Language: తెలుగు
Book: Genesis
Translation Words
అక్రమం, దుర్మార్గాలు
నిర్వచనం:
"అక్రమం" అంటే "పాపం," అనే అర్థం ఇచ్చే పదం. అయితే ఇదమిద్ధంగా ఇది తెలిసి చేసిన గొప్ప దుర్మార్గకార్యాలకు వర్తిస్తుంది.
- "అక్రమం" అక్షరాలా దీని అర్థం అతిక్రమించడం (చట్టాన్ని). ఇది గొప్ప అన్యాయాన్ని సూచిస్తున్నది.
- అక్రమం అనే దాన్ని కావాలని ఇతరులకు వ్యతిరేకంగా హానికరమైన క్రియలు చెయ్యడం.
- ఇతర నిర్వచనాలు “చెడ్డ హృదయం” “భ్రష్టత్వం," ఈ రెండు మాటలు భయంకర పాపం పరిస్థితులను వర్ణిస్తున్నాయి.
అనువాదం సలహాలు:
- "అక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దుర్మార్గత” లేక “దుష్ట క్రియలు” లేక “హానికరమైన పనులు."
- తరచుగా, "అక్రమం" అంటే "పాపం” అని కూడా అర్థం వస్తుంది “అపరాధం." కాబట్టి వీటిని రకరకాలుగా తర్జుమా చెయ్యడం ప్రాముఖ్యం.
(చూడండి: పాపము, అపరాధం, అపరాధం)
బైబిల్ రిఫరెన్సులు:
- దానియేలు 09:12-14
- నిర్గమ 34:5-7
- ఆది 15:14-16
- ఆది 44:16-17
- హబక్కూకు 02:12-14
- మత్తయి 13:40-43
- మత్తయి 23:27-28
- మీకా 03:9-11
పదం సమాచారం:
- Strong's: H205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G92, G93, G458, G3892, G4189
అధికారి, ప్రభువు, యజమాని, పెద్దమనిషి
నిర్వచనం:
బైబిలులో “అధికారి” పదం సాధారణంగా ప్రజలమీద హక్కుదారత్వం లేదా అధికారం ఉన్నవారిని సూచిస్తుంది. అయితే బైబిలులో ఈ పదం వివిధరకాలైన ప్రజలను, దేవుణ్ణి కూడా సంభోదించడానికి ఉపయోగించబడింది.
- యేసును సంబోదిస్తున్నప్పుడు గానీ లేదా సేవకులను కలిగిన వ్యక్తిని సూచించేటప్గుపుడు గానీ ఈ పదం “యజమాని” అని అనువదించబడవచ్చు.
- కొన్ని ఆంగ్ల అనువాదాలలో పై స్థాయిలో ఉన్న వారిని మర్యాదగా సంబోధించే సందర్భంలో “అయ్యా (పెద్ద మనిషి)" అని అనువదించబడింది.
"ప్రభువు" పదం పెద్ద అక్షరాలతో గుర్తించబడినప్పుడు ఇది దేవుణ్ణి సూచిస్తుంది. (అయితే గమనించండి, ఒకరిని సంబోదిస్తున్నట్టి రూపంలో ఉపయోగించబడినట్లయితే లేదా వాక్యం ఆరంభంలో ఈ పదం ఉన్నట్లయితే ఇది పెద్ద అక్షరాలలో ఉండవచ్చు, "అయ్యా" లేదా "యజమాని" అనే అర్థం ఉంటుంది.)
- పాతనిబంధనలో, “సర్వశక్తిగల ప్రభువైన దేవుడు” లేదా “ప్రభువైన యెహోవా” లేదా “యెహోవా మా ప్రభువు” అనే వాక్యాలలో కూడా ఈ పదం ఉపయోగించబడింది.
- కొత్తనిబంధనలో, “ప్రభువైన యేసు”, “ప్రభువైన యేసు క్రీస్తు” అనే పదాలను అపొస్తలులు ఉపయోగించారు. యేసు దేవుడని ఇది సూచిస్తుంది.
- కొత్త నిబంధనలో “ప్రభువు” పదం దేవుణ్ణి నేరుగా సంబోధించడంలో ఉపయోగించబడింది. ప్రత్యేకించి పాతనిబంధన వచనాలను ప్రస్తావించే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగించారు. ఉదాహరణకు, “యెహోవా నామములో వచ్చువాడు ధన్యుడు” అనే వాక్యభాగం, కొత్తనిబందన వాక్యభాగంలో “ప్రభువు నామంలో వచ్చువాడు ధన్యుడు.”
-
”ప్రభువు” బిరుదు హెబ్రీ, గ్రీకు పదాలలోని అసలు అర్థాన్ని అనువదించడంలో ఉపయోగించబడింది. ఇది దేవుని పేరు (యెహోవా) అనువాదంగా అనేక అనువాదాలలో జరిగినట్లు ఎప్పుడూ ఉపయోగించబడలేదు.
-
కొన్ని అనువాదాలు “ప్రభువు” పదాన్ని “యజమాని” లేదా “పరిపాలకుడు” లేదా హక్కుదారత్వాన్నీ లేదా అత్యున్నత అధికారాన్నీ తెలియపరచే ఇతర పదంగా అనువదించారు.
- సరియైన సందర్భంలో, అనేక అనువాదాలు ఈ పదంలోని మొదటి అక్షరాన్ని ఈ పదం దేవుణ్ణి సూచిస్తుందని పాఠకుడికి స్పష్టం అయ్యేలా పెద్ద అక్షరంతో రాశారు.
- కొత్తనిబంధనలో పాతనిబంధన వచనాన్ని ప్రస్తావించినప్పుడు, అది దేవుని గురించి చెపుతున్నదాని తెలియచేయడానికి “ప్రభువైన దేవుడు” అనే పదం వినియోగించబడవచ్చు.
అనువాదం సూచనలు:
- దాసులను కలిగిన వ్యక్తిని సూచించడానికి ఆ పదానికి సమానమైన “యజమాని” అనే పదంతో అనువదించబడవచ్చు. ఒక సేవకుడు తాను పనిచేస్తున్న వ్యక్తిని పిలవడానికి కూడా ఆ సేవకుడు వినియోగించగలిగిన పదం.
- ఈ పదం యేసును సూచిస్తున్నప్పుడు, ఆ ప్రసంగీకుడు యేసును ఒక మత బోధకునిగా చూస్తున్నట్టు ఆ వాక్యభాగం చూపిస్తున్నట్లయితే మత నాయకుడిని గౌరవంగా పిలిచేలా “బోధకుడా” అని అనువదించవచ్చు.
- ఒక వ్యక్తి యేసును ఎరుగకుండా పిలుస్తున్నట్లయితే, “ప్రభువు” పదం మర్యాదపూర్వకమైన సంబోధనగా “అయ్యా” అని అనువదించబడవచ్చు. ఒక వ్యక్తిని మర్యాదపూర్వకంగా పిలువవలసిన ఇతర సందర్భాలలో కూడా ఈ అనువాదాన్ని వినియోగించవచ్చు.
- తండ్రి అయిన దేవుణ్ణి లేదా యేసును సూచించే సందర్భంలో ఈ పదం ఒక బిరుదులా పరిగణించవచ్చు. “ప్రభువు” (పెద్ద అక్షరాలు) అని ఇంగ్లీషులో రాయ బడవచ్చు.
(చూడండి: దేవుడు, యేసు, పాలించు, యెహోవా)
బైబిలు రిఫరెన్సులు:
- ఆది. 39:02
- యెహోషువా 03:9-11
- కీర్తనలు 086:15-17
- యిర్మియా 27:04
- విలాపవాక్యములు 02:02
- యెహెజ్కేలు 18:29
- దానియేలు 09:09
- దానియేలు 09:17-19
- మలాకీ 03:01
- మత్తయి 07:21-23
- లూకా 01:30-33
- లూకా 16:13
- రోమా 06:23
- ఎఫెసీ 06:9
- ఫిలిప్పీ 02:9-11
- కొలస్సీ 03:23
- హెబ్రీ 12:14
- యాకోబు 02:01
- 1 పేతురు 01:03
- యూదా 01:05
- ప్రకటన 15:04
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 25:05 అయితే యేసు లేఖనాలనుండి వచనాలను ఎత్తి చూపుతూ సాతానుకు జవాబిచ్చాడు. “దేవుని వాక్యంలో, ‘నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని’ ఆజ్ఞాపించాడని చెప్పాడు.
- 25:07 “సాతానా నా వెనుకకు పొమ్ము” అని ప్రభువు జవాబిచ్చాడు. దేవుని వాక్యంలో తన ప్రజలకు, “నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలెను” అని ఆజ్ఞాపించాడు.
- 26:03 ఇది ప్రభువు దయా సంవత్సరం.
- 27:02 దేవుని ధర్మశాస్త్రం “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలెను” అని చెపుతున్నదని ధర్మశాస్త్ర బోధకుడు జవాబిచ్చాడు.
- 31:05 “ప్రభువా, ఇది నీవే అయితే, నీటి మీద నడుస్తూ నీ దగ్గరకు వచ్చేలా నాకు ఆజ్ఞ ఇవ్వు” అని పేతురు యేసుతో చెప్పాడు.
- 43:09 దేవుడు యేసును ప్రభువుగానూ, క్రీస్తుగానూ చేసెనని ఖచ్చితంగా తెలిసికొనుడి.
- 47:03 ఈ దయ్యము వలన ఆమె ప్రజల భవిష్యత్తును గురించి సోదె చెపుతూ, తన యజమానులకు బహు లాభాన్ని చేకూరుస్తుంది.
- 47:11 “ప్రభువు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవునూ, నీ ఇంటివారునూ రక్షించబడుదురు” అని పౌలు జవాబిచ్చాడు.
పదం సమాచారం:
- Strong's: H113, H136, H1167, H1376, H4756, H7980, H8323, G203, G634, G962, G1203, G2962
అనుగ్రహం, అనుగ్రహాలు, అనుకూలమైన, పక్షపాతం
నిర్వచనం:
"అనుగ్రహం" అంటే ఒక మనిషి పట్ల వాత్సల్యం చూపడం. ఎవరిపైనైనా అనుగ్రహం చూపడం అంటే ఆ వ్యక్తి పట్ల సానుకూలంగా ఉంటూ ఇతరులకన్నా అతనికి ఎక్కువ మేలు చేస్తూ ఉండడం.
- "పక్షపాతం" అంటే కొందరి పట్ల అంగీకారభావం అనుగ్రహంగా ఉంటూ మరి కొందరి పట్ల అలా కాకుండా ఉండడం. ఇది ఒక వ్యక్తిని అతడు మనకు నచ్చాడు గనక మరొక వ్యక్తికన్నా ఎక్కువ ప్రేమ చూపడం. సాధారణంగా, పక్షపాతం అన్యాయంగా ఎంచబడుతుంది.
- యేసు "దేవుని, మనుషుల అనుగ్రహం" లో ఎదిగాడు. అంటే వారు అయన తన గుణ లక్షణాలు, ప్రవర్తన ఆమోదించారు.
- ఎవరిదైనా "అనుగ్రహం పొందడం" అంటే ఆ మనిషి నుండి ప్రత్యేక సానుకూల భావం సంపాదించడం.
- రాజు ఎవరి మీదనైనా అనుగ్రహం చూపడం అంటే అతడు వ్యక్తి విన్నపాలను ఆమోదించి ఇస్తున్నాడని భావం.
- "అనుగ్రహం" అంటే కొన్ని చర్యలు, పనులు చేసి మరొకవ్యక్తికి మేలు కలిగించడం.
అనువాదం సలహాలు:
- అనువదించడంలో ఇతర పద్ధతులు. "అనుగ్రహం" అంటే "ఆశీర్వాదం” లేక “మేలు."
- "యెహోవా అనుకూల సంవత్సరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. యెహోవాగొప్ప ఆశీర్వాదం పంపించే "సంవత్సరం (లేక సమయం)."
- "పక్షపాతం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పక్షపాత బుద్ధి” లేక “దురభిమానం” లేక “అన్యాయంగా ప్రవర్తించు." "ప్రియమైన వాడు," అంటే "ఇష్టుడు, ప్రేమను చూరగొన్న వాడు."
బైబిల్ రిఫరెన్సులు:
- 1 సమూయేలు 02:25-26
- 2 దిన 19:6-7
- 2 కొరింతి 01:11
- అపో. కా. 24:26-27
- ఆది 41:14-16
- ఆది 47:25-26
- ఆది 50:4-6
పదం సమాచారం:
- Strong's: H995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G1184, G3685, G4380, G4382, G5485, G5486
అన్న
వాస్తవాలు:
అన్న యెరూషలేములో 10 సంవత్సరాలపాటు యూదు ప్రధాన యాజకుడు. క్రీ. శ. 6 నుండి దాదాపు 15 వరకు ఈ పదవిలో ఉన్నాడు. రోమా ప్రభుత్వం అతణ్ణి ప్రధాన యాజకత్వం నుండి తొలగించింది. అయినా అతడు యూదుల మధ్య ప్రభావం గల నాయకుడుగా కొనసాగాడు.
- అన్న అధికార ప్రధాన యాజకుడు కయపకు మామగారు. యేసు పరిచర్య కాలంలో యితడు ఉన్నాడు.
- ప్రధాన యాజకులు పదవీవిరమణ చేశాక, వారు ఆ బిరుదు నామం ఉంచుకుంటారు. దానితో బాటు పదవి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి కయప, ఇతరులు యాజకత్వంలో ఉన్నప్పటికీ, అన్నను ప్రధాన యాజకుడు అనడం కొనసాగుతుంది.
- యూదు నాయకుల ఎదుట యేసు న్యాయ విచారణ సమయంలో ఆయన్ని మొదటిగా ప్రశ్నించడానికి అన్న దగ్గరకు తీసుకువచ్చారు.
(చూడండి: ప్రధాన యాజకుడు, యాజకుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 04:5-7
- యోహాను 18:22-24
- లూకా 03:1-2
పదం సమాచారం:
అన్య, అన్యులు
నిర్వచనము:
పరిశుద్ధ కాలములో “అన్య” అను పదమును యెహోవా దేవుని కాకుండా అబద్ధపు దేవుళ్ళను ఆరాధించే జనాంగమును వివరించుటకు ఉపయోగించబడినది.
- ఈ ప్రజలతో సంబంధము కలిగియుండే ప్రతియొక్కరు లేక ప్రతీది అనగా వారు ఆరాధించే స్థలమైన బలిపీఠములు, వారు కనుబరిచే ఆచారములు మరియు వారి నమ్మకములన్నిటిని “అన్యసంబంధమైనవి” అని పిలువబడ్డాయి.
- అన్య నమ్మకాలలో తప్పుడు దేవుళ్ళను ఆరాధించడము మరియు ప్రకృతిని ఆరాధించడమును కలిగియుంటారు.
- కొన్ని అన్య మతాలలో లైంగికపరమైన అనైతిక ఆచారాలు లేక వాటిని ఆరాధించడములో భాగంగా మనుష్యులను చంపే ఆచారాలను కలిగియుంటారు.
(ఈ పదాలను కూడా చూడండి: బలిపీఠం, దేవుడు, బలియాగము, ఆరాధన, యెహోవా)
పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:
- 1 కోరింథీ.10:20-22
- 1 కోరింథీ.12:1-3
- 2 రాజులు.17:14-15
- 2 రాజులు.21:4-6
పదం సమాచారం:
అపరాధం, అపరాధాలు, అతిక్రమం
నిర్వచనం:
"అపరాధం" అంటే ఆజ్ఞ, పరిపాలన , లేక నైతిక నియమం ఉల్లంఘించడం,. "అపరాధం" జరిగించు "అతిక్రమం."
- అలంకారికంగా, "అపరాధం" అనే దాన్ని "గీత దాటు," అంటే మితి మీరడం. తన, ఇతరుల క్షేమం కోసం పెట్టిన నియమం మీరడం.
- పదాలు "అతిక్రమం," "పాపం," "అక్రమం ,” “అతిక్రమం" అన్నింటి అర్థం వ్యతిరేకంగా దేవుని సంకల్పం ధిక్కరించ, ఆయన ఆజ్ఞలు మీరడం.
అనువాదం సలహాలు:
- "అతిక్రమణ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "పాపం” లేక “ధిక్కరించు” లేక “తిరగబడు."
- ఒక వచనం లేక వాక్య భాగం పాపం” లేక “అపరాధం” లేక “అతిక్రమం," అనే అర్థమిచ్చే రెండుపదాలుఉపయోగిస్తే వీలైతే, ఈ పదాలు అనువదించడంలో వేరువేరు పదాలు వాడండి. బైబిల్లో సందర్భంలో రెండు లేక ఎక్కువ ఒకే విధమైన అర్థాలు గల పదాలు ఉంటే సాధారణంగా అందులోని ఉద్దేశం ఆ విషయం నొక్కి చెప్పడానికి, లేక దాని ప్రాధాన్యత తెలపడానికే.
(చూడండి: పాపము, అపరాధం, అక్రమం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తెస్సలోనిక 04:3-6
- దానియేలు 09:24-25
- గలతి 03:19-20
- గలతి 06:1-2
- సంఖ్యా 14:17-19
- కీర్తనలు 032:1-2
పదం సమాచారం:
- Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928
అపరాధం, అపరాధాలు, అతిక్రమించు
నిర్వచనం:
"అపరాధం” చేయడం అంటే చట్టం మీరడం లేక వేరొకరి హక్కులు ఉల్లంఘించడం. "అతిక్రమం" అంటే "ఆజ్ఞ మీరడం."
- అతిక్రమం అంటే నైతిక, లేదా సాంఘిక చట్టం, లేక మరొక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం.
- ఈ పదానికి "పాపం,” “అపరాధం," అనే పదాలతో ముఖ్యంగా దేవుణ్ణి ధిక్కరించడంతో సంబంధం ఉంది.
- అన్ని పాపాలు దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలే.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, " వ్యతిరేకంగా అతిక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వ్యతిరేకంగాపాపం” లేక “పరిపాలనను ధిక్కరించడం."
- కొన్నిభాషల్లో "హద్దు మీరడం" వంటి పదాలు "అతిక్రమం" అనే దాన్ని అనువదించడంలో ఉపయోగిస్తారు.
- ఈ పదాన్ని బైబిల్ వచనంలో ఉన్న అర్థంతో పోల్చి అపరాధం” “పాపం" అనే ఒకే విధమైన అర్థం వచ్చే వాటిని వాడవచ్చు.
(చూడండి: అవిధేయత చూపడం, అక్రమం, పాపము, అపరాధం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 సమూయేలు 25:27-28
- 2 దిన 26:16-18
- కొలస్సి 02:13-15
- ఎఫెసి 02:1-3
- యెహెజ్కేలు 15:7-8
- రోమా 05:16-17
- రోమా 05:20-21
పదం సమాచారం:
- Strong's: H816, H817, H819, H2398, H4603, H4604, H6586, H6588, G264, G3900
అబీమెలెకు
వాస్తవాలు:
అబీమెలెకు ఫిలిష్తియుల రాజు. అబ్రాహాము, ఇస్సాకు కనానులో జీవించిన కాలంలో ఇతడు గెరారును పరిపాలించాడు.
- అబ్రాహాము అబీమెలెకు రాజుకు శారా తన భార్య అని చెప్పడానికి బదులుగా తన చెల్లి అని చెప్పి అబద్ధం ఆడాడు.
- అబ్రాహాము, అబీమెలెకు బెయెర్షేబా దగ్గర ఉన్న బావుల విషయం ఒప్పందం చేసుకున్నారు.
- చాలా సంవత్సరాల తరువాత ఇస్సాకు రిబ్కా గురించి తన భార్య అని చెప్పడానికి బదులుగా తన చెల్లి అని చెప్పి అబీమెలెకును అతని పరివారాన్ని మోసగించాడు.
- అబీమెలెకు రాజు అబ్రాహామును, అటు తరువాత ఇస్సాకును వారు చెప్పిన అబద్ధాలకై గద్దించాడు.
- అబీమెలెకు అనే పేరున్న మరొకడు గిద్యోను కొడుకు. యోతాము సోదరుడు. కొన్ని అనువాదాల్లో కొద్దిగా తేడాతో ఈ పేరు ఉంది. ఇది ఆ వ్యక్తి అబీమెలెకు రాజు కాకుండా వేరొకడు అని చెప్పడం కోసం.
(చూడండి: బెయెర్షేబా, గెరారు, గిద్యోను, యోతాము, ఫిలిష్టియులు)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 సమూయేలు 11:21
- ఆది 20:1-3
- ఆది 20:4-5
- ఆది 21:22-24
- ఆది 26:9-11
- న్యాయాధి 09:52-54
పదం సమాచారం:
అబ్రాహాము, అబ్రాము
వాస్తవాలు:
అబ్రాము ఊర్ అనే పట్టణానికి చెందిన కల్దియ జాతి వాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలు జాతి పితగా ఎంపిక చేశాడు. దేవుడు అతని పేరును "అబ్రాహాము"గా మార్చాడు.
- "అబ్రాము"అంటే "ఘనుడైన తండ్రి."
- "అబ్రాహాము"అంటే "అనేక మందికి తండ్రి."
- దేవుడు అబ్రాహాముకు ఎందరో సంతానం కలుగుతారని, వారు గొప్ప జాతిగా ఉంటారని ప్రమాణం చేశాడు.
- అబ్రాహాము దేవునిపై నమ్మకం ఉంచి లోబడ్డాడు. దేవుడు అబ్రాహాము ను కల్దియ దేశం నుండి కనాను ప్రదేశానికి నడిపించాడు.
- అబ్రాహాము, అతని భార్య శారా కనాను ప్రదేశంలో నివసిస్తూ ముసలితనంలో ఇస్సాకు అనే ఒక కొడుకును కన్నారు.
(చూడండి: కనాను, కల్దియ, శారా, ఇస్సాకు)
బైబిల్ రిఫరెన్సులు:
- గలతి 03:6-9
- ఆది 11:29-30
- ఆది 21:1-4
- ఆది 22:1-3
- యాకోబు 02:21-24
- మత్తయి 01:1-3
బైబిల్ కథల నుండి ఉదాహరణ:
- 04:06 అబ్రాము కనాను వచ్చినప్పుడు, దేవుడు అన్నాడు, "చుట్టూ చూడు.
నీవు చూస్తున్న నేల అంతటినీ నీకూ నీ సంతానానికి వారసత్వంగా ఇస్తాను."
- 05:04 అప్పుడు దేవుడు అబ్రాము పేరును అబ్రాహాము గా మార్చాడు. అంటే "అనేక మందికి తండ్రి."
- 05:05 దాదాపు ఒక సంవత్సరం తరువాత అబ్రాహాము నూరేళ్ళ ప్రాయం, శారా 90 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, శారా అబ్రాహాము కొడుక్కి జన్మనిచ్చింది.
- 05:06 ఇస్సాకు యువ ప్రాయంలో దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఇలా చెప్పాడు. "నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుపోయి అతన్ని నాకు బలిగా అర్పించు."
- 06:01 అబ్రాహాము బాగా ముసలివాడు అయిన తరువాత, ఇస్సాకు పెద్దవాడయ్యాడు. అబ్రాహాము తన సేవకుడిని తన బంధువులుండే ప్రాంతానికి పంపించి తన కొడుక్కి భార్యను తెమ్మన్నాడు.
- 06:04 చాలా కాలం తరువాత అబ్రాహాము చనిపోయాడు, దేవుడు నిబంధనాపూర్వకంగా చేసిన వాగ్దానాలు ఇస్సాకుకు సంక్రమించాయి.
- 21:02 దేవుడు అబ్రాహాము కు వాగ్దానం చేశాడు. అతని ద్వారా లోకజాతులన్నీ దీవెనలు పొందుతాయి.
పదం సమాచారం:
అమాలేకు, అమాలేకీయుడు, అమాలేకీయులు
వాస్తవాలు:
అమాలేకీయులు కనాను దక్షిణ ప్రాంతం అంతటా నివసించే సంచారజీవులు. వీరు నెగెబు ఎడారి నుండి అరేబియా దక్షిణ భాగం అంతటా విస్తరించి ఉన్నారు. వీరు ఏశావు మనవడు అమాలేకు సంతానం.
- ఇశ్రాయేలీయులు మొదటిగా కనానులో నివసించడానికి వచ్చినప్పటినుండి అమాలేకీయులు వారికి బద్ధ శత్రువులు.
- కొన్ని సార్లు ఈ పదం "అమాలేకు" ను అమాలేకీయులు అందరినీ ఉద్దేశించి అలంకారికంగా ఉపయోగిస్తారు.
- అమాలేకీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మోషే తన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. అతడు అలసిపోయి చేతులు దించినప్పుడు ఓడిపోసాగారు. కాబట్టి అహరోను, హూరు మోషే చేతులు ఎత్తి పట్టడానికి సహాయపడగా ఇశ్రాయేలు సైన్యం చేతిలో అమాలేకీయులు ఓడిపోయారు.
- సౌలు రాజు, దావీదు రాజు ఇద్దరూ అమాలేకీయులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు.
- ఒక సారి అమాలేకీయులపై విజయం సాధించాక సౌలు ఆ కొల్ల సొమ్ములో కొంత ఉంచుకోవడం ద్వారానూ, దేవుడు అజ్ఞాపించినట్టు అమాలేకీయుల రాజును చంపకపోవడం ద్వారా దేవుని మాట మీరాడు.
(చూడండి: అరేబియా, దావీదు, ఏశావు, నెగెబు, సౌలు (పాతనిబంధన))
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 04:42-43
- 2 సమూయేలు 01:8-10
- నిర్గమ 17:8-10
- సంఖ్యా 14:23-25
పదం సమాచారం:
అయ్యో
నిర్వచనము:
“అయ్యో” అనే పదము గొప్ప బాధతో కూడిన భావమును సూచించును. ఎవరైనా ఏదైనా అతీ తీవ్రమైన అపాయమును అనుభవిస్తారని చెప్పే హెచ్చరికను కూడా ఈ పదము తెలియజేయుచున్నది.
- ప్రజలు తమ పాపములనుబట్టి పొందుకునే శిక్షగా వారు అనుభవించే శ్రమలను ప్రజలకు హెచ్చరికగా “అయ్యో” అనే పదమును జతపరిచి వ్యక్తపరుస్తారు.
- పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాలలో భయానకమైన తీర్పును నొక్కి చెప్పుటకు “అయ్యో” అనే పదము పునరావృతం అయ్యుంటుంది.
- “అయ్యో నేను” లేక “అయ్యో నాకు” అనే మాటలను ఒక వ్యక్తి చెబుతున్నాడంటే అతి తీవ్రమైన శ్రమను గుర్చిన బాధను వ్యక్తపరచుకోవడం అని అర్థము.
తర్జుమా సలహాలు:
- సందర్భానుసారముగా, “అయ్యో” అనే పదము కూడా “గొప్ప బాధ” లేక “దుఃఖము” లేక “విపత్తు” లేక “ఉపద్రవం” అని కూడా తర్జుమా చేయుదురు.
- “(ఏదైనా పట్టణము పేరు చెప్పి) అయ్యో” అని చెప్పిన మాటను తర్జుమా చేయు అనేక విధానములలో “(ఆ పట్టణము) కొరకు జరగబోయేది ఎంత భయానకము” లేక “(పట్టణములో) ప్రజలు భయంకరముగా శిక్షించబడుదురు) లేక “చాలా భయంకరముగా ఆ ప్రజలు శ్రమిస్తారు” అనే మాటలను కూడా చేర్చుదురు.
- “అయ్యో నేను!” లేక “అయ్యో నాకు!” అనే ఈ మాటను “నేను ఎంత దౌర్భాగ్యుడను!” లేక “నేను దౌర్భాగ్యుడను!” లేక “నాకు కలిగింది ఎంత భయానకము!” అని కూడా తర్జుమా చేయకూడదు.
- “అయ్యో నీకు” అనే మాటను “నీవు భయంకరముగా శ్రమపడుతావు” లేక “నీవు భయంకరమైన శ్రమలను అనుభవిస్తావు” అని తర్జుమా చేయవచ్చును.
పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:
- యెహే.13:17-18
- హబ.02:12-14
- యెషయా.31:1-2
- యిర్మియా.45:1-3
- యూదా.01:9-11
- లూకా.06:24-25
- లూకా.17:1-2
- మత్తయి.23:23-24
పదం సమాచారం:
- Strong's: H188, H190, H337, H480, H1929, H1945, H1958, G3759
అరారాతు
వాస్తవాలు:
బైబిల్లో, "అరారాతు"అనేది ఒక ప్రాంతానికి, రాజ్యానికి, ఒక పర్వత శ్రేణికి ఇచ్చిన పేరు.
- "అరారాతు భూభాగం" బహుశా టర్కీ దేశం ఈశాన్య భాగంలో ఉంది.
- అరారాతు ఒక కొండ పేరుగా అందరికీ బాగా తెలుసు. వరద తరువాత నోవహు ఓడ ఇక్కడ ఆగింది.
- ఆధునిక కాలంలో, ఈ కొండను "అరారాతు కొండ" అని తరచుగా పిలుస్తారు. బైబిల్లో "అరారాతు పర్వతాల్లో" ఇది ఉంది.
(చూడండి: మందసం, నోవహు)
బైబిల్ రిఫరెన్సులు:
- 2రాజులు 19:35-37
- ఆది 08:4-5
- యెషయా 37:38
- యిర్మీయా 51:27-28
పదం సమాచారం:
అసహ్యించు, అసహ్యించుకొన్న , అసహ్యమైన
వాస్తవాలు:
"అసహ్యమైన" పదం అయిష్టమైనదానినీ, నిరాకరించబడినదానిని వివరిస్తుంది. "అసహ్యించుకోవడం" అంటే బలమైన అయిష్టత కలిగి ఉండడం.
- తరచుగా బైబిలు దుర్మార్గతను అసహ్యించుకోమని మాట్లాడుతుంది. అంటే దుష్టత్వాన్ని అసహ్యించాలి, దానిని తిరస్కరించాలి.
- అబద్ద దేవుళ్ళను ఆరాధించిన వారి దుష్టఆచారాలను వర్ణించడానికి "అసహ్యమైన" పదాన్ని దేవుడు ఉపయోగించాడు.
- పొరుగు ప్రజల సమూహాలు ఆచరించే పాపపూరితమైన, అనైతిక కార్యాలను "అసహ్యించుకోవాలని" ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించబడ్డారు.
- చెడు లైంగిక క్రియలన్నిటినీ "అసహ్యమైనవి" గా దేవుడు పిలిచాడు
- సోదె చెప్పడం, మంత్ర విద్య, పిల్లలను బలిగా అర్పించం ఇలాటివన్నీ దేవునికి "అసహ్యమైన" కార్యాలు.
- "అసహ్యించు" పదబంధం "బలంగా తిరస్కరించడం” లేదా “అసహ్యించుకోవడం” లేదా “తీవ్రమైన దుష్టత్వంగా ఎంచడం" అని అనువదించబడవచ్చు.
- "అసహ్యమైన" పదం "భయంకరమైన దుష్టత్వం” లేదా “నీచమైన” లేదా “తిరస్కారానికి అర్హమైన" పదాలుగా అనువదించబడవచ్చు.
- నీతిమంతుడు దుష్టులకు "అసహ్యమైన" వాడుగా యెంచబడినప్పుడు, "చాలా అవాంఛనీయమైనదిగా యెంచబడడం" లేదా "అప్రియమైనది” లేదా “తిరస్కరించబడినది" అని అనువదించబడవచ్చు.
- "అపవిత్రమైన" జంతువులు అని దేవుడు ప్రకటించిన కొన్ని నిర్దిష్ట రకాల జంతువులు "అసహ్యమైనవని ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు. అవి ఆహారానికి సరిపోవు. ఇది "బలంగా అయిష్టత చూపడం” లేదా “తిరస్కరించడం” లేక “అనంగీకారమైనదిగా యెంచడం" అని అనువదించబడవచ్చు.
(చూడండి: సోది, శుద్ధమైన)
బైబిలు రిఫరెన్సులు:
- ఆది. 43:32
- యిర్మీయా 07:30
- లేవీ. 11:10
- లూకా 16:15
- ప్రకటన 17:3-5
పదం సమాచారం:
- Strong's: H1602, H6973, H8130, H8251, H8262, H8263, H8441, H8581, G946, G947, G948, G4767, G5723, G3404
అసూయ, ఆశించడం
నిర్వచనం:
ఎదుటి వ్యక్తి కలిగియున్నదాని కారణంగా లేదా అతనికి ప్రశంశనీయమైన లక్షణాలు ఉన్నకారణంగా ఈర్ష్యగా ఉండడాన్ని ఈ పదం సూచిస్తుంది. "ఆశించడం" పదం దేనినైనా ఒకదానిని కలిగియుండాలని బలమైన కోరిక కలిగియుండడం అని అర్థం.
- అసూయ అనేది సాధారణంగా మరొక వ్యక్తి విజయాలు, మంచి భాగ్యం, ఆస్తిపాస్థులను బట్టి కలిగే ఆగ్రహంతో కూడిన వ్యతిరేక భావన.
- ఆశించడం అంటే మరొకరి ఆస్థులను లేదా వారి భార్యనూ లేదా భర్తనూ కలిగియుండాలానే బలమైన కోరిక.
(చూడండి: ఈర్ష్య)
బైబిలు రిఫరెన్సులు:
- 1 కొరింథీ 13:4-7
- 1 పేతురు 02:01
- నిర్గమ, 20:17
- మార్కు 07:20-23
- సామెతలు 03:31-32
- రోమా 01:29
పదం సమాచారం:
- Strong's: H183, H1214, H1215, H2530, H3415, H5869, H7065, H7068, G866, G1937, G2205, G2206, G3713, G3788, G4123, G4124, G4190, G5354, G5355, G5366
ఆత్మ, ఆత్మలు, ఆత్మీయత
నిర్వచనము:
“ఆత్మ” అనే ఈ పదము ప్రజలలో లేక ఒక వ్యక్తిలో కనిపించని అభౌతికమైన భాగమును సూచిస్తుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు, తన ఆత్మ అతని శరీరమును విడిచి వెళ్లును. “ఆత్మ” అనే పదము వైఖరిని లేక భావోద్వేగ స్థితిని కూడా సూచిస్తుంది.
- “ఆత్మ” అనే పదము భౌతిక శరీరము లేనిదిగా ఉండేదానిని, విశేషముగా దుష్ట ఆత్మను సూచిస్తుంది.
- ఒక వ్యక్తిలోని ఆత్మ దేవునిని తెలుసుకొని, ఆయనయందు విశ్వసించే ఒక భాగమైయున్నది.
- సాధారణముగా “ఆత్మీయత” అనే పదము అభౌతికమైన ప్రపంచములో ఉండేదానిని వివరిస్తుంది.
- పరిశుద్ధ గ్రంథములో విశేషముగా దేవునికి సంబంధించిన ప్రతిదానిని మరియు పరిశుద్ధాత్మను సూచిస్తుంది.
- ఉదాహరణకు, “ఆత్మీయకమైన ఆహారము” దేవుని ఉపదేశములను సూచిస్తుంది, ఇవి ఒక వ్యక్తి ఆత్మకు మంచి పోషణను అనుగ్రహిస్తాయి, మరియు “అత్మియకమైన జ్ఞానము” పరిశుద్ధాత్మ శక్తినుండి వచ్చిన నీతిని మరియు జ్ఞానమును సూచిస్తుంది.
- దేవుడు ఆత్మయైయున్నాడు మరియు ఆయన ఇతర ఆత్మలను సృష్టించియున్నాడు, వీరికి భౌతిక శరీరములు ఉండవు.
- దూతలు ఆత్మలైయున్నారు, ఇందులో దేవునికి విరుద్ధముగా తిరస్కరించి, దుష్ట ఆత్మలుగా మారినవారున్నారు.
- “ఆత్మ” అనే ఈ పదము “గుణలక్షణములను కూడా సూచించుదురు”, ఉదాహరణకు, “జ్ఞానాత్మ” లేక “ఏలియా ఆత్మలో” ఇలా ఒకరి లేక ఏదైనా గుణలక్షణములను చేర్చి ఉపయోగించురు.
- ఒక వైఖరికి లేక భావోద్వేలుగా “ఆత్మకు” ఉదాహరణలు చెప్పుటలో “పిరికితనముగల ఆత్మ” మరియు “అసూయ ఆత్మ” అని కూడా చేర్చి చెప్పుదురు.
తర్జుమా సలహాలు;
- సందర్భాన్ని ఆధారము చేసికొని, “ఆత్మ” అనే పదమును తర్జుమా చేయు విధానములో “అభౌతికమైన ఆకారము” లేక “లోపలి భాగము” లేక “అంతరంగము” అని కూడా ఉపయోగించుదురు.
- కొన్ని సందర్భాలలో, “ఆత్మ” అనే పదమును “దుష్టాత్మ” లేక “దుష్ట ఆత్మ సంబంధమైన” అని కూడా తర్జుమా చేయుదురు.
- “నా అంతరంగములో నా ఆత్మ దుఃఖించుచున్నది” అని వాక్యములో ఉన్నట్లుగా కొన్నిమార్లు “ఆత్మ” అనే పదమును ఒక వ్యక్తిలోని భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించబడును. దీనిని “నా ఆత్మలో నేను దుఃఖించాను” లేక “నేను చాలా ఎక్కువ దుఃఖానికి లోనైయున్నాను” అని కూడా తర్జుమా చేయుదురు.
- “ఒక గుణలక్షణమునకు లేక వ్యక్తి ధోరణికి సంబంధించిన ఆత్మ” అనే ఈ మాటను “ఆ వ్యక్తి గుణలక్షణము” లేక “ఆ వ్యక్తి ప్రభావము” లేక “ఆ వ్యక్తి ధోరణి” లేక “ఆ వ్యక్తి ద్వారా ఏర్పడిన ఆలోచన” అని కూడా తర్జుమా చేయుదురు.
- సందర్భానుసారముగా “ఆత్మీయత” అనే పదమును “అభౌతికమైన” లేక “పరిశుద్ధాత్మనుండి” లేక “దేవుని విషయాలు” లేక “అభౌతికమైన ప్రపంచములోని భాగము” అని కూడా తర్జుమా చేయుదురు.
- “ఆత్మీయమైన పాలు” అనే ఈ అలంకారికమైన మాటను “దేవుని గూర్చిన ప్రాథమికమైన ఉపదేశాలు” లేక ‘ఆత్మను పోషించే (పాలు పోషించునట్లు” దేవుని ఉపదేశములు” అని కూడా తర్జుమా చేయుదురు.
- “ఆత్మీయమైన పరిపక్వత” అనే ఈ మాట “పరిశుద్ధాత్మకు విధేయత చూపించు దైవికమైన ప్రవర్తన” అని కూడా తర్జుమా చేయుదురు.
- “ఆత్మీయమైన వరము” అనే మాటను “పరిశుద్ధాత్మ ఇచ్చే విశేషమైన సామర్థ్యము” అని కూడా తర్జుమా చేయుదురు.
(ఈ పదములను కూడా చూడండి: దేవదూత, దయ్యం, పరిశుద్ధాత్మ, ప్రాణం (ఆత్మ))
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 కొరింతి.05:3-5
- 1 యోహాను.04:1-3
- 1 తెస్స.05:23-24
- అపొ.కార్య.05:9-11
- కొలొస్స.01:9-10
- ఎఫెసీ.04:23-24
- ఆది.07:21-22
- యెషయా.04:3-4
- మార్కు.01:23-26
- మత్తయి.26:39-41
- ఫిలిప్పి.01:25-27
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 13:03 మూడు దినములైన తరువాత, ప్రజలు తమ్మునుతాము ఆత్మియకముగా సిద్ధపరచుకొనినతరువాత, దేవుడు సీనాయి పర్వతమునుండి ఉరుములతోనూ, మెరుపులతోనూ, మరియు గొప్ప బూర ధ్వనులతోను దిగివచ్చెను.
- 40:07 “సమాప్తమైనది! తండ్రి, నా ఆత్మ నీ చేతులకు అప్పగించుచున్నాను” అని యేసు గట్టిగా అరిచెను. ఆ తరువాత ఆయన తన తలను వంచి, తన ఆత్మను అప్పగించెను.
- 45:05 స్తెఫెను చనిపొతూ “యేసు నా ఆత్మను చేర్చుకొనుము” అని ఏడ్చెను.
- 48:07 ఆయన ద్వారా సమస్త ప్రజలు ఆశీర్వదించబడిరి, ఎందుకంటే యేసునందు విశ్వసించిన ప్రతియొక్కరు పాపమునుండి రక్షించబడియున్నారు, మరియు వారందరూ అబ్రాహాము ఆత్మీయ సంతానముగా మార్చబడిరి.
పదం సమాచారం:
- Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427
ఆదరణ, ఆదరణలు, ఆదరణ పొందిన, ఆదరించు, ఆదరణకర్త, ఆదరణకర్తలు, ఆదరణ పొందని
నిర్వచనం:
"ఆదరణ” “ఆదరణకర్త" అనే పదాలు ఎవరినైనా హింసలు, శారీరిక, మానసిక నొప్పి ఉన్న సమయంలో సాయం చెయ్యడం సూచిస్తున్నాయి.
- ఆదరణ కలిగించే వ్యక్తిని "ఆదరణకర్త" అంటారు.
- పాత నిబంధనలో, "ఆదరణ" అనే పదాన్ని దేవుడు ఎలా తన ప్రజలకు వారి హింసల్లో సహాయం చేయడాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.
- కొత్త నిబంధనలో, దేవుడు తన ప్రజలకు పరిశుద్ధాత్మ మూలంగా ఆదరణ కలిగిస్తాడు.
ఈ ఆదరణ పొందిన తరువాత అదే ఆదరణ వారు ఇతరుల హింసల్లో వారికి ఇస్తారు.
- " ఇశ్రాయేలు ఆదరణకర్త " అనే మాట మెస్సియా తన ప్రజలను అడుకోవడాన్ని సూచిస్తుంది
- యేసు విశ్వాసులకు "ఆదరణకర్త" గా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, "ఆదరణ" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నొప్పి తొలగించడం” లేక “బాధలో ఉన్నవారికి సహాయం” లేక “ప్రోత్సాహించు” లేక “ఓదార్చు."
- "మన ఆదరణ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మన ప్రోత్సాహం” లేక “మన ఓదార్పు” లేక “దుఃఖ సమయంలో మన సహాయం."
- ఈ పదం"ఆదరణకర్త" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. " ఆదరణ కలిగించే వ్యక్తి” లేక “ఎవరికైనా నొప్పి ఉపశమనం చేయడం” లేక “ప్రోత్సాహించే మనిషి."
- పరిశుద్ధాత్మను " ఆదరణకర్త" అని చెప్పిన చోట ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. " ప్రోత్సాహించు” లేక “ సహాయం చేయు” లేక “సహాయం, నడిపింపు ఇచ్చేవాడు."
- ఈ పద బంధం "ఇశ్రాయేలు ఆదరణకర్త"ను ఇలా అనువదించ వచ్చు. " ఇశ్రాయేలుకు ఆదరణ కలిగించే మెస్సియా."
- "వారికి ఆదరణకర్త లేడు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. " ఆదరించే వాడు లేడు” లేక “ప్రోత్సాహింఛి సహాయం చేసే వాడు లేడు."
(చూడండి: ధైర్యం, పరిశుద్ధాత్మ)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తెస్స 05:8-11
- 2 కొరింతి 01:3-4
- 2 సమూయేలు 10:1-3
- అపో. కా. 20:11-12
పదం సమాచారం:
- Strong's: H2505, H5150, H5162, H5165, H5564, H8575, G302, G2174, G3870, G3874, G3875, G3888, G3890, G3931
ఆదాము
వాస్తవాలు:
ఆదాము దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి. అతడు, అతని భార్య హవ్వ దేవుని పోలికలో చెయ్యబడ్డారు.
- దేవుడు ఆదామును దుమ్ము నుండి చేసి అతనిలోకి జీవం ఊదాడు.
- ఆదాము పేరు "ఎర్ర మట్టి” లేక “నేల"అని అర్థం ఇచ్చే హీబ్రూ పదానికి దగ్గరగా ఉంది.
- "ఆదాము"అనే పేరు "మానవ జాతి” లేక “మానవుడు"అనే పాత నిబంధన పదం అయింది.
- మనుషులంతా ఆదాము, హవ్వల సంతానం.
- ఆదాము, హవ్వలు దేవునికి లోబడలేదు. ఇది వారిని దేవునికి దూరం చేసి పాపం, మరణం లోకంలోకి వచ్చేలా చేసింది.
(చూడండి: చనిపోవడం, వారసుడు, హవ్వ, దేవుని పోలిక, జీవం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1తిమోతి 02:13-15
- ఆది 03:17-19
- ఆది 05:1-2
- ఆది 11:5-7
- లూకా 03:36-38
- రోమా 05:14-15
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 01:09 అప్పుడు దేవుడు అన్నాడు, "మానవులను మన పోలికలో ఆకారంలో చేద్దాము."
- 01:10 ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఒక తోట నాటి, అక్కడ ఆదాము నివసించి దాన్ని సాగు చేసేలా నియమించాడు.
- 01:12 అప్పుడు దేవుడు చెప్పాడు, "మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు." కానీ జంతువులు ఏవీ ఆదాము తోడు కాలేదు.
- 02:11 దేవుడు ఆదాము హవ్వలకు జంతువు చర్మాలు తొడిగాడు.
- 02:12 కాబట్టి దేవుడు ఆదాము హవ్వలను ఆ అందమైన తోటనుండి వెళ్ళగొట్టాడు.
- 49:08 ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతానంపై కూడా ప్రభావం చూపింది.
- 50:16 ఎందుకంటే ఆదాము హవ్వ దేవునికి లోబడలేదు. వారి ఈ లోకంలోకి పాపాన్ని తెచ్చారు. దేవుడు దాన్ని శపించి దాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
పదం సమాచారం:
ఆధిపత్యం
నిర్వచనం:
"ఆధిపత్యం" అనే పదం ప్రజలు, జంతువులు, లేక దేశం పై శక్తి, అదుపు, లేక అధికారాలను సూచిస్తున్నది.
- భూమి అంతటిపై ప్రవక్తగా, యాజకుడుగా రాజుగా యేసు క్రీస్తుకు ఆధిపత్యం ఉంది.
- సిలువపై యేసు క్రీస్తు మరణం మూలంగా సాతాను ఆధిపత్యం శాశ్వతకాలం రద్దు అయింది.
- సృష్టి సమయంలో దేవుడు చెప్పాడు. మనిషికి భూమిపై ఉన్న చేపలు, పక్షులు, జీవులన్నిటిపై ఆధిపత్యం ఉంటుంది.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "అధికారం” లేక “శక్తి” లేక “అదుపు."
- "ఒక దానిపై ఆధిపత్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పరిపాలన చెయ్యడం” లేక “నిర్వహించడం."
(చూడండి: అధికారం, శక్తి)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 పేతురు 05:10-11
- కొలస్సి 01:13-14
- యూదా 01:24-25
పదం సమాచారం:
- Strong's: H1166, H4474, H4475, H4896, H4910, H4915, H7287, H7300, H7980, H7985, G2634, G2904, G2961, G2963
ఆవు, ఆవులు, ఎద్దు, ఎద్దులు, దూడ, దూడలు, పశువులు, పెయ్య, ఎద్దు, ఎద్దులు
నిర్వచనం:
"ఆవు," "ఎద్దు," "పెయ్య," “పశువులు" అన్నీ గడ్డి మేసే ఒక జాతికి చెందిన పెద్ద, నాలుగు-కాళ్ళ జంతువులు.
- స్త్రీ జంతువు "ఆవు" అనీ మగ వాటిని "ఎద్దు" అనీ అంటారు. వాటి పిల్ల "దూడ."
- బైబిల్లో, ఈ పశువులు "శుద్ధ" జంతువులు. ప్రజలు ఆహారంగా, బలి అర్పణగా ఉపయోగించ వచ్చు. వీటిని ముఖ్యంగా మాంసం, పాలు కోసం పెంచుతారు. "పెయ్య" అంటే అడ ఆవు. ఇంతవరకూ దూడను పెట్టలేదు. "ఎద్దు" అనేది వ్యవసాయ పని కోసం ప్రత్యేకంగా శిక్షణ నిచ్చిన పశువు. ఈ పదం బహువచనం "ఎద్దులు." సాధారణంగా ఎద్దులు మగవి. వాటి.
- బైబిల్ అంతటా ఎద్దులను నాగలికిగానీ బండికి గానీ కాడి కింద కట్టిన జంతువులుగా చూపారు.
- ఎద్దులు ఒక కాడి కింద కలిసి పని చేస్తే అలాటి సందర్భం బైబిల్లో "కాడి కింద" అని రూపకాలంకారంగా కఠిన మైన పనిని సూచించడానికి వాడారు.
- ఎద్దు మగ పశువు. అయితే వృషణాలు చితకగొట్టకుండా అయినా పని చేయడానికి శిక్షణనిస్తారు.
(చూడండి: కాడి)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 15:9-11
- నిర్గమ 24:5-6
- సంఖ్యా 19:1-2
- ద్వితీ 21:3-4
- 1 సమూయేలు 01:24-25
- 1 సమూయేలు 15:1-3
- 1 సమూయేలు 16:2-3
- 1 రాజులు 01:9-10
- 2 దిన 11:13-15
- 2 దిన 15:10-11
- మత్తయి 22:4
- లూకా 13:15-16
- లూకా 14:4-6
- హెబ్రీ 09:13-15
పదం సమాచారం:
- Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022
ఆశీర్వదించు, ఆశీర్వదించబడిన, ఆశీర్వాదం
నిర్వచనం:
ఎవరినైనా లేక దేనినైనా "ఆశీర్వదించడం" అంటే ఆశీర్వదించబడుతున్న వ్యక్తికి మంచివీ, మరియు ప్రయోజనకరమైన విషయాలు కలిగేలా చెయ్యడం అని అర్థం.
- ఎవరినైనా ఆశీర్వదించడం అంటే ఆ వ్యక్తికి సానుకూలమైనవి, ప్రయోజనకరమైనవి జరగాలనే కోరికను వ్యక్తపరచడం.
- బైబిలు కాలాలలో, ఒక తండ్రి తరచుగా తన పిల్లలమీద ఆశీర్వాదం ఉచ్చరిస్తాడు.
- ప్రజలు దేవుణ్ణి "ఆశీర్వదిస్తున్నారు" లేదా దేవుడు ఆశీర్వదించబడాలనే కోరికను వ్యక్తపరుస్తున్నారు అంటే వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని అర్థం.
- పదం "ఆశీర్వదించు" పదం కొన్నిసార్లు ఆహారాన్ని తీసుకోడానికి ముందు దానిని పవిత్రపరచడం కోసం లేదా ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికీ, దేవుణ్ణి స్తుతించడానికీ ఉపయోగించబడుతుంది.
అనువాదం సూచనలు:
- "ఆశీర్వదించడానికి" అనే పదం "సమృద్ధిగా సమకూర్చడం కోసం" లేదా "చాలా దయతోనూ, అనుకూలంగానూ ఉండడం" అని అనువదించబడవచ్చు.
- "దేవుడు గొప్ప ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు" వాక్యాన్ని "దేవుడు అనేక మంచి సంగతులు అనుగ్రహించాడు" లేదా "దేవుడు సమృద్ధిగా సమకూర్చాడు" లేదా “దేవుడు అనేక మంచి విషయాలు జరిగేలా చేశాడు" అని అనువదించవచ్చు.
- "అతడు ఆశీర్వదించబడినవాడు" అనే వాక్యం "అతడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అతడు గొప్పగా ప్రయోజనాన్ని పొందుతాడు" లేదా "అతడు “అతడు మంచి వాటిని అనుభవిస్తాడు” లేదా “దేవుడు అతడు వర్ధిల్లేలా చేస్తాడు" అని అనువదించవచ్చు.
- "ఆ వ్యక్తి ఆశీర్వదించబడినవాడు" వాక్యాన్ని "అటువంటి వ్యక్తికి ఇది ఎంత శ్రేష్ఠమైనది" అని అనువదించవచ్చు.
- "ప్రభువు స్తుతింపబడును" లాంటి వ్యక్తీకరణలు "దేవుడు స్తుతి నొందును గాక" లేదా "దేవునికి స్తోత్రం" లేదా "నేను ప్రభువును స్తుతిస్తున్నాను" అని అనువదించబడవచ్చు.
- ఆహారాన్ని ఆశీర్వదించడం సందర్భంలో ఇది "ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం" లేదా "వారికి ఆహారం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించారు" లేదా "దాని కోసం దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఆహారాన్ని పవిత్ర పరచారు" అని అనువదించబడవచ్చు.
(చూడండి: స్తుతి)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింథీ 10:16
- అపొ. కా. 13:34
- ఎఫెసీ 01:03
- ఆదికాండం 14:20
- యెషయా 44:03
- యాకోబు 01:25
- లూకా 06:20
- మత్తయి 26:26
- నెహెమ్యా 09:05
- రోమా 04:09
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 01:07 అది మంచిదని దేవుడు చూశాడు. మరియు వారిని ఆశీర్వదించాడు.
- 01:15 దేవుడు ఆదాము, హవ్వలను తన స్వంత స్వరూపంలో చేసాడు. అయన వారిని ఆశీర్వదించాడు"మరియు వారితో, "మీరు అనేకమంది పిల్లలనూ మనుమ సంతానాన్ని కలిగి యుండండి మరియు భూమిని నింపండి" అని చెప్పాడు.
- 01:16 కాబట్టి దేవుడు తాను చేస్తున్న పని అంతటి నుండి విశ్రమించాడు. ఆయన ఏడవ రోజును ఆశీర్వదించాడు మరియు దానిని పవిత్రపరచాడు ఎందుకంటే ఆ రోజున ఆయన తన పని నుండి విశ్రమించాడు.
- 04:04 "నీ పేరును గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను మరియు నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ నీ వలన ఆశీర్వాదం పొందుతాయి."
- 04:07 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించాడు. మరియు "పరలోకానికీ, భూమికీ అధికారి అయిన సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును ఆశీర్వదించును గాక" అని చెప్పాడు.
- 07:03 ఇస్సాకు ఏశావుకు తన ఆశీర్వాదం ఇవ్వాలని కోరాడు.
- 08:05 చెరసాలలో సైతం, యోసేపు దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
పదం సమాచారం:
- Strong's: H833, H835, H1288, H1289, H1293, G1757, G2127, G2128, G2129, G3106, G3107, G3108, G6050
ఇతియోపియా, ఇతియోపీయుడు
వాస్తవాలు:
ఇతియోపియా దేశం ఆఫ్రికాలో ఈజిప్టుకు దక్షిణాన ఉన్న దేశం. పశ్చిమాన నైలు నది, తూర్పున ఎర్ర సముద్రం ఉన్నాయి. ఇతియోపియా మనిషిని "ఇతియోపీయుడు" అంటారు.
- ప్రాచీన ఇతియోపియా ఈజిప్టుకు దక్షిణంగా ఉంది. ఇప్పుడు అనేక ఆధునిక ఆఫ్రికా దేశాలు, సూడాన్, ఆధునిక ఇతియోపియా, సోమాలియా, కెన్యా, ఉగాండా, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, చాడ్ ఇక్కడ ఉన్నాయి.
- బైబిల్లో ఇతియోపియాను కొన్ని సార్లు "కూషు” లేక “నూబియా" అని పిలిచాడు
- ఇతియోపియా ("కూషు"), ఈజిప్టు దేశాలను తరచుగా బైబిల్లో కలిపి ప్రస్తావించారు. ఎందుకంటే అవి ఒకదానికి ఒకటి అనుకుని ఉన్నాయి. వారి ప్రజలకు ఒకే పూర్వీకులు ఉండి ఉంటారు.
- దేవుడు సువార్తికుడు ఫిలిప్పును ఎడారి దారిన పంపించగా అతడు ఒక ఇతియోపీయ నపుంసకునికి యేసును గురించిన సువార్త వినిపించాడు.
(చూడండి: కూషు, ఈజిప్టు, నపుంసకుడు, ఫిలిప్పు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 08:26-28
- అపో. కా. 08:29-31
- అపో. కా. 08:32-33
- అపో. కా. 08:36-38
- యెషయా 18:1-2
- నహుము 03:8-9
- జెఫన్యా 03:9-11
పదం సమాచారం:
- Strong's: H3568, H3569, H3571, G128
ఇల్లు, ఇళ్ళు, ఇంటి కప్పు, ఇంటి కప్పులు, గిడ్డంగి, గిడ్డంగులు, గృహనిర్వాహకులు
నిర్వచనం:
"ఇల్లు" అనే మాటను బైబిల్లో తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు.
- కొన్ని సార్లు "ఇంటి వారు," అంటే ఒక ఇంట్లో కలిసి నివసించే మనుషులు.
- తరచుగా "ఇల్లు" అంటే ఒక వ్యక్తి సంతానం, ఇతర బంధువులు. ఉదాహరణకు, "దావీదు ఇల్లు" అంటే దావీదు సంతానం.
- “దేవుని ఇల్లు” “యెహోవా ఇల్లు" అంటే ప్రత్యక్ష గుడారం, లేదా ఆలయం. ఈ మాటలు సాధారణంగా దేవుడు నివసించే చోటును కూడా సూచిస్తాయి.
- హెబ్రీ 3లో "దేవుని ఇల్లు" అనే మాటను రూపకాలంకారంగా దేవుని ప్రజలను లేక సాధారణంగా, దేవునికి చెందిన ప్రతిదాన్నీ సూచించడానికి వాడారు.
- "ఇశ్రాయేలు ఇల్లు" అంటే సాధారణంగా మొత్తం ఇశ్రాయేలు జాతి లేక ఇదమిద్ధంగా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం గోత్రాలు.
అనువాదం సలహాలు
- సందర్భాన్ని బట్టి, "ఇల్లు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఇంటి వారు” లేక “ప్రజలు” లేక “కుటుంబం” లేక “సంతానం” లేక “ఆలయం” లేక “నివాస స్థలం."
- "దావీదు ఇల్లు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దావీదు వంశం” లేక “దావీదు కుటుంబం” లేక “దావీదు సంతానం." సంబంధించిన అనే మాటలు ఇలానే అనువదించ వచ్చు.
- "ఇశ్రాయేలు ఇల్లు" అనే మాట అనువాదం "ఇశ్రాయేలు ప్రజలు” లేక “ఇశ్రాయేలీయుల సంతానం” లేక “ఇశ్రాయేలీయులు."
- "యెహోవాఇల్లు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యెహోవా ఆలయం” లేక “యెహోవాను ఆరాధించే చోటు” లేక “యెహోవాతన ప్రజలను కలుసుకునే చోటు” లేక “యెహోవా నివసించే చోటు."
- "దేవుని ఇల్లు" అనే దాన్ని ఇలా ఇదే విధంగా అనువదించ వచ్చు.
(చూడండి: దావీదు, వారసుడు, దేవుని ఇల్లు, ఇంటి వారు, ఇశ్రాయేలు రాజ్యము, ప్రత్యక్ష గుడారం, ఆలయం, యెహోవా)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 07:41-42
- అపో. కా. 07:47-50
- ఆది 39:3-4
- ఆది 41:39-41
- లూకా 08:38-39
- మత్తయి 10:5-7
- మత్తయి 15:24-26
పదం సమాచారం:
- Strong's: H1004, H1005, G3609, G3613, G3614, G3624
ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు
వాస్తవాలు:
"ఇశ్రాయేలు" అనేది దేవుడు యాకోబుకు పెట్టిన పేరు. అంటే "అతడు దేవునితో పోరాడాడు."
- యాకోబు సంతానాన్ని "ఇశ్రాయేలు ప్రజలు” లేక “ఇశ్రాయేలు జాతి” లేక “ఇశ్రాయేలీయులు" అన్నారు.
- దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన నిబంధన చేశాడు. వారు ఆయన ఎన్నికైన ప్రజ.
- ఇశ్రాయేలు జాతిలో పన్నెండు గోత్రాలున్నాయి.
- తరువాత సొలోమోను రాజు చనిపోయాక, ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోయింది: దక్షిణ రాజ్యం "యూదా," ఉత్తర రాజ్యం "ఇశ్రాయేలు."
- సందర్భాన్ని బట్టి "ఇశ్రాయేలు" ను ఇలా అనువదించ వచ్చు. " ఇశ్రాయేలు ప్రజ ” లేక “ఇశ్రాయేలు జాతి".
(చూడండి: ఇశ్రాయేలు, ఇశ్రాయేలు రాజ్యము, యూద, జాతి, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 10:1-3
- 1 రాజులు 08:1-2
- అపో. కా. 02:34-36
- అపో. కా. 07:22-25
- అపో. కా. 13:23-25
- యోహాను 01:49-51
- లూకా 24:21
- మార్కు 12:28-31
- మత్తయి 02:4-6
- మత్తయి 27:9-10
- ఫిలిప్పి 03:4-5
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 08:15 పన్నెండు మంది కుమారులు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలు అయ్యారు.
- 09:03 ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులచే బలవంతంగా అనేక భవనాలు, మొత్తంగా పట్టణాలు కట్టించారు.
- 09:05 ఒక ఇశ్రాయేలు స్త్రీ జన్మ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
- 10:01 వారు చెప్పాడు, "ఇశ్రాయేలు దేవుడు ఇలా చెబుతున్నాడు, 'నా ప్రజలను వెళ్ళనివ్వండి!'"
- 14:12 అయితే ఇశ్రాయేలు ప్రజలు పోగై దేవునికి, మోషేకు వ్యతిరేకంగా సణిగారు.
- 15:09 దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు పక్షంగా పోరాడాడు. ఆయన పెద్ద వడగళ్ళు కురిపించి అమోరీయులను హతం చేశాడు. అమోరీయులు చిందరవందర అయిపోయారు.
- 15:12 యుద్ధం తరువాత దేవుడు ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ వాగ్దాన దేశంలో భూభాగం ఇచ్చాడు. తరువాత దేవుడు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నెమ్మదినిచ్చాడు..
- 16:16 కాబట్టి దేవుడు విగ్రహారాధన నిమిత్తం ఇశ్రాయేలును శిక్షించాడు.
- 43:06 "మనుషులు of ఇశ్రాయేలు మనుషులారా, మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా దేవుని శక్తి చేత యేసు అనేక సూచనలు అద్భుతాలు చేశాడు.
పదం సమాచారం:
- Strong's: H3478, H3479, H3481, H3482, G935, G2474, G2475
ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు, యాకోబు
వాస్తవాలు:
యాకోబు ఇస్సాకు, రిబ్కాలకు పుట్టిన కవలల్లో ఒకడు.
- యాకోబు పేరుకు అర్థం "అతడు మడమను పట్టుకున్నాడు" ఈ మాట అర్థం "అతడు మోసగించే వాడు." యాకోబు పుడుతున్నప్పుడు అతడు సోదరుడు ఏశావు మడిమె పట్టుకున్నాడు.
- అనేక సంవత్సరాలు తరువాత, దేవుడు యాకోబు పేరును "ఇశ్రాయేలు," అని మార్చాడు. అంటే "అతడు దేవునితో పోరాడాడు."
- యాకోబు యుక్తిపరుడు, కపటమైనవాడు. అతడు మొదట పుట్టినవాడి ఆశీర్వాదం, వారసత్వ హక్కులు నుండి తన అన్న ఏశావు దగ్గరనుండి లాగేసుకోవాలని చూశాడు.
- ఏశావు కోపగించుకుని యాకోబును చంపడానికి చూశాడు. అందుకని యాకోబు తన స్వదేశం విడిచి పారిపోయాడు. అయితే సంవత్సరాలు తరువాత యాకోబును తన భార్యలతో, పిల్లలతో ఏశావు ఉంటున్న కనాను ప్రదేశం తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పాడు. వారి కుటుంబాలు ఒకరితో ఒకరు సామరస్యంగా నివసించారు.
- యాకోబుకు పన్నెండు మంది కుమారులు. వారి సంతానం పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలుగా అయ్యారు.
- యాకోబు అనే పేరు గల వేరువేరు మనుషులు ఉన్నారు. వారిలో మత్తయి రాసిన యేసు వంశవృక్షంలో యోసేపు తండ్రి ఉన్నాడు.
(చూడండి: కనాను, మోసగించు, ఏశావు, ఇస్సాకు, ఇశ్రాయేలు, రిబ్కా, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 07:11-13
- అపో. కా. 07:44-46
- ఆది 25:24-26
- ఆది 29:1-3
- ఆది 32:1-2
- యోహాను 04:4-5
- మత్తయి 08:11-13
- మత్తయి 22:31-33
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 07:01 పిల్లలు ఎదుగుతూ ఉండగా రిబ్కా యాకోబును ప్రేమించింది. అయితే ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. యాకోబుకు ఇంటిపట్టున ఉండడం ఇష్టం, అయితే ఏశావుకు వేట అంటే ఇష్టం.
- 07:07 యాకోబు అనేక సంవత్సరాలు, అక్కడ నివసించి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. అతనికి పన్నెండు మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. దేవుడు అతణ్ణి ధనికుడుగా చేశాడు.
- 07:08 ఇరవై సంవత్సరాల తరువాత అక్కడ నుండి తన కుటుంబం, సేవకులు, తన మందలు అన్నిటినీ తీసుకుని కనానులో తన ఇంటికి తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పాడు.
- 07:10 దేవుడు అబ్రాహాముకు చేసిన నిబంధన వాగ్దానం ఇస్సాకుకు, ఇప్పుడు యాకోబు కు సంక్రమించింది.
- 08:01 అనేక సంవత్సరాలు తరువాత, యాకోబు వృద్ధాప్యంలో అతడు ఇష్టమైన కుమారుడు, యోసేపును మందలను కాస్తున్న అతని సోదరుల దగ్గరకు పంపించాడు.
పదం సమాచారం:
ఇష్మాయేలు, ఇష్మాయేలీయుడు, ఇష్మాయేలీయులు
వాస్తవాలు:
ఇష్మాయేలు అబ్రాహాముకు ఐగుప్తియ బానిస హాగరుకు పుట్టిన కుమారుడు. అనేక ఇతర మనుషులు పాత నిబంధనలో ఇష్మాయేలు అనే పేరుగల వారు ఉన్నారు.
- "ఇష్మాయేలు" అంటే "దేవుడు వింటాడు."
- దేవుడు అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలును దీవిస్తానని వాగ్దానం చేశాడు. అయితే అతడు దేవుడు తన నిబంధన స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన కుమారుడు కాడు.
- దేవుడు హాగరును ఇష్మాయేలును వారు ఎడారిలోకి వెళ్ళగొట్టబడినప్పుడు కాపాడాడు.
- ఇష్మాయేలు పారాను ఎడారిలో ఉన్నప్పుడు ఒక అతడు ఐగుప్తియ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు.
- నెతన్యా కుమారుడు ఇష్మాయేలు సైన్యంలో అధికారి గవర్నర్ ను మట్టు బెట్ట డానికి బాబిలోనియా రాజు, నెబుకద్నేజర్ నియమించిన మనుషులకు నాయకుడు.
- పాత నిబంధనలో నలుగురు ఇష్మాయేలు అనే పేరు గల ఇతర మనుషులు ఉన్నారు.
(చూడండి: అబ్రాహాము, బబులోను, నిబంధన, ఎడారి, ఈజిప్టు, హాగరు, ఇస్సాకు, నెబుకద్నెజరు, పారాను, శారా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 01:28-31
- 2 దిన 23:1-3
- ఆది 16:11-12
- ఆది 25:9-11
- ఆది 25:13-16
- ఆది 37:25-26
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 05:02 కాబట్టి అబ్రాము హాగరును పెళ్లి చేసుకున్నాడు. హాగరుకు మగపిల్లవాడు పుట్టాడు. అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.
- 05:04 "నేను ఇష్మాయేలును గొప్ప జాతిగా చేస్తాను. అయితే నా నిబంధన మాత్రం ఇస్సాకుతో చేస్తాను."
పదం సమాచారం:
ఇస్సాకు
వాస్తవాలు:
ఇస్సాకు అబ్రాహాము శారాల ఏకైక కుమారుడు. వారు వృద్దులైనప్పటికి దేవుడు వారికి కొడుకునిస్తానని వాగ్దానం చేశాడు.
- "ఇస్సాకు" అంటే "అతడు నవ్వుతాడు." దేవుడు అబ్రాహాముకు శారా కొడుకును కంటుందని చెబితే , అబ్రాహాము నవ్వాడు. ఎందుకంటే వారు ఇద్దరూ ముసలివాళ్ళే. కొంత కాలం తరువాత, శారా ఆ వార్త విని ఆమె కూడా నవ్వింది.
- అయితే దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. అబ్రాహాము, శారాలకు వారి ముసలి తనంలో ఇస్సాకు పుట్టాడు.
- దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు. తాను అబ్రాహాముతో చేసిన నిబంధన ఇస్సాకుకు, తరువాత తన సంతానానికి శాశ్వతకాలం ఉంటుంది.
- ఇస్సాకు యువ ప్రాయంలో దేవుడు అబ్రాహాము విశ్వాసపరీక్ష చేస్తూ ఇస్సాకును బలి అర్పణ చేయమని చెప్పాడు.
- ఇస్సాకు కుమారుడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు. వారి సంతానం తరువాత పన్నెండు గోత్రాలుగా ఇశ్రాయేలు జాతి అయ్యారు.
(చూడండి: అబ్రాహాము, వారసుడు, నిత్యత్వం, నెరవేర్చు, ఇశ్రాయేలు, శారా, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- గలతి 04:28-29
- ఆది 25:9-11
- ఆది 25:19-20
- ఆది 26:1
- ఆది 26:6-8
- ఆది 28:1-2
- ఆది 31:17-18
- మత్తయి 08:11-13
- మత్తయి 22:31-33
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 05:04 "నీ భార్య, శారా, కుమారుణ్ణి —కంటుంది. అతడు వాగ్దానపుత్రుడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు."
- 05:06 ఇస్సాకు యువకుడుగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాడు, "నీ ఏకైక కుమారుడు ఇస్సాకు, బలి అర్పణగా నాకు అర్పించు."
- 05:09 దేవుడు ఇస్సాకుకు బదులుగా బలి అర్పణ కోసం ఒక పొట్టేలును చూపించాడు_.
- 06:01 అబ్రాహాము వృద్ధుడు అయినప్పుడు అతని కుమారుడు, ఇస్సాకు, పెద్ద వాడయ్యాక అబ్రాహాము తన సేవకుల్లో ఒకడిని తన దేశంలో తన బంధువుల దగ్గరకు తన కుమారుడు, ఇస్సాకు కు భార్యను తెమ్మని పంపించాడు.
- 06:05 ఇస్సాకు ప్రార్థించగా రిబ్కా గర్భవతి కావడానికి దేవుడు అనుమతించాడు. ఆమె కవలలకు జన్మనిచ్చింది.
- 07:10 తరువాత ఇస్సాకు చనిపోయాక, యాకోబు, ఏశావు అతన్ని పాతిపెట్టారు. అబ్రాహముకు దేవుడు చేసిన నిబంధన వాగ్దానం ప్రకారం అతని తరువాత అది ఇస్సాకుకు ఇప్పుడు యాకోబుకు సంక్రమించింది.
పదం సమాచారం:
- Strong's: H3327, H3446, G2464
ఈజిప్టు, ఐగుప్తియుడు, ఈజిప్టు వారు
వాస్తవాలు:
ఈజిప్టు ఆఫ్రికా ఈశాన్య భాగంలో ఉన్న దేశం. కనాను ప్రదేశానికి నైరుతి దిక్కుగా ఉంది. ఐగుప్తియుడు అంటే ఈజిప్టు దేశస్థుడు.
- ప్రాచీన కాలంలో, ఈజిప్టు ఒక శక్తివంతమైన సంపన్న దేశం.
- ప్రాచీన ఈజిప్టు రెండు భాగాలుగా ఉంది. దిగువ ఈజిప్టు (ఉత్తర భాగం. నైలు నది దిగువకు సముద్రంలోకి ప్రవహించే భాగం), ఎగువ ఈజిప్టు (దక్షిణ భాగం). పాత నిబంధనలో, ఈ భాగాలను మూల భాషలో "ఈజిప్టు” “పత్రోస్" అన్నారు.
- అనేక సమయాలు కనానులో ఆహారం కొరతగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయుల పితరులు వారి కుటుంబాలకు ఆహారం కోసం ఈజిప్టుకు ప్రయాణించారు.
- అనేక వందల సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారు.
- యోసేపు, మరియ హేరోదునుండి తప్పించుకోడానికి చిన్న వాడు యేసును తీసుకుని ఈజిప్టు వెళ్లారు.
(చూడండి: మహా హేరోదు, యోసేపు (కొ ని), నైలు నది)
బైబిల్ రిఫరెన్సులు:
- పితరుడు
- అపో. కా. 07:9-10
- నిర్గమ 03:7-8
- ఆది 41:27-29
- ఆది 41:55-57
- మత్తయి 02:13-15
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 08:04 బానిస వ్యాపారాలు యోసేపును ఈజిప్టుకు తీసుకుపోయారు. ఈజిప్టు పెద్ద, శక్తివంతమైన దేశం. నైలు నది అందులో ప్రవహిస్తున్నది.
- 08:08 ఫరో యోసేపును గురించి ఎంత మెచ్చుకున్నాడంటే అతణ్ణి ఈజిప్టు అంతటిలో రెండవ అత్యధిక శక్తివంతమైనవాడుగా నియమించాడు!
- 08:11 కాబట్టి యాకోబు తన కుమారులను ఆహారం కొనడానికి ఈజిప్టుకు పంపించాడు.
- 08:14 యాకోబు ముసలి వాడైనప్పటికి, అతడు తన కుటుంబం అంతటితో ఈజిప్టు వెళ్ళాడు. వారు అక్కడ నివసించారు.
- 09:01 తరువాత యోసేపు చనిపోయాక, అతని బంధువులు అంతా ఈజిప్టు లో నివసించారు.
పదం సమాచారం:
- Strong's: H4713, H4714, G124, G125
ఉంపుడుగత్తె, ఉంపుడుగత్తెలు
నిర్వచనం:
ఉంపుడుగత్తె అంటే ఒక మనిషికి భార్య ఉండగా వేరొక స్త్రీని పరిగ్రహిస్తే ఆ రెండవ ఆమె. సాధారణంగా ఉంపుడుగత్తె చట్టపరంగా ఆ వ్యక్తికి పెళ్లి జరిగినది కాదు.
- పాత నిబంధనలో, ఉంపుడుగత్తెలు తరచుగా స్త్రీ బానిసలు.
- ఉంపుడుగత్తె ను కొనడం ద్వారా పొందవచ్చు. లేక యుద్ధంలో దోపుడు సొమ్ముగా,బాకీ తీర్చడంలో భాగంగా పొందే వారు.
- రాజుకు అనేక మంది ఉంపుడుగత్తెలు ఉండడం ఘనతగా ఎంచేవారు.
- ఉంపుడుగత్తె ఉండడం దేవుని సంకల్పానికి వ్యతిరేకమని కొత్త నిబంధన బోధిస్తున్నది.
బైబిల్ రిఫరెన్సులు:
- 2 సమూయేలు 03:6-7
- ఆది 22:23-24
- ఆది 25:5-6
- ఆది 35:21-22
- ఆది 36:9-12
- న్యాయాధి 19:1-2
పదం సమాచారం:
ఊట, ఊటలు, బుగ్గ, బుగ్గలు, పెల్లుబుకు
నిర్వచనం:
పదాలు "ఊట” “బుగ్గ" సాధారణంగా నేల నుండి సహజంగా పెల్లుబికే నీటి ప్రవాహం.
- ఈ మాటలను అలంకారికంగా బైబిల్లో దేవుని నుండి ప్రవహించే ఆశీర్వాదాలను, లేక దేవుడు దేన్నైనా శుద్ధి చేస్తే పరిశుభ్ర పరిస్తే దానికి ఉపయోగిస్తారు.
- ఆధునిక కాలంలో, ఊట అంటే తరచుగా మనిషి నిర్మించిన నీరు ప్రవహించే దానికోసం వాడతారు. మీ అనువాదం సహజమైన నీటి మూలం అనే అర్థాన్ని ఇస్తున్నదో లేదో చూడండి.
- ఈ పదం అనువాదం "వరద" అనే అర్థం కూడా ఇస్తుంది అనేది పోల్చి చూడండి.
(చూడండి: వరద)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 పేతురు 02:17-19
- ఆది 07:11-12
- ఆది 08:1-3
- ఆది 24:12-14
- ఆది 24:42-44
- యాకోబు 03:11-12
పదం సమాచారం:
- Strong's: H794, H953, H1530, H1543, H1876, H3222, H4002, H4161, H4456, H4599, H4726, H5033, H5869, H5927, H6524, H6779, H6780, H7823, H8444, H8666, G242, G305, G393, G985, G1530, G1816, G4077, G4855, G5453
ఊదా
వాస్తవాలు:
“ఊదా” అనే పదము ఒక రంగు పేరు, ఇది నీలం మరియు ఎరుపు రంగుల మిశ్రణం.
- పూర్వ కాలములో ఊదా రంగు చాలా అరుదుగా దొరికేది మరియు ఇది చాలా విలువైనది. ఈ రంగును రాజుల వస్త్రములకు మరియు ఇతర ఉన్నత అధికారుల వస్త్రములకు వేయుటకు ఉపయోగించేవారు.
- ఎందుకంటే ఇది చాలా వెలగలిగినది మరియు ఈ రంగును తయారు చేయుటకు ఎక్కువ సమయము కావలసియుండేది, ఊదా రంగు బట్టలు సంపన్నతకు, విశిష్టతకు మరియు రాజరికమునకు గుర్తుగా పరిగణించబడేది.
- అనేక రంగులలో ఊదా రంగును కూడా గుడారము మరియు దేవాలయములోనున్న తెరలలో ఉపయోగించారు, అంతేగాకుండా, యాజకుల ద్వారా ధరించే ఏఫోదులో కూడా ఉపయోగించారు.
- ఊదా రంగుకు సంబంధించిన పొడిని ఒక విధమైన సముద్రపు నత్తలను దంచుట ద్వారా లేక వాటిని ఉడుకబెట్టుట ద్వారా లేక అవి జివిస్తూ ఉండగనే దానికి సంబంధించిన పదార్థమును విడుదల చేయునట్లు చేయుట ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది చాలా వెలతో కూడిన ఉత్పత్తి విధానమైయుండెను.
- రోమా సైనికులు యేసును సిలువకు వేయక ముందు ఆయనపైన ఊదా రంగుకు సంబంధించిన రాజరికపు బట్టను వేసిరి, ఎందుకంటే యూదుల రాజని ఆయన చెప్పుకోనినందుకుగాని ఆ బట్టను వేసి హేళన చేసిరి.
- ఫిలిప్పి పట్టణస్థురాలైన లూదియా అను ఒక స్త్రీ తన పోషణ కొరకు ఊదా రంగు పొడిని అమ్ముకొనుచుండెను.
(ఈ పదములను కూడా చూడండి: ఏఫోదు, ఫిలిప్పి, రాజరికం, ప్రత్యక్ష గుడారం, ఆలయం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 దిన.02:13-14
- దాని.05:7
- దాని.05:29-31
- సామెతలు.31:22-23
పదం సమాచారం:
- Strong's: H710, H711, H713, G4209, G4210, G4211
ఊపిరి, శ్వాస, శ్వాస, ఊదడం
నిర్వచనం:
బైబిల్లో, పదాలు "శ్వాస” “ఊపిరి" తరచుగా జీవం ఇవ్వడానికి, జీవం కలిగి ఉండడానికి అలంకారికంగా ఉపయోగిస్తారు.
- దేవుడు "ఊపిరి ఊదాడు"అంటే ఆదాములోకి జీవ శ్వాస పంపాడు, అని బైబిల్ బోధిస్తున్నది. సరిగ్గా ఆ సమయంలో ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు.
- యేసు శిష్యులపై ఊది, వారికి "ఆత్మను పొందమని" చెప్పాడు. అయన బహుశా అక్షరాలా గాలి ఊదడం ద్వారా సంకేతరూపంగా పరిశుద్ధాత్మ వారిపైకి రావడం తెలియజేశాడు.
- కొన్ని సార్లు పదాలు "ఊదడం” “బయటికి ఊదడం"అనే దాన్ని మాట్లాడడం సూచించడానికి ఉపయోగిస్తారు.
- అలంకారికంగా అనే మాట "దేవుని ఊపిరి” లేక “యెహోవా ఊపిరి" తరచుగా దేవుని ఆగ్రహాన్ని సూచిస్తున్నది. తిరుగుబాటు చేసిన నిర్దేవ జాతులపై ఇది శిక్ష. ఇది అయన శక్తికి సూచన.
అనువాదం సలహాలు
- "తన చివరి శ్వాస"అనే మాటను అలంకారికంగా "అతడు చనిపోయాక" అనే అర్థం ఇస్తుంది. దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అతడు తన చివరి ఊపిరి తీసుకున్నాడు” లేక “అతడు ఊపిరి పీల్చడం మానేశాడు” లేక “అతడు అంతిమ శ్వాస తీసుకున్నాడు."
- లేఖనాలు "దేవుని శ్వాస"అంటే దేవుడు తన ప్రేరణనిచ్చి పలికిన లేఖన వాక్కులు. వీటిని మనుషులు తరువాత రాశారు. బహుశా సాధ్యమైతే దీన్ని దేవుని శ్వాస అని అనువదించడం కొంత వరకు అక్షరాలా సరి అయినది. అంతకు మించి ఈ అర్థాన్ని చక్కగా చెప్పడం కుదరదు.
- అక్షరార్థంగా అనువదిస్తే "దేవుని శ్వాస"అనే మాట ఆమోదయోగ్యం కాదు. తర్జుమా చేసే ఇతర పద్ధతులు "దైవ ప్రేరణ” లేక “దేవుని రచన” లేక “దేవుడు పలికిన." "దేవుని శ్వాస ద్వారా లేఖన వాక్కులు వచ్చాయి"అని రాయవచ్చు.
- "ఊపిరి పీల్చుకోవడం” లేక “జీవ శ్వాస ఊదడం” లేక “ఊపిరి పోయడం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శ్వాస పీల్చుకొనేలా చెయ్యడం” లేక “మరలా బ్రతికించడం” లేక “జీవించి శ్వాస తీసుకునేలా చెయ్యడం” లేక “జీవం ఇవ్వడం."
- సాధ్యమైతే దీన్ని ఇలా అనువదించడం మంచిది. "దేవుని ఊపిరి." అక్షరార్థంగా మీ భాషలో "ఊపిరి"అనే అర్థం ఇవ్వడానికి ఏ పదం ఉపయోగిస్తారో చూడండి. దేవునికి "ఊపిరి"ఉంటుంది అని చెప్పడం వీలు పడకపోతే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని శక్తి” లేక “దేవుని పలుకు."
- "నిలదొక్కుకుని” లేక “కాస్త ఊపిరి పీల్చుకుని"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శ్వాస మరింత తేలికగా పీల్చుకునేలా” లేక “మామూలుగా శ్వాస పీల్చుకోవడం కోసం పరిగెత్తడం ఆపడం."
- "అది కేవలం ఊపిరి మాత్రమే"అంటే "ఇక చాలా తక్కువ సమయం మిగిలింది."
- అదే విధంగా "మనిషి ఒకే ఊపిరి" అంటే "మనుషులు చాలా కొద్ది సమయం మాత్రమే జీవిస్తారు.” లేక “మానవుల జీవితం చాలా కొద్ది పాటి. చిన్న ఊపిరి వంటిది” లేక “దేవునితో పోలిస్తే మనిషి గాలి, లేక ఊపిరి లాగా స్వల్పం."
(చూడండి: ఆదాము, పౌలు, దేవుని వాక్యము, జీవం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1రాజులు 17:17-18
- ప్రసంగి 08:8-9
- యోబు 04:7-9
- ప్రకటన 11:10-12
- ప్రకటన 13:15-17
పదం సమాచారం:
- Strong's: H3307, H5301, H5396, H5397, H7307, H7309, G1709, G1720, G4157
ఎత్తుగా, అత్యున్నతంగా
నిర్వచనం:
“ఎత్తుగా,” “అత్యున్నతంగా” అనే పదాలు సాధారణంగా “పరలోకంలో” అనే అర్థాన్ని చూపిస్తాయి.
“అత్యున్నతంగా” అనే పదం “అత్యంత గౌరవాన్ని పొందడం” అనే అర్థాన్ని ఇస్తుంది.
- “అత్యున్నతంగా ఉన్న చెట్టు” అంటే “పొడవుగా ఉన్న చెట్టుమీద” అనే భావంతో కూడా అక్షరార్ధంగా వినియోగించవచ్చు,
- ”ఎత్తుగా” అనే పదం పక్షుల గూళ్ళు ఎత్తుగా ఉంటాయి అనే అర్ధం వచ్చేలా ఆకాశంలో ఎత్తుగా ఉండడం గురించి చెపుతుంది, ఆ సందర్భంలో “ఆకాశంలో ఉన్నతంగా” లేక “పొడవైన చెట్టు చివరన” అని అనువాదం చెయ్యవచ్చు.
- ”ఎత్తుగా” అనే పదం హెచ్చించిన ప్రదేశం, లేక ఒక వ్యక్తి ప్రాముఖ్యత లేక ఒక వస్తువు ప్రాముఖ్యతను సూచిస్తుంది.
- ”పైనుండి” అనే పదం “ఆకాశం నుండి అని అనువదించవచ్చు.
(చూడండి: పరలోకం, ప్రతిష్ట)
బైబిలు రిఫరెన్సులు:
- విలాపవాక్యములు 01:13-14
- కీర్తనలు 069:28-29
పదం సమాచారం:
- Strong's: H1361, H4605, H4791, H7682, G1722, G5308, G5310, G5311
ఎదోము, ఎదోమీయుడు, ఎదోమీయులు, ఇదుమియా
వాస్తవాలు:
ఎదోము అనేది ఏశావుకు మరొకపేరు. అతడు నివసించిన ప్రాంతానికి "ఎదోము" అనీ, అటు తరువాత, "ఇదుమియా" అనీ పేరు వచ్చింది. "ఎదోమీయులు" అతని సంతానం.
- ఎదోము ప్రాంతం ఉనికి మారుతూ వచ్చింది. మొత్తం మీద ఇశ్రాయేలుకు దక్షిణాన, ఎట్టకేలకు దక్షిణ యూదాకు వ్యాపించింది.
- కొత్త నిబంధన సమయాల్లో ఎదోము యూదా పరగణా దక్షిణ భాగంలో ఉంది. గ్రీకులు దీన్ని "ఇదుమియా" అని పిలిచారు.
- "ఎదోము" అంటే "ఎరుపు," బహుశా ఇది పుట్టుకతోనే ఏశావు శరీరంపై ఉన్న ఎర్రని వెంట్రుకల మూలంగా వచ్చి ఉండవచ్చు. లేదా ఏశావు తన జన్మ హక్కు ను అమ్ముకుని తిన్న ఎర్రని చిక్కుడు కూర మూలంగా వచ్చి ఉండవచ్చు.
- పాత నిబంధనలో ఎదోము దేశాన్ని తరచుగా ప్రస్తావించినది ఇశ్రాయేలుకు శత్రు దేశంగా.
- ఓబద్యా మొత్తం పుస్తకం ఎదోము నాశనం గురించే. ఇతర పాత నిబంధన ప్రవక్తలు ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనాలు పలికారు.
(చూడండి: ప్రత్యర్థి, జన్మ హక్కు, ఏశావు, ఓబద్యా, ప్రవక్త)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 25:29-30
- ఆది 32:3-5
- ఆది 36:1-3
- యెషయా 11:14-15
- యెహోషువా 11:16-17
- ఓబద్యా 01:1-2
పదం సమాచారం:
- Strong's: H123, H130, H8165, G2401
ఎఫ్రాయిము, ఎఫ్రాయిమీయుడు, ఎఫ్రాయిమీయులు
వాస్తవాలు:
ఎఫ్రాయిము యోసేపు రెండవ కుమారుడు. అతని సంతానం, ఎఫ్రాయిమీయులు, పన్నెండు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటిగా అయింది.
- ఎఫ్రాయిము గోత్రం ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు పది గోత్రాల్లో ఒకటి.
- కొన్ని సార్లు ఎఫ్రాయిము పేరును బైబిల్లో ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం కోసం ఉపయోగిస్తారు.
- ఎఫ్రాయిము ప్రదేశం కొండ ప్రాంతం. " ఎఫ్రాయిము కొండ సీమ” లేక “ఎఫ్రాయిము కొండలు."
(చూడండి: ఇశ్రాయేలు రాజ్యము, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 06:66-69
- 2 దిన 13:4-5
- యెహెజ్కేలు 37:15-17
- ఆది 41:50-52
- ఆది 48:1-2
- యోహాను 11:54-55
పదం సమాచారం:
- Strong's: H669, H673, G2187
ఏలాము, ఏలామీయులు
వాస్తవాలు:
ఏలాము షేము కుమారుడు, నోవహు మనవడు
- ఏలాము సంతానం "ఏలామీయులు," వారు "ఏలాము" ప్రదేశంలో నివసించారు.
- ఏలాము ప్రాంతం టైగ్రిస్ నదికి ఆగ్నేయ దిశలో ఇప్పుడు పశ్చిమ ఇరాన్లో ఉంది.
(చూడండి: నోవహు, షేము)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 01:17-19
- అపో. కా. 02:8-11
- ఎజ్రా 08:4-7
- యెషయా 22:5-7
పదం సమాచారం:
- Strong's: H5867, H5962, G1639
ఏశావు
వాస్తవాలు:
ఏశావు ఇస్సాకు, రిబ్కాల కవల పిల్లల్లో ఒకడు. అతడు ఇస్సాకుకు పుట్టిన మొదటి బిడ్డ. అతని కవల సోదరుడు యాకోబు.
- ఏశావు తన జన్మ హక్కును అతని సోదరుడు యాకోబుకు ఒక ఆహార పదార్థం కోసం అమ్మి వేశాడు.
- ఏశావు పెద్ద కొడుకు కాబట్టి అతని తండ్రి ఇస్సాకు అతనికి ప్రత్యేక ఆశీర్వాదం ఇవ్వాలి. అయితే యాకోబు ఇస్సాకును మోసగించి ఆ ఆశీర్వాదం తానే పొందాడు. మొదట్లో ఏశావు కోపగించుకున్నాడు. అతడు యాకోబును చంపడానికి చూశాడు. అయితే తరువాత అతడు అతన్ని క్షమించాడు.
- ఏశావుకు అనేక మంది పిల్లలు, మనవలు కలిగారు. ఈ సంతానం పెద్ద ప్రజా సమూహం అయి కనాను ప్రదేశంలో నివసించారు.
(చూడండి: ఎదోము, ఇస్సాకు, ఇశ్రాయేలు, రిబ్కా)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 25:24-26
- ఆది 25:29-30
- ఆది 26:34-35
- ఆది 27:11-12
- ఆది 32:3-5
- హెబ్రీ 12:14-17
- రోమా 09:10-13
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 06:07 రిబ్కా పిల్లలు పుట్టినప్పుడు మొదటి వాడు ఎరుపు బొచ్చుతో బయటికి వచ్చాడు. అతని పేరు ఏశావు.
- 07:02 కాబట్టి ఏశావు యాకోబుకు తన పెద్దకొడుకు హక్కులు ఇచ్చేశాడు.
- 07:04 ఇస్సాకు మేక వెంట్రుకల వాసన గల వస్త్రాలు, వాసన చూసి అతడు ఏశావు అనుకుని అతణ్ణి ఆశీర్వదించాడు.
- 07:05 ఏశావు యాకోబును ద్వేషించాడు. ఎందుకంటే యాకోబు పెద్ద కొడుకు హక్కు అయిన తన ఆశీర్వాదం దొంగిలించాడు.
- 07:10 అయితే ఏశావు యాకోబును క్షమించాడు. వారు ఒకరినొకరు చూసుకుని ఆనందించారు.
పదం సమాచారం:
ఒంటె, ఒంటెలు
నిర్వచనం:
ఒంటె నాలుగు కాళ్ళు గల పెద్ద జంతువు. వీపుపై ఒకటి లేక రెండు మూపురాలు ఉంటాయి.
- బైబిల్ కాలాల్లో, ఇశ్రాయేలు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఒంటె అన్నిటికన్నా పెద్ద జంతువు.
- ఒంటెను ముఖ్యంగా మనుషులను భారాలను మోయడానికి ఉపయోగిస్తారు.
- కొన్ని ప్రజా సమూహాలు ఒంటెలను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఇశ్రాయేలీయులు అలా చెయ్యరు. ఎందుకంటే ఒంటెలు మలిన జీవులని వాటిని తినకూడదని దేవుడు చెప్పాడు.
- ఒంటెలు చాలా విలువైనవి. ఎందుకంటే అవి వేగంగా ఇసుక నేలలో ప్రయాణించగలవు. ఆహారం, నీరు లేకుండా అనేక వారాలు ఉండగలవు.
(చూడండి: భారం, శుద్ధమైన)
బైబిల్ రిఫరెన్సులు:
- 1దిన 05:20-22
- 2దిన 09:1-2
- నిర్గమ 09:1-4
- మార్కు 10:23-25
- మత్తయి 03:4-6
- మత్తయి 19:23-24
పదం సమాచారం:
- Strong's: H327, H1581, G2574
ఒలీవ, ఒలీవలు
నిర్వచనం :
ఒలీవ ఫలం చిన్నదిగా, అండాకార రూపంలో ఉన్న ఒలీవల చెట్టుఫలం. మధ్యధరా సముద్ర ప్రాంతాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది.
- ఒలీవ చెట్లు ఒకవిధమైన పెద్దవీ, నిత్యనూతన ఆకుపచ్చని ఆకులు గల చెట్టుపొద, వీటికి చిన్న తెల్లని పూలు ఉంటాయి. అధిక వేడిమి గల వాతావరణంలో బాగా పెరుగుతాయి, తక్కువ నీటితో బ్రతుకుతాయి.
- ఒలీవ చెట్టు ఫలం ఆకుపచ్చగా ఆరంభం అవుతుంది, పండినప్పుడు అది నలుపురంగులోనికి మారుతుంది. ఒలీవల ఫలం ఆహారంగా ఉపయోగపడతాయి, వాటినుండి నూనె తీయడానికి ఉపయోగపడతాయి.
- ఒలీవల నూనె వంట కోసం, దీపాలలోనూ, మత సంబంధ ఆచారాలకు వినియోగిస్తారు.
- బైబిలులో ఒలీవ చెట్లు, కొమ్మలు కొన్నిసార్లు అలంకారంగా ప్రజలను సూచిస్తున్నాయి.
(చూడండి : దీపం, సముద్రం, ఒలీవల పర్వతం)
బైబిలు రిఫరెన్సు:
- 1 దినవృత్తాంతములు 27:28-29
- ద్వితియోపదేశకాండం 06:10-12
- నిర్గమకాండం 23:10-11
- ఆదికాండం 08:10-12
- యాకోబు 03:11-12
- లూకా 16:5-7
- కీర్తనలు 052:8-9
పదం సమాచారం:
- Strong's: H2132, H3323, H8081, G65, G1636, G1637, G2565
కంగారు, కంగారుగా, కంగారుపడు
వాస్తవాలు:
కంగారు అంటే తనకు హాని జరగవచ్చని ఒక మనిషిలో కలిగే హెచ్చరిక ఆలోచన.
"కంగారు పడడం"అంటే ఎదో ఆపద, ముప్పు వాటిల్లనున్నదని అందోళన, భయంతో సతమతం కావడం.
- మోయాబీయులు యూదా రాజ్యంపై దాడి చేస్తారని విన్నప్పుడు యెహోషాపాతు రాజు కంగారు పడ్డాడు.
- అంత్య దినాల్లో వాటిల్లనున్న అరిష్టాల గురించి విన్నప్పుడు కంగారు పడవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు.
- "హెచ్చరిక ధ్వని చెయ్యడం" అంటే హెచ్చరించడం. ప్రాచీన కాలంలో, ఒక వ్యక్తి ఏదైనా శబ్దం చేయడం ద్వారా ఇతరులను హెచ్చరించే వాడు.
అనువాదం సలహాలు
- "ఎవరినైనా కంగారు పెట్టడం"అంటే "అందోళనకు గురి చెయ్యడం"లేక "కలవరపరచడం."
- "కంగారు పడడం"అనే మాటను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అందోళన చెందడం” లేక “భయపడడం” లేక “చాలా తీవ్రంగా ఆలోచించడం."
- “హెచ్చరిక ధ్వని చెయ్యడం” అనే మాటను ఇలా అనువదించవచ్చు "బహిరంగంగా హెచ్చరించు” లేక “ప్రమాదం ముంచుకు వస్తున్నదని ప్రకటించడం” లేక “ప్రమాదం గురించి తెలియజేయడానికి బాకా ఊదడం."
(చూడండి: యెహోషాపాతు, మోయాబు)
బైబిల్ రిఫరెన్సులు:
- దానియేలు 11:44-45
- యిర్మీయా 04:19-20
- సంఖ్యా 10:9
పదం సమాచారం:
కట్టడ, కట్టడలు, శాసనం చెయ్యడం
నిర్వచనం:
కట్టడ అనేది మనుషులందరూ వినేలా బాహాటంగా ప్రకటించిన చట్టం.
- దేవుని చట్టాలను కట్టడలు, అధికరణాలు లేక ఆజ్ఞలు అన్నారు.
- చట్టాల, ఆజ్ఞల లాగానే కట్టడలకు లోబడాలి.
- మనవ పాలకుని కట్టడకు ఒక ఉదాహరణ రోమా సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ జనసంఖ్య కోసం వారి సొంత ఊరు వెళ్ళాలి అని సీజర్ అగస్టస్ చేసినది.
- దేన్నైనా శాసించడం అంటే తప్పక లోబడవలసిన ఆజ్ఞ ఇవ్వడం. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "అజ్ఞాపించడం” లేక “ఆజ్ఞ” లేక “తప్పక చేయ వలసినది” లేక “బహిరంగంగా చట్టం చెయ్యడం."
- దేన్నైనా అది జరగాలని "శాసిస్తే" "తప్పక సంభవిస్తుంది” లేక “అది మారదని నిర్ణయం జరిగి పోయింది.” లేక “నిస్సందేహంగా సంభవించేదని చెప్పడం."
(చూడండి: ఆజ్ఞాపించు, ప్రకటించు, ధర్మం, బోధించు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 15:13-15
- 1 రాజులు 08:57-58
- అపో. కా. 17:5-7
- దానియేలు 02:12-13
- ఎస్తేరు 01:21-22
- లూకా 02:1-3
పదం సమాచారం:
- Strong's: H559, H633, H1697, H5715, H1504, H1510, H1881, H1882, H1696, H2706, H2708, H2710, H2711, H2782, H2852, H2940, H2941, H2942, H3791, H3982, H4055, H4406, H4941, H5407, H5713, H6599, H6680, H7010, H8421, G1378
కఠిన, మరింత కఠినం, కఠిన పరచు, కఠిన పరచిన, కాఠిన్యం
నిర్వచనం:
"కఠిన" అనే పదానికి సందర్భాన్ని బట్టి అనేక వివిధ అర్థాలున్నాయి. సాధారణంగా దేన్నైనా దుర్లభం, చాలించుకొనని, లేక లొంగని దాన్ని వర్ణించదానికి ఇది వాడతారు.
- "కఠిన హృదయం” లేక “కఠిన-మనస్సు" తలబిరుసుగా పశ్చాత్తాప పడకుండా ఉన్న మనుషులకు వాడతారు. దేవుణ్ణి ధిక్కరించే వారిని వర్ణించడానికి ఈ మాట వాడతారు.
- అలంకారికంగా "హృదయంకాఠిన్యం” “వారి హృదయాలను కఠినపరచుకొను" అనే మాటలు తలబిరుసు, అవిధేయతలను సూచిస్తాయి.
- ఎవరిదైనా హృదయం "కఠిన పరచడం" అంటే ఆవ్యక్తి తలబిరుసుగా, పశ్చాత్తాపం లేకుండా లోబడక ఉండడం.
- దీన్ని విశేషణంగా ఉపయోగించినప్పుడు "కఠినమైన పని” లేక “గట్టిగా ప్రయత్నించడం," అంటే ఏదైనా చెయ్యడానికి బలమైన, శ్రద్ధగల ప్రయత్నం చెయ్యడం.
అనువాదం సలహాలు
- "కఠిన" అనే పదాన్ని సందర్భాన్ని బట్టి ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "దుర్లభం” లేక “తలబిరుసు” లేక “సవాలుతో కూడిన."
- "కాఠిన్యం” లేక “హృదయ కాఠిన్యం” లేక “కఠిన హృదయం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తలబిరుసుతనం” లేక “తిరుగుబాటులో కొనసాగడం” లేక “తిరుగుబాటు మనస్తత్వం” లేక “తలబిరుసు అవిధేయత” లేక “తలబిరుసుగా పశ్చాత్తాపరహితంగా."
- "కఠిన పరచు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తలబిరుసుగా పశ్చాత్తాప రహితంగా” లేక “లోబడడానికి నిరాకరించు."
- " నీ హృదయం కఠిన పరచుకోవద్దు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పశ్చాత్తాప పడడానికి నిరాకరించ వద్దు.” లేక “తలబిరుసుగా ధిక్కరించే ధోరణిలో."
- అనువదించడంలో ఇతర పద్ధతులుo "కఠిన-శిమనస్సు” లేక “కఠిన-హృదయం గల" "తలబిరుసుగా అవిధేయుడు” లేక “ధిక్కరించడంలో కొనసాగు” లేక “పశ్చాత్తాప పడడానికి నిరాకరించు” లేక “అస్తమానం తిరుగుబాటు చేయు."
- "కఠినమైన పని” లేక “కఠినప్రయత్నం," "కఠిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఎడతెగని ప్రయత్నం” లేక “శ్రద్ధగా."
- "వ్యతిరేకంగా కఠిన ప్రయత్నం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "బలంగా నెట్టడం” లేక “బలమైనవిధంగా వ్యతిరేకంగా నెట్టు."
- " ప్రజలు కఠిన శ్రమతో పీడించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలను కఠినంగా వారు బాధలు పడేలా పని చేయించడం” లేక “దుర్లభమైన పని చేయించి ప్రజలు బాధలు పడేలా బలవంతం చెయ్యడం."
- వివిధ రకాల "కఠిన శ్రమ" ఒక స్త్రీ ప్రసవ సమయం.
(చూడండి: అవిధేయత చూపడం, దుష్టత్వం, హృదయం, ప్రసవవేదన, లోబడనొల్లని)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 కొరింతి 11:22-23
- ద్వితీ 15:7-8
- నిర్గమ 14:4-5
- హెబ్రీ 04:6-7
- యోహాను 12:39-40
- మత్తయి 19:7-9
పదం సమాచారం:
- Strong's: H280, H386, H553, H1692, H2388, H2389, H2420, H2864, H3021, H3332, H3513, H3515, H3966, H4165, H4522, H5450, H5539, H5564, H5646, H5647, H5797, H5810, H5980, H5999, H6089, H6277, H6381, H6635, H7185, H7186, H7188, H7280, H8068, H8307, H8631, G917, G1419, G1421, G1422, G1423, G1425, G2205, G2532, G2553, G2872, G2873, G3425, G3433, G4053, G4183, G4456, G4457, G4641, G4642, G4643, G4645, G4912, G4927
కనాను, కనానీయుడు, కనానీయులు
వాస్తవాలు:
కనాను హాము కుమారుడు. హాము నోవహు కుమారుల్లో ఒకడు. కనానీయులు కనాను సంతానం.
- ఈ పదం "కనాను” లేక “కనాను ప్రదేశం"అంటే యోర్దాను నదికి మధ్యదరా సముద్రానికి మధ్య గల ప్రాంతం కూడా. దీని దక్షిణ సరిహద్దు ఈజిప్టు, ఉత్తర సరిహద్దు సిరియా.
- ఈ దేశంలో కనానీయులు, అనేక ఇతర ప్రజలు నివసించారు.
- దేవుడు కనాను ప్రదేశం అబ్రాహాముకు తన సంతానం అయిన ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేశాడు.
(చూడండి: హాము, వాగ్ధాన భూమి)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 13:19-20
- నిర్గమ 03:7-8
- ఆది 09:18-19
- ఆది 10:19-20
- ఆది 13:5-7
- ఆది 47:1-2
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 04:05 అతడు (అబ్రాము) తన భార్య శారాను తన సేవకులు అందరినీ తనకున్న ప్రతిదాన్నీ తీసుకుని దేవుడు తనకు చూపిన కనాను దేశానికి వచ్చాడు.
- 04:06 అబ్రాము కనాను కు వచ్చినప్పుడు దేవుడు “నీ చుట్టూరా చూడు” అని చెప్పాడు. నీకు, నీ సంతానానికి నీవు చూస్తున్న దేశం వారసత్వముగా ఇస్తాను."
- 04:09 "కనాను దేశం నీ సంతానం వారికి ఇస్తాను."
- 05:03 "నీకు, నీ సంతానం వారికీ కనాను దేశం వారి ఆస్తిగా ఇచ్చి వారి దేవుడుగా శాశ్వతకాలం ఉంటాను."
- 07:08 ఇరవై సంవత్సరాలు తరువాత కనానులోని తన ఇంటికి, తన కుటుంబం, తన సేవకులు, తన మందలతో తిరిగి వెళ్ళమని చెప్పాడు.
పదం సమాచారం:
- Strong's: H3667, H3669, G2581, G5478
కన్య, కన్యకలు. కన్యత్వము
వాస్తవాలు :
కన్య అనగా ఎటువంటి లైంగిక సంబంధాలు లేని స్త్రీ అని అర్థము.
- ప్రవక్తయైన యెషయా, మెస్సియ కన్య గర్భములో జన్మించునని చెప్పెను.
- యేసుక్రీస్తును గర్భము ధరించినప్పుడు మరియ కన్యయై ఉండెను. కావున ఆయనకు మానవ తండ్రి లేడు.
- కొన్ని భాషల్లో కన్య అనేపదం మర్యాదపూర్వకముగా వాడబడింది.
(దీనిని చూడండి: క్రీస్తు, యెషయా, యేసు, యేసు తల్లి)
బైబిలు వచనాలు:
- ఆది. 24:1516
- లూకా 01:26-29
- లూకా 01:34-35
- మత్తయి 01:22-23
- మత్తయి 25:1-4
బైబిలు కథల నుండి కొన్ని ఉదాహరణలు:
- 21:09 ప్రవక్తయైన యెషయా మెస్సియ కన్య గర్భమునందు జన్మించునని ప్రవచించెను.
- 22:04 కన్యయైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడెను.
- 22:05 అప్పుడు మరియ, “ఇది ఏలాగు జరుగును, నేను ఇంకా కన్యను గదా ?” అనెను.
- 49:01 నీవు దేవుని కుమారునికి జన్మనిచ్చుదువని దూత కన్యయైన మరియతో అనెను. అయితే ఆమె ఇంకనూ కన్యయై యుండగానే కుమారుని కని యేసు అను పేరు పెట్టెను.
పదం సమాచారం:
- Strong's: H1330, H1331, H5959, G3932, G3933
కయీను
వాస్తవాలు:
కయీను, తన తమ్ముడు హేబెలు ఆదాము, హవ్వలకు పుట్టినట్టుగా బైబిల్లో ప్రస్తావించిన మొదటి కుమారులు.
- కయీను రైతు. ఆహార పంటలు పండించే వాడు. హేబెలు గొర్రె కాపరి.
- కయీను అతని సోదరుడు హేబెలుపై అసూయ పెట్టుకుని హత్య చేశాడు. ఎందుకంటే దేవుడు హేబెలు బలి అర్పణఅంగీకరించాడు. అయితే కయీను బలి అర్పణ తోసిపుచ్చాడు.
- అందుకు శిక్షగా, దేవుడు అతన్ని నుండి ఏదేను నుండి పంపించి వేశాడు. నేల అతని కోసం పంటలను ఇవ్వదని చెప్పాడు.
- దేవుడు కయీను నుదుటిపై ఒక గుర్తు వేశాడు. అతడు తిరుగులాడిన చోట్ల ఇతరులు అతన్ని చంపకుండేలా దేవుడు ఈ పని చేశాడు.
(చూడండి: ఆదాము, బలియాగము)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 03:11-12
- ఆది 04:1-2
- ఆది 04:8-9
- ఆది 04:13-15
- హెబ్రీ 11:4
- యూదా 01:9-11
పదం సమాచారం:
కరుణ, కరుణ గల
నిర్వచనం:
ఈ పదం "కరుణ" అనేది మనుషుల పట్ల సానుభూతిని సూచిస్తున్నది, ముఖ్యంగా బాధల్లో ఉన్న వారి పట్ల. "కరుణ గల" వ్యక్తి ఇతరుల విషయం జాలి పడి సహాయం చేస్తాడు.
- ఈ పదం "కరుణ" సాధారణంగా అవసరంలో ఉన్న మనుషుల గురించి శ్రద్ధ వహించి సాయపడడాన్ని తెలియ జేస్తుంది.
- బైబిల్ లో దేవుడు కరుణ గలవాడని, అయన ప్రేమ కరుణ పూర్ణుడు అని చెబుతున్నది.
- పౌలు కొలస్సి సంఘానికి రాసిన లేఖలో, వారు "కరుణను వస్త్రంగా ధరించుకోవాలని" చెప్పాడు. వారు అవసరంలో ఉన్న మనుషులకు చురుకుగా సహాయం చేస్తూ ఉండాలని చెప్పాడు.
అనువాదం సలహాలు:
- అక్షరార్థం "కరుణ" అంటే "కడుపులో కరుణ" కలిగి ఉండడం. ఈ మాటకు అంటే "కనికరం” లేక “దయ" అని కూడా అర్థం. ఇతర భాషల్లో ఈ అర్థం ఇచ్చే వారి స్వంత అనే మాటలు ఉండవచ్చు.
- "కరుణ" అనే మాట అనువదించడంలో, "లోతైన సానుభూతి” లేక “సహాయం చేసే కరుణ" అనే అర్థాలు రావాలి.
- ఈ పదాన్ని "కరుణ గల" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "శ్రద్ధ గలిగి సహాయకరంగా ఉండడం” లేక “లోతైన ప్రేమ, జాలి" కనుపరచడం
బైబిల్ రిఫరెన్సులు:
- దానియేలు 01:8-10
- హోషేయ 13:14
- యాకోబు 05:9-11
- యోనా 04:1-3
- మార్కు 01:40-42
- రోమా 09:14-16
పదం సమాచారం:
- Strong's: H2550, H7349, H7355, H7356, G1653, G3356, G3627, G4697, G4834, G4835
కరుణ, కరుణగల
నిర్వచనం:
“కరుణ,” “కరుణగల” పదాలు అవసరతలో ఉన్న ఇతరులకు సహాయం చెయ్యడం, ప్రత్యేకించి వారు తక్కువస్థితిలో గానీ లేదా అణచివేయబడిన స్థితిలో గానీ ఉన్నప్పుడు సహాయం చెయ్యడాన్ని సూచిస్తున్నాయి.
- ”కరుణ” అనే పదంలో మనుష్యులు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకుండా ఉండడం అనే అర్థం కూడా ఉంది.
- రాజులాంటి శక్తివంతమైన వ్యక్తి మనుష్యులకు హాని చెయ్యడానికి బదులు వారిని దయతో చూచినప్పుడు అతడు “కరుణగల” వ్యక్తి అని వర్ణించబడతాడు.
- కరుణకలిగి యుండడం అంటే మనకు విరోధంగా ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అనికూడా అర్థం ఉంది.
- గొప్ప అవసరతలో ఉన్న ప్రజలకు మనం సహాయం చేసినప్పుడు మనం కరుణ చూపిస్తాము.
- దేవుడు మన విషయంలో కరుణ కలిగి యున్నాడు, మనం ఇతరుల పట్ల కరుణ కలిగి యుండాలని ఆయన కోరుతున్నాడు.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, “కరుణ” అనే పదం “దయ” లేదా “కనికరం” లేదా “జాలి” అని అనువదించబడవచ్చు.
- ”కరుణగల” అనే పదం “జాలి చూపించడం” లేదా “దయగా ఉండడం” లేదా “క్షమించడం” అని అనువదించబడవచ్చు.
- ”కరుణ చూపించడం” లేక “కరుణ కలిగి యుండడం” అనే పదాలు “దయను చూపించు” లేదా “వారిపట్ల కనికరం కలిగి యుండు” అని అనువదించబడవచ్చు.
(చూడండి: కరుణ, క్షమించు)
బైబిలు రెఫరెన్సులు:
- 1 పేతురు 01:3-5
- 1 తిమోతి 01:13
- దానియేలు 09:17
- నిర్గమ. 34:06
- ఆది. 19:16
- హెబ్రీ 10:28-29
- యాకోబు 02:13
- లూకా 06:35-36
- మత్తయి 09:27
- ఫిలిప్పీ 02:25-27
- కీర్తన 041:4-6
- రోమా 12;01
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 19:16 వారు (ప్రవక్తలు) అందరూ విగ్రహాలను పూజించడం నిలిపివేయాలని ప్రజలకు చెప్పారు, ఇతరులకు న్యాయాన్నీ కరుణనూ చూపించడం ఆరంభించాలని చెప్పారు.
- 19:17 అతడు (యిర్మియా) బావి అడుగుభాగంలోని మట్టిలోనికి కూరుకుపోయినప్పుడు రాజు అతని పట్ల కరుణ చూపించి యిర్మియా చనిపోకముందే అతనిని బావిలోనుండి బయటికి తీయాలని సేవకులకు ఆజ్ఞాపించాడు.
- 20:12 పర్షియా రాజు బలమైనవాడు, అయితే తాను జయించిన ప్రజలపట్ల కరుణ చూపించాడు.
- 27:11 అప్పుడు ప్రభువు ధర్మశాస్త్ర బోధకుడిని “నీవు ఏమి తలస్తున్నావు?” అని అడిగాడు. దోచుకోబడి, కొట్టబడిన ఈ వ్యక్తికి వారిలో ఎవరు పొరుగువాడు? “అతని పట్ల కరుణ చూపినవాడే” అని జవాబిచ్చాడు.
- 32:11 అయితే యేసు అతనితో, “వద్దు, నీవు నీ ఇంటికి వెళ్లి నీ స్నేహితులతోనూ, నీ కుటుంబంతోనూ దేవుడు నీ పట్ల చేసిన సమస్తాన్ని చెప్పు, ఆయన నీమీద ఏవిధమైన కరుణ చూపించాడో చెప్పు” అని చెప్పాడు.
- 34:09”అయితే సుంకరి మతనాయకునికి దూరంగా నిలిచి, పరలోకం వైపు తలెత్తడానికికూడా ధైర్యం లేక, రొమ్ముమీద కొట్టుకొనుచు, “దేవా దయచేసి నా పట్ల కరుణ చూపు, ఎందుకంటే నేను పాపిని” అని ప్రార్థించాడు.
పదం సమాచారం:
- Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698
కరువు, కరువుs
నిర్వచనం:
"కరువు" అంటే దేశం, లేక ప్రాంతం అంతటా తీవ్రమైన ఆహారం కొరత. సాధారణంగా వర్షం లేక పోవడం వలన.
- వర్షాభావం, పైరుకు సోకే వ్యాధులు, లేక కీటకాలు వంటి సహజమైన కారణాల మూలంగా ఆహారం కొరత ఏర్పడడం.
- ఆహారం కొరత శత్రువులు పంటలు నాశనం చెయ్యడం వల్ల కూడా సంభవించ వచ్చు.
- బైబిల్లో, దేవుడు తరచుగా కరువును ఉపయోగించి జాతులు తనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారిని శిక్షిస్తాడు.
- ఆమోసు 8:11లో "కరువు" ను అలంకారికంగా ఉపయోగించారు. దేవుడు తన ప్రజలతో మాట్లాడక పోవడం ద్వారా వారిని శిక్షించడం. దీన్ని ఇలా అనువదించ వచ్చు. "కరువు" మీ భాషలో "ఆహారం లేమి” లేక “తీవ్రమైన కొరత" అనే అర్థం ఇచ్చే మాట వాడాలి.
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 21:11-12
- అపో. కా. 07:11-13
- ఆది 12:10-13
- ఆది 45:4-6
- యిర్మీయా 11:21-23
- లూకా 04:25-27
- మత్తయి 24:6-8
పదం సమాచారం:
- Strong's: H3720, H7458, H7459, G3042
కర్ర, కర్రలు
నిర్వచనము:
కర్ర అనగా పొడువాటి చెక్కతో చేసిన కట్టె లేక లోపపు కడ్డి, దీనిని అనేకమార్లు నడవడానికి ఉపయోగించే కట్టెగా ఉపయోగించబడింది.
- యాకోబు వృద్ధుడైయున్నప్పుడు అతను నడవడానికి సహాయకరముగా కర్రను ఉపయోగించాడు.
- దేవుడు తన శక్తిని ఫరోకు చూపించుటకు మోషే కర్రను పాముగా చేసెను.
- కాపరులు కూడా తమ గొర్రెలను కాయుటకు లేక గొర్రెలు తప్పిపోవునప్పుడు, క్రింద పడినప్పుడు వాటిని రక్షించుటకు దుడ్డు కర్రను ఉపయోగించారు.
- ఇది కాపరి దుడ్డు కర్రకు అనగా వేరుగా ఉంటుంది, కాపరి కర్రకు దాని చివరి భాగములో ఒక కొక్కి తగిలించియుందురు, దీనిని గొర్రెలపై దాడిపై చేయు ప్రాణులను చంపుటకు ఉపయోగించియుందురు.
(ఈ పదములను కూడా చూడండి: ఫరో, శక్తి, ఆడగొర్రె, కాపరి)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- నిర్గమ.04:1-3
- నిర్గమ.07:8-10
- లూకా.09:3-4
- మార్కు.06:7-9
- మత్తయి.10:8-10
- మత్తయి.27:27-29
పదం సమాచారం:
- Strong's: H4132, H4294, H4731, H4938, H6086, H6418, H7626, G2563, G3586, G4464
కల
నిర్వచనం:
కల అంటే మనుషులు తమ నిద్రలో అనుభవించే ఆలోచనలు.
- కలలు తరచుగా కలలు కనే వారికి అవి నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తాయి. అయితే అవి వాస్తవాలు కాదు.
- కొన్ని సార్లు దేవుడు తన ప్రజలు కల నుండి దేన్నైనా నేర్చుకోవాలని కలలు ఇస్తాడు. అయన నేరుగా మనుషులతో వారి కలల ద్వారా మాట్లాడాడు.
- బైబిల్లో, దేవుడు ప్రత్యేకమైన కలల ద్వారా కొందరికి సందేశం ఇవ్వాలని, అంటే భవిషత్తులో సంభవించే వాటిని గురించి.
- కల వేరు, దర్శనం వేరు. కలలు ఒక వ్యక్తి నిద్రలో వస్తాయి. అయితే దర్శనాలు సాధారణంగా ఒక వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడే వస్తాయి.
(చూడండి: దర్శనము)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 02:16-17
- దానియేలు 01:17-18
- దానియేలు 02:1-2
- ఆది 37:5-6
- ఆది 40:4-5
- మత్తయి 02:13-15
- మత్తయి 02:19-21
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 08:02 యోసేపు సోదరులు అతణ్ణి ద్వేషించారు. ఎందుకంటే వారి తండ్రి అతణ్ణి ఎక్కువగా ప్రేమించాడు.అంతేగాక యోసేపుకు ఒక వచ్చింది. అతడు వారి అధిపతి అవుతాడని దాని అర్థం.
- 08:06 ఒక రాత్రి, ఫరో, అంటే ఈజిప్టు రాజుకు రెండు కలలు వచ్చాయి, అవి అతణ్ణి కలవర పరిచాయి. తన సలహాదారులెవరూ ఆ కలల అర్థం చెప్పలేక పోయారు.
- 08:07 దేవుడు యోసేపుకు ఆ కలల అర్థం చెప్పే సామర్థ్యం ఇచ్చాడు._, కాబట్టి ఫరో యోసేపును చెరసాల నుండి రప్పించాడు. యోసేపు కలల భావం వివరించాడు. "దేవుడు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట కోత, ఏడు సంవత్సరాలు కరువు ఇస్తాడు."
- 16:11 కాబట్టి ఆ రాత్రి, గిద్యోను సైనిక శిబిరానికి పోయి మిద్యాను సైనికుడు తన స్నేహితునితో చెబుతున్న కల విన్నాడు. ఆ మనిషి స్నేహితుడు ఇలా చెప్పాడు, "కల ఏమిటంటే గిద్యోను సైన్యం మిద్యాను సైన్యాన్ని ఓడిస్తుంది."
- 23:01 అతడు (యోసేపు) ఆమె (మరియ)ను అవమానించడం ఇష్టం లేక నెమ్మదిగా ఆమెకు విడాకులు ఇవ్వాలని భావించాడు.
పదం సమాచారం:
- Strong's: H1957, H2472, H2492, H2493, G1797, G1798, G3677
కష్టం, కష్టపడడం, కష్టపడ్డారు, కూలివాడు, కూలివారు
నిర్వచనం:
“కష్టం” అనే పదం కష్టమైన పని దేనినైనా చెయ్యడాన్ని సూచిస్తింది.
- సాధారణంగా కష్టం అంటే శక్తిని వినియోగించే కార్యం. కార్యం అనేది తరచుగా కష్టమైనదనే అర్థాన్ని ఇస్తుంది.
- కూలివాడు ఎటువంటి కార్యాన్నైనా చేస్తాడు.
- ఆంగ్ల బాషలో ఈ పదాన్ని కానుపు నొప్పులలో భాగంగా ఉపయోగిస్తారు. ఇతరబాషలలో ఈ పదానికి పూర్తిగా భిన్నమైన పదాలు ఉన్నాయి.
- ”కష్టం” అనే పదాన్ని “పని” లేక “కఠినమైన పని” లేక “కష్టమైన పని” లేక “కష్టించి పని చెయ్యడం” అని అనువదించవచ్చు.
(చూడండి: కఠిన, ప్రసవవేదన)
బైబిలు రెఫరెన్సులు:
- 1 థెస్సలోనిక 02:7-9
- 1 థెస్సలోనిక 03:4-5
- గలతీ 04:10-11
- యాకోబు 05:4-6
- యోహాను 04:37-38
- లూకా 10:1-2
- మత్తయి 10:8-10
పదం సమాచారం:
- Strong's: H213, H3018, H3021, H3022, H3023, H3205, H5447, H4522, H4639, H5445, H5647, H5656, H5998, H5999, H6001, H6089, H6468, H6635, G75, G2038, G2040, G2041, G2872, G2873, G4704, G4866, G4904, G5389
కాడి, నాగళ్ళు, కాడి మోపబడెను
నిర్వచనం:
కాడి అనేది చెక్కతో లేక లోహముతో చేయబడిన పరికరమైయున్నది. దీనిని రెండు లేక అనేక పశువులకు కట్టి బండిని లాగుటకైనను లేక నాగలిని లాగుటకైనను ఉపయోగించుదురు. ఈ పదమునకు పలు అలంకారిక అర్థము కలవు.
- ఒకే ఉద్దేశ్యం కొరకై అనేకులు పనిచెయవలసినప్పుడు అందరిని కలపడానికి “కాడి” అనే పదమును అలంకారికంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు యేసును సేవించడం.
- పౌలు వాలే క్రీస్తును సేవిస్తున్నవారిని సూచించుటకు ఆయన “జతపనివారు” అని సంబోధించారు. దీనిని “తోటి దాసుడు” లేక “సహోద్యోగి” లేక “తోటి ఉద్యోగి” అని తర్జుమా చేయవచ్చును.
- బానిసత్వములో ఉన్నప్పుడు లేక హింసిచబడుచున్నప్పుడు ఒకడు మోసే భారమును సూచించుటకు “కాడి” అనే పదమును అలంకారికంగా అనేక మార్లు ఉపయోగించబడియున్నది.
- వ్యవసాయం చేయుచున్నప్పుడు కాడి అని స్థానికంగా ఉపయోగించే విధముగానే అనేక సందర్భాలలో, ఈ పదమునకు అక్షరార్థముగా తర్జుమా చేయవలెను.
- ఈ పదమును అలంకారికంగా ఉపయోగించబడినప్పుడు దానిని తర్జుమా చేయడానికి “అనచివేయునంత భారము” లేక “అధిక భారువు” లేక “బంధకము” అని సందర్భానుసారంగా తర్జుమా చేయగలరు.
(ఈ పదములను కూడా చూడండి: కట్టివేయు, భారం, హింసించు, హింసించు, సేవకుడు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.15:10-11
- గలతీ.05:1-2
- ఆది.27:39-40
- యెషయా.09:4-5
- యిర్మియా.27:1-4
- మత్తయి.11:28-30
- ఫిలిప్పి.04:1-3
పదం సమాచారం:
- Strong's: H3627, H4132, H4133, H5674, H5923, H6776, G2086, G2201, G2218, G4805
కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబాకాదేషు
వాస్తవాలు:
కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబా కాదేషు అనే పేర్లన్నీ ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పట్టణాన్ని ూచిస్తున్నాయి, ఇది ఎదోము ప్రాంతానికి దగ్గరగా ఇశ్రాయేలు దక్షిణ భాగంలో ఉంది.
- కాదేషు పట్టణం ఒక నీటి ఊటగా ఉండేది. సీను ఎడారి మధ్యలో నీరు, సారవంతమైన నేల ఉన్న స్థలం.
- కనాను భూభాగాన్ని వేగు చూడడానికి మోషే కాదేషు బర్నేయ నుండి వేగులను పంపించాడు.
- ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేస్తున్న సందర్భంలో ఇది ప్రసిద్ధమైన మజిలి.
- కాదేషు బర్నేయలో మిర్యామును సమాధి చేసారు.
- మెరిబా కాదేషు వద్ద ఇశ్రాయేలీయులకు నీరు పొందడానికి దేవుడు చెప్పిన విధంగా నీరున్న బండతో మాట్లాడడానికి బదులు ఆ బండను కొట్టడం ద్వారా మోషే దేవునికి అవిధేయుడయ్యాడు.
- ”కాదేషు” అనే పేరు హెబ్రీ పదం నుండి తీసుకోబడింది, అంటే “పవిత్రం” లేక “ప్రతిష్టితం” అని అర్థం.
(చూడండి: ఎడారి, ఎదోము, పరిశుద్ధమైన)
బైబిలు రిఫరెన్సులు:
- యెహెజ్కేలు 48:27-29
- ఆదికాండం 14:7-9
- ఆదికాండం 16:13-14
- ఆదికాండం 16:1-3
- యెహోషువా 10:40-41
- సంఖ్యాకాండం 20:1
పదం సమాచారం:
- Strong's: H4809, H6946, H6947
కానుక, కానుకలు
నిర్వచనం:
"కానుక" అంటే ఎవరికైనా అర్పించేది. కానుక ప్రతిఫలం ఆశించి ఇచ్చేది కాదు.
- డబ్బు, ఆహారం, బట్టలు, లేక ఇతర వస్తువులు పేద వారికి ఇచ్చినా వాటిని "కానుకలు" అనవచ్చు.
- బైబిల్లో, దేవునికి ఇచ్చే అర్పణ, లేక బలి అర్పణ కానుక.
- రక్షణ అనేది యేసులో విశ్వాసం మూలంగా దేవుడు ఇచ్చే కానుక.
- కొత్త నిబంధనలో, "వరాలు" అనే మాటను దేవుడు ఇతరులకు పరిచర్య నిమిత్తం అందరు క్రైస్తవులకు ఇచ్చే ప్రత్యేక ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు అనే అర్థంలో కూడా వాడతారు.
అనువాదం సలహాలు:
- సామాన్య పదం "కానుక" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "ఇచ్చినది ఏదైనా."
- దేవుడు ఎవరికైనా కానుక, లేక ప్రత్యేక సామర్థ్యం ఇస్తే, అలాటి "ఆత్మ వరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆత్మ సంబంధమైన సామర్థ్యం” లేక “పరిశుద్ధాత్మ నుండి ప్రత్యేక సామర్థ్యం” లేక “దేవుడు ఇచ్చే ప్రత్యేక ఆత్మ సంబంధమైన నైపుణ్యం."
(చూడండి: ఆత్మ, పరిశుద్ధాత్మ)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 12:1-3
- 2 సమూయేలు 11:6-8
- అపో. కా. 08:20-23
- అపో. కా. 10:3-6
- అపో. కా. 11:17-18
- అపో. కా. 24:17-19
- యాకోబు 01:17-18
- యోహాను 04:9-10
- మత్తయి 05:23-24
- మత్తయి 08:4
పదం సమాచారం:
- Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486
కాపరి, కాపరులు, కాపు కాయబడెను, కాపు కాయుట
నిర్వచనము:
కాపరి అనగా గొర్రెలను భాగుగా కాచి కాపాడే వ్యక్తి. “కాపరి” కర్తవ్యము ఏమనగా గొర్రెలను సంరక్షించుట మరియు వాటికి ఆహారమును నీళ్ళను అందించుటయైయున్నది. కాపరులు గొర్రెలను కాయుదురు, వాటిని పచ్చికగల చోట్లకు మరియు నీళ్ళు అధికముగా ఉన్నచెంతకు నడిపించుదురు. కాపరులు కూడా గొర్రెలు నాశనము కాకుండా కాపాడుతారు మరియు వాటిని అడవి మృగాలనుండి సంరక్షిస్తారు.
- పరిశుద్ధ గ్రంథములో ఈ పదమును ప్రజల ఆత్మీయ అవసరతలను చూచుకొనుటను సూచించుటకు అనేకమార్లు ఉపయోగించబడింది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు వారికి చెప్పబడిన విషయాలన్నిటిని మరియు వారు ఎలా జీవించాలోనన్న విధానమును వారికి నిర్దేశించుటను గూర్చి ఇందులో ఇమిడియుంటాయి.
- పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు “కాపరి” అని పిలువబడియున్నాడు, ఎందుకంటే ఆయన వారి ప్రతి అవసరతలను తీర్చువాడైయుండెను మరియు వారిని రక్షించువాడైయుండెను. ఆయన కూడా వారిని నడిపించాడు మరియు వారికి మార్గ నిర్దేశనమును చేశాడు.
- మోషే ఇశ్రాయేలీయులకు కాపరియైయుండెను, ఆయన వారిని యెహోవాను ఆరాధన చేయుటలో ఆత్మీయకముగా నడిపించియుండెను మరియు భౌతికముగా వారిని కానాను భూమికి నడిపించియుండెను.
- క్రొత్త నిబంధనలో యేసు తనను “మంచి కాపరి” అని పిలుచుకొనియున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా సంఘానికి “గొప్ప కాపరిగా” తనను తానూ సూచించుకొనియున్నాడు.
- క్రొత్త నిబంధనలో అనేకమార్లు “కాపరి” అనే పదము విశ్వాసులకు ఆత్మీయ నాయకుడుగానున్న వ్యక్తిని సూచించుటకు ఉపయోగించబడియుండెను. తర్జుమా చేయబడిన “పాస్టర్” అనే పదము మరియు తర్జుమా చేయబడిన “కాపరి” అనే పదము ఒకటైయున్నవి. పెద్దలు మరియు విచారణకర్తలు కూడా కాపరులుగా పిలువబడియున్నారు.
తర్జుమా సలహాలు:
- దీనిని అక్షరార్థముగా ఉపయోగించినట్లయితే, “కాపరి” కర్తవ్యమును “గొర్రెలను చూచుకోవడం” లేక “గొర్రెలను కాపాడుకొనుట” అని కూడా తర్జుమా చేయుదురు.
- “కాపరి” అనే వ్యక్తిని “గొర్రెలను కాపు కాయు వ్యక్తి” లేక “గొర్రెల వ్యాపారి” లేక “గొర్రెల సంరక్షకుడు” అని కూడా తర్జుమా చేయుదురు.
- రూపకలంకారముగా ఉపయోగించినప్పుడు, ఈ పదమును తర్జుమా చేయు విభిన్నమైన విధానములలో “ఆత్మీయ కాపరి” లేక “ఆత్మీయ నాయకుడు” లేక “కాపరివలె ఉన్న వ్యక్తి” లేక “కాపరి గొర్రెలను కాపాడినట్లుగా ప్రజలను సంరక్షించు వ్యక్తి” లేక “కాపరి గొర్రెలను నడిపించునట్లుగా తన ప్రజలను నడిపించు వ్యక్తి” లేక “దేవుని గొర్రెలను కాయువాడు” అనే మాటలను ఉపయోగించుదురు.
- కొన్ని సందర్భాలలో “కాపరి” అనే పదమును “నాయకుడు” లేక “మార్గదర్శకుడు” లేక “సంరక్షించువాడు” అని కూడా తర్జుమా చేయుదురు.
- “కాపరి” అనే పదానికి ఆత్మీయ మాటగా “సంరక్షించుట” లేక “ఆత్మీయముగా పోషించుట” లేక “నిర్దేశించుట మరియు బోధించుట” లేక “నడిపించుట మరియు సంరక్షించుట (కాపరి గొర్రెలను చూచుకొను విధముగా) అని కూడా తర్జుమా చేయుదురు.
- అలంకారికముగా ఉపయోగించే మాటలలో, ఈ పదమును తర్జుమా చేయుటలో “కాపరి” అనే పదమునకు అక్షరార్థరమైన పదము చేర్చడము లేక ఉపయోగించడం ఉత్తమము.
(ఈ పదములను కూడా చూడండి: విశ్వసించు, కనాను, సంఘం, మోషే, సంఘకాపరి, ఆడగొర్రె, ఆత్మ)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.49:24
- లూకా.02:8-9
- మార్కు.06:33-34
- మార్కు.14:26-27
- మత్తయి.02:4-6
- మత్తయి.09:35-36
- మత్తయి.25:31-33
- మత్తయి.26:30-32
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 09:11 ఐగుప్తు అతి దూరములోనున్న అడవిలో మోషే కాపరి అయ్యాడు.
- 17:02 దావీదు బెత్లెహేము పట్టణమునుండి వచ్చిన కాపరియైయుండెను. అనేక సమయాలలో తన తండ్రి గొర్రెలను కాయుచున్నప్పుడు, గొర్రెల మీదకి దాడిచేయవచ్చిన సింహమును మరియు ఎలుగుబంటిని హత మార్చెను.
- 23:06 ఆ రాత్రి పొలములో గొర్రెలను కాయుచున్న కాపరులు ఉండిరి.
- 23:08 కాపరులు వెంటనే యేసు ఉన్నటువంటి స్థలమునకు వచ్చిరి, దూత వారితో చెప్పినట్లుగానే, వారు ఆయన పరుండబెట్టియుండుటను చూచిరి.
- 30:03 కాపరిలేని గొర్రెలవలె ఈ ప్రజలున్నారని యేసు చెప్పెను.
పదం సమాచారం:
- Strong's: H6629, H7462, H7469, H7473, G750, G4165, G4166
కాలం, అకాలిక, తేదీ
వాస్తవాలు:
బైబిలులో "కాలం లేదా సమయం" పదం తరచుగా నిర్దిష్టమైన సంఘటనలు జరిగినప్పుడు ఒక నిర్దిష్ట కాలం లేదా సమయ పరిమితులను రూపకంగా సూచించడానికి బైబిల్లో "సమయం" అనే మాటను తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు. "యుగం" లేదా "శకం" లేదా "కాలం" పదాలకూ ఇదే అర్థం ఉంటుంది.
- దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము రెండూ భూమి మీదికి రాబోతున్న గొప్పకష్టం, లేదా శ్రమల "కాలాన్ని" గురించి మాట్లాడుతున్నాయి.
- "కాలం, కాలములు, అర్థ కాలము" పదబంధంలో కాలం అంటే "సంవత్సరం" అని అర్థం. ఈ ప్రస్తుత యుగం అంతంలో మహా శ్రమ కాల సమయంలో మూడున్నర సంవత్సరాల సమయాన్ని ఈ పదం సూచిస్తుంది.
- "సమయం" అంటే "మూడవ సమయం" లాంటి పదబంధంలో సందర్భాన్ని" సూచిస్తుంది. "అనేక సమయాలు" పదం "అనేక సందర్భాలను" సూచిస్తుంది.
- "సకాలంలో ఉండడం" అంటే రావలసిన సమయంలో రావాలి, ఆలస్యం కాకూడదు అని అర్థం.
- సందర్భాన్ని బట్టి "సమయం" పదం "కాలం" లేదా "కాల వ్యవధి" లేదా "క్షణం" లేదా "సంఘటన" లేదా "సంభవం" అని అనువదించబడవచ్చు.
- "సమయములు, కాలములు" పదం ఒకే తలంపును రెండు సార్లు చెప్పడానికి అలంకారిక వ్యక్తీకరణ. ఈ వాక్యం "కొన్ని నిర్దిష్ట సంఘటనలు కొన్ని నిర్దిష్ట కాల వ్యవధిలో జరుగుతున్నాయి" అని అనువదించబడవచ్చు.
(చూడండి: వయసు, హింసలు)
బైబిలు రిఫరెన్సులు:
- అపొ.కా. 01:07
- దానియేలు 12:1-2
- మార్కు 11:11
- మత్తయి 08:29
- కీర్తనలు 068:28-29
- ప్రకటన 14:15
పదం సమాచారం:
- Strong's: H116, H227, H268, H310, H570, H865, H1697, H1755, H2165, H2166, H2233, H2465, H3027, H3117, H3118, H3119, H3259, H3427, H3706, H3967, H4150, H4279, H4489, H4557, H5331, H5703, H5732, H5750, H5769, H6049, H6235, H6256, H6258, H6440, H6471, H6635, H6924, H7105, H7138, H7223, H7272, H7281, H7637, H7651, H7655, H7659, H7674, H7992, H8027, H8032, H8138, H8145, H8462, H8543, G744, G530, G1074, G1208, G1441, G1597, G1626, G1909, G2034, G2119, G2121, G2235, G2250, G2540, G3379, G3461, G3568, G3763, G3764, G3819, G3956, G3999, G4178, G4181, G4183, G4218, G4277, G4287, G4340, G4455, G5119, G5151, G5305, G5550, G5551, G5610
కుటుంబం, కుటుంబాలు
నిర్వచనం:
"కుటుంబం" అంటే రక్తసంబంధం ఉన్న వారు, సాధారణంగా తండ్రి, తల్లి, వారి పిల్లలు. ఇందులో తాతలు, మనవలు మేనమామలు, పిన తల్లులు మొదలైన ఇతర బంధువులు కూడా ఉంటారు.
- హీబ్రూ కుటుంబం ఒక మత సమాజం. ఆరాధన, ఉపదేశం ద్వారా మత సంప్రదాయాలను నేర్పించే వ్యవస్థ.
- సాధారణంగా తండ్రి కి కుటుంబంపై అధికారం ఉంటుంది.
- కుటుంబం లో సేవకులు, ఉంపుడుగత్తెలు, విదేశీయులు సైతం ఉంటారు.
- కొన్ని భాషలలో మరింత స్థూలమైన "తెగ” లేక “ఇంటి వారు" వంటి పదాలు ఉండవచ్చు. కేవలం తల్లిదండ్రులు, పిల్లలు కాకుండా ఎక్కువ మంది ఉండే సందర్భాలను ఇది సూచిస్తుంది .
- "కుటుంబం" అనే దాన్ని ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉన్న మనుషులకు కూడా ఉపయోగిస్తారు. అలాటి వారు దేవుని కుటుంబంలో భాగం. ఎందుకంటే వారు యేసును విశ్వసించారు.
(చూడండి: తెగ, పూర్వీకుడు, ఇల్లు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 08:1-2
- 1 సమూయేలు 18:17-18
- నిర్గమ 01:20-22
- యెహోషువా 02:12-13
- లూకా 02:4-5
పదం సమాచారం:
- Strong's: H1, H251, H272, H504, H1004, H1121, H2233, H2859, H2945, H3187, H4138, H4940, H5387, H5712, G1085, G3614, G3624, G3965
కుమారుడు
నిర్వచనం:
స్త్రీ పురుషులకు పుట్టిన మగ సంతానమును అతని జీవితకాలమంతా వారి “కుమారుడు” అని పిలువబడతాడు. ఇతడు ఆ పురుషుని కుమారుడనీ, ఆ స్త్రీ కుమారుడని కూడా పిలువబడతాడు. “దత్తపుత్రుడు” అనగా కుమారుని స్థానములో ఉండుటకు చట్టబద్ధంగా ఉంచబడిన మగబిడ్డ.
- బైబిలులో "యొక్క కుమారుడు" పదం ఒకని ముందు తరం నుండి ఆ వ్యక్తి తండ్రి, తల్లి లేదా పితరులను గురించించడానికి ఉపయోగిస్తారు. ఈ పదం వంశావళులలోనూ, ఇతర చోట్లా ఉపయోగించబడుతుంది.
- తండ్రి పేరును ఇవ్వడానికి "యొక్క కుమారుడు" పదం ఉపయోగించడం ఒకే పేరు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, 1 రాజులు గ్రంథం 4 అధ్యాయంలో "సాదోకు కుమారుడైన అజర్యా," నాతాను కుమారుడైన అజర్యా," 2 రాజులు గ్రంథం 15 అధ్యాయంలో అమజ్యా కుమారుడైన అజర్యా" లలో ముగ్గురు భిన్నమైన వ్యక్తులు ఉన్నారు.
అనువాదం సూచనలు:
- ఈ పదం ఉపయోగించబడిన అనేక సంభవాలలో భాషలో కుమారుడిని సూచించడం కోసం ఉపయోగించబడిన అక్షరార్థమైన పదం చేత అనువదించడం ఉత్తమం.
- "దేవుని కుమారుడు" పదం అనువదించేటప్పుడు, "కుమారుడు" కోసం లక్ష్యభాషలోని సాధారణ పదం ఉపయోగించబడింది.
- కొన్నిసార్లు "కుమారులు" పదం మగపిల్లలూ, ఆడపిల్లలూ సూచించబడేలా "పిల్లలు" పదం చేత అనువదించబడవచ్చు. ఉదాహరణకు, "దేవుని కుమారులు" పదం "దేవుని పిల్లలు" అని అనువదించబడవచ్చు, దీనిలో ఆడపిల్లలూ, స్త్రీలూ కలిసి ఉన్నారు.
(చూడండి: అజర్యా, వారసుడు, పూర్వీకుడు, మొదట పుట్టిన, దేవుని కుమారుడు, దేవుని కుమారులు)
బైబిలు రిఫరెన్సులు:
- 1 దిన.18:15
- 1 రాజులు 13:02
- 1 థెస్స 05:05
- గలతీ 04:07
- హోషేయా 11:01
- యెషయా 09:06
- మత్తయి 03:17
- మత్తయి 05:09
- మత్తయి 08:12
- నెహెమ్యా 10:28
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 04:08 దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అతనికి ఒక కుమారుని మరల వాగ్దానం చేశాడు, ఆకాశాములో నక్షత్రములవలె లెక్కలేనంతమంది సంతానమును అనుగ్రహిస్తానని వాగ్ధానము చేశాడు.
- 04:09 “నీ స్వంత శరీరమునుండి కుమారుని నీకు ఇచ్చెదనని” దేవుడు చెప్పాడు.
- 05:05 ఒక సంవత్సరమైన తరువాత, అబ్రాహాముకు 100 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, శారాకు 90 సంవత్సరములు ఉన్నప్పుడు, శారా అబ్రాహాముకు కుమారుని కన్నది.
- 05:08 వారు బలి అర్పించు స్థలముకు వచ్చినప్పుడు, అబ్రాహాముకు తన కుమారుడైన ఇస్సాకును కట్టి, బలిపీఠము మీద ఉంచాడు. అతడు తన కుమారుని బలి ఇవ్వబోయే సమయములో, “ఆగుము! బాలుని ఏమి చేయవద్దు! నువ్వు నాకు భయపడుదువని, నీ ఒక్కగానొక్క కుమారుని నాకిచ్చుటకు వెనుక తీయవని నేనిప్పుడు తెలుసుకొనియున్నాను” అని దేవుడు చెప్పాడు.
- 09:07 ఆమె బిడ్డను చూసినప్పుడు, ఆమె తన స్వంత కుమారునిగా స్వీకరించెను.
- 11:06 దేవుడు ఐగుప్తుల ప్రథమ సంతానమైన కుమారులు అందరినీ చంపాడు.
- 18:01 అనేక సంవత్సరములైన తరువాత, దావీదు మరణించాడు, తన కుమారుడు సొలొమోను పరిపాలించుటకు ఆరంభించాడు.
- 26:04 “ఇతను యోసేపు కుమారుడు కాడా?” అని వారు చెప్పుకొనిరి.
పదం సమాచారం:
- Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207
కూషు
వాస్తవాలు:
కూషు నోవహు కుమారుడు హాముకు పెద్ద కొడుకు. అతడు నిమ్రోదుకు పూర్వీకుడు కూడా. అతని సోదరులు ఇద్దరికీ ఈజిప్టు, కనాను అని పేర్లు.
- పాత నిబంధన కాలంలో, "కూషు" ఒక పెద్ద ప్రాంతం పేరు. ఇది ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతంలో ఉంది. ఒక వేళ ఈ దేశం పేరు హాము కుమారుడు కూషు మూలంగా వచ్చి ఉండవచ్చు.
- ప్రాచీన ప్రాంతం కూషు వివిధ సమయాల్లో నేటి దేశాలు సూడాన్, ఈజిప్టు, ఇతియోపియా, బహుశా అరేబియా దేశాల ప్రాంతం అయి ఉండవచ్చు.
- కూషు అనే పేరు గల మరొక మనిషిని కీర్తనలు గ్రంథం ప్రస్తావించింది. అతడు బెన్యామీను గోత్రికుడు.
(చూడండి: అరేబియా, కనాను, ఈజిప్టు, ఇతియోపియా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 01:8-10
- యెహెజ్కేలు 29:8-10
- ఆది 02:13-14
- ఆది 10:6-7
- యిర్మీయా 13:22-24
పదం సమాచారం:
- Strong's: H3568, H3569, H3570
కృప, కృపగల
నిర్వచనం:
"కృప" పదం సంపాదించని ఒకరికి ఇవ్వబడిన సహాయాన్నీ లేదా ఆశీర్వాదాన్నీ సూచిస్తుంది. "కృపగల" పదం ఇతరులకు కృపను చూపించు వ్యక్తిని వివరిస్తుంది.
- పాపపూరితమైన మానవులకు దేవుని కృప ఒక వరముగా ఉచితంగా ఇవ్వబడింది.
- కృప పదంలోని భావం చెడు కార్యాలు మరియు గాయపరచే కార్యాలు చేసిన వారితో దయతోనూ క్షమాపణతోనూ ఉండడం అని సూచిస్తుంది.
- "కృప కనుగొను" అనే వ్యక్తీకరణ దేవుని నుండి సహాయాన్నీ, కరుణనూ పొందడం అనే అర్థాన్నిచ్చే వ్యక్తీకరణ. తరచుగా ఇందులో దేవుడు ఒకరి విషయంలో సంతోషించడం మరియు అతనికి సహాయం చెయ్యడం అనే అర్థం ఉంది.
అనువాదం సూచనలు:
- "కృప" పదం "దైవికమైన దయ" లేదా "దేవుని దయ" లేదా "పాపుల కోసం దేవుని దయ మరియు క్షమాపణ" లేదా "కరుణపూరిత దయ" అనే పదాలతో ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- "కృపగల" పదం "సంపూర్ణ కృప" లేదా "దయ" లేదా "కరుణ గల" లేదా కరుణతో కూడిన దయ" అని అనువదించబడవచ్చు.
- "అతడు దేవుని దృష్టిలో కృపను పొందాడు" వ్యక్తీకరణ "అతడు దేవుని నుండి కరుణను పొందాడు" లేదా "దేవుడు అతనికి కరుణతో సహాయం చేశాడు" లేదా "దేవుడు తన దయను అతనికి చూపించాడు" లేదా "దేవుడు అతని విషయంలో సంతోషించాడు, అతనికి సహాయం చేసాడు" అని అనువదించబడవచ్చు.
బైబిలు రిఫరెన్సులు:
- అపొ. కా. 04:33
- అపొ. కా. 06:08
- అపొ. కా. 14:04
- కొలస్సీ 04:06
- కొలస్సీ 04:18
- ఆది 43:28-29
- యాకోబు 04:07
- యోహాను 01:16
- ఫిలిప్పీ 04:21-23
- ప్రకటన 22:20-21
పదం సమాచారం:
- Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543
కెరూబు, కెరూబులు
నిర్వచనం:
ఈ పదం "కెరూబు," దాని బహువచనం "కెరూబులు," వుడు చేసిన ఒక ప్రత్యేక పరలోక జీవి. బైబిల్ వర్ణించిన కెరూబులకు రెక్కలు, మంటలు ఉన్నాయి.
- కెరూబులు దేవుని మహిమను, శక్తిని ప్రదర్శిస్తారు. వారు పవిత్ర వస్తువుల సంరక్షకులు.
- తరువాత ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు, దేవుడు అగ్ని ఖడ్గాలున్న కెరూబులను ఏదేను తోటకు తూర్పువైపున పెట్టాడు. మనుషులు జీవ వృక్షం సమీపించకుండా ఇలా చేశాడు.
- దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక దానికొకటి అభిముఖంగా ఉండే రెండు కెరూబులు తయారు చెయ్యమని అజ్ఞాపించాడు. వారి రెక్కలు నిబంధన మందసం ప్రాయశ్చిత్తం మూత పై ఒక దానికొకటి తాకుతూ ఉండాలి.
- అతడు వారికి ఇంకా ఇలా చెప్పాడు. కెరూబుల రూపాలను ప్రత్యక్ష గుడారం తెరలపై కుట్టాలి.
- కొన్ని వాక్య భాగాల్లో, ఈ జీవుల వర్ణన ఉంది. వారికి నాలుగు ముఖాలు: మనిషి, సింహం, ఎద్దు, గరుడ పక్షి.
- కెరూబులను కొన్ని సార్లు దేవదూతలు అని ఎంచారు. అయితే బైబిలు దీన్ని స్పష్టంగా చెప్పడం లేదు.
అనువాదం సలహాలు:
- ఈ పదం "కెరూబులు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"రెక్కల జీవులు” లేక “రెక్కలున్న కాపలా దారులు” లేక “ఆత్మ సంబంధమైన రెక్కల సంరక్షకులు” లేక “పరిశుద్ధ రెక్కల ప్రాణులు."
- "కెరూబు"ను ఇలా అనువదించ వచ్చు. కెరూబులు కు ఏకవచనం, "రెక్కల జీవి” లేక “రెక్కలున్న ఆత్మ సంబంధమైన సంరక్షకుడు."
- ఈ పదాన్ని దేవదూతలు అని అర్థం ఇచ్చే వివిధ పదాల నుండి వేరుగా అనువాదం అయ్యేలా చూడండి.
- ఈ పదాన్ని బైబిల్ అనువాదంలో స్థానిక, లేక జాతీయ భాషలో కూడా అనువదించ వచ్చు.
(చూడండి: దేవదూత)
బైబిల్ రిఫరెన్సులు:
- 1దిన 13:5-6
- 1రాజులు 06:23-26
- నిర్గమ 25:15-18
- యెహెజ్కేలు 09:3-4
- ఆది 03:22-24
పదం సమాచారం:
కేదారు
వాస్తవాలు
కేదారు ఇష్మాయేలు రెండవ కొడుకు. ఇది ఒక ప్రాముఖ్యమైన పట్టణం, అతని పేరును బట్టి ఈ పట్టణానికి పేరు ఇవ్వబడియుండవచ్చు.
- కేదారు పట్టణము పాలస్తీనా దక్షిణపు భాగం వద్దగల అరేబియా ఉత్తర ప్రాంతంలో ఉంది. బైబిలు కాలంలో ఇది గొప్పతనానికి, అందానికి మారు పేరుగా ఉండేది.
- కేదారు సంతానం ఒక పెద్ద ప్రజా గుంపుగా తయారయ్యారు. ఆ గుంపును “కేదారు” అని పిలుస్తారు.
- ”కేదారు వారి నల్లని డేరాలు” అనే వాక్యం కేదారు ప్రజలు నివసించిన మేకలను మేపే నల్లని గుడారాలను సూచిస్తున్నాయి.
- ఈ ప్రజలు గొర్రెలను, మేకలను పెంచుతారు. రవాణా కోసం వారు ఒంటెలను కూడా వినియోగించారు.
- బైబిలులో “కేదారు మహిమ” అనే పదం ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని, దాని ప్రజల గొప్పతనాన్ని సూచిస్తుంది.
(చూడండి: అరేబియా, మేక, ఇష్మాయేలు, బలియాగము)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
కొమ్ము, కొమ్ములు, కొమ్ములున్న
వాస్తవాలు:
కొమ్ములు గట్టి పదార్థంతో తలపై ఎదుగుతూ ఉండేవి. పశువులు, గొర్రె, మేకలు, జింక ఇంకా అనేక జంతువులకు కొమ్ములు ఉంటాయి.
- పొట్టేలు (మగ గొర్రె) కొమ్ముతో చేసిన సంగీత వాయిద్యాన్ని "పొట్టేలు కొమ్ము” లేక “షోఫర్" అంటారు. పండుగలు తదితర ప్రత్యేకసమయాల్లో దీన్ని ఊదుతారు.
- కొమ్ముల వంటి వాటిని సాంబ్రాణి వేసే వేదిక, ఇత్తడి బలిపీఠం నాలుగు మూలలా చెయ్యమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. వీటిని "కొమ్ములు," అని పిలిచినప్పటికీ అవి జంతువు కొమ్ములు కాదు.
- "కొమ్ము" అనే దాన్ని కొన్ని సార్లు కొమ్ము ఆకారంలో ఉన్న గిన్నె లాటి దానికి ఉపయోగిస్తారు. ఇందులో నీరు లేక నూనె ఉంచుతారు. రాజులకు అభిషేకం చెయ్యడానికి దీన్ని ఉపయోగిస్తారు. సమూయేలు దావీదుకు ఇలానే అభిషేకం చేశాడు.
- ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. బాకా.
- "కొమ్ము" ను అలంకారికంగా బలం, శక్తి, అధికారం, రాజ సంబంధమైన ఘనతకు సంకేతంగా ఉపయోగిస్తారు.
(చూడండి: అధికారం, ఆవు, జింక, మేక, శక్తి, రాజరికం, ఆడగొర్రె, బాకా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 15:27-28
- 1 రాజులు 01:38-40
- 2 సమూయేలు 22:3-4
- యిర్మీయా 17:1-2
- కీర్తనలు 022:20-21
పదం సమాచారం:
- Strong's:H3104, H7160, H7161, H7162, H7782, G2768
కొలిమి
వాస్తవాలు:
కొలిమి అంటే చాలా పెద్ద పొయ్యి. దీన్ని ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వస్తువులను వేడి చెయ్యడానికి ఉపయోగిస్తారు.
- ప్రాచీన కాలంలో, కొలుములను లోహాలను కరిగించి గిన్నెలు, ఆభరణాలు, ఆయుధాలు, విగ్రహాలు మొదలైనవి చెయ్యడానికి ఉపయోగిస్తారు.
- కొలుములను బంక మట్టితో కుండలు చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు.
- కొన్ని సార్లు కొలిమి అనేది అలంకారికంగా ఏదైనా బాగా వేడిగా ఉండే దాన్ని సూచిస్తుంది.
(చూడండి: దేవుడు, స్వరూపం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 08:51-53
- ఆది 19:26-28
- సామెతలు 17:3-4
- కీర్తనలు 021:9-10
- ప్రకటన 09:1-2
పదం సమాచారం:
- Strong's: H861, H3536, H3564, H5948, H8574, G2575
కోపం, కోపపడు, కోపంగా
నిర్వచనం:
"కోపంగా ఉండు” లేక “కోపం తెచ్చుకొను"అంటే ఎదో ఒక విషయం గురించి చాలా ఆగ్రహం, చిరాకు, అయిష్టం, లేక ఒకరికి వ్యతిరేకంగా కోపగించు.
- మనుషులు కోపగించుకున్నప్పుడు, వారు తరచుగా పాపపూరితమైన, స్వార్థ పూరితమైన రీతిలో ఆలోచిస్తారు. అయితే కొన్ని సార్లు అన్యాయం లేక పీడనకు వ్యతిరేకంగా న్యాయమైన కోపం కూడా వస్తుంది.
- దేవుని కోపం (దీన్ని "ఆగ్రహం"అనవచ్చు) పాపం గురించి ఆయనకు ఉన్న బలమైన అయిష్టాన్ని తెలుపుతుంది.
- "కోపం రేపడం" అంటే "కోపగించుకునేలా చెయ్యడం."
(చూడండి: ఉగ్రత)
బైబిల్ రిఫరెన్సులు:
- ఎఫెసి 04:25-27
- నిర్గమ 32:9-11
- యెషయా 57:16-17
- యోహాను 06:52-53
- మార్కు 10:13-14
- మత్తయి 26:6-9
- కీర్తనలు 018:7-8
పదం సమాచారం:
- Strong's: H599, H639, H1149, H2152, H2194, H2195, H2198, H2534, H2734, H2787, H3179, H3707, H3708, H3824, H4751, H4843, H5674, H5678, H6225, H7107, H7110, H7266, H7307, G23, G1758, G2371, G2372, G3164, G3709, G3710, G3711, G3947, G3949, G5520
కోరహు, కోరహీయుడు, కోరహీయులు
నిర్వచనం:
పాత నిబంధనలో ముగ్గురు వ్యక్తులకు కోరహు అనే పేరు ఉంది.
- ఏశావు కుమారులలో ఒకని పేరు కోరహు అతని సమాజానికి అతడు నాయకుడు అయ్యాడు.
- లేవి సంతానంలో కోరహు ఒకడు. ప్రత్యక్ష్యగుడారంలో ఒక యాజకుడిగా పనిచేసాడు. మోషే, ఆహారోను విషయంలో అతడు అసూయ చెందాడు, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడానికి ఒక మనుష్యుల గుంపును తయారు చేసాడు.
- కోరహు పేరుతో ఉన్న మూడవ వ్యక్తి యూదా సంతానంలో ఉన్నాడు.
(చూడండి: అహరోను, అధికారం, కాలేబు, వారసుడు, ఏశావు, యూదా)
బైబిలు రెఫరెన్సులు:
- యాజకుడు
- సంఖ్యాకాండం 16:1-3
- సంఖ్యాకాండం 16:25-27
- కీర్తనలు 42:1-2
పదం సమాచారం:
క్షమించు, క్షమించబడిన, క్షమాపణ, క్షమాభిక్ష, క్షమాపణ పొందిన
నిర్వచనం:
ఎవరినైనా క్షమించడం అంటే ఎవరైనా తనకు గాయం కలిగించినా వారికి వ్యతిరేకంగా ఎలాటి కక్ష పెట్టుకోకుండా ఉండడం.
"క్షమాపణ" అంటే ఎవరినైనా మన్నించే క్రియ.
- ఎవరినైనా క్షమించడం అంటే ఆ మనిషిని అతడు చేసిన తప్పు నిమిత్తం శిక్షించక పోవడం.
- ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. "రద్దు చేయడం," "బాకీ క్షమించడం."
- మనుషులు వారి పాపాలు ఒప్పుకుంటే దేవుడు సిలువపై యేసు త్యాగ పూర్వక మరణం ద్వారా క్షమిస్తాడు.
- తాను వారిని క్షమించిన విధంగానే తన శిష్యులు ఇతరులను క్షమించాలని యేసు బోధించారు. "క్షమాభిక్ష" అంటే క్షమించడం. ఎవరినైనా అతని పాపంకోసం శిక్షించక పోవడం. "క్షమాభిక్ష" పెట్టడం అంటే "క్షమించు" అనే అర్థమే గానీ అదనంగా అతని అపరాధం విషయంలో శిక్షించకూడదని నిర్ణయం చేయడం అనే ప్రత్యేకర్థం ఉంది.
- న్యాయ స్థానం న్యాయాధిపతి ఒక వ్యక్తి నేరం చేసాడని రుజువైనా క్షమాభిక్ష పెట్టవచ్చు.
- మనుషులు పాపం చేసినా యేసు క్రీస్తు మనలను క్షమించి నరకం నుండి తప్పించాడు. ఇది తన త్యాగ పూర్వక సిలువ మరణం మూలంగాసాధ్యం అయింది.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, "క్షమించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "క్షమాభిక్ష” లేక “శిక్ష రద్దు” లేక “విడుదల” లేక “ఆ వ్యక్తికి అతని నేరాన్ని వ్యతిరేకంగా నిలపక పోవడం" (ఎవరినైనా).
- "క్షమాపణ" అనే దాన్ని ఒక పదంతో అనువదించ వచ్చు లేక ఒక పదబంధంతో. "మనసులు కక్ష పెట్టుకోక పోవడం” లేక “(ఎవరినైనా) దోషి కాదని ప్రకటించడం” లేక “క్షమాభిక్ష పెట్టే క్రియ."
- మీ భాషలో ఒక పదం క్షమించడం అని అర్థం ఇచ్చే పదం ఉంటే "క్షమాభిక్ష" అని అర్థం వచ్చేలా ప్రయోగించ వచ్చు. (చూడండి: అపరాధ భావం)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 50:15-17
- సంఖ్యా 14:17-19
- ద్వితీ 29:20-21
- యెహోషువా 24:19-20
- 2 రాజులు 05:17-19
- కీర్తనలు 025:10-11
- కీర్తనలు 025:17-19
- యెషయా 55:6-7
- యెషయా 40:1-2
- లూకా 05:20-21
- అపో. కా. 08:20-23
- ఎఫెసి 04:31-32
- కొలస్సి 03:12-14
- 1 యోహాను 02:12-14
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 07:10 అయితే ఏశావు అప్పటికే యాకోబును క్షమించాడు. వారు ఒకరినొకరు మరలా చూసుకుని ఆనందించారు.
- 13:15 తరువాత మోషే కొండ ఎక్కి మరలా దేవుడు ప్రజలను క్షమించాలని ప్రార్థించాడు. దేవుడు మోషే ప్రార్థన విన్నాడు, వారిని క్షమించాడు.
- 17:13 దావీదు తన పాపం విషయం పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు.
- 21:05 కొత్త నిబంధనలో, దేవుడు తన చట్టం మనుషుల హృదయాలపై రాశాడు. ప్రజలు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుదురు, వారు అయన ప్రజలు, దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు.
- 29:01 ఒక రోజు పేతురు యేసును ఇలా అడిగాడు. "స్వామీ నేను నా సోదరుడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ సోదరుణ్ణి ఎన్ని సార్లు క్షమించాలి?
- 29:08 నీవు నన్ను అర్థించావు గనక నేను నీ రుణం క్షమించాను.
- 38:05 తరువాత యేసు పాత్ర తీసుకుని చెప్పాడు, "ఇది తాగండి. ఇది నా రక్తం మూలంగా ఉన్న కొత్త నిబంధన. దీన్ని పాపాల క్షమాపణ కోసం ధార పోశాను.
పదం సమాచారం:
- H5546, H5547, H3722, H5375, H5545, H5547, H7521, G859, G863, G5483
ఖరీదు, ఖరీదు చెల్లించబడెను
నిర్వచనము:
“ఖరీదు” అనే ఈ పదము ఒక డబ్బు మొత్తమును లేక అడగబడినంత మొత్తమును లేక చెరలోనున్న వ్యక్తి విడుదల పొందుట కొరకు చెల్లించవలసిన రుసుమును సూచిస్తుంది.
- క్రియా పదముగా, “ఖరీదు” అనే పదమునకు వెల చెల్లించుట లేక బంధించబడిన, చెరగొనిపోయినవారిని, బానిసలైనవారిని రక్షించు క్రమములో త్యాగపూరితమైన పనిని చేయుట అని అర్థము. “వెనక్కి వచ్చునట్లు కొనుగోలు చేయు” అనే ఈ మాటకు అర్థము “విమోచించు” అనే పదమునకు అనే అర్థము కూడా ఒక్కటే.
- పాపపు బానిసత్వములోనున్న ప్రజలను విడిపించుటకు క్రయధనముగా లేక ఖరీదుగా యేసు తన్నతాను మరణమునకు అప్పగించుకొనెను. వారి పాపముల కొరకు ఖరీదును చెల్లించుట ద్వారా తన ప్రజలను వెనక్కి కొనుక్కొను దేవుని ఈ కార్యమును పరిశుద్ధ గ్రంథములో “విమోచన” అని పిలువబడింది.
తర్జుమా సలహాలు:
- “ఖరీదు” అనే ఈ పదమును “విమోచించుటకు చెల్లించుట” లేక “విడుదల చేయుటకు వెలను చెల్లించుట” లేక “వెనక్కి తిరిగి కొనుగోలు చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “ఖరీదును (క్రయధనమును) చెల్లించుట” అనే ఈ మాటను “(స్వాతంత్ర్యమును అనుగ్రహించుటకు) వెలను చెల్లించుట” లేక “(ప్రజలను విడుదల చేయుటకు) దండమును చెల్లించుట) లేక “అవసరమైన వెలను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “ఖరీదు లేక క్రయధనము” అనే ఈ నామపదమును “వెనక్కి తిరిగి కొనుగోలు చేయుట” లేక “క్రయధనమును చెల్లించుట” లేక “(భూమినిగాని లేక ప్రజలను గాని వెనక్కి తిరిగి కొనుక్కొనుటకు) వెలను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “ఖరీదు (లేక క్రయధనము) మరియు “విమోచన” అనే ఈ పదములకు ఆంగ్ల భాషలో ఒకే అర్థము కలదు గాని కొన్నిమార్లు వేరొక భాషలలో కొంచెము విభిన్నమైన పదాలను ఉపయొగిస్తూ ఉంటారు. ఈ ఉద్దేశము కొరకు కొన్ని ఇతర భాషలలో ఒకే ఒక్క పదమును మాత్రమే ఉపయోగిస్తుంటారు.
- ఈ పదమును “ప్రాయశ్చిత్తం” అనే పదమునుకు విభిన్నముగా తర్జుమా చేయునట్లు చూసుకోండి.
(ఈ పదములను కూడా చూడండి: ప్రాయశ్చిత్తం, విమోచించు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 తిమోతి.02:5-7
- యెషయా.43:2-3
- యోబు.06:21-23
- లేవి.19:20-22
- మత్తయి.20:25-28
- కీర్తన.049:6-8
పదం సమాచారం:
- Strong's: H1350, H3724, H6299, H6306, G487, G3083
గంట, గంటలు
నిర్వచనం:
"గంట"అనే పదాన్ని తరచుగా బైబిల్లో సమయం కొన్ని సంఘటనలు జరిగిన సమయం తెలపడానికి ఉపయోగిస్తారు. దీన్ని "ఆ సమయం” లేక “ఆ క్షణం"అని చెప్పేటందుకు అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు.
- యూదులు సూర్యోదయం మొదలుకుని (సుమారు ఉదయం 6 గంటలు) పగలు సమయాన్ని గంటల్లో లెక్కించారు. ఉదాహరణకు, "తొమ్మిదవ గంట"అంటే "మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం."
- రాత్రివేళ గంటలను సూర్యాస్తమయం (సుమారు 6 గంటలు) మొదలుకుని లెక్కించారు. ఉదాహరణకు, "రాత్రి మూడవ గంట"అంటే ప్రస్తుత పధ్ధతి ప్రకారం "సాయంత్రం 9గంటల ప్రాంతంలో."
- బైబిల్లో సమయం ప్రస్తావనలు ప్రస్తుతం ఉన్న విధంగా కాదు. "సుమారు తొమ్మిది” లేక “దాదాపు ఆరు గంటలు"అని ఉపయోగిస్తారు.
- కొన్ని అనువాదాలు "సాయంత్రం” లేక “ఉదయం వేళ” లేక “మధ్యాహ్నం పూట"అనే పదబంధాలను ఆ సమయం లేక ఆ రోజును సూచించడానికి ఉపయోగిస్తారు.
- "ఆ గంటలో"అనే దాన్ని ఇలా అనువదించవచ్చు. "ఆ సమయంలో” లేక “ఆ క్షణంలో."
- యేసుకు సంబంధించి, "తన సమయం"అని అనువదించిన దానికి అర్థం, "తన సమయం ఇంకా రాలేదు.” లేక “తనకై నియమించ బడిన సమయం వచ్చింది."
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 02:14-15
- యోహాను 04:51-52
- లూకా 23:44-45
- మత్తయి 20:3-4
పదం సమాచారం:
గంట, గంటలు
నిర్వచనం:
కాలాన్ని తెలియజేయడానికి అదనంగా గంట అనే మాటను ఒక చోట జరిగే విషయం, మొదలైన విధాలుగా అలంకారికంగా ఉపయోగిస్తారు:
- కొన్ని సార్లు "గంట" అనేది ఏదైనా చెయ్యవలసిన నియామక కాలాన్ని సూచిస్తున్నది. "ప్రార్థన గంట."
- యేసు బాధలు పడి మరణం పొందవలసిన "గంట అయింది" అంటే అందుకోసం నియమించ బడిన సమయం వచ్చింది. అది చాలాకాలం క్రితం దేవుడు నియమించిన సమయం.
- "గంట" అనే మాటను "ఆ క్షణం” లేక “వెను వెంటనే" అనే అర్థంలో ఉపయోగిస్తారు.
- "గంట" ఆలస్యం అంటే ఆ రోజుకి పొద్దు పోయింది అని, త్వరలో సూర్యుడు అస్తమిస్తాడు అని అర్థం.
అనువాదం సలహాలు:
- ఈ మాటను అలంకారికంగా ఉపయోగించినప్పుడు ఇలా అనువదించ వచ్చు. "సమయం” లేక “క్షణం” లేక “నియమించ బడిన సమయం."
- "అదే గంటలో” లేక “ఆ గంటలోనే" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆ క్షణంలో” లేక “ఆ సమయంలో ” లేక “తక్షణమే” లేక “వెనువెంటనే."
- "ఆలస్యం గంట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆ రోజుకి ఆలస్యం అయింది” లేక “త్వరలో చీకటి పడనున్నది” లేక “మధ్యాహ్నం అయిపొయింది."
(చూడండి: గంట)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 15:29-30
- అపో. కా. 10:30-33
- మార్కు 14:35-36
పదం సమాచారం:
గాజా
వాస్తవాలు:
బైబిల్ కాలాల్లో, గాజా ఒక ధనిక ఫిలిష్తియ పట్టణం. ఇది మధ్యదరా సముద్ర తీరాన, అష్డోదుకు సుమారు 38 కిలో మీటర్ల దక్షిణాన ఉంది. ఇది ఫిలిష్తీయుల ఐదు ముఖ్య పట్టణాల్లో ఒకటి.
- ఉనికిని బట్టి గాజా పట్టణం ఓడ రేవు. వాణిజ్య కార్యకలాపాలు జరిగే స్థలం. అనేక వివిధ ప్రజా సమూహాలు, జాతులు ఉండే పట్టణం.
- ఈ నాడు గాజా పట్టణం చాలా ప్రాముఖ్యమైన ఓడ రేవు. గాజా భూభాగం అనేది మధ్యదరా సముద్రం తీరాన ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఈశాన్యం దిక్కున, ఈజిప్టుకు దక్షిణాన ఉంది.
- ఫిలిష్తీయులు సంసోనును బంధించిన తరువాత అతన్ని గాజా పట్టణం తీసుకుపోయారు.
- సువార్తికుడు ఫిలిప్పు గాజాకు పోయే ఎడారి దారిలో ఇతియోపీయ నపుంసకుడిని కలుసుకున్నాడు.
(చూడండి: అష్డోదు, ఫిలిప్పు, ఫిలిష్టియులు, ఇతియోపియా, గాతు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 04:24-25
- అపో. కా. 08:26-28
- ఆది 10:19-20
- యెహోషువా 10:40-41
- న్యాయాధి 06:3-4
పదం సమాచారం:
- Strong's: H5804, H5841, G1048
గాడిద, కంచర గాడిద
నిర్వచనం:
గాడిద నాలుగు-కాళ్ళ పని జంతువు. గుర్రం లాగానే ఉంటుంది, అయితే చిన్నదిగా పెద్ద చెవులతో ఉంటుంది.
- కంచర గాడిద సంతానోత్పత్తికి పనికి రాదు. అది మగ గాడిదకు ఆడ గుర్రానికి పుట్టిన సంకరజాతి జీవి.
- కంచర గాడిదలు చాలా బలమైన జంతువులు. అవి చాలా విలువైన పని జంతువులు.
- గాడిదలను కంచర గాడిదలను మనుషులు ప్రయాణాలు చేసేటప్పుడు బరువులు మోయడానికి ఉపయోగిస్తారు.
- బైబిల్ కాలాల్లో, రాజులు శాంతి సమయాల్లో గుర్రం కన్నా గాడిదనే ఉపయోగిస్తారు. గుర్రం యుద్ధ సమయాల్లో వాడతారు.
- యేసు ఆయన సిలువ వేయబడిన రోజుకు వారం ముందు యెక్కషలేముకు గాడిద పిల్ల ఎక్కి వెళ్ళాడు.
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 01:32-34
- 1 సమూయేలు 09:3-4
- 2 రాజులు 04:21-22
- ద్వితీ 05:12-14
- లూకా 13:15-16
- మత్తయి 21:1-3
పదం సమాచారం:
- Strong's: H860, H2543, H3222, H5895, H6167, H6501, H6505, H6506, H7409, G3678, G3688, G5268
గాదు
వాస్తవాలు:
గాదు యాకోబు కుమారుల్లో ఒకడు. యాకోబు మరొక పేరు ఇశ్రాయేల్.
- గాదు కుటుంబం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల్లో ఒకటి.
- బైబిల్లో మరొక మనిషి గాదు ఒక ప్రవక్త. ఇతడు దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడం ద్వారా పాపం చేసినప్పుడు అతన్ని గద్దించాడు.
- రెండు పట్టణాలు బయలు గాదు, మిగ్దాల్ గాదు అనేవి మూల భాషలో రెండు మాటలు.
(చూడండి: జనసంఖ్య, ప్రవక్త, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 05:18-19
- నిర్గమ 01:1-5
- ఆది 30:9-11
- యెహోషువా 01:12-13
- యెహోషువా 21:36-38
పదం సమాచారం:
- Strong's: H1410, H1425, G1045
గిలాదు, గిలాదీయుడు, గిలాదీయులు
నిర్వచనం:
గిలాదు యోర్దాను నదికి తూర్పున ఉన్న కొండ ప్రాంతం పేరు. ఇక్కడ ఇశ్రాయేలు గోత్రాలు గాదు, రూబేను, మనష్శే నివసించారు.
- ఈ ప్రాంతం "గిలాదు కొండ సీమ” లేక “గిలాదు పర్వత ప్రదేశం."
- "గిలాదు" అనేది చాలా మంది పాత నిబంధన మనుషులకు కూడా ఉంది. ఈ మనుషుల్లో ఒకడు మనష్శే మనవడు. మరొక గిలాదు యెఫ్తా తండ్రి.
(చూడండి: గాదు, యెఫ్తా, మనష్షే, రూబేను, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 02:21-22
- 1 సమూయేలు 11:1-2
- ఆమోసు 01:3-4
- ద్వితీ 02:36-37
- ఆది 31:19-21
- ఆది 37:25-26
పదం సమాచారం:
గుంట, గుంటలు, ఊహించని ఉపద్రవము
నిర్వచనము:
గుంట అనునది నేల మీద త్రవ్వి తీసే లోతైన రంధ్రం.
- ప్రజలు నీటి కొరకు లేక జంతువులను పట్టుకొను ఉద్దేశము కొరకు అనేకమైన గుంటలను త్రవ్వుదురు.
- గుంటను తాత్కాలికముగా ఖైదిని ఉంచడానికి కూడా ఉపయోగించేవారు.
- కొన్నిమార్లు “గుంట” అనే పదము సమాధిని లేక నరకమును సూచిస్తుంది. మరికొన్నిమార్లు ఇది “అగాధమును” కూడా సూచిస్తుంది.
- చాలా లోతైన గుంటను “నీటి తొట్టి” అని కూడా అంటారు.
- “గుంట” అనే పదమును అలంకార భాషలో కూడా ఉపయోగించారు, ఉదాహరణకు, “నాశనమనే గుంట” అనే వాక్యము ఘోరమైన పరిస్థితిలో ఇరుక్కొని ఉండుట లేక పాప స్వభావములో అతీ ఎక్కువగా నిమగ్నమైయుండుటను, నాశనకరమైన ఆలువాట్లలో మునిగియుండుటను వివరిస్తుంది.
(ఈ పదములను కూడా చుడండి: అగాథం, నరకం, చెర)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.37:21-22
- యోబు.33:16-18
- లూకా.06:39-40
- సామె.01:12-14
పదం సమాచారం:
- Strong's: H875, H953, H1356, H1360, H1475, H2352, H4087, H4113, H4379, H6354, H7585, H7745, H7816, H7825, H7845, H7882, G12, G999, G5421
గుడారం, గుడారాలు, గుడారం నిర్మాణకులు
నిర్వచనం:
గుడారం అనేది మందమైన బట్టతో కప్పి స్థంభాలపై నిలబెట్టే నివాసం.
- గుడారాలు చిన్నవిగా కొద్ది మంది ఉండేందుకు అనుగుణంగా ఉండవచ్చు. లేక పెద్దదిగా మొత్తం కుటుంబం నిద్ర పోవడానికి, వంటలు చేసుకోడానికి, నివశించడానికి ఉపయోగపడేది.
- అనేక మంది ప్రజలకు గుడారాలు శాశ్వత నివాస స్థలాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ఎక్కువ కాలం అబ్రాహాము కుటుంబం కనాను ప్రదేశంలో మేక వెంట్రుకలతో చేసిన దృఢమైన గుడ్డ కప్పిన పెద్ద గుడారాల్లో నివసించారు.
- ఇశ్రాయేలీయులు కూడా వారి నలభై సంవత్సరాల సీనాయి ఎడారి ప్రయాణాల్లో గుడారాల్లో నివసించారు.
- ప్రత్యక్ష గుడారం ఒక రకమైన చాలా పెద్దగుడారం. గుడ్డతెరలతో చేసిన మందమైన గోడలు ఉన్నాయి.
- అపోస్తలుడు పౌలు సువార్త ప్రకటన కోసం వివిధ పట్టణాలు ప్రయాణించినప్పుడు అతడు గుడారాలు చేసి తనను పోషించుకున్నాడు.
- "గుడారాలు" అనే పదాన్ని కొన్ని సార్లు సాధారణంగా మనుషులు నివాసముండే స్థలాలను సూచించడానికి అలంకారికంగా ఉపయోగిస్తారు. "గృహాలు” లేక “నివాసాలు” లేక “ఇళ్ళు" లేక "శరీరాలు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
(చూడండి: అబ్రాహాము, కనాను, తెర, పౌలు, సీనాయి, ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 05:10
- దానియేలు 11:44-45
- నిర్గమ 16:16-18
- ఆది 12:8-9
పదం సమాచారం:
- Strong's: H167, H168, H2583, H3407, H6898
గుర్రం
నిర్వచనం:
గుర్రం పెద్ద నాలుగు-కాళ్ళ జంతువు. బైబిల్ కాలాల్లో దీన్ని ఎక్కువగా వ్యవసాయం పనులకు, మనుషుల రవాణా కు ఉపయోగించారు.
- కొన్ని గుర్రాలను బండ్లు, రథాలు లాగడానికి ఉపయోగిస్తారు. కొన్నిటిని రౌతు స్వారీ చేసేందుకు వాడతారు.
- గుర్రాలకు తరచుగా నోట్లో కళ్ళెం ధరింపజేసి వాటిపై అదుపుతో స్వారీ చేస్తారు.
- బైబిల్లో, గుర్రాలను విలువైన ఆస్తిపాస్తులుగా సంపదకు కొలమానంగా ఎంచే వారు. ముఖ్యంగా ఎందుకంటే యుద్ధంలో అవి బాగా పనికి వస్తాయి. ఉదాహరణకు, సొలోమోను రాజుకున్న గొప్ప సంపద వేలకొద్దీ గుర్రాలు, రథాలు.
- ఈజంతువులు గాడిద, కంచర గాడిదలతో పోలిక కలిగి ఉంటాయి.
(చూడండి: రథం, గాడిద, సొలొమోను)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 18:3-4
- 2 రాజులు 02:11-12
- నిర్గమ 14:23-25
- యెహెజ్కేలు 23:5-7
- జెకర్యా 06:7-8
నిర్వచనం:
పదం సమాచారం:
- Strong's: H47, H5483, H5484, H6571, H7409, G2462
గువ్వ, పావురం
నిర్వచనం:
గువ్వలు, పావురాళ్ళు రెండు రకాల ఒకే విధమైన చిన్న, బూడిద రంగు-గోధుమ రంగు పక్షులు. గువ్వ తరచుగా మరింత తెల్లగా ఉండవచ్చు.
- కొన్ని భాషల్లో వీటికి రెండు వివిధ పేర్లు ఉండగా కిన్ని భాషల్లో రెండు పేర్లు ఉన్నాయి.
- గువ్వలు, పావురాళ్ళను దేవునికి బలి అర్పణల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెద్ద జంతువులను తేలేని మనుషులు వీటిని తెస్తారు.
- గువ్వ వరద నీరు కొద్దిగా ఇంకుతూ ఉండగా ఒలీవ చెట్టు ఆకును నోవహు దగ్గరకు తెచ్చింది.
- గువ్వలు కొన్ని సార్లు స్వచ్ఛత, నిర్దోషత్వం, లేక శాంతికి సంకేతం.
- గువ్వలు, పావురాళ్ళు అనే పేర్లు అనువాదం చేస్తున్న భాషలో లేకపోతే ఈ పదాన్నిఅనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గువ్వ అనే పేరుగల చిన్న బూడిద రంగు గోధుమ రంగు పక్షి” లేక “ఒకే విధమైన చిన్న బూడిద రంగు లేక గోధుమ రంగు స్థానిక పక్షులు."
- గువ్వ, పావురం ఒకే వచనంలో వస్తే వీలైతే రెండు వేరు వేరు మాటలు ఈ పక్షులకు ఉపయోగించాలి.
(చూడండి: ఒలీవ, నిర్దోష, శుద్ధమైన)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 08:8-9
- లూకా 02:22-24
- మార్కు 01:9-11
- మత్తయి 03:16-17
- మత్తయి 21:12-14
పదం సమాచారం:
- Strong's: H1469, H1686, H3123, H8449, G4058
గెరారు
వాస్తవాలు:
గెరారు కనాను ప్రదేశంలో ఒక పట్టణం. ఇది హెబ్రోనుకు నైరుతీ దిశగా బేయెర్షెబా వాయవ్యంగా ఉంది.
- అబీమెలెకు రాజు గెరారు అధిపతి. అబ్రాహాము, శారా అక్కడ నివసించారు.
- ఇశ్రాయేలీయులు కనానులో నివసించిన కాలంలో ఫిలిష్తీయులు గెరారు ప్రాంతాన్ని పాలించారు.
(చూడండి: అబీమెలెకు, బెయెర్షేబా, హెబ్రోను, ఫిలిష్టియులు)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 దిన 14:12-13
- ఆది 20:1-3
- ఆది 26:1
- ఆది 26:6-8
పదం సమాచారం:
గొడ్రాలు, నిస్సారమైన నేల
నిర్వచనం:
"గొడ్రాలు" గా ఉండడం అంటే పిల్లలు లేకుండా చెట్ల విషయంలోనైతే ఫలాలు లేకుండా అని అర్థం.
- నేల లేక దేశం ఎండినదైతే అక్కడ మొక్కలు మొలవవు.
- ఒక స్త్రీ గొడ్రాలు అయితే ఆమె శారీరికంగా పిల్లలను కనడానికి పనికి రాదు.
అనువాదం సలహాలు:
- " నిస్సారమైన " అనే పదాన్ని దేశాన్ని, లేక భూమిని సూచించడానికి ఉపయోగిస్తారు. దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సారవంతం కాని” లేక “ఫలభరితం కాని” లేక “మొక్కలు మొలవని."
- ఇది గొడ్రాలైన స్త్రీ విషయంలో వాడితే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంతానం లేని” లేక “పిల్లలను కనలేని” లేక “పిల్లలను గర్భం ధరించే సామర్థ్యం లేని."
బైబిల్ రిఫరెన్సులు:
- 1 సమూయేలు 02:5
- గలతి 04:26-27
- ఆది 11:29-30
- యోబు 03:6-7
పదం సమాచారం:
- Strong's: H4420, H6115, H6135, H6723, H7909, H7921, G692, G4723
గొమొర్రా
వాస్తవాలు:
గొమొర్రా సారవంతం అయిన సోదోమ లోయ భూమిలో ఉన్న పట్టణం. అబ్రాహామును విడిచి లోతు నివాసం కోసం ఎన్నుకొన్నాడు.
- గొమొర్రా, సోదోమ కచ్చితంగా ఎక్కడున్నదో తెలియదు. అయితే ఇది నేరుగా ఉప్పు సముద్రానికి దక్షిణంగా సిద్దిము లోయ దగ్గర ఉండవచ్చు.
- సోదోమ గొమొర్రా ప్రాంతాలు అనేక మంది రాజులు యుద్ధాలు చేశారు.
- లోతు కుటుంబం సోదోమ, ఇతర పట్టణాల సంఘర్షణలో చిక్కుకున్నప్పుడు అబ్రాహాము తన మనుషులతో వెళ్లి వారిని రక్షించాడు.
- ఆ తరువాత కొంత కాలానికే సోదోమ, గొమొర్రాలను దేవుడు నాశనం చేశాడు. ఎందుకంటే అక్కడి ప్రజల దుర్మార్గత మితి మీరి పోయింది.
(చూడండి: అబ్రాహాము, బబులోను, లోతు, ఉప్పు సముద్రము, సొదొమ)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 పేతురు 02:4-6
- ఆది 10:19-20
- ఆది 14:1-2
- ఆది 18:20-21
- యెషయా 01:9
- మత్తయి 10:14-15
పదం సమాచారం:
గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల
నిర్వచనం:
“గొర్రెపిల్ల” పదం ఒక చిన్న గొర్రెను సూచిస్తుంది. గొర్రెలు నాలుగు కాళ్ళు ఉన్న జంతువులు, దట్టమైన నూలు జుట్టు కలిగియుంటాయి, దేవునికి బలుల కోసం వినియోగిస్తారు. యేసు “దేవుని గొర్రెపిల్ల” అని పిలువబడ్డాడు, ఎందుకంటే ప్రజల పాపాల కోసం వెల చెల్లించడానికి ఆయన బలి అయ్యాడు.
- ఈ జంతువులు సులభంగా తప్పిపోతాయి, వీటికి భద్రత అవసరం. దేవుడు మానవులను గొర్రెలతో పోల్చాడు.
- బౌతికంగా పరిపూర్ణమైన గొర్రెలను, గొర్రెపిల్లలను బలి ఇవాలని దేవుడు మనుష్యులకు హెచ్చరించాడు.
- యేసు “దేవుని గొర్రెపిల్ల” అని పిలువబడ్డాడు, ఎందుకంటే ప్రజల పాపాల కోసం వెల చెల్లించడానికి ఆయన బలి అయ్యాడు. ఆయన సంపూర్ణమైనా, కళంకం లేని బలి, ఎందుకంటే ఆయన సంపూర్తిగా పాపం లేనివాడు.
అనువాదం సూచనలు:
- భాషా ప్రాంతంలో గొర్రెలు పరిచయంగా ఉన్నట్లయితే, వాటిలో చిన్నదానిని “గొర్రెపిల్ల”, “దేవుని గొర్రె పిల్ల” అని అనువదించవచ్చు.
- ”దేవుని గొర్రెపిల్ల” అనే పదాన్ని “దేవుని (బలి)గొర్రెపిల్ల” లేక “దేవునికి అర్పితమైన గొర్రెపిల్ల” లేక “దేవుని నుండి (బలి) గొర్రెపిల్ల” అని అనువదించవచ్చు.
- ఒకవేళ గొర్రెలు అనే పదం తెలియకపోతే, ఈ పదాన్ని “చిన్న గొర్రెపిల్ల” అని అనువదించవచ్చు, గొర్రెలు ఏవిధంగా ఉంటాయని వివరణ పేజీ అడుగుభాగాన్న పొందుపరచవచ్చు, ఈ వివరణ ఆ ప్రాంతంలో రక్షణ లేకుండా, తరచూ సంచరిస్తూ, భయంతో, మందలుగా నివసించే జంతువులతో గొర్రెలను, గొర్రెపిల్లలను సరిపోల్చుతూ ఉంటుంది,
- సమీపంలో స్థానికంగా లేక జాతీయ బాషలో ఉన్న బైబిలు అనువాదంలో ఈ పదం అర్థం గురించి కూడా ఆలోచన చెయ్యాలి.
(చూడండి: ఆడగొర్రె, కాపరి)
బైబిలు రెఫరెన్సులు:
- 2 సమూయేలు 12:1-3
- ఎజ్రా 08:35-36
- యెషయా 66:3
- యిర్మియా 11:18-20
- యోహాను 01:29-36
- యోహాను 01:35-36
- లేవీకాండం 14:21-23
- లేవీకాండం 17:1-4
- లూకా 10:3-4
- ప్రకటన 15:3-4
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 05:07 అబ్రాహాము, ఇస్సాకు దహనబలి స్థలానికి వచ్చినప్పుడు, ఇస్సాకు అబ్రహాముతో, “తండ్రీ, నిప్పును, కట్టేలును ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది? అని అడిగాడు.
- 11:02 ఆయన యందు విశ్వసించిన వారిలో ప్రధమ సంతానాన్ని రక్షించే మార్గాన్ని దేవుడు ఏర్పాటుచేసాడు. ప్రతీ కుటుంబమూ ఒక పరిపూర్ణ గొర్రెపిల్ల ను లేక మేకను ఎంపిక చేసుకొని దానిని చంపాలి. * 24:06 మరుసటి రోజు, యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు వచ్చాడు. యోహాను ఆయనను చూచినప్పుడు, ఇలా అన్నాడు, “చూడండి! లోక పాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల ఇక్కడ ఉన్నాడు.
- 45:08 ఆయన చదివాడు, “వారు ఆయనను గొర్రెపిల్ల లాగా వధకు తీసుకుపోయారు, గొర్రె ఊరుకోన్నట్టే ఆయన నోరు తెరువలేదు.
- 48:08 అబ్రహాము తన కుమారుణ్ణి దహనబలిగా అర్పించమని చెప్పినప్పుడు, దేవుడు అభ్రహాము కుమారుడు ఇస్సాకుకు బదులు ఒక గొర్రె పిల్లను ఏర్పరచాడు, మనమందరం మన పాపముల నిమిత్తము చనిపోవలసిన వారం! అయితే మన స్థానంలో చనిపోవడానికి దేవుని గొర్రెపిల్ల, యేసును దేవుడు ఏర్పరచాడు.
- 48:09 దేవుడు ఐగుప్తు మీదకు చివరి తెగులును పంపినప్పుడు, ఇశ్రాయేలులోని ప్రతీ కుటుంబం ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్ల ను చంపి దాని రక్తాన్ని ద్వారబంధాల మీదా, దానికిరువైపులా చల్లాలని చెప్పాడు.
పదం సమాచారం:
- Strong's: H7716, G721, G2316
గోత్రం, గోత్రాలు, గిరిజన, గోత్రికులు
నిర్వచనం:
గోత్రం అంటే ఒకే పూర్వీకుని నుండి వచ్చిన వారు.
- గోత్రం సాధారణంగా ఒకే గోత్రం నుండి వచ్చిన వారికి ఒకే భాష, సంస్కృతి ఉంటాయి.
- పాత నిబంధనలో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పన్నెండు గోత్రాలుగా విభజించాడు. ప్రతి గోత్రం యాకోబు కుమారుడు లేక మనవడు నుండి వచ్చారు.
- గోత్రం అంటే జాతి కన్నా చిన్నడి. అయితే తెగకన్నా పెద్దది.
(చూడండి: తెగ, జాతి, జనాంగములు, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 సమూయేలు 10:17-19
- 2 రాజులు 17:16-18
- ఆది 25:13-16
- ఆది 49:16-18
- లూకా 02:36-38
పదం సమాచారం:
- Strong's: H523, H4294, H7625, H7626, G1429, G5443
గోనెపట్ట
నిర్వచనము:
గోనెపట్ట అనునది ముతక నేతగల, ఒంటె వెంట్రుకలనుండైన లేక మేక వెంట్రుకలనుండైన చేసిన గరుకు గరుకులుగా ఉన్నటువంటి ఒక విధమైన బట్ట.
- దీనినుండి చేయబడిన బట్టను ధరించుకొనిన వ్యక్తి చాలా అనానుకూలముగా ఉంటుంది. గోనెపట్టను విలాపమును, దుఃఖమును లేక తగ్గింపుతో కూడిన పశ్చాత్తాపమును చూపించుటకు ధరించుకొందురు.
- “గోనెపట్ట మరియు బూడిద” అనే ఈ మాట సర్వ సాధారణమైన మాట, ఇది సంప్రదాయముగా పశ్చాత్తాపమును మరియు దుఃఖమును వ్యక్తపరచుటకు సూచించబడియుండెను.
తర్జుమా సలహాలు:
- ఈ పదమును “ప్రాణుల వెంట్రుకలనుండి చేసిన ముతక బట్ట” లేక “మేక వెంట్రుకలనుండి చేసిన బట్టలు” లేక “గరుకు గరుకుగా ఉన్న దట్టమైన బట్ట” అని కూడా తర్జుమా చేయుదురు.
- ఈ పదమును తర్జుమా చేయుటకు వేరొక విధానములో “గరుకు గరుకుగా ఉన్నటువంటి విలాప వస్త్రాలు” అని కూడా చెప్పుదురు.
- “గోనెపట్టలొనూ మరియు బూడిదలోను కూర్చొనుట” అనే ఈ మాటను “బూడిదలో కూర్చొని, గోనెపట్టను ధరించుకొనుట ద్వారా విలాపమును మరియు తగ్గింపును చూపించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: బూడిద, ఒంటె, మేక, వినయపూర్వకమైన, దుఃఖించు, పశ్చాత్తాపపడు, సూచక క్రియ)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 సమూ.03:31-32
- ఆది.37:34-36
- యోవేలు.01:8-10
- యోనా.03:4-5
- లూకా.10:13-15
- మత్తయి.11:20-22
పదం సమాచారం:
ఘనత
నిర్వచనం:
“ఘనత” అనే పదం గొప్పతనాన్ని, మహిమను సూచిస్తుంది, తరచుగా ఒక రాజు లక్షణాలను గురించి మాట్లాడుతుంది.
- బైబిలులో, “ఘనత” అనే పదం తరచుగా సర్వలోకం మీద సర్వాదికారియైన దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఒక రాజును సంబోధించదానికి “మీ ఘనత” అని పలుకుతారు.
అనువాదం సూచనలు:
- ఈ పదాన్ని “రాజు గొప్పతనం” లేక “రాజరికపు మహిమ” అని అనువాదం చెయ్యవచ్చు.
- ”మీ ఘనత” అనే పదం “మీ హెచ్చింపు” లేక “మీ శ్రేష్ఠత” లేక స్థానిక భాషలలో ఒక పాలకుడిని సంబోధించే సహజ విధానాన్ని వినియోగించవచ్చు.
(చూడండి: రాజు)
బైబిలు రెఫరెన్సులు:
- 2 రాజులు 01:16-18
- దానియేలు 04:36-37
- యెషయా 02:9-11
- యూదా 01:24-25
- మీకా 05:4-5
పదం సమాచారం:
- Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G3168, G3172
చనిపోవడం, చనిపోయాక, మృత, ప్రమాదకరమైన, మృతస్థితి, మరణం, మరణాలు, మరణకరం
నిర్వచనం:
ఈ పదాన్ని శారీరిక, ఆత్మ సంబంధమైన మరణాలు రెండింటి కోసం ఉపయోగిస్తారు. శారీరికంగా, ఒక మనిషి భౌతికశరీరం సజీవంగా లేని స్థితిని సూచిస్తున్నది. ఆత్మ సంబంధమైన మరణం అనేది వారి పాపం మూలంగా పరిశుద్ధ దేవుని నుండి వారు వేరై పోవడాన్ని సూచిస్తున్నది.
1. శారీరిక మరణం
- "చనిపోవడం" అంటే ప్రాణం పోవడం. మరణం అనేది శారీరిక జీవానికి అంతం.
- ఒక వ్యక్తి ఆత్మ తన శరీరం విడిచిపోవడమే అతడు చనిపోవడం.
- ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు, శారీరిక మరణం ఈ లోకం లోకి వచ్చింది.
- "మరణం పాలు చేయడం" అంటే చంపడం, లేక ఎవరినైనా హత్యచెయ్యడం. ముఖ్యంగా ఒక రాజు లేక ఇతర అధిపతి ఎవరినైనా హతమార్చమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు.
2. ఆత్మ సంబంధమైన మరణం
- ఆత్మ సంబంధమైన మరణం అంటే ఒక వ్యక్తిదేవుని నుండి వేరై పోవడం.
- అతడు దేవునికి లోబడలేదు గనక ఆత్మ సంబంధంగా ఆదాము చనిపోయాడు. దేవునితో తన సంబంధం తెగిపోయింది. అతడు సిగ్గు పాలై దేవుని నుండి తన స్థితి దాచి పెట్టుకోడానికి ప్రయత్నించాడు.
- ఆదాము సంతతి అందరూ పాపులే. ఆత్మ సంబంధం గా మృతులే. మనం యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనలను మరలా ఆత్మ సంబంధంగా బ్రతికిస్తాడు.
అనువాదం సలహాలు:
- ఈ పదం అనువదించడంలో, లక్ష్య భాషలో మరణాన్ని సూచించే సాధారణమైన, సహజమైన పదం ఉపయోగించడం మంచిది.
- కొన్ని భాషల్లో "చనిపోవడం" అనే దాన్ని "నిర్జీవం" అని రాస్తారు. ఈ పదం "మృత" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "జీవం పోయిన” లేక “జీవం కోల్పోయిన” లేక “బ్రతికి లేని"
- అనేక భాషలు అలంకారికంగా మరణాన్ని వర్ణించడానికి “వెళ్లి పోయిన” మొదలైన మాటలు వాడతాయి. అయితే, బైబిల్లో సాధారణంగా ఉపయోగించే సూటియైన పదం వాడడం మంచిది.
- బైబిల్లో, శారీరిక జీవ మరణాలను ఆత్మ సంబంధమైన జీవం, మరణంతో తరచుగా పోల్చారు. శారీరిక మరణం, ఆత్మ సంబంధమైన మరణం ఈ రెంటినీ సూచించే పదాన్ని వాడితే మంచిది. అనువాదం లో ఇది ప్రాముఖ్యం.
- కొన్ని భాషల్లో ఇలాటి అర్థం రావడం అవసరం అయితే “ఆత్మ సంబంధమైన మరణం" అని ప్రత్యేకంగా వాడడం మంచిది. కొందరు అనువాదకులు ఆత్మ సంబంధమైన మరణం అనే దానికి భిన్నంగా చెప్పవలసి వస్తే "శారీరిక మరణం" అని రాస్తారు.
- "మృత" అనే మాట మనుషులు చనిపోయాక ఉండే స్థితిని చూపే మాములు విశేషణం. కొన్ని భాషలు దీన్ని "మృతులు” అని గానీ లేక “మనుషులు చనిపోయాక" అని గానీ అనువదించడం చేస్తారు. (చూడండి: nominal adjective
- "మరణం విధించడం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చంపడం” లేక “హత్య” లేక “మరణశిక్ష అమలు" అని కూడా వాడవచ్చు.
(చూడండి: విశ్వసించు, విశ్వాసం, జీవం, ఆత్మ)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 15:20-21
- 1 తెస్స 04:16-18
- అపో. కా. 10:42-43
- అపో. కా. 14:19-20
- కొలస్సి 02:13-15
- కొలస్సి 02:20-23
- ఆది 02:15-17
- ఆది 34:27-29
- మత్తయి 16:27-28
- రోమా 05:10-11
- రోమా 05:12-13
- రోమా 06:10-11
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 01:11 దేవుడు ఆదాముకు చెప్పాడు, అతడు తోటలో ఏ చెట్టు పండు అయినా తినవచ్చు, మంచిచెడు వివేచన ఇచ్చే చెట్టు ఫలం తప్ప. అతడు ఆ చెట్టు పండు తింటే అతడు చనిపోతాడు.
- 02:11 "తరువాత నీవు చనిపోతావు., నీ శరీరం తిరిగి మట్టికి చేరుకుంటుంది."
- 07:10 తరువాత ఇస్సాకు చనిపోయాక, యాకోబు, ఏశావు పాతిపెట్టారు.
- 37:05 "యేసు ఇలా అన్నాడు, "నేనే పునరుత్థానం, జీవం. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు అతడు చనిపోవయినా జీవిస్తూ ఉంటారు. నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఎన్నటికీ చనిపోవడం ఉండదు."
- 40:08 తన మరణం ద్వారా మనుషులు దేవుని చెంతకు వచ్చే దారి ఏర్పరచాడు.
- 43:07 "యేసు చనిపోయినా, దేవుడు ఆయన్ను చావు నుండి లేపాడు."
- 48:02 ఎందుకంటే వారు పాపం చేసినప్పుడు, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాధుల పాలై చనిపోతారు.
పదం సమాచారం:
- Strong's: H6, H1478, H1826, H1934, H2491, H4191, H4192, H4193, H4194, H4463, H5038, H5315, H6297, H6757, H7496, H7523, H8045, H8546, H8552, G336, G337, G520, G581, G599, G615, G622, G684, G1634, G1935, G2079, G2253, G2286, G2287, G2288, G2289, G2348, G2837, G2966, G3498, G3499, G3500, G4430, G4880, G4881, G5053, G5054
చీకటి
నిర్వచనం:
ఈ పదం "చీకటి" అంటే అక్షరాలా వెలుగులేని స్థితి. అలంకారికంగా ఈ పదానికి అనేక అర్థాలున్నాయి.
- రూపకాలంకారంగా, "చీకటి" అంటే "అపవిత్రత” లేక “దుష్టత్వం” లేక “ఆత్మ సంబంధమైన అంధత్వం."
- పాపానికి నైతిక దుష్టత్వానికి సంబంధించిన వాటిని ఇది సూచిస్తున్నది.
- "చీకటి ఆధిపత్యం" అనే మాట సాతాను దుష్ట పరిపాలనను సూచిస్తున్నది.
- "చీకటి" అనే పదాన్ని రూపకాలంకారంగా మరణం కోసం ఉపయోగిస్తారు. (చూడండి: రూపకాలంకారంగా
- దేవుణ్ణి ఎరగని వారు "చీకటిలో జీవిస్తున్నారు," అంటే వారు నీతిని అర్థం చేసుకోలేరు, పాటించలేరు.
- దేవుడు వెలుగు (నీతి). చీకటి (దుష్టత్వం) వెలుగును ఓడించలేదు.
- ఇది కొన్ని సార్లు దేవుణ్ణి తిరస్కరించిన వారుండే శిక్షాస్థలాన్నిసూచిస్తుంది. "బయటి చీకటి."
అనువాదం సలహాలు:
- ఈ పదాన్ని అక్షరాలా అనువదించడం మంచిది. వెలుగు లేని స్థితిని ఇది సూచిస్తున్నది. ఈ పదం ఒక గదిలోని చీకటిని, లేక వెలుతురూ లేని సమయంలో ఉండే చీకటిని సూచిస్తున్నది.
- అలంకారికంగా ఉపయోగం విషయానికి వస్తే చీకటికి, వెలుగుకు తేడా ప్రాముఖ్యతను గుర్తించి దుర్మార్గత, కపటాలకు, మంచితనం, సత్యాలకు అంతరం చూపడానికి ఈ పదం వాడతారు.
- సందర్భాన్ని బట్టి, అనువదించడంలో ఇతర పద్ధతులు "రాత్రి చీకటి" ("పగటి వెలుగు") లేక "రాత్రి సమయంలో లాగా ఏదీ కనబడ కుండా” లేక “చీకటి స్థలం వలె దుష్టత్వం.”
(చూడండి: చెడిన, ఆధిపత్యం, రాజ్యము, వెలుగు, విమోచించు, నీతిగల)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 01:5-7
- 1 యోహాను 02:7-8
- 1 తెస్స 05:4-7
- 2 సమూయేలు 22:10-12
- కొలస్సి 01:13-14
- యెషయా 05:29-30
- యిర్మీయా 13:15-17
- యెహోషువా 24:7
- మత్తయి 08:11-13
పదం సమాచారం:
- Strong's: H652, H653, H2816, H2821, H2822, H2825, H3990, H3991, H4285, H5890, H6205, G2217, G4652, G4653, G4655, G4656
చుట్ట, చుట్టలు
నిర్వచనము:
పురాతన కాలములో చుట్ట అనుదానిని చర్మముతోగాని లేక ప్యాపిరస్ అనే వాటిని పొడువుగా చేసికొని, వాటి మీద వ్రాసుకొని, వాటిని చుట్టగా చుట్టుకొని పుస్తకముగా వాడుకొనేవారు.
- చుట్ట మీద వ్రాసిన తరువాత, దానిలో ఉన్నదానిని చదువుకొనిన తరువాత, ప్రజలు దానికి ఇరువైపుల కట్టెలను కట్టి ఉపయోగించుట ద్వారా చుట్టేవారు.
- చుట్టలను లేఖనాలకొరకు మరియు న్యాయ సంబంధమైన పత్రాలకొరకు ఉపయోగించేవారు.
- కొన్నిమార్లు ఒక రాయభారి ద్వారా అందించబడే చుట్టలకు మైనము ద్వారా ముద్ర వేసేవారు. చుట్టను తీసుకొనేటప్పుడు ఆ చుట్ట మీద మైనము ఇంకా ఉన్నట్లయితే, ఆ చుట్టను ఎవరూ తెరవలేదని లేక దాని మీద ఇతర వేరే సమాచారము వ్రాయలేదని మరియు దాని ముద్ర ఇంకను ఉందని పొందుకొనే వ్యక్తి తెలుసుకుంటాడు.
- హెబ్రీ లేఖనములను కలిగియున్న చుట్టలను తెరచి సమాజ మందిరములలో గట్టిగా చదివేవారు.
(ఈ పదములను కూడా చూడండి: ముద్ర, సమాజ మందిరము, దేవుని వాక్యము)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- యిర్మియా.29:1-3
- లూకా.04:16-17
- సంఖ్యా.21:14-15
- ప్రకటన.05:1-2
పదం సమాచారం:
- Strong's: H4039, H4040, H5612, G974, G975
చూడు, చూచును, చూచెను, చూచుట, కాపలాదారుడు, కాపలాదారులు, చూడదగినంత
నిర్వచనము:
“చూడు” అనే పదమునకు దేనినైనా చాలా దగ్గరగాను మరియు జాగ్రత్తగాను చూచుట అని అర్థము. దీనికి అనేకమైన అలంకారిక అర్థములు కలవు. “కాపలాదారుడు” అనగా ఒక పట్టణములోని ప్రజలకు ఎటువంటి అపాయము కలుగకుండ లేక ఆపద సంభవించకుండ ఉండునట్లు వారిని కాయుటకు ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఆ పట్టణమంతా తిరుగుతూ చేసే ఉద్యోగమైయున్నది.
- “నీ జీవితమును మరియు సిద్ధాంతమును చాలా దగ్గరిగా చూచుకొనుము” అనే ఆజ్ఞకు అర్థము ఏమనగా జ్ఞానముగా చాలా జాగ్రత్తగా జీవించు మరియు తప్పుడు బోధనలను ఏ మాత్రము నమ్మవద్దు అని దాని అర్థము.
- “మెలకువ కలిగియుండు” అనగా అపాయమును లేక హానికరమైన ప్రభావము ఎంతమాత్రమూ పడకుండా జాగ్రత్తగా ఉండు అని అర్థము.
- “చూడు” లేక “చూస్తూ ఉండు” అనగా ఎల్లప్పుడూ పాపమునకు మరియు దుష్టత్వమునకు విరుద్ధముగా పోరాడుటకు జాగ్రత్తగా ఉండు మరియు భద్రముగా ఉండు అని అర్థము. “సిద్ధముగా ఉండు” అనే అర్థము కూడా వస్తుంది.
- “కాపలా కాస్తూ ఉండడం” లేక “చాలా దగ్గరిగా చూడడం” అనే ఈ మాటలకు ఎవరినైనా లేదా దేనినైనా కాయడం, సంరక్షించడం లేక జాగ్రత్త తీసుకోవడం అని అర్థము.
- “చూడు” అనే పదమును తర్జుమా చేయు ఇతర విధానములలో “ఎక్కువ శ్రద్ధకలిగియుండు” లేక “శ్రద్ధాసక్తుడవైయుండు” లేక “జాగ్రత్తగా కాపలా కాయు” లేక “భద్రత కలిగియుండు” అని కూడా ఉపయోగించి తర్జుమా చేయుదురు.
- “కాపలాదారుడు” అనే పదానికి “కావలివాడు” లేక “కాపుకాయువాడు” అని కూడా ఉపయోగించుదురు.
పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంధ వాక్యములు:
- 1 తెస్స.05:4-7
- హెబ్రీ.13:15-17
- యిర్మియా.31:4-6
- మార్కు.08:14-15
- మార్కు.13:33-34
- మత్తయి.25:10-13
పదం సమాచారం:
- Strong's: H821, H2370, H4929, H4931, H5027, H5341, H5894, H6486, H6822, H6836, H6974, H7462, H7789, H7919, H8104, H8108, H8245, G69, G70, G991, G1127, G1492, G2334, G2892, G3525, G3708, G3906, G4337, G4648, G5083, G5438
చెట్టు, చెట్లు, నాటబడెను, నాటుట, నాటిన, తిరిగి నాటుట, మరియొక చోట నాటుట, విత్తు, విత్తును, విత్తబడెను, విత్తుట, విత్తుట
నిర్వచనము:
“చెట్టు” అనగా సాధారణముగా నేల మీద అంటుకట్టబడి పెరిగే దేనినైనా చెట్టు అని అందురు.
“విత్తు” అనగా చెట్లు పెరుగుట కొరకు నేలలో విత్తనములను నాటుట అని అర్థము.
“విత్తువాడు” అనగా విత్తనములను విత్తే వ్యక్తి లేక నాటే వ్యక్తి అని అర్థము.
- విత్తుట లేక నాటుట అనేవి విభిన్నముగా ఉంటాయి, అయితే అందులో ఒక విధానము ఏమనగా చేతినిండా విత్తనములు తీసుకొని, వాటిని పొలములో వెదజల్లుట అని అర్థము.
- విత్తనములు నాటుటకొరకు ఇంకొక విధానము ఏమనగా పొలములో నేల మీద రంధ్రములను చేసి, ఆ రంధ్రములలోనికి విత్తనములను వేయడం.
- “విత్తు” అనే పదమును అలంకారికముగా కూడా వాడుదురు, ఉదాహరణకు, “మనిషి ఏమి విత్తునో దానినే కోయును” . ఈ మాటకు ఒక వ్యక్తి చెడును చేస్తే, డానికి ఫలితముగా అనానుకూలతలను ఎదుర్కొనును; ఒకవేళ ఒక వ్యక్తి మంచి చేస్తే, అతను అనుకూలమైన ఫలితమును పొందుకొనును అని అర్థము.
తర్జుమా సలహాలు:
- “విత్తు” అనే పదమును “నాటు” అని కూడా తర్జుమా చేయుదురు. తర్జుమా చేయబడిన ఈ పదము విత్తనములను నాటుట అనే అర్థము వచ్చునట్లు కూడా జాగ్రత్తపడండి.
- “విత్తువాడు” అనే పదమును తర్జుమా చేయు అనేక విధానములలో “నాటువాడు” లేక “రైతు” లేక “విత్తనములను నాటే వ్యక్తి” అనే మాటలను కూడా వినియోగించుదురు.
- ఆంగ్లములో “విత్తు” అనే పదమును విత్తనములను నాటుటను గూర్చి మాత్రమె ఉపయోగిస్తారు, అయితే ఆంగ్లములో “నాటు” అనే పదమును విత్తములను నాటుటను గూర్చి మరియు పెద్ద పెద్ద చెట్లను నాటుటను గూర్చియు ఉపయోగిస్తారు. ఇతర భాషలు కూడా నాటబడిన దానిని ఆధారము చేసికొని ఇతర విభిన్న పదాలను ఉపయోగించవచ్చు.
- “ఒక వ్యక్తి తాను ఏది విత్తుతాడో దానినే కోయును” అనే ఈ మాటను “ఒక చెట్టు ఆ చెట్టుకు సంబంధించిన విత్తనములను ఏ విధంగా ఇస్తుందో, అదేవిధముగా ఒక వ్యక్తి మంచి క్రియలు కూడా మంచి ఫలితాన్ని తీసుకొని వస్తాయి మరియు ఆ వ్యక్తి చెడు క్రియలు చేసినట్లయితే చెడ్డ ఫలితాన్ని తీసుకొని వస్తాయి” అని కూడా తర్జుమా చేయవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: దుష్టత్వం, మంచిది, కోయు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- గలతీ.06:6-8
- లూకా.08:4-6
- మత్తయి.06:25-26
- మత్తయి.13:3-6
- మత్తయి.13:18-19
- మత్తయి.25:24-25
పదం సమాచారం:
- Strong's: H2221, H2232, H2233, H2236, H4218, H4302, H5193, H7971, H8362, G4687, G4703, G5300, G5452 , G6037
చెప్పు, చెప్పులు
నిర్వచనము:
చెప్పు అనగా మడిమకు లేక పాదముకు చుట్టూ అతుక్కొనునట్లు చేసే వారల ద్వారా పాదముకు రక్షగా తయారు చేయబడిన సాధారణమైన పాదరక్ష అని చెప్పవచ్చును. చెప్పులను స్త్రీ పురుషులు ఇరువురు ధరించుకొందురు.
- ఆస్తిపాస్తులులాంటివి అమ్ముచున్నప్పుడు న్యాయబద్ధమైన వ్యవహారమును నిశ్చయించుటకు కొన్నిమార్లు చెప్పును ఉపయోగించేవారు: ఒక మనిషి తన చెప్పును తీసికొని ఇంకొక వ్యక్తికి ఇచ్చేవాడు.
- ఒకరు తమ చెప్పులను గాని లేక బూట్లనుగాని ఇప్పడము అనునది కూడా గౌరవమునకు సూచనయైయున్నది, ప్రత్యేకముగా దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకోరు.
- నేను యేసు చెప్పుల వారను ఇప్పుటకైనను యోగ్యుడను కాను అని యోహాను చెప్పెను, ఇటువంటి పని చాలా తక్కువగా ఎంచే బానిసలు లేక సేవకులు చేసేవారు.
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.07:33-34
- ద్వితీ.25:9-10
- యోహాను.01:26-28
- యెహో.05:14-15
- మార్కు.06:7-9
పదం సమాచారం:
- Strong's: H5274, H5275, H8288, G4547, G5266
చెయ్యి, చేతులు, చేతితో, చేతులు ఉంచి, తన చెయ్యి ఉంచి, కుడి చెయ్యి, కుడి చేతులు, చేతి నుంచి
నిర్వచనం:
బైబిల్లో అలంకారికంగా "చెయ్యి " అనే మాటను అనేక రకాలుగా ఉపయోగిస్తారు:
- దేన్నైనా ఎవరినైనా ఒక వ్యక్తి చేతుల్లో పెట్టడం.
- "చెయ్యి" ని తరచుగా దేవుని శక్తి, చర్య వంటి వాటికోసం ఉపయోగిస్తారు. దేవుడు "నా చెయ్యి వీటన్నిటినీ చెయ్యలేదా?"
- "అప్పగించడం” లేక “ఒకరి చేతిలో పెట్టడం" అంటే ఎవరినైనా మరొకరి అదుపులో శక్తి కింద ఉంచడం.
- అలంకారికంగా "చెయ్యి " అనే మాటను ఇలా కూడా వాడతారు:
- "చేతులు వేసి" అంటే "హాని" చెయ్యడం.
- "చేతినుండి రక్షించు" అంటే ఎవరినైనా వేరొకరి వల్ల హాని కలగకుండా కాపాడు.
- "కుడి చేతి వైపు" అనే హోదా "కుడి పక్క.”
- “చేతితో" అంటే ఎవరిమీదనైనా చర్య తీసుకోవడం. ఉదాహరణకు, "ప్రభువు చేతితో" అంటే ప్రభువు దేన్నైనా సంభవించేలా చేయడం.
- ఎవరిమీదనైనా చేతులు ఉంచడం అంటే ఆ వ్యక్తిపై ఆశీర్వాదం పలకడం.
- "చేతులు ఉంచడం" అంటే చెయ్యి ఒక వ్యక్తిపై ఉంచి అతన్ని దేవుని సేవకు ప్రతిష్టించు, లేక ఆ వ్యక్తి స్వస్థతకై ప్రార్థించు.
- పౌలు "నా చేతితో రాసిన” అంటే ఉత్తరంలో ఆ భాగం అక్షరాలా తాను స్వంతగా రాశాను అని. ఎవరికైనా చెబితే రాయడం కాదు.
అనువాదం సలహాలు
- ఈ మాటలు ఇతర అలంకారిక ప్రయోగాలూ ఇదే అర్థం ఇచ్చే ఇతర అలంకారిక పదాలు ఉపయోగించి అనువదించ వచ్చు. లేక అక్షరార్థంగా భాష అర్థం వచ్చేలా నేరుగా అనువదించ వచ్చు (పై ఉదాహరణలు చూడండి).
- " పుస్తకం చుట్టఅందించడం" అనే మాట ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అతనికి పుస్తకం చుట్ట ఇచ్చాడు” లేక “పుస్తకం చుట్ట తన చేతిలో పెట్టాడు." అతనికి మొత్తంగా ఇవ్వలేదు, కేవలం తాత్కాలికంగా అప్పటికి మాత్రం ఇచ్చారు.
- "చెయ్యి" అనేది ఆ వ్యక్తిని సూచిస్తున్నది. "దేవుని చెయ్యి ఆ పని చేసింది" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు చేశాడు."
- "వారి శత్రువుల చేతులకు అప్పగించిన” లేక “వారి శత్రువుల వశం చేసిన," ఇలా అనువదించ వచ్చు, "వారి శత్రువులు వారిని ఓడించేలా అనుమతించడం” లేక “వారి శత్రువులు వారిని పట్టుకునేలా చెయ్యడం” లేక “వారి శత్రువులు వారిపై అదుపు సాధించేలా."
- "చేతితో చనిపోవడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అతని చేతుల్లో హతం కావడం."
- "కుడి చేతిపై" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కుడి వైపున."
- యేసు "దేవుని కుడి వైపు కూర్చోవడం," ఒక ఉన్నత ప్రతిష్ట, సమాన అధికారం, అనే అర్థంతో ఉపయోగిస్తారు. లేక కొద్దిగా వివరణ ఇవ్వవచ్చు: "దేవుని కుడి వైపు, అత్యున్నత అధికార స్థానంలో."
(చూడండి: ప్రత్యర్థి, ఆశీర్వదించు, బందీ, ప్రతిష్ట, శక్తి)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 07:22-25
- అపో. కా. 08:14-17
- అపో. కా. 11:19-21
- ఆది 09:5-7
- ఆది 14:19-20
- యోహాను 03:34-36
- మార్కు 07:31-32
- మత్తయి 06:3-4
పదం సమాచారం:
- Strong's: H405, H2026, H2651, H2947, H2948, H3027, H3028, H3225, H3231, H3233, H3709, H7126, H7138, H8040, H8042, H8168, G710, G1188, G1448, G1451, G1764, G2021, G2092, G2176, G2902, G4084, G4474, G4475, G5495, G5496, G5497
చెర, ఖైది, ఖైదీలు, చెరలు, చెరలో వేయుట, బంధించుట, బంధించబడెను, ఖైదు, నిర్బంధనము చేయుట
నిర్వచనము:
“చెర” అనే పదము నేరస్తులు తాము చేసిన నేరముల కొరకు శిక్షగా వారిని ఉంచే ఒక స్థలమును సూచించును.
“ఖైది” అనే ఈ పదము చెరలో ఉంచిన వ్యక్తిని సూచించును.
- న్యాయ విచారణలో తీర్పు కొరకై ఎదురుచూచునప్పుడు చెరలో ఒక వ్యక్తిని ఉంచియుందురు.
- “బంధించబడియుండుట” అనే పదము “చెరలో ఉంచుట” లేక “చెరసాలలో పెట్టుట” అని అర్థమిచ్చును.
- అనేకమంది ప్రవక్తలు మరియు ఇతర దేవుని సేవకులు ఎటువంటి తప్పులు చేయనప్పటికీ వారిని చెరసాలలో ఉంచిరి.
తర్జుమా సలహాలు:
- “చెరసాల” అనే పదమునకు “జైలు” మరొక పర్యాయము కలదు.
- ఈ పదమును “బందేకాన” అని కూడా తర్జుమా చేయుదురు, ఈ పదమును సహజముగా ఒక వ్యక్తిని బహుశః నేల క్రింది భవనములోగాని లేక ఒక భవనము యొక్క ముఖ్య స్థలములోగాని బంధించుటను సూచిస్తుంది.
- “ఖైదీలు” అనే పదము ఒక శత్రువు ద్వారా చెరపట్టబడిన ప్రజలను మరియు సహజముగా వీరికి ఇష్టములేని స్థలములో ఉంచుటను సూచిస్తుంది. ఈ అర్థమును ఇంకొక విధానములో మనము తర్జుమా చేయాలంటే “చెరలు” అని కూడా చెప్పవచ్చును.
- “బంధించబడుట” అను పదమును ఇంకొక విధానములో “ఖైదీగా పట్టబదుట” లేక “చెరలో ఉంచుట” లేక “చెరగొనిపోవుట” అని కూడా చెప్పవచ్చును.
(ఈ పదమును కూడా చూడండి: బందీ)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.25:4-5
- ఎఫెసీ.04:1-3
- లూకా.12:57-59
- లూకా.22:33-34
- మార్కు.06:16-17
- మత్తయి.05:25-26
- మత్తయి.14:3-5
- మత్తయి.25:34-36
పదం సమాచారం:
- Strong's: H612, H613, H615, H616, H631, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6115, H6495, H7617, H7622, H7628, G1198, G1199, G1200, G1201, G1202, G1210, G2252, G3612, G4788, G4869, G5084, G5438, G5439
జన్మ హక్కు
నిర్వచనం:
ఈ పదం "జన్మ హక్కు"అనేది బైబిల్లో ఒక కుటుంబంలో మొదట పుట్టిన కుమారునికి సంక్రమించే ప్రతిష్ట, కుటుంబం పేరు, సంపదలను సూచిస్తుంది.
- మొదట పుట్టిన కుమారుని జన్మ హక్కు ప్రకారం తండ్రి వారసత్వ ఆస్తిలో రెండు పాళ్ళు వస్తుంది.
- రాజు పెద్దకొడుక్కి సాధారణంగా తన తండ్రి చనిపోయాక పరిపాలన చేసే జన్మ హక్కు ఉంటుంది.
- ఏశావు తన జన్మ హక్కును తన తమ్ముడు యాకోబుకు అమ్మి వేశాడు. మొదట పుట్టిన ఏశావు వారసత్వంగా పొందే ఆశీర్వాదం యాకోబు పొందాడు.
- జన్మ హక్కులో వంశ చరిత్ర మొదట పుట్టిన కుమారుని కుటుంబం ద్వారా కొనసాగే ప్రతిష్ట ఇమిడి ఉంది.
అనువాదం సలహాలు:
- "జన్మ హక్కు"అనే దాన్ని అనువదించడం. "ఆస్తి విషయంలో మొదట పుట్టిన కుమారునికి ఉన్న హక్కు” లేక “కుటుంబం ప్రతిష్ట” లేక “మొదట పుట్టినవాడి ఆధిక్యత వారసత్వ సంపద."
(చూడండి: మొదట పుట్టిన, వారసత్వముగా పొందు, వారసుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1దిన 05:1-3
- ఆది 25:31-34
- ఆది 43:32-34
- హెబ్రీ 12:14-17
పదం సమాచారం:
జాతి, జాతులు
నిర్వచనం:
ఒక జాతి అంటే ఏదైనా ఒక ప్రభుత్వ రూపం చేత పాలించబడే అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు. దేశంలోని ప్రజలందరూ తరచుగా ఒకే పూర్వికులను కలిగియుంటారు, ఒకే స్వజాతీయతను కలిగియుంటారు. ఒక “జాతి” సాధారణంగా చక్కగా నిర్వచించిన సంస్కృతినీ, రాష్ట్రీయ పరిధులను కలిగి యుంటుంది.
- బైబిలులో ఒక “జాతి” (ఐగుప్తు లేక ఐతియోపియా లాంటి) దేశంగా ఉండవచ్చు, అయితే తరచుగా ప్రత్యేకించి బహువచనంలో వినియోగించినప్పుడు ఇది సార్వజనికంగానూ, ప్రజా గుంపును సూచించేదిగానూ ఉంటుంది. సందర్భాన్ని పరీక్షించడం ప్రాముఖ్యం.
- బైబిలులోని జాతులలో ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు, సిరియనులు, బాబులోనీయులు, కనానీయులు, రోంనులు, గ్రీసుదేశీయులు మొదలైనవారు ఉన్నారు.
- కొన్నిసార్లు “జాతి” అనే పదం ఒక గుంపు ప్రజల పితరుడిని సూచించడానికి రూపకాలంకారంగా వినియోగించబడుతుంది, రిబ్కాకు బిడ్డలు కలుగక ముందు ఆమె గర్భంలో ఒకరితో ఒకరు పోట్లాడుకొనే రెండు “జాతులు” ఉన్నారని దేవుడు చెప్పాదమలో మనం దీనిని చూస్తాం. దీనిని “రెండు జాతుల సంష్టాపకులు” లేక “రెండు గుంపుల పితరులు” అని అనువదించవచ్చు. “జాతి” అనే పదం యొక్క అనువాదం కొన్నిసార్లు “అన్యజనులు” లేక “యెహోవాను పూజించని ప్రజలను” గురించి సూచిస్తుంది. సందర్భం దాని అర్థాన్ని స్పష్టం చేస్తుంది.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, “జాతి” అనే పదాన్ని “ప్రజా గుంపు” లేక “ప్రజలు” లేక “దేశం” అని అనువదించవచ్చు.
- ”జాతి” అనే పదం కోసం భాషలో మిగిలిన పదాలన్నిటికీ భిన్నంగా ఉండే పదం ఉంటే, ప్రతీ సందర్భంలో ఆ పదం సహజంగానూ, ఖచ్చితంగానూ ఉన్నంతవరకూ బైబిలు భాగంలో ప్రతీసారీ వినియోగించవచ్చు.
- ”జాతులు” అనే బహువచన పదాన్ని “ప్రజా గుంపులు” అని అనువదించవచ్చు.
- కొన్ని సందర్భాలలో, ఈ పదాన్ని “అన్యజనులు” లేక “యూదేతరులు” అని అనువదించవచ్చు.
(చూడండి: అస్సిరియా, బబులోను, కనాను, యూదేతరుడు, గ్రీకు, జనాంగములు, ఫిలిష్టియులు, రోమా)
బైబిలు రెఫరెన్సులు:
- 1 దినవృత్తాంతములు 14:15-17
- 2 దినవృత్తాంతములు 15:6-7
- 2 రాజులు 17:11-12
- అపొస్తలులకార్యములు 02:5-7
- అపొస్తలులకార్యములు 13:19-20
- అపొస్తలులకార్యములు 17:26-27
- అపొస్తలులకార్యములు 26:4-5
- దానియేలు 03:3-5
- ఆదికాండం 10:2-5
- ఆదికాండం 27:29
- ఆదికాండం 35:11-13
- ఆదికాండం 49:10
- లూకా 07:2-5
- మార్కు 13:7-8
- మత్తయి 21:43-44
- రోమా 04:16-17
పదం సమాచారం:
- Strong's: H249, H523, H524, H776, H1471, H3816, H4940, H5971, G246, G1074, G1085, G1484
జీవం, జీవించు, జీవముతో ఉన్న, సజీవ
నిర్వచనం:
"జీవం" పదం భౌతికంగా చనిపోయి ఉండడానికి వ్యతిరేకంగా భౌతికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది.
1 శారీరక (భౌతిక) జీవం
- ఒక "జీవం" పదం "ఒక జీవితం కాపాడబడింది" లో ఉన్నట్టుగా ఒక వ్యక్తిగత జీవితాన్ని కూడా సూచిస్తుంది.
- కొన్నిసార్లు “జీవం” పదం “అతని జీవితం ఆనందభరితంగా ఉంది” లో ఉన్నట్టుగా జీవిస్తున్న అనుభవాన్ని సూచిస్తుంది.
- “అతని జీవిత అంతం” అనే వాక్యంలో ఉన్నట్టుగా ఇది ఒక వ్యక్తి జీవిత కాలపరిమితిని కూడా సూచిస్తుంది.
- ”జీవించడం” పదం “మా అమ్మ ఇంకా జీవించే ఉంది” లో ఉన్నట్టుగా శారీరికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది. “వారు పట్టణంలో నివసిస్తున్నారు”లో ఉన్నట్టుగా ఒక చోట నివసిస్తున్నారు అని సూచిస్తుంది.
- బైబిలులో “జీవం” అనే అంశం “మరణం” అంశాన్ని తరుచుగా విభేదిస్తుంది.
2 శాశ్వత జీవం
- ఒక వ్యక్తి యేసు నందు విశ్వాసముంచినప్పుడు శాశ్వత జీవాన్ని కలిగియుంటాడు, దేవుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ జీవించడం ద్వారా పరివర్తన చెందిన జీవితాన్ని ఇస్తాడు.
- శాశ్వత జీవానికి వ్యతిరేక పదం శాశ్వత మరణం, అంటే దేవుని నుండి వేరైపోవడం, శాశ్వత శిక్షను అనుభవించడం.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, “జీవం” పదం “ఉనికి” లేదా “వ్యక్తి” లేదా “ప్రాణం" లేదా జీవి" లేదా "అనుభవం" అని అనువదించబడవచ్చు.
- ”జీవించడం” పదం “నివసించడం” లేదా లేక “ఉండడం” లేక “ఉనికిలో ఉండడం” అని అనువదించబడవచ్చు.
- “జీవిత అంతం” అనే వాక్యం "అతడు జీవించడం నిలిపివేసినపుడు” అని అనువదించబడవచ్చు.
- ”వారి జీవితాలు ఉండనిచ్చారు" అనే వాక్యం “వారు జీవించడానికి అనుమతించారు” లేదా "వారిని చంపలేదు" అని అనువదించబడవచ్చు.
- ”వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు” అనే వాక్యం “వారు తమని తాము ప్రమాదంలో ఉంచుకొన్నారు” లేదా “తమను చంపివెయ్యగల ఒక కార్యాన్ని చేసారు” అని అనువదించబడవచ్చు.
- శాశ్వత జీవం గురించి బైబిలు చెపుతున్నప్పుడు, “జీవం” పదం “శాశ్వత జీవం” లేదా "దేవుడు మన ఆత్మలలో మనలను సజీవంగా చేస్తున్నాడు" లేదా "దేవుని ఆత్మ చేత నూతన జీవితం" లేదా "మన అంతరంగంలో సజీవం చెయ్యబడడం" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, “జీవాన్ని ఇవ్వడం” అనే వాక్యం “జీవించేలా చెయ్యడం" లేదా "శాశ్వత జీవం ఇవ్వడం" లేదా "శాశ్వతంగా జీవించేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
(చూడండి: చనిపోవడం, నిత్యత్వం)
బైబిలు రెఫరెన్సులు:
- 2 పేతురు 01:03
- అపొ.కా. 10:42
- ఆది. 02:07
- ఆది. 07:22
- హెబ్రీ 10:20
- యిర్మియా 44:02
- యోహాను 01:04
- న్యాయా. 02:18
- లూకా 12:23
- మత్తయి 07:14
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- 01:10 కనుక దేవుడు నేల మట్టిని తీసుకొని మానవుణ్ణి చేసాడు, అతనిలో జీవాన్ని ఊదాడు.
- 03:01 చాలా కాలం తరువాత లోకంలో అనేకమంది ప్రజలు జీవిస్తూ వచ్చారు.
- 08:01 యోసేపు సోదరులు తమ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, యోసేపు ఇంకా సజీవం గా ఉన్నాడని తమ తండ్రితో చెప్పారు. అతడు మిక్కిలి సంతోషించాడు.
- 17:0 9 అయితే అతని (దావీదు)జీవితం అంతంలో దేవుని యెదుట భయంకర పాపం చేసాడు.
- 27:01 ఒక రోజు యూదా ధర్మశాస్త్ర ప్రవీణుడు ఆయనను శోధించాలని యేసునొద్దకు వచ్చాడు., “బోధకుడూ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.
- 35:05”పునరుద్దానమునూ, జీవమునూ నేనే” అని యేసు జవాబిచ్చాడు.
- 44:05 “యేసును చంపమని రోమా అధిపతికి మీరే చెప్పారు. జీవాధి పతిని మీరే చంపారు, అయితే దేవుడు ఆయనను మృతులలోనుండి లేపాడు.
పదం సమాచారం:
- Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590
జీవి, జీవులు
నిర్వచనం:
"జీవి" అనే పదం దేవుడు సృష్టించిన ప్రాణం గల మానవులను, జంతువులను సూచిస్తున్నది.
- ప్రవక్త యెహెజ్కేలు తన దర్శనంలో దేవుని మహిమను వర్ణించిన "ప్రాణులను" చూశాడు. అవేమిటో అతనికి తెలియక వాటికి అతడు సాధారణ నామాలు ఇచ్చాడు.
- గమనించండి, "సృష్టి" అనే పదానికి వివిధ అర్థాలు ఉన్నాయి. ప్రతిదాన్నీ దేవుడు సృష్టించాడు ప్రాణం ఉన్నవీ, లేనివీ దేవుడే చేశాడు.(నేల, నీరు, నక్షత్రాలు మొ). ఈ పదం "జీవి" అనే దానిలో ప్రాణం గలవి మాత్రమే ఉన్నాయి.
అనువాదం సలహాలు
- సందర్భాన్ని బట్టి, "జీవి" నిఇలా అనువదించ వచ్చు, "ప్రాణి” లేక “జీవం గలది” లేక “సృష్టించ బడినది."
- బహువచనం, "జీవులు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రాణులన్నీ” లేక “మనుషులు, జంతువులు” లేక “జంతువులు” లేక “మానవులు."
(చూడండి: సృష్టించు)
బైబిల్ రిఫరెన్సులు:
- దానియేలు 04:10-12
- యెహెజ్కేలు 01:7-9
- యెహోషువా 10:28
- లేవీ 11:46-47
- ప్రకటన 19:3-4
పదం సమాచారం:
- Strong's: H255, H1320, H1321, H1870, H2119, H2416, H4639, H5315, H5971, H7430, H8318, G2226, G2937, G2938
జెబూలూను
వాస్తవాలు:
జెబూలూను, యాకోబు మరియు లేయాలకు పుట్టిన చివరి కుమారుడు మరియు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రముల పేరులలో ఇది కూడా ఒకటైయున్నది.
- ఇశ్రాయేలు గోత్రములలో జెబూలూను వారికి ఉప్పు సముద్రము యొక్క పడమటి భూభాగం నేరుగా ఇవ్వబడింది.
- కొన్నిసార్లు “జెబూలును” అనే పేరు ఇశ్రాయేలు గోత్రపువారు నివసించిన ప్రాంతం యొక్క పేరును సూచిస్తుంది.
(దీనిని చూడండి: ఇశ్రాయేలు, లేయా, ఉప్పు సముద్రము, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిలు వచనాలు:
- నిర్గమ. 01:1-5
- ఆది. 30:19-21
- యెషయా 09:1-2
- న్యాయ. 04:10
- మత్తయి 04:12-13
- మత్తయి 04:14-16
పదం సమాచారం:
- Strong's: H2074, H2075, G2194
డాలు, డాళ్ళు, డాలు చేపట్టబడెను
నిర్వచనము:
డాలు అనేది సైనికుడు యుద్ధములో తనను తాను శత్రువల ఆయుధమునుండి గాయపడకుండ సంరక్షించుకొనుటకు ఉపయోగించే వస్తువైయున్నది. ఒకరికి “డాలు” ఇచ్చుట అనగా హానినుండి ఆ వ్యక్తిని సంరక్షించుట అని అర్థము.
- డాళ్ళు ఎక్కువ మట్టుకు వృత్తాకారములో లేక అండాకారంలో ఉండేవి, వాటిని చర్మము, చెక్క, లేక లేక లోహమువంటివాటితో తయారు చేసేవారు. వాటిని చిల్చే వాటినుండి అనగా బాణము లేక ఖడ్గము అనేవాటినుండి కాపాడుటకు అవి దృఢమైనవిగా, గట్టిగా తయారు చేయుదురు.
- ఈ పదమును రూపకలంకారముగా ఉపయోగించుటలో, పరిశుద్ధ గ్రంథము దేవునిని తన ప్రజలను కాపాడే సంరక్షణ డాలు అని పిలుచుచున్నది. (చూడండి: రూపకలంకారము)
- పౌలు “విశ్వాసపు డాలును” గూర్చి మాట్లాడెను, యేసునందు విశ్వాసము కలిగియుండుటను గూర్చి చెప్పే అలంకారిక విధానమైయున్నది మరియు దేవునికి విధేయత చూపుటలో విశ్వాసము ద్వారా జీవించునప్పుడు సాతాను ఆత్మీయ బాణములనుండి విశ్వాసులను సంరక్షించును.
(ఈ పదములను కూడా చూడండి: విశ్వాసం, లోబడు, సాతాను, ఆత్మ)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 రాజులు.14:25-26
- 2 దిన.23:8-9
- 2 సమూ.22:36-37
- ద్వితి.33:29
- కీర్తన.018:35-36
పదం సమాచారం:
- Strong's: H2653, H3591, H4043, H5437, H5526, H6793, H7982, G2375
తప్పు, తప్పులు, తప్పు చేసెను, తప్పుగా, పూర్తీ తప్పుగా, తప్పు చేయువాడు, తప్పు చేయుట, తప్పుగా నడుచుకొనుట, తప్పుగా నడుచుకొనెను, నొప్పి, నొప్పించును, నొప్పించుట, బాధించేవి
నిర్వచనము:
ఎవరి విషయములోనైనా “తప్పు” చేయుట అనగా ఆ వ్యక్తిపట్ల అన్యాయముగా, కపటముగా నడుచుకొనుట అని అర్థము.
- “తప్పుగా నడుచుకొనుట” అనే పదము ఒకరి విషయములో చాలా దారుణముగాను లేక చెడుగాను ప్రవర్తించుట అని అర్థము, ఆ వ్యక్తికి మానసికంగాను లేక భౌతికముగాను హాని కలిగేటట్లు కారణమగుట అని అర్థము.
- “హాని” అనే పదము చాలా సాధారణమైన పదము మరియు “ఎదో ఒక విధానములో ఒకరికి హాని కలుగజేయుట” అని అర్థము. దీనికి అనేకమార్లు “భౌతికమైన గాయము” అనే అర్థము కూడా కలదు.
- సందర్భానుసారముగా, ఈ పదాలన్నిటిని “తప్పు చేయు” లేక “అన్యాయముగా నడుచుకో” లేక “హాని కలిగించు” లేక “హాని కలిగించు విధానములో నడుచుకో” లేక “గాయము” అని కూడా తర్జుమా చేయుదురు.
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.07:26-28
- నిర్గమ.22:20-21
- ఆది.16:5-6
- లూకా.06:27-28
- మత్తయి.20:13-14
- కీర్తన.071:12-13
పదం సమాచారం:
- Strong's: H205, H816, H2248, H2250, H2255, H2257, H2398, H2554, H2555, H3238, H3637, H4834, H5062, H5142, H5230, H5627, H5753, H5766, H5791, H5792, H5916, H6031, H6087, H6127, H6231, H6485, H6565, H6586, H7451, H7489, H7563, H7665, H7667, H7686, H8133, H8267, H8295, G91, G92, G93, G95, G264, G824, G983, G984, G1536, G1626, G1651, G1727, G1908, G2556, G2558, G2559, G2607, G3076, G3077, G3762, G4122, G5195, G5196
తరం
నిర్వచనం:
"తరం" అంటే ఒకే కాలంలో పుట్టి పెరిగిన ప్రజా సమూహం.
- తరం అనే మాటను ఒక ఇదమిద్ధమైన కాలాన్ని సూచించడానికి కూడా వాడతారు. బైబిల్ కాలాల్లో, తరం అంటే సుమారు 40 సంవత్సరాలు.
- తల్లిదండ్రులు, వారి పిల్లలు రెండు వివిధ తరాలు.
- బైబిల్లో, "తరం" అనే మాటను అలంకారికంగా సాధారణంగా ఒకే విధమైన గుణ లక్షణాలుగల మనుషులను సూచించడానికి ఉపయోగిస్తారు.
అనువాదం సలహాలు
- "తరం” లేక “తరం ప్రజలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఇప్పుడు నివసించే ప్రజలు” లేక “మీరు."
- " దుష్ట తరం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. " ఇప్పుడు ఈ దుష్ట ప్రజలున్న కాలం."
- "తరం నుండి తరం” లేక “ఒక తరం మరుసటి తరం వరకు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రస్తుతం నివసించే ప్రజలు, వారి పిల్లలు లేక మనవలు” లేక “ప్రతి సమయం లో ఉన్న ప్రజలు” లేక “ప్రస్తుతం, భవిషత్తు సమయాల్లో ఉండే మనుషులు” లేక “మనుషులంతా వారి సంతానం."
- "రానున్న తరం ఆయన్ను సేవిస్తారు; వారు మరుసటి తరం వారికి యెహోవాను గురించి చెబుతారు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అనేక మంది ప్రజలు భవిషత్తులో యెహోవాను సేవిస్తారు, అయన గురించి వారి పిల్లలకు మనవలకు చెబుతారు."
(చూడండి: వారసుడు, దుష్టత్వం, పూర్వీకుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 15:19-21
- నిర్గమ 03:13-15
- ఆది 15:14-16
- ఆది 17:7-8
- మార్కు 08:11-13
- మత్తయి 11:16-17
- మత్తయి 23:34-36
- మత్తయి 24:34-35
పదం సమాచారం:
తలుపు, ద్వారాలు, గేటు అడ్డ కర్రలు, ద్వారపాలకుడు, ద్వారపాలకులు, ద్వారబంధాలు, ప్రవేశం.
నిర్వచనం:
"గేటు" అంటే ఒక ఇల్లు, లేక పట్టణం చుట్టూ ఉండే గోడలో ఉన్న ప్రవేశం. ఇది బందులపై తిరిగే కొయ్యతో చేసిస్ నిర్మాణం.
"తలుపు కమ్ము" అంటే కొయ్యతో లేక లోహంతో చేసిన కర్ర. దీన్ని గేటును బిగించడానికి అమరుస్తారు.
- పట్టణం గేటు ను తెరిచి ప్రజలు, జంతువులు, సామాను పట్టణంలోకి రానిస్తారు.
- పట్టణం భద్రత కోసం దాని గోడలు, ద్వారాలు మందంగా బలమైనవిగా చేస్తారు. ద్వారాలను లోహంతో లేక కొయ్యతో చేసిన కడ్డీ అడ్డంగా పెట్టి శత్రు సైనికులు పట్టణంలోకి ప్రవేసించకుండా నిరోధిస్తారు.
- పట్టణం గేటు తరచుగా పట్టణానికి సమాచార, సాంఘిక కేంద్రం. వ్యాపార లావాదేవీలు, తీర్పులు ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే పట్టణం గోడలు మందంగా ఉండి రాకపోకలకు అనువుగా సూర్యరశ్మి నుండి రక్షణగా చల్లని నీడ ఇస్తాయి. పౌరులు ఆహ్లాదకరమైన ఈ నీడలో కూర్చుని వారి వ్యాపారాలు, ఇంకా న్యాయ, చట్ట పరమైన వివాదాలు తీర్చుకుంటారు.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతులతో దీన్ని అనువదించవచ్చు. "గేటు" అంటే "తలుపు” లేక “గోడలో గుండా ప్రవేశం” లేక “ద్వారబంధం” లేక “ప్రవేశ ద్వారం."
- "గేటు అడ్డు కర్రలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గేటు బోల్టులు” లేక “తలుపు బిగించడానికి కొయ్యతో చేసిన దూలాలు” లేక “గేటును బంధించడానికి లోహపు కడ్డీలు."
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 09:23-25
- అపో. కా. 10:17-18
- ద్వితీ 21:18-19
- ఆది 19:1-3
- ఆది 24:59-60
- మత్తయి 07:13-14
పదం సమాచారం:
- Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440
తామారు
వాస్తవాలు:
తామారు పేరుతో పాత నిబంధనలో అనేకమంది స్త్రీలున్నారు. ఇది పాత నిబంధనలో అనేక పట్టణాలు, లేక ఇతర స్థలాల పేరు.
- తామారు యూదా కోడలు. ఆమె యేసుక్రీస్తు పూర్వీకుడు పెరెసుకు జన్మ నిచ్చింది.
- దావీదు రాజు కుమార్తెలలో ఒకామె పేరు తామారు; ఆమె అబ్షాలోము సోదరి. ఆమె మారుటి అన్న అమ్నోను ఆమెను మానభంగం చేసి వదిలేశాడు.
- అబ్షాలోము తామారు అనే పేరుగల కుమార్తె ఉంది.
- ఒక పట్టణం పేరు "హజేజోను తామారు." ఇది ఉప్పు సముద్రం పశ్చిమ తీరాన ఉన్న ఎన్గేది. "బయలు తామారు," అనే ఊరు కూడా ఉంది. "తామారు" అనే పేరు ప్రస్తావనలు ఉన్న వివిధ పట్టణాలు ఉన్నాయి.
(చూడండి: అబ్షాలోము, పూర్వీకుడు, అమ్నోను, దావీదు, పూర్వీకుడు, యూదా, ఉప్పు సముద్రము)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 02:3-4
- 2 సమూయేలు 13:1-2
- 2 సమూయేలు 14:25-27
- ఆది 38:6-7
- ఆది 38:24-26
- మత్తయి 01:1-3
పదం సమాచారం:
- Strong's: H1193, H2688, H8412, H8559
తిరస్కారం, నిరసించదగిన
వాస్తవాలు:
ఈ పదం "తిరస్కారం" తీవ్రమైన అమర్యాద, అప్రతిష్టలను సూచిస్తున్నది. ఒక యుద్ధంలో శత్రువుమీద తిరస్కారం చూపుతారు. దేన్నైనా నీచంగా త్రోసిపుచ్చడాన్ని "నిరసించదగిన" అన్నారు.
- ఒక వ్యక్తి ప్రవర్తన బహిరంగంగా దేవునికి అమర్యాద చూపితే ఈ పదం వాడతారు. "నిరసించదగిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "గొప్ప అమర్యాద చూపడం” లేక “పూర్తిగా అప్రతిష్ట పాలు చెయ్యడం” లేక “నిరసనకు పాత్రమైన."
- " తిరస్కారం చూపడం" అంటే న్యాయాధిపతి ఎవరినైనా నీచమైన విలువ గల వాడుగా ఎంచడం అనే సందర్భం.
- ఈ అనే మాటలకు ఒకే విధమైన అర్థం: "ఒకరి పట్ల తిరస్కార భావం” లేక “తిరస్కారం చూపు” లేక “తిరస్కారభావం కలిగి ఉండు” లేక “తిరస్కారంగా ఒకరి పట్ల ప్రవర్తించు." వీటన్నిటికీ "బలమైన అమర్యాద” లేక “తీవ్ర అప్రతిష్ట " అని అర్థం.
- వ్యభిచారం, హత్య జరిగించడం ద్వారా దావీదు రాజు పాపం చేసినప్పుడు, అతడు తన పట్ల తిరస్కారం చూపాడని దేవుడు చెప్పాడు. అంటే అతడు తీవ్రమైన అమర్యాద, అగౌరవం దేవుని పట్ల చూపాడు.
(చూడండి: అప్రతిష్ట)
బైబిల్ రిఫరెన్సులు:
- దానియేలు 12:1-2
- సామెతలు 15:5-6
- కీర్తనలు 031:17-18
పదం సమాచారం:
- Strong's: H936, H937, H959, H963, H1860, H7043, H7589, H5006, G1848
తిరుగు, తిరగండి, వెనక్కి తిరగండి, తిరిగి రావడం
నిర్వచనం:
"తిరుగడం" అంటే శారీరకంగా దిశ మార్చుకోవడం లేదా ఏదైనా ఒకటి దిశ మార్చుకొనేలా చెయ్యడం అని అర్థం.
- "తిరుగడం" అనే పదానికి "చుట్టూ తిరగడం" లేదా "వెనక్కి తిరిగి చూడడం" లేదా భిన్నమైన దిశను చూడడం" అనే అర్థాలు కూడా ఉన్నాయి.
- "వెనుదిరుగు” లేదా "తిరగడం" అంటే "వెనక్కి వెళ్ళడం,” లేదా “వెళ్ళిపోయేలా చెయ్యడం" అని అర్థం.
- "నుండి వెనక్కు తిరగడం" అంటే ఏదైనా చెయ్యడం "నిలిపి వెయ్యడం" లేదా ఎవరినైనా తిరస్కరించడం ఆపివెయ్యడం" అని అర్థం.
- ఒకరి "వైపుకు తిరుగు" అంటే ఆ వ్యక్తి వైపుకు నేరుగా చూడు అని అర్థం.
- "తిరుగు, వెళ్ళు" లేదా "వెళ్లి పోడానికి వెనుతిరిగాడు" అంటే "వెళ్ళిపోవడం" అని అర్థం.
- "వెనుదిరుగు " అంటే "దేనినైనా మరలా చేయనారంభించు" అని అర్థం.
- ".. వెనుకకు తిరుగు" అంటే "దేనినైనా చెయ్యడం నిలిపి వెయ్యి" అని అర్థం.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, "తిరుగు" పదం "దిశను మార్చు" లేదా "వెళ్ళు" లేదా "కదులు" అని అనువదించబడవచ్చు.
- కొన్ని సందర్భాలలో "తిరుగు" పదం "ఒకరిని ఏదైనా చేసేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు. "ఒకరి నుండి తిరగడం" పదబంధం "ఒకరు వెళ్ళిపోయేలా చెయ్యడం" లేదా "ఒకరు ఆగిపోయేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- "దేవుని నుండి తిరగడం" పదబంధం "దేవుణ్ణి ఆరాధించడం ఆపివెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- "దేవుని వైపుకు తిరగడం" పదబంధం "దేవుణ్ణి తిరిగి ఆరాధించడం ఆరంబించడం" అని అనువదించబడవచ్చు.
- శత్రువులు "వెనక్కి తిరిగారు" అంటే "తిరోగమనం" అని అర్థం. "శత్రువును వెనుతిరిగేలా చెయ్యి" అంటే "శత్రువు తిరోగమించేలా చెయ్యి" అని అర్థం.
- అలంకారికంగా ఉపయోగించబడినట్లయితే, ఇశ్రాయేలీయులు అబద్దపు దేవుళ్ళ "వైపుకు తిరిగారు" అంటే వారు వాటిని "పూజించడం ఆరంభించారు" అని అర్థం. వారు విగ్రహాలనుండి "తిరిగారు" అంటే వాటిని "పూజించడం నిలిపివేశారు" అని అర్థం.
- దేవుడు తన తిరుగుబాటు ప్రజల "నుండి తిరిగాడు" అంటే ఆయన వారిని "సంరక్షించడం ఆపివేశాడు" లేదా "సహాయం చెయ్యడం ఆపివేశాడు" అని అర్థం.
- "తండ్రుల హృదయాలను తమ పిల్లల వైపుకు తిప్పుదును" పదబంధం "తండ్రులు తమ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొనేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- "నా ఘనతను సిగ్గుకు తిప్పారు" వాక్యం "నా ఘనత సిగ్గుగా మారేలా చేశారు" లేదా "నేను సిగ్గుపడేలా నన్ను అవమానపరచారు" లేదా "నన్ను సిగ్గుపరచారు (దుష్టమైనది చెయ్యడం ద్వారా) తద్వారా మనుష్యులు ఇకమీదట నన్ను ఘనపరచరు" అని అనువదించబడవచ్చు.
- “మీ పట్టణములను నాశనమునకు తిప్పుదును" వాక్యం "మీ పట్టణములు నాశనం అయ్యేలా చేస్తాను" అని అనువదించబడవచ్చు.
- "తిరగడం" పదం "మారడం" అని అనువదించబడవచ్చు. మోషే కర్ర ఒక పాముగా "తిరిగి నప్పుడు" అది పాములా మారింది. "మార్పు చెందింది" అని కూడా అనువదించబడవచ్చు.
(చూడండి: దేవుడు, కుష్టరోగి, ఆరాధన)
బైబిలు రిఫరెన్సులు:
- 1 రాజులు 11:02
- అపొ. కా. 07:42
- అపొ.కా 11:21
- యిర్మీయా 36:1-3
- లూకా 01:17
- మలాకీ 04:06
- ప్రకటన 11:06
పదం సమాచారం:
- Strong's: H541, H1750, H2015, H2017, H2186, H2559, H3399, H3943, H4142, H4672, H4740, H4878, H5186, H5253, H5414, H5437, H5472, H5493, H5528, H5627, H5753, H5844, H6437, H6801, H7227, H7725, H7734, H7750, H7760, H7847, H8159, H8447, G344, G387, G402, G576, G654, G665, G868, G1294, G1578, G1612, G1624, G1994, G2827, G3179, G3313, G3329, G3344, G3346, G4762, G5077, G5157, G5290, G6060
తీగె, తీగెలు
నిర్వచనము:
“తీగె” అనునది ఒక మొక్క నేలమీద ప్రాకేందుకు గాని లేదా చెట్టుపైకి మరియు వేరే ఆకారాలకు గాని ఎక్కడానికి సహాయం చేస్తుంది. “తీగ ” అనే పదాన్ని గురించి బైబిలులో చూచినట్లయితే సాధారణముగా పండుమోసే తీగలలో ద్రాక్షాతీగల గురించి మాత్రమే చెప్పబడింది.
- బైబిల్లో , “తీగ” అంటే ఎక్కువసార్లు “ద్రాక్షాతీగలు” అనే అర్థం ఇస్తుంది.
- ద్రాక్షాతీగల యొక్క శాఖలు ప్రధానకాండానికి అతుకబడివుండి, వాటికి నీటిని మరియు ఇతర పోషకాలను అందిచుటద్వారా మొక్క ఎదగడంలో సహాయపడతాయి.
- యేసుప్రభువుల వారు ఆయనని “ద్రాక్షావల్లి ” గానూ మరియు అయన ప్రజలను “కొమ్మలు” గానూపిలిచెను. సందర్భాన్ని బట్టి, “తీగె” అనేది “ద్రాక్షాతీగె కాడ” లేదా “ద్రాక్షచెట్టుయొక్క కాండము” గా అనువాదింపబడింది.
(దీనిని చూడండి: ద్రాక్ష, ద్రాక్షాతోట)
బైబిలు వచనాలు:
- ఆది. 40:9-11
- ఆది. 49:11-12
- యోహాను 15:1-2
- లూకా 22 :17-18
- మార్కు 12:1-3
- మత్తయి 21:35-37
పదం సమాచారం:
- Strong's: H5139, H1612, H8321, G288, G290, G1009, G1092
తుడిచి పెట్టు, తుడిచి పెట్టిన, అంతు చూడడం, సమూల నాశనం, పూర్తిగా తుడిచి వేయు, చెరిపి వేయు
నిర్వచనం:
పదాలు "తుడిచి పెట్టు” “సమూల నాశనం "అనే మాటలు పూర్తిగా లేకుండా పోవడం, లేక నాశనం, దేన్నైనా, ఎవరినైనా పూర్తిగా ధ్వంసం చేయడాన్ని సూచిస్తాయి.
- ఈ మాటలను సకరాత్మకంగా కూడా ఉపయోగిస్తారు. దేవుడు మన పాపాలను క్షమించి వాటిని ఇక గుర్తు చేసుకోకుండా వాటిని "తుడిచి పెట్టి వేస్తాడు."
- దీన్ని తరచుగా నకారాత్మక రీతిలో ఉపయోగిస్తారు. దేవుడు ఒక ప్రజను వారి పాపం మూలంగా "తుడిచి పెట్టివేస్తాడు” లేక “సమూల నాశనం చేస్తాడు."
- బైబిల్ ఒక వ్యక్తి పేరును దేవుని జీవ గ్రంథంలోనుంచి "తుడిచి పెట్టిన” లేక “చెరిపి వేసిన "సంగతిని మాట్లాడుతున్నది.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వదిలించుకొను” లేక “తొలగించు” లేక “పూర్తిగా నాశనం చేయు” లేక “పూర్తిగా తొలగించు."
- ఎవరి పేరు అయినా జీవ గ్రంథంలో నుండి తొలగించడం అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నుండి తొలగించు” లేక “చెరిపి వేయు."
బైబిల్ రిఫరెన్సులు:
- ద్వితీ 29:20-21
- నిర్గమ 32:30-32
- ఆది 07:23-24
- కీర్తనలు 051:1-2
పదం సమాచారం:
- Strong's: H3971, H4229, G631, G1591, G1813
తెగ, తెగలు
నిర్వచనం:
"తెగ" అనే పదం కుటుంబ సభ్యులను మించి ఒక పూర్వికుడి నుండి వచ్చిన పెద్ద సమూహానికి వర్తిస్తుంది.
- పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులను వారి తెగలు, లేక కుటుంబ సమూహాల ప్రకారం లెక్కించారు.
- తెగలకు సాధారణంగా వారిలో ఎక్కువ ప్రఖ్యాతి చెందిన పూర్వీకుని పేరు పెడతారు.
- వ్యక్తులను సైతం కొన్ని సార్లు వారి తెగ పేరుతొ చెబుతారు. ఒక ఉదాహరణ మోషే మామ యిత్రోను తన తెగ పేరు “రగూయేలు” తొ కొన్ని సార్లు పిలిచారు.
- తెగ అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కుటుంబ సమూహం” లేక “విస్తార కుటుంబం” లేక “బంధువులు."
(చూడండి: కుటుంబం, యిత్రో, గోత్రం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 06:33-35
- ఆది 10:2-5
- ఆది 36:15-16
- ఆది 36:29-30
- ఆది 36:40-43
- యెహోషువా 15:20
- సంఖ్యా 03:38-39
పదం సమాచారం:
- Strong's: H1, H441, H1004, H4940
తెర, తెరలు
నిర్వచనం:
బైబిల్లో, "తెర" అంటే మందం అయిన, బరువైన గుడ్డతో చేసిన పరదా. దీన్ని ప్రత్యక్ష గుడారం, ఆలయం చెయ్యడంలో ఉపయోగిస్తారు.
- ప్రత్యక్ష గుడారాన్ని పైనుండి నాలుగు పొరలుగా ఉన్న తెరలు ఉపయోగించి నిర్మిస్తారు. ఈ తెర లను గుడ్డతో లేక జంతువు చర్మాలతో చేస్తారు.
- గుడ్డ తెరలు కూడా ప్రత్యక్ష గుడారం బయటి ఆవరణ చుట్టూ ఉన్న గోడ కోసం ఉపయోగిస్తారు. ఈ తెరలను "సన్న నార బట్ట" తో చేస్తారు. ఇది జనపనారతో చేసిన ఒక రకమైన గుడ్డ.
- ప్రత్యక్ష గుడారం, ఆలయం భవనం, రెంటి లోనూ మందమైన గుడ్డ తెరను పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య వేలాడ దీస్తారు. యేసు చనిపోయాక అద్భుతమైన రీతిలో రెండు భాగాలుగా చినిగిన తెర ఇదే.
అనువాదం సలహాలు:
- ఆధునిక తెరలు బైబిల్ కాలం తెరలకు భిన్నమైనవి కాబట్టి ఈ తెరలను స్పష్టంగా చెప్పడానికి వివిధ పదాలు వాడడం మంచిది.
- సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం, "కప్పే తెర” లేక “యవనిక” లేక “మందం గుడ్డ” లేక “జంతువు చర్మం కప్పు” లేక “వేలాడే గుడ్డ."
(చూడండి: పరిశుద్ధ స్థలం, ప్రత్యక్ష గుడారం, ఆలయం)
బైబిల్ రిఫరెన్సులు:
- హెబ్రీ 10:19-22
- లేవీ 04:16-17
- లూకా 23:44-45
- మత్తయి 27:51-53
- సంఖ్యా 04:5-6
పదం సమాచారం:
- Strong's: H1852, H3407, H4539, H6532, H7050, G2665
తెరహు
వాస్తవాలు:
తెరహు నోవహు కుమారుడు షేము సంతతి వాడు. అతడు అబ్రాము, నాహోరు, హారానుల తండ్రి.
- తెరహు ఊరులో ఉన్న తన ఇంటినుండి బయలు దేరి తన కుమారుడు అబ్రాము, లోతు, అబ్రాము భార్య శారాలతో కనాను ప్రదేశం ప్రయాణం అయ్యాడు.
- కనాను దారిలో తెరహు, తన కుటుంబం కొన్ని సంవత్సరాలు మెసపొటేమియాలో హారాను పట్టణంలో నివసించారు.
తెరహు 205వ ఏట హారానులో చనిపోయాడు.
(చూడండి: అబ్రాహాము, కనాను, హారాను, లోతు, మెసపొటేమియా, నాహోరు, శారా, షేము, ఉర్)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 11:31-32
- 1 దిన 01:24-27
- లూకా 03:33-35
పదం సమాచారం:
తేనె, తేనె పట్టు
నిర్వచనం:
"తేనె" తియ్యని, జిగురు, పదార్థం. పువ్వుల మకరందం లోనుండి తేనెటీగలు తయారు చేసేది. తేనె పట్టు అంటే తేనెటీగలు తయారు చేసే మైనపు ఫ్రేము. ఇందులో అవి తేనె నిలవ చేస్తాయి.
- రకాన్ని బట్టి తేనె పసుపు, గోధుమ రంగుల్లో ఉండవచ్చు.
- తేనె అడవి చెట్ల తొర్రల్లో లేక తేనెటీగలు ఎక్కడ పట్టు పెడితే అక్కడ దొరుకుతుంది. మనుషులు తేనె తినడానికి, అమ్మడానికి తేనె పట్టు ఉండే పెట్టెలు వాడతారు. అయితే బహుశా బైబిల్లో ప్రస్తావించినది సహజంగా దొరికే తేనె.
- బైబిల్లో ముగ్గురు ఇదమిద్ధంగా సహజమైన తేనె తిన్నట్టు రాసి ఉంది. యోనాతాను, సంసోను, బాప్తిసమిచ్చే యోహాను.
- ఈ పదాన్ని తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు. దేన్నైనా మధురమైన రుచికరమైనదాన్నిఇలా సూచిస్తారు. ఉదాహరణకు, దేవుని మాటలు, కట్టడలు “తేనెకన్నా మధురం."
- కొన్ని సార్లు వ్యక్తి మాటలు తేనె వలె తియ్యని అంటారు. అయితే ఇతరులను మోసగించి హాని తలపెట్టే విషయం కూడా ఇక్కడ ఉంది.
(చూడండి: యోహాను (బాప్తిసమిచ్చే), యోనాతాను, ఫిలిష్టియులు, సంసోను)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 14:1-3
- ద్వితీ 06:3
- నిర్గమ 13:3-5
- యెహోషువా 05:6-7
- సామెతలు 05:3-4
పదం సమాచారం:
- Strong's: H1706, H3293, H3295, H5317, H6688, G2781, G3192, G3193
తోడేలు, తోడేళ్ళు, అడవి కుక్కలు
నిర్వచనము:
తోడేలు చాలా క్రూరమైన జంతువు, అడవి కుక్కకు సమానముగా ఉండే మాంసాహారి ప్రాణి.
- తోడేళ్ళు సాధారణముగా సమూహాలుగాను మరియు కొమ్మల మధ్యన ఉండి వేటాడుతాయి, వాటి వేట చాలా దొంగ తెలివితేటలతో ఉంటుంది.
- పరిశుద్ధ గ్రంథములో “తోడేళ్ళు” అనే మాటను గొర్రెలకు పోల్చబడిన విశ్వాసులను నాశనము చేసే అబద్ద ప్రవక్తలను లేక అబద్ద బోధకులను సూచించుటకు అలంకారికముగా ఉపయోగించబడింది. అబద్ద బోధ ప్రజలు తప్పుడు విషయాలను నమ్మునట్లు చేయును మరియు వారికి హానిని తీసుకొని వచ్చును.
- గొర్రెలు విశేషముగా తోడేళ్ళ ద్వారా దాడి చేయబడి, వాటికి ఆహారముగా మారుతాయనే సత్యాంశము ఆధారముగా ఈ పోలిక చేయబడినది, ఎందుకంటే అవి బలహీనముగా ఉంటాయి మరియు వాటిని అవి రక్షించుకొనలేవు.
తర్జుమా సలహాలు:
- ఈ పదమును “అడవి కుక్క” లేక “అడవి ప్రాణి” అని కూడా తర్జుమా చేయుదురు.
- అడవి కుక్కలకు ఇతర పేర్లు “జాకాల్” లేక “కోయోతే” అని కూడా ఉన్నాయి.
- ప్రజలను సూచించుటకు అలంకారికముగా ఉపయోగించినప్పుడు, దీనిని “గొర్రెల మీద దాడికి వెళ్ళే ప్రాణులవలె ప్రజలకు హానికలిగించే దుష్ట ప్రజలు” అని తర్జుమా చేయవచ్చును.
(ఈ పదాలను కూడా చూడండి: దుష్టత్వం, అబద్ధ ప్రవక్త, ఆడగొర్రె, బోధించు)
పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:
- అపొ.కార్య.20:28-30
- యెషయా.11:6-7
- యోహాను.10:11-13
- లూకా.10:3-4
- మత్తయి.07:15-17
- జేఫన్యా.03:3-4
పదం సమాచారం:
- Strong's: H2061, H3611, G3074
దమస్కు
వాస్తవాలు:
దమస్కు సిరియా దేశం ముఖ్య పట్టణం. బైబిల్ కాలాల్లోని నగరం ఉన్న చోటే నేటి నగరం కూడా ఉంది.
- దమస్కు లోకంలో అత్యంత పురాతనమైన పట్టణం. అన్ని కాలాల్లోనూ దీనిలో జనాభా నివసించారు.
- అబ్రాహాము కాలంలో, దమస్కు ఆరాము రాజ్యం రాజధాని (ఇది ఇప్పుడు సిరియాలో ఉంది).
- పాత నిబంధన అంతటా దమస్కు నివాసులు, ఇశ్రాయేలు ప్రజల మధ్య లావాదేవీల ప్రస్తావనలు ఉన్నాయి.
- దమస్కు నాశనం గురించి అనేక బైబిల్ ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు పాత నిబంధన కాలంలో అస్సిరియా వారు దీన్ని నాశనం చేయడంతో నెరవేరాయి. లేదా ఇది భవిషత్తులో పట్టణం పూర్ణ నాశనం తో నెరవేరవచ్చు.
- కొత్త నిబంధనలో, పరిసయ్యుడు సౌలు (తరువాత పౌలు అనే పేరు వచ్చింది) ఈ నగర క్రైస్తవులను బాధించడానికి వెళుతుండగా యేసు అతణ్ణి ఎదుర్కొని అతడు విశ్వాసిగా మారేలా చేశాడు.
(చూడండి: ఆరాము, అస్సిరియా, విశ్వసించు, సిరియా)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 దిన 24:23-24
- అపో. కా. 09:1-2
- అపో. కా. 09:3-4
- అపో. కా. 26:12-14
- గలతి 01:15-17
- ఆది 14:15-16
పదం సమాచారం:
- Strong's: H1833, H1834, G1154
దాను
వాస్తవాలు:
దాను యాకోబు ఐదవ కుమారుడు. పన్నెండు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటి. కనాను ఉత్తరాన దాను గోత్రం వారు స్థిరపడిన ప్రాంతానికి దాను అని పేరు వచ్చింది.
- కాలంలో అబ్రాము కాలంలో దాను అనే పేరు గల పట్టణం యెరూషలేముకు పశ్చిమాన ఉండేది.
- ఇశ్రాయేలు జాతి వాగ్దాన దేశం ప్రవేశించిన కొన్ని సంవత్సరాలు తరువాత, దాను అనే పేరు గల పట్టణం పేరు యెరూషలేముకు 60 మైళ్ళు ఉత్తరాన ఉంది.
- ఈ పదం"దానీయులు" దాను సంతానాన్ని సూచిస్తున్నది. అంటే ఆ తెగ సభ్యులు.
(చూడండి: కనాను, యెరూషలేము, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 12:34-35
- 1 రాజులు 04:24-25
- నిర్గమ 01:1-5
- ఆది 14:13-14
- ఆది 30:5-6
పదం సమాచారం:
- Strong's: H1835, H1839, H2051
దుష్టత్వం, దుర్మార్గుడు, భ్రష్టమైన
నిర్వచనం:
బైబిలులో "దుష్టత్వం” పదం నైతిక దుష్టత్వాన్ని లేక భావోద్రేక భ్రష్టత్వాన్ని గురించిన భావాన్ని సూచిస్తుంది. పదం ఉపయోగించబడిన నిర్దిష్ట సమయంలో ఉద్దేశించబడిన అర్థాన్ని ఆ సందర్భం సాధారణంగా తెలియపరుస్తుంది.
- "దుష్టత్వం" అనేది వ్యక్తి గుణ లక్షణాల గురించి తెలియపరుస్తుంది, అయితే, "దుర్మార్గం" అనేది ఒక వ్యక్తి ప్రవర్తన గురించి వివరిస్తుంది. అయితే, రెండు పదాలకు ఒకే విధమైన అర్థం ఉంది.
- "దుర్మార్గత" పదం మనుషులు చెడు కార్యాలు చేస్తున్నప్పుడు ఉన్న స్థితిని సూచిస్తుంది.
- దుష్టత్వం ఫలితాలు ఇతరులను హత్య చేయడం, దొంగతనం, దుర్భాషలు, కౄరంగా ఉండడం, కఠినత్వం చూపడంలో స్పష్టంగా కనిపిస్తాయి.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, "దుష్టత్వం” “దుర్మార్గత" పదాలు "చెడు" లేదా "పాపపూరితమైన” లేదా "అనైతిక" అని అనువదించబడవచ్చు.
- "మంచిది కానిది" లేదా "నీతి కానిది" అని కూడా ఇతర విధాలుగా అనువదించవచ్చు.
- ఈ పదాలు, పద బంధాలు లక్ష్య భాషలో సహజమైన, సందర్భ సహితమైన రీతిలో ఉపయోగించబడేలా జాగ్రత్త పడండి.
(చూడండి: అవిధేయత చూపడం, పాపము, మంచిది, నీతిగల, దయ్యం)
బైబిలు రిఫరెన్సులు:
- 1 సమూయేలు 24:11
- 1 తిమోతి 06:10
- 3 యోహాను 01:10
- ఆది. 02:17
- ఆది. 06:5-6
- యోబు 01:01
- యోబు 08:20
- న్యాయాధిపతులు 09:57
- లూకా 06:22-23
- మత్తయి 07:11-12
- సామెతలు 03:07
- కీర్తనలు 022:16-17
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 02:04 "మీరు దానిని తినిన వెంటనే మీరు దేవుని వలే అవుతారని దేవునికి తెలుసు మరియు ఆయనకు వలే మంచి, చెడు లను తెలుసుకొంటారు.
- 03:01 చాలాకాలం తరువాత అనేక మంది ప్రజలు లోకంలో నివసిస్తున్నారు. వారు చాలా దుర్మార్గంగా మరియు హింసాత్మకంగా తయారయ్యారు.
- 03:02 అయితే నోవహు దేవుని దయను పొందాడు. అతడు దుష్టుల మధ్య నివసిస్తున్న నీతిమంతుడు.
- 04:02 దేవుడు వారు అందరూ కలిసి దుష్టత్వం చేయడానికి కలిసిపనిచేసినట్లయితే, వారు అనేక పాపపూరితమైన కార్యాలు చేస్తారని దేవుడు చూచాడు.
- 08:12 "నన్ను ఒక బానిసగా అమ్మివేసినప్పుడు మీరు దుష్టత్వం చేయడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు దుష్టత్వాన్ని మేలు కోసం ఉపయోగించాడు!"
- 14:02 వారు (కనానీయులు) ఆరాధించిన అబద్ధ దేవుళ్ళను పూజించారు, అనేక దుష్ట కార్యాలు చేశారు.
- 17:01 అయితే అప్పుడు అతడు (సౌలు) ఒక దుర్మార్గుడైన వ్యక్తిగా మారాడు. దేవునికి విధేయత చూపలేదు. కాబట్టి దేవుడు వేరొక మనిషిని అతని స్థానంలో రాజుగా ఎన్నుకున్నాడు.
- 18:11 నూతన ఇశ్రాయేలు రాజ్యంలో రాజులు అందరూ దుష్టులే .
- 29:08 రాజు కోపగించుకుని ఆ దుష్ట సేవకుడిని అతడు తన ఋణం అంతా తీర్చే వరకు చెరసాలలో వేయించాడు.
- 45:02 "అతడు (స్తెఫను) మోషే గురించీ, దేవుని గురించీ చెడు మాటలు పలకడం మేము విన్నాము" అని చెప్పారు."
- 50:17 అయన (యేసు) ప్రతి కన్నీటి బిందువును తుడిచి వేయును, ఇకమీద హింసలు, విచారం, ఆక్రోశం, దుష్టత్వం, బాధ నొప్పి, లేక మరణం ఉండవు.
పదం సమాచారం:
- Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337
దుష్టుడు, దుష్టులు, దుష్టకార్యం
నిర్వచనం:
"దుష్టుడు" అనే మాట పాపపూరితమైన, దుర్మార్గ కార్యాలు చేసే వారికి వర్తిస్తుంది.
- దేవునికి లోబడని వారికి కూడా ఇది స్థూలంగా వర్తిస్తుంది.
- ఈ పదాన్ని ఇలా కూడా అనువదించ వచ్చు. "దుష్టత్వం కోసం” లేక “దుర్మార్గత కోసం," "జరిగించడం” లేక “చెయ్యడం” లేక “కారణం."
(చూడండి: దుష్టత్వం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 పేతురు 02:13-17
- యెషయా 09:16-17
- లూకా 13:25-27
- మలాకీ 03:13-15
- మత్తయి 07:21-23
పదం సమాచారం:
- Strong's: H205, H6213, H6466, H7451, H7489, G93, G458, G2038, G2040 , G2555
దేవదూత, దేవదూతలు, ప్రధాన దూత
నిర్వచనం:
దేవదూత దేవుడు సృష్టించిన ఒక శక్తివంతమైన ఆత్మ. దేవదూతలు దేవుణ్ణి సేవిస్తూ ఆయన చెప్పినది చేసే వారు.
"ప్రధాన దూత" అనే ఈ పదం దేవదూత ఇతర దేవదూతల నాయకునికి వర్తిస్తుంది.
- ఈ పదానికి అక్షరార్థం "దేవదూత""వార్తాహరుడు."
- "ప్రధాన దూత" అంటే అక్షరాలా "ప్రధాన వార్తాహరుడు." "ప్రధాన దూత" అని బైబిల్లో చెప్పిన దేవదూత ఒక్క మిఖాయేలు మాత్రమే.
- బైబిల్లో, దేవదూతలు దేవుని నుండి మనుషులకు సందేశాలు తెచ్చే వారు. ఈ సందేశాలలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న సూచనలు ఉన్నాయి.
- దేవదూతలు మనుషులకు రాబోయే కాలంలో జరగనున్న సంఘటనలు తెలియ జేస్తారు. లేక ఇప్పటికే జరిగిపోయిన సంఘటనలు చెబుతారు.
- దేవదూతలకు దేవుని ప్రతినిధులుగా అయన అధికారం ఉంది. కొన్ని సార్లు బైబిల్లో దేవుడే మాట్లాడుతున్నట్టు వీరు మాట్లాడుతారు.
- దేవదూతలు దేవుణ్ణి సేవించే ఇతర మార్గాలు, మనుషులకు భద్రత, బలం ఇవ్వడం ద్వారా.
- ఒక ప్రత్యేక పద బంధం, "యెహోవా దూత," అనే దానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నాయి: 1) "యెహోవాకు ప్రతినిధిగా ఉన్న దేవదూత” లేక “యెహోవాను సేవించే వార్తాహరుడు." 2) అది సాక్షాత్తూ యెహోవాకే వర్తిస్తుంది. అయన దేవదూతగా కనిపించి వ్యక్తులతో మాట్లాడాడు. ఈ రెంటిలో ఈ అర్థం దేవదూతలు "నేను"అంటూ తానే యెహోవానన్నట్టు మాట్లాడడం ఎందుకో వివరిస్తుంది.
అనువాదం సలహాలు:
- "దేవదూత"అనే మాటను అనువదించడంలో "దేవుని నుండి వార్తాహరుడు” లేక “దేవుని పరలోక సేవకుడు” లేక “దేవుని ఆత్మ వార్తాహరుడు"అనే అర్థాలు వస్తాయి.
- "ప్రధాన దూత" అనే ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రధాన దేవదూత” లేక “దేవదూతలను శాసించే వాడు” లేక “దేవదూతల నాయకుడు."
- ఈ పదాలను అనువదించడం జాతీయ భాష లో లేక మరొక స్థానిక భాషలో ఎలా అనేది ఆలోచించండి.
- "యెహోవా దూత" అనే పద బంధాన్ని అనువదించడం "దేవదూత,” “యెహోవా” అనే మాటలను చెప్పడానికి ఉపయోగించే మాటలతో చెయ్యాలి." ఇలా చెయ్యడం ద్వారా ఆ పద బంధం వివిధ వివరణలు సరిపోతాయి. ఇంకా ఇక్కడ వాడదగిన అనువాదాలు, "యెహోవా నుండి వచ్చిన దేవదూత” లేక “యెహోవా పంపిన దేవదూత” లేక “దేవదూతలాగా కనిపించిన యెహోవా."
(చూడండి: ప్రధాని, శిరస్సు, సందేశకులు, మిఖాయేలు, పాలించు, సేవకుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- 2సమూయేలు 24:15-16
- అపో. కా. 10:3-6
- అపో. కా. 12:22-23
- కొలస్సి 02:18-19
- ఆది 48:14-16
- లూకా 02:13-14
- మార్కు 08:38
- మత్తయి 13:49-50
- ప్రకటన 01:19-20
- జెకర్యా 01:7-9
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 02:12 దేవుడు గొప్ప శక్తివంతమైన దేవదూతలను తోట ప్రవేశ ద్వారం వద్ద ఉంచాడు. ఎవరైనా ప్రవేశించి జీవ వృక్షం పండు తినకూడదని ఇలా చేశాడు.
- 22:03 దేవదూత జెకర్యాకు జవాబిస్తూ, "నన్ను ఈ మంచి వార్త వినిపించడానికి దేవుడు పంపాడు."
- 23:06 హటాత్తుగా మెరిసిపోతున్న ఒక దేవదూత వారికి (కాపరులకు), ప్రత్యక్షం అయ్యాడు. వారు భయంతో బిగుసుకు పోయారు. దేవదూత వారికి ఇలా చెప్పాడు, "భయపడకండి, ఎందుకంటే మీకోసం మంచి వార్త తెచ్చాను."
- 23:07 హటాత్తుగా, ఆకాశం దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన పాటలతో నిండిపోయింది.
- 25:08 అప్పుడు దేవదూతలు వచ్చి యేసుకు సేదదీర్చారు.
- 38:12 యేసు తన చెమట రక్తబిందువులుగా పడుతుండగా గొప్ప యాతన అనుభవించాడు. దేవుడు ఒక దేవదూతను ఆయన్ను బలపరచడం కోసం పంపించాడు.
- 38:15 "నన్ను కాపాడడానికి తండ్రిని గొప్ప దేవదూతల సైన్యం కోసం అడగలేనా."
పదం సమాచారం:
- Strong's: H47, H430, H4397, H4398, H8136, G32, G743, G2465
దేవుడు
నిర్వచనం:
బైబిలులో "దేవుడు" అనే పదం శూన్యంలో నుండి విశ్వాన్ని సృష్టించిన శాశ్వత జీవిని సూచిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనిగా దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. దేవుని వ్యక్తిగత నామం "యెహోవా."
- దేవుడు ఎల్లప్పుడూ ఉనికి కలిగియున్నాడు. ఏదీ ఉనికిలో లేక ముందు అయన ఉన్నాడు. అయన శాశ్వత కాలం ఉనికి కలిగిఉంటాడు.
- ఆయన ఏకైక నిజ దేవుడు. విశ్వంలో సమస్తము మీద ఆయన అధికారాన్ని కలిగియున్నాడు.
- దేవుడు సంపూర్ణంగా నీతిమంతుడు, అనంత జ్ఞానం గలవాడు, పరిశుద్ధుడు, పాపరహితుడు. న్యాయవంతుడు, కరుణగలవాడు, ప్రేమగలవాడు.
- అయన నిబంధనను జరిగించు వాడు, తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చువాడు.
- దేవుణ్ణి ఆరాధించడం కోసమే మనుషులను అయన సృష్టించాడు, వారు ఆయనను మాత్రమే ఆరాధించాలి.
- దేవుడు తన పేరును "యెహోవా" అని బయలుపరచుకొన్నాడు. అంటే "ఆయన ఉన్నవాడు" లేదా "నేను ఉన్నవాడను" లేదా "ఎల్లప్పుడూ ఉనికి కలిగియున్నవాడు" అని అర్థం.
- బైబిలు అబద్ధపు "దేవుళ్ళను" గురించి కూడా బోధిస్తుంది. అవి కేవలం జీవం లేని విగ్రహాలు. మనుషులు వాటిని తప్పుగా పూజిస్తారు.
అనువాదం సూచనలు:
- "దేవుడు" అనే పదం "దైవం" లేదా “సృష్టికర్త” లేదా “సర్వోన్నతుడైనవాడు" లేదా "సర్వోన్నతుడైన సృష్టికర్త" లేదా "అనంతుడైన సార్వభౌమ ప్రభువు" లేదా "శాశ్వతుడైన సర్వోన్నతుడైనవాడు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- అనువదించడంలో ఇతర పద్ధతులు. "సర్వతీతుడైన సృష్టికర్త” లేక “అనంతుడైన సార్వభౌమ ప్రభువు” లేక “నిత్యమైన సర్వాధికారి."
- దేవుడు అనే పదాన్ని స్థానిక, జాతీయ భాషలో ఏవిధంగా సూచిస్తారో గమనించండి. అనువదించబడుతున్న భాషలో "దేవుడు" అనే పదం కోసం ఇంతకు ముందే ఒక పదం ఉండవచ్చు. అలా ఉంటే ఈ పదం పైన వర్ణించిన నిజ దేవుని గుణ లక్షణాలకు సరి పోయేలా నిశ్చయం చేసుకోవడం ప్రాముఖ్యం.
- అనేక భాషలు ఏకైక నిజ దేవుని కోసం ఉపయోగించే పదం అబద్దపు దేవుని కోసం ఉండే పదంతో భిన్నంగా ఉండేలా పదం మొదటి అక్షరం పెద్ద అచ్చులో ఉంటుంది. నిజ దేవునికి అబద్ద దేవుళ్ళకు వేరువేరు పదాలు వాడడం ద్వారా ఇలాటి తేడా చూపించగల మరొక విధానం. గమనిక: బైబిలు వాక్యంలో యెహోవా దేవుణ్ణి ఆరాదించని వ్యక్తి యెహోవాను గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్న అక్షరాలలో 'దేవుడు' పదం ఉపయోగించినప్పుడు యెహోవాను సూచిస్తూ పెద్ద అక్షరం లేకుండా పదాన్ని అనువదించినట్లయితే అది అంగీకారమే (యోహాను 1:16, 3:9 చూడండి).
- "నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు" వాక్యం "దేవుడనైన నేను ఈ ప్రజల మీద పరిపాలన చేస్తాను, వారు నన్ను ఆరాధిస్తారు." అని అనువదించబడవచ్చు.
(చూడండి: సృష్టించు, దేవుడు, తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్మ, దేవుడు, దేవుని కుమారుడు, యెహోవా)
బైబిలు రిఫరెన్సులు:
- 1 యోహాను 01:07
- 1 సమూయేలు 10:7-8
- 1 తిమోతి 04:10
- కొలస్సీ 01:16
- ద్వితీ. 29:14-16
- ఎజ్రా 03:1-2
- ఆది. 01:02
- హోషేయా 04:11-12
- యెషయా 36:6-7
- యాకోబు 02:20
- యిర్మియా 05:05
- యోహాను 01:03
- యెహోషువా 03:9-11
- విలాపవాక్యములు 03:43
- మీకా 04:05
- ఫిలిప్పీ 02:06
- సామెతలు 24:12
- కీర్హనలు 047:09
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 01:01 దేవుడు విశ్వం, అందులోని సమస్తాన్నీఆరు రోజులలో సృష్టించాడు.
- 01:15 దేవుడు పురుషుడినీ, స్త్రీనీ తన స్వంత స్వరూపంలో చేశాడు.
- 05:03 "నేను సర్వ శక్తిమంతుడైన దేవుణ్ణి. నేను నీతో నిబంధన చేస్తాను."
- 09:14 దేవుడు చెప్పాడు, "నేను ఉన్నవాడను అనువాడను” 'ఉన్నవాడు అనువాడు నన్ను నీ దగ్గరకు పంపాడు.' అని వారితో చెప్పు. 'నేను యెహోవాను, నీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. శాశ్వతకాలం ఇది నా నామం."
- 10:02 ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరో కంటే, ఐగుప్తులోని దేవుళ్ళ కంటే తాను శక్తివంతమైన వాడనని ఫరోకు కనుపరిచాడు.
- 16:01 ఇశ్రాయేలీయులు నిజ దేవుడు యెహోవాకు బదులుగా కనానీయుల దేవుళ్ళను పూజించసాగారు.
- 22:07 నీవు నా కుమారుడవు, నిన్ను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త అని పిలువబడుడువు. నీవు మెస్సియా రాక కొరకు ప్రజలను సిద్ధం చేస్తావు!"
- 24:09 ఒకే దేవుడు ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుండగా యోహాను విన్నాడు. కుమారుడైన యేసును అయన బాప్తిసం సమయంలో పరిశుద్ధాత్మ రావడం చూశాడు.
- 25:07 "నీ ప్రభువైన దేవుని మాత్రమే పూజించాలి, ఆయనను మాత్రమే సేవించాలి."
- 28:01 "మంచివాడు ఒక్కడే, అయనే దేవుడు."
- 49:09 అయితే దేవుడు లోకంలోని ప్రతి ఒక్కరినీ ప్రేమించాడు, అయన తన అద్వితీయ కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచు వాడు తన పాపాలకోసం శిక్షపొందకుండా దేవునితో శాశ్వతకాలం ఉంటారు.
- 50:16 అయితే కొన్ని రోజులకు దేవుడు పరిపూర్ణమైన నూతన ఆకాశాన్నీ నూతన భూమినీ సృష్టిస్తాడు.
పదం సమాచారం:
- Strong's: H136, H305, H410, H426, H430, H433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G112, G516, G932, G935, G1096, G1140, G2098, G2124, G2128, G2150, G2152, G2153, G2299, G2304, G2305, G2312, G2313, G2314, G2315, G2316, G2317, G2318, G2319, G2320, G3361, G3785, G4151, G5207, G5377, G5463, G5537, G5538
దేవుడు, అబద్ధ దేవుడు, దేవుళ్ళు, దేవత, విగ్రహం, విగ్రహాలు, విగ్రహారాధికుడు, విగ్రహారాధికులు, విగ్రహారాధక, విగ్రహారాధన
నిర్వచనం:
నిజ దేవునికి బదులుగా అబద్ధ దేవుడు దేన్నైనా ప్రజలు పూజించడం. "దేవత" అంటే అబద్ద స్త్రీ వేలుపు.
- ఈ అబద్ధ దేవుళ్ళు లేక దేవతలు నిజంగా ఉనికిలో లేరు. యెహోవా ఒక్కడే దేవుడు.
- ప్రజలు కొన్ని సార్లు పూజ చేయడం కోసం వారి అబద్ద దేవుళ్ళకు సంకేతాలుగా విగ్రహాలను తయారు చేసుకుంటారు.
- బైబిల్లో, దేవుని ప్రజలు తరచుగా దేవునికి లోబడకుండా తొలగి పోయి నుండి అబద్ద దేవుళ్ళను పూజించారు.
- దయ్యాలు తరచుగా ప్రజలు అబద్ధ దేవుళ్ళను విగ్రహాలను నమ్మేలా మోసగిస్తూ వాటిని పూజించినందువల్ల వారికి శక్తి లభిస్తుందని నమ్మిస్తారు.
- బైబిల్ కాలాల్లో ప్రజలు పూజించిన అనేక అబద్ధ దేవుళ్ళలో బయలు, దాగోను, మొలెకు ఉన్నారు.
- అషేరా, అర్తెమి (డయానా) ప్రాచీన ప్రజలు ఆరాధించిన ఇద్దరు స్త్రీ దేవతలు. విగ్రహం అనేది ప్రజలు పూజించడం కోసం తయారు చేసుకున్న బొమ్మ. "విగ్రహారాధక" అంటే నిజ దేవుడు కాని ఏ ఇతర ప్రతిమను ప్రతిష్ట చేసుకోవడాన్ని సూచించేటందుకు అంటారు.
- ప్రజలు వారు అబద్ధ దేవుళ్ళను పూజించడానికి విగ్రహాలు పెట్టుకుంటారు.
- ఈ అబద్ధ దేవుళ్ళు నిజంగా లేరు. యెహోవా తప్ప వేరే దేవుడు లేడు.
- కొన్ని సార్లు దయ్యాలు విగ్రహాల ద్వారా పని చేస్తారు, ఏమీ లేకపోయినా వాటికీ శక్తి ఉన్నదని భ్రమింపజేయడానికి.
- విగ్రహాలను తరచుగా బంగారం, వెండి, కంచు, లేక ఖరీదైన కలప మొదలైన విలువైన ముడి సరుకుతో చేస్తారు.
- "విగ్రహారాధక రాజ్యం" అంటే "విగ్రహారాధన చేసే ప్రజలు" లేక "భూసంబంధమైన వస్తువులను పూజించే మనుషులు ఉన్న రాజ్యాలు."
- "విగ్రహారాధక ప్రతిమ" అనేది "చెక్కిన ప్రతిమ" లేక "విగ్రహం" అనే దానికి మరొకపదం.
అనువాదం సలహాలు:
- మీ భాషలో లేక సమీప భాషల్లో ఇప్పటికే "దేవుడు” లేక “అబద్ధ దేవుడు" అనే దానికి సరైన పదం ఉండ వచ్చు.
- "విగ్రహం" అనే మాటను అబద్ద దేవుళ్ళను సూచించడానికి ఉపయోగిస్తారు.
- ఇంగ్లీషులో చిన్న అక్షరం "g" ని అబద్ద దేవుళ్ళకోసం ఉపయోగిస్తారు, పెద్ద అక్షరం "G" ని ఏకైక నిజ దేవుని కోసం ఉపయోగిస్తారు.
మరి కొన్ని ఇతర భాషల్లో కూడా అలా ఉంది.
- మరొక పధ్ధతి పూర్తిగా వేరే పదం అబద్ద దేవుళ్ళ కోసం వినియోగించడం.
- కొన్ని భాషల్లో మగ, లేక అడ అబద్ధ దేవుడి గురించి చెప్పడానికి పూర్తిగా వేరే పదం వాడతారు.
(చూడండి: దేవుడు, అషేరా, బయలు, మెలెకు, దయ్యం, స్వరూపం, రాజ్యము, ఆరాధన)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 35:1-3
- నిర్గమ 32:1-2
- కీర్తనలు 031:5-7
- కీర్తనలు 081:8-10
- యెషయా 44:20
- అపో. కా. 07:41-42
- అపో. కా. 07:43
- అపో. కా. 15:19-21
- అపో. కా. 19:26-27
- రోమా 02:21-22
- గలతి 04:8-9
- గలతి 05:19-21
- కొలస్సి 03:5-8
- 1 తెస్స 01:8-10
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 10:02 ఈ తెగగుళ్ళ, ద్వారా దేవుడు ఫరోకు తాను ఈజిప్టు దేవుళ్ళు అందరికన్నా ఫరో కన్నా శక్తివంతమైన వాడినని చూపించాడు.
- 13:04 తరువాత దేవుడు వారితో ఒక నిబంధన చేసి ఇలా చెప్పాడు. "నేను యెహోవా, నీ దేవుణ్ణి, నిన్ను ఐగుప్టు బానిసత్వం నుండి విడిపించే వాణ్ణి. ఇతర దేవుళ్ళను పూజించ వద్దు."
- 14:02 వారు (కనానీయులు) అనేక మంది అబద్ధ దేవుళ్ళను అనేక దుష్ట వస్తువులను పూజించారు.
- 16:01 ఇశ్రాయేలీయులు నిజ దేవుడు యెహోవాకు బదులుగా కనానీయ దేవుళ్ళను పూజించ సాగారు.
- 18:13 అయితే ఎక్కువ మంది యూదా రాజులు దుష్టత్వం, చెడు తనం మూలంగా విగ్రహాలను ఆరాధించారు.
కొందరు రాజులు అయితే వారి పిల్లలను సైతం అబద్ధ దేవుళ్ళకు బలి ఇచ్చారు.
పదం సమాచారం:
- Strong's: H205, H367, H410, H426, H430, H457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G1493, G1494, G1495, G1496, G1497, G2299, G2712
దేవుని ఇల్లు, యెహోవా ఇల్లు
నిర్వచనం:
బైబిల్లో, "దేవుని ఇల్లు" "యెహోవా ఇల్లు అంటే దేవుణ్ణి ఆరాధించే చోటు.
- ఈ పదాన్ని మరింత ఇదమిద్ధంగా ప్రత్యక్ష గుడారం, లేక ఆలయం కోసం ఉపయోగిస్తారు.
- కొన్ని సార్లు "దేవుని ఇల్లు" అనే మాటను దేవుని ప్రజలకోసం వాడతారు.
అనువాదం సలహాలు:
- ఆరాధన స్థలం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుణ్ణి ఆరాధించే చోటు.”
- ఆలయం లేక ప్రత్యక్ష గుడారం గురించి వాడుతున్నప్పుడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. దేవుణ్ణి ఆరాధించే "ఆలయం (లేక ప్రత్యక్ష గుడారం). (లేక దేవుడు ఉన్న చోటు” లేక “దేవుడు తన ప్రజలను కలుసుకునే చోటు.")
- "ఇల్లు” ఈ మాటను అనువాదం చెయ్యడంలో దేవుని నివాసం, అంటే ఆయన ఆత్మ అక్కడ తన ప్రజలను కలుసుకుంటాడు. వారు అక్కడ ఆయన్ను ఆరాధిస్తారు.
(చూడండి: దేవుని ప్రజలు, ప్రత్యక్ష గుడారం, ఆలయం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తిమోతి 03:14-15
- 2 దిన 23:8-9
- ఎజ్రా 05:12-13
- ఆది 28:16-17
- న్యాయాధి 18:30-31
- మార్కు 02:25-26
- మత్తయి 12:3-4
పదం సమాచారం:
- Strong's: H426, H430, H1004, H1005, H3068, G2316, G3624
దొంగ, దొంగలు, దోచుకొను, దోచుకొన్న, దోపిడీ దొంగలు, దోపిడీ
వాస్తవాలు:
"దొంగ" అంటే ఇతరులకు చెందిన ధనం, ఆస్తులు తీసుకునే వ్యక్తి. "దొంగ" బహువచనం "దొంగలు." "దోపిడి గాడు అంటే తాను దోచుకున్న వారికి శారీరికంగా హాని కలిగించే వాడు.
- యేసు చెప్పాడు ఒక సమరయ మనిషిని గురించిన కథ చెప్పాడు. అతడు దోపిడీ దొంగల చేతిలో చిక్కి గాయపడిన యూదు మనిషిను ఆదుకున్నాడు. దోపిడీ దొంగలు యూదుమనిషిని కొట్టి గయా పరిచారు. అతని డబ్బు బట్టలు ఎత్తుకెళ్ళారు.
- దొంగలు, దోపిడీదారులు దొంగతనానికి హటాత్తుగా, అంటే మనుషులు ఉహించని సమయంలో వస్తారు. తరచుగావారు చీకటి మాటున వస్తారు. తాము చేసేది ఎవరికీ కనబడకుండా ఉంటారు.
- అలంకారికంగా చూస్తే కొత్త నిబంధనలో సాతానును దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వచ్చే దొంగతో పోల్చారు. అంటే సాతాను యొక్క పథకం దేవుని ప్రజలను ఆయనకు లోబడకుండా చెయ్యడం. అతడు ఇలా చెయ్యగలిగితే దేవుడు తన ప్రజల కోసం ఉంచిన మంచి విషయాలను సాతాను దోచుకున్నట్టు అవుతుంది.
- యేసు తన రాకడ దొంగతనం చేసే వాడు అనుకోకుండా రావడంతో పోల్చాడు. దొంగ ఏ విధంగా ఎవరూ ఎదురు చూడని సమయంలో వస్తాడో అలానే యేసు రెండవ రాక కూడా మనుషులు ఉహించని సమయంలో ఉంటుంది.
(చూడండి: ఆశీర్వదించు, నేరం, సిలువ వేయు, చీకటి, నాశనం, శక్తి, సమరయ, సాతాను)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 పేతురు 03:10
- లూకా 12:33-34
- మార్కు 14:47-50
- సామెతలు 06:30-31
- ప్రకటన 03:3-4
పదం సమాచారం:
- Strong's: H1214, H1215, H1416, H1589, H1590, H1980, H6530, H6782, H7703, G727, G1888, G2417, G2812, G3027
ద్రాక్ష, ద్రాక్షలు, ద్రాక్ష చెట్టు
నిర్వచనం:
ద్రాక్ష చిన్న, గుండ్రని, మృదు చర్మంతో ఉండే పండు. అది ద్రాక్ష చెట్టుకు గుత్తులుగా కాస్తుంది. ద్రాక్షల రసాన్ని ద్రాక్షారసం చెయ్యడానికి ఉపయోగిస్తారు.
- ద్రాక్ష వివిధ రంగుల్లో ఉంటాయి. ఆకుపచ్చ, ఊదా రంగు, లేక ఎరుపు.
- ద్రాక్షలు ఒకటి నుండి మూడు సెంటిమీటర్లు సైజులో ఉండవచ్చు. ద్రాక్షలను పెంచే క్షేత్రాలను ద్రాక్ష తోటలు అంటారు. వీటిల్లో సాధారణంగా ద్రాక్ష చెట్లు బారులు ఉంటాయి.
- ద్రాక్షలు బైబిల్ కాలాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆహారం. ద్రాక్ష తోటలు ఉండడం సంపద సూచన.
- ద్రాక్షలను కుళ్ళిపోకుండా ఉంచడానికి తరచుగా వాటిని ఎండబెడతారు. ఎండబెట్టిన ద్రాక్షలను "ఎండు ద్రాక్షలు" అంటారు. వీటిని ముద్దలుగా వత్తి నిలవ చేస్తారు.
- యేసు దేవుని రాజ్యం గురించి తన శిష్యులకు బోధించడానికి ద్రాక్ష తోట ఉదాహరణ వాడాడు.
(చూడండి: తీగె, ద్రాక్షాతోట, ద్రాక్షారసం)
బైబిల్ రిఫరెన్సులు:
- ద్వితీ 23:24-25
- హోషేయ 09:10
- యోబు 15:31-33
- లూకా 06:43-44
- మత్తయి 07:15-17
పదం సమాచారం:
- Strong's: H811, H891, H1154, H1155, H1210, H2490, H3196, H5563, H5955, H6025, H6528, G288, G4718
ద్రాక్షారసం, ద్రాక్షారసం తిత్తి, క్రొత్త ద్రాక్షారసం
నిర్వచనం:
పరిశుద్ధ గ్రంథములో “ద్రాక్షారసం” పదం ద్రాక్షలు అనే పండ్ల రసముతో బాగుగా పులియబెట్టి చేసి తీసిన ఒక విధమైన పానీయమును సూచిస్తుంది. ద్రాక్షారసమును “ద్రాక్షారస తిత్తు"లలో” భద్రము చేసి ఉంచుతారు, ఈ తిత్తులను ప్రాణుల చర్మాలతో తయారుచేస్తారు.
- “క్రొత్త ద్రాక్షారసం” పదం పులియబెట్టకుండ ద్రాక్షలనుండి అప్పటికప్పుడే తీసిన ద్రాక్షారసమును సూచిస్తుంది. కొన్నిసార్లు “ద్రాక్షారసం” కూడా పులియబెట్టని ద్రాక్షారసమును సూచిస్తుంది.
- ద్రాక్షారసమును చేయడానికి, ద్రాక్ష పళ్ళను మద్యపు తొట్టిలో వేసి త్రొక్కుతారు, ఆ రసము చివరికి పులిసి, దానిలో మద్యపానం ఏర్పడుతుంది.
- బైబిలు కాలములలో ద్రాక్షారసం భోజముతోపాటు తీసికునే సహజమైన పానీయం. నేటి మద్యపానమువలె ఆ రోజులలో ద్రాక్షారసం ఉండేది కాదు.
- భోజనము కోసం ద్రాక్షారసం వడ్డించడానికి ముందు తరచుగా ద్రాక్షారసమును నీళ్ళతో కలిపేవారు.
- పాతగిలిన మరియు పెళుసుగా ఉన్నటువంటి ద్రాక్షా తిత్తులు పిగిలిపోతాయి, తద్వారా అందులోని ద్రాక్షారసం బయటకి కారుతుంది. క్రొత్త ద్రాక్షాతిత్తులు చాలా మృదువుగానూ, అనువైనవిగానూ ఉంటాయి, అంటే అవి అంత సులభముగా చినిగిపోవు మరియు ద్రాక్షారసమును భద్రముగా ఉంచుతాయి.
- మీ సంస్కృతిలో ద్రాక్షరసమునుగూర్చి తెలియకపొతే, ఇది “పులియబెట్టిన రసము” లేదా “ద్రాక్ష పండ్ల నుండి తీసి పులియబెట్టిన పానీయం” లేదా “పులియబెట్టిన ద్రాక్షారసం” అని అనువదించబడ వచ్చు. (చూడండి: తెలియనివాటిని ఏవిధంగా అనువదించాలి
- “ద్రాక్షారసపు తిత్తి” పదం “ద్రాక్షారసం కొరకు సంచి” లేదా "ద్రాక్షారసం కోసం జంతు చర్మపు సంచి" అని ఇతర విధాలుగా అనువదించవచ్చు.
(చూడండి: ద్రాక్ష, తీగె, ద్రాక్షాతోట, ద్రాక్షరసపు గానుగ (లేక తొట్టి))
బైబిలు రిఫరెన్సులు:
- 1 తిమోతి 05:23
- ఆది. 09:21
- ఆది. 49:12
- యోహాను 02:3-5
- యోహాను 02:10
- మత్తయి 09:17
- మత్తయి 11:18
పగులగొట్టబడింది
పదం సమాచారం:
- Strong's: H2561, H2562, H3196, H4469, H4997, H5435, H6025, H6071, H8492, G1098, G3631, G3820, G3943
ద్రోహం, ద్రోహం చేయు, ద్రోహానికి గురి అయిన, ద్రోహం జరిగించు, ద్రోహి, ద్రోహులు
నిర్వచనం:
"ద్రోహం"అంటే ఎవరినైనా మోసగించి హాని చెయ్యడం.
"ద్రోహి"అంటే తనపై నమ్మకముంచిన స్నేహితునికి ద్రోహం చేసేవాడు.
- యూదా "ద్రోహి."ఎందుకంటే అతడు యూదు నాయకులకు యేసును ఎలా పట్టుకోవాలో చెప్పాడు.
- యూదా చేసిన ద్రోహం ముఖ్యంగా దుర్మార్గం ఎందుకంటే అతడు యేసు అపోస్తలుడు. యూదు నాయకుల నుండి డబ్బు తీసుకుని యేసుకు అన్యాయంగా మరణ శిక్ష పడేలా చేశాడు.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, “ద్రోహం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మోసగించి హాని చేయు” లేక “శత్రువుకు అప్పగించు” లేక “కపటంగా ప్రవర్తించు."
- ఈ పదం "ద్రోహి"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ద్రోహం చేసే వ్యక్తి” లేక “కపట వర్తనుడు” లేక “ద్రోహి."
(చూడండి: యూదా ఇస్కరియోతు, యూదు అధికారులు, అపొస్తలుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 07:51-53
- యోహాను 06:64-65
- యోహాను 13:21-22
- మత్తయి 10:2-4
- మత్తయి 26:20-22
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 21:11 ఇతర ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. మెస్సియాను చంపిన వారు అయన బట్టలకోసం చీట్లు వేస్తారని అయన మిత్రుడే ఆయనకు ద్రోహం చేస్తాడని చెప్పారు. ఒక స్నేహితుడు ముఫ్ఫై వెండి నాణాలు పుచ్చుకుని మెస్సియాకు ద్రోహం చేస్తాడని జెకర్యా ప్రవక్త ముందుగా ప్రవచించాడు.
- 38:02 తరువాత యేసు, అయన శిష్యులు యెరూషలేముకు వచ్చినప్పుడు, యూదా యూదు నాయకుల దగ్గరకు పోయి తనకు డబ్బిస్తే యేసుకు ద్రోహం చేసి, పట్టి ఇస్తానని చెప్పాడు.
- 38:03 ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదు నాయకులు, యూదాకు ముఫ్ఫై వెండి నాణాలు ఇచ్చి యేసుకు ద్రోహం చేసేలా చేశారు.
- 38:06 తరువాత తన శిష్యులకు "మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు అని యేసు చెప్పాడు. "నేను ఎవరికి రొట్టె ముక్క ఇస్తానో అతడే నాకు ద్రోహం చేస్తాడు."
- 38:13 మూడవ సారి తిరిగి వెళ్లి, యేసు వారితో అన్నాడు. "లేవండి! నాకు ద్రోహం చేసే వాడు ఇడుగో."
- 38:14 తరువాత యేసు చెప్పాడు, "యూదా, నాకు ద్రోహం చేయడానికి ముద్దు నీకు సాధనం అయిందా?"
- 39:08 ఈ లోగా, ద్రోహి అయిన యూదా, యూదు నాయకులు యేసుకు మరణ శిక్ష విధించారని తెలుసుకున్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. అతడు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
పదం సమాచారం:
- Strong's: H7411, G3860, G4273
ధర్మం, సూత్రం
నిర్వచనం:
“ధర్మం (చట్టం)" అనేది సాధారణంగా రాయబడిన న్యాయబద్ధ నియమం, అధికారంలో ఉన్నవారిచేత అమలులోనికి తీసుకొనిరాబడేది. అయితే ఒక "సూత్రం" నిర్ణయం చెయ్యడం కోసం, ప్రవర్తన కోసం ఒక మార్గదర్శక నియమం. ఇది సాధారణంగా రాయబడదు, లేదా అమలు చెయ్యబడదు. అయితే కొన్నిసార్లు "ధర్మం" పదం ఒక "సూత్రం" అని అర్థం ఇచ్చేలా ఉపయోగించబడుతుంది.
- ”ధర్మం" పదం "శాసనం" పదం ఒకేలా ఉంటాయి, అయితే "ధర్మం" పదం పలుకబడినదానికంటే రాయబడిన దానినే సూచిస్తుంది.
- ”ధర్మం” గురించిన ఈ భావం “మోషే ధర్మశాస్త్రం” కున్న భావానికి భిన్నంగా ఉంటుంది, దేవుడు ఇశ్రాయేలుకిచ్చిన ఆజ్ఞలనూ, హెచ్చరికలనూ ఇది సూచిస్తుంది.
- సాధారణ ధర్మాన్ని ప్రస్తావించినప్పుడు, “ధర్మం” అనే పదం “సూత్రం” లేదా సాధారణ నియమం" అని అనువదించబడవచ్చు.
(చూడండి: ధర్మం, ధర్మశాస్త్రం)
బైబిలు రెఫరెన్సులు:
- ద్వితి. 04:02
- ఎస్తేరు 03:8-9
- నిర్గమ. 12:12-14
- ఆది. 26:05
- యోహాను 18:31
- రోమా 07:1
పదం సమాచారం:
- Strong's: H1285, H1881, H1882, H2706, H2708, H2710, H4687, H4941, H6310, H7560, H8451, G1785, G3548, G3551, G4747
ధాన్యం, ధాన్యాలు, ధాన్యక్షేత్రాలు
నిర్వచనం:
"ధాన్యం" అంటే సాధారణంగా గోదుమ, బార్లీ, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, లేక వరి తదితర తృణ ధాన్యాలు. ఇది మొత్తంగా మొక్కను కూడా సూచించ వచ్చు.
- బైబిల్లో, ముఖ్య ధాన్యాలు గోదుమ, బార్లీ.
- ధాన్యం కంకి ఆ మొక్క లో ధాన్యం ఉండే భాగం.
- గమనించండి కొన్ని పాత బైబిల్ వాచకాలు "ధాన్యం" అనే మాటను ఇలాటి పంటలకు సాధారణ పదంగా వాడాయి. ఆధునిక ఇంగ్లీషులో అయితే, ఈ పదానికి ఒక జాతి ధాన్యం అనే అర్థమే వస్తుంది.
(చూడండి: శిరస్సు, గోధుమ)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 42:1-4
- ఆది 42:26-28
- ఆది 43:1-2
- లూకా 06:1-2
- మార్కు 02:23-24
- మత్తయి 13:7-9
- రూతు 01:22
పదం సమాచారం:
- Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719
ధైర్యం, ధైర్యంగల, ప్రోత్సహించు, ప్రోత్సాహం, నిరుత్సాహపరచు, అధైర్యం
వాస్తవాలు:
"ధైర్యం" పదం కష్టమైనవి, భయపెట్టేవి, లేదా ప్రమాదకరమైనవాటిని నిర్భయంగా ఎదుర్కోవడం లేదా వాటిని చెయ్యడం అని సూచిస్తుంది.
- "ధైర్యం గల" పదం ధైర్యాన్ని చూపించే వ్యక్తినీ, భయంగా అనిపించినప్పటికీ లేదా విడిచి పెట్టాలనే ఒత్తిడి వచ్చినప్పటికీ సరియైన దానిని చేస్తున్న వ్యక్తినీ వివరిస్తుంది.
- ఒక వ్యక్తి భావోద్రేకమైన లేదా శారీరకమైన బాధను బలంతోనూ, పట్టుదలతోనూ ఎదుర్కొనేటప్పుడు ధైర్యాన్ని కనుపరుస్తాడు.
- "ధైర్యంగా ఉండు" అంటే "భయపడవద్దు" లేదా "సంగతులన్నీ సక్రమంగా జరుగుతాయనే నిశ్చయత కలిగియుండు" అని అర్థం.
- యెహోషువా ప్రమాదకరమైన కనాను ప్రదేశం వెళ్ళడానికి సిద్దపడుతున్నప్పుడు అతడు "బలము కలిగి ధైర్యంగా" ఉండాలని మోషే హెచ్చరిస్తున్నాడు.
- "ధైర్యంగల" పదం "సాహసం" లేదా "నిర్భయం" లేదా "ధైర్యసాహసం" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి "ధైర్యం కలిగియుండు" పదబంధం "భావోద్రేకంగా బలంకలిగి ఉండు" లేదా "ఆత్మ విశ్వాసం కలిగియుండు" లేదా "స్థిరంగా నిలబడు" అని అనువదించబడవచ్చు.
- "ధైర్యంతో మాట్లాడు" వాక్యం "ధైర్యసాహసంతో మాట్లాడు" లేదా "భయం లేకుండా మాట్లాడు" లేదా "నమ్మకంతో మాట్లాడు" అని అనువదించబడవచ్చు.
"ప్రోత్సాహించు" “ప్రోత్సాహం" పదాలు ఒకరికి ఆదరణ, నిరీక్షణ, నిబ్బరం, ధైర్యం కలిగించడానికి చెప్పడాన్ని లేదా పనులు చెయ్యడాన్ని సూచిస్తారు.
- "హెచ్చరించు" పదం ఒకరు చెడు కార్యాన్ని తిరస్కరించాలని ప్రేరేపించడం, బదులుగా మంచిది, సరియైనదానిని చెయ్యడానికి ప్రేరేపించడం అని అర్థం.
- అపోస్తలుడైన పౌలూ, ఇతర కొత్త నిబంధన రచయితలూ క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సాహించుకుంటూ ప్రేమ చూపుతూ ఉండాలని క్రైస్తవులకు బోధించారు.
"నిరుత్సాహపరచు" పదం ప్రజలు నిరీక్షణనూ, నమ్మకాన్నీ, ధైర్యాన్ని పోగొట్టుకొనేలా చేసే మాటలు మాట్లాడడం లేదా పనులు చెయ్యడాన్ని సూచిస్తుంది. వారు చెయ్యాలని తెలిసిన దానిని కష్టపడి చెయ్యాలనే ఆశను తక్కువ చెయ్యడం అని అర్థం.
అనువాదం సూచనలు
- సందర్భాన్ని బట్టి, దీన్ని "ప్రోత్సహించు" పదం "ప్రేరేపించు" లేదా "ఆదరించు" లేదా "దయగల మాటలు చెప్పు" లేదా "సహాయం చెయ్యి, సహకారం అందించు" అని అనువదించబడవచ్చు.
- "ప్రోత్సాహపు మాటలు చెప్పు" అంటే "ప్రజలు తాము ప్రేమించబడ్డారు, అంగీకరించబడ్డారు, శక్తితో నింపబడ్డారు" అని భావించేలా చేసే మాటలు చెప్పు" అని అర్థం.
(చూడండి: నిబ్బరం, హెచ్చరించు, భయం, బలము)
బైబిలు రిఫరెన్సులు:
- ద్వితీ 01:37-38
- 2 రాజులు 18:19-21
- 1 దిన 17:25
- మత్తయి 09:20-22
- 1 కొరింథీ 14:1-4
- 2 కొరింథీ 07:13
- అపొ.కా. 05:12-13
- అపొ. కా. 16:40
- హెబ్రీ 03:12-13
- హెబ్రీ 13:5-6
పదం సమాచారం:
- Strong's: H533, H553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G2114, G2115, G2174, G2292, G2293, G2294, G3870, G3874, G3954, G4389, G4837, G5111
నడుము
నిర్వచనం:
“నడుము” అనే పదం ఒక జంతువు లేక మనిషి శరీరంలోని ఒక భాగాన్ని సూచిస్తుంది, అది క్రింది పక్కటెముకలు, తోదేముకల మధ్యలో ఉంది, దీనిని కింది పొత్తికడుపు అనికూడా అంటారు.
- ”నడుము కట్టుకోండి” అనే వాక్యం కష్టపడి పనిచెయ్యడానికి సిద్ధపదండి అనే అర్థాన్ని ఇస్తుంది. ఒకని నిలువుటంగీ కింది భాగాన్ని నడుం చుట్టూ ఉన్న నడికట్టులో దోపడం అనే ఒక అలవాటు నుండి వచ్చింది.
- ”నడుం” అనే పదం బలిగా అర్పించే జంతువు వెనుక కింది భాగాన్ని సూచించడానికి తరుచుగా బైబిల్లో వాడడం జరిగింది.
- బైబిలులో “నడుం” అనే పదం మనిషి పునరుత్పత్తి కణాలు అతని సంతానానికి ఆధారంగా ఉపమానంగానూ, మృదువైన రీతిలోనూ తరుచుగా చెప్పడం జరిగింది.
- ”నీ నడుం నుండి వచ్చును” అనే వాక్యం “నీ సంతానం అవుతుంది” లేక “నీ సంతానం నుండి జన్మిస్తుంది” లేక “నీ నుండి వచ్చేలా దేవుడు చేస్తాడు” అని అనువదించవచ్చు.
- శరీరంలోని ఒక భాగాన్ని గురించి చెపుతున్నప్పుడు, సందర్భాన్ని బట్టి “పొత్తికడుపు” లేక “తొడలు” లేక “కటిప్రదేశం” అని అనువాదం చెయ్యవచ్చు.
(చూడండి: వంశస్థుడు, వారసుడు, బిగించి కట్టు)
బైబిలు రిఫరెన్సులు:
- సంతానం
- 2 దినవృత్తాంతములు 06:7-9
- ద్వితియోపదేశకాండం 13:11
- ఆదికాండం 37:34-36
- యోబు 15:27-28
పదం సమాచారం:
- Strong's: H2504, H2783, H3409, H3689, H4975, G3751
నఫ్తాలి
వాస్తవాలు:
యాకోబు కుమారులలో నఫ్తాలి ఆరవవాడు. అతని సంతానం నఫ్తాలి గోత్రంగా ఏర్పడ్డారు, ఇశ్రాయేలీయుల పెన్నెండు గోత్రాలలో ఒకటి.
- కొన్నిసార్లు నఫ్తాలి పేరు వారు నివసించిన ప్రాంతాన్ని సూచిస్తుంది.
- నఫ్తాలి ప్రాంతం ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతంలో దాను, ఆషేరు గోత్రాలకు దగ్గర్లో ఉంది. దీని తూర్పు ప్రాంతం కిన్నెరెతు సముద్రానికి పశ్చిమ తీరంలో ఉంది.
- ఈ గోత్రం పాతనిబంధనలోనూ, కొత్తనిబంధనలోనూ పేర్కొనబడింది.
(చూడండి: అషేరు, దాను, ఇశ్రాయేలు, గలిలయ సముద్రము, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిలు రెఫరెన్సులు:
- 1 రాజులు 04:15-17
- ద్వితియోపదేశ కాండం 27:13-14
- యెహెజ్కేలు 48:1-3
- ఆదికాండం 30:7-8
- వ్యాయాదిపతులు 01:33
- మత్తయి 04:12-13
పదం సమాచారం:
నయమాను
వాస్తవాలు:
పాతనిబంధనలో ఆరాము రాజు సైన్యంలో నయమాను ప్రధాన సైన్యాధికారి.
- నాయమానుకు భయంకరమైన చర్మ వ్యాధి ఉండేది. దానిని కుష్టువ్యాధి అంటారు, అది నయం కానిది.
- నయమాను ఇంటిలో ఉన్న యూద బానిసబాలిక స్వస్థత కోసం ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళమని నయమానుతో చెప్పింది.
- యొర్డాను నదిలో ఏడుసార్లు మునగమని ఎలీషా ప్రవక్త నాయమానుతో చెప్పాడు. నయమాను లోబడినప్పుడు, ఆ వ్యాధినుండి దేవుడు బాగుచేసాడు.
- ఫలితంగా, నయమాను నిజదేవుడు, యెహోవా యందు విశ్వాసముంచాడు.
- యాకోబు కుమారుడు బెన్యామీను సంతానంలో నయమాను అను పేరు గలవారు ఇద్దరు ఉన్నారు.
(చూడండి: ఆరాము, యోర్దాను నది, కుష్టరోగి, ప్రవక్త)
బైబిలు రెఫరెన్సులు:
- 1 దినవృత్తాంతములు 08:6-7
- 2 రాజులు 05:1-2
- లూకా 04:25-27
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 19:14 భయంకరమైన చర్మ రోగం కలిగిన శత్రు సైన్యాధికారి నయమాను కు కలిగిన ఒక అద్భుతకార్యం.
- 19:15 మొదట నయమాను చాలా కోపగించాడు, అది బుద్ధిహీనంగా ఉన్నదని దానిని చెయ్యలేదు. తరువాత తన మనసు మార్చుకొని యోర్దాను నదిలో ఏడుసార్లు మునిగాడు.
- 26:06 ఇశ్రాయేలు శతృసైన్యాధికారి నయమాను చర్మ రోగాన్ని ఆయన (ఎలీషా) మాత్రమే బాగుచేసాడు.
పదం సమాచారం:
నాశనం, నాశనాలు, నాశనం చేశారు, నాశనకర్త, నాశనకర్తలు, నాశనం చేయి
నిర్వచనం:
దేన్నైనా పూర్తిగా నాశనం చెయ్యడం అంటే అది ఇక ఉనికిలో లేకుండా చేయడం.
- "నాశనకర్త" అక్షరాలా దీని అర్థం "నాశనం చేసే వ్యక్తి."
- ఈ పదాన్ని తరచుగా పాత నిబంధనలో ఎవరైనా దాడి చేస్తున్న సైన్యం, లేక నాశనం చేసే ఇతర జాతులు మొదలైన వాటికి వాడతారు.
- దేవుడు ఈజిప్టులో మొదట పుట్టిన మగపిల్లలందరినీ చంపడానికి ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూతను "తొలిచూలు పిల్లల నాశనకర్త" అనవచ్చు. ఇలా తర్జుమా చెయ్యవచ్చు "మొదట పుట్టిన మగపిల్లలను చంపిన దూత."
- ప్రకటన గ్రంథంలో అంత్య కాలంలో, సాతాను, కొన్ని ఇతర దురాత్మలను "నాశనకర్త" అన్నారు. "నాశనాలు చేసే వాడు" దేవుడు సృష్టించిన ప్రతి దాన్నీ నాశనం శిథిలం చెయ్యడమే తన ఉద్దేశం.
(చూడండి: దేవదూత, ఈజిప్టు, మొదట పుట్టిన, పస్కా)
బైబిల్ రిఫరెన్సులు:
- నిర్గమ 12:23
- హెబ్రీ 11:27-28
- యిర్మీయా 06:25-26
- న్యాయాధి 16:23-24
పదం సమాచారం:
- Strong's: H6, H7, H622, H398, H1104, H1197, H1820, H1942, H2000, H2015, H2026, H2040, H2254, H2255, H2717, H2718, H2763, H2764, H3238, H3341, H3381, H3423, H3582, H3615, H3617, H3772, H3807, H4191, H4199, H4229, H4591, H4889, H5218, H5221, H5307, H5362, H5420, H5422, H5428, H5595, H5642, H6789, H6979, H7665, H7667, H7703, H7722, H7760, H7843, H7921, H8045, H8074, H8077, H8316, H8552, G355, G396, G622, G853, G1311, G1842, G2049, G2506, G2507, G2647, G2673, G2704, G3089, G3645, G4199, G5351, G5356
నాహోరు
వాస్తవాలు:
అబ్రహాముకున్న ఇద్దరు బంధువులకు నాహోరు అను పేరు ఉంది. అతని తాత, అతని సోదరుడు.
- అబ్రహాము సోదరుడు నాహోరు ఇస్సాకు భార్య రిబ్కాకు తాత.
- ”నాహోరు పట్టణం” అంటే “నాహోరు పేరు కలిగిన పట్టణం” లేక “నాహోరు జీవించిన పట్టణం” లేక “నాహోరు పట్టణం” కావచ్చు.
(చూడండి: అబ్రాహాము, రిబ్కా)
బైబిలు రెఫరెన్సులు:
- 1 దినవృత్తాంతములు 01:24-27
- ఆదికాండం 31:51-53
- యెహోషువా 24:1-2
- లూకా 03:33-35
పదం సమాచారం:
నింద, నిందించును, నిందించబడెను, నిందించబడుట, నిందగా
నిర్వచనము:
ఒకరిని నిందించుట అనగా ఆ వ్యక్తియొక్క ప్రవర్తననుగాని లేక గుణగణములనుగాని విమర్శించుట లేక ఒప్పకొనకపోవుట అని అర్థము. నింద అనునది ఒక వ్యక్తి గూర్చి ప్రతికూల వ్యాఖ్య చేయడమైయుండును.
- ఒక వ్యక్తి “నిందింపబడలేదు” లేక “నిందకు అతీతముగా ఉన్నాడు” లేక “నిందారహితముగా ఉన్నాడని” చెప్పుట అనగా ఈ వ్యక్తి దేవుని గౌరవించు విధానములో నడుకొనుచున్నాడని మరియు ఆ వ్యక్తిని విమర్శించడానికి ఇసుమంతైనా లేదని చెప్పుటయని దాని అర్థము.
- “నింద” అనే ఈ పదమును “ఆరోపణ” లేక “సిగ్గుచేటు” లేక “అవమానించుట” అని తర్జుమా చేయవచ్చును.
- “నింద” అనే ఈ పదమును “గద్దించు” లేక “ఆరోపించు” లేక “విమర్శించు” అని సందర్భానుసారముగా తర్జుమా చేయవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: నిందించు, గద్దించడం, సిగ్గు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 తిమోతి.05:7-8
- 1 తిమోతి.06:13-14
- యిర్మియా.15:15-16
- యోబు.16:9-10
- సామెతలు.18:3-4
పదం సమాచారం:
- Strong's: H1421, H1442, H2617, H2659, H2778, H2781, H3637, H3639, H7036, G410, G423, G819, G3059, G3679, G3680, G3681, G5195, G5196, G5484
నిందించు, నిందితుడు, నేరము మోపేవాడు, నేరారోపణ
నిర్వచనం:
"నిందించు" మరియు "నేరారోపణ" పదాలు ఏదైనా తప్పు చేసినందుకు నెపము మోపడాన్ని సూచిస్తుంది. ఇతరులను నిందించువ్యక్తి " నేరము మోపువాడు" అవుతాడు.
- అన్యాయ నిందారోపణ అంటే ఒకరికి వ్యతిరేకంగా అసత్యమైన నేరం మోపడం. యేసు నేరం చేసాడని యూదు నాయకులు ఆయన యేసు మీద తప్పుగా నేరము మోపడం ఇలాంటిదే.
- కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో, సాతాను "నేరము మోపువాడు" అని పిలువబడ్డాడు.
బైబిల్ రిఫరెన్సులు:
- అపొ. కా. 19:40
- హోషేయ 04:04
- యిర్మియా 02:9-11
- లూకా 06:6-8
- రోమా 08:33
పదం సమాచారం:
- Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724
నిబంధన, నిబంధనలు, కొత్త నిబంధన
నిర్వచనం:
నిబంధన అంటే రెండు పక్షాలు కట్టుబడి ఉండవలసిన అధికారిక, సమ్మతి, ఏకీభావంతెలిపే ఒప్పందం. దీన్ని ఒకటి లేక రెండు పక్షాలు తప్పక నెరవేర్చాలి.
- ఏకీభావం అనేది వ్యక్తులు, ప్రజాసమూహాలు, లేక దేవునికి ప్రజలకు మధ్య జరుగుతుంది.
- ప్రజలు ఒకరితో ఒకరు నిబంధన చేస్తే వారు దేన్నైనా చేస్తానని ఒప్పుకుంటే అది తప్పకుండా చెయ్యాలి.
- మానవులు చేసే నిబంధనలకు ఉదాహరణలు వివాహం నిబంధనలు, వ్యాపార ఒప్పందాలు, దేశాల మధ్య ఒడంబడికలు.
- బైబిల్ అంతటా, దేవుడు వివిధ నిబంధనలు తన ప్రజలతో చేశాడు.
- కొన్ని నిబంధనల్లో, దేవుడు ఏషరతులు లేకుండా తన ధర్మం నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. ఉదాహరణకు, దేవుడు మానవ జాతితో లోకాన్ని వరద ద్వారా మరి ఎన్నడూ భూమిని నాశనం చెయ్యనని తన నిబంధన స్థిరపరచినప్పుడు ఆ వాగ్దానంలో మనుషులు నెరవేర్చవలసిన ఎలాటి షరతులు లేవు.
- ఇతర నిబంధనల్లోనైతే, ప్రజలు ఆ నిబంధనలో తమ వంతు నెరవేర్చడం ద్వారా విధేయత చూపితేనే తన వంతు నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. "కొత్త నిబంధన" అనేది దేవుడు తన కుమారుడు యేసు సూచిస్తున్నది తన ప్రజలకోసం బలి అర్పణ ద్వారా జరిగేది.
- దేవుని "కొత్త నిబంధన" బైబిల్ లో "కొత్త నిబంధన" భాగంలో వివరించ బడింది.
- కొత్త నిబంధన దేవుడు ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో చేసిన "పాత” లేక “మొదటి" నిబంధన కు వేరుగా ఉంది.
- కొత్త నిబంధన పాతదాని కన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే అది యేసు బలి అర్పణపై ఆధారపడింది. ఆ అర్పణ మనుషుల పాపాలకు శాశ్వతకాలం ప్రాయశ్చిత్తం జరిగిస్తుంది. పాత నిబంధన కింద చేసిన బలి అర్పణలు అలా చెయ్యలేవు.
- దేవుడు కొత్త నిబంధనను యేసు విశ్వాసుల హృదయాలపై రాశాడు. వారు దేవునికి లోబడి పరిశుద్ధ జీవితాలు గడిపేలా ప్రోత్సహిస్తుంది.
- కొత్త నిబంధన అంత్య కాలంలో దేవుడు భూమిపై తన పరిపాలన స్థాపించేటప్పుడు పూర్తిగా నెరవేర్చబడుతుంది.
ప్రతిదాన్నీ మరలా మంచిదిగా అంటే దేడు మొదటిగా లోకాన్ని సృష్టించినప్పటివలె దేవుడు చేస్తాడు.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించే పద్ధతులు "కట్టుబడేలా చేసే ఏకీభావం” లేక “అధికారిక ఒప్పందం” లేక “ప్రమాణం” లేక “కాంట్రాక్టు."
- కొన్ని భాషల్లో నిబంధన అని అర్థం ఇచ్చే వివిధ మాటలు ఉండవచ్చు. అది ఒకటి, లేక రెండు పక్షాలు చేసుకున్న వాగ్దానం వారు తప్పక నిలబెట్టుకునే దానిపై ఆధారపడి ఉపయోగించాలి. నిబంధన ఏక పక్షమైతే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వాగ్దానం” లేక “ప్రమాణం."
- ఈ పదం అనువాదం ప్రజలు ప్రతిపాదించిన నిబంధనలాగా ధ్వనించ కూడదు. నిబంధనలు అన్నీ దేవునికి ప్రజలకు మధ్య జరిగేవే. నిబంధన ఆరంభకుడు దేవుడే.
- "కొత్త నిబంధన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కొత్త అధికారిక ఒడంబడిక” లేక “కొత్త ఒప్పందం” లేక “కొత్త కాంట్రాక్టు."
- ఈ పదం "కొత్త" అనే మాటల అర్థం "తాజా” లేక “కొత్త రకం” లేక “వేరొక."
(చూడండి: నిబంధన, వాగ్ధానం)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 09:11-13
- ఆది 17:7-8
- ఆది 31:43-44
- నిర్గమ 34:10-11
- యెహోషువా 24:24-26
- 2 సమూయేలు 23:5
- 2 రాజులు 18:11-12
- మార్కు 14:22-25
- లూకా 01:72-75
- లూకా 22:19-20
- అపో. కా. 07:6-8
- 1 కొరింతి 11:25-26
- 2 కొరింతి 03:4-6
- గలతి 03:17-18
- హెబ్రీ 12:22-24
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 04:09 తరువాత దేవుడు అబ్రాముతో నిబంధన చేశాడు. నిబంధన రెండు పక్షాల మధ్య అనేది ఒక ఏకీభావం.
- 05:04 "నేను ఇష్మాయేలును కూడా గొప్ప జాతిగా చేస్తాను. అయితే నా నిబంధన ఇస్సాకుతో స్థిరపరుస్తాను."
- 06:04 చాలా కాలం తరువాత అబ్రాహాము చనిపోయాక దేవుడు చేఅతనితో చేసిన వాగ్దాన నిబంధన ఇస్సాకుకు సంక్రమించింది.
- 07:10 నిబంధన వాగ్దానం దేవుడు అబ్రాహముతో చేశాడు. ఆ తరువాత ఇస్సాకుతో. ఇప్పుడు యాకోబుతో చేశాడు."
- 13:02 మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, "నీవు నా స్వరానికి లోబడితే నా నిబంధన ప్రకారం నడుచుకుంటే మీరు ఒక ఒక రాజ్యంగా యాజకులుగా పరిశుద్ధ జాతిగా అవుతారు."
- 13:04 తరువాత దేవుడు వారికి ఒక నిబంధన చెప్పాడు, "నేను యెహోవాను, నీ దేవుణ్ణి, నిన్ను ఈజిప్టు బానిసత్వం నుండి రక్షించిన వాణ్ణి. ఇతర దేవుళ్ళను పూజించకూడదు."
- 15:13 తరువాత యెహోషువా దేవుడు ఇశ్రాయేలీయులతో సీనాయి దగ్గర చేసిన నిబంధనకు వారు నిబంధనకు లోబడవలసిన సంగతిని ప్రజలకు జ్ఞాపకం చేశాడు.
- 21:05 ప్రవక్త యిర్మీయా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. తాను ఒక కొత్త నిబంధన చేయబోతున్నాడు. అయితే ఆ నిబంధన దేవుడు సీనాయి దగ్గర ఇశ్రాయేలుతో చేసిన నిబంధన వంటిది కాదు. కొత్త నిబంధనలో దేవుడు తన చట్టం మనుషుల హృదయాలపై రాశాడు. ప్రజలు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. వారు తన ప్రజలు, దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు. మెస్సియా ఈ కొత్త నిబంధన మొదలు పెడతాడు.
- 21:14 మెస్సియా మరణం, పునరుత్థానం ద్వారా దేవుడు పాపులను రక్షించే తన పథకం అమలు పరచి కొత్త నిబంధన ఆరంభిస్తాడు.
- 38:05 తరువాత యేసు ఒక పాత్ర తీసుకుని “తాగండి” అని చెప్పాడు, ఇది నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన పాప క్షమాపణ కోసం ఒలకబోయబడింది. మీరు దీన్ని తాగే ప్రతి సమయంలో ఇది గుర్తు చేసుకోండి.
- 48:11 అయితే దేవుడు ఒక కొత్త నిబంధన చేశాడు. ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. కొత్త నిబంధన మూలంగా ఏ జాతి వారైనా యేసులో దేవుని ప్రజలు అవుతారు.
పదం సమాచారం:
- Strong's: H1285, H2319, H3772, G802, G1242, G4934
నియమించు, నియమించిన, నియమించ బడిన
నిర్వచనం:
"నియమించు” “నియమించ బడిన"అనే పదాలు ఎవరినైనా ఎన్నుకుని ఇదమిద్ధమైన కార్యాచరణ లేక పాత్ర నెరవేర్చడం అనే దాన్ని సూచిస్తున్నాయి.
- "నియమించ బడిన" అంటే "ఎంపిక అయిన" అనే అర్థం కూడా ఇస్తుంది. "నిత్య జీవానికి నియమించ బడిన"అని రాసిన చోట్ల దేన్నైనా పొందిన అనే అర్థం వస్తుంది. మనుషులు "నిత్య జీవానికి నియమించ బడిన" అంటే వారిని శాశ్వత జీవం పొందడం కోసం ఎన్నుకోవడం జరిగింది అని అర్థం.
- పద బంధం "నిత్య జీవానికి నియమించ బడిన" అంటే ఏదైనా జరగడానికి దేవుని "నిర్ణయ కాలం” లేక “నియమించిన సమయం"అని అర్థం.
- ఈ పదం "నియమించు" అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యమని "ఆజ్ఞ” లేక “కేటాయింపు".
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, అనువదించడం చెయ్యండి. "నియమించు"అనే దానిలో "ఎన్నుకున్న” లేక “కేటాయించు” లేక “పథకం ప్రకారం ఎన్నుకున్న” లేక “ఎంపిక చేసి ప్రకటించు"అనే అర్థాలు వస్తాయి.
- ఈ పదం "నియమించ బడిన"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కేటాయించు” లేక “పథకం వేయు” లేక “ఇదమిద్ధంగా ఎన్నుకొను."
- "నియమించ బడిన"అనే దాన్ని "ఎంపిక కావడం"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
బైబిల్ రిఫరెన్సులు:
- 1సమూ 08:10-12
- అపో. కా. 03:19-20
- అపో. కా. 06:2-4
- అపో. కా. 13:48-49
- ఆది 41:33-34
- సంఖ్యా 03:9-10
పదం సమాచారం:
- Strong's: H561, H977, H2163, H2296, H2706, H2708, H2710, H3198, H3245, H3259, H3677, H3983, H4150, H4151, H4152, H4487, H4662, H5324, H5344, H5414, H5567, H5975, H6310, H6485, H6565, H6635, H6680, H6923, H6942, H6966, H7760, H7896, G322, G606, G1299, G1303, G1935, G2525, G2749, G4287, G4384, G4929, G5021, G5087
నిర్దోష
నిర్వచనం:
"నిర్దోష" నేరం చేసిన, ఇతరత్రా తప్పు చేసిన అపరాధ భావం లేని స్థితి. ఇది సాధారణంగా చెడుకార్యాలు చెయ్యని మనుషులకు వర్తిస్తుంది.
- ఒక వ్యక్తి ఏదైనా చేసినట్టు నేరం మోపబడితే అతడు ఆ తప్పు చెయ్యలేదని తేలితే అతడు నిర్దోషి.
- కొన్ని సార్లు "నిర్దోష" అనే పదాన్ని ఏ తప్పు చేయని వారికి తమకు జరుగుతున్నది అన్యాయం అయినప్పుడు వాడతారు. ఉదాహరణకు శత్రు సైన్యం "నిర్దోష ప్రజలపై" దాడి చేసినప్పుడు.
అనువాదం సలహాలు:
- ఎక్కువ సందర్భాల్లో "నిర్దోష" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "అపరాధ భావం లేని” లేక “బాధ్యుడు కాని” లేక “ఆరోపణకు తగని."
- సాధారణంగా నిర్దోష ప్రజలకు అన్వయించినప్పుడు ఈ పదాన్నిఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తప్పులేని వాడు” లేక “ఎలాటి దుష్టత్వంలో భాగం లేని."
- "నిర్దోష రక్తం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరణ శిక్షకు తగిన నేరమేదీ చెయ్యని."
- "నిర్దోష రక్తం ఒలికించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిర్దోషులను చంపు” లేక “ఏ తప్పు చేయని వారిని చంపడం."
- సందర్భంలో ఎవరినైనా చంపినప్పుడు, "నిర్దోష రక్తం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరణపాత్రుడు కాని."
- యేసును గురించిన సువార్తను వినని కారణంగా "అపరాధం విషయంలో నిర్దోషి" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆత్మ సంబంధమైన మృతస్థితిలో ఉన్నదానికి బాధ్యులు కారు” లేక “వారు సందేశం అంగీకరించనందుకు బాధ్యులు కారు."
- యూదా "నేను నిర్దోష రక్తం విషయంలో ద్రోహం చేశాను," అన్నప్పుడు అతడు "ఏ తప్పు చెయ్యని మనిషికి ద్రోహం చేశాను” అంటున్నాడు. లేక “దోషం లేని మనిషి మరణం పొందేలా చేశాను."
- యేసును గురించి పిలాతు "నేను నిర్దోషి రక్తం విషయంలో నిర్దోషని" అన్న దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఏ తప్పు చేయని ఈ మనిషి మరణంలో నాకు ఏ బాధ్యతా లేదు."
(చూడండి: అపరాధ భావం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 04:3-4
- 1 సమూయేలు 19:4-5
- అపో. కా. 20:25-27
- నిర్గమ 23:6-9
- యిర్మీయా 22:17-19
- యోబు 09:21-24
- రోమా 16:17-18
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 08:06 తరువాత రెండు సంవత్సరాల వరకు, అతడు నిర్దోషి అయినప్పటికీ యోసేపు ఇంకా చెరసాలలో ఉన్నాడు.
- 40:04 వారిలో ఒకడు యేసును హేళన చేశాడు. అయితే మరొకడు "నీకు దేవుని భయం లేదా?” అన్నాడు. దోషులం, అయితే ఈ మనిషి నిర్దోషి."
- 40:08 యేసుకు కాపలా ఉన్న సైనికుడు అక్కడ సంభవిస్తున్నదంతా చూసి "తప్పనిసరిగా, ఈ మనిషి నిర్దోషి. అతడు దేవుని కుమారుడు" అన్నాడు.
పదం సమాచారం:
- Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121
నిర్వాహకుడు, కార్యనిర్వాకుడు, గృహనిర్వాహకత్వం
నిర్వచనం:
బైబిలులో “నిర్వాహకుడు” లేదా “కార్యనిర్వాహకుడు” యజమాని ఆస్థి. అతని వ్యాపార వ్యవహాలను గురించిన బాధ్యత తీసుకోడానికి నియమించబడినవాడు అని సూచిస్తుంది.
- గృహనిర్వాహకునికి అధిక బాధ్యత ఇవ్వబడింది. ఇతర సేవకుల మీద పర్యవేక్షణ చెయ్యడం కూడా దీనిలో ఉంది.
- ”నిర్వాహకుడు” పదం కార్యనిర్వాహకుడు అనేదానికి వాడే ఆధునిక పదం. ఒకనికి చెందిన ఆచరణీయ వ్యవహాలన్నిటినీ నిర్వహించడం గురించీ రెండు పదాలు సూచిస్తున్నాయి.
అనువాద సూచనలు:
- ఈ పదం “పర్యవేక్షకుడు” లేదా “ఇంటి నిర్వాహకుడు” లేదా “నిర్వహించు సేవకుడు” లేదా “నిర్వహించు వ్యక్తి” అని అనువదించబడవచ్చు.
(చూడండి: సేవకుడు)
బైబిలు రెఫరెన్సులు:
- 1 తిమోతి 03:4-5
- ఆదికాండం 39:04
- ఆదికాండం 43:16
- యెషయా 55:10-11
- లూకా 08:03
- లూకా 16:02
- మత్తయి 20:8-10
- తీతు 01:07
పదం సమాచారం:
- Strong's: H376, H4453, H5057, H6485, G2012, G3621, G3623
నిలువు, వరసలు, స్తంభము, స్తంభములు
నిర్వచనము:
“స్తంభము” అనే పదము సాధారణముగా పైకప్పును భారము పట్టుకొని ఉండుటకు ఉపయోగించే ఒక పెద్ద నిలువు కట్టడను సూచించును.
“స్తంభము” అను పదానికి మరియొక పదము “నిలువు” అని అంటారు.
- పరిశుద్ధ గ్రంథ కాలములో భవనములను నిర్మించుటలో పడిపోకుండా నిలువబెట్టుటకు ఉపయోగించే స్తంభములు సాధారణముగా ఒకే రాతినుండి చెక్కేవారు.
- పాత నిబంధనలో సంసోను ఫిలిష్టియులుచేత పట్టబడినప్పుడు, అతనిని దేవాలయములో కట్టివేసి ఉంచినప్పుడు ఆ స్తంభములను గట్టిగా లాగుట ద్వారా వారి అన్య దేవాలయమును నాశనము చేసెను.
- “స్తంభము” అనే పదము కొన్నిమార్లు ఒక గొప్ప సంఘటన జరిగిన చోట గురుతుగా ఉంచుటకు లేక సమాధివద్ద జ్ఞాపకార్ధముగా పెట్టుటకు ఒక పెద్ద రాయిని లేక చెక్కిన ఒక పెద్ద రాతి బండను సూచిస్తుంది.
- ఒక అబద్ధపు దేవుణ్ణి ఆరాధించుటకు చేసే ఒక విగ్రహమును కూడా ఈ పదము సూచిస్తుంది. ఈ పదము “చెక్కిన రూపము” అనే మాటకు కూడా వర్తిస్తుంది మరియు దీనిని “ప్రతిమ” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “స్తంభము” అనే పదమును ఒక స్తంభములాగా ఆకారములో ఉన్నదానిని సూచించుటకు ఉపయోగించబడినది, ఉదాహరణకు, ఇశ్రాయేలీయులను అరణ్యము ద్వారా రాత్రి పూట నడిపించిన “అగ్ని స్తంభము” లేక లోతు భార్య పట్టణమును వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె “ఉప్పు స్తంభముగా” మారడము.
- భవనము పడిపోకుండా ఉంచే ఒక కట్టడగా ఉపయోగించే “స్తంభము” లేక “నిలువు కట్టడ” అనే పదములను “దూలము పడిపోకుండా పెట్టె నిలువెత్తు రాయి” లేక “పడిపోకుండా కట్టే రాతి కట్టడ” అని కూడా తర్జుమా చేయవచ్చు.
- “స్తంభము” అనే పదమును ఉపయోగించే వాటిలో “ప్రతిమ” లేక “గుట్ట” లేక “దిబ్బ” లేక “స్మారక చిహ్నం” లేక “పొడవైన ద్రవ్యరాశి” అని సందర్భానుసారముగా ఉపయోగిస్తారు.
(ఈ పదములను కూడా చుడండి: స్థాపన, దేవుడు, స్వరూపం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 రాజులు.18:4-5
- నిర్గమ.13:19-22
- నిర్గమ.33:7-9
- ఆది.31:45-47
- సామెతలు.09:1-2
పదం సమాచారం:
- Strong's: H352, H547, H2106, H2553, H3730, H4552, H4676, H4678, H4690, H5324, H5333, H5982, H8490, G4769
నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత
నిర్వచనం:
“నీతి" పదం దేవుని సంపూర్ణ మంచితనం, న్యాయం, విశ్వాస్యత, ప్రేమలను సూచిస్తుంది. ఈ గుణలక్షణాలు కలిగియుండడం దేవుడు నీతిమంతుడు” అని తెలియజేస్తాయి. దేవుడు నీతిమంతుడు కనుక ఆయన పాపాన్ని శిక్షించాలి.
- ఈ పదాలన్నీ తరచుగా దేవునికి విధేయత చూపిస్తున్న వ్యక్తినీ, నైతికంగా మంచిగా ఉన్న వ్యక్తినీ వివరించడానికి ఉపయోగించబడుతున్నాయి. అయితే మనుష్యులందరూ పాపం చేశారు, దేవుడు తప్పించి ఏ ఒక్కరూ సంపూర్ణంగా నీతిమంతులు కాదు.
- బైబిలులో “నీతిమంతుడు” అని పిలువబడినవారిలో నోవహు, యోబు, అబ్రాహాము, జెకర్యా, ఎలీసెబెతులు.
- ప్రజలు తాము రక్షించబడడానికి యేసు నందు విశ్వాసం ఉంచినప్నుపుడు దేవుడు వారిని తమ పాపాలనుండి శుద్ధి చేస్తాడు, యేసు నీతిని బట్టి వారిని నీతిమంతులుగా ప్రకటిస్తాడు.
“అవినీతి" అంటే పాపయుతంగా ఉండడం, నైతికంగా భ్రష్టమైనదిగా ఉండడం. దుర్మార్గం (అన్యాయం) పాపాన్ని లేదా పాపయుత స్థితిలో ఉండడం అని సూచిస్తుంది.
- ఈ పదాలు దేవుని బోధనలకూ, ఆయన ఆజ్ఞలకూ అవిధేయత చూపించే విధానములో జీవించుటను ప్రత్యేకించి సూచిస్తుంది.
- అనీతిమంతులైన ప్రజలు వారి ఆలోచనలలోనూ, క్రియలలోనూ అవినీతికరంగా ఉంటారు.
- కొన్నిమార్లు “అనీతిమంతులు” పదం ప్రత్యేకించి యేసునందు విశ్వాసం ఉంచని ప్రజలను సూచిస్తుంది.
“న్యాయబద్ధమైనవాడు," "న్యాయబద్ధత" పదాలు దేవుని ధర్మాలను అనుసరించే విధానంలో జీవించడానిని సూచిస్తుంది.
- ఈ పదాల అర్థంలో నిటారుగా నిలవడం, నేరుగా ముందుకు చూడడం అనే అభిప్రాయం ఉంది.
- “న్యాయబద్ధంగా" ఉన్న వ్యక్తి దేవుని ధర్మాలకు విదేయత చూపుతాడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా కార్యాలు చేయడు.
- “నిజాయితీ,” “నీతి” వంటి పదాలు ఒకే అర్థాన్ని కలిగి యున్నాయి. కొన్నిసార్లు ఈ రెండు పదములు ఒకే అర్థమును కలిగియుంటాయి మరియు కొన్నిమార్లు సమాంతర నిర్మాణాలలో “నిజాయితీ, నీతి” వంటి పదాలు ఉపయోగించబడతాయి. (చూడండి: సమాంతరత
అనువాదం సూచనలు:
- ఈ మాట దేవునిని వివరించినప్పుడు, “నీతి” అనే పదం “పరిపూర్ణముగా మంచిది మరియు న్యాయమైనది” లేక “ఎల్లప్పుడూ సరిగ్గా నడుచుకొనునది” అని అనువదించబడవచ్చు.
- దేవుని “నీతి" అనే పదం “పరిపూర్ణమైన విశ్వాస్యత, న్యాయం" లేదా "ఎల్లప్పుడూ సరియైన కార్యాలు చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- దేవునికి విధేయులైన ప్రజలను గూర్చి వివరించినప్పుడు, “నీతి” పదం “నైతికముగా మంచితనము” లేదా “న్యాయమైన” లేక “దేవుణ్ణి సంతోషపరచే జీవితాన్ని జీవించడం" అని కూడా అనువదించబడవచ్చు.
- “నీతిమంతులు” అనే పదం “నీతిగల ప్రజలు” లేదా “దేవునికి భయపడే ప్రజలు” అని కూడా అనువదించబడవచ్చు.
-
సందర్భాన్ని బట్టి “నీతి" అనే పదం “మంచితనము” లేదా “దేవుని ముందు పరిపూర్ణముగా ఉండుట” లేదా “దేవునికి విధేయత చూపుట ద్వారా సరియైన విధానములో ఉండుట” లేదా “పరిపూర్మంణంగా మంచిని చెయ్చియడం" అని అర్తథం ఇచ్నచేలా అనువదించబడవచ్చు.
-
"అనీతి" పదం "నీతి కానిది" అని సామాన్యంగా అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి ఈ పదం "దుష్టత్వము” లేదా “అనైతికత” లేదా “దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసిన ప్రజలు” లేదా “పాపాత్ములు” అని ఇతరవిధాలుగా అనువదించబడవచ్చు.
- “అనీతిమంతులు" పదం “నీతిలేని ప్రజలు” అని అనుమతించబడవచ్చు.
- “అనీతి" పదం "పాపం" లేదా “చెడు ఆలోచనలూ, క్రియలు” లేదా “దుష్టత్వము” అని అనువదించబడవచ్చు.
-
సాధ్యమైతే, “నీతిమంతులు, నీతి” అనే పదాలతో వీటికున్న సంబంధమును చూపించే విధానములో దీనిని అనువదించడం ఉత్తమం.
-
“న్యాయబద్ధమైన" పదం అనువాదంలో “సరిగా నడుకొనడం" లేదా సరిగా నడుచుకొను వ్యక్తి" లేదా "దేవుని ధర్మాలను అనుసరించడం" లేదా “దేవునికి విధేయత చూపడం” లేదా “సరియైన విధానములో ప్రవర్తించడం" అనే పదాలు జతచెయ్యబడవచ్చు.
- “న్యాయబద్ధత" పదం “నైతికమైన పవిత్రత” లేదా “మంచి నైతిక ప్రవర్తన" లేదా “న్యాయమైన" అని అనువదించబడవచ్చు.
- “న్యాయబద్ధమైన" పదం "న్యాయబద్ధంగా ఉన్న ప్రజలు" లేదా "న్యాయబద్ధమైన వారు" అని అనువదించబడవచ్చు.
(చూడండి: దుష్టత్వం, విశ్వసనీయ, మంచిది, పరిశుద్ధమైన, యథార్థత, న్యాయమైన, ధర్మం, ధర్మశాస్త్రం, లోబడు, శుద్ధమైన, నీతిగల, పాపము)
బైబిలు రిఫరెన్సులు:
- ద్వితి. 19:16
- యోబు 01:08
- కీర్తనలు 037:30
- కీర్తనలు 049:14
- కీర్తనలు 107:42
- ప్రసంగి 12:10-11
- యెషయా 48:1-2
- యెహెజ్కేలు 33:13
- మలాకీ 02:06
- మత్తయి 06:01
- అపొ.కా 03:13-14
- రోమా 01:29-31
- 1 కొరింథీ 06:09
- గలతీ 03:07
- కొలస్సీ 03:25
- 2 థెస్స 02:10
- 2 తిమోతి 03:16
- 1 పేతురు 03:18-20
- 1 యోహాను 01:09
- 1 యోహాను 05:16-17
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- 03:02 అయితే నోవహు దేవుని దయను పొందెను. అతను నీతిమంతుడు, దుష్ట ప్రజల మధ్యన జీవించుచుండెను.
- 04:08 దేవుని వాగ్ధానమునందు అబ్రాహాము విశ్వసించినందున అతడు నీతిమంతుడు అని దేవుడు వెల్లడి చేశాడు.
- 17:02 దావీదు వినయమనస్కుడు, నీతిమంతుడు, దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవునికి లోబడినవాడు.
- 23:01 మరియతో ప్రధానము చేయబడిన యోసేపు నీతిమంతుడైన మనిషి.
- 50:10 ఆ తరువాత, నీతిమంతులు వారి తండ్రియైన దేవుని రాజ్యములో సూర్యునివలె ప్రకాశించెదరు.
పదం సమాచారం:
- Strong's: H205, H1368, H2555, H3072, H3474, H3476, H3477, H3483, H4334, H4339, H4749, H5228, H5229, H5324, H5765, H5766, H5767, H5977, H6662, H6663, H6664, H6665, H6666, H6968, H8535, H8537, H8549, H8552, G93, G94, G458, G1341, G1342, G1343, G1344, G1345, G1346, G2118, G3716, G3717
నూనె
నిర్వచనం
నూనె చిక్కని, స్వచ్చమైన ద్రవం, కొన్ని మొక్కలనుండి దీనిని తీస్తారు.
బైబిలు కాలంలో నూనె ఒలీవల మొక్కలనుండి తీసేవారు.
- ఒలీవల నూనె వంటకీ, అభిషేకానికీ, అర్పనలకూ, దీపాలకూ, వైద్యానికీ వినియోగిస్తారు.
- పురాతన కాలంలో ఒలీవల నూనె అత్యంత విలువైనదిగా యెంచేవారు, నూనెను కలిగియుండడం గొప్ప సంపడకు పరిమాణంగా యెంచేవారు.
- ఈ పదాన్ని అనువదించేటప్పుడు ఈ నూనె వంటలో వినియోగించే నూనెలా అర్థమిచ్చేలా చూడండి, వాహన సంబంధమైన నూనె కాదు. వివిధ రకాలైన నూనేలకు కొన్ని బాషలలో వివిధ పదాలు ఉన్నాయి.
(చూడండి: ఒలీవ, బలియాగము)
బైబిలు రిఫరెన్సులు:
- 2 సమూయేలు 01:21-22
- నిర్గమకాండం 29:1-2
- లేవికాండం 05:11
- లేవికాండం 08:1-3
- మార్కు 06:12-13
- మత్తయి 25:7-9
పదం సమాచారం:
- Strong's: H1880, H2091, H3323, H4887, H6671, H7246, H8081, G1637, G3464
నెగెబు
వాస్తవాలు:
నెగెబు ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతంలోని ఒక అరణ్య ప్రదేశం, ఇది ఉప్పు సముద్రానికి నైరుతి దిశలో ఉంది.
- ఈ పదంకున్న ప్రారంభ అర్థం, “దక్షిణం,” కొన్ని ఆంగ్ల అనువాదాలు ఈ విధంగా తర్జుమా చేసాయి.
- ఈ రోజున నెగెబు అరణ్యం ఉన్న ప్రదేశంలో “దక్షిణం” లేదు.
- అబ్రహాం కాదేషు పట్టణంలో ఉన్నప్పుడు అతడు నెగెబులో లేక దక్షిణ ప్రాంతంలో నివసించాడు.
- రిబ్కా తనను కలుసుకొని తనకు భార్యగా కావడానికి వస్తున్నప్పుడు ఇస్సాకు నెగెబులో ఉన్నాడు.
- యూదా గోత్రాలు – యూదా, షిమియోను దక్షిణ ప్రాంతంలో నివాసం ఉన్నారు.
- నెగెబు ప్రాంతంలో అతి పెద్ద పట్టణం బెయెర్షబా.
(చూడండి: అబ్రాహాము, బెయెర్షేబా, ఇశ్రాయేలు, యూదా, కాదేషు, ఉప్పు సముద్రము, షిమ్యోను)
బైబిలు రెఫరెన్సులు:
- ఆదికాండం 12:8-9
- ఆదికాండం 20:1-3
- ఆదికాండం 24:61-62
- యెహోషువా 03:14-16
- సంఖ్యాకాండం 13:17-20
పదం సమాచారం:
నెల, నెలలు, నెలవారీ
నిర్వచనం:
"నెల" అనేది ఒక కాల పరిమితి. సుమారు నలుగు వారాలు ఉంటాయి. నెలలో రోజుల సంఖ్య సౌరమానం, చాంద్రమానం వాడకాన్ని బట్టి మారుతుంది.
- చాంద్రమానం కాలెండర్లో నెల నిడివి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం అంటే సుమారు 29 రోజులు ఉంటుంది. ఇందులో సంవత్సరానికి 12 లేక 13 నెలలు ఉంటాయి. సంవత్సరం 12 లేక 13 నెలలు ఉన్నప్పటికీ, మొదటి నెలకు ఒకే పేరు ఉంటుంది, అది వివిధ ఋతువులు వివిధ కాలాలు ఉన్నదైనా.
- "అమావాస్య"లేక చంద్రుని ఆరంభ కళ. ఇది నెల పొడుపు. చాంద్రమాన కాలెండర్ లో మొదటి నెల.
- నెలలను బైబిల్లో ఇశ్రాయేలీయులు చాంద్రమానం కాలెండర్ ప్రకారం ఉపయోగిస్తారు.
ఆధునిక యూదులు ఇప్పటికీ మతపరమైన కాలెండర్ వాడతారు.
- ఆధునిక సౌరమాన కాలెండర్ లో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలం ప్రకారం లెక్కిస్తారు. (సుమారు 365 రోజులు). సంవత్సరం అనేది ఎప్పుడూ 12 నెలలే. ప్రతి నెల నిడివి 28నుంచి 31 రోజులు ఉంటుంది.
బైబిల్ రిఫరెన్సులు:
- 1సమూయేలు 20:32-34
- అపో. కా. 18:9-11
- హెబ్రీ 11:23-26
- సంఖ్యా 10:10
పదం సమాచారం:
- Strong's: H2320, H3391, H3393, G3376
నేరం, నేరాలు, నేరస్థుడు, నేరస్థులు
నిర్వచనం:
ఈ పదం "నేరం" సాధారణంగా ఒక దేశ చట్టాన్ని ఉల్లంఘించే నేరాన్ని సూచిస్తున్నది. ఈ పదం "నేరస్థుడు" ఎవరైనా నేరం చేసిన మనిషికి వాడతారు.
- వివిధ నేరాలు ఒక వ్యక్తిని చంపడం, లేక ఎవరి అస్తినైనా దొంగిలించడం మొదలైనవి.
- నేరస్థుడిని సాధారణంగా పట్టుకుని కొన్ని రకాల బంధకాలలో అంటే చెరసాల వంటి దానిలో పెడతారు.
- బైబిల్ కాలాల్లో, కొందరు నేరస్థులు తమపై పగ సాధించే వారినుండి తప్పించుకునేందుకు పారిపోయి, ఒక చోటి నుండి మరొక చోటికి తిరుగుతూ ఉంటారు.
(చూడండి: దొంగ)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 తిమోతి 02:8-10
- హోషేయ 06:8-9
- యోబు 31:26-28
- లూకా 23:32
- మత్తయి 27:23-24
పదం సమాచారం:
- Strong's: H2154, H2400, H4639, H5771, H7563, H7564, G156, G1462, G2556, G2557, G4467
నైలు నది, ఐగుప్తు నది, నైలు
వాస్తవాలు:
నైలు చాలా పొడవు, వెడల్పు కలిగిన నది, ఆఫ్రికా ఈశాన్య దిశలో ఉంది. ఐగుప్తులో ఇది ప్రఖ్యాతి గాంచిన ప్రధానమైన నది.
- నైలు నది ఐగుప్తుకు ఉత్తరాన ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
- నైలు నదికి ఇరువైపులా సస్యశ్యామలమైన భూమిలో పంటలు పెరుగుతాయి.
- ఐగుప్తులో అనేకులు నైలునదికి దగ్గరలో నివసిస్తారు, ఎందుకంటే ఆహారపంటలకు నైలునది అత్యంత ప్రాముఖ్యమైన ప్రధాననీటి వనరు.
- ఇశ్రాయేలీయులు గోషెను ప్రాంతంలో నివసించారు, ఇది చాలా ఫలవంతమైన భూభాగం ఎందుకంటే ఇది నైలునదికి సమీపంలో ఉంది.
- మోషే బాలునిగా ఉన్నప్పుడు, మోషే తల్లిదండ్రులు ఆ బాలును ఒక పెట్టెలో ఉంచి ఫరో మనుష్యులనుండి కాపాడడానికి నైలునది రెళ్ళు మధ్యలో దాచారు.
(చూడండి: ఈజిప్టు, గోషేను, మోషే)
బైబిలు రెఫరెన్సులు:
- ఆమోసు 08:7-8
- ఆదికాండం 41:1-3
- యిర్మియా 46:7-9
బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:
- 08:04 ఐగుప్తు చాల పొడవైన, శక్తివంతమైన దేశం, ఇది నైలునది వెంబడి ఆనుకొని ఉంది.
- 09:04 ఇశ్రాయేలీయులు అనేకమంది బిడ్డలను కలిగియున్నారని ఫరో చూచాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల బాలురను నైలునదిలో పడద్రోయడం ద్వారా వారిని చంపివేయాలని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు.
- 09:06 పిల్లవాని తల్లిదండ్రులు వానిని దాచలేక వాడు చనిపోక బ్రతుకునట్లు నైలునది రెళ్ళు మధ్య నీటిమీద తేలుచున్న బుట్టలో ఉంచారు.
- 10:03 దేవుడు నైలునదిని రక్తముగా మార్చాడు, అయితే ఇంకనూ ఫరో ఇస్రాయేలీయులను వెళ్ళనియ్యలేదు.
పదం సమాచారం:
- Strong's: H2975, H4714, H5104
నోవహు
వాస్తవాలు:
నోవాహు 4,000 సంవత్సరాల క్రితం లోకంలోని దుష్టప్రజలందరినీ నాశనం చెయ్యడానికి సర్వలోక జలప్రళయాన్ని పంపిన కాలంలో జీవించాడు, భూమి నీటితో నిండిపోయినప్పుడు తానునూ, తన కుటుంబమూ కాపాడబడునట్లు దేవుడు అతిపెద్దడైన ఓడను తయారు చెయ్యమని దేవుడు నోవహుతో చెప్పాడు,
- నోవాహు నీతిమంతుడు, అన్నింటిలోనూ దేవునికి విధేయత చూపినవాడు.
- అతిపెద్దడైన ఓడను నిర్మించమని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టు నోవాహు ఖచ్చితంగా చేసాడు.
- ఓడలోపల, నొవహూ, అతని కుటుంబమూ క్షేమంగా ఉన్నారు, తరువాత వారి పిల్లలూ, మనుమసంతానమూ ప్రజలతో భూమిని నింపారు.
- ఆ కాలంనుండి పుట్టిన ప్రతీ ఒక్కరూ నోవాహు సంతానమే.
(చూడండి: వారసుడు, మందసం)
బైబిలు రెఫరెన్సులు:
- ఆదికాండం 05:30-31
- ఆదికాండం 05:32
- ఆదికాండం 06:7-8
- ఆదికాండం 08:1-3
- హెబ్రీ 11:7
- మత్తయి 24:37-39
బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:
- 03:02 అయితే నోవాహు దేవుని దయపొందినవాడయ్యాడు.
- 03:04 నోవాహు దేవునికి విధేయత చూపాడు. నోవహూ, తన ముగ్గురు కుమారులు దేవుడు వారికి చెప్పిన విధంగా ఓడను తయారు చేసారు.
- 03:13 రెండు నెలలు తరువాత “నీవునూ, నీ కుటుంబమూ, జంతువులన్నియూ ఓడనుండి వెళ్ళవచ్చని” దేవుడు నోవాహు తో చెప్పాడు. కుమారులనూ, కుమారుల కుమారులని కని భూమిని నింపుడి” అని చెప్పాడు. కాబట్టి నవహు నూ అతని కుటుంబమూ ఓడ నుండి బయటికి వచ్చారు.
పదం సమాచారం:
పడిపో, జారిపడుట, పడిపోయెను, పడిపోవుట
నిర్వచనము:
“పడిపో” అనే ఈ పదమునకు నడిచి వెళ్ళేటప్పుడు లేక పరుగెత్తేటప్పుడు “దాదాపు క్రిందకి పడిపోవుట” అని అర్థము. సాధారణముగా ఇది ఏదైనా ఒకదాని మీద తట్టుకొని పడుట అని అర్థమిచ్చును.
- అలంకారికముగా, “పడిపో” అనే ఈ పదానికి “పాపము చేయు” లేక నమ్ముటలో “తప్పు చేయుట” అని అర్థము.
- యుద్ధము చేయునప్పుడు లేక హింసించబడుచున్నప్పుడు లేక శిక్షించబడుచున్నప్పుడు తొట్రుపడుటను లేక బలహీనతను చూపించుటకు కూడా ఈ పదమును ఉపయోగించుదురు.
తర్జుమా సలహాలు:
- భౌతికముగా ఒకదాని మీద జారిపడినప్పుడు “పడిపో” అనే పదమును ఉపయోగించే సందర్భాలలో దీనిని “దాదాపు పడిపోయినట్లుగాను” లేక “జారిపడినట్లుగాను” అర్థమునిచ్చే మాటలతో తర్జుమా చేయాలి.
- సందర్భములో సరియైన అర్థమును ఇచ్చినట్లయితే, ఈ పదానికున్న అక్షరార్థ అర్థము అలంకార సందర్భములో కూడా ఉపయోగించబడుతుంది.
- అనువాద భాషలో అక్షరార్థము ఇవ్వని అలంకారిక ఉపయోగాలలో, “పడిపో” అనే పదమును “పాపము చేయు” లేక “తప్పు చేయు” లేక “నమ్ముటను ఆపు” లేక “బలహీనపడు” అని అనేక మాటలను సందర్భానుసారముగా తర్జుమా చేయవచ్చు.
- ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములో “పాపము చేయుట ద్వారా పడిపోవుట” లేక “నమ్మకుండుట ద్వారా జారిపడుట” అనే మాటలను వినియోగించుదురు.
- “పడిపోవునట్లు చేసెను” అనే మాటను “బలహీనమగుటకు కారణమాయెను” లేక “తప్పు చేయుటకు కారణమాయెను” అని కూడా తర్జుమా చేయుదురు.
(ఈ పదములను కూడా చూడండి: విశ్వసించు, హింసించు, పాపము, అడ్డంకు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 పేతురు.02:7-8
- హోషేయా.04:4-5
- యెషయా.31:3
- మత్తయి.11:4-6
- మత్తయి.18:7-8
పదం సమాచారం:
- Strong's: H1762, H3782, H4383, H4384, H5062, H5063, H5307, H6328, H6761, H8058, G679, G4348, G4350, G4417, G4624, G4625
పద్దనరాము
వాస్తవాలు:
పద్దనరాము అనునది ఒక ప్రాంతము పేరు, అబ్రాహాము మరియు తన కుటుంబం కానాను దేశమునకు వెళ్ళక మునుపు ఈ స్థలములోనే నివాసముండిరి. ఈ పదమునకు “ఆరాము బయలు” అని అర్థము కలదు.
- అబ్రహాము కానాను ప్రదేశమునకు ప్రయాణము చేయుటకు మునుపు హారానును పద్దనరాములోనే వదిలిపెట్టెను, తన కుటుంబములోనే ఎక్కువ శాతము ప్రజలు హారానులోనే ఉండిరి.
- అనేక సంవత్సరములైన తరువాత, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి చేయుటకు తన బంధువులలో అమ్మాయిని వెదుకుటకు తన దాసుని పద్దనరాముకు పంపెను మరియు అక్కడ ఆ దాసుడు బెతూయేలు మనమరాలైన రిబ్కాను కనుగొనెను.
- ఇస్సాకు మరియు రిబ్కా కుమారుడైన యాకోబు కూడా పద్దనరాముకు ప్రయాణము చేసియుండెను మరియు హారానులోనున్న రిబ్కా అన్నయైన లాబాను కూతుర్లను వివాహాము చేసికొనెను.
- ఆరాము, పద్దనరాము, మరియు అరాం-నహరాయిము అనునవి ఒకే ప్రాంతానికి చెందినవి, ఇవి ఇప్పుడు ఆధునిక దేశమైన సిరియాలోనున్నవి.
(ఈ పదాలను కూడా చూడండి: అబ్రాహాము, ఆరాము, బెతూయేలు, కనాను, హారాను, ఇశ్రాయేలు, లాబాను, రిబ్కా, సిరియా)
పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:
- ఆది.28:1-2
- ఆది.35:9-10
- ఆది.46:12-15
పదం సమాచారం:
పని, పనులు (కార్యములు), క్రియలు,
నిర్వచనం:
"పని" పదం సహజంగా ఏదైనా ఒకదానిని పూర్తి చెయ్యడానికి ప్రయత్నం చేసే చర్యను సూచిస్తుంది, లేదా ఆ చర్యయొక్క ఫలితాన్ని సూచిస్తుంది. "పనులు" పదం పనులన్నిటినీ ఒక మొత్తంగా సూచిస్తుంది (అంటే చెయ్యబడిన పనులు లేదా చెయ్యవలసిన పనులు)
- బైబిలులో ఈ పదాలు సాధారణంగా దేవునికీ, మానవులకూ సంబంధించినవిగా ఉపయోగించబడ్డాయి.
“దేవునికి సంబంధించి ఉపయోగించినప్పపుడు, బైబిలులో "పని” పదం తరచుగా ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని చర్యనూ లేదా తన ప్రజలను కాపాడిన కార్యాన్ని (వారి శత్రువులనుండి గానీ, పాపం నుండి గానీ, లేదా రెంటినుండి గానీ) సూచిస్తుంది.
- దేవుని “కార్యములు” ఆయన చేస్తున్న పనులన్నిటినీ లేదా చేసిన పనులన్నిటినీ, అంటే లోక సృష్టి, పాపులను రక్షించడం, సమస్త సృష్టి అవసరాలు తీర్చడం, సమస్త సృష్టిని కాపాడడం, సూచిస్తున్నాయి.
- ఒక వ్యక్తి చేసే పనులూ లేదా కార్యాలూ మంచివైయుండవచ్చు లేక చెడ్డవైయుండవచ్చు.
అనువాదం సూచనలు:
- “పనులు” పదం “క్రియలు” లేదా "చర్యలు" లేదా "జరిగిన కార్యాలు" అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.
- దేవుని "పనులు" లేదా “కార్యములు” లేదా "ఆయన చేతి కృత్యములు” పదాలు "అద్భుతాలు" లేదా "శక్తిగల కార్యాలు" లేదా "దేవుడు చేస్తున్న కార్యాలు" అని అనువదించబడవచ్చు.
- “దేవుని కార్యం" వ్యక్తీకరణ "దేవుడు చేస్తున్న కార్యాలు" లేదా "దేవుడు చేస్తున్న అద్భుతాలు" లేదా "దేవుడు పూర్తి చేసిన సమస్తము" అని అనువదించబడవచ్చు.
- “పని” అనే పదం "ప్రతీ మంచి పని" లేదా "ప్రతీ మంచి కార్యం" లో ఉన్నట్టుగా “పనులు” పదానికి ఇది ఏకవచనం.
- “పని” దేవుని కోసం లేదా ఇతరుల కోసం చేసినప్పుడు "సేవ" లేదా "పరిచర్య" అని అనువదించబడవచ్చు.
(చూడండి: ఫలం, పరిశుద్ధాత్మ, అద్భుతం)
బైబిలు రిఫరెన్సులు:
- 1 యోహాను 03:12
- అపొ.కా. 02:8-11
- దానియేలు 04:37
- నిర్గమ 34:10-11
- గలతీ 02:15-16
- యాకోబు 02:17
- మత్తయి 16:27-28
- మీకా 02:07
- రోమా 03:28
- తీతు 03:4-5
పదం సమాచారం:
- Strong's: H4566, H4567, H4611, H4659, H5949, G2041
పన్నెండు మంది, పన్నెండు
నిర్వచనం:
"పన్నెండు మంది" యేసు ఎన్నుకొన్న అయన తన అత్యంత సన్నిహితమైన శిష్యులు, లేక అపోస్తలులను సూచిస్తున్నది. తరువాత యూదా ఆత్మహత్య చేసుకున్నాక వారిని పదకొండు మంది అని పిలిచారు.
- యేసుకు అనేక మంది ఇతర శిష్యులు ఉన్నారు. అయితే ఈ బిరుదు నామం "పన్నెండు మంది" అనేది యేసుకు అత్యంత సన్నిహితమైన వారికి గుర్తింపుగా అలా ఉండిపోయింది.
- ఈ పన్నెండుమంది శిష్యుల పేర్ల జాబితాలు మత్తయి 10, మార్కు 3, లూకా 6లో ఉన్నాయి.
- కొంత కాలం తరువాత యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత "పన్నెండవ వాడుగా" ఎన్నుకొన్న శిష్యుడు పేరుమత్తియ. యితడు యూదా స్థానంలో వచ్చాడు. తరువాతవారు మరలా వారిని "పన్నెండు మంది" అని పిలిచారు.
అనువాదం సలహాలు:
- చాలా భాషల్లో మరింత స్పష్టమైన, సహజమైన పదం "పన్నెండు మంది అపోస్తలులు” లేక “యేసు పన్నెండుమంది అత్యంత సన్నిహితమైన శిష్యులను" సూచించేది ఉండవచ్చు.
- " పన్నెండు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యేసు పన్నెండు మిగిలిన శిష్యులు."
- కొన్నిఅనువాదాల్లో ఇంగ్లీషులో పెద్ద అక్షరం వాడి ఈ బిరుదు నామం "పన్నెండు మంది” “ పన్నెండు"ను సూచిస్తారు.
(చూడండి: అపొస్తలుడు, శిష్యుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 15:5-7
- అపో. కా. 06:2-4
- లూకా 09:1-2
- లూకా 18:31-33
- మార్కు 10:32-34
- మత్తయి 10:5-7
పదం సమాచారం:
పరదేశి, బహిష్కరణ, విదేశీయుడు, విదేశీయులు
నిర్వచనం:
"విదేశీయుడు" అంటే తనది కాని దేశంలో నివసించే వాడు. విదేశీయుడు అనే దానికి మరొక పేరు "పరదేశి."
- పాత నిబంధనలో, ఈ పదాన్నిముఖ్యంగా ఎవరైనా వివిధ ప్రజల సమూహాల నుండి వచ్చి వేరే ప్రజల మధ్య నివసించేటప్పుడు వాడతారు.
- విదేశీయుడు అనేవాడు ఉన్న ప్రాంతం కాకుండా వేరే భాష, సంస్కృతి గల ప్రాంతం నుండి వచ్చిన వాడు.
- ఉదాహరణకు, నయోమి ఆమె కుటుంబం మోయాబుకు వలస పోయినప్పుడు విదేశీయులు. నయోమి ఆమె కోడలు రూతు తరువాత ఇశ్రాయేలుకు వచ్చినప్పుడు రూతును “విదేశీయురాలు" అన్నారు. ఎందుకంటే ఆమె not originally నుండి ఇశ్రాయేలు.
- అపోస్తలుడు పౌలు చెప్పాడు- ఎఫెసీయులు క్రీస్తును ఎరిగినప్పుడు వారు దేవుని నిబంధనకు "విదేశీయులు."
- కొన్ని సార్లు "విదేశీయుడు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "అపరిచితుడు." అయితే అది కేవలం ఎవరినైనా పరిచయం లేని తెలియని మనిషికి వాడాలి.
బైబిల్ రిఫరెన్సులు:
- 2 దిన 02:17-18
- అపో. కా. 07:29-30
- ద్వితీ 01:15-16
- ఆది 15:12-13
- ఆది 17:24-27
- లూకా 17:17-19
- మత్తయి 17:24-25
పదం సమాచారం:
- Strong's: H312, H628, H776, H1471, H1481, H1616, H2114, H3363, H3937, H4033, H5236, H5237, H5361, H6154, H8453, G241, G245, G526, G915, G1854, G3581, G3927, G3941
పరీక్ష, పరీక్షలు, పరీక్షించు
నిర్వచనం:
ఒక వ్యక్తి బలాలు, బలహీనతలు బయట పెట్టే దుర్లభం లేక బాధాకరమైన అనుభవాన్ని "పరీక్ష" అనే పదం సూచిస్తున్నది.
- దేవుడు తన ప్రజలను పరీక్షలకు గురి చేస్తాడు., అయితే ఆయన పాపం చేసేలా శోధించడు. సాతాను అయితే ప్రజలను పాపం చేసేలా శోధించుతాడు.
- దేవుడు కొన్ని సార్లు మనుషుల పాపం బయట పెట్టేటందుకు పరీక్షలు పెడతాడు. పరీక్ష ఒక వ్యక్తిని పాపం నుండి పాపం తొలగించి దేవునికి దగ్గర చెయ్యడానికి ఉపయోగ పడుతుంది.
- బంగారం, ఇతర లోహాలు అగ్ని పరీక్ష మూలంగా అవి ఎంత శుద్ధమైనవో దృఢమైనవో తెలుస్తాయి. దేవుడు బాధాకరమైన పరిస్థితులను తన ప్రజలను పరిక్షించడానికి వాడుకుంటాడు.
- "పరీక్షకు గురి చెయ్యడం" అంటే, "దేన్నైనా లేక ఎవరినైనా వారి విలువైను రుజువు చెయ్యడానికి" పూనుకోవడం.
- దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యడం అనే సందర్భంలో ఆయనను మన కోసం ఒక అద్భుతం చేసేలా అడగడం. ఇది తన కరుణను అలుసుగా తీసుకోవడమే..
- దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యకూడదని యేసు సాతానుతో చెప్పాడు. దేవుడు సర్వ శక్తిమంతుడు, అయన అన్నిటికీ ప్రతివారికీ పైగా ఉన్న పరిశుద్ధ దేవుడు.
అనువాదం సలహాలు:
- "పరీక్ష" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సవాలు” లేక “కష్టాలు అనుభవించేలా చెయ్యడం” లేక “చేవ ఎలాటిదో చూడడం."
- "పరీక్ష" అనే దాన్ని అనువదించడం, "సవాలు” లేక “కష్ట తరమైన అనుభవం ."
- "పరీక్షకు గురి చెయ్యడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరీక్ష” లేక “సవాలు విసరడం” లేక “తనను రుజువు చేసుకొమ్మని చెప్పడం."
- దేవుణ్ణి ఈ సందర్భంలో పరీక్షిస్తున్నాడు అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "దేవుడు తన ప్రేమ రుజువు చేసుకొమ్మని చెప్పడం."
- కొన్నిసందర్భాల్లో దేవుడు "పరీక్ష" పెడుతున్నప్పుడు కాకపోతే "శోధించు" అనే అర్థం వస్తుంది.
(చూడండి: శోధించు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 04:1-3
- 1 తెస్స 05:19-22
- అపో. కా. 15:10-11
- ఆది 22:1-3
- యెషయా 07:13-15
- యాకోబు 01:12-13
- విలాప 03:40-43
- మలాకీ 03:10-12
- ఫిలిప్పి 01:9-11
- కీర్తనలు 026:1-3
పదం సమాచారం:
- Strong's: H5713, H5715, H5749, H6030, H8584, G1242, G1263, G1303, G1957, G3140, G3141, G3142, G3143, G4303, G4828, G6020
పరుగెత్తు, పరుగెత్తించును, పరుగెత్తువాడు, పరుగెత్తువారు, పరుగెత్తుట
నిర్వచనము:
“పరుగెత్తు” అనే పదమునాకు అక్షరార్థము ఏమనగా “పాదాల మీద అతీ త్వరగా కదలుట” అని అర్థము, సాధారణముగా నడిచి వెళ్ళుటకంటెను అతి వేగంగా వెళ్ళుట అని అర్థము. “పరుగెత్తు” అనే ఈ మాటకు ముఖ్యార్థమును అనానుకూలమైన మాటలలో కూడా ఉపయోగించుదురు, వాటిలో కొన్ని ఈ క్రింది పేర్కొనబడినవి:
- “బహుమానము పొందునటువంటి విధానములో పరుగెత్తు” _ బహుమానము పొందుటకు పరుగు పందెములో పరుగెత్తినట్లుగానే అదే విధమైన పట్టుదలతో దేవుని చిత్తమును చేయుటలో పట్టుదల కలిగియుండాలి అని అర్థము.
- “నీ ఆజ్ఞల మార్గములో పరుగెత్తుట” - దేవుని ఆజ్ఞలకు సంతోషముగా అతీ త్వరగా విధేయత చూపుట అని అర్థము.
- “ఇతర దేవతల వెనుక పరుగెత్తు” అనగా ఇతర దేవుళ్ళను ఆరాధించుటలో కొనసాగు అని అర్థము.
- “నేను దాగియుండుటకు నీ వద్దకు నేను పరుగెత్తుకొని వచ్చెదను” అనగా అనేకమైన కష్టాలను ఎదుర్కొనుచునప్పుడు ఆశ్రయము మరియు భద్రత కొరకు దేవుని వైపునకు త్వరగా తిరుగుకొనుము అని అర్థము.
- నీళ్ళు మరియు ఇతర ద్రవ పదార్థములైన కన్నీరు, రక్తము, తీపు వంటకాలను మరియు నదులను “పరుగెత్తుచున్నాయి” అని చెప్పుదురు. దీనిని “ప్రవహిస్తున్నాయి” అని కూడా తర్జుమా చేయుదురు. ఒక దేశపు లేక ప్రాంతపు సరిహద్దును “నది ప్రక్కన ప్రవహించునది” లేక విభిన్న దేశపు సరిహద్దు అని కూడా చెప్పుదురు. దీనిని ఇంకొక విధానములో చెప్పి తర్జుమా చేయాలంటే, ఇతర దేశము ప్రక్కనే ఉన్న దేశపు సరిహద్దు లేక నది “ప్రక్కనే” ఉన్నటువంటి దేశపు సరిహద్దు అని చెప్పుదురు లేదా ఇతర దేశము లేక నదియే దేశపు “సరిహద్దులు” అని కూడా మాట్లాడుదురు.
- నదులు మరియు ప్రవాహాలు “ఎండిపోవచ్చును”, వీటికి అర్థము ఏమనగా వాటిలో నీరు ఎప్పటికీ ఉండదని దాని అర్థము. దీనిని “ఆరిపోయింది” లేక “ఎండిపోయింది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- విందు దినములు “గడిచిపోవును”, దీనికి అర్థము ఏమనగా “గడిచిపోయెను” లేక “ముగించబడెను” లేక “అయిపోయెను” అని అర్థము.
(ఈ పదములను కూడా చూడండి: దేవుడు, పట్టుదలతో ఉండడం, ఆశ్రయము, తిరుగు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 కొరింతి.06:18
- గలతీ.02:1-2
- గలతీ.05:5-8
- ఫిలిప్పీ.02:14-16
- సామెతలు.01:15-17
పదం సమాచారం:
- Strong's: H213, H386, H1065, H1272, H1518, H1556, H1980, H2100, H2416, H3001, H3212, H3332, H3381, H3920, H3988, H4422, H4754, H4794, H4944, H5074, H5127, H5140, H5472, H5756, H6437, H6440, H6544, H6805, H7272, H7291, H7310, H7323, H7325, H7519, H7751, H8264, H8308, H8444, G413, G1377, G1601, G1530, G1532, G1632, G1998, G2027, G2701, G3729, G4063, G4370, G4390, G4890, G4936, G5143, G5240, G5295, G5302, G5343
పాడు, పాడు చేయును, పాడు చేయబడెను
నిర్వచనము:
దేనినైనా “పాడు” చేయుట అనగా పనికిరాకుండా చేయుట, లేక నాశనము చేయుట, కొల్లబెట్టుట అని అర్థము. “పాడు” లేక “పాడుచేయును” అనే ఈ మాట నాశనము చేయబడిన ఏదైనా తాలూకు పడిపోయిన మరియు కొల్లగొట్టబడిన శిథిలాలను సూచించును.
- ప్రవక్తయైన జెఫన్య లోకమంతా తీర్పుతీర్చబడే మరియు శిక్షించబడే దినముకు సంబంధించి “పాడు దినముగా” దేవుని ఉగ్రత దినమును గూర్చి మాట్లాడెను.
- భక్తిహీనులైన వారికొరకు పాడును మరియు నాశనమును పొంచియుండునని సామెతల గ్రంథము తెలియజేయుచున్నది.
- సందర్భానుసారముగా, “పాడు” అనే ఈ పదమును “నాశనము చేయుట” లేక “కొల్లగొట్టుట” లేక “పనికిరాకుండా చేయుట” లేక “విరుగగొట్టుట” అని కూడా తర్జుమా చేయుదురు.
- “పాడు” లేక “పాడు చేయును” అనే ఈ మాటను “పడిపోయిన” లేక “భవనములన్నియు క్రిందకి కూలిపోయినవి” లేక “నాశనము చేయబడిన పట్టణము’ లేక “వినాశనము” లేక “విరుగగొట్టబడటము” లేక “నాశనము” అని సందర్భానుసారముగా తర్జుమా చేయుదురు.
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 దిన.12:7-8
- 2 రాజులు.19:25-26
- అపొ.కార్య.15:15-18
- యెషయా.23:13-14
పదం సమాచారం:
- Strong's: H6, H1197, H1530, H1820, H1942, H2034, H2040, H2717, H2719, H2720, H2723, H2930, H3510, H3765, H3782, H3832, H4072, H4288, H4383, H4384, H4654, H4658, H4876, H4889, H5221, H5557, H5754, H5856, H6365, H7451, H7489, H7582, H7591, H7612, H7701, H7703, H7843, H8047, H8074, H8077, H8414, H8510, G2679, G2692, G3639, G4485
పాతిపెట్టు, పాతిపెట్టిన, పాతిపెట్టుట, సమాధి
నిర్వచనం:
ఈ పదం "పాతిపెట్టు"అనేది సాధారణంగా మృత దేహాన్ని నేలలోగానీ, ఏదైనా సమాధి స్థలంలో గానీ ఉంచడానికి వాడే మాట. ఈ పదం "సమాధి"అనేది దేన్నైనా పాతిపెట్టడానికి, లేక దేన్నైనా పాతిపెట్టే స్థలాన్ని వర్ణించడానికి ఉపయోగిస్తారు.
- తరచుగా నేలలో గుంట తవ్వి మృత దేహాన్ని ఉంచి ఆ పైన మట్టి కప్పివేస్తారు.
- కొన్ని సార్లు మృత దేహాన్ని పెట్టె వంటి దానిలో అంటే శవ పేటికలో ఉంచి దాన్ని పాతిపెడతారు.
- బైబిల్ కాలాల్లో, మృత దేహాన్ని తరచుగా గుహ వంటి దానిలో ఉంచుతారు. యేసు చనిపోయాక , తన శరీరాన్ని బట్టలో చుట్టి రాతిలో తొలిచిన సమాధిలో పెట్టి పెద్ద బండ రాయితో మూసివేస్తారు.
- "సమాధి స్థలం” లేక “సమాధి గది” లేక “సమాధి కుహరం” లేక “సమాధి గుహ"అనేవి మృత దేహాన్ని పాతిపెట్టే స్థలం పేర్లు.
- ఇతర విషయాలను కూడా పాతిపెడతారు. ఉదాహరణకు ఆకాను యెరికోలో దొంగిలించిన వెండి, ఇతర వస్తువులను నేలలో పాతిపెట్టాడు.
- "తన ముఖం కప్పుకోవడం" అంటే సాధారణంగా "తన చేతులతో ముఖం కప్పుకుని" అనే అర్థం వస్తుంది.
- కొన్ని సార్లు ఈ పదం "దాచి పెట్టు"అనే దానికి "పాతిపెట్టు"అనే అర్థం వస్తుంది. ఆకాను కొన్ని వస్తువులను యెరికోలో దొంగిలించి నేలలో దాచిపెట్టాడు. అంటే అతడు నేలలో పాతిపెట్టాడు.
(చూడండి:యెరికో, సమాధి)
బైబిల్ రిఫరెన్సులు:
- 2రాజులు 09:9-10
- ఆది 35:4-5
- యిర్మీయా 25:32-33
- లూకా 16:22-23
- మత్తయి 27:6-8
- కీర్తనలు 079:1-3
పదం సమాచారం:
- Strong's: H6900, H6912, H6913, G1779, G1780, G2290, G4916, G5027
పానార్పణం
నిర్వచనం:
దేవునికి పానార్పణం బలి అర్పణగా బలిపీఠంపై ద్రాక్షారసం ఒలకబోయాలి. ఇది తరచుగా దహన బలి, నైవేద్యంతో కలిపి అర్పించాలి.
- పౌలు తన జీవం పానార్పణంగా సమర్పించబడుతున్నదని చెప్పాడు. అంటే అతడు సంపూర్ణంగా దేవుని సేవకు ప్రతిష్టించుకుంటున్నానని, తాను బాధల పాలు అవుతానని, మరణం వస్తుందని తెలిసినా ప్రజలకు యేసును గురించి చెప్పాలని అంటున్నాడు.
- యేసు మరణం సిలువపై అంతిమ పానార్పణంగా, తన రక్తం సిలువపై మన పాపాలకోసం చిందించాడు.
అనువాదం సలహాలు:
- అనువదించడంలో మరొక పధ్ధతి "ద్రాక్షారసం అర్పించడం."
- పౌలు అతడు తాను "అర్పణగా పోయబడుతున్నాను" అనే మాటను ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. " బోధ దేవుని సందేశం మనుషులకుచెప్పడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఎలానంటే బలిపీఠంపై ద్రాక్షారసం పారబోసినట్టు."
(చూడండి: దహన బలి, నైవేద్యం)
బైబిల్ రిఫరెన్సులు:
- నిర్గమ 25:28-30
- యెహెజ్కేలు 45:16-17
- ఆది 35:14-15
- యిర్మీయా 07:16-18
- సంఖ్యా 05:15
పదం సమాచారం:
- Strong's: H5257, H5261, H5262
పారాను
వాస్తవాలు:
పారాను అనునది కానాను దేశములో దక్షిణ భాగములోను మరియు తూర్పు ఐగుప్తులో ఉండే అరణ్యము లేక ఎడారి ప్రాంతమైయుండును. పారాను పర్వతము ఉన్నది, ఇది సీనాయి పర్వతమునకు మరొక పేరు అయ్యుండవచ్చును.
- దాసియైన హాగరును మరియు తన కుమారుడు ఇష్మాయేలును బయటికి పంపించమని శారా అబ్రహామునకు ఆదేశమిచ్చిన తరువాత వారు వెళ్లి పారాను అరణ్యములో ఉండిరి.
- మోషే ఇస్రాయేలియులను ఐగుప్తునుండి బయటకి నడిపించిన తరువాత వారు పారాను అరణ్యము ద్వారా వెళ్ళిరి.
- కానాను దేశమును వేగు చూచుటకు మరియు సమాచారమును సేకరించుటకు మోషే పన్నెండు మందిని పారాను అరణ్యమునందున్న కాదేషు-బర్నేయనుండి పంపించియుండెను.
- జిన్ అరణ్యము అనునది ఉత్తర పారాను మరియు సిన్ అరణ్యము దక్షిణ పారానుయైయుండెను.
(ఈ పదాలను కూడా చూడండి: కనాను, ఎడారి, ఈజిప్టు, కాదేషు, సీనాయి)
పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:
- 1 రాజులు.11:18-19
- 1 సమూ.25:1
- ఆది.21:19-21
- సంఖ్యా.10:11-13
- సంఖ్యా.13:3-4
పదం సమాచారం:
పాలన, పాలించును, పాలించబడెను, పాలించుచున్నది
నిర్వచనము:
“పాలన” అనే పదమునకు ఒక నిర్దిష్టమైన రాజ్యములో లేక దేశములో ప్రజలను పరిపాలించడం అని అర్థము. రాజు పాలన అనేది ఆయన పాలించే కాలపు వ్యవధిని సూచిస్తుంది.
- “పాలన” అనే పదమును సర్వప్రపంచమంతటి మీద రాజుగా దేవుడు పరిపాలన జరిగిస్తున్నాడని సూచించుటకు కూడా ఉపయోగించబడియున్నది.
- ఇశ్రాయేలీయులు దేవుణ్ణి రాజుగా తిరస్కరించినప్పటినుండి వారిని ఏలుటకు మనుష్య రాజులను దేవుడు వారి మీదకి అనుమతించాడు.
- యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఆయన రాజుగా సర్వలోకమంతటిని బహిరంగముగా పరిపాలన చేయును, మరియు క్రైస్తవులు ఆయనతోపాటు పాలన చేయుదురు.
- ఈ పదమును “ఖచ్చితమైన పాలన” లేక “రాజు పాలన” అని కూడా తర్జుమా చేయుదురు.
(ఈ పదములను కూడా చూడండి: రాజ్యము)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 తిమోతి.02:11-13
- ఆది.36:34-36
- లూకా.01:30-33
- లూకా.19:26-27
- మత్తయి.02:22-23
పదం సమాచారం:
- Strong's: H3427, H4427, H4437, H4438, H4467, H4468, H4475, H4791, H4910, H6113, H7287, H7786, G757, G936, G2231, G4821
పితరుడు, పితరులు
నిర్వచనము:
పరిశుద్ధ గ్రంథములో “పితరుడు” అనే పదము యూదుల జనాంగమునకు మూల వ్యక్తీని సూచిస్తుంది, విశేషముగా అబ్రహాము, ఇస్సాకు లేక యాకోబులను సూచిస్తుంది.
- ఈ పదము ఇస్రాయేలియుల 12 గోత్ర కర్తలైన 12 మంది యాకోబు సంతతిని కూడా సూచిస్తుంది.
- “పితరుడు” అనే పదముకు “మూలపితరుడు” అని అర్థము కలదు, అయితే ఒక జనాంగమునకు ప్రసిద్ధి చెందిన పూర్వికూలైన పురుష నాయకులను సూచించును.
(ఈ పదాలను కూడా చూడండి: పూర్వీకుడు)
పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:
- అపొ.కార్య.02:29-31
- అపొ.కార్య.07:6-8
- అపొ.కార్య.07:9-10
- ఎజ్రా.03:12-13
పదం సమాచారం:
- Strong's: H1, H7218, G3966
పిల్లలు, బిడ్డ, సంతానం
నిర్వచనం:
"బిడ్డ" పదం ("పిల్లలు" బహువచనం) ఒక స్త్రీ పురుషుల సంతానాన్ని సూచిస్తుంది. ఈ పదం సాధారణంగా వయసులో చిన్నవానినీ, ఇంకా పూర్తిగా ఎదగని యువజనునీ సూచించడానికి తరచుగా ఉపయోగించబడింది. "సంతానం" పదం ప్రజలు లేదా జంతువుల జీవసంబంధమైన సంతతి వారిని సాధారణంగా సూచిస్తుంది.
- బైబిలులో, శిష్యులూ, వెంబడించే వారు కొన్నిసార్లు "పిల్లలు" అని పిలువబడ్డారు.
- "పిల్లలు"అనే పదం తరచుగా ఒక వ్యక్తి సంతానాన్ని సూచిస్తూ ఉపయోగించబడింది.
- "విత్తనం" పదం కొన్నిసార్లు సంతానానికి చిత్ర రూపకంగా చూపించడానికి ఉపయోగించబడింది.
- బైబిలులో తరచుగా "సంతానం" అనే పదం "పిల్లలు" లేదా "సంతానం" అని ఒకే అర్థాన్ని కలిగియుంది.
- "పిల్లలు" పదం ఏదైనా ఒకదాని గుణలక్షణాలు కలిగియున్నట్టు సూచించవచ్చు.
కొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి:
అనువాదం సూచనలు:
- "పిల్లలు"అనే పదం ఒక వ్యక్తి మునుమనవళ్ళను లేదా గొప్ప మునుమనవళ్ళను మొదలైన వారిని సూచిస్తున్నప్పుడు "సంతానం" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, "పిల్లలు" అనే పదాన్ని "లక్షణాలు కలిగియున్నవ్యక్తులు" లేదా "వారిలా ప్రవర్తించే వ్యక్తులు" అని అనువదించవచ్చు.
- సాధ్యమైనంత వరకు "దేవుని పిల్లలు" పదం అక్షరాలా అనువదించబడవచ్చు ఎందుకంటే దేవుడు మన పరలోకపు తండ్రి అనేది బైబిలులో ప్రాముఖ్యమైన అంశం. "దేవునికి చెందిన వ్యక్తులు" లేదా "దేవుని ఆత్మీయ పిల్లలు" అనేది సాధ్యమైన అనువాదం.
- యేసు తన శిష్యులను "పిల్లలు,"అని పిలిచినప్పుడు ఇది "ప్రియమైన స్నేహితులు" లేదా "నా ప్రియమైన శిష్యులు" అని కూడా అనువదించబడవచ్చు.
- పౌలు, యోహాను యేసు నందు విశ్వాసులను "పిల్లలు" అని సూచించినప్పుడు ఇది "ప్రియమైన సహా విశ్వాసులు" అని కూడా అనువదించబడవచ్చు.
- "వాగ్దాన పుత్రులు” అనే వాక్యం "దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందిన ప్రజలు" అని కూడా అనువదించబడవచ్చు.
(చూడండి: వారసుడు, విత్తనము, వాగ్ధానం, కుమారుడు, ఆత్మ, విశ్వసించు, ప్రియమైన)
బైబిలు రిఫరెన్సులు:
- 1 యోహాను 02:28
- 3 యోహాను 01:04
- గలతీ 04:19
- ఆది. 45:11
- యొహోషువా 08:34-35
- నెహెమ్యా 05:05
- అపొ.కాs 17:29
- నిర్గమ 13:11-13
- ఆది. 24:07
- యెషయా 41:8-9
- యోబు 05:25
- లూకా 03:7
- మత్తయి 12:34
పదం సమాచారం:
- Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388
పెద్ద, వృద్ధలు, పాతది
నిర్వచనం:
"పెద్ద" లేదా "వృద్ధులు" పదం సమాజంలో పరిణతిగల పెద్దలుగానూ నాయకులుగానూ మారడానికి సరిపడిన వయసుకు ఎదిగిన ప్రజలను (బైబిలు సాధారణంగా పురుషులు) సూచిస్తుంది. ఉదాహరణకు, వృద్ధులకు నెరసిన వెంట్రుకలు ఉంటాయి, వయోజనులైన పిల్లలు ఉంటారు, లేదా మనుమ సంతానం ఉంటారు లేదా మునిమనుమ సంతానం ఉంటారు.
- "పెద్ద" పదం పెద్దలు సహజంగా వారి వయసు, అనుభావం, గొప్ప దర్శనం కలిగియుండడం కారణంగా వారు పెద్దలుగా ఉంటారనే వాస్తవం నుండి వచ్చింది.
- పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులను సామాజిక న్యాయం, మోషే ధర్మశాస్త్రం విషయాలలో నడిపించడానికి పెద్దలు సహాయపడ్డారు.
- కొత్త నిబంధనలో యూదు "పెద్దలు" వారి సమాజంలో పెద్దలుగా ఉండడం కొనసాగించారు, ప్రజలకు న్యాయం తీర్చే వారుగా ఉన్నారు.
- ఆదిమ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ "పెద్దలు" స్థానిక విశ్వాసుల సంఘాలలో ఆత్మ సంబంధమైన నాయకత్వం ఇచ్చారు. ఈ సంఘాలలోని పెద్దలలో ఆత్మ సంబంధమైన పరిణతి గల యువకులు కూడా ఉన్నారు.* ఈ పదం "వృద్ధులైన పురుషులు" లేదా "సంఘాన్ని నడిపిస్తున్న ఆత్మీయ పరిణతగల పురుషులు" అని అనువదించబడవచ్చు.
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన. 11:1-3
- 1 తిమోతి 03:1-3
- 1 తిమోతి 04:14
- అపొ. కా. 05:19-21
- అపొ. కా. 14:23
- మార్కు 11:28
- మత్తయి 21:23-24
పదం సమాచారం:
- Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850
పేరు
నిర్వచనం:
“పేరు” (నామం) అనే పదం ఒక నిర్దిష్టమైన వ్యక్తి లేదా వస్తువు పిలువబడే పదాన్ని సూచిస్తుంది. అయితే బైబిలులో "పేరు" పదం అనేక భిన్నమైన అంశాలను సూచించడానికి అనేక భిన్నమైన విధానాలలో ఉపయోగించబడింది.
- “కొన్ని సందర్భాలలో "పేరు" పదం "మన కోసం పేరు సంపాదించుకొందాము" అనే వాక్యంలో ఉన్నట్లు వ్యక్తి ప్రసిద్ధిని సూచిస్తుంది.
- ”పేరు” అంటే ఒకదాని జ్ఞాపకం అని కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, “విగ్రహాల పేర్లను కొట్టివేయండి” అంటే వాటి జ్ఞాపకం లేకుండా, ప్రజలు వాటిని పూజించకుండా ఆ విగ్రహాలను నాశనం చెయ్యండి అని అర్థం.
- ”దేవుని పేరున” మాట్లాడుతున్నాను అంటే ఆయన శక్తితోనూ, ఆయన అధికారంతోనూ లేదా ఆయన ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అని అర్థం.
- “ఆకాశం క్రింద మరి యే నామమున మనం రక్షణ పొందలేము” అనే వాక్యంలో ఉన్నట్టు ఒకని “పేరు” అతని పూర్తి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
“ఆయన మంచి పేరు” లాంటి మాటను “ఆయన మంచి కీర్తి” అని అనువదించబడవచ్చు.
- ”పేరులో” దేనినైనా చెయ్యడం అనే మాటను “అధికారంతో” లేదా “అనుమతితో” లేదా ఆ వ్యక్తి “ప్రతినిధిగా” చెయ్యడం అని అనువదించబడవచ్చు.
- ”మనకోసం పేరు సంపాదించుకొందము” అనే వాక్యం “అనేకులు మనల్ని తెలుసుకొనేలా చేసుకొందాం” లేదా “మనం ప్రాముఖ్యం అని అనేకమంది తలంచేలా చేసుకొందాం” అని అనువదించబడవచ్చు.
- ”ఆయన పేరున ప్రార్థించండి” అనే వాక్యం “పేరును పిలవండి” లేదా “ఆయనకు పేరునివ్వండి” అని అనువదించబడవచ్చు.
- ”నీ పేరును ప్రేమించువారు” అనే వాక్యం “నిన్ను ప్రేమించువారు” అని అనువదించబడవచ్చు.
- ”విగ్రహాల పేర్లు కొట్టివెయ్యండి” అనే వాక్యం “వాటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకొనకుండా అన్య విగ్రహాలను నాశనం చెయ్యండి” లేదా “అబద్ధపు దేవుళ్ళను ఆరాధించకుండ మనుష్యులను నిలువరించండి” లేదా “మనుష్యులు వాటిని గురించి ఇకమీదట తలంచకుండా విగ్రహాలన్నిటిని పూర్తిగా నాశనం చెయ్యండి” అని అనువదించబడవచ్చు.
బైబిలు రెఫరెన్సులు:
- 1 యోహాను 02:12
- 2 తిమోతి 02:19
- అపొ.కా. 04:07
- అపొ.కా. 04:12
- అపొ.కా. 09:27
- ఆది. 12:02
- ఆది. 35:10
- మత్తయి 18:05
పదం సమాచారం:
- Strong's: H5344, H7121, H7761, H8034, H8036, G2564, G3686, G3687, G5122
పోతీఫరు
వాస్తవాలు:
పోతీఫరు ఐగుప్తు ఫరో కొరకు నియమించబడిన ప్రాముఖ్యమైన అధికారి, ఇతను యోసేపు కొంతమంది ఇష్మాయేలీయులకు అమ్మబడిన కాలములో ఉండేవాడు.
- పోతీఫరు యోసేపును ఇష్మాయేలీయుల వద్దనుండి తీసుకొనివచ్చెను మరియు తన ఇంటి మీద తనను అధికారిగా నియమించెను.
- యోసేపు తప్పుడు ఆరోపణ వేయబడినప్పుడు, పోతీఫరు తనను చెరలో ఉంచవలసివచ్చియుండెను.
(ఈ పదములను కూడా చుడండి: ఈజిప్టు, యోసేపు (పా ని), ఫరో)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.37:34-36
- ఆది.39:1-2
- ఆది.39:13-15
పదం సమాచారం:
ప్రతిష్ట
నిర్వచనం:
పదాలు "ప్రతిష్ట" "ప్రతిష్ట కలిగించడం” అంటే ఎవరికైనా నైనా గౌరవం, ప్రతిష్ట, లేక మన్నన కలిగించడం.
- ప్రతిష్ట ను సాధారణంగా రాజు, దేవుడు వంటి ఎవరైనా ఉన్నత హోదా, ప్రాధాన్యత ఉన్న వారికి ఇస్తారు.
- దేవుడు క్రైస్తవులు ఇతరులకు ప్రతిష్ట కలిగించాలని దేవుడు చెప్పాడు.
- పిల్లలు వారి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, అంటే వారికి లోబడడం ద్వారా గౌరవించాలి.
- "ప్రతిష్ట” “మహిమ" అనే పాదాలను తరచుగా కలిపి ఉపయోగిస్తారు, ముఖ్యంగా యేసును గురించి చెప్పేటప్పుడు. ఒకే దాన్ని రెండు రకరకాలుగా చెప్పడం.
- దేవుణ్ణి ఘన పరచడం అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన్ను స్తుతిస్తూ ఆయనకు లోబడం ద్వారా గౌరవం చూపుతూ అయన ఘనతను ప్రతిబింబించే విధంగా జీవిస్తూ ఉండాలి.
అనువాదం సలహాలు:
- అనువదించడంలో ఇతర పద్ధతులు. "గౌరవం” లేక “ప్రఖ్యాతి” లేక “ఉన్నత స్థితి."
- "ప్రతిష్ట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రత్యేక గౌరవం చూపడం” లేక “స్తుతి కలిగేలా చెయ్యడం” లేక “ఉన్నతమైన మన్నన కలిగేలా” లేక “గొప్ప విలువ."
(చూడండి: అప్రతిష్ట, మహిమ, మహిమ, స్తుతి)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 సమూయేలు 02:8
- అపో. కా. 19:15-17
- యోహాను 04:43-45
- యోహాను 12:25-26
- మార్కు 06:4-6
- మత్తయి 15:4-6
పదం సమాచారం:
- Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G820, G1391, G1392, G1784, G2151, G2570, G3170, G4411, G4586, G5091, G5092, G5093, G5399
ప్రతీకారం, ప్రతీకారం చేయు, ప్రతీకారం చేసిన, ప్రతీకారం చేసే వాడు, పగ, పగ సాధించు
నిర్వచనం:
"ప్రతీకారం చేయు” లేక “పగ తీర్చుకోను” లేక “పగ సాధించు"అంటే ఒకడు చేసిన దానికి అతణ్ణి శిక్షించు. ప్రతీకారం, లేక పగ. "పగ సాధించు."
- సాధారణంగా "ప్రతీకారం"అంటే న్యాయం జరగాలన్న ఉద్దేశం, లేదా జరిగిన తప్పును సరి దిద్దాలని చూడడం.
- మనుషులకు సంబంధించి "పగ తీర్చుకొను” లేక “ప్రతీకారం చేయు"అంటే సాధారణంగా హాని చేసిన వాడికి తగిన శాస్తి చేయడం.
- దేవుడు "పగ సాధించినప్పుడు” లేక “పగ సాధిస్తే," అతడు నీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే అతడు పాపంపై తిరుగుబాటుపై శిక్ష విధిస్తున్నాడు.
అనువాదం సలహాలు:
- దీన్ని"ప్రతీకారం"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "జరిగిన తప్పును సవరించు” లేక “న్యాయం సాధించు."
- మానవులకు సంబంధించి "పగ తీర్చుకోవడం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కక్ష సాధించు” లేక “శిక్షించడం కోసం గాయపరచు” లేక “దెబ్బకు ."
- సందర్భాన్ని బట్టి, "పగ సాధించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"శిక్ష” లేక “పాపానికి శిక్ష” లేక “జరిగిన తప్పులకు శాస్తి." కొన్ని సార్లు "ప్రతి శిక్ష"అనే మాట ఉపయోగిస్తారు, ఇది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది.
- దేవుడు "నా పగ సాధించుకుంటాను," అంటే "నాకు వ్యతిరేకంగా చేసిన తప్పులకు శిక్ష వేస్తాను” లేక “ఎందుకంటే వారు నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారికి కీడు కలిగిస్తాను."
- దేవుని పగ సాధింపును చెప్పేటప్పుడు అయన పాపానికి తన శిక్ష వేస్తాడు అని గుర్తుంచుకోవాలి.
(చూడండి: శిక్షించు, న్యాయమైన, నీతిగల)
బైబిల్ రిఫరెన్సులు:
- 1సమూయేలు 24:12-13
- యెహెజ్కేలు 25:15-17
- యెషయా 47:3-5
- లేవీ 19:17-18
- కీర్తనలు 018:46-47
- రోమా 12:19-21
పదం సమాచారం:
- Strong's: H1350, H3467, H5358, H5359, H5360, H6544, H6546, H8199, G1349, G1556, G1557, G1558, G2917, G3709
ప్రవక్త, ప్రవచనం, భవిష్యత్తును చెప్పడం, దీర్ఘదర్శి, ప్రవక్త్రిని
నిర్వచనం:
“ప్రవక్త” అంటే ప్రజలకు దేవుని సందేశాన్ని చెప్పేవాడు. ఈ కార్యాన్ని చేసే స్త్రీని “ప్రవక్తిని” అని పిలుస్తారు.
- తరచుగా ప్రవక్తలు ప్రజలు తమ పాపములనుండి తిరిగి దేవునికి విధేయులు కావాలని హెచ్చరించారు.
- “ప్రవచనము” అంటే ప్రవక్త మాట్లాడే సందేశం అని అర్థం. “ప్రవచించడం” అంటే దేవుని సందేశాన్ని చెప్పడం అని అర్థం.
- తరచుగా ప్రవచన సందేశము భవిష్యత్తులో జరగబోవుదానిని గురించి ఉంటుంది.
- పాత నిబంధనలోనున్న అనేక ప్రవచనములు ఇప్పటికే నెరవేర్చబడియున్నాయి.
- బైబిలులో ప్రవక్తల చేత రాయబడిన అనేక గ్రంథాలు కొన్ని సార్లు "ప్రవక్తలు" అని సూచించబడతాయి.
- ఉదాహరణకు, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే ఈ మాట హెబ్రీ లేఖనములన్నిటిని సూచిస్తుంది, దీనిని “పాత నిబంధన” పిలుస్తాము.
- “దీర్ఘదర్శి” లేక “చూచే వ్యక్తీ” అనే పదం ప్రవక్త కోసం వాడబడింది.
- కొన్నిమార్లు “దీర్ఘదర్శి” పదం అబద్దపు ప్రవక్తను లేదా శకునము చెప్పే అభ్యాసాలను జరిగించేవాడిని సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- “ప్రవక్త” పదం “దేవుని ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి” లేదా “దేవుని సందేశములను మాట్లాడే వ్యక్తి” అని అనువదించబడవచ్చు.
- “దీర్ఘదర్శి” పదం “దర్శనములు చూసే వ్యక్తి” లేదా “దేవుని నుండి భవిష్యత్తును చూడగలిగే మనుష్యుడు” అని అనువదించవచ్చు.
- “ప్రవక్తినులు పదం “దేవునికి స్త్రీ ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే స్త్రీ” లేదా “దేవుని సందేశాలను మాట్లాడే స్త్రీ” అని అనువదించబడవచ్చు.
- “ప్రవచనము” పదం అనువాదంలో “దేవుని నుండి సందేశము” లేదా “ప్రవక్త సందేశము” అని ఉండవచ్చు.
- “ప్రవచించడం” పదం “దేవుని నుండి మాటలను పలుకడం” లేదా “దేవుని సందేశాన్ని చెప్పు" అని అనువదించబడవచ్చు.
- “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే అలంకారిక వాక్యము, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల పుస్తకములు” లేదా “దేవుడు గురించీ, తన ప్రజలను గురించి వ్రాయబడిన ప్రతీది, ఇందులో ప్రవక్తలు బోధించినవి మరియు దేవుని కట్టడలు" ఉన్నాయి.
- అబద్ధపు దేవుని ప్రవక్తను (లేక దీర్ఘదర్శిని) సూచించేటప్పుడు, దీనిని “అబద్ధ ప్రవక్త (దీర్ఘదర్శి)” లేదా “అబద్దపు దేవుని ప్రవక్త (లేక దీర్ఘదర్శి)” లేదా “బయలు ప్రవక్త” అని తర్జుమా చేయవలసిన అవసరత ఉంటుంది.
(చూడండి: బయలు, బయలు, సోది, దేవుడు, అబద్ధ ప్రవక్త, నెరవేర్చు, ధర్మశాస్త్రం)
బైబిలు రిఫరెన్సులు:
- 1 థెస్స 02:14-16
- అపొ.కా. 03:25
- యోహాను 01:43-45
- మలాకీ 04:4-6
- మత్తయి 01:23
- మత్తయి 02:18
- మత్తయి 05:17
- కీర్తన 051:01
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 12:12 ఐగుప్తీయులు చనిపోయారని ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, వారు దేవునియందు విశ్వాసముంచిరి మరియు మోషే దేవుని ప్రవక్త అని విశ్వాసం ఉంచారు.
- 17:13 దావీదు చేసిన పనినిబట్టి దేవుడు కోపగించుకొనెను, ఇందుచేత దావీదు చేసిన పాపము ఎంత ఘోరమైనదని చెప్పుటకు దేవుడు నాతాను ప్రవక్తను దావీదునొద్దకు పంపించాడు.
- 19:01 ఇశ్రాయేలీయుల చరిత్రయందంతంటిలో దేవుడు వారియొద్దకు ప్రవక్తలను పంపెను. దేవుని నుండి వచ్చు సందేశములను ప్రవక్తలు విని, ఆ దేవుని సందేశములను వారు ప్రజలకు వినిపించారు.
- 19:06 ఇశ్రాయేలు రాజ్యము యొక్క సమస్త ప్రజలందరూ మరియు బయలు దేవతకు సంబంధించిన 450 మంది ప్రవక్తలు కర్మెలు పర్వతము వద్దకు వచ్చిరి.
- 19:17 అనేకసార్లు ప్రజలు దేవునికి విధేయత చూపలేదు. వారు అనేకమార్లు ప్రవక్తలను అగౌరపరచారు, మరియు కొన్నిమార్లు వారిని హతమార్చారు.
- 21:09 మెస్సయ్యా కన్య మరియ గర్భాన జన్మిస్తాడని ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు.
- 43:05 “అంత్యదినములలో, నా ఆత్మను కుమ్మరించెదను” అని దేవుడు చెప్పిన మాటను యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడి, నెరవేర్చబడెను.
- 43:07 “నీవు పరిశుద్ధుని సమాధిలో ఉండనివ్వవు” అని చెప్పబడిన ప్రవచనమును నెరవేర్చావు.
- 48:12 దేవుని వాక్యమును ప్రకటించిన మోషే గొప్ప ప్రవక్త. అయితే యేసు అందరిలో గొప్ప ప్రవక్త. ఆయనే దేవుని వాక్యమైయుండెను.
పదం సమాచారం:
- Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578
ప్రేమ, ప్రియమైన
నిర్వచనం:
మరొక వ్యక్తిని ప్రేమించడం అంటే ఆ వ్యక్తిని గురించిన శ్రద్ధ తీసుకోవడం, అతనికి ప్రయోజనకరమైన పనులు చెయ్యడం. “ప్రేమ” అనే పదం కోసం వివిధ అర్థాలు ఉన్నాయి, కొన్ని భాషలు వివిధ పదాలను వినియోగించడం ద్వారా వ్యక్తీకరిస్తాయి.
-
దేవుని నుండి వచ్చిన ప్రేమ తన వరకూ ప్రయోజనం చేకూర్చక పోయినప్పటికీ ఇతరుల క్షేమం మీదనే దృష్టి నిలుపుతుంది. ఇటువంటి ప్రేమ ఇతరులు ఏమి చేసినప్పటికీ వారిని గురించిన శ్రద్ధ తీసుకొంటుంది, దేవుడు తానే ప్రేమ, నిజమైన ప్రేమకు ఆధారం.
-
పాపం, మరణం నుండి మనలను రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా యేసు ఇటువంటి ప్రేమను చూపించాడు. త్యాగసహితంగా ఇతరులను ప్రేమించడానికి తన అనుచరులకు నేర్పించాడు.
- మనుష్యులు ఇతరులను ఇటువంటి ప్రేమతో ప్రేమించినప్పుడు ఇతరుల వర్ధిల్లడానికి కారణమైన వాటిని గురించి తలంచే విధానాలలో కార్యాలను జరిగిస్తారు. ఈ విధమైన ప్రేమలో ఇతరులను క్షమించడం ఉంటుంది.
-
అనువాదం వివరణ భిన్నమైన అర్థాన్ని సూచించకపోయినట్లయితే తప్పించి ULT లో “ప్రేమ” అనే పదం ఇటువంటి త్యాగసహితమైన ప్రేమను సూచిస్తుంది.
-
కొత్తనిబంధనలో మరొక పదం సహోదరప్రేమను లేదా స్నేహితునితో లేదా కుటుంబ సభ్యునితో ప్రేమను సూచిస్తుంది.
-
స్నేహితులు లేదా బంధువుల మధ్య ఉన్న సహజ మానవ ప్రేమను ఈ పదం సూచిస్తుంది.
-
”విందులో అత్యంత ప్రాముఖ్యమైన స్థలాలలో కూర్చోవడం వారికి ఇష్టం” అనే సందర్భాలలో కూడా ఈ పదం ఉపయోగించబడవచ్చు. వారికి “చాలా ఇష్టం” లేదా “అధికంగా కోరుతున్నారు” అని అర్థం.
-
“ప్రేమ” అనే పదం ఒక స్త్రీ, పురుషుల మధ్యలో ఉన్న మొహపూరిత ప్రేమ అని కూడా సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- అనువాదం వివరణలో మరొక విధంగా ప్రస్తావించకపోయినట్లయితే , ULT లో “ప్రేమ” అంటే దేవుని నుండి వచ్చిన త్యాగసహితమైన ప్రేమ అని సూచిస్తుంది.
- కొన్ని భాషలలో దేవునికున్న నిస్వార్ధ ప్రేమ, త్యాగసహిత ప్రేమ కోసం ప్రత్యేకమైన పదం ఉండవచ్చు. ఈ పదం “సమర్పించబడిన, విశ్వసనీయ శ్రద్ధ” లేదా “నిస్వార్ధ శ్రద్ధ” లేదా “దేవుని నుండి ప్రేమ” అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు. దేవుని ప్రేమను అనువదించడానికి వినియోగించే పదంలో ఇతరుల ప్రయోజనం కోసం ఒకరు తమ సొంత ఇష్టాలను వదులుకోవడం, ఇతరులు ఏమి చేసినప్పటికీ వారిని ప్రేమించడం అనే భావం వచ్చేలా అనువదించేలా చూడండి.
- కొన్నిసార్లు "ప్రేమ" కోసం ఉపయోగించే ఇంగ్లీషు పదం కుటుంబసభ్యులు, స్నేహితులకోసం కలిగియుండే లోతైన శ్రద్ధను వివరిస్తుంది. కొన్ని భాషలు ఈ పదం “చాలా ఇష్టం” లేదా “శ్రద్ధ కలిగియుండడం” లేదా “బలమైన ఆపేక్షకలిగియుండడం” అనే పదాలతో అనువదించబడవచ్చు.
- ఒకదాని కోసం బలమైన ప్రాధాన్యతను వ్యక్తీకరించడానికి “ప్రేమ” అనే పదం వినియోగించబడిన సందర్భములలో, ఈ పదం “బలంగా యెంచుకోవడం” లేదా “అధికంగా ఇష్టపడడం” లేదా “ఉన్నతంగా కోరుకోవడం” అని అనువదించబడవచ్చు.
- కొన్ని భాషలలో భార్యా భర్తల మధ్య మోహపూరిత లేదా లైంగికసంబంధ ప్రేమను సూచించడానికి కూడా ఒక ప్రత్యేక పదం ఉండవచ్చు.
- అనేక భాషలు “ప్రేమ”ను ఒక చర్యగా వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకు, “ప్రేమ సహించును, ప్రేమ దయ చూపించును” అనే వాక్యాలను “ఒకరు మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు, అతని పట్ల సహనాన్ని కలిగియుంటాడు, దయకలిగి యుంటాడు” అని అనువాదం చెయ్యవచ్చు.
(చూడండి: నిబంధన, చనిపోవడం, బలియాగము, రక్షించు, పాపము)
బైబిలు రెఫరెన్సులు:
- 1 కొరింథీ 13:07
- 1 యోహాను 03:02
- 1 థెస్స 04:10
- గలతీ 05:23
- ఆది. 29:18
- యెషయా 56:06
- యిర్మియా 02:02
- యోహాను 03:16
- మత్తయి 10:37
- నెహెమ్యా 09:32-34
- ఫిలిప్పీ 01:09
- పరమ గీతం 01:02
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- 27:02 ధర్మశాస్త్ర బోధకుడు దేవుని ధర్మశాస్త్రం విషయంలో జవాబిస్తూ, “నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించ వలెను” అని చెప్పాడు. మరియు నిన్ను వలే నీ పొ రుగువానిని ప్రేమించ వలెను.
- 33:08 “ముండ్ల పోదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును, ధనమోహమును దేవుని కోసం ప్రేమను అణచివేయును.”
- 36:05 పేతురు మాట్లాడుచుండగా, కాంతివంతమైన మేఘము వారి మీదకు వచ్చెను, మేఘములోనుండి ఒక స్వరము, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను ప్రేమించుచున్నాను అని పలికెను.
- 39:10 “సత్యమును ప్రేమించు ప్రతీవాడునూ నన్ను ప్రేమించును.”
- 47:01 ఆమె (లుదియ)ప్రేమించెను, దేవుని ఆరాధించెను.
- 48:01 దేవుడు లోకమును సృష్టించినపుడు, సమస్తము పరిపూర్ణంగా ఉండెను. పాపం అక్కడ లేదు. ఆదాము, హవ్వ ఒకరినొకరు ప్రేమించుకొన్నారు వారు దేవుని ప్రేమించారు.
- 49:03 నిన్ను నీవు ప్రేమిస్తున్నట్టు గానే ఇతరులను ప్రేమించాలని ఆయన (యేసు) బోధించాడు.
- 49:04 నీవు దేనినైనా, నీ సంపదనైనా ప్రేమించిన దాని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలని కూడా ఆయన (యేసు) నీకు బోధించాడు.
- 49:07 దేవుడు పాపులను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని యేసు బోధించాడు.
- 49:09 అయితే దేవుడు లోకములో ఉన్న ప్రతీవారినీ ప్రేమించాడు యేసునందు విశ్వాసముంచు వాడు తన పాపాల విషయంలో శిక్ష పొందక, దేవునితో శాశ్వితం జీవించేలా తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించాడు.
- 49:13 దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీతో సన్నిహిత సంబంధం కలిగియుండేలా నీవు యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు.
పదం సమాచారం:
- Strong's: H157, H158, H159, H160, H2245, H2617, H2836, H3039, H4261, H5689, H5690, H5691, H7355, H7356, H7453, H7474, G25, G26, G5360, G5361, G5362, G5363, G5365, G5367, G5368, G5369, G5377, G5381, G5382, G5383, G5388
ఫరో, ఐగుప్తు రాజు
వాస్తవాలు:
పురాతన కాలములో ఐగుప్తు దేశమును ఏలిన రాజులను ఫరోలు అని పిలుచుచుండిరి.
- సుమారు 2,000 సంవత్సరములలో ఐగుప్తును ఏలిన ఫరోలు దరిదాపు అందరు కలిసి 300 మంది.
- ఈ ఐగుప్తియుల రాజులు చాలా శక్తివంతమైనవారు మరియు శ్రిమంతులునైయుండిరి.
- ఈ ఫరోలలో అనేకులను గూర్చి పరిశుద్ధ గ్రంథములో లిఖితము చేయబడియున్నది.
- అనేకమార్లు ఈ పదమును లేక బిరుదును ఒక బిరుడుకంటే ఒక పేరుగానే ఉపయోగించబడింది. ఇటువంటి పరిస్థితులలో ఆంగ్ల భాషలో ఈ పదములో మొదటి అక్షరమును పెద్దదిగా చేసి దానిని వ్రాస్తారు.
(ఈ పదములను కూడా చుడండి: ఈజిప్టు, రాజు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.07:9-10
- అపొ.కార్య.07:11-13
- అపొ.కార్య.07:20-21
- ఆది.12:14-16
- ఆది.40:6-8
- ఆది.41:25-26
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 08:06 ఒక రోజు ఐగుప్తీయులు తమ రాజులుగా పిలుచుకొను ఫరో రెండు కలలను కనెను, అవి తనను చాలా ఎక్కువగా కలవరపరచెను.
- 08:08 ఫరో యోసేఫును బట్టి ఎంతగానో మెప్పించబడెను, తద్వారా అతను ఐగుప్తు దేశమంతటిలో రెండవ శక్తివంతమైన వ్యక్తిగా నియమించెను.
- 09:02 ఆ కాలమందు ఐగుప్తును ఏలుతున్న ఫరో ఇస్రాయేలియులను ఐగుప్తీయులకు బానిసలనుగా చేసెను.
- 09:13 “నేను నిన్ను ఫరో వద్దకు పంపెదను, తద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని తమ బానిసత్వమునుండి నీవు బయటకు తీసుకొని వచ్చెదవు.”
- 10:02 ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరోకంటేను మరియు ఐగుప్తులోని సమస్త దేవుళ్ళకంటెను ఆయనే శక్తిమంతుడని ఫరోకు కనుబరచుకొనెను.
పదం సమాచారం:
- Strong's: H4428, H4714, H6547, G5328
ఫలం, ఫలవంతం, నిష్ఫలమైన
నిర్వచనం:
"ఫలం" అక్షరాలా మనం తినగలిగే చెట్టు భాగాన్ని సూచిస్తున్నది. "ఫలభరితం" గా ఉన్నదానికి అనేక ఫలాలు ఉంటాయి. ఈ పదాలు బైబిలులో అలంకారికంగా ఉపయోగించబడ్డాయి.
- బైబిలు తరచుగా "ఫలం" అనే పదాన్ని ఒక వ్యక్తి క్రియలను సూచిస్తూ ఉపయోగిస్తుంది. చెట్టుకు కాసిన పండు ఆ చెట్టు ఎటువంటిదో చూపించినట్టుగానే ఒక వ్యక్తి మాటలు, క్రియలు తన గుణ లక్షణాలను వెల్లడిస్తాయి.
- ఒక వ్యక్తి మంచి, లేక చెడ్డ ఆత్మ సంబంధమైన ఫలాలను కలుగచేస్తాడు. అయితే "ఫలభరితం" అనే పదానికి ఎప్పుడూ అధికమైన మంచి ఫలాన్ని కలిగించడం అనే అర్థం ఉంటుంది.
- "ఫలభరితం" అనే పదం అలంకారికంగా "సౌభాగ్య వంతమైనది" అని అర్థాన్ని ఇస్తుంది. అనేకమంది పిల్లలు, సంతానం, పుష్కలంగా ఆహారం, ఇతర సంపదలు కలిగి ఉన్న స్థితిని ఇది తరచుగా సూచిస్తున్నది.* సాధారణంగా "ఫలం" పదం దేనినుండైనా వచ్చిన దానిని సూచిస్తుంది. లేదా ఎవరైనా ఒకరు పండించిన దానిని సూచిస్తుంది. ఉదాహరణకు, "జ్ఞాన ఫలం" అంటే జ్ఞానం కలిగి ఉండడం నుండి కలిగే మంచి విషయాలను సూచిస్తున్నది.
- "భూమి ఫలం" అనే వాక్యం సాధారణంగా ప్రజలు భుజించడానికి భూమి పండించే ప్రతీ దానినీ సూచిస్తుంది. దీనిలో ద్రాక్షలు లేదా ఖర్జూరాలు లాంటి ఫలాలు మాత్రమే కాదు అయితే కూరగాయలు, గింజలు, ధాన్యాలు కూడా ఉంటాయి.
- "ఆత్మ ఫలం" అనే అలంకారిక వాక్యం దేవునికి విధేయత చూపే ప్రజల జీవితాలలో పరిశుద్ధాత్మ కలిగించే దైవిక లక్షణాలను సూచిస్తుంది.
- "గర్భ ఫలం" అనే వాక్యం "గర్భము కలిగించేది" అంటే పిల్లలును సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- ఒక పండ్ల చెట్టునుండి తినదగిన పండును సూచించడానికి లక్ష్య భాషలో సాధారణంగా ఉపయోగించిన "ఫలం" పదం కోసం సాధారణ పదాన్ని వినియోగించి ఈ పదాన్ని అనువదించడం ఉత్తమం.
- సందర్భాన్ని బట్టి "ఫలవంతం" పదం "అధికమైన ఆత్మీయ ఫలాలను కలిగిస్తుంది" లేదా "అనేకమైన పిల్లలను కలిగి యుండడం" లేదా "భాగ్యవంతమైన" అని అనువదించబడవచ్చు.
- "భూఫలం" పదం "ఆ భూమి పండించే పంట.” లేదా “ఆ ప్రాంతంలో సాగు అయ్యే ఆహారం పంటలు" అని అనువదించబడవచ్చు.
-
దేవుడు జంతువులను మనుషులను సృష్టించినప్పుడు అయన వారికి ఇలా అజ్ఞాపించాడు- "మీరు ఫలించి, విస్తరించండి" అంటే అనేకమంది సంతానం కలిగియుండండి అని అర్థం. ఈ వాక్యం "అనేక మంది సంతానం కలిగియుండండి” లేదా “చాలా మంది పిల్లలు, సంతానం కలిగి యుండండి” లేదా “ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండండి, తద్వారా అధికమైన సంతానాన్ని కలిగియుంటారు" అని అనువదించబడవచ్చు.
-
"గర్భ ఫలం" అనే వాక్యం "గర్భము ఉత్పత్తి చేసేది" లేదా "స్త్రీలు కనే పిల్లలు" లేదా " కేవలం “పిల్లలు" అని అనువదించబడవచ్చు. ఎలీసెబెతు మరియతో "నీ గర్భఫలం ధన్యం" అని అనడంలో "నీవు కనబోయే పిల్లవాడు ధన్యుడు" అని అర్థం." లక్ష్య భాషలో దీనికి వివిధ పదాలు ఉండవచ్చు.
- "ద్రాక్ష చెట్టు ఫలం," అనే మరొక వాక్యం "ద్రాక్ష చెట్టు పండు” లేదా “ద్రాక్షలు" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, "మరింత ఫలభరితంగా ఉంటుంది " అనే వాక్యం "మరింత ఫలాన్ని ఇస్తుంది" లేదా "ఎక్కువ మంది పిల్లలు కలిగియుంటుంది" లేదా “మరింత భాగ్యవంతులు అవుతారు" అని అనువదించబడవచ్చు.
- అపోస్తలుడు పౌలు చెప్పిన "ఫలభరిత సేవ" అనే వాక్యం "మంచి ఫలితాలు తెచ్చే పని" లేదా “అనేక మంది ప్రజలు యేసులో విశ్వాసం ఉంచేలా చేసే పని" అని అనువదించబడవచ్చు.
- "ఆత్మ ఫలం" అనే పదం "పరిశుద్ధాత్మ కలిగించే కార్యం" లేదా “ఒకరిలో పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు అని చూపించే మాటలు, క్రియలు" అని అనువదించబడవచ్చు.
(చూడండి: వారసుడు, ధాన్యం, ద్రాక్ష, పరిశుద్ధాత్మ, తీగె, గర్భము)
బైబిలు రిఫరెన్సులు:
- గలతీ 05:23
- ఆది. 01:11
- లూకా 08:15
- మత్తయి 03:08
- మత్తయి 07:17
పదం సమాచారం:
- Strong's: H3, H4, H1061, H1063, H1069, H2173, H2233, H2981, H3206, H3581, H3759, H3899, H3978, H4022, H4395, H5108, H5208, H6500, H6509, H6529, H7019, H8256, H8393, H8570, G1081, G2590, G2592, G2593, G3703, G5052, G5352, G6013
బంగారం, బంగారు
నిర్వచనం:
బంగారం పసుపు రంగులో ఉండే ప్రశస్తమైన లోహం. దీన్ని ఆభరణాలు, మత సంబంధమైన వస్తువులు చెయ్యడంలో ఉపయోగిస్తారు. ఇది ప్రాచీన కాలంలో ఎక్కువ విలువైన లోహం.
- బైబిల్ కాలాల్లో, అనేక వివిధ రకాల వస్తువులను ముద్ద బంగారంతో చేసేవారు. లేక బంగారు రేకు తాపడం చేసేవారు.
- చెవి పోగులు, ఇతర ఆభరణాలు, విగ్రహాలు, బలిపీఠములు ఇతర వస్తువులు చెయ్యడానికి ఉపయోగిస్తారు.
- పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం, లేక ఆలయంలో నిబంధన మందసం మొదలైన వాటిని చెయ్యడానికి బంగారం ఉపయోగించారు. ఇంకా వ్యాపార లావాదేవీలకు మారకాలకు వినియోగించే వారు. విలువ నిర్ణయించడానికి సున్నితపు త్రాసులో తూచే వారు.
- తరువాత కాలంలో బంగారం, వెండి లాటి ఇతర లోహాలను వ్యాపార లావాదేవీలకోసం నాణేల ముద్రణకు ఉపయోగించారు.
- పూర్తిగా బంగారంతో చెయ్యని వాటిని చెప్పడానికి (అంటే బంగారు తొడుగు వేసిన వాటిని) "బంగారు” లేక “బంగారం-కప్పిన” లేక “బంగారం-తాపడం చేసిన" అనే మాటలు ఉపయోగిస్తారు.
- కొన్ని సార్లు బంగారంతో చెయ్యక పోయినా "బంగారం-రంగులో ఉన్న వస్తువులు," అంటే పసుపు, బంగారం రంగు లో ఉన్నవాటిని విలువైనవిగా ఎంచారు.
(చూడండి: బలిపీఠం, నిబంధన మందసం, దేవుడు, వెండి, ప్రత్యక్ష గుడారం, ఆలయం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1220, H1222, H1722, H2091, H2742, H3800, H4062, H5458, H6884, H6885, G5552, G5553, G5554, G5557
బందీ, బందీలు, బంధించు, బంధించబడిన, చెర
నిర్వచనం:
"బందీ” “చెర" అనే పదాలు ప్రజలను పట్టుకుని వారు ఇష్టపడని చోట అంటే వారిని ఓడించిన దేశంలో వారు నివసించేలా బలవంతం చేయడం.
- యూదా రాజ్యంలోని ఇశ్రాయేలీయులు బాబిలోనియాలో 70సంవత్సరాలు చెరలో ఉన్నారు.
- బందీలు తరచుగా తమను పట్టుకున్న జాతి కోసం వెట్టి చాకిరీ చెయ్యవలసి ఉంటుంది.
- దానియేలు, నెహెమ్యా ఇశ్రాయేలు బందీలు, వారు బాబిలోనియా రాజు దగ్గర పని చేశారు.
- "చెర పట్టు"అనే మాట ఎవరినైనా బంధించడాన్ని సూచించే వేరొక పదం.
- "బందీలుగా కొని పోవడం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "బందీలుగా ఉండేలా బలవంతం చెయ్యడం” లేక “మరొక దేశానికి ఖైదీలుగా తీసుకుపోవడం."
- అలంకారికంగా చూస్తే అపోస్తలుడు పౌలు క్రైస్తవులకు ప్రతి ఆలోచనను "చెరబట్టి"క్రీస్తుకు విధేయంగా చెయ్యమని చెప్పాడు.
- ఒక వ్యక్తి పాపానికి ఎలా బందీ అవుతాడో కూడా చెప్పాడు. అంటే అతడు పాపం "అదుపులో"ఉంటాడు.
అనువాదం సలహాలు
- సందర్భాన్ని బట్టి, "చెరలో ఉండడం"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "స్వేచ్ఛ లేకుండా” లేక “చెరసాలలో ఉంచి” లేక “విదేశంలో ఉంచి."
- "బందీగా కొనిపోవడం” లేక “చెర పట్టడం"ఇలా అనువదించ వచ్చు, "పట్టుకుని” లేక “చెరసాలలో బంధించి” లేక “విదేశంలో."
- ఈ పదం "బందీలు"ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "చెర పట్టబడిన ప్రజలు” లేక “బానిస జాతి."
- సందర్భాన్ని బట్టి, "చెర"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు., "ఖైదు చెయ్యడం” లేక “ప్రవాసం” లేక “విదేశంలో ఉండేలా బలవంతం."
(చూడండి: బబులోను, ప్రవాసం, చెర, పట్టుకొనుట)
బైబిల్ రిఫరెన్సులు:
- 2కొరింతి 10:5-6
- యెషయా 20:3-4
- యిర్మీయా 43:1-3
- లూకా 04:18-19
పదం సమాచారం:
- Strong's: H1123, H1473, H1540, H1546, H1547, H2925, H6808, H7617, H7622, H7628, H7633, H7686, H7870, G161, G162, G163, G164, G2221
బబులోను, బాబిలోనియా, బాబిలోనియా, బబులోనీయులు
వాస్తవాలు:
బబులోను పట్టణం ప్రాచీన బాబిలోనియా ప్రాంతంలో ఉంది. ఇది బాబిలోనియా సామ్రాజ్యంలో భాగం.
- బబులోను యూఫ్రటిసు నది తీరాన వెలసిన నగరం. కొన్ని వందల సంవత్సరాలు క్రితం బాబెలు గోపురం కట్టింది ఇక్కడే.
- కొన్ని సార్లు ఈ పదం "బబులోను" మొత్తం బాబిలోనియా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, "బబులోను రాజు" మొత్తం సామ్రాజ్యం అంతా పరిపాలన చేశాడు. ఒక్క నగరాన్ని మాత్రమే కాదు.
- బాబిలోనియా వారు చాలా శక్తివంతమైన ప్రజలు. వీరు యూదా రాజ్యంపై దాడి చేసి ప్రజలను బాబిలోనియాలో 70 సంవత్సరాలపాటు ప్రవాసంలో ఉంచారు.
- ఈ ప్రాంతంలో ఒక భాగాన్ని "కల్దియ" అని పిలిచారు. ఇక్కడ నివసించే ప్రజలను "కల్దీయులు" అన్నారు. ఫలితంగా, ఈ పదం"కల్దియ" ను తరచుగా బాబిలోనియాను సూచించ డానికి ఉపయోగిస్తారు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం
- కొత్త నిబంధనలో, ఈ పదం "బబులోను" ను కొన్ని సార్లు విగ్రహ పూజ, ఇతర పాపపూరితమైన జీవిత విధానాలు, ప్రజలు, ప్రాంతాలు, ఆలోచనా విధానాలు మొదలైన వాటిని సూచించే రూపకాలంకారంగా ఉపయోగిస్తారు.
- పద బంధం "మహా బబులోను” లేక “గొప్ప బబులోను పట్టణం" అనేదాన్ని రూపకాలంకారికంగా ఒక పట్టణం లేక ఒక పాపపూరితమైన పెద్ద ధనిక, జ్ఞాన పూరితమైన జాతి, లేక ప్రాచీన బబులోను పట్టణం కోసం వాడతారు.
(చూడండి: బాబెలు, కల్దియ, యూద, నెబుకద్నెజరు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 09:1-3
- 2 రాజులు 17:24-26
- అపో. కా. 07:43
- దానియేలు 01:1-2
- యెహెజ్కేలు 12:11-13
- మత్తయి 01:9-11
- మత్తయి 01:15-17
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 20:06 ఆష్శూరీయులు ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేసిన 100 సంవత్సరాల తరువాత, దేవుడు బాబిలోనియా రాజైన నెబుకద్నేజరును యూదా రాజ్యంపై, దాడి చేయడానికి ప్రేరేపించాడు. బబులోను అప్పటికి శక్తివంతమైన సామ్రాజ్యం.
- 20:07 అయితే కొన్ని సంవత్సరాల తరువాత, యూదా రాజు బబులోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాబట్టి, బబులోనీయులు తిరిగి వచ్చారు. యూదా రాజ్యంపై దాడి చేశారు. వారు పట్టుకుని యెరూషలేము పట్టణాన్ని ఆలయాన్ని నాశనం చేశారు. పట్టణంలో, ఆలయంలో ఉన్న నిధులను అన్నిటినీ తీసుకు పోయారు.
- 20:09 నెబుకద్నేజర్, తన సైన్యం దాదాపుగా యూదా రాజ్యంలోని ప్రజలందరి బబులోను కు తీసుకు పోయారు. నిరుపేదలను మాత్రం పొలాలు సాగు చేయడానికి ఉండనిచ్చారు.
- 20:11 సుమారు 70 సంవత్సరాల తరువాత బబులోను వారు పారసీకుల రాజు కోరేషు చేతిలో ఓడిపోయారు.
పదం సమాచారం:
- Strong's: H3778, H3779, H8152, H894, H895, H896, G897
బయలు
వాస్తవాలు:
"బయలు"అంటే "ప్రభువు” లేక “యజమాని"కనానీయులు ఆరాధించిన ముఖ్య అబద్ధ దేవుడి పేరు.
- స్థానిక అబద్ధ దేవుళ్ళు కూడా ఉన్నారు. వారి పేర్లలో "బయలు"అనే మాట ఉంటుంది. ఉదాహరణకు "బయలు పెయోరు."cకొన్నిసార్లు ఈ దేవుళ్ళను కలిపి "బయలులు"అంటారు.
- కొందరి పేర్లలో ఈ పదం "బయలు"కలిసి ఉంటుంది.
- బయలు ఆరాధనలో పిల్లలను బలి ఇవ్వడం, వేశ్యలను ఉపయోగించడం వంటి దుష్టఆచారాలు మిళితమై ఉంటాయి.
- వివిధ సమయాల్లో వారి చరిత్ర అంతటా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న ఇతర విగ్రహారాధక జాతుల వలె బయలు ఆరాధనల్లో లోతుగా నిమగ్నం అయ్యారు.
- రాజు ఆహాబు పరిపాలన దేవుని ప్రవక్త ఏలియా బయలు అనే దేవుడు లేడని యెహోవా ఒక్కడే నిజ దేవుడనీ రుజువు చెయ్యడానికి ఒక పరీక్ష పెట్టాడు. ఫలితంగా బయలు ప్రవక్తలు హతం అయ్యారు. ప్రజలు మరలా యెహోవా ఆరాధించసాగారు.
(చూడండి: ఆహాబు, అషేరా, ఏలియా, దేవుడు, వేశ్య, యెహోవా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1రాజులు 16:31-33
- 1సమూయేలు 07:3-4
- యిర్మీయా 02:7-8
- న్యాయాధి 02:11-13
- సంఖ్యా 22:41
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 19:02 ఆహాబు బయలు అనే పేరు గల అబద్ధ దేవుణ్ణి ప్రజలు ఆరాధించాలని ప్రోత్సాహించిన దుర్మార్గుడు.
- 19:06 మొత్తం ఇశ్రాయేల్ రాజ్యం ప్రజలంతా, 450మంది బయలు ప్రవక్తలు, కర్మేల్ కొండకు వచ్చారు. ఏలియా ప్రజలతో చెప్పాడు, "ఎంత కాలం మీరు మీ మనసు మార్చుకుంటూ ఉంటారు? యెహోవా దేవుడు అయితే ఆయన్ని సేవించండి. బయలు దేవుడు అయితే ఆయన్ని సేవించండి!"
- 19:07 తరువాత ఏలియా బయలు ప్రవక్తలకు, ఇలా చెప్పాడు. "ఒక ఎద్దును వధించి బలి అర్పణ సిద్ధం చెయ్యండి. అయితే మంట పెట్టవద్దు.
- 19:08 తరువాత బయలు ప్రవక్తలు బయలుకు ప్రార్థించారు, " ఓ బయలు, మా మాట విను!"
- 19:12 ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకున్నారు. తరువాత ఏలియా వారిని అక్కడి నుండి తీసుకుపోయి చంపమని అజ్ఞాపించాడు.''
పదం సమాచారం:
బలిపీఠం, బలిపీఠాలు
నిర్వచనం:
బలిపీఠం అంటే ఎత్తుగా కట్టిన వేదిక. ఇశ్రాయేలీయులు జంతువులను ధాన్యాన్ని దేవునికి బలిగా దహించడానికి దీనిని ఉపయోగిస్తారు.
- బైబిల్ కాలాల్లో, మామూలు బలిపీఠాలను తరచుగా తడిపిన మట్టిని కుప్పగా పోయడం ద్వారా గానీ, కొన్ని రాళ్ళను ఒకదానిపై ఒకటి జాగ్రత్తగా పేర్చి నిలబెట్టడం ద్వారా గానీ నిర్మిస్తారు.
- కొన్ని ప్రత్యేక పెట్టె ఆకారపు బలిపీఠాలు కూడా కట్టారు. వాటిపై బంగారం, ఇత్తడి, లేక కంచు వంటి లోహాలను తాపడం చేసేవారు.
- ఇశ్రాయేలీయుల పరిసరాల్లో నివసించే ఇతర ప్రజలు కూడా వారి దేవుళ్ళకు బలి అర్పణలు చెయ్యడానికి బలిపీఠాలు నిర్మించే వారు.
(చూడండి: ధూప బలిపీఠం, దేవుడు, నైవేద్యం, బలియాగము)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 08:20-22
- ఆది 22:9-10
- యాకోబు 02:21-24
- లూకా 11:49-51
- మత్తయి 05:23-24
- మత్తయి 23:18-19
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 03:14 నోవహు ఓడ నుండి బయటికి వచ్చి బలిపీఠం నిర్మించి అర్పించ దగిన కొన్ని రకాల జంతువులను బలి అర్పణ చేసాడు.
- 05:08 వారు బలి అర్పణ స్థలానికి చేరుకున్నప్పుడు, అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు చేతులు కట్టి అతణ్ణి బలిపీఠం పై ఉంచాడు.
- 13:09 యాజకుడు జంతువును వధించి దాన్ని బలిపీఠం పై దహించి వేసే వాడు.
- 16:06 అతడు (గిద్యోను) ఒక కొత్త బలిపీఠం కట్టి దాన్ని దేవునికి ప్రతిష్టించాడు. విగ్రహం కోసం వాడిన బలిపీఠం పై అతడు దేవునికి బలి అర్పణ చేసాడు.
పదం సమాచారం:
- Strong's: H741, H2025, H4056, H4196, G1041, G2379
బాధ, బాధించు, బాధించ బడిన, హింస, హింసలు
నిర్వచనం:
హింసించు అనే ఈ పదం ఎవరికైనా బాధ, నొప్పి కలిగించడం అనే దానికి వాడతారు.
"బాధ"అంటే వ్యాధి, మానసిక వేదన, లేక అలాటి ఫలితం కలిగించే ఇతర విషయాలు.
- దేవుడు తన ప్రజలను వ్యాధితో, ఇతర కష్టాలతో బాధిస్తాడు. వారి పాపాల విషయం బాధపడి తన వైపుకు తిరుగుతారేమో అని ఇలాచేస్తాడు.
- దేవుడు ఈతిబాధలు, తెగుళ్ళు ఈజిప్టు ప్రజల పైకి పంపించాడు. ఎందుకంటే వారి రాజు దేవునికి లోబడలేదు.
- "బాధ పాలు కావడం"అంటే ఎదో ఒక రకమైన కష్టం, వ్యాధి తదితర బాధ, మానసిక దిగులు కలగడం.
అనువాదం సలహాలు:
- బాధించడం అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఎవరినైనా కష్టాల పాలు చెయ్యడం.” లేక “ఒకరిని బాధ పెట్టడం” లేక “కష్టాలు రానియ్యడం."
- కొన్ని సందర్భాల్లో "బాధ"ను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంభవించు” లేక “కలుగు” లేక “కష్టాలు కలిగించు."
- "ఎవరికైనా కుష్టువ్యాధి కలిగించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కుష్టువ్యాధి వచ్చేలా చేయు."
- మనుషులకు, జంతువులకు "బాధ" కలిగించడాన్ని చెప్పడానికి ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బాధ కలిగించు."
- సందర్భాన్ని బట్టి, ఈ పదం "బాధను" ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఆపద” లేక “వ్యాధి” లేక “బాధ” లేక “గొప్ప కష్టం."
- "బాధించు"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ఫలానా దాని మూలంగా” లేక “ఫలానా వ్యాధి కలిగించు."
(చూడండి: కుష్టరోగి, తెగులు, బాధపడు)
బైబిల్ రిఫరెన్సులు:
- 2తెస్స 01:6-8
- ఆమోసు 05:12-13
- కొలస్సి 01:24-27
- నిర్గమ 22:22-24
- ఆది 12:17-20
- ఆది 15:12-13
- ఆది 29:31-32
పదం సమాచారం:
- Strong's: H205, H1790, H3013, H3905, H3906, H4157, H4523, H6031, H6039, H6040, H6041, H6862, H6869, H6887, H7451, H7489, H7667, G2346, G2347, G2552, G2553, G2561, G3804, G4777, G4778, G5003
బాధపడు, బాధపరుచును, బాధపరచబడెను, శ్రమనొందుట, శ్రమలు
నిర్వచనము:
“బాధపడు” మరియు “శ్రమనొందుట” పదములు రోగములాంటివి, బాధలాంటివి లేక ఇతర కష్టములులాంటివి అనుభవించుటను సూచించును.
- ప్రజలు హింసనొందునప్పుడు లేక వారు రోగాలతో ఉన్నప్పుడు, వారు బాధనొందుదురు.
- కొంతమంది ప్రజలు కొన్ని తప్పుడు పనులు చేసినప్పుడు శ్రమనొందుదురు; ఇతర సమయాలలో ప్రపంచములో పుట్టుకు వస్తున్నా రోగాల ద్వారా మరియు పాపము ద్వారా వారు హింసనొందుదురు.
- శ్రమనొందడం భౌతిక సంబంధమైనది, నొప్పి లేక రోగమును అనుభవించుటయైయున్నది. ఇది భయము, భావోద్వేగమునకు, దిగులుకు, లేక ఒంటరితనము అనేటువంటి మానసికమైన బాధలకు కూడా సంబంధించినదైయుండును.
- “నన్ను బాధించు” అనే మాటకు “నన్ను భరించు” లేక “నా మోర విను” లేక “సహనముతో విను” అని అర్థము.
తర్జుమా సలహాలు:
- “బాధపడు” అనే ఈ పదానికి “బాధను అనుభవించు” లేక “కష్టాన్ని సహించు” లేక “క్లిష్ట పరిస్థితులను అనుభవించు” లేక “క్లిష్టమైన మరియు బాధాకరమైన అనుభవాల ద్వారా వెళ్ళు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- సందర్భానుసారముగా “శ్రమనొందుట” అనే ఈ మాటను “అత్యంత క్లిష్ట పరిస్థితులు” లేక “తీవ్రమైన కష్టాలు” లేక “క్లిష్టకరమైన కష్టమైన పరిస్థితులను అనుభవించుట” లేక “బాధాకరమైన అనుభవాల సమయము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “దాహముతో బాధపడు” అనే ఈ మాటను “దాహమును అనుభవించు” లేక “దాహముతో శ్రమనొందుట” అని తర్జుమా చేయుదురు.
- “హింసాత్మకముగా బాధననుభవించు” అనే ఈ మాటను “హింసాత్మకమైన పరిస్థితుల ద్వారా వెళ్ళుట” లేక “హింసాత్మకమైన క్రియల ద్వారా హాని నొందుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 తెస్స.02:14-16
- 2 తెస్స.01:3-5
- 2 తిమోతి.01:8-11
- అపొ.కార్య.07:11-13
- యెషయా.53:10-11
- యిర్మియా.06:6-8
- మత్తయి.16:21-23
- కీర్తన.022:24-25
- ప్రకటన.01:9-11
- రోమా.05:3-5
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 09:13 “నేను నా ప్రజల శ్రమలను చూచియున్నాను” అని దేవుడు చెప్పెను.
- 38:12 “నా తండ్రి, సాధ్యమైతే ఈ శ్రమల గిన్నెను నాయొద్దనుండి తీసివేయుము” అని యేసు మూడు మార్లు ప్రార్ధించెను.
- 42:03 మెస్సయ్యా శ్రమనొందును మరియు చంపబడును, కాని ఆయన మూడవ దినమున తిరిగిలేచును అని ప్రవక్తలు చెప్పియున్నారని ఆయన (యేసు) జ్ఞాపకము చేసెను.
- 42:07 “మెస్సయ్యా శ్రమనొందును మరియు చంపబడును, కాని ఆయన మూడవ దినమున తిరిగిలేచునని వ్రాయబడియున్నది” అని ఆయన (యేసు) చెప్పెను.
- 44:05 “మీరు ఏమి చేయుచున్నారో మీకు అర్థము కాకపోయినప్పటికి, మెస్సయ్యా శ్రమనొందును, చంపబడునని చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుటకు దేవుడు మీ క్రియలను ఉపయోగించుకొనియున్నాడు.”
- 46:04 “రక్షించబడనివారికందరికి ప్రకటించుటకు నేను ఇతనిని (సౌలును) ఎన్నుకొనియున్నాను. నా కొరకు ఇతను తప్పకుండ ఎన్ని శ్రమలు పడాలో చూపించెదను” అని దేవుడు చెప్పెను.
- 50:17 ఆయన (యేసు) ప్రతి కన్నీటిని తుడిచివేయును మరియు అక్కడ శ్రమ , బాధ, ఏడ్పు, కీడు, నొప్పి, లేక మరణము అనేవి ఉండవు.
పదం సమాచారం:
- Strong's: H943, H1741, H1934, H4342, H4531, H4912, H5142, H5254, H5375, H5999, H6031, H6040, H6041, H6064, H6090, H6770, H6869, H6887, H7661, G91, G941, G971, G2210, G2346, G2347, G3804, G3958, G4310, G4778, G4841, G5004, G5723
బాబెలు
వాస్తవాలు:
బాబెలు మెసపొటేమియా ప్రాంతం ప్రధాన పట్టణం. షినారు దక్షిణ భాగాన ఉంది. షినారును తరువాత బాబిలోనియా అని పిలిచారు.
- బాబెలు పట్టణం హాము ముని మనవడు, షినారు ప్రాంతాన్ని పరిపాలించిన నిమ్రోదు కట్టాడు.
- షినారు ప్రజలు గర్వంతో పరలోకాన్ని అంటే ఎత్తైన గోపురం కట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఇదే "బాబెలు గోపురం" అని పిలువబడింది.
- ఎందుకంటే గోపురం కడుతున్న ప్రజలు దేవుడు అజ్ఞాపించినట్టు భూమి అంతటా విస్తరించడానికి నిరాకరించారు. దేవుడు అక్కడ వారి భాషలు తారుమారు చేసి ఒకరి మాట ఒక అర్థం చేసుకోలేక పోయేలా చేశాడు. వారు భూమి వివిధ ప్రాంతాలకు చెదిరిపోయేలా చేశాడు.
- ఈ పదం "బాబెలు"యొక్క మూలార్థం "గందరగోళం," దేవుడు మనుషుల భాష తారుమారు చేశాడు గనక ఈ పేరు వచ్చింది.
(చూడండి: బబులోను, హాము, మెసపొటేమియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
బుట్ట, బుట్టలు, బుట్టల నిండా
నిర్వచనం:
"బుట్ట"అంటే మొక్కల నుండి తీసిన పదార్థంతో నేసిన గిన్నె వంటిది.
- బైబిల్ కాలంలో, బుట్టలను బహుశా బలమైన మొక్కలను ఎండబెట్టి తయారు చేసేవారు. లేక చెట్టు కాండం నుండి ఒలిచిన దానితో చేసేవారు.
- బుట్ట పై అందులోకి నీరు పోకుండా అది తేలేలా చేసే తారు వంటిది పూసే వారు.
- మోషే పసివాడుగా ఉన్నప్పుడు, అతని తల్లి బుట్టకు తారు పూసి అది నైలు నదిలో రెల్లు మధ్య తేలుతూ పోయేలా చేసింది.
- ఈ పదాన్ని అనువదించడంలో పై కథలో "బుట్ట" అన్నాము. ఇదే పదం నోవహు కట్టిన నావను చెప్పడానికి వేరే పదంతో తర్జుమా చెయ్యాలి. ఈ రెంటికీ సామాన్య అర్థం ఈ రెండు సందర్భాల్లో "తేలుతున్న మందసం."
(చూడండి: మందసం, మందసం, మోషే, నైలు నది)
బైబిల్ రిఫరెన్సులు:
- నోవహు
- అపో. కా. 09:23-25
- ఆమోసు 08:1-3
- యోహాను 06:13-15
- న్యాయాధి 06:19-20
- మత్తయి 14:19-21
పదం సమాచారం:
- Strong's: H374, H1731, H1736, H2935, H3619, H5536, H7991, G2894, G3426, G4553, G4711
బూడిద, శల్యాలు, దుమ్ము
వాస్తవాలు:
ఈ పదం "బూడిద” లేక “శల్యాలు "అంటే కట్టెలు కాలిన తరువాత మిగిలే బూడిద రంగు చూర్ణం. కొన్ని సార్లు పనికిమాలిన, నిరుపయోగమైన దేన్నైనా సూచించడానికి దీన్ని అలంకారికంగా ఉపయోగిస్తారు.
- బైబిల్ లో బూడిద గురించి చెబుతూ కొన్ని సార్లు ఈ పదం "ధూళి" అని తర్జుమా అయింది. ఎండిన నేలపై ఉండే మెత్తని దుమ్మును చెప్పడానికి ఇది వాడతారు.
- “బూడిద కుప్ప" అంటే బూడిద పోగు.
- ప్రాచీన కాలంలో, బూడిదలో కూర్చోవడం సంతాపానికి, దుఃఖానికి సూచన.
- దుఃఖించే సమయంలో గరుకైన, దురద పెట్టే గోనె పట్ట ధరించడం, బూడిదలో కూర్చోవడం, లేక తలపై బూడిద చల్లుకోవడం వాడుక.
- తలపై బూడిద వేసుకోవడం అవమానానికి, ఇబ్బందికీ సూచన.
- పనికిమాలిన దేనికోసమైనా పాటుపడడం "బూడిద తినడం వంటిది."
- "బూడిద" తర్జుమా చేసేటప్పుడు ఈ పదం లక్ష్య భాషలో కట్టెలు కాలినప్పుడు మిగిలిన దాన్ని చెప్పడానికి ఇది వాడాలి.
- "బూడిద చెట్టు"పూర్తిగా వేరే పదం అని గుర్తుంచుకోండి.
(చూడండి: మంట, గోనెపట్ట)
బైబిల్ రిఫరెన్సులు:
- 1రాజులు 20:9-10
- యిర్మీయా 06:25-26
- కీర్తనలు 102:9-10
- కీర్తనలు 113:7-8
పదం సమాచారం:
- Strong's: H80, H665, H666, H766, H1854, H6083, H6368, H7834, G2868, G4700, G5077, G5522
బెతూయేలు
వాస్తవాలు:
బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు కుమారుడు.
- బెతూయేలు రిబ్కా, లాబానుల తండ్రి.
- బెతూయేలు అనే పేరు గల ఊరు కూడా ఉంది. ఇది దక్షిణ యూదాలో, బేయెర్షెబా సమీపాన ఉంది.
(చూడండి: బెయెర్షేబా, లాబాను, నాహోరు, రిబ్కా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 04:29-31
- ఆది 28:1-2
పదం సమాచారం:
బెన్యామీను, బెన్యామీను గోత్రికుడు, బెన్యామీను గోత్రికులు
వాస్తవాలు:
బెన్యామీను యాకోబు, అతని భార్య రాహేలు కనిష్ట కుమారుడు. అతని పేరుకు అర్థం, "నా కుడి చేతి కుమారుడు."
- అతడు అతని అన్న యోసేపు రాహేలు పిల్లలు. ఆమె చనిపోతున్న సమయంలో బెన్యామీను పుట్టాడు.
- బెన్యామీను సంతానం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల్లో ఒకటి అయింది.
- సౌలు రాజు ఇశ్రాయేలు బెన్యామీను గోత్రం నుండి వచ్చాడు.
- అపోస్తలుడు పౌలు కూడా బెన్యామీను గోత్రికుడే.
(చూడండి: ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, యోసేపు , యోసేపు (పా ని), పౌలు, రాహేలు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
బేతేలు
వాస్తవాలు:
బేతేలు పట్టణం కనాను ప్రదేశంలో యెరూషలేము ఉత్తరాన ఉంది. దీన్ని అంతకుముందు "లూజు" అనే వారు.
- తరువాత మొదటి సారిగా దేవుని వాగ్దానం పొందాక అబ్రాము (అబ్రాహాము) బేతేలు దగ్గర దేవునికి బలిపీఠం కట్టాడు. ఈ పట్టణం అసలు పేరు ఆ సమయంలో బేతేలు కాదు. అయితే సాధారణంగా దాన్ని "బేతేలు,"అని అలవాటైన పేరుతొ పిలిచేవారు.
- యాకోబు అతని సోదరుడు ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నుండి, ఈ పట్టణం దగ్గర ఒక రాత్రి ఆరు బయట నేలపై నిద్ర పోయాడు. అతడు నిద్ర పోతుండగా అతనికి ఒక కల వచ్చింది. దేవదూతలు పరలోకానికి నిచ్చెనపై ఎక్కుతూ దిగుతూ ఉండడం చుసాడు.
- యాకోబు ఆ పేరు పెట్టే దాకా ఆ పట్టణం పేరు "బేతేలు"గా మారలేదు. స్పష్టంగా చెప్పాలంటే కొన్ని అనువాదాలు దీన్ని "లూజు (తరువాత పిలిచాడు బేతేలు)"అనే అనువదించడం చూడవచ్చు. అబ్రాహాముకు సంబంధించిన వాక్య భాగాల్లో, ఇంకా యాకోబు మొదటి సారి అక్కడికి వచ్చిన సందర్భాల్లో (అతడు దాని పేరు మార్చక ముందు) ఇలా రాయ వచ్చు.
- బేతేలును ప్రస్తావించినది తరచుగా పాత నిబంధనలో అనేక ప్రాముఖ్యం అయిన సంఘటనలు జరిగినప్పుడు.
(చూడండి: అబ్రాహాము, బలిపీఠం, ఇశ్రాయేలు, యెరూషలేము)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 12:8-9
- ఆది 35:1-3
- హోషేయ 10:14-15
- న్యాయాధి 01:22-24
పదం సమాచారం:
బోళం
నిర్వచనం:
బోళం ఒక నూనె లేక మసాల లాంటిది. ఆఫ్రికా, ఆసియాలో బోళం చెట్టునుండి వచ్చే జిగురునుండి తయారు చేస్తారు. ఇది సంబరానికి సంబంధించి ఉంటుంది.
- బోళాన్ని సాంబ్రాణిలోనూ, పరిమళ ద్రవ్యాలోనూ, ఔషదాలలోనూ వినియోగిస్తారు, చనిపోయిన దేహాలను సమాధి చెయ్యడానికి సిద్ధపరచడానికి దీనిని వినియోగిస్తారు.
- యేసు జన్మించినప్పుడు జ్ఞానులు తీసుకొనివచ్చిన బహుమతులలో బోళం ఒకటి.
- యేసు సిలువవేయబడినప్పుడు ఆ బాధను మరచిపోడానికి ద్రాక్షారసంలో బోళాన్ని కలిపి ఇచ్చారు.
(చూడండి: సాంబ్రాణి, జ్ఞానులు (పండితులు))
బైబిలు రిఫరెన్సులు:
- నిర్గమ 30:22-25
- ఆదికాండం 37:25-26
- యోహాను 11:1-2
- మార్కు 15:22-24
- మత్తయి 02:11-12
పదం సమాచారం:
- Strong's: H3910, H4753, G3464, G4666, G4669
భయం, భయాలు, భయపడు
నిర్వచనం:
"భయం” “భయపడు" అనేవి ఒక వ్యక్తి తనకు ఇతరుల నుండి బెదిరింపు, హాని కలుగుతుందనే భావన.
- "భయం" అనేది అధికారంలో ఉన్న ఒక మనిషి పట్ల అద్భుతాశ్చర్యాలతో కూడిన గౌరవం అని కూడా అర్థం.
- "యెహోవా భయం," "దేవుని భయం” “ప్రభువు భయం," అంటే దేవునిపట్ల గాఢమైన గౌరవం కలిగి ఆయనకు భయపడి లోబడడం. భయం కలిగేది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడని, అయన పాపాన్ని అసహ్యించుకుంటాడని తెలిసి.
- బైబిల్ బోధించేది ఏమిటంటే ఒక వ్యక్తి యెహోవాపట్ల భయం కలిగి ఉంటే అతడు జ్ఞాని అవుతాడు.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, "భయం" అనే మాటను ఇలా అనువదించ వచ్చు. "భయపడు” లేక “లోతైన గౌరవం” లేక “సన్మానం” లేక “అద్భుతాశ్చర్యాలు కనపరచు."
- "భయపడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భీతి చెందు” లేక “హడలి పోవు” లేక “భయపడు."
- వాక్యం "వారిపై దేవుని భయం వచ్చింది." అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "హటాత్తుగా వారు దేవుని పట్ల అద్భుతాశ్చర్యాలు, గౌరవంతో నిండిపోయారు.” లేక “తక్షణమే, వారు దేవుని పట్ల అబ్బురం, గౌరవ భావంతో నిండి పోయారు.” లేక “తరువాత, వారు దేవునికి భయపడ్డారు (అయన గొప్ప శక్తి)."
- "భయపడకండి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "భయపడకండి” లేక “భయపడవద్దు."
- గమనించండి "యెహోవా భయం" కొత్త నిబంధనలో కనిపించదు. "ప్రభువు భయం” లేక “ప్రభువైన దేవుని భయం" అనే మాట ఉపయోగిస్తారు.
(చూడండి: ఆశ్చర్యపోవు, అద్భుతాశ్చర్యాలు, అధికారి, శక్తి, యెహోవా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 04:17-18
- అపో. కా. 02:43-45
- అపో. కా. 19:15-17
- ఆది 50:18-21
- యెషయా 11:3-5
- యోబు 06:14-17
- యోనా 01:8-10
- లూకా 12:4-5
- మత్తయి 10:28-31
- సామెతలు 10:24-25
పదం సమాచారం:
- Strong's: H367, H926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G870, G1167, G1168, G1169, G1630, G1719, G2124, G2125, G2962, G5398, G5399, G5400, G5401
భారం, భారాలు, భారంతో ఉన్న, భారభరితమైన
నిర్వచనం:
భారం అంటే బరువైనది మోయడం. ఇది అక్షరాలా భౌతికమైన దాన్ని సూచిస్తున్నది, అంటే బరువులు మోసే జంతువు.
ఈ పదం "భారం"అనే దానికి అనేక అలంకారిక అర్థాలు ఉన్నాయి:
- భారం అంటే ఒక వ్యక్తిపై ఉన్న దుర్లభం అయిన బాధ్యత, లేక ప్రాముఖ్యం అయిన బాధ్యత. "భారం భరించు” లేక “మోయు" "మోయలేని భారం"అని చెప్పవచ్చు.
- క్రూరమైన నాయకుడు భరించలేని భారాలు తాను పాలించే ప్రజలపై మోప వచ్చు. ఉదాహరణకు పెద్ద మొత్తంలో పన్నులు మోపవచ్చు.
- ఒక వ్యక్తి ఎవరికైనా భారంగా ఉండడం ఇష్టం లేకపోతే అతడు ఎదుటి వాడికి ఎలాటి సమస్యా కలిగించడు.
- ఒక మనిషి అపరాధ భావం, పాపం అతనికి భారం.
- "ప్రభువుభారం"అంటే అలంకారికంగా ఒక ప్రవక్త దేవుని ప్రజలకు తెచ్చే "దేవుని నుండి సందేశం."
- ఈ పదం "భారం"అనే దాన్ని ఇలా అనువదించవచ్చు. "బాధ్యత ” లేక “విద్యుక్త ధర్మం” లేక “బరువైన భారం” లేక “సందేశం,"సందర్భాన్ని బట్టి చూసుకోవాలి.
బైబిల్ రిఫరెన్సులు:
- 2తెస్స 03:6-9
- గలతి 06:1-2
- గలతి 06:3-5
- ఆది 49:14-15
- మత్తయి 11:28-30
- మత్తయి 23:4-5
పదం సమాచారం:
- Strong's: H92, H3053, H4614, H4853, H4858, H4864, H4942, H5445, H5447, H5448, H5449, H5450, H6006, G4, G916, G922, G1117, G2347, G2599, G2655, G5413
భాష, భాషలు
నిర్వచనం:
"భాష" కు బైబిల్లో అనేక అలంకారికంగా అర్థాలు .
- బైబిల్లో, ఈ పదానికి ఎక్కువగా అలంకారికంగా అర్థం "భాష” లేక “పలుకు."
- కొన్ని సార్లు "భాష" అనే మానవభాష. కొన్ని ప్రజలు సమూహాలు మాట్లాడేది.
- ఇతర సమయాల్లో ఇది to మానవాతీత భాషను సూచిస్తున్నది. అంటే పరిశుద్ధాత్మ క్రీస్తు విశ్వాసులకు ఇచ్చే "ఆత్మ వరాలు."
- "నాలుకలు" అనే మాట మంటను సూచిస్తున్నది.
- "నా నాలుక హర్షించును," అంటే మొత్తం వ్యక్తి అని అర్థం.
- "అబద్ధమాడే నాలుక” అంటే ఒక వ్యక్తి మాట లేక పలుకు.
అనువాదం సలహాలు
- సందర్భాన్ని బట్టి, "భాష" ను ఇలా అనువదించ వచ్చు. "భాష” లేక “ఆత్మ సంబంధమైన భాష." చెబుతున్నదేమితో స్పష్టంగా లేకపొతే దాన్ని “భాష అని అనువదించడం మంచిది.
- మంట, గురించి చెబుతుంటే ఈ పదాన్నిఇలా తర్జుమా చెయ్యవచ్చు"జ్వాలలు."
- "నా నాలుక హర్షించును" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నేను హర్షించి దేవుణ్ణి స్తుతిస్తాను.” లేక “నేను సంపూర్ణంగా ఆనందంతో స్తుతిస్తాను."
- "అబద్ధాలు ఆడే నాలుక" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు."అబద్ధాలు చెప్పే వ్యక్తి” లేక “అబద్ధం ఆడే మనుషులు."
- "వారి భాషలతో" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వారు చెప్పే మాటలతో” లేక “వారి మాటల ద్వారా."
(చూడండి: కానుక, పరిశుద్ధాత్మ, సంతోషం, స్తుతి, సంతోషం, ఆత్మ)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 12:9-11
- 1 యోహాను 03:16-18
- 2 సమూయేలు 23:1-2
- అపో. కా. 02:25-26
- యెహెజ్కేలు 36:1-3
- ఫిలిప్పి 02:9-11
పదం సమాచారం:
- Strong's: H762, H2013, H2790, H3956, G1100, G1258, G1447, G2084
భూమి, మర్త్య, భూసంబంధమైన
నిర్వచనం:
"భూమి" అంటే ఇతర జీవులతో బాటు మానవులు నివసించే లోకం.
- "భూమి" అంటే నేల లేక నేలను కప్పే మన్ను అని కూడా అర్థం ఇస్తుంది.
- ఈ పదాన్ని తరచుగా భూమిపై నివసించే మనుషులకు అలంకారికంగా ఉపయోగిస్తారు.
- "భూమి సంతోషించాలి” “ఆయనఅతడు భూమికి న్యాయాధిపతి" అనే మాటలు ఈ పదం అలంకారిక వాడకానికి ఉదాహరణలు.
- "భూసంబంధమైన" అనే మాట సాధారణంగా ఆత్మ సంబంధమైన వస్తువులకు భిన్నంగా శారీరిక వస్తువులను సూచిస్తున్నది.
అనువాదం సలహాలు:
- ఈ పదాన్ని స్థానిక భాష లేక జాతీయ భాషలు మనం నివసించే భూమిని ఎలా పిలుస్తారో అలా కూడా అనువదించ వచ్చు.
- సందర్భాన్ని బట్టి, "భూమి" ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "లోకం” లేక “దేశం” లేక “మట్టి” లేక “నేల."
- అలంకారికంగా ఉపయోగించినప్పుడు "భూమి" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భూమిపై నివసించే ప్రజలు” లేక “భూనివాసులు’ లేక “భూమిపై ఉన్న ప్రతిదీ."
- అనువదించడం "భూసంబంధమైన" అనే దాన్ని అనువదించడంలో "భౌతిక” లేక “భూవస్తువులు” లేక “దృశ్యమైనవి.”
(చూడండి: ఆత్మ, లోకం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 01:38-40
- 2 దిన 02:11-12
- దానియేలు 04:35
- లూకా 12:51-53
- మత్తయి 06:8-10
- మత్తయి 11:25-27
- జెకర్యా 06:5-6
పదం సమాచారం:
- Strong's: H127, H772, H776, H778, H2789, H3007, H3335, H6083, H7494, G1093, G1919, G2709, G2886, G3625, G3749, G4578, G5517
మంచిది, సరియైన, రమ్యమైన, సంతోషకరమైన, మెరుగైన, శ్రేష్ఠమైన
నిర్వచనం:
"మంచిది" అనే పదానికి సందర్భాన్ని బట్టి వివిధ అర్థాలున్నాయి. అనేక భాషలు వివిధ అర్థాలను అనువదించడం కోసం వివిధ పదాలను ఉపయోగిస్తాయి.
- సాధారణంగా, ఏదైనా దేవుని గుణ లక్షణాలకూ, ఉద్దేశాలకూ, చిత్తానికీ సరిపడినట్లయితే అది మంచిది అవుతుంది.
- "మంచిది" అంటే సంతోషకరమైనది, శ్రేష్ఠమైనది, సహాయకరమైనది, సరిపడినది, లాభకరమైనది, లేదా నైతికంగా సరియైనది అని అర్థం.
- "మంచి" దేశం అంటే "సారవంతం” లేక “ఫలభరితం" అని అర్థం.
- "మంచి" పంట అంటే "సమృద్ధి" అయిన పంట అని అర్థం.
- ఒక వ్యక్తి తను చేసిన దానిలో “మంచి" గా ఉండగలడు అంటే అతని కార్యాచరణలో గానీ లేదా వృత్తిలోగానీ నిపుణుడుగా ఉన్నాడని అర్థం. ఉదాహరణకు "మంచి రైతు" అనే వాక్యం.
- బైబిలులో "మంచి" అనే పదానికి సాధారణ అర్థం తరచుగా "దుష్టత్వం" అనే దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
- "మంచితనం" అంటే సాధారణంగా నైతికంగా మంచిగా ఉండడం లేదా తలంపులలోనూ, చర్యలలోనూ నీతిగా ఉండడం సూచిస్తుంది.
- దేవుని మంచితనం అంటే ఆయన ప్రజలకు మంచివీ, ప్రయోజనకరమైన వాటిని అనుగ్రహించడం ద్వారా వారిని ఆశీర్వదించడానిని సూచిస్తుంది. ఇది అయన నైతిక పరిపూర్ణతను కూడా సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- లక్ష్య భాషలో "మంచిది" పదం కోసం సాధారణ పదాన్ని దాని సాధారణ అర్థం ఖచ్చితంగానూ, సహజంగానూ ఉన్న చోట ఉపయోగించాలి. ప్రత్యేకించి దుర్మర్గత పదానికి వ్యతిరేకంగా ఉన్న చోట ఉపయోగించాలి.
- సందర్భాన్ని బట్టి, ఈ పదం "దయగల” లేక “శ్రేష్ఠమైన" లేదా “దేవునికి సంతోషాన్ఆని కలిగించే" లేదా నీతిమంతుడు" లేదా “నైతికంగా న్యాయబద్ధమైన" లేదా “ప్రయోజనకరమైన" పదాలు ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- "మంచి భూమి" పదం "సారవంతమైన భూమి" లేదా “ఫలవంతమైన భూమి" అని అనువదించబడవచ్చు; "మంచి పంట" పదం "సమృద్ధియైన పంట" లేదా "విస్తారమొత్తంలో పంట" అని అనువదించబడవచ్చు.
- "మంచి చెయ్యడం" అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించేదేదైనా చెయ్యడం, "దయగలిగి యుండండి" లేదా "సహాయం చెయ్యండి" లేదా మరొకరికి "ప్రయోజనం చేకూర్చండి" అని అర్థం.
- "విశ్రాంతి దినమున మంచి చెయ్యడం" అంటే "విశ్రాంతి దినమున ఇతరులకు సహాయం చేసే క్రియలు చెయ్యండి" అని అర్థం.
- సందర్భాన్ని బట్టి, "మంచితనం" అనే పదం "ఆశీర్వాదం” లేదా “దయ” లేదా “నైతిక పరిపూర్ణత” లేదా “నీతి” లేదా “పవిత్రత" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
(చూడండి: దుష్టత్వం, పరిశుద్ధమైన, లాభం, నీతిగల)
బైబిలు రిఫరెన్సులు:
- గలతీ 05:22-24
- ఆది 01:12
- ఆది 02:09
- ఆది 02:17
- యాకోబు 03:13
- రోమా 02:04
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 01:04 దేవుడు తాను సృష్టించినదంతా మంచిది ఉన్నట్టు చూశాడు.
- 01:11 దేవుడు మంచి చెడుల తెలివిని ఇచ్చే చెట్టును మొలిపించాడు.”
- 01:12 తరువాత దేవుడు చెప్పాడు, "నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు."
- 02:04 "దేవుడు నీవు దీనిని తినినప్పుడు నీవు దేవుని వలే ఉంటావు, ఆయనకు వలే మంచి చెడుల తెలివిని కలిగి ఉంటావు."
- 08:12 "మీరు దుష్ట తలంపుతో నన్ను బానిసగా అమ్మి వేశారు. అయితే దేవుడు దుష్టత్వాన్ని మంచి కోసం ఉపయోగించుకున్నాడు!"
- 14:15 యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు విధేయత కలిగి దేవునికి లోబడ్డాడు.
- 18:13 ఈ రాజులు కొందరు మంచి మనుషులు. న్యాయంగా పరిపాలన జరిగిస్తూ దేవుణ్ణి ఆరాధించినవారు.
- 28:01 "మంచి బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి?" యేసు అతనితో చెప్పాడు. "నన్ను మంచి వాడని ఎందుకు పిలుస్తున్నావు?' మంచి వాడొక్కడే, ఆయన దేవుడు."
పదం సమాచారం:
- Strong's: H117, H145, H155, H202, H239, H410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G14, G15, G18, G19, G515, G744, G865, G979, G1380, G2095, G2097, G2106, G2107, G2108, G2109, G2114, G2115, G2133, G2140, G2162, G2163, G2174, G2293, G2565, G2567, G2570, G2573, G2887, G2986, G3140, G3617, G3776, G4147, G4632, G4674, G4851, G5223, G5224, G5358, G5542, G5543, G5544
మంచు, మంచు కురిసెను, మంచు కురియుట
వాస్తవాలు:
“మంచు” అనే పదము వాతావరణము చల్లగా ఉన్న ప్రాంతాలలో మేఘాలనుండి క్రింద పడే మంచు నీటినుండి రాలి పడే తెల్లని బిందువులు లేక దూదిని పోలిన మంచును సూచిస్తుంది.
- మంచు ఇశ్రాయేలులోని ఎత్తైన స్థలాలో కురుస్తుంది, కాని అ మంచు ఎక్కువ సమయము నేల మీద ఉండదు. పర్వత శిఖరాల మీద ఎక్కువ కాలము మంచు మిగిలియుంటుంది. పరిశుద్ధ గ్రంథములో మంచు కలిగిన పర్వతముగా లెబానోను పర్వతము ఒక ఉదాహరణగా మిగిలియున్నది.
- తెల్లగా ఉండేది అనేకమార్లు మంచు రంగకు పోల్చి చూసినప్పుడు అదే రంగును కలిగియున్నది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథములో యేసు ధరించిన వస్త్రములు మరియు ఆయన వెంట్రుకలు “మంచువలె తెల్లగా” ఉన్నాయని వివరించబడియుండెను.
- మంచు తెల్లదనం కూడా పవిత్రతకు మరియు శుద్ధతకు గురుతుగా ఉన్నది. ఉదాహరణ, మన “పాపములు మంచువలె తెల్లగా ఉంటాయి” అనే మాటకు దేవుడు సంపూర్ణముగా తన ప్రజల పాపములనుండి వారిని కడిగివేశాడని దాని అర్థము.
- కొన్ని భాషలు బహుశ మంచును “ఘనీభవించిన వానగా” లేక “మంచు రేకలు” లేక “ఘనీభవించిన రేకులు” అని సూచించును.
- “మంచు నీరు” అనేది కరిగిన మంచునుండి వచ్చే నీటిని సూచించును.
(ఈ పదములను కూడా చూడండి: లెబానోను, శుద్ధమైన)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- నిర్గమ.04:6-7
- యోబు.37:4-6
- మత్తయి.28:3-4
- కీర్తన.147:15-16
- ప్రకటన.01:4-16
పదం సమాచారం:
- Strong's: H7949, H7950, H8517, G5510
మంట, మంటలు, అగ్నికణాలు, నిప్పు పళ్ళాలు, చలి కాగే నెగడులు, నిప్పుకుండ, నిప్పుకుండలు
నిర్వచనం:
మంట అంటే వేడిమి, వెలుగు, అగ్ని జ్వాలలు, దేన్నైనా తగల బెట్టడానికి.
- కట్టెలు తగలబెట్టిడితే బూడిదగా మారిపోతుంది.
- "మంట" ను అలంకారికంగా ఉపయోగిస్తారు. సాధారణంగా తీర్పు లేక పవిత్ర పరచడాన్ని సూచించడానికి.
- అవిశ్వాసుల అంతిమ తీర్పు నరకాగ్ని.
- మంటను బంగారం, ఇతర లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. బైబిల్లో, ఈ ప్రక్రియను దేవుడు తన ప్రజలను వారి జీవితాల్లో సంభవించే కష్టాలను ఉపయోగించి వారిని శుద్ధి చేయడాన్ని సూచించడానికి వాడతారు.
- "అగ్నితో బాప్తిసం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "హింసలు అనుభవించడం ద్వారా శుద్ధి చెయ్యడం."
(చూడండి: శుద్ధమైన)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 16:18-20
- 2 రాజులు 01:9-10
- 2 తెస్స 01:6-8
- అపో. కా. 07:29-30
- యోహాను 15:5-7
- లూకా 03:15-16
- మత్తయి 03:10-12
- నెహెమ్యా 01:3
పదం సమాచారం:
- Strong's: H215, H217, H398, H784, H800, H801, H1197, H1200, H1513, H2734, H3341, H3857, H4071, H4168, H5135, H6315, H8316, G439, G440, G1067, G2741, G4442, G4443, G4447, G4448, G4451, G5394, G5457
మంద, మందలు
నిర్వచనం:
బైబిల్లో, "మంద" అనే మాట గొర్రె, మేకలు, పశువులు, ఎద్దులు, లేక పందుల సమూహాలను సూచిస్తున్నది
- వివిధ భాషల్లో రకరకాలుగా జంతువుల, పక్షులు సమూహాలను సూచించే పదం ఉంటుంది.
- ఉదాహరణకు, "మంద" అనే మాటను గొర్రెకు, మేకలకు ఉపయోగిస్తారు. బైబిల్లో కూడా ఇలా ఉపయోగిస్తారు.
- "మంద" అనే మాటను పక్షుల సమూహానికి ఉపయోగించరు.
- మీ భాషలో వివిధ జంతుసమూహాలకు ఏ పదాలు ఉపయోగిస్తారో చూడండి.
- "మందలు, సమూహాలు" మొదలైన వాటిని చెప్పే వచనాల్లో "గొర్రె” లేక “పశువులు" అనే పదం జోడిస్తే మంచిది. భాషలో వివిధ రకాల జంతువు సమూహాల కోసం వేరువేరు మాటలు ఉంటే ఇలా చెయ్యాలి.
(చూడండి: మేక, ఆవు, పంది, ఆడగొర్రె)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 10:28-29
- 2 దిన 17:10-11
- ద్వితీ 14:22-23
- లూకా 02:8-9
- మత్తయి 08:30-32
- మత్తయి 26:30-32
పదం సమాచారం:
- Strong's: H951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G34, G4167, G4168
మచ్చ, మచ్చలు, మచ్చలేని
వాస్తవాలు:
ఈ పదం "మచ్చ" అనేది జంతువు లేక వ్యక్తిపై శారీరిక కళంకం లేక లోపం తెలియజేస్తాయి. ఇది ప్రజల్లో ఆత్మ సంబంధమైన తప్పుల విషయంలో కూడా ఉపయోగిస్తారు.
- కొన్ని బలి అర్పణల విషయంలో, మచ్చలు, కళంకాలు లేని జంతువులను అర్పించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు అజ్ఞాపించాడు.
- యేసు క్రీస్తు పాప రహిత పరిపూర్ణ బలి అర్పణను కూడా ఇది సూచిస్తున్నది.
- క్రీస్తు విశ్వాసులను వారి పాపం నుండి తన రక్తం ద్వారా కడిగి వారిని మచ్చ లేని వారుగా చేశాడు.
- ఈ పదాన్నిఅనువదించే మార్గాలు "కళంకం” లేక “లోపం” లేక “పాపం," సందర్భాన్ని బట్టి.
(చూడండి: విశ్వసించు, శుద్ధమైన, బలియాగము, పాపము)
బైబిల్ రిఫరెన్సులు:
- 1పేతురు 01:18-19
- 2పేతురు 02:12-14
- ద్వితీ 15:19-21
- సంఖ్యా 06:13-15
- పరమ 04:6-7
పదం సమాచారం:
- Strong's: H3971, H8400, H8549, G3470
మనష్షే
వాస్తవాలు:
పాతనిబంధనలో మనష్షే పేరు ఉన్నవారు ఐదుగురు ఉన్నారు.
- యోసేపు మొదటి కుమారుని మనష్షే.
- మనష్షే అతని తమ్ముడు ఎఫ్రాయీములను యోసేపు తండ్రి యాకోబు దత్తత తీసుకొన్నాడు, ఫలితంగా వారి సంతానానికి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలమధ్య ఉండే ఆధిక్యత దొరికింది.
- మనష్షే సంతానం ఇశ్రాయేలీయుల గోత్రాలలో ఒక గోత్రంగా తయారైంది.
- మనష్షే గోత్రం తరచుగా “మనష్షే అర్థగోత్రం” అని పిలువబడుతుండేది, ఎందుకంటే మనష్షే గోత్రంలోని ఒక భాగం మాత్రమే కానానులోని యొర్ధానునదికి పశ్చిమాన స్థిరపడింది. మనష్షే గోత్రంలోని మరొక సగభాగం యొర్దానుకు తూర్పున స్థిరపడింది.
- యూదా రాజులలో ఒక రాజు పేరు కూడా మనష్షే
- మనష్షే రాజు చాలా దుష్టుడైన రాజు, అబద్ధపు దేవుళ్ళకు తన సొంత కుమారులనే బలిగా అర్పించాడు.
- శత్రు సైన్యం చేతికి అప్పగించడం ద్వారా దేవుడు మనష్షేని శిక్షించాడు. మనష్షే దేవుని వైపుకు తిరిగాడు, విగ్రహారాధన జరిగే బలిపీఠాలను నాశనం చేసాడు.
- ఎజ్రా కాలంలో మనష్షే పేరున్న ఇద్దరు వ్యక్తులు నివసించారు. ఈ ఇద్దరు వ్యక్తులు అబద్ధపు దేవుళ్ళను ఆరాధించేలా తమను ప్రభావితం చేసిన అన్యులైన తమ భార్యలను విదిచిపెత్తవలసి వచ్చింది.
- మరొక మనష్షే అబద్ధపు దేవుళ్ళకు యాజకులుగా ఉన్న కొందరు దానీయులకు తాతగా ఉన్నాడు.
(చూడండి: బలిపీఠం, దాను, ఎఫ్రాయిము, ఎజ్రా, దేవుడు, ఇశ్రాయేలు, యూదా, అన్య, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిలు రెఫరెన్సులు:
- 2 దినవృత్తాంతములు 15:8-9
- ద్వితియోపడేశకాండం 03:12-13
- ఆదికాండం 41:50-52
- ఆదికాండం 48:1-2
- న్యాయాధిపతులు 01:27-28
పదం సమాచారం:
- Strong's: H4519, H4520, G3128
మనసు, మనసుగల, గుర్తు చెయ్యడం, ఏకమనస్కులైన
నిర్వచనం:
“మనసు” పదం ఒక వ్యక్తిలో ఆలోచించే భాగం, నిర్ణయాలు చేసే భాగం.
- ప్రతీ వ్యక్తి మనసు అతని లేదా తలంపులు, ఊహ అంతటి మొత్తం.
- ”క్రీస్తు మనసు కలిగియుండడం” అంటే యేసు క్రీస్తు ఆలోచించినట్లు, వ్యవహరిస్తున్నట్టు ఆలోచించడం, చెయ్యడం అని అర్థం. తండ్రియైన దేవునికి విధేయుడిగా ఉండడం, క్రీస్తు బాధలకు లోబడియుండడం అని అర్థం. దీనిని చేయడానికి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శక్తిని పొందడం.
- ”మనసు మార్చుకోవడం” అంటే ఒకడు తనకు ముందు ఉన్న అభిప్రాయానికి భిన్నంగా భిన్నమైన నిర్ణయాన్ని చెయ్యడం లేక కలిగియుండడం అని అర్థం.
అనువాదం సూచనలు
- ”మనసు” అనే పదం “ఆలోచనలు” లేదా “తర్కం” లేదా “ఆలోచించడం” లేదా “అవగాహన చేసుకోవడం” అని అనువదించబడవచ్చు.
- ”మనసులో ఉంచుకో” అనే వ్యక్తీకరణ “జ్ఞాపకం ఉంచుకో” లేదా “దీని మీద శ్రద్ధ ఉంచు” లేదా “దీనిని తెలుసుకొనేలా ఉండు” అని అనువదించబడవచ్చు.
- ”హృదయం, ఆత్మ, మనసు” అనే వ్యక్తీకరణ “నీవు భావిస్తున్నదాని గురించీ, నీవు విశ్వసిస్తున్నదాని గురించీ, నువ్వు ఆలోచిస్తున్నదానిని గురించీ" అని అనువదించబడవచ్చు.
- ”మనసులోనికి తెచ్చుకో” అనే వ్యక్తీకరణ “జ్ఞాపకముంచుకో” లేదా “దాని గురించి ఆలోచించు” అని అనువదించబడవచ్చు.
- ”మనసు మార్చుకొని వెళ్ళిపోయాడు” అనే వ్యక్తీకరణ “భిన్నంగా నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు” లేదా “వెళ్ళిపోడానికి నిర్ణయించుకొన్నాడు” లేదా “తన అభిప్రాయాన్ని మార్చుకొని వెళ్ళిపోయాడు” అని అనువదించబడవచ్చు.
- ”ద్విమనస్కులై” అనే పదం “అనుమానించడం” లేదా “నిర్ణయించుకోలేక పోవడం” లేదా “విరుద్ధమైన తలంపులతో” అని అనువదించబడవచ్చు.
(చూడండి: విశ్వసించు, హృదయం, ప్రాణం (ఆత్మ))
బైబిలు రెఫరెన్సులు:
- లూకా 10:27
- మార్కు 06:51-52
- మత్తయి 21:29
- మత్తయి 22:37
- యాకోబు 04:08
పదం సమాచారం:
- Strong's: H3629, H3820, H3824, H5162, H7725, G1271, G1374, G3328, G3525, G3540, G3563, G4993, G5590
మన్నా
నిర్వచనం:
మన్నా తెల్లని గింజల్లా ఉండే ఆహార పదార్ధం, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచిన తరువాత అరణ్యంలో 40 సంవత్సరాలు వారు భుజించదానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం.
- మన్నా తెల్లని పొరల్లా కనిపిస్తుంది, ప్రతీ ఉదయం నేల మీద మంచుకింద ఉండేది. అది రుచికి తియ్యగానూ, తేనెలా ఉండేది.
- ఇశ్రాయేలీయులు సబ్బాతు దినం తప్పించి ప్రతీ రోజు మన్నా పొరలను పోగుచేసుకొనేవారు.
- సబ్బాతు దినానికి ముందు, రెండింతల మన్నాను పోగుచేసుకోవాలి, తద్వారా విశ్రాంతిదినాన్న వారు పోగుచేసుకోవలసిన అవసరం లేదు.
- ”మన్నా” అంటే “ఇదేమి” అని అర్థం.
- బైబిలులో, మన్నా అనే పదం “పరలోకం నుండి ఆహారం,” “పరలోకం నుండి ధాన్యం” అని కూడా సూచిస్తుంది.
అనువాదం సూచనలు
- దీనిని “ఆహారపు సన్నని పోర” లేక “పరలోకం నుండి ఆహారం” అని అనువాదం చెయ్యవచ్చు.
- స్థానిక లేక దేశీయ బైబిలు అనువాదంలో ఈ పదం ఏవిధంగా అనువదించబడిందో గమనించండి.
(చూడండి: రొట్టె, ఎడారి, ధాన్యం, పరలోకం, సబ్బాతు)
బైబిలు రెఫరెన్సులు:
- ద్వితియోపదేశకాండం 08:3
- నిర్గమకాండం 16:26-27
- హెబ్రీ 09:3-5
- యోహాను 06:30-31
- యెహోషువా 05:12
పదం సమాచారం:
మాదయి, మాదీయులు
వాస్తవాలు:
మాదయి అస్సీరియా, బబులోనుకి తూర్పున ఉన్న పురాతన సామ్రాజ్యం. ఇది ఎలాముకు, పర్షియాకు ఉత్తరాన ఉంది. మాదయి సామ్రాజ్యంలో నివసించిన ప్రజలు “మాదీయులు” అని పిలువబడ్డారు.
- మాదయి సామ్రాజ్యం ప్రస్తుత టర్కీ, ఇరాన్, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలోని భూబాగాలను కలుపుకొని ఉంది.
- మాదీయులు పర్షియనులతో సన్నిహితంగా ఉండేవారు, బాబులోను రాజును జయించదానికి ఇద్దరు చక్రవర్తులు ఏకం అయ్యారు.
- మాదీయుడైన దర్యావేషు బాబులోను మీదకు దండెత్తాడు, ఆ కాలంలో దానియేలు ప్రవక్త జీవిస్తున్నాడు.
(చూడండి: అస్సిరియా, బబులోను, కోరేషు, దానియేలు, దర్యావేషు, ఏలాము, పారసీక)
బైబిలు రిఫరెన్సులు:
- 2 రాజులు 17:4-6
- అపొస్తలులకార్యములు 02:8-11
- దానియేలు 05:25-28
- ఎస్తేరు 01:3-4
- ఎజ్రా 06:1-2
పదం సమాచారం:
- Strong's: H4074, H4075, H4076, H4077, G3370
మార్త
వాస్తవాలు:
మార్త బెతనియ గ్రామం నుండి యేసుని అనుసరించిన స్త్రీ.
- మార్తకు మరియ అనే ఒక సహోదరి ఉంది, లాజరు అనే సోదరుడు ఉన్నాడు, వారు కూడా యేసును అనుసరించారు.
- ఒకసారి యేసు వారిని తమ ఇంట దర్శించదానికి వెళ్ళినప్పుడు, భోజనం తయారు చెయ్యడంలో మార్త ఆటంకపడింది, తన సోదరి మరియ యేసు బోధను వింటుంది.
- లాజరు చనిపోయినప్పుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని తాను విశ్వసిస్తున్నట్టు మార్త చెప్పింది.
(చూడండి: లాజరు, మరియ, (మార్త సహోదరి))
బైబిలు రెఫరెన్సులు:
- యోహాను 11:1-2
- యోహాను 12:1-3
- లూకా 10:38-39
పదం సమాచారం:
మిద్యాను, మిద్యానీయుడు, మిద్యానీయులు
వాస్తవాలు:
అబ్రహాము అతని భార్య కుమారుడు మిద్యాను. అరేబియా అరణ్యంలో ఉత్తరాన ఉన్న ప్రజాగుంపు పేరు కూడా మిద్యాను, ఇది కానాను భూబాగానికి దక్షిణాన ఉంది. ఆ ప్రజాగుంపులోని ప్రజలను “మిద్యానీయులు” అని పిలుస్తారు.
- మోషే మొదట ఐగుప్తును విడిచినప్పుడు, మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ యిత్రో కుమార్తెలను కలుసుకొన్నాడు, వారికి సహాయం చేసాడు, వారి మందలకు నీరు అందించాడు. తరువాత మోషే యిత్రో కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకొన్నాడు.
- యోసేపును బానిస వర్తర్తకులైన మిద్యాను గుంపు వారు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు.
- అనేక సంవత్సరాల తరువాత మిద్యానీయులు కనాను దేశంలోని ఇశ్రాయేలీయులపై దాడి చేసి వారిని ఆక్రమించుకొన్నారు. వారిని ఓడించడానికి గిద్యోను ఇస్రాయేలీయులను నడిపించాడు.
- ప్రస్తుతం అరేబియా గోత్రాలు ఈ గుంపు సంతానమే.
(చూడండి: అరేబియా, ఈజిప్టు, మంద, గిద్యోను, యిత్రో, మోషే)
బైబిలు రెఫరెన్సులు:
- అపొస్తలులకార్యములు 07:29-30
- నిర్గమ 02:15-17
- ఆదికాండం 25:1-4
- ఆదికాండం 36;34-36
- ఆదికాండం 37:27-28
- న్యాయాధిపతులు 07:1
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 16:03 అయితే ప్రజలు దేవుణ్ణి మరచిపోయారు, తిరిగి విహ్రహాలను పూజించడం ఆరంభించారు.
అందుచేత దేవుడు వారిని ఓడించడానికి వారికి సమీపంగా ఉన్న శత్రు గుంపు మిద్యానీయులను అనిమతించాడు.
- 16:04 ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు, మిద్యానీయులకు కనబడకుండ వారు గుహలలో దాగుకొన్నారు,
- 16:11 అతని స్నేహితుడు, “గిద్యోను సైన్యం మిద్యాను సైన్యాన్ని ఓడిస్తుందని ఈ కలభావమా?” అని అడిగాడు.
- 16:14 దేవుడు మిద్యానీయులను గందరగోళ పరచాడు, అందుచేత వారు ఒకరినొకరి మీద దాడి చేసి ఒకరినొకరు చంపుకొన్నారు.
పదం సమాచారం:
- Strong's: H4080, H4084, H4092
మిస్పా
వాస్తవాలు:
పాతనిబంధనలో అనేక పట్టణాలకు మిస్పా అని పేరు ఉంది. మిస్పా అంటే “వెలుపలికి చూచేస్థలం” లేక “కావలివాని బురుజు” అని అర్థం.
- సౌలు దావీడును వెంటాడేతప్పుడు, తన తల్లిదండ్రులను మోయాబు రాజు కాపుదలలో మిస్పాలో విడిచి వెళ్ళాడు,
- యూదా, ఇశ్రాయేలు రాజ్యాల మధ్య తీరంలో మిస్పా అనే పట్టణం ఉంది. ఇది సైనిక ప్రధాన కేంద్రం.
(చూడండి: దావీదు, యూద, ఇశ్రాయేలు రాజ్యము, మోయాబు, సౌలు (పాతనిబంధన))
బైబిలు రెఫరెన్సులు:
- 1 రాజులు 15:20-22
- 1 సమూయేలు 07:5-6
- 1 సమూయేలు 07:10-11
- యిర్మియా 40:5-6
- న్యాయాధిపతులు 10:17-18
పదం సమాచారం:
ముఖం, ముఖాలు, అభిముఖంగా, ముఖకవళికలు, ముఖం దించుకుని
నిర్వచనం:
"ముఖం" అంటే ఒక వ్యక్తి శిరస్సు ముందు భాగం. ఈ పదానికి అనేక అలంకారిక అర్థాలు ఉన్నాయి.
- "నీ ముఖం" అంటే తరచుగా అలంకారికంగా "నీవు" అని అర్థం. అదే విధంగా, "నా ముఖం" తరచుగా అంటే "నేను” లేక “నా" అని అర్థం.
- శారీరిక అర్థంలో ఎవరినైనా దేన్నైనా "ముఖం చూపడం” అంటే ఆ వ్యక్తి కేసి చూడడం.
- To "వేరొకరి ముఖం కేసి" అంటే "నేరుగా వేరొకరిని చూడడం."
- “ఎదురెదురుగా” అంటే ఇద్దరు మనుషులు దగ్గరగా అభిముఖంగా చూసుకోవడం.
- యేసు "నిలకడగా తన ముఖం యెరూషలేము వైపుకు ఉంచుకున్నాడు," అంటే అయన చాలా స్థిరంగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
- "వేరొకరికి ఎదురుగా ముఖం" అంటే మనుషులకు, పట్టణానికి వ్యతిరేకంగా తిప్పుకోవడం. అంటే to స్థిరంగా వారికీ ఇక సాయపడరాదని నిర్ణయం చేసుకోవడం. లేక ఆ పట్టణాన్ని, వ్యక్తిని తిరస్కరించడం.
- "దేశం ముఖం" అంటే ఆ భూప్రదేశమంతా, లేక భూతలం అంతా అని అర్థం. ఉదాహరణకు, "కరువు భూముఖం అంతా" అంటే విస్తృతంగా వ్యాపించిన కరువు అనేక మంది ప్రజలు నివసించే భూమి.
- అలంకారికంగా "నీ ముఖం నీ ప్రజల నుండి దాచుకోకు" అంటే "నీ ప్రజలను తిరస్కరించవద్దు” లేక “నీ ప్రజలను వదిలిపెట్టవద్దు” లేక “నీ ప్రజలను కాపాడకుండా మానవద్దు."
అనువాదం సలహాలు:
- వీలైతే, లక్ష్య భాషలో ఒకే విధమైన అర్థం వచ్చే మాటలు వాడుతూ ఉండాలి.
- "ముఖం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఒకరి వైపు ముఖం తిప్పుకోవడం” లేక “నేరుగా చూడడం” లేక “ముఖం కేసి చూడడం."
- "అభిముఖంగా" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దగ్గరగా” లేక “ఎదురెదురుగా” లేక “సమక్షంలో."
- సందర్భాన్ని బట్టి, "తన ముఖం ఎదుట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఒకరి ఎదురుగా” లేక “అతని ఎదుట” లేక “ముందు వైపు” లేక “తన సమక్షం."
- "తన ముఖం తిప్పుకుని" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నేరుగా ప్రయాణించడం” లేక “తన మనస్సులో స్థిరంగా నిర్ణయం చేసుకోవడం."
- "దాచి పెట్టు తన ముఖం నుండి దాచిపెట్టు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తొలగి పోవడం” లేక “సంరక్షణ, సహాయం మానుకోవడం” లేక “తిరస్కరించడం."
- “పట్టణం లేక ప్రజలకు తన ముఖం వ్యతిరేకంగా తిప్పుకోవడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కోపంగా చూడడం, దోషిగా తీర్చడం” లేక “అంగీకారం నిరాకరించడం” లేక “తిరస్కరించాలని నిర్ణయం” లేక “దోషిగా తీర్చు, తిరస్కరించడం” లేక “తీర్పు తీర్చడం."
- "వారి ముఖం మీద చెప్పడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సూటిగా చెప్పడం” లేక “వారి సమక్షం చెప్పడం” లేక “వ్యక్తిగతంగా చెప్పడం."
- "దేశం ముఖం"పై అనే మాటను ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "దేశం అంతటా” లేక “భూమి అంతటా” లేక “భూమి అంతటా నివాసం."
బైబిల్ రిఫరెన్సులు:
- ద్వితీ 05:4-6
- ఆది 33:9-11
పదం సమాచారం:
- Strong's: H600, H639, H5869, H6440, H8389, G3799, G4383, G4750
ముద్దు, ముద్దులు, ముద్దు పెట్టుకోవడం, ముద్దుపెట్టుకొంటూ ఉండడం
నిర్వచనం:
ఒకడు తన పెదవులను మరొకరి పెదవుల మీద లేక ముఖం మీద ఉంచే ప్రక్రియయే ముద్దు. ఈ పదం ఉపమాన రీతిగా కూడా వినియోగించవచ్చు.
- కొన్ని సంస్కృతులలో ఒకరికొకరు బుగ్గ మీద ముద్దు పెట్టడం ఒక విధమైన శుభముకు గుర్తుగా లేక వీడ్కోలు చెప్పడానికి సూచనగా ఉంటుంది.
- ఒక ముద్దు భార్య – భర్త లాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన ప్రేమను చూపిస్తుంది,
- ”ఒకరికి వీడ్కోలు ముద్దు ఇవ్వండి” అనే మాట అర్థం ముద్దుతో వారికి వీడ్కోలు పలకండి అంది అర్థం.
- కొన్నిసార్లు “ముద్దు” అనే పదాన్ని “ఎవరికైనా వీడ్కోలు చెప్పడానికి” అనే అర్థానికి వినియోగిస్తారు. “మొదట నేను వెళ్లి నా తండ్రి, తల్లికి ముద్దు పెట్టి వస్తాను,” అని ఎలిషా ఏలియా చెప్పినప్పుడు, అతడు తాను ఏలియాను అనుసరించడానికి ముందు తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పడానికి కోరుతున్నాడు.
బైబిలు రిఫరెన్సులు”
- 1 థెస్సలోనిక 05:25-28
- ఆదికాండం 27:26-27
- ఆదికాండం 29:11-12
- ఆదికాండం 31”26=28
- ఆదికాండం 45:14-15
- ఆదికాండం 48:8-10
- లూక 22:47-48
- మార్కు 14:43-46
- మత్తయి 26:47-48
పదం సమాచారం:
- Strong's: H5390, H5401, G2705, G5368, G5370
ముద్ర, ముద్రలు, ముద్రించబడినది, ముద్రించుట, విప్పబడని ముద్రము
నిర్వచనము:
ఒకదానిని ముద్రించుట అనగా ముద్రను విరగగొట్టకుండ తెరుచుటకు అసాధ్యమయ్యే విధముగా ఒకదానిని ముచ్చుట అని అర్థము.
- అనేకమార్లు ముద్ర దేనికి లేక ఎవరికి సంబంధించినది అని చూపించుటకు వారిదే అయినటువంటి అలంకారముతో తయారుస్తారు.
- కొన్ని పత్రాలను లేక ముఖ్యమైన పత్రాలను సంరక్షించుటకు కరిగిపోయిన మైనమును తీసుకొని ముద్రించేవారు. మైనము చల్లబడి గట్టిబడిన తరువాత, ఆ పత్రము లేక పత్రికను మైనపు ముద్రను పగలగొట్టకుండ తెరువలేరు.
- యేసును సమాధి చేసి, దానిని రాతితో మూసిన తరువాత దానిని ఎవరు తెరవకుండు నిమిత్తము ఆ రాతి మీద ముద్రలను వేసియుండిరి.
- మన రక్షణ ఎల్లప్పుడు భద్రముగా ఉంటుందని చూపించే “ముద్రగా” పరిశుద్దాత్ముని ముద్రకు అలంకారముగా పోల్చి పౌలు చెప్పియున్నారు.
(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధాత్మ, సమాధి)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- నిర్గమ.02:3-4
- యెషయా.29:11-12
- యోహాను.06:26-27
- మత్తయి.27:65-66
- ప్రకటన.05:1-2
పదం సమాచారం:
- Strong's: H2368, H2560, H2856, H2857, H2858, H5640, G2696, G4972, G4973
ముసుగు, ముసుగులు, ముసుగు వేయబడిన , ముసుగు వేయబడని
నిర్వచనము:
“ముసుగు” అనునది సాధారణముగా తల లేదా ముఖము కనబడకుండా కప్పుకొనుటకు ఉపయోగించే ఒక పలుచని బట్ట ముక్కగా చెప్పబడుచున్నది.
- మోషే కూడా యెహోవా దేవుని సముఖములో నుండి వచ్చిన తరువాత తన ప్రకాశవంతమైన ముఖమును ప్రజలు చూడలేకపోయినందున తన ముఖమును కప్పుకొనెను.
- బైబిలులో చూచినట్లయితే, స్త్రీలు తమ తలను కప్పుకొనుటకు ఈ ముసుగును ధరిస్తారు మరియు వారు బయటవున్నప్పుడు కానీ లేదా పురుషుల మధ్యలో వున్నప్పుడు కానీ ఎక్కువగా ముఖమును కప్పుకుంటారు.
- “ముసుగు” అను మాట దేనినైనా కప్పడానికి ఉపయోగించే పైకప్పు అని అర్థమిచ్చుచున్నది.
- కొన్ని ఆంగ్ల సంస్కరణలలో, “ముసుగు” అనే పదమును అతి పరిశుద్ధస్థలము యొక్క ప్రవేశద్వారమును కప్పుటకు ఉపయోగించు మందపాటి తెరగా చెప్పబడింది. సంధర్భాన్ని ఆధారం చేసుకొని “ తెర” అనేది ఒక బరువైన, దళసరి గుడ్డముక్కగా చెప్పబడుతుంది.
తర్జుమా సలహాలు
- “ముసుగు” ఒక “పలుచని కప్పుకునే గుడ్డ ” లేదా “కప్పుకునే గుడ్డ” లేదా “తల ముసుగు” అని కూడా అనువదింపబడింది.
- కొన్ని సంప్రదాయాలలో, స్త్రీలు ముసుగు వేసుకునే పద్దతి కలదు. ఇది మోషే గురించి ఉపయోగించారు కావున వేరొక పదాన్ని తెలుసుకోవడం కూడా అవసరమై ఉన్నది.
(దీనిని చూడండి: మోషే)
బైబిలు వచనాలు:
- 2 కొరింథి. 03:12-13
- 2 కొరింథి. 03:14-16
- యెహేజ్కేలు 13:17-18
- యెషయా 47:1-2
- పరమగీతములు 04:3
పదం సమాచారం:
మృగం
వాస్తవాలు:
బైబిలులో "మృగం" పదం తరచుగా "జంతువు" అని మరొక విధంగా చెప్పడానికి ఉపయోగించారు.
- క్రూర మృగం అంటే అడవిలో గానీ లేదా మైదానాలలో గానీ స్వేచ్ఛగా నివసించే జంతువు, మనుషుల చేత మచ్చిక చేయబడినది కాదు.
- గృహసంబంధ మృగం మనుషులతో కలిసి నివసిస్తుంది. ఆహారం కోసం గానీ లేదా పొలం దున్నడం లాంటి పని చెయ్యడానికి ఉంచుతారు. "పశు సంపద" పదం తరచుగా ఇటువంటి జంతువులను సూచించడానికి ఉపయోగిస్తారు.
- పాత నిబంధన దానియేలు గ్రంథం, కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం మృగాలు దేవుణ్ణి ఎదిరించే దుష్ట శక్తులూ, అధికారాలనూ సూచించే మృగాలు ఉన్న దర్శనాలను గురించి వివరిస్తున్నాయి. (చూడండి: [రూపకం]
(rc://*/ta/man/translate/figs-metaphor))
- ఈ మృగాలు కొన్నిటిని విచిత్రమైన లక్షణాలున్నవిగా వర్ణించబడ్డాయి, అనేక శిరస్సులు, అనేక కొమ్ములు ఉండడం వంటివి. వాటికి తరచుగా శక్తి, అధికారం ఉంటాయి. అవి వివిధ దేశాలను జాతులను లేదా ఇతర రాజకీయ శక్తులను సూచిస్తాయి.
- ఈ పదం "జీవి” లేదా “సృష్టించబడిన వస్తువు" లేదా "జంతువు" లేదా “క్రూర జంతువు," అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.
(చూడండి: అధికారం, దానియేలు, పశుగణం (పశుసంపద), జాతి, శక్తి, బయలుపరచు, బయెల్జబూలు)
బైబిలు రిఫరెన్సులు:
- 1 కొరింథీ 15:32
- 1 సమూయేలు 17:44
- 2 దిన. 25:18
- యిర్మీయా 16:1-4
- లేవీ 07:21
- కీర్తనలు 049:12-13
పదం సమాచారం:
- Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074
మెలెకు, మొలోకు
వాస్తవాలు:
కనానీయులు పూజించే ఒక అబద్దపు దేవుళ్ళ పేరు మెలెకు. ఈ పదాన్ని “మొలోకు” లేదా “మొలెకు” అని రాయవచ్చు.
- మెలెకును పూజించే ప్రజలు తమ పిల్లలను అగ్నిద్వారా బలి ఇస్తారు.
- కొందరు ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడు యెహోవాను విడిచి మెలెకును పూజించారు. మెలెకును ఆరాధించేవారి దుష్టఆలోచనలను వారు అనుసరించారు, పిల్లలను బలి ఇవ్వడం అనే ఆచారాన్ని కూడా వారు అనుసరించారు.
(చూడండి: కనాను, దుష్టత్వం, దేవుడు, దేవుడు, దేవుడు, బలియాగము, సత్యమైన, ఆరాధన, యెహోవా)
బైబిలు రెఫరెన్సులు:
- 1 రాజులు 11:7-8
- 2 రాజులు 23:10-11
- అపొస్తలులకార్యములు 07:43
- యిర్మియా 32:33-35
- లేవీకాండం 18:21
పదం సమాచారం:
- Strong's: H4428, H4432, G3434
మెల్కీసెదెకు
వాస్తవాలు:
అబ్రహాము జీవించిన కాలంలో మెల్కీసెదెకు షాలేము పట్టణానికి రాజుగా ఉన్నాడు. (తరువాత దీనిని యెరూషలెం అని పిలిచారు).
- మెల్కీసెదెకు అంటే “నీతికి రాజు” అని అర్థం, ఆయన బిరుదు “షాలేము రాజు” అంటే “సమాధాన రాజు” అని అర్థం.
- ”సర్వోన్నతుడైన దేవుని యాజకుడు” అని కూడా పిలువబడ్డాడు.
- అబ్రహాము తన అన్న కుమారుడు లోతును శక్తివంతమైన రాజులనుండి విడిపించిన తరువాత మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె, ద్రాక్షారసం పంచినపుడు బైబిలులో మొట్టమొదటిసారి కనిపిస్తాడు. అబ్రహాము తన విజయంనుండి వచ్చిన దోపుడు సొమ్ములో పదియవ భాగాన్ని మెల్కీసెదెకుకు ఇచ్చాడు.
- కోత్తనిబందనలో తండ్రీ లేక తల్లి లేనివాడుగా మెల్కీసెదెకు వివరించబడ్డాడు. శాశ్వతకాలం పాలించే రాజుగా, యాజకుడిగా పిలువబడ్డాడు.
- యేసు “మెల్కీసెదెకు యాజక క్రమం” చొప్పున యాజకుడిగా ఉన్నాడని కొత్తనిబంధన చెపుతుంది. ఇశ్రాయేలీయుల యాజకులవలే యేసు లేవీయులనుండి వచ్చినవాడు కాదు. ఆయన యాజకత్వం మెల్కీసెదెకుకు వలే నేరుగా దేవుని నుండి వచ్చింది.
- బైబిలులో ఆయన వివరాలను ఆధారం చేసుకొని, మెల్కీసెదెకు మానవ యాజకుడు, దేవునిచేత ఏర్పరచబడినవాడు, సమాధానానికీ, నీతికీ నిత్యుడైన రాజు, మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుకు ప్రాతినిధ్యం వహించడానికీ లేక ఆయనను చూపించదానికీ దేవుని చేత ఏర్పరచబడినవాడు.
(చూడండి: అబ్రాహాము, నిత్యత్వం, ప్రధాన యాజకుడు, యెరూషలేము, లేవి, యాజకుడు, నీతిగల)
బైబిలు రెఫరెన్సులు:
- ఆదికాండం 14:17-18
- హెబ్రీ 05:19-20
- హెబ్రీ 07:15-17
- కీర్తనలు 110:4
పదం సమాచారం:
మెషెకు
వాస్తవాలు:
మెషెకు పాతనిబంధనలో ఇద్దరు వ్యక్తులకున్న పేర్లు.
- ఒక మెషెకు యాపెతు కుమారుడు.
- మరొక మెషెకు షేము మనుమడు.
- మెషెకు ఒక భూబాగంకున్న పేరు, వీరిలో ఒకని పేరును బట్టి పిలువబడియుండవచ్చు.
- మెషెకు ప్రాంత ప్రస్తుతం టర్కీ అని పిలువబడే ప్రాంతం కావచ్చును.
(చూడండి: యాపెతు, నోవహు, షేము)
బైబిలు రెఫరెన్సులు:
- 1 దినవృత్తాంతములు 01:5-7
- యెహెజ్కేలు 27:12-13
- ఆదికాండం 10:2-5
- కీర్తనలు 120:5-7
పదం సమాచారం:
మేక, మేకలు, మేకతోళ్ళు, భరించే మేక, మేక పిల్లలు
నిర్వచనం:
మేక నాలుగు-కాళ్ళ జంతువు. గొర్రె వంటి జాతి. వీటిని పాలు, మాంసం కోసం పెంచుతారు. చిన్న మేకలను "మేక పిల్ల" అంటారు.
- గొర్రె లాగానే మేకలు కూడా బలి అర్పణ, ముఖ్యంగా పస్కా బలి సందర్భంలో ప్రాముఖ్యమైన జంతువులు.
- మేకలు, గొర్రెలు ఒకే విధమైనవైనా కొన్ని విషయాల్లో తేడా ఉంది.
- మేకల బొచ్చు ముతకగా ఉంటుంది. గొర్రెలకు ఉన్ని ఉంటుంది.
- మేకతోక నిలబడి ఉంటుంది. గొర్రె తోక కిందికి వేలాడుతూ ఉంటుంది.
- గొర్రెలు సాధారణంగా మందలుగా ఉంటాయి. అయితే మేకలు కొంత స్వతంత్రంగా మందనుండి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి.
- బైబిల్ కాలాల్లో, మేకలు తరచుగా ఇశ్రాయేలు ప్రాంతంలో పాలు ఇచ్చే జంతువులు.
- మేక చర్మాలను గుడారం కప్పే కవర్ గా, ద్రాక్షారసం నిల్వ చేసే తిత్తులుగా వాడతారు.
- పాత, కొత్త నిబంధనల్లో మేకను అవినీతిపరులైన ప్రజలకు సంకేతంగా ఉపయోగిస్తారు, ఒకవేళ దాన్ని మేపే వారి దగ్గరనుండి వెళ్ళిపోయే అలవాటును బట్టి ఇలా చేస్తుండవచ్చు.
- ఇశ్రాయేలీయులు మేకలను పాపం మోసుకుపోయే దానికి సంకేతంగా ఉపయోగిస్తారు. ఒక మేకను బలి అర్పణ చేసినప్పుడు యాజకుడు తన చేతులు రెండవ, సజీవ మేక పై ఉంచి ఆపైన మనుషుల పాపాలు ఎడారిలోకి మోసుకుపోయే దానికి సంకేతంగా ఆ జంతువుపై పాపాలు మోపి పంపించి వేస్తాడు.
(చూడండి: మంద, బలియాగము, ఆడగొర్రె, నీతిగల, ద్రాక్షారసం)
బైబిల్ రిఫరెన్సులు:
- నిర్గమ 12:3-4
- ఆది 30:31-32
- ఆది 31:10-11
- ఆది 37:31-33
- లేవీ 03:12-14
- మత్తయి 25:31-33
పదం సమాచారం:
- Strong's: H689, H1423, H1429, H1601, H3277, H3629, H5795, H5796, H6260, H6629, H6842, H6939, H7716, H8163, H8166, H8495, G122, G2055, G2056, G5131
మొర్ర, మొర్ర పెట్టు, ఆక్రోసించు, గట్టిగా మొర్ర పెట్టు, మొర్ర పెట్టిన, ఆక్రోశం, కేకలు
నిర్వచనం:
పదాలు "మొర్ర” లేక “మొర్ర పెట్టు" దేన్నైనా బిగ్గరగా అత్యవసరంగా పిలవడాన్ని సూచిస్తున్నాయి.
ఎవరైనా నొప్పిలో దురవస్థలో కోపంలో " ఆక్రోశం" చెయ్యవచ్చు.
- పద బంధం "మొర్ర పెట్టిన" అంటే to అరుచు, లేక గట్టిగా పిలవడం, తరచుగా సహాయం అడగడం కోసం.
- ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గట్టిగా కేక పెట్టు” లేక “త్వరగా సహాయం కోసం అడగడం."
- "నేను నీకు మొర్ర పెట్టాను" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "నిన్ను సహాయం కోసం పిలిచాను” లేక “కంగారుగా సహాయం కోసం అడిగాను."
(చూడండి: పిలుపు, అభ్యర్ధన)
బైబిల్ రిఫరెన్సులు:
- యోబు 27:8-10
- మార్కు 05:5-6
- మార్కు 06:48-50
- కీర్తనలు 022:1-2
పదం సమాచారం:
- Strong's: H603, H1058, H2199, H2201, H6030, H6463, H6670, H6682, H6817, H6818, H6873, H6963, H7121, H7123, H7321, H7440, H7442, H7723, H7737, H7768, H7769, H7771, H7773, H7775, H8173, H8663, G310, G349, G863, G994, G995, G1916, G2019, G2799, G2805, G2896, G2905, G2906, G2929, G4377, G5455
మోయాబు, మోయాబీయుడు, మోయాబీయులు
వాస్తవాలు:
మోయాను లోతు పెద్ద కుమార్తె కుమారుడు. తానూ, తన కుటుంబం నివసించిన ప్రాంతం పేరు కూడా మోయాబు అయ్యింది. “మోయాబీయుడు” అంటే మోయాబు సంతానంగా ఉన్నవారికి గానీ లేదా మోయాబు దేశంలో నివసించేవారికి గానీ వర్తిస్తుంది.
- మోయాబు దేశం ఉప్పు సముద్రానికి తూర్పున ఉంది.
- బెత్లెహెముకు ఆగ్నేయంగా మోయాబు దేశం ఉంది, ఇక్కడే నయోమి నివసించింది.
- బెత్లెహేములో ఉన్నవారు రూతును “మోయాబీయురాలు” అని పిలిచారు, ఎందుకంటే ఆమె మోయాబు దేశం నుండి వచ్చింది. ఈ పదాన్ని “మోయాబు యవనస్తురాలు” లేక “మోయాబునుండి వచ్చిన స్త్రీ” అని కూడా అనువాదం చెయ్యవచ్చు.
(చూడండి: బెత్లెహేము, యూదయ, లోతు, రూతు, ఉప్పు సముద్రము)
బైబిలు రెఫరెన్సులు:
- ఆదికాండం 19:36-38
- ఆదికాండం 36:34-36
- రూతు 01:1-2
- రూతు 01:22
పదం సమాచారం:
యాజకుడు, యాజకులు, యాజకత్వము
నిర్వచనము:
పరిశుద్ధ గ్రంథములో ఒక యాజకుడు దేవుని ప్రజల పక్షముగా దేవుని బలులు అర్పించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తియైయున్నాడు.
“యాజకత్వము” అనునది యాజకుని స్థితిని లేక అతని ధర్మమును తెలియజేయు పదమునైయున్నది.
- పాత నిబందనలో ఇశ్రాయేలు జనము కొరకు దేవుని యాజకులుగా ఉండుటకు ఆయన ఆహరోనును మరియు అహరోను సంతతిని ఎన్నుకొనెను.
- “యాజకత్వము” అనునది లేవియుల సంతతిలో తండ్రినుండి కుమారునికి అందించే ఒక బాధ్యత మరియు ఒక హక్కుగా పరిగణించబడినది.
- ఇశ్రాయేలు యాజకులు దేవాలయములో తమ కర్తవ్యములుతోపాటు ప్రజలు దేవునికి అర్పించు బలుల బాధ్యతను కూడా కలిగియుండిరి.
- యాజకులు కూడా దేవుని ప్రజల పక్షముగా దేవుని దైనందిన ప్రార్థనలు అర్పించెడివారు మరియు ఇతర భక్తి సంబంధమైన ఆచారములను జరిగించెడివారు.
- యాజకులు సంప్రదాయకమైన ఆశీర్వాదములను జనులపైన పలుకుతారు మరియు వారికి ధర్మశాస్త్రమును తెలియజేస్తారు.
- యేసు కాలములో రెండు రకాల యాజకులు ఉండేవారు, వారిలో ప్రధాన యాజకులు మరియు మహా యాజకుడు ఉందురు.
- యేసు దేవుని సన్నిధిలో మనకొరకు విజ్ఞాపనముచేసే “మహా ప్రధాన యాజకుడైయున్నాడు”. ఆయన తనను తాను పాపముకొరకు అంతిమ బలిగా అర్పించుకొనియున్నాడు. మనుష్య యాజకుల ద్వారా చేయబడే బలులు ఎప్పటికి అవసరములేదని ఈ మాటకు అర్థము.
- క్రొత్త నిబంధనలో యేసునందు విశ్వాసముంచిన ప్రతియొక్కరు “యాజకులుగా” పరిగణించబడియున్నారు. వీరు తమకొరకు మరియు ఇతరులకొరకు విజ్ఞాపన చేయుటకు ప్రార్థనలో దేవునితో నేరుగా మాట్లాడుటకు యోగ్యులైయున్నారు.
- పురాతన కాలములో బయలు దేవత అనేటువంటి అబద్ధపు దేవుళ్ళకు అర్పించిన ఇతర అన్య యాజకులు కూడా ఉండిరి.
తర్జుమా సలహాలు:
- సందర్భానుసారముగా, “యాజకుడు” అనే ఈ పదమును “బలిని ఇచ్చువాడు” లేక “దేవుని మధ్యవర్తి” లేక “బలిని అర్పించు మధ్యవర్తి” లేక “దేవునికి ప్రాతినిధ్యం వహించుటకు ఆయన ఎన్నుకొనిన ఒక వ్యక్తి” అని కూడా తర్జుమా చేయవచ్చు.
- తర్జుమా చేయబడిన “యాజకుడు” అనే ఈ పదము “మధ్యవర్తి” అనే పదమునకు విభిన్నమైనది మరియు వేరే అర్థమును కలిగియున్నది.
- “ఇశ్రాయేలు యాజకుడు” లేక “యూదుడైన యాజకుడు” లేక “యెహోవ యాజకుడు” లేక “బయలు యాజకుడు” అని కొంతమంది అనువాదకులు ఎల్లప్పుడు చెప్పడానికి ప్రాధాన్యతనిస్తారు.
- “యాజకుడు” అని తర్జుమా చేసిన ఈ పదము “ప్రధాన యాజకుడు”, “మహా యాజకుడు”, “లేవియుడు” మరియు “ప్రవక్త” అనే పదములకు విభిన్నముగా ఉండాలి.
(ఈ పదములను కూడా చూడండి: అహరోను, ప్రధాన యాజకులు, ప్రధాన యాజకుడు, మధ్యవర్తి, బలియాగము)
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 2 దిన.06:40-42
- ఆది.14:17-18
- ఆది.47:20-22
- యోహాను.01:19-21
- లూకా.10:31-32
- మార్కు.01:43-44
- మార్కు.02:25-26
- మత్తయి.08:4
- మత్తయి.12:3-4
- మీకా.03:9-11
- నెహెమ్యా.10:28-29
- నెహెమ్యా.10:34-36
- ప్రక.01:4-6
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 04:07 “మెల్కీసెదెకు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.”
- 13:09 ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపించువారు దేవుని బలియర్పణగా గుడారపు ప్రవేశ ద్వారమునకు ముందు స్థలమునకు ఒక ప్రాణిని తీసుకొని రావలెయును. యాజకుడు ఆ ప్రాణిని వధించి, దానిని బలిపీఠము మీద దహించవలెను. ఒక జంతువు రక్తము బలిని అర్పించిన వ్యక్తి పాపమును కప్పుతుంది మరియు ఆ వ్యక్తిని దేవుని దృష్టిలో శుద్దునిగా కనబడునట్లు చేస్తుంది. దేవుడు మోషే అన్నయైన ఆహరోనును ఎన్నుకున్నాడు మరియు అహరోను సంతానము ఆయన యాజకులుగా ఉండిరి.
- 19:07 అందుచేత, బయలు యాజకులు బలియర్పణను సిద్ధపరిచిరి, కాని అగ్నితో వారు దానిని దహించలేకపోయిరి.
- 21:07 ఇశ్రాయేలు యాజకుడు ప్రజల పాపములకొరకు నియమించబడిన శిక్షకు బదులుగా ప్రజల పక్షముగా దేవుని బలులను అర్పించు వ్యక్తియైయున్నాడు. యాజకులు కూడ ప్రజల కొరకు దేవునికి ప్రార్థన చేసిరి.
పదం సమాచారం:
- Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420
యాతన
నిర్వచనం:
ఈ పదం "యాతన" అనే దాన్ని తీవ్రమైన నొప్పి లేక వేదన తెలియజేయడానికి వాడతారు.
- యాతన అంటే శారీరిక, మానసిక బాధ లేక నొప్పి కావచ్చు.
- తరచుగా గొప్ప యాతనలో ఉన్నవారు దాన్ని తమ ముఖ కవళికల్లో, ప్రవర్తనలో తెలియజేస్తారు.
- ఉదాహరణకు, ఒక వ్యక్తి తీవ్రమైన నొప్పి లేక యాతనలో ఉంటే అతడు తన పళ్ళు బిగించి కేక పెట్టవచ్చు.
- ఈ పదం "వేదన"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "మానసిక క్షోభ” లేక “లోతైన విచారం” లేక “తీవ్రమైన నొప్పి."
బైబిల్ రిఫరెన్సులు:
- యిర్మీయా 06:23-24
- యిర్మీయా 19:6-9
- యోబు 15:22-24
- లూకా 16:24
- కీర్తనలు 116:3-4
పదం సమాచారం:
- Strong's: H2342, H2479, H3708, H4164, H4689, H4691, H5100, H6695, H6862, H6869, H7267, H7581, G928, G3600, G4928
యాపెతు
వాస్తవాలు:
యాపెతు నోవహు ముగ్గురు కుమారులుల్లో ఒకడు.
- ప్రపంచ వ్యాప్తమైన వరద భూమి అంతటినీ ముంచెత్తినప్పుడు యాపెతు తన ఇద్దరు సోదరులుతో, వారి భార్యలతో సహా ఓడలో నోవహుతో ఉన్నారు.
- నోవహు కుమారుల జాబితా సాధారణంగా, "షేము, హాము, యాపెతు" అని ఉంటుంది. ఇది యాపెతు కనిష్ట సోదరుడు అని తెలుపుతున్నది.
(చూడండి: మందసం, వరద, హాము, నోవహు, షేము)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 01:1-4
- ఆది 05:32
- ఆది 06:9-10
- ఆది 07:13-14
- ఆది 10:1
వాస్తవాలు:
పదం సమాచారం:
యూద, యూదా రాజ్యం
వాస్తవాలు:
ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలన్నిటిలో యూదా గోత్రం పెద్దది. యూదా రాజ్యంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి.
- సోలోమోను చనిపోయిన తరువాత దేశము రెండు రాజ్యాలుగా విడిపోయింది. ఇశ్రాయేలు, యూదా. యూదా రాజ్యము దక్షిణ రాజ్యము, ఉప్పు సముద్రానికి పశ్చిమంగా ఉంది.
- యూదా రాజ్యానికి ముఖ్య పట్టణం యెరూషలెం.
- యూదా రాజ్య రాజులు ఎనిమిది మంది యెహోవా దేవునికి లోబడ్డారు, ఆయనన్ను ఆరాధించడానికి ప్రజలను నడిపించారు. ఇతర యూదా రాజులు దుష్టులుగా ఉన్నారు, విగ్రహాలను పూజించడానికి ప్రజలను నడిపించారు.
- అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని (ఉత్తర రాజ్యం) వారిని ఓడించిన తరువాత 120 సంవత్సరాలకు బాబులోను దేశం యూదా రాజ్యాన్ని స్వాధీనపరచుకొంది. బాబులోను వారు పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేసారు, యూదాలోని అనేకమందిని బబులోనుకు బందీలుగా తీసుకొని వెళ్ళారు.
(చూడండి: యూదా, ఉప్పు సముద్రము)
బైబిలు రిఫరెన్సులు
- 1 సమూయేలు 30:26-28
- 2 సమూయేలు 12:7-8
- హోషేయా 05:14-15
- యిర్మియా 07:33-34
- న్యాయాధిపతులు 01:16-17
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 18:07 కేవలం రెండు గోత్రాలు మాత్రమే అతనికి (రెహబాము) నమ్మకంగా ఉన్నాయి. ఈ రెండు గోత్రాలు యూదా రాజ్యం గా మారాయి.
- 18:10 యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యమూ శత్రువులుగా మారాయి, తరచుగా ఒకరికి ఒకరు విరోధంగా పోరాడుకొంటున్నారు.
- 18:13 యూదా రాజులు దావీదు సంతానము. వీరిలో కొందరు రాజులు మంచి వ్యక్తులు, వారు నీతిగా పరిపాలించారు, దేవుణ్ణి ఆరాధించారు. అయితే యూదా రాజులలో అనేకులు దుష్టులు, అవినీతిపరులు, వారు విగ్రహాలను ఆరాధించారు.
- 20:01 యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం రెండూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాయి.
- 20:05 ఇశ్రాయేలు రాజ్యంలోని ప్రజలు దేవుని విశ్వసించక, ఆయనకు లోబడని కారణంగా దేవుడి వారిని ఏ విధంగా శిక్షించాడో యూదా రాజ్యము లోని ప్రజలు చూసారు. అయినప్పటికీ వారు ఇంకా విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు, కనానీయుల దేవుళ్ళను పూజించారు.
- 20:06 అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసిన 100 సంవత్సరాల తరువాత దేవుడు యూదా రాజ్యం మీదకు దండెత్తడానికి బాబులోను రాజు, నెబుకద్నెజరును పంపాడు.
- 20:09 నెబుకద్నెజరునూ, అతని సైన్యమూ యూదా రాజ్యము లో దాదాపు ప్రజలనందరినీ బాబులోనుకు తీసుకొని వెళ్ళాడు, పొలాలలోని పంటలకోసం అతి పేదవారిని విడిచిపెట్టారు.
పదం సమాచారం:
యూదా
వాస్తవాలు:
యూదా యాకోబు పెద్ద కుమారుల్లో ఒకడు. అతని తల్లి లేయా. అతని సంతానం "యూదా గోత్రం."
- యూదా తన సోదరులతో వారి తమ్ముడు యోసేపును గోతిలో పడవేసి చంపడానికి మారుగా బానిసగా అమ్మి వేయమని చెప్పాడు.
- దావీదు రాజు, అతని తరువాత ఇతర యూదా రాజులంతా యూదా సంతానం. యేసు కూడా యూదా సంతతి వాడు.
- సొలోమోను పరిపాలన ముగిసినప్పుడు ఇశ్రాయేలు జాతి రెండుగా చీలి యూదా రాజ్యం దక్షిణ రాజ్యంగా అయింది.
- కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో యేసును "యూదా గోత్ర సింహం" అన్నారు.
- "యూదుడు” “యూదయ" అనేవి "యూదా" నుండే వచ్చాయి.
(చూడండి: ఇశ్రాయేలు, యూదుడు, యూద, యూదయ, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 02:1-2
- 1 రాజులు 01:9-10
- ఆది 29:35
- ఆది 38:1-2
- లూకా 03:33-35
- రూతు 01:1-2
పదం సమాచారం:
యెరూషలేము
వాస్తవాలు:
యెరూషలేము మొదట ప్రాచీన కనానీయ పట్టణం. తరువాత ఇశ్రాయేలులో అత్యంత ప్రాముఖ్యమైన పట్టణం అయింది. ఇది ఉప్పు సముద్రానికి 34 కిలో మీటర్ల పశ్చిమాన బెత్లెహేముకు ఉత్తరంగా ఉంది. ఇది ఈనాటికీ ఇశ్రాయేలు ముఖ్య పట్టణం.
- "యెరూషలేము" మొదటి ప్రస్తావించినది యెహోషువా గ్రంథంలో. ఈ నగరానికి ఉన్న ఇతర పాత నిబంధన పేర్లు "షాలేము" " యెబూసు పట్టణం,” “సియోను." "యెరూషలేము” “షాలేము," అంటే మూల అర్థం "శాంతి."
- యెరూషలేము మొదట యెబూసీయుల కోట. దీన్ని దావీదు ఓడించి "సియోను" అని పేరు పెట్టి తన ముఖ్య పట్టణంగా చేసుకున్నాడు.
- యెరూషలేములో దావీదు కుమారుడు సొలోమోను మొదటి ఆలయం మోరియా కొండపై నిర్మించాడు. ఇది అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును దేవునికి అర్పించిన స్థలం. అక్కడ కట్టిన ఆలయాన్ని తరువాత బబులోనీయులు నాశనం చేశారు.
- ఆలయం యెరూషలేములో ఉంది గనక ముఖ్య యూదు పండుగలు అక్కడ జరిగేవి.
- ప్రజలు సాధారణంగా యెరూషలేముకు “ఎక్కి వెళ్ళేవారు.” ఎందుకంటే అది కొండల్లో ఉంది.
(చూడండి: బబులోను, క్రీస్తు, దావీదు, యెబూసు, యేసు, సొలొమోను, ఆలయం, సీయోను)
బైబిల్ రిఫరెన్సులు:
- గలతి 04:26-27
- యోహాను 02:13-14
- లూకా 04:9-11
- లూకా 13:4-5
- మార్కు 03:7-8
- మార్కు 03:20-22
- మత్తయి 03:4-6
- మత్తయి 04:23-25
- మత్తయి 20:17-19
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 17:05 దావీదు యెరూషలేము ఆక్రమించుకుని దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు.
- 18:02 యెరూషలేములో, సొలోమోను ఆలయం నిర్మించాడు. తన తండ్రి దావీదు పథకం రచించి సరంజామా సమకూర్చాడు.
- 20:07 వారు (బబులోనీయులు) యెరూషలేము పట్టుకుని నాశనం చేశారు. పట్టణంలో, ఆలయంలో ఉన్న విలువైన వస్తువులను తీసుకు పోయారు.
- 20:12 70 సంవత్సరాలు ప్రవాసం తరువాత, చిన్న బృందం యూదులు యూదాలో యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్లారు.
- 38:01 యేసు మొదటగా బహిరంగంగా ప్రకటించడం బోధించడం ఆరంభించిన మూడు సంవత్సరాల తరువాత యేసు తన శిష్యులకు తాను పస్కాను వారితో యెరూషలేము లో జరుపుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అక్కడ అయన హతం కాబోతున్నాడు.
- 38:02 తరువాత యేసు శిష్యులు యెరూషలేముకి వచ్చారు. యూదా యూదు నాయకుల వద్దకు వెళ్లి డబ్బు ఇస్తే యేసు పట్టిస్తానని చెప్పాడు.
- 42:08 "లేఖనాల్లో రాసి ఉంది. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడి వారి పాపాలకు క్షమాపణ పొందాలని నా శిష్యులు ప్రకటిస్తారు.” వారు యెరూషలేములో మొదలు పెట్టి తరువాత అన్ని చోట్లా ప్రజలు సమూహాలకు ప్రకటిస్తారు."
- 42:11 చనిపోయి లేచాక నలభై రోజుల పాటు యేసు తన శిష్యులతో చెప్పాడు, "యెరూషలేములో మీమీదికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చేదాకా ఉండండి."
పదం సమాచారం:
- Strong's: H3389, H3390, G2414, G2415, G2419
యెహోవా
వాస్తవాలు:
దేవుడు మోషెతో మండుచున్న పొదలోనుండి మాట్లాడినప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోనడానికి “యెహోవా” అనే పదమును ఆయన వ్యక్తిగత పేరుగ తెలియపరచారు.
- “యెహోవా” అనే పదమునకు “ఉన్నవాడు” లేక “ఉనికి” కలిగియున్నాడని అర్థమిచ్చు పదమునుండి తీసుకొనబడియున్నది.
- “యెహోవా” అను పదమునకు “ఆయన” లేక “నేను” లేక “కలుగజేయువాడు అని అర్థములు కలవు.
- దేవుడు ఎల్లప్పుడూ జివిస్తున్నాడని మరియు జీవించును అని ఈ పేరు తెలియజేయుచున్నది. ఆయన సదాకాలము ఉన్నాడని దానికి మరియొక అర్థము కలదు.
- ఆచరమును పాటించుచు, అనేక పరిశుద్ధ గ్రంథములలో “యెహోవా” అనే పదమునకు “ప్రభువు” అని ఉపయోగించబడియున్నది. యెహోవా పేరును తప్పుగా ఉచ్చరించెదమేమో అని యూదులు “యెహోవా” అనే పదము లేఖనలలో ఉపయోగించబడియున్న ప్రతి చోట “ప్రభువు” అని పలుకుటకు ప్రారంభించడం ద్వారా ఈ పధ్ధతి వచెనని చారిత్రాత్మకముగ ఉన్న వాస్తవ సంగతియైయున్నది. దేవుని వ్యక్తిగత నామమును (పేరును) గౌరవించులాగున మరియు హెబ్రీ భాషలో వాడబడు వేరొక “ప్రభువు” అనే పదమునకు కలుగు అర్థమును వేరుపరచులాగున ఆధునిక బైబిల్లలో “ప్రభువు” అనే పదమును పెద్ద అక్షరములలో వ్రాయబడియున్నది.
- పాత నిబంధన గ్రంథములో ఉపయోగించబడిన హెబ్రీ భాషలో “యావ్హె” అని పిలువబడినట్లుగానే యుఎల్బి మరియు యుడిబి బైబిల్లలో కూడా ఈ పదమును అనువాదం చేసిరి.
- “యావ్హే” అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ఒక్క మారును కనుబడలేదు; పాత నిబంధన గ్రంథములోని వాక్య భాగమును సూచించుటకు “ప్రభువు” అనే గ్రీకు పదమును మాత్రమే ఉపయోగించబడియున్నది.
- పాత నిబంధన గ్రంథములో, దేవుడు తనను గూర్చి మాట్లాడుచున్నప్పుడు, నామవాచకం ఉపయోగించడానికి బదులుగా ఆయన పేరునే ఉపయోగించారు.
- దేవుడే అక్కడ మాట్లాడుచున్నాడని చదువరులకు సూచించడానికి యుఎల్బి బైబిల్లో “నేను” అనే నామవాచక పదమును ఉపయోగించియున్నారు.
తర్జుమా సలహాలు
- “యహ్వే” అనే పదమును లేక వాక్యమును “నేనున్నాను” లేక “జీవించువాడు” లేక “ఉన్నవాడు” లేక “జీవించుచున్నవాడు” అని తర్జుమా చేయవచ్చును.
- ఈ పదమును “యహ్వే” అని ఏరితిగా పలుకుతారో అదే విధముగా వ్రాయవచ్చును.
- కొన్ని సంఘాల శాఖలలో “యహ్వే” అనే పదమును ఉపయోగించడానికి ఇష్టపడరు అందువలన సాంప్రదాయకంగా వచ్చిన పద్ధతి ప్రకారముగా “ప్రభువు” అనే పదమును ఉపయోగిస్తారు. ఈ పదమును గట్టిగా చదువుచున్నప్పుడు “ప్రభువు” అనే పదమునకుగల అర్థమును స్పురింప జేయవచ్చును అని ఇక్కడ గమనించతగిన ప్రాముఖ్యమైన సంగతియైయున్నది. “ప్రభువు” అనే పేరుకు (యహ్వే) మరియు “ప్రభువు” అనే బిరుదుకుగల వెత్యాసమును తెలియపరచుటకు కొన్ని భాషలలో ఆ పదముకు తోడుగా లేక వ్యాకరణ సంబంధమైన పదమును జోడిస్తారు.
- వాక్య భాగములలో యహ్వే అనే పదము వచ్చినప్పుడు సాద్యమైనంతవరకు దానిని అలాగే ఉంచడము మంచిది అయితే వాక్య భాగము సహజంగా మరియు స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని తర్జుమాలలో నామవాచక పదమును మాత్రమే ఉపయోగిస్తారు.
- “యహ్వే సెలవిచ్చునది ఏమనగా” అని ఒక వాక్యమును ప్రారంభించవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: దేవుడు, అధికారి, అధికారి, మోషే, బయలుపరచు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 రాజులు.21:19-20
- 1 సము.16:6-7
- దాని.09:3-4
- యెహె.17:24
- 1 ఆది.02:4-6
- 1 ఆది.04:3-5
- 1 ఆది.28:12-13
- హోషెయ.11:12
- యెషయ.10:3-4
- యెషయ.38:7-8
- యోబు.12:9-10
- యెహోషువా.01:8-9
- విలాప.01:4-5
- లేవి.25:35-38
- మలాకి.03:4-5
- మీకా.02:3-5
- మీకా.06:3-5
- సంఖ్యా.08:9-11
- కీర్తన.124:1-3
- రూతు.01:19-21
- జెకర్య.14:5
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 09:14 “నేను ఉన్నవాడను అని దేవుడు చెప్పెను. ‘ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని’ వారితో చెప్పమనెను. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా అని వారితో చేప్పమనెను. నిరంతరమూ నా నామము ఇదే.”
- 13:04 అప్పుడు దేవుడు వారికి నిబంధన ఇచ్చి, “నీ దేవుడైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అని సెలవిచ్చెను.
- 13:05 “విగ్రహములను నీవు చేసికొనకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.”
- 16:01 నిజమైన దేవుడైన యెహోవాను పూజించుటకు బదులుగా ఇశ్రాయేలీయులు కనానీయుల దేవతలను పూజించిరి.
- 19:10 అప్పుడు ఏలియా, “అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడైన యెహోవా నీవు ఇశ్రాయేలీయుల దేవుడవనియు మరియు నేను నీ దాసుడననియు ఈ దినము తెలియపరచుము” అని ప్రార్థించెను.
పదం సమాచారం:
- Strong's: H3050, H3068, H3069
యోబు
వాస్తవాలు:
బైబిల్లో దేవుని దృష్టిలో నిర్దోషమైన న్యాయవంతుడైన మనిషిగా వర్ణించబడిన మనిషి యోబు. అతడు భయంకర హింసల్లోదేవునిపై తన విశ్వాసం నిలబెట్టుకున్న వాడుగా ప్రసిద్ధుడు.
- యోబు ఊజు దేశంలో నివసించాడు. కనాను ప్రదేశం తూర్పున బహుశా ఎదోమీయుల ప్రాంతంలో ఉంది.
- అతడు కాలంలో ఏశావు, యాకోబుల కాలంలో నివసించాడు అంటారు. ఎందుకంటే యోబు స్నేహితుల్లో ఒకడు "తేమానీయుడు." ఇది ఏశావు మనవడి నుండి వచ్చిన ప్రజలు సమూహం పేరు.
- పాత నిబంధన పుస్తకం యోబు ఈ విధంగా యోబు, ఇతరులు బాధల విషయంలో ఎలా స్పందించారో తెలుపుతున్నది. ఈ గ్రంథం సార్వ భౌమ సృష్టికర్తగా విశ్వనాథునిగా దేవుని మనస్సు తెలియజేస్తున్నది.
- అన్ని విపత్తుల తరువాత దేవుడు ఎట్టకేలకు యోబును స్వస్థపరిచాడు. అతనికి మరింతమంది పిల్లలను, సంపదను ఇచ్చాడు.
- యోబు గ్రంథం అతడు చాలా వృద్ధాప్యంలో చనిపోయాడు అని చెబుతున్నది.
(చూడండి: అబ్రాహాము, ఏశావు, వరద, ఇశ్రాయేలు, నోవహు)
బైబిల్ రిఫరెన్సులు:
- జనాంగములు
- యాకోబు 05:9-11
- యోబు 01:1-3
- యోబు 03:4-5
పదం సమాచారం:
- Strong's: H347, H3102, G2492
రక్తం
నిర్వచనం:
"రక్తం" ఎరుపు ద్రవం. మనిషి గాయపడితే అతని చర్మం గుండా బయటకు వస్తుంది. రక్తం వ్యక్తి మొత్తం శరీరానికి రక్తం జీవాధారమైన పోషకాలను అందిస్తుంది.
- రక్తం జీవానికి సంకేతం. రక్తం చిందించినప్పుడు జీవాన్ని కోల్పోవడం లేక మరణం పొందడం జరుగుతుంది.
- ప్రజలు దేవునికి బలి అర్పణలు చేసినప్పుడు వారు ఒక జంతువును వధించి దాని రక్తాన్ని బలిపీఠంపై పోసే వారు. ఆ జంతువు జీవం బలి అర్పణ అయిపోయింది అనే దానికి ఇది సంకేతం. మనుషుల పాపాలకు ఈ విధంగా వెల చెల్లించడం జరుగుతుంది.
- సిలువపై తన మరణం ద్వారా యేసు రక్తం సంకేత రూపంగా ప్రజలను వారి పాపాల నుండి శుద్ధి చెయ్యడానికి తమ పాపాలకై వారు పొందవలసిన శిక్ష తప్పించడానికి మార్గం సిద్ధపరిచాడు.
- "రక్తమాంసాలు" అనే మాట మానవులను సూచిస్తున్నది.
- "స్వంత రక్తమాంసాలు" అనే మాట శారీరికంగా బంధుత్వం ఉన్న మనుషులను సూచిస్తున్నది.
అనువాదం సలహాలు:
- లక్ష్య భాషలో రక్తం అనేదాన్ని చెప్పడానికి ఉపయోగించే పదం ఉపయోగించి ఈ పదాన్ని తర్జుమా చెయ్య వచ్చు
- "రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలు” లేక “మానవులు."
- సందర్భాన్ని బట్టి, "నా స్వంత రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నా స్వంత కుటుంబం” లేక “నా స్వంత బంధువులు” లేక “నా స్వంత ప్రజలు."
- లక్ష్య భాష లో ఈ అర్థం ఇచ్చే పదం ఉంటే "రక్తమాంసాలు" అనే పదాన్ని ఆ మాట ఉపయోగించి అనువదించవచ్చు.
(చూడండి: శరీరం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 01:5-7
- 1 సమూయేలు 14:31-32
- అపో. కా. 02:20-21
- అపో. కా. 05:26-28
- కొలస్సి 01:18-20
- గలతి 01:15-17
- ఆది 04:10-12
- కీర్తనలు 016:4
- కీర్తనలు 105:28-30
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 08:03 యోసేపు సోదరులు ఇంటికి తిరిగి వెళ్ళక ముందు వారు యోసేపు అంగీని చింపి దాన్ని మేక రక్తం లో ముంచారు.
- 10:03 దేవుడు నైలు నదీజలాలను రక్తంగా మార్చాడు, అయితే ఫరో ఇంకా ఇశ్రాయేలీయులను వెళ్ళనియ్యలేదు.
- 11:05 ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళ తలుపులపై రక్తం పూశారు. కాబట్టి అందరు లోపల ఉండగా దేవుడు ఆ ఇళ్ళు దాటిపోయాడు. గొర్రె పిల్ల రక్తం మూలంగా వారు భద్రంగా ఉన్నారు.
- 13:09 బలి అర్పణ చేసిన జంతువు రక్తం ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేసి అతన్ని దేవుని దృష్టిలో పరిశుభ్రం చేస్తుంది.
- 38:05 తరువాత యేసు ఒక పాత్ర తీసుకుని ఇలా చెప్పాడు, "దీన్ని తాగండి. ఇది నా రక్తం పాపాల క్షమాపణ కోసం చిందించిన రక్తం మూలంగా అయిన కొత్త నిబంధన.
- 48:10 ఎవరైనా యేసు, రక్తం పై విశ్వాసం ఉంచితే ఆయన ఆ మనిషి వ్యక్తి పాపం తీసి వేస్తాడు. దేవుని శిక్ష అతన్ని దాటిపోతుంది.
పదం సమాచారం:
- Strong's: H1818, H5332, G129, G130, G131, G1420
రథం, రథాలు, రథికులు
నిర్వచనం:
ప్రాచీన కాలంలో, రథాలు తేలికగా ఉండే రెండు-చక్రాల బండ్లు. వీటిని గుర్రాలు లాగేవి.
- మనుషులు యుద్ధాల కోసం, ప్రయాణం కోసం రథాలపై నిలబడే వారు, లేక కూర్చునే వారు.
- యుద్ధంలో రథాలు ఉన్న సైన్యానికి గొప్ప వేగంలోనూ సైన్యాన్ని తరలించడంలోను, రథాలు లేని సైన్యం కంటే పై చేయిగా ఉండేది.
- ప్రాచీన ఈజిప్టు, రోమా సైన్యాలు గుర్రాలు, రథాలు రథాలు ఉపయోగించడంలో ప్రఖ్యాతులు.
(చూడండి: ఈజిప్టు, రోమా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 09:22
- 2 దిన 18:28-30
- అపో. కా. 08:29-31
- అపో. కా. 08:36-38
- దానియేలు 11:40-41
- నిర్గమ 14:23-25
- ఆది 41:42-43
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 12:10 కాబట్టి వారు ఇశ్రాయేలీయులను సముద్రం దారిలో తరిమారు. అయితే ఈజిప్టు వారు గాభరా పడిపోయేలా చేయగా వారి రథాలు కూరుకుపోయాయి.
పదం సమాచారం:
- Strong's: H668, H2021, H4817, H4818, H5699, H7393, H7395, H7396, H7398, G716, G4480
రమా
వాస్తవాలు:
రమా అనేది ఇశ్రాయేలీయుల పురాతనమైన పట్టణము, ఇది యెరూషలేమునుండి 8 కి.మీ. దూరములో ఉంటుంది. ఈ ప్రాంతమునందు బెన్యామీను గోత్రపువారు జీవించియుండిరి.
- రమా అనేది రాహేలు బెన్యామీనుకు జన్మనిచ్చిన తరువాత చనిపోయిన ప్రాంతమైయుండెను.
- ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగొనిపోయినప్పుడు, వారందరిని బబులోనుకు తీసుకొని వెళ్ళక మునుపు వారిని మొట్ట మొదటిగా రమాకు తీసుకొనివచ్చిరి.
- రమా అనే ప్రాంతము సమూయేలు తల్లిదండ్రుల ఊరైయుండెను.
(ఈ పదాలను కూడా చూడండి: బెన్యామీను, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 దిన.27:25-27
- 1 సమూ.02:11
- 2 దిన.16:1
- యిర్మియా.31:15
- యెహో.18:25-28
- మత్తయి.02:17-18
పదం సమాచారం:
రాజదండం, రాజదండములు
నిర్వచనము:
“రాజదండం: అనే ఈ పదము రాజులాంటి ఒక వ్యక్తి ద్వారా ఉపయోగించబడే దుడ్డు కర్ర లేక అలంకరించబడిన కర్రను సూచిస్తుంది.
- రాజదండములు వాస్తవానికి చెక్కను అలంకారకృతములుగా చెక్కి తయారుచేయడం జరుగుతుంది. ఆ తరువాత రాజదండములు బంగారమువంటి విలువైన లోహములతో కూడా తయారు చేయుదురు.
- రాజదండము రాజరికమునకు, అధికారమునకు మరియు గౌరవమునకు మరియు రాజుతో పాటు హుందాతనముకు గురుతుయైయున్నది.
- పాత నిబంధనలో దేవుడు నీతియను రాజదండమును కలిగియున్నాడని చెప్పబడియున్నది, ఎందుకంటే దేవుడు తన ప్రజల మీద రాజుగా పరిపాలించియున్నాడు.
- పాత నిబంధనలోని ప్రవచనము మెస్సయ్యాను సమస్త దేశములను పరిపాలించుటకు ఇశ్రాయేలునుండి వచ్చే రాజదండముగా సూచించబడినది.
- దీనిని “పాలించు దండము” అని లేక “రాజు యొక్క దండము” అని కూడా తర్జుమా చేయుదురు.
(ఈ పదములను కూడా చూడండి: అధికారం, క్రీస్తు, రాజు, నీతిగల)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆమోసు.01:5
- ఎస్తేరు.04:9-12
- ఆది.49:10
- హెబ్రీ.01:8-9
- సంఖ్యా.21:17-18
- కీర్తన.045:5-7
పదం సమాచారం:
- Strong's: H2710, H4294, H7626, H8275, G4464
రాజు, రాజులు, రాజ్యం, రాజ్యాలు, రాచరికం, రాచ ఠీవిగా
నిర్వచనం:
“రాజు” అనే పదం ఒక పట్టణానికే, రాష్ట్రానికీ లేక దేశానికీ సర్వశ్రేష్ఠమైన పాలకుడిగా ఉన్న వ్యక్తిని సూచిస్తుంది.
- ఒక రాజుకు తనకు ముందున్న రాజులతో ఉన్న కుటుంబ సంబంధం కారణంగా సాధారణంగా ఎంపిక చెయ్యబడతాడు.
- ఒక రాజు చనిపోయినప్పుడు, సాధారణంగా తన పెద్ద కుమారుడు తదుపరి రాజు అవుతాడు.
- పురాతన కాలాలలో, రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజల మీద సంపూర్ణమైన అధికారాన్ని కలిగియుంటాడు.
- ”రాజు” అనే పదం క్రొత్త నిబంధనలో నిజంగా రాజు కాని “రాజైన హేరోదు” లాంటివారికి ఆరుదుగా వినియోగించబడింది.
- బైబిలులో, తరచుగా దేవుడు తన ప్రజలమీద పరిపాలన చేస్తున్న రాజుగా సూచించబడ్డాడు.
- ”దేవుని రాజ్యం” తన ప్రజలమీద దేవుని పరిపాలనను సూచిస్తుంది.
- యేసు “యూదులకు రాజు,” “ఇస్రాయేలుకు రాజు,” “రాజులకు రాజుగా” పిలువబడ్డాడు.
- ప్రభువైన యేసు తిరిగి వచ్చినప్పుడు లోకాన్ని ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు.
- ఈ పదం, “సర్వశ్రేష్ఠ ప్రధాని” లేక “సంపూర్ణ నాయకుడు” లేక “సార్వభౌమ పాలకుడు” అనికూడా అనువదించవచ్చు.
- ”రాజుల రాజు” అనే పదం “ఇతర రాజులందరి మీద పరిపాలన చేస్తున్న రాజు” లేక “ఇతర పరిపాలకులందరి మీద అధికారం కలిగిన సర్వశ్రేష్ఠ పరిపాలకుడు” అని కూడా అనువదించవచ్చు.
(చూడండి: అధికారం, హేరోదు, రాజ్యము)
బైబిలు రిఫరెన్సులు:
- దేవుని రాజ్యము
- 2 రాజులు 05:17-19
- 2 సమూయేలు 05:3-5
- అపొస్తలులకార్యములు 07:9-10
- అపొస్తలులకార్యములు 13:21-22
- యోహాను 01:49-51
- లూక 01:5-7
- లూకా 22:24-25
- మత్తయి 05:33-35
- మత్తయి 14:8-9
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 08:06 ఒక రాత్రి, ఫరో(ఐగుప్తీయులు తమ రాజును ఈ విధంగా పిలుచుకొంటారు,) రాజుకు రెండు కలలు వచ్చాయి, అవి అతనిని అధికంగా కలవరపరచాయి.
- 16:01 ఇశ్రాయేలీయులకు రాజు లేడు, కనుక ప్రతి వాడును తన తన ఇస్త్తానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.
- 16:18 చివరిగా ప్రజలు ఇతర దేశాలకు ఉన్నట్టుగా ఒక రాజు కొరకు దేవుణ్ణి అడిగారు.
- 17:05 కాలక్రమంలో సౌలు యుద్ధంలో చనిపోయాడు, దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు. అతను మంచి రాజు, ప్రజలు అతనిని ప్రేమించారు.
- 21:06 దేవుని ప్రజలు కూడా మెస్సయను ప్రవక్త అని పిలిచారు, ప్రధాన యాజకుడు, ఒక రాజు.
- 48:14 దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, అయితే ప్రభువైన యేసు సమస్త లోకానికి రాజు!
పదం సమాచారం:
- Strong's: H4427, H4428, H4430, G935, G936
రాణి, రాణులు
నిర్వచనము:
ఒక దేశమును పాలించే పాలకురాలైన స్త్రీనిగాని లేదా రాజు భార్యనుగాని రాణి అని పిలిచెదరు.
- ఎస్తేరు రాణి రాజైన ఆహాశ్వేరోషును వివాహమాడిన తరువాత ఆమె పారసీక సామ్రాజ్యమునకు రాణియాయెను.
- రాణియైన యెజెబేలు రాజైన ఆహాబుకు దుష్ట భార్యయైయుండెను.
- సెబా రాణి ప్రసిద్ధి చెందిన పాలకురాలు, ఈమె రాజైన సొలొమోనును దర్శించవచ్చెను.
- “రాణి తల్లి” అనేటువంటి మాట పాలించే రాజు యొక్క అమ్మనుగాని లేక అవ్వనుగాని లేక ముందున్న రాజు భార్యనుగాని (విధవరాలునుగాని) పిలిచెదరు. రాణి తల్లి ఎక్కువ ప్రభావితము చేసియుంటుంది; ఉదాహరణకు, అతల్య - ఈమె జనులందరిని విగ్రహ ఆరాధికులనుగా చేసెను.
(ఈ పదములను కూడా చూడండి: ఆహష్వేరోషు, అతల్యా, ఎస్తేరు, రాజు, పారసీక, పాలించు, షేబ)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 రాజులు.10:10
- 1 రాజులు.11:18-19
- 2 రాజులు.10:12-14
- అపొ.కార్య.08:26-28
- ఎస్తేరు.01:16-18
- లూకా.11:31
- మత్తయి.12:42
పదం సమాచారం:
- Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938
రాయి, రాళ్లు, రాళ్లు రువ్వుట
నిర్వచనము:
రాయి అనేది చాలా చిన్న రాతి ముక్క. ఒకరి మీద “రాయిని” రువ్వుట అనగా ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశముతో ఆ మీదకి రాళ్ళను మరియు పెద్ద రాతి బండలను విసరుట అని అర్థము. “రాళ్ళను రువ్వుట” అనగా ఒకరి మీద రాళ్ళను రువ్వే సంఘటనను సూచించుట అని అర్థము.
- పురాతన కాలములో రాళ్ళను రువ్వే కార్యక్రమము ప్రజలు చేసిన అపరాధముల కొరకు శిక్షగా ప్రజలను చంపే సర్వ సాధారణ విధానమైయున్నది.
- ప్రజలు వ్యభిచారములాంటి పాపములు చేసినప్పుడు వారిపైన రాళ్ళను రువ్వాలని దేవుడు ఇశ్రాయేలు నాయకులకు ఆజ్ఞాపించియున్నాడు.
- క్రొత్త నిబంధనలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసు క్షమించియున్నాడు మరియు రాళ్ళను రువ్వే ప్రజలను అడ్డగించాడు.
- యేసును గూర్చి సాక్ష్యమిచ్చినందుకు పరిశుద్ధ గ్రంథములో మొట్ట మొదటిగా చంపబడిన వ్యక్తి స్తెఫెను, ఇతనిని రాళ్ళతో కొట్టి చంపారు.
- లుస్త్ర పట్టణములో అపొస్తలుడైన పౌలు మీదకి రాళ్ళను విసిరారు, కాని అతనికి తగిలిన గాయములవలన అతను మరణించలేదు.
(ఈ పదములను కూడా చూడండి: వ్యభిచారం, జరిగించు, నేరం, చనిపోవడం, లుస్త్ర, సాక్షం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.07:57-58
- అపొ.కార్య.07:59-60
- అపొ.కార్య.14:5-7
- అపొ.కార్య.14:19-20
- యోహాను.08:4-6
- లూకా.13:34-35
- లూకా.20:5-6
- మత్తయి.23:37-39
పదం సమాచారం:
- Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586
రాహేలు
వాస్తవాలు:
రాహేలు యాకోబు భార్యలలో ఒకరైయుండెను. ఈమె మరియు తన అక్కయైన లేయాలు యాకోబు మామయైన లాబాను కుమార్తెలైయుండిరి.
- రాహేలు యోసేపు మరియు బెన్యామీనులకు తల్లియైయుండెను, ఈ సంతానము ఇశ్రాయేలు పన్నెండు మంది గొత్రీకులలో ఉండిరి.
- అనేక సంవత్సరములు రాహేలుకు పిల్లలు లేకపోయిరి. ఆ తరువాత దేవుడు ఆమెను పిల్లలను కనుటకు బలపరచెను మరియు యాకోబుకు ఆమె ద్వారా సంతానమాయెను.
- అనేక సంవత్సరములైన తరువాత ఆమె బెన్యామీనుకు జన్మనిచ్చిన తరువాత చనిపోయెను, యాకోబు ఆమెను బెత్లెహేము వద్ద సమాధి చేసెను.
(ఈ పదాలను కూడా చూడండి: బెత్లెహేము, ఇశ్రాయేలు, లాబాను, లేయా, యోసేపు (పా ని), ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.29:4-6
- ఆది.29:19-20
- ఆది.29:28-30
- ఆది.31:4-6
- ఆది.33:1-3
- మత్తయి.02:17-18
పదం సమాచారం:
రిబ్కా
వాస్తవాలు:
రిబ్కా అబ్రాహాము సోదరుడైన నాహోరు మనవరాలు.
- దేవుడు రిబ్కాను అబ్రాహాము కుమారుడగు ఇస్సాకుకు భార్యగా ఉండుటకు ఎన్నుకొనను.
- రిబ్కా నివసించిన స్థలమైన అరాం నహరాయిము ప్రాంతమును వదిలి, అబ్రాహాము దాసునితో ఇస్సాకు నివసించే ప్రాంతమైన నేగేవ్ ప్రాంతమునకు వెళ్ళెను.
- ఎంతో కాలము వరకు రిబ్కాకు సంతానము లేకుండెను, కాని చివరికి దేవుడు ఆమెను ఇద్దరు మగ పిల్లలతో అనగా ఏసావు మరియు యాకోబులను ఇచ్చి ఆశీర్వదించెను.
(ఈ పదములను కూడా చూడండి: అబ్రాహాము, ఆరాము, ఏశావు, ఇస్సాకు, ఇశ్రాయేలు, నాహోరు)
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- నెగెబు
- ఆది.24:45-46
- ఆది.24:56-58
- ఆది.24:63-65
- ఆది.25:27-28
- ఆది.26:6-8
పరిశుద్ధ గ్రంథము నుండి ఉదాహరణలు:
- 06:02 అబ్రాహాము యొక్క బంధువులు నివసించిన ప్రాంతమునకు సుదూర ప్రయాణము చేసిన తరువాత, దేవుడు దాసుని రిబ్కా వద్దకు నడిపించెను. ఈమె అబ్రాహాము సోదరుని యొక్క మనవరాలైయుండెను.
- 06:06 “నీలో రెండు రాజ్యుములున్నాయి” అని దేవుడు రిబ్కాకు చెప్పెను.
- 07:01 పిల్లలు ఎదిగేకొలది, రిబ్కా యాకోబును ప్రేమించెను, అయితే ఇస్సాకు ఏసావును ప్రేమించెను.
- 07:03 ఇస్సాకు తన ఆశీర్వాదమును ఏసావుకు ఇవ్వాలని ఆశించేను. అయితే అతను అశీర్వాదములు ఇవ్వక మునుపు, రిబ్కా మరియు యాకోబులిరువురు తనని మోసము చేసి, ఏసావని యాకోబు నటించియుండెను.
- 07:06 అయితే రిబ్కా ఏసావు ప్రణాళికను వినెను. అందుచేత ఆమె యాకోబును ఎంతో దూరములోనున్న తన బంధువులయొద్దకు పంపించెను.
పదం సమాచారం:
రూబేను
వాస్తవాలు:
రూబేను యాకోబుకు మొట్ట మొదటిగా పుట్టిన కుమారుడైయుండెను. ఇతని తల్లి పేరు లేయా.
- ఇతని సహోదరులు తమ చిన్న తమ్ముడైన యోసేపును చంపాలని చూచినప్పుడు, రూబేను తన తమ్ముళ్ళకు తనని బావిలో వేద్దామని చెప్పుట ద్వారా యోసేపు ప్రాణమును కాపాడియుండెను.
- రూబేను కొంచెము సమయమైన తరువాత యోసేపును రక్షించుటకు వెనక్కి తిరిగి వచ్చెను, కాని మిగిలిన ఇతర సహోదరులు ఆ మార్గముగుండా వెళ్తున్న వ్యాపారులకు తమా తమ్మున్ని బానిసగా అమ్మివేసిరి.
- రూబేను సంతానము ఇశ్రాయేలు పన్నెండు గోత్రములలో ఒక గోత్రముగా మార్చబడిరి.
(ఈ పదములను కూడా చూడండి: ఇశ్రాయేలు, యోసేపు (పా ని), లేయా, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.29:31-32
- ఆది.35:21-22
- ఆది.42:21-22
- ఆది.42:37-38
పదం సమాచారం:
- Strong's: H7205, H7206, G4502
రొట్టె
నిర్వచనం:
రొట్టె అనేది పిండిలో నీరు, నూనే కలిపి ముద్దా చేసి ఆహారంగా వండిన పదార్థం. ముద్దను తరువాత రొట్టె ఆకారంలో వత్తి పెనంపై కాలుస్తారు.
- ఈ పదం "రొట్టె" అనేది దానంతట అదే కనిపించినప్పుడు అది అంటే "పెద్ద రొట్టె" అనే అర్థం వస్తుంది.
- రొట్టె ముద్దకు సాధారణంగా పొంగజేసే పదార్థం కలిపి అది పొంగేలా చేస్తారు.
- రొట్టె ను పొంగజేసే పదార్థం కలపకుండా కూడా చేస్తారు. బైబిల్లో "పొంగని రొట్టె" అని పిలిచిన దాన్ని యూదుల పస్కా భోజనంలో ఉపయోగిస్తారు.
- బైబిల్ కాలంలో రొట్టె అనేక మంది ప్రజలు ముఖ్య ఆహారం గనక ఈ పదాన్ని బైబిల్లోసాధారణంగా ఆహారాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.
- ఈ పదం "సన్నిధి రొట్టెలు" ప్రత్యక్ష గుడారం, లేక ఆలయంలో దేవునికి బలి అర్పణగా బంగారు బల్లపై ఉంచే పన్నెండు రొట్టెలను సూచిస్తుంది. ఈ రొట్టెలు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలకు గుర్తు. వీటిని యాజకులు మాత్రమే తినాలి. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు వారి మధ్య నివసించాడు అని సూచించే రొట్టె."
- అలంకారికంగా “పరలోకంనుండి వచ్చిన ఆహారం" అనే మాట దేవుడు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలో ఇచ్చిన "మన్నా" అనే పేరున్న ప్రత్యేకమైన తెల్లని ఆహారం.
- యేసు కూడా తనను "పరలోకం నుండి వచ్చిన ఆహారం" అనీ "జీవాహారం” అనీ పిలిచాడు.
- యేసు, తన శిష్యులు అయన మరణానికి ముందు పస్కా భోజనం కలిసి తినేటప్పుడు అయన పొంగని పస్కా రొట్టెతో తన శరీరాన్ని పోల్చాడు. ఆ శరీరం సిలువపై హింసల పాలు అవుతుంది.
- అనేక సమయాల్లో ఈ పదం "రొట్టె"ను సాధారణంగా "ఆహారం" అని తర్జుమా చెయ్యవచ్చు.
(చూడండి: పస్కా, ప్రత్యక్ష గుడారం, ఆలయం, పులియని రొట్టె, పులిపిండి)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 02:46-47
- అపో. కా. 27:33-35
- నిర్గమ 16:13-15
- లూకా 09:12-14
- మార్కు 06:37-38
- మత్తయి 04:1-4
- మత్తయి 11:18-19
పదం సమాచారం:
- Strong's: H2557, H3899, H4635, H4682, G106, G740, G4286
రోజు, రోజులు
నిర్వచనం:
"రోజు" అంటే అక్షరాలా సూర్యాస్తమయంతో మొదలు పెట్టి 24 గంటలు. దీన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు .
- ఇశ్రాయేలీయులు, యూదులకు ఒక రోజు సూర్యాస్తమయంతో మొదలై మరుసటిరోజు సూర్యాస్తమయంతో ముగుస్తుంది.
- కొన్ని సార్లు "రోజు"ను అలంకారికంగా మరింత దీర్ఘమైన కాలపరిమితిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు "యెహోవా దినం ” లేక “అంత్య దినాలు."
- కొన్ని భాషల్లో అలంకారికంగా అనువదించడానికి వివిధ పద్ధతులు ఉంటాయి. "రోజు" అనే పదాన్ని అలంకారికంగా కాకుండా కూడా ఉపయోగిస్తారు.
- "రోజు" అంటే "సమయం” లేక “కాలాలు” లేక “సందర్భం” లేక “సంఘటన," అని సందర్భాన్ని బట్టి అర్థాలు వస్తాయి.
(చూడండి: తీర్పు దినం, అంత్య దినం)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 20:4-6
- దానియేలు 10:4-6
- ఎజ్రా 06:13-15
- ఎజ్రా 06:19-20
- మత్తయి 09:14-15
పదం సమాచారం:
- Strong's: H3117, H3118, H6242, G2250
రౌతు, రౌతులు
నిర్వచనం:
బైబిల్ కాలాల్లో, "రౌతులు" అంటే గుర్రాలెక్కి యుద్ధం చేసేవారు.
- గుర్రాలు లాగే రథాలపై నిలిచి యుద్ధం చేసే యోధులను కూడా "రౌతులు," అంటారు. ఈ పదం సాధారణంగా గుర్రంపై స్వారీ చేసే వారికే వర్తిస్తుంది.
- ఇశ్రాయేలీయులు యుద్ధంలో గుర్రాల బలంపైనా తమ స్వంత బలంపైనా ఆధారపడరాదని విశ్వసించారు. వారి బలం యెహోవాలోనే ఉన్నదని వారికి తెలుసు. అందుకే వారికి అనేకమంది రౌతులు లేరు.
- ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు."గుర్రపు రౌతులు” లేక “గుర్రాలపై మనుషులు."
(చూడండి: రథం, గుర్రం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 01:5-6
- దానియేలు 11:40-41
- నిర్గమ 14:23-25
- ఆది 50:7-9
పదం సమాచారం:
- Strong's: H6571, H7395, G2460
లాబాను
వాస్తవాలు
పాత నిబంధనలో లాబాను యాకోబుకు మేనత్త పెనిమిటి, మామ.
- పద్దనరాములో లాబాను ఇంట యాకోబు నివసించాడు, లాబాను కుమార్తెలను వివాహం చేసుకోడానికి షరతుగా లాబాను గొర్రెలను, మేకలను చూసుకొన్నాడు.
- రాహేలు తన భార్య కావాలనేది యాకోబు ప్రాధాన్యత.
- లాబాను యాకోబును మోసగించి, రాహేలును తన భార్యగా ఇవ్వడానికి ముందు మొదట తన పెద్ద కుమార్తె లేయాను పెండ్లి చేసుకొనేలా చేసాడు.
(చూడండి: ఇశ్రాయేలు, నాహోరు, లేయా, రాహేలు)
బైబిలు రిఫరెన్సులు:
- ఆదికాండం 24:28-30
- ఆదికాండం 24:50-51
- ఆదికాండం 27:43-45
- ఆదికాండం 28:1-2
- ఆదికాండం 29:4-6
- ఆదికాండం 29:13-14
- ఆదికాండం 30:25-26
- ఆదికాండం 46:16-18
పదం సమాచారం:
లెమెకు
వాస్తవాలు
ఆదికాండం గ్రంథంలో ఇద్దరి పేర్లు లెమెకు అని ప్రస్తావించబడింది.
- మొదటిగా లెమెకు పేరు కయీను కుమారునికి పెట్టబడింది. తనకు హాని చేసిన వానిని హత్య చేస్తానని తన ఇద్దరు భార్యల వద్ద డంబముగా పలికాడు.
- లెమెకు అని పేరు కలిగిన రెండవ వ్యక్తి సేతు కుమారుడు. అతడు నోవహుకు కూడా తండ్రి.
చూడండి: కయీను, నోవహు, షేతు)
బైబిలు రెఫరెన్సులు:
- ఆదికాండం 04:18-19
- ఆదికాండం 05:25-27
- ఆదికాండం 05:25-27
- ఆదికాండం 05:28-29
- ఆదికాండం 05:30-31
- లూకా 03:36-38
పదం సమాచారం:
లేయా
వాస్తవాలు:
యాకోబు భార్యలలో లేయా ఒకరు. యాకోబు పదిమంది కుమారులకు ఆమె తల్లి, వారి సంతానం ఇశ్రాయేలు పన్నెండుగోత్రాలలో పదిమంది.
- లేయా తండ్రి లాబాను, యాకోబు తల్లి రిబ్కాకు సోదరుడు.
- మరో భార్య రాహేలును ప్రేమించినంతగా యాకోబు లేయాను ప్రేమించలేదు, అయితే దేవుడు లేయాకు అనేకమంది పిల్లలను అనుగ్రహించడం ద్వారా లేయాను సమృద్ధిగా ఆశీర్వదించాడు.
- ప్రభువైన యేసూ, దావీదు రాజు పితరులలో లేయా కుమారుడు యూదా ఉన్నాడు.
(చూడండి: ఇశ్రాయేలు, యూదా, లాబాను, రాహేలు, రిబ్కా)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
లేవి, లేవీయుడు, లేవీయులు, లేవిసంబంధి
నిర్వచనం:
యాకోబు లేక ఇశ్రాయేలు పన్నెండు కుమారులలో ఒకడు లేవి. “లేవీయుడు” అనే పదం లేవి తమ పితరుడిగా ఉన్న ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న వ్యక్తిని సూచిస్తుంది.
- లేవీయులు దేవాలయ సంబంధ విషయాలలో బాధ్యత తీసుకుంటారు, మతపరమైన విధులు నిర్వహిస్తారు, బలులు అర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు.
- యూదా యాజకులు అందరూ లేవీయులే. లేవీ సంతానం, లేవి గోత్రంలో భాగం. (లేవీయులందరూ యాజకులు కాదు)
- లేవీ యాజకులు ప్రత్యేకంగా ఉన్నవారు, దేవాలయంలో దేవుని సేవించడంలో ప్రత్యేకమైన పని కోసం సమర్పించుకొన్నవారు.
- యేసు పితరులలో ఇద్దరు “లేవి” అనే పేరు కలిగియున్నారు, లూకా సువార్తలో యేసు వంశావళిలో వారిపేర్లు ఉన్నాయి.
- యేసు శిష్యుడు మత్తయికి కూడా లేవి అనే పేరు ఉంది.
(చూడండి: మత్తయి, యాజకుడు, బలియాగము, ఆలయం)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3878, H3879, H3881, G3017, G3018, G3019, G3020
లోకం, లోకసంబంధ
నిర్వచనం:
“లోకం” పదం సాధారణముగా ప్రజలు జీవించే స్థలమైన విశ్వంలోని ఒక భాగమును - భూమిని, సూచిస్తుంది. “లోకసంబంధ” పదం ఈ లోకములో దుష్ట విలువలతోనూ, దుష్ట ప్రవర్తనలతోనూ జీవిస్తున్న ప్రజలను సూచిస్తుంది.
- దీని సాధారణ భావనలో “లోకం” పదం ఆకాశాలనూ, భూమినీ, అందులోని సమస్త జీవరాశులనూ సూచిస్తుంది.
- అనేక సందర్భాలలో “లోకం” పదం “లోకములోని ప్రజలు” అనే అర్ధాన్ని ఇస్తుంది.
- కొన్నిమార్లు ఈ పదం దుష్ట ప్రజలనూ లేదా దేవునికి విధేయత చూపని దుష్ట ప్రజలను సూచిస్తున్నట్టు తెలుస్తుంది.* అపొస్తలులు కూడా “లోకం” పదాన్ని స్వార్థపూరితమైన ప్రవర్తనను లేక ఈ లోకములో భ్రష్ట విలువలతో జీవించే ప్రజలను సూచించడానికి ఉపయోగించారు. ఇందులో మానవ ప్రయత్నాల మీద ఆధారపడిన స్వనీతి భక్తి ఆచారాలు దీనిలో ఉన్నాయి.
- "లోక సంబంధమైనవి" గా చెప్పబడే ఈ విలువల ద్వారా ప్రజలూ, వస్తువులూ ఈ విధమైన విలువలద్వారా వర్గీకరించబడ్డారు.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, “లోకం" పదం “విశ్వం" లేదా "ఈ లోకపు ప్రజలు” లేదా "లోకములోని భ్రష్ట సంగతులు” లేదా "లోకములో ప్రజల దుష్ట వైఖరులు" అని అనువదించబడవచ్చు.
- “లోకమంతటా” పదం తరచుగా "అనేకులైన ప్రజలు" అనే అర్థాన్ని ఇస్తుంది, ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సూచిస్తుంది. ఉదాహరణకు, "లోకం అంతా ఐగుప్తుకు వచ్చింది" పదబంధం "చుట్టూ ఉన్న దేశములనుండి అనేకమంది ప్రజలు ఐగుప్తుకు వచ్చారు" లేదా “ఐగుప్తు చుట్టూ ఉన్న అన్ని దేశాల నుండి ప్రజలు ఐగుప్తుకు వచ్చారు" అని అనువదించబడవచ్చు.
- “లోకమంతా రోమా జనాభా లెక్కలలో నమోదు కావడం కోసం తమ స్వంత గ్రామాలకు వెళ్ళారు" వాక్యం "రోమా సామ్రాజ్యము చేత పరిపాలించబడే ప్రాంతములలో జీవిస్తున్న అనేకమంది ప్రజలు" అని మరో విధంగా అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, “లోకసంబంధ" పదం “దుష్టత్వం" లేదా “పాపసంబంధమైన" లేదా స్వార్ధపూరిత" లేదా "దైవభక్తిలేని" లేదా "భ్రష్టత్వము” లేదా “ఈ లోకములోని ప్రజల భ్రష్ట విలువల ద్వారా ప్రభావితము చేయబడిన" అని అనువదించబడవచ్చు.
- “లోకములో ఈ సంగతులు చెప్పడం" పదబంధం "లోకంలోని ప్రజలకు ఈ సంగతులు చెప్పడం" అని అనువదించబడవచ్చు.
- ఇతర సందర్భాలలో “లోకములో” పదం “లోక ప్రజల మధ్య జీవించడం" లేదా దైవభక్తిలేని ప్రజల మధ్య నివసించడం" అని కూడా అనువదించబడవచ్చు.
(చూడండి: చెడిన, పరలోకం, రోమా, దైవభక్తిగల)
బైబిలు రిఫరెన్సులు:
- 1 యోహాను 02:15
- 1 యోహాను 04:05
- 1 యోహాను 05:05
- యోహాను 01:29
- మత్తయి 13:36-39
పదం సమాచారం:
- Strong's: H776, H2309, H2465, H5769, H8398, G1093, G2886, G2889, G3625
లోతు
వాస్తవాలు:
లోతు అబ్రహాము తోడబుట్టినవాని కుమారుడు.
- అతను అబ్రహాము సోదరుడు హారాను కుమారుడు.
- లోతు అబ్రహాముతో కనాను భూభాగానికి ప్రయాణం అయ్యాడు, సొదొమ పట్టణంలో స్థిరపడ్డాడు.
- లోతు మోయాబీయులకు, అమ్మోనీయులకు మూల పురుషుడు.
- శత్రు రాజులు సొదొమ పట్టణం మీదకు దండెత్తి లోతును బంధించినప్పుడు, అబ్రహాము అనేక వందలమందితో వచ్చి లోతును కాపాడి అతని వస్తువులను తిరిగి స్వాధీనపరచుకొన్నాడు.
- సొదొమ పట్టణంలోని ప్రజలు చాలా దుర్మార్గులు, అందుచేత దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసాడు. అయితే లోతునూ, అతని సంతానమూ తప్పించుకోనేలా వారు ఆ పట్టణాన్ని విడిచిపెట్టాలని దేవుడు వారితో మొదట చెప్పాడు.
(చూడండి: అబ్రాహాము, అమ్మోను, హారాను, మోయాబు, సొదొమ)
బైబిలు రెఫరెన్సులు:
- 2 పేతురు 02:7-9
- ఆదికాండం 11:27-28
- ఆదికాండం 12:4-5
పదం సమాచారం:
వంచు, సాగిల పడు, వంగిన, వంగుట, నేలకు వంగుట, నేలకు వంగి,
నిర్వచనం:
వంగుట అంటే వినయంగా, ఎదుటి వ్యక్తి పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తపరచడం కోసం తన వంగి నమస్కారం చెయ్యడం.
"నేలకు వంగుట" అంటే సాగిల పడి, మోకరించి తరచుగా ముఖం, చేతులు నేలకు ఆనించడం.
- ఇతర మాటలు. "మోకాలు వంచు" (అంటే మోకరించు) "శిరస్సు వంచి" (అర్థం శిరస్సు వినయపూర్వకంగా, లేక సంతాపపూర్వకంగా వంచి).
- వంగడం అనేది దుఃఖానికి సంతాపానికి సూచన. ఎవరినైనా "సాగిలపడడం" అంటే పూర్తిగా లొంగి వినయం చూపడం.
- తరచుగా ఒక వ్యక్తి ఎవరైనా రాజులు, ఇతర అధిపతుల వలె ఉన్నత స్థాయి, లేక తనకన్నా ఎక్కువ హోదా, ప్రాముఖ్యత గొప్ప పదవి అలాటివి ఉంటే వారికి మొక్కుతాడు.
- దేవుని ఎదుట సాగిలపడడం అనే మాటకు అర్థం ఆయనకు ఆరాధన చేయడం.
- బైబిల్లో, ప్రజలు యేసు చేసిన అద్భుతాలు,అయన బోధ చూసి అయన దేవుని నుండి వచ్చాడని గ్రహించి ఆయనకు సాగిల పడ్డారు.
- యేసు ఒక దినాన తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తన మోకాళ్ళు వంచి ఆయనకు ఆరాధన చేస్తారని బైబిల్ చెబుతున్నది.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని ఒక పదం లేక పదబంధం సాయంతో అనువదించ వచ్చు. "నెలకు ముఖం ఆనించి” లేక తల వంచి” లేక “మోకరించు."
- ఈ పదం "నేలకు వంగుట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మోకరించు” లేక “సాష్టాంగపడడం."
- కొన్ని భాషల్లో సందర్భాన్ని బట్టి అనువాదంలో వాడగలిగిన పదాలు ఉంటాయి.
(చూడండి: వినయపూర్వకమైన, ఆరాధన)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 రాజులు 05:17-19
- నిర్గమ 20:4-6
- ఆది 24:26-27
- ఆది 44:14-15
- యెషయా 44:19
- లూకా 24:4-5
- మత్తయి 02:11-12
- ప్రకటన 03:9-11
పదం సమాచారం:
- Strong's: H86, H3721, H3766, H5186, H5753, H5791, H6915, H7743, H7812, H7817, G1120, G2578, G2827, G4098, G4781, G4794
వధ, వధించుట, వధించబడెను, వధించబడెను
నిర్వచనము:
“వధ” అనే ఈ పదము ప్రజలనైన లేక ప్రాణులనైన ఎక్కువ సంఖ్యలో చంపుటను లేదా హింసాత్మకమైన విధానములో చంపుటను సూచిస్తుంది. ఆహారము భుజించు ఉద్దేశము కొరకు ప్రాణిని చంపుటను కూడా ఈ పదము సూచించును. వధించే క్రియను కూడా “వధ” అని పిలిచెదరు.
- అబ్రాహాము అరణ్యములో తన గుడారము వద్ద ముగ్గురు అతిథులను చేర్చుకున్నప్పుడు, తన అతిథుల కొరకు ఒక క్రొవ్విన దూడను వధించి భోజనమునకు సిద్ధము చేయమని తన దాసులకు ఆదేశించెను.
- దేవుడు తన వాక్కులను అనుసరించి నడుచుకొనని వారినందరిని వధించుటకు తన దూతలను పంపించునని ప్రవక్తయైన యేహెజ్కేలు ప్రవచించెను.
- దేవునికి ఇశ్రాయేలీయులు అవిధేయత చూపించినందున వారు తమ శత్రువుల ద్వారా సరిసుమారు 30,000 వేలమంది అతి ఘోరముగా వధించబడియున్నారని 1 సమూయేలు గ్రంథములో దాఖలు చేయబడియున్నది.
- “వధించు ఆయుధాలు” అనే ఈ మాటను “చంపుటకొరకు ఆయుధాలు” అని కూడా తర్జుమా చేయుదురు.
- “వధ అతి ఘోరమైనది” అనే ఈ మాటను “ఎక్కువ సంఖ్యలో చనిపోయిరి” లేక “చనిపోయినవారి సంఖ్య ఎక్కువ” లేక “ఎక్కువ సంఖ్యలో ప్రజలు అతి భయానకముగా చంపబడ్డారు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “వధ” అనే ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములలో “చంపు” లేక “వధించు” లేక “చంపుట” అనే పదాలను ఉపయోగించుదురు.
(ఈ పదములను కూడా చూడండి: దేవదూత, ఆవు, అవిధేయత చూపడం, యెహెజ్కేలు, సేవకుడు, వధించు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- యెహె.21:10-11
- హెబ్రీ.07:1-3
- యెషయా.34:1-2
- యిర్మియా.25:34-36
పదం సమాచారం:
- Strong's: H2026, H2027, H2028, H2076, H2491, H2873, H2874, H2878, H4046, H4293, H4347, H4660, H5221, H6993, H7524, H7819, H7821, G2871, G4967, G4969, G5408
వయసు, వృద్ధులు
నిర్వచనం:
"వయసు" పదం ఒక వ్యక్తి బ్రతికిన సంవత్సరాల సంఖ్యను సూచిస్తుంది. ఇది సాధారణంగా కాల పరిమితిని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది.
- విస్తృతమైన కాల పరిమితిని సూచించడానికి "యుగము," "ఋతువు" అనే ఇతర పదాలు ఉపయోగించబడ్డాయి.
- "ఈ యుగం" అనే పదాన్ని దుష్టత్వం, పాపం, అవిధేయతతో భూమి నిండియున్న ప్రస్తుత సమయంగా యేసు సూచిస్తున్నాడు.
- నూత ఆకాశం, నూతన భూమి మీద నీతి పరిపాలించబోయే భవిష్యత్తు యుగం ఉండబోతున్నది.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, "వయసు" పదం "యుగం" లేదా "సంవత్సరాల వయస్సు" లేదా "కాలపరిమితి" లేదా "సమయం" అని అనువదించబడవచ్చు.
- "చాలా పురాతన కాలంలో" పదబంధం "అనేక సంవత్సరాల వయసులో" లేదా "అతడు చాలా వృద్దుడుగా ఉన్నప్పుడు" లేదా "అతడు చాలా దీర్ఘ కాలం జీవించినప్పుడు" అని అనువదించబడవచ్చు.
- "ప్రస్తుత దుష్ట యుగం" పదబంధం "మనుషులు చాలా దుర్మార్గులుగా ఉన్న ఈ ప్రస్తుత కాలంలో" అని అర్థం.
బైబిలు రిఫరెన్సులు:
- 1 దిన. 29:28
- 1 కొరింథీ 02:07
- హెబ్రీ 06:05
- యోబు 05:26
పదం సమాచారం:
- Strong's: H2465, G165, G1074
వర్ధిల్లు, సమృద్ధి, వర్ధిల్లుతున్న
నిర్వచనం:
“వృద్ధిల్లు” అనే పదం సాధారణముగా చక్మంకగా జీవించడాన్ని సూచిస్తుంది, భౌతికంగానూ, ఆత్మీయంగానూ వర్ధిల్లడాన్ని సూచిస్తుంది. ప్రజలుగానీ లేదా ఒక దేశముగానీ “వర్ధిల్లి"నప్పుడు వారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, విజయవంతంగా ఉండడానికి కావలసినవాటన్నిటినీ కలిగియున్నారని అర్థం. వారు “సమృద్ధి"ని అనుభవిస్తున్నారు.
- “వర్ధిల్లుతున్న" పదం తరచుగా ధనమునూ, ఆస్తిపాస్తిలనూ కలిగియుండడానిని సూచిస్తుంది లేదా ప్రజలు చక్కగా జీవించడం కోసం కావలసిన ప్రతీదానిని తయారుచేసుకోవడానిని సూచిస్తుంది.
- బైబిలులో “వర్ధిల్లుతున్న" పదంలో "మంచి ఆరోగ్యము," "పిల్లలతో ఆశీర్వదించబడడం" కూడా ఉన్నాయి.
- “వర్ధిల్లుతున్న" పట్టణము లేక దేశము అంటే ఆ దేశము అనేకమంది ప్రజలను కలిగియుంది, మంచి ఆహార ఉత్పాదన ఉంది, ఎక్కువ రాబడిని తెచ్చే వ్యాపారాలు ఉన్నాయని అర్థం.
- ఒక వ్యక్తి దేవుని బోధనలకు లోబడినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా వృద్ధి చెందుతాడని బైబిలు బోధిస్తుంది. అతడు సంతోష సమాధానముల ఆశీర్వాదములను కూడా అనుభవిస్తాడు. దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడు వస్తు సంబంధమైన సంపదను ఇవ్వడు, అయితే వారు ఆయన ఆజ్ఞలను అనుసరించే కొలది వారికి ఎల్లప్పుడూ ఆత్మీయంగా వృద్ధిని కలిగిస్తాడు. పరుస్తాడు.
- సందర్భాన్ని బట్టి “వర్ధిల్లుతున్న" పదం “ఆత్మీయంగా విజయవంతం కావడం" లేదా " “దేవుని చేత ఆశీర్వదించబడడం" లేదా "మంచి సంగతులను అనుభవించడం" లేదా “మంచిగా జీవించడం” అని అనువదించబడ వచ్చు.
- “వర్ధిల్లుతున్న" పదం "విజయవంతం” లేదా “సంపన్న” లేదా “ఆత్మీయంగా ఫలభరితం" అని అనువదించబడవచ్చు.
- “సమృద్ధి” అనే పదం “క్షేమం" లేదా “సంపద” లేదా “విజయము” లేదా “సమృద్ధికరమైన ఆశీర్వాదములు” అని అనువదించబడవచ్చు.
(చూడండి: ఆశీర్వదించు, ఫలం, ఆత్మ)
బైబిలు రిఫరెన్సులు:
- 1 దిన 29:22-23
- ద్వితి. 23:06
- యోబు 36:11
- లేవి. 25:26-28
- కీర్తనలు 001:3
పదం సమాచారం:
- Strong's: H1129, H1767, H1878, H1879, H2428, H2896, H2898, H3027, H3190, H3444, H3498, H3787, H4195, H5381, H6500, H6509, H6555, H6743, H6744, H7230, H7487, H7919, H7951, H7961, H7963, H7965, G2137
వస్త్రం, వస్త్రాలు తొడిగిన, వస్త్రాలు, బట్టలు, బట్టలు లేకుండా
నిర్వచనం:
దీన్నిఅలంకారికంగా ఉపయోగించినప్పుడు బైబిల్లో, "వస్త్రం ధరించిన" అంటే దేన్నైనా కలిగి ఉండడం అని అర్థం వస్తుంది. దేన్నైనా అంటే ధరించుకోవడం అంటే కొన్ని గుణ లక్షణాలు కలిగి ఉండడం.
- అదే విధంగా నీ శరీరంపై అందరికీ బాహాటంగా కనిపించే విధంగా కొన్ని గుణ లక్షణాలు ఇతరులు చక్కగా చూసేలా ఉంటే వాటిని నీవు "ధరించుకున్నట్టు." "నిన్ను నీవు దయ అనే వస్త్రంతో కప్పుకోవడం" అంటే నీ గుణ లక్షణాలు దయపూరితమైనవిగా ప్రతి ఒక్కరూ తేలికగా చూడ గలుగుతున్నారు.
- "పైనుండి శక్తిని వస్త్రంగా ధరించడం" అంటే నీకు దేవుడు శక్తినివ్వడం.
- ఈ పదాన్ని ప్రతికూలంగా కూడా ఉపయోగిస్తారు. "సిగ్గును వస్త్రంగా కప్పుకోవడం. లేక “భీతిని వస్త్రంగా ధరించడం."
అనువాదం సలహాలు:
- వీలైతే, దీన్ని అక్షరార్థంగా భాషాలంకారంగా, "వస్త్రం ధరించుకో" అని ఉంచడం మంచిది. దీన్ని అనువదించడంలో మరొక పధ్ధతి బట్టలు వేసుకోవడం.
- అది సరైన అర్థం ఇవ్వకపోతే, ధరించడం అనేదాన్ని చెప్పడానికి ఇతర పద్ధతులు "వస్త్రం తోడుక్కోవడం" "ప్రదర్శించిన” లేక “వెల్లడి చేసిన” లేక “నిండిపోయిన” లేక “అలాటి లక్షణాలు గల."
- ఈ పదం "వస్త్రం ధరించుకో" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిన్ను నీవు కప్పుకో” లేక “బయటికి కనిపించేలా ప్రవర్తించు."
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H899, H1545, H3680, H3736, H3830, H3847, H3848, H4055, H4346, H4374, H5497, H8008, H8071, H8516, G294, G1463, G1562, G1737, G1742, G1746, G1902, G2066, G2439, G2440, G3608, G4016, G4470, G4616, G4683, G4749, G5509, G6005
వారం, వారాలు
నిర్వచనం:
"వారం" అనేది అక్షరాలా ఏడు రోజులు సమయం.
- యూదు పద్ధతిలో సమయం లెక్కింపుకు ఒక వారం శనివారం సూర్యాస్తమయం తో ఆరంభం అవుతుంది. మరుసటి శనివారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది.
- బైబిల్లో, ఈ పదం "వారం"కొన్ని సార్లు అలంకారికంగా ఉపయోగిస్తారు. ఏడు కాలాలను (ఉదా. ఏడు సంవత్సరాలు) సూచించడానికి.
- "వారాల పండుగ"పస్కాకు ఏడు వారాలు తరువాత వచ్చే కోత కాలం సంబరం. దీన్ని "పెంతెకోస్తు"అని కూడా అంటారు.
(చూడండి: పెంతకోస్తు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 20:7-8
- ద్వితీ 16:9-10
- లేవీ 23:15-16
పదం సమాచారం:
వారసుడు, వంశీకులు, సంతతి వాడు, సంతానం
నిర్వచనం:
"సంతతి వాడు" అంటే నేరుగా రక్తం సంబంధి అయిన వాడు. లేక చరిత్రలో తరువాతి కాలంలో సంతతిలో ఉన్న వాడు.
- ఉదాహరణకు, అబ్రాహాము నోవహు సంతతి వాడు.
- ఒక వ్యక్తి సంతానం అంటే తన పిల్లలు, మనవలు, ముని మనవలు, తదితరులు. యాకోబు సంతానం పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలు.
- "సంతానం గా వచ్చిన వారు" అంటే "ఫలానా వారి వంశం వాడు." ఉదాహరణకు "అబ్రాహాము నోవహునుండి వచ్చిన వాడు." ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "కుటుంబం క్రమం లోనుండి."
(చూడండి: అబ్రాహాము, పూర్వీకుడు, ఇశ్రాయేలు, నోవహు, ఇశ్రాయేల్ పన్నెండు గోత్రాలు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 09:4-5
- అపో. కా. 13:23-25
- ద్వితీ 02:20-22
- ఆది 10:1
- ఆది 28:12-13
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 02:09 " స్త్రీ సంతతి వాడు నీ శిరస్సు చితకగొడతాడు, నీవు అతని మడిమెకు గాయం చేస్తావు."
- 04:09 "కనాను ప్రదేశం నీ సంతానానికి ఇస్తాను."
- 05:10 "నీ సంతానం ఆకాశం లోని తారలకన్నా ఎక్కువ చేస్తాను."
- 17:07 " నీ కుటుంబం లోని వాడే ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలన చేస్తాడు. మెస్సియా నీ సంతానం లో ఒకడు!"
- 18:13 యూదా రాజులు దావీదు సంతానం.
- 21:04 దేవుడు దావీదు రాజుకు వాగ్దానం చేశాడు. మెస్సియా దావీదు స్వంత సంతానం లో ఒకడు.
- 48:13 మెస్సియా దావీదు స్వంత సంతానం లో ఒకడు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. యేసు, మెస్సియా, ప్రత్యేకంగా దావీదు సంతతి వాడు.
పదం సమాచారం:
- Strong's: H319, H1004, H1121, H1323, H1755, H2232, H2233, H3205, H3211, H3318, H3409, H4294, H5220, H6849, H7611, H8435, G1074, G1085, G4690
వారసుడు
నిర్వచనం:
"వారసుడు" అంటే చనిపోయిన వ్యక్తికి చెందిన ఆస్థిని లేదా డబ్బును న్యాయబద్దంగా పొందేవాడు అని అర్థం.
- బైబిలు కాలములలో ముఖ్య వారసుడు మొదట పుట్టిన కుమారుడే లేదా జ్యేష్టుడే. అతడు తన తండ్రి డబ్బులోనూ, ఆస్థిలోనూ ఎక్కువభాగాన్ని పొందుతాడు.
- బైబిలు "వారసుడు" పదాన్ని ఆత్మీయ తండ్రి దేవుని నుండి ఆత్మీయ ప్రయోజనాలను పొందే క్రైస్తవుడిగా అలంకారికంగా కూడా ఉపయోగిస్తుంది.
- దేవుని పిల్లలుగా క్రైస్తవులు " యేసు క్రీస్తుతో ఉమ్మడి వారసులు" అని పిలువబడ్డారు. ఈ పదబంధం "సహ వారసులు" లేదా "తోటి వారసులు" లేదా "ఆయనతో కలిసి వారసులు" అని అనువదించబడవచ్చు.
- "వారసుడు" పదం "ప్రయోజనాలను పొందుకొనే వ్యక్తి" లేదా "తల్లిదండ్రులు గానీ లేదా ఇతర బంధువులు చనిపోయినతరువాత ఆస్థినీ, ఇతర వస్తువులను పొందుకొనే వాడు అనే అర్థాన్ని తెలియపరచేలా భాషలో వ్యక్తీకరించబడినదేనితోనైనా అనువదించబడవచ్చు.
(చూడండి: మొదట పుట్టిన, వారసత్వముగా పొందు)
బైబిలు రిఫరెన్సులు:
- గలతీ 04:1-2
- గలతీ 04:07
- ఆది. 15:01
- ఆది. 21:10-11
- లూకా 20:14
- మార్కు 12:07
- మత్తయి 21:38-39
పదం సమాచారం:
- Strong's: H1121, H3423, G2816, G2818, G2820, G4789
విందు
నిర్వచనం:
విందు అంటే భారీ ఎత్తున సాధారణంగా అనేక ఆహారం పదార్థాలతో మర్యాద పూర్వకంగా జరిగేది.
- ప్రాచీన కాలంలో రాజులు తరచుగా రాజకీయ నాయకులను, ఇతర ప్రాముఖ్యమైన అతిథులను వినోదింప జేయడానికి విందులు చేసే వారు.
- “మృష్టాన్న భోజనం” అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. లేక “ప్రాముఖ్యమైన ఉత్సవం ” లేక “తిండిబోతు భోజనం."
బైబిల్ రిఫరెన్సులు:
- దానియేలు 05:10
- యెషయా 05:11-12
- యిర్మీయా 16:7-9
- లూకా 05:29-32
- పరమ 02:3-4
పదం సమాచారం:
- Strong's: H3739, H4797, H4960, H4961, H8354, G1173, G1403
విల్లు, బాణాలు, విల్లంబులు
నిర్వచనం:
నారి కట్టిన విల్లు నుండి బాణాలు నుండి విసిరే ఆయుధం. బైబిల్ కాలాల్లో దీన్ని శత్రువులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలోగానీ, ఆహారానికై జంతువుల వేటలోగానీ ఉపయోగిస్తారు.
- విల్లును కట్టెతో గానీ, ఎముక, లోహం, లేక జింక కొమ్ములు వంటి ఇతర బలమైన పదార్థంతో చేస్తారు. అది వంగి ఉండి బిగుతుగా నారితో లాగి కట్టి ఉంటుంది.
- బాణం సన్నని చువ్వలాగా ఉండి. చివరన పదునైన ఇనప ములికి అమర్చి ఉంటుంది. ప్రాచీన కాలంలో, బాణాలు వెదురు, ఎముక, రాయి, లేక లోహంతో తయారు చేసే వారు.
- విల్లంబులను సాధారణంగా వేటగాళ్ళు, యోధులు ఉపయోగిస్తారు.
- బైబిల్లో "బాణం"అనే దాన్ని కొన్ని సార్లు శత్రువులను, లేక దైవ తీర్పును సూచించ డానికి అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు.
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 21:14-16
- హబక్కూకు 03:9-10
- యోబు 29:20-22
- విలాప 02:3-4
- కీర్తనలు 058:6-8
పదం సమాచారం:
- Strong's: H2671, H7198, G5115
విశ్రాంతి, విశ్రాంతినిచ్చును, విశ్రాంతి తీసికొనబడినది, విశ్రాంతి తీసికొనుట, విశ్రాంతి లేకపోవడం
నిర్వచనమ:
“విశ్రాంతి” అనే పదమునకు అక్షరార్థమేదనగా సేద తీర్చుకొనుటకు లేదా తిరిగి బలము పొందుకొను నిమిత్తము పనిచేయుటను నిలిపివేయుట అని అర్థము. “దేనినుండైన విశ్రాంతిపొందుట” అనే మాట దేనినుండైనా సడలించుకొని మిగిలియుండడమును సూచిస్తుంది. “విశ్రాంతి” అనగా పనిచేయుట నిలిపివేయుట అని అర్థము.
- ఒక వస్తువును ఎక్కడైనా “విశ్రాంతి తీసుకొనుట” అని కూడా చెప్పవచ్చును, ఈ మాటకు “నిలిచియుండుట” లేక అక్కడ “కూర్చునియుండుట” అని అర్థము.
- ఎక్కడైనా “విశ్రాంతి తీసుకొనుటకు” పడవ వచ్చుచున్నది, అనగా అక్కడ “నిలబడును” లేక “ఆగిపోవును” దాని అర్థము.
- మనుష్యులు లేక పశువులు విశ్రాంతి తీసుకొనునప్పుడు, అవి సేద తీర్చుకొనుటకు అక్కడ కూర్చునియుంటాయి లేదా పడుకొనియుంటాయి లేక వారు కూర్చుంటారు లేదా పడుకుంటారు.
- ఇశ్రాయేలీయులు వారములోని ఏడవ దినమున విశ్రాంతి తీసుకొనుమని దేవుడు ఆజ్ఞాపించాడు. పనిచేయని ఈ రోజును “సబ్బాతు” దినము అని పిలుస్తారు.
- దేనిమీదనైనా వస్తువుకు విశ్రాంతినివ్వాలంటే దానిని అక్కడ “పెట్టాలి” లేదా “నిలువబెట్టాలి” అని అర్థము.
అనువాద సలహాలు:
- సందర్భానుసారముగా, “(ఒకరు) విశ్రాంతి తీసుకొనుట” అనే మాటను “పనిచేయడం ఆపుము” లేక “తనకుతాను సేదదీర్చుకోవడం” లేక “భారములు మోయడము ఆపడం” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- దేనిమీదనైనా వస్తువుకు విశ్రాంతినివ్వడం అనే ఈ మాటను దేనిమీదనైనా ఆ వస్తువును “పెట్టడం” లేక “నిలువబెట్టడం” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “నేను మీకు విశ్రాంతినిచ్చెదను” అని యేసు చెప్పిన మాటను “మోసుకొనిపోవుచున్న మీ భారములను మోయకుండా ఆపునట్లు చేయుదును” లేక “మీరు సమాధానముగా ఉండునట్లు నేను సహాయము చేయుదును” లేక “నాయందు విశ్వాసముంచుటకు మరియు సేదదీరుటకు నేను మిమ్ములను బలపరతును” అని కూడా తర్జుమా చేయుదురు.
- “వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు” అని దేవుడు చెప్పియున్నాడు, మరియు ఈ మాటను “నేనిచ్చు విశ్రాంతి ఆశీర్వాదములను వారు అనుభవించరు” లేక “నాయందు విశ్వాసముంచుట ద్వారా వచ్చేటువంటి సంతోష సమాధానములను వారు అనుభవించరు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “విశ్రాంతి” అను పదమును “నిలిఛియున్నవి” లేక “ఇతర ప్రజలందరు” లేక “మిగిలిన ప్రతియొక్కటి” అని కూడా తర్జుమా చేయవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: శేషము, సబ్బాతు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 దిన.06:40-42
- ఆది.02:1-3
- యిర్మియా.06:16-19
- మత్తయి.11:28-30
- ప్రక.14:11-12
పదం సమాచారం:
- Strong's: H14, H1824, H1826, H2308, H3498, H3499, H4494, H4496, H4771, H5117, H5118, H5183, H5564, H6314, H7258, H7280, H7599, H7604, H7605, H7606, H7611, H7673, H7677, H7901, H7931, H7954, H8058, H8172, H8252, H8300, G372, G373, G425, G1515, G1879, G1954, G1981, G2270, G2663, G2664, G2681, G2838, G3062, G4520
విశ్వసనీయ, విశ్వాస్యత, అవిశ్వసనీయ, అవిశ్వాస్యత, నమ్మదగిన
నిర్వచనం:
దేవుని పట్ల "విశ్వసనీయంగా" ఉండడం అంటే దేవుని ఉపదేశాల ప్రకారం స్థిరంగా జీవించడం అని అర్థం. ఆయనకు విధేయత చూపడం ద్వారా సద్భక్తి కలిగి ఉండడం అని అర్థం. విశ్వసనీయంగా ఉండడంలోని స్థితి లేక షరతు "విశ్వాస్యత" గా ఉంటుంది.
- ఒక వ్యక్తి విశ్వసనీయంగా ఉండడం దేవుడు తన వాగ్దానం ఎప్పుడూ నిలబెట్టుకోడానికీ మరియు ఇతర ప్రజలకు ఎల్లప్పుడూ తన బాధ్యతలు నెరవేర్చడానికీ నమ్మదగిన వాడుగా ఉండడం.
- ఒక విశ్వసనీయ వ్యక్తి ఒక కర్తవ్యాన్ని అది పెద్దదీ మరియు కష్టమైనదీ అయినా దానిని చెయ్యడంలో పట్టుదలతో ఉంటాడు.
- దేవుని పట్ల విశ్వసనీయత అంటే దేవుడు మనలను చెయ్యమని కోరే దానిని స్థిరంగా చేస్తూ ఉండడం.
"అవిశ్వసనీయ" పదం అంటే దేవుడు వారికి అజ్ఞాపించిన వాటిని చెయ్యని ప్రజలను వర్ణిస్తుంది. అవిశ్వసనీయ స్థితి లేదా ఆచరణ "అవిశ్వాస్యత" గా ఉండడం అంటారు.
- ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను పూజించడం ఆరంభించినప్పుడు మరియు ఇతర విషయాలలో దేవునికి అవిధేయత చూపినప్పుడు వారు "అవిశ్వసనీయులు" అని పిలువబడ్డారు.
- దాంపత్యంలో వ్యభిచారం చేసిన వారు తన భార్యకు లేదా భర్తకు "అవిశ్వసనీయలు" గా ఉన్నారు.
- దేవుడు ఇశ్రాయేలీయుల అవిధేయ ప్రవర్తనను వర్ణించడానికి "అవిశ్వాస్యత" పదాన్ని ఉపయోగించాడు. వారు దేవునికి విధేయత చూపించడం లేదు లేదా ఆయన ఘనపరచడం లేదు.
అనువాదం సూచనలు:
- అనేక సందర్భాలలో, "విశ్వసనీయ" పదం "సద్భక్తితో ఉన్నవారు" లేదా "సమర్పించబడివారు" లేదా "ఆధారపడదగినవారు" అని అనువదించబడవచ్చు.
- ఇతర సందర్భాలలో, "విశ్వసనీయ" పదం "విశ్వసించడానికి కొనసాగడం" లేదా "విశ్వసించడంలోనూ మరియు దేవునికి విధ్వయత చూపడంలో పట్టుదల కలిగియుండడం" అని అర్థం ఇచ్చే పదంతో అనువదించబడవచ్చు.
- "విశ్వాస్యత" పదం "విశ్వసించడంలో పట్టుదల కలిగియుండడం" లేదా "సద్భక్తి" లేదా "ఆధారపడదగిన తత్వం" లేదా "దేవుణ్ణి విశ్వసించడం మరియు ఆయనకు విధేయత చూపించడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, "అవిశ్వసనీయ" పదం "విశ్వసనీయులు కాదు" లేదా "విశ్వాసం ఉంచనివారు" లేదా "సద్భక్తి లేనివారు" అని అనువదించబడవచ్చు.
- "అవిశ్వసనీయ" పదం "(దేవుని పట్ల) విశ్వాసనీయులు కానివారు" లేదా "అవిశ్వసనీయ ప్రజలు" లేదా "దేవునికి అవిధేయత చూపేవారు" లేదా "దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయు ప్రజలు" అని అనువదించబడవచ్చు.
- "అపనమ్మకత్వం" పదం "అవిధేయత" లేదా "విశ్వాస ద్రోహం" లేదా "విశ్వసించకపోవడం, విధేయత చూపించకపోవడం" అని అనువదించబడవచ్చు.
- కొన్ని భాషలలో, "అవిశ్వసనీయ" పదం "అపనమ్మకం" కొరకైన పదంతో సంబంధపరచబడి ఉంటుంది.
(చూడండి: వ్యభిచారం, విశ్వసించు, అవిధేయత చూపడం, విశ్వాసం, విశ్వసించు)
బైబిలు రిఫరెన్సులు:
- ఆది. 24:49
- లేవీ. 26:40
- సంఖ్యా. 12:07
- యెహోషువా 02:14
- న్యాయా. 02:16-17
- 1 సమూయేలు 02:09
- కీర్తనలు 012:01
- సామెతలు 11:12-13
- యెషయా 01:26
- యిర్మీయా 09:7-9
- హోషేయ 05:07
- లూకా 12:46
- లూకా 16:10
- కొలస్సీ 01:07
- 1 థెస్స. 05:24
- 3 యోహాను 01:05
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 08:05 చెరసాలలో సైతం యోసేపు దేవుని పట్ల విశ్వసనీయంగా కొనసాగాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
- 14:12 అయినప్పటికీ, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తన వాగ్దానం విషయంలో విశ్వసనీయంగా ఉన్నాడు.
- 15:13 దేవునికి విశ్వసనీయంగా ఉంటామని మరియు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రజలు దేవునికి వాగ్దానం చేశారు.
- 17:09 దావీదు న్యాయంతో మరియు విశ్వసనీయతతో అనేక సంవత్సరాలు యేలుబడి చేశాడు మరియు దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అయితే అతని జీవితం ఆఖరు భాగంలో దావీదు దేవునికి వ్యతిరేకంగా ఘోరమైన పాపం చేశాడు.
- 18:04 దేవుడు సొలోమోనుమీద కోపగించుకొన్నాడు మరియు సోలోమోను అవిశ్వాస్యతకు శిక్షగా సొలోమోను మరణం తరువాత ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోతుందని ఆయన వాగ్దానం చేశాడు.
- 35:12 " పెద్ద కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు. 'ఈ సంవత్సరాలు అన్నీ నీ కోసం విశ్వసనీయంగా పని చేశాను!"
- 49:17 అయితే దేవుడు విశ్వసనీయుడు మరియు నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు.
- 50:04 అంతము వరకూ నీవు నా పట్ల విశ్వసనీయంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు."
పదం సమాచారం:
- Strong's: H529, H530, H539, H540, H571, H898, H2181, H4603, H4604, H4820, G569, G571, G4103
వీణ, సితార, సితారాలు
నిర్వచనం:
వీణ, సితారాలు చిన్నవిగానూ, తీగెలతోనూ ఉండే సంగీత వాయిద్యాలు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలీయులు వినియోగించేవారు.
- సితార వాయిద్యం పిల్లనగ్రోవిలా ఉంటుంది, తెరచిన చట్రం మీదుగా మీటే తీగలు ఉంటాయి.
- సితార వాయిద్యం ఆధునిక శ్రవణ సంబంధ తంబుర (గిటార్) వలే ఉంటుంది, చెక్కతో చేసిన పెట్టె ఉండి దానికి వ్యాపించిన మెడ భాగం ఉంటుంది, దానిమీద మీటడానికి తీగెలు ఉంటాయి.
- వీణ లేక సితార మ్రోగించడంలో కొన్ని తీగెలను ఒక చేతి వ్రేళ్ళ కింద ఉంటాయి, మిగిలిన తీగెలను మరొక చేయి మీటుతుంది.
- వీణె, సితార, పిల్లనగ్రోవి వాయిద్యాలు తీగెలను మీటడం ద్వారా శబ్దం చేస్తాయి.
- తీగెల సంఖ్య వేరువేరుగా ఉంటుంది, అయితే పాతనిబంధన ప్రత్యేకించి పది తీగెలు ఉన్న వాయిద్యం గురించి ప్రస్తావించింది.
(చూడండి: వీణ)
బైబిలు రెఫరెన్సులు:
- 1 రాజులు 10:11-12
- 1 సమూయేలు 10:5-6
- 2 దినవృత్తాంతములు 05:11-12
పదం సమాచారం:
- Strong's: H3658, H5035, H5443
వీణ, వీణలు, వైణికుడు
నిర్వచనం:
వీణ అనేది తీగెలున్న సంగీత వాయిద్యం, సారణంగా పెద్ద ఫ్రేము ఉండి, నిలువునా తీగెలు అమర్చి ఉంటాయి.
- బైబిల్ కాలాల్లో, దేవదారు వృక్ష జాతి కలపను వీణలు ఇతర సంగీత వాయిద్యాలు చేయడానికి ఉపయోగిస్తారు.
- వీణలను తరచుగా చేతుల్లో ధరించి మాట్లాడుతూ వాయించేవారు.
- బైబిల్లో అనేక సార్లు వీణల ప్రస్తావన ఉంది. వీటిని దేవునికి స్తుతి, ఆరాధనకోసం వాడతారు.
- దావీదు రాసిన అనేక కీర్తనలు వీణపై సంగీతం కూర్చాడు.
- అతడు సౌలు రాజు కోసం అతడు దురాత్మ మూలంగా ఇబ్బంది పడుతుంటే వీణ వాయించాడు.
(చూడండి: దావీదు, దేవదారు వృక్ష జాతి, కీర్తన, సౌలు (పాతనిబంధన))
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 15:16-18
- ఆమోసు 05:23-24
- దానియేలు 03:3-5
- కీర్తనలు 033:1-3
- ప్రకటన 05:8
పదం సమాచారం:
- Strong's: H3658, H5035, H5059, H7030, G2788, G2789, G2790
వెండి
నిర్వచనము:
వెండి అనేది బూడిద రంగులో ఉండే మెరిసే విలువైన లోహము, దీనిని నాణ్యములను, నగలను, పాత్రలను మరియు ఆభరణములను చేయుటకు ఉపయోగించుదురు.
- తయారు చేయబడే అనేకమైన పాత్రలలో వెండి గిన్నెలు మరియు పాత్రలు కూడా ఉంటాయి, ఈ సామాగ్రిని వంట చేయుటకు, ఆహారము భుజించుటకు లేక వడ్డించుటకు ఉపయోగించబడును.
- వెండి మరియు బంగారు అనునవి దేవాలయమును మరియు గుడారమును నిర్మించుటలో ఉపయోగించబడినవి. యెరూషలేములోని దేవాలయములో వెండితో చేయబడిన పాత్రలు కలవు.
- పరిశుద్ధ గ్రంథములో షెకెలు అనేది బరువుగల వస్తువైయుండెను, మరియు కొనుగోలు అనేది అనేకమార్లు కొన్ని వెండి షెకెలులను ఇచ్చుట ద్వారా జరిగేది. క్రొత్త నిబంధన కాలములో షెకెలు కొలతలో కొలవబడిన అనేక విభిన్నమైన బరువులుగల వెండి నాణెములు ఉండేవి.
- యోసేపు అన్నలు తనను బానిసగా ఇరవై వెండి షెకెలులకు అమ్మివేసిరి.
- యేసుకు ద్రోహము చేసినందుకు యూదాకు ముప్పై వెండి నాణెములు చెల్లించిరి.
(ఈ పదములను కూడా చూడండి: ప్రత్యక్ష గుడారం, ఆలయం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 దిన.18:9-11
- 1 సమూ.02:36
- 2 రాజులు.25:13-15
- అపొ.కార్య.03:4-6
- మత్తయి.26:14-16
పదం సమాచారం:
- Strong's: H3701, H3702, H7192, G693, G694, G695, G696, G1406
వెలుగు, వెలుగులు, వెలుతురు, మెరుపు, పగటివెలుతురు, సంధ్యవెలుగు, విశదపరచడం(వెలుగు కలగడం), జ్ఞానం పొందడం
నిర్వచనం:
బైబిలులో “వెలుగు” పదానికి అనేక అలంకారిక ప్రయోగాలు ఉన్నాయి.
ఈ పదం తరుచుగా నీతి, పవిత్రత, సత్యం అనే పదాల కోసం ఉపమానాలంకారంగా ఉపయోగించబడింది.
- లోకానికి దేవుని సత్య సందేశాన్ని తాను తీసుకొని వచ్చానని చెప్పడానికీ, వారి పాప చీకటి నుండి వారిని విడిపించడానికి తాను వచ్చినట్లు చెప్పడానికీ ”నేను లోకానికి వెలుగు” అని యేసు చెప్పాడు.
- క్రైస్తవులు ”వెలుగులో నడవండి” అనే ఆజ్ఞను అను ఆజ్ఞను పొందారు. అంటే దుర్మార్గాన్ని విడిచి, దేవుడు కోరిన విధంగా జీవించాలని అర్థం.
- ”దేవుడు వెలుగు” ఆయనలో చీకటి ఎంతమాత్రమునూ లేదు అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు.
- వెలుగు, చీకటి పూర్తిగా పరస్పర వైరుధ్యాలు. చీకటి అంటే వెలుగు లేకపోవడం.
- ”లోకానికి వెలుగును” అని ప్రభువైన యేసు చెప్పాడు, దేవుడు ఎంత గొప్పవాడో స్పష్టంగా చూపించే మార్గంలో జీవించడం ద్వారా ఆయన అనుచరులు జ్యోతుల్లా ప్రకాశించాలి.
- ”వెలుగులో నడవడం” అంటే దేవుణ్ణి సంతోషపెట్టే మార్గంలో జీవించడం, మంచిదానినీ, సరియైనదానినీ చెయ్యడం. చీకటిలో నడవడం అంటే దేవునికి వ్యతిరేకంగా దుష్టక్రియలను చేస్తూ తిరుగుబాటులో జీవించడం,
అనువాదం సూచనలు:
- అనువాదం చేసేటప్పుడు, “వెలుగు” “చీకటి” అనే పదాలు రూపకాలంకారంగా వినియోగించబడినప్పటికీ వీటిని అక్షరార్ద పదాలను ఉంచడం ప్రాముఖ్యం.
- వచనభాగంలో ఉన్న పోలికను వివరించడం అవసరం. ఉదాహరణకు, “వెలుగు సంబంధులవలే నడుచుకొనుడి” అను వాక్యం ప్రకాశమైన సూర్యుని కాంతిలో ఒకరు నడచిన విధంగా “నీతి జీవితాలను నిష్కపటంగా జీవించండి” అని అనువదించవచ్చు.
- ”వెలుగు”ను అనువదించేటప్పుడు, దీపం వంటి వెలుగును ఇచ్చే వస్తువును సూచించేదిగా ఉండకూడదు. ఈ పదం అనువాదం దాని వెలుగును సూచించాలి.
(చూడండి: చీకటి, పవిత్రత (పరిశుద్ధత), నీతిగల, సత్యమైన)
బైబిలు రెఫరెన్సులు:
- 1 యోహాను 01:5-7
- 1 యోహాను 02:7-8
- 2 కొరింథి 04:5-6
- అపొస్తలులకార్యములు 26:15-18
- యెషయా 02:5-6
- యోహాను 01:4-5
- మత్తయి 06:22-24
- మత్తయి 06:22-24
- నెహెమ్యా 09:12-13
- ప్రకటన 18:23-24
పదం సమాచారం:
- Strong's: H216, H217, H3313, H3974, H4237, H5051, H5094, H5105, H5216, H6348, H7052, H7837, G681, G796, G1645, G2985, G3088, G5338, G5457, G5458, G5460, G5462
వేణువు, వేణువులు, గొట్టం వాయిద్యాలు
నిర్వచనం:
బైబిల్ కాలాల్లో, గొట్టం వాయిద్యాలు అనేవి ఎముకతో, కలపతో తయారు చేసే సంగీత వాయిద్యాలు. వాటికీ కన్నాలు ఉండి ఊదినప్పుడు శ్రావ్యమైన శబ్దం వస్తుంది. వేణువు ఒక రకమైన గొట్టం వాయిద్యం.
- గొట్టం వాయిద్యాలు ఒక రకమైన మందం గల గొట్టాలతో తయారై గాలి ఊదినప్పుడు కంపించడం మూలంగా సంగీతం పుడుతుంది.
- గొట్టం వాయిద్యం వేరే అమరికలు లేక పొతే అది "వేణువు."
- కాపరి గొట్టం వాయిద్యంతో తన గొర్రె మందలను ఊరుకోబెడతాడు.
- గొట్టం వాయిద్యాలను వేణువులను ఆనంద, దుఃఖ సమయాల్లో సంగీతం వాయించడానికి ఉపయోగిస్తారు.
(చూడండి: మంద, కాపరి)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 14:7-9
- 1 రాజులు 01:38-40
- దానియేలు 03:3-5
- లూకా 07:31-32
- మత్తయి 09:23-24
- మత్తయి 11:16-17
పదం సమాచారం:
- Strong's: H4953, H5748, H2485, H2490, G832, G834, G836
వేదన, వేదనలు, పీడించు, పీడకులు
వాస్తవాలు:
"వేదన" అంటే భయంకర హింసలు. ఎవరినైనా పీడించడం అంటే ఆ వ్యక్తి , తరచుగా క్రూరమైన బాధలు పడేలా చేయడం.
- కొన్ని సార్లు "వేదన" అనేది శారీరిక నొప్పి, హింసలు సూచిస్తున్నది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథంలో "మృగం" ఆరాధకులకు అంత్య కాలంలో కలిగే శారీరిక వేదన వర్ణించడం ఉంది.
- హింసలు అంటే ఆత్మ సంబంధమైన , లేక యోబు అనుభవించిన మానసిక బాధ
- అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథంలో యేసును వారి రక్షకుడుగా విశ్వసించని వారు అగ్ని సరస్సులో నిత్యమైన వేదన అనుభవిస్తారు అని రాశాడు.
- ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భయంకర హింసలు” లేక “ఎవరినైనా బాధల పాలు చెయ్యడం” లేక “యాతన." కొందరు అనువాదకులు "భౌతిక” లేక “ఆత్మ సంబంధమైన" అనే పదాలను ఈ అర్థం మరింత స్పష్టం కావడం కోసం వాడవచ్చు.
(చూడండి: మృగం, నిత్యత్వం, యోబు, రక్షకుడు, ఆత్మ, బాధపడు, ఆరాధన)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 పేతురు 02:7-9
- యిర్మీయా 30:20-22
- విలాప 01:11-12
- లూకా 08:28-29
- ప్రకటన 11:10-12
పదం సమాచారం:
- Strong's: H3013, G928, G929, G930, G931, G2558, G2851, G3600
వేశ్య, వ్యభిచరించబడెను, వేశ్యలు, వ్యభిచారి, వ్యభిచరించుట
నిర్వచనము:
“వేశ్య” మరియు “వ్యభిచారి” అనే ఈ రెండు పదములు భక్తి సంబంధమైన ఆచారములకొరకు లేక డబ్భు కొరకు లైంగిక కార్యములను జరిగించే ఒక వ్యక్తిని సూచిస్తాయి.
వ్యభిచారులు లేక వేశ్యలు సహజముగా ఆడవారే ఉంటారు, కొంతమంది మాత్రమె మగవారుంటారు.
- పరిశుద్ధ గ్రంథములో “వేశ్య” అనే పదము కొన్నిమార్లు అబద్ధపు దేవుళ్ళను ఆరాధించువారిని లేక మంత్రవిద్యలను అనుసరించువారిని సూచించుటకు అలంకారికముగా వాడబడియున్నది.
- “వేశ్యవలె నడుచుకో” అనే ఈ మాటకు అనైతిక లైంగిక కార్యాలను జరిగించే ఒక వేశ్యవలె ప్రవర్తించుట అని అర్థము. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో విగ్రహములకు ఆరాధన చేసే ఒక వ్యక్తిని సూచించుటకు కూడా వాడబడింది.
- దేనికో ఒకదానికి “తనను తాను వేశ్యగా చేసికొనుట” అనే మాటకు అనైతిక లైంగికతను కలిగియుండుట లేక ఇది అలంకారముగా చెప్పినప్పుడు, తప్పుడు దేవుళ్ళను ఆరాధించుట ద్వారా నిజ దేవునికి అపనమ్మకస్తులుగా ఉండుట అని అర్థము.
- పురాతన కాలములో కొన్ని అన్య దేవాలయములు వారి ఆచార సంప్రదాయములలో భాగముగా స్త్రీ పురుష వ్యభిచారులను ఉపయోగించేవారు.
- ఈ పదమును వేశ్యను సూచించుటకు అనువాద భాషలో ఉపయోగించే పదమును లేక మాటను ఉపయోగించి అనువాదము చేయవచ్చును. కొన్ని భాషలు ఈ పదము కొరకు బహుశః సభ్యోక్తి పదమును ఉపయోగించుదురు.
(ఈ పదములను కూడా చూడండి: వ్యభిచారం, దేవుడు, లైంగిక అవినీతి, దేవుడు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.34:30-31
- ఆది.38:21-23
- లూకా.15:28-30
- మత్తయి.21:31-32
పదం సమాచారం:
- Strong's: H2154, H2181, H2183, H2185, H6945, H6948, H8457, G4204
శక్తి, శక్తిగల, శక్తివంతంగా
నిర్వచనం:
"శక్తి" పదం కార్యాలను చెయ్యగలిగే లేదా జరిగేలా చూసే సామర్ధ్యాన్ని సూచిస్తుంది. తరచుగా గొప్ప బలాన్ని సూచిస్తుంది. "శక్తులు" కార్యాలను జరిగేలా చేసే సామర్ధ్యం కలిగిన మనుష్యులను లేదా ఆత్మలను సూచిస్తుంది.
- "దేవుని శక్తి" పదం సమస్తాన్ని చెయ్యగల దేవుని శక్తిని సూచిస్తుంది, ప్రత్యేకించి మనుష్యులకు చెయ్యడానికి సాధ్యం కాని కార్యాలను చెయ్యగల దేవుని శక్తిని సూచిస్తుంది.
- దేవుడు తాను చేసిన సమస్తం మీదా సంపూర్ణ శక్తిని కలిగియున్నాడు.
- దేవుడు తాను కోరుకున్న దానిని చెయ్యడానికి తన ప్రజలకు శక్తిని ఇస్తాడు, తద్వారా వారు ప్రజలను స్వస్థపరుస్తారు లేదా ఇతర ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు, దేవుని శక్తి ద్వారా వారు వీటిని చేస్తారు.
- యేసూ, పరిశుద్దాత్మడూ దేవుడు కనుక వారు కూడా ఈ శక్తినే కలిగియున్నారు.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి "శక్తి" పదం "సామర్ధ్యం" లేదా "బలం" లేదా "సమర్ధత" లేదా అద్భుతాలు చేయడానికి శక్తి" లేదా "నియంత్రణ" అని అనువదించబడవచ్చు.
- "శక్తులు" పదం "శక్తివంతమైన జీవులు" లేదా ఇతరులను నియంత్రించు వారు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
(చూడండి: పరిశుద్ధాత్మ, యేసు, అద్భుతం)
బైబిలు రిఫరెన్సులు:
- 1 థెస్స. 01:05
- కొలస్సీ 01:11-12
- ఆది 31:29
- యిర్మియా 18:21
- యూదా 01:25
- న్యాయాధిపతులు 02:18
- లూకా 01:17
- లూకా 04:14
- మత్తయి 26:64
- ఫిలిప్పీ 03:21
- కీర్తన 080:02
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- 22:05 దూత వివరించాడు, "పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, దేవుని శక్తి నీ మీదకు వచ్చును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు.
- 26:01 సాతాను శోధనలను జయించినతరువాత, యేసు పరిశుద్ధాత్మ శక్తి నిండుకొనినవాడై గలిలయ ప్రాంతాలకు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన నివాసం చేశాడు.
- 32:15 వెంటనే శక్తి ఆయనలోనుండి వెళ్ళిపోవడం ఆయన గుర్తించాడు.
- 42:11 మృతులలోనుండి ఆయన లేచిన తరువాత నలుబది రోజులకు ఆయన తన శిష్యులతో "పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిన తరువాత తండ్రి మీకు శక్తి ని అనుగ్రహించేంతవరకూ మీరు యెరూషలేములో నిలిచియుండండి" అని చెప్పాడు.
- 43:06 “ఇశ్రాయేలు మనుష్యులారా, మీరు చూచినవిధంగానూ, మీకు తెలిసిన విధముగానూ యేసు దేవుని శక్తి చేత గొప్ప సూచకక్రియలనూ, అనేక అద్భుతాలనూ జరిగించిన వాడు.
- 44:08 పేతురు జవాబిచ్చాడు, "మీ ముందు నిలబడిన ఈ మనిషి యేసు క్రీస్తు శక్తి చేత స్వస్థపరచబడ్డాడు.
పదం సమాచారం:
- Strong's: H410, H1369, H2220, H2428, H2429, H2632, H3027, H3028, H3581, H4475, H4910, H5794, H5797, H5808, H6184, H7786, H7980, H7981, H7983, H7989, H8280, H8592, H8633, G1411, G1415, G1756, G1849, G1850, G2478, G2479, G2904, G3168
శపథం, శపథాలు, ప్రమాణం(ఒట్టు), ప్రమాణాలు, ఒట్టుపెట్టుకోవడం, చేత ప్రమాణం, చేత ప్రమాణాలు
నిర్వచనం
బైబిలులో శపథం అంటే ఏదైనా చెయ్యడానికి ఇచ్చే క్రమబద్దమైన వాగ్దానం. శపథం చేసే వ్యక్తి తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సి ఉంది. శపథంలో నమ్మకంగా, యదార్ధంగా ఉండడానికి సమర్పణ ఉంది.
- న్యాయ సభలో, ఒక సాక్షి తరుచుగా తాను చెప్పే ప్రతీది సత్యమైనదిగానూ, వాస్తవమైనదిగానూ ఉంటుందని వాగ్దానం ఇవ్వడానికి ప్రమాణం చేస్తాడు.
- బైబిలులో “ప్రమాణం” అంటే ఒక శపధం చెప్పడమే.
- ”చేత ప్రమాణం” అంటే, ఒక వస్తువునైనా లేదా ఒక వ్యక్తినైనా ఆధారంగా లేక శక్తిగా తీసుకొని శపథం చెయ్యడం.
- కొన్నిసార్లు ఈ పదాలను కలిపి “శాపధాన్ని ప్రమాణం చెయ్యి” అని వినియోగిస్తారు.
- అబ్రాహాము, అబిమెలేకు ఒక బావిని ఉపయోగించడం గురించి కలిసి ఓక నిబంధన చేసేటప్పుడు ఒక శాపధాన్ని ప్రమాణం చేసారు,
- ఇస్సాకుకు భార్యను వెదకడానికి తన బంధువుల మధ్య నుండే చూడాలని అబ్రహాము తన సేవకుడిని శపథం (లాంఛనంగా ‘వాగ్దానం’) చెయ్యమని చెప్పాడు.
- దేవుడు కూడా శపధాలు చేసాడు, వాటిలో తన ప్రజలకు వాగ్దానాలను చేసాడు.
- ఆధునిక కాలంలో “శపథం” అంటే “మాలిన బాషను వినియోగించడం.” బైబిల్లో దీని అర్థం ఇది కాదు.
అనువాదం సూచనలు:
- సందర్భాన్ని బట్టి, “ఒక శపధం” అనే పదం “ఒక ప్రతిజ్ఞ” లేక “ఒక గంభీరమైన వాగ్దానం” అని అనువదించవచ్చు.
- ”ప్రమాణం” అనే పదాన్ని “లాంచనప్రాయంగా వాగ్దానం” లేక “ప్రతిజ్ఞ” లేక “ఏదైనా చెయ్యడానికి సమర్పణ” అని అనువాదం చెయ్యవచ్చు. “నా నామంలో ప్రమాణం చెయ్యడం” అనే మాటని “స్థిరపరచడానికి నా పేరును వినియోగిస్తూ ఒక వాగ్దానం చెయ్యడం” అని అనువాదం చెయ్యవచ్చు.
- ”ఆకాశం, భూమి పేరున ప్రమాణం” అనే మాటను “ఏదైనా చెయ్యడానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఆకాశం, భూమి స్థిరపరుస్తున్నాయి అని చెప్పడం” అని అనువదించవచ్చు.
- ”ప్రమాణం” లేక “శపథం” పదములు అర్థం శపించడం అనే అర్థం ఇచ్చేలా ఉండకుండా చూసుకోవాలి. బైబిలులో అటువంటి అర్థం లేదు.
(చూడండి: అబీమెలెకు, నిబంధన, మ్రొక్కుబడి)
బైబిలు రిఫరెన్సులు
- ఆదికాండం 21:22-24
- ఆదికాండం 24:1-4
- ఆదికాండం 31:51-53
- ఆదికాండం 47:29-32
- లూకా 01:72-75
- మార్కు 06:26-29
- మత్తయి 05:36-37
- మత్తయి 14:6-7
- మత్తయి 26:71-72
పదం సమాచారం:
- Strong's: H422, H423, H3027, H5375, H7621, H7650, G332, G3660, G3727, G3728
శరీరం, శరీరాలు
నిర్వచనం:
ఈ పదం “శరీరం” అక్షరాలా ఒక వ్యక్తి లేక జంతువు భౌతిక శరీరాన్ని సూచిస్తున్నది. ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. ఇంగ్లీషులో బృందం అనే అర్థం వస్తుంది.
- తరచుగా ”శరీరం” అనే ఈ పదం మనిషి, లేక జంతువు శవాన్ని సూచిస్తున్నది. కొన్ని సార్లు "మృత దేహం" లేక "శవం"అనే అర్థం ఇస్తుంది.
- యేసు శిష్యులకు తన చివరి పస్కా భోజనం సమయంలో చెప్పాడు, " (రొట్టె) నా శరీరం,"ఇది వారి పాపాల వెల చెల్లించడానికి విరిగిపోనున్న (మరణించ బోతున్న) తన భౌతిక శరీరం."
- బైబిల్లో, క్రీస్తు శరీరం అయిన క్రైస్తవుల సమూహాన్ని ఇది సూచిస్తుంది.
- భౌతిక శరీరానికి అనేక భాగాలు ఉన్నాయి. అలానే "క్రీస్తు శరీరం"లో అనేకమంది వ్యక్తిగతంగా సభ్యులు ఉన్నారు.
- వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి ప్రత్యేకంగా క్రీస్తు శరీరంలో విధులు ఉంటాయి. సమూహం సహాయంతో కలిసి పని చేసి దేవునికి మహిమ కలిగేలా ఆయన్ను సేవించాలి.
- యేసు “శరీరానికి, అంటే తన విశ్వాసులకు శిరస్సు" (నాయకుడు). శిరస్సు తన శరీరానికి ఆజ్ఞలు ఇచ్చినట్టే యేసు తన "శరీరంలో అవయవాలు"అయిన క్రైస్తవులకు మార్గ దర్శకత్వం చేసి నడిపిస్తాడు.
అనువాదం సలహాలు:
- ఈ పదాన్ని అనువదించడం లో అతి శ్రేష్టమైన మార్గం లక్ష్య భాషలో భౌతికశరీరం ఉపమానం ఉపయోగించడమే. ఈ పదం అభ్యంతరకరమైన పదం కాకుండా జాగ్రత్త పడండి.
- మొత్తంగా విశ్వాసులను ఉద్దేశించి రాసేటప్పుడు కొన్ని భాషల్లో "ఆత్మ సంబంధమైన క్రీస్తు శరీరం"అని రాయడం మరింత సహజంగా సవ్యంగా ఉంటుంది.
- యేసు "నా శరీరం,"అన్నప్పుడు దీన్ని అక్షరాలా అనువదించడం, అవసరమైతే ఒక నోట్ సాయంతో వివరించడం మంచిది.
- కొన్ని భాషల్లో మృత దేహాన్ని సూచించడానికి “శవం” వంటి వేరే పదం ఉండవచ్చు. కాబట్టి ఆమోదయోగ్యమైన, అర్థ వంతమైన పదం ఉపయోగించడం మంచిది.
(చూడండి: శిరస్సు, ఆత్మ)
బైబిల్ రిఫరెన్సులు:
- 1దిన 10:11-12
- 1కొరింతి 05:3-5
- ఎఫెసి 04:4-6
- న్యాయాధి 14:7-9
- సంఖ్యా 06:6-8
- కీర్తనలు 031:8-9
- రోమా 12:4-5
పదం సమాచారం:
- Strong's: H990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, H7607, G4430, G4954, G4983, G5559
శరీరం
నిర్వచనం:
బైబిల్లో, "శరీరం" అంటే అక్షరాలా మెత్తని కణజాలంతో ఉండే మానవ లేక జంతు భౌతికశరీరం.
- బైబిల్ "శరీరం" అనే దాన్ని అలంకారికంగా కూడా అందరు మానవులను, లేక ప్రాణులను చెప్పడానికి ఉపయోగించింది.
- కొత్త నిబంధనలో, "శరీరం" అనే మాటను మానవుల పాపపూరితమైన స్వభావం గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. వారి ఆత్మ సంబంధమైన స్వభావానికి భిన్నమైన అంశాన్ని చెప్పడానికి ఈ మాటను తరచుగా ఉపయోగిస్తారు.
- "స్వంత రక్తమాంసాలు" అనే మాటను ఎవరైనా శారీరికంగా మరొకవ్యక్తితో బంధుత్వం ఉన్న, అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, మనవలు మెదలైన వారిని సూచించడానికి ఉపయోగిస్తారు.
- "రక్తమాంసాలు" అనే దాన్ని ఒక వ్యక్తి పూర్వీకులు, లేక సంతానం అని తర్జుమా చెయ్యవచ్చు.
- "ఒక శరీరం" అనే మాట శారీరికంగా ఒక పురుషుడు, స్త్రీ వివాహం ద్వారా కలవడాన్ని సూచించడానికి కూడా వాడతారు.
అనువాదం సలహాలు:
- జంతువుల శరీరం చెప్పిన సందర్భంలో "శరీరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ”శరీరం” లేక “చర్మం” లేక “మాంసం."
- సాధారణంగా ప్రాణులు అందరికీ కలిపి ఉపయోగించినప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "జీవులు” లేక “ప్రాణమున్న ప్రతిదీ."
- సాధారణంగా ప్రజలు అందరి గురించీ చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలు” లేక “మానవులు” లేక “జీవిస్తున్న ప్రతి ఒక్కరూ."
- "రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "బంధువులు” లేక “కుటుంబం” లేక “చుట్టాలు” లేక “కుటుంబం తెగ." కొన్ని సందర్భాల్లో ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పూర్వీకులు” లేక “సంతానం."
- కొన్ని భాషల్లో ఈ మాట ఒకే విధమైన అర్థం ఉండవచ్చు "రక్తమాంసాలు."
- "ఒకే శరీరం అవుతారు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "లైంగికంగా ఏకం కావడం” లేక “ఏక శరీరం ” లేక “శరీరంలో ఆత్మలో ఏకం కావడం." ఈ మాట అనువాదం మీ భాష, సంస్కృతిలో అంగీకారయోగ్యంగా ఉందో లేదో చూసుకోండి.
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 02:15-17
- 2 యోహాను 01:7-8
- ఎఫెసి 06:12-13
- గలతి 01:15-17
- ఆది 02:24-25
- యోహాను 01:14-15
- మత్తయి 16:17-18
- రోమా 08:6-8
పదం సమాచారం:
- Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561
శాపం, శపించి, శాపాలు, శపించడం
నిర్వచనం:
ఈ పదం "శాపం" అంటే ఒక వ్యక్తికి ఏదైనా హాని జరిగేలా పలకడం.
- శాపం అంటే ఎవరికైనా, దేనికైనా హాని తలపెట్టడం.
- ఎవరినైనా శపించడం అనే మాట వారికి హాని జరగాలని కోరుకోవడం.
- అది శిక్ష లేక ఇతర హానికరం అయినవి ఎవరికైనా జరగాలని పలకడం.
అనువాదం సలహాలు:
- ఈ పదాన్నిఅనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"హాని కలిగించడం” లేక “కీడు జరిగేలా ప్రకటించు” లేక “చెడు సంభవించేలా శాపం పెట్టడం."
- దేవుడు తనకు అవిధేయులైన ప్రజలపై శాపాలు పంపించే సందర్భంలో ఇలా అనువదించ వచ్చు, "హాని సంభవించడానికి అనుమతి ఇచ్చి శిక్షించు."
- ఈ పదం "శపించి" అనేదాన్ని ఇలా అనువదించ వచ్చు, "(వ్యక్తి) ఎక్కువ ఇబ్బంది పడేలా చెయ్యడం."
- పద బంధం “శపితుడు" ను ఇలా అనువదించ వచ్చు, "ఒక వ్యక్తి గొప్ప దురవస్థలు అనుభవించేలా."
- పద బంధం, "నేలను శపించి" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, " నేల సారవంతంగా ఉండదు."
- "నేను పుట్టిన దినాన్ని శపించి" అనే దాన్ని అని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నేనెంత దురవస్థలో ఉన్నానంటే నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది."
- అయితే, లక్ష్య భాషలో "శపితుడు" అనే అర్థం ఇచ్చే పదం ఉంటే దాన్ని వాడడం మంచిది.
(చూడండి: ఆశీర్వదించు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 సమూయేలు 14:24-26
- 2 పేతురు 02:12-14
- గలతి 03:10-12
- గలతి 03:13-14
- ఆది 03:14-15
- ఆది 03:17-19
- యాకోబు 03:9-10
- సంఖ్యా 22:5-6
- కీర్తనలు 109:28-29
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 02:09 దేవుడు సర్పంతో చెప్పాడు, "నీవు శాపానికి గురి అయ్యావు!"
- 02:11 "ఇప్పుడు నేల శపించబడింది. నీవు ఆహారం కోసం నీవు కష్టపడాలి."
- 04:04 "నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. నిన్ను శపించే వారిని శపిస్తాను."
- 39:07 తరువాత పేతురు ఒట్టు పెట్టుకుని ఆ మనిషిని నేనెరిగి ఉంటే దేవుడు నాకు శాపం పెట్టు గాక."
- 50:16 ఆదాము, హవ్వలు లోబడలేదు గనక పాపం లోకంలోకి ప్రవేశించింది. దేవుడు లోకాన్ని శపించి దాన్ని నాశనం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.
పదం సమాచారం:
- Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035
శారా, శారాయి
వాస్తవాలు:
- శారా అబ్రహాము భార్యయైయుండెను.
- ఆమె నిజమైన పేరు “శారాయి” అయ్యుండెను, కాని దేవుడు దానిని “శారా”గా మార్చివేశాడు.
- దేవుడు అబ్రహాముకు మరియు శారాకు వాగ్ధానము చేసిన కుమారున్ని అనగా ఇస్సాకుకు శారా జన్మనిచ్చెను.
(ఈ పదములను కూడా చూడండి: అబ్రాహాము, ఇస్సాకు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.11:29-30
- ఆది.11:31-32
- ఆది.17:15-16
- ఆది.25:9-11
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహారణలు:
- 05:01 “అబ్రహాము భార్యయైన “శారాయి”, “నేను పిల్లలను కనకుండ దేవుడు చేసినందున, నేనిప్పుడు ఈ వృద్ధాప్యములో పిల్లలను కనలేను, ఇక్కడ నా దాసీ హాగారు ఉంది, ఆమెను పెల్లిచేసికొని పిల్లలను కనుము” అని అతనితో చెప్పెను.
- 05:04 “నీ భార్య శారాయి ఒక మగ బిడ్డను కనును, అతనే వాగ్ధాన పుత్రుగా ఎంచబడును.”
- 05:04 “దేవుడు కూడా శారాయి పేరును శారా గా మార్చివేశాడు, ఈ పేరుకు “రాజకుమారి” అని అర్థము.
- 05:05 “ఒక సంవత్సరమైన తరువాత, అబ్రహాము 100 సంవత్సరముల వృద్ధుడైనప్పుడు శారా 90 సంవత్సరముగల వయస్సుగలదై, అబ్రహాము కుమారునికి జన్మనిచ్చెను. దేవుడు వారికి చెప్పినట్లుగా వారు తనకి ఇసాకు అని పేరు పెట్టిరి.
పదం సమాచారం:
- Strong's: H8283, H8297, G4564
శుద్ధమైన, కడుగు
నిర్వచనం:
"శుద్ధమైన" పదం సాధారణంగా ఒకని నుండి/ఒకదాని నుండి మురికిని గానీ లేదా మరకలను తొలగించడం లేదా మొదటి స్థానంలో ఎటువంటి మురికి లేదా మరక లేకుండా ఉండడం అని సూచిస్తుంది. "కడుగు" పదం ప్రత్యేకంగా ఒకరి నుండి/ఒకదాని నుండి మురికినీ లేదా మరకనూ తొలగించే చర్యను సూచిస్తుంది.
- "శుద్ధపరచు" అంటే దేనినైనా "శుద్ధి"గా చెయ్యడం. ఇది "కడుగు” లేదా “పవిత్రపరచు" అని కూడా అనువదించబడవచ్చు.
- పాత నిబంధనలో, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆచార పరమైన " శుద్ధజంతువులు" ఏమిటో “అశుద్ధ" జంతువులు ఏమిటో చెప్పాడు. శుద్ధ జంతువులు మాత్రమే ఆహారానికీ, లేదా బలి ఇవ్వడానికీ అనుమతించబడతాయి. ఈ సందర్భంలో "శుద్ధిచెయ్యడం" పదం దేవునికి బలిగా ఉపయోగించడం కోసం జంతువు అనుమతించబడిందని అర్థం.
- నిర్దిష్ట చర్మ రోగాలు ఉన్న వ్యక్తి అది ఇక అంటువ్యాధిగా ఉండకుండా స్వస్థత పొందేంత వరకూ ఆశుద్ధుడిగానే ఉంటాడు. ఆ వ్యక్తి తిరిగి "శుద్ధుడు"గా ప్రకటించబడడం కోసం చర్మం శుద్ధి కోసం సూచనలకు విధేయత చూపించాలి.
- కొన్నిసార్లు "శుద్ధ" అనే పదం నైతిక శుద్ధిని సూచిస్తూ అలంకారికంగా ఉపయోగించబడుతుంది. అంటే పాపం నుండి "శుద్ధి" కావడం అని అర్థం.
బైబిలులో "అశుద్ధం" పదం ప్రజలు తాకడానికీ. తినడానికీ, బలి అర్పించడానికీ పనికిరానివని దేవుడు ప్రకటించిన వాటిని అలంకారికంగా సూచిస్తుంది.
- దేవుడు "శుద్ధమైన" జంతువులను గురించీ, "ఆశుద్ధమైన" జంతువులను గురించీ ఇశ్రాయేలీయులకు సూచనలు ఇచ్చాడు. అశుద్ధమైన జంతువులు తినడానికి గానీ లేదా బలి అర్పించడానికి గానీ ఉపయోగించడానికి అనుమతించబడవు.
- కొన్ని నిర్దిష్ట చర్మ రోగాలు ఉన్న ప్రజలు స్వస్థత పొందేంత వరకూ "అశుద్ధులు" గా ఉంటారు.
- ఇశ్రాయేలీయులు అశుద్ధమైన దానిని ఏదైనా తాకినట్లయితే వారు కొంత కాలంపాటు ఆశుద్దులుగా యెంచబడతారు.
- అశుద్ధమైన వాటిని ముట్టుకోవడం, లేదా తినడం గురించి దేవుని ఆజ్ఞలకు లోబడడం ఇశ్రాయేలీయులను దేవుని సేవకై ప్రత్యేక పరుస్తుంది.
- శారీరక, ఆచార పరమైన అశుద్ధత నైతిక అశుద్ధతకు సంకేతంగా ఉంది.
- "అశుద్ధమైన ఆత్మ" మరొక భాషా రూపంలో ఒక దురాత్మను సూచిస్తుంది.
అనువాదం సలహాలు:
- ఈ పదం "శుద్ధమైన" లేదా "పవిత్రమైన" (మురికిగా ఉండకుండా ఉండడం భావంలో) కోసం సాధారణంగా ఉపయోగించే పదాలతో అనువదించబడవచ్చు.
- "ఆచారపరంగా శుద్ధిగా ఉండడం" లేదా "దేవునికి అంగీకారంగా ఉండడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- "శుద్ధీకరణ" ను "కడగడం" లేదా "పవిత్రపరచడం" అనువదించ వచ్చు.
-
"శుద్ధి," "శుద్ధి చెయ్యడం" కోసం ఉపయోగించే పదాలు అలంకారిక భావంలో కూడా అర్థం అయ్యేలా చూడండి.
-
"అశుద్ధం" పదం "శుద్ధంగా లేకపోవడం" లేదా "దేవుని దృష్టిలో పనికిరానిది" లేదా ""శారీరకంగా అశుద్ధమైనది" లేదా "మలినమైనది" అని అనువదించబడవచ్చు.
- ఒక దయ్యాన్ని ఆశుద్ధమైన ఆత్మగా సూచిస్తున్నప్పుడు "అశుద్ధం" పదం "దుష్టమైనది" లేదా "అపవిత్రమైనది" అని అనువదించబడవచ్చు.
- ఈ పదం అనువాదం ఆత్మ సంబంధమైన అశుద్ధత అర్దాన్ని అనుమతించాలి. తాకడానికీ, తినడానికీ, లేదా బలిఅర్పించడానికీ పనికిరానివిగా దేవుడు ప్రకటించిన దేనినైనా ఇది సూచించగలిగియుండాలి.
(చూడండి: మైల, దయ్యం, పరిశుద్ధమైన, బలియాగము)
బైబిలు రిఫరెన్సులు:
- ఆది. 07:02
- ఆది. 07:08
- ద్వితీ. 12:15
- కీర్తనలు 051:07
- సామెతలు 20:30
- యెహెజ్కేలు 24:13
- మత్తయి 23:27
- లూకా 05:13
- అపొ. కా. 08:07
- అపొ. కా. 10:27-29
- కొలస్సీ 03:05
- 1 థెస్స. 04:07
- యాకోబు 04:08
పదం సమాచారం:
- Strong's: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G167, G169, G2511, G2512, G2513, G2839, G2840, G3394, G3689
శుద్ధమైన, శుద్ధపరచు, శుద్ధీకరణ
నిర్వచనం:
“శుద్ధమైన" అంటే ఎటువంటి పొరపాటు లేకుండా ఉండడం, లేదా ఉండకూడనిదేదీ కలుపబడకుండా ఉండడం అని అర్థం. ఒక దానిని శుద్దీకరించడం అంటే దానిని మలినపరచేదానిని గానీ లేదా కలుషితం చేసేదానిని గానీ తొలగించడం అని అర్థం.
- పాతనిబంధన ధర్మాలకు సంబంధించి "శుద్ధి పరచు" మరియు "శుద్దీకరణ" పదాలు ఒక వస్తువు లేదా వ్యక్తిని వ్యాధి, శరీర ద్రవాలు లేదా శిశు జననం లాంటి వాటి వలన ఆచారపరమైన అపరిశుభ్ర పరచబడినప్పుడు వాటినుండి శుభ్రపరచడాన్ని ప్రధానంగా సూచిస్తుంది.
- ప్రజలు పాపము నుండి సాధారణంగా జంతు బలి ద్వారా శుద్ధి చెయ్యబడడం గురించి చెప్పే ధర్మాలు పాతనిబంధనలో ఉన్నాయి. ఈ కార్యాలు కేవలం తాత్కాలికమైనవీ, బలులు తిరిగి తిరిగి పునరావృతం చెయ్యవలసి వచ్చేది.
- క్రొత్త నిబంధనలో శుద్ధి చెయ్యబడడం అంటే తరచుగా పాపం నుండి శుద్ధి చెయ్యడడం అని సూచిస్తుంది.
- మనుష్యులు, యేసునూ, ఆయన బలియాగాన్నీ విశ్వసించడం ద్వారా పశ్చాత్తాపపడడం, దేవుని క్షమాపణను పొందుకోవడం ద్వారా మాత్రమే పాపం నుండి సంపూర్తిగానూ, శాశ్వతంగానూ శుద్ధి చెయ్యబడతారు.
అనువాదం సూచనలు:
- “శుద్దిపరచు" పదం "శుద్ధి చెయ్యి" లేదా శుభ్రపరచు" లేదా "సమస్త మలినం నుండి శుభ్రపరచడం" లేదా "సమస్త పాపం నుండి తొలగిపోవడం" అని అనువదించబడవచ్చు.
- “తమ శుధ్ధీకరణ కాలము ముగిసిన తరువాత” అనే వాక్యం "అవశ్యకమైన దినములు వారు ఎదురు చూడడం ద్వారా తమ్మును తాము శుద్ధి పరచుకొన్న తరువాత" అని అనువదించబడవచ్చు.
- “పాపములనుండి శుధ్ధీకరణ అనుగ్రహించబడింది" పదబంధం "ప్రజలు తమ పాపం నుండి సంపూర్తిగా శుద్ధి చెయ్యబడడం కోసం ఒక మార్గం అనుగ్రహించబడింది" అని అనువదించబడవచ్చు.
- “శుధ్ధీకరణ” పదం “శుభ్రపరచడం” లేదా “ఆత్మీయంగా కడుగబడుట” లేదా “ఆచారపరంగా శుధ్ధీకరించబడుట” అని వివిధ విధాలుగా అనువదించబడవచ్చు.
(చూడండి: ప్రాయశ్చిత్తం, శుద్ధమైన, ఆత్మ)
బైబిలు రిఫరెన్సులు:
- 2 తిమోతి 01:05
- నిర్గమ 31:6-9
- హెబ్రీ 09:13-15
- యాకోబు 04:08
- లూకా 02:22
- ప్రకటన 14:04
పదం సమాచారం:
- Strong's: H1249, H1252, H1253, H1305, H1865, H2134, H2135, H2141, H2212, H2398, H2403, H2561, H2889, H2890, H2891, H2892, H2893, H3795, H3800, H4795, H5343, H5462, H6337, H6884, H6942, H8562, G48, G49, G53, G54, G1506, G2511, G2512, G2513, G2514
షిమ్యోను
వాస్తవాలు:
పరిశుద్ధ గ్రంథములో షిమ్యోను అను పేరు మీద అనేకమంది వ్యక్తులున్నారు.
- పాత నిబంధనలో యాకోబు (ఇశ్రాయేలు) రెండవ కుమారుడు పేరు షిమ్యోను. తన తల్లి పేరు లేయా. తన సంతానము ఇశ్రాయేలు పన్నెండు గోత్రీకులలో ఒకరిగా మారిరి.
- షిమ్యోను గోత్రము వారు వాగ్ధాన దేశమైన కానానులో దక్షిణాది ప్రాంతమును వశము చేసికొనిరి. ఈ ప్రాంతము యూదాకు సంబంధించిన భూమి ద్వారా ఆవరించబడియుండును.
- యోసేపు మరియలు శిశువుగానున్న యేసును దేవునికి ప్రతిష్టించాలని యెరూషలేములోని దేవాలయమునకు వచ్చినప్పుడు, షిమ్యోను అనే పేరుగల ఒక వృద్దుడు మెస్సయ్యాను చూసేందుకు దేవుడు నాకు అనుమతినిచ్చియున్నాడని దేవునిని మహిమపరిచాడు.
(ఈ పదములను కూడా చూడండి: కనాను, క్రీస్తు, ప్రతిష్టించు, ఇశ్రాయేలు, యూదా, ఆలయం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.29:33-34
- ఆది.34:24-26
- అది.42:35-36
- ఆది.43:21-23
- లూకా.02:25-26
పదం సమాచారం:
- Strong's: H8095, H8099, G4826
షిలోహు
వాస్తవాలు:
షిలోహు అనేది యెహోషువా నాయకత్వములో ఇశ్రాయేలీయుల ద్వారా జయించబడిన గోడల కానాను పట్టణమైయుండెను.
- షిలోహు పట్టణము పడమర యోర్దాను నది ప్రక్కన మరియు బేతెల్ పట్టణపు ఉత్తర భాగాన కనపించును.
- యెహోషువా ఇశ్రాయేలును నడిపించే కాలములో షిలోహు పట్టణము ఇశ్రాయేలీయులందరు సమావేసమయ్యే స్థలమైయుండెను.
- ఇశ్రాయేలు పన్నెండు మంది గోత్రీకులకు కానాను దేశమును ఎవరికి ఎంత భాగము పంచిపెట్టాలని యెహోషువా చెబుతున్నప్పుడు, ఆ మాటలను వినుటకు వారందరూ షిలోహునందు కలిసికొనియుండిరి.
- యెరూషలేములో ఏ దేవాలయమును కట్టక ముందు, ఇశ్రాయేలీయులందరూ వచ్చి బలి అర్పించే పట్టణము షిలోహు అయ్యుండెను.
- సమూయేలు బాలుడైయున్నప్పుడు, తన తల్లి హన్నా తనను తీసుకొని యెహోవాను సేవించుటకు యాజకుడైన ఏలి ద్వారా తర్ఫీదు పొందుటకు షిలోహుకు వచ్చి విడిచిపెట్టెను.
(ఈ పదములను కూడా చూడండి: బేతేలు, ప్రతిష్టించు, హన్నా, యెరూషలేము, యోర్దాను నది, యాజకుడు, బలియాగము, సమూయేలు, ఆలయం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 రాజులు.02:26-27
- 1 సమూ.01:9-10
- యెహో.18:1-2
- న్యాయా.18:30-31
పదం సమాచారం:
షెకెము
వాస్తవాలు:
షెకెము అనునది ఉత్తర యెరూషలేముకు సుమారు 40 మైళ్ళ దూరములో ఉండే కానానులోని ఒక పట్టణము. షెకెము అనేది పాత నిబంధనలో ఒక మనుష్యుని ఇవ్వబడిన పేరైయున్నది.
- షెకెము పట్టణము అనునది యాకోబు తన అన్నయైన ఎశావుతో సమాధానపడిన తరువాత స్థిరపడిన ఊరైయున్నది.
- యాకోబు షెకెములోని హివ్వియుడైన హమోరు కుమారులనుండి భూమిని కొనుగోలు చేసియున్నాడు. ఈ భూమి తన కుటుంబముకొరకు సమాధి తోటగా మార్చబడెను మరియు తన కుమారులు తనను ఈ స్థలములో సమాధి చేసిరి.
- హమోరు కుమారుడు షెకెము యాకోబు కుమార్తెయైన దీనాను మానభంగము చేసెను, ఈ కారణాన యాకోబు కుమారులు షెకెము పట్టణములోని మనుష్యులను చంపియుండెను.
(తర్జుమా సలహాలు: హామోరు)
(ఈ పదములను కూడా చూడండి: కనాను, ఏశావు, హామోరు, హివ్వీయుడు, ఇశ్రాయేలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.07:14-16
- ఆది.12:6-7
- ఆది.33:18-20
- ఆది.37:12-14
పదం సమాచారం:
షేతు
వాస్తవాలు:
ఆదికాండము గ్రంథములో షేతు ఆదాము హవ్వలకు మూడవ కుమారుడైయుండెను.
- కయీను చేతిలో చంపబడిన హవ్వ కుమారుడు హెబెలు స్థానములో ఆమెకు షేతును అనుగ్రహించియున్నాడని హవ్వ చెప్పెను.
- నోవహు షేతు సంతానములలో ఒకడైయుండెను, ప్రళయము వచ్చినప్పటినుండి జీవించిన ప్రతియొక్కరు షేతు సంతానమైయుండెను.
- షేతు మరియు తన కుటుంబము “ప్రభువు పేరట ప్రార్థన చేసిన వారలలో” మొదటివారైయుండిరి.
(ఈ పదములను కూడా చూడండి: హేబెలు, కయీను, పిలుపు, వారసుడు, పూర్వీకుడు, వరద, నోవహు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 దిన.01:1-4
- లూకా.03:36-38
- సంఖ్యా.24:17
పదం సమాచారం:
షేబ
వాస్తవాలు:
పురాతన కాలములో షేబ అనేది దక్షిణ అరేబియాలో కనిపించే ప్రాంతమైయున్నది లేక పురాతన నాగరీకతయైయున్నది.
- షేబ దేశము లేక ప్రాంతము బహుశః ఇప్పటి యెమెన్ మరియు ఇతియోపియా దేశాలు వద్ద ఉండి ఉండవచ్చు.
- ఈ దేశపు నివాసులు బహుశః హాము సంతతియైయుండవచ్చును.
- షేబ రాణి సొలొమోను జ్ఞానమును గూర్చి మరియు తనకున్న ఐశ్వర్యమును గూర్చి విని, రాజైన సొలొమోనును దర్శించుటకు వచ్చెను.
- పాత నిబంధన వంశావళులలో “షేబ” అని పేరుగల అనేకమంది పురుషులు కలరు. షేబ అనే ప్రాంతము ఈ మనుష్యులలోనుండే వచ్చి ఉంటుందని ఒక అంచనా కలదు.
- బెయేర్షేబా పట్టణము షేబాకు చాలా దగ్గరిగా ఉన్నట్లు పాత నిబంధనలో ఒకమారు చూడగలము.
(ఈ పదములను కూడా చూడండి: అరేబియా, బెయెర్షేబా, ఇతియోపియా, సొలొమోను)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 దిన.01:8-10
- 1 రాజులు.10:1-2
- యెషయా.60:7
- కీర్తన.072:8-10
పదం సమాచారం:
షేము
వాస్తవాలు:
షేము నోవహు ముగ్గురు కుమారులలో ఒకడైయుండెను, ఆదికాండ పుస్తకములో ప్రళయము వచ్చినప్పడు నావలోనికి వీరందరూ బయలుదేరియుండిరి.
- షేము అబ్రాహాముకు మరియు అతని సంతానమునకు పూర్వీకుడైయుండెను.
- షేము సంతానమును “షేమీయులు” అని పిలిచెదరు; వారు హెబ్రీ మరియు అరాబిక్ భాషలవలె “సెమిటిక్” భాషను మాట్లాడుదురు.
- షేము సరిసుమారు 600 సంవత్సరాలు జీవించియున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది.
(ఈ పదములను కూడా చూడండి: అబ్రాహాము, అరేబియా, మందసం, వరద, నోవహు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.05:32
- ఆది.06:9-10
- ఆది.07:13-14
- ఆది.10:1
- ఆది.10:30-31
- ఆది.11:10-11
- ఆది.03:36-38
పదం సమాచారం:
సంతానం
నిర్వచనం:
“సంతానం” అనే పదం సాధారణంగా మనుషుల లేక జంతువుల సంబంధమైన జీవసంబంధ సంతానాన్ని సూచిస్తుంది.
- బైబిల్లో కూడా “సంతానం” అనే పదానికి “పిల్లలు” లేక “వంశస్తులు” అనే అర్ధం ఉంది.
- ”విత్తనం” అనే పదం కొన్ని సార్లు అలంకారరూపంలో సంతానం అని తెలియచేస్తుంది.
(చూడండి: వారసుడు, విత్తనము)
బైబిలు రిఫరెన్సులు:
- అపొస్తలులకార్యములు 17:28-29
- నిర్గమకాండం 13:11-13
- ఆదికాండం 24:5-7
- యెషయ 41:8-9
- యోబు 05:23-25
- లూకా 03:7
- మత్తయి 12:33-35
పదం సమాచారం:
- Strong's: H1121, H2233, H5209, H6363, H6529, H6631, G1081, G1085
సంవత్సరం, సంవత్సరాలు
నిర్వచనం:
ఈ పదం "సంవత్సరం"ను బైబిల్లో అక్షరాలా 354 రోజుల కాలాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. చాంద్రమానం కాలెండర్ పద్ధతి ప్రకారం ఈ లెక్క. ఇది చంద్రుడు భూమిని చుట్టి వచ్చేటందుకు పట్టే సమయం.
- ఆధునిక సౌరమాన కాలెండర్ ప్రకారమైతే ఒక సంవత్సరం 365 రోజులు ఉంటుంది. దీన్ని 12 నెలలుగా విభజిస్తారు. ఇది భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి వచ్చే సమయం.
- రెండు కాలెండర్ పద్ధతుల్లోనూ ఒక సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. అయితే అదనంగా 13వ నెల కొన్ని సార్లు చాంద్రమానం కాలెండర్ సంవత్సరానికి జోడిస్తారు. ఎందుకంటే /చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే 11రోజులు తక్కువ. ఈ విధంగా ఈ రెండు కాలెండర్లు ఒకదానికొకటి సమంగా ఉంటాయి.
- బైబిల్లో "సంవత్సరం "అనే పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. ఏదైనా ఒక ప్రత్యేక సంఘటన చోటు చేసుకునే సమయాన్ని సూచించడానికి ఇలా చేస్తారు. ఉదాహరణకు "యెహోవా సంవత్సరం” లేక “కరువు సంవత్సరం” లేక “ప్రభువు అనుగ్రహ సంవత్సరం." ఈ సందర్భాల్లో, "సంవత్సరం "అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సమయం” లేక “కాలాలు” లేక “కాల వ్యవధి."
(చూడండి: నెల)
బైబిల్ రిఫరెన్సులు:
- 2రాజులు 23:31-33
- అపో. కా. 19:8-10
- దానియేలు 08:1-2
- నిర్గమ 12:1-2
పదం సమాచారం:
- Strong's: H3117, H7620, H7657, H8140, H8141, G1763, G2094
సమాధానం, శాంతియుత, సమాధానపరచువారు
నిర్వచనం:
“సమాధానం” పదం ఎటువంటి సంఘర్షణ, ఆందోళన లేదా భయం లేకుండా ఉండే స్థితినిగానీ లేదా భావనను గానీ సూచిస్తుంది. "శాంతియుతంగా లేదా సమాధానంగా" ఉండే వ్యక్తి నెమ్మదిగా భావిస్తాడు, సురక్షితంగానూ, భద్రం గానూ ఉండే భావనను కలిగియుంటాడు.
- పాత నిబంధనలో “సమాధానం" పదం తరచుగా ఒక వ్యక్తి క్షేమం, ఆరోగ్యం లేదా సంపూర్ణతల సాధారణ భావాన్ని సూచిస్తుంది.
- "సమాధానం" పదం ప్రజల గుంపులు లేదా దేశాలు ఒకరితో ఒకరు యుద్ధాలు లేకుండా ఉన్న సమయాన్ని కూడా కొన్నిసార్లు సూచిస్తుంది. ప్రజలు "శాంతియుత సంబంధాలు" కలిగియున్నారు అని చెప్పవచ్చు.
- ఒక వ్యక్తితోగానీ లేదా ప్రజల గుంపుతోగానీ “సమాధానపడడం" అంటే యుద్ధాన్ని ఆపగల చర్యలను తీసుకోవడం అని సూచిస్తుంది.
- “సమాధానపరచువాడు” ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవించడానికి ప్రజలను ప్రభావితము చేయడంలో అనేక విషయాలను చెప్పేవాడూ, క్రియలను జరిగించేవాడూ అని అర్థం.
- ఇతర ప్రజలతో “సమాధానంగా ఉండడం" అంటే ఆ ప్రజలకి విరుద్ధముగా పోరాటము చేయని స్థితిలో ఉండడం అని అర్థం.
- దేవుడు మరియు ప్రజల మధ్యన మంచి సంబంధం లేదా సరియైన సంబంధం కేవలం దేవుడు తన ప్రజలను పాపమునుండి విడిపించినప్పుడే ఏర్పడుతుంది. దీనినే “దేవునితో సమాధానం” కలిగియుండడం అంటారు.
- “కృప మరియు సమాధానం” పదాలు తమ తోటి విశ్వాసులకు ఆశీర్వాదంగా అభివందనాలు తెలియజేయడానికి తమ ఉత్తరాలలో అపొస్తలులు ఉపయోగించారు.
- "సమాధానం" పదం ఇతరప్రజలతో గానీ లేదా దేవునితో గానీ మంచి సంబంధంలో ఉండడాన్ని కూడా సూచిస్తుంది.
బైబిలు రిఫరెన్సులు:
- 1 థెస్స 05:1-3
- అపొ.కా. 07:26
- కొలస్సీ 01:18-20
- కొలస్సీ 3:15
- గలతీ 05:23
- లూకా 07:50
- లూకా 12:51
- మార్కు 04:39
- మత్తయి 05:09
- మత్తయి 10:13
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 15:06 కానానులోనున్న ఎటువంటి ప్రజల గుంపుతోనైనను సమాధాన ఒప్పందం చేసుకోవద్దని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.
- 15:12 దేవుడు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించాడు.
- 16:03 వారి శత్రువులనుండి విడిపించగల విమోచకుడిని దేవుడు అనుగ్రహించెను మరియు ఆ దేశమునకు సమాధానమును అనుగ్రహించాడు.
- 21:13 ఆయన (మెస్సీయా) తన ప్రజల పాపముల శిక్షను అనుభవించడం కోసం చనిపోతాడు. ఆయన మీద పడిన శిక్ష ద్వారా దేవునికీ, మనుష్యులకూ మధ్య సమాధానం కలిగింది.
- 48:14 దావీదు ఇశ్రాయేలుకు రాజైయుండెను, అయితే యేసు సమస్త విశ్వమునకు రాజైయున్నాడు. ఆయన మరలా వస్తాడు, మరియు సదాకాలము న్యాయముతోనూ, సమాధానముతోనూ తన రాజ్యమును పరిపాలించును.
- 50:17 యేసు న్యాయముతోనూ మరియు సమాధానముతోను తన రాజ్యమును ఏలును, మరియు ఆయన తన ప్రజలతో సదాకాలము ఉండును.
పదం సమాచారం:
- Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272
సమాధి, సమాధి తవ్వేవారు, సమాధులు, గోరీ, సమాధి స్థలం
నిర్వచనం:
పదాలు "సమాధి” “గోరీ" అంటే మనుషులు చనిపోయాక శరీరాన్ని పాతిపెట్టే స్థలం. "సమాధి స్థలం" అనే పదం దీన్ని సూచిస్తున్నది.
- యూదులు కొన్ని సార్లు సహజమైన గుహలను సమాధులుగా ఉపయోగిస్తారు. కొన్ని సార్లు వారు కొండ వాలులో గుహలు తవ్వేవారు.
- కొత్త నిబంధన కాలంలో , ఒక పెద్ద బరువైన రాయి సమాధిని మూయడానికి వాడేవారు.
- లక్ష్య భాషలో సమాధి అంటే శరీరాన్ని పాతిపెట్టే నేలలో గుంట అనే అర్థమే వస్తే దీన్ని ఇతర పద్ధతుల్లో అనువదించడం మంచిది. "గుహ” లేక “కొండ తొలిచి."
- " సమాధి" అనే పదాన్ని సాధారణంగా, అలంకారికంగా కూడా మృతస్థితికి, స్థలానికి కూడా తరచుగా ఉపయోగిస్తారు.
(చూడండి: పాతిపెట్టు, చనిపోవడం)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 02:29-31
- ఆది 23:5-6
- ఆది 50:4-6
- యోహాను 19:40-42
- లూకా 23:52-53
- మార్కు 05:1-2
- మత్తయి 27:51-53
- రోమా 03:13-14
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 32:04 ఒక మనిషి ఆ ప్రాంతంలో సమాధుల్లో నివసించాడు.
- 37:06 యేసు అతనితో, "మీరు లాజరును ఎక్కడ ఉంచారు?" వారు " సమాధిలో” వచ్చి చూడండి."
- 37:07 సమాధి ఒక గుహ. ఒక రాయి డానికి అడ్డంగా ఉంది.
- 40:09 తరువాత యేసు మెస్సియా అని విశ్వసించిన యోసేపు, నికోదేము అనే ఇద్దరు యూదు నాయకులు యేసుశరీరం కోసం పిలాతును అడిగారు. వారు ఆయన శరీరం గుడ్డలో చుట్టి రాతిని తొలిచిన సమాధి లో ఉంచారు. తరువాత వారు పెద్ద రాయి సమాధి ముఖానికి అడ్డంగా దొర్లించారు.
- 41:04 అతడు ( దేవదూత) సమాధికి అడ్డంగా ఉన్న రాయి దొర్లించి దానిపై కూర్చున్నాడు. సమాధిని కాపలా కాసే సైనికులు భయంతో వణికి పోతూ చచ్చిన వారిలాగా నేలపై పడిపోయారు.
- 41:05 స్త్రీలు సమాధి దగ్గరకు రాగా దేవదూత వారితో "భయపడకండి. యేసు ఇక్కడ లేడు. అయన తాను చెప్పినట్టే చనిపోయిన వారిలో నుండి లేచాడు! సమాధిలో చూడండి." స్త్రీలు సమాధి లోకి చూస్తే వారికి యేసు శరీరం కనబడ లేదు. ఆయన శరీరం అక్కడ లేదు!
పదం సమాచారం:
- Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028
సముద్రం, మహాసముద్రం, పశ్చిమ సముదరం, మధ్యధరా సముద్రం
వాస్తవాలు:
బైబిలులో “గొప్ప సముద్రం” లేక పశ్చిమ సముద్రం” అంటే ప్రస్తుతం పిలుస్తున్న “మధ్యధరా సముద్రం” అని అర్థం, బైబిలు కాలంలోని మనుష్యులకు తెలిసిన అత్యంత పెద్ద నీటి సముదాయం.
- మధ్యధరా సముద్రానికి సరిహద్దులు: ఇశ్రాయేలు (తూర్పు), ఐరోపా (ఉత్తరం, పశ్చిమం), ఆఫికా (దక్షిణం).
- పురాతన కాలంలో వ్యాపారానికీ, ప్రయానాలకూ ఈ సముద్రం అత్యంత ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇది అనేక దేశాలకు తీరంగా ఉంది. ఈ సముద్ర తీరంలో ఉన్న పట్టణాలు, ప్రజా గుంపులు అత్యంత సంపదతో ఉన్నాయి, ఎందుకంటే పడవల ద్వారా ఇతర దేశాల నుండి వస్తువులను వారు పొందడం చాలా సులభం.
- గొప్ప సముద్రం ఇశ్రాయేలుకు పశ్చిమాన ఉన్న కారణంగా, కొన్నిసార్లు దీనిని పశ్చిమసముద్రం అని పిలుస్తారు.
(చూడండి: ఇశ్రాయేలు, జనాంగములు, వర్ధిల్లు)
బైబిలు రెఫరెన్సులు:
- యెహేజ్కేలు 47:15-17
- యెహేజ్కేలు 47:18-20
- యెహోషువా 15:3-4
- సంఖ్యాకాండం 13:27-29
పదం సమాచారం:
- Strong's: H314, H1419, H3220
సర్వోన్నతుడు
వాస్తవాలు:
“సర్వోన్నతుడు” అనే పదం దేవునికి బిరుదు. ఇది ఆయన గొప్పతనాన్ని లేక అధికారాన్ని సూచిస్తుంది.
- ఈ పదం అర్థం “సార్వభౌముడు” లేక “సర్వాదికారి” అనే పదాల అర్థం ఒకేలా ఉంటుంది.
- ఈ బిరుదులో ”ఉన్నతమైన” అనే పదం భౌతిక ఎత్తును గానీ లేదా దూరాన్ని గానీ సూచించడం లేదు. గొప్పతనాన్ని సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- ఈ పదాన్ని “సర్వోన్నతుడైన దేవుడు” లేక అత్యంత సర్వాదికారి దేవుడు” లేక “ఉన్నతుడైన దేవుడు” లేక “అత్యంత గొప్పవాడు” లేక “సర్వాదికారియైన వాడు” లేక “అందరికంటే గొప్పవాడైన దేవుడు” అని అనువదించవచ్చు.
- ”ఉన్నతుడు” లాంటి పదం వినియోగించినప్పుడు, అది భౌతికమైన ఎత్తు లేక పొడవులను సూచించేదిగా ఉండకూడదు.
(చూడండి: దేవుడు)
బైబిలు రెఫరెన్సులు:
- అపొస్తలులకార్యములు 07:47-50
- అపొస్తలులకార్యములు 16:16-18
- దానియేలు 04:17-18
- ద్వితియోపదేశకాండం 32:7-8
- ఆదికాండం 14:17-18
- హెబ్రీ 07:1-3
- హోషెయా 07:16
- విలాపవాక్యములు 03:34-36
- లూకా 01:30-33
పదం సమాచారం:
సలహా, సలహా ఇచ్చు, సలహా పొందిన, సలహాదారు, సలహాదారులు, కౌన్సిల్, మార్గదర్శి, మార్గదర్శులు, సలహాసంఘాలు
నిర్వచనం:
పదాలు "కౌన్సిల్” “సలహా" అనే పదాలకు ఒకటే అర్థం. ఎవరికైనా కొన్ని పరిస్థితుల్లో జ్ఞానం గల సలహా ఇచ్చి సహాయం చేయడం. జ్ఞానం గల "మార్గదర్శి” లేక “సలహాదారు" అంటే సలహా లేక ఆలోచన చెప్పి ఒక వ్యక్తి సరైన నిర్ణయం చేయడానికి సహాయం చేస్తాడు.
- రాజులదగ్గర తరచుగా అధికార సలహాదారులు లేక మార్గదర్శులు ఉండి ఆ రాజులూ ఏలుతున్న ప్రజలప్రాముఖ్యమైన సమస్యల విషయంలో నిర్ణయాలు చేయడానికి సహాయం చేస్తారు.
- కొన్ని సార్లు ఇచ్చిన సలహా లేక ఆలోచన మంచిది కాకపోవచ్చు. దుష్టసలహాదారులు ఒక రాజును అతని ప్రజలకు హానికరమైన చర్యలు తీసుకునేలా ప్రోత్సహించ వచ్చు.
- సందర్భాన్ని బట్టి, దీన్ని "సలహా” లేక “కౌన్సిల్" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిర్ణయం చేయడంలో సహాయం” లేక “హెచ్చరికలు” లేక “జాగ్రత్తలు” లేక “నడిపింపు."
- "కౌన్సిల్" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సలహా ఇవ్వడం” లేక “సూచనలు చెయ్యడం” లేక “హెచ్చరించు."
- గమనించండి "కౌన్సిల్" అనేది, "సమాలోచన సభ," ఒకటి కాదు. సభ అంటే ఎక్కువ మంది ఉంటారు.
(చూడండి: హెచ్చరించు, పరిశుద్ధాత్మ, జ్ఞాని)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1697, H1847, H1875, H1884, H1907, H2940, H3245, H3272, H3289, H3982, H4156, H4431, H5475, H5779, H5843, H6440, H6963, H6098, H7592, H8458, G1010, G1011, G1012, G1106, G4823, G4824, G4825
సహవాసం
నిర్వచనం:
సాధారణంగా, "సహవాసం" అంటే ఒకే విధమైన ఆసక్తులు అనుభవాలు గల వారి మధ్య ఉండే స్నేహ పూర్వకమైన కలయికలు.
- బైబిల్లో, "సహవాసం" అనే మాట క్రీస్తు విశ్వాసుల కలయికను సాధారణంగా సూచిస్తున్నది.
- క్రైస్తవ సహవాసం అంటే విశ్వాసుల మధ్య వారికి క్రీస్తు, పరిశుద్ధాత్మల మూలంగా ఉండే సంబంధం.
- ఆది క్రైస్తవులు వారి సహవాసాన్ని దేవుని వాక్కు వినడం, కలిసి ప్రార్థన చేయడం వారికి ఉన్నవి కలిసి పంచుకోవడం కలిసి భోజనాలు చేయడం ద్వారా వ్యక్త పరిచే వారు.
- క్రైస్తవులు క్రీస్తు తన త్యాగ పూర్వక సిలువ మరణం మూలంగా దేవునికి, తమకు మధ్య అంతరం తొలగించినందువల్ల వారి విశ్వాసం మూలంగా దేవునితో సహవాసం ఏర్పరచుకుంటారు.
అనువాదం సలహాలు:
- అనువదించే పద్ధతులు. "సహవాసం" అంటే "కలిసి పంచుకోవడం” లేక “సంబంధం కలిగి ఉండడం” లేక “స్నేహ సంబంధాలు” లేక “క్రైస్తవ సమాజం."
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 01:3-4
- అపో. కా. 02:40-42
- ఫిలిప్పి 01:3-6
- ఫిలిప్పి 02:1-2
- ఫిలిప్పి 03:8-11
- కీర్తనలు 055:12-14
పదం సమాచారం:
- Strong's: H2266, H8667, G2842, G2844, G3352, G4790
సింధూర వృక్షం, సింధూర వృక్షములు
నిర్వచనం
ఒక సింధూర వృక్షం పొడవుగా ఉండే చెట్టు, వెడల్పైన మ్రాను ఉంటుంది, కొమ్మలు విస్తరించి ఉంటాయి.
- సింధూర వృక్షానికి దృఢమైన, బలమైన కలప ఉంటుంది, ఓడలు కట్టడంలో వినియోగిస్తారు, వ్యవసాయ నాగలి, ఎడ్ల కాడి, నడిచే కర్రలు తాయారు చెయ్యడంలో దీనిని వినియోగిస్తారు.
- సింధూర చెట్టు విత్తనాన్ని సింధూర ఫలం అంటారు.
- కొన్ని సింధూర చెట్ల మ్రానులు 6 మీటర్ల చుట్టు కొలత ఉంటుంది.
- సింధూర వృక్షాలు దీర్ఘాయుష్షుకు గుర్తుగా ఉంటాయి, వీటికి ఇతర ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. బైబిలు గ్రంథంలో అవి తరుచుగా పరిశుద్ధ స్థలాలతో సంబంధ పరచబడ్డాయి.
అనువాదం సూచనలు:
- అనేక అనువాదాలు కేవలం “సింధూరం” అనే పదాన్ని వినియోగించడం కంటే “సింధూర వృక్షం” అనే మాటను వినియోగించడానికి ప్రాముఖ్యతని ఇచ్చాయి.
- సింధూర వృక్షాలను గురించి అర్థం కాని ప్రాంతంలో, “సింధూర వృక్షం” అనే పదాన్ని “.....వంటి పెద్ద నీడనిచ్చే సింధూర వృక్షం” అని అనువదించవచ్చు, తరువాత స్థానికంగా అటువంటి లక్షణాలు కలిగిన వృక్షం పేరు పెట్టవచ్చు.
- చూడండి: తెలియని పదాలను అనువదించడం
(చూడండి: పరిశుద్ధమైన)
బైబిలు రిఫరెన్సులు:
- ఆదికాండం 10:3-4
- ఆదికాండం 13:16-18
- ఆదికాండం 14:13-14
- ఆదికాండం 35:4-5
- న్యాయాధిపతులు 06:11-12
పదం సమాచారం:
- Strong's: H352, H424, H427, H436, H437, H438
సింహాసనం, సింహాసనాలు, సింహాసనం పైనున్న
నిర్వచనం:
సింహాసనం అంటే ప్రత్యేకంగా చేసిన కుర్చీ. రాజు, లేక అధిపతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు చేసే సమయంలో, తన ప్రజల విన్నపాలు వినే సమయంలో దానిపై కూర్చుంటాడు.
- సింహాసనం రాజు యొక్క అధికారం, శక్తి కి సంకేతం
- "సింహాసనం" అనే మాటను తరచుగా అలంకారికంగా రాజు పరిపాలన, లేక శక్తి వెల్లడించడానికి ఉపయోగిస్తారు.
- బైబిల్లో, దేవుడు తరచుగా ఒక రాజు తన సింహాసనంపై కూర్చున్నట్టు కనిపిస్తాడు. యేసు తన తండ్రి కుడి వైపున సింహాసనంపై కూర్చున్న వర్ణన బైబిల్లో ఉంది.
- పరలోకం దేవుని సింహాసనం అని యేసు చెప్పాడు. దీన్ని అనువదించడంలో ఒక పధ్ధతి "దేవుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు."
(చూడండి: అధికారం, శక్తి, రాజు, పాలన)
బైబిల్ రిఫరెన్సులు:
- కొలస్సి 01:15-17
- ఆది 41:39-41
- లూకా 01:30-33
- లూకా 22:28-30
- మత్తయి 05:33-35
- మత్తయి 19:28
- ప్రకటన 01:4-6
పదం సమాచారం:
- Strong's: H3427, H3676, H3678, H3764, H7675, G968, G2362
సిగ్గు, సిగ్గుపడిన, అవమానం, అగౌరవించు, దూషణ
నిర్వచనం:
“సిగ్గు" పదం ఒక వ్యక్తి అగౌరవకరమైన లేదా సరికాని పని చేసినప్పుడు ఆ వ్యక్తి అవమానింపబడినట్లుగానూ లేదా తక్కువ చేయబడినట్లుగానూ భావించే భాధాకర భావనను సూచిస్తుంది.
- “సిగ్గుకరమైనది" అంటే "అక్రమమైనది" లేదా "అగౌరవమైనది" అని అర్థం.
- “సిగ్గుపడుట” అనే పదం ఒక వ్యక్తి అక్రమమైన లేదా అగౌరవమైన పనిని చేసినప్పుడు ఏవిధంగా భావిస్తాడో దానిని వివరిస్తుంది.
- “అగౌరవపరచు" అంటే సాధారణంగా బహిరంగంగా సిగ్గుపడేలా లేదా అవమానపడేలా చెయ్యడం అని అర్థం. ఒకరిని సిగ్గుపరచే చర్యను "అగౌరవ పరచడం" అంటారు.
- ఒకరిని "దూషణ" చెయ్యడం అంటే ఒక వ్యక్తి స్వభావాన్ని లేదా ప్రవర్తనను విమర్శించడం లేదా అంగీకరించకపోవడం అని అర్థం.
- "సిగ్గుపరచడం" అంటే ప్రజలను ఓడించడం లేదా వారు తమ గురించి తాము సిగ్గుపడేలా వారి చర్యలను బహిరంగం చెయ్యడం అని అర్థం. విగ్రహాలను పూజించే వారు సిగ్గుపరచబడతారు అని ప్రవక్త యెషయా చెప్పాడు.
- "అవమానకరమైన" పదం ఒక పాపకార్యాన్ని వివరించడానికి లేదా ఆ కార్యాన్ని చేసిన వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాప కార్యాన్ని చేసినప్పుడు అది అతనిని అవమాన లేదా అగౌరవ స్థితిలో ఉంచుతుంది.
- కొన్నిసార్లు మంచి పనులు చేసేవ్యక్తి అవమానం లేదా సిగ్గుపడేలా పరిగణించబడతాడు. ఉదాహరణకు, యేసు సిలువ మీద చంపబడినప్పుడు చనిపోవడంలో ఇది అవమానకరమైన విధానం. ఈ అవమానం పొందడానికి ఆయన ఎలాంటి తప్పూ చెయ్యలేదు.
- దేవుడు ఒకరిని తక్కువ చేసినప్పుడు అంటే ఒక గర్విష్టియైన వ్యక్తి తన గర్వాన్ని అధిగమించడంలో సహాయం చెయ్యడానికి అతడు ఓటమిని అనుభవించేలా అనుమతించడం అని అర్థం. ఇది ఒక వ్యక్తిని తరచుగా గాయపరచడం కోసం తక్కువచేసే విధానానికి ఇది భిన్నంగా ఉంటుంది.
- ఒక వ్యక్తి "దూషణకు మించినవాడు" లేదా "దూషణకు దూరంగా ఉన్నవాడు" లేదా "ఎటువంటి దూషణ లేనివాడు" అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి గౌరవించే విధంగా ప్రవర్తిస్తున్నాడు, అతన్ని విమర్శించడానికి చాలా తక్కువ ఉంది లేదా ఏమీ లేదు.
అనువాదం సూచనలు
- "అవమానం" పదాన్ని "సిగ్గు" లేదా "అగౌరవం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- "అవమానకరమైన" పదం అనువాదంలో "సిగ్గుకరమైన" లేదా అగౌరవకరమైన" పదాలు జత చేయబడవచ్చు.
- "అగౌరవించు (తక్కువచేసి చూపు)" పదం అనువాదంలో "సిగ్గు" లేదా "సిగ్గుపడేలా చేయి" లేదా "ఇబ్బంది పడేలా చేయి" పదాలు జతచెయ్యబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి "అగౌరవించు" పదం "సిగ్గు" లేదా "అగౌరవించు" లేదా "అవమానం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
- "దూషణ" పదం "నేరారోపణ" లేదా "సిగ్గు" లేదా "అగౌరవం" అని అనువదించబడవచ్చు.
- "దూషణకు గురిచెయ్యడం" పదం సందర్భాన్ని బట్టి "గద్దించడం" లేదా "నిందించడం" లేదా "విమర్శించడం" అని అనువదించబడవచ్చు.
(ఈ పదములను కూడా చూడండి: దేవుడు, వినయపూర్వకమైన, కించపరిచే, యెషయా, పశ్చాత్తాపపడు, పాపము, ఆరాధన)
బైబిలు రిఫరెన్సులు:
- 1 పేతురు 03:15-17
- 2 రాజులు 02:17
- 2 సమూయేలు 13:13
- లూకా 20:11
- మార్కు 08:38
- మార్కు 12:4-5
- 1 తిమోతి 03:07
- ఆదికాండం 34:07
- హెబ్రీ 11:26
- విలాపవాక్యములు 02:1-2
- కీర్తనలు 022:06
- ద్వితి. 21:14
- ఎజ్రా 09:05
- సామెతలు 25:7-8
- కీర్తనలు 006:8-10
- కీర్తనలు 123:03
- 1 తిమోతి 05:7-8
- 1 తిమోతి 06:13-14
- యిర్మియా 15:15-16
- యోబు 16:9-10
- సామెతలు 18:03
పదం సమాచారం:
- Strong's: H937, H954, H955, H1317, H1322, H2616, H2659, H2781, H3001, H3637, H3639, H3640, H6172, H7022, H7036, H8103, H8106, G127, G149, G152, G153, G422, G808, G818, G819, G821, G1788, G1791, G1870, G2617, G3856, G5195
సిరియా
వాస్తవాలు:
సిరియా అనేది ఇశ్రాయేలు ఉత్తర భాగమున ఉండే ఒక దేశమైయున్నది. క్రొత్త నిబంధన కాలములో ఇది రోమా సామ్రాజ్యపు పాలన క్రింద ఉండే ఒక ప్రాంతమైయుండెను.
- పాత నిబంధన కాలములో, సిరియనులు ఇశ్రాయేలీయులకు బలమైన శత్రు సైన్యమైయుండిరి.
- ప్రవక్తయైన ఎలీషా ద్వారా కుష్టు రోగమునుండి స్వస్థపరచబడిన నామాను కూడా సిరియా సైన్యాధిపతియైయుండెను.
- సిరియాలోని నివాసులందరూ నోవహు కుమారుడైన షేమునుండి వచ్చిన ఆరాము సంతతియైయుండిరి.
- సిరియా రాజధాని దమస్కు, ఈ పట్టణమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో అనేకచోట్ల పేర్కొనబడింది.
- సౌలు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించాలని ఎన్నో ప్రణాళికలతో వెళ్ళాడు కాని యేసు అతనిని నిలిపివేశాడు.
(ఈ పదములను కూడా చూడండి: ఆరాము, సైన్యాధ్యక్షుడు, దమస్కు, వారసుడు, ఎలీషా, కుష్టరోగి, నయమాను, హింసించు, ప్రవక్త)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.15:22-23
- అపొ.కార్య.15:39-41
- అపొ.కార్య.20:1-3
- గలతీ.01:21-24
- మత్తయి.04:23-25
పదం సమాచారం:
- Strong's: H130, H726, H758, H761, H762, H804, H1834, H4601, H7421, G4947, G4948
సీదోను, సీదోనీయులు
వాస్తవాలు:
సీదోను కానాను పెద్ద కుమారుడైయుండెను. సీదోను అని పిలువబడే కానానీయుల పట్టణము కూడా ఉన్నది, బహుశః కానాను కుమారుడు పుట్టిన తరువాత పేరు పెట్టియుండవచ్చును.
- సీదోను పట్టణము ప్రస్తుత లెబనోను దేశములోని భాగమైన ప్రాంతములోనున్న మధ్యదరా సముద్రము తీరమున ఉత్తర ఇశ్రాయేలునందు కనబడుతుంది.
- “సీదోనీయులు” సీదోను మరియు దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములలో జీవించిన ఫెనికయా ప్రజల గుంపువారైయుండిరి.
- పరిశుద్ధ గ్రంథములో సీదోను తూరు పట్టణమునకు చాలా దగ్గరగా ఉంటుంది, ఈ రెండు పట్టణములు శ్రీమంత పట్టణములైయుండెను మరియు ఇక్కడి ప్రజలు తమ అనైతిక ప్రవర్తనకు పేరుగాంచియుండిరి.
(ఈ పదములను కూడా చూడండి: కనాను, నోవహు, ఫేనీకే, సముద్రం, తూరు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.12:20-21
- అపొ.కార్య.27:3-6
- ఆది.10:15-18
- ఆది.10:19-20
- మార్కు.03:7-8
- మత్తయి.11:20-22
- మత్తయి.15:21-23
పదం సమాచారం:
- Strong's: H6721, H6722, G4605, G4606
సీల, సిల్వాను
వాస్తవాలు:
సీల యెరూషలేములోని విశ్వాసుల మధ్యన నాయకుడైయుండెను.
- యెరూషలేములోని సంఘ పెద్దలందరు అంతియొకయ పట్టణమునకు పత్రికను తీసుకొని వెళ్ళుటకు పౌలు మరియు బర్నబాలతో వెళ్ళుటకు సీలను నియమించిరి.
- కొద్ది కాలమైన తరువాత యేసు క్రీస్తును గూర్చి ప్రజలకు బోధించుటకు ఇతర పట్టణములకు పౌలుతో సీల కూడా ప్రయాణము చేసెను.
- పౌలు సీలలను ఫిలిప్పి పట్టణములోని చెరసాలలో వేసిరి. వారు చెరసాలలో ఉన్నప్పుడే దేవునిని పాటలు పాడి స్తుతించిరి మరియు దేవుడు వారిని చెరనుండి విడిపించెను. చెరసాల అధిపతి వారికి జరిగిన సాక్ష్యమును వినుట ద్వారా క్రైస్తవుడిగా మారిపోయెను.
(ఈ పదములను కూడా చూడండి: అంతియొకయ, బర్నబా, యెరూషలేము, పౌలు, ఫిలిప్పి, చెర, సాక్షం)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 పేతురు.05:12-14
- 1 తెస్స.01:1
- 2 తెస్స.01:1-2
- అపొ.కార్య.15:22-23
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 47:01 ఒక రోజున పౌలు మరియు తన స్నేహితుడైన సీల ఇరువురు కలిసి యేసును గూర్చిన శుభవార్తను ప్రకటించుటకు ఫిలిప్పి పట్టణమునకు వెళ్ళిరి.
- 47:02 ఆమె (లుదియ) తన ఇంట బస చేయుటకు పౌలును మరియు సీలను ఆహ్వానించెను, అందుచేత వారు ఆమె ఇంట ఆమెతోపాటు బసచేసిరి.
- 47:03 పౌలు మరియు సీలలు అనేకమార్లు ప్రార్థన చేసికొను స్థలములో ప్రజలను కలిసికొనిరి.
- 47:07 అందుచేత బానిసయైన అమ్మాయి యజమానులు పౌలును మరియు సీలను రోమా అధికారుల వద్దకు తీసుకొని వెళ్లి, వారిని జైలులోనికి వేయించిరి.
- 47:08 వారు పౌలు మరియు సీలను చెరసాలలోని అతీ భద్రమైన స్థలములో వేసి, వారి కాళ్లకు బొండలను బిగియించిరి.
- 47:11 చెరసాల అధికారి పౌలు సీల వద్దకు వణుకుతూ వచ్చి, “నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను?” అని అడిగెను.
- 47:13 ఆ మరుసటి రోజున పట్టణ నాయకులు పౌలు సీలలను చెరసాలనుండి విడుదల చేసిరి మరియు ఫిలిప్పి పట్టణమును విడిచి వెళ్లిపొమ్మని వేడుకొనిరి. పౌలు మరియు సీల లుదియాను మరియు ఇతర కొంతమంది స్నేహితులను దర్శించి, పట్టణమును విడిచి వెళ్లిపోయిరి.
పదం సమాచారం:
సుక్కోతు
నిర్వచనము:
సుక్కోతు అనేది పాత నిబంధనలోని రెండు పట్టణములకు పెట్టిన పేరైయుండెను. “సుక్కోతు” (లేక “సుక్కోతు”) అనే పదమునకు “పాకలు” అని అర్థము.
- సుక్కోతు అని పిలువబడే మొదటి పట్టణము యోర్దాను నదికి తూర్పు దిక్కున ఉండేది.
- యాకోబు సుక్కోతులో తమ కొరకు పాకలు వేసుకొంటూ తన కుటుంబముతోనూ మరియు గొర్రెల మందలతోనూ జీవించియుండెను.
- వందలాది సంవత్సరములు గడిచిపోయిన తరువాత, గిద్యోను మరియు తన సైన్యములోని మనుష్యులు మిద్యానీయులను తరుముకుంటూ వస్తున్నప్పుడు సుక్కోతులో ఆగిపోయిరి, కాని అక్కడి ప్రజలు వారికీ ఆహారమునిచ్చుటకు నిరాకరించిరి.
- రెండవ పట్టణమైన సుక్కోతు ఐగుప్తుకు ఉత్తరాది సరిహద్దు భాగములో ఉంటుంది, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని తమ బానిసత్వమునుండి విడుదలపొంది వస్తున్నప్పుడు ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తరువాత వారు సుక్కోతులోనే నిలిచిపోయిరి.
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 రాజులు.07:46-47
- నిర్గమ.12:37-40
- యెహో.13:27-28
- న్యాయా.08:4-5
పదం సమాచారం:
సేవకుడు, సేవించడం, బానిస, పనివాడు, యవనస్థుడు, యవన స్త్రీ
నిర్వచనం:
“సేవించడం" అంటే సాధారణంగా పని చెయ్యడం అని అర్థం. ఈ భావన విస్తృతమైన భిన్న సందర్భాలకు అన్వయించబడవచ్చు. ఈ పదం ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం ఇష్టపూర్వకంగాగానీ లేదా బలవంతంగా గానీ పనిచెయ్యడం (లేదా విధేయత చూపడం) అని సూచిస్తుంది. బైబిలులో "సేవకుడు," "బానిస" పదాలు ఎక్కువగా ఒకదానితో ఒకటి మార్పు చెయ్యగలిగిన పదాలు.
- ఈ క్రింద ప్రస్తావించబడినవారిలో ఎవరైనా "సేవకుడు" అని పిలువబడవచ్చు: ఒక బానిస, ఒక యవన మహిళా కార్మికురాలు, ఒక యవన పురుష కార్మికుడు, దేవునికి విధేయత చూపించేవాడు, ఇతరులు.
- ఒక బానిస తాను పనిచేస్తున్న వ్యక్తి ఒక విధమైన ఆస్థిగా ఉంటాడు. ఒక బానిసను వ్యక్తి ఆ బానిసకు "హక్కుదారుడు" లేదా "యజమాని" అవుతాడు. కొందరు యజమానులు తమ బానిసలను క్రూరంగా చూసేవారు. ఇతరులు తమ బానిసలను ఇంటిలో ఒక విలువైన వ్యక్తిగా చూసుకొనేవారు.
- ఒక వ్యక్తి తాత్కాలికంగా బానిసగా ఉండవచ్చు, ఉదాహరణకు తన యజమానికి చేసిన ఋణాన్ని తీర్చే క్రమంలో పనిచేస్తాడు.
అనువాదం సూచనలు
- “సేవ చేయడం” పదం సందర్భాన్ని బట్టి "పరిచర్య చేయడం” లేదా “పని చేయడం” లేదా “శ్రద్ధ తీసుకోవడం" లేదా "విధేయత చూపించడం" అని అనువదించబడవచ్చు.
- "యవనస్తుడు" లేదా "యవన స్త్రీ" పదాలు తరచుగా "సేవకుడు" లేదా "బానిస" అనే అర్థాన్ని ఇస్తాయి. ఈ అర్థం సందర్భాన్ని బట్టి వివేచించబడతాయి. స్వాధీనతా సంబంధపదం ఉపయోగించబడినట్లయితే అది ఈ పరిస్థితికి సూచికగా ఉంటుంది. ఉదాహరణకు, "ఆమె యవ్వన స్త్రీలు" పదం "ఆమె పరిచారకులు" లేదా ""ఆమె బానిసలు" అని అనువదించబడవచ్చు. ,
- తరచుగా ఒకరు తనను తాను "నేను నీ దాసుణ్ణి" అని సూచించుకొంటున్నప్పుడు అతడు మాట్లాడుతున్న వ్యక్తికి గౌరవాన్ని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తికి సామాజికంగా ఉన్నత స్థితి ఉండవచ్చు లేదా మాట్లాడేవారు వినయాన్ని చూపిస్తుండవచ్చు. ఈ మాట చెపుతున్న వ్యక్తి వాస్తవానికి దాసుడు అని అర్థం కాదు.
- "దేవుణ్ణి సేవించడం" పదం "దేవుణ్ణి ఆరాధించండి, లోబడండి" లేదా "దేవుడు ఆజ్ఞాపించిన పనిని చెయ్యండి" అని అనువదించబడవచ్చు.
- పాత నిబంధనలో దేవుని ప్రవక్తలూ, దేవుణ్ణి ఆరాధించే ఇతరులూ తరచుగా "సేవకులు" అని సూచించబడ్డారు.
- “దేవునిని సేవించడం” పదం "దేవుని ఆరాధించండి, ఆయనకు విధేయత చూపండి" లేదా "దేవుడు ఆజ్ఞాపించిన వారిని చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవునికి విధేయులైన ప్రజలు తరచుగా “దాసులు” అని పిలువబడ్డారు.
- “బల్ల వద్ద సేవచేయ్యండి" అంటే బల్ల దగ్గర కూర్చునియున్నప్రజలకు ఆహారాన్ని తీసుకురండి" లేదా సర్వ సాధారణముగా “ఆహారమును పంచండి” అని అర్థం.
- ఒక వ్యక్తి తన అతిథులకి పరిచర్య చేసే సందర్భంలో ఈ పదం "శ్రద్ధ తీసుకోవడం" లేదా "ఆహారాన్ని వడ్డించడం" లేదా "ఆహారాన్ని సమకూర్చడం" అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రజలకు ఆహారాన్ని వడ్డించండని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు ఈ పదం "పంచండి" లేదా "అందించండి" లేదా "ఇవ్వండి" అని అనువదించబడవచ్చు.
- దేవునిని గూర్చి ఇతరులకు బోధించే ప్రజలు దేవునికినీ, వారి వాక్యబోధను వినుచున్న ప్రజలకూ సేవచేస్తున్నారు.
- తాము పాత నిబంధనకు ఏవిధంగా “సేవ చేసేవారో” అనే దానిని గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీ క్రైస్తవులకు రాశాడు. ఇది మోషే ధర్మశాస్త్రమునకు విధేయులై జీవించినట్లు సూచించుచున్నది. ఇప్పుడు వారు క్రొత్త నిబంధనకు “సేవ చేయుచున్నారు.” అనగా, యేసు సిలువలో బలియైనందున, యేసును విశ్వసించినవారు దేవునిని సంతోషపరచుటకునూ, పరిశుద్ధమైన జీవితాలను జీవించుటకు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడియున్నారు.
- పాత నిబంధనకు గానీ లేదా క్రొత్త నిబంధనకు గానీ వారు చేసిన క్రియలను వారి "సేవ" రూపంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈ పదం “సేవచేయడం" లేదా “విధేయత చూపడం” లేదా "భక్తికలిగి యుండడం" అని అనువదించబడవచ్చు.
(చూడండి: జరిగించు, బానిసను చేయడం, ఇంటి వారు, అధికారి, లోబడు, నీతిగల, నిబంధన, ధర్మం)
బైబిలు రిఫరెన్సులు:
- అపొ.కా. 04:29-31
- అపొ.కా. 0:7-8
- కొలస్సీ 01:7-8
- కొలస్సీ 03:22-25
- ఆది. 21:10-11
- లూకా 12:47-48
- మార్కు 09:33-35
- మత్తయి 10:24-25
- మత్తయి 13:27-28
- 2 తిమోతి 02:3-5
- అపొ.కా. 06:2-4
- ఆది. 25:23
- లూకా 04:8
- లూకా12:37-38
- లూకా 22:26-27
- మార్కు 08:7-10
- మత్తయి 04:10-11
- మత్తయి 06:24
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 06:01 అబ్రహాము బాగా వృద్దుడైనప్పుడు ఇస్సాకు పెద్దవాడై ఎదిగియున్నాడు, అబ్రాహాము తన దాసులలో ఒకరిని పిలిచి, తన బంధువులు నివాసముండిన స్థలమునకు పంపించి, అక్కడ తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను చూడమని పంపించాడు.
- 08:04 బానిస వ్యాపారులు ధనికుడైన ప్రభుత్వ అధికారికి యోసేపును బానిసగా అమ్మివేసారు.
- 09:13 “నేను (దేవుడు) నిన్ను (మోషేను) ఫరో వద్దకు పంపించెదను, తద్వారా నువ్వు ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొని వచ్చెదవు.”
- 19:10 “అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, యెహోవా, నీవు ఇశ్రాయేలు దేవుడవని మరియు నేను నీ దాసుడనని ఈ రోజున మాకు కనుపరచుము” అని ఏలియా ప్రార్థించాడు.
- 29:03 “దాసుడు అప్పు తీర్చనందున, ‘తాను చేసిన ఆప్పు తీర్చుటకు ఈ మనుష్యుని మరియు తన కుటుంబమును బానిసలుగా అమ్మివేయండి” అని రాజు చెప్పాడు.
- 35:06 “నా తండ్రి ఇంటనున్న దాసులందరూ తినడానికి ఎంతో ఉంది, మరియు అయితే నేను ఇక్కడ అలమటిస్తున్నాను.”
- 47:04 వారు నడుస్తూ వస్తుండగా, దాసి “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు” అని గట్టిగా కేకలు వేసి చెప్పెను.
- 50:04 “దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు” అని యేసు కూడా చెప్పాడు.
పదం సమాచారం:
- (Serve) H327, H3547, H4929, H4931, H5647, H5656, H5673, H5975, H6213, H6399, H6402, H6440, H6633, H6635, H7272, H8104, H8120, H8199, H8278, H8334, G1247, G1248, G1398, G1402, G1438, G1983, G2064, G2212, G2323, G2999, G3000, G3009, G4337, G4342, G4754, G5087, G5256
సొదొమ
నిర్వచనము:
అబ్రాహాము తోడబుట్టిన వాని కొడుకు లోతు మరియు తన కుటుంబముతో జీవించిన దక్షిణ కానానులో ఒక పట్టణమైయుండెను.
- సొదొమ చుట్టూ ఉన్నటువంటి భూమి అంతయు నీరావరి మరియు ఫలవంతమైన భూమియైయుండెను, అందుచేత లోతు కానానులో మొదటిగా స్థిరపడిన దేశమైన ప్రాంతములో జీవించుటకు ఆ భూమిని ఎన్నుకొనెను.
- ఈ పట్టణము ఎక్కడ ఉందని ఖచ్చితముగా తెలియదు, ఎందుకంటే సొదొమ మరియు దాని దగ్గరలోని గొమొర్ర నగరములోని ప్రజలు చేసిన దుష్ట కార్యములను బట్టి దేవునిచేత సంపూర్ణగా నాశనము చేయబడియున్నాయి.
- సొదొమ మరియు గొమొర్ర ప్రజలు స్వలింగ సంపర్కము జరిగించే భయంకర పాపమునకు నిలువెత్తు నిదర్శనమైయుండిరి.
(ఈ పదములను కూడా చూడండి: కనాను, గొమొర్రా)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ఆది.10:19-20
- ఆది.13:12-13
- మత్తయి.10:14-15
- మత్తయి.11:23-24
పదం సమాచారం:
సోదరుడు
నిర్వచనం:
"సోదరుడు" అనే పదం కనీసం ఒక జీవసంబంధమైన తల్లినిగానీ లేదా తండ్రిని గానీ పంచుకొనే ఒక మగ తోబుట్టువును సూచిస్తుంది.
- కొత్త నిబంధనలో "సోదరులు" అనే పదం ఒకే గోత్రంలో, కుటుంబంలో, వృత్తిలో లేదా ప్రజా గుంపులో సభ్యులుగా బంధువులకూ, లేదా సహచరులకూ సాధారణ సూచనగా కూడా ఉపయోగించబడింది.
- కొత్తనిబంధనలో అపొస్తలులు తరచుగా తోటి క్రైస్తవులను, స్త్రీ పురుషులనూ సహితం సూచించడానికి "సోదరులు" పదం ఉపయోగించారు.
- కొన్ని సార్లు కొత్త నిబంధనలో, ఈ పదం "సోదరి"ని స్పష్టంగా సాటి క్రైస్తవురాలు అయిన స్త్రీని సూచించడానికి అపోస్తలులు ఉపయోగించారు. లేదా పురుషులూ, స్త్రీలనూ కలిపి నొక్కి చెప్పడానికి ఉపయోగించారు. ఉదాహరణకు, యాకోబు తాను "ఒక సోదరుడు లేక సోదరి ఆహారం, వస్త్రాల అవసరతలో ఉన్నారు" అని సూచిస్తున్నప్పుడు విశ్వాసులందరి గురించి మాట్లాడుతున్నాడు.
అనువాదం సూచనలు:
- సహజమైన లేదా జీవసంబంధమైన సోదరుని గురించి సూచించేటప్పుడు, అది తప్పు అర్థం ఇవ్వనట్లయితే, లక్ష్య భాషలో ఉపయోగించబడే అక్షరార్థమైన పదంతో అనువదించబడవచ్చు.
- పాత నిబంధనలో ముఖ్యంగా, ఒకే కుటుంబం, తెగ, లేదా ప్రజా సమూహంలోని సభ్యులను సూచించడానికి సాధారణంగా "సోదరుల" పదం ఉపయోగించబడినప్పుడు "బంధువులు" లేదా కుటుంబ సభ్యులు" లేదా "తోటి ఇశ్రాయేలీయులు" అని ఉపయోగించవచ్చు.
- క్రీస్తులో సాటి విశ్వాసిని గురించి చెప్పే సందర్భంలో ఈ పదం "క్రీస్తులో సోదరుడు” లేదా “ఆత్మ సంబంధమైన సోదరుడు" అని అనువదించబడవచ్చు.
- మగవారినీ, స్త్రీలనూ సూచిస్తున్నప్పుడు "సోదరుడు"అనే పదం తప్పు అర్థం ఇస్తుంది. అప్పుడు మరింత సాధారణ సంబంధాన్ని సూచించే పదం ఉపయోగించ వచ్చు, ఈ పదంలో పురుషులూ, స్త్రీలూ కలిసి ప్రస్తావించబడతారు.
- ఈ పదం పురుషులూ, స్త్రీలు అయిన విశ్వాసులను సూచించదానికి "తోటి విశ్వాసులు" లేదా "క్రైస్తవ సోదరులు, సోదరీలు" అని అనువదించబడవచ్చు.
- పదంఉపయోగించబడిన సందర్భంలో అది మగవారిని మాత్రమే సూచిస్తుందా లేదా పురుషులూ స్త్రీలూ ఇద్దరూ ప్రస్తావించబడ్డారా అని పరిశీలించండి.
(చూడండి: అపొస్తలుడు, తండ్రియైన దేవుడు, సహోదరి, ఆత్మ)
బైబిలు రిఫరెన్సులు:
- అపొ.కా. 07:26
- ఆది. 29:10
- లేవి. 19:17
- నెహెమ్యా 03:01
- ఫిలిప్పీ 04:21
- ప్రకటన 01:09
పదం సమాచారం:
- Strong's: H251, H252, H264, H1730, H2992, H2993, H2994, H7453, G80, G81, G2385, G2455, G2500, G4613, G5360, G5569
సోయరు
వాస్తవాలు:
సోయరు అనేది చిన్న ఊరు, దేవుడు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలను నాశనంచేసినపుడు లోతు ఈ సోయరు అనే ప్రాంతానికి పారిపోయెను.
- ఇది గతంలో “బేలా” అని పిలువబడేది అయితే లోతు దేవుణ్ణి ఈ “చిన్న” నగరాన్ని రక్షించమని అడిగినప్పుడు “సోయరు” అని పేరు మార్చబడింది.
- సోయరు అనేది యోర్దాను నదీతీరప్రాంతంలో కానీ లేదా మృతసముద్రం యొక్క దక్షిణభాగం చివరలో కనబడుతుంది.
(దీనిని చూడండి: లోతు, సొదొమ, గొమొర్రా)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ద్వితియో. 34:1-3
- ఆది. 13:10-11
- ఆది 14:1-2
- ఆది 19:21-22
- ఆది 19:23-25
పదం సమాచారం:
స్తుతి, స్తుతులు, స్తుతించెను, స్తుతించుట, స్తుతికి అర్హుడు
నిర్వచనము:
ఎవరినైనా స్తుతించాలంటే ఆ వ్యక్తికొరకు గౌరవమును మరియు ప్రశంసలను వ్యక్తపరచాలి.
- దేవుని గొప్పతనమునుబట్టి ప్రజలందరు దేవునిని స్తుతిస్తారు మరియు లోక రక్షకునిగాను, సృష్టికర్తగాను ఆయన చేసిన అద్భుత కార్యములనుబట్టి ఆయనను స్తుతిస్తారు.
- దేవుని కొరకైన స్తుతిలో అనేకమార్లు ఆయన చేసిన కార్యముల కొరకు కృతజ్ఞతలు చెల్లించుటయనునది ఉండును.
- సంగీతము మరియు పాటలు పాడుట అనునది అనేకమార్లు దేవునిని స్తుతించు విదానముగా పరిగణించబడును.
- దేవునిని ఆరాధించుట అనునది ఆయనను స్తుతించుటయను అర్థములో భాగమునైయున్నది.
- “స్తుతి” అనే పదమును “మంచిగా మాట్లాడు” లేక “మాటలతో గొప్పగా ఉన్నతంగా ఘనపరచు” లేక “మంచి విషయములు పలుకు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- “స్తుతి” అనే నామపదమును “ఘనముగా మాట్లాడు” లేక “ఘనపరిచే విధముగా మాట్లాడు” లేక “మంచి విషయములను చెప్పి మాట్లాడు” అని తర్జుమా చేయవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి: ఆరాధన)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 2 కొరింతి.01:3-4
- అపొ.కార్య.02:46-47
- అపొ.కార్య.13:48-49
- దాని.03:28
- ఎఫెసీ.01:3-4
- ఆది.49:8
- యాకోబు.03:9-10
- యోహాను.05:41-42
- లూకా.01:46-47
- లూకా.01:64-66
- లూకా.19:37-38
- మత్తయి.11:25-27
- మత్తయి.15:29-31
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 12:13 ఇశ్రాయేలీయులు దేవునిని స్తుతించుటకు మరియు వారి క్రొత్త స్వాతంత్ర్యమును ఆచరించుటకు అనేకమైన పాటలు పాడిరి, ఎందుకంటే దేవుడు వారిని ఐగుప్తు సైన్యమునుండి రక్షించెను.
- 17:08 దావీదు ఈ మాటలు వినినప్పుడు, అతను తక్షణమే దేవునిని స్తుతించి, కృతజ్ఞతలు తెలియజేసెను, ఎందుకంటే ఇటువంటి ఘనతను మరియు అనేక ఆశీర్వాదములను ఇస్తానని దేవుడు దావీదుకు వాగ్ధానము చేసియుండెను.
- 22:07 “దేవునిని స్తుతించుడి, ఎందుకనిన ఆయన తన ప్రజలను జ్ఞాపకము చేసికొనెను” అని జెకర్యా చెప్పెను!
- 43:13 వారందరు (శిష్యులు) కూడి దేవుని స్తుతించుటలో సంతోషించిరి మరియు వారితోనున్న సమస్తము వారిలో ఒకరితో ఒకరు పంచుకొనిరి.
- 47:08 వారు పౌలు మరియు సీలను చెరలో ఎక్కువ భద్రత కలిగిన భాగమందు ఉంచిరి మరియు వారి కాళ్ళను బంధించిరి. అయినను మధ్యరాత్రియందు, వారు పాటలు పాడుచు దేవునిని స్తుతించిరి .
పదం సమాచారం:
- Strong's: H1319, H6953, H7121, H7150, G1229, G1256, G2097, G2605, G2782, G2783, G2784, G2980, G3853, G3955, G4283, G4296
స్వరూపం, స్వరూపాలు, చెక్కిన ప్రతిమ, చెక్కిన ప్రతిమలు, పోత విగ్రహాలు, బొమ్మ, బొమ్మలు, చెక్కిన బొమ్మ, చెక్కిన బొమ్మలు, లోహం పోతపోసిన బొమ్మ, లోహం బొమ్మలు
నిర్వచనం:
ఈ పదాలు అబద్ధ దేవుళ్ళ విగ్రహాలను సూచించడానికి ఉపయోగిస్తారు. పూజా విగ్రహాలు, "స్వరూపం" "చెక్కిన ప్రతిమ" అనే మాటలు కూడా వాడతారు.
- "చెక్కిన ప్రతిమ” లేక “చెక్కిన బొమ్మ" అంటే కొయ్యతో చేసిన ప్రతిమ. జంతువు, వ్యక్తి, లేక వస్తు రూపం.
- "పోత పోసిన లోహం బొమ్మ" అంటే లోహం కరిగించి పోత పోసి జంతువు, లేక వ్యక్తి ఆకారం తీసుకు వస్తారు.
- ఈ కొయ్యతో లోహంతో చేసిన బొమ్మలను అబద్ద దేవుళ్ళ పూజకు ఉపయోగిస్తారు.
- "స్వరూపం" అంటే విగ్రహం కొయ్యతో, లోహంతో చేసిన బొమ్మ.
అనువాదం సలహాలు:
- విగ్రహం గురించి చెప్పేటప్పుడు "స్వరూపం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "విగ్రహం” లేక “చెక్కిన విగ్రహం” లేక “చెక్కిన మత ప్రతిమ."
- కొన్ని భాషల్లో స్పష్టంగా ఉండవచ్చు. ఎప్పుడూ వర్ణనాత్మక పదం వాడాలి. "చెక్కిన ప్రతిమ” లేక “లోహం పోతపోసిన బొమ్మఅనే మాటలు వాడాలి. "స్వరూపం” లేక “బొమ్మ" అనే మాటలు మూల భాషలో ఉన్నప్పటికీ ఇలా రాయాలి.
- ఈ పదాన్ని వివిధ రీతులలో దేవుని పోలికకు ఉపయోగిస్తారు అని స్పష్టంగా చెప్పాలి.
(చూడండి: దేవుడు, దేవుడు, దేవుడు, దేవుని పోలిక)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 14:9-10
- అపో. కా. 07:43
- యెషయా 21:8-9
- మత్తయి 22:20-22
- రోమా 01:22-23
పదం సమాచారం:
- Strong's: H457, H1544, H2553, H4541, H4676, H4853, H4906, H5257, H5262, H5566, H6091, H6456, H6459, H6754, H6755, H6816, H8403, H8544, H8655, G1504, G5179, G5481
స్వేచ్ఛ, స్వేచ్ఛగా, స్వతంత్రుడు, స్వేచ్ఛ సంకల్పం, స్వాతంత్ర్యం
నిర్వచనం:
పదాలు "స్వేచ్ఛ” లేక “స్వాతంత్ర్యం" అంటే బానిసత్వం నుండి విడుదల. మరొకపదం "స్వాతంత్ర్యం."
- "ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వడం” లేక “స్వేచ్ఛ కలిగించడం" అంటే ఎవరినైనా బానిసత్వం లేక చెర నుండి విడిపించడం.
- బైబిల్లో, ఈ పదాలు తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు. విశ్వాసి యేసులో ఇక పాపం శక్తి కింద లేడు.
- "స్వాతంత్ర్యం” లేక “స్వేచ్ఛ పొందడం" అనేది మోషే ధర్మశాస్త్రానికి లొంగి ఉండను అవసరం లేదు. పరిశుద్ధాత్మ నడిపింపులో బోధలో ఉండే స్వేచ్ఛ.
అనువాదం సలహాలు:
- "స్వేచ్ఛ" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "బంధించ బడక” లేక “బానిసగా లేక పోవడం” లేక “బానిసత్వం నుండి విడుదల” లేక “బానిసత్వం లో లేకపోవడం."
- " స్వేచ్ఛ” లేక “స్వాతంత్ర్యం" అనే పదాలను ఇలా అనువదించ వచ్చు. "స్వేచ్ఛగా ఉండే స్థితి” లేక “బానిసగా లేని స్థితి” లేక “బంధించి ఉండని స్థితి."
- "విడిపించడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "స్వేచ్ఛనివ్వడం” లేక “బానిసత్వంనుండి రక్షించు” లేక “బానిసత్వం నుండి విడుదల."
- "స్వేచ్ఛపొందిన" అంటే "విడుదల అయిన” లేక “బయటికి తేబడిన."
(చూడండి: కట్టివేయు, బానిసను చేయడం, సేవకుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- గలతి 04:26-27
- గలతి 05:1-2
- యెషయా 61:1
- లేవీ 25:10
- రోమా 06:17-18
పదం సమాచారం:
- Strong's: H1865, H2600, H2666, H2668, H2670, H3318, H4800, H5068, H5069, H5071, H5081, H5337, H5352, H5355, H5425, H5674, H5800, H6299, H6362, H7342, H7971, G425, G525, G558, G572, G629, G630, G859, G1344, G1432, G1657, G1658, G1659, G1849, G2010, G3032, G3089, G3955, G4174, G4506, G5483, G5486
హనోకు
వాస్తవాలు:
హనోకు పాత నిబంధనలో ఇద్దరు నుషుల పేరు.
- ఒక మనిషి షేతు సంతతి వాడు. అతడు నోవహు పూర్వీకుడు.
- హనోకు దేవునితో సన్నిహిత సంబంధం గలవాడు. అతడు 365 సంవత్సరాలు జీవించిన తరువాత దేవుడు అతడింకా బ్రతికి ఉండగానే పరలోకం తీసుకుపోయాడు.
- హనోకు అనే పేరు గల మరొకడు కయీను కుమారుడు.
(చూడండి: కయీను, షేతు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 01:1-4
- ఆది 05:18-20
- ఆది 05:21-24
- యూదా 01:14-16
- లూకా 03:36-38
పదం సమాచారం:
హవ్వ
వాస్తవాలు:
మొదటి స్త్రీ పేరు. ఆమె పేరుకు అర్థం "జీవం” లేక “ప్రాణం గల."
- దేవుడు ఆదాము నుండి పక్కటెముక తీసి హవ్వను చేశాడు.
- హవ్వను ఆదాముకు "సహాయకురాలుగా" చేశాడు. ఆమె ఆదాము వెంట ఉండి దేవుడు అతనికి ఇచ్చిన పనిలో సహకరించాలి.
- హవ్వను సాతాను (పాము రూపంలో) విషమ పరీక్షకు గురిచేసి మొదటగా దేవుడు తినవద్దన్న పండు తినడం ద్వారా పాపం చేయించాడు.
(చూడండి: ఆదాము, జీవం, సాతాను)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తిమోతి 02:13-15
- 2 కొరింతి 11:3-4
- ఆది 03:20-21
- ఆది 04:1-2
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 01:13 తరువాత దేవుడు ఆదాము పక్కటెముకల్లో ఒకటి తీసి ఒక స్త్రీగా చేసి, ఆమెను ఆదాము దగ్గరికి తెచ్చాడు.
- 02:02 అయితే ఆ తోటలో కుటిలమైన పాము ఉన్నాడు. అతడు ఆ స్త్రీని ఇలా అడిగాడు. "దేవుడు నిజంగా తోటలోని ఏ చెట్టు పండు తినవద్దు అన్నాడా?"
- 02:11 అతని భార్య పేరు హవ్వ, అంటే "జీవం ఇచ్చేది" ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి అవుతుంది.
- 21:01 దేవుడు వాగ్దానం చేశాడు. మానవ సంతతి వాడు హవ్వకు జన్మించి పాము శిరస్సు చితకగొడతాడు.
- 48:02 సాతాను తోటలో పాము ద్వారా మాట్లాడి తద్వారా హవ్వను మోసగించాడు.
- 49:08 ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతానంఅంతటినీ చెరిపింది.
- 50:16 ఎందుకంటే ఆదాము హవ్వ దేవునికి లోబడలేదు. వారు లోకంలోకి పాపాన్ని తెచ్చారు. దేవుడు వారిని శపించి నాశనం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.
పదం సమాచారం:
హాగరు
వాస్తవాలు:
హాగరు ఐగుప్తియ స్త్రీ. ఆమె శారా బానిస.
- శారాకు పిల్లలు కలగక పొతే ఆమె హాగరును సంతానం కోసం తన భర్త అబ్రాముకు ఇచ్చింది.
- హాగరు గర్భ ధారణ జరిగి ఆమె అబ్రాము కుమారుడు ఇష్మాయేలుకు జన్మ నిచ్చింది.
- హాగరు ఎడారిలో అల్లాడుతుండగా దేవుడు ఆమెను ఆదుకుని ఆమె సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు.
(చూడండి: అబ్రాహాము, వారసుడు, ఇష్మాయేలు, శారా, సేవకుడు)
బైబిల్ రిఫరెన్సులు:
- గలతి 04:24-25
- ఆది 16:1-4
- ఆది 21:8-9
- ఆది 25:12
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 05:01 కాబట్టి అబ్రాము భార్య శారాఅతనితో చెప్పింది, "ఎందుకంటే దేవుడు నాకు పిల్లలను ఇవ్వలేదు. ఇప్పుడు నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను. ఇదుగో నా సేవిక,హాగరు. ఆమెను వివాహమాడి నాకోసం ఒక కొడుకును కను."
- 05:02 హాగరు కు కొడుకు పుట్టాడు. అబ్రాము అతని పేరు ఇష్మాయేలు అని పెట్టాడు.
పదం సమాచారం:
హాము
వాస్తవాలు:
హాము నోవహు ముగ్గురు కుమారులలో రెండవ వాడు.
- ప్రపంచ వ్యాప్తమైన వరద భూమిని ముంచెత్తినప్పుడు హాము, అతని సోదరులు వారి భార్యలతో సహా ఓడలో నోవహుతో ఉన్నారు.
- వరద తరువాత హాము తన తండ్రి, నోవహుకు అప్రతిష్ట తెచ్చిన సందర్భం ఉంది. ఫలితంగా, నోవహు హాము కుమారుడు కనానును, తన సంతానం అంతటినీ శపించాడు. ఎట్టకేలకు వీరు కనానీయ జాతి అయ్యారు.
(చూడండి: మందసం, కనాను, అప్రతిష్ట, నోవహు)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 05:32
- ఆది 06:9-10
- ఆది 07:13-14
- ఆది 10:1
- ఆది 10:19-20
పదం సమాచారం:
హాయి
వాస్తవాలు:
పాత నిబంధన కాలంలో హాయి అనేది ఒక కనాను ఊరు. ఇది బేతేలుకు దక్షిణాన యెరికోకు 8 కి.మీ. వాయవ్యంగా ఉంది.
- యెరికోను ఓడించాక, యెహోషువా ఇశ్రాయేలీయుల హాయిపై దాడికి పంపించాడు. అయితే వారు తేలికగా ఓడిపోయారు. ఎందుకంటే దేవుడు వారిపై కోపగించాడు.
- ఆకాను అనే ఒక ఇశ్రాయేలు వాడు యెరికో దోపుడు సొమ్మును ఉంచుకున్నాడు. అతని కుటుంబం అంతా చనిపోవాలని దేవుడు అజ్ఞాపించాడు. దేవుడు ఇశ్రాయేలీయులు హాయి వారిని ఓడించేలా చేశాడు.
(చూడండి: బేతేలు, యెరికో)
బైబిల్ రిఫరెన్సులు:
- ఎజ్రా 02:27-30
- ఆది 12:8-9
- ఆది 13:3-4
- యెహోషువా 07:2-3
- యెహోషువా 08:10-12
పదం సమాచారం:
హారాను
వాస్తవాలు:
హారాను అబ్రాము తమ్ముడు. లోతు తండ్రి.
- హారాను అనేది ఒక ఊరు పేరు కూడా. అబ్రాము, తన కుటుంబం ఊరు నుండి కనాను ప్రదేశం చేరుకునే ప్రయాణంలో కొంత కాలం ఇక్కడ నివసించారు.
- హారాను అనే పేరుగల వేరే వ్యక్తులు. కాలేబు కుమారుడు.
- మరొక హారాను లేవీ సంతతి వాడు.
(చూడండి: అబ్రాహాము, కాలేబు, కనాను, లేవి, లోతు, తెరహు, ఉర్)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 రాజులు 19:12-13
- అపో. కా. 07:1-3
- ఆది 11:31-32
- ఆది 27:43-45
- ఆది 28:10-11
- ఆది 29:4-6
పదం సమాచారం:
హీబ్రూ, హెబ్రీ
వాస్తవాలు:
"హెబ్రీ" ప్రజలు అబ్రాహాము నుండి ఇస్సాకు, యాకోబు ద్వారా వచ్చిన వారు. హెబ్రీయుడు అని మొదటగా బైబిల్లో పిలిచిన వ్యక్తి అబ్రాహాము.
- "హీబ్రూ" అంటే హెబ్రీయులు మాట్లాడిన భాష. ఎక్కువ భాగం పాత నిబంధన హీబ్రూ భాషలో రాశారు.
- బైబిల్లో చాలా చోట్ల హెబ్రీవారిని "యూదు ప్రజలు” లేక “ఇశ్రాయేలీయులు" అని కూడా పిలిచారు. ఈ పదాలు మూడు ఒకే ప్రజా సమూహం అని మనసులో పెట్టుకుని ఈ మూడు పదాలను వేరువేరుగా ఉంచడం మంచిది..
(చూడండి: ఇశ్రాయేలు, యూదుడు, యూదు అధికారులు)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 26:12-14
- ఆది 39:13-15
- ఆది 40:14-15
- ఆది 41:12-13
- యోహాను 05:1-4
- యోహాను 19:12-13
- యోనా 01:8-10
- ఫిలిప్పి 03:4-5
పదం సమాచారం:
- Strong's: H5680, G1444, G1445, G1446, G1447
హృదయం, హృదయాలు
నిర్వచనం:
బైబిల్లో, "హృదయం" అనే పదాన్ని ఒక వ్యక్తి ఆలోచనలు, భావాలు, అభిలాషలు, లేక సంకల్పం మొదలైన వాటిని చెప్పడానికి తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు.
- "కఠిన హృదయం" అనే మాటకు సాధారణంగా ఒక వ్యక్తి తలబిరుసుగా దేవునికి లోబడకుండా ఉండడం అని అర్థం.
- "నా హృదయమంతటితో” లేక “హృదయపూర్వకంగా" అంటే ఏదైనా చెయ్యడంలో ఏదీ దాచుకోకుండా పూర్ణ అధికారిక ఒప్పందంతో, ఇష్టంతో పనిచెయ్యడం.
- "హృదయానికి పట్టించుకోవడం" అంటే దేన్నైనా సీరియస్ గా తీసుకుని తన జీవితానికి అన్వయించుకోవడం.
- "పగిలిన హృదయం" అనే మాట గొప్ప విచారంలో ఉన్న మనిషిని వర్ణించేది. అలాటి వ్యక్తి లోతైన గాయం తగిలి మానసికంగా కుంగిపోయిన వాడు.
అనువాదం సలహాలు
- కొన్ని భాషల్లో కడుపు, కాలేయం వంటి వివిధ శరీరభాగాలు ఇందుకు వాడతారు.
- కొన్ని భాషలు ఒక పదం, ఇతర భాషలు వేరొక పదం ఈ సంగతి చెప్పడానికి వాడవచ్చు.
- కొన్ని భాషల్లో "హృదయం" లేక ఇతర శరీరభాగాలు ఈ అర్థం ఇవ్వకపోతే ఆ "ఆలోచనలు” లేక “భావాలు” లేక “అభిలాషలు” వెల్లడి పరచే అక్షరాలా అలాటి పదాలు ఉపయోగించాలి.
- సందర్భాన్ని బట్టి, "నా హృదయమంతటితో” లేక “హృదయపూర్వకంగా" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నా శక్తి అంతా ఉపయోగించి” లేక “నా పూర్ణ శ్రద్ధతో” లేక “సంపూర్తిగా” లేక “పరిపూర్ణమైన అధికారిక ఒప్పందంతో."
- "హృదయానికి పట్టించుకోవడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సీరియస్ గా తీసుకోవడం” లేక “సంపూర్ణంగా దానిపై దృష్టి పెట్టడం."
- "కఠిన హృదయం " అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తలబిరుసుగా తిరుగుబాటు చేసిన” లేక “లోబడడానికి నిరాకరించు” లేక “ఎడతెగక దేవుణ్ణి ధిక్కరించడం."
- "పగిలిన హృదయం" అనే దాన్ని "గొప్ప విచారం” లేక “లోతైన గాయం" అని తర్జుమా చెయ్యవచ్చు.
(చూడండి: కఠిన)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 యోహాను 03:16-18
- 1 తెస్స 02:3-4
- 2 తెస్స 03:13-15
- అపో. కా. 08:20-23
- అపో. కా. 15:7-9
- లూకా 08:14-15
- మార్కు 02:5-7
- మత్తయి 05:5-8
- మత్తయి 22:37-38
పదం సమాచారం:
- Strong's: H1079, H2436, H2504, H2910, H3519, H3629, H3820, H3821, H3823, H3824, H3825, H3826, H4578, H5315, H5640, H7130, H7307, H7356, H7907, G674, G1282, G1271, G2133, G2588, G2589, G4641, G4698, G5590
హెబ్రోను
వాస్తవాలు:
హెబ్రోను ఉన్నతమైన కొండలపై యెరూషలేముకు 20 మైళ్ళు దక్షిణాన ఉన్న ఊరు.
- క్రీ. పూ 2000 అబ్రాము కాలంలో ఈ పట్టణం నిర్మాణం జరిగింది. పాత నిబంధన చారిత్రిక కథనాల్లో అనేక సార్లు ఈ పట్టణం ప్రస్తావన ఉంది.
- హెబ్రోను పట్టణానికి దావీదు రాజు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. అతని కొడుకులు చాలా మంది అబ్షాలోముతో సహా ఇక్కడే పుట్టారు.
- క్రీ శ 70 లో ఈ పట్టణాన్నిరోమీయులు నాశనం చేశారు.
(చూడండి: అబ్షాలోము)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 సమూయేలు 02:10-11
- ఆది 13:16-18
- ఆది 23:1-2
- ఆది 35:26-27
- ఆది 37:12-14
- న్యాయాధి 01:8-10
- సంఖ్యా 13:21-22
పదం సమాచారం:
- Strong's: H2275, H2276, H5683
హేబెలు
వాస్తవాలు:
హేబెలు ఆదాము హవ్వల రెండవ కొడుకు. అతడు కయీను తమ్ముడు.
- హేబెలు గొర్రెల కాపరి.
- హేబెలు దేవునికి అర్పణగా కొన్ని జంతువులను అర్పించాడు.
- దేవుడు హేబెలు, అతని అర్పణల విషయంలో సంతోషించాడు.
- ఆదాము హవ్వల పెద్ద కొడుకు కయీను హేబెలును చంపాడు.
(చూడండి: కయీను, బలియాగము, కాపరి)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 04:1-2
- ఆది 04:8-9
- హెబ్రీ 12:22-24
- లూకా 11:49-51
- మత్తయి 23:34-36
పదం సమాచారం: