1 నుంచి 17 వచనాలు యేసుక్రీస్తు పూర్వికుల వివరాలను తెలుపుతాయి
దీనినే ఇంకో విధంగా:" అబ్రాహాము వంశానికి చెందిన దావీదు వంశస్తుడైన" అని అనువదించవచ్చు. అబ్రహముకు అతని వంశస్తుడైన
దావీదుకు మధ్య చాలా తరాలు, అలాగే దావీదుకు అతని వంశస్తుడైన యేసుకు మధ్య చాలా తరాలు ఉన్నాయి.
"దావీదు కుమారుడు" అన్న పదబంధాన్ని 9:27 లోను ఇతర వచనాలలో కూడా గౌరవ నామంగా వాడారు, కానీ ఇక్కడ దాన్ని కేవలం యేసు వంశావళిని తెలియజేయడానికి మాత్రమే ఉపయోగించారు.
దీనినే ఇంకో విధంగా "అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి అయ్యాడు" లేక "అబ్రహముకు ఇస్సాకు అనే కొడుకు ఉన్నాడు" అని రాయొచ్చు. వీటిలో ఏదో ఒక పద్దతిని ఎంచుకుని దాన్నే ఈ వంశస్తుల జాబితా అంతా రాయడానికి ఉపయోగిస్తే పాఠకులకు తేలిగ్గా అర్థమవుతుంది.
స్త్రీ పురుషుల పేర్లు రాయడానికి వేరు వేరు సంబోధనలు వున్న భాషల్లో ఈమె పేరును స్త్రీ సంబోధనగా రాయాలి.
.
యేసు పూర్వికుల జాబితా కొనసాగుతున్నది. Mathew 1:2
3 లలో వాడిన పదజాలాన్నే వాడాలి.
స్త్రీ పురుషుల పేర్లు రాయడానికి వేరు వేరు సంబోధనలు వున్న భాషల్లో ఈ పేర్లకు స్త్రీ సంబోధనను వాడాలి.
"సోలోమోను తండ్రి దావీదు, తల్లి ఊరియా భార్య." లేక "దావీదు, ఊరియా భార్య, సోలోమోను తల్లిదండ్రులు."
" ఊరియా భార్య విధవరాలు."
యేసు పూర్వికుల జాబితా కొనసాగుతున్నది. Mathew 1:2
3 లలో వాడిన పదజాలాన్నే వాడాలి.
కొన్నిసార్లు ఇతని పేరును "ఆసాపు" అని అనువదించారు.
నిజానికి యెహోరాము ఉజ్జీయా తాత, కాబట్టి ఇక్కడ "తండ్రి" బదులు "పూర్వీకుడు" అని అనువదించవచ్చు(యుడిబి).
"యేసు పూర్వికుల జాబితా కొనసాగుతున్నది. Mathew 1:2
3 లలో వాడిన పదజాలాన్నే వాడాలి.
కొన్నిసార్లు దీన్ని ఆమోసు అని అనువదించారు.
యోషియా నిజానికి యెకొన్యా తాత. (యు డి బి చూడండి.).
" వారు బబులోనుకు బలవంతంగా పంపబడినప్పుడు." లేక "బబులోనులో నివసించాలని బబులోనీయులు వారిని బలవంతపెట్టినప్పుడు." మీ భాషలో బబులోనుకు ఎవరు వెళ్ళారో చెప్పాల్సి వస్తే, మీరు "ఇశ్రాయేలీయులు" లేక "యూదాలో నివసించిన ఇశ్రాయేలీయులు" అని చెప్పొచ్చు.
యేసు వంశస్తుల జాబితా కొనసాగుతున్నది. మత్తయి 1:2
3 లలో వాడిన పదజాలాన్నే వాడాలి.
1:11 లో వాడిన పదజాలాన్నే వాడాలి.
నిజానికి షయల్తీయేలు జెరుబ్బాబెలు తాత (యుడిబి చూడండి).
యేసు వంశస్తుల జాబితా కొనసాగుతున్నది. మత్తయి 1:2
3 లలో వాడిన పదజాలాన్నే వాడాలి.
దీన్నే"యేసుకు జన్మనిచ్చిన మరియ" అని కర్తరీ ప్రయోగంలో అనువదించవచ్చు.” (కర్త ప్రధానంగా, లేక కర్మ ప్రధానంగా వున్న వాక్య ప్రయోగాలు చూడండి.).
1:11 లో వాడిన పదజాలాన్నే వాడాలి.
యేసు పుట్టుకకు దారి తీసిన సంఘటనల వివరాలు ఇక్కడ మొదలవుతాయి. ఒకవేళ మీ భాషలో అంశాలు మారినప్పుడు వేరే విధంగా చెప్పే అవకాశం వుంటే దాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు.
సభ్యతతో కూడిన ఈ మాటకు అసలు అర్ధం "వారి మధ్య శారీరక సంబంధం లేక ముందు"అని. (చూడండి: సభ్యోక్తి).
మరియ గర్భం ధరించేలా పరిశుద్ధాత్మ చేశాడు.
యేసు పుట్టుకకు దారి తీసిన సంఘటనల వివరాలు ఇక్కడ కొనసాగుతున్నాయి.
ఒక దేవదూత అకస్మాత్తుగా యోసేపు ముందు నిలిచాడు.
ఇక్కడ "కుమారుడు" అన్న పదానికి అర్ధం "వంశానికి చెందిన" అని. దావీదు యోసేపు తండ్రి కాడు, అతని పూర్వికుడు.
" పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం ద్వారా మరియ గర్భవతి అయింది.” (కర్త లేక కర్మ ప్రధాన వాక్య ప్రయోగాలు చూడండి.).
ఇది ఒక ఆజ్ఞ. "అతనికి పేరు పెట్టండి" లేక " అతనికి ఈ పేరు పెట్టండి" లేక "అతనికి నామకరణం చేయండి"
"తన ప్రజలు" అంటే యూదులు.
యేసు పుట్టుక ద్వారా నెరవేరే ప్రవచనాన్ని మత్తయి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
కర్త ప్రధాన వాక్య ప్రయోగాన్ని ఉపయోగించి "దేవుడు చాలాకాలం క్రితం యెషయా ప్రవక్తకు ఏం రాయమని చెప్పాడంటే." (కర్త లేక కర్మ ప్రధాన వాక్య ప్రయోగాలు చూడండి.).
దీనికి బదులు "చూడు" లేక "విను" లేక " నేను చెపుతున్న దానిని శ్రద్ధగా విను" అని రాయొచ్చు.
యెషయా 7:14 లోని వచనాలనే ఇక్కడ ప్రస్తావించారు.
యేసు పుట్టుకకు దారి తీసిన సంఘటనల వివరాలను మళ్ళీ ఇక్కడ చూస్తాం.
మరియను భార్యగా స్వీకరించి, పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టమని దేవదూత అతనికి చెప్పాడు. (20
21 వచనాలు).
"ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకోలేదు” (సభ్యోక్తి గురించి చూడండి.).
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతులను ఈ అధ్యాయంలో వివరిస్తారు.
"యూదా దేశంలోని బెత్లేహేము పట్టణం” (యుడిబి).
"నక్షత్ర శాస్త్రాన్ని ఆధ్యయనం చేసినవారు" (యుడిబి).
ఇక్కడ హేరోదు మహారాజు అని అర్థం.
"ఆయనను గురించి తెలిపే నక్షత్రం" లేక "ఆయన పుట్టకకు సంబంధించిన నక్షత్రం." ఆ నక్షత్రానికి అతనే సొంతదారుడు అని వారు చెప్పడం లేదు.
ఈ పదాన్ని కింది అర్ధాలలో అనువదించవచ్చు.
1). ఆ బిడ్డను "దేవత్వము" కలిగినవాడిగా వారు భావించి ఆరాధించాలని అనుకొన్నారు.
2). మానవులందరికీ రాజుగా వారు ఆయనను గుర్తించి "గౌరవించాలని" అనుకున్నారు.
మీ భాషలో ఈ రెండు అర్ధాలను ఇచ్చే పదం ఉంటే దాన్ని ఇక్కడ ఉపయోగించడానికి ప్రయత్నించండి.
తనకు బదులుగా మరొకరు యూదుల రాజు అవుతాడని "అతడు ఆందోళన చెందాడు."
హేరోదు రాజు ఏమి చేస్తాడో అని "యెరూషలేములో చాలామంది ప్రజలు (యు డి బి)" భయపడ్డారు.
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● యూదాలోని బెత్లేహేము
""యూదా లోని బెత్లేహేము పట్టణం"
● ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి.
దీన్నే కర్తరీ ప్రయోగంలో "ప్రవక్త ఇలా రాశాడు" అని రాయొచ్చు.
● ప్రవక్త ద్వారా వ్రాయబడింది. దీన్నే "మీకా ప్రవక్త ద్వారా రాయబడింది" లేక "మీకా ప్రవక్త రాశాడు." అని రాయొచ్చు.
●యూదా దేశపు బెత్లేహీమా. నీవు యూదా ప్రదానులలో ఎంత మాత్రంను అల్పమైనదానవు కావు
"బెత్లేహేము పట్టణ ప్రజలారా మీ ఊరు చాలా గొప్పది” (యుడిబి). " ఓ బెత్లేహేమా, అతి ప్రాముఖ్యమైన పట్టణాలలో నీవు ఒక దానివి." (అవాంతర సంబోధన చూడండి). (న్యూనోక్తి చూడండి).
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతులు వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది
● అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి
అంటే ఇతర మనుష్యులెవారికీ తెలియకుండా హేరోదు జ్ఞానులతో మాట్లాడాడు.
● ఆ శిశువు
దీనర్దం పసిపాప అయిన యేసు అని.
● పూజించు
1:2 లో వాడిన పదాలనే ఇక్కడ వాడండి.
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది
● వారు రాజు మాట విని
"తరువాత" (యుడిబి). లేక "జ్ఞానులు రాజు మాట విన్న తరువాత."
● వారికి ముందుగా నడిచెను
"వారికి దారి చూపించింది."
● మీదుగా వచ్చి నిలుచు వరకు
"మీదుగా ఆగింది." లేక "పైన ఆగింది."
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● వారు
అంటే జ్ఞానులు.
● పూజించు
1:2 లో వాడిన పదాలనే ఇక్కడ వాడండి.
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● వారు తిరిగి వెళ్ళిరి
"జ్ఞానులు తిరిగి వెళ్లారు."
● లేచి, తీసుకొని. పారిపోయి.అక్కడే యుండుమని
దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏకవచనాన్నే ఉపయోగించాలి.( 'నీవు' రూపాలు చూడండి).
● హేరోదు మరణం వరకు
హేరోదు 2:19 లో మరణిస్తాడు. ఇది వారు ఐగుప్తులో నివసించిన కాలాన్ని తెలుపుతుంది. అంతేకానీ హేరోదు వెంటనే మరణించాడని కాదు.
● ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని
ఇది హోషయా 11:1 నుండి తీసుకున్న వాక్యం. మత్తయిలోని గ్రీకు వాక్యాలకు హోషయాలోని హీబ్రూ వాక్యాలకు మధ్య కొంత తేడా ఉంది. ఇక్కడ వేరే ప్రాంతం నుండి కాదు, "ఐగుప్తులో నుండి" అన్న విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● అప్పుడు హేరోదు
యోసేపు మరియ, యేసులు ఐగుప్తుకు వెళ్ళిన తరువాత హేరోదు ఏంచేశాడో ఇక్కడ చెబుతారు. హేరోదు 2:19 వరకు జీవించి ఉన్నాడు.
● తన్ను అపహసించిరని
"జ్ఞానులు తనను మోసం చేసి నవ్వులపాలు చేసారని" (యుడిబి).
● అతను మగ శిశువులందరిని వధించాడు
"మగ బిడ్డలను అందరిని వధించమని అతడు ఆజ్ఞాపించాడు" లేక "మగ బిడ్డలను అందరిని వధించమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు." (యుడిబి).
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది. ఇక్కడ 18 వాక్యం యిర్మియా 31:15 నుండి తీసుకున్నది. అయితే గ్రీకులో ఉన్న మత్హయి వాక్యంలోని పదాలకు, హీబ్రూ లో ఉన్న యిర్మియా వాక్యంలోని పదాలకు మధ్య కొంత తేడా ఉంది.
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● ఇదిగో
పెద్ద కథలో మరో కొత్త మలుపు తిరగడానికి ఇది గుర్తు. ఇంతకు ముందు సంఘటనలోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరేవారి ప్రస్తావన వస్తుంది. మీ భాషలో దీన్ని బహుశా వేరే విధంగా చెప్పే అవకాశము ఉండొచ్చు.
● శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు
"పసి బాలుడిని చంపాలని చూసినవారు" (సభ్యోక్తి గురించి చూడండి.).
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● అయితే అతడు విని
"యోసేపు విని."
● అతని తండ్రి అయిన హేరోదు
ఇతను అర్కేలాయు తండ్రి.
● అతడు అక్కడకు వెళ్ళ వెరచి
ఇక్కడ "అతడు" అంటే యోసేపు.
● ఆయన నజరేయుడనబడునని
ఇక్కడ "ఆయన" అంటే యేసు.
యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.
● అయితే అతడు విని
"యోసేపు విని."
● అతని తండ్రి అయిన హేరోదు
ఇతను అర్కేలాయు తండ్రి.
● అతడు అక్కడకు వెళ్ళ వెరచి
ఇక్కడ "అతడు" అంటే యోసేపు.
● ఆయన నజరేయుడనబడునని
ఇక్కడ "ఆయన" అంటే యేసు.
బాప్తిస్మమిచ్చు యోహాను బోధ కొనసాగుతున్నది
● అతనిచేత బాప్తిస్మం పొందుచుండిరి
"యోహాను వారికి బాప్తిస్మమిచ్చెను." (కర్త లేక కర్మ ప్రధాన వాక్య ప్రయోగాలు చూడండి.).
● వారు
యెరూషలేము, యూదా దేశంలోని వారు, యోర్దాను తీర ప్రాంతంలోని ప్రజలు.
బాప్తిస్మమిచ్చే యోహాను బోధ కొనసాగుతున్నది.
● సర్ప సంతానమా
దీనికి బదులు "దుష్టులైన విష సర్పాల్లారా" లేక "మీరు విష సర్పాల వంటి దుష్టులైన వారు" అని రాయొచ్చు. (రూపకాలంకారం చూడండి).
● రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
ఇక్కడ యోహాను అలంకారిక ప్రశ్నవేసి ఆ ప్రజలను గద్దిస్తున్నాడు. ఎందుకంటే వారు పాపం చేయడం మానుకోవడానికి ఇస్ష్టంగా లేరు కాని దేవుని శిక్షను తప్పించుకోవడానికి బాప్తిస్మము ఇమ్మని అతడిని అడుగుతున్నారు. (అలంకారిక ప్రశ్నలు చూడండి).
● రాబోవు ఉగ్రతను
"రాబోయే శిక్షను” లేక "దేవుడు కోపించి తీసుకునే చర్యనుంచి" లేక "దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు కాబట్టి," అని రాయొచ్చు. ఉగ్రత అనే పదాన్ని ఇక్కడ దేవుని శిక్షను గురించి వాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఉగ్రత శిక్షకు దారితీస్తుంది. (విశేషణ ప్రయోగం అన్యాపదేశం చూడండి).
● అబ్రాహాము మాకు తండ్రి
"అబ్రాహాము మాకు పూర్వీకుడు" లేక "మేము అబ్రాహాము వారసులము"
● దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని
"దేవుడు ఈ రాళ్లనుంచి కూడా మనుష్యులను పుట్టించి వారిని అబ్రాహామునకు వారసులుగా చేయగలడు"
బాప్తిస్మమిచ్చు యోహాను బోధ కొనసాగుతున్నది
● ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇది "మీరు మీ పాపపు ప్రవర్తన మానుకోక పోతే ఒక వ్యక్తి చెట్టును నరకడానికి ఎలాగైతే వేరుపై గొడ్డలి పెట్టి సిద్ధంగా ఉన్నాడో అలాగే మిమ్మల్ని శిక్షించడానికి దేవుడు సిద్దంగా ఉన్నడు" అని చెప్పే ఒక ఉపమాన వాక్యం.(రూపకాలంకారం చూడండి).
● నేను మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను
పశ్చాత్తాపము చెందినవారికి యోహాను బాప్తిస్మ మిస్తున్నాడు.
● ఆయితే నా వెనుక వచ్చుచున్నవాడు
యోహాను వెనుక వస్తున్న వ్యక్తి యేసు.
● ఆయన పరిశుద్దాత్మలోను, అగ్నిలోను మీకు బాప్తిస్మమిచ్చును
ఇది "దేవుడు మీలో తన పరిశుద్దాత్మను నింపి మిమ్మల్ని అగ్ని ద్వారా పరీక్షించి పవిత్ర పరచి దేవుని రాజ్యంలోకి చేరుస్తాడు" అని చెప్పే ఒక ఉపమాన వాక్యం. (రూపకాలంకారం చూడండి).
● ఆయన మీకు బాప్తిస్మము ఇస్తాడు
యేసు మీకు బాప్తిస్మము ఇస్తాడు.
● ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి
ఒక వ్యక్తి ఎలాగైతే గోదుమ గింజలను, పొట్టును వేరు చేస్తాడో అలాగే క్రీస్తు నీతిమంతులను, అనీతిమంతులను వేరు చేస్తాడని పోల్చి చెప్పే ఉపమానవాక్యం. ఈ ఉపమానాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి "క్రీస్తు తన చేతిలో చేటను పట్టుకున్నవ్యక్తి లాగా ఉన్నాడు.” (రూపకాలంకారం చూడండి).
●ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది
"క్రీస్తు చేట పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు"
● చేట
గోదుమల్ని గాల్లో పైకి ఎగురవేసి గోదుమ గింజలను, పొట్టును వేరుచేయడానికి ఉపయోగించే పనిముట్టు. పనికిరాని పొట్టు గాలికి చెదరిపోయి బరువైన గింజలు కిందకు పడతాయి.
● ఆయన కళ్ళము
మనుషులు గోదుమలను పొట్టును వేరుచేసే స్థలం ఇది. "అతని స్థలము" అంటే "అతను గింజలను, పొట్టును వేరుచేసే స్థలం."
● ఆయన గోదుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయును
ఇది దేవుడు ఏవిధంగా నీతిమంతులను, దుష్టులను వేరు చేస్తాడో పోల్చి చెప్పే ఉపమానవాక్యం. రైతు కొట్లలో చేరే గోదుమల్లాగా నీతిమంతులు పరలోకానికి చేరుతారు, పొట్టులాంటి దుష్టులను దేవుడు ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. (ఉపమాలంకారం Simile చూడండి).
బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మము ఇచ్చిన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.
● నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా
ఇక్కడ "నేను" అంటే బాప్తిస్మమిచ్చు యోహాను "నీ" అంటే యెసు.
● నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?
ఇది అలంకారిక ప్రశ్న. దీన్నే మరొక విధంగా "నీవు పాపం చేయలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి బాప్తిస్మము పొందాల్సిన అవసరం లెదు" అని కుడా తర్జుమా చేయవచ్చు.
● నేను" అంటే బాప్తిస్మమిచ్చు యోహాను "నీవు " అంటే యెసు అని గుర్తించాలి. (అలంకారిక ప్రశ్నలు అలంకారిక ప్రశ్న చూడండి).
యేసు యోహాను చేత ఎలా బాప్తిస్మము పొందాడో ఆ వివరాలు ఇక్కడ ఉంటాయి.
● యేసు బాప్తిస్మము పొందిన వెంటనే
దీన్నే “యేసు యోహాను చేత బాప్తిస్మము పొందిన వెంటనే" అని అనువదించవచ్చు.
● ఇదిగో ఆకాశము తెరవబడెను
"ఆకాశము తెరవబడుట ఆయన చూచెను" లేక "పరలోకము తెరువబడుట ఆయన చూచెను." (కర్త లేక కర్మ ప్రధాన వాక్యాలను చూడండి.).
● పావురం వలె దిగివచ్చుట
దీన్ని 1). ఆత్మ పావురంలా ఉందని సులభ వాక్యంగాను (యుడిబి చూడండి). 2). పావురంలా దేవుని ఆత్మ యేసు పైకి చాలా మృదువుగా దిగివచ్చినట్లు పొల్చిచెప్పవచ్చు. (ఉపమాలంకారం చూడండి).
● ఇదిగో
పెద్ద కథలో మరొక సంఘటన ఆరంభాన్ని ఇది సూచిస్తున్నది. ఇప్పటిదాకా చెప్పిన దానిలోని వారు కాక వేరే వ్యక్తులు ఇందులో ఉండవచ్చు. దీన్ని సూచించడానికి మీ భాషలో వాడవలసిన పదం వాడండి.
సాతాను యేసును ఎలా శోధించాడో ఆ వివరాలు ఈ భాగంలో ఉంటాయి.
● అపవాది. శోధకుడు
ఈ రెండు పదాలు ఒకరిని ఉద్దేశించినవే. ఈ రెండింటిని అనువదించడానికీ ఓకే పదాన్ని రాయాల్సి ఉంటుంది.
● ఉపవాసముండిన తరువాత... ఆయన అకలిగొనెను
ఇవి యేసును సూచిస్తాయి.
● నీవు దేవుని కుమారుడవైతే, ఆజ్ఞాపించు
దీన్ని 1). "నీవు దేవుని కుమారుడివి కాబట్టి నీకు ఆజ్ఞాపించే అధికారం ఉంది" అని తన కొరకు అద్భుతాలు చేసుకోమని ఆయన్ని రెచ్చగొట్టడం (యుడిబి చూడండి). 2). "ఆజ్ఞాపించడం ద్వారా నువ్వు దేవుని కుమారుడవని నిరూపించుకో" అని ఆయనను సవాలు చేయడం లేక నిందించడం (యుడిబి చూడండి). యేసు దేవుని కుమారుడని సాతానుకు తెలుసని గ్రహించడం మంచిది.
● ఈ రాళ్లు రొట్టేలగునట్లు ఆజ్ఞాపించుమనెను
"రొట్టెలుగా మారండి అని ఈ రాళ్లతో చెప్పు!"
యేసును సాతాను శోధించిన వివరాలు కొనసాగుతున్నాయి.
● నీవు దేవుని కుమారుడవైతే, కిందికి దుముకు
దీన్ని ఇలా అనువదించ వచ్చు రాయొచ్చు 1). "నువ్వు నిజంగా దేవుని కుమార్రుడవు కాబట్టి కిందకి దూకవచ్చు" అని తన కొరకు అద్భుతాలు చేసుకోమని ఆయన్ని రెచ్చగొట్టడం (యుడిబి చూడండి). 2). "నువ్వు కిందకి దూకడం ద్వారా నువ్వు దేవుని కుమారుడవని నిరూపించుకో" అని ఆయనను సవాలు చేయడం లేక నిందించడం (యుడిబి చూడండి). యేసు దేవుని కుమారుడని సాతానుకు తెలుసని గ్రహించడం మంచిది.
● కిందకు
అంటే నేలపైకి.
● ఆయన ఆజ్ఞాపిస్తాడు. "నిన్ను జాగ్రత్తగా పట్టుకోమని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు." లేక "ఆయనను జాగ్రత్తగా పట్టుకోండి" అని దేవుడు తన దూతలకు చెబుతాడు.
యేసును సాతాను ఎలా శోధించాడో ఆ వివరాలు కొనసాగుతాయి.
● మరియొక చోట వ్రాయబడియున్నదని
"దేవుని గ్రంథంలో రాసిన వాక్యాలను నీకు మళ్లీ చెబుతున్నాను." అని రాయొచ్చు
● ఆయనతో చెప్పెను
"అపవాది యేసుతో చెప్పాడు"
● వీటన్నిటిని నీకిచ్చెదనని
"వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను. " కొన్ని మాత్రమే కాదు," వీటన్నిటిని: నీకు ఇస్తానని ఇక్కడ శోధకుడు నొక్కి చెబుతున్నాడు
యేసును సాతాను ఎలా శోధించాడో ఆ వివరాలు కొనసాగుతాయి
● ఇక్కడ మూడవసారి యేసు సాతానును పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాల ద్వారా గద్దిస్తున్నాడు.
● అపవాది
"సాతాను" కు మరో పేరును ఇక్కడ మత్తయి ఉపయోగించాడు.
● ఇదిగో
ఇప్పుడు తెలుపబోతున్న కొత్త సంగతులను శ్రద్ధగా వినాలని ఇక్కడ "ఇదిగో" అనే పదాన్ని వాడారు.
గలిలయలో యేసు సువార్త పరిచర్య ప్రారంభమైన వివరాలు ఇందులో ఉంటాయి.
● యోహాను చెరపట్టబడెనని
"యోహానును రాజు బంధించాడు” (కర్త లేక కర్మ ప్రధాన ఉన్న వాక్యాలు Active or Passive చూడండి).
గలిలయలో యేసు సువార్త పరిచర్య ప్రారంభమైన వివరాలు కొనసాగుతున్నాయి.
గలిలయలో యేసు సువార్త పరిచర్య ప్రారంభమైన వివరాలు కొనసాగుతున్నాయి.
● పరలోకరాజ్యం సమీపించి యున్నది
3:2 లో ఇదే అర్దాన్నిచ్చే వాక్యాన్ని ఎలా అనువదించారో ఇక్కడ కూడా అలాగే అనువదించాలి
గలిలయలో యేసు సువార్త పరిచర్య ప్రారంభమైన వివరాలు కొనసాగుతున్నాయి.
వలవేయుట
"వల విసరడం."
● నా వెంబడి రండి
సీమోను, అంద్రేయలను తన వెంట వచ్చి తనతో పాటు జీవిస్తూ తన శిష్యులుగా ఉండమని యేసు ఆహ్వానిస్తున్నాడు. "నా శిష్యులుగా రండి" అని రాయొచ్చు.
● మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను
దీన్నే ఇలా "మీరు ఎలాగైతే చేపలను పట్టారో అలాగే దేవుని కొరకు మనుష్యులను పట్టడం నేర్పుతాను." (రూపకాలంకారం చూడండి).
గలిలయలో యేసు సువార్త పరిచర్య ప్రారంభమైన వివరాలు కొనసాగుతున్నాయి.
● వారు తమ వలలు బాగుచేసుకొనుచుండగా
"వారు" అంటే ఇద్దరు సోదరులు, జెబెదయి కావొచ్చు లేక ఇద్దరు సోదరులు మాత్రమే కావొచ్చు.
● వారిని పిలిచెను
"యోహాను, యాకోబు లను యేసు పిలిచాడు." తన వెంట వచ్చి తనతో పాటు జీవిస్తూ తన శిష్యులుగా ఉండమని యేసు వారిని ఆహ్వానిస్తున్నాడు.
● వెంటనే
"ఆ క్షణమే."
● దోనెను విడిచిపెట్టి. ఆయనను వెంబడించిరి
వారు తమ జీవిత గమనాన్ని మార్చుకున్నారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతున్నది. వారు ఇకపై చేపలు పట్టేవారిగా ఎంతమాత్రం ఉండరు. తమ వృత్తిని కుటుంబ సభ్యులకు వదిలిపెట్టి మిగిలిన జీవితకాలమంతా యేసును వెంబడించాలని అనుకొన్నారు
గలిలయలో యేసు సువార్త పరిచర్య ప్రారంభమైన వివరాలు కొనసాగుతున్నాయి.
● నానా విధంలైన రోగంల చేతను వేదన చేతను
"వ్యాధితో, అనారోగ్యంతో ““వ్యాధి", "అనారోగ్యము" అంటే దాదాపు ఒకే అర్ధం, కాని వీటిని వేర్వేరు అర్దాలిచ్చే పదాలుగా రాయొచ్చు. ఒక మనిషి వ్యాధికి గురై అనారోగ్యం పాలవుతాడు. వ్యాధి మనిషిని బాధిస్తుంది, ఆ బాధ వలన అతడు అనారోగ్యంగా కనిపిస్తాడు.
● దెకపొలి
"పది పట్టణాలు.” (యుడిబి చూడండి). గలిలయ సముద్రానికి ఆగ్నేయంగా వున్న ప్రాంతాలు
5, 7 అధ్యాయాలు ఒకే అంశాన్ని చెబుతాయి. యేసు కొండ యెక్కి తన శిష్యులకు బోధించాడు.
● అప్పుడాయన తన నోరు తెరచి
"యేసు మాట్లాడటం మొదలుపెట్టాడు."
● వారికి బోధించాడు
ఇక్కడ "వారు" అంటే ఆయన శిష్యులు.
● ఆత్మ విషయమై దీనులైనవారు
"తమకు దేవుడు అవసరం అని ఎరిగినవారు."
● దుఃఖ పడువారు
ఈ ప్రజలు చాలా దిగులుగా ఉన్నారు. ఎందుకంటే 1). లోకంలో జరుగుతున్న పాపక్రియలను గూర్చి లేక 2). ఎవరైనా చనిపోయినందువల్ల. మీ భాషలో తప్పనిసరి అయితే తప్ప ఇక్కడ వీరు ఎందుకు దుఃఖపడుతున్నారో వివరించడానికి ప్రయత్నించవద్దు.
● వారు ఓదార్చబడుదురు
దీన్నే "దేవుడు వారిని ఓదారుస్తాడు" అని రాయొచ్చు. (కర్త లేక కర్మ ప్రధాన వాక్యాలు Active or Passive చూడండి).
యేసు తన శిష్యులకు బోధిస్తున్నాడు. ఈ కార్యక్రమం 5:1 లో మొదలైంది.
● నీతి కొరకు ఆకలిదప్పులు
"ఆహారం, మంచినీటిని ఎంతగా కోరుకుంటామో, అలా నీతిగా జీవించడాన్ని కోరుకోవడం"రూపకాలంకారం చూడండి).
● వారు తృప్తి పరచబడుదురు
"దేవుడు వారిని తృప్తి పరుస్తాడు.” (కర్త లేక కర్మ ప్రధాన వాక్యాలు Active or passive చూడండి).
● హృదయ శుద్ధి గలవారు
"స్వచ్చమైన మనసులు కలిగిన వారు."
● వారు దేవుని చూచెదరు
"దేవునితో కలిసి నివసించే అవకాశం వారికి వస్తుంది. " లేక " అటువంటివారిని తనతో నివసించడానికి దేవుడు అనుమతిస్తాడు."
యేసు తన శిష్యులకు బోధిస్తున్నాడు. ఈ కార్యక్రమం 5:1 లో మొదలైంది.
● సమాధానపరచు వారు
మానవులు తమ తోటి మానవులతో కలిసి సమాధానంగా జీవించడానికి సాయపడేవారు.
● దేవుని కుమారులు
వీరు దేవుడి స్వంత బిడ్డలు. (రూపకాలంకారాలు Metaphor చూడండి).
● హింసించబడువారు
దీనిని "ఇతర మనుష్యుల చేతిలో అన్యాయానికి గురయ్యేవారు" అని రాయొచ్చు.
● నీతి నిమిత్తము
"ఎందుకంటే వారు దేవుడు చెప్పే విధంగా చేసేవారు"
● పరలోకరాజ్యం వారిది
"పరలోక రాజ్యంలో నివసించడానికి దేవుడు వారికి అనుమతిస్తాడు." పరలోక రాజ్యం వారి స్వంతం కాదు గాని తన సన్నిధిలో నివసించే హక్కుని దేవుడు వారికి ఇస్తున్నాడు.
యేసు తన శిష్యులకు ఇంకా బోధిస్తున్నాడు. ఈ కార్యక్రమం 5:1 లో మొదలైంది.
● నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి
"మీ గూర్చి వారు చెప్పింది నిజం కాకపోయినా కేవలం నన్ను వెంబడించినందు వలన" లేక "మీరు దానికి పాత్రులు కాకపోయినా కేవలం నన్ను నమ్మినందు వలన."
● సంతోషించి ఆనందించుడి
"సంతోషించు," "ఆనందించు" అంటే ఒకే అర్ధం. తన మాటలు వింటున్నవారు కేవలం సంతోషించడమే కాకుండా అపరిమితంగా సంతోషించాలని యేసు కోరుకుంటున్నాడు.(ప్రత్యేక విశేషణ వాక్యాలు Hendiadys చూడండి).
యేసు తన శిష్యులకు బోధనలు కొనసాగిస్తున్నాడు. ఈ కార్యక్రమం 5:1 లో మొదలైంది.
● మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు
"ఈ లోకంలోని ప్రజలకు మీరు ఉప్పు లాంటివారు." లేక "ఆహారానికి ఉప్పు ఎలాంటిదో లోకానికి మీరు అలాంటివారు." దీని అర్ధం ఇలా ఉండొచ్చు 1). "ఉప్పు ఎలాగైతే ఆహారానికి రుచిని ఇస్తుందో మీరు కూడా ఈ లోకంలోని ప్రజలను మంచివారుగా మార్చాలి." లేక 2). ఆహారాన్ని ఎలాగైతే ఉప్పు చెడిపోకుండా కాపాడుతుందో అలాగే మీరు కూడా ప్రజలు పాపంలో పడిపోకుండా కాపాడాలి.” (రూపకాలంకారం చూడండి).
● ఉప్పు నిస్సారమైతే
దీని అర్ధం 1). తాను చేయాల్సిన పనిని ఉప్పు చేయక పోతే (యుడిబి లో ఉన్న విధంగా). లేక 2). "తన స్వభావాన్ని ఉప్పు కోల్పోతే."
● అది దేని వలన సారము పొందును?
"దాన్ని మరల ఎలా ఉపయోగకరంగా చేయడం?" లేక "అది మరలా ప్రయోజనకరంగా మారడం అసాధ్యం.” (ఆలంకారిక ప్రశ్నలు Rhetoric చూడండి).
● అది బయట పారవేయబడి మనుష్య్లలచే త్రొక్కబడుటకే గాని మరి దేనికి
"మనుష్యులు నడిచే రోడ్డుపై పారవేయడానికే అది పనికొస్తుంది."
● మీరు లోకమునకు వెలుగై ఉన్నారు
"మీరు లోకంలోని ప్రజలకు దీపంలాగా ఉన్నరు."
● కొండపైనున్న పట్టణము మరుగై నుండనేరదు
"కొండపై నున్న పట్టణములోని దీపాలను రాత్రిపూట కూడా అందరూ చూడగలరు." లేక " కొండపై నున్న పట్టణంలోని దీపాలను అందరూ చూడగలరు.” (నిశ్చిత, సూచిత సమాచారం Explicit and Implicit inform. కర్త, కర్మ ప్రధాన వాక్యాలు Active Passive చూడండి).
యేసు తన శిష్యులకు ఇంకా బోధిస్తున్నాడు. ఈ కార్యక్రమం 5:1 లో మొదలైంది
● అయితే .. మనుష్యులు దీపం వెలిగించి
"మనుష్యులు దీపం వెలిగించినప్పుడు."
● దీపం
ఒలివ నూనె పోసి మధ్యలో వెలిగించిన వత్తి ఉండే ఒక చిన్న గిన్నె. ఇది కాంతినిస్తుంది అన్నది ముఖ్యమైన విషయం.
● కుంచం కింద పెట్టరు
"దీపాన్ని కొలత బుట్ట కింద పెట్టరు." మనుషులెవరికీ కనపడకుండా దీపాన్ని వెలిగించడం తెలివితక్కువ పని అని చెప్పడానికి వాడే సామెత ఇది.
యేసు తన శిష్యులకు ఇంకా బోధిస్తున్నాడు. ఈ కార్యక్రమం 5:1 లో మొదలైంది
● ఒక పొల్లయినను సున్నయైనను
"రాయబడిన మాటలలో ఏ చిన్న అక్షరమైనా లేక అక్షరంలోని చిన్న "భాగమైనా" లేక "ధర్మశాస్త్రం లో ఎంత అప్రధానంగా అనిపించిన భాగాన్ని కూడా" (రూపకాలంకారం చూడండి).
● ఆకాశమును భూమియు
"దేవుడు సృష్టించినదంతా” (భిన్న పద వివరణ Merism చూడండి).
● అంతయు నేరవేరువరకు
"ధర్మశాస్త్రం లోని దంతా దేవుడు నేరవేర్చాడు.” (కర్త్జ లేక కర్మ ప్రధాన వాక్యాలను చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● యీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి
"ఎవరైనా ఈ ఆజ్ఞలను పాటించకపోతే, వీటిలో చిన్న ఆజ్ఞ నైనా పాటించకపోతే"
● అతడు మిక్కిలి అల్పుడనబడును
"అటువంటివారిని దేవుడు చాలా తక్కువ వాడిగా ఎంచుతాడు."
● అల్పుడు
ఏ మాత్రం ప్రాముఖ్యత లేనివాడు
● వారికి బోధించువాడెవాడో
దేవుని ఆజ్ఞలను ఏవైనా బోధించేవాడు.
● గొప్పవాడు
"చాల ముఖ్యుడు."
● మీ. మీరు .. మీతో
ఇక్కడ అన్నీ బహువచనాలు
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● యేసు ఒక జనసమూహముతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. "మీరు విన్నారు", "నేను మీతో చెప్పునదేమనగా" ఇక్కడ జనసమూహాన్ని ఉద్దేశించి బహువచనాలు ఉపయోగిస్తున్నాడు. "నరహత్య చేయవద్దు" అనేది ఏకవచనం, కానీ మీరు దీన్ని బహువచనంగా అనువదించాల్సి ఉంటుంది.
● నేను మీతో చెప్పునదేమనగా
ఇక్కడ "నేను" అనేది చాలా దృఢమైన మాట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు ఎంత ప్రాధాన్యత ఉందో, యేసు చెప్పే మాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని ఈ మాట తెలియజేస్తుంది.
● హత్య. హత్య చేయు
ఈ పదం చంపడాన్ని తెలియజేస్తుంది కానీ రక రకాలుగా ప్రాణాలు పోవడం గురించి కాదు.
● సహోదరుడు
దీనర్దం స్వంత సహోదరుడో, పోరుగువాడో కాదు, సహ విశ్వాసి అని.
● వ్యర్దుడా. ద్రోహీ
తెలివిలేని వారిని ఉద్దేశించి చెప్పే మాటలు ఇవి. "వ్యర్దుడా" అంటే "బుద్ది లేని", "ద్రోహీ” అంటే దేవునికి లోబడనివాడు అని.
● విమర్శ
ఇది స్థానిక పురపాలక సభ. అంతేకాని యెరూషలేములోని సన్హెర్దిన్ అని కాదు
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ "నీవు," "నీ" అన్ని సంబోధనలు ఏకవచనమే గాని మీ భాషలో బహువచనాలుగా అనువదించాలేమో చూడండి.
● అర్పణ అర్పించు
"అర్పణ ఇచ్చునప్పుడు" లేక "అర్పణ తెచ్చునప్పుడు."
● అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల
"బలిపీఠం ముందు నిలుచున్నపుడు నీకు జ్ఞాపకం వస్తే."
● నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని
నువ్వు అతనికి చేసిన హాని లేక నష్టాన్ని ఆ వ్యక్తి గుర్తు చేసుకొంటే."
●మొదట నీ సహోదరుడితో సమాధానపడుము
" నీవు అర్పణం చెల్లించడానికి ముందు నీ సహోదరుడితో సమాధానపదు.” (కర్త లేక కర్మ ప్రాధాన్య వాక్యాలు Active or Passive sentences చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ "నీవు" "నీ" అన్ని సంబోధనలు ఏకవచనమే గాని మీ భాషలో బహువచనాలుగా అనువదించాలేమో చూడండి.
● చేయవద్దని
దీనర్దం ఒకపని చేయవద్దు లేక నిర్వహించవద్దు.
● నేను మీతో చెప్పునదేమనగా
ఇక్కడ "నేను" అనేది చాలా దృఢమైన మాట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు ఎంత ప్రాధాన్యత ఉందో, యేసు చెప్పే మాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని ఈ మాట తెలియజేస్తుంది.
● ఒక స్త్రీని మోహాపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ ఉపమానానికి అర్దము ఎవరైనా ఒకరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అతడు వ్యభిచారం చేసిన వ్యక్తితో సమానం అని. (అన్యాపదేశాలు, రూపకాలంకారాలు చూడండి).
● స్త్రీని మోహపు చూపుతో చూచు
"వేరొక స్త్రీ పొందు కోరుకొనేవాడు.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ "నీవు" "నీ" అన్ని సంబోధనలు ఏకవచనమే గాని మీ భాషలో బహువచనాలుగా అనువదించాలేమో చూడండి.
● కుడికన్ను. కుడిచెయ్యి
ఎడమ కన్ను ఎడమ చేయి కాకుండా శరీరం లోని ముఖ్యమైన కన్ను, చేయి. "కుడి" అంటే “మంచిది" లేక "ఒక" అని.
● నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల
"నీవు చూసే దృశ్యాలు అభ్యంతరకరంగా ఉంటే" లేక అ"నీవు వాటిని చూడటం ద్వారా పాపం చేయాలని అనిపిస్తే." "అభ్యంతరం" అనేది పాపానికి రూపకం. యేసు ఇక్కడ వ్యంగాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా ప్రజలు పాపాన్ని తప్పించుకోవాదానికి కళ్ళు మూసుకుంటారు.
● పెరికి వేయి
"బలవంతంగా తీసివేయి" లేక "నలిపివేయి" (యు డి బి చూడండి). (అతిశయ వాక్యాలు చూడండి).
● నీ యొద్దనుండి పారవేయుము
"దాన్ని వదిలించుకో"
● నీ అవయవములలొ ఒకటి నశించుట
"నీ శరీరంలో ఒక భాగాన్ని కోల్పోవాలి."
● నీ కుడిచేయి నిన్ను అభ్యంతర పరచిన
చేయితో చేసే పనులకు ఒక వ్యక్తీ పూర్తి బాధ్యత వహించాలని చెప్పే అన్యాపదేశం ఇది. (అన్యాపదేశాలు, చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ "నీవు" "నీ" అన్ని సంబోధనలు ఏకవచనమే గాని మీ భాషలో బహువచనాలుగా అనువదించాలేమో చూడండి.
● కుడికన్ను. కుడిచెయ్యి
ఎడమ కన్ను ఎడమ చేయి కాకుండా శరీరం లోని ముఖ్యమైన కన్ను, చేయి. "కుడి" అంటే “మంచిది" లేక "ఒక" అని.
● నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల
"నీవు చూసే దృశ్యాలు అభ్యంతరకరంగా ఉంటే" లేక అ"నీవు వాటిని చూడటం ద్వారా పాపం చేయాలని అనిపిస్తే." "అభ్యంతరం" అనేది పాపానికి రూపకం. యేసు ఇక్కడ వ్యంగాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా ప్రజలు పాపాన్ని తప్పించుకోవాదానికి కళ్ళు మూసుకుంటారు.
● పెరికి వేయి
"బలవంతంగా తీసివేయి" లేక "నలిపివేయి" (యు డి బి చూడండి). (అతిశయ వాక్యాలు చూడండి).
● నీ యొద్దనుండి పారవేయుము
"దాన్ని వదిలించుకో"
● నీ అవయవములలొ ఒకటి నశించుట
"నీ శరీరంలో ఒక భాగాన్ని కోల్పోవాలి."
● నీ కుడిచేయి నిన్ను అభ్యంతర పరచిన
చేయితో చేసే పనులకు ఒక వ్యక్తీ పూర్తి బాధ్యత వహించాలని చెప్పే అన్యాపదేశం ఇది. (అన్యాపదేశాలు, చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● చెప్పబడియున్నదిగదా
దేవుడు చెప్పాడు (యుడిబి చూడండి). యేసు తాను దేవుడితో గాని దేవుని వాక్యంతో గాని విభేధించడం లేదని చెప్పడానికి ఇక్కడ కర్మణీ వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆయన ఉద్దేశం సరైన కారణంతో విడాకులు తీసుకోవడం సమంజసమేనని. పరిత్యాగ పత్రాన్ని రాసి ఇవ్వాలన్న ఆజ్ఞను ఒక వ్యక్తీ పాటించినా విడాకులు తీసుకోడం సరికాదని. ( కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● తన భార్యను విడనాడు వాడు
విడాకులు తీసుకోవడం అన్న విషయాన్ని సభ్యంగా చెబుతున్నారు. (సభ్యోక్తి చూడండి).
● ఇయ్యవలెనని
"అతడు ఇవ్వాలి" అని ఆజ్ఞాపించడం.
● అయితే నేను చెప్పునదేమనగా
యేసు చెప్పిన ఈ మాటల్లో “ఇంతకు ముందు చెప్పినదానికి" వేరుగా తాను చెప్పబోతున్నాను అన్న భావన ఉంది. ఇక్కడ "నేను" అన్న దానిని నొక్కి చెబుతున్నాడు ఎందుకంటే ఇంతకుముందు మాటలు చెప్పిన వ్యక్తి కంటే తాను ప్రాముఖ్యమైనవాడని అంటున్నాడు.
● ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు
తన భార్యకు సరైన కారణం లేకుండా విడాకులు ఇచ్చే వ్యక్తీ "ఆమె వ్యభిచారం చేయడానికి కారణమవుతున్నాడు. (5:27 లో "వ్యభిచారం చేయడానికి" అన్నదానికి వాడిన పదాలనే ఇక్కడ వాడండి). కొన్ని సంస్కృతులలో ఆమె తిరిగి పెళ్లి చేసుకోవచ్చు, కాని సరైన కారణం లేకుండా విడాకులు తీసుకుని తిరిగి పెళ్లి చేసుకొంటే అది వ్యభిచారం అవుతుంది(యుడిబి చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ "మీరు విన్నారు గదా" లోని "మీరు", నేను మీతో చెప్పునది" లో మీతో అన్నవి బహువచనాలు. "మీరు ఒట్టు పెట్టుకొనవద్దు" లోని "మీరు చెల్లింపవలెను" లోని "మీరు" అంటే ఎకవచనాలు.
● చెప్పబడిన మాట మీరు విన్నారు కదా
"మీరు ప్రమాణం చేయకూడదు" అని మన పూర్వికులతో దేవుడు చెప్పాడని మీ మత పెద్దలు మీకు చెప్పారు కదా.” తాను దేవుడి మాటను గాని, దేవుడిని గాని వ్యతిరేకించడం లేదని, కాకపోతే తమ మాటలు కాని వాటిని తమ మాటలుగా చెప్పి ప్రజలను మభ్య పెట్టవద్దని, తనమాటలు వింటున్నవారికి స్పష్టం చేయడానికి యేసు ఇక్కడ కర్మణీ వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు.
● చెప్పబడింది
5:31 లో లాగే ఇక్కడ అనువదించాలి.
● ఒట్టు. ప్రమాణం
వీటర్దం 1).దేవునికి అంగీకారమైనదే చేస్తామని మనుష్యుల ముందు ప్రజల ముందు ప్రకటించడం (యుడిబి చూడండి)., లేక 2). తాము ఏదైనా ఒక సంగతిని చూసి చెప్పిన మాటలు నిజమని దేవుడికి తెలుసని అందరికీ చెప్పడం.
● నేను మీతో చెప్పునదేమనగా.
ఆకాశము తోడని .. ఒట్టుపెట్టుకొనవద్దు.. దేవుని సింహాసనం.. ఆయన పాదపీటం .. యెరూషలేము తోడని .. అది మహారాజు పట్టణం
ఇది యెషయా నుండి తీసుకున్న రూపకము(రూపకాలంకారం చూడండి).
● ఎంతమాత్రం ఒట్టుపెట్టుకొనవద్దు
మీ భాషలో ఆజ్ఞాపించడానికి బహువచన విధానాలు ఉంటే వాటిని ఇక్కడ ఉపయోగించండి. "మీరు అబద్దపు ఒట్టులు పెట్టవద్దు” (33వ వచనం). అని చెబితే ఒట్టు పెట్టుకోవచ్చు కాని అబద్దపు ఒట్టుపెట్ట కూడదు అని అర్ధమవుతుంది. "ఎంతమాత్రం ఒట్టు పెట్టవద్దు" అంటే ఒట్టునే నిషేధించడం.
ఒట్టు పెట్టవద్దు
33లో లాగే ఇక్కడ అనువదించాలి.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఇక్కడ "మీరు ఒట్టు పెట్టుకోనునప్పుడు", "మీరు ఎంత మాత్రం" అన్న పదాలలో"మీరు" అంటే ఎకవచనాలు. ఒకవేళ మీ భాషలో "మీరు" పదాన్ని బహువచంగా ఉపయోగించాలంటే అలాగే అనువదించండి.
● 5:34
35 లో యేసు తన మాటలు విన్తున్నవారితో దేవుని సింహాసనం, పాదపీఠం, మహారాజు పట్టణం తోడని ఒట్టుపెట్టుకొనవద్దు అని అన్నాడు. అంతేకాదు తమ తల తోడని కూడా ఒట్టుపెట్టుకోవద్దని ఎందుకంటే అవి వారి ఆధీనంలో లేవని చెబుతున్నాడు.
● ఒట్టు
5:34 లో లానే ఇక్కడ అనువదించండి.
● మీ మాట "అవునంటే అవును " "కాదంటే కాదు "
మీరు అవును చెప్పాలనుకుంటే "అవును" అని, కాదు అని చెప్పాలనుకుంటే "కాదు" అని కచ్చితంగా చెప్పండి.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
● చెప్పబడిన మాట మీరు విన్నారు కదా
5:33 లో లాగే ఇక్కడ అనువదించండి.
● మీరు విన్నారు
ఇక్కడ "మీరు" అంటే ఏకవచనం.
● కంటికి కన్ను, పంటికి పల్లు
ఎవరైనా తమకు హాని చేస్తే వారు ఎంత హాని చేశారో అంత హాని చేయడానికి అనుమతి ఉంటుంది.
● అయితే నేను చెప్పునది ఏమనగా
5:32 లో లానే దీన్ని అనువదించండి.
● దుష్టుని
"చెడ్డ వ్యక్తి" లేక "హాని చేసే వ్యక్తి” (యుడిబి).
● నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ
ఇవన్నీ బహువచనాలు.
● కొట్టు. నీ కుడి చెంప
యేసు జీవించిన కాలంలో కుడి చెంప మీద కొట్టడం, ఆ వ్యక్తిని అవమానించడం వంటింది. కంటి తో చేసినట్టే చేతితో (రూపాకాలంకారం). కొట్టు అంటే ఇక్కడ తెరచిన అరచేతితో కొట్టడం అని.
ఎడమ చెంప కూడా త్రిప్పుము
"నీ మరో చెంప పైన కూడా అతడిని కొట్టనివ్వు."
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
● "మీ" "మీరు" అనేవి అలాగే కొట్ట"నివ్వు", "పో", "ఇవ్వు", "తిప్పుకో వద్దు", అనే పదాలలో సంబోధనలు కూడా ఏకవచనాలే కాని వాటిని బహువచనాలుగా అనువదించాలి.
● వస్త్రము. అంగీ
ఇక్కడ వస్త్రము అంటే ఒంటి పైన వేసుకునే చొక్కా లేక ఉన్ని చొక్కా అని. అంగీ ధర కొంత ఎక్కువగా ఉంటుంది దీన్నివెచ్చదనం కొరకు చొక్కా పైన కప్పుకుంటారు. అలాగే రాత్రి వేళలో వెచ్చదనం కొరకు దుప్పటిలాగా ఉపయోగిస్తారు.
● వానికి
" ఆ వ్యక్తికి ఇవ్వు"
● ఎవరైనా
ఏ వ్యక్తి అయినా.
● ఒక మైలు
ఒక వెయ్యి గజాలు, రోమన్ సైనికుడు తన భారాన్ని ఇంకొక వ్యక్తి పైన మోపి అధికారికంగా వెయ్యి గజాలు దూరం నడిపించవచ్చు.
● అతనితో కూడా
దీని అర్ధం "ఎవరైనా నిన్ను తనతో కూడా అతనితో రమ్మంటే" అని.
● అతనితో కూడా రెండు మైళ్ళు
"అతను నిన్ను రమ్మన్న మైలు దూరంతో పాటు మరొక మైలు వెళ్ళు. "
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహంతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
● మీ. ప్రేమించి .. మీ శత్రువును ద్వేషించి" అన్నవి ఏకవచనాలు, అయితే మీరు వాటిని బహువచానాలుగా అనువదించాల్సి ఉంటుంది. మిగిలిన సందర్బాల్లో "మీరు", "ప్రేమించు", "ప్రార్దించు" అన్న పదాలలో బహువచనాలు రాయాలి.
● అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా
5:33 లో లాగే ఇక్కడ అనువదించండి.
● ఇక్కడ పొరుగువాడు అంటే వారి జాతికి లేదా వాళ్ళ సంఘానికి సంబంధించిన వ్యక్తి అని. నీ పొరుగు వాడు
ఇక్కడ బహువచనంగా అనువదించాలి.
● అయితే నేను చెప్పునదేమనగా
5:32 లో లాగే ఇక్కడ అనువదించాలి.
● మీ తండ్రికి కుమారులై యుండునట్లు
" మీ తండ్రి వంటి స్వభావాన్ని మీరూ కలిగి ఉండునట్లు.” (రూపకాలంకారం చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతున్నది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
● “నీ”, నీవి" అనేవి ఇక్కడ బహువచనాలు.
● వందనము
మనతో మాట్లాడే వారి సంక్షేమాన్ని కోరుతూ సాధారణంగా ఉపయోగించే పదం. ఇక్కడ ఉపయోగించిన నాలుగు వచనాలు అన్ని అలంకారిక ప్రశ్నలే. వీటిని ఎలా మామూలు ప్రకటన వాక్యాలుగా రాయోచ్చో యుడిబి లో వివరణ ఉంటుంది (అలంకారిక వేసే ప్రశ్నలను చూడండి)
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహంతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. "మీ", "మీతో" అన్న సంబోధనలు అన్నీ బహువచనాలు.
● నీ ముందర బూర ఊదింప వద్దు
గుంపులో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఒక వ్యక్తి పెద్ద బాకా ఊదినట్లు మీరు అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించకండి (రూపకాలంకారం చూడండి).
● ఘనత
5:16 లో లాగే ఇక్కడ అనువదించండి.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. "మీ", "మీతో" అన్న సంబోధనలు అన్నీ బహువచనాలు.
● నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక యుండవలెను
చాలా రహస్యంగా ఉండాలి అని చెప్పడానికి వాడే రూపకం ఇది. సాధారణంగా మనం అన్ని పనులు రెండు చేతులతో చేస్తాము కాబట్టి ఏ చేయి ఏ పని చేస్తుందో మరో చేతికి కనపడుతుంది. అయితే మనం బీదలకు దానం చేసే విషయం మనకు చాలా సన్నిహితంగా ఉండేవారికి కూడా తెలియనివ్వకూడదని దీని భావం(రూపకాలంకారం చూడండి).
● నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తం
. "మరో వ్యక్తికి తెలియకుండా నీవు దానము చెయ్యాలి."
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. 5, 7 వాక్యాల్లోని "మీరు ", "మీతో" అన్న సంబోధనలు అన్నీ ఏకవచానాలు కానీ వీటిని బహువచనాలుగా అనువదించాలి.
● నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను
"నేను మీతో సత్యము చెబుతున్నాను."
● నీ గదిలోనికి వెళ్లి
"నీవు ఏకాంత ప్రదేశానికి వెళ్లి" లేక "లోపలి గదిలోనికి వెళ్లి."
రహస్యమందు చూచు నీ తండ్రి
దీన్ని మనుష్యులు రహస్యంగా చేసే పనులను తండ్రి చూస్తాడు' అని అనువదించవచ్చు.
● వ్యర్ధమైన మాటలు
అర్ధం లేని మాటలు పదే పదే పలకడం
● విస్తరించి మాటలాడుట
"ఎక్కువసేపు చేసే ప్రార్దన", లేక "ఎక్కువ మాటలతో కూడిన ప్రార్ధన'
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● నీవు
యేసు ఇక్కడ జనసమూహం తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. యేసు, "ఇలా ప్రార్ధన చేయండి అని చెప్పే సమయంలో వారిని సమూహంగా బహువచనంలోనూ, మీ పరలోకపు తండ్రి అన్నచోట "మీ' అంటే ఏకవచనంలోనూ సంబోధిస్తున్నాడు.
● మీ నామం పరిశుద్ద పరచబడును గాక
"మీరు పరిశుద్దుడని అందరూ తెలుసుకోవాలి."
● మీ రాజ్యం వచ్చును గాక
సమస్త ప్రజలు, సమస్తమూ మీ రాజ్యపాలన కిందకి రావాలి
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● ఇక్కడ "మా," "మాకు," "మేము," ఇవన్ని యేసు తాను బోధిస్తున్న జనసముహాన్ని ఉద్దేశించి చెబుతున్నవే. (చూడండి: ప్రత్యేక).
● రుణములు
రుణము అంటే ఒక మనిషి ఇంకో మనిషికి బాకీ ఉన్నది. ఇది చెప్పాలంటే పాపాలను ఉద్దేశించి చెప్పే రూపకము.(రూపకాలంకారం చూడండి.).
● రుణస్థులు
మరో మనిషికి బాకీ పడి ఉండే వ్యక్తిని రుణస్థుడు అంటారు. పాపాత్ములు అని చెప్పే రూపకం ఇది.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. "మీరు,' "మీవి," అన్నీ బహువచనాలే.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ 17, 18 వచనాల్లోని "నీ,' "నీకు," అన్నీ ఏకవచనాలే. 16వ వచనంలోని బహువచనం "మీరు" కు అనుగుణంగా బహువచనాలుగా అనువదించవచ్చు.
● కాగా
అంతేగాక
● నీ తల అంటుకొని
"మామూలుగా నువ్వు ఎలా కనపడుతావో అలాగే ఉండు." ఇక్కడ తల "అంటుకొని" అంటే రోజూ తల వెండ్రుకలను దువ్వుకుంటామో అలాగే చేయడం. క్రీస్తు "తల అభిషేకించడం" అనీ అర్ధం కాదు.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ 17, 18 వచనాల్లోని "నీ,' "నీకు," అన్నీ ఏకవచనాలే. 16వ వచనంలోని బహువచనం "మీరు" కు అనుగుణంగా బహువచనాలుగా అనువదించవచ్చు.
● ధనం కూడ బెట్టుకోవద్దు
అంటే మనకు సంతోషం కలిగించేవి.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది. ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "నీ,' "నీకు," అన్నీ ఏకవచనాలే. మీరు బహువచనాలుగా అనువదించాల్సి రావచ్చు.
● దేహానికి దీపం కన్నే
అన్నిటిని చూడటానికి దీపం ఎలా ఉపయోగపడుతుందో కన్ను ద్వారా అన్నిటిని స్పస్తంగా చూడవచ్చు. (రూపకం చూడండి).
● నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును
నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే నీవు చూడగలవు. అప్పుడు నీ శరీరం మొత్తం బాగా పని చేస్తుంది. నీవు నడవగలవు, పనిచేయగలవు. వంటివి. ముఖ్యంగా దానం ఇవ్వడం, దురాశ వాటిల్లో దేవుడు చూసినట్టు చూడగలగడం అని చెప్పేందుకు వాడిన రూపకం(యు డి బి).
● కన్ను
దీని బహువచనంగా అనువదించాల్సి ఉంటుంది.
● వెలుగుమయమై
అర్ధం చేసుకునే శక్తికి ఇది రూపకం.
● నీ కన్ను చెడినదైతే
ఇదేమి కనుకట్టు అని కాదు. దీన్ని మరో రకంగా దేవుడు చూసే విధంగా మీరు చూడరు అని అనువదించ వచ్చు. దురాశకి ఇది మరో రూపకం(యు డి బి " మీరు ఎంత దురాశాపరులో చూడండి", తర్వాత 20:15). నీలో ఉన్న వెలుగు చీకటి అయి యున్న యెడల
నీలో వెలుగు అనుకుంటున్నది నిజానికి చీకటి.” (దేవుడు అన్నిటిని చూసినట్లు ఒకడు చూడగలడు అన్నదానికి ఇది ఒక రూపకము).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది. ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● "ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహం గొప్పవి కావా?"
జీవితంలో ఆహారం, వస్త్రం అన్నవి అంత ప్రాముఖ్యమైనవి కావు. ఈ అలంకార రూపమైన ప్రశ్నకి అర్ధం "మీరు తినే ఆహారం కంటే, మీరు వేసుకునే దుస్తులకంటే, మీ జీవితం ముఖ్యమైనది అని.
దీన్నే మరో విధంగా "ఆహారం కంటే జీవితం ముఖ్యం, కాదా? దుస్తులకంటే దేహం ముఖ్యం, కాదా?" అని అనువదించవచ్చు. (అలంకార ప్రశ్నలు చూడండి).
● కొట్లు
పంటలు దాచి ఉంచే స్థలం.
● మీరు వాటి కంటే బహు శ్రేష్టులు కారా?
ఈ అలంకార రూపమైన ప్రశ్నకి అర్ధం "మీరు పక్షుల కంటే విలువైన వారని."
దీన్నే మరో విధంగా "మీరు పక్షులకంటే చాలా విలువైనవారు, కారా?" అని అనువదించవచ్చు
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసికొనగలడు?
అలంకార రూపముగా వేసిన ఈ ప్రశ్నకు అర్ధం, ఎవరు బాధపడటం వలన తమ వయస్సును పెంచుకోలేరని. (అలంకార ప్రశ్నలు చూడండి).
● ఒక మూరెడు
ఒక "మూరెడు" అంటే సగం మీటరు కంటే కొంత తక్కువ. ఇక్కడ దాన్ని, జీవిత కాలాన్ని పొడిగించే రూపకంగా వాడారు.(బైబిల్ లోని కొలతలు, రూపకాలంకారం చూడండి).
● వస్త్రములను గురించి మీరు చింతింపనేల?
అలంకార రూపముగా వేసిన ఈ ప్రశ్నకు అర్ధం, "మీరు ఏ బట్టలు వేసుకోవాలో అని బాధపడక్కర్లేదు."
● ఆలోచించుడి
"చూడండి"
● అడవి పువ్వులు
ఒక రకమైన అడవి జాతి పువ్వులు .
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● గడ్డి
మీ భాషలో 6:28 వచనం లోని అడవి పువ్వులు, "గడ్డి" అనే రెండు పదాల అర్ధం వచ్చే ఏదైనా ఒక పదం ఉంటే దాన్ని ఇక్కడ వాడొచ్చు.
● పొయ్యిలో వేయబడు
యేసు జీవించిన కాలంలో యూదులు వంటకు కట్టె పొయ్యిలను వాడేవారు (యుడిబి చూడండి). దీనిని మరోలా "మంటలో వేయబడు," లేక "కాల్చి వేయబడు" అని రాసుకోవచ్చు.
● అల్ప విశ్వాసులారా
దేవుడిపైన విశ్వాసం లేకపోవడం గురించి ప్రజలను యేసు తిడుతున్నాడు. దీనిని మరోలా "మీ విశ్వాసం చాలా తక్కువగా ఉంది" అని, లేక "మీరు ఎందుకు ఇంత తక్కువ విశ్వాసంతో ఉన్నారు?" అని మరో వాక్యం లాగా రాసుకోవచ్చు
● కాబట్టి
"అయినప్పటికీ" లేక "ఇలా ఉన్నప్పటికీ" అని అనువదించవచ్చు
● గూర్చి. గూర్చి
6:31 లో చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అంటే అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు, కాబట్టి "మీరు విచారపడకండి": మీకు అవి కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు." కాబట్టి విచారపడకండి.
● కాబట్టి
దీనిని మరో విధంగా "ఇలా అయినప్పటికీ" అని రాయొచ్చు.
● రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును
ఈ మానవీకరణకు అర్ధం, "రేపటి రోజు" జీవించబోయే వ్యక్తినుద్దేశించింది. (యుడిబి చూడండి), (మానవీకరణ చూడండి).
● ఏనాటి కీడు ఆనాటికి చాలును
దీనిని "ఒక రోజు జరిగే చెడు సంఘటనలు ఆ రోజుకు సరిపోతాయి" అని అనువదించవచ్చు.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును
దీన్నే కర్తరీ వాక్యంలో "దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు" (యు డి బి).; లేక "ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు" అని రాయొచ్చు. (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్నా వాక్యాలను చూడండి.
● గూర్చి
2వ వచనానికి ఆధారం 1వ వచనమే నని పాఠకులకు అర్ధమయ్యేలాగా రాయండి.
● కొలత
దీనికి అర్ధాలు 1). విధించబడిన శిక్ష మొత్తం (యుడిబి చూడండి). 2). తీర్పు తీర్చడానికి ఉపయోగించే కొలమానం
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
" నీ", "నీవు" అనేవి ఇక్కడ ఏకవచనాలు. మీరు బహువచానాలుగా అనువదించాల్సి ఉంటుందేమో చూడండి.
● చూచుట యేల? నీవు చెప్పనేల?
యేసు వారిని మొదట తమ తప్పులు, పాపాలు చూసుకోమని చెబుతున్నాడు. (అలంకారము చూడండి).
● నలుసు. దూలము
ఈ పదాలు ఒక మనిషి చేసే చిన్న, పెద్ద తప్పులను సూచిస్తున్నాయి. (రూపకము చూడండి).
● సహొదరుడు
దీని అర్థం స్వంత తమ్ముడు కానీ, పొరుగువాడని కాదు, తోటి విశ్వాసి అని.
● కన్ను
ఇది జీవితానికి సాదృశ్యంగా ఉంది.
● నలుసు
"నలక" (యుడిబి)., లేక "పోగు" ధూళి ముక్క.” మనిషి కంటిలో పడే చిన్న వాటిని పిలిచే పదాన్ని వాడండి.
● దూలం
ఒక చెట్టు నుంచి కొట్టబడిన పెద్ద భాగం. ఒక మనిషి కంటిలో దూరడానికి అసలు అవకాశం లేని పెద్ద చెక్క ముక్క. (అతిశయ వాక్యాలు చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● కుక్కలు. పందులు .. త్రోక్కివేయు .. పడి . చీల్చివేయు
ఇక్కడ "త్రోక్కివేసేది" పందులు, "పడి చీల్చివేసేది" కుక్కలు.(యుడిబి చూడండి).
● కుక్కలు .. పందులు
ఈ జంతువులను నీచమైనవిగా ఎంచుతారు. దేవుడు ఈ జంతువులను తినవద్దని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. పవిత్రమైన వస్తువుల విలువను గుర్తించలేని చెడ్డవారిని ఉద్దేశించి చెప్పిన రూపకాలివి. (రూపకము చూడండి). వీటిని ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే మంచిది.
● ముత్యాలు
ఇవి గుండ్రంగా ఉండే విలువైన పూసలు. దేవుని గురించిన జ్ఞానానికి లేక విలువైన వస్తువులకి ఇవి రూపకాలుగా ఉన్నాయి. (యుడిబి చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే.
● అడుగుడి. వెదకుడి .. తట్టుడి
విసుగు లేకుండా చేసే ప్రార్ధనకు ఇవి రూపకాలు.(రూపకాలంకారం చూడండి).
● ఎక్కువ కాలంపాటు విశ్రాంతి లేకుండా చేసే పనులను వర్ణించడానికి మీ భాషలో ఏదైనా ప్రత్యక పదజాలం ఉంటే ఇక్కడ ఉపయోగించండి. (యుడిబి చూడండి).
● అడుగుడి
దేవుడిని అడగడం (యుడిబి చూడండి).
● వెదకుడి
"అనుకోవడం " లేక "చూడడం.”
● తలుపు తట్టడం అంటే, ఒక ఇంటిలోని లేక గదిలోని మనిషిని తలుపు తీయమని మర్యాదగా అడగటానికి సూచన, తలుపు తట్టడం. ఒకవేళ తలుపు తట్టడం అంత మర్యాదకరమైన పదం కాదనుకుంటే, తలుపులు తెరవమని మనుషులు ఎలా మర్యాదగా అడుగుతారో అలా రాయండి. లేక పోతే "తలుపు తీయమని దేవుడిని అడగండి" అని అనువదించండి .
● యెడల. యెడల
వీటిని రాయక్కర్లేదు.
● మీలో ఏ మనుష్యుడైనను
ఈ రూపకాలంకార ప్రశ్నకు అర్ధం "మీలో ఎవడూ ఉండడు" అని. (యుడిబి, అలంకార ప్రశ్నలు చూడండి).
● ఒక రొట్టె ముక్క. రాతి . చేప . పాము
వీటిని ఉన్నవి, ఉన్నట్టుగానే అనువదించాలి.
● ఒక రొట్టె ముక్క
"కొంత భోజనం"
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే. అడుగుడి
● ప్రజలు మీకు ఏమీ చేయవలనని మీరు కోరుదురో
"ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో" (యుడిబి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే. అడుగుడి
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
ఇక్కడ ప్రజలతో యేసు మాట్లాడుతూ వ్యక్తిగతంగా వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు.
ఇక్కడ "మీ,' "మీతో ," అన్నీ బహువచనాలే. అడుగుడి
● "వెడల్పు", "విశాల" అనే పదాలు "ఇరుకు"ఎంత భిన్నమైనవో తెలిపేందుకు, అలాగే ఈ రెండు ద్వారాలు, దారుల మధ్య ఉన్న తేడాను ఎత్తి చూపేందుకు తగిన పదాలను అనువదించేటప్పుడు ఉపయోగించండి.
● ఇరుకు ద్వారమున ప్రవేశించుడి
మీరు దీన్ని 14వ వచనం చివరలో ఇలా రాస్తే బాగుంటుంది"కాబట్టి ఇరుకు ద్వారాన ప్రవేశించండి."
● ద్వారం, మార్గం
ప్రజలు దారిలో నడచుకుంటూ ఎలా ద్వారం లోపలకి వెళుతారో, తర్వాత "జీవము" లేక "నాశనం" లోకి ప్రవేశిస్తారో తెలిపే రూపకాలంకారం ఇది. (యు డి బి, రూపకాలంకారం చూడండి} కాబట్టి మీరు "ప్రజలు విశాలమైన దారిలో నడిచి, వెడల్పుగా ఉండే ద్వారం గుండా నాశనానికి వెళతారు." ఇక్కడ ద్వారము, దారి రెండు వేరు వేరు విశేషణాలుగా పాఠకులు అర్ధం చేసుకుంటారు కాబట్టి వాటిల్ని తిరిగి రాయాల్సిన అవసరం లేదు.( విశేషణాలను జత పరిచే వాక్య పద్దతులు చూడండి).
● ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది. ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది.
యు ఎల్ బి లో క్రియా పదాల ముందు విశేషణాలను రాయడం ద్వారా ఆ విశేషణాల మధ్య తేడాని నొక్కి చెబుతోంది. మీ భాషలో విశేషణాల మధ్య తేడాని ఎత్తి చూపే విధంగా అనువదించండి.
● నాశనము
మామూలుగా అయితే దీనర్ధం పాడై/చెడిపోవడం. ఇక్కడ నిత్య మరణానికి రూపకంగా వాడిన శారీరిక మరణాన్ని సూచిస్తోంది.(యు డి బి, చూడండి} ఇది "నిత్య జీవానికి" రూపకమైన శారీరక "జీవితాని"కి వ్యతిరేకమైనది. (రూపకాలంకారం చూడండి}
● వెళ్ళండి "వెడల్పు", "విశాల" అనే పదాలు "ఇరుకు"ఎంత భిన్నమైనవో తెలిపేందుకు, అలాగే ఈ రెండు ద్వారాలు, దారుల మధ్య ఉన్న తేడాను ఎత్తి చూపేందుకు తగిన పదాలను అనువదించేటప్పుడు ఉపయోగించండి.
● ఇరుకు ద్వారమున ప్రవేశించుడి
మీరు దీన్ని 14వ వచనం చివరలో ఇలా రాస్తే బాగుంటుంది"కాబట్టి ఇరుకు ద్వారాన ప్రవేశించండి."
● ద్వారం, మార్గం
ప్రజలు దారిలో నడచుకుంటూ ఎలా ద్వారం లోపలకి వెళుతారో, తర్వాత "జీవము" లేక "నాశనం" లోకి ప్రవేశిస్తారో తెలిపే రూపకాలంకారం ఇది. (యుడిబి, రూపకాలంకారం చూడండి} కాబట్టి మీరు "ప్రజలు విశాలమైన దారిలో నడిచి, వెడల్పుగా ఉండే ద్వారం గుండా నాశనానికి వెళతారు." ఇక్కడ ద్వారము, దారి రెండు వేరు వేరు విశేషణాలుగా పాఠకులు అర్ధం చేసుకుంటారు కాబట్టి వాటిల్ని తిరిగి రాయాల్సిన అవసరం లేదు.( విశేషణాలను జత పరిచే వాక్య పద్దతులు చూడండి).
● ద్వారం వెడల్పును,ఆ దారి విశాలమునైయున్నది.. ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది.
యు ఎల్ బి లో క్రియా పదాల ముందు విశేషణాలను రాయడం ద్వారా ఆ విశేషణాల మధ్య తేడాని నొక్కి చెబుతోంది. మీ భాషలో విశేషణాల మధ్య తేడాని ఎత్తి చూపే విధంగా అనువదించండి.
● నాశనము
మామూలుగా అయితే దీనర్ధం పాడై/చెడిపోవడం. ఇక్కడ నిత్య మరణానికి రూపకంగా వాడిన శారీరిక మరణాన్ని సూచిస్తోంది.(యుడిబి చూడండి} ఇది "నిత్య జీవానికి" రూపకమైన శారీరక "జీవితాని"కి వ్యతిరేకమైనది.(రూపకాలంకారం చూడండి}
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● జాగ్రత్త పడుడి
" ఆపదలనుండి రక్షించుకోండి
● వారి ఫలముల వలన
యేసు, ప్రవక్తల చర్యలను, చెట్టు పండ్లతో పోలుస్తున్నాడు. దీన్ని మరో విధంగా "వారు చేసే పనులను బట్టి అని రాసుకోవచ్చు." (రూపకాలంకారం చూడండి).
● కోయుదురా?
"ప్రజలు కోయరు" యేసు మాట్లాడుతున్న ప్రజలకి దీని సమాధానం"కోయరు" అని తెలిసి ఉంటుంది. (అలంకార ప్రశ్నలు చూడండి).
● మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును
ఇక్కడ యేసు మంచి మాటలు చెప్పే, మంచి పనులు చేసే ప్రవక్తలను మంచి ఫలాలు అనే రూపకం ద్వారా పోలుస్తున్నాడు.
● పనికిమాలిన చెట్టు కాని ఫలాలను ఫలించును
యేసు తర్వాత కూడా అదే రూపకాన్ని ఉపయోగిస్తూ ఫలాలను చెడ్డ మాటలు పలికే, చెడ్డ పనులు చేసే ప్రవక్తలతో పోలుస్తున్నాడు.
● మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును
యేసు అబద్ద ప్రవక్తలను ఉద్దేశిస్తూ పండ్లు చెట్లను రూపకలుగా వాడుతున్నాడు. చెడ్డ చెట్లకు ఏమి జరుగుతుందో ఆయన ఇక్కడ చెబుతున్నారు. అంటే చెడ్డ ప్రవక్తలకు కూడా అలాగే జరుగుతుందని అర్ధం. (రూపకాలంకారం,స్పష్టమైన, అవ్యక్తమైన సమాచారం చూడండి).
● మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు
"వారి ఫలాలు" అంటే ప్రవక్తలైనా, చెట్లైనా కావొచ్చు. చెట్టు పండ్లైనా, ప్రవక్తల పనులైనా అవి మంచివో కావో అన్న విషయాన్ని తెలుసుకొవోచ్చు అని ఈ రూపకము చెబుతుంది. అవకాసం ఉంటే ఈ రెండిటిని విడివిడిగా ప్రస్తావిస్తూ రాయండి. (సందిగ్ద వాక్యం చూడండి).
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది
● నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే
నా తండ్రి కోరుకున్నది చేసేవాడు"
● మేము
వీరిలో యేసు లేడు(ప్రత్యేక పదాలు చూడండి).
● ఆ దినమందు
యేసు తన మాటలు వింటున్నవారికి అర్దమౌతుందని తెలిసే తీర్పు రోజును "ఆ దినమందు" అంటున్నాడు. యేసు మాట్లాడే వారికి ఆ దినం అంటే అర్ధమౌతుందని తెలిసే ఇలా అంటున్నాడు (యుడిబిలో ఉన్నట్టు). ఒకవేళ మీ పాఠకులు గుర్తించలేక పోతే మీరు దీన్ని స్పష్టంగా అనువదించాలి.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది
● కాబట్టి
"ఆ కారణం చేత"
● బండ మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును
యేసు తన మాటలకు విధేయత చూపేవారిని ఈ విధమైన నష్టము రాని చోట యిల్లు కట్టుకున్న మనిషితో పోలుస్తున్నాడు. వాన,గాలి, వరదలు ఇంటిపైకి వచ్చినా అది పడిపోదు అన్న విషయాన్ని గుర్తించండి. (ఉపమానం చూడండి).
● బండ
ఇది పై మట్టి, బంకమట్టి కిందనుండే భూభాగం కానీ నేలపైనుండే పెద్ద రాయి కానీ రాతి నేల కాదు.
యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగుతుంది. ఇది 5:1 లో మొదలైంది.
● ఇసుక మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును
యేసు తన ఉపమానాన్ని కొనసాగిస్తున్నాడు (ఉపమానం చూడండి).
● కూలబడెను
ఒక ఇల్లు పడిపోవడాన్ని చెప్పడానికి మామూలుగా ఏ పదం వాడతామో దాన్ని రాయండి.
● దాని పాటు గొప్పదని
వాన, వరదలు, గాలి ఆ ఇంటిని పూర్తిగా నాశనం చేసాయి.
● ముగించినప్పుడు
కథనంలో కొత్త భాగాన్ని మొదలుపెట్టడానికి మీ భాషలో ఏదైనా ప్రయోగం ఉంటే ఇక్కడ ఉపయోగించండి. (ఉపన్యాసం చూడండి).
యేసు అద్భుతమైన విధంగా చాలా మందిని బాగు చేయడం మొదలవుతుంది.
● ఆయన కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనను వెంబడించెను
దీన్నే మరో విధంగా "యేసు కొండ దిగి కిందకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు ఆయనను వెంబడించారు. " ఆ ప్రజలలో ఆయనతోపాటు కొండ దిగినవారు, కొండపై ఆయనతో పాటు లేనివారు కూడా ఉండొచ్చు.
● ఇదిగో
ఇక్కడ "ఇదిగో" అనే పదం కొత్త మనిషి రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏమైనా ప్రత్యేక పద్ధతి ఉందేమో చూడండి.
● కుష్టురోగి
"కుష్టు రోగం ఉన్న మనిషి" లేక "ఒక చర్మ రోగంతో బాధపడుతున్న వ్యక్తి.” (యుడిబి).
● నీకిష్టమైతే
దీన్ని మరో విధంగా "మీరు కోరుకుంటే" లేక "మీరు అనుకుంటే" అని రాయొచ్చు. యేసుకు తనను బాగుచేయగల శక్తి వుందని ఆ కుష్టురోగికి తెలుసు, అయితే యేసు తనను తాకుతాడో లేదో అని అనుకుంటున్నాడు.
● నన్ను శుద్దునిగా చేయగలవనెను
దీన్ని ఇలా అనువదించ వచ్చు "మీరు నన్ను బాగు చేయగలరు" లేక "నన్ను బాగు చేయండి." అని రాయొచ్చు.(యుడిబి).
● తక్షణమే
"వెంటనే."
● వాని కుష్టురోగం శుద్ధియాయెను
యేసు "శుద్దుడవు కమ్మని" చెప్పగానే అతను బాగు పడ్డాడు. దీన్నే ఇలా "అతను బాగయ్యాడు" లేక "అతని కుష్టు రోగం పోయింది" లేక కుష్ఠురోగం బాగయింది." అని రాయొచ్చు.
యేసు కుష్టురోగిని బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతున్నాయి.
● వాని
కుష్ఠురోగం ఉన్న మనిషి.
● ఎవరితోనూ ఏమియూ చెప్పకు
ఆ మనిషి తాను కానుకలు ఇచ్చే సమయంలో యాజకునితో మాట్లాడాలి, అయితే యేసు జరిగిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని అంటున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరికీ ఏమీ చెప్పొద్దు" లేక "నేను నిన్ను బాగు చేసానని ఎవరికీ చెప్పొద్దు" అని రాయొచ్చు. (అతిశయ వాక్యాలు చూడండి.).
● నీ దేహాన్ని యాజకునికి కనపరచుకుని
యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి తన శరీరం (చర్మం). బాగైన విషయాన్ని యాజకునికి తెలిపిన తర్వాత అతడిని ఇతరులతో కలిసి జీవించడానికి అనుమతిస్తారు.
● వారికి సాక్ష్యార్దమై కనపరచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని
మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషికి కుష్టు రోగం బాగైన తర్వాత అతడు తన కృతజ్ఞతార్పణలను యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు వాటిని తీసుకుంటే ఆ మనిషి బాగైనట్టు అందరికి తెలుస్తుంది.
● వారికి
దీనర్ధం 1). యాజకులు లేక 2). ప్రజలు లేక 3). యేసును విమర్శించేవారు. అవకాశముంటే ఈ ముగ్గురిని ఉద్దేశించే సర్వనామాన్ని రాయండి.(సందిగ్దత చూడండి).
యేసు చాలామందిని బాగు చేసిన వివరాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆయన .. ఆయన
యేసు
● పక్షవాతం
జబ్బుతో "కదలలేని పరిస్థితి."
● యేసు "నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని" అతనితో చెప్పగా
శతాధిపతితో యేసు "నేను నీ ఇంటికి వచ్చి నీ పనివాడిని బాగుచేస్తాను" అంటున్నాడు.
యేసు చాలామందిని బాగు చేసిన సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.
● నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు
"నీవు నా ఇంటిలోకి రావడానికి (అన్యాపదేశాలు చూడండి).
● నీవు మాట మాత్రం సెలవిమ్ము
"నీవు ఆజ్ఞాపించు."
● సైనికులు
"శిక్షణ పొందిన యోధులు."
● ఇశ్రాయేలులో నేవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని
దేవుని ప్రజలుగా ఎంచబడే ఇశ్రాయేలులోని యూదులకు అందరికంటే ఎక్కువ విశ్వాసం ఉంటుందని యేసు దగ్గర ఉన్న ప్రజలు అనుకుంటుండవచ్చు. యేసు వారి అభిప్రాయం తప్పని, శతాధిపతి విశ్వాసం గొప్పదని చెబుతున్నాడు.
రోమా శతాధిపతి పనివాడిని యేసు బాగు చేసిన సంఘటన కొనసాగుతుంది.
● మీతో
తన వెంట వస్తున్నవారితో ఇలా అంటున్నాడు, (8:10). కాబట్టి ఇది బహువచనం.
● తూర్పు నుండియు పడమట నుండియు
ఇది రెండు వైరుధ్య విషయాలను కలిపి చెప్పే పద ప్రయోగం: తూర్పు అంటే అది పడమరకు దగ్గర కాదు. ఈ వ్యాక్యాన్ని "అన్ని ప్రాంతాలనుండి" లేక "అన్ని దూరదిక్కుల నుండి" అని రాయొచ్చు. (వైరుధ్యా పద ప్రక్రియ చూడండి).
● కూర్చుందురు గాని
అప్పటి సంప్రదాయం ప్రకారం తినే సమయంలో మనుషులు బల్ల చుట్టూ శరీరాలను వాల్చి కూర్చునేవారు. ఒక కుటుంబము, స్నేహితులు సన్నిహితంగా జీవించే సంప్రదాయాన్ని ఈ అన్యాపదేశంగా చెబుతోంది. (అన్యాపదేశం చూడండి).
● పరలోకరాజ్య సంబధులు. త్రోయబడుదురు
"దేవుడు పరలోక రాజ్య సంబధులను త్రోసివేస్తాడు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న పదప్రయోగాన్ని చూడండి).
● పరలోకరాజ్య సంబంధులు
సంబంధులు అంటే 'చెందినవారు" ఇక్కడ దేవుని రాజ్యానికి చెందినవారు. ఇది కొంత విడ్డూరంగా ఉంది, ఎందుకంటే "సంబంధులు" త్రోయబడుతారు, కొత్తవారు లోపలి చేర్చబడుతారు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరైతే దేవునికి విధేయత చూపి లోబడుతారో" రాయొచ్చు(యుడిబి చూడండి). (జాతీయాలు చూడండి).
● వెలుపటి చీకటిలోనికి
దేవుని వ్యతిరేకించే వారికి ఎదురయ్యే నిరంతర స్థితిని ఇది తెలియజేస్తుంది. "దేవునికి దూరంగా ఉండే చీకటి ప్రదేశం” (అన్యాపదేశం చూడండి).
● నీకు అవును గాకని
"నేను నీ కొరకు చేస్తాను." (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న పదప్రయోగాన్ని చూడండి).
● దాసుడు స్వస్థతనొందెను
"యేసు దాసుడిని బాగు చేసాడు." (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న పదప్రయోగాన్ని చూడండి).
● ఆ గడియలోనే
తాను దాసుడిని బాగు చేస్తానని యేసు చెప్పిన ఈ క్షణంలోనే."
యేసు చాలామందిని బాగు చేసే సంఘటనల వివరాలు కొనసాగుతాయి.
● యేసు రాగా
యేసుతో పాటు ఆయన శిష్యులు ("ఆయన ఆదేశించిన వారు,"8:18; యుడిబి చూడండి). కూడా ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం యేసు ఏం చెప్పాడు, ఏం చేసాడు అన్నదే కాబట్టి అవసరమైతేనే శిష్యులను గురించి చెప్పండి. ఎటువంటి అపార్ధాలు లేకుండా చూడండి.
● పేతురు అత్త
"పేతురు భార్య తల్లి."
● జ్వరమామెను విడిచెను
ఒకవేళ మీ భాషలో ఇక్కడ జ్వరమే తనంతట తానే ఆమెను వదిలి వెళ్ళిపోయింది అనే మానవీకరణగా అర్ధం వస్తే "ఆమె బాగు పడింది" లేక "యేసు ఆమెను బాగు చేసాడు" అని రాయొచ్చు. (మానవీకరణ చూడండి).
● లేచి
"మంచం మీద నుండి లేచి"
యేసు చాలామందిని బాగు చేసే సంఘటనల వివరాలు కొనసాగుతాయి
● సాయంకాలం
యుడిబి మార్కు 1:30 ప్రకారం యేసు కపెర్నహూం లోకి సబ్బాతు రోజు వచ్చాడు. యూదుల ఆచారం ప్రకారం సబ్బాతు రోజు ఏ పని కానీ ప్రయాణం కానీ చేయరు, అందుకని వారు సాయంత్రం వరకు ఆగి ప్రజలను యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. వేరే అర్ధం వస్తుందనుకుంటే తప్ప మీరు సబ్బాతు గురించి రాయక్కర్లేదు.
● ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి
ఇది అతిశయ వాక్యం. యేసు ఒకమాట కంటే ఎక్కువ మాట్లాడి ఉండవచ్చు. దీని ఇలా "యేసు ఒకసారి మాట్లాడగానే దయ్యాలు ఆ మనిషిని వదిలి వెళ్ళాయి.” (అతిశయ వాక్యాలు చూడండి).
● ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను
"ఇశ్రాయేలులోని యూదా ప్రజలకు చెప్పమని దేవుడు యెషయా ప్రవక్తకు తెలిపిన ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● యెషయా ద్వారా చెప్పబడినది
"యెషయా ఏమి చెప్పాడో" (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించెనని
"ప్రజల రోగాలను వదలగొట్టి వారిని బాగు చేసాడు. “(ఏకమూలక పదాలు Doublet చూడండి).
తనను అనుసరించేవారి నుండి తాను ఏమి కోరుకుంటున్నాడో యేసు వివరిస్తున్నాడు.
● నీ. ఆయన
8"19 లో ఇది యేసును ఉద్దేశించిన సంబోధనలు.
● ఆజ్ఞాపించెను
"వారు ఏం చెయ్యాలో ఆయన వారికి చెప్పాడు."
● అంతట
యేసు వారికి చెప్పిన తర్వాత దోనె ఎక్కక ముందు (యుడిబి చూడండి).
● నీవెక్కడికి
"ఏ స్థలానికైనా."
● నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు
ఈ వైరుధ్య ప్రయోగంలో చెప్పిన జంతువులు అడవి జంతువులని అర్ధం. (వైరుధ్య వాక్య ప్రయోగం చూడండి).
●నక్కలు
నక్కలనేవి కుక్కల్లాగే వుండి గూటిలోని పక్షుల్ని, చిన్న చిన్న జంతువుల్ని తింటాయి. ఒక వేళ మీ ప్రాంతంలో నక్కలు తెలియకపోతే కుక్కలు లేక ఇతర బొచ్చు ఉన్న జంతువుల్ని రాయొచ్చు. (తెలియనివాటిని అనువదించడం చూడండి).
● బొరియలు
నక్కలు నెలలో రంధ్రాలు చేసుకుని అక్కడ నివసిస్తాయి. నక్కలకు బదులు మీరు రాసే జంతువులు ఎక్కడ "నివసిస్తాయో" వాటిని రాయండి.
● తల వాల్చుకోనుటకైనను స్థలం లేదని
"తనకు నిద్ర పోవడానికి స్థలం లేదని" (జాతీయాలు చూడండి).
యేసు తనను అనుసరించేవారి నుంచి ఏమీ కోరుకుంటాడో ఇంకా వివరిస్తున్నాడు.
● నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
ఇది చాల మర్యాదగా అడిగిన కోరిక. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వారిని ఆ రోజే పాతిపెడుతారు. ఒకవేళ ఆ వ్యక్తి తండ్రి ఇంకా బ్రతికి ఉండొచ్చు. ఇక్కడ తన తండ్రి చివరి రోజుల్లో లేక సంవత్సరాలలో అతడి పోషించి వస్తానని చెప్పడానికి సభ్యోక్తిగా వాడిన వ్యక్యమై ఉండవచ్చు (యుడిబి చూడండి). ఒకవేక అతని తండ్రి అప్పటికే చనిపోయి ఉంటే కొన్ని గంటల సమయం మాత్రమే అడిగి ఉండేవాడు. అపార్ధలు రాకుండా ఉండాలంటే, అవసరమైతే అతని తండ్రి చనిపోయాడో లేదో కూడా వివరించండి. (సభ్యోక్తి చూడండి).
● మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననిమ్మని చెప్పెను
ఇవి క్లుప్తంగా కఠినంగా వాక్యాన్ని పూర్తిచేయకుండా చెప్పిన మాటలు. కాబట్టి తక్కువ పదాలను వుపయోగించి తక్కువగా వివరించండి. ఆ వ్యక్తి "పాతిపెట్టడానికి" అడిగిన పదజాలాన్నే ఇక్కడ కూడా వాడండి.
● పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను
ఆ వ్యక్తి తన బాధ్యతను నెరవేర్చకుండా చేసే కఠినమైన మాటలు ఇవి. "చనిపోయిన వారిని వారే పాతిపెట్టుకోనివ్వు" లేక "చనిపోయినవారిని పాతిపెట్టుకోవడానికి అనుమతివ్వు" అన్నవాటి కంటే కటినమైన మాటలు. దీని మరోలా "చనిపోయినవారినే తమ తర్వాత చనిపోయేవారిని పాతిపెట్టుకోనిమ్ము" అన్న వాక్యంగా అనుకోవచ్చు.
● మృతులు. తమ మృతులను
"మృతులు" అంటే దేవుని రాజ్యానికి దూరంగా నిత్య జీవం లేకుండా ఉండేవారిని ఉద్దేశించిన రూపకం (యు డి బి చూడండి: రూపకాలంకారం). "తమ మృతులు" అంటే దేవుని రాజ్యానికి బయట ఉన్న వారి చనిపోయిన బంధువులు అని అర్ధం.
యేసు తుఫానును ఆపిన సంఘటన వివరాలు మొదలవుతాయి.
● దోనె యెక్కి
"యేసు పడవలోకి ఎక్కాడు."
● ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి
8:22 లో ఉపయోగించినట్టు "శిష్యులు", "అనుచరులు" అన్న పదాలనే ఇక్కడ ఉపయోగించడానికి ప్రయత్నించండి.
● అంతట
పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.
● సముద్రం మీద తుఫాను లేచినందున
"సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది."
● ఆ దోనె అలల చేత కప్పబడెను
"కాబట్టి అలలు దోనెను కప్పేసాయి. (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వ్యాక్యాలను చూడండి).
●మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి
ఆయనను వారు "రక్షించు"మనే మాటలతో లేప లేదు గాని, మొదట ఆయనను లేపి తర్వాత "రక్షించుమని" అడిగారు.
●నశించిపోవుచున్నాము
"మేము చనిపోబోతున్నాము."
యేసు తుఫానును ఆపిన సంఘటన ఇక్కడ పూర్తవుతుంది.
● వారు
శిష్యులు
● లారా. వారితో
బహువచనం
● ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి
యేసు ఇక్కడ అలంకారిక ప్రశ్నిస్తూ శిష్యుల్ని మందలిస్తున్నాడు. దీనర్ధం "మీరు భయపడకూడదు” (యుడిబి చూడండి). లేక "మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు" అని. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● అల్ప విశ్వాసులారా
ఇది బహువచనం. 6:30 లో ఉన్న ఇవే పదాలను అనువదించినట్టే ఇక్కడ అనువదించండి.
● ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి
ఈ చాతుర్యవాక్యం శిష్యులు ఎంత ఆశ్చర్య పడ్డారో చెబుతుంది. దీన్నే ఇలా "గాలి, సముద్రం కూడా ఈయన మాట వింటున్నాయి! ఈయన ఎలాంటి మనిషో కదా" అని లేక "ఎలాంటి మనిషిని మనం ఇంతవరకు చూడలేదు! గాలి అలలు కూడా ఈయన మాట వింటున్నాయి" అని రాయొచ్చు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● గాలి, సముద్రము ఈయన మాట వింటున్నాయి
మనుషులూ, జంతువులూ మాట వినడం, వినకపోవడం ఆశ్చ్యరం కాదు గానీ, గాలి, నీళ్ళు మాట వినడం చాలా ఆశ్చ్యరం., మనుషుల్లాగే ప్రకృతిలోనివి మాట విని చేసే శక్తి ఉందని ఈ మానవీకరణ వాక్యం వివరిస్తుంది. (మానవీకరణ చూడండి).
యేసు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుష్యులను బాగు చేసిన సంఘటన వివరాలు మొదలవుతాయి.
● అద్దరినున్న
"గలీల సముద్రము అవతలి వైపున ఉన్న"
● గదరేనీయుల దేశము
గదరా దేశము లో నివసిస్తున్నందున వారికి గదరేనీయులు అని పేరు వచ్చింది. (పేర్లను అనువదించడం చూడండి).
● వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేక పోయెను
ఆ ఇద్దరు మనుషులను పట్టిన దయ్యాలు చాలా భయంకరమైనవి కాబట్టి వారున్న ప్రాంతం ద్వారా ఎవరూ వెళ్ళలేక పోయేవారు.
● ఇదిగో
పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.
● ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి?
మొదట అలంకారిక వేసిన ఈ ప్రశ్న చాలా వ్యతిరేక భావంతో నిండి వుంది. (యుడిబి, అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● దేవుని కుమారుడా
యేసు ఎవరో చెబుతూ అందుకనే అతడిని రావాలని కోరుకోవడం లేదని చెప్పడానికి దయ్యాలు ఈ సంబోధన చేస్తున్నాయి.
● కాలం రాక మునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా?
రెండవసారి వేస్తున్న ఈ చాతుర్య ప్రశ్న కూడా వ్యతిరేక భావంతోనే ఉంది. దీనర్ధం "దేవుడు మమల్ని శిక్షించడానికి నియమించిన సమయానికంటే ముందు వచ్చి మమ్మల్ని శిక్షించి దేవుడిని వ్యతిరేకించ వద్దు” అని.(అలంకారిక ప్రశ్నలు, చూడండి).
యేసు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుష్యులను బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతాయి.
● అప్పుడు
ఇక్కడ కథ కొనసాగించడానికి ముందే పాఠకుడికి అవసరమైన సమాచారాన్ని రచయిత అందిస్తున్నాడు. యేసు అక్కడికి రావడానికి ముందే పందులు ఉన్నాయి. (సంఘటనల క్రమం చూడండి).
● నీవు మమ్మును వెళ్ళగొట్టిన యెడల
దీనర్ధం "నీవు మమ్మల్ని వెళ్ళగొడతావు కాబట్టి" అని కూడా కావొచ్చు.
● మమ్మును
ప్రత్యేకత (ప్రత్యేకత చూడండి).
● వాటిని
ఈ మనిషిలోని దయ్యాలు.
● అవి ఆ మనుష్యులను వదిలి పెట్టి ఈ పందుల లోనికి పోయెను
" ఆ దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పందులలోకి వెళ్ళాయి."
● ఇదిగో
ఇక్కడ "ఇదిగో" అంటే తర్వాత జరిగే ఆశ్చ్యర సంఘటనల వైపు మన దృష్టిని మళ్ళించడం.
● ప్రపాతము నుండి వడిగా
"ఏటవాలుగా ఉన్న ప్రాంతంనుండి త్వరగా కిందకు జారాయి."
● నీళ్ళలో పడి చచ్చెను
"మునిగిపోయాయి"
యేసు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుష్యులను బాగు చేసిన సంఘటన ఇక్కడ పూర్తవుతుంది.
● వాటిని మేపుచున్నవారు
"పందులను కాపలా కాస్తున్న వారు"
● జరిగిన కార్యములన్నియు, దయ్యాలు పట్టినవారి సంగతియు
దయ్యాల స్వాధీనంలో ఉన్న వ్యక్తులకు యేసు ఏంచేసాడో.
● ఇదిగో
పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.
● ఆ పట్టణస్తులందరు
దీనర్ధం ఆ పట్టణంలోని ప్రజలందరూ అని కాదు. చాలా మంది లేక ఎక్కువ మంది అని.(అతిశయ వాక్యాలు చూడండి).
● ప్రాంతాలు
"ఆ పట్టణం దాని చుట్టూ పక్కల ప్రదేశాలు."
పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు బాగు చేసిన సంఘటన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.
● ఆయన దోనె ఎక్కి
బహుశా యేసు శిష్యులు కూడా ఆయనతో వెళ్లి ఉండవచ్చు. (యుడిబి చూడండి).
● దోనె
బహుశా 8:23 లోని దోనె కావొచ్చు. గందరగోళం లేకుండా ఉండాలంటే దీన్ని వివరించండి.
● తన పట్టణములో ప్రవేశింపగా
"ఆయన నివసిస్తున్న పట్టణములో” (యుడిబి చూడండి).
● ఇదిగో
పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.
● వారి
పక్షవాతం ఉన్న వ్యక్తిని యేసు వద్దకు తీసుకువచ్చిన వారు, పక్షవాయువు రోగి కూడా కలిపి అవొచ్చు.
● కుమారుడా
ఇతను యేసు కొడుకు కాదు గాని, అతనితో అభిమానంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని "నీ స్నేహితుడా" లేక "యువకా" అని లేక అసలు రాయకుండా ఉన్నా మంచిది.
● నీ పాపములు క్షమింప బడియున్నవని
"దేవుడు నీ పాపాలు క్షమించాడు" లేక "నేను నీ పాపాలు క్షమించాను."
పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు బాగు చేసిన సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● ఇదిగో
పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు
● తమలో తాము
దీనర్ధం "వారు తమ మనసులో" కావొచ్చు లేక "ఒకరితో ఒకరు" నోటితో మాట్లాడుకోవడం కావొచ్చు.
● దేవదూషణ
కేవలం దేవుడు మాత్రమే చేయగలడు అని శాస్త్రులు అనుకుంటున్న వాటిని యేసు చేస్తానంటున్నాడు.
● వారి తలంపులు గ్రహించి
వారు ఏమీ ఆలోచిస్తున్నారో యేసు తన అతీంద్రియ శక్తి (దైవిక జ్ఞానం). ద్వారా గాని లేక వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూడడం ద్వారా గాని గ్రహించి ఉండొచ్చు.
● మీరెందుకు మీ హృదయంలలో దురాలోచనలు చేయుచున్నారు?
శాస్త్రులను తిట్టడానికి యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● మీరు. మీ
బహువచనాలు
● దురాలోచన
ఇది కేవలం పొరబాటు,కాదుగాని నైతిక పాపం లేక చెడ్డబుద్ధి.
● ఏది సులభము?
ఆ రోగి తాను చేసిన పాపాల వలనే పక్షవాతానికి గురయ్యాడని శాస్త్రులు నమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తు చేయడానికి యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ అతని పాపాలు క్షమింపబడితే అతను లేచి నడుస్తాడని,కాబట్టి తాను ఆ పక్షవాయువు రోగిని బాగు చేస్తే తనకు పాపాలను క్షమించే అధికారం ఉందని శాస్త్రులు గుర్తించాలని యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు.(అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా?
"నీ పాపాలు క్షమింపబడి యున్నాయని చెప్పడం తేలికా? లేక "నీవు లేచి నడువు అని చెప్పడం తేలికా?"
● నీ పాపములు క్షమింప బడి యున్నవి
దీనర్ధం 1)."నేను నీ పాపాలను క్షమిస్తున్నాను” (యు డి బి). లేక 2). "దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు." ఇక్క నీ అనేది ఏకవచనం (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● మీరు తెలిసికోనవలెను
"నేను చేసి నిరూపిస్తాను." ఇక్కడ "మీరు" బహు వచనం.
● నీవు .నీ
ఏకవచనం
● నీ యింటికి పొమ్మని
యేసు అతడిని ఎక్కడికీ వెళ్ళవద్దని చెప్పడం లేదు, ఇంటికి వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు.
పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు బాగు చేసిన సంఘటన ఇక్కడ ముగుస్తుంది. యేసు తర్వాత పన్నులు వసూలు చేసే వ్యక్తిని తన శిష్యులలో ఒకనిగా ఉండమని పిలుస్తాడు.
● మహిమ
5:16 లో వాడిన పదాలే వాడండి.
● ఇట్టి అధికారం
పాపలు క్షమించే అధికారం
● మత్తయి. అతని
అతడు
చర్చి సంప్రదాయం ప్రకారం ఈ సువార్తను మత్తయి రాశాడు. అయితే ఇక్కడ అతడు అతని అనే సర్వనామాలను "నన్ను' "నాతో " అని రాయడానికి ఏ ఆధారమూ లేదు.
● అతనితో చెప్పగా
"యేసు మత్తయితో చెప్పగా"
● యేసు అక్కడి నుండి వెళ్ళుచు
(9:8). లో "ఇదిగో" తో మొదలైన సంఘటనను ప్రస్తావించడానికి దీనిని రాసారు మీ భాషలో దీన్ని రాయడానికి ఏవైనా ప్రత్యేక పద్దతులు ఉంటే ఇక్కడ ఉపయోగించండి.
● వెళ్ళుచు
ఇక్కడ యేసు కపెర్నహూము లోపలికి వెళ్తున్నాడో బయటకి వెళుతున్నాడో తెలియదు కాబట్టి వెళ్ళడానికి రాసే పదాన్నే ఇక్కడ రాయండి.
● అతడు లేచి ఆయనను వెంబడించెను
"మత్తయి లేచి యేసును ఒక శిష్యుడిగా వెంబడించాడు." గానీ ఆయన వెళ్ళే చోటుకి వెళ్ళాడని కాదు(యుడిబి చూడండి).
పన్ను వసూలు చేసే మత్తయి ఇంటిలో ఈ సంఘటనలు జరుగుతాయి.
● ఇంటిలో
బహుశా ఇది మత్తయి ఇల్లు కావొచ్చు. (యుడిబి చూడండి)., లేకపోతే యేసు ఇల్లు కూడా కావొచ్చు. ("యేసు ఆయన శిష్యులతో కూర్చుండిరి"). గందరగోళం లేకుండా ఉండాలంటే స్పష్టంగా రాయండి.
● ఇదిగో
ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి. ఇంగ్లీషులో అయి'తే "అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ..”
● పరిసయ్యులు అది చూసి
"యేసు పన్నులు వసూలు చేసేవారితోనూ, పాపం చేసేవారితోనూ కలిసి భోజనం చేస్తున్నాడని పరిసయ్యులు చూసి."
పన్ను వసూలు చేసే మత్తయి ఇంటిలో ఈ సంఘటనలు జరుగుతాయి.
● ఆయన ఆ మాట విని
"ఆ మాట " అంటే యేసు పన్నులు వసూలు చేసేవారితోనూ, పాపం చేసేవారితోనూ కలిసి భోజనం చేస్తున్నాడని పరిసయ్యులు అడిగిన మాట.
● వైద్యుడు
డాక్టరు (యుడిబి చూడండి).
● రోగులకేగాని
"రోగంతో ఉన్న వ్యక్తికే డాక్టరు అవసరం"
వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని
"దీని అర్ధం ఏంటో మీరు తెలుసుకోవాలి"
● మీరు వెళ్లి
"మీరు " అనీ సర్వనామం పరిసయ్యులను తెలియజేస్తుంది.
యేసు శిష్యులు ఉపవాసం ఉండటం లేదన్న విషయాన్ని బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు.
● పెండ్లి ఇంటివారు దుఃఖ పడగలరా?
పెండ్లి కొడుకు తమతో ఉన్నపుడు అతనితో కూడా ఉన్నవారు ఎవరూ ఉపవాసం ఉంటారని అనుకోరు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● పెండ్లి ఇంటివారు
ఇది యేసు శిష్యుల్ని గురించి చెప్పిన రూపకం. (రూపకాలంకారం చూడండి).
● పెండ్లికుమారుడు వారి యొద్డనుండి కొనిపోబడు
"ఎవరో పెండ్లికుమారుడిని తీసుకుని వెళుతారు." చంపబడతాడు అనడానికి ఇది ఒక రూపకం. (రూపకాలంకారం, కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● దుఃఖపడరు
"విచారము. బాధ." (యుడిబి చూడండి}
యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు సమాధానం ఇంకా కొనసాగుతోంది.
● ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వెయ్యడు
పాత సంప్రదాయాలను ఆచరించే వారు అంత తొందరగా కొత్త వాటిని ఒప్పుకోలేరు. (రూపకం చూడండి).
● బట్ట
"దుస్తులు"
● మాసిక
చినుగును కప్పడానికి వాడే "కొత్త గుడ్డ ముక్క."
యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు సమాధానం ఇంకా కొనసాగుతోంది.
● పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు.
పరిసయ్యులు, మేము ఉపవాసం ఉంటాము, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసు ఈ రూపకాన్ని లేక ఉపమానాన్ని చెబుతున్నాడు.(రూపకాలంకారం చూడండి).
● పోయరు
"ఎవరూ దాంట్లోకి పోయరు” (యుడిబి). లేక "మనుషులు ఎప్పుడూ పోయరు"
● కొత్త ద్రాక్షారసం
"ద్రాక్షా పండ్ల రసం." మద్యంగా చేయబడని ద్రాక్ష పండ్ల రసం అని అర్ధం. ఒకవేళ మీ ప్రాంతంలో ద్రాక్ష పండ్లు లేకపోతే పండ్లు అని తెలిపే పదం వాడండి.
● పాత తిత్తులలో
దీనర్ధం చాలా సార్లు వాడిన ద్రాక్ష తిత్తులు.
● ద్రాక్ష తిత్తులు
ఇవి జంతు చర్మంతో చేసిన తిత్తులు. వీటిని "చర్మపు సంచులు" అని లేక "ద్రాక్షసంచులు"అని రాయొచ్చు. (యుడిబి).
● తిత్తులు పిగిలి
కొత్త ద్రాక్ష రసం మగ్గి రసం పొంగినప్పుడు సంచులు సాగలేక రసాన్ని పట్టలేక చిల్లులు పడతాయి.
● పాడగును
"నాశనమవుతాయి." (యుడిబి).
● కొత్త తిత్తులు
"కొత్త ద్రాక్షారస సంచులు" లేక "కొత్త చర్మపు సంచులు.” దీనర్ధం ఇవి ఇంతకు ముందు వాడనివి అని.
యూదా అధికారి కూతురిని యేసు అద్భుతమైన విధంగా బాగుచేసిన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.
● ఈ మాటలు
ఉపవాసం గురించి యోహాను శిష్యులకు యేసు ఇచ్చిన సమాధానం.
● ఇదిగో
ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి
● ఆయనకు మ్రొక్కి
యూదుల సాంప్రదాయంలో ఒక వ్యక్టిని గౌరవించడాన్ని ఇది సూచిస్తుంది.
● నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రదుకుననెను
తన కూతురిని తిరిగి బ్రతికించే శక్తి యేసుకు ఉందని ఆ యూదా అధికారి నమ్ముతున్నాడని ఇది తెలియజేస్తుంది.
● ఆయన శిష్యులు
"యేసు శిష్యులు"
యూదా అధికారి కూతురిని బాగు చేయడానికి వెళ్ళే దారిలో మరొక ఆమెను యేసు బాగు చేసిన సంఘటన ఇది.
● ఇదిగో
ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి
● రక్త స్రావ రోగం
"బాగా రక్తం కారి పోవడం." ఆమెకు సాధారణంగా రక్త స్రావం జరిగే సమయం కాకుండా, గర్భం నుంచి రక్తం కారుతూ ఉండొచ్చు. కొన్ని సాంప్రదాయాల్లో దీని కొంత మర్యాదగా వివరించే అవకాశం ఉంటుంది. (సభ్యోక్తి చూడండి).
● ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని
ఆమె ఇక్కడ వస్త్రం తనను బాగు చేస్తుందని నమ్మటం లేదు యేసు తనను బాగు చేస్తాడని నమ్ముతోంది. (మానవీకరణ చూడండి).
● పై వస్త్రం
'పై బట్ట"
● కానీ
"అయితే" ఆమె అనుకున్నది ఇక్కడ జరగలేదు.
● కుమారీ
ఆమె యేసు కూతురు కాదు, ఆయన ఆమెతో మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇది గందరగోళంగా అనిపిస్తే "అమ్మాయీ", అని రాయొచ్చు లేక రాయకుండా ఉండొచ్చు.
యూదా అధికారి కూతురిని యేసు అద్భుతమైన విధంగా బాగుచేసిన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● ఆ అధికారి ఇంటికి
ఇది యూదా నాయకుడి ఇల్లు.
● పిల్లనగ్రోవి
ఇది చెక్కతో బోలుగా వుండే పొడవైన సంగీత వాయిద్యం. దీని ఒకవైపు నుండి లేక పై నున్న రంధ్రంలో ఊదడం ద్వారా మోగిస్తారు.
● పిల్లనగ్రోవులు వాయించు వారిని
"పిల్లన గ్రోవులు ఊదే మనుషులు"
● పంపివేసి
ఇక్కడ యేసు చాలామంది మనుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ భాషలో బహువచనంలో వాడే పదాన్ని ఇక్కడ రాయండి.
● చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని
ఇక్కడ యేసు ఆమెను తాను తిరిగి బ్రతికిస్తాడు కాబట్టి ఆమె మరణానికి నిద్ర అనే పదాన్ని వాడుతున్నాడు. (సభ్యోక్తి చూడండి).
యూదా అధికారి కూతురిని యేసు అద్భుతమైన విధంగా బాగు చేసిన సంఘటన ఇక్కడ ముగుస్తుంది.
● జనసమూహమును పంపివేసి
"యేసు అక్కడ గుమికూడిన వారినందరినీ బయటికి పంపివేసిన తర్వాత" లేక "ఆ కుటుంబ సభ్యులు గుంపును బయటికి పంపివేసిన తర్వాత."
● లేచెను
ఆమె మంచంపై నుండి లేచింది. ఇది 8:15 లో లాగే .జరిగిన సంఘటన.
● ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించెను
ఈ మానవీకరణకు అర్ధం ప్రజలు ఒకరితో ఒకరు చెప్పుకోవడం ద్వారా ఈ సమాచారం వ్యాపించింది. "ఆ ప్రాంతంలోని ప్రజలందరూ దానిని గూర్చి విన్నారు” (యు డి బి). లేక "ఆ అమ్మాయి బ్రతికి లేవడం చూసిన వారు ఆ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలందరికి చెప్పడం మొదలు పెట్టారు.” (మానవీకరణ చూడండి).
ఇద్దరు గుడ్డివారిని యేసు బాగు చేసిన సంఘటన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.
● యేసు అక్కడినుండి వెళ్ళుచుండగా
యేసు ఆ ప్రాంతం విడిచి వెళుతున్నాడు.
● వెళ్ళుచుండగా
ఇక్కడ యేసు ఆ ప్రాంతం లోకి వెళుతున్నాడో బయటికి వెళుతున్నాడో తెలియదు కాబట్టి మామూలుగా "వెళ్ళడానికి ఉపయోగించే పదాన్ని వాడండి.
● దావీదు కుమారుడా
యేసు దావీదుకు నేరుగా పుట్టిన కుమారుడు కాదు కాబట్టి దీన్ని "దావీదు వంశానికి చెందిన వాడా" అని రాయొచ్చు(యుడిబి). అయితే "దావీదు కుమారుడు" అన్నది ఆయనను పిలిచే పిలుపు.(21:9 చూడండి). కాబట్టి ఆ వ్యక్తులు బహుశా ఎలా పిలుస్తూ ఉండొచ్చు.
● యేసు ఇంట ప్రవేశించిన తరువాత
ఇది యేసు ఇల్లు కావొచ్చు(యుడిబి). లేక 9:10 లోని ఇల్లు కావొచ్చు.
● అవును ప్రభువా
"అవునా ప్రభువా, నువ్వు బాగు చేయగలవని నమ్ముచున్నాము."
ఇద్దరు గుడ్డివారిని యేసు బాగు చేయడం ఇక్కడ పూర్తవుతుంది.
● వారి కన్నులు ముట్టి
ఇద్దరి కళ్ళను ఒకసారి తాకాడో, లేక ఒకని కళ్లపై కుడిచేతిని మరొకని కళ్లపై ఎడమచేతిని ఉంచాడో తెలియదు. అయితే ఎడమచేతిని అపరిశుభ్రమైన పనులకు ఉపయోగిస్తారు కాబట్టి, ఆయన తన కుడిచేతినే ఉపయోగించి ఉండొచ్చు. అల్లాగే ఆయన మాట్లాడుతూ వారి కళ్ళను తాకాడో లేక మొదట తాకి తర్వాత మాట్లాడాడో కూడా తెలియదు.
● వారి కన్నులు తెరువబడెను
"దేవుడు వారి కళ్ళను బాగు చేశాడు" లేక "ఆ గుడ్డివారిద్దరూ చూడగలిగారు” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు. జాతీయాలు చూడండి).
● అయినను
"డానికి బదులు." ఆ మనుషులు యేసు చెప్పినట్టు చేయలేదు.
● కీర్తి ప్రచురము చేసిరి
"తమకు ఏమి జరిగిందో దీన్ని చాలామందికి చెప్పారు."
తన స్వంత పట్టణంలో యేసు చాలామందిని బాగు చేసిన సంఘటనల వివరాలు కొనసాగుతాయి.
● ఇదిగో
ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి.
● మూగ
మాట్లాడలేక పోవడం.
● మూగవాడు మాటలాడగా
"మూగగా వుండిన వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడు" లేక "మాట్లాడలేక పోయిన వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు" లేక "ఆ వ్యక్తికి మాటలు వచ్చాయి."
● జనసమూహములు ఆశ్చర్యపడి
"ప్రజలందరూ ఆశ్చర్యపోయారు"
● ఈలాగు ఎన్నడును కనపడలేదని
దీనర్ధం "ఎలాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు" లేక ఎవరూ ఇలాంటి పనులు చేయలేదు" అని.
● దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని
"ఆయన దయ్యాలను తరిమి వేస్తున్నాడు." ఇక్కడ ఆయన అనే సర్వనామం యేసును సూచిస్తుంది.
గలీల ప్రాంతంలో యేసు బోధించే, బాగుచేసే, సువార్త చెప్పే పరిచర్య గురించి వివరాలు ఇక్కడ ఉంటాయి.
● సమస్త పట్టణములయందును
"చాలా పట్టణాల్లో.” (అతిశయ వాక్యాలు చూడండి).
● పట్టణములు గ్రామాలు
"పెద్ద గ్రామాలు. చిన్న గ్రామాలు" లేక "పెద్ద పట్టణాలు . చిన్న పట్టణాలు"
● ప్రతివిధమైన రోగాన్నీ . ప్రతివిధమైన వ్యాధినీ
అన్ని రోగాలను, అన్నివ్యాధులను. రోగం, జబ్బు అనేవి చాల దగ్గర అర్ధాన్నిచ్చే పదాలు. వీలైతే వీటిని రెండు వేర్వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి మనిషిని రోగానికి గురిచేసి బాధపెడుతుంది. వ్యాధి ఉన్నందువల్ల కలిగే శారీరక బలహీనత, బాధను రోగం అంటారు.
● వారు కాపరిలేని గొర్రెల వలె
"ఆ ప్రజలకు నాయకుడు లేడు."
గత సంఘటనలలోని ప్రజల అవసరాలకు శిష్యులు ఏ విధంగా స్పందించాలో చెప్పడానికి పంట కోతను గురించిన వాక్య ప్రయోగాన్ని(భాషా రూపాన్ని). యేసు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు.
● కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
ఇది ఒక రూపకాలంకారము. ఇక్కడ దేవుని నమ్ముకుని ఆయన రాజ్యంలో చేరే ఎక్కువమంది ప్రజలను ఒక పొలంలో పెరిగే పైరుతో, ఇతరులకు దేవుడి గురించి చెప్పేవారిని పొలంలో పనిచేసే వారితో పోలుస్తున్నాడు. ఈ రూపకాలంకారం అర్ధం ఏంటంటే దేవుడిని గూర్చి తెలుసుకోవాల్సిన చాలామంది ప్రజలకు చెప్పడానికి కొద్ది మందే జనం ఉన్నారని. (రూపకాలంకారం చూడండి).
● పంట
"బాగా పండి కోతకు వచ్చిన పంట."
● పనివారు
"పనిచేసేవారు."
● కొత్త యజమానుని వేడుకొనుడని
"దేవుడిని అడగండి. ఈ పంటకు యజమాని దేవుడే."
యేసు మొదలు పెట్టిన పనిని కొనసాగించడానికి తన పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ మొదలువుతాయి
● తన పన్నెండుమంది శిష్యులను పిలిచి
"తన శిష్యులు పన్నెండు మందిని రమ్మని చెప్పాడు"
● వారికి అధికారమిచ్చెను
ఈ వాక్యం వెనుక అర్ధాన్ని సరిగా తెలిపేందుకు, అధికారం ఇచ్చింది 1). అపవిత్రాత్మలను తరిమి వేయడానికి 2 వ్యాధులను రోగాలను బాగుచేయడానికి .
● వెళ్ళగొట్టుటకును
"చెడ్డ ఆత్మలను తరిమి వేయడం"
● ప్రతివిధమైన రోగాన్నీ . ప్రతివిధమైన వ్యాధినీ
అన్ని రోగాలను, అన్నివ్యాధులను. రోగం, జబ్బు అనేవి చాల దగ్గర అర్ధాన్నిచ్చే పదాలు. వీలైతే వీటిని రెండు వేర్వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి మనిషిని రోగానికి గురిచేసి బాధపెడుతుంది. వ్యాధి ఉన్నందువల్ల కలిగే శారీరక బలహీనత, బాధను రోగం అంటారు.
యేసు 10:1 లో మొదలు పెట్టిన పనిని కొనసాగించడానికి తన పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● మొదట
ఇది హోదా కాదు వరుస క్రమం.
● బృందములోని వాడు
దీని అర్ధాలు బహుశా 1)."బృందంలో ఒకడు లేక 2)."ఉత్సాహంగా ఉండేవాడు." మొదటిదాని అర్థం యూదా ప్రజలను రోమా అధికారం నుండి విడిపించాలనుకునే బృందంలో ఇతడు ఒకడు. దీన్నే ఇలా :"దేశభక్తి కలిగినవాడు" లేక "జాతీయతా వాది" లేక "స్వాతంత పోరాట యోధుడు" అని అనువదించవచ్చు. రెండవదాని అర్ధం: అతడు దేవుడి మహిమ కొరకు పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నవాడు అని. దీన్నే "మక్కువ కలిగిన వాడు(ఇష్ట పడే వ్యక్తి) అని రాయొచ్చు.
● సుంకరియైన మత్తయి
ఇంతకుముందు పన్నులు వసూలు చేసిన మత్తయి"
● ఆయనను అప్పగించిన
"యేసును అప్పగించే."
యేసు తన పనిని కొనసాగించడానికి పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి
● యేసు ఈ పన్నెండు మంది శిష్యులను పంపుచూ
"యేసు ఈ పన్నెండుమంది శిష్యులను పంపాడు" లేక "యేసు పంపిన పన్నెండు మంది శిష్యులు వీరే."
● పంపుచూ
ఒక ప్రత్యేక వుద్దేశంతోనే యేసు వారిని పంపాడు. 10:2లో "అపొస్తలుల" అని వాడిన సర్వనామానికి ఇది క్రియా పదం.
● వారికాజ్ఞాపించినదేమనగా
"వారు ఏమి చేయాలో ఆయన వారికి చెప్పాడు.” దీని "ఆయన వారికి ఆదేశించాడు" అని రాయొచ్చు.
● ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే
ఇశ్రాయేలు జాతి ప్రజలనందరినీ, కాపరికి దూరమైపోయి తిరుగుతున్న గొర్రెలతో పోల్చిన రూపకం ఇది. (యుడిబి). (రూపకాలంకారం చూడండి).
● ఇశ్రాయేలు వంశము
ఇది ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించిన మాట. దీన్ని "ఇశ్రాయేలు ప్రజలు" లేక "ఇశ్రాయేలు వంశానికి చెందినవారు" అని రాయొచ్చు. (ఉత్ప్రేక్ష చూడండి). మీరు వెళ్ళుచు
ఇక్కడ "మీరు" అనే సర్వనామము పన్నెండుమంది అపొస్తలులను సూచిస్తుంది.
● పరలోక రాజ్యం సమీపించి యున్నదని
3:2లో ఇదే అర్ధాన్నిచ్చే వాక్యాలను అనువదించినట్లే ఇక్కడ కూడా అనువదించండి.
యేసు తన పనిని కొనసాగించడానికి పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి
● మీ .. మీరు
పన్నెండుమంది అపొస్తలులు
● బంగారమునైనను వెండినైనను రాగినైనను సిద్ధపరచుకొనకుడి
"బంగారం, వెండి లేక రాగిని సంపాదించుకోవద్దు.
● సిద్ధపరచు
"అడగడం", "తీసుకోవడం" "స్వీకరించడం."
● బంగారమునైనను వెండినైనను రాగినైనను
నాణేలు చేయడానికి వాడే లోహాలు ఇవి. ఇది ధనం గూర్చి చెప్పడానికి వాడిన రూపకం. కాబట్టి ఒకవేళ మీ ప్రాంతంలో లోహాల గూర్చి తెలియకపోతే ఈ జాబితాను "డబ్బు(ధనం) అని రాయండి. (యుడిబి చూడండి).
● సంచులలో
దీని అర్ధం "నడికట్టు" లేక "డబ్బు పెట్టె నడికట్టు" కావొచ్చు. అయితే ఇది డబ్బుపెట్టుకుని తీసుకెళ్ళే ఏ వస్తువైనా కావొచ్చు. నడికట్టు అంటే నడుం చుట్టూ కట్టుకునే పొడవాటి గుడ్డ లేక తోలు కావొచ్చు. దీంట్లో డబ్బు పెట్టి మడిచి తీసుకుని వెళ్ళేంత వెడల్పుగా ఉంటుంది.
● జాలె
ప్రయాణం చేసేటప్పుడు అవసరమైన వస్తువులు పెట్టుకునే ఏ సంచి అయినా కావొచ్చు, లేక ఆహారం, డబ్బు అడగడానికి వాడే సంచి కావొచ్చు.
● రెండు అంగీలనైను
5:40 లో "అంగీ" కొరకు వాడిన పదాన్నే ఇక్కడ వాడండి.
● పనివాడు
"కష్టపడే వాడు."
● ఆహారము
"అతనికి కావలసింది."
యేసు తన పనిని కొనసాగించడానికి పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● మీ. మీరు
పన్నెండుమంది అపొస్తలులు.
● మీరు ఏ పట్టణము లోనైనను, గ్రామంలో నైనను ప్రవేశించునప్పుడు
"మీరు పట్టాణానికైనా, గ్రామానికైనా వెళ్ళేటప్పుడు" లేక మీరు వెళ్ళే ప్రతి పట్టణంలో, గ్రామంలో."
● పట్టణం.
"పెద్ద గ్రామం..చిన్న గ్రామం" లేక "పెద్ద పట్టణం.. చిన్న పట్టణం." ఇవి 9:35లో వాడిన పదాలే.
● అక్కడినుండి వెళ్ళు వరకు అక్కడనే బస చేయుడి
మీరు ఈ పట్టణాన్ని లేక గ్రామాన్ని విడిచి వెళ్ళేవరకు అతడి ఇంట్లోనే ఉండండి.
● ఆ ఇంటిలో ప్రవేశించుచూ ఇంటివారికి శుభమని చెప్పుడి
"మీరు ఆ ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటిలో ఉండే వారిని పలకరించండి." ఆ రోజుల్లో సాధారణంగా "ఈ ఇంటికి సమాధానం వచ్చును గాక! " అనేవారు. (ఉత్ప్రేక్ష చూడండి).
● ఆ ఇల్లు యోగ్యమైనదైతే
"ఆ ఇంటిలో ఉండేవారు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తే" (యుడిబి). లేక "ఆ ఇంటిలో ఉండేవారు మిమ్మల్ని బాగా చూసుకుంటే" (ఉత్ప్రేక్ష చూడండి).
● మీ సమాధానం దాని మీదికి వచ్చును
"ఆ ఇంట్లో సమాధానం ఉండునుగాక" లేక "ఆ ఇంట్లో ఉండేవారు చాలా సమాధానంగా ఉంటారు” (యుడిబి చూడండి).
● మీ సమాధానం
అపొస్తలులు ఆ ఇంటికి కొరకు దేవుడిని అడిగే సమాధానం.
● అది అయోగ్యమైనదైతే
"వారు మమ్మల్ని సరిగా పలకరించకపోతే" (యుడిబి). లేక "వారు మిమ్మల్ని సరిగా చూడకపోతే"
● మీ సమాధానం మీకు తిరిగి వచ్చును
ఇది ఈ రెండింటిలో ఇదో ఒక అర్ధమై ఉండొచ్చు 1). ఒకవేళ ఆ ఇంటిలోనివారు అర్హులు. కాకపోతే దేవుడు ఆ ఇంటికి సమాధానాన్ని ఇవ్వడు; యుడిబి లో చెప్పిన విధంగా, లేక 2). ఒకవేళ ఆ ఇంటిలోనివారు అర్హులు. కాకపోతే అపొస్తలులు తాము పలికిన సమాధాన వాక్యాలు నిజం కాకూడదని దేవుడిని అడగాలి. మీ భాషలో మనం పలికిన ఆశీర్వచనాలను వెనుకకు తీసుకునే పద ప్రయోగం ఉంటే దాన్ని ఇక్కడ రాయండి.
యేసు 10:1లో మొదలుపెట్టిన తన పనిని కొనసాగించడానికి పన్నెండు మంది శిష్యుల్ని పంపే సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● ఎవడైనను మిమ్ములను చేర్చుకొనక మీ మాటలను వినకుండిన యెడల
"ఆ పట్టణంలో ఒకరైనా కూడా మిమ్మల్ని స్వీకరించి మీ మాటలు వినకపోతే."
● మీ, మీరు
పన్నెండుమంది అపొస్తలులు
● మీ మాటలను వినకుండిన యెడల
"మీరు చెప్పే ఉపదేశాలను వినడం” (యుడిబి). లేక "మీరు ఏం చెబుతారో వినడం."
● పట్టణం
దీన్ని 10:11 లో లాగే అనువదించాలి.
● మీ పాదధూళి దులిపి వేయుడి
"ఆ ఇంటిలోని లేక పట్టణంలో మీ పాదాలకు పాదాలు అంటుకున్న దుమ్మును దులిపి వేయండి." ఈ ఇంటిలోని లేక పట్టణంలోని ప్రజలను తిరస్కరించాడు అనడానికి ఇది గుర్తు. (యుడిబి చూడండి).
● ఓర్వదగినదై యుండునని
"బాధ చాలా తక్కువగా ఉంటుంది."
● సొదొమ గోమొర్ర ప్రదేశముల
సోదొమ, గోమొర్ర లలో నివిసించే ప్రజలు," దేవుడు ఆకాశం నుండి అగ్నిని రప్పించి నాశనం చేసిన ప్రాంతాలు. (ఉత్ప్రేక్ష చూడండి).
● ఆ పట్టణం
అపొస్తలులను చేర్చుకోవడం గానీ వారి ఉపదేశాలను వినడం గానీ చేయని పట్టణ ప్రజలు (ఉత్ప్రేక్ష చూడండి).
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలులకు యేసు వివరిస్తున్నాడు.
● ఇదిగో
ముందు చెప్పబోయే సంగతులను మరింత నొక్కి చెప్పడానికి "ఇదిగో" అని రాస్తున్నారు. దీన్నే ఇలా "చూడండి", లేక "వినండి" లేక "నేను చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి" అని రాయొచ్చు(యుడిబి చూడండి).
● నేను మిమ్ము పంపుచున్నాను
యేసు వారిని ఒక ప్రత్యేక ఉద్దేశంతో పంపిస్తున్నాడు.
● తోడేళ్ళ మధ్యకు గొర్రెలను
యేసు తాను పంపుతున్న శిష్యులను, దాడి చేసే అడవి జంతువుల మధ్యకు వెళ్ళే ఎదిరించే శక్తి లేని జంతువులతో పోలుస్తున్నాడు. (ఉపమ చూడండి).
● గొర్రెల వలె
దిక్కులేని (ఉపమ చూడండి).
●తో డేళ్ళ మధ్యకు
ఇక్కడ ఉపమానాన్ని వివరించి "ప్రమాదకరమైన తోడేళ్ళ వంటి ప్రజల మధ్యకు " లేక "ప్రమాదకరమైన జంతువుల్లాగా ప్రవర్తించే ప్రజల మధ్యకు" లేకపోతే ఉపమాన అర్ధాన్ని చెబుతూ "మీ పై దాడి చేసే ప్రజల మధ్యకు" అని రాయొచ్చు(రూపకాలంకారం చూడండి).
● పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులై యుండుడి
ఇక్కడ ఉపమానాలు చెప్పకుండా "తెలివిగా, జాగ్రత్తగా అలాగే నిష్కళంకంగా, న్యాయంగా వ్యవహరించండి” అని రాయండి(ఉపమ చూడండి).
● మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి
"జాగ్రతగా ఉండండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అప్పగిస్తారు."
● మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి
"శ్రద్ధగా చూడండి" లేక "చురుకుగా ఉండండి" లేక "చాలా జాగ్రత్తగా ఉండండి” (జాతీయం చూడండి).
● మిమ్మును అప్పగించి
యూదా యేసుకు చేసిన దానిని వివరించే పదం ఇది (యుడిబి చూడండి). దీన్నే ఇలా "మిమ్మల్ని మోసం చేస్తారు" లేక "మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు" లేక " మిమ్మల్ని బంధించి విచారణకు నిలబెడతారు" అని రాయొచ్చు.
● మహాసభలు
ఇక్కడ దీనర్ధం ఒక జాతిలో శాంతి సమాధానాలు కాపాడటానికి నియమించబడే అక్కడి పెద్దలు లేక మత నాయకులు" దీన్ని "న్యాయస్థానాలు" రాయొచ్చు.
● కొరడాలతో కొట్టింతురు
కొరడాలతో కొడతారు.
తేబడుదురు
"వారు మిమ్మల్ని తీసుకుని వస్తారు" లేక "వారు మిమ్మల్ని ఈడ్చుకుని వస్తారు" (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● నా నిమిత్తము
"ఎందుకంటే మీరు నాకు చెందినవారు కాబట్టి" (యుడిబి చూడండి) లేక "మీరు నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి"
● వీరికిని అన్యజనులకును
ఇక్కడ "వీరు " అనే సర్వనామం "అధిపతులను గానీ రాజులుగానీ లేక తప్పులు మోపే యూదా ప్రజలనుగానీ సూచిస్తుంది (10:17).
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలులకు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● వారు మిమ్మును అప్పగించునప్పుడు
"ప్రజలు మిమ్మల్ని అప్పగించునప్పుడు" ఇక్కడ "వారు" అంటే 10:17లోని "వారే"
● అప్పగించునప్పుడు
10:17 లో అప్పగించునప్పుడు అన్న వాక్యాన్ని అనువదించినట్టే ఇక్కడ అనువదించండి.
● మీరు
ఈ పేరాలలోని మీ. మీరు అనే సర్వనామాలు పన్నెండుమందిని ఉద్దేశించినవి.
● చింతింపకుడి
"మీరు ఆందోళన చెందవద్దు"
● ఏలాగు మాటలాడుదుము? ఏమి చెప్పుదుము?
"మీరు ఎలా మాట్లాడాలి లేక మీరు ఏం చెప్పాలి." ఈ రెండు భావాలను కలిపి:"మీరు ఏమీ చెప్పాలో." (రెండు భావాలను కలిపి రాసే పద్ధతి చూడండి).
● ఆ గడియలోనే
" ఆ సమయంలోనే" (ఉత్ప్రేక్ష చూడండి).
● మీ తండ్రి ఆత్మ
అవసరమైతే దీన్ని "మీ దేవుడు మీ పరలోకపు తండ్రి ఆత్మ" అని అనువదించవచ్చు లేకపోతే కింద ఫుట్ నోట్ లో ఈ పదానికి అర్ధం మన శరీరపు తండ్రి ఆత్మ కాదని, మన దేవుడి పరిశుద్దత్మని వివరించవచ్చు.
● మీలో
మీ ద్వారా"
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలుల కు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● సహోదరుని సహోదరుడు, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు
"సహోదరులు తమ సహోదరులను మరణానికి అప్పగిస్తారు, తండ్రులు తమ కుమారులను మరణానికి అప్పగిస్తారు. "
● అప్పగించడం
దీన్ని 10:17 లో అప్పగించడం అనే పదాన్ని అనువదించి నట్టు ఇక్కడ అనువదించండి.
● మీద లేచి
"తిరుగుబాటు చేసి” (యుడిబి చూడండి). లేక "వ్యతిరేకమై
● వారిని చంపించెదరు
" వారిని చంపడానికి అప్పగిస్తారు" లేక "అధికారులచే వారిని చంపిస్తారు."
● అందరిచే ద్వేషింపబడుదురు
"అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు" లేక "ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● మీరు. మీరు .. మీరు .. మీరు
పన్నెండుమంది అపొస్తలులు
● నా నామం నిమిత్తం
" నా కొరకు” లేక "మీరు నన్ను నమ్ముకొన్నందు వల్ల (యుడిబి చూడండి).
● అంతము వరకు సహించిన వారు
"చివరి వరకు విశ్వాసంగా ఉన్నవారు."
●వాడు రక్షింపబడును
"దేవుడు అతడిని రక్షిస్తాడు. “(కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● వేరొక
"మరొక పట్టణానికి పారిపోండి.
● వచ్చువరకు
"వస్తాడు"
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలుల కు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● శిష్యుడు బోధకునికంటే అధికుడు కాదు
ఇది సాధారణ సత్యం, అంతేగానీ ఏ ఒక్క శిష్యుడినో బోధకుడినో ఉద్దేశించిన మాటలు కావు. "ఒక శిష్యుడు తన బోధకుడి కంటే ముఖ్యమైన వాడు కాదు. "ఎందుకంటే "అతనికి ఎక్కువ పరిజ్ఞానం ఉండదు" లేక "అతనిది పెద్ద హోదా కాద." లేక "అతను బోధకుడి కంటే మెరుగైనవాడు కాదు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "శిష్యుడు ఎప్పుడూ తన బోధకుడికంటే తక్కువ వాడు" లేక "శిష్యుడికంటే బోధకుడు ఎప్పుడూ గొప్పవాడు." అని రాయొచ్చు.
● దాసుడు యజమానునికంటే అధికుడు కాడు
"ఒక పనివాడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే, అంతేకాని ఏ ఒక్క పనివాడి గూర్చి, యజమానుని గూర్చి ఉద్దేశించింది కాదు. ఒక పనివాడు తన యజమానుడికంటే "గొప్పవాడు కాదు " "ముఖ్యమైన వాడు కాదు" దీన్నే ఇలా "పనివాడు ఎప్పుడూ తన యజమానుడికంటే తక్కువ వాడు" లేక "పనివాడి కంటే యజమానుడు ఎప్పుడూ గొప్పవాడు" అని రాయొచ్చు.
● దాసుడు
"బానిస."
● యజమాని
"స్వంతదారుడు."
● శిష్యుడు తన బోధకునివలె ఉండిన చాలును
"శిష్యుడు తాను తన గురువు లాంటి వాడినైతే చాలు అని సంతృప్తి చెందాలి."
● బోధకునివలె
"గురువుకు ఉన్నంత తెలివి ఉంటే చాలు: లేక "గురువు ఎలా ఉంటే అలా ఉంటే చాలు."
● దాసుడు తన యజమానుని వలెను
"పనివాడు తన యజమానికున్నంత ప్రాముఖ్యత తనకు ఉంటే చాలు అని సంతోషపడాలి"
● ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి యుండిన యెడల ఆయన ఇంటివారు మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా
యేసును సరిగా ఆదరించడం లేదు, కాబట్టి ఆయన శిష్యులు తమకు కూడా అలాగే జరుగుతుందని, లేక ఇంకా హీనంగా చూస్తారని తెలుసుకోవాలి.(యుడిబి చూడండి).
● వారు పేరు పెట్టి యుండిన
దీన్ని ఇలా అనువదించ వచ్చు అనువదించవచ్చు. "ప్రజలు అలా పిలిచారు కాబట్టి."
● ఇంటి యజమానుని
ఈ "ఇంటి యజమానుడు" అనే పదాన్ని తనతో పోల్చే రూపకం లాగా చెబుతున్నాడు. (రూపకాలంకారం చూడండి).
● బయల్జెబూలు
దీని మూల భాష ప్రకారం దీనర్ధం 1)."బయల్జెబూలు" అని యధాతధంగా రాయడం లేక 2). "సాతాను" అని అర్ధం వచ్చే విధంగా దీన్ని అనువదించడం.
● ఆయన ఇంటివారు
"ఆయన ఇంటివారు" అనే పదజాలాన్ని తన శిష్యులతో పోల్చే రూపకంగా యేసు ఇక్కడ వాడుతున్నాడు
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలుల కు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● వారికి భయపడకుడి
ఇక్కడ "వారు" అనే సర్వనామం యేసు అనుచరులను బాధపెట్టే వారిని గూర్చి చెప్పింది.
● మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు
సమాంతరతగా చెప్పబడిన ఈ వాక్యాన్ని "ప్రజలు దాచి ఉంచే విషయాలను దేవుడు వెల్లడి చేస్తాడు" అని రాయొచ్చు. (సమాంతరత, కర్త లేక కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు చూడండి).
● చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి
ఈ సమాంతరతను ఇలా "నేను మీకు చీకటిలో చెప్పే విషయాలను మీరు ప్రజలకు పగటివేళ చెప్పండి. నేను మీకు చెవిలో నెమ్మదిగా చెప్పే విషయాలను ఇళ్ళపైకి ఎక్కి ప్రకటించండి.
● నేను చీకటిలో చెప్పునది
"నేను మీకు రహస్యంగా చెప్పేది” (యుడిబి). లేక "నేను మీకు సన్నిహితంగా చెప్పేది” (రూపకాలంకారం చూడండి).
● వెలుగులో చెప్పుడి
"బహిరంగంగా చెప్పండి" లేక "బయట అందరికీ చెప్పండి” (యుడిబి చూడండి). (రూపకాలంకారం చూడండి).
●చె విలో మీకు చెప్పబడినది
"నేను మీకు చెవిలో గుసగుసలాడింది."
● మేడల మీద ప్రకటించుడి
"ఇంటి మిద్దెపైన ఎక్కి అందరూ వినేట్లు బిగ్గరగా చెప్పండి.
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలుల కు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● ఆత్మను చంపనేరక దేహాన్నే చంపు వారికి భయపడకుడి
"మనుషులను చూసి భయపడకండి. వాళ్ళు శరీరాన్ని చంపగలరు గానీ ఆత్మను చంపలేరు.
● దేహంను చంపు వారికి
శరీరాన్ని చంపడం. ఒకవేళ ఈ పదాలు వింతగా అనిపిస్తే, "మిమ్మల్ని చంపేవారు", "మనుషుల్ని చంపేవారు" అని రాయొచ్చు.
● దేహం
భౌతికంగా చేతితో తాకే మనిషి భాగం.
● ఆత్మను చంపు
మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి హాని చేసేవాళ్ళు.
● ఆత్మ
మనిషి లోని కళ్ళకు కనపడని, చేతితో తాకలేని భాగం, చనిపోయి శరీరం నశించినా నిలిచి ఉండేది.
● రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా
ఈ చాతుర్య ప్రశ్నను ఇలా; "పిచ్చుకల గూర్చి ఆలోచించండి, అవి ఎంత సామాన్యమైనవి అంటే మీరు రెండింటిని ఒక చిన్న నాణెంతో కొనవచ్చు. (యు డి బి). (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● పిచ్చుకలు
ఇవి చాల చిన్నగా ఉండి గింజలు తినేవి. మనుషులు ప్రాధాన్యం లేని వాటిని పోల్చడానికి వీటిని వాడుతారు.(రూపకాలంకారం చూడండి).
● కాసు
అనువదించే భాషలో (లక్ష్య భాషలో). ఉండే తక్కువ వెల గల నాణంగా అనువదిస్తారు. దినసరి కూలి రోజు జీతంలో ఇది 1/16వ వంతు వెల కలిగిన రాగి నాణము. దీని "అతి తక్కువ డబ్బుకు" అని రాయొచ్చు.
● మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనాను నేలను పడదు
దీన్ని ఇలా అనువదించ వచ్చు:' మీ తండ్రికి తెలిసిన తరువాతే వాటిలో ఏదైనా ఒకటి నేలపై పడుతుంది" అని రాయొచ్చు.
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలులకు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడేవడో
"తాను నా శిష్యుడని ప్రజలందరికి చెప్పే వాడు" లేక "ప్రజలందరి ముందు తాను నాకు విధేయుడని అంగీకరించేవాడు."
● ఒప్పుకొనువాడు
"అంగీకరించే వాడు" (యుడిబి చూడండి).
● మనుష్యుల ఎదుట
"ప్రజల ముందు" లేక "ఇతరుల ముందు"
● పరలోకమందున్న నా తండ్రి
ఇక్కడ యేసు తండ్రి అయిన దేవుడి గూర్చి మాట్లాడుతున్నాడు.
● మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునొ
"ప్రజల ముందు నన్ను విడిచి పెట్టెవాడు" లేక "ప్రజలముందు నన్ను తిరస్కరించేవాడు" లేక "అందరిముందు తాను నా శిష్యుడినని ఒప్పుకోలేని వాడు" లేక "ఎవరైనా నాకు విధేయుడనని ఒప్పుకోకపోతే."
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలులకు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● తలంచకుడి
"మీరు అనుకోవద్దు" లేక "మీరు అలా ఆలోచించవద్దు"
● ఖడ్గం
ఈ రూపకానికి అర్ధం 1). బాధాకరమైన చావు (రూపకంలో "సిలువ" చూడండి).
● తొలగ
"తిప్పివేయడం: లేక "విడదీయడం" లేక "వేరు పరచడం."
● ఒక మనుష్యునికిని వాని తండ్రికిని
"తండ్రికి వ్యతిరేకంగా కొడుకును"
● అతనికి శత్రువులు
"ఒక వ్యక్తి శత్రువులు" లేక "ఒక వ్యక్తి బద్ద శత్రువులు."
● ఒక మనుష్యుని ఇంటివారే
"తన స్వంత ఇంటిలోని వాళ్ళే."
తన పని చేసే సమయంలో ఎటువంటి బాధలు ఎదుర్కొంటారో తన పన్నెండుమంది అపొస్తలులకు యేసు వివరిస్తున్నాడు. ఇది 10:16లో మొదలైంది.
● నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు
దీని ఇలా: "ప్రేమించేవాళ్ళు. తగిన వాళ్ళు కారు" లేక "మీరు ప్రేమిస్తే . మీరు యోగ్యులు కారు."
● ఎవరు
దీని ఇలా: "ఎవరైనా" లేక "ఆ వ్యక్తి" లేక "ఎవరైనా ఒకరు" లేక "ప్రజలలో వారు" (యుడిబి చూడండి).
● ప్రేమించు
ఇక్కడ "ప్రేమ" అనే పదానికి "సహోదర ప్రేమ" లేక "స్నేహితుడి ప్రేమ" అని. దీన్నే "ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో: లేక "అంకిత భావంతో ఉంటారో" లేక "ఇష్టంగా ఉంటారో" అని రాయొచ్చు.
● నాకు పాత్రుడు కాడు
దీన్నే "అతడు నాకు చెందినవాడని చెప్పే యోగ్యత లేదు" లేక "నాకు శిష్యుడిగా ఉండే అర్హత లేదు" లేక "నాకు చెందినవాడుగా ఉండే యోగ్యత లేదు" అని రాయొచ్చు. ( యుడిబి చూడండి).
● తన. ఎత్తుకొని . కాడు
దీన్ని ఇలా అనువదించ వచ్చు: "ఎవరు ఎత్తుకోడో.. వాడు కాడు " లేక "నువ్వు ఎత్తికోనక పోతే . నీవు కావు" లేక "నీవు గనుక ఎత్తుకోక పోతే . నీవు కావు" అని రాయొచ్చు.
● సిలువ నెత్తికొని. వెంబడింప
చనిపోవదానికైనా సిద్దం అని చెప్పడానికి వాడిని రూపకం ఇది. మీరు అనువదించేటప్పుడు మామూలుగా ఏదైనా వస్తువును పట్టుకుని ఒక వ్యక్తిని వెనుక వెళుతున్నట్టు రాయొచ్చు. (రూపకాలంకారం చూడండి).
● ఎత్తికొని
"తీసుకుని" లేక "పట్టుకుని మోయడం"
● తన. దక్కించుకొనువాడు. పోగొట్టుకొనును . పోగొట్టుకొనువాడు . దక్కించుకొనును.
వాటిని వీలైనంత తక్కువ పదాలలో అనువదించాలి. దీని ఇలా: "కాపాడుకునేవాళ్ళు . పోగొట్టుకుంటారు. పోగొట్టుకునేవాళ్ళు . కాపాడుకుంటారు: లేక "మీరు కాపాడుకుంటే పోగొట్టుకుంటారు. మీరు పోగొట్టుకుంటే కాపాడు కుంటారు" అని రాయొచ్చు.
● దక్కించు
ఇది "భద్రపరచు" లేక "రక్షించు" అన్న వాటికి రూపకం. దీని ఇలా:"ఎవరు భద్రపరచుకోవడానికి ప్రయత్నిస్తారో" అని రాయొచ్చు.
యేసు తన అపొస్తలుల పరిచర్యలో వెళుతుండగా సాయపడే వారిని ఆశీర్వదిస్తానని చెప్పే వివరాలు.
● చేర్చుకొనువాడు
దీన్ని "ఎవరైనా" లేక "ఎవరిలో ఒకరైనా" లేక "ఎవరు చేర్చుకొంటారో వారు" అని రాయొచ్చు. ( యుడిబి చూడండి).
● చేర్చుకొను
10:14 లో ఉన్నట్టు “అంగీకరించడం" అని. దీనర్ధం "అతిధిగా అంగీకరించేవాడు. "
● మిమ్మును
వీరు యేసు మాట్లాడుతున్న పన్నెండుమంది అపొస్తలులు.
● నన్ను పంపిన వానిని చేర్చుకొను
"నన్ను పంపిన తండ్రి అయిన దేవుడిని అంగీరించువాడు"
యేసు తన అపొస్తలుల పరిచర్యలో వెళుతుండగా సాయపడేవారిని ఆశీర్వదిస్తానని చెప్పే వివరాలు ఇక్కడ ముగుస్తాయి.
● ఎవడు. యిచ్చునో
"ఇచ్చేవారు ఎవరైనా"
●, శిష్యుడని ఎవడు చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో
దీన్ని ఇలా అనువదించ వచ్చు: "అతడు నా శిష్యుడు కాబట్టి అతనికి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు ఇచ్చేవాడు ఎవడో" లేక "నా శిష్యులలో తక్కువ వాడికి కొద్దిగా చన్నీళ్ళు ఇచ్చేవాడు" అని అనువదించవచ్చు.
● వాడు తన ఫలమును పోగొట్టుకోనడని
"ఆ వ్యక్తి తప్పకుండా తన బహుమతిని పొందుతాడు” (ద్వంద్వ ప్రతికూల, litotes చూడండి).
● పోగొట్టుకొనడు
దీనర్ధం ఆ వ్యక్తికి ఉన్నవాటిని తీసివేయడం అని కాదు.
బాప్తిసమిచ్చు యోహాను శిచ్యులకు యేసు ఏమి సమాధానం ఇచ్చాడో ఆ వివరాలు ఇక్కడ మొదలవుతాయి.
● చాలించిన తరువాత
ఇక్కడ మరో కొత్త సంఘటన మొదలవుతుందని చెప్పడానికి ఈ పదాన్ని వాడారు. మీ భాషలో కొత్త సంఘటన మొదలైందని చెప్పడానికి ఏదైనా పద్ధతి ఉంటే దాన్ని ఇక్కడ ఉపయోగించండి. దీన్ని "అప్పుడు' లేక ఆ తరువాత" అని అనువదించవచ్చు.
● ఆజ్ఞాపించుట
దీన్ని "బోధించడం" లేక "ఆదేశించడం" అని అనువదించవచ్చు.
● తన పన్నెండుమంది శిష్యులకు
వీరు అపొస్తలుల గా యేసుచే ఎన్నుకోబడినవారు.
● అంతట
"ఆ సమయంలో.” దీన్ని రాయకుండా వదిలి పెట్టవచ్చు (యుడిబి చూడండి).
●యోహాను చెరసాలలో విని
దీన్ని మరో విధంగా: "జైలులో ఉన్న యోహాను విన్నప్పుడు", లేక "జైలులో ఉన్న యోహానుకు ఎవరో చెప్పినప్పుడు"
● ఆయన్ని అడుగుటకు తన శిష్యులనంపెను
బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యుల ద్వారా యేసుకు సందేశాన్ని పంపుతున్నాడు.
● ఆయన్ను అడుగుటకు
ఇక్కడ "ఆయన్ను" అనే సర్వనామం యేసును సూచిస్తుంది.
● రాబోవు వాడవు నీవేనా
దీన్ని "వచ్చేవాడు" లేక "వస్తాడని మేము ఎదురుచూస్తున్నవాడు," అని ఎలా రాసినా ఇది "మెస్సియా"ను గూర్చి చెప్పిన అతిశయ వాక్యం ("క్రీస్తు,"యు డి బి).
● మరియొకని కొరకు కనిపెట్టవలెనా
"మేము ఎదురు చూస్తున్నవాడు.” ఇక్కడ "మేము' అనే సర్వనామం యోహాను శిష్యులే కాకుండా యూదులనందరినీ ఉద్దేశించినది.
బాప్తిసమిచ్చు యోహాను శిష్యులకు యేసు ఇచ్చిన సమాధానం ఇక్కడ ముగుస్తుంది.
● యోహానుకు తెలుపుడి
"యోహానుకు చెప్పండి"
యేసు బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తన చుట్టూ ఉన్న జనంతో మాట్లాడుతున్నాడు.
● మీరు ఏమి చూచుటకు. వెళితిరి?
యేసు ఈ పదాలను మూడు అలంకారిక ప్రశ్నలలో ఉపయోగిస్తూ బాప్తిసమిచ్చు యోహాను ఎలాటి వ్యక్తో ఆలోచించమని ప్రజలకు చెబుతున్నాడు. దీన్ని ఇలా అనువదించవచ్చు: "మీరు చూడటానికి బయటకు వెళ్ళారా?. వెళ్లి ఉండకపోవచ్చు!" లేక "మీరు తప్పకుండ చూడటానికి బయటకు వెళ్లి వుండరు!” (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● గాలికి కదలుచున్న రెల్లునా
దీన్ని 1). యోర్దాను నదీప్రాంతంలో పెరుగుతున్న మొక్కలను గూర్చి అయి ఉండొచ్చు (యుడిబి చూడండి). లేక 2) ఒక రకమైన వ్యక్తిని గూర్చి చెప్పే రూపకం అయి ఉండొచ్చు : "గాలికి కదిలి పోయే వ్యక్తి .” (ఉపమ చూడండి). ఈ వుపమానానీకి రెండు అర్ధాలు ఉండొచ్చు : అటువంటి వ్యక్తి 1).గాలికి త్వరగా కదిలిపోయేవాడు, బుద్ధిని త్వరగా మార్చుకునేవాడికి ఇది రూపకాలంకారం, లేక 2).గాలి కొట్టినప్పుడు చప్పుడు చేయడం, పనికిరాని మాటలు ఎక్కువ మాట్లాడడానికి ఇది ఒక రూపకం. (రూపకాలంకారం చూడండి).
● రెల్లు
ఎత్తుగా పెరిగే గడ్డి మొక్క.
● సన్నపు నార బట్టలు ధరించుకున్న
'బాగా ఖరీదైన బట్టలు వేసుకున్న.” బాగా డబ్బున్న వాళ్ళు ఇటువంటి బట్టలు వేసుకుంటారు.
● అవును గాని
ఈ పదాన్ని సాధారణంగా “ఇదిగో" అని అనువదిస్తారు. ముందు జరగబోయే సంఘటనలకు ముఖ్యమైనవని చెప్పడానికి వాడుతారు. దీన్ని "నిజానికి" అని అనువదించవచ్చు.
యేసు బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తన చుట్టూ ఉన్న జనంతో ఇంకా మాట్లాడుతున్నాడు.
● మరి ఏమి చూడ వెళ్లితిరి
బాప్తిసమిచ్చు యోహాను గూర్చి వేస్తున్న అలంకారిక ప్రశ్నలలో ఇది ఒకటి. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవును గాని . మీతో చెప్పుచున్నాను
ఇక్కడ "మీరు" అనే సర్వనామం చూట్టు ఉన్న ప్రజలను ఉద్దేశించింది.
● ప్రవక్త కంటే గొప్పవానినని
"మామూలు ప్రవక్త కాదు" లేక "మామూలు ప్రవక్త కంటే చాలా ముఖ్యమైన ప్రవక్త."
●ఇతడే
ఇక్కడ "ఇతడు" అంటే బాప్తిసమిచ్చు యోహాను అని.
● ఎవనిని గూర్చి రాయబడెనో
ఇక్కడ "ఎవరిని" అంటే తర్వాత వాక్యంలోని "దూత"ను ఉద్దేశించింది.
●ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును
మలాకీ గ్రంథంలోని వచనాలను యేసు ఇక్కడ ప్రస్తావిస్తూ, మలాకీ 3:1 లో పేర్కొన్న దూత యోహానని చెబుతున్నాడు.
● నేను నా దూతను పంపుచున్నాను
"నేను" "నా" అనే సర్వనామాలు దేవుడిని ఉద్దేశించినవి. ఈ పాతనిబంధన గ్రంథకర్త దేవుడు తెలిపిన దానిని ప్రవచనంగా రాశాడు.
● నీ ముందర
"నీకు ముందుగా" లేక "నీకు ముందుగా వెళ్ళు." ఇక్కడ "నీ" అనే సర్వనామం ఏకవచనం. ఎందుకంటే ఈ వాక్యంలో దేవుడు మెస్సియతో మాట్లాడుతున్నాడు. (నీ అనే వాక్య రూపాలు చూడండి).
యేసు బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తన చుట్టూ ఉన్న జనంతో ఇంకా మాట్లాడుతున్నాడు.
● స్త్రీలు కనిన వారిలో
"ఆడవారు జన్మనిచ్చిన వారిలో" లేక " ఇంతవరకు జీవించిన వారిలో” (యుడిబి చూడండి).
● బాప్తిసమిచ్చు యోహానుకంటే గొప్పవాడు
"బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు"
● పరలోక రాజ్యంలో
దేవుడు ఏర్పాటు చేయబోయే రాజ్యంలో. "దేవుని రాజ్యంలో ప్రవేశించేవారిలో."
● అతనికంటే గొప్పవాడు
"యోహాను కంటే చాలా ముఖ్యమైన వాడు"
● బాప్తిసమిచ్చు యోహాను దినంలు మొదలుకొని ఇప్పటి వరకు
"యోహాను సందేశాన్ని చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి"
● పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు
దీనర్ధాలు 1). హింసాత్మకులు దానిలో హింసాత్మక పనులు చేస్తారు(యుడిబి చూడండి). లేక 2)."పరలోక రాజ్యంలోని వారిని ప్రజలు హింసిస్తారు, క్రూరమైన వాళ్ళు దాన్ని స్వాధీన పరచుకోవాలని చూస్తారు" లేక 3). పరలోక రాజ్యం బలంగా విస్తరిస్తుంది, బలవంతులు దాంట్లో పాలు పంచుకోవాలని చూస్తారు."
బాప్తిసమిచ్చు యోహాను గూర్చి యేసు జనసమూహంతో మాట్లాడటం కొనసాగుతుంది.
● ధర్మశాస్త్రం
"మోషే ధర్మశాస్త్రం."
● యోహాను
"బాప్తిసమిచ్చు యోహాను."
● మీకు
ఈ సర్వనామం చుట్టూ ఉన్న జనాలను ఉద్దేశించింది.
● ఏలీయా ఇతడే
"ఇతడే" అంటే బాప్తిసమిచ్చు యోహాను. పాత నిబంధనలో ఏలీయా చెప్పిన ప్రవచనంలోని వ్యక్తి బాప్తిసమిచ్చె యోహానని చెప్పే పర్యాయపదం ఇది. అయితే బాప్తిసమిచ్చే యోహానే ఏలీయా అని చెప్పడం లేదు. (పర్యాయ పదాలు చూడండి).
● చెవులు గలవాడు విను గాక
కొన్ని భాషాల్లో ఇతరులను సంబోధిస్తూ "మీకు వినే శక్తి వుంటే (చెవులు ఉంటే) వినండి అని అంటారు." "మీలో ఎవరికీ చెవులు ఉన్నాయో వాళ్ళు వినండి.” (ఉత్తమ, మధ్యమ, ప్రధమ పురుషలు చూడండి).
● చెవులు గల వాడు వినును గాక
"ఎవరికి చెవులు ఉంటాయో వారు" లేక "నా మాటలు ఎవరు వింటారో."
● వినును గాక
"అతడిని బాగా విననియ్యండి" లేక "నేను చెప్పే మాటలను శ్రద్ధగా విననియ్యండి."
బాప్తిసమిచ్చు యోహాను గూర్చి యేసు జనసమూహంతో మాట్లాడటం కొనసాగుతుంది.
● దేనితో పోల్చుదును
అలంకారిక ప్రశ్న వేయడం ఇక్కడ మొదలవుతుంది. యేసు దీని ఉపయోగిస్తూ అక్కడి ప్రజలను , సంతలో మాట్లాడుకునే పిల్లలతో పోలుస్తున్నాడు. దీన్ని ఆయన అలంకారిక ప్రశ్నతో మొదలుపెడుతున్నాడు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● సంత వీధులలో కూర్చుని యుండి. పిలుపులాట లాడుకోను పిల్లకాయలను పోలియున్నారు
ఈ ఉపమానానికి అర్ధం 1). యేసు "పిల్లనగ్రోవి ఊదాడు" యోహాను "ప్రలాపించాడు", "ఈ తరము వారు" నాట్యం చేయడానికి, సంతాప పడడానికి (ఈ పదాలు విధేయతకు సూచన). ఒప్పుకోలేదు. లేక 2) మోషే ధర్మ శాస్త్రానికి తాము చేర్చిన చట్టాలను పాటించడం లేదని ప్రజలను పరిసయ్యులు ఇతర మత నాయకులు విమర్శిస్తున్నారు. (రూపకాలంకారం చూడండి).
● ఈ తరం
"ప్రస్తుత కాలంలో జీవిస్తున్న వారు" లేక "ఈ ప్రజలు" లేక "ఈ తరంలో జీవిస్తున్న ప్రజలారా.” (యుడిబి చూడండి).
● సంత వీధులలో
ప్రజలు తమ వస్తువులను అమ్మడానికి తీసుకువచ్చే బహిరంగ విశాలప్రదేశం.
● మీకు పిల్లనగ్రోవి వూదితిమి
ఇక్కడ వూదిన వారు అక్కడ సంతలో ఉన్న పిల్లలు “మీకు” అంటే "ఈ తరము వారు" లేక వారి సంగీతాన్ని విని కూడా స్పందించని ప్రజలు.
● పిల్లనగ్రోవి
ఇది చెక్కతో బోలుగా చేసిన పొడవైన కర్రలాంటి వాయిద్యం, దీనిపైన లేక ఒక చివరి నుండి గాలిని ఊదడం ద్వారా మోగిస్తారు.
● మీరు నాట్యమాడరైతిరి
"మీరు సంగీతానికి నాట్యం చేయలేదు"
● మీరు రొమ్ముకొట్టుకొనరైతిరి
"మీరు మాతో పాటు సంతాప పడలేదు"
బాప్తిసమిచ్చు యోహాను గూర్చి యేసు జనసమూహంతో మాట్లాడటం ముగుస్తుంది.
● తినకయు
"ఏమీ ఆహరం తీసుకొనకుండా. " దీని మరో విధంగా "తరచూ ఉపవాసం ఉంటూ" లేక "మంచి ఆహారం తీసుకోకుండా" అని రాయొచ్చు(యుడిబి). యోహాను అసలు ఏమీ తినలేదని అర్ధం కాదు.
● వీడు దయ్యం పట్టినవాడని వారనుచున్నారు
యోహాను గూర్చి ప్రజలు ఏమంటున్నారో దాన్ని ఇక్కడ యేసు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దీన్ని పరోక్ష ప్రస్తావనగా :"అతడికి దయ్యం పట్టిందని వాళ్ళు అంటున్నారు" లేక "అతడికి దయ్యం ఆవహించిందని ఆరోపిస్తున్నారు." అని రాయొచ్చు. (ఉల్లేఖనాలు చూడండి).
● వారు
ఇక్కడ "వారు" అనే సర్వనామం ఆ కాలంలోని ప్రజలను గూర్చిన సంబోధన. (16వ వచనం).
● మనుష్య కుమారుడు
యేసు తానే "మనుష్య కుమారుడని" అక్కడున్న వారు గ్రహించాలని కోరుకుంటున్నాడు కాబట్టి దీన్ని "మనుష్య కుమారుడైన నేను" అని రాయొచ్చు.
● వీడి తిండిపోతును
"ఆత్రంగా తినే వాడు" లేక "అతడు మామూలుగా ఎక్కువ తింటాడు"
● మద్యపాని
"త్రాగుబోతు" లేక "త్రాగుడుకు బానిస"
● జ్ఞానమని వాని క్రియలనుబట్టి తీర్పుపొందునని
ఇది బహుశా ఒక సామెత కావొచ్చు. దీన్ని ఈ పరిష్టితిని వర్ణించడానికి యేసు ఉపయోగించాడు, ఎందుకంటే తనను, యోహానును తిరస్కరిస్తున్న ప్రజలు బుద్ధిగలిగిన వారు కాదు. యుడిబి లో లాగ దీని కర్త ప్రధాన వాక్యాలుగా అనువదించవచ్చు. (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● జ్ఞానమని తీర్పు పొందును
ఇక్కడ మానవీకరణ గా వాడిన జ్ఞానం అనే పదానికి అర్ధం దేవుడు ఎదుట ప్రదర్శించే జ్ఞానమని కాదు, నిజమని నిరూపించబడిన జ్ఞానం. (మానవీకరణ చూడండ్).
● దాని క్రియలను
ఇక్కడ "దాని" అనే సర్వనామం జ్ఞానానికి మానవీకరణ గా వాడినది.
యేసు తాను అధ్భుత కార్యాలు చేసిన పట్టణాలలో ప్రజలను విమర్శించే సంఘటన వివరాలు మొదలవుతాయి.
● పట్టణములను గద్దింపసాగెను
యేసు ఇక్కడ అన్యాపదేశాన్ని ఉపయోగించి ఈ పట్టణముల వారు తప్పు చేస్తున్నారని చీవాట్లు పెడుతున్నారు. (అన్యాపదేశం చూడండి).
● పట్టణములు
ఆ టౌన్లు
● ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో
దీన్ని కర్తరీ ప్రయోగాన్ని ఉపయోగించి "ఆయన అద్భుతాలు చేసిన పట్టణాలు” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● అద్భుతములు
దీన్ని "గొప్పకార్యాలు" లేక "శక్తిగల కార్యాలు" లేక "ఆశ్చర్య కార్యాలు" అని రాయొచ్చు. (యుడిబి).
● వారు మారుమనస్సు పొందకపోవుట వలన
"వారు" అనే సర్వనామం ఇతర పట్టణాల్లో పశ్చాత్తాప పడని వారిని ఉద్దేశించింది.
● అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా,
ఇక్కడ కొరాజీనా, బేత్సయిదా నగరాల ప్రజలు తన మాటాలు వింటున్నట్టు చెబుతున్నాడు కానీ వారు అక్కడ లేరు. (సంగ్రహంగా రాయడం చూడండి).
● కొరాజీనా. బెత్సయిదా . తూరు . సీదోను
ఈ పట్టణాల్లోని ప్రజలను గూర్చి చెప్పడానికి ఈ పట్టణాల పేర్లను అన్యాపదేశంగా వాడుతున్నారు. (అన్యాపదేశం చూడండి).
● మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల
దీని కర్తరీ వాక్యంలో ఇలా అనువదించవచ్చు: "నేను మీకు చేసిన అద్భుత కార్యాలను తూరు సీదోను పట్టణాల్లో చేసి యుండిన ఎడల (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● అయ్యో. మీ మధ్యను చేయబడిన అద్భుతములు = ఇక్కడ "మీ" అనే సర్వనామం ఏకవచనం.
● వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని యుందురు
"వారు" అనే సర్వనామం ఇక్కడ తూరు సీదోను ప్రజలనుద్దేశించినది.
● మారుమనస్సు
"వారు వారి పాపాల కొరకుపశ్చాత్తాప పడి ఉండేవారు:
● విమర్శ దినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టాణముల వారి గతి ఓర్వతగినదై యుండునని
"తీర్పు దినమందు దేవుడు మీ పట్ల కంటే కూడా తూరు సీదోను వారికి ఎక్కువ కనికరం చూపుతాడు " లేక "తీర్పు దినమందు దేవుడు తూరు సీదోను ప్రజలకంటే మిమ్మల్ని ఎక్కువ శిక్షిస్తాడు” (యుడిబి). ఇందులో దాగి ఉన్న అసలు అర్ధం ఏమిటంటే "మీరు నేను అద్భుతాలు చేయడం చూసి కూడా నన్ను నమ్మలేదు మారుమనస్సు పొందలేదు.” (స్పష్ట విస్పష్ట చూడండి).
● మీ కొరకు
"మీ" అనే సర్వనామం కొరజీనా బెత్సయిదా వారిని ఉద్దేశించింది.
యేసు తాను అధ్భుత కార్యాలు చేసిన పట్టణాలలో ప్రజలను విమర్శిస్తున్న సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● కపెర్నహూమా
ఇక్కడ కపెర్నహూము పట్టాణ ప్రజలు తన మాటలు వింటున్నట్టు చెబుతున్నాడు కానీ వారు అక్కడ లేరు. (సంగ్రహంగా రాయడం చూడండి). "నీవు' అనేది ఏకవచనం, ఈ రెండు వచనాలలో దీన్ని కపెర్నహూమును సంబోధించడానికి వాడారు.
● కపెర్నహూము. సోదొమ
ఈ పట్టణాల పేర్లు కపెర్నహూము, సోదొమలో నివసిస్తున్న ప్రజలను ఉద్దేశించిన పర్యాయ పదాలు. (పర్యాయ పదాలు చూడండి).
● ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా
యేసు ఈ అలంకారిక ప్రశ్నను వేస్తూ కపెర్నహూము ప్రజల గర్వాన్ని తిడుతున్నాడు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి). దీన్ని కర్త ప్రధాన వాక్యంగా "నీవు ఆకాశానికి ఎక్కుతాను అనుకుంటున్నావా? " లేక "నిన్ను దేవుడు గౌరవిస్తాడని అనుకుంటున్నావా?” (కర్హ లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).
● హెచ్చింప బడెదవా
"గౌరవాన్ని పొందుతావా." (జాతీయాలు చూడండి).
● నీవు పాతాళము వరకు దిగి పొయెదవు
దీన్ని కర్త ప్రధాన వాక్యంగా: "దేవుడు నిన్ను పాతాళానికి దించుతాడు." అని రాయొచ్చు.(కర్హ లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).
● నీలో చేయబడిన అద్భుతములు సొదొమలొ చేయబడిన యెడల
దీని కర్త ప్రధాన వాక్యంగా: "నేను నీలో చేసిన గొప్ప కార్యాలను సొదొమలొ చేసుంటే." (కర్హ లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).
● అద్భుతములు
"అద్భుత కార్యాలు" లేక "శక్తి గల కార్యాలు" లేక "వింత కార్యాలు"
● అది నేటివరకు నిలిచి యుండును
ఇక్కడ "అది" అనే సర్వనామం సొదొమ నుద్దేశించినది.
● విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై యుండునని
దీన్ని ఇలా అనువదించ వచ్చు తీర్పు దినమందు దేవుడు మీ పట్ల కంటే కూడా సొదొమ ప్రాంత ప్రజల పట్ల ఎక్కువ కనికరాన్ని చూపిస్తాడు" లేక "తీర్పు దినమందు దేవుడు సొదొమ ప్రజల కంటె ఎక్కువ కఠినంగా శిక్షిస్తాడు" (యుడిబి చూడండి). ఈ మాటలకు అర్ధం "నేను చేసిన అద్భుత కార్యాలను చూసి కూడా మీరు నన్ను నమ్మ లేదు పశ్చాతాప పడలేదు." (స్పష్ట విస్పష్ట వాక్యాలు చూడండి).
యేసు తన చుట్టూ జనసమూహం ఉన్నప్పటికీ వారి మధ్యనే పరలోకపు తండ్రికి ప్రార్ధన చేస్తున్నాడు.
● యేసు చెప్పినదేమనగా
దీనర్ధం 1). యేసు 12"1 లో తన శిష్యులను పంపిన తర్వాత ఎవరో ఏదో చెప్పినదానికి యేసు జవాబిస్తున్నాడు, లేక 2). పశ్చాతప పడని నగరాలను ఉద్దేశించిన తన విమర్శలను యేసు ఇక్కడ ముగిస్తున్నాడు: "యేసు ఇంకా ఇలా అన్నాడు" అని రాయొచ్చు.
● తండ్రీ
దీనర్ధం ఈ లోక తండ్రి కాదు, దేవుడైన తండ్రి.
● ఆకాశమునకును భూమికిని ప్రభువా
దీన్ని పర్యాయ వాక్యంగా అనువదిస్తూ: ఆకాశంలోని భూమిలోని ప్రతి దానికి ప్రతి మనిషికీ ప్రభువా," లేక రెండు విరుద్ద అర్దాల పదాలను పొలిచి చెప్పే విధంగా "విశ్వానికి ప్రభువా" అని రాయొచ్చు (పర్యాయ పదాలు, వైరుధ్య వాక్యాలు చూడండి).
● నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని"
"ఈ సంగతులు" అనే పదానికి అసలు అర్ధం ఏంటో ఇక్కడ స్పష్టంగా లేదు. " ఒకవేళ మీ భాషలో ఈ పదానికి కచ్చితమైన అనువాదం రాయాల్సి వస్తే "తెలివైన వారు, చదువుకున్నవారు తెలుసుకునే అవకాశం లేకుండా నీవు సత్యాలను తెలివి తక్కువ వారికి వెల్లడించావు” అని రాయొచ్చు.
● మరుగు చేసావు
"దాచి.” ఇది వెల్లడి చేయడం అనే క్రియకు వ్యతిరేక పదం.
● జ్ఞానులు. వివేకులు
"జ్ఞానము తెలివి కలిగిన వారు.” దీని మరోలా: తమకు తామే తెలివైనవారిమి, జ్ఞానముగల వారికి అనుకునే ప్రజలు(యుడిబి, వ్యంగ్య పదాలు చూడండి).
● బయలు పరచినావని
ఇక్కడ "బయలుపరచినవి" అంటే ముందు వచనంలోని "ఈ సంగతులు."
● పసిబాలురకు
ఈ పదం అర్ధం "చిన్న వయసులోని వారు." "చదువుకోని వారు" లేక "తెలివితక్కువ వారు.” దీన్ని ఇలా అనువదించ వచ్చు "తెలివితక్కువ పిల్లలు" అని రాయొచ్చు.
● పసిబాలురకు
ఈ పదం, తెలివిలేని, చదువుకోని, తాము తెలివితక్కువ వారిమని చదువులేని వారిమని అనుకునే ప్రజల నుద్దేశించిన ఉపమానం. (ఉపమ చూడండి).
● ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను
"ఈ విధంగా చేయడం మంచిదని నీవు గుర్తించావు"
● సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింప బడి యున్నది
దీన్ని కర్త ప్రధాన వాక్యంగా: నా తండ్రి అన్నిపనులు నా చేతికిచ్చాడు" లేక " నా తండ్రి అన్ని పనులు నాకు అప్పగించాడు: అని రాయొచ్చు. (కర్త లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).
● తండ్రి గాక ఎవరూ కుమారుని ఎరుగరు
"కుమారుని గురించి తండ్రికి మాత్రమే తెలుసు."
● కుమారుని ఎరుగరు
"వ్యక్తిగత అనుభవం ద్వారా ఎరుగరు"
● కుమారుడు
యేసు తన గురించే ప్రధమ పురుషలో మాట్లాడుతున్నాడు (ఉత్తమ, మధ్యమ, ప్రధమ పురుష చూడండి).
● కుమారుడు గాకను. మరి ఎవరును తండ్రిని ఎరుగరు
"కుమారుడికి మాత్రమే తండ్రి గురించి తెలుసు
● తండ్రిని ఎరుగరు
" "వ్యక్తిగత అనుభవం ద్వారా ఎరుగరు"
● కుమారుడెవనికి ఆయనను బయలు పరచ నుద్దేశించునో
దీన్ని మరోలా ;"కుమారుడు తన తండ్రి గురించి తెలియజేస్తేనే ప్రజలకు తండ్రిని గురించి తెలుస్తుంది. కుమారుడెవనికి ఆయనను బయలు పరచ నుద్దేశించునో
ఆయనను అంటే దేవుడైన తండ్రి.
యేసు జన సమూహంతో మాట్లాడటం ఇక్కడ ముగిస్తున్నాడు
● ప్రయాసపడి భారం మోసికొనుచున్న
ఈ రూపకం ద్వారా యూదుల ధర్మశాస్త్రం లోని "కాడి"ని ప్రస్తావిస్తున్నాడు. (రూపకాలంకారం చూడండి).
● నేను మీకు విశ్రాంతి కలుగ జేతును
"మీ భారాలనుండి, కష్టాల నుండి మీకు నేను విడుదల నిస్తాను. (స్పష్ట విస్పష్ట వాక్యాలు చూడండి).
● మీ మీద నా కాడి ఎత్తుకుని
ఇక్కడ "మీ" అనే సర్వనామం "కష్టపడుతున్న, బరువులు మోస్తున్న వారిని" ఉద్దేశించింది. ఈ రూపకానికి అర్ధం ;"నేను మీకు అప్పగించే పనిని చేయండి అని” (యుడిబి చూడండి). లేక "నాతో కలిసి పని చేయండి.” (రూపకం చూడండి).
● నా కాడి సుళువు
ఇక్కడ బరువుగా ఉండదు, తేలికగానే ఉంటుంది అని అర్థం.
తన శిష్యులు సబ్బాతు రోజు ఆకలి తీర్చుకోవడానికి వరి కంకులను కోయటాన్ని పరిసయ్యులు విమర్శించినందుకు యేసు తన శిష్యులను సమర్దిస్తూ మాట్లాడుతున్నాడు.
● పంటచేలలో
ధాన్యాలు నాటే ప్రదేశం. ఒకవేళ గోదుమలు తెలియక పోతే వరి సర్వసాధారణమైన పంట అయితే, "రొట్టెలు చేసుకునే ధాన్యాల పంట పొలాలు."
● వెన్నులు త్రుంచి తినసాగిరి. విశ్రాంతి దినాన చేయకూడనిది
పరాయివాళ్ళ పంటపొలాల్లోని ధాన్యపు గింజలను విశ్రాంతి రోజు తుంచి తినడం దొంగతనంగా ఏమీ భావించరు.(యుడిబి చూడండి). ఇది మామూలుగా చేయకూడని పని కాకపోయినా, విశ్రాంతి రోజున చేయడం అనేది ఇక్కడ వారి సందేహం.
● వారిని
ధాన్యపు కంకుల గింజలు
● వెన్నులు
బాగా ఎత్తుగా పెరిగిన గోదుమ మొక్కల పైన చివరన ఉండే భాగం. మొక్కలోని పండిన ధాన్యం లేక విత్తనాలు ఇక్కడ ఉంటాయి.
● ఇదిగో
దీన్ని: "చూడు," "విను" లేక "నేను చెప్పేదాన్ని శ్రద్ధగా విను" అని రాయొచ్చు
తన శిష్యులు సబ్బాతు రోజు ఆకలి తీర్చుకోవడానికి వరి కంకులను కోయటాన్ని పరిసయ్యులు విమర్శించినందుకు యేసు తన శిష్యులను సమర్దిస్తూ ఇంకా మాట్లాడుతున్నాడు.
● వారితో. మీరు
పరిసయ్యులు
● మీరు చదువలేదా?
తాము చదివిన విషయాలనుంచి ఏమీ నేర్చుకోనందుకు పరిసయ్యులను యేసు చీవాట్లు పెడుతున్నాడు. దీన్ని మరోలా
"మీరు చదివే విషయాలలోని సంగతునలను మీరు నేర్చుకోవాలి.” (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● తాను. తనతో
దావీదు
● సముఖపు రొట్టెలు
దేవునికి అర్పించిన రొట్టెలు ఆయన సన్నిధిలో ఉంచిన రొట్టెలు. (యుడిబి).
● తనతో కూడా ఉన్నవారైనను
"దావీదుతో కూడా ఉన్నవారు"
● యాజకులు తప్ప
"యాజకులు మాత్రమే వాటిని తినవచ్చు." (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
తన శిష్యులు సబ్బాతు రోజు ఆకలి తీర్చుకోవడానికి వరి కంకులను కోయటాన్ని పరిసయ్యులు విమర్శించినందుకు యేసు తన శిష్యులను సమర్దిస్తూ ఇంకా మాట్లాడుతున్నాడు.
● మీరు. మీతో
పరిసయ్యులు
● ధర్మశాస్త్రమందు చదవలేదా
"మీరు ధర్మశాస్త్రాన్ని చదివారు కాబట్టి అందులో ఏమి వుందో మీకు తెలుసు" (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి
మామూలు రోజులలో చేసినట్టు విశ్రాంతి రోజున చేసి."
● నిర్దోషులై యున్నారని
"దేవుడు వారిని శిక్షించడు"
● దేవాలయం కంటే గొప్పవాడు
"గుడి కంటే చాల ముఖ్యమైన వాడు." గుడికంటే చాల ముఖ్యమైన వాడినని యేసు ఇక్కడ తన గూర్చి తానే చెప్పుకొంటున్నాడు.
తన శిష్యులు సబ్బాతు రోజు ఆకలి తీర్చుకోవడానికి వరి కంకులను కోయటాన్ని పరిసయ్యులు విమర్శించినందుకు యేసు తన శిష్యులను సమర్దిస్తూ ఇంకా మాట్లాడుతున్నాడు.
● మీకు తెలిసియుంటే
"మీకు తెలియదు"
● మీతో. మీకు
పరిసయ్యులు.
● కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను
బాలి అర్పించడం మంచిదే కానీ దయ చూపించడం చాలా మంచిది. (అతిశయ వాక్యాలు చూడండి).
● అను వాక్యభాగం
"ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమీ చెప్పాడో."
● నేను కోరుచున్నాను
ఇక్కడ "నేను" అనే సర్వనామం దేవుడిని ఉద్దేశించింది.
సబ్బాతు రోజు ఒక వ్యక్తిని బాగు చేసింది చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు సమాధానమిస్తున్నాడు.
● ఆయన అక్కడి నుండి వెళ్లి
"యేసు పంట పొలాల్లోనుండి వెళ్లి."
● వారి
తాను మాట్లాడుతున్న పరిసయ్యుల ప్రార్ధనా మందిరములో
● ఇదిగో
ఇక్కడ "ఇదిగో" అనే పదం కొత్త వ్యక్తి వచ్చాడని చెబుతుంది. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేక విధానం ఉంటే రాయండి.
● ఊచ చెయ్యి
"పొట్టిగా ఉన్న కురచ చెయ్యి" లేక "బాగా ముడుచుకుపోయిన చేయి."
సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు.
● మీలో ఏ మనుష్యునికైనను. పట్టుకుని .. పైకి తీయడా?
దీన్ని మరోలా "మీలో. ప్రతి ఒక్కరు దాన్ని పట్టుకుని పైకి తీస్తారు.” (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● వారు. మీ.
పరిసయ్యులు.
● ఏ మనుష్యునికైనను
'అతడికి ఉన్నట్లయితే"
● పైకి తీయడా
"గొర్రెను పట్టుకుని ఆ గుంట నుండి పైకి లేవనెత్తుతాడు.
● విశ్రాంతి దినాన మేలు చేయుట ధర్మమే
"మంచి పనులు చేసేవారెవరూ ధర్మాన్ని అతిక్రమించరు" లేక "మంచి పనులు చేసేవారు ధర్మాన్ని పాటిస్తారు"
సబ్బాతు రోజు తను ఒక వ్యక్తిని బాగు చేయడం చూసి పరిసయ్యులు తనను నిందింఛి నందుకు యేసు వారికి సమాధానమిస్తున్నాడు.
● ఆ మనుష్యుని
పొట్టి చెయ్యి ఉన్న వ్యక్తి
● నీ చెయ్యి చాపుమనెను
"నీ చెయ్యి పైకి తీసి లేపు" లేక "నీ చెయ్యి పొడవుగా చాపు."
● వాడు
ఆ వ్యక్తి
● అది. అది
ఆ వ్యక్తి చేయి.
● అది బాగు పడెను
"పూర్తిగా ఆరోగ్యంగా అయింది" లేక "మళ్ళీ ఆరోగ్యంగా అయింది"
● విరోధముగా ఆలోచన చేసిరి
"అతనికి హాని తలపెట్టాలని కుట్ర పన్నారు.
● ఆయనను ఏలాగు
"ఏ విధంగా చేసే అవకాశాలు ఉన్నయో అన్ని అవకాశాలు."
● ఆయనను సంహరింతుమా
యేసును చంపడానికి
యేసు చేస్తున్న కార్యాలన్నీ ఏ విధంగా యెషయా ప్రవక్త ప్రవచనాలను నేరవేరుస్తున్నాయో ఇక్కడ చూస్తాము.
● "ఆ సంగతి
తనను పరిసయ్యులు చంపదానికి కుట్ర చేస్తున్న సంగతి"
● అచ్చట నుండి వెళ్లి పోయెను
"ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు"
● నన్ను ప్రసిద్ది చేయవద్దని
"తనను గూర్చి ఎవరికీ చెప్పవద్దని"
● ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పినది
"దేవుడు ప్రవక్తయైన యెషయాకు చెప్పి రాయించినది."
యేసు చేసిన అద్భుత కార్యాలు ఎలా యెషయా ప్రవచనాలను నేరవేర్చాయో ఇక్కడ వివరణ ఉంది. దేవుడు చెప్పిన మాటలను యెషయా రాశాడు.
యేసు చేసిన అద్భుత కార్యాలు ఎలా యెషయా ప్రవచనాలలో ఒకదానిని నెరవేర్చిందో ఇక్కడ వివరణ ఉంది. దేవుడు చెప్పిన మాటలను యెషయా రాశాడు.
● ఈయన. ఈయనను
12:18 లోనే "సేవకుడు.”
● ఈయన నలిగిన రెల్లును విరువడు
"బలహీనులను అతడు బాధ పెట్టడు" (రూపకాలంకారం చూడండి).
● నలిగిన
"కొంత విరిగిన లేక పాడైపోయిన"
● మకమక లాడుచున్న అవిసెనారను
అర్పివేయబడిన దీపం వత్తి, నిస్సహాయ, దిక్కులేని పరిస్థితిలో ఉన్నవారిని సూచిస్త్తుంది (రూపకాలంకారం చూడండి).
● చేయు వరకు
దీనిని కొత్త వాక్యంగా "ఆయన దీనిని చేసేంతవరకు" అని రాయొచ్చు.
● విజయమొందుట న్యాయవిధిని ప్రబలం చేయు వరకు
"తాను న్యాయవంతుడని ఆయన మనుషులకు నిరూపిస్తాడు"
యేసు ఒక మనిషిని బాగు చేయడం సాతాను శక్తి ద్వారానే అని పరిసయ్యులు చెప్పుకునే వివరాలు ఇక్కడ మొదవుతాయి.
● గ్రుడ్డివాడును మూగవాడునైన
"చూడలేని, మాట్లాడలేని మనిషి.”
● ప్రజలందరూ విస్మయమొంది
"ఆ మనిషిని యేసు బాగు చేయడం చూసిన వారందరూ ఎంతో ఆశ్చర్య పడ్డారు."
యేసు ఒక మనిషిని బాగు చేయడం సాతాను శక్తి ద్వారానే అని పరిసయ్యులు చెప్పుకునే వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● ఈ అద్భుతము
దయ్యం పట్టిన, చూసే, వినే శక్తి లేని వ్యక్తి ని బాగు చేయడం.
● వీడు బయల్జెబూబు వలెనే దయ్యంలను వెళ్ళగొట్టుచున్నాడు
"ఇతడు బయల్జెబూబు పనులు చేసేవాడు కాబట్టే దయ్యాలను వెళ్ళగొట్ట గలుగుతున్నాడు"
● వీడు
పరిసయ్యులు యేసును పేరు పెట్టి పిలవకుండా తాము అతడిని వ్యతిరేకిస్తున్నామని తెలుపుతున్నారు.
● వారి. వారితో
పరిసయ్యులు.
యేసు ఒక మనిషిని బాగు చేయడం సాతాను శక్తి ద్వారానే అని పరిసయ్యులు. చెప్పుకునే వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● మీ మీదికి
పరిసయ్యుల పైకి
● మొదట బలవంతుని బంధింపని యెడల
"బలం కలిగిన మనిషిని మొదట అడ్డుకోలేక పోతే"
● నా పక్షమున నుండనివాడు
"నా వైపు ఉండి నాకు మద్దతు ఇవ్వని వాడు" లేక "నాతో కలిసి పని చెయ్యని వాడు"
● నాకు విరోధి
"నాకు వ్యతిరేకంగా పనిచేసేవాడు" లేక "నేను చేసిన పనిని పాడు చేసేవాడు"
● సమకూర్చని
పంటలు సాగు చేయడాన్ని తెలపడానికి మామూలుగా ఈ పదాన్ని వాడుతారు.
ఒక మనిషిని బాగు చేయడం సాతాను శక్తి ద్వారానే అని పరిసయ్యులు. చెప్పుకునే వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● మీతో
పరిసయ్యులతో.
● మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును
"మనుషులు చేసే ప్రతి పాపాన్ని దేవుడ్ని దూషించడాన్ని దేవుడు క్షమిస్తాడు” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు చూడండి).
ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు
"పరిశుద్దాత్మను దూషిస్తే దేవుడు క్షమించడు"
● మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు
"మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని దేవుడు క్షమిస్తాడు."
● ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను
దీన్ని మరోలా
"ఈ కాలంలో .. ముందు కాలంలో." అని రాయొచ్చు.
ఒక మనిషిని బాగు చేయడం సాతాను శక్తి ద్వారానే అని పరిసయ్యులు. చెప్పుకునే వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదని యెంచుడి
"చెట్టు పండు మంచిదైతే చెట్టు కూడా మంచి చెట్టని, చెట్టు పండు చెడిపోయి ఉంటే చెట్టు కూడా మంచిది కాదని తెలుసుకోండి."
● మంచిది. చెడ్డది
దీనర్ధం 1)."ఆరోగ్యంగా ఉండే . అనారోగ్యంగా ఉండే" లేక 2)."పనికి వచ్చే .. పనికి రాని."
● చెట్టు దాని పండు వలన తెలియబడును
దీనర్ధం 1)."మనుషులు ఒక చెట్టు పండును చూసి ఈ చెట్టు మంచిగా ఉందో లేదో తెలుసుకుంటారు" లేక 2)."మనుషులు ఒక చెట్టు పండును చూసి అది ఏ జాతి చెట్టో తెలుసుకుంటారు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు చూడండి).
● మీరు. మీతో
పరిసయ్యులు.
● హృదయమందు నిండి యుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా
"ఒక మనిషి తన మనసులో ఏమి అనుకుంటున్నాడో దాన్నే చెప్పగలడు” (అన్యాపదేశాలు చూడండి).
మంచి ధన నిధి. చెడ్డ ధన నిధి
"మంచి ఆలోచనలు . చెడ్డ ఆలోచనలు" (రూపకాలంకారం చూడండి).
ఒక మనిషిని బాగు చేయడం సాతాను శక్తి ద్వారానే అని పరిసయ్యులు. చెప్పుకునే వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.
● మీరు. మీ
పరిసయ్యులు.
● మనుష్యలు. లెక్క చెప్పవలసి యుండును
"దేవుడు వాళ్ళనువాటి గూర్చి అడుగుతాడు" లేక "దేవుడు వారి విలువను బట్టి న్యాయం తీరుస్తాడు"
● వ్యర్ధమైన
"పనికిరాని." దీన్ని మరోలా "హానికరమైన" అని రాయొచ్చు(యుడిబి చూడండి).
● వారు
"మనుషులు"
● నీతిమంతుడవని తీర్పు నొందుదువు. అపరాధివని తీర్పు నొందుదువు
"దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు నిన్ను నిందిస్తాడు” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు చూడండి).
యేసు దయ్యం పట్టిన, మూగ, గుడ్డి మనిషిని బాగు చేయడం చూసి కూడా మరొక సూచక క్రియ చేయమని అడిగిన పరిసయ్యులను, శాస్త్రులను చీవాట్లు పెడుతున్నాడు.
● కోరుచున్నాము
"కావాలనుకుంటున్నాము"
● వ్యభిచారులైన చెడ్డతరము వారు
ఈ కాలంలో నివసించే ప్రజలు చెడ్డపనులు చేయడానికి ఇష్టపడుతూ దేవుడంటే విశ్వాసం లేకుండా ఉన్నారు.
● ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు
"ఈ కాలంలోని వ్యభిచారులు, చెడ్డవారైన మనుషులకు దేవుడు ఏ సూచనలు చూపే పనులు జరిగించడు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
● యోనాను గురించిన సూచక క్రియయే
దీన్ని "యోనా విషయంలో జరిగిన సంఘటన" లేక "యోనా విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యము" (రూపకాలంకారం చూడండి).
● భూగర్భంలో
భూమిలో సమాధిలో ఉంచబడి (ఉపమ చూడండి).
యేసు దయ్యం పట్టిన, మూగ, గుడ్డి మనిషిని బాగు చేయడం చూసి కూడా మరొక సూచక క్రియ చేయమని అడిగిన పరిసయ్యులను, శాస్త్రులను ఇంకా చీవాట్లు పెడుతున్నాడు.
● నీనెవె వారు ఈ తరము వారితో నిలువబడి. వారి మీద నేరస్థాపన చేతురు
దీన్ని మరోలా : "నీనెవె ప్రజలు ఈ కాలపు ప్రజలను నిందిస్తారు . దేవుడు వారి నిందలను విని మిమ్మల్ని శిక్షిస్తాడు" లేక "దేవుడు న్యాయం తీర్చి నీనెవె ప్రజలు ఈ కాలపు ప్రజల తప్పులను చూపుతాడు, అయితే నీనెవె ప్రజలు పశ్చాతాప పడ్డారు, మీరు పశ్చాతాప పడలేదు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తాడు.” (అన్యాపదేశాలు చూడండి).
● ఈ తరము
యేసు ఉపదేశిస్తున్న కాలంలో జీవిస్తున్న ప్రజలు (రూపకాలంకారం చూడండి).
● కంటే గొప్పవాడు
"చాలా ప్రముఖ వ్యక్తి."
యేసు సూచక క్రియ చేయమని అడిగిన పరిసయ్యులను, శాస్త్రులను ఇంకా చీవాట్లు పెడుతున్నాడు.
● దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును
దీని మరోలా: "దక్షిణ దేశం రాణి ఈ కాలంలోని ప్రజలను నిందిస్తుంది, దేవుడు ఆమె మోపిన నిందలను విని, ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు" లేక "దేవుడు దక్షిణ దేశం రాణిని. ఈ కాలంలోని ప్రజలను పాపం చేసారని నిందితులుగా ఎంచుతాడు, అయితే ఆమె సొలోమోను మాటలను విన్నది, మీరు నా మాటలను వినలేదు కాబట్టి ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు” (అన్యాపదేశం , స్పష్ట, విస్పష్ట వాక్యాలు చూడండి).
● దక్షిణ దేశపు రాణి
అన్య రాజ్యానికి రాణి అయిన షీబా దేశపు రాణి (పేర్లను అనువదించడం, తెలియని వాటిని అనువదించడం చూడండి).
● భూమ్యంతములనుండి వచ్చెను
"ఆమె చాలా దూర ప్రదేశము నుండి వచ్చింది” (జాతీయం చూడండి).
● ఈ తరము
యేసు ఉపదేశిస్తున్న కాలంలో జీవిస్తున్న ప్రజలు. (రూపకాలంకారం చూడండి).
● కంటే గొప్పవాడు
"చాలా ప్రముఖ వ్యక్తి"
యేసు సూచక క్రియ చేయమని అడిగిన పరిసయ్యులను, శాస్త్రులను ఇంకా చీవాట్లు పెడుతున్నాడు.
● నీరు లేని చోట్ల
"బీడు భూముల్లో" లేక "మనుషులెవరూ నివసించని ప్రాంతాల్లో.” (యుడిబి చూడండి).
● దొరకనందున
"ఏ విధమైన నెమ్మది లేనందు వల్ల"
● అది అనుకొని
"చెడ్డ ఆత్మ అనుకొని"
● అది ఊడ్చి అమర్చి యుండుట చూచి
దీన్ని మరోలా: "చెడ్డ ఆత్మ తాను ఉండివచ్చిన ఇంటిని ఎవరో బాగా శుభ్రం చేసి అన్నీ సర్ది ఉండటం చూసి.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).
యేసు అమ్మ, అన్నాదమ్ములు రావడంతో ఆయన ఆత్మీయ కుటుంబం గూర్చి వివరించే అవకాశం దొరుకుతుంది.
● ఆయన తల్లియు
యేసును కన్న తల్లి
● ఆయన సహోదరులు
దీని అర్ధం 1). ఆయన స్వంత ఇంటిలోని తోబుట్టువులు, దగ్గర బంధువులు (యుడిబి చూడండి). 2). ఇశ్రాయేలు లోని స్నేహితులు, సహచరులు.
● ఆయనతో మాటలాడగోరుచూ
"ఎదురు చూస్తూ"
యేసు తల్లి, అన్నాదమ్ముళ్ళు రావడంతో ఆయన ఆత్మీయ కుటుంబం గూర్చి వివరించే అవకాశం దొరుకుతుంది.
● తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి
"ఆయన అమ్మ, అన్నాదమ్ములు ఆయనను చూడటానికి వేచి ఉండారని యేసుతో చెప్పిన వ్యక్తి."
● నా తల్లి యెవరు? నా సహోదరులెవరు?
దీన్ని మరోలా: "నా నిజమైన అమ్మ, అన్నాదమ్ములు ఎవరో నేను మీకు చెబుతాను." (అలంకారిక ప్రశ్నలు, చూడండి).
● చేయువాడే
"ఎవరైనా"
ఈ అధ్యాయములో, సముద్రపు దరిని యేసు పడవలో కూర్చొని పెద్ద జనసమూహముతో దేవుని రాజ్యాన్ని వివరించే రకరకాల ఉపమానాలు తెలియజేసాడు.
● ఆ దినాన
ముందటి అధ్యాయములో వలెనే ఈ సంగతులు కూడా ఒకే దినాన సంభవించాయి.
● ఇంటిలో నుండి బయటకు
ఎవరి ఇంటిలో యేసు నిలిచియున్నాడో ప్రస్తావించబడలేదు.
● పడవలోనికి వెళ్ళి
బహుశా ఇది పై కప్పు లేకుండా తెరచాపతో ఉన్న చిన్న పడవ అయి ఉంటుంది.
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెప్పాడు.
● యేసు అనేక విషయాలను ఉపమానములుగా వారికి చెప్పాడు
"ఉపమానములలో యేసు వారికి అనేక విషయాలు చెప్పాడు"
● వారికి
సమూహములోనున్న ప్రజలకు
● ఇదిగో
ప్రత్యామ్నాయ అనువాదం: "చూడండి" లేక "వినండి" లేక "నేను మీకు చెప్పబోయే దానిని మనస్సు పెట్టి వినండి"
● విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను
"ఒక రైతు పొలంలో విత్తనాలు జల్లుటకు వెళ్లెను"
● ఆయన విత్తుచుండగా
"విత్తువాడు విత్తుచుండగా"
● దారి ప్రక్కన
పొలాన్ని ఆనుకొని ఉన్న "బాట.” ప్రజలు అందులో నడుస్తారు కావున నేల గట్టిగా ఉంటుంది.
● నోట్లో వేసుకు పోయాయి
"విత్తనాలన్నిటిని తినివేసాయి"
● రాతి నేల
"రాళ్ల మీదనున్న తక్కువ మన్ను"
● వెంటనే అవి మొలిచెను
"విత్తనాలు త్వరగా మొలకెత్తి పెరిగెను."
● అవి వాడిపోయినవి
"మొక్కలను ఎండ మాడ్చి వేసినందున వేడికి అవి తట్టుకోలేకపోయాయి." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● అవి మాడి పోయినవి
"మొక్కలు ఎండిపోయి చనిపోయాయి"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● ముండ్ల పొదలలో పడినవి
"ముండ్ల పొదలు మొలుచు చోట పడినవి."
● వాటిని అణచి వేసినవి
"కొత్త మొలకలను అణచి వేసినవి." మొక్కలు సరిగా పెరగకుండా కలుపు మొక్కలు అడ్డుకుంటున్నాయి అని చెప్పుటకు వాడే సాధారణ పదం వాడండి.
● విత్తనంలను ఫలించెను
"పంట పండెను" లేక "ఎక్కువ విత్తనాలు వచ్చెను" లేక "ఫలములను ఇచ్చెను."
● చెవులు గల వాడు, వినును గాక
కొన్ని భాషలలో మధ్యమ పురుష వాచకం వాడటం చాలా సాధారణముగా ఉంటుంది: "నీకు వినటానికి చెవులుంటే, విను." (చూడండి: ఉత్తమ, మధ్యమ లేక ప్రథమ పురుష వాచకములు).
● చెవులు గలవాడు
"ఎవరైనా వినగలిగినవారు" లేక "ఎవరైనా నా మాటలు వినగలవారు"
● అతడు వినును గాక
"అతడు మంచిగా వినును గాక" లేక "నేను చెప్పుచున్నదానికి అతడు సావధానత చూపును గాక"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● వారితో
శిష్యులతో.
● పరలోక రాజ్యాన్నిగూర్చిన మర్మములు తెలిసికొను ఆధిక్యత మీకు మాత్రం ఇవ్వబడినది, కాని వారికి అది ఇవ్వబడలేదు
దీనిని దాగి ఉన్న భావాన్ని తెలియజేస్తూ సకర్మక క్రియా రూపములో ఈ విధంగా తర్జుమా చేయవచ్చును: "పరలోకమును గూర్చిన మర్మములను తెలుసుకొనే ఆధిక్యతను దేవుడు మీకు అనుగ్రహించాడు, కాని ఈ ప్రజలకు దేవుడు అనుగ్రహించలేదు" లేక "పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మములను గ్రహించే సామర్థ్యము గల వారిగా దేవుడు మిమ్మును చేసాడు, కాని ఈ ప్రజలకు ఆ శక్తిని ఇవ్వలేదు." (చూడండి: సకర్మక క్రియ కర్మార్థక క్రియ, స్పష్టమైన, అస్పష్టమైన వాచకములు).
● మీరు
శిష్యులు
● మర్మములను
దాచబడిన సత్యములను కాని యేసు వాటిని ఇప్పుడు బయలు పరుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మర్మములు" లేక "దాచబడిన సత్యములు" (యుడిబి చూడండి).
● ఎవరికున్నదో
"ఎవరికి గ్రహించే శక్తి ఉన్నదో" లేక "నేను చెప్పే మాటలను స్వీకరించే వారు"
● అతనికి ఎక్కువ ఇవ్వబడుతుంది
దీనిని సకర్మక క్రియ రూపములో వ్రాయవచ్చును: "దేవుడు వానికి ఎక్కువ గ్రహింపు శక్తిని ఇస్తాడు." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● అతనికి ఎక్కువ సమృద్ది కలుగును
"అతడు తేటగా అర్థం చేసుకుంటాడు"
● ఎవనికి లేదో
"ఎవరికి గ్రహించే శక్తిలేదో వానికి" లేక "నేను చెప్పే మాటలను స్వీకరించలేని వానికి"
● అతని యొద్దనుండి అతనికి కలిగినది కూడా తీసివేయబడుతుంది
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చును: "అతనికి కలిగిని దానిని కూడా దేవుడు తీసివేస్తాడు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు.
● నేను వారితో మాట్లాడితిని
ఇక్కడ వాడిన "వారితో" అనే సర్వ నామము ఈ రెండువచనాలలోను అక్కడి జనసమూహములోని ప్రజలను సూచిస్తుంది.
● వారు చూచినను, నిజముగా చూడలేదు, వారు విన్నను నిజముగా వినలేదు కాబట్టి
అర్థం చేసుకోవటానికి ప్రజలు తృణీకరిస్తున్నారు అని శిష్యులతో చెప్పటానికి యేసు ఈ అనురూపతను వాడుతున్నాడు. (చూడండి: అనురూపత).
● వారు చూచినను నిజముగా వారు చూడలేదు
"వారు చూచినను వారు తెలుసుకోరు" క్రియా పదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దానిని ఈ విధంగా తర్జుమ చేయాలి, "వారు సంగతులను చూసినను, వాటిని వారు గ్రహించలేదు" లేక "జరిగిన సంగతులను వారు చూసినను, వాటి అర్థమేమిటో వారు గ్రహించలేదు" (చూడండి: క్రియా పదాలు).
● వారు వినినప్పటికి, నిజముగా వినలేదు అర్థం కూడా చేసుకోలేదు
"వారు విన్నప్పటికి, వారు అర్థం చేసుకోలేదు" క్రియా పదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దానిని ఈ విధంగా తర్జుమా చేయాలి, "ఉత్తరువులను వారు విన్నను, సత్యమును వారు గ్రహించలేదు"
● వినేటప్పుడు వింటారు కాని, ఏ మాత్రం అర్థం చేసుకోరు; చూసేటప్పుడు మీరు చూస్తారు కాని ఏ మాత్రం గ్రహింపరు
యెషయా కాలంలోనున్న అవిశ్వాసులైన ప్రజలను గూర్చి ప్రవక్తయైన యెషయా చెప్పిన లేఖనం ఇక్కడ ఉటంకించబడింది. ఈ దృష్టాంతమును తన మాటలు వింటున్న జనసమూహము ఎలాంటివారో తెలియజేయుటకు యేసు ఉపయోగిస్తున్నాడు. ఇది మరొక అనురూపత. (చూడండి: అనురూపత).
● వినేటప్పుడు వింటారు, కాని మీరు ఏవిధంగాను అర్థం చేసుకోరు
దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చు "మీరు వింటారు, కాని మీరు అర్థం చేసుకోరు." క్రియాపదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దీనిని ఈ విధంగా తర్జుమా చేయాలి, "మీరు సంగతులను వింటారు, మీరు వాటిని గ్రహించరు "
● చూఛేటప్పుడు చూస్తారు, కాని మీరు ఏమాత్రం తెలుసుకోరు
"మీరు చూస్తారు, కాని మీరు తెలుసుకోరు." క్రియా పదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దీనినిఈ విధంగా తర్జుమా చేయవచ్చు "సంగతులను మీరు చూస్తారు, కాని వాటిని మీరు తెలుసుకోరు."
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు. ఆయన యెషయా 13:14లోని మాటలను పునరుచ్చరించుచున్నాడు.
● ఈ ప్రజల హృదయం మందమైనది
"ఈ ప్రజలు ఇక ఎంతకాలం నేర్చుకొనరు" (యుడిబి చూడండి).
● వారి చెవులు వినుటకు బరువెక్కిపోయాయి
"వినటానికి వారు ఎంతమాత్రం ఇష్టపడటము లేదు" (యుడిబి చూడండి).
● వారి కన్నులు మూయబడియున్నవి
"వారు తమ కన్నులు మూసుకున్నారు" లేక "వారు చూడటానికి నిరాకరించుచున్నారు"
● వారు తమ కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మరలా తిరగకుండా
"కావున వారు మరలా తిరగకుండునట్లు తమ కన్నులతో చూడలేరు, తమ చెవులతో వినలేరు, తమ హృదయంతో గ్రహించలేరు.
● మరలా తిరుగుట
"వెనుకకు మళ్ళుట" "మారు మనస్సు పొందుట"
● నేను వారిని స్వస్థ పరచునట్లు
"నన్ను స్వస్థపరచనీయునట్లు." ప్రత్యామ్నాయ అనువాదం: "వారిని మరలా నేను స్వీకరించేలా." (చూడండి: రూపకాలంకారము).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు.
● మీ. మీరు
శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు.
● వారు చూసిరి
"వారు చూడగలరు" లేక "వారు చూడగల సమర్థులు."
● వారు వినుచున్నారు
"వారు వినగలరు" లేక "వారు వినగల సమర్థులు."
● మీరు చూచుచున్న సంగతులు
"నేను చేయటం మీరు చూసిన సంగతులు."
● మీరు వినుచున్న సంగతులు
"నేను చెప్పటము మీరు విన్న సంగతులు''
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఇక్కడ 13:8లో ఆయన చెప్పిన ఉపమానమునే వివరిస్తున్నాడు.
● తన హృదయంలో విత్తబడిన దానిని దుష్టుడు వచ్చి లాక్కుపోతాడు
"తన హృదయంలో ఉన్న దేవుని వాక్యం మరచి పోయేలా సాతాను చేస్తాడు."
● లాక్కుపోవటం
సోత్తుదారుని చేతిలోనుండి ఏదైనా ఎవరైనా గుంజుకొని తీసుకు పోతున్నారు అని భావమిచ్చే మాటను వ్రాయటానికి ప్రయత్నించండి.
● తన హృదయంలో విత్తబడినది
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చు: "దేవుని వాక్యం తన హృదయంలో విత్తబడింది." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● తన హృదయంలో
వినుచున్నవాని హృదయం
● దారి ప్రక్కన విత్తబడినవాడు ఇతడే
అక్షరార్థం చేసిన తర్జుమా సరైన భావము నీయక పోతే, యేసు విత్తువాడు అని సందేశము విత్తనం అని, వినువాడు దారి ప్రక్కన ఉన్న పొలం అని చదువుచున్నవారు అర్థం చేసుకొనేలా తర్జుమా చేయండి. సాధ్యమైన తర్జుమా ఏమనగా: "దారి ప్రక్కన విత్తబడినదానికి ఇలా జరుగుతుంది." దీనిని 13:4 తర్జుమా చేసిన విధంగా నీవు తర్జుమా చేయాలి.
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన 13:8లో చెప్పిన ఉపమానమునే వివరిస్తున్నాడు.
● రాతి నేలను విత్తబడినవాడు ఎవరనగా
అక్షరార్థముగా చేసిన తర్జుమా సరైన అర్థంనీయకపోతే, చదువుచున్నవారు అర్థం చేసుకొనేలా యేసు విత్తువాడు అని, సందేశము విత్తనం అని, వినువాడు రాతినేల అని తర్జుమా చేయండి. సాధ్యమైన తర్జుమా ఏదనగా, "రాతి నేలను విత్తబడిన వాడు ఇలాగుండును. (చూడండి: ఉపమాలంకారము, అధ్యారోపము).
● అతనికి వేరు లేనందున
"అతనికి లోతులేని వేరులున్నవి" లేక "లేత మొక్క వేరులు తన్నటానికి అతను అనుమతివ్వలేదు" (చూడండి: అతిశయోక్తి, అన్యాపదేశము).
● వాక్యం బట్టి
"సందేశమును బట్టి."
● వెంటనే తొట్రుపడును
"వెంటనే అతను పడిపోవను" లేక "వెంటనే అతడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టును." (చూడండి: జాతీయం).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● ముండ్ల పొదలలో విత్తబడినవాడు. మంచి నేలను విత్తబడిన వాడు
అక్షరార్థముగా చేసిన తర్జుమా సరైన అర్థంనీయకపోతే, చదువుచున్నవారు అర్థం చేసుకొనేలా యేసు విత్తువాడు అని, సందేశము విత్తనం అని, వినువాడు ముండ్ల పొదలలో విత్తబడినవాడు అని తర్జుమా చేయండి. సాధ్యమైన తర్జుమా ఏదనగా: "ముండ్లపొదలలో విత్తబడిన విత్తనాలు ఇలా ఉంటాయి.. మంచి నేలను విత్తబడిన విత్తనాలు ఇలా ఉంటాయి." (చూడండి: ఉపమాలంకారము, అధ్యారోపము).
● వాక్యం
"సందేశము"
● ఇహలోకముపట్ల చింత ధన మోహము వాక్యాన్ని నులిమివేస్తాయి, , అతడు నిష్ఫలమైపోతాడు
దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చు, "కలుపు మొక్కలు మంచి మొక్కలను ఎదగకుండా చేసిన రీతిగా, ఇహలోకమును గూర్చిన చింత, ధనమోహము ఒక వ్యక్తి ఫలభరితుడవకుండా అడ్డుకుంటాయి" (చూడండి: రూపకాలంకారము).
● ఇహలోకమును గూర్చిన చింత
"ప్రజలు చింతించే ఈ లోక విషయాలు"
● నిష్ఫలమవ్వటం
"ఫలములేనివాడు అవుతాడు"
● నిజముగా ఫలించువాడు ఇలా ఉంటాడు
"వీరు విశ్వాసం కలిగి ఫలభరితులుగా ఉంటారు" లేక "మంచి ఫలములనిచ్చు మంచి మొక్కలవలె ఈ ప్రజలు కూడా ఫలభరితముగా ఉంటారు" (చూడండి: రూపకాలంకారము, ఉపమాలంకారము).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● యేసు మరొక ఉపమానమును వారికి తెలియజేసాడు
"యేసు మరియొక ఉపమానమును కూడివచ్చిన జన సమూహమునకు చెప్పాడు"
● పరలోక రాజ్యం ఒక మనుష్యుని వలె ఉన్నది
తర్జుమాచేసేటప్పుడు పరలోక రాజ్యం మనుష్యునితో సమానముగా ఉంటుందనే భావము రాకూడదు, కాని పరలోక రాజ్యం ఈ ఉపమానములో వివరించబడిన పరిస్థితులవలె ఉంటుందనే భావము కనపడాలి (యుడిబి చూడండి).
● మంచి విత్తనం
"మంచి ఆహారపు విత్తనాలు" లేక "మంచి ధాన్యపు విత్తనాలు." వినుచున్నవారు యేసు గోదుమ గింజలను గూర్చి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. (చూడండి: స్పష్టమైన అస్పష్టమైన).
● అతని శతృవు వచ్చి
"అతని శతృవు పొలంనకు వచ్చి"
● కలుపు మొక్కలు
దీనిని "చెడ్డ విత్తనం" లేక "కలుపు మొక్కల విత్తనాలు" అని తర్జుమా చేయవచ్చును. ఈ కలుపు మొక్కలు చిన్నప్పుడు ఆహారపు మొక్కలవలెనే కనబడతాయి, కాని వాటి పంట విషపూరితము.
● ఆకులు పెరిగినప్పుడు
"గోదుమ గింజలు మొలకెత్తినప్పుడు" లేక "మొక్కలు పెరిగినప్పుడు"
● వాటి పంట చేతికొచ్చినప్పుడు
"ధాన్యము పండినప్పుడు" లేక "గోదుమలు పండినప్పుడు"
● కలుపు మొక్కలు కూడా కనిపించినాయి
ప్రత్యామ్నాయ అనువాదం: "అప్పుడు ప్రజలు పొలంలో కలుపు మొక్కలు కూడా కనబడటం చూసారు"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఈ వచనాలలో కలుపుమొక్కలను గూర్చిన ఉపమానము కొనసాగుతుంది.
● పొలం యజమాని
పొలంలో మంచి విత్తనంలను విత్తిన వ్యక్తే ఇతను.
● నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తలేదా?
"నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తినావు." పొలం యజమాని బహుశా తన సేవకుల చేత పొలంలో విత్తనాలు వేయించి ఉంటాడు (యుడిబి చూడండి). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న), ప్రత్యామ్నాయ అనువాదంe: అన్యాపదేశము
● అతను వారితో ఇలా చెప్పెను
"పొలం యజమాని సేవకులతో ఇలా చెప్పెను"
● మేము. నీకిష్టమా
"మేము" అనే పదం సేవకులను సూచిస్తుంది."
● వాటిని పోగుచేయుట
"కలుపు మొక్కలను పెరికి వేసి" పారవేయుట (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు. ఈ వచనాలు కలుపు మొక్కల ఉపమానమును పూర్తి చేస్తాయి.
● పొలం యజమాని చెప్పెను
"పొలం యజమాని సేవకులతో ఇలా చెప్పెను"
● పంట కోయువారికి నేను ఇలా చెప్తాను, "మొదట కలుపు మొక్కలను పెరికి వేసి కట్ట కట్టి కాల్చి వేయండి, కాని గోదుమలను నా కొట్టులోనికి చేర్చి పెట్టండి"
దీనిని నీవు పరోక్ష ఉల్లేఖనముగా ఇలా వ్రాయవచ్చు: "మొదట కలుపు మొక్కలను పోగు చేసి కట్టలు కట్టి కాల్చి వేయండి, తరువాత గోదుమలను నా కొట్లలోనికి చేర్చండి అని పంట కోయువారితో నేను చెప్తాను" (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● నా కొట్టు
"ధాన్యాగారము" లేక "ధాన్యమును నిలవ వుంచుటకు వాడే భవనము"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడి వచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● యేసు వారికి మరొక ఉపమానము తెలియ చేసాడు
"జన సమూహమునకు యేసు మరొక ఉపమానమును తెలియజేసాడు"
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు.
● ఆవగింజ
చాలా చిన్న గింజ కాని పెద్ద చెట్టుగా ఎదుగుతుంది (చూడండి: తెలియని వాటి తర్జుమా).
● ఈ గింజ నిజానికి మిగిలిన అన్నిగింజలకంటే చిన్నది
ఆవగింజలు చాలా చిన్నవని నాడు వింటున్న శ్రోతలకు తెలుసు. (చూడండి: స్పష్టమైన , అస్పష్టమైన).
● కాని అది పెరిగినప్పుడు
"కాని మొక్క పెరిగినప్పుడు."
● ఒక వృక్షమైంది
"పెద్ద పొదగా మారింది" (చూడండి: అతిశయోక్తి, ఉపమాలంకారము, తెలియని వాటి తర్జుమా).
● ఆకాశ పక్షులు
"పక్షులు" (చూడండి: జాతీయం).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● అప్పుడు యేసు వారితో మరొక ఉపమానము చెప్పెను
"యేసు జనసమూహమునకు మరొక ఉపమానము చెప్పెను"
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు. పరలోక రాజ్యం పులిసినపిండి కాదు గాని, పరలోక రాజ్యం వ్యాప్తి చెందుటయనేది పులిసిన పిండిలా ఉంటుంది. (చూడండి: ఉపమాలంకారము).
● మూడు పరిమాణముల పిండి
"పెద్ద మొత్తములో పిండి" లేక మీ సంస్కృతిలో పిండిని కొలిచే పెద్ద కొలత ఏమిటో ఆ పదజాలమును వాడండి (యుడిబి చూడండి).
● అది పొంగే వరకు
పిండి ముద్ద పొంగే వరకు. భావ గర్భితమైన అర్థమేమనగా పులుపు , మూడు పరిమాణముల పిండి కలిసి రొట్టె కాల్చుటకు కావలసిన విధంగా పిండి పొంగటానికి కారణమయ్యాయి. (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు.
● ఈ సంగతులన్నియు యేసు ఉపమానరీతిగా ప్రజలకు చెప్పెను; ఉపమానము లేకుండా వారికి ఏమియు చెప్పలేదు
"ఉపమానరీతిగా. చెప్పెను.. ఉపమానము .. చెప్పలేదు" అను ఈ క్రమము ఆయన వారితో ఉపమాన రీతిగా మాట్లాడెను అను మాటలను ఉద్ఘాటిస్తుంది.
● ఈ సంగతులన్నియు
ఇది 13:1 ప్రారంభములో యేసు చెప్పినదానిని సూచిస్తుంది.
● ఉపమానము లేకుండ ఆయన వారికి ఏమియు చెప్పలేదు
"ఉపమానముల ద్వారా తప్ప ఆయన వారికి ఏమియు చెప్పలేదు." ప్రత్యామ్నాయ అనువాదం: "వారికి చెప్పిన ప్రతిదానిని ఆయన ఉపమానములలో చెప్పెను" (చూడండి: అతిశయోక్తి , ఆక్షేపాలంకారము).
● ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు, అతను చెప్పిన దేమనగా
దీనిని సకర్మక క్రియారూపములో వ్రాయవచ్చు: "చాలా కాలం క్రితం వ్రాయమని ప్రవక్తలలో ఒకరిని దేవుడు చెప్పినది ఆయన నెరవేర్చెను" (యు డి బి). (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ఆయన చెప్పినప్పుడు
"ప్రవక్త చెప్పినప్పుడు"
● మరుగైన విషయములు
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చును: "దేవుడు మరుగుగా వుంచిన విషయములు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● లోకము పుట్టినది మొదలుకొని
"లోకము ప్రారంభమైనది మొదలుకొని" లేక "దేవుడు లోకమును చేసినది మొదలుకొని"
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లెను.
● ఇంటిలోనికి వెళ్లెను
"ఇంటిలోపలికి వెళ్లెను" లేక "ఆయన నివసిస్తున్న ఇంటికి వెళ్లెను"
● విత్తుచున్నవాడు
"విత్తువాడు"
● మనుష్యకుమారుడు
యేసు తనను గురించి తాను చెప్పుకొనుచున్నాడు.
● రాజ్యపు కుమారులు
"రాజ్యంనకు చెందిన ప్రజలు"
● దుష్టుని కుమారులు
"దుష్టునికి చెందిన కుమారులు"
● వాటిని విత్తిన శత్రువు
కలుపు మొక్కలను విత్తిన శతృవు.
● లోకము అంతమున
"యుగము అంతమున"
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● కాబట్టి, కలుపు మొక్కలు పోగు చేయబడి అగ్నితో కాల్చబడిన రీతిగా
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చును: "కాబట్టి, ప్రజలు కలుపు మొక్కలను పోగు చేసి వాటిని అగ్నితో కాల్చిన రీతిగా" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● లోకము అంతమున
"యుగము అంతమున"
● మనుష్యకుమారుడు తన దూతలను పంపును
యేసు ఇక్కడ తనగురించి తాను చెప్పుకొనుచున్నాడు. దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చును, "మనుష్యకుమారుడనైన నేను నా దూతలను పంపుతాను"
● అక్రమము జరిగించిన వారు
"అన్యాయము చేసిన వారు" లేక "చెడ్డ ప్రజలు"
● మండుచున్న అగ్ని గుండము
"వేడిమిగల మండుచున్న అగ్ని గుండము." అగ్ని గుండము అంటే తెలియక పోతే, "ఆవం" లేక "కొలిమి" అని వాడవచ్చు
● సూర్యుని వలె ప్రకాశించెదరు
"సూర్యుని చూచినంత తేలికగా" (చూడండి: ఉపమాలంకారము).
● చెవులు గలవాడు వినును గాక
కొన్ని భాషలలో మధ్యమ పురుష వాడటం చాలా సాధారణముగా ఉంటుంది: "చెవులు కలిగిన నీవు, విను" లేక "నీకు చెవులున్నవి, కావున విను" (చూడండి: ఉత్తమ పురుష, మధ్యమ పురుష లేక ప్రథమ పురుష).
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు. ఈ రెండు ఉపమానములలో పరలోక రాజ్యం అంటే ఏమిటో శిష్యులకు బోధించుటకు యేసు రెండు ఉపమాలంకారములను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: ఉపమాలంకారము).
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు (చూడండి: ఉపమాలంకారము).
● పొలంలో దాచబడిన ధనము
ధననిధి చాలా విలువైనది, ప్రశస్తమైనది లేక అనేక వస్తువుల సముదాయము. దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చు: "పొలంలో ఒకరు దాచుకొనిన ధననిధి" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● దానిని దాచిపెట్టి
"దానిని కప్పివేసెను"
● తనకు కలిగిన సమస్తమును అమ్మివేసి, ఆ పొలాన్ని కొనెను
భావగర్భితమైన అర్థమేమనగా ఆ వ్యక్తి అందులో దాచబడిన ధనమును తీసుకొనుటకు ఆ పొలాన్ని కొనెను. (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
● ఒక వర్తకుడు
వర్తకుడు అనగా వ్యాపారి లేక టోకు వర్తకుడు, తరచుగా దూర ప్రాంతంల నుండి సరుకును తెచ్చుకొనేవాడు.
● విలువైన ముత్యాలను కొరకు వెదకుచున్న
దాగియున్న భావమేమనగా ఆ మనిషి విలువైన ముత్యాలను కొనటము కోసము వెదకుచున్నాడు. (చూడండి: స్పష్టమైన , అస్పష్టమైన).
● విలువైన ముత్యాలు
దీనిని "మంచి ముత్యాలు" లేక "అందమైన ముత్యాలు" అని తర్జుమా చేయవచ్చును. "ముత్యము" నున్నగాను, గట్టిగాను, మెరుస్తూ, తెల్లని పూసగా లేక లేత రంగు పూసగా సముద్రములోపలి ఆల్చిప్పలలో సహజ సిద్దంగా రూపించబడుతుంది రత్నమంత విలువైనది లేక విలువైన నగల హారము చేయటానికి ఉపయోగపడుతుంది.
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు. ఈ ఉపమానములోను, పరలోక రాజ్యం అంటే ఏమిటో తన శిష్యులకు తెలియజేయుటకు యేసు మరలా ఉపమాలంకారమును వాడుతున్నాడు. (చూడండి: ఉపమాలంకారము).
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు (చూడండి: ఉపమాలంకారము).
● సముద్రములో వేయబడిన వలను పోలియున్నది
దీనిని సకర్మక క్రియా రూపములో తర్జుమా చేయవచ్చును: "సముద్రములో ఒక జాలరి విసిరిన వలను పోలియున్నది"
● సముద్రములో విసిరిన వల
"సరస్సులోనికి వేసిన ఒక వల"
● అన్నిజాతుల జీవులను పోగు చేసిన
"అన్ని రకాల చేపలను పట్టిన"
● తీరమునకు తీసుకొనిరాగా
"తీరమునొద్దకు వలను లాక్కొని వచ్చిరి" లేక "తీరమునకు వలను లాగిరి"
● మంచి వాటిని
మంచి చేపలను
● పనికిమాలినవాటిని
"చెడ్డ చేపలను" లేక "తినటానికి పనికిరాని చేపలను"
● పారవేసెను
"భధ్రము చేయలేదు."
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● లోక అంతమున
"యుగ సమాప్తినందు."
● బయటకు వచ్చి
"బయటకు వచ్చి" లేక "బయటకు వెళ్ళి" లేక "పరలోకమునుండి వచ్చి."
● వారిని పడవేయును
"చెడ్డవారిని పడవేయును."
● మండుచున్న అగ్ని గుండము
దీనిని "వేడిమిగల మండుచున్న అగ్ని గుండము" గా తర్జుమా చేయవచ్చును. పాత నిబంధన వాక్యభాగము దానియేలు 3:6లో ఉపయోగించిన పదాలను దృష్టాంతములుగా తీసుకొని పాతాళములోని అగ్నికి రూపకాలంకారముగా వాడిన మాటలు ఇవి (చూడండి: రూపకాలంకారము). అగ్ని గుండము అంటే తెలియక పోతే, "ఆవం" లేక "కొలిమి" అని వాడవచ్చు.
● అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును
"అక్కడ చెడ్డ ప్రజలు ఏడ్చుచు, తమ పండ్లు కొరుక్కొనుచూ ఉంటారు."
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● "ఈ విషయములన్నిటిని మీరు గ్రహించితిరా?" "శిష్యులు ఆయనతో "గ్రహించితిమి" అనిరి
అవసరమైతే దీనిని పరోక్ష ఉల్లేఖనము వ్రాయవచ్చు, "ఇదంతయు వారు అర్థం చేసుకున్నారా అని యేసు వారిని అడిగాడు, వారు అర్థం చేసుకున్నాము అని చెప్పారు. (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● శిష్యునిగా మారిన
"సంగతి నేర్చుకున్నాడు."
● ధన నిధి
ధననిధి చాలా విలువైనది, ప్రశస్తమైనది లేక అనేక వస్తువుల సముదాయము. ప్రశస్తమైన వస్తువులు పెట్టుకునే స్థలముగా, "ధనాగారము" లేక "నిల్వ వుంచు గది" సూచిస్తుంది.
ఇది యేసు సొంత ఊరిలోని సమాజ మందిరములో మాట్లాడుచుండగా అక్కడి ప్రజలు ఆయనను ఏ విధంగా తృణీకరించారో తెలియజేసే వృత్తాంతం.
● తన సొంత ప్రాంతం
"తన సొంత ఊరు" (యుడిబి చూడండి).
● వారి సమాజ మందిరములో
"వారి" అనే సర్వనామము ఆ ప్రాంత ప్రజలను సూచిస్తుంది.
● వారు విస్మయమొందిరి
"వారు ఆశ్చర్యపడిరి."
● ఈ అద్భుతములు
"ఈ అద్భుతములను చేయుటకు ఆయన ఎక్కడినుంచి శక్తిని పొందుకున్నాడు." (చూడండి: అధ్యారోపము).
● వడ్లవాని కుమారుడు
వడ్లవాడు అనగా కర్రతోగాని రాయితో గాని వస్తువులను చేయువాడు. మీకు వడ్లవాడు అంటే తెలియకపోతే "వడ్రంగి" అని వ్రాయండి.
ఇది యేసు సొంత ఊరిలోని సమాజ మందిరములో మాట్లాడుచుండగా అక్కడి ప్రజలు ఆయనను తృణీకరించిన విధానంను తెలియజేసే వృత్తాంతం ఇక్కడ కొనసాగుతుంది.
● ఆయన వలన వారు నొప్పించబడిరి
"యేసు సొంత ఊరు ప్రజలు ఆయన మీద కోపం తెచ్చుకొనిరి" లేక "వారాయనను అంగీకరించలేదు."
● ప్రవక్త గౌరవము లేకుండా లేడు
"ప్రవక్త ప్రతిచోట గౌరవించబడతాడు" లేక "ప్రవక్త ప్రతిచోట గౌరవమును పొందుకుంటాడు" లేక "ప్రజలు ప్రవక్తను ప్రతిచోటా గౌరవిస్తారు"
● తన సొంత గ్రామంలో
"తన సొంత ప్రాంతంలో" లేక "తన సొంత ఊరిలో."
● తన సొంత కుటుంబము
"తన సొంత ఇంటివారు"
● అక్కడ ఎక్కువ అద్భుతములను ఆయన చేయలేకపోయెను.
యేసు తన సొంత ఊరులో ఎక్కువ అద్భుతములను చేయలేకపోయెను."
14:3
12లో జరిగిన సంఘటనలు ఇక్కడ వివరించుటకు ముందే జరిగినవి.
● ఆ సమయమున
"ఆ రోజులలో" లేక "యేసు గలిలయలో పరిచర్య చేయుచున్నప్పుడు"
● చతుర్థాధిపతియైన హేరోదు
హేరోదు అంతిప, ఇశ్రాయేలులోని నాలుగవ భాగముపైన అధిపతి (చూడండి: పేరులు తర్జుమా).
● యేసును గూర్చిన వార్త విని
"యేసును గూర్చి సమాచారము విని" లేక "యేసు యొక్క కీర్తిని విని."
ఇది బాప్తీస్మమిచ్చు యోహానును హేరోదు చంపిన విధానం ఈ వాక్యభాగాలలో కొనసాగుతుంది.
● హేరోదు యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించెను
హేరోదు తన కొరకు ఈ పనులు చేయమని ఇతరులకు ఆజ్ఞాపించియుంటాడు. (చూడండి: అన్యాపదేశము).
● హేరోదు యోహానును పట్టుకొని
హేరోదు యోహానును అరెస్టు చేయించి
● "ఆమెను నీ భార్యగా ఉంచుకొనుట నీకు న్యాయము కాదు" అని యోహాను అతనితో చెప్పెను
"యోహాను అతనితో ఆమెను తన భార్యగా ఉంచుకొనుట న్యాయము కాదు అని చెప్పెను" (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● అతనితో యోహాను చెప్పెను గనుక
"హేరోదుతో యోహాను చెప్పుచునే ఉండెను గనుక" (యుడిబి చూడండి).
● ఇది న్యాయము కాదు
హేరోదియను పెండ్లిచేసుకున్నప్పటికి ఫిలిప్పు ఇంకను బ్రతికే ఉన్నాడని యు డి బి భావిస్తుంది, కాని సహోదరుని విధవరాలిని వివాహము చేసుకొనుట మోషే ధర్మశాస్త్రము కూడా నిషేధిస్తుంది.
ఇది బాప్తీస్మమిచ్చు యోహానును హేరోదు ఎలా చంపాడో తెలియజేసే వృత్తాంతం కొనసాగుతుంది.
● మధ్యలో
పుట్టిన రోజు పండుగలో పాలుపొందుటకు వచ్చిన అతిధుల మధ్యలో (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
ఇది బాప్తీస్మమిచ్చు యోహానును హేరోదు ఎలా చంపాడో తెలియజేసే వృత్తాంతం కొనసాగుతుంది.
● ఆమె తన తల్లి వలన బోధింపబడిన తరువాత
ప్రత్యామ్నాయ అనువాదం: "ఆమెకు తన తల్లి బోధించిన తరువాత" (చూడండి: సకర్మక క్రియ కర్మార్థక క్రియ).
● బోధించబడిన
"శిక్షణ పొందిన."
● దేని కొరకు అడగాలో అని
దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చు "ఏమి అడగాలోఅని" ఈ మాటలు గ్రీకు మూల భాషలో లేవు. సందర్భమును బట్టి అవి చొప్పించబడినవి. (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
● ఆమె చెప్పెను
"ఆమె" అను సర్వనామము హేరోదియ కూతురును సూచిస్తుంది.
● పళ్ళెము
పెద్ద పళ్ళెము.
● ఆమె కోరినదానికి రాజు తలక్రిందులై పోయాడు
"ఆమె కోరిక రాజును చాలా కలవరపరచింది" (చూడండి: సకర్మక క్రియ కర్మార్థక క్రియ).
● రాజు
చతుర్థాధిపతియైన హేరోదు
బాప్తీస్మమిచ్చు యోహానును హేరోదు ఎలా చంపాడో తెలియజేసే వైనము ఈ వాక్యభాగాలలో కొనసాగుతుంది.
● అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ పడుచు దానికి ఇవ్వబడింది
"ఒక వ్యక్తి అతని తలను పళ్ళెములో పెట్టి తీసుకొచ్చి దానిని ఆ పడుచుదానికి ఇచ్చెను." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● పళ్ళెము
పెద్ద పళ్ళెము
● పడుచుది
పెళ్ళిగాని యువతికి వాడే పదం వాడండి.
● అతని శిష్యులు
యోహాను శిష్యులు
● దేహం
చనిపోయిన దేహం
● వారు వెళ్లి యేసుకు చెప్పిరి
"యోహాను శిష్యులు వెళ్ళి బాప్తీస్మమిచ్చు యోహానుకు జరిగిన దానిని యేసుకు తెలియ చేసిరి." (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
బాప్తీస్మమిచ్చు యోహాను చంపబడినతరువాత యేసు ఒంటరిగా ఏకాంత స్థలమునకువెళ్ళెను.
● ఇది విని
"యోహానుకు జరిగినదానిని విని" లేక "యోహాను గూర్చిన వార్తను విని" (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
● అతను వెళ్లెను
"జనసమూహమును విడిచి వెళ్ళెను లేక దూరముగా వెళ్లెను
● అక్కడనుంచి
"ఆ స్థలమునుంచి"
● జన సమూహములు అది విని
"వారు ఎక్కడికి వెళ్ళిరో జనసమూహము తెలిసికొని" (యుడిబి చూడండి). లేక "ఆయన వెళ్ళిపోయెనని ప్రజలు తెలిసికొని"
● జనసమూహములు
"జనసమూహముల ప్రజలు" లేక "ప్రజలు"
● యేసు వారి యొద్దకు వచ్చి పెద్ద జనసమూహమును చూచి
"తీరమునకు యేసు వచ్చినప్పుడు, అతను పెద్ద జనసమూహమును చూచెను."
ఏకాంత స్థలమునకు తనను వెంబడించిన జన సమూహమునకు యేసు ఆహారము పంచిపెట్టుట.
● శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి
"యేసు" శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి"
ఏకాంత స్థలమునకు తనను వెంబడించిన జన సమూహమునకు యేసు ఆహారము పెట్టుట.
● వారికి. అవసరత లేదు
"జన సమూహమునకు .. అవసరత లేదు"
● మీరు వారికి ఇవ్వండి
"మీరు" అనే పదం బహువచనం, శిష్యులను సూచిస్తుంది. (చూడండి: "నీవు, మీరు" రూపాలు).
● వారు ఆయనతో చెప్పిరి
"శిష్యులు యేసుతో చెప్పిరి"
● ఐదు రొట్టెలు, రెండు చేపలు
"5 రొట్టెలు, 2 చేపలు" (చూడండి: సంఖ్యల తర్జుమా).
● వాటిని నా యొద్దకు తీసుకురండి
"రొట్టెలు, చేపలు నా యొద్దకు తీసుకురండి"
ఏకాంత స్థలమునకు తనను వెంబడించిన జన సమూహమునకు యేసు ఆహారము పెట్టుట.
● కూర్చొను
లేక "పరుండు." నీ సంస్కృతిలో సాధారణముగా ప్రజలు తినేటప్పుడు ఉండె స్థితిని వాడండి
● తీసికొని
"ఆయన చేతులతో పట్టుకొని." ఆయన వాటిని దొంగిలించలేదు. (చూడండి: జాతీయం).
● రొట్టెలు
"ముక్కలు చేయబడని రొట్టెలు" లేక "పూర్తి రొట్టెలు"
● చూచుచు
దీని అర్థం 1). "చూస్తున్నప్పుడైనా కావచ్చు లేక 2). చూచిన తరువాతనైనా కావచ్చు.
● వారు తీసికొని
"శిష్యులు పోగుచేసి"
● తినిన వారు
"రొట్టెలు చేపలు తినిన వారు." (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
యేసు నీటి మీద నడచుట
● వెంటనే
"ఐదు వేలమందికి యేసు ఆహారము పెట్టిన వెంటనే."
● బాగా ప్రొద్దు పోయిన తరువాత
"సాయంత్రము చాలా సమయము అయిన తరువాత" లేక "చీకటి పడినప్పుడు."
● అలలు వలన దాదాపు అదుపు తప్పిపోయింది
"అలలు పడవపైన విసరుతున్నాయి."
యేసు నీటి మీద నడచుట
● ఆయన సముద్రము మీద నడుచుచుండెను
"యేసు సముద్రము మీద నడచుచుండెను."
● వారు భయాక్రాంతులైరి
"శిష్యులు చాలా భయాక్రాంతులైరి."
● భూతము
చనిపోయిన వ్యక్తి శరీరమును విడిచిన ఆత్మ
యేసు నీటి మీద నడచుట.
● పేతురు ఆయనకు సమధానమిస్తూ
"పేతురు యేసుకు సమాధానమిస్తూ."
యేసు నీటి మీద నడచుట
● "అల్ప విశ్వాసులారా"
6:30లో దీనిని నీవు ఎలా తర్జుమా చేసావో చూడు.
● మీరెందుకు సందేహిస్తున్నారు
"మీరు సందేహం పడకుండా ఉండాల్సింది" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
ఏకాంత స్థలమునుండి తిరిగి వచ్చిన తరువాత యేసు గలిలయలో తన పరిచర్యను కొనసాగించెను.
● వారు అవతలికి వెళ్ళినప్పుడు
"యేసు ఆయన శిష్యులు సరస్సును దాటి అవతలికి వెళ్లినప్పుడు."
● గెన్నేసరెతు
గలిలయ సముద్రమున పశ్చిమోత్తరపు దిక్కున ఉన్న చిన్న పట్టణము (చూడండి: పేరులు తర్జుమా).
● వారు వర్తమానము పంపి
"ఆ ప్రాంత ప్రజలు వర్తమానములను పంపిరి."
● వారు ఆయనను వేడుకొనిరి
"రోగులు ఆయనను వేడుకొనిరి."
● వస్త్రము
"అంగీ" లేక "ఆయన ధరించుకొనినది."
మత నాయకులకు , యేసుకు మధ్య జరిగిన సంఘర్షణ ఈ వాక్యభాగములో ప్రారంభము.
● పెద్దల సంప్రదాయములను ఉల్లంఘించుట
"పెద్దలైన మత నాయకులు ఇచ్చిన నియమాలను గౌరవించటము లేదు."
● వారు చేతులు కడుగుకొనుట
"మన ధర్మశాస్త్రములో అపేక్షించబడిన రీతిగా వారు తమ చేతులు కడుగుకొనుట లేదు" (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
ఇది పరిసయ్యులు. శాస్త్రులు , యేసు మధ్యన జరిగిన సంఘర్షణను కొనసాగిస్తుంది.
● ఎవరైతే
"ఎవరైనా."
● తన తండ్రిని ఘనపరచ వలసిన
తండ్రికి సంరక్షణ నందించుట ద్వారా అతని పట్ల గౌరవము చూపుట.
● మీ సంప్రదాయాల కోసము దేవుని వాక్యాన్ని మీరు విసర్జించియున్నారు
ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు దేవుని వాక్యం కంటే ఎక్కువగా సంప్రదాయములను ఉన్నతము చేసారు"
ఇది పరిసయ్యులు. శాస్త్రులు , యేసు మధ్యన జరిగిన సంఘర్షణను కొనసాగిస్తుంది
● యెషయా సరిగానే ప్రవచించాడు
ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ ప్రవచనంలో యెషయా నిజము చెప్తున్నాడు."
● ఆయన చెప్పినప్పుడు
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు చెప్పిన దానిని అతను చెప్పినప్పుడు"
● ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరతురు
ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ ప్రజలు మంచివిషయములు చెప్తారు."
● కాని వారి హృదయంలో నాకు దూరముగా ఉన్నారు
ప్రత్యామ్నాయ అనువాదం: "కాని వారు నిజముగా నన్ను ప్రేమించరు."
● వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు
ప్రత్యామ్నాయ అనువాదం: "వారి ఆరాధన నా పైన ఎటువంటి ప్రభావము చూపదు" లేక "నన్ను ఆరాధిస్తున్నట్లుగా వారు కేవలము నటిస్తున్నారు."
● ప్రజల ఆజ్ఞలు
"ప్రజలు చేసే ఆజ్ఞలు."
యేసు ఉపమానముతో జనసమూహమునకు బోధించుట
● వినండి గ్రహించండి
చెప్పబోతున్న ప్రాముఖ్యమైన ప్రతిపాదనను యేసు వక్కాణిస్తున్నాడు.
15:11లో చెప్పిన ఉపమాన భావాన్ని యేసు శిష్యులకు వివరిస్తున్నాడు.
● ఈ ప్రతిపాదన విని పరిసయ్యులు. అభ్యంతరపడ్డారా?
ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ ప్రతిపాదన పరిసయ్యులకు కోపం పుట్టించిందా?" లేక "ఈ ప్రతిపాదన పరిసయ్యులను అభ్యంతరపరచిందా?" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
11వ వచనంలోని తాను చెప్పిన ఉపమానమును శిష్యులకు వివరించటం యేసు కొనసాగిస్తున్నాడు.
● మాకు
"శిష్యులమైన మాకు"
● పోవునది
"వెళ్ళునది"
● మరుగుదొడ్డి
ప్రజలు వ్యర్థపదార్థమును కప్పిపెట్టు స్థలమునకున్న మృదువైన మాట.
11వ వచనంలోని తాను చెప్పిన ఉపమానమును శిష్యులకు వివరించటం యేసు కొనసాగిస్తున్నాడు.
● నోటిలోనుండి వచ్చు విషయములు
"ఒక వ్యక్తి పలుకు మాటలు"
● హృదయంలోనుండి వచ్చును
"ఒక వ్యక్తి నిజమైన భావములు, ఆలోచనల జనితముగా పుట్టును."
● నరహత్య
అమాయకులైన ప్రజలను చంపుట.
● దూషణలు
ఇతరులను బాధపరిచే మాటలు.
● కడగని చేతులు
శుద్దీకరణాచారములో కడగబడని చేతులు.
కనాను స్త్రీ కుమార్తెను యేసు స్వస్థ పరచిన వృత్తాంతం ప్రారంభము.
● ఆ ప్రాంతంనుండి కనాను స్త్రీ ఒకతె వచ్చింది
ఒక స్త్రీ ఇశ్రాయేలుకు వెలుపల ఉన్న తన సొంత ఊరు విడిచి ఇశ్రాయేలు దేశమునకు వచ్చి యేసును కనుగొన్నది.
● కనాను స్త్రీ
ఒక దేశముగా కనాను ఉనికిని కొల్పోయింది: "కనాను జాతి ప్రజలకు చెందిన ఒక స్త్రీ."
● నా కుమార్తె దయ్యముచేత మిక్కిలి బాధించ బడుచున్నది
"ఒక దెయ్యము నా కుమార్తెను చాలా బాధపరుస్తుంది." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● సమాధానముగా ఒక్క మాట కుడా ఆమెకు చెప్పలేదు
"ఏమీ చెప్పలేదు."
ఈ వాక్య భాగాలలో కనాను స్త్రీ కుమార్తెను యేసు స్వస్థ పరచిన విషయము కొనసాగుతుంది.
● ఆమె వచ్చి
"కనాను స్త్రీ వచ్చి."
● చిన్నపిల్లల రొట్టె. చిన్న కుక్క పిల్లలు
"యుక్తముగా యూదులకు చెందినది.. అన్యజనులకు" (చూడండి: రూపకాలంకారము).
ఈ వాక్య భాగాలలో కనాను స్త్రీ కుమార్తెను యేసు స్వస్థ పరచిన విషయము కొనసాగుతుంది.
● చిన్న కుక్కపిల్లలు కూడా తమ యజమానుడు బల్లమీదనుండి పడిన రొట్టె తునకలు తినునుగదా
యూదులు విసిరి వేయుచున్న కొద్దిపాటి మంచి విషయములను మాత్రమే అన్యజనులు పొందుకొనగలుగుచున్నారు. (చూడండి: రూపకాలంకారము).
● ఆమె కూతురు స్వస్థత పొందింది
"యేసు ఆనమె కూతురును స్వస్థపరిచాడు" లేక "యేసు ఆమె కూతురును భాగుచేశాడు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ఆ గడియలోనే
"ఖచ్చితముగా అదే సమయమున" లేక "వెంటనే"
గలిలయలో పెద్ద జనసమూహములో ప్రజలను యేసు స్వస్థ పరచుచున్న సంఘటన ప్రారంభము.
● కుంటి, గ్రుడ్డి, మూగ, అంగహీనులు
"నడవలేని ప్రజలు, చూడలేని కొంతమంది, మాట్లాడలేనికొంతమంది, కాళ్లు చేతులు పనిచేయని మరికొంతమంది." కొన్ని ప్రాచీన ప్రతులలో ఈ మాటలు భిన్నమైన క్రమములో వ్రాయబడినవి.
● వారు వారిని యేసు పాదముల యొద్ద ఉంచిరి
"జనసమూహములు రోగులను యేసునొద్దకు తీసుకొచ్చిరి."
గలిలయలోని పెద్ద జనసమూహమునకు యేసు ఆహారము పెట్టుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● లేకుంటే వారు మూర్చిల్లిపోతారు
సాధ్యమైన అర్థాలు: 1). "భయముతో తాత్కాలికముగా వారు స్పృహ కోల్పోతారు" లేక 2). "భయముతో వారు బలహీనులైపోతారు" (చూడండి: అతిశయోక్తి).
● కూర్చొను
భోజనము చేయటానికి బల్ల లేనప్పుడు వాడుకగా ప్రజలు ఎలా ఉండి తింటారో ఆ పదాన్ని వాడు, అది కూర్చొని కావచ్చు లేక పడుకొని కావచ్చు.
గలిలయలోని పెద్ద జనసమూహమునకు యేసు ఆహారము పెట్టుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● ఆయన తీసుకొని
"యేసు తీసుకొని" 14:19లో నీవు తర్జుమా చేసిన విధంగానే తర్జుమా చేయుము.
● వాటిని. ఇచ్చెను
"రొట్టెలు చేపలు.. ఇచ్చెను."
● వారు పోగుచేసిరి
"శిష్యులు పోగు చేసిరి."
● తినిన వారు
"తినిన ప్రజలు."
● ప్రాంతం
"ఊరుకు చెందిన భాగము."
● మగదాను
కొన్నిసార్లు "మగదాల" అని పిలువబడుతుంది. (చూడంది: పేర్లు తర్జుమా).
మత నాయకులకు , యేసుకు మధ్య జరిగిన సంఘర్షణ ఈ వాక్యభాగములో ప్రారంభము.
● ఆకాశము. ఆకాశము
దేవుని యొద్దనుండి సూచక క్రియ చేయమని యూదుల నాయకులు యేసును అడుగుచున్నారు (చూడండి: రూపకాలంకారము). కాని వారికి కనబడుచున్న ఆకాశమువైపు చూడమని యేసు చెబుతున్నాడు. ఆకాశమునకు , దేవుడు నివసించు చోటునకు భిన్నమైన అర్థాలను పాఠకులు అర్థం చేసుకోగలిగితేనే ఒకటే పేరు వాడండి.
● సాయంత్రమైనప్పుడు
పగలు సూర్యుడు అస్తమించుచున్న సమయము
● అనుకూల వాతావరణము
తేటగా నిమ్మళముగా ఉల్లాసకరముగా వుండే వాతావరణము.
● ఆకాశము ఎర్రగా ఉన్నది
ఆకాశము ఎర్రని సూర్యాస్తమయముతో వెలుతురుగా ఉన్నది.
మత నాయకులకు , యేసుకు మధ్య జరిగిన సంఘర్షణ ఈ వాక్యభాగములో ప్రారంభము.
● ప్రతికూలమైన వాతావరణము
"మబ్బులు పట్టి గాలులతో కూడిన వాతావరణము"
● మందారముగా
"చీకటిగా, వానవస్తున్నట్లుగా"
● ఏ సూచక క్రియయు ఇవ్వబడదు
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మీకు ఏ సూచక క్రియయు ఇవ్వడు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ, స్పష్టమైన, అస్పష్టమైన).
మత నాయకులతో సంఘర్షణ అయిపోయిన తరువాత యేసు తన శిష్యులను హెచ్చరించుట.
● పులిసిన
చెడ్డ ఆలోచనలు, తప్పుడు బోధలు (చూడండి: రూపకాలంకారము).
● తర్కించు
"వాదించటం" లేక "వివాదము"
మత నాయకులతో సంఘర్షణ అయిపోయిన తరువాత యేసు తన శిష్యులను హెచ్చరించుట.
● ఐదు రొట్టెలు ఐదు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదియైనను లేక ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అదియైననూ మీరు గ్రహించలేదా లేక మీకు జ్ఞాపకము లేదా?
యేసు వారికి చీవాట్లు పెట్టుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: 5 రొట్టెలు 500 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపల రొట్టెలు మీరు పోగుచేసాలో మీరు గ్రహించి జ్ఞాపకము చేసుకోవలసింది! 7రొట్టెలు 4000 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపల రొట్టెలు ఎత్తిరో కూడా మీరు జ్ఞాపకము చేసుకొవాలి! (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న, సంఖ్యల తర్జుమా).
మత నాయకులతో సంఘర్షణ అయిపోయిన తరువాత యేసు తన శిష్యులను హెచ్చరించుట.
● ఐదు రొట్టెలు ఐదు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదియైనను లేక ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అదియైననూ మీరు గ్రహించలేదా లేక మీకు జ్ఞాపకము లేదా?
యేసు వారికి చీవాట్లు పెట్టుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: 5 రొట్టెలు 500 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపల రొట్టెలు మీరు పోగుచేసాలో మీరు గ్రహించి జ్ఞాపకము చేసుకోవలసింది! 7రొట్టెలు 4000 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపల రొట్టెలు ఎత్తిరో కూడా మీరు జ్ఞాపకము చేసుకొవాలి! (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న, సంఖ్యల తర్జుమా).
యేసు దేవుని కుమారుడని పేతురు గుర్తించుట.
● కాని నేను ఎవరినని మీరు చెబుతారు?
"కాని నేను మిమ్మును అడుగుచున్నాను: నేను ఎవరినని మీరు చెబుతారు?"
యేసు దేవుని కుమారుడని పేతురు గుర్తించిన దానికి యేసు స్పందన.
● సీమోను బర్ యోనా
"యోనా కుమారుడవైన సీమోను."
● రక్తమాంసములు దీనిని నీకు బయలు పరచలేదు
"నీకు దీనిని ఏ మానవుడు బయలు పరచలేదు" (చూడండి: అన్యాపదేశము).
● పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలువలేవు
సాధ్యమైన అర్థాలు: 1). "మరణ పాశములు దానిని జయించలేవు" (యుడిబి చూడండి). లేక 2). ఒక పట్టణములోనికి సైన్యము చొరబడినట్లుగా అది మరణ పాశములను పగలగొట్టివేస్తుంది (చూడండి: రూపకాలంకారము).
యేసు దేవుని కుమారుడని పేతురు ఇచ్చిన జవాబుకు యేసు స్పందన
● పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు
ఒక ఇంటిలోనికి అతిథులను సేవకుడు ఆహ్వానించిన రీతిగా ప్రజలు దేవుని ప్రజలుగా మారుటకు ద్వారము తెరచే సామర్థ్యత (చూడాండి: రూపకాలంకారము).
● భూమి మీద బంధించునది. పరలోకమందు విప్పబడును
పరలోకమందు జరిగిన రీతిగా ప్రజలు క్షమించబడ్డారని లేక ఖండించబడ్డారని వెల్లడి చేయుట (చూడండి: రూపకాలంకారము).
యేసును వెంబడించినందుకు దొరికే మూల్యమును శిష్యులకు ఆయన తెలియజేయుట ప్రారంభించెను.
● అప్పటినుంచి
తాను క్రీస్తునని ఎవరితోను చెప్పవద్దని శిష్యులకు యేసు అజ్ఞాపించిన తరువాతనుంచి, తనపట్ల దేవుని ప్రణాలికను పంచుకోవటం ప్రారంభించాడు.
● చంపబడతాడు
ప్రత్యామ్నాయ అనువాదం: "వారు ఆయనను చంపుతారు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● మూడవ దినాన తిరిగి లేస్తాడు
"మూడవ దినాన, దేవుడు ఆయనను తిరిగి జీవింపచేస్తాడు"
యేసును వెంబడించినందుకు దొరికే మూల్యమును శిష్యులకు ఆయన తెలియజేయుట కొనసాగించెను.
● నన్ను వెంబడించు
"ఒక శిష్యునిగా నాతో రా."
● తనను తాను ఉపేక్షించుకొని
"తన సొంత కోర్కెలకు అప్పగించుకోకూడదు" లేక "తన సొంత కోర్కెలను మరచిపోవాలి."
● తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడించాలి
"తన సిలువను ఎత్తికొని, మోస్తూ, నా వెనుక నడవాలి," క్రీస్తు శ్రమ పడి చనిపోయిన రీతిగా శ్రమ పడి చనిపోవుటకు సిద్ద పడాలి" (చూడండి: రూపకాలంకారము).
● ఎవరైనా కావాలనుకుంటే
"కావాలి అనుకునే ఎవరైనా."
● అతడు లోకమంతయు సంపాదించుకొని
"లోకములో ఉన్నదంతయు సంపాదించుకొని."
● తన ప్రాణమును పోగొట్టుకుంటే
"తనకు తాను నాశనము చేసుకుంటే లేక తానే నాశనమైపోతే."
యేసును వెంబడించినందుకు దొరికే మూల్యమును శిష్యులకు ఆయన తెలియజేయుట కొనసాగించెను.
● మనుష్యకుమారుడు తన రాజ్యంతో కూడా వచ్చుట చూచువరకు మరణమును రుచి చూడరు
"వారు చనిపోక మునుపు మనుష్యకుమారుడు తన రాజ్యంతో కూడా వచ్చుట చూస్తారు"
● మరణమును రుచి చూడరు
"మరణమును అనుభవించరు" లేక "మరణించరు."
● మనుష్యకుమారుడు తన రాజ్యంతో వచ్చుట
"నా రాజ్యంతో నేను వచ్చుట వారు చూచువరకు" (చూడండి: ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష వాచకములు).
యేసు తన ముగ్గురు శిష్యులకు తన మహిమను చూపించుట
● పేతురు యాకోబు అతని సహోదరుడైన యోహాను
"పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను"
● ఆయన రూపాంతరము చెందెను
"యేసు యొక్క రూపమును దేవుడు పూర్తిగా మార్చివేసెను" లేక (చూడండి: సకర్మక క్రియ లేక "కర్మార్థక క్రియ).
● వస్త్రములు
"బట్టలు."
● వెలుగంతటి ప్రకాశముగా ఆయెను
"వెలుగువలె తళతళ ప్రకాశించెను" (చూడండి: ఉపమాలంకారము).
యేసు తన ముగ్గురు శిష్యులకు తన మహిమను చూపించిన వృత్తాంతం కొనసాగింపు.
● ఇదిగో
చెప్పబోవుచున్న ఆశ్చర్యకరమైన సంగతిని సావధానంగా వినుటకు ఈ మాట మనలను అప్రమత్తం చేస్తుంది.
● వారికి
యేసుతో ఉన్న శిష్యులకు.
● సమాధానమిచ్చి చెప్పినదేమనగా
"చెప్పెను." పేతురు ఇక్కడ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు
● మనము ఇక్కడ ఉండుట మంచిది
సాధ్యమైన అర్థాలు: 1). "నీతోను, మోషేతోను, ఏలియాతోను శిష్యులమైన మేము ఉండుట మంచిది" లేక 2). "నీవు, మోషే, ఏలియా, శిష్యులమైన మేము అందరము ఇక్కడ ఉండుట మంచిది." (చూడండి: ప్రత్యేకం).
● గుడారములు
సాధ్యమైన అర్థాలు: 1). ప్రజలు వచ్చి ఆరాధించుటకు స్థలములు (యుడిబి చూడండి). లేక 2). ప్రజలు నిద్రపోవటానికి తాత్కాలిక స్థలములు
యేసు తన ముగ్గురు శిష్యులకు తన మహిమను చూపించిన వృత్తాంతం కొనసాగింపు.
● ఇదిగో
చెప్పబోవుచున్న ఆశ్చర్యకరమైన సంగతిని సావధానంగా గ్రహించుట్లు చదువుచున్నవారిని ఈ మాట అప్రమత్తం చేస్తుంది.
● వారి తమ ముఖములను నేలకు పెట్టుకొని పడిరి
"శిష్యులు తమ ముఖములను నేల మీద మోపి బోర్ల పడిరి."
యేసు తన ముగ్గురు శిష్యులకు తన మహిమను చూపించిన వైనము కొనసాగింపు.
● వారు అలా
"యేసు ఆయన శిష్యులు అలా."
యేసు తన ముగ్గురు శిష్యులకు తన మహిమను చూపించిన వైనము కొనసాగింపు. 17:10లోని ప్రశ్నకు యేసు జవాబునిస్తున్నాడు.
● అన్ని సంగతులు పునరుద్ధరించుట
"విషయములను క్రమములో పెట్టుట."
● వారు. తమకు..వారు
సాధ్యమైన అర్థాలు 1). యూదుల నాయకులు (యుడిబి చూడండి). లేక 2). యూదా ప్రజలందరూ
దురాత్మ పట్టిన ఒక బాలుని యేసు స్వస్థ పరచిన వైనము ఈ వాక్యభాగములో ప్రారంభమౌతుంది.
● మూర్ఛరోగి
కొన్నిసార్లు అపస్మారక స్థితిలోనికి వెళ్లి గిలగిలాడుతూ ఉంటాడు.
దురాత్మ పట్టిన ఒక బాలుని యేసు స్వస్థ పరచిన వైనము ఈ వాక్యభాగములో ప్రారంభమౌతుంది.
● ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను? ఎంతకాలం నేను మిమ్ములను సహించాలి?
ప్రజలతో యేసు సంతోషముగా లేడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను మీతో ఉండటానికి విసిగిపోయాను. మీ అవిశ్వాసం వలన అవినీతి వలన నేను విసిగిపోయాను!" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
దురాత్మ పట్టిన ఒక బాలుని యేసు స్వస్థ పరచుట ఈ వాక్యభాగములో ప్రారంభమౌతుంది.
● మేము
మాట్లాడుచున్నవారు, కాని వినుచున్నవారు కాదు (చూడండి: అంతర్‌గ్రాహ్యము).
● వదిలించెను
"దయ్యము బయటకు వచ్చునట్లు చేసెను"
● మీరు చేయటానికి ఏదియు ఆసాధ్యము కాదు
"మీరు దేనినైనా చేయగలుగుతారు" (చూడండి: ఆక్షేపాలంకారము).
గలిలయలో యేసు తన శిష్యులకు బోధించుట కొనసాగించెను.
● వారు నిలిచిరి
"శిష్యులు, యేసు అక్కడ ఉన్నారు"
● మనుష్యకుమారుడు అప్పగింపబడును
ప్రత్యామ్నాయ అనువాదం: "మనుష్యకుమారుని ఒకరు అప్పగింపబోతున్నారు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● వారు ఆయనను చంపుతారు
"అధికారులు మనుష్యకుమారుని చంపుతారు."
● ఆయన తిరిగి లేస్తాడు
దేవుడు ఆయనను తిరిగి లేపుతాడు" లేక "ఆయన తిరిగి జీవిస్తాడు." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
యేసు దేవాలయపు పన్ను కట్టుట ఈ వాక్య భాగములో ప్రారంభమౌతుంది
● అప్పుడు వారు
అప్పుడు యేసు ఆయన శిష్యులు
● అర షెకెలు పన్ను
యూదా పురుషులందరూ ప్రభువుకు కానుకగా మొదట ఇచ్చిన పన్ను (చూడండి: బైబిలు డబ్బు).
● ఇల్లు
యేసు నివసిస్తున్న స్థలము.
● భూరాజులు
అధికారులు.
● పాలితులు
నాయకుని క్రింద లేక రాజు క్రింద వుండే ప్రజలు
యేసు దేవాలయపు పన్ను కట్టుట ఈ వాక్య భాగములో ప్రారంభమౌతుంది.
● పాలితులు
నాయకుని క్రింద లేక రాజు క్రింద వుండే ప్రజలు
● దాని నోటిలో
"చేప నోటిలో."
● దానిని తీసుకో
"షెకెలు తీసుకో."
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుట.
● చిన్న పిల్లల వలె అయితేనే
"చిన్న పిల్లలు ఆలోచించినట్లు ఆలోచించితేనే" (చూడండి: ఉపమాలంకారము).
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● ఈ చిన్న పిల్లవానివలె ఎవరు తనను తాను తగ్గించుకుంటారో
"ఈ చిన్న పిల్లవాడు తగ్గించుకొనిన రీతిగా ఎవరు తనను తాను తగ్గించుకుంటాడో" (చూడండి: ఉపమాలంకారము).
● తన మెడకు గొప్ప తిరుగటి రాయి వ్రేలాడదీసి, అతను సముద్రపు అగాధములో పడవేయబడుట
"వారు అతని మెడ చుట్టు తిరుగటి రాయి పెట్టి అగాధ సముద్రములో త్రోసి వేసిన" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● తిరుగటి రాయి
పెద్దగా, బరువుగా ఉండే రాయి. చక్రములా గుండ్రముగా ఉండి, గోదుమలను పిండిగా విసరటానికి అనువుగా ఉండే తిరుగలి రాయి. ప్రత్యామ్నాయ అనువాదం: "బరువైన రాయి"
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● నీ చేయి
వినువారందరిని ఒక వ్యక్తిగా సంబోధిస్తూ యేసు వారితో మాట్లాడుతున్నాడు.
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● దానిని పెరికి వేసి, అవతల పారవేయి
, ఎంతటి కష్టమైనా అవిశ్వాసంలోనున్న తీవ్రతను తొలగించవలసిన అవసరతను ఈ పదబంధము తెలియజేస్తుంది.
● జీవములోనికి ప్రవేశించుట
"నిత్యజీవములోనికి ప్రవేశించుట"
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● తృణీకరించు
"బలముగా అసహ్యించు" లేక "ప్రాముఖ్యత లేనిదిగా ఆలోచించు"
● వారి దూతలు
"చిన్నపిల్లల దూతలు"
● ఎల్లప్పుడు. యొక్క ముఖమును చూచు
"ఎల్లప్పుడు దగ్గరగా ఉండు"
శిష్యులకు మాదిరిని చూపించుటకు యేసు ఒక చిన్నపిల్లవానిని ఉపయోగించుటను కొనసాగించుట.
● మీరేమి ఆలోచిస్తారు?
ప్రజలు ఏమి చేస్తారో అలోచించండి. (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● విడిచిపెట్టి. వెదకుటకు వెళ్ళడా?
"ఎప్పుడైనా అతడు విడిచి పెడతాడు., వెదకటానికి వెళతాడు."
● తొంబది తొమ్మిది
"99"
● చిన్నవారిలో ఒకరైననూ నశించిపోవుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు
"ఈ చిన్నవారందరూ బ్రతకాలని మీ పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు" (చూడండి: ఆక్షేపాలంకారము).
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించటం యేసు ప్రారంభించెను.
● నీ సహోదరుని నీవు సంపాదించుకొంటివి
"మరలా నీ సహోదరునితో నీ సహవాసము మంచిగా కట్టుకుంటావు"
● నోటి ద్వారా
సాక్షుల "నోటి నుండి వచ్చు" మాటల ద్వారా (చూడండి: జాతీయం).
మారుమనస్సు క్షమాపణను గూర్చి బోధించుట యేసు కొనసాగిస్తున్నాడు.
● వారు చెప్పేది వినుటకు
సాక్షులు చెప్పేది వినుటకు (18:16).
● అతని మీకు అన్యునిగాను సుంకము వసూలు చేయువానిగాను ఉండనిమ్ము
"అన్యునితోను సుంకము వసూలు చేయువానితోను వ్యవహిరించినట్లు అతనితో వ్యవహరించండి"
మారుమనస్సు క్షమాపణను గూర్చి తన శిష్యులకు బోధించుట యేసు కొనసాగిస్తున్నాడు.
● బంధించినవి. బంధించబడును.. విప్పినవి.. విప్పబడును
16:19లో ఈ మాటలను నీవు ఎలా తర్జుమా చేసావో చూడు.
● బంధింపబడును. విప్పబడును
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు బంధిస్తాడు.. దేవుడు విప్పుతాడు." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● వారు. వారికి
"ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ" లేక "కనీసం ఇద్దరు"
● కూడిన
"కలిసి"
మారుమనస్సు క్షమాపణను గూర్చి బోధించుట యేసు కొనసాగిస్తున్నాడు.
● ఏడుమారులు
"7 మారులు" (చూడండి: సంఖ్యల తర్జుమా).
● డెబ్బది ఏడు మారులు
సాధ్యమైన అర్థాలు: 1). "70 మారులు 7" (యు ఎల్ బి). లేక 2). 77 మార్లు (యు ఎల్ బి). సంఖ్యను వాడటం తికమకగా ఉంటే, నీవు లెక్కపెట్టగలిగిన దానికంటే ఎక్కువ మారులు అని చెప్పవచ్చు. (యు ఎల్ బి, అతిశయోక్తి చూడండి).
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించుటకు యేసు ఉపమానమును వాడుచున్నాడు.
● ఒక సేవకుడు తీసుకొని రాబడ్డాడు
ప్రత్యామ్నాయ అనువాదం: "రాజు సేవకులలో ఒకనిని ఎవరో తీసుకొని వచ్చారు (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● పదివేల తలాంతులు
"10,000 తలాంతులు" లేక "సేవకుడు తిరిగి చెల్లించలేనంత డబ్బు" (చూడండి: బైబిలు ద్రవ్యం).
● తనతో పాటు. అమ్ముకొని అప్పు తీర్చుమని యజమానుడు ఆజ్ఞాపించెను. ఆ మనిషిని అమ్మివేసి, అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పు డబ్బులు కట్టమని రాజు తన సేవకులకు ఆజ్ఞాపించెను."
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించుటకు యేసు ఉపమానమును వాడుచున్నాడు.
● పడి, తల వంచి
"తన మోకాళ్ళ మీద పడి, తన తలను క్రిందికి వంచి"
● ఆయన ఎదుట
"రాజు ఎదుట."
● విడిచి పెట్టెను
"అతనిని పోనిచ్చెను."
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించుటకు యేసు ఉపమానమును వాడుచున్నాడు.
● వంద దేనారములు
"100 దేనారములు" లేక "వంద రోజుల కూలి." (చూడండి: బైబిలు ద్రవ్యం).
● లాగి
"గట్టిగా పట్టుకొని" లేక "గుంజి" (యుడిబి).
● పడి. నా మీద దయ ఉంచుము, నేను నీకు తిరిగి చెల్లించెదను
"పడి..నా మీద దయ ఉంచుము, నేను నీకు తిరిగి చెల్లించెదను " అని 18:26లో నీవు తర్జుమా చేసిన విధంగానే దీనిని తర్జుమా చేయుము. (చూడండి: నిందాస్తుతి).
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించుటకు యేసు ఉపమానమును వాడుచున్నాడు.
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించుటకు యేసు ఉపమానమును వాడుచున్నాడు.
● అప్పుడు ఆ సేవకుని యజమానుడు అతనిని పిలిచి
"రాజు ఆ మొదటి సేవకుని పిలిచెను"
● నీవును. చూపవద్దా?
"నీవు. చూపాలి" (చూడండి: ఆక్షేపాలంకారము).
మారుమనస్సు , క్షమాపణ గురించి బోధించుటకు యేసు ఉపమానమును వాడుచున్నాడు.
యేసు గలిలయ విడిచి వెళ్లి యూదయలో బోధించుట ప్రారంభించెను.
● తరువాత జరిగినదేమనగా
మీ భాషలో క్రొత్త కథను ప్రారంభించే విధానం ఏదైనా ఉంటే దానిని ఇక్కడ వాడవచ్చు.
● ఈ మాటలు
అనగా 18:1
35లో చెప్పిన మాటలు
● బయలు దేరెను
"నడిచి వెళ్ళెను" లేక "విడిచెను"
● సరిహద్దులలోనికి
"ప్రాంతంలోనికి"
వివాహము విడాకులు గురించి బోధించటం యేసు ప్రారంభించెను.
● ఆయన యొద్దకు వచ్చి
"యేసునొద్దకు వచ్చి"
●. మీరు చదువలేదా?
పరిసయ్యులు. సిగ్గుపడాలని యేసు అనుకున్నాడు. (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
వివాహము విడాకులు గురించి యేసు బోధించటం కొనసాగించెను.
●, ఆయన ఈ మాటలు కూడా చెప్పెను...?
19:3 నుండి ఈ ప్రశ్న కొనసాగుతుంది: "మీరు చదువలేదా...?" (చూడండి: అధ్యారోపము).
● తన భార్యను హత్తుకొనవలెను
"తన భార్యతో దగ్గరగా ఉండాలి"
● ఏక శరీరము
"ఒకే వ్యక్తి" (చూడండి: రూపకాలంకారము).
వివాహము విడాకులు గురించి యేసు బోధించటం కొనసాగించెను.
● వారు ఆయనతో చెప్పిరి
"పరిసయ్యులు. యేసుతో చెప్పిరి"
● మనకు ఆజ్ఞాపించెను
"యూదులమైన మనకు ఆజ్ఞాపించెను"
● విడాకుల పత్రము
వివాహము న్యాయబద్దముగా కొట్టివేయబడిందని తెలియజేయు పత్రము.
● మొదటినుంచి ఆ విధానంలో లేదు
"దేవుడు పురుషుని స్త్రీని సృజించినప్పుడు వారు ఎప్పుడైనా విడాకులు తీసుకోవాలని ఆయన ఆలోచన చేయలేదు."
● వ్యభిచార కారణమును బట్టి తప్ప
"లైంగిక అపనమ్మకత్వమును బట్టి తప్ప."
● విడువబడినదానిని వివాహము చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు
అనేకమైన ప్రాచీన ప్రతులలో ఈ మాటలు లేవు"
వివాహము విడాకులు గురించి యేసు బోధించటం కొనసాగించెను.
● తల్లి గర్భమునుండి పుట్టిన నపుంసకులు
"ప్రత్యుత్పత్తి జననేంద్రియాలు పనిచేయకుండా పుట్టిన పురుషులు"
● తమను తాము నపుంసకులు చేసుకొనిన నపుంసకులు
సాధ్యమైన అర్థాలు ఏవనగా 1). "తమ జననేంద్రియములను కత్తిరించుకున్న నపుంసకులు" లేక 2). "పెళ్లి చేసుకోకుండా లైంగికముగా పవిత్రముగా ఉండాలని నిర్ణయించుకున్న పురుషులు" (చూడండి: రూపకాలంకారము).
● పరలోక రాజ్యం నిమిత్తము
"దేవుని శ్రేష్ఠతరముగా సేవించగలుగునట్లు."
● ఈ మాటలు స్వీకరించుటకు. స్వీకరించును గాక
19:11లో "ఈ మాటలను అంగీకరించరు.. అంగీకరించుటకు" అనే వాక్యం ఎలా తర్జుమా చేసినావో చూడు.
యేసునొద్దకు ప్రజలు చిన్నపిల్లలను తీసుకొచ్చిరి.
● కొంతమంది చిన్నపిల్లలు ఆయన యొద్దకు తీసుకొని రాబడిరి
ప్రత్యామ్నాయ అనువాదం: "కొంతమంది ప్రజలు చిన్నపిల్లలను యేసు నొద్దకు తీసుకొని వచ్చిరి." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● అనుమతి
"సమ్మతి."
● నాయొద్దకు వచ్చుటకు వారిని ఆటంక పరచవద్దు
"నాయొద్దకు రాకుండా వారిని ఆపవద్దు."
● అలాంటి వారిదే పరలోక రాజ్యం చెందుతుంది
"వీరిలా ఉన్నవారికి పరలోక రాజ్యం చెందుతుంది" లేక "ఈ చిన్నపిల్లలవలె ఉండే ప్రజలు మాత్రమే పరలోక రాజ్యం వెళ్లగలరు."
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడటం ప్రారంభించెను.
● ఇదిగో
రచయిత ఒక క్రొత్త వ్యక్తిని కథలోనికి తీసుకొస్తున్నాడు. ఇలా వ్యక్త పరచే విధానం నీ భాషలో ఉండవచ్చు.
● మంచి విషయము
దేవుని సంతోష పరచే విషయము
● ఒక్కడే మంచివాడు
"దేవుడు మాత్రమే సంపూర్ణముగా మంచివాడు."
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడుట కొనసాగించెను.
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడుట కొనసాగించెను.
● అభిలాష
"కోరిక."
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడుట కొనసాగించెను.
● ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, సూది బెజ్జముగుండా ఒంటె వెళ్లుట సులభము
దేవుని రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట చాలా కష్టము. (చూడండి: అతిశయోక్తి).
● సూది బెజ్జము
సూదికి ఒక ప్రక్కన దారము ఎక్కించుటకు ఉండే రంద్రము.
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడుట కొనసాగించెను.
● వారు చాలా ఆశ్చర్యపడిరి
"శిష్యులు ఆశ్చర్యపడిరి."
● అప్పుడు ఎవరు రక్షణ పొందగలరు?
సాధ్యమైన అర్థాలు: 1). వారు జవాబు కోసం చూస్తున్నారు లేక 2). ప్రత్యామ్నాయ అనువాదం: అప్పుడు ఎవరూ రక్షణ పొందలేరు!" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● మేము సమస్తమును విడిచిపెట్టి
"మాకున్న ధనమంతయు విడిచిపెట్టితిమి" లేక "మాకున్న ఆస్తులన్నియు విడిచిపెట్టితిమి."
● కావున మాకేమి కలుగుతుంది
"ఏ మంచి విషయములను దేవుడు మాకు ఇస్తాడు."
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడుట కొనసాగించెను.
● క్రొత్త జన్మనందు
"సమస్తమును నూతనము చేయబడిన సమయమున" లేక "క్రొత్త యుగములో."
● పండ్రెండు సింహాసనములపైన కూర్చుండి, తీర్పు తీర్చుదురు
"ఇతరులుపైన రాజులుగాను న్యాయాధిపతులుగాను ఉంటారు" (చూడండి: అన్యాపదేశము).
లోకములో ఉన్న భాగ్యములు పరలోకములో ఉన్న బహుమానములు గురించి యేసు మాట్లాడుట కొనసాగించెను.
● నూరంతలు పొందుతారు
"వారు వదులుకొనిన విషయములకు నూరంతల మంచివిషయములను పొందుతారు."
● మొదటివారు అనేకులు చివరివారు అవుతారు
లోకము దృష్టిలో మొదటివారు అనుకున్న అనేకమంది, అనగా ధనవంతులు, ఇతరులను పాలించువారు మొదలగువారు ఒకదినాన దేవుని రాజ్యంలో చివరివారు అవుతారు.
ఒక మనిషి తన పనివారికి కూలి ఇస్తున్న ఉపమానమును యేసు తన శిష్యులతో చెప్పుట ప్రారంభించెను.
● పరలోక రాజ్యం తోట యజమానిని పోలియున్నది
తోట యజమాని తన పొలంలో ప్రవర్తించిన రీతిగా సమస్తమును దేవుడు పరిపాలిస్తాడు. (చూడండి: ఉపమాలంకారము).
● పరలోక రాజ్యం పోలియున్నది
13:24లో నీవు ఎలా తర్జుమా చేసావో చూడు
● అతను ఒప్పుకొనిన తరువాత
"తోట యజమాని ఒప్పుకొనిన తరువాత"
● ఒక దేనారము
ఒక దినం కూలి (చూడండి: బైబిలు డబ్బు).
తోట యజమాని తన పనివారికి కూలి చెల్లిస్తున్న ఉపమానము యేసు కొనసాగిస్తున్నాడు.
● మరలా అతను వెళ్లి
"తోట యజమాని మరలా వెళ్ళి"
● పనిలేకుండా ఊరకనే నిలుచున్న
"ఏమీ చేయకుండా" లేక "పనిలేని వారు"
తోట యజమాని తన పనివారికి కూలి చెల్లిస్తున్న ఉపమానము యేసు కొనసాగిస్తున్నాడు.
● మరలా అతను వెళ్లి
"తోట యజమాని మరలా వెళ్ళి"
● పనిలేకుండా ఊరకనే నిలుచున్న
"ఏమీ చేయకుండా" లేక "ఏ పనిలేని వారు"
తోట యజమాని తన పనివారికి కూలి చెల్లిస్తున్న ఉపమానము యేసు కొనసాగిస్తున్నాడు.
● వారిలో ఒక్కొక్కరికి
"పదకొండవ గడియలో పని ప్రారంభించిన పనివారిలో ప్రతి ఒక్కనికి "
● ఒక దేనారము
"ఒక దినం కూలి" (చూడండి: బైబిలు డబ్బు).
● వారు అనుకున్నారు
"ఎక్కువ సమయము పని చేసిన పనివారు అనుకున్నారు"
తోట యజమాని తన పనివారికి కూలి చెల్లిస్తున్న ఉపమానము యేసు కొనసాగిస్తున్నాడు.
● వారు పొందుకొనినప్పుడు
"ఎక్కువ సమయము పనిచేసిన పనివారు పొందినప్పుడు"
● సొత్తుదారుడు
"తోట యజమాని" లేక "ద్రాక్షతోట యజమాని"
● మేము దిన భారము మోసి ఎండకు ఎండితిమి
"మేము దినమంతయు ఎండలో పనిచేసితిమి."
తోట యజమాని తన పనివారికి కూలి చెల్లిస్తున్న ఉపమానము యేసు కొనసాగిస్తున్నాడు.
● వారిలో ఒకడు
"ఎక్కువ సమయము పనిచేసిన వారిలో ఒకడు"
● స్నేహితుడా
ఒకడు సావధానముగా మరొకని గద్దించుటకు తగిన పదాన్ని ఉపయోగించండి.
● నీవు నాతో ఒక దేనారమునకు ఒప్పుకోలేదా?
ప్రత్యామ్నాయ అనువాదం: "నీకు ఒక దేనారమే ఇవ్వటానికి మనము ఒప్పుకొన్నాము" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● ఒక దేనారము
"ఒక దినం కూలి" (చూడండి: బైబిలు డబ్బు).
● మీకు ఇచ్చుట నా సంతోషము
"ఇచ్చుట నన్ను సంతోష పరచింది" లేక "ఇవ్వటానికి నేను సంతోషిస్తున్నాను."
తోట యజమాని తన పనివారికి కూలి చెల్లిస్తున్న ఉపమానము యేసు కొనసాగిస్తున్నాడు.
● నా సొంత ధనములోనుండి నా ఇష్టం వచ్చినట్లు ఇచ్చుటకు నాకు న్యాయము కాదా? ప్రత్యామ్నాయ అనువాదం: "నా డబ్బులతో నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● న్యాయము
"చట్టబద్దము" లేక "సకారణము" లేక "హక్కు"
● లేక నేను మంచివానినైనందుకు నీ కన్ను చెడినదా?
"ఇంకనూ సంపాదన లేని ప్రజలకు నేను మంచి చేసినందున నీవు సంతోషము లేనివానివిగా ఉండకూడదు."
యేసు శిష్యులతో కూడ యెరూషలేమునకు వెళ్లుచుండగా వారితో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.
● మనము వెళ్లుచున్నాము
శిష్యులతో యేసు కూడా ఉన్నాడు. (చూడండి: అంతర్గ్రాహ్యము).
● మనుష్యకుమారుడు అప్పగింపబడును
ప్రత్యామ్నాయ అనువాదం: "ఒకరు మనుష్యకుమారుని అప్పగిస్తారు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● వారు శిక్ష విధించి. అపహాస్యము చేయుటకు అన్యులకు అప్పగిస్తారు
ప్రధాన యాజకులు శాస్త్రులు శిక్ష విధించి ఆయనను అన్యులకు అప్పగిస్తారు, అన్యులు అపహాస్యము చేస్తారు.
● ఆయన తిరిగి లేస్తాడు
ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు ఆయనను లేపుతాడు" (చూడండి: సకర్మక క్రియ లేక్ కర్మార్థక క్రియ).
ఇద్దరు శిష్యుల తల్లి యేసుకు మనవి చేసుకున్నది.
● నీ కుడిచేయి. నీ ఎడమ చేయి
అధికార స్థానములలో (చూడండి: అన్యాపదేశము).
ఇద్దరు శిష్యుల తల్లికి యేసు సమాధానమిచ్చుట.
● మీరు
తల్లి, ఇద్దరు శిష్యులు (చూడండి: "నీవు”, "మీరు" రూపాలు
ద్వి వచనం/బహువచనం).
●. గలరా?
.”. మీకు సాధ్యమేనా?" యేసు కుమారులతో మాత్రమే మాట్లాడుతున్నాడు.
● నేను త్రాగబోయే పాత్రలోనిది మీరు త్రాగ.
"నేను వెళ్లబోవుచున్న శ్రమల గుండా వెళ్లుట" (చూడండి: జాతీయం).
● వారు
కుమారులు.
● నా తండ్రి వలన అది ఎవరికి సిద్దపరచబడెనో వారికే అది
"నా తండ్రి ఎవరికి ఆ యోగ్యతను సిద్దపరచాడో వారికే నా ప్రక్కన కూర్చుండే యోగ్యత ఉంటుంది" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● సిద్దపరచబడి
సిద్దము చేయబడి.
తల్లికి చెప్పినదానిని శిష్యులకు బోధించుటకు యేసు ఉపయోగించాడు.
● అన్యజనుల నాయకులు వారిని లోబరుచుకుంటారు
"అన్యజనుల రాజులు తమకు కావలసిన దానిని చేయుటకు అన్యజనులను బలవంతము చేస్తారు."
● వారిలో ముఖ్యులైన వారు
నాయకులు అధికారము ఇచ్చిన మనుష్యులు.
● వారిమీద అధికారము చెలాయిస్తారు
"వారిని తమ స్వాధీనములో ఉంచుకుంటారు."
● అభిలాషలు
"వాంఛలు" లేక "కోరికలు."
● తన ప్రాణము పెట్టుటకు
"చనిపోవుటకు సమ్మతిగలిగి."
ఇద్దరు గ్రుడ్డివారిని యేసు స్వస్థపరచిన వైనం ఈ వాక్యభాగాలలో ప్రారంభమౌతుంది.
● వారు బయలు వెళ్లగా
ఇది శిష్యులు, యేసును గూర్చి మాట్లాడుచున్నది.
● ఆయనను వెంబడించిరి
"యేసును వెంబడించిరి."
● ఇదిగో
చెప్పబోవుచున్న అశ్చర్యకరమైన సంగతిపైన మనస్సు పెట్టమని రచయిత తెలియ జేస్తున్నాడు. ఇలా వ్యక్త పరచే విధానం మీ భాషలో ఊండవచ్చు.
● వెళ్ళుచుండగా
"వారితో నడుచుచుండగా."
● వారు అంతకంటే బిగ్గరగా కేకలు వేసిరి
"గ్రుడ్డివారు ముందు కేకవేసిన దానికంటే బిగ్గరగా కేకలు వేసిరి" లేక "వారు బిగ్గరగా కేకలు వేసిరి."
ఇద్దరు గ్రుడ్డివారిని యేసు స్వస్థపరచిన వైనం ఈ వాక్యభాగాలలో కొనసాగుతుంది.
● వారిని పిలిచెను
గ్రుడ్డివారిని పిలిచెను.
● అభిలాష
కోరిక.
● మా కన్నులు తెరవబడాలని
ప్రత్యామ్నాయ అనువాదం: "నీవు మమ్ములను చూచునట్లు చేయాలని కోరుకుంటున్నాము" లేక "మేము చూడగలగాలని కోరుకుంటున్నాము." (చూడండి: జాతీయం, అధ్యారోపము).
● కనికరముతో కదిలింపబడి
"కనికరము కలిగి" లేక "వారి పట్ల కనికరముతో కదిలింపబడి."
యేసు తన శిష్యులతో కలిసి యెరూషలేమునకు తన ప్రయాణమును కొనసాగించుట.
● బేత్పగే
ఒక గ్రామం (చూడండి: పేర్లు తర్జుమా).
● గాడిద పిల్ల
"మగ గాడిద పిల్ల."
యెరూషలేమునకు యేసు గాడిద మీద వెళ్లుటను ఈ వాక్యభాగము కొనసాగిస్తుంది.
● ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను
"ఇలా జరుగుతుందని దేవుడు తన ప్రవక్త ద్వారా అనేక సంవత్సరాల క్రితం తెలియజేసెను" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ప్రవక్తద్వారా చెప్పబడినది
"ఇది జరుగక ముందే ప్రవక్త చెప్పినది" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● సీయోను కుమారీ
ఇశ్రాయేలు (చూడండి: ఉపలక్షణము).
● గాడిద
పేద ప్రజలు సవారీ చేయు జంతువు.
● గాడిద పిల్ల
"మగ గాడిద పిల్ల."
యెరూషలేమునకు యేసు గాడిద మీద వెళ్లుటను ఈ వాక్యభాగము కొనసాగిస్తుంది.
● వస్త్రములు
పైవస్త్రములు లేక పొడవాటి వస్త్రములు.
● యేసు దాని మీద కూర్చుండెను
"గాడిద మీద వేయబడిన వస్త్రముల పైన యేసు కూర్చుండెను."
యెరూషలేమునకు యేసు గాడిద మీద వెళ్లుటను ఈ వాక్యభాగము కొనసాగిస్తుంది.
● హోసన్నా
"రక్షించు" అని అర్థం ఇచ్చే హీబ్రూ పదం; కాని ఇక్కడ "దేవునికి స్తోత్రము" అనే అర్థం నిస్తుంది!"
● పట్టణమంతయు కదిలెను
పట్టణములో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనను చూడటానికి ఉత్తేజింపబడ్డారు.
దేవాలయములోనికి యేసు ప్రవేశించుటను ఈ వృత్తాంతం ప్రారంభిస్తుంది.
● ఆయన వారితో చెప్పెను
"యేసు అక్కడ రూకలు మార్చుతూ వస్తువులు అమ్ముచూ కొనుచూ ఉన్నవారితో చెప్పెను."
● ప్రార్థనా గృహము
"ప్రజలు ప్రార్థన చేయు స్థలము."
● దొంగల గుహ
"దొంగలు దాగుకొను గుహ వలె." (చూడండి: రూపకాలంకారము).
● కుంటివారు
నడవలేనివారు లేక కాలు సరిగా లేనివారు
యేసు దేవాలయములో ఉన్న వృత్తాంతంను ఈ వాక్యభాగము తెలియజేస్తుంది.
● హోసన్నా
21:09లో ఎలా తర్జుమా చేసావో చూడు.
● దావీదు కుమారుడు
21:09లో ఎలా తర్జుమా చేసావో చూడు
● వారు ఆగ్రహముతో ఊగిపోయారు
"వారు యేసును అయిష్టపడి కోపం తెచ్చుకున్నారు"
● ఈ ప్రజలు చెప్పుచున్నదానిని నీవు వినుచున్నావా?
"నీ గురించి ఈ సంగతులు చెప్పుటకు ప్రజలను నీవు అనుమతించకూడదు" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● మీరు ఎప్పుడూ చదువలేదా
"అవును, నేను వింటున్నాను, కాని లేఖనములలో మీరు చదువుచున్నదానిని జ్ఞాపకము చేసుకోవాలి" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● యేసు వారిని విడిచి వెళ్లెను
"యేసు ప్రధాన యాజకులను, శాస్త్రులను విడిచి వెళ్లెను."
అంజూరపు చెట్టును యేసు శపించుట ఈ వాక్యభాగములో ప్రారంభమౌతుంది.
● ఎండిపోయెను
"చచ్చిపోయెను."
అంజూరపు చెట్టును శపించిన విషయము యేసు వివరిస్తున్నాడు.
● ఎండిపోయెను
"ఎండిపోయి చనిపోయెను."
మత నాయకులు యేసును ప్రశ్నించిన వృత్తాంతంను ఈ వాక్యభాగము ప్రారంభిస్తుంది.
మత నాయకులు యేసును ప్రశ్నించిన వృత్తాంతం ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● ఆకాశమునుండి
"పరలోకమందున్న దేవుని యొద్దనుండి" (చూడండి: అన్యాపదేశము).
● ఆయన మనతో చెప్పును
యేసు మనతో చెప్పును."
● జనసమూహమునకు మనము భయపడుచున్నాము
"జనసమూహము ఏమి చెప్పుకుంటున్నారో చివరకు మనలను ఏమి చేస్తారోనని భయపడు చున్నాము."
● వారందరు యోహానును ఒక ప్రవక్త అని చూస్తున్నారు
"యోహానును ఒక ప్రవక్త అని వారు నమ్ముతున్నారు."
ఉపమానముతో మత నాయకులకు యేసు సమాధానమిచ్చెను.
ఉపమానముతో మత నాయకులకు యేసు సమాధానమిచ్చుట కొనసాగించెను.
● వారు అన్నారు
"ప్రధాన యాజకులు, పెద్దలు అన్నారు."
● వారితో యేసు అన్నాడు
"యేసు ప్రధాన యాజకులు, పెద్దలుతో అన్నాడు."
● యోహాను మీ యొద్దకు వచ్చెను
"యోహాను వచ్చి మతనాయకులకు, సామన్య జనానికి బోధించెను."
● నీతి మార్గమునందు
ప్రజలు దేవునికి ఎలా స్పందించాలో జీవించాలో యోహాను చూపించాడు. (చూడండి: రూపకాలంకారము).
రెండవ ఉపమానముతో మత నాయకులకు యేసు సమాధానమిచ్చుటను కొనసాగించెను.
● విస్తారమైన భూమి కలిగిన వ్యక్తి
"ఎక్కువ ఆస్తి కలిగిన తోట యజమాని."
● ద్రాక్ష తోట కాపలావారికి కౌలుకు ఇచ్చెను
"ద్రాక్ష తోట కాపలావారిని ద్రాక్షతోటమీద ఉంచెను." యజమానుడుకి ద్రాక్షాతోటమీద ఇంకనూ అధికారమున్నది.
● ద్రాక్షతోట కాపలా ఉండువారు
ద్రాక్షచెట్లు కాయలు ఎలా పండించాలో తెలిసినవారు.
రెండవ ఉపమానముతో మత నాయకులకు యేసు సమాధానమిచ్చుటను కొనసాగించెను.
● తన సేవకులు
"విస్తారమైన భూమి కలిగిన వ్యక్తియొక్క సేవకులు" (21:33).
రెండవ ఉపమానముతో మత నాయకులకు యేసు సమాధానమిచ్చుటను కొనసాగించెను.
రెండవ ఉపమానముతో మత నాయకులకు యేసు సమాధానమిచ్చుటను కొనసాగించెను.
● ప్రజలు ఆయనతో ఇలా చెప్పిరి
"ప్రజలు యేసుతో ఇలా చెప్పిరి."
ఉపమానమును వివరించుటకు యేసు ప్రవక్తలను ఉపయోగించాడు.
● యేసు వారితో ఇలా చెప్పెను
"యేసు ప్రజలతో ఇలా చెప్పెను" (21:41).
● ఇల్లు కట్టు వారు నిషేదించిన రాయి చివరకు మూలరాయి ఆయెను.
ప్రత్యామ్నాయ అనువాదం: ఇల్లు కట్టువారు నిషేదించిన రాయి చివరకు అతి ప్రాముఖ్యమైన రాయి అయ్యింది." అధికారులు యేసును తృణీకరిస్తారు, కాని దేవుడు తన రాజ్యంనకు రాజుగా చేస్తాడు. (చూడండి: రూపకాలంకారము).
● ప్రభువునొద్దనుండి వచ్చినది
"ఈ గొప్ప మార్పును ప్రభువే చేసెను."
ఉపమానమును వివరించుట యేసు కొనసాగించెను.
● నేను మీతో చెప్పునదేమనగా
"ప్రధాన యాజకులతోను పెద్దలతోను యేసు మాట్లాడుతున్నాడు.
● ఫలములను పండించు
"మంచిదానిని చేయు" (చూడండి: రూపకాలంకారము).
● దాని ఫలములను
"దేవుని రాజ్యపు ఫలములను."
● ఈ రాయి మీద ఎవరు పడినను
"ఈ రాయిమీద తొట్రుపడువారు" (చూడండి: రూపకాలంకారము).
● ఎవరిమీద ఈ రాయి పడునో
"ఎవరి మీదకు తీర్పు వచ్చునో" (చూడండి: రూపకాలంకారము).
యేసు చెప్పిన ఉపమానములకు మత నాయకులు ప్రతిస్పందన.
● ఆయన ఉపమానములు
"యేసు యొక్క ఉపమానములు."
● చేతులు వేయుటకు
"బంధించుటకు."
మత నాయకులకు యేసు పెండ్లి విందును గూర్చిన ఉపమానము చెప్పుట ప్రారంభించెను.
● పరలోక రాజ్యం. వలె ఉన్నది.
13:24లో నీవు ఎలా తర్జుమా చేశావో చూడు.
● పిలువబడినవారు
ప్రత్యామ్నాయ అనువాదం: "రాజు ఆహ్వానించిన ప్రజలు" (చూడండి: సకర్మక క్రియ, కర్మార్థక క్రియ).
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
● చూడండి
ప్రత్యామ్నాయ అనువాదం: "చూడుడి" లేక "వినుడి" లేక "నేను నీకు చెప్పబోవుచున్నదానిపైన మనస్సు పెట్టు
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
● ఆ ప్రజలు
"పిలువబడిన అతిథులు" (22:4).
● ఆయన ఆహ్వానమును ముఖ్యమైనదిగా ఎంచలేదు
"ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని అలక్ష్యము చేసిరి."
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
● రాజమార్గపు కూడళ్లలో
"రోడ్లు కలిసే చోటు."
● శాల
పెద్ద గది.
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మత నాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
పెండ్లి విందును గూర్చిన ఉపమానమును మతనాయకులకు చెప్పుట యేసు కొనసాగించెను.
యేసును మత నాయకులు కపటోపాయముచేత పట్టుకోవాలని ప్రయత్నించిన వైనం ఈ వాక్యభాగాలలో ప్రారంభమౌతుంది.
● యేసును తన మాటలలో ఎలా చిక్కించవచ్చా అని
"అతనికి విరోధముగా ఉపయోగించుటకు అతనిని ఎలా ఇరికించవచ్చా అని"
● హేరోదీయులు
అధికారులు, రోమా సామ్రాజ్యమునకు మైత్రిపూర్వకముగా నున్న యూదుల రాజగు హేరోదును వెంబడించే వారు" (చూడండి: పేర్లు తర్జుమా).
● ప్రజల మధ్యన నీవు పక్షపాతము చూపవు
"కొంత మంది ప్రజలకు నీవు ప్రత్యేకమైన గౌరవమును చూపవు" లేక "అధిక ప్రాముఖ్యత కలిగిన ప్రజలకు నీవు సావధానత చూపవు."
పన్నులు పైన యేసుకున్న ఉద్దేశ్యములను బట్టి ఆయనను చిక్కించాలని ప్రయత్నించుటను మత నాయకులు కొనసాగిస్తున్నారు.
● దేనారము
ఒక దినపు కూలికి సరిపోయిన రోమా నాణెము (చూడండి: బైబిలు డబ్బు).
పన్నులు కట్టుట పై యేసుకున్న ఉద్దేశ్యములను బట్టి ఆయనను చిక్కించాలని ప్రయత్నించుటను మత నాయకులు కొనసాగిస్తున్నారు.
● కైసరువి
"కైసరుకు చెందినవి" (చూడండి: అన్యాపదేశము).
● దేవునివి
దేవునికి చెందినవి"
విడాకులు గురించిన యేసుకున్న ఉద్దేశ్యములను బట్టి ఆయనను చిక్కించాలని మత నాయకులు ప్రయత్నించుటను కొనసాగిస్తున్నారు.
● బోధకుడా, మోషే ఇలా చెప్పాడు, "ఒక మనిషి చనిపోతే, "లేఖనములలో మోషే వ్రాసిన విషయము గురించి వారు అడుగుచున్నారు. మీ భాషలో ఉల్లేఖనము లోపల మరొక ఉల్లేఖనము వ్రాయుటకు వీలుపడకపోతే దీనిని పరోక్ష ఉల్లేఖనముగా వ్రాయండి." "ఒక మనిషి చనిపోతే. అని మోషే చెప్పెను." (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● అతని సహోదరుడు. అతని భార్య.. అతని సహోదరుడు
చనిపోయినవాని భార్య.
విడాకులు గురించిన తన ఉద్దేశ్యములను బట్టి యేసును చిక్కించాలని మత నాయకులు ప్రయత్నించుటను కొనసాగిస్తున్నారు.
● వారందరి తరువాత
"ప్రతి సహోదరుడు వివాహము చేసికొనిన తరువాత" లేక "ప్రతి సహోదరుడు చనిపోయిన తరువాత."
● దేవుని శక్తి
"దేవుడు చేయగలిగినది."
విడాకులు గురించిన తన ఉద్దేశ్యములతో యేసును చిక్కించాలని మత నాయకులు ప్రయత్నించుటను కొనసాగిస్తున్నారు.
విడాకులు గురించిన తన ఉద్దేశ్యములతో యేసును చిక్కించాలని మత నాయకులు ప్రయత్నించుటను కొనసాగిస్తున్నారు.
● మీరు చదువలేదా. యాకోబు..?
ప్రత్యామ్నాయ అనువాదం: ఇది మీరు చదివారని నాకు తెలుసు, కాని మీరు అర్థం చేసుకున్నట్లు కనబడుటలేదు. యాకోబు." (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● దేవుని ద్వారా మీతో మాట్లాడినది
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మీతో మాట్లాడినది" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● దేవుడు, చెప్పినదేమనగా
‘నేను. యాకోబు..? ఇది ఉల్లేఖనములోనున్న మరొక ఉల్లేఖనము. "దేవుడు మోషేతో, దేవుడగు తాను, అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పెను" (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
ధర్మశాస్త్రముపైన తన ఉద్దేశ్యములను బట్టి యేసును చిక్కించాలని మత నాయకులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
● ధర్మశాస్త్ర పండితుడు
మోషే ధర్మశాస్త్రమును గ్రహించుటలో ప్రత్యేక నైపుణ్యతగల పరిసయ్యుడు.
ధర్మశాస్త్రముపైన తన ఉద్దేశ్యములను బట్టి యేసును చిక్కించాలని మత నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ధర్మశాస్త్రముపైన తన ఉద్దేశ్యములను బట్టి యేసును చిక్కించాలని మత నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
● అలాటిది
22: 37 లో ఉన్న ఆజ్ఞ వంటిది.
మెస్సీయాను గురించి మత నాయకులను ప్రశ్నించటం యేసు ప్రారంభించెను.
మెస్సీయాను గురించి మత నాయకులను ప్రశ్నించటం యేసు కొనసాగించెను.
● నా కుడి చేయి ప్రక్కన
"కుడి చేయి" ఎల్లప్పుడు గౌరవస్థానమును సూచిస్తుంది. (చూడండి: అన్యాపదేశము).
● నీ శత్రువులను నీ పాదపీఠములుగా నేను చేయు వరకు
"నీ శత్రువులను నేను జయించేవరకు" (చూడండి: జాతీయం).
మెస్సీయాను గురించి మత నాయకులను ప్రశ్నించటం యేసు కొనసాగించెను.
మత నాయకులవలె ఉండవద్దని యేసు తన శిష్యులను హెచ్చరించుట ప్రారంభిస్తున్నాడు.
● మోషే పీఠమందు కూర్చుంటారు
"మోషేకు ఉన్నట్లు అధికారము కలిగియుంటారు" లేక "మోషే ధర్మశాస్త్రము యొక్క అర్థమేమిటో చెప్పు అధికారము కలిగియుంటారు" (చూడండి: రూపకాలంకారము).
● ఏదైనా
"ప్రతిది" లేక "సమస్తము."
మత నాయకులవలె ఉండవద్దని యేసు తన శిష్యులను హెచ్చరించుట కొనసాగిస్తున్నాడు.
● మోయటానికి వీలులేని భారమైన బరువులు కడతారు
"అనుసరిస్తానికి కష్టమైన అనేక నియమాలు మీ మీద మోపుతారు" (చూడండి: రూపకాలంకారము).
● వారు వేలు కూడా కదపరు
"వారు చిన్న సహాయముకూడా చేయరు" (చూడండి: రూపకాలంకారము).
● రక్షరేకులు
లేఖనము వ్రాయబడిన కాగితము లోపల పెట్టబడిన చిన్న తాయెత్తు.
మత నాయకులవలె ఉండవద్దని యేసు తన శిష్యులను హెచ్చరించుట కొనసాగిస్తున్నాడు.
మత నాయకులవలె ఉండవద్దని యేసు తన శిష్యులను హెచ్చరించుట కొనసాగిస్తున్నాడు.
● భూమి మీద ఎవనిని మీ తండ్రి అని పిలువ వద్దు
"భూమి మీ తండ్రి అని ఎవరిని పిలువ వద్దు" లేక "భూమి మీద ఏ మనిషినైనా మీకు తండ్రి అని చెప్పవద్దు"
మత నాయకులవలె ఉండవద్దని యేసు తన శిష్యులను హెచ్చరించుట కొనసాగిస్తున్నాడు.
● హెచ్చించుకొనువాడు
"తనను తాను ప్రాముఖ్యమైనవానిగా ఎంచుకొనువాడు"
● హెచ్చింపబడతారు
"ముఖ్యమైనవానిగా పైకెత్తబడతాడు."
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం ప్రారంభించెను.
● మీరు అందులో ప్రవేశింపరు
"దేవుడు మీ మీద పాలన చేయుటకు మీరు అనుమతివ్వరు."
● విధవరాండ్ర ఇండ్లను కబళించివేయుదురు
"పురుషుని కాపుదల లేని స్త్రీల ఇండ్లలోనిది మొత్తము దోచుకుంటారు"
● నరకు పుత్రుడు
"నరకమందు సంబంధించినవాడు" లేక "నరకమునకు వెళ్లవలసినవాడు" (చూడండి: జాతీయం).
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
● అంధులైన మార్గదర్శకులారా. మూర్ఖులారా
"నాయకులు భౌతికముగా నిజమైన గ్రుడ్డివారు కాకపోయినప్పటికి, వారి తప్పేమిటో వారు గ్రహించరు. (చూడండి: రూపకాలంకారము).
● తన ఒట్టునకు బద్దుడు
ప్రత్యామ్నాయ అనువాదం: "తాను చేస్తానని ప్రమాణము చేసినది తప్పక చేయాలి" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ఏది గొప్పది, బంగారమా లేక బంగారమును పరిశుద్దపరచు దేవాలయమా?
పరిసయ్యులను గద్దించుటకు యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు. (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
● అంధులారా
అత్మీయముగా అంధులైన ప్రజలు (చూడండి: రూపకాలంకారము).
● ఏది గొప్పది, అర్పణమా లేక అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
వారికి అంతకు ముందే తెలిసిన దానిని ప్రత్యేకించి చెప్పటానికి యేసు ఈ ప్రశ్న వేసాడు. (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● అర్పణము
బలిపీఠము మీద పెట్టక మునుపు దేవుని యొద్దకు తీసుకొని రాబడిన జంతువు యొక్క బలిని గాని భూమి పంటను గాని అర్పణము అంటారు. ఒకసారి దానిని బలిపీఠము మీద పెట్టినప్పుడు ఆ అర్పణమును బల్యర్పణము అని పిలుస్తారు. (చూడండి: అన్యాపదేశము).
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
● మీకు శ్రమ
23:13లో దీనిని నీవు ఎలా తర్జుమా చేసావో చూడు.
● పుదీనా, సోపు, జీలకర్ర
ఆకులు గింజలు ఆహారమును రుచికరముగా చేయుటకు వాడతారు. (చూడండి: తెలియనివాటి తర్జుమా).
● అంధులైన మార్గదర్శకులారా
వీరు భౌతికముగా అంధులుకారు. యేసు అత్మీయమైన అంధత్వమును శారీరకమైన అంధత్వముతో పోల్చుచున్నాడు. (చూడండి: రూపకాలంకారము).
● దోమలు లేకుండా వడగట్టి ఒంటెను మింగువారు మీరు
చిన్న చిన్న అపవిత్రమైన పురుగులను తినటానికి జాగ్రత్త వహించి ఉద్దేశ్యపూర్వకుముగానైనా లేక తెలియకుండానైనా పెద్ద పెద్ద జంతువుల మాంసమును తిను మూర్ఖులవలె తక్కువ ప్రాముఖ్యత కలిగిన ఆజ్ఞలను పాటించుటకు చాలా జాగ్రత్త వహించి, ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన ఆజ్ఞలను మూర్ఖులు వలె అలక్ష్యము చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఒక వ్యక్తి తాను త్రాగుచున్న దానిలో పడిన దోమను వడకట్టి ఒంటెను మ్రింగిన మూర్ఖులవంటివారు మీరు."
● దోమను వడగట్టుట
నోటిలోనికి వెళ్లకుండా ఏదైనా వస్త్రము అడ్డము పెట్టుకొని త్రాగుట.
● దోమ
ఎగిరే చిన్న కీటకము.
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
● మీకు శ్రమ
23:13లో నీవు ఎలా తర్జుమా చేసావో చూడు.
● మీరు గిన్నెను పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు
ఇతరులు చూడటానికి "శాస్త్రులు”, "పరిసయ్యులు." పైకి శుభ్రముగా కనబడతారు. (చూడండి: రూపకాలంకారము).
● లోపల వారు బలాత్కారముతోను, దుర్మార్గముతోను
"వారికి ఉన్న అవసరతకంటే ఎక్కువ కలిగియుండులాగున ఇతరులకు చెందిన దానిని బలవంతముగా తీసుకుంటారు."
● అంధులైన పరిసయ్యులారా
పరిసయ్యులు. సత్యమును గ్రహించరు. వారు శారీరకముగా అంధులుకారు (చూడండి: రూపకాలంకారము).
● గిన్నె, పళ్లెము మొదట లోపల శుద్ధిచేయండి. అప్పుడు బయట ప్రక్కన అదే శుద్ధి అవుతుంది
వారి హృదయాలు దేవుని ఎదుట సరియైనవైతే వారి జీవితాలు కూడా దేవుని ఎదుట సరియైనవిగానే ఉంటాయి. (చూడండి: రూపకాలంకారము).
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
● మీ పితరులు చేసిన పాపమును మీరు సంపూర్ణము చేయండి
"మీ పితరులు ప్రారంభించిన పాపములను మీరు పూర్తి చేయండి" (చూడండి: అన్యాపదేశము).
● సర్పములారా, సర్పసంతానమా
"ప్రమాధకరమైన విషపూరితమైన పాములంతటి దుష్టులు మీరు" (చూడండి: రూపకాలంకారము).
● నరక శిక్ష నుండి మీరేలాగు తప్పించుకొందురు?
"నరక శిక్షను తప్పించుకునే మార్గమేదియు మీకు లేదు." (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
మత నాయకుల వేషధారణను బట్టి యేసు వారికి వ్యతిరేకముగా మాట్లాడటం కొనసాగించెను.
● హేబెలు. మొదలుకొని.. జెకర్యా
హేబెలు మొదటిహతసాక్షి, , జెకర్యా దేవాలయములో యూదుల చేత చంపబడిన చివరివానిగా భావిస్తారు.
● జెకర్యా
బాప్తీస్మమిచ్చు యోహాను తండ్రి కాదు.
యెరూషలేము ప్రజలు దేవుని తిరస్కరించినందున తాను విచారముగా ఉన్నట్లు యేసు చెప్తున్నాడు.
● యెరూషలేమా, యెరూషలేమా
యెరూషలేము ప్రజలను ఒక పట్టణము అని సంబోధిస్తూ యేసు వారితో మాట్లాడుతున్నాడు. (చూడండి: సంక్షేపాలంకారము, అన్యాపదేశము).
● నీ పిల్లలు
ఇశ్రాయేలీయులందరు. (చూడండి: ఉపలక్షణము).
● నీ యిల్లు నీకు విడువబడియున్నది
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు నీ యింటిని విడిచి పెడతాడు, అప్పుడది ఖాళీగా ఉంటుంది" (చూడండి: అన్యాపదేశము).
● నీ యిల్లు
సాధ్యమైన అర్థాలు: 1). యెరూషలేము పట్టణము (యుడిబి చూడండి). 2). దేవాలయము (చూడండి: అన్యాపదేశము).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట ప్రారంభించాడు.
● మీరు వీటన్నిటిని చూచుటలేదా?
సాధ్యమైన అర్థాలు: యేసు క్రీస్తు 1). దేవాలయపు కట్టడ గురించి మాట్లాడుతున్నాడు (ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ కట్టడములన్నిటిని గురించి నన్ను ఒకటి చెప్పనివ్వండి."). లేక 2). ఇప్పుడు ఆయన తెలియజేసిన నాశనము ("ఇప్పుడు నేను మీకు చెప్పినదానిని గ్రహించవలసియున్నది, కాని మీరు గ్రహించలేదు!"). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● ఎవరూ మిమ్ములను సత్యదూరము చేయకుండ జాగ్రత్తగా ఉండుడి
"ఈ విషయములను గురించి ఎవరూ మీతో అబద్దములు చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి"
అంత్య దినాల గురించి తన శిష్యులతో చెప్పుట యేసు కొనసాగించెను.
● మీరు వ్యాకులపడకుండా చూచుకొనుడి
"ఈ విషయములు మిమ్మును వ్యాకుల పరచనీయవద్దు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
అంత్య దినాల గురించి తన శిష్యులతో చెప్పుట యేసు కొనసాగించెను.
● వారు మిమ్మును అప్పగిస్తారు
"మిమ్ములను హింసించాలనుకున్న ప్రజలు మిమ్మును అప్పగిస్తారు."
● మిమ్మును అప్పగిస్తారు
10:17లో తర్జుమా చేసినట్లు దీనిని తర్జుమా చేయాలి.
అంత్య దినాలు గురించి తన శిష్యులతో చెప్పుట యేసు కొనసాగించెను.
● అనేకుల ప్రేమ చల్లారును
సాధ్యమైన అర్థాలు: 1). అనేకమమంది ప్రజలు ఇతరులను ప్రేమించ లేరు" (యుడిబి చూడండి). లేక 2). "అనేకులు దేవుని ప్రేమించలేరు” (చూడండి: జాతీయం).
● సమస్త జనములు
ప్రత్యామ్నాయ అనువాదం: "అన్ని స్థలాలలో ఉన్న సమస్త ప్రజలు" (చూడండి: అన్యాపదేశము).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడినది
ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రవక్తయైన దానియేలు వ్రాసిన దాని గురించి" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● పిల్లతో ఉన్నవారు
గర్భిణులు (చూడండి: మృదూక్తి).
● చలికాలం
"చల్లగా ఉండే కాలం"
● శరీరులు
ప్రజలు
(చూడండి: ఉపలక్షణము).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● దానిని నమ్మవద్దు
"వారు మీకు చెప్పే అబద్ద విషయాలు నమ్మవద్దు"
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● మెరుపు కనబడినట్లు. రాకడ కూడా ..
ఆయన చాలా వేగముగా, చూడగలుగునట్లు వస్తాడు, (చూడండి: ఉపమాలంకారము).
● చచ్చిన జంతువు ఎక్కడ ఉంటుందో అక్కడ రాబందులు పోగవుతాయి
సాధ్యమైన అర్థాలు: 1). మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆయనను చూస్తారు, ఆయన వచ్చాడని తెలుసుకుంటాకు (యుడిబి చూడండి). లేక 2). ఎక్కడ అత్మీయముగా చచ్చిన ప్రజల ఉంటారో, అక్కడకు అబద్దపు ప్రవక్తలు పోగవుతారు (రూపకాలంకారము).
● రాబందులు
చచ్చిన లేక చస్తూ ఉన్న ప్రాణుల కళేబరములను తినే గద్ద జాతి పక్షులు.
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● వెంటెనే
"అదే సమయులో"
● ఆ దినాల
24:23
28లో వివరించబడిన దినాల
● సూర్యుడు చీకటి కమ్మును
"సూర్యుడు చీకటియగునట్లు దేవుడు చేస్తాడు." (చూడండి: సకర్మక క్రియ/కర్మార్థక క్రియ).
● ఆకాశ శక్తులు కదిలింపబడును
"అకాశములోను ఆకాశము పైనను ఉన్న వాటిని దేవుడు కదిలింపచేస్తాడు). (చూడండి: సకర్మక క్రియ/కర్మార్థక క్రియ).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● వారి రొమ్ము కొట్టుకుందురు
రాబోవుచున్న శిక్షకు వారు భయాందోళనకు గురైనట్లు తెలియజేయుటకు వారి గుండెలు కొట్టుకుంటారు.
● వారు పోగు చేయుదురు
"ఆయన దూతలు పోగుచేయును."
● ఆయన ఏర్పరచుకున్నవారిని
మనుష్యకుమారుడు ఏర్పరచుకున్న జనులు.
● నాలుగు దిక్కులు
ప్రత్యామ్నాయ అనువాదం: "ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర దిక్కుల నుంచి" (యుడిబి చూడండి). లేక "ప్రతి చోటనుండి" (చూడండి: అన్యాపదేశము).
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● ద్వారము దగ్గర
"దాడి చేయటానికి వచ్చిన సైన్యము పట్టణములోనికి చొరబడటానికి సిద్దముగా ఉన్నట్లు."
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● ఈ తరము గతించదు
"నేడు నివసిస్తున్న ప్రజలలో అందరూ చనిపోరు" (చూడండి: మృదూక్తి).
● ఈ సంగతులన్ని జరుగు వరకు
ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ సంగతులన్ని దేవుడు జరిగించు వరకు."
● ఆకాశము భూమియు గతించిపోవును
"ఆకాశము భూమి ఇక ఉనికిలో ఉండదు."
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● మనుష్యకుమారుడు గాని
"మనుష్యకుమారుడు కూడా"
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● నోవహు దినాల ఉన్నట్లుగానే, మనుష్యకుమారుని దినంలుండును
ప్రత్యామ్నాయ అనువాదం: "మనుష్యకుమారుడు వచ్చు దినం నోవహు దినాలన్నట్లుగా ఉంటుంది" ఎందుకనగా వారికి చెడు సంభవించబోతున్నదని ఎవరు తెలుసుకోరు.
● జలప్రళయమునకు ముందు దినాల్లో వారు తినుచు త్రాగుచు ఉండిరి, అందరిని కొట్టుకొని పోయినది
మనుష్యకుమారుని రాక కూడా అలాగే ఉండును
ప్రత్యామ్నాయ అనువాదం: "మనుష్య కుమారుని రాక కూడ జలప్రళయమునకు ముందు దినాల్లో అందరు తినుచు త్రాగుచు ఉన్నట్లు ఉంటుంది. అందరిని కొట్టుకొని పోయినది."
యేసు మరలా తిరిగి వచ్చే ముందు ఏమి సంభవిస్తుందో తన శిష్యులకు తెలియజేయుట కొనసాగించాడు.
● అప్పుడు
మనుష్య కుమారుడు వచ్చినప్పుడు.
● ఒకరు ఎత్తబడెదరు, ఒకరు విడువబడెదరు.
సాధ్యమైన అర్థాలు: 1). దేవుడు ఒకరిని పరలోకమునకు తీసుకొనిపోతాడు, మరొకరిని శిక్షించుటకు భూమి మీదనే వదిలివేస్తాడు (యుడిబి చూడండి). లేక 2). శిక్షించుటకు దూతలు ఒకరిని తీసుకొని వెళ్లిపోతాయి దీవించబడునట్లు మరొకరిని వదిలివేస్తాయి (13:40
43 వరకు చూడండి).
● తిరుగలి
పప్పు ధాన్యము విసురుటకు వాడే సాధనము.
● కాబట్టి
"నేను మీతో చెప్పితిని కాబట్టి."
● మెలకువగా ఉండుడి
"మనస్సు నిలపండి."
తన రాకడ కొరకు ఎలా సిద్దపడాలో యేసు తన శిష్యులకు చెప్తున్నాడు.
● దొంగ
ఆయన వస్తాడని ప్రజలు అనుకొనని సమయములో నేను వస్తానని యేసు చెప్తున్నాడు, అంతే కాని దొంగతనము కొరకు వస్తానని కాదు.
● అతడు మెలకువగా ఉండి కావలియుండును
భద్రముగా ఉంచుకొనుటకు "తన ఇంటిని తాను కాచుకునేవాడు."
● తన ఇంటికి కన్నము వేయుటకు ఎవరిని లోనికి రానివ్వడు
"ఇంటి లోనికి వెళ్ళి వస్తువులు దొంగిలించకుండా తాను ఎవరిని అనుమతించేవాడు కాదు." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
తన రాకడ కొరకు ఎలా సిద్దపడాలో యేసు తన శిష్యులకు చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● కావున తన యజమానుడు. నమ్మకముగల తెలివైన సేవకుడు ఎవరు? ప్రత్యామ్నాయ అనువాదం: "కావున ఎవరు నమ్మకమైన తెలివైన సేవకుడు? తన యజమానుడు అతనిని.." (చూడండి: అలంకార సంబంధమైన ప్రశ్న).
● వారికి ఆహారము పెట్టుట. "తన యజమానుని ఇంటిలోని వారికి ఆహారము పెట్టుట."
తన రాకడ కొరకు ఎలా సిద్దపడాలో యేసు తన శిష్యులకు చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● హృదయంలో చెప్పుకొనెను
"తన మనస్సులో ఆలోచించుకొనెను."
● అతని విధిని చేయును
"అతనికి జరిగించును."
బుద్ధిగల కన్యకలు , బుద్ధిలేని కన్యకలను గూర్చిన ఉపమానము చెప్పుటు యేసు ప్రారంభించెను. (చూడండి: ఉపమానములు).
● దీపములు
ఇవి 1). దీపములు అయ్యుంటాయి (యుడిబి చూడండి). లేక 2). కర్రకు ఒక ప్రక్క బట్ట చుట్టి, దానిని నూనెతో తడిపి నిప్పు అంటించిన దివిటీలు అన్నా అయ్యుంటాయి.
● వారిలో ఐదుగురు
"కన్యకలలో ఐదుగురు."
● నూనె వారితో తీసుకొని వెళ్లలేదు
"వారి వద్ద నున్న దీపములలోని నూనె మాత్రమే ఉన్నది."
బుద్ధిగల కన్యకలు , బుద్ధిలేని కన్యకలను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● వారందరూ నిద్ర పోయిరి
"పదిమంది కన్యకలు నిద్రపోయిరి."
బుద్ధిగల కన్యకలు , బుద్ధిలేని కన్యకలను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● వారి దీపములను చక్కపరచిరి
"వారి దీపములు కాంతివంతముగా వెలుగునట్లు సరిచేసిరి."
● బుద్ధిలేనివారు బుద్ధిగలవారితో ఈలాగు చెప్పిరి
"బుద్దిలేని కన్యకలు బుద్దిగల కన్యకలతో ఈలాగు చెప్పిరి."
● మా దీపములు ఆరిపోవుచున్నవి
"మా దీపములలోని మంట బాగా వెలగటం లేదు" (చూడండి: జాతీయం).
బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలను గూర్చిన ఉపమానము తన శిష్యులకు చెప్పుట యేసు కొనసాగించెను.
● వారు వెళ్లిరి
"బుద్దిలేని ఐదుగురు కన్యకలు వెళ్ళిరి."
● సిద్దముగా ఉన్నవారు
అదనముగా నూనె ఉన్న కన్యకలు.
● తలుపు మూయబడినది
ప్రత్యామ్నాయ అనువాదం: "ఒకరు తలుపు మూసారు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● మా కోసం. తీయుము
"మేము లోపలికి వచ్చులాగున మాకోసం తలుపు తీయుము." (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
● మీరు నాకు తెలియదు
"మీరెవరో నాకు తెలియదు."
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు ప్రారంభించెను.
● ఇది... వలె ఉంటుంది
"పరలోకరాజ్యం. వలె ఉంటుంది" (చూడండి 25:1).
● వెళ్లబోవుచున్న
"వెళ్ళటానికి సిద్దముగా ఉన్న" లేక "తొందరలో వెళ్లనున్న."
● తన డబ్బును వారికిచ్చెను
"తన డబ్బుపైన వారిని నిర్వాహణకర్తలుగా ఉంచాడు."
● తన డబ్బు
"తన సొత్తు."
● ఐదు తలాంతులు
"ఒక తలాంతు ఇరువది సంవత్సరముల జీతముతో సమానము" దీనిని ఆధునిక ద్రవ్యరూపములోనికి మార్చుట చేయవద్దు. ఉపమానములో ఐదు, రెండు, , ఒకటి అలాగే ఇంకా పెద్ద మొత్తమున ఉన్న డబ్బులను పోల్చటము జరుగుతుంది. (యుడిబి చూడండి, “ఐదు సంచుల బంగారము”, బైబిలు డబ్బు చూడండి).
● అతడు తన ప్రయాణమై వెళ్లెను
"యజమానుడు ప్రయాణము చేయుచు వెళ్లిపోయెను."
● మరొక ఐదు తలాంతులు చేసెను
"మరొక ఐదు తలాంతులు సంపాదించెను."
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● మరొక రెండు చేసెను
"మరొక రెండు సంపాదించెను."
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● నేను మరొక ఐదు తలాంతులను చేసితిని
"నేను మరొక ఐదు తలాంతులను సంపాదించితిని."
● తలాంతులు
25:15లో నీవు ఎలా తర్జుమా చేసావో చూడు.
● భళా!
"నీవు మంచిగా జరిగించితివి" లేక "నీవు బాగుగా జరిగించితివి." మీ సంప్రదాయములో యజమానుడు (అధికారములో ఉన్నవాడు). తన సేవకుడు (తన చేతిక్రింద పనివాడు). చేసిన దానిని ఆమోదిస్తూ పలికేమాటలు వ్యక్తపరచే విధానం ఉండవచ్చు.
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● ఎక్కువ తలాంతులు... నేను చేసాను
25:20లో ఎలా తర్జుమా చేసావో చూడు.
● భళా! ..నీ యజమానుని సంతోషము
25:21లో ఎలా తర్జుమా చేశావో చూడు.
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● నీవు విత్తని చోట కోయువాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకొనువాడవు
ప్రత్యామ్నాయ అనువాదం: "భూమిలో విత్తనాలు వేయమని మరొకరికి డబ్బు చెల్లించి ఆ తోటలనుండి నీవు ఆహారము కూర్చుకొస్తావు"
● వెదజల్లుట
ఆ రోజుల్లో వారు నాగటి చాళ్లలో విత్తనాలు నాటుటకంటే, తరచుగా విత్తనంలను చిన్న మొత్తములో చుట్టూ విసిరేవారు.
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● చెడ్డవాడివైన సోమరి దాసుడా
"పని చేయటం ఇష్టంలేని చెడ్డ దాసుడవు నీవు."
● నేను విత్తని చోట కోయువాడను వెదజల్లని చోట పంట కూర్చుకొనువాడను
25:24లో ఎలా తర్జుమా చేశావో చూడు.
● నాది నేను తీసుకునేవాడిని
"నా సొంత బంగారము నేను తీసుకునేవాడిని." (చూడండి: అధ్యారోపము).
● వడ్డీ
యజమానుని డబ్బును తాత్కాలికముగా ఉపయోగించుకున్నందుకు సాహుకారుని వద్ద తీసుకునే రుసుము
నమ్మకమైన సేవకులు , అపనమ్మకమైన సేవకులను గూర్చిన ఉపమానము చెప్పుట యేసు కొనసాగించెను.
● బహు సమృద్ది
"అంతకంటే ఎక్కువ"
● అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును
"అక్కడ ప్రజలు ఏడ్చుచు వారి పండ్లు కొరుకుతుంటారు"
యుగ సమాప్తినాడు ప్రజలను తాను ఎలా తీర్పు తీర్చుతాడో తన శిష్యులకు యేసు చెప్పుట ప్రారంభించెను.
● ఆయన ఎదుట సమస్త జనములు పోగు చేయబడుదురు
ప్రత్యామ్నాయ అనువాదం: "సమస్త జనములను ఆయన తన ఎదుట పోగుచేయును" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ఆయన ఎదుట
"ఆయన ముందర"
● సమస్త జనములు
"ప్రతి దేశమునుండి సమస్త ప్రజలు" (చూడండి: అన్యాపదేశము).
● మేకలు
మేకలు ఒక మోస్తరు పరిమాణములో ఉండి నాలుగు కాళ్లు గలిగిన పాలిచ్చు జంతువులు, ఇవి గొర్రెలు వలె ఉంటాయి. తరచుగా మచ్చికచేయబడి లేక గొర్రెలవలె మంద కట్టబడియుంటాయి.
● ఆయన నిలువ బెట్టును
"మనుష్యకుమారుడు నిలువ బెట్టును"
యుగ సమాప్తినాడు ప్రజలను తాను ఎలా తీర్పు తీర్చుతాడో తన శిష్యులకు యేసు చెప్పుట కొనసాగించెను.
● రాజు
"మనుష్య కుమారుడు" (25:31).
● తన కుడి వైపున ఉన్నవారిని
"గొర్రెలను" (25:33).
● రండి, మీరు నా తండ్రి చేత ఆశీర్వదింపబడినారు
ప్రత్యామ్నాయ అనువాదం: "రండి మిమ్మును నా తండ్రి ఆశీర్వదించాడు"
● మీకొరకు సిద్దపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి
ప్రత్యామ్నాయ అనువాదం: "మీకొరకు దేవుడు సిద్దపరచిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి"
యుగ సమాప్తినాడు ప్రజలను తాను ఎలా తీర్పు తీర్చుతాడో తన శిష్యులకు యేసు చెప్పుట కొనసాగించెను.
● రాజు
"మనుష్య కుమారుడు" (25:31).
● వారితో చెప్పును
"కుడిచేతివైపున వున్నవారితో చెప్పును"
● సహోదరులు
"స్త్రీ పురుషులను కలిపి సంబోధించే పదం మీ భాషలో ఉంటే దానిని ఇక్కడ వాడండి.
● మీరు నాకు చేశారు
"మీరు నాకు చేసినట్లుగానే నేను భావిస్తాను
యుగ సమాప్తినాడు ప్రజలను తాను ఎలా తీర్పు తీర్చుతాడో తన శిష్యులకు యేసు చెప్పుట కొనసాగించెను.
● శపింపబడిన మీరు
"దేవుడు శపించిన ప్రజలు మీరు"
● సిద్దపరచబడిన నిత్య అగ్ని
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు సిద్దపరచిన నిత్య అగ్ని" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● వాని దూతలు
వాని సహాయకులు
● మీరు నాకు వస్త్రము కప్పలేదు
"మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు"
● రోగినై చెరలో ఉంటిని
"నేను రోగినై చెరలో ఉన్నాను"
యుగ సమాప్తినాడు ప్రజలను తాను ఎలా తీర్పు తీర్చుతాడో తన శిష్యులకు యేసు చెప్పుట కొనసాగించెను.
● వారు కూడా సమాధానము చెప్తారు
"ఎడమవైపున ఉన్నవారు" (25:41). కూడా సమాధానము చెప్తారు
● మిక్కిలి అల్పులైన వారిలో ఒకరికి
"నా ప్రజలలో తక్కువ ప్రాముఖ్యత గలవారిలో ఎవరికైనా"
● మీరు నా కొరకు చేయలేదు
"మీరు నా కొరకు చేయలేదని నేను భావిస్తాను" లేక "మీరు నిజముగా సహాయము చేయనిది నాకే"
● నిత్య శిక్ష
"శిక్ష ఎప్పటికి అంతం కాదు"
● నీతిమంతులు నిత్యజీవములోనికి
"నీతిమంతులైన ప్రజలు నిత్యజీవములోనికి ప్రవేశిస్తారు"
తాను ఏ విధంగా శ్రమపొంది మరణము పొందనున్నాడో తన శిష్యులకు తెలియచేయుట ప్రారంభము
● జరిగినదేమనగా
కథలో క్రొత్త భాగమును ప్రారంభించే విధానం నీ భాషలో ఉంటే, దానిని ఉపయోగించు.
● ఈ మాటలన్నియు
24:4
25:46 వరకు చెప్పబడిన మాటలన్నియు
● మనుష్య కుమారుడు సిలువవే యబడుటకు అప్పగింపబడును
"మనుష్యకుమారుని పట్టుకొని ఆయనను సిలువవేసే ప్రజలకు కొంతమంది అప్పగిస్తారు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
యేసు బంధించబడి చంపబడునట్లు యూదుల నాయకులు కుట్రపన్నుట.
● దొంగతనంగా
"రహస్యముగా"
● పండుగప్పుడు
వార్షిక పస్కా పండుగప్పుడు.
యేసు మరణమునకు ముందు ఒక స్త్రీ ఆయన మీద నూనె పోయుట
● ఆనుకొని యుండగా
తన ప్రక్కకు పడుకొని యుండగా. ప్రజలు తినేటప్పుడు సాధాణముగా ఉండే విధానానికి సరిపోయిన మాట మీ భాషలో ఏది ఉంటే అది వాడండి.
● ఆయన యొద్దకు ఒక స్త్రీ వచ్చి
యేసు నొద్దకు ఒక స్త్రీ వచ్చి
● చలువ రాతి శిల బుడ్డి
నున్నని రాయితో చేయబడిన పాత్ర, కొనాలంటే చాలా ఖరీదైనది.
● తైలము
సువాసనతో కూడిన నూనె.
● వ్యర్థము చేయటానికి కారణము ఏమిటి?
"ఈ తైలమును ఇలా వ్యర్థము చేసి ఈ స్త్రీ చెడ్డ పని చేసింది!" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
తన మరణమునకు ముందు తనను అభిషేకించిన స్త్రీని యేసు ప్రశంసిస్తున్నాడు.
● ఈ స్త్రీని మీరెందుకు ఇబ్బంది పెట్టుచున్నావు?
ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ స్త్రీని మీరు ఇబ్బంది పెట్టకూడదు!" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● మీరు...మీతో... మీతో
శిష్యులు
తన మరణమునకు ముందు తనను అభిషేకించిన స్త్రీని యేసు ప్రశంసించుట కొనసాగిస్తున్నాడు.
యేసును బంధించి చంపటానికి శిష్యులలో ఒకడు యూదులకు సహాయము చేయటానికి ఒప్పుకున్నాడు.
● మీకు అప్పగించుటకు
"మీకు యేసును అందించుటకు" లేక "యేసును మీరు బంధించుటకు సహాయము చేస్తే"
● ముప్పది వెండి నాణెములు
పాత నిబంధనలోని ప్రవచనంలోనున్న మాటలు కూడా ఇవే గనుక, ఆధునిక ద్రవ్య రూపములోనికి మార్చకుండా ఇదే పదజాలమును ఉంచండి.
● ఆయనను వారికి అప్పగించుటకు
"యేసును బంధించుటకు ప్రధాన యాజకులకు సహాయము చేయుటకు"
యేసు తన శిష్యులతో కలిసి పస్కాను భుజించుటకు సిద్ద పడుట.
● ఆయన చెప్పెను
"పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్లి, అతనితో ఇలా చెప్పండి, "నా కాలం సమీపమైనది, నా శిష్యులతో నీ యింట పస్కాను ఆచరించవలసియున్నదని బోధకుడు చెబుతున్నాడు" అని చెప్పెను.
"మరొక వ్యక్తికి యేసు చెప్పిన వర్తమానమును ఆ వ్యక్తితో చెప్పమని ఆయన తన శిష్యులకు చెప్పెను" ప్రత్యామ్నాయ అనువాదం: "పట్టణములో ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్లి బోధకుడు చెప్పాడని ఆ వ్యక్తితో ఇలా చెప్పండి, ‘నా సమయము సమీపముగా నున్నది. నా శిష్యులతో కూడా నేను నీ యింట పస్కాను ఆచరించాలి’ అని చెప్పమని తన శిష్యులకు చెప్పెను." లేక "ఆయన తన శిష్యులను పట్టణములోనికి ఫలాని వ్యక్తి యింటికివెళ్లి ‘నా సమయము సమీపముగా నున్ననిది నేను నా శిష్యులతో కలిసి నీ యింట పస్కాను ఆచరించాలని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుమని తన శిష్యులకు చెప్పెను."
● నా సమయము
సాధ్యమైన అర్థాలు: 1). "నేను చెప్పిన దాని గురించిన సమయము" (యు డి బి). లేక 2). "నా కొరకు దేవుడు పెట్టిన సమయము"
● సమీపముగా నున్నది
సాధ్యమైన అర్థాలు: 1). దగ్గరగా ఉన్నది (యు డి బి). లేక 2). "వచ్చింది” (చూడండి: జాతీయం).
● పస్కాను ఆచరించుట
"పస్కా ఆహారమును భుజించుటకు" లేక "ప్రత్యేకమైన భోజనము భుజించి పస్కాను జరుపుకొనుటకు"
యేసు తన శిష్యులతో కలిసి పస్కాను భుజించుచు వారికి బోధించెను.
● ఆయన తినుటకు కూర్చుండెను
తినేటప్పుడు నీ సంస్కృతిలో ఉండే భంగిమ తీరును సూచించే పదాన్ని వాడు.
● ఖచ్చితముగా నేను కాదు కదా, ప్రభువా?
"ఖచ్చితముగా నేను కాదు, నేనా, ప్రభువా? (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
యేసు తన శిష్యులతో పస్కాను భుజించుచు వారికి బోధించుటను కొనసాగించెను.
● ఎవని ద్వారా మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆవ్యక్తి
"మనుష్యకుమారుని అప్పగింపబోవు మనిషి"
● నీయంతట నీవే చెప్పావు
"నీవు చెప్పినట్లుగా, నీవే అతనివి" లేక "ఇప్పుడు నీవు ఒప్పుకున్నావు" (చూడండి: జాతీయం).
యేసు తన శిష్యులతో పస్కాను భుజించుచు వారికి బోధించుటను కొనసాగించెను.
● పట్టుకొని ... ఆశీర్వదించి. విరిచి
14:19లో నీవు తర్జుమా చేసినట్లు దీనిని చేయుము.
యేసు తన శిష్యులతో పస్కాను భుజించుచు వారికి బోధించుటను కొనసాగించెను.
● పట్టుకొని
14:19లో నీవు తర్జుమా చేసినట్లు దీనిని చేయుము.
● అది వారికి ఇచ్చెను
"అది శిష్యులకు ఇచ్చెను"
● నిబంధన రక్తము
"నిబంధన అమలులో ఉన్నదని తెలియజేయు రక్తము" లేక "నిబంధనను సంభవనీయముగా చేయు రక్తము"
● కార్చబడుచున్న
"మరణమందు కార్చబడుచున్న" లేక "నా శరీరమునుండి త్వరలోనే ప్రవహించనున్న" లేక "నేను చనిపోయినప్పుడు నా గాయములనుండి ప్రవహిస్తుంది"
● ద్రాక్ష తీగె ఫలము
"ద్రాక్షారసము" (చూడండి: జాతీయం).
ఒలీవల కొండకు వెళ్లుచుండగా తన శిష్యులకు బోధించుట కొనసాగించెను.
● కీర్తన
దేవుని స్తుతించు పాట.
● వదిలి వేయు
"నన్ను వదిలివేస్తారు."
● మందలోని గొర్రెలు చెదరిపోవును
ప్రత్యామ్నాయ అనువాదం: 1). "మందలోని గొర్రెలన్నిటిని వారు చెదరగొడతారు" (యు డి బి). లేక 2). "అన్ని దిక్కులకు మందలోని గొర్రెలు పారిపోతాయి."
● మందలోని గొర్రెలు
శిష్యులు (చూడండి: రూపకాలంకారము).
● నేను లేచిన తరువాత
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు నన్ను లేపిన తరువాత" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● నేను లేచిన
ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు నన్ను మరణము నుండి లేపిన"
ఒలీవల కొండకు వెళ్లుచుండగా తన శిష్యులకు బోధించుట కొనసాగించెను.
● వదిలి వేయు
26:31లో తర్జుమా చేసిన విధంగా తర్జుమా చేయి.
● కోడిపుంజు కూయక మునుపు
ప్రత్యామ్నాయ అనువాదం: "సూర్యుడు ఉదయించక మునుపు"
● కోడిపుంజు
సూర్యాస్తమయమునకు ముందు సమయములో గట్టిగా కూతపెట్టు పక్షి.
● కూత కూయు
కోడిపుంజు కూయు శబ్దము.
ఒలీవల కొండకు వెళ్లుచుండగా తన శిష్యులకు బోధించుట కొనసాగించెను.
● దుఃఖము
చాలా విచారము.
గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేయుట ఈ వాక్యభాగములో ప్రారంభమౌతుంది.
● ముఖము నేల మోపి
ప్రార్థన చేయుటకు ఉద్దేశ్య పూర్వకముగా ముఖము నేలను మోపుట (చూడండి: జాతీయం).
గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేయుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● ఆయన దూరముగా వెళ్లి
"యేసు దూరముగా వెళ్ళి"
● దీనిని నేను త్రాగితేనే గాని
"ఈ శ్రమలు అనే పాత్రలోనిది నేను త్రాగితేనే గాని"
● వారి కన్నులు భారముతో
"వారు చాలా నిద్రమత్తుగా" (చూడండి: జాతీయం).
గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేయుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● గడియ సమీపముగా నున్నది
"సమయము వచ్చియున్నది"
● పాపుల చేతులు
"పాపముతో నిండిన ప్రజలు" (చూడండి: ఉపలక్షణము).
● చూడండి
"మీకు నేను చెప్పబోయే దాని పైన మనస్సు పెట్టండి"
గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేయుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● ఆయన మాట్లాడుచుండగా
"యేసు మాట్లాడుచుండగా"
● "నేనెవరికి ముద్దు పెట్టుదునో, ఆయనే అతను. ఆయనను పట్టుకొనుడి" అని చెప్పెను
"వాడు ఎవరిని ముద్దు పెట్టుకొనునో ఆయననే వారు పట్టుకొనవలసినదని చెప్పెను" (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● నేనెవరికి ముద్దు పెట్టుదునో
"నేను ముద్దు పెట్టు వానిని" లేక "నేను ముద్దు పెట్టు మనుష్యుని" (యు డి బి).
● ముద్దు
ఒకని బోధకునికి వందనము చెప్పు గౌరవ ప్రదమైన విధానం
గెత్సెమనే తోటలో యేసును బంధించుట ఈ వాక్యభాగములో ప్రారంభమౌతుంది.
● అతడు యేసు నొద్దకు వచ్చి
"యూదా యేసునొద్దకు వచ్చి"
● ఆయనను ముద్దు పెట్టుకొనెను
"ముద్దు పెట్టుకొని అతని కలిసెను"
● యేసు మీద చేతులు వేసిరి
యేసును బంధించాలనే ఆలోచనతో ఆయనను పట్టుకొనిరి (చూడండి: అన్యాపదేశము).
● ఆయనను పట్టుకొనిరి
ఆయనను బందీగా చేసిరి.
గెత్సెమనే తోటలో యేసును బంధించుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● ఇదిగో
కథలోనికి క్రొత్త వ్యక్తిని రచయిత తీసుకొస్తున్నాడు. ఈ విధంగా వ్యవహరించే విధానం నీ భాషలో ఉండవచ్చు.
● నా తండ్రిని నేను వేడుకొనలేననియు, పండ్రెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడనియు నీవనుకొను చున్నావా?
ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నా తండ్రిని వేడుకొనగలననియు, పండ్రెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఆయన పంపగలడనియు నీవు తెలుసుకోవాలి" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● పండ్రెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు
దూతల ఖచ్చితమైన సంఖ్య ప్రాముఖ్యము కాదు. (చూడండి: సంఖ్యల తర్జుమా).
● సేనా వ్యూహములు
రోమా సైన్యములోని ఆరేసి వేలమంది సైనికులుగల సేనా విభాగాలు (చూడండి: తెలియనివాటి తర్జుమా).
గెత్సెమనే తోటలో యేసును బంధించుట ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● కత్తులతోను గుదియలతోను దొంగను పట్టుకొనటానికి వచ్చినట్లు నన్ను పట్టుకోవటానికి మీరు వచ్చారా?
ప్రత్యామ్నాయ అనువాదం: "నేను దొంగను కానని మీకు తెలుసు, కావున కత్తులు గుదియలు తీసుకొని నా దగ్గరకు రావటము మీరు చేస్తున్న తప్పు" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● గుదియలు
ప్రజలను కొట్టటానికి వాడే గదలు లేక బడితలు
● ఆయనను విడిచి
వారు ఆయనతో ఉండవలసిన సమయములో ఆయనను విడిచి పారిపోయారు అని చెప్పటానికి నీ భాషలొ ఏదైనా పదం ఉంటే దానిని ఇక్కడ వాడవచ్చు.
ప్రధాన యాజకుని ద్వారా యేసు ప్రశ్నింపబడిన వృత్తాంతాన్ని ఈ వాక్యభాగము ప్రారంభిస్తుంది.
● ప్రధాన యాజకుని ఇంటి ఆవరణము
ప్రధాన యాజకుని ఇంటి దగ్గర నున్న బహిరంగ స్థలము.
ప్రధాన యాజకుని ద్వారా యేసు ప్రశ్నింపబడిన వృత్తాంతాన్ని ఈ వాక్యభాగము కొనసాగిస్తుంది.
● ఇద్దరు ముందుకు వచ్చి
"ఇద్దరు మనుష్యులు ముందుకు వచ్చి" (యు డి బి). లేక "ఇద్దరు సాక్ష్యులు ముందుకు వచ్చి"
● "ఈ మనుష్యుడు ‘దేవుని మందిరమును నేను నాశనము చేసి మూడు రోజుల్లో దాని లేపగలనని పలికెను’ " అని చెప్పిరి, ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుని మందిరమును పడగొట్టి మూడు రోజుల్లో దాని లేపగలనని యేసు చెప్పెనని సాక్షమిచ్చిరి" (చూడండి: సంవాద ఉల్లేకనములు).
● ఈ మనుష్యుడు చెప్పెను
"యేసు అను ఈ మనుష్యుడు చెప్పెను"
ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించిన వైనము ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● వారు నీకు విరోధముగా సాక్ష్యము చెప్పుచున్నారు
"ఈ సాక్ష్యులు నీకు విరోధముగా సాక్ష్యము చెప్పుచున్నారు"
● నీవు క్రీస్తువో కాదో మాకు చెప్పుము
"నీవు క్రీస్తువైతే మాతో చెప్పుము"
● నీయంతట నీవే ఇది చెప్పావు
"నీవు చెప్పినట్లుగా, నేనే" లేక "నీవు ఇప్పుడే ఒప్పుకున్నావు" (చూడండి: జాతీయం).
● కాని నేను మీతో చెప్పునదేమనగా, ఇది మొదలుకొని
ప్రధాన యాజకునితోని ప్రక్కనున్ను ఇతరులతోను యేసు మాట్లాడుతున్నాడు.
● ఇది మొదలుకొని మనుష్యకుమారుడు... మీరు చూస్తారు
సాధ్యమైన అర్థాలు: 1). భవిష్యత్తులో వారు మనుష్యకుమారుని ఒక సమయములో చూస్తారు (యుడిబి చూడండి). లేక 2). "ఇప్పుడు" అనగా యేసు అర్థం తన మరణమునకు చెందిన సమయము.
● శక్తిగలవాని కుడి పార్శ్వమున
సర్వశక్తిగలవాని కుడి ప్రక్కన.
● ఆకాశ మేఘముల మీద వచ్చుచుండుట
"ఆకాశమేఘముల మీద ఎక్కి వచ్చుట."
ప్రధాన యాజకుని ద్వారా యేసు ప్రశ్నింపబడిన వృత్తాంతం ఈ వాక్యభాగము కొనసాగుతుంది.
● ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని
వస్త్రమును చింపుకొనుట కోపానికి విచారమునకు సాదృశ్యము.
● వారు జవాబిచ్చిరి
"యూదుల నాయకులు జవాబిచ్చిరి."
ప్రధాన యాజకుని ద్వారా యేసు ప్రశ్నింపబడిన వృత్తాంతం ఈ వాక్యభాగము కొనసాగుతుంది.
● అప్పుడు వారు
సాధ్యమైన అర్థాలు: "అప్పుడు వారిలో కొందరు" లేక "అప్పుడు సైనికులు."
● ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి
అవమానము తెలియజేయుట
యేసు తనకు తెలుసునన్న సంగతి పేతురు ఎలా తృణీకరించెనో ఈ వృత్తాంతంలో కొనసాగుతుంది.
● నీవు దేని గురించి మాట్లాడుచున్నావో నాకు తెలియదు
పని పిల్ల చెప్పినది పేతురు గ్రహించగలుగుచున్నాడు. ఆయన యేసుతో కూడా ఉన్నాననే విషయాన్ని తృణీకరించుటకు ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు.
యేసు తనకు తెలుసునన్న సంగతి పేతురు ఎలా తృణీకరించెనో ఈ వృత్తాంతంలో కొనసాగుతుంది
● అతను..అప్పుడు
"పేతురు..అప్పుడు."
● ప్రవేశద్వారము దగ్గరకు
ఆవరణము చుట్టునుండు గోడకు ఉన్న ద్వారము.
యేసు తనకు తెలుసునన్న సంగతి పేతురు ఎలా తృణీకరించెనో ఈ వృత్తాంతంలో కొనసాగుతుంది.
● వారిలో ఒకడు
"యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు"
● నీ మాటలలోని యాస నిన్ను పట్టిస్తుంది
"నీవు గలిలయ వాడివని మేము చెప్పగలము ఎందుకనగా నీవు గలిలయుని వలెనే మాట్లాడుచున్నావు."
● శాపము
తనను తానే శపించుకొనుట.
● ఒట్టు, "ఆ మనిషి నాకు తెలియదు"
ప్రత్యామ్నాయ అనువాదం: "ఆ మనిషిని తాను ఎరుగనని" (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
యేసును విచారణ, మరణము యొక్క వృత్తాంతంనకు ఇది ప్రారంభము.
యూదా తనను తాను ఎలా చంపుకున్నాడో (27:3
10). తెలియజేయుటకు యేసును బంధించిన కథను చెప్పటము రచయిత నిలుపు చేసాడు.
● అప్పుడు యూదా
"కథను మధ్యలో ఆపి మరొక క్రొత్త కథను చెప్పు విధానం నీ భాషలో ఉంటే దానిని నీవు ఇక్కడ ఉపయోగించవచ్చు.
● ముప్పది వెండి నాణెములు
యేసును అప్పగించుటకు యూదాకు ప్రధాన యాజకులు ఇచ్చిన డబ్బు (26:15).
● నిరపరాద రక్తము
"మరణదండనకు తగిన ఆధారము లేని వాడు" (చూడండి: అన్యాపదేశము).
యూదా తనను తాను ఎలా చంపుకున్నాడో ఈ వృత్తాంతంలో కొనసాగుతుంది.
● ఇది పెట్టుటకు న్యాయము కాదు
"ఇది పెట్టుటకు మన ధర్మశాస్త్రము అంగీకరించదు."
● ఇది పెట్టుట
ఈ వెండిని పెట్టుట.
● రక్త క్రయధనము
"ఒక మనిషిని చంపటానికి చెల్లించిన ధనము" (చూడండి: అన్యాపదేశము, యు డి బి).
● కుమ్మరివాని పొలం
యెరూషలేములో పరదేశులను పాతి పెట్టుటకు వాడబడిన పొలం ఇది (యుడిబి చూడండి).
● నేటి వరకు
రచయిత ఈ మాటలు వ్రాసిన కాలం వరకు
యూదా తనను తాను ఎలా చంపుకున్నాడో ఈ వృత్తాంతంలో కొనసాగుతుంది.
● అప్పుడు... అని ప్రవక్తయైన యిర్మియా ద్వారా చెప్పబడినది నెరవేరెను
"ఈ ప్రవచనంను ప్రవక్తయైన యిర్మియా మాట్లాడెను, అది నెరవేరింది; అతను చెప్పినదేమనగా" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ఇశ్రాయేలు ప్రజలు
"ఇశ్రాయేలు మత నాయకులు (చూడండి: అన్యాపదేశము).
● నాకు ఆదేశించిన
"ప్రవక్తయైన యిర్మియాకు" ఆదేశించిన (27:9).
రోమా గవర్నరు ఎదుట యేసుపై జరిగిన విచారణ 27:2 దగ్గర ఆపిన కథ ఇక్కడనుంచి మరలా ఈ వాక్యభాగముల గుండా కొనసాగుతుంది.
● ఇప్పుడు
కథను మధ్యలో ఆపిన తరువాత మరలా దానిని తిరిగి ప్రారంభించే విధానం నీ భాషలో ఉన్నవిధంగా ఇక్కడ నీవు వాడవచ్చు.
● గవర్నరు
పిలాతు (27:1).
● నీవు చెప్పినట్లే
"నీవంగీకరించినట్లే" (చూడండి: జాతీయం).
● కాని ప్రధాన యాజకులు చేత, పెద్దలు చేత నేరారోపణ చేయబడినప్పుడు
ప్రత్యామ్నాయ అనువాదం: "కాని ప్రధాన యాజకులు పెద్దలు ఆయనను నిందించినప్పుడు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● నీ మీద మోపుచున్న నేరములను నీవు వినటము లేదా?
"నీవు చెడ్డ పనులు చేస్తున్నావని నిన్ను ఈ ప్రజలు నిందిస్తుంటే నీవు సమాధానమివ్వకపోవుట నాకు ఆశ్చర్యముగా ఉన్నది!" (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న).
● ఒక్క మాట కూడా..., కావున గవర్నరు మిక్కిలి ఆశ్చర్యపడెను
ప్రత్యామ్నాయ అనువాదం: "ఒక్క మాట కూడ...; గవర్నరును ఇది మిక్కిలి ఆశ్చర్యపరచింది"
గవర్నరు ఎదుట యేసుపై జరిగిన విచారణ ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఇప్పుడు
ప్రధాన కథకు మధ్యలో ఏమి జరిగిందో చదువుచున్నవారు గ్రహించేలా తగిన సమాచారమిచ్చుటకు రచయిత ఇక్కడ 27:17లో ఈ మాటను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: రచనా శైలులు
నేపథ్య సమాచారము).
● పండుగ
పస్కాను జరుపుకునే పండుగ
● జనసమూహము చేత ఎన్నిక చేయబడిన ఖైదీ
ప్రత్యామ్నాయ అనువాదం: "జన సమూహము ఎన్నుకొనిన ఖైదీ" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● పేరుమోసిన
"చెడ్డ పనులు చేయుచున్నందుకు అందరికీ భాగా తెలిసిన"
గవర్నరు ఎదుట యేసుపై జరిగిన విచారణ ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయనను అప్పగించిరి
పిలాతు తీర్పు తీర్చులాగున "యేసును ఆయన యొద్దకు తీసుకొనివచ్చిరి"
● ఆయన... కూర్చుని యుండగా
"పిలాతు కూర్చుని యుండగా"
● న్యాయపీఠము మీద కూర్చుని
"ఒక అధికారిగా తన విధిని నిర్వర్తిస్తుండగా" (చూడండి: రూపకాలంకారము).
● మాటను పంపెను
"వర్తమానము పంపెను"
గవర్నరు ఎదుట యేసుపై జరిగిన విచారణ ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● వారిని అడిగెను
"జనసమూహమును అడిగెను"
గవర్నరు ఎదుట యేసుపై జరిగిన విచారణ ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయన చేసినది ఏమిటి?
"యేసు చేసినది ఏమిటి?
● వారు కేకలు వేసిరి
"జనసమూహము కేకలు వేసిరి."
● రక్తము
"మరణము" (చూడండి: అన్యాపదేశము).
గవర్నరు ఎదుట యేసుపై జరిగిన విచారణ ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక!
"అవును! ఆయనకు మరణ దండన వేయటానికి మేము మా సంతానము సంతోషముగా బాధ్యత వహిస్తున్నాము!" (చూడండి: అన్యాపదేశము).
రోమా సైనికులు యేసును పరిహాసము చేయుట ఈ వాక్యభాగములలో ప్రారంభమౌతుంది
● అధికార మందిరము
సాధ్యమైన అర్థాలు: 1). సైనికులు నివసించు స్థలము (యుడిబి చూడండి). లేక 2). అధికారి నివసించు స్థలము.
● ఆయనకు వస్త్రములు తీసివేసిరి
"ఆయన వస్త్రములు లాగి వేసిరి"
● సిందూర వర్ణము
నిగనిగలాడే ఎరుపు వర్ణము.
● శుభము
"మేము నిన్ను ఘనపరుస్తున్నాము" లేక "నీవు చిరకాలం జీవించును గాక."
రోమా సైనికులు యేసును పరిహాసము ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● వారు. వారు.. వారు
పిలాతు సైనికులు
● ఆయన..ఆయనను..ఆయనను..ఆయన..ఆయన..ఆయనను
యేసు
యేసు ఎప్పుడు సిలువ వేయబడెను అనే సంఘటన ఈ వాక్యభాగములలో ప్రారంభమౌతుంది.
● వారు వెళ్లుచుండగా
"వారు యెరూషలేమునుండి వెళ్లుచుండగా" (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
● ఆయన సిలువను అతడు మోయునట్లు అతనిని వారితో కూడా రమ్మని బలవంతము చేసిరి
"యేసు సిలువను మోయునట్లు సైనికులు అతనిని వారితో కూడా రమ్మని బలవంతము చేసిరి."
● గొల్గొతా అనబడిన స్థలము
"గొల్గొతా అని ప్రజలు పిలుచు స్థలము."
● చేదు రసము
జీర్ణక్రియ జరగటానికి శరీరము ఉపయోగించే చేదైన పసుపు వర్ణపు రసము.
యేసు సిలువ వేయబడి మరణించిన సంఘటన ఈ వాక్యభాగములలో ప్రారంభమౌతుంది.
● వస్త్రములు
యేసు వేసుకొనియున్న వస్త్రములు (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
యేసు సిలువ మరణముల సంఘటన ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయనతో పాటు దొంగలు కూడా సిలువ వేయబడిరి
ప్రత్యామ్నాయ అనువాదం: "యేసుతోపాటు ఇద్దరు దొంగలను కూడా సైనికులు సిలువ వేసిరి (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● తమ తలలు ఊపిరి
యేసును అపహాస్యము చేయుటకు
యేసు సిలువ మరణముల వైనము ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయన ఇతరులను రక్షించెను, కాని తనను తాను రక్షించుకొనలేడు
సాధ్యమైన అర్థాలు: 1). యేసు ఇతరులను రక్షించెననిగాని (చూడండి: నిందాస్తుతి, యు డి బి). లేక తనను తాను రక్షించుకొనునని గాని యూదుల నాయకులు నమ్మలేదు, లేక 2). ఇతరులను ఆయన రక్షించెనని నమ్ముచున్నారుగాని, ఇప్పుడు తనను తాను రక్షించుకోలేనందుకు ఆయనను చూచి నవ్వుచున్నారు.
● ఆయన ఇశ్రాయేలు రాజు
యేసు ఇశ్రాయేలు రాజు అని నాయకులు నమ్ముట లేదు (చూడండి: నిందాస్తుతి).
యేసు సిలువ మరణముల వైనము ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలు
"యేసుతో పాటు సైనికులు సిలువ వేసిన దొంగలు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
యేసు సిలువ మరణముల వైనము ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● కేక వేసెను
"పిలిచెను" లేక "అరిచాడు."
● ఏలీ, ఏలీ, లామా సబక్తానీ
తర్జుమాదారులు ఈ మాటలను తమ ప్రాంతీయ హీబ్రూ భాషలోనే ఉంచిరి. (చూడండి: పేర్లు తర్జుమా).
యేసు సిలువ మరణముల వైనము ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● వారిలో ఒకడు
సాధ్యమైన అర్థాలు: 1). సైనికులలో ఒకడు లేక 2). దగ్గర నిలిచి చూస్తున్నవారిలో ఒకడు
● స్పంజి
సముద్రపుపాచి అనబడిన సముద్రపు జీవిని కోసుకొచ్చి ద్రవములను పట్టి ఉంచుటకు తరువాత పిండివేయుటకు వుపయోగించేవారు.
● ఆయనకు ఇచ్చిరి
"యేసుకు ఇచ్చిరి."
యేసు మరణించినప్పుడు జరిగిన సంఘటనల బాపతు ఈ వాక్యభాగములో ప్రారంభము.
● ఇదిగో
చెప్పబోవుచున్న ఆశ్చర్యకరమైన సమాచారమును మనస్సుపెట్టి చదవమని రచయిత చెబుతున్నాడు.
● సమాధులు తెరువబడెను, నిద్రించిన అనేకమంది పరిశుద్దుల శరీరములు లేచెను
"దేవుడు సమాధులను తెరిచి చనిపోయిన అనేకమంది పరిశుద్దుల శరీరములను లేపెను." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● నిద్రించిన
చనిపోయిన (చూడండి: మృదూక్తి).
● సమాధులు తెరువబడెను... అనేకమందికి కనబడిరి
సంఘటనలు జరిగిన క్రమము స్పష్టముగా ఉన్నది. సాధ్యమైన క్రమము ఏమనగా: యేసు చనిపోయినప్పుడు వచ్చిన భూకంపము తరువాత సమాధులు తెరువబడినవి 1). పరిశుద్దులు లేచిరి, యేసు పునరుత్థానుడయ్యాడు, పరిశుద్ధులు పట్టణములోనికి వెళ్ళి అనేక మంది ప్రజలకు కనబడిరి, లేక 2). యేసు పునరుత్థానుడయ్యాడు, పరిశుద్దులు లేచారు, పట్టణములో ప్రవేశించారు, అనేక మంది ప్రజలకు కనబడ్డారు.
యేసు చనిపోయినప్పుడు జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనల బాపతు ఈ వాక్యభాగములో కొనసాగింపు.
యేసు సమాధి చేయబడుటను గూర్చిన వృత్తాంతం ఈ వాక్యభాగములలో ప్రారంభము.
● అప్పుడు పిలాతు దానిని అతనికి ఇవ్వమని ఆజ్ఞాపించెను.
"అప్పుడు పిలాతు యేసు దేహంను యోసేపుకు ఇవ్వమని సైనికులకు ఆజ్ఞాపించెను"
యేసు సమాధి చేయబడుటను గూర్చిన వృత్తాంతం ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● నార బట్టలు
కొనటానికి చాలా విలువైన వస్త్రాలు.
● సమాధికి ఎదురుగా
"సమాధి ముందు భాగము"
యేసు సమాధి చేయబడిన తరువాత జరిగిన సంఘటనల వైనము ఈ వాక్యభాగములో కొనసాగుతుంది.
● సిద్దపరచు దినం
పస్కాను భుజించుటకు సిద్దపడు దినం.
● ఈ మోసగాడు బ్రతికియున్నప్పుడు
"మోసగాడైన యేసు బ్రతికియున్నప్పుడు."
యేసు సమాధి చేయబడిన తరువాత జరిగిన సంఘటనల వైనము ఈ వాక్యభాగములో కొనసాగుతుంది
● కావలి
4 నుంచి 16 మంది రోమా సైనికులు
● రాతికి ముద్ర వేసి
సాధ్యమైన అర్థాలు: 1). సమాధి ద్వారమునకు ఇరు ప్రక్కల రాతి గోడలకు త్రాడును అతికిస్తూ ఆ పొర్లించిన రాతి చుట్టు పెట్టిరి. (యుడిబి చూడండి). లేక 2). పొర్లించిన రాతికి , రాతి గోడలకు మధ్య ముద్రలు వేసిరి.
● కావలిని ఉంచిరి
సమాధిని ప్రజలు తాకకుండా చూడమని చెప్పి సైనికులను అక్కడ నిలువబెట్టిరి.
యేసు మరణమునుండి పునరుత్థానుడైన సంఘటన ఈ వాక్యభాగములలో ప్రారంభము.
● విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత, మరుసటి వారమునకు మొదటి దినాన ఇంక ప్రొద్దు పొడుస్తుందనగా
"విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత, ఆదివారము ఉదయమునే సూర్యుడు వచ్చెను."
● వేరొక మరియ
"మరియ అను పేరుగల వేరొక స్త్రీ," యాకోబూ యోసేపుల తల్లి మరియ (27:56).
● ఇదిగో
ఏదో ఆశ్చర్యమైన సంగతి జరగబోతుందని రచయిత చెబుతున్నాడు. నీ భాషలో ఇలా వ్యవహరించే విధానం వేరేదైనా ఉంటే దానిని వాడు.
● అప్పుడు మహా భూకంపము కలిగెను, ప్రభువు దూత దిగివచ్చెను. రాతిని పొర్లించెను
సాధ్యమైన అర్థాలు: 1). దూత వచ్చి రాయిని పొర్లించిన కారణమున భూకంపము కలిగియుండవచ్చు (యు ఎల్ బి). లేక 2). ఈ సంఘటనలన్నీ ఒకే సమయములో జరిగియుండవచ్చును. (యు ఎల్ బి).
● భూకంపము
అకస్మాత్తుగాను ప్రచండముగాను భూమి కదులుట.
యేసు మరణమునుండి పునరుత్థానుడైన సంఘటన ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● ఆయన రూపము
"దేవదూత రూపము వలె."
● మెరుపు వలె
"ప్రకాశమైన మెరుపు వలె."
● తెల్లని మంచువలె
"అత్యధికమైన ప్రకాశం."
● చచ్చిన వారి వలె
"కదలలేని స్థితి."
యేసు మరణమునుండి పునరుత్థానుడైన సంఘటన ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● స్త్రీలు
"మగ్దలేనే మరియ, వేరొక మరియ."
● సిలువ వేయబడినవానిని
"ప్రజలు సైనికులు సిలువ వేసిన వానిని” (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● లేచియున్నాడు
“దేవుడు ఆయనను లేపియున్నాడు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
యేసు మరణమునుండి పునరుత్థానుడైన సంఘటన ఈ వాక్యభాగములలో కొనసాగుతుంది.
● స్త్రీలు
"మగ్దలేనే మరియ వేరొక మరియ."
● ఇదిగో
ఏదో ఆశ్చర్యమైన సంగతి జరగబోతుందని రచయిత చెబుతున్నాడు. నీ భాషలో ఇలా వ్యవహరించే విధానం వేరేదైనా ఉండవచ్చు
● ఆయన పాదములు పట్టుకొని
"తమ మోకాళ్ళ మీదికి దిగి ఆయన పాదములు పట్టుకొనిరి."
● నా సహోదరులు
యేసు శిష్యులు
పునరుత్థానమును గూర్చి అధికారుల ప్రతిస్పందన ఈ వాక్యభాగములలో ప్రారంభమౌతుంది.
● స్త్రీలు
"మగ్దలేనే మరియ వేరొక మరియ."
● ఇదిగో
పెద్దకథలో ఇప్పటివరకు చెప్పుకున్నదానికి భిన్నమైన ప్రజలతో కూడిన వేరొక సంఘటన ప్రారంభమౌతుందని తెలియజేస్తుంది. నీ భాషలో ఇలా వ్యవహరించే విధానం వేరేదైనా ఉండవచ్చు.
● వారితో చర్చించిరి
"తమలో తాము ఒక ఆలోచనచేసి ఒక నిర్ణయమునకు వచ్చిరి." సైనికులకు ద్రవ్యమిచ్చుటకు యాజకులు పెద్దలు నిర్ణయించుకొనిరి.
● ‘మేము నిద్రపోవుచుండగా...యేసు శిష్యులు వచ్చి. ఇతరులతో చెప్పుడి
"ఎవరైనా మిమ్ములను అడిగితే, మేము నిద్రపోవుచుండగా... యేసు శిష్యులు వచ్చి...అని చెప్పండి"
సైనికులకు అధికారులు చెప్పిన మాటలు ఈ వాక్యభాగములో కొనసాగుచున్నవి.
● గవర్నరు
పిలాతు (27:2).
● వారికి చెప్పబడిన రీతిగా చేసిరి
"చేయమని యాజకులు వారితో చెప్పినట్లు చేసిరి" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● నేటికి
మత్తయి ఈ పుస్తకమును వ్రాసిన సమయము నాటికి.
పునరుత్థానము తరువాత యేసు తన శిష్యులను కలుసుకొనిన సంఘటన ఈ వాక్యభాగములలో ప్రారంభము
పునరుత్థానము తరువాత యేసు తన శిష్యులను కలుసుకొనిన సంఘటన ఈ వాక్యభాగములలో కొనసాగింపు.
● నామములోనికి
"అధికారము ద్వారా."
పునరుత్థానము తరువాత యేసు తన శిష్యులను కలుసుకొనిన సంఘటన ఈ వాక్యభాగములలో ప్రారంభము.
● వారికి బోధించుడి
"మీరు బాప్తీస్మమిచ్చిన వారికి బోధించండి" (28:19).
● చూడండి
ప్రత్యామ్నాయ అనువాదం: "దృష్టించండి" లేక "వినండి" లేక "నేను మీతో చెప్పబోవుచున్నదాని పైన మనస్సు పెట్టండి."