Telugu: Translation Questions for 1 Corinthians, 1 John, 1 Peter, 1 Thessalonians, 1 Timothy, 2 Corinthians, 2 John, 2 Peter, 2 Thessalonians, 2 Timothy, 3 John, Acts, Colossians, Deuteronomy, Ephesians, Exodus, Galatians, Genesis, Hebrews, James, John, Jude, Leviticus, Luke, Mark, Matthew, Numbers, Philemon, Philippians, Revelation, Romans, Titus

Formatted for Translators

©2022 Wycliffe Associates
Released under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.
Bible Text: The English Unlocked Literal Bible (ULB)
©2017 Wycliffe Associates
Available at https://bibleineverylanguage.org/translations
The English Unlocked Literal Bible is based on the unfoldingWord® Literal Text, CC BY-SA 4.0. The original work of the unfoldingWord® Literal Text is available at https://unfoldingword.bible/ult/.
The ULB is licensed under the Creative Commons Attribution-ShareAlike 4.0 International License.
Notes: English ULB Translation Notes
©2017 Wycliffe Associates
Available at https://bibleineverylanguage.org/translations
The English ULB Translation Notes is based on the unfoldingWord translationNotes, under CC BY-SA 4.0. The original unfoldingWord work is available at https://unfoldingword.bible/utn.
The ULB Notes is licensed under the Creative Commons Attribution-ShareAlike 4.0 International License.
To view a copy of the CC BY-SA 4.0 license visit http://creativecommons.org/licenses/by-sa/4.0/
Below is a human-readable summary of (and not a substitute for) the license.
You are free to:
The licensor cannot revoke these freedoms as long as you follow the license terms.
Under the following conditions:
Notices:
You do not have to comply with the license for elements of the material in the public domain or where your use is permitted by an applicable exception or limitation.
No warranties are given. The license may not give you all of the permissions necessary for your intended use. For example, other rights such as publicity, privacy, or moral rights may limit how you use the material.

Chapter 1

Translation Questions

Matthew 1:1

యేసు వంశావళిలో తమ ప్రాముఖ్యతనుబట్టి మొదటిగా పేర్కొన్న ఇద్దరు పూర్వీకులు ఎవరు?

మొదటిగా పేర్కొన్న ఇద్దరు పూర్వీకులు దావీదు, అబ్రాహాము. (1:1)

Matthew 1:15

వంశావళిలో ఎవరి భార్య పేరు ఉంది? ఎందువలన?

యోసేపు భార్య మరియ. ఎందుకంటే ఆమె యేసుకు జన్మనిచ్చింది (1:16).

Matthew 1:18

మరియ యోసేపుకు ప్రదానం కావడానికి ముందు ఏమి జరిగింది?

మరియ యోసేపుకు ప్రదానం కావడానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది (1:18).

యోసేపు ఎలాంటివాడు?

యోసేపు నీతిమంతుడు (1:19).

మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు ఏమి చేయాలని నిర్ణయించుకున్నాడు?

యోసేపు మరియను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు (1:19).

Matthew 1:20

మరియను విడిచిపెట్టకూడని ఎందుకు నిర్ణయించుకున్నాడు?

యోసేపుకు దేవదూత కలలో కనబడి మరియను భార్యగా స్వీకరించమని, ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పాడు (1:20).

యోసేపు ఆ బాలునికి యేసు అనే పేరు ఎందుకు పెట్టాడు?

ఆయన తన ప్రజలను తమ పాపాలనుండి రక్షిస్తాడు కనుక అ పేరు పెట్టాడు (1:21).

Matthew 1:22

పాత నిబంధనలో ఈ సంగతులన్నీ జరుగుతాయని చెప్పిన ప్రవచనం ఏమిటి?

కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అని పాత నిబంధనలో ప్రవక్త చెప్పినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అంటే "దేవుడు మనకు తోడు" అని అర్థం (1:23).

Matthew 1:24

మరియ యేసుకు జన్మనిచ్చేంత వరకు యోసేపు ఎలాంటి జాగ్రత్త తీసుకొన్నాడు?

మరియ యేసుకు జన్మనిచ్చేంత వరకు ఆమెను సమీపించలేదు (1:25).


Chapter 2

Translation Questions

Matthew 2:1

యేసు ఎక్కడ జన్మించాడు?

యేసు యూదా దేశంలోని బెత్లేహేములో జన్మించాడు (2:1).

తూర్పు దేశపు జ్ఞానులు యేసును ఏమని పిలిచారు?

తూర్పు దేశపు జ్ఞానులు యేసును "యూదుల రాజు" అని పిలిచారు (2:2).

యూదుల రాజు పుట్టాడని జ్ఞానులు ఎలా తెలుసుకున్నారు?

తూర్పు దిక్కున వెలసిన యూదుల రాజు నక్షత్రం చూసి తెలుసుకున్నారు (2:2).

జ్ఞానులనుంది ఈ వార్త విన్న హేరోదు రాజు ఎలా స్పందించాడు?

ఈ వార్త విన్న హేరోదు రాజు కలవరపడ్డాడు (2:3).

Matthew 2:4

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు పుడతాడని ఎలా తెలుసుకున్నారు?

యేసు బేత్లెహేములో పుడతాడని ప్రవచనం ద్వారా వారు తెలుసుకున్నారు (2:5-6).

Matthew 2:9

జ్ఞానులు యేసు కచ్చితంగా ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోగలిగారు?

తూర్పు దేశం నుండి జ్ఞానులను నడిపించిన నక్షత్రం యేసు ఉన్న యింటిపై నిలిచింది (2:9).

Matthew 2:11

జ్ఞానులు యేసును దగ్గరకు వచ్చినప్పడు యేసు వయసు ఎంత?

జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నాడు (2:11).

జ్ఞానులు యేసుకు ఇచ్చిన కానుకలు ఏమిటి?

జ్ఞానులు యేసుకు బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా ఇచ్చారు (2:11).

జ్ఞానులు ఏ మార్గంలో తిరిగివెళ్లారు? ఎందుకు?

వారిని హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని దేవుడు హెచ్చరించినందువల్ల వారు వేరొక మార్గంలో వెళ్లారు (2:12).

Matthew 2:13

కలలో యోసేపుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబడ్డాయి?

హేరోదు యేసును చంపాలని చూస్తున్నాడని, అందువల్ల మరియను, యేసును తీసుకొని ఐగుప్తుకు పారిపొమ్మని కలలో దూత చెప్పాడు (2:13).

యేసును ఇగుప్తుకు తీసుకు వెళ్ళినప్పుడు ఏ ప్రవచనం నేరేవేరింది?

యేసును ఇగుప్తుకు తీసుకు వెళ్ళినప్పుడు 'ఇగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని' అనే ప్రవచనం నెరవేరింది (2:15).

Matthew 2:16

జ్ఞానులు తన దగ్గరకు తిరిగి రానప్పుడు హేరోదు ఏమి చేశాడు?

బేత్లెహేము ప్రాంతంలోని రెండు సంవత్సరాల లోపు వయసు మగ పిల్లలను చంపించాడు (2:16).

Matthew 2:19

హేరోదు మరణించిన తరువాత యోసేపుకు ఏ సూచనలు అందాయి?

యోసేపుకు కలలో ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళమని సూచనలు అందాయి (2:19-20).

Matthew 2:22

యోసేపు మరియా, యేసులతో కలసి ఎక్కడ నివసించాడు?

యోసేపు మరియా, యేసులతో కలసి గలిలయలోని నజరేతులో నివసించాడు (2:22-23).

యోసేపు కొత్త ప్రాంతానికి వెళ్లడం వల్ల ఏ ప్రవచనం నెరవేరింది?

క్రీస్తు నజరేతువాడని ప్రవక్తలు పలికిన మాట నెరవేరింది (2:23).


Chapter 3

Translation Questions

Matthew 3:1

అరణ్యంలో బాప్తిసమిచ్చే యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు?

బాప్తిసమిచ్చే యోహాను "పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి" అని ప్రకటిస్తున్నాడు (3:2).

యెషయా ప్రవక్త పలికిన ఏ ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు?

"ప్రభువు మార్గము సరాళము చేయుడి" అనే ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు (3:3).

Matthew 3:7

పరిసయ్యులును, సద్దూకయ్యులను చూసి వారిని ఏమి చేయమని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు?

మారుమనస్సుకు తగిన ఫలము ఫలించమని బాప్తిసమిచ్చే యోహాను పరిసయ్యులకు, సద్దూకయ్యులకు చెప్పాడు (3:8).

పరిసయ్యులు, సద్దూకయ్యులు తమలో తాము ఏమి అనుకోవద్దని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు?

అబ్రాహాము తమ తండ్రి అని తమలో తాము అనుకోవద్దని యోహాను చెప్పాడు (3:9).

Matthew 3:10

యోహాను ప్రకారం మంచి ఫలము ఫలించని చెట్టుకు ఏమి జరుగుతుంది?

మంచి ఫలము ఫలించని చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుందని యోహాను చెప్పాడు (3:10).

బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు ఏమి చేస్తాడు?

బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలో, అగ్నిలో బాప్తిసమిస్తాడు (3:11).

Matthew 3:13

యేసుకు బాప్తిసమిచ్చే యోహాను బాప్తిసమిచ్చేందుకు అంగీకరించకపొతే యేసు ఏమి చెప్పాడు?

"నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది" అని యేసు యోహానుతో చెప్పాడు (3:15).

Matthew 3:16

యేసు నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు ఏమి చూసాడు?

యేసు నీటిలో నుండి బయటకు వచ్చీనప్పుదు దేవుని ఆత్మ పావురం రూపంలో పైనుండి తన పైకి క్రిందికి దిగి రావడం చూసాడు (3:16).

యేసు బాప్తిస్మం తీసుకొన్న తరువాత పరలోకం నుండి స్వరం ఏమని పలికింది?

"ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అన్న స్వరం పరలోకం నుండి వినిపించింది (3:17).


Chapter 4

Translation Questions

Matthew 4:1

అపవాది చేత శోధింపబడడానికి యేసును అరణ్యంలోకి ఎవరు కొనిపోయారు?

అపవాది చేత శోధింపబడడానికి యేసును ఆత్మ కొనిపోయాడు (4:1).

యేసు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?

యేసు నలభై పగళ్ళు , నలభై రాత్రులు ఉపవాసమున్నాడు (4:2).

అపవాది యేసును శోధించిన మొదటి శోధన ఏమిటి?

రాళ్ళను రొట్టెలుగా చేయమని అపవాది యేసును మొదటిగా శోధించాడు (4:3).

మొదటి శోధనకు యేసు చెప్పిన జవాబు ఏమిటి?

మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు జవాబిచ్చాడు (4:4).

Matthew 4:5

అపవాది యేసు ముందు ఉంచిన రెండవ శోధన ఏమిటి?

అపవాది యేసును దేవాలయంపై నుండి క్రిందికి దూకమని చెప్పి శోదించాడు (4:5-6).

Matthew 4:7

రెండవ శోధనకు యేసు ఏమని జవాబిచ్చాడు?

యేసు, ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు (4:7).

అపవాది యేసు ముందు ఉంచిన మూడవ శోధన ఏమిటి?

అపవాది తనకు సాగిలపడి నమస్కారము చేయమని చెప్పాడు (4:8-9).

Matthew 4:10

మూడవ శోధనకు యేసు ఏమని జవాబిచ్చాడు?

ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని యేసు అపవాదికి చెప్పాడు (4:10).

Matthew 4:14

యేసు కపెర్నహూము లోని గలిలయ వచ్చినప్పుడు ఏమి నెరవేర్చబడింది?

గలిలయ లోని ప్రజలకు వెలుగు కనబడింది అని పలికిన యెషయా ప్రవచనం నెరవేరింది (4:15-16).

Matthew 4:17

ఏమి సందేశం యేసు బోధించడం మొదలుపెట్టాడు?

యేసు, "పరలోకరాజ్యము సమీపించియున్నది కనుక మారుమనస్సు పొందుది" అని ప్రకటించడం మొదలుపెట్టాడు" (4:17).

Matthew 4:18

పేతురు, ఆంద్రెయలను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?

పేతురు, ఆంద్రెయలను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తానని యేసు చెప్పాడు (4:19).

Matthew 4:21

పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు తమ జీవనానికి ఏ పని చేస్తారు?

పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు చేపలు పట్టేవారు (4:18,21).

Matthew 4:23

ఈ సమయంలో బోధించడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు?

యేసు గలిలయలోని సమాజమందిరములోకి వెళ్ళాడు (4:23).

ఏ ఏ రకాల ప్రజలు యేసు దగ్గరకు తేబడుతున్నారు? యేసు వారికి ఏమి చేస్తున్నాడు?

నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నవారిని, దయ్యములు పట్టినవారిని ఆయన దగ్గరకు తెస్తున్నారు, యేసు వారిని బాగుపరుస్తున్నాడు (4:24).

ఈ సమయంలో ఎంతమంది యేసును అనుసరిస్తున్నారు?

ఈ సమయంలో బహు జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు (4:25).


Chapter 5

Translation Questions

Matthew 5:1

ఆత్మ విషయంలో దీనులైనవారు ఎందువలన ధన్యులు?

ఆత్మ విషయంలో దీనులైనవారు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిది (5:3).

దు:ఖపడేవారు ఎందువలన ధన్యులు?

దు:ఖపడేవారు ధన్యులు, ఎందుకంటే వారు ఓదార్చబడతారు (5:4).

Matthew 5:5

సాత్వీకులు ఎందువలన ధన్యులు?

సాత్వీకులు ధన్యులు, ఎందుకంటే వారు భూలోకంను స్వతంత్రించుకొంటారు (5:5).

నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ఎందువలన ధన్యులు?

నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, ఎందుకంటే వారు తృప్తిపరచబడతారు (5:6).

Matthew 5:11

యేసు నిమిత్తం జనులచే హింసించబడిన వారు ఎందువలన ధన్యులు?

యేసు నిమిత్తం జనులచే హింసించబడేవారు ధన్యులు, ఎందుకంటే పరలోకమందు వారి ఫలము అధికమౌతుంది (5:11-12).

Matthew 5:15

విశ్వాసులు ఇతరుల ఎదుట తమ వెలుగును ఎందుకు ప్రకాశింపనియ్యాలి?

విశ్వాసులు తమ మంచి క్రియలను బట్టి ఇతరుల ఎదుట తమ వెలుగును ప్రకాశింపనియ్యాలి (5:15-16).

Matthew 5:17

పాత నిబంధన చట్టాలను, ప్రవక్తల ప్రవచనాల విషయం ఏమి చేయడానికి యేసు వచ్చాడు?

పాత నిబంధన చట్టాలను, ప్రవక్తల ప్రవచనాలను నేరవేర్చడానికే యేసు వచ్చాడు (5:17).

Matthew 5:19

పరలోకంలో గొప్పవాడు అని పిలువబడేవాడు ఎవరు?

దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధించేవాడు పరలోకంలో గొప్పవాడు (5:19).

Matthew 5:21

నరహత్య చేసేవాడు మాత్రమే కాక, మరి ఇంకా ఎవరు తీర్పులోకి ప్రవేశిస్తాడు?

నరహత్య చేసేవాడు మాత్రమే కాక, తన సహోదరుని మీద కోపగించేవాడు కూడా తీర్పులోకి ప్రవేశిస్తాడు (5:21-22).

Matthew 5:23

నీ సహోదరుని పట్ల నీకు విరోధం ఏదైనా ఉన్నట్టయితే ఏమి చేయాలని యేసు బోధించాడు?

మనం మన సహోదరుని పట్ల విరోధం ఏదైనా ఉన్నట్టయితే అతనితో సమాధానపడాలని యేసు బోధించాడు? (5:23-24).

Matthew 5:25

మనం న్యాయాధిపతి ఎదుటికి వెళ్లేముందు మన ప్రతివాదిపట్ల ఏమి చేయాలని యేసు బోధించాడు?

త్రోవలో ఉండగానే మన ప్రతివాదితో సమాధానపడాలని యేసు బోధించాడు (5:25).

Matthew 5:27

వ్యభిచారం చేయడం మాత్రమే కాక, మరొకటి కూడా పాపమని యేసు చెప్పాడు, అది ఏమిటి?

వ్యభిచారం మాత్రమే కాదు గాని ఒక స్త్రీని మోహపు చూపు చూడడం కూడా పాపమేనని యేసు బోధించాడు (5:27-28).

Matthew 5:29

పాపంలో పడేలా చేసే విషయాలపట్ల మనం ఎలా ఉండాలని యేసు చెప్పాడు?

పాపంలో పడేలా చేసే విషయాలను మనం వదిలించుకొని, వాటికి దూరంగా ఉండాలని యేసు చెప్పాడు (5:29-30).

Matthew 5:31

విడాకులను యేసు ఎందుకు సమర్ధించాడు?

అవివాహితుల మధ్య వ్యభిచారం విషయంలో యేసు విడాకులు అనుమతించాడు (5:32).

ఒక భర్త తన భార్యను తప్పుగా విడాకులు తీసుకున్నట్లయితే, ఆమె భార్యను తిరిగి పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె ఏమి అయిది?

వ్యభిచార కారణం లేకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. [5:32].

Matthew 5:36

ఆకాశం తోడు, పరలోకం తోడు, భూలోకం తోడు, యెరూషలేము తోడు, తల తోడు అనడానికి బదులు మనం ఏమి చెప్పాలని యేసు చెప్పాడు?

వీటన్నిటికి మించి మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అని యేసు చెప్పాడు (5:33-37).

Matthew 5:38

దుష్టుని విషయంలో మనం ఎలా ఉండాలని యేసు బోధించాడు?

మనం దుష్టుని విషయంలో అతణ్ణి ఎదిరించకుండా ఉండాలని యేసు బోధించాడు (5:38-39).

Matthew 5:43

మనలను ద్వేషించేవారి పట్ల, మన శత్రువులపట్ల మన వైఖరి ఎలా ఉండాలని యేసు బోధించాడు?

మన శత్రువులను, మనలను ద్వేషించే వారిని ప్రేమించి, వారి కోసం ప్రార్ధించాలని యేసు బోధించాడు (5:43-44).

Matthew 5:46

మనలను ప్రేమించేవారిని మాత్రమే కాక, ద్వేషించేవారిని కూడా ప్రేమించాలని యేసు ఎందుకు బోధించాడు?

మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమిటి? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు గదా అని యేసు చెప్పాడు (5:46-47).


Chapter 6

Translation Questions

Matthew 6:1

మనం తండ్రి ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం చేసే పనులు ఎలా ఉండాలి?

మనం చేసే నీతి క్రియలు రహస్యంగా ఉండాలి (6:1-4).

Matthew 6:5

రహస్యంగా చేసే ప్రార్థన ఎవరి వద్దనుండి ప్రతిఫలం పొందుతుంది?

రహస్యంగా చేసే ప్రార్థన తండ్రి వద్దనుండి ప్రతిఫలం పొందుతుంది (6:6).

Matthew 6:8

మనం ప్రార్ధించే సమయంలో ఎలా ప్రార్ధించాలని యేసు చెప్పాడు?

మన తండ్రికి మన అక్కరలు ఏమిటో తెలుసు గనుక ప్రార్థనలో విస్తారమైన మాటలు పలుకవద్దని యేసు చెప్పాడు (6:7-8).

తండ్రి చిత్తం ఎక్కడ నెరవేరాలని మనం ప్రార్ధించాలి?

తండ్రి చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టుగా భూమియందును నెరవేరాలని ప్రార్ధించాలి (6:10).

Matthew 6:14

మన ఋణస్తులను మనం క్షమించకపోతే దేవుడు ఏమి చేస్తాడు?

మన ఋణస్తులను మనం క్షమించకపోతే దేవుడు మన ఋణాలను క్షమించడు (6:15).

Matthew 6:16

మనం తండ్రి నుంచి ప్రతిఫలం పొందాలంటే మన ఉపవాసం ఎలా ఉండాలి?

మనం ఉపవాసం చేస్తున్నట్టు ఇతరులకు కనబడేలా కాక, రహస్యమందున్న తండ్రికి కనబడేలా చేస్తే తండ్రి ప్రతిఫలమిస్తాడు (6:16-18).

Matthew 6:19

మన ధన నిధిని ఎక్కడ దాచుకోవాలి? ఎందుకు?

పరలోకంలో మన నిధి దాచుకోవాలి. ఎందుకంటే అది నాశనం కాదు, దొంగలు దోచుకోరు (6:19-20).

మన ధనం ఉన్నచోట ఏమి ఉంటుంది?

మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది (6:21).

Matthew 6:22

మనం ఎంచుకోవలసిన ఇద్దరు యజమానులు ఎవరు?

దేవుడు, సంపద అనే ఇద్దరు యజమానులలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి (6:24).

Matthew 6:25

ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని ఎందుకు చింతించకూడదు?

ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని మనం చింతించకూడదు. ఎందుకంటే, పక్షులను పట్టించుకొనే దేవుడు వాటికంటే శ్రేష్టమైన మనలను మరింత ఎక్కువగా పట్టించుకుంటాడు (6:25-26).

Matthew 6:27

మనం చింతించడం వల్ల ఏమి చేయలేమని యేసు గుర్తు చేస్తున్నాడు?

మనం చింతించడం వల్ల ఒక మూర ఎత్తు పెరగలేమని యేసు గుర్తు చేస్తున్నాడు (6:27).

Matthew 6:32

మన భూలోక అవసరాలు మనకు అనుగ్రహించబడాలంటే మనం మొదటగా దేనిని వెదకాలి?

మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటగా వెదకాలి. అప్పుడు మన భూలోక అవసరాలు మనకు అనుగ్రహించబడతాయి (6:33).


Chapter 7

Translation Questions

Matthew 7:3

మనం ఇతరుల కళ్ళలో ఉన్న నలుసు చూడడానికి ముందు ఏమి చేయ్యాలి?

మనం మొదటగా మన కళ్ళలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి (7:1-5).

Matthew 7:6

పరిశుధ్ధమైనది కుక్కలకు వేస్తే ఏమవుతుంది?

పరిశుధ్ధమైనది కుక్కలకు వేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కి మనమీద పడి మనలను చీల్చి వేస్తాయి (7:6).

Matthew 7:7

తండ్రి నుంచి పొందాలంటే మనం ఏమి చేయాలి?

మనం తండ్రి నుంచి పొందాలంటే ఆయనను అడగాలి, వెదకాలి, తట్టాలి (7:8).

Matthew 7:11

తండ్రిని అడిగేవారికి ఆయన ఏమి చేస్తాడు?

ఆయనను అడుగువారికి ఆయన మంచి ఈవులను అనుగ్రహిస్తాడు (7:11).

ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలని ధర్మశాస్త్రము, ప్రవక్తలు బోధించారు?

ఇతరుల మనకు ఏమి చేయాలని కోరుకుంటామో వారికీ అలానే చేయాలని ధర్మశాస్త్రము, ప్రవక్తలు బోధించారు (7:12).

Matthew 7:13

వెడల్పు మార్గము ఎక్కడకు నడిపిస్తుంది?

వెడల్పు మార్గము నాశనమునకు నడిపిస్తుంది (7:13).

ఇరుకు మార్గము ఎక్కడకు నడిపిస్తుంది?

ఇరుకు మార్గము జీవమునకు నడిపిస్తుంది (7:14).

Matthew 7:15

అబద్ధ ప్రవక్తలను మనం ఎలా గుర్తించాలి?

వారి జీవితాలలోని ఫలములను బట్టి వారిని గుర్తించగలము (7:15-20).

Matthew 7:21

పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించగలరు?

తండ్రి చిత్తం నేరవేర్చువారు పరలోకరాజ్యములో ప్రవేశిస్తారు (7:21).

యేసు నామంలో ప్రవచించినవారిని, దయ్యాలను వెళ్ళగొట్టినవారిని, అద్భుతాలు చేసిన వారిని చూసి యేసు ఏమి అంటాడు?

యేసు వారిని చూసి, "నేను మిమ్ములను ఎన్నటికీ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యెద్ద నుండి వెళ్ళండి" అంటాడు (7:22-23).

Matthew 7:24

యేసు చెప్పిన ఉపమానంలో ఇద్దరు యింటి యజమానులలో బుద్ధి గలవాడు ఎవరు?

యేసు మాటలు విని ఆ ప్రకారము చేసినవాడు బుద్ధిమంతుడు (7:24).

Matthew 7:26

యేసు చెప్పిన ఉపమానంలో ఇద్దరు యింటి యజమానులలో బుద్ధిలేనివాడు ఎవరు?

యేసు మాటలు విని ఆ ప్రకారము చేయనివాడు బుద్ధిలేనివాడు (7:26).

Matthew 7:28

శాస్త్రుల బోధలతో పోలిస్తే ఆయన బోధ ఎలా ఉన్నది?

శాస్త్రుల బోధలతో పోలిస్తే ఆయన బోధ అధికారము గలదిగా ఉన్నది (7:29).


Chapter 8

Translation Questions

Matthew 8:4

యేసు కుష్టరోగిని స్వస్థపరచిన తరువాత దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనబడి మోషే నియమించిన కానుక సమర్పించమని ఎందుకు చెప్పాడు?

స్వస్థపడిన కుష్టరోగి యాజకుని ఎదుట సాక్ష్యార్ధంగా కనబడాలని దేవాలయానికి వెళ్ళమన్నాడు (8:4).

Matthew 8:5

పక్షవాతంతో పడియున్న తన సేవకుణ్ణి స్వస్థపరచమని శతాధిపతి కోరినప్పుడు యేసు ఏమి చెప్పాడు?

నేను వచ్చి సేవకుణ్ణి స్వస్థపరుస్తానని యేసు చెప్పాడు (8:7).

Matthew 8:8

యేసు తన ఇంటికి రావడం అవసరం లేదని శతాధిపతి ఎందుకు చెప్పాడు?

యేసు తన ఇంటికి వచ్చుటకు తాను అయోగ్యుడనని శతాధిపతి తలంచాడు. యేసు ఒక్క మాట పలికితే తన సేవకుడు బాగుపడతాడని నమ్మాడు (8:8).

యేసు శతాధిపతిని ఏమని మెచ్చుకున్నాడు?

ఇశ్రాయేలీయులలో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసము కనబడలేదని యేసు చెప్పాడు (8:10).

Matthew 8:11

పరలోక రాజ్యములో ఎవరు భోజనపు బల్ల వద్ద కూర్చుంటారని యేసు చెప్పాడు?

అనేకులు తూర్పు నుండి, పడమర నుండి వచ్చి పరలోక రాజ్యములో భోజనపు బల్ల వద్ద కూర్చుంటారు (8:11).

ఏడ్పు, పండ్లు కొరుకుడు ఉండే చీకటిలోకి ఎవరు త్రోయబడతారని యేసు చెప్పాడు?

రాజ్య సంబంధులు చీకటిలోకి త్రోయబడతారని యేసు చెప్పాడు (8:12).

Matthew 8:14

యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎవరిని స్వస్థపరిచాడు?

యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు పేతురు అత్తను స్వస్థపరిచాడు (8:14-15).

Matthew 8:16

యేసు దయ్యములను వెళ్ళగొట్టి, సమస్త రోగులను స్వస్థపరిచినపుడు ఎవరి ప్రవచనం నెరవేర్చబడింది?

"ఆయన మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరింది (8:17).

Matthew 8:18

యేసు నివాసం గురించి ఒక శాస్త్రి అడిగిన ప్రశ్నకు ఆయన ఏమి జవాబిచ్చాడు?

యేసు తనకు తల వాల్చుకొనుటకు కూడా స్థలము లేదని చెప్పాడు (8:20).

Matthew 8:21

ఒక శిష్యుడు తన తండ్రిని పాతిపెట్టుటకు అనుమతినిమ్మని అడిగినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

యేసు ఆ శిష్యునితో, తనను వెంబడించమని, మరణించిన వారు మరణించిన వారిని పాతిపెట్టుకోనిమ్మని చెప్పాడు (8:21-22).

Matthew 8:23

సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు ఏమి చేస్తున్నాడు?

సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు నిద్రపోతున్నాడు (8:24).

Matthew 8:26

శిష్యులు యేసును లేపి తాము నశించిపోతున్నామని భయపడినప్పుడు యేసు వారితో ఏమన్నాడు?

యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "అల్ప విశ్వాసులారా, ఎందుకు భాధపడుతున్నారు?" (8:26).

అక్కడ మిక్కిలి నిమ్మళం అయినప్పుడు శిష్యులు ఎందుకు ఆశ్చర్యపడ్డారు?

యేసుకు గాలీ, సముద్రమూ లోబడుతున్నాయని శిష్యులు ఆశ్చర్యపడ్డారు (8:27).

Matthew 8:28

యేసు గదరేనీయుల దేశము వచ్చినప్పుడు ఎవరిని కలుసుకున్నాడు?

యేసు దయ్యములు పట్టిన ఇద్దరు ఉగ్రులైన మనుషులను కలుసుకున్నాడు (8:28).

వారిలో ఉన్న దయ్యములు యేసుతో ఏమని చెప్పాయి?

సమయము రాకమునుపే మమ్మును బాధించుటకు వచ్చితివా అని యేసుతో చెప్పాయి (8:29).

Matthew 8:30

వారిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు దయ్యాలు ఏమి చేశాయి?

యేసు ఆ దయ్యాలను వెళ్ళగొట్టగా, అవి పందుల గుంపులో ప్రవేశించి సముద్రములోకి వేగంగా పరుగెత్తి నీళ్ళలో పడి చనిపోయాయి (8:32).

Matthew 8:33

యేసు పట్టణంలో ప్రవేశించినప్పుడు పట్టణస్థులు ఆయనను ఏమని బ్రతిమాలుకొన్నారు?

పట్టణస్థులు తమ ప్రాంతం విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలుకొన్నారు (8:34).


Chapter 9

Translation Questions

Matthew 9:3

పక్షవాతం గలవానితో అతని పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం, స్వస్థపడి లేచి నడువమని చెప్పడం ఏది సులభమని ఎందుకు అడిగాడు?

పక్షవాతం గలవానితో అతని పాపలు క్షమించబడ్డాయని చెప్పడం ద్వారా ఆయనకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదని చెప్పాడు (9:5-6).

Matthew 9:7

పక్షవాతం గల రోగి స్వస్థపడినపుడు, అతని పాపాలు క్షమించబడినపుడు అక్కడ ఉన్నవారు దేవుణ్ణి ఎందుకు స్తుతించారు?

ప్రజలు భయపడి మనుష్యునికి ఇలాంటి అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించారు (9:8).

యేసు శిష్యుడు కాకముందు మత్తయి వృత్తి ఏమిటి?

యేసు శిష్యుడు కాకముందు మత్తయి సుంకపు పన్ను వసూలుదారుడు (9:9).

Matthew 9:10

యేసు, ఆయన శిష్యులు ఎవరితో కలసి భోజనం చేశారు?

యేసు, ఆయన శిష్యులు సుంకరులతో, పాపులతో కలసి భోజనం చేశారు (9:10).

Matthew 9:12

యేసు ఎవరిని పిలవడానికి వచ్చానని చెప్పాడు?

యేసు పాపులను పిలవడానికి వచ్చానని చెప్పాడు (9:13).

Matthew 9:14

తన శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదని యేసు చెప్పాడు?

తన శిష్యులతో తనతో కలసి ఉన్నందున వారు ఉపవాసం ఉండడం లేదని యేసు చెప్పాడు (9:15).

యేసు శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు?

యేసు వారి యొద్ద నుండి కొనిపోబడినప్పుడు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు (9:15).

Matthew 9:20

రక్తస్రావ రోగం గల స్త్రీ ఏమి చేసింది? ఎందుకు?

రక్తస్రావ రోగం గల స్త్రీ యేసు పైవస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే తాను స్వస్థపడతానని అనుకొన్నది (9:20-21).

రక్తస్రావ రోగం గల స్త్రీ బాగుపడడానికి ఏమి దోహదం చేసింది?

స్త్రీ బాగుపడడానికి ఆమె విశ్వాసం దోహద పడిందని యేసు చెప్పాడు (9:22).

Matthew 9:23

యేసు యూదా అధికారి ఇంట్లో ప్రవేశించినపుడు అక్కడి ప్రజలు ఆయనను ఎందుకు అపహసించారు?

ఆ బాలిక చనిపోలేదు, నిద్రపోతున్నదని యేసు చెప్పినప్పుడు అక్కడి ప్రజలు ఆయనను అపహసించారు (9:24).

Matthew 9:25

యేసు ఆ బాలికను మరణం నుండి లేపినప్పుడు ఏమి జరిగింది?

యేసు ఆ బాలికను మరణం నుండి లేపిన వార్త అ ప్రాంతమంతా వ్యాపించింది (9:26).

Matthew 9:27

ఇద్దరు గుడ్డి వారు యేసును వెంబడిస్తూ ఏమని కేకలు వేసారు?

"దావీదు కుమారుడా, మమ్మును కనికరించుము" అంటూ ఇద్దరుగుడ్డి వారు కేకలు వేసారు (9:27).

Matthew 9:29

గుడ్డి వారికి యేసు చూపు ఇచ్చినప్పుడు ఆయన వారిలో ఏమి చూసాడు?

యేసు ఇద్దరు గుడ్డి వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి స్వస్థపరిచాడు (9:29).

Matthew 9:32

దయ్యము పట్టిన మూగ వానిని స్వస్థపరిచినప్పుడు పరిసయ్యులు ఏమని నేరారోపణ చేశారు?

ఈయన దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు (9:34).

Matthew 9:35

యేసు జన సమూహమును చూసి ఎందుకు కనికర పడ్డాడు?

యేసు జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలే , విసిగి చెదరి ఉన్నందున వారిపై కనికరపడ్డాడు (9:36).

Matthew 9:37

దేని కొరకు అవసరంగా ప్రార్థన చేయాలని యేసు తన శిష్యులతో చెప్పాడు?

కొత్త విస్తారంగా ఉన్నందున కోత పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొమ్మని యేసు తన శిష్యులతో చెప్పాడు (9:38).


Chapter 10

Translation Questions

Matthew 10:1

యేసు తన పన్నెండుమంది శిష్యులకు వేటిపై అధికారం ఇచ్చాడు?

అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతివిధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరుచుటకు యేసు తన పన్నెండుమంది శిష్యులకు అధికారం ఇచ్చాడు (10:1).

Matthew 10:2

యేసును అప్పగించేబోయే శిష్యుని పేరు ఏమిటి?

యేసును అప్పగించేబోయే శిష్యుని పేరు ఇస్కరియోతు యూదా (10:4).

Matthew 10:5

ఆ సమయంలో యేసు తన శిష్యులను ఎక్కడికి పంపాడు?

యేసు తన శిష్యులను ఇశ్రాయేలు దేశంలోని నశించిన గొర్రెల యొద్దకు పంపాడు (10:6).

Matthew 10:8

శిష్యులు ధనం గానీ, అదనంగా దుస్తులు గానీ తమ వెంట తీసుకుని వెళ్ళవచ్చా?

లేదు, శిష్యులు ధనం గానీ, అదనంగా దుస్తులు గానీ తమ వెంట తీసుకుని వెళ్ళకూడదు (10:9-10).

Matthew 10:11

శిష్యులు గ్రామ గ్రామాలకు తిరుగుతున్నపుడు ఎక్కడ బస చెయ్యాలి?

శిష్యులు గ్రామ గ్రామాలకు తిరుగుతున్నపుడు యోగ్యుడైన ఒక వ్యక్తిని వెదకి అతని ఇంటి వద్ద బస చెయ్యాలి (10:11).

Matthew 10:14

శిష్యులను అంగీకరించక, వారి మాటలు వినని పట్టణాల ప్రజలకు ఎలాంటి తీర్పు ఉంటుంది?

శిష్యులను అంగీకరించక, వారి మాటలు వినని పట్టణాల ప్రజలకు సోదోమ గోమోర్రా జరిగినదానికంటే మించిన కీడు జరుగుతుంది (10:14-15).

Matthew 10:16

శిష్యులుగా ఉండగోరువారు ఎలా ఉండడానికి సిద్ధపడాలి?

శిష్యులుగా ఉండగోరువారు ప్రజలచే మహాసభలకు అప్పగింపబడడానికి, కొరడా దెబ్బలు తినడానికి, అధిపతుల ఎదుట నిలబడడానికి సిద్ధపడి ఉండాలి (10:17-18).

Matthew 10:19

శిష్యులు మాట్లాడుతున్నప్పుడు వారిలో ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారు?

శిష్యులు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడిస్తున్నారు (10:20).

Matthew 10:21

అంతములో ఎవరు రక్షింపబడతారని యేసు చెప్పాడు?

అంతము వరకు సహించినవాడు రక్షింపబడతారని యేసు చెప్పాడు (10:22).

Matthew 10:24

యేసును ద్వేషించినవారు ఆయన శిష్యుల పట్ల ఎలా ఉంటారు?

యేసును ద్వేషించినవారు ఆయన శిష్యులను కూడా ద్వేషిస్తారు (10:22,24-25).

Matthew 10:28

ఎవరికీ భయపడకూడని యేసు చెప్పాడు?

ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడనక్కరలేదని యేసు చెప్పాడు (10:28).

ఎవరికీ భయపడాలని యేసు చెప్పాడు?

ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపజేసే వాడికి భయపడాలని యేసు చెప్పాడు (10:28).

Matthew 10:32

యేసును ఒప్పుకొన్నవారి పట్ల ఆయన ఏమి చేస్తాడు?

యేసును ఒప్పుకొన్నవారిని ఆయన తన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు (10:32).

యేసును తిరస్కరించిన వారిని ఆయన ఏమి చేస్తాడు?

యేసును తిరస్కరించిన వారిని ఆయన తన తండ్రి ఎదుట తిరస్కరిస్తాడు (10:33).

Matthew 10:34

యేసు తాను ఎలాంటి విభేదాలు పెట్టేందుకు వచ్చానని చెప్పాడు?

గృహాలలోని సభ్యులలో విభేదాలు పెట్టేందుకు తాను వచ్చానని యేసు చెప్పాడు (10:34-36).

Matthew 10:37

యేసు కోసం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు ఏమి పొందుతాడు?

యేసు కోసం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు (10:39).

Matthew 10:42

శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు ఇచ్చేవాడు ఏమి పొందుతాడు?

శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు ఇచ్చేవాడు అందుకు తగిన ఫలము పొందుతాడు (10:42).


Chapter 11

Translation Questions

Matthew 11:1

యేసు ఏమి ముగించిన తరువాత పట్టణంలలో బోధించుటకు, ప్రకటించుటకు వెళ్ళిపోయాడు?

యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించుట ముగించిన తరువాత పట్టణంలలో బోధించుటకు, ప్రకటించుటకు వెళ్ళిపోయాడు (11:1).

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమి సందేశం యేసుకు పంపించాడు?

బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుకు, "రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా" అనే సందేశం పంపిచాడు (11:3).

Matthew 11:4

రాబోవువాడు ఈయనే అని ఋజువు చేసే సంఘటనలు ఏమి జరుగుతున్నాయని యేసు చెప్పాడు?

గుడ్డివారు చూచుచున్నారు, చనిపోయినవారు తిరిగి లేస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని యోహానుకు చెప్పమని యేసు చెప్పాడు (11:5).

ఎవరి విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడని యేసు చెప్పాడు?

తన విషయంలో అభ్యంతరపడనివాడు ధన్యుడని యేసు చెప్పాడు (11:6).

Matthew 11:9

యేసు జీవితంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎలాంటి పాత్ర పోషించాడు అని యేసు చెప్పాడు?

మార్గమును సిద్ధపరచడానికి ముందుగా రాబోవు దూత అని బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చిన ప్రవచనం ఉన్నది అని యేసు చెప్పాడు(11:9-10).

Matthew 11:13

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరు అని యేసు చెప్పాడు?

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలీయా ప్రవక్త అని యేసు చెప్పాడు (11:14).

Matthew 11:18

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమియు తినకుండా, తాగకుండా ఉంటునప్పుడు అక్కడివారు అతనిని గూర్చి ఏమన్నారు?

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమియు తినకుండా, త్రాగకుండా ఉండుటను బట్టి అతనికి దయ్యము పట్టింది అన్నారు (11:18).

యేసు ఇతరులతో కలసి తినుచూ, త్రాగుచూ ఉండుటను బట్టి అక్కడివారు అతనిని గూర్చి ఏమన్నారు?

యేసు ఇతరులతో కలసి తినుచూ, త్రాగుచూ ఉండుటను బట్టి అక్కడివారు అతనిని గూర్చి ఇతడు తిండిబోతు, తాగుబోతు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని చెప్పుకున్నారు (11:19).

Matthew 11:20

యేసు విస్తారమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ మార్పు నొందని పట్టణాల గురించి ఆయన ఏమని ప్రకటించాడు?

విస్తారమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ మార్పు నొందని పట్టణాలపై తీర్పు వస్తుందని యేసు ప్రకటించాడు (11:20-24).

Matthew 11:25

పరలోక రాజ్య విషయాలను ఎవరికి మరుగు చేసినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు?

పరలోక రాజ్య విషయాలను జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).

పరలోక రాజ్య విషయాలను ఎవరికి బయలు పరచినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు?

పరలోక రాజ్య విషయాలను పసిపిల్లలకు, బుద్ధిహీనులకు బయలు పరచినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).

ఎవరు తండ్రిని తెలుసుకుంటారని యేసు చెప్పాడు?

తండ్రి తనకు తెలుసుననీ తనకు ఇష్టమైన వారికి తాను బయలు పరుస్తాననీ యేసు చెప్పాడు (11:27).

Matthew 11:28

ఎవరికి విశ్రాంతి కలుగజేస్తానని యేసు వాగ్దానం చేశాడు?

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త ప్రజలకు ఆయన విశ్రాంతి కలుగజేస్తానని యేసు వాగ్దానం చేశాడు (11:28).


Chapter 12

Translation Questions

Matthew 12:1

యేసు శిష్యులు ఏమి చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు?

యేసు శిష్యులు పంటచేనిలో ప్రవేశించి వెన్నులు తుంచి తింటూ విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు (12:2).

Matthew 12:5

దేవాలయము కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

యేసు తానే దేవాలయము కంటే గొప్పవాడినని చెప్పాడు (12:6).

Matthew 12:7

మనుష్య కుమారుడైన యేసుకు ఏ అధికారం ఉంది?

మనుష్య కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (12:8).

Matthew 12:9

యేసు సమాజ మందిరములో ఊచ చెయ్యి గలవాడిని బాగుచేసినప్పుడు పరిసయ్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

పరిసయ్యులు యేసును "విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా?" అని ప్రశ్నించారు (12:10).

Matthew 12:11

సబ్బాతు దినమున ఏమి చేయడం న్యాయమని యేసు చెప్పాడు?

విశ్రాంతి దినమున మేలు చేయుట న్యాయమేనని యేసు చెప్పాడు (12:12).

Matthew 12:13

ఊచ చెయ్యి గలవాడిని యేసు స్వస్థపరచినపుడు ఆయనను ఏమి చెయ్యాలని ఆలోచన చేశారు?

యేసు ఊచ చెయ్యి గలవాడిని స్వస్థపరచినపుడు పరిసయ్యులు ఆలయం బయటకు వెళ్లి యేసును ఎలా సంహరించాలి అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు (12:14).

Matthew 12:19

యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు ఏమి చేయడు?

యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు జగడమాడడు, కేకలు వేయడు, నలిగినా రెల్లును విరువడు, మకమకలాడుతున్నఅవిసెనారను ఆర్పడు (12:19-20).

యేసును గురించి యెషయా ప్రవచించినట్టు, దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది?

అన్యజనులకు దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది (12:18,21).

Matthew 12:26

బయల్జేబూలు ద్వారా దయ్యములను వెళ్ళగొట్టే విషయంలో యేసు ఎలా స్పందించాడు?

సాతాను వలన సాతానును వెళ్ళగొడితే సాతాను రాజ్యము ఎలా నిలబడుతుంది అని యేసు చెప్పాడు (12:26).

Matthew 12:28

దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యము వారి యొద్దకు వస్తుందని యేసు చెప్పాడు (12:28).

Matthew 12:31

ఎలాంటి పాపం క్షమించబడదని యేసు చెప్పాడు?

ఆత్మ విషయమైన దూషణ అనే పాపం క్షమించబడదని యేసు చెప్పాడు (12:31).

Matthew 12:33

దేని వలన చెట్టు ఎలాంటిదో తెలుస్తుంది?

చెట్టు అది కాసే ఫలాల వలన మంచిదో, కాదో తెలుస్తుంది (12:33).

Matthew 12:36

వేటిని బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు?

తమ మాటలను బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు అని యేసు చెప్పాడు(12:37).

Matthew 12:38

ఆయన తన తరం వారికి యేసు ఏ సూచన ఇస్తున్నాడు?

యోనా ఉన్నట్టు, మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండబోతున్నానని యేసు ఈ తరం వారికి సూచన ఇచ్చాడు (12:39-40).

Matthew 12:41

యోనా కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

తాను యోనా కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:41).

నీనెవే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యేసు తరంలోని ప్రజలపై ఏమని నేరస్థాపన చేస్తారు?

నీనివే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యోనా ద్వారా, సొలోమోను ద్వారా దేవుని మాటలు విన్నారు. యేసు తరంలోని ప్రజలపై యోనా, సోలోమోనుల కంటే గొప్పవాడైన యేసు మాటలు వినలేదు (12:41-42).

Matthew 12:42

సొలోమోను కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

తాను సొలోమోను కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:42).

Matthew 12:43

యేసు తరంలోని వ్యక్తిని వదిలిపెట్టిన అపవిత్రాత్మ వడలిపోయిన స్థితి ఎలా ఉంటుంది?

వదిలి పోయిన అపవిత్రాత్మవెళ్లి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తి కడపటి స్థితి కంటే మొదటి స్థితి హీనమైనదిగా అయ్యేలా చేస్తుంది. యేసు తరంలోని వ్యక్తి అలానే ఉంటాడు(12:43-45).

Matthew 12:48

యేసు తనకు తల్లి, సహోదరుడు, సహోదరి ఎవరని చెప్పాడు?

తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తనకు తల్లి, సహోదరుడు, సహోదరి అని యేసు చెప్పాడు (12:46-50).


Chapter 13

Translation Questions

Matthew 13:3

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయి?

త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేశాయి (13:4).

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు ఏమయ్యాయి?

మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి మొలిచాయి గానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి (13:5-6).

Matthew 13:7

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?

ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలిచి ముండ్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి (13:7).

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?

మంచి నేలలో పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగా, ఒకటి అరువదంతలుగా, ఒకటి ముప్పదంతలుగా ఫలించాయి (13:8).

Matthew 13:13

యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు, చూస్తారు గానీ ఏమి చెయ్యరు?

యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు గానీ గ్రహించరు, చూస్తారు గానీ ఎంతమాత్రము తెలుసుకోరు (13:14).

Matthew 13:15

యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజలలో ఉన్న తప్పు ఏమిటి?

యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజల హృదయాలు కొవ్వు పట్టాయి. వారి చెవులు మందములయ్యాయి, వారి కన్నులు మూసికోనిపోయాయి (13:15).

Matthew 13:18

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

త్రోవ పక్కన పడిన విత్తనం వలే ఒక వ్యక్తివాక్యము విని దానిని గ్రహించక ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో చల్లిన దానిని ఎత్తుకుపోతాడు (13:19).

Matthew 13:20

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో రాతి నేలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

రాతి నెలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని వెంటనే దానిని సంతోషముగా గ్రహించును కానీ, వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు (13:20-21).

Matthew 13:22

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

ముండ్ల పొదలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తిని ఐహిక విచారములు, ధన మోహము ఆ వాక్యము అణచివేస్తాయి (13:22).

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

మంచి నేలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని గ్రహించి, సఫలుడై, నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తాడు (13:23).

Matthew 13:27

గురుగులు విత్తువాని ఉపమానంలో పొలములో గురుగులు చల్లినది ఎవరు?

శత్రువు పొలములో గురుగులు చల్లాడు (13:28).

Matthew 13:29

గురుగులు, గోధుమల గురించి యజమాని తన సేవకులకు ఇచ్చిన సూచనలు ఏమిటి?

రెండు పంటలూ కలసి పెరిగిన తరువాత కోతకాలము వచ్చినప్పుడు, గోధుమలను గిడ్డంగిలో సమకూర్చి, గురుగులను తగలబెట్టమని యజమాని చెప్పాడు (13:30).

Matthew 13:31

యేసు చెప్పిన ఆవగింజ ఉపమానంలో చిన్నదైన ఆవగింజ ఏమి అవుతుంది?

ఆవగింజ మొక్క పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించునంత చెట్టు అవుతుంది (13:31-32).

Matthew 13:33

పరలోక రాజ్యమును పులిసిన పిండితో ఎందుకు పోల్చాడు?

పరలోక రాజ్యము కొంచెము పొంగజేసే పదార్థం కలిసిన మూడు కుంచాల పిండి తో పోల్చబడినది (13:33).

Matthew 13:36

గురుగుల ఉపమానంలో, మంచి విత్తనం విత్తువాడు ఎవరు? పంట పొలం ఏమిటి? మంచి విత్తనాలు ఎవరు? గురుగులు ఎవరు? పంట కోయువారు ఎవరు?

మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, పంట పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య వారసులు, గురుగులు దుష్టుని సంబంధులు, పంట కోయువారు దేవదూతలు (13:37-39).

Matthew 13:40

యుగసమాప్తిలో దుర్నీతిపరులకు ఏమి జరుగుతుంది?

యుగసమాప్తిలో దుర్నీతిపరులు అగ్నిగుండములో పడవేయబడతారు (13:42).

యుగసమాప్తిలో నీతిమంతులకు ఏమి జరుగుతుంది?

యుగసమాప్తిలో నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునివలే తేజరిల్లుతారు (13:43).

Matthew 13:44

యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన పొలములో దొరికిన నిధి విషయంలో ఒక వ్యక్తి ఏమి చేశాడు?

తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలము కొన్నాడు (13:44).

యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి ఏమి చేశాడు?

మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అ ముత్యం కొన్నాడు (13:45-46).

Matthew 13:47

చేపలు పట్టే వల ఉపమానం యుగసమాప్తిలో జరగబోయే దేనిని సూచిస్తుంది?

వల నిండినప్పుడు మంచి చేపలను గంపలోకి చేర్చి, చెడ్డవాటిని బయట పారవేస్తారు. అదే విధంగా యుగసమాప్తిలో దేవదూతలు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పాడవేస్తారు (13:47-50).

Matthew 13:54

యేసు స్వదేశీయులు ఆయన బోధలు విన్నప్పుడు ఏమని ప్రశ్నించారు?

"ఈ జ్ఞానం, ఈ అద్భుతములు చేసే శక్తి ఎక్కడినుంచి వచ్చాయి" అని ఆశ్చర్యపడ్డారు (13:54).

Matthew 13:57

ప్రవక్తకు తన దేశములో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ప్రవక్త తన దేశములో, తన యింటిలో ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు (13:57).

యేసు స్వదేశీయుల అవిశ్వాసం వల్ల ఏమి జరిగింది?

స్వదేశీయుల అవిశ్వాసం వల్ల యేసు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు (13:58).


Chapter 14

Translation Questions

Matthew 14:1

హేరోదు యేసు గురించి ఏమనుకున్నాడు?

బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడని హేరోదు యేసును గురించి అనుకున్నాడు (14:2).

Matthew 14:3

హేరోదు చేసిన ఏ అన్యాయమైన పనిని గూర్చి యోహాను చెప్పాడు?

హేరోదు తన సోదరుని భార్యను ఉంచుకొన్నాడని యోహాను చెప్పాడు (14:4).

హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష ఎందుకు విధించ లేదు?

ప్రజలు ఇతనిని ప్రవక్త అని గౌరవిస్తున్నందువల్ల ప్రజలకు భయపడి హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష విధించలేదు (14:5).

Matthew 14:6

తన జన్మదినం నాడు హేరోదియ నాట్యం చేసినప్పుడు హేరోదు ఏమి చేశాడు?

హేరోదియ ఏమి కోరినా ఇస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు (14:7).

Matthew 14:8

హేరోదియ ఏమి కోరుకుంది?

ఒక పళ్ళెంలోయోహాను తలను తెచ్చి ఇవ్వమని కోరింది (14:8).

హేరోదు ఆమె కోరికను ఎందుకు తీర్చవలసి వచ్చింది?

విందు సమయంలో ప్రజలందరి ఎదుటా చేసిన ప్రమాణం నెరవేర్చుకోవడానికి ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. (14:9).

Matthew 14:13

జనసమూహములు తనను వెంబడిస్తున్నప్పుడు వారిని చూసి యేసు ఏమి చేశాడు?

జనసమూహములను చూసి యేసు వారిపై కనికరపడి, వారిలో రోగులను స్వస్థపరిచాడు (14:14).

Matthew 14:16

యేసు తన శిష్యులతో ఏమి చెప్పాడు?

జనసమూహములకు మీరే భోజనము పెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు (14:16).

Matthew 14:19

యేసు, తన శిష్యులు తెచ్చిన అయిదు రొట్టెలు, రెండు చేపలను ఏమిచేశాడు?

యేసు ఆ రొట్టెలను, చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు జనసమూహమునకు పంచమని శిష్యులకు ఇచ్చాడు (14:19).

ఎంతమంది ప్రజలు భుజించారు? ఇంకా ఎంత మిగిలిపోయింది?

అయిదు వేలమంది పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి (14:20-21).

Matthew 14:22

జనసమూహాన్ని పంపివేసిన తరువాత యేసు ఏమి చేశాడు?

యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ పైకి వెళ్ళాడు (14:23).

సముద్రం మధ్యలో ఉన్న శిష్యులకు ఏమి జరిగింది?

బలమైన గాలి వీచినప్పుడు శిష్యులు ప్రయాణిస్తున్న నావ అదుపుతప్పింది (14:24).

Matthew 14:25

యేసు తన శిష్యుల దగ్గరకు ఎలా వచ్చాడు?

యేసు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చాడు (14:25).

శిష్యులు యేసును చూసినప్పుడు ఆయన వారితో ఏమని చెప్పాడు?

యేసు తన శిష్యులకు నేనే, భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు (14:27).

Matthew 14:28

పేతురు తన దగ్గరకు చేస్తానని యేసుతో చెప్పినప్పుడు యేసు ఏమన్నాడు?

నీళ్ళపై నడచి రమ్మని యేసు పేతురుతో చెప్పాడు (14:29).

పేతురు నీళ్ళలో ఎందుకు మునిగిపోతున్నాడు?

పేతురు భయపడినప్పుడు నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టాడు (14:30).

Matthew 14:31

యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు ఏమి జరిగింది?

యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు గాలి అణగిపోయింది (14:32).

ఇది చూసిన శిష్యులు ఏమి చేశారు?

దీనిని చూసిన శిష్యులు యేసు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కారు (14:33).

Matthew 14:34

యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు అక్కడి ప్రజలు ఏమి చేశారు?

యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు ప్రజలు రోగులను యేసు దగ్గరకు తీసుకువచ్చారు (14:35).


Chapter 15

Translation Questions

Matthew 15:4

పరిసయ్యులు పారంపర్యాచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎలా అతిక్రమిస్తున్నారని యేసు చెప్పాడు?

పరిసయ్యులు తమ తల్లితండ్రుల నుండి సంక్రమించినది "దేవార్పితమని" చెప్పి తమ పిల్లలను వారికి సహాయం చేయనీయక అడ్డుపడుతున్నారు (15:3-6).

Matthew 15:7

పరిసయ్యుల పలికే మాటలను గురించి, వారి హృదయాలను గురించి యెషయా ఏమని ప్రవచించాడు?

పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు గాని వారి హృదయాలు ఆయనకు దూరముగా ఉన్నవి అని యెషయా ప్రవచించాడు (15:7-8).

దేవుని గురించిన మాటలు బోధించడానికి బదులు పరిసయ్యులు ఏమి బోధిస్తున్నారు?

పరిసయ్యులు మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు (15:9).

Matthew 15:10

ఒక మనుష్యుని అపవిత్రపరచనిది ఏమిటని యేసు చెప్పాడు?

మనుష్యుని నోటిలోకి వెళ్ళునది అతనిని అపవిత్రపరచదని యేసు చెప్పాడు (15:11,17,20).

ఒక మనుష్యుని ఏది అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు?

మనుష్యుని నోటి నుండి వచ్చునది అతనిని అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు (15:11,18-20).

Matthew 15:12

యేసు పరిసయ్యులను ఏమని పిలిచాడు? వారి వలన ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

యేసు పరిసయ్యులను గుడ్డివారని పిలిచాడు. గుడ్డివారు గుడ్డివారికి దారి చూపినపుడు ఇద్దరూ గుంటలో పడతారు (15:14).

Matthew 15:18

ఎలాంటి ఆలోచనలు ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి?

దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి (15:19).

Matthew 15:21

కనాను స్త్రీ తనను కనికరించమని కోరినప్పుడు మొదట యేసు ఏమి చేశాడు?

యేసు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు (15:23).

Matthew 15:24

ప్ర, కనాను స్త్రీకి సహాయం చేయకపోవడం విషయంలో యేసు ఎలాంటి వివరణ ఇచ్చాడు?

యేసు, తాను ఇశ్రాయేలు ఇంటివారిలో నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డానని చెప్పాడు (15:24).

Matthew 15:27

కనాను స్త్రీ విధేయత చూసిన యేసు ఆమెతో ఏమి చెప్పాడు, ఆమెకోసం ఏమి చేశాడు?

ఆమె విశ్వాసము గొప్పదని చెప్పి, ఆమె కోరుకొన్నది నెరవేర్చాడు (15:28).

Matthew 15:29

గలిలయలో ఆయన దగ్గరకు వచ్చిన బహు జనసమూహమునకు ఏమి చేశాడు?

యేసు మూగ వారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను స్వస్థపరిచాడు (15:30-31).

Matthew 15:32

యేసు ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలతో జనసమూహం ఆకలి తీర్చాడు?

శిష్యుల వద్ద ఉన్న ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలతో యేసు జనసమూహం ఆకలి తీర్చాడు (15:34).

Matthew 15:36

యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని ఏమి చేశాడు?

యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడు (15:36).

రొట్టెలు, చేపలను ఎంతమంది ప్రజలు తృప్తిగా తిన్నారు?

స్త్రీలు, పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు తృప్తిగా తిన్నారు (15:38).

వారందరూ తిన్న తరువాత ఎంత మిగిలింది?

వారందరూ తిన్న తరువాత ఏడు గంపల రొట్టెలు, చేపలు మిగిలాయి (15:37).


Chapter 16

Translation Questions

Matthew 16:1

పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును ఏ విధంగా శోధించడానికి వచ్చారు?

పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆకాశము నుండి ఏదైనా సూచక క్రియ చేసి చూపించమని యేసును అడిగారు (16:1).

Matthew 16:3

పరిసయ్యులు, సద్దూకయ్యులకు ఏ సూచక క్రియ ఇవ్వబడుతుందని చెప్పాడు?

పరిసయ్యులు, సద్దూకయ్యులకు యోనాను గూర్చిన సూచక క్రియ వారికి అనుగ్రహింపబడుతుందని చెప్పాడు (16:4).

Matthew 16:5

దేని విషయంలో జాగ్రత్త వహించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు?

పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు (16:6).

Matthew 16:11

శిష్యులను జాగ్రత్త వహించాలని చెప్పడంలో యేసు అసలు ఉద్దేశం ఏమిటి?

శిష్యులను జాగ్రత్త వహించాలని చెప్పడంలోని యేసు అసలైన ఉద్దేశం పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధలను గూర్చి జాగ్రత్త పడమని (16:12).

Matthew 16:13

యేసు ఫిలిప్పు కైసరయకు వచ్చినప్పుడు తన శిష్యులను ఏమని అడిగాడు?

యేసు తన శిష్యులను "మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని అడిగాడు (16:13).

యేసు ఎవరని కొందరు అనుకొంటున్నారు?

కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను అనీ, కొందరు ఏలీయా అనీ, కొందరు యిర్మీయా అనీ, ప్రవక్తలలో ఒకడనీ అనుకొంటున్నారు (16;14).

యేసు ప్రశ్నకు పేతురు ఏమని జవాబిచ్చాడు?

"నీవు సజీవుడైన దేవుని కుమారడవైన క్రీస్తువు" అని పేతురు జవాబిచ్చాడు (16:16).

Matthew 16:17

యేసు ప్రశ్నకు జవాబు పేతురుకు ఎలా తెలుసు?

యేసు అడిగిన ప్రశ్నకు జవాబును పరలోకమందున్న తండ్రి అతనికి బయలుపరిచాడు (16:17).

Matthew 16:19

భూమిపై పేతురుకు ఎలాంటి అధికారం యేసు ఇచ్చాడు?

యేసు పరలోకపు తాళపు చెవులు పేతురుకు ఇచ్చాడు. పేతురు భూలోకంలో దేనిని బంధిస్తాడో పరలోకంలో అది బంధించబడుతుంది, భూలోకంలో దేనిని విప్పుతాడో అది పరలోకంలో విప్పబడుతుంది అని యేసు చెప్పాడు (16:19).

Matthew 16:21

ఆ సమయం నుండి యేసు తన శిష్యులకు ఏ విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు?

తాను యెరూషలేముకు వెళ్లి, అనేక శ్రమలు పొంది, చంపబడి, మూడవ రోజున లేపబడవలసి ఉన్నదని చెప్పడం మొదలుపెట్టాడు (16:21).

జరుగబోయే సంగతులు యేసుకు ఎన్నడూ జరగవని పేతురు యేసును గద్దించినపుడు యేసు ఏమన్నాడు?

యేసు పేతురుతో, "సాతానా, నా వెనుకకు పొమ్ము" అన్నాడు (16:23).

Matthew 16:24

యేసును అనుసరించే ప్రతి ఒక్కరూ ఏమి చేయడానికి ఇష్టపడాలి?

యేసును అనుసరించే ప్రతి ఒక్కరూ తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని ఆయనను వెంబడించాలి (16:24).

మనిషికి ఏది ప్రయోజనకరం కాదని యేసు చెప్పాడు?

ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే వానికి ఏమి ప్రయోజనము అని యేసు చెప్పాడు (16:26).

Matthew 16:27

మనుష్యకుమారుడు ఎలా రాబోతున్నాడని యేసు చెప్పాడు?

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కలసి రాబోతున్నాడని యేసు చెప్పాడు (16:27).

మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికి తగిన ప్రతిఫలం ఎలా చెల్లిస్తాడు?

మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికి వారి వారి క్రియల చొప్పున తగిన ప్రతిఫలం చెల్లిస్తాడు (16:27).


Chapter 17

Translation Questions

Matthew 17:1

యేసుతో కలసి ఎత్తయిన కొండ పైకి ఎవరు వెళ్లారు?

పేతురు, యాకోబు అతని సహోదరుడైన యోహాను యేసుతో కలసి వెళ్లారు (17:1).

కొండపైన యేసు ఎలా కనిపించాడు?

యేసు ముఖము సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివయ్యాయి (17:2).

Matthew 17:3

యేసుతో మాట్లాడడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు?

మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడడానికి ప్రత్యక్షమయ్యారు (17:3).

పేతురు ఏమి చేద్దామని అన్నాడు?

వారు ముగ్గురికీ మూడు కుటీరాలు నిర్మిద్దామని పేతురు అన్నాడు (17:4).

Matthew 17:5

ప్రకాశవంతమైన మేఘమునుండి ఏమని వినిపించింది?

ప్రకాశవంతమైన మేఘము నుండి, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి" అన్న మాటలు వినిపించాయి (17:5).

Matthew 17:9

వారు కొండ దిగి వస్తున్నప్పుడు యేసు శిష్యులకు ఏమని ఆజ్ఞాపించాడు?

మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచే వరకు ఈ దర్శనము ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు (17:9).

Matthew 17:11

లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చే విషయం గూర్చి యేసు ఏమి చెప్పాడు?

లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడని యేసు చెప్పాడు (17:11).

ఏలీయా ముందుగానే వచ్చిన సంగతి, మనుషులు అతనికి ఏమి చేసారో ఆ సంగతి గురించి యేసు ఏమి చెప్పాడు?

ఏలీయా బాప్తిసమిచ్చే యోహానుగా ఇదివరకే వచ్చినప్పుడు మనుషులు అతనిని తెలుసుకోక, వారి ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేశారు అని యేసు చెప్పాడు (17:10-13).

Matthew 17:14

శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ గలిగారా?

శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ లేకపోయారు (17:14-16).

Matthew 17:17

చాంద్ర రోగం ఉన్న బాలునికి యేసు ఏమి చేశాడు?

యేసు అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించాడు. ఆ గంటలోనే ఆ బాలుడు స్వస్థత పొందాడు (17:18).

Matthew 17:19

చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి శిష్యులు ఎందుకు స్వస్థ పరచ లేకపోయారు?

తమకున్న అల్ప విశ్వాసం వల్లనే బాలుణ్ణి శిష్యులు స్వస్థ పరచ లేకపోయారని యేసు చెప్పాడు (17:20).

Matthew 17:22

శిష్యులు విచారగ్రస్తులయ్యేలా యేసు చెప్పిన విషయం ఏమిటి?

యేసు తన శిష్యులతో తనను చంపే వారికీ తనను అప్పగిస్తారని, వారు తనను చంపుతారని, మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు శిష్యులు విచారగ్రస్తులయ్యారు (17:22-23).

Matthew 17:26

పేతురు, యేసు తమ పన్నులు చెరొక అర షెకెలు ఎలా చెల్లించారు?

పేతురును సముద్రమునకు వెళ్లి, గాలం వేసి మొదటగా వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచి అక్కడ దొరికిన ఒక షెకెలుతో ఇద్దరి పన్ను కట్టాలని యేసు పేతురుతో చెప్పాడు (17:27).


Chapter 18

Translation Questions

Matthew 18:1

మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలగాలంటే ఎలా ఉండాలి?

మనం తప్పక మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని యేసు చెప్పాడు (18:3).

Matthew 18:4

పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఎవరు ఉంటారని యేసు చెప్పాడు?

తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని యేసు చెప్పాడు (18:4).

యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువానికి ఏమి జరుగుతుంది?

యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువాడు మెడకు తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట మేలు (18:6).

Matthew 18:9

ప్ర,. మనకు అభ్యంతరం కలిగించే వాటిని ఏమి చేయాలని యేసు చెప్పాడు?

మనకు అభ్యంతరం కలిగించే దేనినైనా విసిరి పారవేయాలని యేసు చెప్పాడు (18:8-9).

Matthew 18:10

చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదని యేసు చెప్పాడు?

చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదంటే పిల్లల దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తున్నారని యేసు చెప్పాడు (18:10).

Matthew 18:12

తప్పిపోయిన గొర్రెను వెదికే వ్యక్తి పరలోకపు తండ్రిని ఎలా పోలి ఉన్నాడు?

ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు (18:12-14).

Matthew 18:15

నీ సహోదరుడు నీపట్ల తప్పు చేసినప్పుడు నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటి?

మొదటగా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని తప్పు తెలియజెయ్యి (18:15).

నీ సహోదరుడు వినని పక్షంలో నువ్వు చేయవలసిన రెండవ పని ఏమిటి?

రెండవదిగా, నీతో సహా ఇద్దరు ముగ్గురిని సాక్ష్యులుగా నీ వెంట తీసుకు వెళ్ళు (18:16).

Matthew 18:17

అప్పటికీ నీ సహోదరుడు వినని పక్షంలో మూడవదిగా నువ్వు ఏమి చెయ్యాలి?

మూడవది, ఆ సంగతి సంఘములో చెప్పాలి (18:17).

Matthew 18:18

ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు యేసు చేస్తున్న వాగ్దానం ఏమిటి?

ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు వారి మధ్యన ఉంటానని యేసు వాగ్దానం చేస్తున్నాడు (18:20).

Matthew 18:21

మన సహోదరులు మనపట్ల తప్పిదం చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలని యేసు చెప్పాడు?

మనం మన సహోదరుణ్ణి ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్బై ఏళ్లసార్లు క్షమించాలని యేసు చెప్పాడు (18:21-22).

Matthew 18:23

సేవకుడు తన యజమానికి అచ్చియున్నది ఏమిటి? అతడు దానిని తీర్చగలిగాడా?

సేవకుడు తన యజమానికి పదివేల తలాంతులు అచ్చియున్నాడు. అతడు దానిని తీర్చలేకపోయాడు (18:24-25).

Matthew 18:26

యజమాని సేవకుని అప్పు ఎందుకు క్షమించాడు?

యజమాని ఆ సేవకునిపై కనికరపడి అతనిని విడిచిపెట్టి క్షమించాడు (18:27).

Matthew 18:28

క్షమాపణ పొందిన సేవకుడు తనకు వంద తలాంతులు అచ్చియున్న తోటి సేవకుణ్ణి క్షమించి విడిచిపెట్టాడా?

ఆ సేవకుడు తనకు వంద తలాంతులు అచ్చియున్న తోటి సేవకుణ్ణి క్షమించకుండా చెరసాలలో వేయించాడు (18:28-30).

Matthew 18:32

ఆ సేవకుడు తన తోటి సేవకునికి చేసినది విన్న యజమాని ఏమన్నాడు?

యజమాని సేవకుణ్ణి పిలిచి అతడు క్షమించబడినట్టు, అతని తోటి దాసుని పట్ల కనికరం చూపాలని చెప్పాడు (18:33).

Matthew 18:34

ఆ యజమాని సేవకుణ్ణి ఏమి చేశాడు?

యజమాని తనకు అచ్చియున్నందంతా చెల్లించే వరకూ బాధపరచువారికి అతణ్ణి అప్పగించాడు (18:34).

మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే తండ్రి ఏమి చేస్తాడని యేసు చెప్పాడు?

యజమాని తన సేవకునిపట్ల చేసినట్టు, మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఇలాగే చేస్తాడని యేసు చెప్పాడు (18:35).


Chapter 19

Translation Questions

Matthew 19:3

పరిసయ్యులు యేసుని శోధించడానికి ఆయనను ఏమని ప్రశ్నించారు?

"ఏ కారణం చేతనైనా భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమేనా?" అని పరిసయ్యులు యేసుని ప్రశ్నించారు (19:3).

సృష్టి ఆరంభంలో ఏమి ఉన్నదని యేసు చెప్పాడు?

సృష్టి ఆరంభంలో దేవుడు పురుషుని, స్త్రీని సృష్టించాడని యేసు చెప్పాడు (19:4).

Matthew 19:5

దేవుడు పురుషుని, స్త్రీని చేసిన విధానాన్ని బట్టి పురుషుడు ఏమి చేయాలని యేసు చెప్పాడు?

పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడని యేసు చెప్పాడు (19:5).

పురుషుడు తన భార్యను హత్తుకొనుట వలన ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండుట వలన వారిద్దరూ ఏక శరీరులుగా ఉంటారు (19:5-6).

దేవుడు జతపరచిన వారిని మానవుడు ఏమి చేయకూడని యేసు చెప్పాడు?

దేవుడు జతపరచిన వారిని మానవుడు వేరు చేయకూడని చేయకూడని యేసు చెప్పాడు (19:6).

Matthew 19:7

మోషే ఆజ్ఞ విడాకులను ఎందుకు అనుమతించిందని యేసు చెప్పాడు?

ఆనాటి యూదుల హృదయ కఠినత్వాన్ని బట్టి మోషే విడాకులు అనుమతించాడని యేసు చెప్పాడు (19:7-8).

వ్యభిచారం చేసేవాడు ఎవరని యేసు చెప్పాడు?

కేవలం వ్యభిచారం కోసమే తన భార్యను విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి. విడిచి పెట్టబడిన దానిని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి అని యేసు చెప్పాడు (19:9).

Matthew 19:10

నపుంసకులుగా ఉండేందుకు అంగీకరించే వారిని గూర్చి యేసు ఏమి చెప్పాడు?

నపుంసకులుగా మారేందుకు అంగీకరించే వారిని నపుంసకులుగా మారనివ్వండి అని యేసు చెప్పాడు (19:10-12).

Matthew 19:13

చిన్న పిల్లలను యేసు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేశారు?

చిన్నపిల్లలను యేసు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు శిష్యులు వారిని గద్దించారు (19:13).

యేసు చిన్నపిల్లలను చూసినప్పుడు ఏమి చేశాడు?

చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని తన యొద్దకు రానివ్వమని, పరలోక రాజ్యం ఇలాంటివారిదేనని యేసు చెప్పాడు (19:14).

Matthew 19:16

నిత్యజీవంలో ప్రవేశించాలంటే తప్పక ఏమి చెయ్యాలని అ యువకునితో యేసు చెప్పాడు?

నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలన్నిటినీ పాటించమని యేసు అ యువకునితో చెప్పాడు (19:16-17).

Matthew 19:20

ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నానని అ యువకుడు చెప్పినప్పుడు, యేసు అతనితో ఏమని చెప్పాడు?

ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నానని అ యువకుడు చెప్పినప్పుడు యేసు అతనితో అతనికున్నవన్నీ అమ్మివేసి పేదవారికి ఇవ్వమని చెప్పాడు (19:20-21).

తనకున్నవన్నీ అమ్మివేయమని యేసు ఆజ్ఞాపించినపుడు అతడు ఎలా స్పందించాడు?

ఆ యువకుడు ఎక్కువ ఆస్థి గలవాడు కనుక యేసు చెప్పిన మాట విని విచార పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు (19:22).

Matthew 19:23

ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుటను గూర్చి యేసు ఏమని చెప్పాడు?

ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని యేసు చెప్పాడు. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే (19:23-26).

Matthew 19:28

తనను వెంబడించిన శిష్యులకు ఏ ప్రతిఫలం దక్కుతుందని యేసు చెప్పాడు?

తనను వెంబడించిన శిష్యులు పునరుత్థాన దినమందు, వారు పన్నెండు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని యేసు చెప్పాడు (19:28).

Matthew 19:29

మొదటివారిని, కడపటివారిని గూర్చి యేసు ఏమి చెప్పాడు?

మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని యేసు చెప్పాడు (19:30).


Chapter 20

Translation Questions

Matthew 20:1

ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఎంత కూలి ఇవ్వడానికి అంగీకరించాడు?

ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఒక దేనారము ఇవ్వడానికి అంగీకరించాడు (20:1-2).

Matthew 20:3

తొమ్మిది, పన్నెండు, మూడు, అయిదు గంటల సమయంలో కుదుర్చుకున్న పనివారికి ఎంత కూలి ఇస్తానని ఇంటి యజమాని చెప్పాడు?

ఏది న్యాయమో అది ఇస్తానని ఇంటి యజమాని కూలివారితో చెప్పాడు (20:4-7).

Matthew 20:8

పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఎంత కూలి లభించింది?

పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఒక దేనారము కూలి లభించింది (20:9).

Matthew 20:11

పొద్దున్న పనికి కుదర్చబడిన కూలీలు ఏమని సణుగుకొన్నారు?

తాము రోజంతా పనిచేసినప్పటికీ చివరి గంట పనిచేసినవారితో సమానమైన కూలీ దొరికిందని సణుగుకొన్నారు (20:11-12).

Matthew 20:13

కూలీలకు ఇంటి యజమాని ఏమని సమాధానమిచ్చాడు?

పొద్దుటి నుంచి పని చేసినవారికి చెప్పినట్టు ఒక దేనారం కూలి ఇచ్చానని, అయితే తన ఇష్ట ప్రకారం మిగతా కూలీలకు కూడా అంతే చెల్లించానని ఇంటి యజమాని చెప్పాడు (20:13-15).

Matthew 20:17

యేసు తన శిష్యులతో యెరూషలేము బయలుదేరేముందు తనకు జరుగబోయే ఏ ఏ విషయాలు ముందుగా తెలియజేసాడు?

తనను ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకొని మరణ శిక్ష విధించి సిలువ వేస్తారని, తాను మూడవ రోజున తిరిగి లేస్తానని శిష్యులకు ముందుగా చెప్పాడు (20:17-19).

Matthew 20:20

జెబెదయి కుమారుల తల్లి యేసును ఏమి కోరుకుంది?

తన కుమారులు యేసు రాజ్యంలో ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చుని ఉండాలని యేసును కోరుకున్నది (20:20-21).

Matthew 20:22

పరలోక రాజ్యంలో తన కుడి పక్కన ఎడమ పక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించే అధికారం ఎవరికి ఉన్నదని యేసు చెప్పాడు?

ఆయన ఎంపిక చేసిన వారికోసం తగిన స్థలాలను తండ్రి అయిన దేవుడు నిర్ణయిస్తాడు (20:23).

Matthew 20:25

తన శిష్యులలో గొప్పవాడుగా ఉండగోరిన వాడు ఎలా ఉండాలని యేసు చెప్పాడు?

గొప్పవాడుగా ఉండగోరిన వాడు పరిచారకుడుగా ఉండాలని ఉండాలని యేసు చెప్పాడు (20:26).

యేసు ఎందుకు వచ్చానని చెప్పాడు?

అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు (20:28).

Matthew 20:29

యేసు ఆ మార్గమున వెళ్తూ ఉండగా దారి పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివాళ్ళు ఏమి చేశారు?

ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు, "ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు" అని కేకలు వేసారు (20:30).

Matthew 20:32

ఇద్దరు గుడ్డివాళ్ళను యేసు ఎందుకు స్వస్థపరిచాడు?

ఇద్దరు గుడ్డివాళ్ళను చూసి యేసు వారిపై కనికరపడ్డాడు (20:34).


Chapter 21

Translation Questions

Matthew 21:1

యేసు తన శిష్యులకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఏమి కనబడుతుందని చెప్పాడు?

శిష్యులు వెళ్ళినప్పుడు వారికి కట్టబడియున్న ఒక గాడిద, దానితో గాడిద పిల్ల కనబడతాయని యేసు చెప్పాడు (21:2).

Matthew 21:4

ఈ సంఘటనను ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడు?

ప్రవక్త, ఇదిగో నీ రాజు గాడిదను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచించాడు (21:4-5).

Matthew 21:6

యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు ఏమి చేశారు?

యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు పైబట్టలు, చెట్ల కొమ్మలు దారి వెంట పరిచారు (21:8).

Matthew 21:9

యేసు వెళ్తుండగా జనసమూహం ఏమని కేకలు వేసారు?

జనసమూహం "దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము" అని కేకలు వేశారు (21:9). .

Matthew 21:12

యెరూషలేము దేవాలయములో ప్రవేశించినప్పుడు యేసు ఏమి చేశాడు?

దేవాలయములో ప్రవేశించి యేసు, క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి, గువ్వలను అమ్మేవారి బల్లలను పడదోశాడు (21:12).

దేవుని మందిరాన్ని వ్యాపారులు ఏమి చేశారని యేసు అన్నాడు?

దేవుని మందిరాన్ని వ్యాపారులు దొంగల గుహవలె చేశారని యేసు అన్నాడు (21:13).

Matthew 21:15

యేసును గూర్చి చిన్న పిల్లలు కేకలు వేస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు అభ్యంతరం తెలిపినప్పుడు యేసు వారితో ఏమి అన్నాడు?

బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్దింపజేసితివి అని ప్రవక్తలచే పలుకబడిన ప్రవచనం యేసు వారికి గుర్తు చేశాడు (21:15-16).

Matthew 21:18

యేసు అంజూరపు చెట్టును ఏమి చేశాడు? ఎందుకు?

అది కాపు లేకుండా ఉన్నందువల్ల యేసు ఆ చెట్టుని శపించాడు (21:18-19).

Matthew 21:20

అంజూరపు చెట్టు ఎండిపోయిన సందర్భంలో ప్రార్థన గురించి యేసు తన శిష్యులకు ఏమి బోధించాడు?

వారు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటన్నిటినీ పొందుతారని యేసు బోధించాడు (21:20-22).

Matthew 21:23

యేసు బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి యేసును ఏమని ప్రశ్నించారు?

ప్రధాన యాజకులు, పెద్దలు యేసు దగ్గరకు వచ్చి, ఏ అధికారంతో యేసు ఈ పనులన్నీ చేస్తున్నాడని అడిగారు (21:23).

Matthew 21:25

ప్రధాన యాజకులు, పెద్దలు అడిగిన ప్రశ్నకు బదులుగా యేసు వారిని ఏమని అడిగాడు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మనుషులనుండి కలిగిందా అని యేసు వారిని ప్రశ్నించాడు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెబితే, యోహానును ఎందుకు నమ్మలేదని యేసు ప్రశ్నించవచ్చు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం మనుషులనుండి కలిగింది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహానును ఒక ప్రవక్తగా భావిస్తున్న ప్రజలకు భయపడి ఏ జవాబూ చెప్పలేదు (21:26).

Matthew 21:28

యేసు చెప్పిన కథలో ఇద్దరు కుమారులలో ఎవరు తండ్రి చెప్పిన పని చేశారు?

మొదటి కుమారుడు ముందు వెళ్లనని చెప్పినప్పటికీ తరువాత తన మనస్సు మార్చుకొని వెళ్లి పని పూర్తిచేశాడు (21:28-31).

Matthew 21:31

ప్రధాన యాజకులు, శాస్త్రుల కంటే ముందుగా సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ఎందుకు చెప్పాడు?

సుంకరులు, వేశ్యలు యోహాను నీతి మార్గమును నమ్మారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యోహాను నీతి మార్గమును నమ్మక పశ్చాత్తాపపడలేదు (21:31-32).

Matthew 21:35

పంట యజమాని తన భాగం కోసం సేవకులను పంపినప్పుడు గుత్త కాపులు ఏమిచేశారు?

గుత్త కాపులు సేవకులలో ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరియొకరిపై రాళ్ళు రువ్వారు (21:35-36).

చివరకు యజమాని ఏమి చేశాడు?

చివరగా యజమాని తన కుమారుణ్ణి పంపించాడు (21:37).

Matthew 21:38

చివరగా యజమాని పంపిన వ్యక్తిని గుత్త కాపులు ఏమిచేశారు?

యజమాని కుమారుణ్ణి గుత్త కాపులు చంపివేశారు (21:38-39).

Matthew 21:40

తరువాత ఏమి చేయమని మనుషులు యజమానికి చెప్పారు?

ఆ దుర్మార్గులైన గుత్త కాపులను సంహరించి పంటలో భాగం ఇచ్చే వేరే కాపులకు ఇవ్వమని చెప్పారు (21:40-41).

Matthew 21:42

యేసు లేఖనాన్ని ప్రస్తావించి చెప్పినట్టు, నిషేధించబడిన రాయి ఏమవుతుంది?

ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది (21:42).

Matthew 21:43

యేసు ప్రస్తావించిన లేఖనం ప్రకారం, ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యము ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు ప్రజల యొద్దకు తీసుకురాబడుతుంది (21:43).

Matthew 21:45

ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును వెంటనే ఎందుకు బంధించలేకపోయారు?

యేసును ప్రజలు ప్రవక్త అని భావించినందువల్ల ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రజలకు భయపడి యేసును బంధించలేకపోయారు (21:46).


Chapter 22

Translation Questions

Matthew 22:5

రాజు తన కుమారుని పెండ్లి విందుకు ఆహ్వానం పంపినపుడు పిలువబడినవారు ఏమి చేశారు?

కొందరు ఆహ్వానం లక్ష్యపెట్టలేదు, కొందరు తమ సొంత పనులకు వెళ్ళిపోయారు, కొందరు ఆ సేవకులను పట్టుకుని అవమాన పరచి చంపివేశారు (22:2-6).

మొదట పెండ్లి విందుకు పిలువబడి, తిరస్కరించినవారిని రాజు ఏమి చేశాడు?

రాజు తన సేనలను పంపి ఆ హంతకులను చంపించి, వారి నగరాన్ని తగలబెట్టించాడు (22:7).

Matthew 22:8

తరువాత రాజు పెండ్లి విందుకు ఎవరిని పిలిచాడు?

తరువాత రాజు తన సేవకులకు కనబడినవారందరినీ, వారు మంచివారైనా, చెడ్డవారైనా అందరినీ పిలిపించాడు (22:9-10).

Matthew 22:13

పెండ్లి దుస్తులు ధరించనివారిని రాజు ఏమి చేశాడు?

పెండ్లి దుస్తులు ధరించనివారి కాళ్ళు, చేతులు కట్టివేసి చీకటిలోకి తోసివేశాడు (22:11-13).

Matthew 22:15

పరిసయ్యులు యేసును ఏమి చేయాలని చూశారు?

పరిసయ్యులు యేసును మాటలలో పెట్టి చిక్కుల్లో పడవేయాలని చూశారు (22:15).

పరిసయ్యుల శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కాదా అని యేసును అడిగారు (22:17).

Matthew 22:20

పరిసయ్యుల శిష్యులకు యేసు ఏమని జవాబిచ్చాడు?

కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వమని వారికి జవాబిచ్చాడు (22:21).

Matthew 22:23

పునరుత్దానమును గురించి సద్దూకయ్యుల నమ్మకం ఏమిటి?

పునరుత్దానము అనేది లేదని సద్దూకయ్యుల నమ్ముతారు (22:23).

Matthew 22:25

సద్దూకయ్యుల కథలో ఒక స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?

ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు (22:24-27).

Matthew 22:29

సద్దూకయ్యులకు తెలియని రెండు విషయాలు ఏమిటని యేసు చెప్పాడు?

సద్దూకయ్యులకు లేఖానాలు, దేవుని శక్తీ గురించి తెలియదు (22:29).

పునరుత్థానంలో పెండ్లి గురించి యేసు ఏమి చెప్పాడు?

పునరుత్థానంలో ఎవరూ పెండ్లి చేసుకోరని యేసు చెప్పాడు (22:30).

Matthew 22:31

పునరుత్థానం ఉన్నదని యేసు లేఖనాల ద్వారా ఎలా చూపించాడు?

తండ్రియైన దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైయున్నాడని లేఖనాలను ప్రస్తావిస్తూ యేసు చెప్పాడు (22:32).

Matthew 22:34

పరిసయ్యుడైన ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ఏమని ప్రశ్నించాడు?

ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు (22:36).

Matthew 22:37

యేసు చెప్పిన రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి?

నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనేవి యేసు చెప్పిన ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు (22:37-39).

Matthew 22:41

యేసు పరిసయ్యులను ఏమని ప్రశ్నించాడు?

క్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగాడు (22:42).

పరిసయ్యులను ఏమని జవాబిచ్చారు?

క్రీస్తు దావీదు కుమారుడని పరిసయ్యులు జవాచ్చారు (22:42).

Matthew 22:43

తరువాత యేసు పరిసయ్యులను అడిగిన రెండవ ప్రశ్న ఏమిటి?

తన ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఎలా చెబుతున్నాడని యేసు అడిగాడు (22:43-45).

Matthew 22:45

పరిసయ్యులకు యేసుకు ఏమని జవాబిచ్చారు?

యేసు అడిగిన దానికి వారు ఎవరూ మాట్లాడలేకపోయారు (22:46).


Chapter 23

Translation Questions

Matthew 23:1

పరిసయ్యులు, శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చుని చెప్పే వాటి గురించి యేసు ఏమని చెప్పాడు?

పరిసయ్యులు, శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చుని చెప్పే వాటన్నిటినీ గైకొనుమని యేసు చెప్పాడు (23:2-3).

పరిసయ్యుల, శాస్త్రుల క్రియల చొప్పున చేయవద్దని యేసు ఎందుకు చెప్పాడు?

పరిసయ్యుల, శాస్త్రుల క్రియల చొప్పున చేయవద్దని యేసు ఎందుకు చెప్పాడంటే వారు చెబుతారు గాని ఆ ప్రకారం చేయరు (23:3).

Matthew 23:4

పరిసయ్యుల, శాస్త్రులు ఎందుకోసం తమ క్రియలు జరిగిస్తారు?

పరిసయ్యుల, శాస్త్రులు ఇతరులు చూడాలని తమ క్రియలు జరిగిస్తారు (23:5).

Matthew 23:8

యేసు చెప్పినట్టు మనకున్న ఒకే ఒక్క తండ్రి, ఒకే ఒక్క గురువు ఎవరు?

పరలోకమందున్నవాడు ఒక్కడే మన తండ్రి, క్రీస్తు ఒక్కడే మన గురువు అని యేసు చెప్పాడు (23:8-10).

Matthew 23:11

తనను హెచ్చించుకొనే వారిని, తనను తగ్గించుకోనే వారిని దేవుడు ఏమి చేస్తాడు?

తనను హెచ్చించుకొనే వారిని తగ్గిస్తాడు, తనను తగ్గించుకోనే వారిని హెచ్చిస్తాదు (23:12).

Matthew 23:13

పరిసయ్యులు, శాస్త్రులు ఒక వ్యక్తిని తమ మతంలోకి చేర్చుకొన్నప్పుడు అతడు దేనికి వారసుడు అవుతాడు?

పరిసయ్యుల, శాస్త్రులు ఒక వ్యక్తిని తమ మతంలోకి చేర్చుకొన్నప్పుడు ఆ వ్యక్తి వారికంటే రెండు రెట్లు అధిక శిక్షకు పాత్రుడవుతాడు (23:15).

యేసు పరిసయ్యులను, శాస్త్రులను వారి ప్రవర్తన బట్టి పదే పదే ఏమని పిలిచాడు?

యేసు పరిసయ్యులను, శాస్త్రులను పదే పదే వేషదారులు అని పిలిచాడు (23:13-15,23,25,27,29).

Matthew 23:16

ఒట్టు పెట్టుకొనే సందర్భంలో పరిసయ్యుల, శాస్త్రుల బోధలను గూర్చి యేసు ఏమి చెప్పాడు?

పరిసయ్యుల, శాస్త్రుల బోధలు అంధులైన మార్గదర్శకులు, అంధులైన అవివేకులు అని యేసు చెప్పాడు (23:16-19).

Matthew 23:23

పరిసయ్యులు, శాస్త్రులు పుదీనాలో, సోపులో, జీలకర్రలో పదవ వంతు చెల్లిస్తున్నప్పటికీ ఏ విషయంలో తప్పిపోతున్నారు?

పరిసయ్యులు, శాస్త్రులు ధర్మ శాస్త్రములో ముఖ్యమైన విషయాలలో అంటే న్యాయము, కనికరము, విశ్వాసము విషయాలలో తప్పిపోతున్నారు (23:23).

Matthew 23:25

పరిసయ్యులు, శాస్త్రులు దేనిని శుభ్రం చేయడంలో తప్పిపోతున్నారు?

పరిసయ్యులు, శాస్త్రులు తమ గిన్నెలు బయట శుభ్రం చేస్తున్నారు గాని గిన్నెల లోపల శుభ్రం చేయడం లేదు (23:25-26).

Matthew 23:27

పరిసయ్యులు, శాస్త్రులు తమ లోపల ఏమి ఉంచుకొన్నారు?

పరిసయ్యులు, శాస్త్రులు వేషధారణ, అన్యాయం, అక్రమాలతో తమ హృదయాలు నింపుకొన్నారు (23:25,28).

Matthew 23:29

పరిసయ్యుల, శాస్త్రుల పితరులు దేవుని ప్రవక్తలను ఏమి చేశారు?

పరిసయ్యుల, శాస్త్రుల పితరులు దేవుని ప్రవక్తలను చంపివేశారు (23:29-31).

Matthew 23:32

శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి శిక్షను ఎదుర్కోబోతున్నారు?

శాస్త్రులు, పరిసయ్యులు తీర్పులో నరక శిక్షను ఎదుర్కోబోతున్నారు (23:33).

Matthew 23:34

శాస్త్రులు పరిసయ్యులు తాను పంపుతున్న ప్రవక్తలను, జ్ఞానులను, , ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

వారిలో కొందరిని సిలువ వేస్తారు, కొందరిని కొరడాలతో కొడతారు, కొందరిని తరిమి వేస్తారు (23:34).

శాస్త్రుల, పరిసయ్యుల దోష ప్రవర్తన బట్టి వారికి ఎలాంటి తీర్పు వస్తుంది?

చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా వారి శాస్త్రుల, పరిసయ్యుల మీదకు వస్తుంది (23:35).

ఏ తరము వారికి యేసు చెప్పినది వస్తుంది?

యేసు చెప్పిన ఇవన్నీప్రస్తుత తరమువారికి వస్తాయి (23:36).

Matthew 23:37

యేసు యెరూషలేము సంతతి ఏమి చేయాలని కోరినప్పుడు వారు నెరవేర్చలేక పోయారు?

యెరూషలేము సంతతి అంతటినీ ఒక చోట సమకూర్చవలెనని కోరినప్పుడు వారు నిరాకరించారు (23:37).

యెరూషలేము పట్టణం ఎలా ఉంది?

ఇప్పుడు యెరూషలేము పట్టణం విడిచిపెట్టబడింది (23:38).


Chapter 24

Translation Questions

Matthew 24:1

యెరూషలేములోని దేవాలయమును గూర్చిన యేసు ప్రవచనం ఏమిటి?

యెరూషలేములోని దేవాలయము రాయి మీద రాయి ఒక్కటికూడా నిలబడకుండా పడదోయబడుతుందని యేసు ప్రవచించాడు (24:2).

Matthew 24:3

దేవాలయమును గూర్చిన ప్రవచనం విన్నప్పుడు శిష్యులు యేసును ఏమని అడిగారు?

ఇవి ఎప్పుడు జరుగుతాయి, యేసు రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు (24:3).

ఎలాంటి వ్యక్తులు ప్రజలను మోసపుచ్చుతారని యేసు చెప్పాడు?

అనేకులు యేసు పేరట వచ్చి తామే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తారు (24:5).

Matthew 24:6

వేదన కలగడానికి ప్రారంభమయ్యే సంభవాలు ఏమిటని యేసు చెప్పాడు?

యుద్ధములు, కరువులు, భూకంపాలు మొదలైనవి వేదన కలగడానికి ప్రారంభమయ్యే సంభవాలు అని యేసు చెప్పాడు (24:6-8).

Matthew 24:9

ఆ సమయంలో విశ్వాసులకు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఆ సమయంలో విశ్వాసులు శ్రమలపాలై చనిపోతారు, జనములచేత ద్వేషింపబడతారు, అనేకులు అభ్యంతరపడి అప్పగించుకొంటారు, ఒకరినొకరు ద్వేషించుకొంటారు (24:9-12).

Matthew 24:12

ఎవరు రక్షింపబడతారు?

అంతము వరకు సహించినవారు రక్షింపబడతారు (24:13).

అంతము రాక ముందు సువార్త వ్యాప్తి ఎలా జరుగుతుంది?

రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమంతటా ప్రకటింపబడుతుంది (24:14).

Matthew 24:15

విశ్వాసులు నాసనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం చూసినప్పుడు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

విశ్వాసులు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం చూసినప్పుడు కొండలకు పారిపోతారు(24:15-18).

Matthew 24:19

ఆ రోజుల్లో ఇంతటి ఘోర శ్రమ ఎలా ఉంటుంది?

లోకం ఆరంభం నుండి ఇప్పటివరకు ఇలాంటి శ్రమ కలగలేదు, ఇకపై ఎప్పటికీ జరగదు (24:21).

Matthew 24:23

అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఏర్పరచబడిన వారిని ఎలా మోసగిస్తారు?

అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచి ఏర్పరచ బడిన వారిని మోసగిస్తారు (24:24).

Matthew 24:26

రాబోయే మనుష్య కుమారుడు ఎలా కనబడతాడు?

మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనడుతుందో రాబోయే మనుష్య కుమారుడు కనబడతాడు (24:27).

Matthew 24:29

శ్రమ ముగిసిన తరువాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఏమి జరుగుతుంది?

సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చీకటి కమ్మివేస్తుంది. నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి (24:29).

Matthew 24:30

మనుష్య కుమారుడు మహిమతో, ప్రభావముతో దిగి వచ్చుట చూసినప్పుడు భూమిపై ఉన్న సకల గోత్రములవారు ఏమి చేస్తారు?

మనుష్య కుమారుడు మహిమతో, ప్రభావముతో దిగి వచ్చుట చూసినప్పుడు భూమిపై ఉన్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకుంటారు (24:30).

మనుష్య కుమారుడు తన దూతలను ఎంపిక చేయబడిన వారిని పోగుచేయడానికి పంపినప్పుడు ఎలాంటి శబ్దం వినిపిస్తుంది?

దూతలు ఎంపిక చేయబడిన వారిని పోగుచేయడానికి వచ్చినప్పుడు గొప్ప బూర శబ్దం వినిపిస్తుండి (24:31).

Matthew 24:34

ఈ విషయాలన్నీ జరిగే వరకు ఏమి గతించదని యేసు చెప్పాడు?

ఈ విషయాలన్నీ జరిగే వరకు ఈ తరము గతించదని యేసు చెప్పాడు (24:34).

ఏవి గతించి పోయినా, ఏవి గతించవని యేసు చెప్పాడు?

ఆకాశము, భూమి గతించి పోయినా ఆయన మాటలు గతింపవని యేసు చెప్పాడు (24:35).

Matthew 24:36

ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలుసు?

కేవలం ఒక్క తండ్రికి మాత్రమే ఈ విషయాలన్నీఎప్పుడు జరుగుతాయో తెలుసు (24:36).

Matthew 24:37

నోవహు దినముల ముందు జలప్రళయం రాకముందు ప్రజలు ఉన్నట్టుగా మనుష్య కుమారుడు వచ్చే సమయంలో ప్రజలు ఎలా ఉంటారు?

ప్రజలు తినుచూ, త్రాగుచూ పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు మనుష్య కుమారుని రాకడను గూర్చి తెలుసుకొనకుండా ఉంటారు (24:37-39).

Matthew 24:43

విశ్వాసులు తన రాకడ విషయంలో ఏ వైఖరి కలిగి ఉండాలని యేసు చెప్పాడు?

ప్రభువు ఎప్పుడు వస్తాడో విశ్వాసులకు తెలియదు కనుక మెలకువ కలిగి సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (24:42,44).

Matthew 24:45

యజమాని ఇంట లేనప్పుడు నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకుడు ఏమి చేస్తాడు?

నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకుడు తన యజమాని ఇంట లేనప్పుడు యజమాని ఇంటివారి బాగోగులు చూసుకుంటాడు (24:45-46).

యజమాని తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకునికి ఏమి చేస్తాడు?

యజమాని తన యావదాస్తిపై ఆ సేవకునికి బాధ్యతలు అప్పగిస్తాడు (24:47).

Matthew 24:48

యజమాని ఇంట లేనప్పుడు దుష్టుడైన సేవకుడు ఏమి చేస్తాడు?

యజమాని ఇంట లేనప్పుడు దుష్టుడైన సేవకుడు తన తోటి సేవకులను కొట్టి, తాగుబోతులతో కలసి తాగుతూ, తింటూ ఉంటాడు (24:48-49).

యజమాని తిరిగి వచ్చినప్పుడు దుష్టుడైన సేవకుణ్ణి ఏమి చేస్తాడు?

యజమాని తిరిగి వచ్చినప్పుడు దుష్టుడైన సేవకుణ్ణి రెండుగా నరికించి, ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలానికి తోలివేస్తాడు (24:51).


Chapter 25

Translation Questions

Matthew 25:1

బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు ఏమి చేయలేదు?

బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు తమ దివిటీలలో నూనె తీసుకు వెళ్ళలేదు (25:3).

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు ఏమి చేశారు?

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు తమ దివిటీలలో సరిపడిన నూనె తీసుకు వెళ్లారు (25:4).

Matthew 25:5

పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? అది అనుకొన్న సమయమేనా?

పెండ్లి కుమారుడు అనుకొన్నసమయం కంటే ఆలస్యంగాఅర్థరాత్రి సమయంలో వచ్చాడు (25:5-6).

Matthew 25:10

పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి గల కన్యలు ఏమి చేశారు?

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారునీతో కలసి పెండ్లి విందుకు వెళ్లారు (25:10).

పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధిలేని కన్యలకు ఏమి జరిగింది?

బుద్ధిలేని కన్యలు నూనె కొనేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి విందు తలుపులు మోయబడ్డాయి (25:8-12).

కన్యకల ఉపమానం నుండి విశ్వాసులు ఏమి నేర్చుకోవాలని యేసు కోరుకున్నాడు?

ఆ దినమైనా, సమయమైనా తెలియదు గనుక విశ్వాసులు మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (25:13).

Matthew 25:14

యజమాని ఊరు విడిచి వెళ్తూ, తన ఇద్దరు సేవకులకు ఇచ్చిన అయిదు, రెండు తలాంతులను వారు ఏమి చేశారు?

అయిదు తలాంతులు పొందినవాడు అదనంగా మరో అయిదు తలాంతులు సంపాదించాడు. రెండు తలాంతులు పొందినవాడు అదనంగా మరో రెండు తలాంతులు సంపాదించాడు (25:16-17).

Matthew 25:17

యజమాని ఊరు విడిచి వెళ్తూ, ఒక సేవకునికి ఇచ్చిన ఒక్క తలాంతును అతడు ఏమి చేశాడు?

అతడు ఒక గొయ్యి తవ్వి యజమాని ఇచ్చిన తలాంతును దాచిపెట్టాడు (25:18).

Matthew 25:19

యజమాని ఎంతకాలం వరకు తిరిగి రాలేదు?

యజమాని చాలాకాలం వరకు తిరిగి రాలేదు (25:19).

అయిదు, రెండు తలాంతులు తీసుకొన్న సేవకులతో యజమాని ఏమని చెప్పాడు?

యజమాని వారితో, "భళా నమ్మకమైన మంచి దాసుడా" అని మెచ్చుకొని వారిని అనేకమైన వాటిపై నియమించాడు (25:20-23).

Matthew 25:26

ఒక్క తలాంతు తీసుకొన్న సేవకునితో యజమాని ఏమన్నాడు?

యజమాని ఆ సేవకుణ్ణి "సోమరివైన చెడ్డ దాసుడా" అని చెప్పి అతని వద్దనుండి ఒక్క తలాంతు తీసి వేసి, అతణ్ణి చీకటిలోకి విసరివేయమని చెప్పాడు (25:24-30).

Matthew 25:31

మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని ఏమి చేస్తాడు?

మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని సమస్త జనులను పోగుచేసి ఒకరినుండి ఒకరిని వేరుపరుస్తాడు (25:31-32).

Matthew 25:34

రాజు కుడి పక్కన ఉన్నవారు ఏమి పొందుతారు?

రాజు కుడిపక్కన ఉన్నవారు లోకం పుట్టినది మొదలు తమ కోసం సిద్దపరచబడిన రాజ్యం పొందుతారు (25:34).

రాజు కుడిపక్కన ఉన్నవారు తమ జీవిత కాలంలో ఏమి చేశారు?

రాజు కుడిపక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దాహం ఉన్నవారి దాహం తీర్చారు, పరదేశులను ఆదరించారు, బట్టలు లేనివారికి బట్టలిచ్చారు, రోగులను పరామర్శించారు, ఖైదీలను దర్శించారు (25:35-40).

Matthew 25:41

రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఏమి పొందుకుంటారు?

రాజు కుడి పక్కన ఉన్నవారు అపవాదికి, వాడి దూతలకు సిద్దపరచబడిన నిత్యాగ్నిలోకి పడద్రోయబడతారు (25:41).

Matthew 25:44

రాజు ఎడమ పక్కన ఉన్నవారు తమ జీవిత కాలంలో ఏ పనులు చేయలేదు?

రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టలేదు, దాహం గొన్నవారి దప్పిక తీర్చలేదు, పరదేశులను ఆదరించలేదు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వలేదు, రోగులను పరామర్శించలేదు, ఖైదీలను దర్శించలేదు (25:42-45).


Chapter 26

Translation Questions

Matthew 26:1

ఏ యూదుల పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు?

పస్కా పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు (26:2).

Matthew 26:3

యాజకులు, పెద్దలు ప్రధాన యాజకుని మందిరములో సమకూడి ఏమని ఆలోచన చేశారు?

వారు యేసును మాయోపాయము చేత పట్టుకొని ఆయనను చంపాలని ఆలోచన చేశారు (26:4).

ప్రధాన యాజకులు, పెద్దలు ఎందువలన భయపడ్డారు?

పండుగ సందర్భంగా యేసుని చంపితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వారు భయపడ్డారు (26:5).

Matthew 26:6

ఒక స్త్రీ విలువైన అత్తరును యేసు తలపై పోసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారు?

శిష్యులు కోపగించుకోని ఆ అత్తరును అమ్మి వచ్చిన ధనం పేదలకు పంచవచ్చు గదా అన్నారు (26:6-9).

Matthew 26:12

తన తలపై ఆ స్త్రీ నూనె పోసినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

నా భూస్థాపన కొరకు ఈమె ఈ అత్తరు పోసినదని యేసు చెప్పాడు (26:12).

Matthew 26:14

యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ఎంత మొత్తం చెల్లించారు?

యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ముప్ఫై వెండి నాణెములు చెల్లించారు (26:14-15).

Matthew 26:23

తనను అప్పగింపబోయేవానికి భవిషత్తులో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

తనను అప్పగింపబోయే వాడికి బాధ, వాడు పుట్టకుండా ఉన్నట్టయితే అతనికి మేలు అని యేసు అన్నాడు (26:24).

యేసును అప్పగింపబోయేది నేనా అని యూదా అడిగినప్పుడు యేసు ఏమని జవాబిచ్చాడు?

"నీవన్నట్టే" అని యేసు జవాబిచ్చాడు (26:25).

Matthew 26:26

యేసు రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి, విరిచి శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

"దీనిని తీసికొని తినండి, ఇది నా శరీరము" అని చెప్పాడు (26:26).

Matthew 26:27

యేసు గిన్నె తీసుకొని దానిని శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

"ఇది నా రక్తము, అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము" అని చెప్పాడు (26:28).

Matthew 26:30

యేసు తన శిష్యులతో ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు వారితో ఏమని చెప్పాడు?

ఆ రాత్రి వారంతా తన విషయంలో అభ్యంతరపడతారని యేసు చెప్పాడు (26:30-31).

Matthew 26:33

పేతురు యేసు విషయంలో అభ్యంతరపడనని యేసుతో చెప్పినప్పుడు ఆయన పేతురుతో ఏమని చెప్పాడు?

పేతురు ఈ రాత్రి కోడి కూయక ముందు తనను ఎరుగనని మూడుసార్లు చెబుతాడని యేసు చెప్పాడు (26:33-34).

Matthew 26:36

తాను ప్రార్ధించే సమయంలో పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను ఏమి చేయమని యేసు అడిగాడు?

శిష్యులను మెలకువగా ఉండి కనిపెట్టమని యేసు కోరాడు (26:37-38).

Matthew 26:39

ప్రార్థనలో యేసు తండ్రిని ఏమి అడిగాడు?

సాధ్యమైతే ఈ గిన్నెను నానుండి తొలగిపోనిమ్ము అని ప్రార్ధించాడు (26:39).

యేసు తన చిత్తం కాక, ఎవరి చిత్తం నెరవేరాలని కోరాడు?

యేసు, తన చిత్తం కాక తండ్రి చిత్తమే నెరవేరాలని కోరాడు (26:39,42).

Matthew 26:42

యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేస్తున్నారు?

యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు (26:40,43,45).

ఎన్నిసార్లు యేసు శిష్యులను విడిచి ప్రార్ధించడానికి వెళ్ళాడు?

యేసు శిష్యులను విడిచి మూడుసార్లు ప్రార్ధించడానికి వెళ్ళాడు? (26:39-44).

Matthew 26:47

గుంపులో ఉన్న యేసును బంధించడానికి యూదా ఏ సూచన చెప్పాడు?

గుంపులో ఉన్న యేసును ముద్దు పెట్టుకోవడం అనే సూచనను బట్టి ఆయనే యేసు అని గుర్తించాలని యూదా చెప్పాడు (26:47-50).

Matthew 26:51

యేసును బంధించినప్పుడు శిష్యులు ఏమి చేశారు?

యేసు శిష్యులలో ఒకడు కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు (26:51).

యేసు కోరుకుంటే తనను తాను కాపాడుకోలేడా?

యేసు తన తండ్రిని కోరితే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సేనలను తండ్రి పంపుతాడని యేసు చెప్పాడు (26:53).

లేఖనాలు ఏ సంఘటనలవల్ల నేరవేరబడాలని యేసు చెప్పాడు?

జరుగుతున్నఈ సంఘటనలన్నీ లేఖానాల నెరవేర్పు అని యేసు చెప్పాడు (26:54,56).

Matthew 26:55

అప్పుడు శిష్యులు ఏమి చేశారు?

శిష్యులు అందరూ యేసును విడిచి పారిపోయారు (26:56).

Matthew 26:59

యేసుకు మరణ శిక్ష విధించేలా చేయాలని ప్రధాన యాజకులు, మహాసభవారు ఏమి కుట్రలు చేస్తున్నారు?

ఆయనను చంపాలని యేసుకు వ్యతిరేకంగా ప్రజలచే అబద్ధ సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారు (26:59).

Matthew 26:62

జీవము గల దేవుని సాక్ష్యంగా ఏమి చెప్పాలని ప్రధాన యాజకుడు ఆజ్ఞాపించాడు?

ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట తమతో చెప్పమని ఆజ్ఞాపించాడు (26:63).

ప్రధాన యాజకుని ఆజ్ఞకు ఏమని జవాబిచ్చాడు?

యేసు, "నీవు చెప్పినట్టే" అని జవాబిచ్చాడు (26:64).

ప్రధాన యాజకుడు ఏమి చూస్తాడని యేసు చెప్పాడు?

మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ప్రధాన యాజకుడు చూస్తాడని యేసు చెప్పాడు (26:64).

Matthew 26:65

ప్రధాన యాజకుడు యేసుపై ఏమని నేరారోపణ చేశాడు?

యేసు దైవదూషణ చేస్తున్నాడని ప్రధాన యాజకుడు యేసుపై నేరారోపణ చేశాడు (26:65).

Matthew 26:67

యేసుపై నేరం ఆరోపించినపుడు వారు ఏమి చేశారు?

వారు యేసు ముఖంపై ఉమ్మివేసి, గుద్ది, అరచేతులతో కొట్టారు (26:67).

Matthew 26:69

ఒకప్పుడు యేసుతో కలసి ఉన్న పేతురును, నువ్వు యేసు శిష్యుడివి కదా, అని అక్కడి వారు అడిగిన మూడుసార్లు పేతురు ఏమని చెప్పాడు.

యేసు ఎవరో తనకు తెలియదని పేతురు చెప్పాడు (26:70,72,74).

Matthew 26:73

మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే ఏమి జరిగింది?

మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే కోడి కూసింది (26:74).

మూడవసారి జవాబిచ్చిన తరువాత పేతురుకు ఏమి జ్ఞాపకం వచ్చింది?

తనను ఎరుగనని మూడుసార్లు పలికిన తర్వాతే కోడి కూస్తుందని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు (26:75).


Chapter 27

Translation Questions

Matthew 27:1

ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును ఎక్కడికి తీసుకు వెళ్ళారు?

ఉదయమైనప్పుడు వారు యేసును గవర్నరు పిలాతు దగ్గరకు తీసుకు వెళ్ళారు (27:2).

Matthew 27:3

యేసుకు శిక్ష విధింపబడినప్పుడు చూసిన ఇస్కరియోతు యూదా ఏమి చేశాడు?

నిరపరాధి రక్తం అప్పగించినందుకు పశ్చాత్తాపపడిన యూదా ఆ వెండి నాణేలు విసిరివేసి వెళ్ళి ఉరి వేసుకున్నాడు (27:3-5).

Matthew 27:6

ముప్ఫై వెండి నాణేలతో ప్రధాన యాజకులు ఏమి చేశారు?

వారు విదేశీయులను పాతిపెట్టడం కోసం కొంత పొలం కొన్నారు (27:6-7).

Matthew 27:9

ఈ సంఘటనల వల్ల ఎవరి ప్రవచనాలు నేరవేరాయి?

ఈ సంఘటనలు వల్ల యిర్మీయా ప్రవచనాలు నేరవేరాయి (27:9-10).

Matthew 27:11

పిలాతు యేసును ఏమని అడిగాడు? యేసు ఏమి జవాబిచ్చాడు?

పిలాతు యేసును 'నీవు యూదుల రాజువా? అని అడిగాడు. అందుకు యేసు, 'అవును, నీవు అన్నట్టే' అని జవాబిచ్చాడు (27:11).

ప్రధాన యాజకులు, పెద్దలు యేసుపై నేరారోపణ చేసినప్పుడు యేసు ఏమి జవాబిచ్చాడు?

యేసు ఒక్క మాట కూడా బదులు పలకలేదు (27:12-14).

Matthew 27:15

పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం పిలాతు యేసుకు ఏమి చేయాలని కోరాడు?

పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం పిలాతు యేసును విడుదల చేయించాలని కోరాడు (27:15-18).

Matthew 27:17

న్యాయపీఠంపై కూర్చుని ఉన్న పిలాతుకు అతని భార్య ఏమని వర్తమానం పంపింది?

ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని ఆమె పిలాతుకు వర్తమానం పంపించింది (27:19).

Matthew 27:20

పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం యేసుకు బదులుగా బరబ్బాను ఎందుకు విడుదల చేశారు?

ప్రధాన యాజకులు, పెద్దలు యేసును కాక బరబ్బాను విడుదల చేయాలని కేకలు వేసేలా ప్రజలను ప్రేరేపించారు (27:20).

యేసును ఏమి చేయాలని ప్రజలు కోరుకున్నారు?

యేసును సిలువ వేయమని ప్రజలు కోరుకున్నారు (27:22-23).

Matthew 27:23

ప్రజలనుండి అల్లరి ఎక్కువ అవుతున్నప్పుడు పిలాతు ఏమి చేశాడు?

పిలాతు ప్రజల ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి తాను నిరపరాధినని చెప్పి, యేసును జనసమూహానికి అప్పగించాడు (27:24).

Matthew 27:25

యేసును ప్రజలకు అప్పగించినప్పుడు వారు ఏమని అన్నారు?

ప్రజలు, "వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక" అని కేకలు వేసారు (27:25).

Matthew 27:27

అప్పుడు గవర్నరు సైనికులు యేసును ఏమి చేశారు?

సైనికులు యేసుకు అంగీ తొడిగించి, తలపై ముళ్ళ కిరీటం ఉంచి, ఆయనను గేలి చేస్తూ, ఆయన తలపై కొట్టి, సిలువ వేసేందుకు తీసుకువెళ్ళారు (27:27-31).

Matthew 27:32

కురేనీయుడైన సీమోనును ఏమి చేయమని బలవంతపెట్టారు?

యేసు మోస్తున్న సిలువను మోయమని సీమోనును బలవంతపెట్టారు (27:32).

సిలువ వేసేందుకు వారు యేసును ఎక్కడికి తీసుకు వెళ్ళారు?

వారు "కపాల స్థలము" అని అర్ధం వచ్చే గొల్గొతాకు యేసును తీసుకువచ్చారు (27:33).

Matthew 27:35

యేసును సిలువ వేసిన తరువాత సైనికులు ఏమి చేశారు?

సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన దుస్తులు పంచుకొని, అక్కడే కూర్చుని ఆయనకు కాపలా కాస్తున్నారు (27:35-36).

యేసు తల భాగంపై ఏమని రాసి పెట్టారు?

"ఇతడు యూదుల రాజైన యేసు" అని వ్రాశారు (27:37).

Matthew 27:38

యేసుతోపాటు ఎవరిని సిలువ వేసారు?

యేసుకు కుడి పక్కన, ఎడమ పక్కన ఇద్దరు దొంగలను ఆయనతోపాటు సిలువ వేశారు (27:38).

గుమి గూడిన ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఏమని సవాలు చేశారు?

తనను తాను రక్షించుకొని సిలువ దిగి రమ్మని యేసును సవాలు చేశారు (27:39-44).

Matthew 27:45

మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఏమి జరిగింది?

మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది (27:45).

మూడు గంటల సమయంలో యేసు ఏమని కేక వేసాడు?

యేసు, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి" అని కేక వేసాడు (27:46).

Matthew 27:48

యేసు మరల బిగ్గరగా కేక వేసిన తరువాత ఏమి జరిగింది?

యేసు ప్రాణం విడిచాడు (27:50).

Matthew 27:51

యేసు మరణించిన తరువాత దేవాలయానికి ఏమి జరిగింది?

యేసు మరణించిన తరువాత దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగింది (27:51).

యేసు మరణించిన తరువాత సమాధులు ఏమయ్యాయి?

సమాధులు తెరుచుకుని అనేకమంది పరిశుద్ధులు లేచి అనేకమందికి కనబడ్డారు (27:52-53).

Matthew 27:54

జరిగినదంతా చూస్తున్న శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి?

"ఇతడు నిజముగా దేవుని కుమారుడు" అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు (27:54).

Matthew 27:57

యేసును సిలువ వేసిన తరువాత ఆయన మృత దేహాన్ని ఏమి చేశారు?

ధనవంతుడైన యేసు శిష్యుడు యోసేపు పిలాతును యేసు దేహం తనకిమ్మని అడిగి, నారబట్ట చుట్టి తన సొంత కొత్త సమాధిలో ఉంచాడు (27:57-60).

Matthew 27:59

యేసు మృతదేహం ఉంచిన సమాధి కి అడ్డంగా ఏమి ఉంచారు?

ఒక పెద్ద రాయిని సమాధికి అడ్డంగా ఉంచారు (27:60).

Matthew 27:62

తరవాతి రోజు ప్రధాన యాజకులు, పెద్దలు పిలాతును ఎందుకు కలిసారు?

యేసు దేహాన్ని ఎవరూ ఎత్తుకు వెళ్ళకుండా భద్రం చేయడానికి కాపలా పెట్టమని అడగడానికి కలిశారు (27:62-64).

Matthew 27:65

సమాధికి ఏమి చేయడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు?

సమాధి రాతికి ముద్ర వేసి, సైనికులను కాపలా ఉంచడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు (27:65-66).


Chapter 28

Translation Questions

Matthew 28:1

మగ్దలేనే మరియ, వేరొక మరియ ఏ రోజు, ఏ సమయంలో యేసు సమాధి దగ్గరకు వెళ్లారు?

ఆదివారం తెల్లవారుజామున వారు యేసు సమాధి దగ్గరకు వెళ్ళారు (28:1).

యేసు సమాధి రాయి ఎలా దొర్లించి ఉంది ?

దేవుని దూత రాయి దొర్లించాడు (28:2).

Matthew 28:3

అక్కడి కావలివారు దూతలను చూసి ఏమి చేశారు?

దూతకు భయపడి కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిపోయారు (28:4).

Matthew 28:5

దూత యేసు గురించి ఆ స్త్రీలకు ఏమి చెప్పాడు?

యేసు మృతులలోనుండి లేచి గలిలయలోకి వారికంటే ముందుగా వెళ్ళాడు అని దూత చెప్పాడు (28:5-7).

Matthew 28:8

యేసు గురించి ఆయన శిష్యులకు చెప్పడానికి వెళ్ళిన ఆ స్త్రీలకు దారి మధ్యలో ఏమి జరిగింది?

యేసు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు వారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు (28:8-9).

Matthew 28:11

సైనికులు వచ్చి ప్రధాన యాజకులతో సమాధి వద్ద జరిగిన విషయాలు చెప్పినప్పుడు ప్రధాన యాజకులు ఏమి చేశారు?

ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారని ప్రచారం చెయ్యమని చెప్పారు (28:11-13).

Matthew 28:16

శిష్యులు యేసును గలిలయలో చూసినప్పుడు ఏమి చేశారు?

శిష్యులు యేసుకు మొక్కారు. అయితే కొందరు సందేహించారు (28:17).

Matthew 28:18

ఎలాంటి అధికారం తనకు ఇవ్వబడిందని యేసు చెప్పాడు?

పరలోకంలో, భూమి మీదా తనకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసు చెప్పాడు (28:18).

యేసు తన శిష్యులకు ఇచ్చిన మూడు ఆజ్ఞలు ఏమిటి?

సమస్త జనులను శిష్యులనుగా చేసి, వారికి బాప్తిస్మం ఇస్తూ, యేసు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చాలని బోధించమని చెప్పాడు (28:19-20).

ఎవరి నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు చెప్పాడు?

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు (28:19).

Matthew 28:20

యేసు తన శిష్యులకు చేసిన చివరి వాగ్దానం ఏమిటి?

నేను యుగసమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు (28:20).


Chapter 1

Translation Questions

Mark 1:1

ప్రవక్త యెషయా ప్రభువు రాకడకు ముందు ఏమి జరుగుతుందని చెప్పాడు?

ప్రభువు మార్గాన్ని సిద్ధపరచుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దంగా ఉండే ఒక దూతను పంపుతాడని యెషయా ముందుగా చెప్పాడు. (1:2-3).

Mark 1:4

ఏమి బోధించడానికి యోహాను వచ్చాడు?

పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించడానికి యోహాను వచ్చాడు?1:4).

యోహాను చేత బాప్తిసము తీసుకున్న వారు ఏమి చేసారు?

యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న వారుతమ పాపాలు ఒప్పుకున్నారు. (1:5).

యోహాను ఏమి తినేవాడు?

యోహాను మిడతలను, అడవి తేనెను తినేవాడు. (1:6).

Mark 1:7

తన వెనుక వచ్చువాడు దేనితో బాప్తిస్మమిస్తాడని యోహాను చెపుతున్నాడు?

తన వెనుక వచ్చువాడు పరిశుద్దాత్మతో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు. (1:8).

Mark 1:9

యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న తరువాత బయటకు వచ్చినపుడుయేసు ఏమి చూసాడు?

బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆకాశము చీల్చ బడుటయు, పరిశుద్దాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు యేసు చూసాడు. (1:10).

యేసు బాప్తిసము తీసుకున్న తరువాత ఆకాశము నుండి వచ్చిన శబ్దము ఏమి చెప్పింది?

"నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించు చున్నాను" అని ఆకాశము నుండి వచ్చిన శబ్దము పలికింది. (1:11).

Mark 1:10

భూమి మీద పాపాలను క్షమించే అధికారం తనకు ఉందని యేసు ఎలా కనుపరచాడు?

తన పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని యేసు పక్షవాత రోగితో చెప్పాడు, ఆ వ్యక్తి అలానే చేసాడు. (2:8-12).

Mark 1:12

యేసును అరణ్యము లోనికి త్రోసుకు వెళ్ళింది ఎవరు?

దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకు వెళ్ళాడు. (1:12).

అరణ్యములో యేసు ఎంత కాలము ఉన్నాడు? అక్కడ ఆయనకు ఏమి జరిగింది?

యేసు అరణ్యములో నలభై రోజులు ఉన్నాడు. ఆయన అక్కడ సైతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. (1:13).

Mark 1:14

యేసు ఏ సందేశాన్ని ప్రకటించాడు?

దేవుని రాజ్యం దగ్గరగా ఉంది, పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మండి అని యేసు ప్రకటించాడు. (1:15).

Mark 1:16

సీమోనును, అంద్రెయను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?

సీమోనును, అంద్రెయను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని యేసు చెప్పాడు. (1:17).

Mark 1:19

సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి ఏమిటి?

సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి చేపలు పట్టడం. (1:16,19).

Mark 1:21

యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఎందుకు ఆశ్చర్యపడేలా చేసింది?

యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఆశ్చర్య పడేలా చేసింది ఎందుకంటే ఆయన అధికారం కలవాడిగా ఉపదేశించాడు. (1:22).

Mark 1:23

సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు ఏ పేరు ఇచ్చింది?

సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు దేవుని పవిత్రుడు అనే పేరు ఇచ్చింది. (1:24).

Mark 1:27

యేసును గురించిన వార్తతో ఏమి జరిగింది?

యేసుని గురించిన వార్త చుట్టుపక్కలా అంతటా వ్యాపించింది. (1:28).

Mark 1:29

వారుసీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు ఎవరిని స్వస్థపరచాడు?

వారు సీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు అతని అత్తను స్వస్థపరచాడు. (1:30).

Mark 1:32

సాయంకాల సమయాన ఏమి జరిగింది?

సాయంకాల సమయాన ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టిన వారినందరిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. (1:32-34).

Mark 1:35

సూర్యోదయాన యేసు ఏమి చేసాడు?

సూర్యోదయాన యేసు లేచి నిర్జన స్థలానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. (1:35).

Mark 1:38

తాను ఏమి చెయ్యడానికి వచ్చాడని యేసు పేతురుతో చెప్పాడు?

దగ్గరగా ఉన్న గ్రామాలలో ప్రకటించడానికి తాను వచ్చాడని యేసు పేతురు?ో చెప్పాడు?(1:38-39).

Mark 1:40

స్వస్తపడాలని బ్రతిమిలాడడానికి తన వద్దకు వచ్చిన కుష్టరోగి పట్ల యేసు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు?

యేసు కుష్టరోగి పై జాలి పడి అతనిని బాగు చేసాడు. (1:40-42).

Mark 1:43

ఏమి చెయ్యమని యేసు కుష్టరోగికి చెప్పాడు, ఎందుకు?

సాక్ష్యంగా ఉండేందుకు మోషే ధర్మశాస్త్రం లో విధించిన వాటిని అర్పించమని యేసు కుష్టరోగికి చెప్పాడు. (1:44).


Chapter 2

Translation Questions

Mark 2:5

యేసు పక్షవాత రోగితో ఏమి చెప్పాడు?

"కుమారా నీ పాపాలకు క్షమాపణ దొరికింది" యేసు పక్షవాత రోగితో చెప్పాడు? (2:5).

యేసు చెప్పిన దానికి ధర్మశాస్త్ర పండితులు కొందరు?ందుకు అభ్యంతర పడ్డారు?

యేసు దేవదూషణ చేస్తున్నాడు, ఎందుకంటే దేవుడు?క్కడే పాపాలు క్షమించగలవాడు అని కొందరు ధర్మశాస్త్ర పండితులు ఆలోచించారు. (2:6-7).

Mark 2:13

నా వెంట రా అని లేవీతో యేసు చెప్పినపుడు లేవి ఏమి చేస్తున్నాడు?

యేసు పిలిచినప్పుడు లేవి సుంకం వసూలు చేసే స్థానం లో కూర్చుని వున్నాడు. (2:13-14).

Mark 2:15

లేవి ఇంటిలో యేసు ఏమి చెయ్యడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది ?

లేవి ఇంటిలో యేసు పాపులతో, సుంకరులతో కలిసి భోజనం చేయడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది. (2:15-16).

Mark 2:17

ఎవరిని పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు?

పాపులను పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు. (2:17).

Mark 2:18

ఉపవాసము గురించి కొందరు యేసును ఏమని ప్రశ్నించారు?

యెహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసమున్నప్పుడు?న శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు అని కొందరు యేసును అడిగారు. (2:18).

Mark 2:20

ఉపవాసము గురించి యేసు ఎలా జవాబిచ్చారు?

పెళ్ళికుమారుడు తమతో ఉన్నంతకాలం వారు ఉపవాసం ఉండరు, అయితే పెళ్ళికుమారుడు వారి దగ్గరనుండి తీసి వేయబడివ్పుడు వారు ఉపవాసముంటారు అని యేసు వారితో చెప్పాడు. (2:19-20).

Mark 2:23

విశ్రాంతి దినాన్న పంట చేలలో యేసు శిష్యులు పరిసయ్యులను అభ్యంతర పరచే పని ఏమి చేసారు?

విశ్రాంతి దినాన్న యేసు శిష్యులు పంటచేలలో కంకులు తెంపుకొని తిన్నారు. (2:23-24).

Mark 2:25

ఆకలి గొని నిషిద్దమయిన రొట్టెను తినిన వాని గురించి ఎలాంటి ఉదాహరణ యేసు ఇచ్చాడు?

ఆకలి గొని యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి ఇచ్చిన దావీదును గురించిన ఉదాహరణ యేసు ఇచ్చాడు? (2:25-26).

Mark 2:27

విశ్రాంతి దినం ఎవరి కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు?

విశ్రాంతి దినం మనుషుల కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు? (2:27).

ఏ అధికారం తనకు ఉందని యేసు చెప్పుకునాడు?

తాను విశ్రాంతి దినమునకు కూడా ప్రభువని యేసు చెప్పాడు. (2:28).


Chapter 3

Translation Questions

Mark 3:1

సమాజ కేంద్రంలో విశ్రాంతి దినాన్న వారు?ందుకు యేసును చూస్తూ ఉన్నారు?

ఆయన మీద నింద మోపడానికి విశ్రాంతి దినాన్న యేసు స్వస్థత చేస్తాడేమో అని వారు చూస్తూ ఉన్నారు. (3:1-2).

Mark 3:3

విశ్రాంతి దినము గురించి యేసు వారిని ఏమని అడిగాడు?

విశ్రాంతి దినాన మేలు చేయడమా కీడు చేయడమా ఏది ధర్మం అని యేసు వారిని అడిగాడు. (3:4).

Mark 3:5

యేసు ప్రశ్నకు వారు ఎలా స్పందించారు, వారి పట్ల యేసుకున్న వైఖరి ఏమిటి ?

వారు నెమ్మదిగా ఉన్నారు, యేసు వారిని కోపగించుకున్నాడు. (3:4-5).

యేసు ఆ వ్యక్తిని స్వస్త పరచిన తరువాత పరిసయ్యులు ఏమి చేసారు?

పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపాలో అని కుట్ర పన్నారు. (3:6).

Mark 3:7

ఆయన సముద్రము వద్దకు వెళ్ళినపుడు ఎంత మంది ఆయనను వెంబడించారు??

గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు. (3:7-9).

Mark 3:11

అపవిత్రాత్మలు యేసుని చూచి ఏమని అరిచారు?

యేసు దేవుని కుమారుడని అపవిత్రాత్మలు యేసుని చూచి అరిచారు. (3:11).

Mark 3:13

యేసు ఎంత మంది అపోస్తలులను నియమించాడు, వారు ఏమి చెయ్యాలి ?

వారు ఆయనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును యేసు పన్నెండు మంది అపోస్తలులను నియమించాడు. (3:14-15).

Mark 3:17

యేసును మోసగించబోవు అపోస్తలుడు ఎవరు?

యేసును మోసగించబోవు అపోస్తలుడు యూదా ఇస్కరియోతు. (3:19).

Mark 3:20

యేసు చుట్టూ ఉన్న జనసమూహము, సంఘటనలను గురించి ఆయన ఇంటివారు?మని తలంచారు?

ఆయనకు మతి చలించినదని ఆయన ఇంటివారు తలంచారు? (3:21).

శాస్త్రులు యేసుకు వ్యతిరేకంగా ఏ నింద వేసారు?

దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని యేసును నిందించారు. (3:22).

Mark 3:23

శాస్త్రులు వేసిన నిందకు యేసు స్పందన ఏమిటి ?

తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యము నిలువనేరదని యేసు చెప్పాడు. (3:23-26).

Mark 3:28

ఏ పాపము క్షమాపణ పొందనేరదని యేసు చెప్పాడు?

పరిశుద్డాత్మకు వ్యతిరేకమైన దూషణ క్షమాపణ పొంద నేరదని యేసు చెప్పాడు? (3:28-30).

Mark 3:33

తన తల్లి తన సహోదరులు ఎవరని యేసు చెప్పాడు?

దేవుని చిత్తము జరిగించు వాడే తన తల్లియు తన సహోదరులును అని యేసు చెప్పాడు? (3:33-35).


Chapter 4

Translation Questions

Mark 4:1

యేసు బోధించడానికి దోనె ఎందుకు ఎక్కాడు?

ఆయన దగ్గర చాలా పెద్ద జనసమూహం సమకూడినందున యేసు బోధించడానికి దోనె ఎక్కాడు? (4:1).

Mark 4:3

త్రోవ ప్రక్కన పడిన విత్తనాలకు ఏమి జరిగింది ?

పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. (4:4).

Mark 4:6

రాతి నేలను పడిన విత్తనాలకు ఏమి జరిగింది ?

మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచి ఎండి పోయాయి. (4:5-6).

ముండ్ల పొదలలో పడిన విత్తనాలకు ఏమి జరిగింది?

ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచి వేసెను. (4:7).

Mark 4:8

మంచి నేలను పడిన విత్తనాలకు ఏమి జరిగింది?

మంచి నేలను పడిన విత్తనాలు పెరిగి పైరై ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను ఫలించెను. (4:8).

Mark 4:10

వెలుపల ఉండువారికి కాక పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పిన దేమిటి ?

దేవుని రాజ్య మర్మము తెలిసికొనుటకు బయటి వారికిగాక ఆ పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పాడు. (4:11).

Mark 4:13

యేసు ఉపమానంలో విత్తనము అంటే ఏమిటి ?

విత్తనము దేవుని వాక్యము. (1:10).

త్రోవపక్కన విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది ?

వాక్యమును విత్తుచుండగా విను వారిని సూచిస్తుంది. అయితే సాతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. (1:11).

Mark 4:16

రాతి నేలను విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది?

వాక్యమునును విని సంతోషముగా అంగీకరించు వారిని సూచిస్తుంది అయితే శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడతారు. (4:16-17).

Mark 4:18

ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది ? ?

వాక్యమును విను వారిని సూచిస్తుంది. అయితే ఈ లోక ఐహిక విచారాలు వాటిని అణచి వేస్తాయి. (4:18-19).

మంచి నేలను విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది?

వాక్యమును విని, అంగీకరించి ఫలమును ఫలించు వారిని సూచిస్తుంది. (4:20).

Mark 4:21

మరుగు చేయబడినవాటికి, రహస్యమయిన వాటికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

మరుగు చేయబడినవి, రహస్యమయినవి వెలుగు లోనికి తేబడతాయని యేసు చెప్పాడు?(4:22).

Mark 4:26

దేవుని రాజ్యము భూమిలో విత్తనము చల్లిన మనుష్యుని ఏ విధంగా పోలి ఉంది?

మనుష్యుడి విత్తనము చల్లుతాడు, అది పెరుగుతుంది, అతనికి తెలియకుండానే పంట వస్తుంది. దానిని అతడు సమకూరుస్తాడు. (4:26-29).

Mark 4:30

దేవుని రాజ్యము ఆవగింజను ఏ విధంగా పోలి ఉంది ?

ఆవగింజ భూమిలో విత్తబడినపుదు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కాని అది ఎదిగి గొప్పదై ఆకాశ పక్షులు దాని నీడను విశ్రమించును. (4:30-32).

Mark 4:35

యేసును ఆయన శిష్యులును నది దాటిపుడు ఏమి జరిగింది ?

పెద్ద తుఫాను రేగి దోనె నీటితో నిండి పోవునట్లుగా అలలు దోనెను కొట్టాయి. (4:35-37).

Mark 4:38

ఈ సమయములో దోనెలో యేసు ఏమి చేస్తున్నాడు?

యేసు నిద్ర పోతూ ఉన్నాడు. (4:38).

శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

తాము నశించి పోతుండగా ఆయనకు చింత లేదా అని యేసును ప్రశ్నించారు. (4:38).

అప్పుడు యేసు ఏమి చేసాడు?

యేసు గాలిని గద్దించి సముద్రమును నిమ్మళ పరచెను. (4:39).

Mark 4:40

ఈ విధంగా యేసు చేసిన తరువాత శిష్యుల స్పందన ఏమిటి ?

శిష్యులు మిక్కిలి భయపడ్డారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. (4:41).


Chapter 5

Translation Questions

Mark 5:1

వారు గెరాసేనల దేశమునకు వచ్చినపుడు యేసును కలుసుకున్నదెవరు?

అపవిత్రాత్మ పట్టినవాడొకడు యేసును కలుసుకున్నాడు. (5:1-2).

Mark 5:3

ఈ వ్యక్తి చేసిన కొన్ని పనులు ఏమిటి ?

ఈ వ్యక్తి సమాధులలో నివసించే వాడు, చేతి సంకెళ్ళను, కట్లను తుత్తునియలుగా చేసేవాడు. ఎల్లప్పుడూ కేకలు వేస్తూ తనను తాను రాళ్ళతో గాయపరచుకొనే వాడు. (5:3-5).

Mark 5:7

ఈ మనుష్యునితో యేసు ఏమి చెప్పాడు??

"అపవిత్రాత్మా, ఈ మనుష్యుని విడిచిపొమ్మని చెప్పాడు. (5:8).

ఈ అపవిత్రాత్మ యేసుకు ఏ పేరు ఇచ్చింది ?

ఈ అపవిత్రాత్మ యేసును సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని పిలిచింది. (5:7).

Mark 5:9

ఆ అపవిత్రాత్మ పేరు ఏమిటి ?

ఆ అపవిత్రాత్మ పేరు సేన, ఎందుకంటే వారు అనేకులు. (5:9).

Mark 5:11

ఆ మనుష్యుని నుండి అపవిత్రాత్మను బయటకు పంపివేసినపుడు?మి జరిగింది?

ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందుల గుంపులోనికి ప్రవేశించాయి. ప్రవేశింపగా అవి నిటారుగా ఉన్న ఆ కొండమీద నుండి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి చనిపోయాయి. (5:13).

Mark 5:14

ఆ అపవిత్రాత్మ వెడలిపోయిన తరువాత ఆ మనుష్యుని పరిస్థితి ఎలా ఉంది ?

ఆ మనుష్యుడు బట్టలు ధరించుకొని స్వస్త చిత్తుడై యేసుతో కూర్చుండెను. (5:15).

Mark 5:16

జరిగిన ఈ సంఘటనలకు ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా స్పందించారు? యేసును ఏమి చెయ్యమని అడిగారు?

ఆ ప్రజలు భయపడి తమ ప్రాంతాన్ని విడిచి పొమ్మని యేసును బతిమాలుకొన్నారు. (5:15-17).

Mark 5:18

సమాధులలో నివసించిన వానిని ఇప్పుడు ఏమి చెయ్యమని యేసు చెప్పాడు??

ప్రభువు తనకు చేసిన కార్యములను తన ఇంటి వారికి తెలియచెప్పమని అన్నాడు. (5:19).

Mark 5:21

సమాజ మందిరపు అధికారి యాయీరు యేసును ఏమని అర్ధించాడు?

వచ్చి చావ సిద్ధమై ఉన్న తన కుమార్తె మీద చేతులుంచ వలసిందని యాయీరు యేసును అడిగాడు. (5:22-23).

Mark 5:25

యేసు వస్త్రమును ముట్టిన స్త్రీకున్న సమస్య ఏమిటి ?

ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధ పడుతుంది. (5:25).

Mark 5:28

ఆ స్త్రీ యేసు వస్త్రమును ఎందుకు ముట్టుకుంది ?

యేసు వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతాననుకొంది. (5:28).

Mark 5:30

ఆ స్త్రీ యేసు వస్త్రములను తాకినపుడు యేసు ఏమి చేసాడు?

యేసు తనలోనుండి ప్రభావము బయటకు వెళ్లిందని తనలో తాను గ్రహించి తనను తాకినదెవరో చూడడానికి చుట్టూ చూసాడు. (5:30,32).

Mark 5:33

జరిగిన సత్యమంతా ఆ స్త్రీ యేసుకు చెప్పినపుడు యేసు ఆమెతో ఏమి చెప్పాడు??

తన విశ్వాసము ఆమెను స్వస్థ పరచెను, సమాధానముతో వెళ్ళమని చెప్పాడు. (5:34).

Mark 5:35

యాయీరు ఇంటికి యేసు చేరినప్పుడు యాయీరు కుమార్తె పరిస్థితి ఎలా ఉంది ?

యాయీరు కుమార్తె చనిపోయింది. (5:35).

Mark 5:36

ఆ సమయంలో యేసు యాయీరుకు ఏమి చెప్పాడు??

భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని యేసు యాయీరుతో చెప్పాడు. (5:36).

Mark 5:39

యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు ఏమి అన్నారు?

యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు యేసుని చూచి అపహసించారు. (5:40).

ఆ చిన్నది ఉన్న గదిలోనికి యేసుతో పాటు ఎవరు వెళ్ళారు?

యేసు ఆ చిన్నదాని తండ్రిని, తల్లిని, పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వెళ్ళాడు. (5:37,40).

Mark 5:41

ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఎలా స్పందించారు?

ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఉక్కిరిబిక్కిరై ఎంతో విస్మయ మొందారు. (5:42).


Chapter 6

Translation Questions

Mark 6:1

యేసు స్వగ్రామ ప్రజలు యేసును చూసి ఎందుకు ఆశ్చర్య పడ్డారు?

ఈ బోధ, జ్ఞానం, ఆయన అద్భుతాలు యేసుకు ఎక్కడనుండి వచ్చాయి అని ప్రజలకు అర్ధం కాలేదు. (6:2).

Mark 6:4

ప్రవక్త ఎక్కడ ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు??

ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు. (6:4).

తన స్వగ్రామములోని ప్రజలలో దేనిని చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు??

తన స్వగ్రామములోని ప్రజలలోని అవిశ్వాసమును చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు?(6:6).

Mark 6:7

పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి ఏమి ఇచ్చాడు??

పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. (6:7).

పన్నెండుమంది శిష్యులు ప్రయాణము కొరకు వారితో ఏమి తీసుకొని వెళ్ళారు?

పన్నెండుమంది చేతికర్ర, చెప్పులు, ఒక అంగీని వారితో తీసుకొని వెళ్ళారు(6:8).

Mark 6:10

ఏ స్థలమందైనను వారిని స్వీకరించని యెడల ఏమి చెయ్యాలని పన్నెండు మంది శిష్యులకు యేసు చెప్పాడు?

వారిమీద సాక్షముగా ఉండుటకు వారి పాదముల క్రింద ధూళి దులిపి వేయాలని యేసు పన్నెండు మందికి చెప్పాడు. (6:11).

Mark 6:14

యేసు ఎవరని ప్రజలు అనుకొంటున్నారు?

యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అని, ఏలియా అని, ప్రవక్త అని ప్రజలు అనుకొంటున్నారు. (6:14-15).

Mark 6:18

తాను చేయుచున్నది న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను దేని గురించి చెప్పాడు??

హేరోదు తన సహోదరుని భార్యను పెండ్లి చేసుకోవడం న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు? (6:18).

బాప్తిస్మమిచ్చు యోహాను సందేశాన్ని విని హేరోదు ఎలా స్పందించాడు?

యోహాను మాటలు వినిన ప్రతీసారి హేరోదు కలవరపడినా సంతోషముతో అతని మాటలు వినుచుండెను. (6:20).

Mark 6:23

హేరోదియకు హేరోదు ఇచ్చిన వాగ్దానం ఏమిటి?

తన రాజ్యములో సగము మట్టుకు తనను ఏమి అడిగినను ఇచ్చెదనని ఆమెకు ప్రమాణం చేసాడు. (6:23).

దేనికొరకు హేరోదియా అడిగింది ?

బాప్తిస్మమిచ్చు యోహాను తల ఒక పళ్ళెములో ఇప్పించమని అడిగింది.(6:25).

Mark 6:26

హేరోదియా మనవి పట్ల హేరోదు ఏ విధంగా స్పందించాడు?

హేరోదు బహుగా విచార పడ్డాడు, అయితే తన అతిధుల ఎదుట తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము ఆమె మనవిని నిరాకరించలేదు. (6:26).

Mark 6:30

యేసు, ఆయన అపోస్తలులును తమకు తాముగా విశ్రాంతి తీసుకోడానికి ప్రయత్నించినపుడు ఏమి జరిగింది ?

అనేకులు వారిని గుర్తుపట్టారు, పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చారు. (6:31-33).

Mark 6:33

వారి కొరకు ఎదురు చూస్తున్న జన సమూహము పట్ల యేసు వైఖరి ఏమిటి ?

వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు. (6:34).

Mark 6:37

యేసు అడిగినప్పుడు ప్రజలకు ఆహారం పెట్టడానికి శిష్యులు ఏమి చెయ్యాలని ఆలోచించారు??

వారు వెళ్లి రెండు దేనారముల విలువైన రొట్టెలను కొనాలని తలంచారు. (6:37).

శిష్యుల వద్ద ఇంతకుముందే ఉన్న ఆహారం ఏమిటి ?

శిష్యుల వద్ద ఇంతకుముందే ఐదు రొట్టెలు, రెండుచేపలు ఉన్నాయి.

Mark 6:39

రొట్టెలను, చేపలను తీసుకొనినప్పుడు యేసు ఏమి చేసాడు?

రొట్టెలను, చేపలను తీసుకొని యేసు ఆకాశమువైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు. (6:41).

Mark 6:42

అందరు తినిన తరువాత ఎంత ఆహారం మిగిలింది ?

అందరు తిని తృప్తి పొందిన తరువాత చేపలును, రొట్టె ముక్కలును పండ్రెండుగంపలు మిగిలాయి. (6:43).

రొట్టెలు తినిన పురుషులు ఎంత మంది ?

ఆ రొట్టెలు తినిన వారు అయిదు వేల మంది పురుషులు. (6:44).

Mark 6:48

శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై ఎలా వచ్చాడు?

శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై నడుచుకుంటూ వచ్చాడు? (6:48).

తనను చూసినప్పుడు యేసు శిష్యులకు ఏమి చెప్పాడు?

ధైర్యము తెచ్చుకొని, భయపడకుడని యేసు తన శిష్యులకు చెప్పాడు?(6:50).

Mark 6:51

రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు ఎందుకు అర్ధం చేసుకోలేదు ?

వారి హృదయాలు బండబారిపోయి ఉన్నాయి కాబట్టి రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు అర్ధం చేసుకోలేదు. (6:52).

Mark 6:53

ఆ ప్రాంత ప్రజలు యేసును గుర్తు పట్టినప్పుడు ఏమి చేసారు?

రోగులను మంచాల మీద తీసుకొని వచ్చారు, ఆయన ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి చేరారు. (6:55).

Mark 6:56

కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న వారికి ఏమి జరిగింది ?

యేసు వస్త్రపు చెంగును ముట్టుకున్న వారు స్వస్థత పొందారు. (6:56).


Chapter 7

Translation Questions

Mark 7:2

పరిసయ్యులు, శాస్త్రులను అభ్యంతర పెట్టినట్లుగా యేసు శిష్యులలో కొందరు చేస్తున్న పని ఏమిటి ?

యేసు శిష్యులలో కొందరు అపవిత్రమయిన చేతులతో భోజనం చేస్తున్నారు. (7:2,5).

భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం ఎవరి ఆచారం ?

భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం పెద్దల ఆచారం (7:3-4).

Mark 7:6

కడుగుటను గురించిన భోధ విషయం లో యేసు పరిసయ్యులు, శాస్త్రులకు యేసు ఏమి చెప్పాడు??

పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు అనియు, వారు మానవ కల్పిత నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారని యేసు చెప్పాడు(7:6-9).

Mark 7:11

నీ తల్లి దండ్రులను ఘనపరచాలి అనే ఉపదేశాన్ని పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు ఏ విధంగా త్రోసివేస్తున్నారు?

వారి తల్లి దండ్రులకు ప్రయోజన కరమైన ధనమును అది కోర్బాను అని ఇచ్చే వారికి చెప్పడం ద్వారా దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. (7:10-13).

Mark 7:14

ఏది మనుష్యుని అపవిత్ర పరచదని యేసు చెప్పాడు?

వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్త్రునిగా చేయగలుగునది ఏదియు లేదని యేసు చెప్పాడు. (7:15,18-19).

ఏది మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు?

లోపలినుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు. (7:15,20-23).

Mark 7:17

ఏ రకమైన భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు?

అన్ని భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు. (7:19).

Mark 7:20

లోపలినుండి వెలుపలికి రాగలిగి మనుష్యుని అపవిత్రపరచు మూడు?ంశములేవి ?

దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము అనునవి లోపలినుండి బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచును. (7:21-22).

Mark 7:24

అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ యూదురాలా లేక గ్రీసు దేశస్థ్తురాలా ?

అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ గ్రీసు దేశస్థ్తురాలు. (7:25-26).

Mark 7:27

పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదు అని యేసు చెప్పిన మాటకు ఆ స్త్రీ ఏ విధంగా స్పందించింది ?

కుక్క పిల్లలు కూడ బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును కదా అని ఆ స్త్రీ చెప్పింది. (7:28).

Mark 7:29

ఆ స్త్రీ కొరకు యేసు ఏమి చేసాడు?

అ స్త్రీ కుమార్తె నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. (7:29-30).

Mark 7:33

చెవుడు, నత్తివానిని యేసు నొద్దకు తీసుకొని వచ్చినపుడు?ేసు ఏమి చేసాడు?

యేసు అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి, ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి చూసి, తెరువబడమని చెప్పాడు. (7:33-34).

Mark 7:36

ఆయన స్వస్థతలను గురించి ఎవరితోను చెప్పవద్దని వారితో చెప్పిన తరువాత అ ప్రజలు ఏమి చేసారు? ?

ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేసారు. (8:1-2).


Chapter 8

Translation Questions

Mark 8:1

తనను వెంబడిస్తున్న జనసమూహము పట్ల యేసు ఎలాంటి జాలి చూపించాడు??

తనను వెంబడిస్తున్న జనసమూహము తినదానికి ఏమీ లేనందున వారి పట్ల యేసు జాలి చూపించాడు. (8:1-2).

Mark 8:5

శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి ?

శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి (8:5).

శిష్యుల రొట్టెలను యేసు ఏమి చేసాడు?

యేసు ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యుల కిచ్చెను. (8:6).

Mark 8:7

ఎంత మంది తిని తృప్తి చెందారు?

ఇంచుమించు నాలుగు వేల మంది పురుషులు తిని తృప్తి చెందారు. (8:9).

అందరు తిన్న తరువాత ఎంత భోజనం మిగిలింది ?

అందరు తిన్న తరువాత ఏడు గంపలనిండా భోజనం మిగిలింది (8:8).

Mark 8:11

ఆయనను పరీక్షించ దానికి పరిసయ్యులు యేసును ఏమి చెయ్యమని అడిగారు?

ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని పరిసయ్యులు యేసును అడిగారు. (8:11).

Mark 8:14

పరిసయ్యుల విషయంలో దేని గురించి యేసు తన శిష్యులను హెచ్చరించాడు?

పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో యేసు తన శిష్యులను హెచ్చరించాడు? (8:15).

Mark 8:16

దేని గురించి యేసు మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు?

తాము రొట్టెలు తేవడం మర్చిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు. (8:16).

Mark 8:18

ఆయన చెప్పిన అర్ధాన్ని అవగాహన చేసుకోడానికి వారికి తాను చేసిన ఏ అద్భుతాలను యేసు జ్ఞాపకం చేసాడు?

అయిదు వేల మందికి ఆహారం పెట్టడం, నాలుగు వేలమందికి ఆహారం పెట్టడం గురించి వారికి జ్ఞాపకం చేసాడు. (8:19-21).

Mark 8:22

గుడ్డివాడు చూపు పూర్తిగా పొందటానికి యేసు చేసిన మూడు?ార్యాలు ఏమిటి ?

యేసు మొదట అతని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచాడు, తరువాత అతని కన్నుల మీద చేతులుంచాడు.(8:23-24).

Mark 8:27

యేసు ఎవరని జనులు చెప్పుకొంటున్నారు?

యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, ఏలియా అనియు, ప్రవక్తలలో ఒకడని జనులు చెప్పుకొంటున్నారు?(8:28).

Mark 8:29

యేసు ఎవరని పేతురు చెప్పాడు?

యేసే క్రీస్తు అని పేతురు చెప్పాడు (8:29).

Mark 8:31

భవిష్యత్తులో జరిగే ఏ సంఘటనల గురించి యేసు తన శిష్యులకు స్పష్టంగా చెప్పడం ఆరంభించాడు??

మనుష్య కుమారుడు?నేక హింసలు పొందాలి, ఉపేక్షించ బడాలి, చంపబడాలి, మూడు దినములైన తరువాత లేపబడాలనే సంగతుల గురించి యేసు వారికి బోధించాడు. (8:31).

Mark 8:33

పేతురు తనను గద్దింప మొదలు పెట్టినపుడు యేసు పెతురుతో ఏమన్నాడు. ?

"సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను కాదు" అని యేసు పేతురుతో చెప్పాడు. (8:33).

తనను వెంబడించు ప్రతి ఒక్కరు ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు?

తనను వెంబడింప గోరువాడు తనను తాను ఉపేక్షించు కొని తన సిలువనెత్తుకోవాలని యేసు చెప్పా డు. (8:34).

Mark 8:35

లోకములోని వాటిని సంపాదించుకోవాలనే కోరిక ఉన్నవాని గురించి యేసు ఏమి చెప్పాడు?

"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము?" అని యేసు అన్నాడు. (8:36).

Mark 8:38

తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను ఏమి చేయ్యబోతున్నాడని యేసు చెప్పాడు?

ఆయన వచ్చునపుడు తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను సిగ్గుపడతాడని యేసు చెప్పాడు? (8:38).


Chapter 9

Translation Questions

Mark 9:1

దేవుని రాజ్యము బలముతో వచ్చునప్పుడు ఎవనిని చూస్తారు అని ఎవరి గురించి యేసు చెప్పాడు?

అక్కడ ఆయనతో నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని యేసు చెప్పాడు. (9:1).

ఆయనతో కలిసి పేతురు, యోహాను, యాకోబు ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్లినపుడు యేసుకు ఏమి జరిగింది ?

యేసు రూపాంతరం చెందాడు, ఆయన వస్త్రాలు ప్రకాశమానముగా మారాయి. (9:2-3).

Mark 9:4

కొండ మీద యేసుతో మాట్లాడుతున్నదెవరు?

ఏలియా, మోషేలు యేసుతో మాట్లాడుతున్నారు. (9:4).

Mark 9:7

కొండ మీద మేఘములోనుండి వచ్చిన శబ్ధము ఏమి చెప్పింది ?

"ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి" అని చెప్పింది. (9:7).

Mark 9:9

కొండమీద చూసిన దాని విషయంలో యేసు తన శిష్యులకు ఏమి ఆజ్ఞాపించాడు?

మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు వారు చూచిన దానిని ఎవరితోనూ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (9:9).

Mark 9:11

ఏలియా రావడం గురించి యేసు ఏమి చెప్పాడు?

ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క బెట్టునని, ఏలియా ముందే వచ్చాడని యేసు చెప్పాడు. (9:11-13).

Mark 9:17

ఆ తండ్రి కుమారులకు శిష్యులు ఏమి చెయ్యలేక పోయారు?

ఆ తండ్రి కుమారునిలో నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్ట లేక పోయారు. (9:17-18).

Mark 9:20

అపవిత్రాత్మ ఆ బాలుని దేని లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది ?

అపవిత్రాత్మ ఆ బాలుని అగ్నిలోనికి, నీళ్ళ లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. (9:22).

Mark 9:23

నమ్ము ప్రతీవానికి సమస్తమును సాధ్యము అని చెప్పినపుడు? తండ్రి ఎలా స్పందించాడు?

"నమ్ముచున్నాను, అపనమ్మకముండకుండ సహాయము చేయుమని" తండ్రి అడిగాడు. (9:23-24).

Mark 9:28

మూగదైన చెవిటి దయ్యమును ఆ చిన్నవానిలోనుండి శిష్యులు ఎందుకు వదలగొట్ట లేక పోయారు?

ప్రార్ధన వలననే దాని అది వెళ్ళ గొట్టబడును గనుక శిష్యులు దానిని వదలగొట్ట లేక పోయారు? (9:28-29).

Mark 9:30

తనకు ఏమి జరగబోతున్నదని యేసు తన శిష్యులకు చెప్పాడు?

తాను మరణమునకు అప్పగింపబడతాడని, మూడు దినముల తరువాత తిరిగి లేస్తాడని వారికి చెప్పాడు. (9:31).

Mark 9:33

శిష్యులు మార్గమున వెళ్ళుచుండగా దేని గురించి వారు రోదించుచున్నారు??

వారిలో ఎవరు గొప్ప వారు?ని శిష్యులు వాదించుచున్నారు. (9:33-34).

ఎవరు మొదటి వాడు అని యేసు అన్నాడు?

అందరికీ పరిచారకుడైన వాడు మొదటివాడు అని యేసు అన్నాడు. (9:35).

Mark 9:36

యేసు నామం లో ఒక చిన్న బిడ్డను ఎవరైనా చేర్చుకొంటె వారు ఎవరిని చేర్చుకుంటున్నారు?

ఎవరైనా యేసు నామం లో ఒక చిన్న బిడ్డను చేర్చు కొంటె వారు చేర్చుకుంటున్నారు, అంతే కాకుండా యేసును పంపిన వానిని కూడా చేర్చుకుంటున్నారు. (9:36-37).

Mark 9:42

చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వానికి ఏమి జరగడం మేలు అని యేసు చెప్పాడు?

చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. (9:42).

నిన్ను అభ్యంతర పరచు దానిని ఏమి చేయాలని యేసు చెప్పాడు?

నిన్ను అభ్యంతర పరచు దేనినైనను నరికి వెయ్యాలని యేసు చెప్పాడు. (9:47).

Mark 9:47

నరకంలో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

నరకంలో వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని యేసు చెప్పాడు?9:48).


Chapter 10

Translation Questions

Mark 10:1

పరిసయ్యులు యేసును శోధించడానికి ఏ ప్రశ్న అడిగారు?

పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని పరిసయ్యులు యేసును అడిగారు. (10:2).

విడనాడుటను గురించి యూదులకు మోషే ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

ఒకడు పరిత్యాగ పత్రిక వ్రాయించి తన భార్యను విడనాడవచ్చునని మోషే సెలవిచ్చాడు. (10:4).

Mark 10:5

విడనాడుటను గురించిన ఆజ్ఞలను యూదులకు మోషే ఎందుకు ఇచ్చాడు?

వారి హృదయ కఠినత్వాన్ని బట్టి యూదులకు ఈ ఆజ్ఞలను మోషే రాసి ఇచ్చాడు. (10:5).

వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు చరిత్ర లో ఏ సంఘటనను ప్రస్తావిస్తున్నాడు?

వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు ఆరంభం లో స్త్రీ, పురుషుడు సృష్టి చెయ్యబడిన సంఘటనను ప్రస్తావించాడు. (10:6).

Mark 10:7

ఇద్దరు వ్యక్తులు అనగా పురుషుడు, స్త్రీ వివాహము అయిన తరువాత ఏమౌతారని యేసు చెప్పాడు??

వారిద్దరూ ఏక శరీరమౌతారని యేసు చెప్పాడు. (10:7-8).

వివాహములో దేవుడు జత పరచుటను గురించి యేసు ఏమీ చెప్పాడు?

దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని యేసు చెప్పాడు. (10:9).

Mark 10:13

తన వద్దకు చిన్న బిడ్డలను తీసుకొను వచ్చువారిని అభ్యంతర పరచిన వారి విషయం లో యేసు చూపిన ప్రతిచర్య ఏమిటి ?

యేసు శిష్యులను కోపగించుకున్నాడు, చిన్న బిడ్డలను తన వద్దకు రానివ్వమని వారితో చెప్పాడు. (10:13-14).

Mark 10:15

దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని ఎలా స్వీకరించాలని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని చిన్నబిడ్డవలె అంగీకరించాలి అని యేసు చెప్పాడు. (10:15).

Mark 10:17

నిత్య జీవమునకు వారసుడగుటకు మొదట ఏమి చెయ్యాలని అతనికి యేసు చెప్పాడు?

నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని యేసు ఆ వ్యక్తికి చెప్పాడు. (10:19).

Mark 10:20

ఆ తరువాత యేసు అతనికి ఇచ్చిన అదనపు ఆజ్ఞలు ఏమిటి ?

తనకు కలిగినవన్నియు అమ్మి ఆయనను వెంబడించాలని చెప్పాడు. (10:21).

ఈ ఆజ్ఞ ఇచ్చినపుడు ఆ వ్యక్తి ఎలా స్పందించాడు, ఎందుకు?

అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ వ్యక్తి విచారపడుతూ వెళ్ళిపోయాడు. (10:22).

Mark 10:23

దేవుని రాజ్యం లోనికి ప్రవేశించాలంటే ఎవరికి కష్టం అని యేసు చెప్పాడు??

ఆస్థిపరులు దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడం కష్టతరం అని యేసు చెప్పాడు. (10:23-25).

Mark 10:26

ఆస్థిపరులు కూడా రక్షించబడగలరు అని యేసు ఎలా చెప్పాడు?

మనుష్యులకు ఇది అసాధ్యం గాని దేవునికి అన్నీ సాధ్యమే అని యేసు చెప్పాడు. (10:26-27).

Mark 10:29

ఇంటిని, కుటుంబాన్ని, భూములనైనను యేసు కొరకు విడిచినవాడు ఏమి పొందుతాడని యేసు చెప్పాడు?

వారు ఐప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబోవు లోకమందును నిత్య జీవమును పొందుదురని చెప్పాడు. (1:10).

Mark 10:32

యేసును ఆయన శిష్యులును ఏ మార్గమున వెళుతున్నారు?

యేసును ఆయన శిష్యులును యెరుషలేము వెళ్ళు మార్గమున పోవుచున్నారు. (10:32).

తనకు యెరుషలేములో ఏమి జరగబోతున్నదని యేసు తన శిష్యులకు చెప్ప్పాడు?

తనకు మరణశిక్ష విధించబడబోతున్నదని, మూడు దినములైన తరువాత తిరిగి లేపబదతాడని తన శిష్యులకు యేసు చెప్పాడు. (10:33-34).

Mark 10:35

యాకోబు, యోహానులు యేసుకు చేసిన మనవి ఏమిటి ?

తన మహిమయందు ఆయన కుడివైపున ఒకడునును, ఎడుమవైపు ఒకడును కూర్చుండునట్లు దయచేయమని యేసును అడిగారు. (10:35-37).

Mark 10:38

యాకోబు, యోహాను ఏమి సహించవలసి ఉంది అని యేసు చెపుతున్నాడు?

తాను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, తాను పొందుచున్న బాప్తిస్మము తీసుకోనుట యైనను వారి చేతనగునాయని వారిని అడిగాడు. (10:39).

యాకోబు, యోహానుల మనవి యేసు అంగీకరించాడా?

లేదు. తన కుడివైపున, ఎడుమవైపున కూర్చుండ నివ్వడం తన వశములో లేదని చెప్పాడు. (10:40).

Mark 10:41

అన్యజనులలో అధికారులు తమ ప్రజలను ఏ విధంగా చూస్తారని యేసు చెప్పాడు?

అన్యజనులలోని అధికారులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారని ప్రభువు చెప్పాడు. (1:10).

Mark 10:43

శిష్యులలో గొప్పవాడిగా ఉండగోరిన వాడు ఏవిధంగా ఉండాలని యేసు కోరుతున్నాడు. ?

ఎవడైనను గొప్పవాడై ఉండగోరితే వాడు పరిచారము చేయవలెనని ప్రభువు చెప్పాడు. (10:43-44).

Mark 10:46

గుడ్డివాడైన బర్తిమయి మౌనంగా ఉండాలని అతనిని గద్దించినపుడు అతను ఏమి చేసాడు?

"దావీదు కుమారుడా నన్ను కరుణించు" మని మరి బిగ్గరగా కేకలు వేసాడు. (10:48).

Mark 10:51

బర్తిమయి గుడ్డితనం నుండి స్వస్థత పొందడానికి యేసు ఏమి చెప్పాడు?

బర్తిమయి విశ్వాసము అతనిని బాగు చేసిందని యేసు చెప్పాడు. (10:52).


Chapter 11

Translation Questions

Mark 11:1

యేసు వారికి ఎదురుగా ఉన్న గ్రామానికి ఇద్దరు మనుషులను పంపి వారిని ఏమి చెయ్యమని చెప్పాడు?

ఎవరూ ఎన్నడూ కూర్చుండని గాడిద పిల్లను తన వద్దకు తీసుకు రమ్మని వారిని పంపాడు. (11:2).

Mark 11:4

గాడిద పిల్లను విప్పుతున్నప్పుడు ఏమి జరిగింది ?

వారేమి చేయుచున్నారని కొందరు అడిగారు, అందుకు శిష్యులు యేసు వారికాజ్ఞాపించినట్టు చెప్పారు, అప్పుడు వారు దానిని పోనిచ్చారు. (11:5-6).

Mark 11:7

గాడిద పిల్ల మీద యేసు ఎక్కి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమి పరచారు?

ప్రజలు తమ బట్టలను దారి పొడుగునా పరచారు, కొందరు పొలములో నరికిన కొమ్మలు పరచిరి. (11:8).

యేసు యెరూషలేము వైపుకు వెళ్తుండగా ప్రజల రానున్న ఏ రాజ్యము గురించి కేకలు వేస్తున్నారు?

తమ తండ్రి అయిన దావీదు రాజ్యము రాబోతున్నాదని కేకలు వేస్తున్నారు. (11:10).

Mark 11:11

దేవాలయ ప్రాంగణములోనికి ప్రవేశించిన తరువాత యేసు ఏమి చేసాడు?

చుట్టూ సమస్తమును చూచి బేతనియకు వెళ్ళాడు. (11:11).

Mark 11:13

ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేని అంజూరపు చెట్టుని చూసినపుడు యేసు ఏమి చేసాడు?

"ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని అంజూరపు చెట్టుతో అన్నాడు. (11:14).

Mark 11:15

ఈ సమయంలో యేసు దేవాలయంలోనికి ప్రవేశించిన తరువాత యేసు ఏమి చేసాడు?

క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టాడు, దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. (11:15-16).

Mark 11:17

లేఖనముల ప్రకారం దేవాలయము ఏవిధంగా ఉండాలని యేసు చెప్పాడు?

దేవాలయము సమస్తమైన జనములకు ప్రార్థన మందిరము అనబడును అని యేసు చెప్పాడు. (11:17).

శాస్త్రులు, ప్రధాన యాజకులు మందిరాన్ని ఏమి చేసారు?ని యేసు చెప్పాడు?

మందిరాన్ని దొంగల గుహగా చేసారని యేసు చెప్పాడు. (11:18).

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఏమి చేయాలని ప్రయత్నించారు?

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును చంపడానికి ప్రయత్నించారు. (11:20).

Mark 11:20

యేసు మాట్లాడిన అంజూరపు చెట్టుకు ఏమి జరిగింది ?

యేసు మాట్లాడిన అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి పోయింది. (11:20).

Mark 11:24

ప్రార్థనలో మనము అడుగువాటన్నిటి గురించి యేసు ఏమి చెప్పాడు?

ప్రార్థన చేయుచున్నప్పుడు మనము అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్మాలి, అప్పుడవి మనకు కలుగును. (11:24).

పరలోకమందున్న తండ్రి కూడా క్షమించునట్లు మనము ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు?

పరలోకమందున్న తండ్రి మనలను క్షమించునట్లు ఒకని మీద విరోధ మేదైనను కలిగిఉన్నయెడల వారిని క్షమించాలి. (11:25).

Mark 11:27

మందిరములో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు నుండి ఏమి తెలుసుకోగోరారు?

ఏ అధికారము వలన తాను చేయుచున్న పనులను చేయుచున్నాడని తెలుసుకోగోరారు. (11:27-28).

Mark 11:29

ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను యేసు ఏమి అడిగాడు?

యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా అని అడిగాడు. (11:30).

Mark 11:31

యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను ఎందుకు చెప్పడానికి ఇష్టపడలేదు ?

యోహానును ఎందుకు నమ్మలేదని యేసు అడుగుతాడని వారు జవాబు చెప్పలేదు. (11:31).

యోహాను బాప్తిస్మము మనుషుల నుండి కలిగినదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను చెప్పడానికి ఎందుకు ఇష్టపడలేదు ?

వారు ప్రజలకు భయపడ్డారు, యోహాను ఒక ప్రవక్త అని వారు ఎంచారు గనుక వారు జవాబు చెప్పలేదు. (11:32).


Chapter 12

Translation Questions

Mark 12:1

ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ఏమి చేసాడు?

ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ప్రయాణమై వెళ్ళాడు. (12:1).

Mark 12:4

పంటలో భాగము తీసికొని రావడానికి తన దాసులను పంపినపుడు రైతులు ఏమి చేసారు?

ఆ రైతులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపి వేసారు. కొందరిని చంపివేశారు. (12:3-5).

Mark 12:6

యజమాని రైతుల వద్దకుకు చివరిగా ఎవరిని పంపించాడు?

యజమాని రైతుల వద్దకుకు చివరిగా తన ప్రియ కుమారుని పంపాడు. (1:10).

Mark 12:8

యజమాని చివరిగా రైతుల వద్దకు పంపిన వానిని ఏమి చేసారు?

ఆ రైతులు అతనిని పట్టుకొని, చంపి, ద్రాక్ష తోట వెలుపల పారవేసారు. (12:8).

ఆ రైతుల విషయంలో ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడు?

యజమాని వచ్చి అ రైతులను సంహరించి ఆ ద్రాక్షా తోటను ఇతరులకు ఇచ్చును. (12:9).

Mark 12:10

కట్టు వారు నిషేధించిన రాయికి ఏమి జరుగుతుందని లేఖనాలు చెపుతున్నాయి ?

కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అవుతుంది. (12:10).

Mark 12:13

పరిసయ్యులు, హేరోదియనులలో కొందరు యేసును ఏమి అడిగారు??

కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారు. (12:14).

Mark 12:16

వారి ప్రశ్నలకు యేసు ఎలా జవాబిచ్చాడు?

కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించమని చెప్పాడు. (12:17).

Mark 12:18

దేనియందు సద్దూకయ్యులు నమ్మకముంచరు?

సద్దూకయ్యులు పునరుత్థానములో నమ్మకముంచరు. (12:18).

Mark 12:20

సద్దూకయ్యులు చెప్పిన కథలో ఆ స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?

ఆ స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు?(12:22).

సద్దూకయ్యులు ఆ స్త్రీని గురించి యేసు ఏమని అడిగారు?

పునరుత్థానమందు వారిలో ఎవరికీ ఆమె భార్యగా ఉంటుంది అని అడిగారు. (12:23).

Mark 12:24

సద్దూకయ్యుల పొరపాటుకు యేసు ఏమి సమాధానం ఇచ్చాడు?

సద్దూకయ్యులు లేఖనములను గాని, దేవుని శక్తిని గురించి గాని ఎరుగరు అని చెప్పాడు. (12:24).

స్త్రీని గురించి సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నకు యేసు ఏమని సమాధానం ఇచ్చాడు?

మృతులలో నుండి లేచునపుడు?ెండ్లి చేసుకోరు, పెండ్లి కియ్యబడరు అని పరలోకమందున్న దూతల వలె ఉంటారు. (12:25).

Mark 12:26

పునరుద్ధానము ఉన్నదని లేఖనముల నుండి యేసు ఎలా చూపించాడు?

నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు? అందరూ ఇంకా సజీవులుగానే ఉన్నారని దేవుడు చెప్పిన దానిని ప్రస్తావించాడు. (12:26-27).

Mark 12:28

ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు?

నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (12:29-30).

యేసు చెప్పిన రెండవ ఆజ్ఞ ఏది?

నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెననునది రెండవ ఆజ్ఞ అని యేసు చెప్పాడు (12:31).

Mark 12:30

ఇవన్నియు జరుగు వరకు ఏమి గతించదని యేసు చెప్పాడు?

ఇవన్నియు జరుగు వరకు అంతము గతింపదని యేసు చెప్పాడు. (13:30).

ఏమి గతింపవు అని యేసు చెప్పాడు?

ఆయన మాటలు గతింపవు అని యేసు చెప్పాడు. (13:32).

ఈ విషయాలు ఎప్పుడు నెరవేరుతాయని యేసు చెప్పాడు?

తండ్రి తప్ప మరి ఎవరికీ ఆ దినం గానీ, గంట గానీ తెలియవు అని చెప్పాడు (13:32).

Mark 12:35

దావీదు గురించి శాస్త్రులను యేసు ఏమని ప్రశ్నించాడు?

దావీదు క్రీస్తును ప్రభువని చెప్పుచున్నాడు, ఆయన ఏలాగు అతని కుమారుడగును అని యేసు అడిగాడు. (12:35-37).

Mark 12:38

శాస్త్రుల విషయంలో దేని గురించి జాగ్రత్త పడమని యేసు చెప్పాడు?

శాస్త్రులు మనుష్యుల చేత గౌరవింప బడాలని కోరతారు, అయితే వారు విధవరాండ్ర ఇండ్లు దిగ మింగుతారు, ప్రజలు చూడాలని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. (12:38-40).

Mark 12:43

పేద విధవరాలు కానుక పెట్టె లో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ వేసిందని యేసు ఎందుకు చెప్పాడు??

ఆమె తన లేమిలో తనకు కలిగినదంతటిలో వేసింది అయితే ఇతరులు తమకు కలిగిన సమృద్దిలోనుండి వేసారు అని యేసు చెప్పాడు. (12:44).


Chapter 13

Translation Questions

Mark 13:1

దేవాలయము కట్టడములు, దానిలోని అద్భుతమైన రాళ్ళకు ఏమి జరగబోతుందని యేసు చెప్పాడు?

రాతిమీద రాయి యొకటియైనను నిలిచి యుండకుండ పడద్రోయబడునని యేసు చెప్పాడు. (13:2).

Mark 13:3

అప్పుడు శిష్యులు యేసును ఏమని అడిగారు?

ఇవి ఎప్పుడు పెరుగుతాయి, వాటి గురుతులు ఏవి అని అడిగారు. (13:4).

Mark 13:5

దేని విషయంలో శిష్యులు జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు?

ఎవడును వారిని మోసపుచ్చకుండా చూచుకోవాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. (13:5-6).

Mark 13:7

వేదనలకు ప్రారంభం అని వేటి గురించి యేసు చెప్పాడు?

వేదనలకు ప్రారంభం యుద్ధాలు, యుద్ధ సమాచారములు, భూకంపములు, కరువులు అని యేసు చెప్పాడు. (13:7-8).

Mark 13:9

శిష్యులకు ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

శిష్యులు సభలకు అప్పగింపబడతారు, సమాజ మందిరాలలో దెబ్బలు తింటారు. సాక్షార్ధమై అధిపతులు, రాజుల ఎదుట నిలువ బెట్టబడతారు అని యేసు చెప్పాడు. (13:9).

మొదట ఏమి జరగవలసి ఉన్నదని యేసు చెప్పాడు?

సకల జనులలో సువార్త ముందుగా ప్రకటింపబడాలి అని యేసు చెప్పాడు. (13:10).

Mark 13:11

కుటుంబ సభ్యుల మధ్య ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు??

కుటుంబములోని ఒక సభ్యుడు మరొకరిని మరణానికి అప్పగిస్తారు?ని యేసు చెప్పాడు. (13:12).

ఎవరు రక్షించ బడతారు అని యేసు చెప్పాడు?

అంతము వరకు సహించిన వాడే రక్షించ బడును అని యేసు చెప్పాడు. (13:13).

Mark 13:14

యూదయలో ఉన్నవారు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలవడం చూచినపుడు వారు ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు??

నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు చూచినపుడు యూదావారు కొండలకు పారిపోవాలి అని యేసు చెప్పాడు. (13:14).

Mark 13:17

ఏర్పరచబడిన వారి నిమిత్తము వారు రక్షింపబడు నిమిత్తము ప్రభువు ఏమి చేయ్యబోతున్నాడని యేసు చెప్పాడు?

ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమల దినములను ప్రభువు తక్కువ చేసాడని యేసు చెప్పాడు. (13:20).

Mark 13:21

ఎవరు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు?

అబద్దపు క్రీస్తులు, అబద్దపు ప్రవక్తలు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు? (13:22).

Mark 13:24

ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత ఆకాశములోని శక్తులకు ఏమి జరుగుతుంది?

సూర్య చంద్రులను చీకటి కమ్ముతుంది, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశ మందు శక్తులు కదిలించ బడతాయి. (13:24-25).

మేఘాలలో దేనిని మనుష్యులు చూస్తారు?

మనుష్య కుమారుడు మహా ప్రభావముతోను, మహిమతోను మేఘవాహనుడై వచ్చుట చూస్తారు. (13:26).

మనుష్య కుమారుడు వచ్చినపుడు ఏమి చేస్తాడు?

మనుష్య కుమారుడు వచ్చినపుడు భూమ్యంతము మొదలుకొని ఆకాశము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకోనిన వారిని పోగుచేయించును. (13:27).

Mark 13:33

ఆయన రాకడ గురించి తన శిష్యులకు యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు. (13:33,35,37).


Chapter 14

Translation Questions

Mark 14:1

ఏమి చెయ్యాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆలోచిస్తున్నారు?

మాయోపాయము చేత ఆయనను ఎలా పట్టుకొని చంపుదామా అని ఆలోచిస్తున్నారు. (14:1).

ప్రధాన యాజకులు, శాస్త్రులు పులియని రొట్టెల పండుగ సమయములో ఎందుకు యేసును పట్టుకొనలేదు ?

పండుగ సమయములో ప్రజలలో అల్లరి కలుగునేమో అని ఆందోళన చెందారు. (14:2).

Mark 14:3

కుష్టరోగి అయిన సీమోను ఇంటి వద్ద ఒక స్త్రీ యేసుకు ఏమి చేసింది ?

మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. (14:3).

ఎందుకు కొందరు ఆమెను గద్దించారు?

ఆ అత్తరు ఎక్కువకు అమ్మి ఆ డబ్బును బీదలకియ్యవచ్చు గదా, అని గద్దించారు. (14:5).

Mark 14:6

ఆ స్త్రీ తనకు ఏమి చేసిందని యేసు చెప్పాడు?

ఆ స్త్రీ తన భూస్థాపాన నిమిత్తము ఆయన శరీరమును అభిషేకించిందని యేసు చెప్పాడు. (14:8).

ఆ స్త్రీ చేసిన దాని విషయంలో యేసు ఏ వాగ్దానాన్ని చేసాడు?

సర్వ లోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింప బడునో అక్కడ ఆ స్త్రీ చేసినవి జ్ఞాపకార్ధముగా ప్రకటింపబడునని వాగ్డానము చేసాడు. (14:9).

Mark 14:10

ఇస్కరియోతు యూదా ఎందుకు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు??

యేసును వారికి పట్టివ్వడానికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు? (14:10).

Mark 14:12

వారందరూ కలిసి పస్కాను భుజించడానికి శిష్యులు స్థలాన్నిఎలా కనుగొన్నారు?

వారు పట్టణములోనికి వెళ్లి అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న వానిని వెంబడించి, వారు భుజించుటకు విడిది గది ఎక్కడ అని అతనిని అడుగమని యేసు తన శిష్యులకు చెప్పాడు. (14:12-14).

Mark 14:17

వారు బల్ల వద్ద కూర్చుని భోజనం చేయుచుండగా యేసు ఏమి చెప్పాడు??

శిష్యులలో ఒకడు తన్ను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:18).

Mark 14:20

ఏ శిష్యుడు తనను అప్పగింపబోతున్నాడని యేసు చెప్పాడు?

తనతో పాటు పాత్ర లో చెయ్యి ముంచు శిష్యుడే తనను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:20).

తనను అప్పగించబోతున్న వాని గమ్యము గురించి యేసు ఏమి చెప్పాడు?

ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలు అని యేసు చెప్పాడు. (14:21).

Mark 14:22

విరువబడిన రొట్టెను శిష్యులకు ఇస్తున్నపుడు యేసు ఏమి చెప్పాడు?

"మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము" అని యేసు చెప్పాడు? (14:22).

పాత్రను శిష్యులకి ఇస్తున్నపుడు యేసు ఏమి చెప్పాడు?

"ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము" అని యేసు చెప్పాడు. (14:24).

ఈ ద్రాక్షారసమును ఎప్పుడు తాగుతాడని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యములో ద్రాక్షా రసమును కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని యేసు చెప్పాడు. (14:25).

Mark 14:26

ఒలీవల కొండ వద్ద శిష్యుల విషయం ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

తన నిమిత్తము శిష్యులందరూ అభ్యంతరపడతారని యేసు ముందుగా చెప్పాడు. (14:27).

Mark 14:30

తాను అభ్యంతరపడనని పేతురు చెప్పిన తరువాత యేసు పేతురుతో ఏమి చెప్పాడు?

ఆరోజు కోడి రెండు సార్లు కూయక ముందే తనను ఎరుగనని పేతురు మూడు సార్లు అబద్ధం చెబుతాడని యేసు చెప్పాడు. (14:30).

Mark 14:32

తాను ప్రార్థించుచుండగా తన ముగ్గురు శిష్యులను ఏమి చెయ్యమని యేసు చెప్పాడు?

వారు ఎక్కడ ఉండి ప్రార్ధించమని వారితో యేసు చెప్పాడు. (14:32-34).

Mark 14:35

దేని కొరకు యేసు ప్రార్ధించాడు??

ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్ధించాడు. (14:35).

తండ్రికి తాను చేసిన ప్రార్ధనకు వచ్చే జవాబుకు తన అంగీకారము ఏమిటి ?

తండ్రి చిత్తము ఏదైనప్పటికీ అంగీకరించడానికి యేసు ఇష్టం చూపాడు. (14:36).

Mark 14:37

తన ముగ్గురు శిష్యుల వద్దకు తాను వచ్చినప్పుడు యేసు ఏమి చూసాడు??

తన ముగ్గురు శిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:37).

Mark 14:40

ప్రార్ధన నుండి రెండవ సారి వచ్చినప్పుడు యేసు ఏమి చూసాడు??

తన ముగ్గురు?ిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:40).

ప్రార్ధన నుండి మూడవ సారి వచ్చినప్పుడు ఏమి చూసాడు??

తన ముగ్గురు?ిష్యులు నిద్ర పోవడం ఆయన చూసాడు. (14:41).

Mark 14:43

యేసు గుర్తించడానికి యూదా ఏ గుర్తును ఇచ్చాడు?

యూదా యేసును ముద్దు పెట్టడం ద్వారా ఆ వ్యక్తి యేసు అని చూపించ గోరాడు. (14:44-45).

Mark 14:47

లేఖనము నెరవేరునట్లు తనను బంధించడములో ఏమి జరిగిందని యేసు చెప్పాడు?

బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను పట్టుకొన వచ్చినందున లేఖనము నేరవేరినదని యేసు చెప్పాడు. (14:48-49).

యేసు పట్టబడినపుడు ఆయనతో ఉన్నవారు ఏమి చేసారు??

యేసుతో ఉన్నవారు ఆయనను విడిచి పారిపోయారు. (14:50).

Mark 14:51

యేసును వెంబడిస్తున్న పడుచువాడు యేసు పట్టబడినపుడు ఏమి చేసాడు?

ఆ పడుచువాడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయాడు. (14:51-52).

Mark 14:53

ప్రధాన యాజకుని వద్దకు యేసును తీసుకొని వెళ్ళినపుడు పేతురు ఎక్కడ ఉన్నాడు??

పేతురు సైనికుల కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొంటున్నాడు. (14:53-54).

Mark 14:55

మహాసభలో యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యంలో ఉన్న లోపము ఏమిటి ?

యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యం అబద్దము, అవి ఒకదానికొకటి సరిపడలేదు. (14:55-59).

Mark 14:60

యేసు ఎవరనే దాని విషయం ప్రధాన యాజకుడు యేసును అడిగాడు?

పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు తానేనా అని ప్రధాన యాజకుడు యేసును అడిగాడు. (14:61).

ప్రధాన యాజకుని ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానమేమిటి ?

పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు తానేనని యేసు జవాబిచ్చాడు. (14:62).

Mark 14:63

యేసు సమాధానము వినిన ప్రధాన యాజకుడు యేసు దోషి అని చెప్పడానికి ఏమి చేసాడు??

దేవదూషణ చేసిన కారణంగా యేసు దోషి అని ప్రధాన యాజకుడు చెప్పాడు. (14:64).

మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరము మోపిన తరువాత యేసును ఏమి చేసారు?

వారు ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దుచూ కొట్టారు. (14:65).

Mark 14:66

పేతురు యేసుతో ఉన్నవాడు అని చెప్పిన చిన్న బాలికతో పేతురు ఏమి అన్నాడు?

తనకు తెలియదనీ, ఆమె అంటున్నది తనకు బోధ పడలేదనీ పేతురు బాలికతో చెప్పాడు. (14:66).

Mark 14:71

యేసు శిష్యులతో ఉన్నవాడు అని పేతురును మూడవ మారు అడిగినప్పుడు పేతురు స్పందన ఏమిటి ?

యేసును ఎరుగనని శపించు కొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. (14:71).

మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత ఏమి జరిగింది ?

మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత రెండవ సారి కోడి కూసింది. (14:72).

కోడి కూత వినిన తరువాత పేతురు ఏమి చేసాడు?

కోడి కూత వినిన తరువాత పేతురు కృంగి పోయి ఏడ్చాడు. (14:72).


Chapter 15

Translation Questions

Mark 15:1

ఉదయం కాగానే ప్రధాన యాజకుడు ఏమి చేసారు?

ఉదయం కాగానే వారు యేసును బంధించి, పిలాతుకు అప్పగించారు. (15:1).

Mark 15:4

ప్రధాన యాజకులు యేసు పై అనేకమైన నిందలు మోపుచుండగా యేసు గురించి ఏది పిలాతును ఆశ్చర్య పడేలా చేసింది?

యేసు ఏ జవాబు చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడ్డాడు. (15:5).

Mark 15:6

పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఏమి చేస్తుండే వాడు?

పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఒక ఖయిదీని విడుదల చేస్తుండే వాడు. (15:6).

Mark 15:9

ఎందుకు పిలాతు యేసును జనసమూహము కొరకు విడుదల చెయ్య గోరాడు?

ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితిరని పిలాతు తెలుసుకున్నాడు. (15:10).

ఎవరిని విడుదల చెయ్యమని జనసమూహం కేకలు పెట్టారు, అతడు చెరసాలలో ఉండునట్లు ఏమి చేసాడు?

బరబ్బాను విడుదల చెయ్యమని వారు కేకలు వేసారు, అతడు హంతకుడు. (15:7,11).

Mark 15:12

యూదుల రాజుకు ఏమి చెయ్యాలని జనసమూహం అడిగారు?

యూదుల రాజు సిలువ వేయబడాలని జనసమూహం కేకలు వేసారు. (15:12-14).

Mark 15:16

అధిపతి సైనికులు యేసును ఏవిధంగా సిద్ధపరచారు??

సైనికులు యేసుకు ఊదారంగు వస్త్రాన్ని ధరింప చేసారు, ముండ్ల కిరీటాన్ని తలపై పెట్టారు. (15:17).

Mark 15:19

యేసు సిలువను ఎవరు మోశారు?

కురేనియుడైన సీమోను యేసు సిలువను మోయడానికి బలవంత పెట్టబడ్డాడు. (15:21).

Mark 15:22

యేసును సిలువ వెయ్యడానికి సైనికులు తీసుకొని వచ్చిన స్థలము పేరు ఏమిటి ?

యేసును సిలువ వెయ్యడానికి తీసుకొని వచ్చిన స్థలము పేరు గొల్గోత. (15:22).

యేసు వస్త్రములను సైనికులు ఏమి చేసారు?

యేసు వస్త్రముల కొరకు సైనికులు చీట్లు చేసారు?(15:24).

Mark 15:25

యేసుకు వ్యతిరేకంగా సైనికులు చెక్క పై ఏమి రాసారు?

సైనికులు ఆ చెక్క పై "యూదులకు రాజు" అని రాసారు. (15:26).

Mark 15:29

దారివెంట వెళుతున్న వారు యేసును ఏమి చెయ్య మని సవాలు చేస్తున్నారు?

తనని తాను రక్షించు కొని సిలువ మీద నుండి కిందికి దిగి రమ్మని ఆయనను సవాలు చేస్తున్నారు. (15:29).

Mark 15:31

తాము నమ్మునట్లు యేసును ఏమి చెయ్య మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు?

తాము నమ్మునట్లు యేసును సిలువ మీదనుండి దిగి రమ్మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు. (15:31-32).

యేసును హేళన చేస్తూ ప్రధాన యాజకులు ఆయనకు ఇచ్చిన బిరుదులు ఏమిటి ?

ప్రధాన యాజకులు ఆయనను క్రీస్తు అని, ఇశ్రాయేలుకు రాజు అని పిలిచారు. (15:32).

Mark 15:33

ఆరవ గంట సమయములో ఏమి జరిగింది ?

ఆరవ గంట సమయములో ఆ దేశమంతటను చీకటి కమ్మింది. (15:33).

తొమ్మిదవ గంట సమయంలో యేసు ఏమని అరిచాడు??

"నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి" అని బిగ్గరగా కేక వేసాడు. (15:34).

Mark 15:36

తాను చనిపోక ముందు యేసు ఏమి చేసాడు?

ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. (15:37).

యేసు చనిపోయినప్పుడు దేవాలయములో ఏమి జరిగింది ?

దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది. (15:38).

Mark 15:39

యేసు చనిపోయిన విధానాన్ని చూసిన శతాధిపతి ఏమని సాక్ష్యమిచ్చాడు?

నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని శతాధిపతి సాక్ష్యమిచ్చాడు. (15:39).

Mark 15:42

ఏ రోజున యేసు చనిపోయాడు?

విశ్రాంతి దినమునకు ముందు రోజున యేసు చనిపోయాడు? (15:42).

Mark 15:45

యేసు చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు ఏమి చేసాడు?

అరిమతయి యోసేపు పిలాతును యేసు దేహమును తనకిమ్మని అడిగాడు, సిలువనుండి ఆయనను దించి, నార బట్టతో ఆయనను చుట్టి, సమాధి యందు ఆయనను ఉంచాడు, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. (15:43,46).


Chapter 16

Translation Questions

Mark 16:1

యేసు దేహాన్ని అభిషేకించడం కోసం స్త్రీలు సమాధి యొద్దకు ఎప్పుడు వెళ్ళారు?

వారంలో మొదటి రోజున సూర్యోదయమైనప్పుడు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు. (16:2).

Mark 16:3

సమాధి వద్ద పెద్ద రాయి ఉన్నప్పటికీ ఆ స్త్రీలు సమాధి లోనికి ఎలా ప్రవేశించారు?

సమాధి వద్ద ఉన్న రాయిని ఎవరో దొరలించి వేసారు. (16:4).

Mark 16:5

ఆ స్త్రీలు సమాధి లోనికి ప్రవేశించగానే ఏమి చూసారు?

తెల్లని అంగీ ధరించు కొనియున్న ఒక యువకుడు కుడి వైపున కూర్చుండుట చూసారు. (16:5).

యేసును గురించి యువకుడు ఏమి చెప్పాడు?

యేసు లేచి ఉన్నాడు, అక్కడ లేడు అని ఆ యువకుడు చెప్పాడు (16:6).

శిష్యులు యేసును ఎక్కడ కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు?

శిష్యులు యేసును గలలియలో కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు. (16:7).

Mark 16:9

యేసు పునరుత్థానుడైన తరువాత మొదట ఎవరికీ కనిపించాడు??

యేసు పునరుత్థానుడైన తరువాత మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. (16:9).

యేసు బ్రతికి ఉన్నాడని మరియ యేసు శిష్యులకు చెప్పినపుడు వారు ఏవిధంగా స్పందించారు?

శిష్యులు నమ్మలేదు. (16:11).

Mark 16:12

యేసు సజీవుడిగా చూసామని మరొక ఇద్దరు చెప్పినపుడు శిష్యులు ఏవిధంగా స్పందించారు?

శిష్యులు నమ్మలేదు (16:13).

Mark 16:14

యేసు శిష్యులకు ప్రత్యక్ష్యమైనపుడు వారి అపనమ్మకమును గురించి యేసు ఏమన్నాడు?

వారి అపనమ్మిక నిమిత్తము వారిని గద్దించాడు. (16:14).

యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ఆజ్ఞాపించాడు. (16:15).

ఎవరు రక్షించబడతారని యేసు చెప్పాడు?

నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడుదురని యేసు చెప్పాడు. (16:16).

ఎవరికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు?

నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు. (16:16).

Mark 16:17

నమ్మిన వారి వలన ఏ సూచక క్రియలు కనబడునని యేసు చెప్పాడు?

నమ్మిన వారు దయ్యములను వెళ్ళ గొట్టుడురు, కొత్త భాషలు మాట్లాడుతారు, మరణకరమైనదేదియు వారికి హాని చెయ్యదు. వారు ఇతరులను స్వస్థత పరచుదురు. (16:17-18).

Mark 16:19

శిష్యులతో మాట్లాడిన తరువాత యేసుకు ఏమి జరిగింది ?

శిష్యులతో మాట్లాడిన తరువాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. (16:19).

అప్పుడు శిష్యులు ఏమి చేసారు?

శిష్యులు బయలు దేరి సువార్త ప్రకటించారు. (16:20).

అప్పుడు ప్రభువు ఏమి చేసాడు?

ప్రభువు వారికి సహకారుడై సూచక క్రియల వలన వారి వాక్యమును స్థిర పరచుచుండెను. (16:20).


Chapter 1

Translation Questions

Luke 1:1

లూకా ప్రస్తావించిన "కన్నులారా చూసినవారు" ఎవరు?

లూకా ప్రస్తావించిన "కన్నులారా చూసినవారు" ఆరంభము నుండి ఉన్న వాక్యసేవకులైన వారు(1:1-2).

యేసు చేసిన కార్యాలను చూసిన వారు ఏమి చేసారు?

మన మధ్య నెరవేరిన కార్యాలను వివరముగా రాయడానికి పూనుకున్నారు(1:2)

యేసు చెప్పిన, చేసిన కార్యాలను లూకా ఎందుకు వ్రాయాలని పూనుకున్నాడు?

యేసు బోధించిన విషయాలను గూర్చిన సత్యాలను ధీయోఫిల తెలుసుకోవాలని లూకా కోరుకున్నాడు(1:4).

Luke 1:5

జెకర్యా, ఎలీసబెతు నీతిమంతులుగా ఎందుకు తీర్చబడ్డారు?

వారు దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు గనుక దేవుడు వారిని నీతిమంతులని తీర్చాడు(1:6).

జెకర్యా, ఎలీసనేతులకు పిల్లలు ఎందుకు పుట్టలేదు?

ఎలీసనేతు గొడ్రాలు గనుక ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు వారిద్దరూ ముసలివారయ్యారు(1:7).

Luke 1:8

యెరూషలేములోని దేవాలయంలో జెకర్యా ఏ పని చేస్తున్నాడు?

జెకర్యా దేవాలయంలో యాజక ధర్మం జరిగిస్తున్నాడు(1:8).

జెకర్యా దేవాలయంలో ఏమి చేస్తున్నాడు?

జెకర్యా దేవాలయములో ధూపము వేస్తున్నాడు(1:9).

దేవాలయముకు వచ్చిన ప్రజలకు జెకర్యా ఏమి చేస్తున్నాడు?

ప్రజల సమూహము దేవాలయము వెలుపల ప్రార్దన చేస్తున్నారు(1:10).

Luke 1:11

అతడు దేవాలయములో ఉన్నప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు?

అతడు దేవాలయములో ఉండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యాదు(1:11).

దూతను చూసినప్పుడు జెకర్యా ఏమి చేసాడు?

దూతను చూసినప్పుడు జెకర్యా తొందరపడి భయపడ్డాడు(1:12).

దూత జెకర్యాకు ఏమి చెప్పాడు?

జెకర్యాను భయపడవద్దనీ, అతని భార్య ఎలీసబెతుకు కొడుకు పుడతాడనీ, అతనికి యోహాను అని పేరు పెట్టాలని చెప్పాడు(1:13).

Luke 1:16

ఇశ్రాయేలు కుమారుల కొరకు యోహాను ఏమి చేస్తాడని దూత చెప్పాడు?

యోహాను ఇశ్రాయేలు కుమారులలో అనేకులను దేవుని వైపు తిప్పుతాడని దూత చెప్పాడు(1:16).

ఎలాంటి ప్రజల కోసం ఆయన బోధలు చేసాడు?

ప్రభువు కోసం సిద్ధపడేవారి అతడు బోధలు చేస్సాడు(1:17).

Luke 1:18

దూత తన పేరు ఏమిటని చెప్పాడు? అతడు ఎక్కడ నివసిస్తాడు?

దూత పేరు గబ్రియేలు, అతడు దేవుని సముఖంలో నివసిస్తాడు(1:19).

Luke 1:21

దూత చెప్పినది జెకర్యా నమ్మకపోవడం వల్ల ఏమి జరుగుతుందని దూత చెప్పాడు?

బాలుడు పుట్టే వరకు జెకర్యా మాటలు రాక మూగవాడుగా ఉంటాడని దూత చెప్పాడు(1:21).

Luke 1:26

ఎలీసబెతు ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె వద్దకు ఎవరు వచ్చారు?

దావీదు వంశీకుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ ఆమె వద్దకు వచ్చింది(1:27).

Luke 1:30

మరియకు ఏమి జరుగుతుందని దూత చెప్పాడు?

మరియ గర్భం ధరించబోతున్నదని దూత చెప్పాడు(1:31).

జన్మించిన బాలునికి ఏమని పేరు పెడతారు? ఆ పేరుకు అర్ధం ఏమిటి?

ఆయన యాకోబు వంశస్తులను యుగయుగాలు ఏలుతాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు(1:31,33).

Luke 1:34

కన్య మరియకు ఏమి జరుగుతుందని దూత చెప్పాడు?

పరిశుద్ధాత్మ మరియ పైకి వస్తుందని, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొంటుందని దూత చెప్పాడు(1:35).

పరిశుద్దుడైన బాలుడు ఎవరి కుమారుడుగా అని పిలువబడతాడని దూత చెప్పాడు?

బాలుడు దేవుని కుమారుడుగా అని పిలువబడతాడని దూత చెప్పాడు(1:35).

దేవునికు సాధ్యం కానిది ఏదని దూత చెప్పాడు?

దేవునికి సమస్తమూ సాధ్యమే(1:35).

Luke 1:39

మరియ ఎలీసబెతును కలుసుకొన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువు ఏమి చేసాడు?

ఎలీసబెతు గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసాడు(1:41,44).

Luke 1:42

ఎవరు ఆశీర్వదించబడిన వారని ఎలీసబెతు చెప్పింది?

మరియ, ఆమె గర్భంలోని శిశువు ఆశీర్వదించబడిన వారని ఎలీసబెతు చెప్పింది(1:42).

Luke 1:54

జరుగుతున్న ఈ శక్తివంతమైన కార్యాలు దేవుడు ఎవరికి చేసిన వాగ్దాన నేరవేర్పు అని మరియ చెప్పింది?

అబ్రాహము, అతని వారసులకు దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు అని మరియ చెప్పింది(1:54).

Luke 1:59

సున్నతి రోజున ఎలీసబెతు కుమారునికి మాములుగా ఏ పేరు పెడతారు?

జెకర్యా(1:59).

Luke 1:62

ఏ పేరు పెట్టాలని వారు జెకర్యాను అడిగారు? అప్పుడు అతనికి ఏమి జరిగింది?

"అతని పేరు యోహాను" అని జెకర్యా అని రాశాడు. అప్పటినుండి అతడు మాటలాడడం ప్రారంభించాడు(1:63-64).

Luke 1:64

ఈ సంఘటనలను బట్టి అందరూ ఏమనుకున్నారు?

దేవుని హస్తం అతనికి తోడై యున్నదని వారు అనుకున్నారు(1:66).

Luke 1:67

దేవుడు ఏమి చేయబోతున్నాడని జెకర్యా దేవుణ్ణి స్తుతించాడు?

దేవుడు ప్రజలకు విమోచన కలిగించబోతున్నాడని జెకర్యా దేవుణ్ణి స్తుతించాడు(1:68).

Luke 1:76

ప్రజలు ఏమి గ్రహించడానికి తన కుమారుడు సహాయపడతాడని జెకర్యా ప్రవచించాడు?

ప్రజలు తమ పాపాలకు క్షమాపణ పొందాలని యోహాను బోధిస్తాడని జెకర్యా ప్రవచించాడు(1:77).

Luke 1:80

ప్రజల ముందుకు వచ్చేవరకు యోహాను ఎక్కడ ఉన్నాడు?

అతడు అరణ్య ప్రాంతంలో ఉంటూ పెరిగాడు(1:80).


Chapter 2

Translation Questions

Luke 2:1

ప్రజాసంఖ్యలో నమోదు కావడానికి ఎక్కడికి వెళ్ళాలి?

ప్రజలంతా తమ తమ సొంత పట్టణాలకు వెళ్ళాలి(2:3).

Luke 2:4

యోసేపు ఏ గోత్రానికి చెందినవాడు కావడం వల్ల మరియతో కలసి బెత్లెహేము వెళ్ళాడు?

యోసేపు దావీదు గోత్రానికి చెందినవాడు కావడం వల్ల మరియతో కలసి బెత్లెహేము వెళ్ళాడు(2:4).

Luke 2:6

మరియ తన కుమారునికి జన్మనిచ్చిన తరువాత ఎక్కడ ఉంచింది?

శిశువు పుట్టిన తరువాత పశువుల తొట్టిలో ఉంచింది (2:7).

Luke 2:8

దేవదూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు?

తమ మందలను కాచుకొంటున్న కాపరులకు దేవదూత ప్రత్యక్షమయ్యాడు (2:8-9).

దేవదూతను చూసిన గొర్రెల కాపరులు ఎలా స్పందించారు?

దేవదూతను చూసిన గొర్రెల కాపరులు ఎంతో భయపడ్డారు(2:9).

Luke 2:10

గొర్రెల కాపరులకు దేవదూత చెప్పిన శుభవార్త ఏమిటి?

రక్షకుడైన క్రీస్తు ప్రభువు పుట్టాడని దేవదూత గొర్రెల కాపరులకు చెప్పాడు(2:11).

Luke 2:15

దేవదూత వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు ఏమి చేసారు?

గొర్రెల కాపరులు శిశువు పుట్టిన బేత్లేహేముకు వెళ్లి శిశువును చూశారు(2:15-16).

Luke 2:21

యేసుకు ఎప్పుడు సున్నతి జరిగింది?

యేసు పుట్టిన ఎనిమిదవ రోజున సున్నతి జరిగింది(2:21).

Luke 2:22

యోసేపు, మరియలు యెరూషలేములోని దేవాలయానికి బాలుడైన యేసును ఎందుకు తీసుకు వెళ్ళారు?

మోషే ధర్మశాస్త్రములో చెప్పబడిన ప్రకారము తమను శుద్ధి చేసుకొని శిశువును ప్రతిష్ట చేయడానికి యోసేపు, మరియలు యెరూషలేములోని దేవాలయానికి బాలుడైన యేసును తీసుకు వెళ్ళారు(2:22-24).

Luke 2:25

సుమెయోనుకు పరిశుద్ధాత్మ ఏమి బయలుపరిచాడు?

ప్రభువైన క్రీస్తును చూసేంతవరకు అతడు మరణించడని పరిశుద్ధాత్మ బయలుపరిచాడు(2:26).

Luke 2:30

యేసు ఏమి కాబోతున్నాడని సుమెయోను చెప్పాడు?

యేసు అన్యజనులకు దేవుని బయలు పరిచే వెలుగుగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా ఉండబోతున్నాడని సుమెయోను చెప్పాడు(2:32).

Luke 2:33

యేసు వలన మరియకు ఏమి జరగబోతున్నదని సుమెయోను చెప్పాడు?

మరియ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుందని సుమెయోను చెప్పాడు(2:35).

Luke 2:36

ప్రవక్తి అయిన అన్న మరియ, యోసేపు, యేసుల వద్దకు వచ్చి ఏమి చేసింది?

అన్న దేవుని కొనియాడి అక్కడ ఉన్నవారందరితో ఆ బాలుని గూర్చి చెప్పడం మొదలు పెట్టింది(2:38).

Luke 2:39

బాలుడైన యేసు నజరేతుకు తిరిగి వచ్చినప్పుడు ఏమి జరిగింది?

బాలుడు జ్ఞానముతో నిండుతూ, ఎదిగి బలం పొందుతున్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది(2:40).

Luke 2:41

పస్కా పండుగ సమయంలో యేసు యెరూషలేములోనే ఉండిపోయాడన్న విషయం యేసు తల్లిదండ్రులు ఎందుకు గుర్తించలేదు?

యేసు తమతోనే కలసి ప్రయాణిస్తున్నాడని వారు భావించారు(2:43-44).

Luke 2:45

యేసు తల్లిదండ్రులు ఆయనను ఎక్కడ కనుగొన్నారు? అక్కడ ఆయన ఏమి చేస్తున్నాడు?

దేవాలయములో బోధకుల మధ్యన కూర్చుని వారి మాటలు వింటూ, ప్రశ్నలు అడుగుతూ ఉన్న యేసును చూసారు(2:46).

Luke 2:48

యేసు కోసం ఆత్రుతతో వెదకిన మరియకు ఆయన ఏమని జవాబిచ్చాడు?

యేసు "నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?" అని మరియకు జవాబిచ్చాడు(2:49).

Luke 2:51

వారు నజరేతుకు తిరిగివచ్చిన తరువాత తన తల్లిదండ్రుల పట్ల యేసు ప్రవర్తన ఎలా ఉన్నది?

యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు(2:51).

యేసు పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు?

యేసు జ్ఞానంలో, వయస్సులో, దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు(2:52).


Chapter 3

Translation Questions

Luke 3:3

యోర్దాను నది ప్రదేశంలో యోహాను ఏమి సందేశం ఇస్తున్నాడు?

యోహాను పాప క్షమాపణ నిమిత్తము, మారుమనస్సు విషయమై ప్రకటిస్తున్నాడు(3:3).

Luke 3:4

యోహాను ఎవరి కోసం మార్గం సిద్ధం చేస్తున్నాడు?

యోహాను ప్రభువు కోసం మార్గం సిద్ధపరుస్తున్నానని చెప్పాడు(3:4).

Luke 3:8

అబ్రాహాము తమ తండ్రి అనే విషయాన్ని బట్టి అతిశయించక దానికి బదులు ఏమి చేయాలని యోహాను బోధించాడు?

మారుమనస్సుకు తగిన ఫలాలు ఫలించాలని యోహాను బోధించాడు(3:8).

Luke 3:9

మంచి ఫలాలు ఫలించని చెట్టు ఏమి చేయబడుతుందని యోహాను చెప్పాడు?

మంచి ఫలాలు ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని యోహాను చెప్పాడు(3:9).

Luke 3:12

నిజమైన మార్పు కనపరచాలంటే ఏమి చేయాలని సుంకరులకు యోహాను చెప్పాడు?

నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని యోహాను సుంకరులకు చెప్పాడు(3:13).

Luke 3:15

తాను నీళ్ళలో బాప్తిస్మమిస్తున్నానని, అయితే రాబోయే వాడు దేనిలో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు?

రాబోయే వాడు పరిశుద్దాత్మలో, అగ్నిలో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు(3:16).

Luke 3:18

యోహాను హేరోదును ఎందుకు గద్దించాడు?

హేరోదు తన తమ్ముని భార్యను వివాహం చేసుకొనడాన్నిబట్టి. అతడు చేస్తున్న చెడ్డ కార్యాలనుబట్టి అతణ్ణి గద్దించాడు(3:19).

యోహనును ఖైదు చేయించింది ఎవరు ?

హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు(3:20).

Luke 3:21

యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చిన వెంటనే ఏమి జరిగింది?

యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చినప్పుడు ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో క్రిందికి దిగి వచ్చాడు(3:21-22).

పరలోకం నుండి వినబడిన స్వరం ఏమి చెప్పింది?

"నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నాను" అనే స్వరం వినబడింది(3:22).

Luke 3:23

యేసు బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు ఎంత?

యేసు బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు దాదాపు ముప్పై ఏళ్లు(3:23).


Chapter 4

Translation Questions

Luke 4:1

యేసును ఎవరు అరణ్యములోనికి నడిపించారు?

యేసును పరిశుద్ధాత్మ అరణ్యములోకి నడిపించాడు(4:1).

యేసు అరణ్యములో అపవాదిచే ఎన్ని రోజులు శోధింపబడ్డాడు?

యేసు అరణ్యములో అపవాదిచే నలభై రోజులు శోధింపబడ్డాడు(4:2).

Luke 4:3

నేలపై ఉన్న రాళ్ళను ఏమి చేయమని సాతాను యేసును శోధించాడు?

రాళ్ళను రొట్టెలుగా మార్చమని సాతాను యేసును శోధించాడు(4:3).

యేసు సాతానుకు ఇచ్చిన జవాబు ఏమిటి?

మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు అని యేసు జవాబిచ్చాడు(4:4).

Luke 4:5

ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళ్ళి సాతాను యేసుకు ఏమి చూపించాడు?

సాతాను యేసుకు భూలోక రాజ్యములన్నిటిని చూపించాడు(4:5).

యేసు ఏమి చేయాలని సాతాను చెప్పాడు?

సాతాను తనకు మ్రొక్కి ఆరాధించాలని యేసును కోరాడు(4:7).

Luke 4:8

అపవాదికి యేసు ఏమని జవాబిచ్చాడు?

నీ దేవుడైన ప్రభువును మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని యేసు చెప్పాడు(4:8).

Luke 4:9

అపవాది యేసును దేవాలయ శిఖరంపైకి తీసుకువెళ్ళి ఏమి చెయ్యమన్నాడు?

అక్కడినుండి కిందికి దూకమని అపవాది యేసుతో చెప్పాడు(4:9).

Luke 4:12

యేసు అపవాదికి ఇచ్చిన జవాబు ఏమిటి?

నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని యేసు చెప్పాడు(4:12).

ఆలయంపై నుండి దూకడానికి యేసు నిరాకరించినప్పుడు అపవాది ఏమి చేసాడు?

అపవాది కొంతకాలము ఆయనను విడిచిపెట్టి వెళ్ళాడు(4:13).

Luke 4:16

సమాజ మందిరంలో నిలిచి ఉన్న యేసు ఏ గ్రంధంలోని ప్రవచనం చదివాడు?

యేసు యెషయా ప్రవచనం చదివాడు(4:17).

Luke 4:20

ఆ రోజున ఏమి నెరవేర్చబడిందని యేసు చెప్పాడు?

ఆ రోజున యెషయా గ్రంథం నుండి చదవబడిన ప్రవచనం నేరవేరిందని యేసు చెప్పాడు(4:21).

Luke 4:23

ప్రవక్త తన స్వదేశంలో ఎలాంటి మన్నన పొందుతాడని యేసు చెప్పాడు?

ఏ ప్రవక్తా తన స్వదేశంలో హితుడు కాడని యేసు చెప్పాడు(4:24).

Luke 4:25

సునగోగులో యేసు చెప్పిన మొదటి ఉదాహరణలో ఒకరికి సహాయం చేయడానికి ఎలీషాను ఎక్కడకు పంపించాడు?

దేవుడు సీదోనులో ఉన్న సారెపతు అనే ఊరికి పంపించాడు(4:26).

సునగోగులో యేసు చెప్పిన రెండవ ఉదాహరణలో ఒకరికి సహాయం చేయడానికి ఎలీషాను ఎక్కడకు పంపించాడు?

దేవుడు సిరియాలోని నయమానుకు సహాయం చేయడానికి పంపించాడు(4:27).

Luke 4:28

సునగోసులో యేసు ఈ ఉదాహరణలు చెప్పినప్పుడు అక్కడి ప్రజలు ఏమి చేసారు?

ఆ ప్రజలు ఆగ్రహంతో నిండుకొని ఆయనను తలక్రిందులుగా పడవేయాలని చూసారు(4:28-29).

సునగోగులో యేసును చంపాలని చూసినప్పుడు ఆయన ఎలా తప్పించుకున్నాడు?

యేసు వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు(4:30).

Luke 4:33

సునగోగులో ఆ వ్యక్త్జి అపవిత్రాత్మ ద్వారా యేసు గురించి ఏమని చెప్పాడు?

యేసు దేవుని పరిశుద్దుడని బిగ్గరగా పలికాడు(4:34).

Luke 4:35

యేసు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టిన తరువాత అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నారు?

అక్కడి ప్రజలు ఆశ్చర్యపడి ఒకరితో ఒకరు దాని గురించి మాట్లాడుకున్నారు(4:36).

Luke 4:40

యేసు తన వద్దకు తేబడిన రోగులకు ఏమి చేసాడు?

యేసు నానా విధములైన రోగులమీద చేతులుంచి వీరిని స్వస్థపరిచాడు(4:40).

యేసు దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు యేసు వాటిని ఎందుకు మాట్లాడనియ్యలేదు?

దయ్యములు యేసు దేవుని కుమారుడని కేకలు వేసినప్పుడు ఆయన యేసు అని వాటికి తెలిసినందువల్ల వాటిని గద్దించి మాట్లాదనియ్యలేదు(4:41).

Luke 4:42

యేసు తాను పంపబడడానికి కారణం ఏమి చెప్పాడు?

యేసు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి పంప బడ్డానని చెప్పాడు(4:43).


Chapter 5

Translation Questions

Luke 5:4

యేసు బోధించిన తరువాత సీమోను దోనెను లోతుకు నడిపించి ఏమి చేయమని చెప్పాడు?

దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయమని చెప్పాడు(5:4).

అక్కడ రాత్రి అంతా చేపలు పట్టలేకపోయిన పేతురు ఏమి చేసాడు?

అతడు యేసు మాటకు లోబడి వలలు వేశాడు(5:5).

వారు వలలు వేసినప్పుడు ఏమి జరిగింది?

వారు వలలు వేసి వలలు పిగిలిపోయేటంత విస్తారంగా చేపలు పట్టారు(5:6).

Luke 5:8

అప్పుడు సీమోను యేసును ఏమి చేయమని చెప్పాడు? ఎందుకు?

సీమోను యేసును తాను పాపాత్ముడు కనుక తనను విడిఛి వెళ్ళిపొమ్మని కోరుకున్నాడు(5:8).

సీమోను ఇప్పటినుండి దేనికోసం వాడబడతాడని యేసు చెప్పాడు?

సీమోను ఇప్పటినుంచి మనుషులను పట్టే జాలరి అవుతాడని యేసు చెప్పాడు(5:10).

Luke 5:15

యేసును గూర్చి విన్న ప్రజలు ఎంతమంది ఆయన బోధలు వినడానికి, స్వస్థతలు పొందడానికి వచ్చారు?

బహు జనసమూహములు ఆయన వద్దకు వచ్చారు (5:15).

Luke 5:20

పక్షవాయు రోగం ఉన్న వ్యక్తిని అతని స్నేహితులు ఇంటి పైకప్పు నుంచి కిందకు దించినప్పుడు యేసు అతనితో ఏమని చెప్పాడు?

యేసు అతనితో, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడియున్నవి అని చెప్పాడు (5:20).

శాస్త్రులు, పరిసయ్యులు యేసు దేవదూషణ చేస్తున్నాడని ఎందుకు అనుకున్నారు?

ఎందుకంటే, ఒక్క దేవునికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉన్నది (5:21).

Luke 5:22

యేసు పక్షవాయు రోగిని స్వస్థపరచి ఆయనకు లోకంలో ఏ అధికారం ఉందని చూపించాడు?

యేసు పక్షవాయు రోగిని స్వస్థపరచడం ద్వారా తనకు లోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని తెలియజేసాడు(5:24).

Luke 5:29

యేసు లేవి అనే సుంకరి ఇంటి వద్ద తినుచు త్రాగుతూ ఉన్న సమయంలో ఆయన ఎవరి గురించి వచ్చానని చెప్పాడు?

మారుమనస్సు పొందడం కోసం పాపులను పిలవడానికి లోకానికి వచ్చానని యేసు చెప్పాడు(5:32).

Luke 5:33

యేసు తన శిష్యులను ఎప్పుడు ఉపవాసం ఉండాలని చెప్పాడు?

తాను వారి మధ్య నుండి కొనిపోబడినప్పుడు శిష్యులు ఉపవాసం ఉండాలని చెప్పాడు(5:35).

Luke 5:36

యేసు చెప్పిన ఉపమానంలో, పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక ఎందుకు వెయ్యరని చెప్పాడు?

పాత గుడ్డకు కొత్త దానితో మాసిక వేస్తే అది దానితో కలవదు, పాత గుడ్డను కొత్తది చింపివేస్తుంది(5:36).

Luke 5:37

యేసు తన రెండవ ఉపమానంలో పాత తిత్తులలో కొత్త ద్రాక్షా రసం ఎందుకు పోయకూడదని చెప్పాడు?

కొత్త ద్రాక్షా రసము పాత తిత్తులను పిగులుస్తుంది, ద్రాక్షారసం పాడైపోతుంది(5:37).

కొత్త ద్రాక్షారసం ఎక్కడ ఉంచాలని యేసు చెప్పాడు?

కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలో పోయ్యాలని యేసు చెప్పాడు(5:38).


Chapter 6

Translation Questions

Luke 6:1

పరిసయ్యులు ఆరోపించినట్టు యేసు శిష్యులు విశ్రాంతి దినంనాడు చేయకూడని పని ఏమి చేస్తున్నారు?

యేసు శిష్యులు వెన్నులు తుంచి, చేతులతో దులుపుకుని తింటున్నారు(6:1).

Luke 6:3

విశ్రాంతిదినం వాడు పని చేయడానికి తనకు అధికారం ఉన్నదని తెలియజేసే బిరుదు ఇచ్చుకున్నాడు?

యేసు తాను విశ్రాంతి దినమునకు యజమానినని చెప్పుకున్నాడు(6:5).

Luke 6:9

యేసు విశ్రాంతి దినంనాడు ఊచచెయ్యి గలవాణ్ణి బాగుచేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఎలా స్పందించారు?

వారు తీవ్రమైన కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు(6:11).

Luke 6:12

కొండపైన యేసు ఎన్నుకొన్న పన్నెండుమంది ఏమని పిలువబడ్డారు?

యేసు వారిని "అపొస్తలులు" అని పిలిచాడు(6:13).

Luke 6:20

ఎలాంటి ప్రజలు ధన్యులని యేసు చెప్పాడు?

పేదవారు, ఆకలిగొన్నవారు, ఏడ్చుచున్నవారు, మనుష్యకుమారుని కొరకు ద్వేషించబడినవారు ధన్యులు(6:20-22).

Luke 6:22

యేసు చెప్పిన ప్రకారం, అలాంటి ప్రజలు సంతోషించి గంతులు వేసి ఆనందిస్తారు?

ఎందుకంటే వారి ఫలము పరలోకంలో అధికం అవుతుంది(6:23).

Luke 6:27

తమను శత్రువులుగా చూస్తూ, తమను ద్వేషిస్తున్న వారిపట్ల ఎలా ప్రవర్తించాలని యేసు తన శిష్యులతో చెప్పాడు?

శిష్యులు తమ శత్రువులను ప్రేమించి, వారి పట్ల మంచి పనులు చెయ్యాలి(6:27,35).

Luke 6:35

కృతజ్ఞత లేనివారిపట్ల, దుష్టులపట్ల దేవుని వైఖరి ఏమిటి?

కృతజ్ఞత లేనివారికి, దుష్టులకు దేవుడు ఉపకారియై ఉన్నాడు(6:35-36).

Luke 6:41

ఎదుటివాని కంట్లో నలుసు తీసివేయక ముందు మనం ఏమి చేయాలని యేసు చెప్పాడు?

మనం వేషదారులమై ఉండకుండునట్లు మొదటగా మనం మన కంట్లో ఉన్న దూలమును తీసుకోవాలని యేసు చెప్పాడు(6:42).

Luke 6:45

సజ్జనుడి హృదయమను మంచి ధననిధి నుండి ఏ విషయాలు బయటపెడతాడు?

సజ్జనుడి హృదయమను మంచి ధననిధి నుండి సద్విషయములు బయటికి తెస్తాడు(6:45).

దుర్జనుడి హృదయమను చెడ్డ ధననిధి నుండి ఏ విషయాలు బయటపెడతాడు?

దుర్జనుడు హృదయమను చెడ్డ ధననిధి నుండి దుర్విషయములు బయటికి తెస్తాడు(6:45).

Luke 6:46

బండమీద తన ఇల్లు కట్టుకున్నవాడు యేసు మాటల విషయంలో ఏమి చేసాడు?

యేసు మాటలు విని, వాటి చొప్పున జరిగించాడు(6:47).

Luke 6:49

పునాది లేకుండా తన ఇల్లు కట్టుకున్నవాడు యేసు మాటల విషయంలో ఏమి చేసాడు?

యేసు మాటలు వినియు, వాటి చొప్పున చేయలేదు(6:49).


Chapter 7

Translation Questions

Luke 7:2

శతాధిపతి యూదుల పెద్దలను యేసు వద్దకు పంపినప్పుడు మొదటగా ఏమి కోరుకున్నాడు?

యేసును తన ఇంటికి వచ్చి తన సేవకుణ్ణి స్వస్థపరచమని కోరుకున్నాడు(7:3).

Luke 7:6

తరువాత శతాధిపతి తన స్నేహితులను యేసు వద్దకు పంపి యేసు తన వద్దకు రావద్దని ఎందుకు చెప్పాడు?

యేసు తన ఇంటికి వచ్చేందుకు తాను యోగ్యుడను కానని శతాధిపతి చెప్పాడు(7:6).

శతాధిపతి తన దాసుణ్ణి ఏవిధంగా స్వస్థపరచాలని కోరుకున్నాడు?

యేసు ఒక మాట చెప్పి తన దాసుణ్ణి స్వస్థపరచాలని కోరుకున్నాడు(7:7).

Luke 7:9

శతాధిపతి చూపిన విశ్వాసాన్ని బట్టి యేసు ఏమి అన్నాడు?

ఇశ్రాయేలీయులలోనైనా ఇంతటి విశ్వాసం తనకు కనబడలేదని యేసు చెప్పాడు(7:9).

Luke 7:11

విధవరాలి కుమారుడు మరణించినప్పుడు యేసు ఎలా స్పందించాడు?

యేసు ఆమెను చూసి ఆమెయందు కనికరపడ్డాడు(7:13).

Luke 7:16

యేసు విధవరాలి కుమారుని బతికించినప్పుడు అక్కడి ప్రజలు ఏమనుకున్నారు?

మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడనీ, దేవుడు తన దర్శనము అనుగ్రహించాడని అక్కడి ప్రజలు అనుకున్నారు(7:16).

Luke 7:21

యోహాను శిష్యులకు యేసు తాను రాబోవు వాడనని ఎలా తెలియపరచుకున్నాడు?

యేసు గుడ్డివారిని, కుంటివారిని, కుష్టురోగులను, చేవిటివారిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బతికించాడు(7:22).

Luke 7:24

యోహాను ఎవరని యేసు చెప్పాడు?

యోహాను ప్రవక్త కంటే గొప్పవాడని యేసు చెప్పాడు(7:26).

Luke 7:29

పరిసయ్యులు, ధర్మశాస్త్రోపడేశకులు యోహాను బాప్తిస్మం నిరాకరించడం ద్వారా ఏమి పోగొట్టుకున్నారు?

వారు తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు(7:30).

Luke 7:33

బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టెలు తినకుండా, ద్రాక్షారసం తాగకుండా ఉండడాన్నిబట్టి అతడు ఏమని పిలువబడ్డాడు?

వారు అతణ్ణి "దయ్యము పట్టినవాడు" అని పిలిచారు(7:33).

యేసు తినుచూ, తాగుతూ ఉండడం చూసి ఆయనను ఏమని పిలిచారు?

వారు యేసును తిండిబోతు అనీ, మద్యపాని అనీ పిలిచారు(7:34).

Luke 7:36

యేసు పరిసయ్యుని ఇంటిలో ఉన్నప్పుడు ఊరిలోని స్త్రీ యేసుకు ఏమి చేసింది?

ఆమె తన కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకుని అత్తరును వాటికి పూసింది(7:38).

Luke 7:46

ఆమె విస్తార పాపాలు ఎందువలన క్షమించబడ్డాయి?

ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె పాపాలు క్షమించబడ్డాయి(7:47).

Luke 7:48

యేసు ఆ స్త్రీతో ఆమె పాపాలు క్షమించబడ్డాయని చెప్పిన మాటనుబట్టి ఆయనతో భోజన పంక్తిలో కూర్చ్చున్నవారు ఏమనుకున్నారు?

వారు "పాపములు క్షమించుటకు ఇతడు ఎవరు" అని తమలో తాము అనుకున్నారు(7:49).


Chapter 8

Translation Questions

Luke 8:1

స్త్రీల సమూహం యేసుకు, ఆయన శిష్యులకు ఏమి చేశారు?

వారు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి(8:3).

Luke 8:11

యేసు చెప్పిన ఉపమానంలో విత్తబడిన విత్తనం ఏమిటి?

విత్తబడినది దేవుని వాక్యం(8:11).

త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరు? వారికి ఏమి జరిగింది?

త్రోవ పక్కన ఉండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమును ఎత్తికొని పోవును(8:12).

రాతినేలలో పడిన విత్తనాలు ఎవరు? వారికి ఏమి జరిగింది?

వారు సంతోషముగా వాక్యము వింటారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు(8:13).

Luke 8:14

ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరు? వారికి ఏమి జరిగింది?

వారు విని, కాలము గడచిన కొలది ఈ జీవసంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణచివేయబడి ఫలించరు(8:14).

మంచి నేలలో పడిన విత్తనాలు ఎవరు? వారికి ఏమి జరిగింది?

వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంభించి ఓపికతో ఫలిస్తారు(8:15).

Luke 8:19

యేసు ఎవరిని తన తల్లి, తండ్రి అని చెప్పాడు?

దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించేవారే తన తల్లి, తండ్రి అని చెప్పాడు(8:21).

Luke 8:24

యేసు గాలిని, నీటిపొంగును అణచినప్పుడు ఆయన శిష్యులు ఏమనుకున్నారు?

వారు, "ఈయన గాలికిని, నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవి. ఈయన ఎవరో" అనుకున్నారు(8:25).

Luke 8:28

గెరాసేనుల దేశంలో దయ్యము పట్టినవాడి పరిస్థితి ఎలా ఉంది?

వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకోకుండా, సమాధులలో నివసిస్తూ గొలుసులతో, కాలిసంకెళ్లతో కట్టబడి ఉన్నాడు(8:27,29).

Luke 8:32

ఆ వ్యక్తిని విడిచిపెట్టమని యేసు ఆజ్ఞాపించినప్పుడు దయ్యం ఏమి చేసింది?

ఆ దయ్యం ఆ వ్యక్తిని విడిచిపోయి పందులలో చొరబడింది గనుక, ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వాడిగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను(8:33).

Luke 8:38

ఆ వ్యక్తిని ఏమి చేయమని యేసు చెప్పాడు?

యేసు అతనితో, "ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గోప్పకార్యాలను చేసెనో తెలియజేయుమని" చెప్పాడు(8:39).

Luke 8:47

యేసు చెప్పిన ప్రకారం, రక్తస్రావం గల స్త్రీ స్వస్థపడడానికి కారణం ఏమిటి?

యేసుపై ఆమెకు ఉన్న విశ్వాసమే ఆమెను స్వస్థపరచింది(8:48).

Luke 8:54

యాయీరు ఇంటివద్ద యేసు ఏమి చేసాడు?

చనిపోయిన యాయీరు కుమార్తెను యేసు బతికించాడు(8:55).


Chapter 9

Translation Questions

Luke 9:1

యేసు తన పన్నెండుమంది శిష్యులను ఎందుకు పంపించాడు?

దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు యేసు తన శిష్యులను పంపించాడు(9:2).

Luke 9:7

కొందరు చెప్పుకొనుచున్న ప్రకారం హేరోడు యేసు గురించి విన్న మూడు విషయాలు ఏమిటి?

యేసును గూర్చి కొందరు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను మృతుల్లో నుండి లేచాడని, కొందరు ఏలీయా కనబడ్డాడనీ, మరికొందరు పూర్వకాలపు ప్రవక్త లేచాడనీ చెప్పుకున్నారు(9:7-8).

Luke 9:12

యేసును వెంబడించిన జనసమూహంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?

యేసును వెంబడించిన జనసమూహంలో అయిదు వేలకు మించి పురుషులు ఉన్నారు(9:14).

Luke 9:15

జనసమూహానికి పెట్టడానికి శిష్యుల వద్ద ఉన్న ఆహారం ఏమిటి?

శిష్యుల వద్ద అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి(9:13,16).

అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలను యేసు ఏమి చేసాడు?

యేసు వాటిని తీసుకుని పరలోకమందున్న తండ్రికి ప్రార్థించి, వాటిని ఆశీర్వదించి ముక్కలుగా చేసి ప్రజలకు పంచమని శిష్యులకు ఇచ్చాడు(9:16).

ప్రజలకు పంచగా ఎన్ని గంపలు మిగిలిపోయాయి?

పన్నెండు నిండు గంపలు మిగిలిపోయాయి(9:17).

Luke 9:20

యేసు తనను ఎవరినని శిష్యులు అనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు ఏమని బదులిచ్చాడు?

పేతురు యేసుతో, "నీవు దేవుని క్రీస్తువు" అని జవాబిచ్చాడు(9:20).

Luke 9:23

తనను వెంబడించేవాడు తప్పనిసరిగా ఏమి చేయాలని యేసు చెప్పాడు?

ఆయనను వెంబడించగోరేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయనను వెంబదించాలని యేసు చెప్పాడు(9:23).

Luke 9:28

కొండ మీద యేసు ఎలా కనబడ్డాడు?

యేసు ముఖరూపము మారిపోయింది. ఆయన వస్త్రాలు తెల్లనివై ధగధగ మెరిశాయి (9:29).

Luke 9:30

యేసుతో కలసి ఎవరు ప్రత్యక్షమయ్యారు?

జ.మోషే, ఎలీయాలు యేసుతో కలసి ప్రత్యక్షమయ్యారు(9:30).

Luke 9:34

మేఘములోనుండి వినబడిన స్వరం ఏమని పలికింది?

ఆ స్వరం, "ఈయన నేనేర్పరచుకున్న నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి" అని పలికింది(9:35).

Luke 9:37

యేసు దయ్యమును వదిలించక ముందు ఆ వ్యక్తి కుమారుణ్ణి దయ్యం ఏమి చేస్తుంది?

వాడు కేకలు వేయుచు, నురుగు కారునట్లు అది వానిని వదలక పీడిస్తుంది(9:39).

Luke 9:43

యేసు చేసిన కార్యాలను అర్థం చేసుకోలేని శిష్యులను చూసి ఏమి అన్నాడు?

యేసు వారితో, "మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోతున్నాడు" అని చెప్పాడు(9:44).

Luke 9:46

శిష్యులలో ఎవరు గొప్పవారుగా ఉంటారని యేసు చెప్పాడు?

ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు అని యేసు చెప్పాడు(9:48).

Luke 9:51

యేసు పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమైనప్పుడు ఏమి జరుగుతుంది?

ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకున్నాడు(9:51).

Luke 9:61

"నాగటి మీద చెయ్యిపెట్టే" వాడు ఏమి చేయకుండా ఉంటె దేవుని రాజ్యమునకు పాత్రుడవుతాడు?

అలాంటివాడు వెనుకకు తిరిగి చూడకూడదు(9:26).


Chapter 10

Translation Questions

Luke 10:3

యేసు 70 మందిని నియమించి వారితో ఏమి తీసుకువెళ్ళకూడదని చెప్పాడు?

వారు సంచి గానీ, జోలె గానీ, చెప్పులను గానీ తమ వెంట తీసుకు వెళ్లకూడదని యేసు చెప్పాడు(10:4).

Luke 10:8

ప్రతి పట్టణంలోనూ ఏమి ప్రకటించాలని అ 70 మందికి యేసు చెప్పాడు?

అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచి, దేవుని రాజ్యము సమీపించియుయున్నదని ప్రకటించాలని యేసు చెప్పాడు(10:9).

Luke 10:10

తమ వద్దకు పంపబడిన యేసును అంగీకరించకపోతే ఏ పట్టణానికి పట్టిన గతికంటే అధ్వాన స్థితి పడుతుంది?

అది సొదొమ పట్టణానికి పట్టిన గతికంటే అధ్వానంగా మారుతుంది(10:12).

Luke 10:17

పంపబడిన 70 మంది తిరిగివచ్చి దయ్యములను వెళ్ళగొట్టిన సంగతులు ఆనందంగా యేసుతో చెప్పినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

యేసు, "మీ పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి" అని చెప్పాడు(10:20).

Luke 10:21

తండ్రియైన దేవునికి పరలోక రాజ్య విషయాలు ఎవరికి తెలియజేయబడుట సంతోషం కలిగిస్తుందని యేసు చెప్పాడు?

పరలోక రాజ్య విషయాలు జ్ఞానులకు వివేకులకు తెలియబడుట కంటే పసిబాలురకు తెలియబడుట తండ్రియైన దేవునికి సంతోషం కలిగిస్తుంది(10:21).

Luke 10:25

యేసు చెప్పినట్టు, ఒక వ్యక్తి నిత్యజీవము పొందడానికి ఏమి చేయాలి?

నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ భక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను(10:27).

Luke 10:31

యేసు చెప్పిన ఉపమానంలో, కొనప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని చూసి యాజకుడు ఏమి చేశాడు?

అతడు గాయపడిన వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు(10:31).

కొనప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని చూసి లేవీయుడు ఏమి చేశాడు?

అతడు గాయపడిన వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు(10:32).

Luke 10:33

కొనప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని చూసి సమరయుడు ఏమి చేశాడు?

అతడు గాయపడిన వ్యక్తిని చూసి అతని గాయములు కడిగి, తన వాహనము మీద ఎక్కించుకుని ఒక పూటకూళ్లవాని ఇంటికి తీసికొనిపోయి అతనిని పరామర్శించెను(10:34).

Luke 10:36

ఈ ఉపమానం చెప్పిన తరువాత యేసు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునితో ఏమి చేయమని చెప్పాడు?

ఉపమానంలో చెప్పబడినట్టు సమరయుడు చూపినట్టు ఇతరులపట్ల జాలి చూపమని చెప్పాడు(10:37).

Luke 10:38

యేసు మార్త ఇంటికి వెళ్ళినప్పుడు మరియ ఏమి చేస్తుంది?

మరియ యేసు పాదాల వద్ద కూర్చుని ఆయన చెప్పేది వింటున్నది(10:39).

Luke 10:40

యేసు తమ ఇంటికి వచ్చినపుడు మార్త ఏమి చేస్తుంది?

మార్త విస్తారమైన పని పెట్టుకుని యేసుకు భోజనం సిద్ధం చేస్తుంది(10:40).

ఎవరు ఉత్తమమైనదానిని ఏర్పరచుకున్నారని యేసు చెప్పాడు?

మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకున్నదని యేసు చెప్పాడు(10:42).


Chapter 11

Translation Questions

Luke 11:3

యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఏమిటి?

ఆయన, "తండ్రీ, నీ నామము పరిశుద్దపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము. మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకుము" అని ప్రార్థించాడు(11:2-4).

Luke 11:5

యేసు చెప్పిన ఉపమానంలో, ఆ వ్యక్తి మధ్యరాత్రి నిద్రలేచి తన స్నేహితునికి రొట్టె ఎందుకు ఇచ్చాడు?

అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుతూ ఉండడంవల్ల ఇచ్చాడు(11:8).

Luke 11:11

పరలోకమందున్న తండ్రి తనను అడిగేవారికి ఏమి ఇస్తాడు?

ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు(11:13).

Luke 11:14

యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం చూసిన కొందరు ఆయన గురించి ఏమని చెప్పుకున్నారు?

యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం చూసిన కొందరు ఆయన దయ్యాలకు అధిపతియైన బయోల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పుకున్నారు(11:15).

Luke 11:18

ఏ శక్తి వలన తాను దయ్యాలను వెళ్ళగొడుతున్నానని యేసు చెప్పాడు?

ఆయన దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని యేసు చెప్పాడు(11:20).

Luke 11:24

అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంతిమ స్థితి ఎలా ఉంటుంది?

అతని అంతిమ స్థితి మొదటికంటే మరింత అధ్వానంగా ఉంటుంది(11:26).

Luke 11:27

యేసు తల్లిని ధన్యురాలని మెచ్చుకున్న సందర్భంలో ధన్యులు ఎవరని యేసు చెప్పాడు?

దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరింత ధన్యులని యేసు చెప్పాడు(11:28).

Luke 11:32

పాత నిబంధనలోని ఏ ఇద్దరు వ్యక్తులకన్నా తాను గొప్పవాడినని యేసు చెప్పాడు?

సోలోమోను మరియు యోనా(11:31-32).

Luke 11:42

పరిసయ్యులు ఏ ఏ విషయాలను నిర్ల్యక్షం చేశారని యేసు చెప్పాడు?

పరిసయ్యులు న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్ల్యక్షం చేశారు(11:42).

Luke 11:45

ధర్మశాస్త్రోపదేశకులు ఇతర మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారని యేసు చెప్పాడు?

వారు మోయశక్యముగాని బరువులను మనుషుల మీద మోపుతారు కానీ వారు ఒక వేలితోనైనను ఆ బరువులు ముట్టరు అని చెప్పాడు(11:46).

Luke 11:49

ఈ తరము ప్రజలు దేని నిమిత్తం విచారింపబడతారని యేసు చెప్పాడు?

లోకము పుట్టినది మొదలు చిందింపబడిన ప్రవక్తల రక్తము నిమిత్తము వారు విచారింపబడతారు(11:50).

Luke 11:53

శాస్త్రులు, పరిసయ్యులు యేసు మాటలు విని ఏమి చేసారు?

వారు ఆయన మీద నేరము మోపవలెనని ఆయన నోట నుండి వచ్చు ఏ మాటయైనను పట్టుకోవాలని చూసారు(11:54).


Chapter 12

Translation Questions

Luke 12:2

యేసు చెప్పినట్టు మీరు చీకటిలో మాట్లాడుకున్న మాటలు ఏమవుతాయి?

ఆ మాటలు వెలుగులో వినబడతాయి(12:3).

Luke 12:4

మనం ఎవరికి భయపడాలని యేసు చెప్పాడు?

నరకములో పడద్రోయు శక్తీ గలవానికి మనం భయపడాలి(12:5).

Luke 12:8

యేసును మనుషుల ఎదుట ఒప్పుకొనేవారికి ఏమి జరుగుతుంది?

యేసును ఒప్పుకున్న వ్యక్తిని యేసు దేవుని ఎదుట, దూతల ఎదుట ఒప్పుకుంటాడు(12:8).

Luke 12:13

యేసు చెప్పిన ప్రకారం, మన జీవితాలు దేనికి తావియ్యకూడదు?

మన జీవితాలు సంపదలు విస్తరించుటకు తావియ్యకూడదు(12:15).

Luke 12:16

యేసు చెప్పిన ఉపమానములో, ధనవంతుడు తన భూమిలో పంట విస్తారంగా పండినప్పుడు ఏమి చెయ్యాలనుకున్నాడు?

అతడు తన కొట్లు విప్పి, వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని తినుచు త్రాగుచు సుఖించాలనుకున్నాడు(12:18-19).

Luke 12:20

అప్పుడు దేవుడు అతనితో ఏమన్నాడు?

దేవుడు, "వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవరికి దక్కుతాయి" అన్నాడు(12:20).

Luke 12:31

ఈ లోకపు ప్రజలు వెదికే వాటికి బదులు మనం ఏమి వెదకాలని యేసు చెప్పాడు?

మనం ఆయన రాజ్యమును వెదకాలి(12:31).

Luke 12:33

మనం మన ధననిధిని ఎక్కడ దాచుకోవాలి? ఎందుకు?

మనం మన ధననిధిని పరలోకంలో దాచుకోవాలి. ఎందుకంటే, అక్కడ దొంగ రాడు, చిమ్మెట కొట్టదు(12:33).

Luke 12:37

యేసు ప్రకారం, ఎలాంటి దాసులు దీవించబడతారు?

ప్రభువు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొంటాడో ఆ దాసులు ధన్యులు(12:37).

Luke 12:39

యేసు వచ్చే సమయం మనకు తెలుసా?

తెలియదు(12:40).

Luke 12:45

తమ యజమాని తిరిగి వచ్చే సమయంలో తమను తాము సిద్ధపరచుకోని దాసులకు ఏమి జరుగుతుంది?

యజమాని వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును(12:46).

Luke 12:47

ఎక్కువగా ఇయ్యబడిన వాని యొద్దనుండి ఏ పరిమాణంలో తీసుకోబడుతుంది?

ఎక్కువగా ఇయ్యబడిన వారినుంచి ఎక్కువగా తీసుకుంటారు(12:48).

Luke 12:51

యేసు చెప్పిన ప్రకారం, భూమి మీద ఎలాంటి విభజనలు జరుగుతాయి?

ఒకే ఇంటిలో ఒకరికి ఒకరు విరోధులుగా ఉంటారు(12:52-53).

Luke 12:57

యేసు చెప్పినట్టు, వివాదం తేల్చుకోవడానికి న్యాయాధికారి వద్దకు వెళ్ళక మునుపు మనం ఏమి చెయ్యాలి?

అతని చేతిలో నుండి తప్పించుకొనడానికి దారిలోనే ప్రయత్నం చెయ్యాలి(12:58).


Chapter 13

Translation Questions

Luke 13:1

పిలాతు కొందరు గలిలయుల రక్తమును బలులతో కలపడంవల్ల వారు గలిలయులందరికంటే పాపులా?

కాదు(13:3).

Luke 13:8

యేసు చెప్పిన ఉపమానంలో, మూడేళ్ళ వరకు కాపు కాయని అంజూరపు చెట్టు ఏమి చేయబడాలి?

చెట్టు చుట్టూ తవ్వి ఎరువు వేసి మరో సంవత్సరంపాటు కనిపెట్టి అప్పటికీ కాపు రాకపోతే నరికివేయబడాలి(13:8-9).

Luke 13:10

సునగోగులో, 18 ఏళ్ల నుండి ఆ స్త్రీని బాధ పెడుతున్న బలహీనత ఏమిటి?

ఆమెను బలహీనపరిచే దయ్యము పట్టి పీడుస్తుంది(13:11,16).

Luke 13:12

ఆమెను స్వస్థపరచినప్పుడు సునగోగు అధికారి కోపముతో ఎందుకు మండిపడ్డాడు?

విశ్రాంతి దినం నాడు యేసు ఆ కార్యం చేశాడు కనుక(13:14).

Luke 13:15

సునగోగు అధికారి వేషధారి అని యేసు ఎలా కనపరిచాడు?

విశ్రాంతి దినమున తమ ఎద్దును గానీ, గాడిదను గానీ తోలుకుని వెళ్ళి నీళ్ళు పెడతారు. అయితే దయ్యము పీడిస్తున్న స్త్రీని ఆ రోజున స్వస్థపరిస్తే ప్రశ్నిస్తారు అని గుర్తు చేశాడు(13:15).

Luke 13:18

దేవుని రాజ్యము ఆవగింజను ఈ విధంగా పోలియున్నది?

ఆవగింజ పెరిగి వృక్షం అవుతుంది. ఆకాశ పక్షులు దాని కొమ్మల్లో నివసిస్తాయి(13:19).

Luke 13:22

రక్షణ పొందేది కొద్దిమందేనా అన్న ప్రశ్నకు యేసు ఏమని జవాబిచ్చాడు?

యేసు, "ఇరుకు ద్వారమున ప్రవేసింప పోరాడుడి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు గాని వారివలన కాదు" అని చెప్పాడు(13:24).

Luke 13:28

దేవుని రాజ్యంలో సమకూడి భోజనపు బల్ల వద్ద విశ్రాంతిగా ఎవరు సమకూడతారు?

జ.అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలు, ఇంకా తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ దిక్కులనుండి వచ్చినవారు(13:28-29).

Luke 13:31

తాను ఎక్కడ చంపబదతానని యేసు చెప్పాడు?

ఆయన యెరూషలేములో తప్పక చంపబదతానని యేసు చెప్పాడు(13:33).

Luke 13:34

యెరూషలేము ప్రజలను ఏమి చేయాలని యేసు కోరుకున్నాడు?

కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే యెరూషలేము ప్రజలను చేర్చుకోవాలని యేసు ఆశించాడు(13:34).

యెరూషలేము ప్రజలు తమపట్ల యేసు కోరిక విషయంలో ఎలా స్పందించారు?

యెరూషలేము ప్రజలు ఆయనను తిరస్కరించారు(13:34).

అందువల్ల యేసు యెరూషలేము ప్రజల విషయం ఏమని ప్రవచించాడు?

యేసు, "ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది.'ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక' అని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరు" అని ప్రవచించాడు(13:35).


Chapter 14

Translation Questions

Luke 14:1

యేసు ఎదుట జలోదర రోగము గల వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను ఏమని అడిగాడు?

యేసు "విశ్రాంతి దినమందు స్వస్థపరచుట న్యాయమా, కాదా?" అని అడిగాడు(14:3).

Luke 14:4

ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు ఏమని జవాబిచ్చారు?

వారు జవాబు చెప్పకుండా మిన్నకుండిపోయారు(14:4).

యేసు అతణ్ణి స్వస్థపరచిన తరువాత ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వేషధారులని ఎలా రుజువుపరిచాడు?

విశ్రాంతి దినమున వారి ఎవరి కుమారుడు గానీ, గాడిద గానీ గుంటలో పడిపోతే బయటకు తీయకుండా ఉంటారా అని యేసు వారికి గుర్తుచేశాడు(14:5).

Luke 14:10

తనను తాను హెచ్చించుకొనేవాడు ఏమవుతాడని యేసు చెప్పాడు?

తనను తాను హెచ్చించుకొనేవాడు తగ్గించబడతాడు(14:11).

తనను తాను తగ్గించుకొనేవాడు ఏమవుతాడని యేసు చెప్పాడు?

తనను తాను తగ్గించుకొనేవాడు హెచ్చించబడతాడు(14:11).

Luke 14:13

యేసు చెప్పిన ప్రకారం, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలిచి విందు చేసినవారికి ఏమి జరుగుతుంది?

జ.వీరు నీతిమంతుని పునరుత్థానములో ప్రత్యుపకారము పొందుతారు(14:14).

Luke 14:18

విందు ఉపమానంలో ముందుగా పిలువబడినవారు ఏమి చేసారు?

ముందుగా పిలువబడినవారు తాము విందుకు రాకుండా సాకులు చెప్పసాగారు(14:18).

Luke 14:21

అప్పుడు యజమాని ఎవరిని విందుకు ఆహ్వానించాడు?

పేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని విందుకు ఆహ్వానించాడు(14:21).

Luke 14:25

యేసు చెప్పిన ప్రకారం శిష్యులుగా ఉండగోరే వారు ఏమిచేయాలి?

ఎవరైనా తన ప్రాణాన్ని, కుటుంబాన్ని ద్వేషించి, తమ సిలువనెత్తికొని, వారికున్నదంతా విదిచిపెట్టకపోతే వారు యేసు శిష్యులు కాలేరు(14:26-27,33).

Luke 14:28

ఆయనను వెంబడింపగోరేవాడికి ఉండవలసిన లక్షణాన్ని గోపురం నిర్మించే వాడి ఉపమాన రీతిగా యేసు ఎలా చెప్పాడు?

అతడు ముందుగా దాని ఖర్చు బేరీజు వేసుకుంటాడు(14:28).

Luke 14:34

ఉప్పు నిస్సారమైతే దానిని ఏమి చేస్తారు?

దానిని పారవేస్తారు.(14:35).


Chapter 15

Translation Questions

Luke 15:3

యేసు చెప్పిన ఉపమానంలో, గొర్రెల కాపరి తన వంద గొర్రెల నుండి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏమి చేసాడు?

అతడు తన తొభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకి కనుగొని ఆనందంగా తిరిగివచ్చాడు(15:4-5).

Luke 15:8

ఒక పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకంలో ఏమి జరుగుతుంది?

మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుంది(15:7,10).

Luke 15:11

యేసు చెప్పిన ఉపమానంలో, చిన్న కుమారుడు తన తండ్రిని ఏమి అడిగాడు?

వారసత్వంగా తనకు సంక్రమించే ఆస్తి తనకు ఇవ్వమని అడిగాడు(15:12).

Luke 15:15

తన వద్ద ఉన్న సొమ్ము అయిపోయాక ఆ చిన్న కుమారుడు జీవించడం కోసం ఏమి చేసాడు?

అతడు వేరొక వ్యక్తి వద్ద పందులు మేపే పనికి కుదిరాడు(15:15).

Luke 15:17

చిన్న కుమారుడు తేటగా ఆలోచించి ఏమి చేయాలని నిర్ణయించుకున్నాడు?

అతడు తండ్రి వద్దకు వెళ్లి తన తప్పు ఒప్పుకుని, తండ్రి వద్ద ఉన్న పనివారిలో ఒకడిగా చేర్చుకొమ్మని అడగాలని నిర్ణయించుకున్నాడు(15:18-19).

Luke 15:20

తన చిన్న కుమారుడు తిరిగి ఇంటికి రావడం దూరం నుండి చూసిన తండ్రి ఏమి చేశాడు?

తండ్రి పరుగెత్తుకొని వెళ్లి తన కుమారుణ్ణి ముద్దుపెట్టుకున్నాడు(15:20).

Luke 15:22

తండ్రి తన కుమారుడు వచ్చిన వెంటనే ఏమి చేశాడు?

తండ్రి తన కుమారునికి ప్రశస్త వస్త్రము తొడిగించి, ఉంగరము పెట్టి, చెప్పులు తొడిగించాడు. విందు ఏర్పాటు చేసాడు(15:22-23).

Luke 15:28

చిన్న కుమారుని కోసం విందు సిద్ధం చేయించమని తండ్రి చెప్పినప్పుడు పెద్ద కుమారుడు ఎలా స్పందించాడు?

అతడు కోపం తెచ్చుకొని లోపలికి వెళ్ళలేదు(15:28).

పెద్ద కుమారుడు తన తండ్రికి ఏమని ఫిర్యాదు చేశాడు?

తాను ఇంతకాలం నుండి తండ్రిని సేవిస్తూ, అతడి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలసి సంతోషించుటకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదని పెద్ద కుమారుడు ఫిర్యాదు చేశాడు(15:29).

Luke 15:31

పెద్దకుమారునికి తండ్రి ఏమని బదులిచ్చాడు?

జ.తండ్రి తన పెద్ద కుమారునితో, "కుమారుడా, నీవెల్లప్పుడును నాతో ఉన్నావు. నావన్నియు నీవే" అన్నాడు(15:31).

చిన్న కుమారుని విషయంలో ఇలా చేయడం యుక్తమని తండ్రి ఎందుకు చెప్పాడు?

ఎందుకంటే చిన్న కుమారుడు తప్పిపోయి దొరికాడు(15:32).


Chapter 16

Translation Questions

Luke 16:1

ధనవంతుడు తన గృహనిర్వాహకుడి గురించి ఎలాంటి వార్త విన్నాడు?

గృహనిర్వాహకుడు తన యజమాని ఆస్తిని పాడుచేస్తున్నాడన్న వార్త విన్నాడు(16:1).

Luke 16:5

యజమాని తనను పనిలోనుండి తొలగించక ముందు గృహనిర్వాహకుడు ఏమి చేశాడు?

గృహనిర్వాహకుడు తన యజమాని ఋణస్తులను పిలిపించి వారి బాకీలు తగ్గించాడు(16:5-7).

Luke 16:8

యజమాని తన గృహనిర్వాహకుడు చేసిన పనినిబట్టి ఏమి చేశాడు?

గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని యజమాని మెచ్చుకున్నాడు(16:8).

ఈ కథ ఆధారంగా యేసు ఇతరులకు ఏమి చెప్పాడు?

యేసు, "అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొనును" అని చెప్పాడు(16:9).

Luke 16:10

మిక్కిలి కొంచెములో నమ్మకమైనవాడు ఇంకా దేనిలో నమ్మకంగా ఉంటాడని యేసు చెప్పాడు?

అతడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడని యేసు చెప్పాడు(16:10).

Luke 16:13

ఇద్దరు యజమానులలో ఎవరిని సేవించాలని యేసు చెప్పాడు?

మనం దేవుణ్ణి గానీ, సిరిని గానీ ఎంచుకోవాలి(16:13).

Luke 16:16

యేసు చెప్పిన ప్రకారం, బాప్తిస్మమిచ్చు యోహాను రాక పూర్వం ఏది అమలులో ఉన్నది?

బాప్తిస్మమిచ్చు యోహాను రాక పూర్వం ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఉన్నారు(16:16).

యేసు చెప్పిన ప్రకారం, ఇప్పుడు ఏది బోధించబడుతుంది?

దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది(16:16).

Luke 16:18

యేసు ప్రకారం, తన భార్యను విడిచి వేరొకరిని పెండ్లి చేసుకొన్నవాడు ఏమని పిలువబడతాడు?

అతడు వ్యభిచారి అని పిలువబడతాడు(16:18).

Luke 16:22

యేసు చెప్పిన కథలో చనిపోయిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు?

లాజరు అబ్రాహము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను(16:22,25).

చనిపోయిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు?

అతడు పాతాళమునకు వెళ్ళాడు(16:23).

Luke 16:24

ధనవంతుడు అబ్రాహామును అడిగిన మొదటి కోరిక ఏమిటి?

అతడు, "తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నాను" అని అడిగాడు(16:24).

Luke 16:25

ధనవంతునికి అబ్రాహాము ఏమని జవాబిచ్చాడు?

అబ్రాహాము, "మాకును మీకును గొప్ప అగాథముంచబడినది" అని జవాబిచ్చాడు(16:26).

Luke 16:27

ధనవంతుడు అబ్రాహామును అడిగిన రెండవ కోరిక ఏమిటి?

అతడు, "నా సహోదరులు ఈ వేదనకరమైన చోటుకు రాకుండా వారిని హెచ్చరించడానికి లాజరును పంపించు" అని కోరుకున్నాడు(16:27-28).

Luke 16:29

ధనవంతునికి అబ్రాహాము ఏమని జవాబిచ్చాడు?

అబ్రహాము, "వారి యొద్ద మోషెయు, ప్రవక్తలును ఉన్నారు. వారి మాటలు వినవలెను" అని చెప్పాడు(16:29).

వారు మోషె, ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోతే మరి ఎవరు చెప్పినా వినరని అబ్రాహాము చెప్పాడు?

జ.మృతులలో నుండి ఒకడు లేచి చెప్పినప్పటికీ నమ్మరని అబ్రహాము చెప్పాడు(16:31).


Chapter 17

Translation Questions

Luke 17:3

నీ సహోదరులలో ఎవరైనా నీపట్ల పాపం చేసి "నేను మారుమనసు పొందాను" అని చెప్పినప్పుడు ఏమి చేయాలని యేసు చెప్పాడు?

మనం తప్పక అతణ్ణి క్షమించాలి(17:4).

Luke 17:9

సేవకులముగా మనకు ఆజ్ఞాపించబడిన పని ముగించిన తరువాత యజమానితో ఏమని చెప్పాలి?

మనము, "మేము నిష్ ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసినవే చేసియున్నాము" అని చెప్పాలి(17:10).

Luke 17:11

వారు యేసుతో ఏమని చెప్పారు?

వారు, "యేసు ప్రభువా, మమ్ము కరుణించుము" అని కేకలు వేశారు(17:13).

Luke 17:14

వారిని ఏమి చేయమని యేసు చెప్పాడు?

వారు వెళ్లి యాజకులకు కనపరచుకోవాలని యేసు చెప్పాడు(17:14).

వారు వెళ్ళుచుండగా ఏమి జరిగింది?

వారు వెళ్ళుచుండగా శుద్దులయ్యారు(17:14).

పదిమంది కుష్టరోగులలో యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎంతమంది తిరిగివచ్చారు?

ఒక్కడు మాత్రమే(17:15).

యేసుకు కృతజ్ఞతలు చెల్లించినవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు?

అతడు సమరయ ప్రాంతానికి చెందినవాడు(17:16).

Luke 17:20

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని యేసును అడిగినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని చెప్పాడు(17:21).

Luke 17:22

ఆయన తిరిగి వచ్చే సమయంలో ఆ రోజు ఎలా ఉంటుందని యేసు చెప్పాడు?

ఆకాశము కింద ఒక దిక్కునుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరియొక దిక్కున ఏలాగు ప్రకాశించునో ఆ రోజు అలా ఉంటుందని యేసు చెప్పాడు(17:24).

Luke 17:25

ముందుగా ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ముందుగా ఆయన అనేక హింసను పొంది ఈ తరము వారిచేత ఉపేక్షించబడతాడని చెప్పాడు(17:25).

మనుష్యకుమారుని రోజులు నోవాహు, లోతు రోజులతో ఎలాంటి పోలికలు కలిగి ఉన్నాయి?

అనేకులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను(17:27).

Luke 17:30

లోతు భార్య వలె మనం ఎలా ఉండకూడదు?

మనం ఈ లోక సంపదల కోసం వెనక్కు తిరగాకూడదు. లోతు భార్య అలా చేసి దానిని పోగొట్టుకుంది(17:31-32).

Luke 17:34

"ఎక్కడ ప్రభువా?" అని శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రకృతి నుండి యేసు ఇచ్చిన జవాబు ఏమిటి?

ఎక్కడ పీనుగులు ఉన్నవో అక్కడ గద్దలు పోగవును(17:37).


Chapter 18

Translation Questions

Luke 18:3

పట్టణములోని విధవరాలు న్యాయాధిపతిని ఏమి కోరుతుంది?

ఆమెకు, ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చమని కోరుతుంది(18:3).

కొంతకాలం తరువాత అన్యాయస్తుడైన న్యాయాధిపతి తనలో తాను ఏమనుకున్నాడు?

అతడు, "ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమెకు న్యాయం తీర్చుదును" అనుకున్నాడు(18:5).

Luke 18:6

ఈ కథ నుండి ప్రార్థన గురించి తన శిష్యులకు ఏమి బోధించాలని యేసు కోరుకున్నాడు?

వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునని, వారి విషయమే ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని బోధించాలని కోరుకున్నాడు(18:1,8).

Luke 18:9

యేసు చెప్పిన కథలో ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినది ఎవరు?

ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు(18:10).

Luke 18:11

తన స్వనీతి గురించి, ఇతర ప్రజల గురించి పరిసయ్యుని ఉద్దేశం ఏమిటి?

అతడు ఇతర ప్రజలకంటే నీతిమంతుడనని భావించుకుంటున్నాడు(18:9,11-12).

Luke 18:13

సుంకరి దేవాలయములో ఏమని ప్రార్థిస్తున్నాడు?

సుంకరి "దేవా, పాపినైన నన్ను కరుణించుమని" ప్రార్థించాడు(18:13).

ఇద్దరిలో ఎవరు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి తిరిగి వెళ్ళారు?

దేవుని ఎదుట సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు(18:14).

Luke 18:15

దేవుని రాజ్యము ఎవరికి చెందుతుందని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యము చిన్నబిడ్డలకు చెందినదని యేసు చెప్పాడు(18:16-17).

Luke 18:22

తన చిన్నతనము నుంచి దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉన్న అధికారికి ఏమి చేయమని యేసు చెప్పాడు?

అతనికి ఉన్న ఆస్తినంతా అమ్మి పేదలకు ఇవ్వమని యేసు చెప్పాడు(18:22).

యేసు ఇలా చెప్పినప్పుడు ఆ అధికారి ఏమి చేసాడు?

అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసనపడి అక్కడినుండి వెళ్ళిపోయాడు(18:23).

Luke 18:28

దేవుని రాజ్యము నిమిత్తము ఇహలోక విషయాలు విడిచిపెట్టిన వారికి ఏమి జరుగుతుందని యేసు వాగ్దానం చేసాడు?

వారికి ఇహమందు చాల రెట్లును, పరమందు నిత్యజీవమును పొందుతారని యేసు వాగ్దానం చేశాడు(18:30).

Luke 18:31

యేసు అభిప్రాయం ప్రకారం, మనుష్యకుమారుని గురించి పాత నిబంధన ప్రవక్తలు ఏమి చెప్పారు?

అన్యజనులకు ఆయన అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమానపరచి, కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచును(18:32-33).

Luke 18:38

దారి పక్కన కూర్చుని ఉన్న గుడ్డివాడు యేసును ఏమని పిలిచాడు?

ఆ గుడ్డివాడు, "యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించు" అని కేకలు వేశాడు(18:38-39).

Luke 18:42

గుడ్డివాడు చూపు పొందినప్పుడు ప్రజల స్పందన ఏమిటి?

ప్రజలందరూ దేవుని స్త్రోత్రము చేశారు(18:43).


Chapter 19

Translation Questions

Luke 19:1

యేసును చూసేందుకు చెట్టు ఎక్కినది ఎవరు? అతని వృత్తి, సంఘంలో అతని స్థాయి ఏమిటి?

అతని పేరు జక్కయ్య. అతడు సంపన్నుడు, పన్నులు వసూలుదారుడు(19:2).

Luke 19:5

యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏవిధంగా సణుగుకొన్నారు?

"ఈయన పాపియైన మనుష్యుని ఇంటికి వెళ్లేనని" ప్రజలు సణుగుకొన్నారు(19:7).

Luke 19:8

తన వద్ద ఉన్నదంతా పేదలకు ఇచ్చివేస్తానని జక్కయ్య ప్రకటించినప్పుడు యేసు అతని గురించి ఏమి చెప్పాడు?

యేసు, "నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది" అని చెప్పాడు(19:9).

Luke 19:11

యేసు యెరూషలేము సమీపించినప్పుడు ప్రజలు ఏమి జరుగుతుందని ఆశించారు?

దేవుని రాజ్యము వెంటనే అగపడునని ప్రజలు ఆశించారు(19:11).

యేసు చెప్పిన ఉపమానంలో రాజ కుమారుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు?

అతడు రాజ్యము సంపాదించుకొని మరల రావాలని ప్రయాణం చేస్తున్నాడు(19:12).

Luke 19:18

మీనాలు సక్రమంగా ఉపయోగించిన సేవకులకు ఏమి జరిగింది?

ఆ సేవకులకు రాజకుమారుడు పట్టణాలను అప్పగించాడు(19:17,19).

Luke 19:20

చెడ్డ దాసుడు రాజకుమారుడు ఎలాంటివాడని తలంచాడు?

అతడు రాజకుమారుడు కఠినమైనవాడని తలంచాడు(19:21).

Luke 19:24

చెడ్డదాసుని పట్ల రాజకుమారుడు ఏమి చేశాడు?

రాజకుమారుడు అతని వద్ద ఉన్న మీనాను లాక్కున్నాడు(19:24).

Luke 19:26

తమను ఏలడానికి అంగీకరించని వారిని ఏమి చేయమని రాజకుమారుడు చెప్పాడు?

వారిని సంహరించమని రాజకుమారుడు చెప్పాడు(19:27).

Luke 19:29

యేసు యెరూషలేము ప్రయాణించడానికి ఎలాంటి జంతువు ఎక్కాడు?

దానిమీద ఇంతవరకు ఏ మనుష్యుడూ కూర్చోలేదు(19:30).

Luke 19:37

యేసు ఒలీవల కొండ దిగుచుండగా ప్రజలు ఏమని కేకలు వేశారు?

ప్రజలు, "ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించ బడు గాక" అంటూ కేకలు వేశారు(19:38).

Luke 19:39

ప్రజలు సంతోషంగా కేకలు వేయని పక్షంలో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ప్రజలు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయని యేసు చెప్పాడు(19:40).

Luke 19:41

యేసు పట్టణాన్ని సమీపించినప్పుడు ఏమి చేశాడు?

యేసు పట్టణం విషయమై ఏడ్చాడు(19:41).

Luke 19:43

పట్టణానికి, అందులోని ప్రజలకు ఏమి జరుగుతుందని యేసు చూపాడు?

'నీలో రాతి మీద రాయి నిలిచి యుండనియ్యని దినములు వచ్చునని' యేసు చెప్పాడు(19:44).

Luke 19:47

యేసు బోధిస్తుండగా ఆయనను చంపాలని ఎవరు అనుకున్నారు?

ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల అధికారులు యేసును చంపాలని కోరుకున్నారు(19:47).

వారు ఆయన్ను ఎందుకు చంపలేదు?

ప్రజలు వాక్యము వింటూ, ఆయనను హత్తుకొని ఉండడంవల్ల యేసును చంపలేకపోయారు(19:48).


Chapter 20

Translation Questions

Luke 20:3

యూదుల అధికారులు యేసును ఏ అధికారంతో నువ్వు ఈ విషయాలు బోధిస్తున్నావని అడిగినప్పుడు ఆయన వారిని ఏమని ప్రశ్నించాడు?

యేసు వారిని "యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులచేత కలిగినదా" అని ప్రశ్నించాడు(20:4).

Luke 20:5

"పరలోకము నుండి" అని చెబితే అప్పుడు యేసు ఏమి అంటాడని వారు భావించారు?

యేసు "అలాగైతే మీరందుకు నమ్మలేదు" అని అడుగుతాడని అనుకున్నారు(20:5).

"మనుష్యుల వలన " అని చెబితే అప్పుడు ప్రజలు తమను ఏమి చేస్తారని వారు భావించారు?

ప్రజలు తమను రాళ్ళతో కొడతారని వారు అనుకున్నారు(20:6).

Luke 20:9

యేసు చెప్పిన ఉపమానంలో, పంట కోతకాలంలో పంటలో తన భాగమిమ్మని కాపుల వద్దకు తన దాసుని పంపినపుడు కాపులు ఏమి చేసారు?

వారు ఆ దాసుని కొట్టి వట్టిచేతులతో పంపివేశారు(20:10-12).

Luke 20:13

చివరగా యజమాని పంట కాపుల వద్దకు ఎవరిని పంపించాడు?

యజమాని తన ప్రియమైన కుమారుణ్ణి పంపించాడు(20:13).

Luke 20:15

యజమాని కుమారుడు ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు కాపులు ఏమి చేసారు?

జ.వారు ఆ కుమారుణ్ణి బయటకు నెట్టివేసి కొట్టి చంపారు(20:15).

యజమాని ఆ కాపులను ఏమి చేసాడు?

యజమాని ఆ కాపులను సంహరించి తోటను వేరొకరికి అప్పగించాడు(20:16).

Luke 20:19

యేసు ఈ ఉపమానం వారిని ఉద్దేశించి చెప్పాడు?

శాస్త్రులు, ప్రధాన యజకులను ఉద్దేశించి ఈ ఉపమానం చెప్పాడు(20:19).

Luke 20:25

కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా, కాదా అని వారు అడిగినప్పుడు యేసు ఏమని జవాబిచ్చాడు?

కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించాలని యేసు జవాబిచ్చాడు(20:25).

Luke 20:27

సద్దూకయ్యులు దేనిని నమ్మరు?

సద్దోకయ్యులు మృతుల పునరుత్థానమును నమ్మరు(20:27).

Luke 20:34

ఈ లోకములో పెండ్లి గురించి, పరలోకములో పెండ్లి గురించి ఏమి చెప్పాడు?

ఈ లోకంలోనే పెండ్లి ఉంటుంది గాని, పరలోకంలో పెండ్లి అనేది ఉండదు అని యేసు చెప్పాడు(20:34-35).

Luke 20:37

పాత నిబంధన కథ ద్వారా పునరుత్థానమును గూర్చి ఎవరిని సాదృశ్యముగా చూపించాడు?

యేసు పొదను గురించిన భాగం ఉదాహరిస్తూ, ప్రభువు అబ్రాహము ఇస్సాకు దేవుడని చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను అని చెప్పాడు(20:37).

Luke 20:41

యేసు ప్రస్తానించిన దావీదు కీర్తనలలోని భాగం ఏమిటి?

యేసు "నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడుపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను" అనే భాగం ప్రస్తావించాడు(20:42-43).

Luke 20:45

శాస్త్రులు తమ బాహ్య ప్రవర్తన వెనుక చేసే దుష్ట క్రియలు ఏమిటి?

వారు విధవరాండ్ర ఇళ్ళను ఆక్రమిస్తూ, మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు(20:47).

శాస్త్రులకు ఎలాంటి తీర్పు కలుగుతుందని యేసు చెప్పాడు?

వారు మరి విశేషముగా శిక్ష పొందుతారని యేసు చెప్పాడు(20:47).


Chapter 21

Translation Questions

Luke 21:1

పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసినదని యేసు ఎందుకు చెప్పాడు?

పేద విధవరాలు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినదని యేసు అలాచెప్పాడు(21:4).

Luke 21:5

యెరూషలేములోని దేవాలయముకు ఏమి జరగబోతుందని యేసు చెప్పాడు?

యెరూషలేములోని దేవాలయము రాతి మీద రాయి ఉండకుండ అవి పడద్రోయబడుతుందని యేసు చెప్పాడు(21:6).

Luke 21:7

దేవాలయమును గూర్చి ప్రజలు అడిగిన రెండు ప్రశ్నలు ఏమిటి?

ప్రజలు, "ఇది ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమిటి?" అని అడిగారు(21:7).

మోసపుచ్చువారు వస్తారని యేసు హెచ్చరించాడు. వారు ఎలా మోసపుచ్చుతారు?

వారు, "నేనే ఆయననియు, కాలము సమీపించెనని" చెప్పుదురు(21:8).

Luke 21:10

అంతము సమీపించునప్పుడు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని యేసు చెప్పాడు?

యుద్ధములు, భూకంపములు, కరువులు, తెగుళ్ళు, ఆకాశము నుండి మహా భయోత్పాతములు సంభవిస్తాయని యేసు చెప్పాడు(21:9,11).

Luke 21:12

విశ్వాసులు దేనివలన హింసించబడతారు?

విశ్వాసులకు ఇది సాక్ష్యార్ధమై ఇది సంభవిస్తుంది(21:13).

Luke 21:20

యెరూషలేము త్వరలో పతనం కాబోతున్నది అనడానికి సూచన ఏమిటి?

యెరూషలేము దండుల చేత చుట్టబడుచున్నది కనుక త్వరలో పతనం కాబోతున్నది(21:20).

యెరూషలేము నాశనము సమీపించినప్పుడు ప్రజలు ఏమి చేయవలసి వస్తుందని యేసు చెప్పాడు?

వారు కొండలకు పారిపోవలెను, వారి మధ్యనుండువారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోనివారు దానిలో ప్రవేశించకూడదు(21:21).

యెరూషలేము నాశన దినములను యేసు ఏమని పిలిచాడు?

లేఖనములలో వ్రాయబడిన వన్నియు నేరవేరుటకై అవి ప్రతిదండన దినములు అని పిలిచాడు(21:22).

Luke 21:23

ఎంతకాలము వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది?

అన్య్జజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది(21:24).

Luke 21:25

యేసు మహిమతో, ప్రభావముతో వచ్చునప్పుడు జరుగబోయే సూచనలు జరుగుతాయని చెప్పాడు?

సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, జనములకు శ్రమలు వస్తాయని యేసు చెప్పాడు(21:25).

Luke 21:29

వసంతకాలము సమీపిస్తుందని తెలుసుకోవడానికి యేసు తన మాటలు వింటున్న వారికి ఎలాంటి ఉదాహరణ చెప్పాడు?

అంజూరపు వృక్షము చిగురించుటను గూర్చిన ఉపమానము యేసు చెప్పాడు(21:30).

Luke 21:32

ఏవి గతిస్తాయని యేసు చెప్పాడు?

ఆకాశము, భూమి గతిస్తాయని యేసు చెప్పాడు(21:33).

గతించనిది ఏమిటి?

యేసు మాటలు ఎన్నటికీ గతించవు(21:33).

Luke 21:34

ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చునట్లు రాకుండా ఉండేలా ఎలా ఉండాలని యేసు తన మాటలు వింటున్నవారిని హెచ్చరించాడు?

వారి హృదయము ఒకవేళ తిండివలనను, మత్తువలన, ఐహిక విచారముల వలనను మందముగా ఉంచుకొనకుండా ఉండాలని యేసు హెచ్చరించాడు(21:34).

Luke 21:36

అకస్మాత్తుగా ఆ దినము వచ్చేవరకు ఎలా ఉండాలని యేసు చెప్పాడు?

ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలని యేసు హెచ్చరించాడు(21:36).


Chapter 22

Translation Questions

Luke 22:1

ఆ సమయంలో యూదులు ఆచరించే ఈ పండుగ సమీపించింది?

పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించింది(22:1).

Luke 22:5

యూదులు యేసును ప్రధాన యాజకుల వద్దకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి సమయం కోసం ఎదురుచూస్తున్నారు?

జనసమూహము లేనప్పుడు ఆయనను పట్టుకుని ప్రధాన యాజకులకు అప్పగించాలని ఎదురుచూస్తున్నారు(22:6).

Luke 22:12

యేసు, ఆయన శిష్యులు పస్కా విందు ఎక్కడ ఆచరించారు?

సిద్ధపరచబడిన మేడగదిలో పస్కా విందు ఆచరించారు(22:10-12).

Luke 22:14

యేసు తిరిగి మళ్ళీ ఎప్పుడు పస్కా ఎప్పుడు ఆచరిస్తానని చెప్పాడు?

దేవుని రాజ్యము పరలోకములో నెరవేరిన తరువాత పస్కా ఆచరిస్తానని యేసు చెప్పాడు(22:16).

Luke 22:19

యేసు రొట్టె విరిచి తన శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

యేసు, "ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నీ శరీరము, నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి" అని చెప్పాడు(22:19).

యేసు గిన్నె పట్టుకొని తన శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

యేసు, "ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తమువలననైన క్రొత్త నిబంధన" అని చెప్పాడు(22:20).

Luke 22:21

యేసును అప్పగించేవాడు ఎవరో శిష్యులకు తెలుసా?

తెలియదు(22:23).

యేసు అప్పగించబడడం దేవుని ప్రణాళికలో భాగమా?

అవును(22:22).

Luke 22:26

శిష్యులలో గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

పరిచర్య చేసేవాడే గొప్పవాడని యేసు చెప్పాడు(22:26).

యేసు తన శిష్యుల మధ్య ఎలా జీవించాడు?

వారి మధ్య ఆయన సేవకుడుగా జీవించాడు(22:27).

Luke 22:28

శిష్యులు ఎక్కడ కూర్చుని ఉంటారని యేసు చెప్పాడు?

శిష్యులు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి తీర్పు తీరుస్తారు(22:30).

Luke 22:33

పేతురు తన విషయంలో ఏమి చేస్తాడని యేసు చెప్పాడు?

పేతురు కోడి కూయక మునుపు తనను ఎరుగనని మూడుసార్లు అబద్ధం చెబుతాడని యేసు చెప్పాడు(22:34).

Luke 22:37

ఈ సంఘటనలనుబట్టి యేసును గూర్చిన ఏ ప్రవచనం నెరవేరింది?

"ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను" అని లేఖనములలో వ్రాయబడిన ప్రవచనము నెరవేరింది(22:37).

Luke 22:39

ఒలీవల కొండపై శిష్యులు ఎందుకు ప్రార్థన చేయాలని యేసు చెప్పాడు?

శిష్యులు శోధనలో ప్రవేశించకుండేలా ప్రార్థన చేయాలని చెప్పాడు(22:40).

Luke 22:41

ఒలీవల కొండపై యేసు ఏమని ప్రార్థించాడు?

యేసు "తండ్రీ, ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము. అయినను నీ ఇష్టము కాదు, నీ చిత్తమే సిధ్ధించునుగాక" అని ప్రార్థించాడు(22:42).

Luke 22:45

యేసు ప్రార్థన చేసిన తరువాత కిందికి దిగివచ్చినప్పుడు శిష్యులు ఏమి చేస్తున్నారు?

వారు నిద్రపోతున్నారు(22:45).

Luke 22:47

జనసమూహము ఎదుట యేసుని ఎలా అప్పగించాడు ?

యేసుని ముద్దు పెట్టుకున్నాడు(22:47-48).

Luke 22:49

చెవి తెగి కింద పడిపోయిన వ్యక్తికి యేసు ఏమి చేసాడు?

యేసు అతని చెవిని తాకి స్వస్థపరిచాడు(22:51).

Luke 22:52

యేసు తాను ప్రతిరోజూ ఎక్కడ ఉంటానని చెప్పాడు?

యేసు తాను ప్రతిరోజూ దేవాలయములో ఉంటానని చెప్పాడు(22:53).

Luke 22:54

యేసు బంధించిన తరువాత ఎక్కడికి తీసుకువెళ్ళారు?

వారు యేసును ప్రథాన యాజకుని వద్దకు తీసుకువెళ్ళారు(22:54).

Luke 22:56

పేతురు యేసుతోకూడ ఉన్నాడని ఒక చిన్నది చెప్పినప్పుడు పేతురు ఏమి అన్నాడు?

పేతురు, "అమ్మాయీ, నేనతని ఎరుగను" అన్నాడు(22:57).

Luke 22:59

యేసు ఎవరో తనకు తెలియదని పేతురు మూడవసారి బొంకిన వెంటనే ఏమి జరిగింది?

యేసు ఎవరో తనకు తెలియదని పేతురు మూడవసారి బొంకిన వెంటనే కోడి కూసింది(22:60).

Luke 22:61

యేసు పేతురు వైపు చూసినప్పుడు పేతురు ఏమి చేసాడు?

పేతురు బయటకు వెళ్లి సంతాపపడి ఏడ్చాడు(22:62).

Luke 22:63

యేసును కాపలా కాస్తున్నవారు ఆయనను ఏమి చేశారు?

వారు యేసును అపహసించి, కొట్టి, ముఖం కప్పివేశారు(22:63-65).

Luke 22:66

యేసు గనక క్రీస్తు అయితే తమతో చెప్పమని వారు అడిగినప్పుడు, యేసు వారికి జవాబు చెప్పినప్పటికీ వారు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

వారు నమ్మరని యేసు చెప్పాడు(22:67).

Luke 22:69

యేసుపై నేరారోపణ చేయడానికి వేరే సాక్ష్యం అక్కర లేదని సమాజ పెద్దలు ఎందుకు అన్నారు?

ఎందుకంటే యేసు స్వయంగా తన నోటితో తానే క్రీస్తునని చెప్పాడు(22:71).


Chapter 23

Translation Questions

Luke 23:1

యూదుల పెద్దలు యేసుపై ఎలాంటి నేరారోపణ చేసారు?

యేసు జనములను తిరగాబడేలా ప్రేరేపిస్తున్నాడని, కైసరుకు పన్ను చెల్లించవద్దనీ, తానే క్రీస్తుననీ, రాజుననీ చెప్పుకుంటున్నాడని నేరారోపణ చేశారు(23:2).

Luke 23:3

యేసును ప్రశ్నించిన తరువాత పిలాతు యేసును గూర్చి ఏమని చెప్పాడు?

పిలాతు, "ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు" అని చెప్పాడు(23:4).

Luke 23:8

యేసును చూడాలని హేరోదు ఎందుకు కోరుకున్నాడు?

హేరోదు యేసు ఏదైనా సూచక క్రియ చేసినప్పుడు చూడాలని కోరుకున్నాడు(23:8).

హేరోదు అడిగిన ప్రశ్నకు యేసు ఏమని జవాబిచ్చాడు?

యేసు హీరోదుకు ఎలాంటి జవాబు చెప్పలేదు(23:9).

Luke 23:13

యేసును తిరిగి పిలాతు వద్దకు తీసుకువచ్చినప్పుడు పిలాతు జనసమూహంతో ఏమని చెప్పాడు?

పిలాతు, "మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు" అని చెప్పాడు(23:14).

Luke 23:18

పస్కా కానుకగా ఎవరిని ఖైదు నుంచి విడుదల చేయాలని జనులు కోరుకున్నారు?

జనులు నేరస్తుడైన బరబ్బను విడుదల చేయాలని కోరుకున్నారు(23:18).

Luke 23:20

యేసును ఏమి చెయ్యమని జనులు కేకలు వేశారు?

జనులు యేసును సిలువ వేయమని కేకలు వేశారు(23:21).

మూడవసారి పిలాతు జనసమూహంతో ఏమని చెప్పాడు?

పిలాతు, "ఇతనియందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు" అని చెప్పాడు(23:22).

Luke 23:23

చివరగా పిలాతు ప్రజల కోరికను ఎందుకు మన్నించి యేసును సిలువకు అప్పగించాడు?

ప్రజల ఎడతెగని అల్లరి కారణంగా పిలాతు అలా చేశాడు(23:24).

Luke 23:26

యేసును వెంబడిస్తున్న వారిలో ఎవరు సిలువ మోశారు?

కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి సిలువ మోశాడు(23:26).

Luke 23:27

యెరూషలేము స్త్రీలను చూసి యేసు తన కోసం కాక, మరి ఎవరి కోసం ఏడవమని చెప్పాడు?

ఆ స్త్రీలు యేసు గురించి కాక, తమ కోసం, తమ పిల్లలకోసం ఏడవాలని చెప్పాడు(23:28).

Luke 23:32

యేసుతో పాటు ఇంకా ఎవరిని సిలువ వేసారు?

యేసుతోపాటు మరో ఇద్దరు దొంగలను సిలువ వేశారు(23:32).

Luke 23:33

యేసు సిలువపై ఉండి, తనను సిలువ వేసిన వారిని గూర్చి ఏమని ప్రార్థించాడు?

"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు" అని ప్రార్థించాడు(23:34).

Luke 23:35

అక్కడ ఉన్న ప్రజలు, సైనికులు, సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు యేసు నిజంగా క్రీస్తు అయితే ఏమి చేయాలని సవాలు చేశారు?

వారు యేసును తనను తాను రక్షించుకోవాలని సవాలు చేశారు(23:35,37,39).

Luke 23:36

సిలువపై యేసు తలమీద ఏమి వ్రాయబడింది?

"ఇతడు యూదుల రాజు" అని వ్రాయబడింది(23:38).

Luke 23:42

సిలువ వేయబడిన రెండవ దొంగ యేసును ఏమని కోరుకున్నాడు?

ఆ దొంగ యేసును, "నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో" అని వేడుకున్నాడు(23:42).

రెండవ దొంగకు యేసు ఏమి వాగ్దానం చేసాడు?

యేసు "నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉంటావు" అని వాగ్దానం చేశాడు(23:43).

Luke 23:44

యేసు మరణించిన తరువాత జరిగిన అద్భుతాలు ఏమిటి?

అప్పుడు దేశమంతా చీకటి కమ్మింది, దేవాలయపు తెర మధ్యకు చిరిగింది(23:44-45).

Luke 23:46

యేసు మరణించిన తరువాత శతాధిపతి ఏమని అన్నాడు?

అతడు, "ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు" అన్నాడు(23:47).

Luke 23:52

యేసు మరణించిన తరువాత అరిమతియి యోసేపు ఏమి చేశాడు?

పిలాతు అనుమతితో యేసు దేహాన్ని సమాధి చేశాడు(23:52-53).

Luke 23:54

యేసు దేహాన్ని పాతిపెట్టిన సమయం ఏమిటి?

ఆ సమయం విశ్రాంతి దినం ఆరంభం(23:54).

యేసుతో ఉన్న స్త్రీలు విశ్రాంతి దినమున ఏమి చేశారు?

వారు ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకున్నారు(23:56).


Chapter 24

Translation Questions

Luke 24:1

యేసు సమాధి వద్దకు స్త్రీలు ఎప్పుడు వెళ్ళారు?

ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు(24:1).

ఆ స్త్రీలు సమాధి వద్ద ఏమి చూశారు?

సమాధి రాయి దొర్లింపబడి ఉండడం, యేసు అక్కడ లేకపోవదం వారు కనుగొన్నారు(24:2-3).

Luke 24:6

ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన ఇద్దరు మనుషులు (దేవదూతలు) యేసుకు ఏమి జరిగిందని చెప్పారు?

వారు యేసు తిరిగి లేచాడని చెప్పారు(24:6)_.

Luke 24:11

సమాధి వద్ద తమకు ఎదురైన అనుభవం వివరించినప్పుడు అపాస్తలులు ఎలా స్పందించారు?

వెర్రి మాటలుగా అనిపించడం వాళ్ళు ఆ మాటలు నమ్మలేదు(24:11).

సమాధిలోకి చూసినప్పుడు పేతురుకు ఏమి కనబడింది?

సమాధిలో నారబట్టలు మాత్రమే పేతురుకి కనబడ్డాయి(24:12).

Luke 24:15

ఎమ్మాయి మార్గంలో యేసుతో కలసి నడుస్తున్న శిష్యులు ఆయనను ఎందువల్ల గుర్తుపట్టలేకపోయారు?

యేసును గుర్తుపట్టలేకుండా వారి కళ్ళు మూయబడ్డాయి(24:16).

Luke 24:21

యేసు సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనపై ఎలాంటి నిరీక్షణ కలిగిఉన్నారు?

ఆయన ఇశ్రాయేలీయులను శత్రువుల నుండి విడిపిస్తాడని వారు నిరీక్షించారు(24:21).

Luke 24:25

యేసు లేఖనాలనుండి రాయబడిన ఏ విషయాన్ని ఆ ఇద్దరు వ్యక్తులతో చెప్పాడు?

లేఖనాలలో తన గురించి రాయబడిన విషయాలను చెప్పాడు(24:27).

Luke 24:30

వారు యేసును గుర్తుపట్టినప్పుడు ఏమి జరిగింది?

ఆయన వారికి అదృశ్యుడయ్యాడు(24:31).

Luke 24:36

యేసు యెరూషలేములో శిష్యులకు మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఏమి చెప్పాడు?

అయన వారితో, "మీకు సమాధానమవునుగాక" అని చెప్పాడు(24:36).

Luke 24:38

యేసు తాను ఆత్మను కానని ఎలా రుజువు చేసుకున్నాడు?

ఆయన తన చేతులు, పాదములు చూసి, అయనను పట్టుకుని పరిశీలించమన్నాడు. వారితో కలిసి కాల్చిన చేప ముక్కలు తిన్నాడు(24:39-43).

Luke 24:41

యేసు తాను ఆత్మను కానని ఎలా రుజువు చేసుకున్నాడు?

ఆయన తన చేతులు, పాదములు చూసి, అయనను పట్టుకుని పరిశీలించమన్నాడు. వారితో కలిసి కాల్చిన చేప ముక్కలు తిన్నాడు(24:39-43).

Luke 24:45

శిష్యులు లేఖనాలను గ్రహించడం ఎప్పుడు మొదలుపెట్టారు?

యేసు వారి మనసులు తెరిచినందువల్ల శిష్యులు లేఖనాలను గ్రహించడం మొదలుపెట్టారు(24:45).

సర్వలోకానికి ఎలాంటి సువార్త బోధించాలని యేసు చెప్పాడు?

సర్వలోకమునకు మారుమనసు, పాపక్షమాపణ ప్రకటింపబదాలని యేసు శిష్యులకు చెప్పాడు(24:47).

Luke 24:48

శిష్యులు దేని కొరకు వేఛి ఉండాలి?

శిష్యులు పైనుండి శక్తి పొందేవరకు పట్టణంలో నిలిచి ఉండాలి(24:49).

Luke 24:50

బేతనియలో యేసు శిష్యులను ఆశీర్వదించిన తరువాత ఏమి జరిగింది?

ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు(24:51).

Luke 24:52

తరువాత శిష్యులు ఎక్కడ ఉండి కాలం గడిపారు? అక్కడ వారు ఏమి చేసారు?

వారు ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్త్రోత్రము చేయుచుండిరి(24:53).


Chapter 1

Translation Questions

John 1:1

ఆదియందు ఏమి ఉంది?

ఆదియందు వాక్కు ఉన్నాడు. (1:1)

వాక్కు ఎవరి వద్ద ఉన్నాడు ?

వాక్కు దేవుని వద్ద ఉన్నాడు. (1:1-2)

వాక్కు ఏమై ఉన్నాడు?

వాక్కు దేవుడై ఉన్నాడు.

వాక్కు లేకుండా ఏమైనా కలిగాయా?

సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదీ ఆయన లేకుండ కలుగలేదు. (1:3)

John 1:4

వాక్కులో ఏమి ఉంది?

ఆయనలో జీవమున్నది. (1:4)

John 1:6

దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుని పేరు ఏమిటి?

అతని పేరు యోహాను. (1:6)

ఏమి చెయ్యడానికి యోహాను వచ్చాడు?

అతని మూలముగా అందరు విశ్వసించునట్లుగా అతడు అ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షి గా వచ్చెను. (1:7)

John 1:10

యోహాను సాక్ష్యమిచ్చుటకు వచ్చిన వెలుగును లోకము తెలుసుకొన్నదా లేక స్వీకరించినదా?

యోహాను సాక్ష్యమిచ్చుటకు వచ్చిన వెలుగును లోకము తెలుసుకొనలేదు, ఆ వెలుగు స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. (1:10-11)

John 1:12

తన నామమందు విశ్వసించిన వారిని ఆ వెలుగు ఏమి చేసింది?

తనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (1:12)

ఆయన నామములో విశ్వసించిన వారు దేవుని పిల్లలు ఎలా అయ్యారు?

దేవుని మూలమున పుట్టినవారు కావడం ద్వారా వారు దేవుని పిల్లలు అయ్యారు. (1:13)

John 1:14

తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్కును పోలిన ఇతర వ్యక్తి ఎవరైనా ఉన్నారా?

లేదు! తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్కు ఒకే ఒక విశిష్ట మైన వ్యక్తి. (1:14)

John 1:16

యోహాను సాక్ష్యమిచ్చిన ఈ వ్యక్తి పరిపూర్ణత లోనుండి మనము ఏమి పొందాము?

ఆయన పరిపూర్ణత లోనుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. (1:16)

యేసు క్రీస్తు ద్వారా ఏమి వచ్చింది?

యేసు క్రీస్తు ద్వారా కృపయు, సత్యమును కలిగెను. (1:17)

ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూసాడా?

ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. (1:18)

తండ్రిని మనకు బయలు పరచినది ఎవరు?

తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలు పరచెను. (1:18)

John 1:22

తాను ఎవరని అడుగుటకు యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, లేవీయులకు యోహాను ఏమి చెప్పాడు?

యెషయా ప్రవక్త చెప్పినట్టు "ప్రభువు త్రోవను సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము" అని యోహాను తన గురించి చెప్పుకొన్నాడు. (1:19-23)

John 1:29

యేసు తన వద్దకు రావడం యోహాను చూసినపుడు యోహాను ఏమి అన్నాడు?

"ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల" అని అన్నాడు. (1:29)

ఎందుకు యోహాను నీళ్ళతో బాప్తిస్మమివ్వడానికి వచ్చాడు?

దేవుని గొర్రెపిల్లయైన యేసు లోక పాపములు తీసివేయడానికి, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష్యమవడానికి, యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చాడు. (1:31)

John 1:32

యేసు దేవుని కుమారుడని బయలు పరచబడడానికి యోహానుకు ఇవ్వబడినన గురుతు ఏది?

ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు అను గురుతు యోహానుకు ఇవ్వబడింది. (1:32-34)

John 1:37

యోహాను యేసు ను "ఇదిగో దేవుని గొర్రెపిల్ల" అని పిలిచినప్పుడు యోహాను ఇద్దరు శిష్యులు ఏమి చేసారు?

వారు యేసును వెంబడించారు. (1:35-37)

John 1:40

యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకని పేరు ఏంటి?

ఆ ఇద్దరిలో ఒకని పేరు అంద్రెయ. (1:40)

అంద్రెయ తన సహోదరుడైన సీమోనుకు యేసును గురించి ఏమి చెప్పాడు?

"మేము మెస్సీయాను కనుగొంటిమి" అని సీమోను కు చెప్పాడు. (141)

సీమోను ఏమని పిలువబడతాడని యేసు చెప్పాడు?

సీమోను "కేఫా" (దాని అర్ధము "పేతురు") అని పిలువబడతాడని యేసు చెప్పాడు (1:42)

John 1:43

పేతురు, అంద్రెయల పట్టణము ఏది?

పేతురు, అంద్రెయల పట్టణము బేత్సయిదా. (1:42)

John 1:49

నతనయేలు యేసును గురించి ఏమి అన్నాడు?

"బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు" అని నతనయేలు అన్నాడు. (1:49)

నతనయేలు ఏమి చూస్తాడు అని యేసు అన్నాడు ?

ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని నతనయేలు తో చెప్పాడు. (1:51)


Chapter 2

Translation Questions

John 2:1

గలిలయ లోని కానా లోని వివాహములో ఎవరు ఉన్నారు ?

గలిలయ లోని కానా లోని వివాహములో యేసు, ఆయన తల్లి, ఆయన శిష్యులు ఉన్నారు. (2:1,11)

John 2:3

యేసు తల్లి "వారికి ద్రాక్షా రసము లేదు" అని ఎందుకు చెప్పింది ?

ఆ పరిస్థితి లో యేసు ఏదైనా చేస్తాడని ఆమె ఎదురు చూచి యేసుకు చెప్పింది. (2:5)

John 2:6

ఏ రెండు పనులు చెయ్యమని యేసు సేవకులతో చెప్పాడు ?

నీటి బానలను నీళ్ళతో నింపమని మొదట చెప్పాడు. తరువాత కొంచెము "నీరు" తీసుకొని విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. (2:7-8)

John 2:9

ద్రాక్ష రసముగా మారిన నీటిని రుచి చూసిన తరువాత ఆ విందు ప్రధాని ఏమన్నాడు ?

"ప్రతివాడును మొదట మంచి ద్రాక్షా రసము పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షా రసము ఉంచుకొని ఉన్నావు" అని విందు ప్రధాని అన్నాడు. (2:10)

John 2:11

ఈ అద్భుతమైన కార్యమును చూసిన శిష్యుల స్పందన ఏమిటి ?

ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాస ముంచిరి. (2:11)

John 2:13

యేసు యెరూషలేములోని దేవాలయము లోనికి వెళ్ళినపుడు ఏమి చూసాడు ?

రూకలు మార్చు వారిని, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని చూసాడు. (2:14)

John 2:15

అమ్మువారిని, రూకలు మార్చువారిని యేసు ఏమి చేసాడు ?

ఆయన త్రాళ్ళతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు జల్లివేసి, వారి బల్లలు పడద్రోసాడు. (2:15)

పావురములను అమ్మువారితో యేసు ఏమి చెప్పాడు ?

పావురములను అమ్మువారితో యేసు "వీటిని ఇక్కడ నుండి తీసికోనిపొండి, నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి" అని చెప్పాడు.(2:16)

John 2:17

దేవాలయము లో యేసు చేయుచున్న కార్యములను చూసి యూదుల అధికారులు ఎలా స్పందించారు ?

"నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను చూపుదువు" అని అడిగారు. (2:18)

యూదుల అధికారులకు యేసు ఎలా జవాబిచ్చాడు ?

"ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును" అని వారికి సమాధాన మిచ్చాడు. (2:19)

John 2:20

ఏ దేవాలయమును గురించి యేసు మాట్లాడుతున్నాడు ?

ఆయన తన సరీరమను దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు. (2:21)

John 2:23

అనేకులు ఎందుకు యేసు నామము నందు విశ్వాసముంచిరి ?

అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. (2:23)

ఎందుకు యేసు తనను తాను ఇతరుల వశము చేసుకోలేదు ?

యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను తాను వారి వశము చేసుకోలేదు, మనుష్యుని ఆంతర్యమును గూర్చి ఎవరూ ఆయనకు చెప్పనవసరం లేదు. (2:24-25)


Chapter 3

Translation Questions

John 3:1

నికోదేము ఎవరు ?

నికోదేము పరిసయ్యుడు, యూదుల అధికారి. (3:1)

యేసును గురించి నికోదేము ఏమని సాక్ష్యమిస్తున్నాడు ?

"బోధకుడా, నీవు దేవునినుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుడుము, దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడు" అని నికోదేము యేసు తో అన్నాడు. (3:2)

John 3:3

ఎలాంటి ప్రశ్నలు యేసును అడగడం ద్వారా నికోదేము ఆశ్చర్య పడి, గందరగోళ పరచ బడ్డాడు అని మనకు కనపడుతుంది ?

"ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింప గలదు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింప గలడా?, ఈ సంగాతులేలాగు సాధ్యమగును?" అని నికోదేము యేసును ప్రశ్నించాడు. (3:4,9)

John 3:9

యేసు నికోదేమును ఏ విధంగా గద్దించాడు ?

"నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? అని నికోదేమును గద్దించాడు, "భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు నమ్ముదురు?" అని మరలా గద్దించాడు. (3:10-12)

John 3:12

పరలోకమునకు ఎక్కి పోయిన వాడు ఎవరు ?

పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేదు. (3:13)

John 3:14

మనుష్య కుమారుడు ఎందుకు హెచ్చించ బడాలి?

విశ్వసించు ప్రతీవాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. (3:114-15)

John 3:16

దేవుడు తాను లోకమును ప్రేమించాడని ఏ విధంగా చూపించాడు ?

ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన తన జనితైక కుమారుని ఈ లోకానికి ఇవ్వడం ద్వారా తన ప్రేమను కనుపరిచాడు. (3:16)

లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడా?

లేదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు దేవుడాయనను పంపెను. (3:17)

John 3:19

మనుష్యులు ఎందుకు తీర్పులోనికి తేబడ్డారు ?

వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు చీకటినే ప్రేమించారు గనుక వారు తీర్పులోనికి తేబడ్డారు. (3:19)

దుష్కార్యములు చేయువారు ఎందుకు వెలుగు నొద్దకు రారు ?

దుష్కార్యములు చేయు ప్రతీవాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండేలా వెలుగు నొద్దకు రారు. (3:20)

సత్య వర్తనులు ఎందుకు వెలుగు నొద్దకు వస్తారు ?

సత్య వర్తనులు తమ క్రియలు దేవునిమూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష్య పరచబడునట్లు వెలుగు నొద్దకు వస్తారు. (3:21)

John 3:29

యేసు బాప్తిస్మమిచ్చు చున్నాడని, ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని యోహాను శిష్యులు యోహానుతో చెప్పినపుడు యోహాను ఏమన్నాడు ?

"ఆయన హెచ్చవలసి యున్నది, నేను తగ్గవలసి యున్నది" అని అన్నాడు. (3:26,30)


Chapter 4

Translation Questions

John 4:1

యేసు ఎప్పుడు యూదయ విడిచి గలిలయకు వెళ్ళాడు ?

యోహాను కంటే యేసు ఎక్కువమంది శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిమమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ఆయనకు తెలిసినప్పుడు యేసు యూదయ విడిచి గలిలయకు వెళ్ళాడు (4:1-3)

John 4:4

గలిలయకు వెళ్ళుచున్న మార్గములో ఆయన ఎక్కడ ఆగాడు ?

సమరయ లోని సుఖారను ఊరిలో యాకోబు బావి వద్ద ఆగాడు. (4:5-6)

John 4:6

యేసు అక్కడ ఉన్నప్పుడు యాకోబు బావి వద్దకు ఎవరు వచ్చారు ?

ఒక సమరయ స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. (4:7)

యేసు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?

ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. (4:8)

సమరయ స్త్రీతో యేసు మొదట ఏమన్నాడు ?

"నాకు దాహమునకిమ్మని" సమరయ స్త్రీని యేసు అడిగాడు. (4:7)

John 4:9

యేసు ఆమెతో మాట్లాడుటను బట్టి ఆమె ఎందుకు ఆశ్చర్య పడింది ?

యూదులు సమరయులతో సాంగత్యము చేయని కారణంగా ఆమె ఆశ్చర్య పడింది. (4:9)

సంభాషణను దేవుని వైపు మరల్చుటకు యేసు ఏమన్నాడు ?

దేవుని వరమును, తనకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవరో అదియు ఆమె ఎరిగియుంటే ఆమె ఆయనను అడుగును, ఆయన ఆమెకు జీవజలమిస్తాడని చెప్పాడు. (4:10)

John 4:11

యేసు మాటలలోని ఆత్మీయ స్వభావాన్ని అర్ధం చేసుకోలేదనే దానిని తెలియపరచే ఏ మాట ఆమె చెప్పింది ?

"అయ్యా ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును" అని జవాబిచ్చింది. (4:11)

John 4:15

తానిచ్చు జలమును గురించి యేసు ఆ స్త్రీ తో ఏమి చెప్పాడు ?

తానిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడని, ఆయన వాని కిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని యేసు ఆ స్త్రీ తో చెప్పాడు. (4:14)

యేసు ఇస్తున్న జలమును ఇప్పుడు ఈ స్త్రీ ఎందుకు కోరుకుంటుంది ?

ఆమె దప్పిగొనకుండునట్లు, చేదుకొనడానికి బావి వద్దకు రాకుండునట్లు ఆ నీళ్ళు దయ చేయుమని అడుగుతుంది. (4:15)

యేసు తన సంభాషణను మార్చుతున్నాడు. ఆ స్త్రీతో ఏమి చెప్పాడు ?

"నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము" అని ఆ స్త్రీతో చెప్పాడు. (4:16)

John 4:17

తన భర్త ను పిలుచుకొని రమ్మని చెప్పినపుడు ఆ స్త్రీ ఏ జవాబు చెప్పింది ?

తనకు పెనిమిటి లేడని ఆ స్త్రీ చెప్పింది. (4:17)

యేసు ప్రవక్త అని ఆమె నమ్మునట్లు యేసు చెప్పిన మాట ఏమిటి ?

ఆమెకు ఐదుగురు పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడున్న వాడు ఆమె పెనిమిటి కాదు అని ఆయన చెప్పాడు. (4:18-19)

John 4:19

యేసు ప్రవక్త అని నమ్మేలా చేసిన యేసు మాట ఏమిటి ?

ఆమెకు ఐదుగురు పెనిమిటులున్నారు, ఇప్పుడున్నవాడు ఆమె పెనిమిటి కాదు అని ఆమెతో చెప్పాడు. (4:18-19)

ఆరాధన గురించి ఎలాంటి వివాద పూరితమైన వాదాన్ని ఆమె యేసు వద్దకు తీసుకొని వచ్చింది ?

సరైన ఆరాధనా స్థలం ఎక్కడ అనే వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొని వచ్చింది. (4:20)

John 4:23

తండ్రి వెదకుచున్న ఆరాధకుల గురించి యేసు ఆమెతో ఏమి చెప్పాడు ?

దేవుడు ఆత్మ, నిజమైన ఆరాధకులు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని చెప్పాడు. (4:23-24)

John 4:25

మెస్సీయ వచ్చినపుడు వారికి సమస్తమును తెలియజేయునని ఆమె చెప్పినపుడు యేసు ఏమి చెప్పాడు ?

ఆమెతో మాట్లాడుచున్న తానే మెస్సీయనని యేసు చెప్పాడు. (4:25-26)

John 4:28

యేసు సంభాషణ పూర్తి అయిన తరువాత ఆ స్త్రీ ఏమి చేసింది ?

ఆ స్త్రీ తన కుండ విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో "మీరు వచ్చి నేను చేసినవన్నియూ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాదా" అని చెప్పింది. (4:28-29)

ఆ స్త్రీ చెప్పిన వార్తను విని ఆ ఊరి ప్రజలు ఏమి చేసారు ?

వారు తమ పట్టణమును విడిచి యేసు నొద్దకు వచ్చారు. (4:30)

John 4:34

తన ఆహారము ఏది అని యేసు చెప్పాడు ?

తనను పంపిన వాని చిత్తము నేరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయును తనకు ఆహారమై ఉన్నదని యేసు చెప్పాడు. (4:34)

పంట కోయుటలోని ప్రయోజనమేమి ?

విత్తువాడును, కోయువాడును కూడా సంతోషించు నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్ధమైన ఫలము సమకూర్చుకొనును. (4:36)

John 4:39

ఆ పట్టణములోని సమరయులనేకులు యేసు నందు విశ్వాసముంచుటకు రెండు కారణాలు ఏమిటి ?

ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి, యేసు మాటలు వినినందున ఇంకనూ అనేకులు విశ్వసించారు. (4:39,41)

John 4:41

యేసును గురించి ఆ సమరయులలో అనేకులు ఏమి నమ్మారు ?

ఆయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్మారు. (4:42)

John 4:43

యేసు గలిలయకు వచ్చినపుడు గలిలయులు ఎందుకు ఆయనను అంగీకరించారు ?

యెరూషలేములో పండగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నియూ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినపుడు వారు ఆయనను చేర్చుకొనిరి. (4:45)

John 4:46

యేసు యూదయను విడిచి గలిలయకు తిరిగి వచ్చినపుడు యేసునొద్దకు ఎవరు వచ్చారు, అతడు కోరినదేమిటి ?

ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను. అయన వచ్చి తన కుమారుణ్ణి స్వస్థ పరచవలేనని అతడు ఆయనను వేడుకొనెను. (4:46-47)

John 4:48

సూచక క్రియలు, మహాత్కార్యముల గురించి యేసు ఆ ప్రధానికి ఏమి చెప్పాడు ?

సూచక క్రియలు, మహాత్కార్యములు చూడకుంటే వారెంత మాత్రము నమ్మరని యేసు చెప్పాడు. (4:48)

యేసు ఆ ప్రధానితో వెళ్లక "నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి యున్నాడని" చెప్పినపుడు ఆ ప్రధాని ఏమి చేసాడు ?

ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. (4:50)

John 4:53

తన కుమారుడు బ్రతికి యున్నాడని తండ్రికి చెప్పిన తరువాత, "నీ కుమారుడు బ్రతికియున్నాడు" అని యేసు చెప్పిన కిందటి రోజు అదే గడియలో జ్వరము వానిని వదిలిపోయినదని తెలుసుకున్న తరువాత కలిగిన ఫలితమేమిటి ?

ప్రధాని యు అతని ఇంటివారుందరునూ యేసును నమ్మిరి. (4:53)


Chapter 5

Translation Questions

John 5:1

యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర అయిదు మంటపములు ఉన్న కోనేరు పేరు ఏమిటి ?

కోనేరు పేరు బేతస్థ (5:2)

బేతస్థ వద్ద ఉన్న దెవరు ?

ఆ మంటపము లో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచచేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. (5:3-4)

John 5:5

బేతస్థ వద్ద "స్వస్థపడ గోరుచున్నావా?" అని యేసు ఎవరిని అడిగాడు?

ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గలవాడై అక్కడ పడియుండుట చూచి, వాడప్పటికి బహు కాలమునుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి "స్వస్థపడ గోరుచున్నావా?" అని అడిగాడు. (5:6-7)

John 5:7

"స్వస్థపడ గోరుచున్నావా?" అని యేసు అడిగిన ప్రశ్నకు వ్యాధి గలవాని స్పందన ఏమిటి ?

ఆ రోగి "అయ్యా, నీళ్ళు కదిలించబడి నప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నా కంటే ముందుగా దిగునని" యేసుతో చెప్పాడు. (5:7)

John 5:9

యేసు "నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని" వానితో చెప్పగా అతనికి ఏమి జరిగింది?

వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. (5:8-9)

John 5:10

ఆ రోగి తన పరుపెత్తుకొని నడవడం యూదా నాయకులను ఎందుకు ఇబ్బంది పెట్టింది ?

విశ్రాంతి దినమందు అతను తన పరుపెత్తుకొన తగదే అని వారు ఇబ్బంది పడ్డారు. (5:9-10)

John 5:14

దేవాలయములో తాను స్వస్థ పరచిన వానిని యేసు చూసినపుడు ఏమని చెప్పాడు ?

"ఇదిగో స్వస్థత నొందితివి , మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము" అని అతనితో చెప్పాడు. (5:14)

పాపము చేయకుమని స్వస్థపడినవానితో యేసు చెప్పిన తరువాత వాడు ఏమి చేసాడు ?

వాడి వెళ్లి, తనను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియ చెప్పాడు. (5:15)

John 5:16

ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసిన కారణముగా యూదులు ఆయనను హింసించినందున యేసు ఎలా స్పందించాడు ?

"నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను" అని యేసు వారితో చెప్పాడు. (5:17)

యేసు చెప్పిన మాట ఎందుకు వారిని ఆయనను చంపేలా చేసింది ?

యేసు విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక (వారి ఆలోచన ప్రకారము), దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తనను దేవునితో సమానునిగా చేసికొనెను. (5:18)

John 5:19

యేసు ఏమి చేసాడు ?

తండ్రి ఏది చేయుట ఆయన చూచెనో దానినే చేసాడు. (5:19)

John 5:21

యూదుల నాయకులు ఆశ్చర్య పడునట్లు ఏ గొప్ప కార్యములను తండ్రి తన కుమారునికి చూపుతున్నాడు ?

తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. (5:20-21)

తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఎందుకు ఇచ్చాడు ?

తండ్రిని ఘనపర్చునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఇచ్చాడు. (5:22-23)

కుమారుని ఘనపరచని యెడల ఏమి జరుగుతుంది ?

కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. (5:23)

John 5:24

నీవు ఆయన మాట విని ఆయనను పంపినవానియందు విశ్వాసముంచిన యెడల ఏమి జరుగుతుంది ?

ఆ విధంగా విశ్వాసముంచిన యెడల నీకు నిత్య జీవముంటుంది, నీవు తీర్పు లోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నావు. (5:24)

John 5:26

సమాధుల్లో ఉన్న వారు తండ్రి స్వరం విన్నప్పుడు ఏమి జరుగుతుంది ?

కుమారుడు తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. (5:26)

John 5:28

సమాధులలో ఉన్న వారందరూ తండ్రి స్వరము వినినపుడు ఏమి జరుగుతుంది ?

సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు. (5:28-29)

John 5:30

ఎందుకు యేసు యొక్క తీర్పులు యథార్థమైనవి ?

ఆయన తన ఇష్టప్రకారము గాక, తండ్రి చిత్త ప్రకారం చెయ్య డానికే చూస్తాడు గనుక ఆయన తీర్పులు యథార్థమైనవి. (5:30)

John 5:36

మనుష్యుల నుండి కాక ఏ రెండు విషయాలు యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నాయి ?

నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను ఆయనకు ఇచ్చియున్నాడో ఆ క్రియలు యేసు దేవుని కుమారుడని సాక్ష్యమిస్తున్నాయి, అంతే కాకుండా ఆయనను పంపిన తండ్రియే ఆయనను గురించి సాక్ష్యమిస్తున్నాడు. (5:34-37)

ఏ కాలమందైనను ఆయన స్వరము వినని వారు, ఆయన స్వరూపమును చూడని వారు ఎవరు ?

యూదుల నాయకులు ఏ కాలమందైనను ఆయన స్వరము విననలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. (5:37)

John 5:39

యూదుల నాయకులు ఎందుకు లేఖనములను పరిశోధించుచున్నారు ?

లేఖనముల యందు వారికి నిత్య జీవమున్నదని తలంచుచు వారు లేఖనములను పరిశోధించుచున్నారు. (5:39)

లేఖనములు ఎవరి గురించి సాక్ష్యమిచ్చుచున్నవి ?

లేఖనములు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్నవి(5:39)

John 5:43

యూదుల నాయకులు ఎవరి మెప్పును కోరడం లేదు ?

యూదుల నాయకులు అద్వితీయ దేవుని మెప్పును కోరడం లేదు. (5:44)

John 5:45

యూదుల నాయకుల మీద తండ్రి యెదుట నేరము మోపువారు ఎవరు ?

మోషే యూదుల నాయకుల మీద తండ్రి యెదుట నేరము మోపును. (5:45)

యూదుల నాయకులు మోషే ను నమ్మిన యెడల ఏమి చేస్తారని యేసు చెపుతున్నాడు ?

యూదుల నాయకులు మోషే ను నమ్మిన యెడల వారు తనను నమ్ముదురు, ఎందుకంటే మోషే తన గురించి రాసాడు అని యేసు చెపుతున్నాడు (5:46-47)


Chapter 6

Translation Questions

John 6:1

గలిలయ సముద్రమునకు మరొక పేరేమిటి ?

గలిలయ సముద్రము తిబెరయ సముద్రము అని కూడా పిలుస్తారు. (6:1)

గొప్ప జనసమూహం ఎందుకు యేసుని వెంబడిస్తుంది ?

రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి. (6:2)

John 6:4

యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండి కన్నులెత్తి ఏమి చూసాడు ?

బహు జనులు తన యొద్దకు వచ్చుట అయన చూసాడు. (6:4-5)

"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" అని యేసు ఫిలిప్పును ఎందుకు అడిగాడు ?

ఫిలిప్పును పరీక్షించుటకు యేసు అతనిని అడిగాడు. (6:5-6)

John 6:7

"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" అని యేసు అడిగిన ప్రశ్నకు ఫిలిప్పు జవాబు ఏమిటి ?

"వారిలో ప్రతీవాడును కొంచెము కొంచెము పుచ్చుకోనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవు" అని ఫిలిప్పు చెప్పాడు. (6:7)

"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" అని యేసు అడిగిన ప్రశ్నకు అంద్రెయ జవాబు ఏమిటి ?

"ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యెద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఏమాత్రము" అని చెప్పాడు. (6:8-9).

John 6:10

ఎంతమంది పురుషులు అక్కడ ఉన్నారు ?

దాదాపు ఐదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. (6:10)

రొట్టెలు, చేపలతో యేసు ఏమి చేసాడు ?

యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, ఆలాగుననే చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. (6:11)

జనులు ఎంత వరకు భుజించిరి ?

వారు తమకిష్టమైనంత వరకు భుజించిరి. (6:11)

John 6:13

వారు భుజించిన తరువాత వారియొద్ద ఎంత ఆహారం మిగిలింది ?

వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగు చేసి పండ్రెండు గంపలు నింపిరి. (6:13)

మరల యేసు ఒంటరిగా కొండకు ఎందుకు వెళ్ళాడు ?

ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను (ఐదువేలమందికి ఆహారం పెట్టడం) చూచి రాజుగా చేయుటకు వారు తనను బలవంతంగా పట్టుకొనబోవుచున్నారని యేసు తెలుసుకొని అక్కడనుండి వెళ్ళిపోయాడు. (6:14-15)

John 6:16

శిష్యులు దోనె లోనికి ఎక్కి కపెర్నహోమునకు పోవుచున్నప్పుడు వాతావరణములో కలిగిన మార్పు ఏమిటి ?

అప్పుడు పెద్ద గాలి విసరగా, సముద్రము పొంగడం ఆరంభించింది. (6:18)

John 6:19

ఎందుకు శిష్యులు భయపడటం మొదలుపెట్టారు ?

యేసు సముద్రము మీద నడచుచు తమ దోనే దగ్గరకు వచ్చుట చూచి వారు భయపడిరి. (6:19)

యేసును దోనె మీద ఎక్కించు కొనుటకు శిష్యులు ఇష్టపడినపుడు యేసు వారితో ఏమన్నాడు ?

"నేనే, భయపడకుడి" అని వారితో చెప్పాడు. (6:20)

John 6:26

ఏ కారణము కొరకు జనులు తనను వెదకుచున్నారని యేసు చెప్పాడు ?

వారు సూచనలను చూచుట వలననే కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొండుటవలననే ఆయనను వెదకుచున్నారని యేసు చెప్పాడు. 61:26)

జనులు దేనికొరకు పనిచెయ్యాలి, దేని కొరకు పని చెయ్య కూడదు అని యేసు చెప్పాడు ?

క్షయమైన దానికొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని యేసు చెప్పాడు. (6:27)

John 6:28

దేవుని క్రియను జనులకు యేసు ఏ విధంగా నిర్వచించాడు ?

"ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ" అని జనులతో యేసు చెప్పాడు. (6:29)

John 6:32

జనసమూహము తమ పితరులకు అనుగ్రహింపబడిన పరలోకపు మన్నాను గురించిన సూచక క్రియను గురించి అడుగుతున్నప్పుడు యేసు ఏ ఆహారము గురించి మాట్లాడాడు ?

లోకమునకు నిత్య జీవమునిచ్చు దేవుని నుండి పంపబడిన నిజమైన జీవాహారము గురించి యేసు మాట్లాడుతున్నాడు. తరువాత తానే జీవాహారమని చెపుతున్నాడు. (6:30-35)

John 6:35

యేసు నొద్దకు ఎవరు వస్తారు ?

తండ్రి యేసుకు అనుగ్రహించువారందరూ ఆయన వద్దకు వస్తారు. (6:37)

John 6:38

యేసును పంపిన వాని చిత్తమేమిటి ?

తండ్రి యేసుకు అనుగ్రహించిన దాని యంతటిలో ఆయనేమియూ పోగోట్టుకొనక, తండ్రి ఆయనకు ఇచ్చిన వారందరికీ అయన నిత్య జీవం ఇవ్వాలనీ, అంత్య దినమున వారిని లేపుతాడని అయన చిత్తం. (6:39-40)

John 6:43

ఒక వ్యక్తి యేసు నొద్దకు ఎలా రాగలడు ?

జ తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడును యేసు నొద్దకు రాలేదు. (6:44)

John 6:46

ఎవరు తండ్రిని చూసారు ?

దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండ లేదు. (6:46)

John 6:50

లోకమునకు జీవము కొరకు యేసు ఇచ్చు ఆహారమేది ?

యేసు ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆయన శరీరమే . (6:51)

John 6:52

మీలో మీరు జీవము గలవారు కావలెనంటే ఏమి చెయ్యాలి ?

మీరు జీవము గలవారు కావలెనంటే మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగవలెను. (6:53)

John 6:54

యేసు మనలో ఎలా నిలిచి యుంటాడు, మనం ఆయనలో ఎలా నిలిచి యుంటాము ?

మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన యెడల ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి యుంటాము. (6:56)

John 6:57

ఎందుకు యేసు జీవించి యున్నాడు ?

తండ్రి మూలముగా యేసు జీవిస్తూ ఉన్నాడు.(6:57)

John 6:64

ఎవరైనా యేసు నొద్దకు ఎలా రాగలరు ?

తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును యేసు నొద్దకు రాలేడు. (6:44)

John 6:66

"మీరు కూడా వెల్లిపోవలెనని యున్నారా ?" అని యేసు పన్నెండు మందిని అడిగినప్పుడు ఎవరు జవాబిచ్చారు? ఏమని చెప్పాడు ?

సీమోను పేతురు యేసుకు జవాబిచ్చాడు. "ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్దుడవని మేము విశ్వసించి ఎరిగియున్నాము" అని చెప్పాడు. (6:67-69)

John 6:70

పన్నెండు మందిలో ఒకడు సాతాను అని ఎవరి గురించి యేసు చెప్పాడు ?

సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడై యుండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. (6:70-71)


Chapter 7

Translation Questions

John 7:1

యూదయలో సంచరించడానికి యేసు ఎందుకు ఇష్టపడలేదు ?

యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించడానికి ఇష్టపడలేదు. (7:1)

John 7:3

ఎందుకు యేసు సహోదరులు ఆయనను పర్ణశాలల పండుగకు యూదయకు వెళ్ళమని చెప్పారు ?

ఆయన చేయుచున్న క్రియలు ఆయన శిష్యులు చూచునట్లు ఆ స్థలము విడిచి యూదయకు వెళ్ళమని అడిగారు. (7:2-4)

John 7:5

పండుగకు వెళ్ళకుండా ఉండటానికి యేసు ఇచ్చిన జవాబు ఏమిటి ?

ఆయన సమయమింకను రాలేదు, ఆయన సమయము పరిపూర్ణము కాలేదు అని తన సహోదరులకు చెప్పాడు. (7:6,8)

లోకము యేసును ఎందుకు ద్వేషిస్తున్నది ?

లోకము క్రియలు చెడ్డవని యేసు సాక్ష్యమిచ్చినందున లోకము ఆయనను ద్వేషించుచున్నది. (7:7)

John 7:10

పండుగకు యేసు ఎలా, ఎప్పుడు వెళ్ళాడు ?

ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్ళాడు. (7:10)

John 7:12

జనసమూహములోని ప్రజలు యేసును గురించి ఏమన్నారు ?

""కొందరు ఆయనను మంచి వాడనిరి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చు వాడనిరి. (7:12)

ఎందుకు ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటాడలేదు ?

యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. (7:13)

John 7:14

యేసు ఎప్పుడు దేవాలయములోనికి వెళ్లి బోధింప నారంభించెను ?

సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధింప నారంభించెను. (7:14)

John 7:17

యేసు చేసిన బోధ దేవుని వలన కలిగినదో, తనంతట తాను చేస్తున్నాడో ఎలా తెలుసుకుంటారని యేసు చెప్పాడు ?

ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయుంచుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, తనంతట తాను చేస్తున్నాడో తెలుసుకుంటారని యేసు చెప్పాడు. (7:17)

తనను పంపిన వాని మహిమను వెదకు వాని గురించి యేసు ఏమి చెప్పాడు ?

ఆ మనుష్యుడు సత్య వర్తనుడు, అతనిలో ఏ దుర్నీతియు లేదు అని చెప్పాడు. (7:18)

John 7:19

యేసు అభిప్రాయం ప్రకారం ధర్మశాస్త్రమును గైకొనువాడు ఎవరు ?

యేసు అభిప్రాయం ప్రకారం ధర్మశాస్త్రమును గైకొనువాడు ఎవడునూ లేదు. (7:19)

John 7:23

విశ్రాంతి దినమున స్వస్థత చెయ్యడం గురించి యేసు వాదన ఏమిటి ?

"మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు విశ్రాంతి దినమున మీరు సున్నతి చేస్తారు, నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందున మీరు నా మీద ఆగ్రహపడుచున్నారు" అని యేసు వాదన చేస్తున్నాడు. (7:22-23)

తీర్పు ఏ విధంగా చెయ్యాలని యేసు చెపుతున్నాడు ?

వేలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చాలని యేసు చెప్పాడు. (7:24)

John 7:25

యేసే క్రీస్తు అని విశ్వసించక పోవడానికి మనుష్యులు ఇచ్చిన కారణం ఏమిటి ?

యేసు ఎక్కడివాడో యెరుగుదుము, క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును యెరగడని మనుష్యులు చెప్పుకొనిరి. (7:27)

John 7:30

యేసును పట్టుకోడానికి అధికారులను ఎవరు పంపారు ?

ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును పట్టుకోడానికి అధికారులను పంపారు.(7:32)

John 7:35

"ఇంకా కొంత కాలము నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉండునో అక్కడికి మీరు రాలేరు" అని యేసు అనిన మాటలను యూదులు అర్ధం చేసుకున్నారా ?

వారి సంభాషణలను బట్టి వారు యేసు మాటలను అర్ధం చేసుకోలేదని తెలుస్తున్నది. (7:35-36)

John 7:39

"ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొన వలెను. నాయందు విశ్వాససముంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారును" అని దేనిని ఉద్దేశించి యేసు ఈ మాట చెప్పాడు ?

తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. (7:39)

John 7:45

"ఎందుకు మీరాయనను తీసికొని రాలేదు" అని ప్రధాన యాజకులు, పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు అధికారులు ఏమి జవాబు ఇచ్చారు ?

"ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవరుడును ఎన్నడును మాటలాడలేదు" అని అన్నారు. (7:45)

John 7:50

యేసును పట్టుకొనుటకు వెళ్ళిన అధికారులతో పరిసయ్యులు "మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని, పరిసయ్యులలో గాని యెవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచారా?" అని అడిగినప్పుడు నికోదేము వారితో ఎలా సమాధానమిచ్చాడు ?

"ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును మన ధర్మశాస్త్రము తీర్పు తీర్చునా?"అని వారిని అడిగాడు. (7:50-51)


Chapter 8

Translation Questions

John 8:1

యేసు దేవాలయములో బోధించుచుండగా శాస్త్రులు, పరిసయ్యులు ఏమి చేసారు ?

వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి యేసు ఏమంటాడో అని ఆయనను అడిగారు. (8:2-3)

John 8:4

శాస్త్రులు, పరిసయ్యులు నిజముగా ఎందుకు ఈ స్త్రీని యేసు నొద్దకు తీసుకొని వచ్చ్చారు ?

ఆయన మీద నేరము మోప వలెనని ఆయనను శోధించడానికి ఆ స్త్రీను యేసునొద్దకు తీసుకొని వచ్చారు. (8:6)

John 8:7

వ్యభిచారములో పట్టబడిన స్త్రీని గురించి మాటి మాటికి అడుగుతున్నపుడు యేసు శాస్త్రులు, పరిసయ్యులతో ఏమి చెప్పాడు ?

"మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును" అని శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్పాడు. (8:7)

John 8:9

పాపములో పట్టబడిన ఆ స్త్రీ మీద మొదట రాయి వెయ్యండని యేసు చెప్పినపుడు ఆ ప్రజలు ఏమి చేసారు ?

వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళారు. (8:9)

వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఏమి చెయ్యమని యేసు చెప్పాడు ?

వెళ్లి ఇక పాపము చేయ వద్దని యేసు చెప్పాడు. (8:11)

John 8:12

"నేను లోకమునకు వెలుగును, నన్నువెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును" అని యేసు చెప్పిన తరువాత పరిసయ్యులు మోపిన నేరమేమిటి ?

యేసు తనను గూర్చి తానే సాక్ష్యము చెప్పుకొనుచున్నాడు, ఆయన సాక్ష్యము సత్యము కాదని నేరము మోపారు.(8:13)

John 8:17

తన సాక్ష్యము సత్యము అని యేసు ఏ విధముగా చెప్పుకున్నాడు ?

వారి ధర్మ శాస్త్రములో ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని రాయబడి ఉన్నదని చెప్పాడు. తానును, తనను పంపిన తండ్రియు ఇద్దరు సాక్ష్యమిస్తున్నట్లు చెప్పాడు. (8:17-18)

John 8:23

దేనిని ఆధారం చేసుకొని పరిసయ్యులు చనిపోతారని పరిసయ్యుల గురించి యేసు మాట్లాడాడు ?

వారు క్రిందివారు అని, తాను పైనుండు వాడు అని ఎరిగి వారిని గురించిన ఆయన జ్ఞానమును బట్టి ఆయన మాటను ఆధారం చేసుకున్నాడు. (8:23-24)

పరిసయ్యులు తమ పాపముల నుండి ఏవిధంగా తప్పించుకోగలరు ?

నేను ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములలోనే చనిపోవుదురని యేసు వారితో చెప్పాడు. (8:24)

John 8:25

ఏ సంగతులను యేసు లోకానికి చెప్పాడు ?

తండ్రి యొద్ద వినిన సంగతులనే ఆయన లోకానికి చెప్పాడు. (8:26-27)

John 8:28

యేసును పంపిన తండ్రి ఆయనను ఒంటరిగా విడిచి పెట్టక యేసుతోనే ఎందుకు ఉన్నాడు ?

తండ్రి కిష్టమైన కార్యములను ఎల్లప్పుడు చేయుచున్నందున తండ్రి యేసును ఒంటరిగా విడిచి పెట్టక తోడుగా ఉన్నాడు. (8:29)

John 8:31

తనను నమ్మిన యూదులు నిజముగా ఆయన శిష్యులని ఏవిధంగా తెలుసు కుంటారని యేసు చెప్పాడు ?

వారు తన వాక్యమందు నిలిచినవారైతే నిజముగా ఆయన శిష్యులుగా ఉంటారని యేసు చెప్పాడు. (8:31)

"...సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును" అని యేసు చెప్పినపుడు నమ్మిన యూదులు ఏమని తలంచారు ?

దాసులుగా ఉండడము, బందీలుగా ఉండడము గురించి యూదులు తలంచారు. (8:33)

John 8:34

"...సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును" అని యేసు చెప్పినపుడు ఆయన దేనిని ఉదాహరిస్తున్నాడు ?

పాపము నుండి దాసులుగా ఉండుట నుండి స్వతంత్రులగుట గురించి ఆయన మాట్లాడుతున్నాడు.(8:34)

John 8:37

యేసును చంపుటకు యూదులు వెదకుచున్నారను దానికి కారణం యేసు ఏమి చెప్పాడు ?

వారిలో ఆయన వాక్యమునకు చోటు లేని కారణంగా వారు ఆయనను చంపుటకు చూచుచున్నారు. (8:37)

John 8:39

వారు ఆబ్రాహాము పిల్లలు కాదు అని యేసు ఎందుకు చెప్పాడు ?

వారు అబ్రాహాము పిల్లలు కాదు ఎందుకంటే వారు అబ్రాహాము చేసిన క్రియలు చెయ్యక యేసును చంప చూచుచున్నారు. (8:39-40)

John 8:42

దేవుడొక్కడే మాకు తండ్రి అని యూదులు చెప్పినపుడు దానిని యేసు ఏవిధంగా ఖండించాడు ?

"దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చి యుండ లేదు, ఆయన నన్ను పంపెను" అని యేసు వారితో చెప్పాడు. (8:42)

ఈ యూదులకు తండ్రి ఎవరు అని యేసు చెప్పాడు ?

వారి తండ్రి అపవాది అని యేసు చెప్పాడు. (8:44)

అపవాది గురించి యేసు ఏమి చెప్పాడు ?

అపవాది ఆదినుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును బట్టియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యేసు అపవాది గురించి చెప్పాడు. (8:44)

John 8:45

ఎవరు దేవుని మాట వినును ?

దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వినును. (8:47)

John 8:50

యేసు మాట గైకొనిన యెడల ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు.

యేసు మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడు. (8:51)

John 8:52

ఎన్నడు మరణము పొందడు అనే యేసు మాట దయ్యము పట్టినవాని మాటలా ఉందని యూదులు ఎందుకు అనుకొన్నారు ?

శరీరము యొక్క భౌతిక మరణము గురించి వారు తలంచారు, అబ్రాహాము, ప్రవక్తలును చనిపోయారు (వారి భౌతిక శరీరములు). (8:52-53)

John 8:57

అబ్రాహాము ఇంకను జీవించి ఉన్నాడు, యేసు అబ్రాహాము కంటే గొప్పవాడు అని చెపుతున్న యేసు మాట ఏది ?

"మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను" అని యేసు చెప్పాడు. "అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు చెప్పాడు. (8:56-58)


Chapter 9

Translation Questions

John 9:1

ఆ మనుష్యుడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అనే దానికి శిష్యులు చేసిన తలంపు ఏమిటి ?

వాడు గుడ్డివాడుగా పుట్టుటకు కారణము వాడు పాపము చేసి ఉండటం గాని వాని కన్నవారు పాపము చేసి ఉండటం గాని అయి ఉండవచ్చు అని శిష్యులు ముందుగా నిర్ధారించారు. (9:2)

John 9:3

వాడు గ్రుడ్డివాడుగా పుట్టడానికి కారణము ఏమిటని యేసు చెప్పాడు ?

దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్ష్య పరచబడుటకే వాడు గ్రుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్పాడు. (9:3)

John 9:6

ఆ గ్రుడ్డి వానికి యేసు ఏమి చేసాడు? అతనితో ఏమి చెప్పాడు ?

యేసు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని" యేసు చెప్పాడు. (9:6-7)

సిలోయము కోనేటిలో ఆ గ్రుడ్డివాడు కడుగుకొనిన తరువాత ఏమి జరిగింది ?

చూపు గలవాడయ్యాడు. (9:7)

John 9:8

అక్కడ కూర్చుండి భిక్ష మెత్తుకొనిన వాడు అతనా కాదా అనే వాదం వచ్చినపుడు అ మనుష్యుడు ఏమి సాక్ష్యమిచ్చాడు ?

అతడు ఆ వ్యక్తిని తానే అని సాక్ష్యమిచ్చాడు. (9:9)

John 9:13

ఇంతకు ముందు గ్రుడ్డివాడుగా ఉండి భిక్షమెత్తుకొనిన వానిని ప్రజలు ఏమి చేసారు ?

వారు ఆ మనుష్యుని పరిసయ్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. (9:13)

అ స్వస్థత ఎప్పుడు చోటు చేసుకుంది ?

గుడ్డి వానికి స్వస్థత విశ్రాంతి దినమందు జరిగింది. (9:14)

ఇంతకు ముందు గ్రుడ్డివాడుగా ఉన్నవానికి పరిసయ్యులు ఏమని అడిగారు ?

నీవు చూపు ఏ విధంగా పొందావు అని ప్రశ్నించారు. (9:15)

John 9:16

పరిసయ్యుల మధ్య కలిగిన బేధము ఏమిటి ?

కొందరు పరిసయ్యులు యేసు విశ్రాంతి దినము ఆచరించుట లేదు (విశ్రాంతి దినమున స్వస్థ పరచాడు) గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాదు అని అన్నారు, మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలు ఎలాగు చెయ్యగలడు అన్నారు. (9:16)

ఇంతకు ముందు గుడ్డివాడిని యేసు గురించి అడిగినపుడు వాడు ఏమి చెప్పాడు ?

"యేసు ఒక ప్రవక్త" అని ఇంతకు ముందు గుడ్డివాడు యేసును గురించి చెప్పాడు. (9:17)

చూపు పొందిన వ్యక్తి యొక్క తలిదండ్రులను యూదులు ఎందుకు పిలిచారు ?

వాడు గ్రుడ్డివాడై యుండి చూపు పొందెనని యూదులు నమ్మలేదు గనుక వారు అతని తలిదండ్రులను పిలిపించారు. (9:18-19)

John 9:19

వారి కుమారుని గురించి అతని తలిదండ్రులు ఏమి చేసారు ?

ఆ మనుష్యుడు నిజముగా వారి కుమారుడే అని అతడు పుట్టు గ్రుడ్డివాడుగా పుట్టాడని చెప్పారు. (9:20)

ఆ మనుష్యుని తలిదండ్రులు వారికి ఏమి తెలియదని చెపుతున్నారు ?

ఇప్పుడు వాడు ఏలాగున చూచుచున్నాడో వారికి తెలియదు, ఎవడు వాని కన్నులు తెరిచినో అదియును తెలియదని చెప్పారు. (9:21)

John 9:22

"వీడు వయస్సు వచ్చిన వాడు, వీనినే అడుగుడి" అని ఆ మనుష్యుని తలిదండ్రులు ఎందుకు అన్నారు ?

వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పారు, ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజమందిరములోనుంది వెలివేతురని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. (9:22)

John 9:24

గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని పరిసయ్యులు రెండవ మారు ఎందుకు పిలిచారు ?

"దేవుని మహిమ పరచుము, ఈ మనుష్యుడు పాపి యని మేమెరుగుదుము" అని చెప్పారు. (9:24)

యేసు ఒక పాపి అని పరిసయ్యులు అనిన మాటకు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని స్పందన ఏమిటి ?

"ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుద్దివాడనై యుండి ఇప్పుడు చూచుచున్నాను" అని జవాబిచ్చాడు. (9:25)

John 9:26

గ్రుడ్డివాడై యుండిన మనుష్యుని పరిసయ్యులు ఎందుకు దూషించారు ?

"ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినక పోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరునూ ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి" అని వారిని అడిగినందుకు పరిసయ్యులు అతనిని దూషించారు.(9:26-28)

John 9:32

పరిసయ్యులు గ్రుడ్డివాడై యుండిన మనుష్యుని దూషించినపుడు వాడు ఇచ్చిన బదులు ఏమిటి ?

"ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగక పోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకించడని యెరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాని కన్నులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమియూ చేయ నేరడు" అని వారికి బదులిచ్చాడు. (9:30-33)

గ్రుడ్డివాడైన మనుష్యుని జవాబుకు పరిసయ్యుల స్పందన ఎలా ఉంది ?

నీవు కేవలం పాపివై పుట్టినావు, నీవు మాకు బోధింప వచ్చితివా అని అతనితో అన్నారు. తరువాత అతనిని సమాజమందిరము లోనుండి వెలివేసారు. (9:34)

John 9:35

గ్రుడ్డి వాడైన మనుష్యుని పరిసయ్యులు వేలివేసారని యేసు వినినప్పుడు యేసు ఏమి చేసాడు ?

అతనిని వెదకుచూ వెళ్లి అతనిని కను గొనెను. (9:35)

గ్రుడ్డి వాడైన మనుష్యుని కనుగొనిన తరువాత యేసు అతనితో ఏమి మాట్లాడాడు ?

నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నవా అని గ్రుడ్డి వాడైన మనుష్యుని యేసు అడిగాడు. (9:35-36)

యేసు దేవుని కుమారుడనే సమాచారానికి గ్రుడ్డి వాడైన మనుష్యుడు ఏవిధంగా స్పందించాడు ?

గ్రుడ్డి వాడైన మనుష్యుడు విశ్వసించుచున్నానని చెప్పాడు, యేసు ను ఆరాధించాడు. (9:38)

John 9:39

పరిసయ్యుల పాపములను గురించి యేసు ఏమి చెప్పాడు ?

"మీరు గ్రుడ్డి వారైతే మీకు పాపము లేకపోవును, గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి యున్నది" అని యేసు వారితో చెప్పాడు. (9:41)


Chapter 10

Translation Questions

John 10:1

యేసు చెప్పిన దాని ప్రకారం దొంగ, దోచుకొనువాడు ఎవరు ?

గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు, దోచుకొనువాడునై యున్నాడు. (10:1)

ద్వారమున ప్రవేశించు వాడు ఎవరు ?

ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి. (10:2)

John 10:3

కాపరి పిలిచినప్పుడు ఎందుకు గొర్రెలు అతనిని వెంబడిస్తాయి ?

గొర్రెలకు అతని స్వరము తెలుసు గనుక అవి అతనిని వెంబడించును. (10:3-4)

John 10:5

గొర్రెలు అన్యుని వెంబడిస్తాయా ?

లేదు. గొర్రెలు అన్యుని వెంబడించవు. (10:5)

John 10:7

యేసుకు ముందు వచ్చినవారందరూ ఎలాంటి వారు ?

యేసుకు ముందు వచ్చినవారందరూ దొంగలును దోచుకొనువారునై యున్నారు. (10:7)

John 10:9

నేనే ద్వారమును అని యేసు చెప్పాడు, ఈ ద్వారము నుండి ప్రవేశించు వారికి ఏమి జరుగుతుంది ?

ద్వారమైన యేసు ద్వారా ప్రవేశించు వారు రక్షించబడుదురు, వారు లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేతను కనుగొంటారు. (10:9)

John 10:11

మంచి కాపరియైన యేసు ఏమి చెయ్యడానికి ఇష్టపడుతున్నాడు ? తన గొర్రెలకు ఏమి చేసాడు ?

మంచి కాపరియైన యేసు తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన గొర్రెలకు తన ప్రాణాన్ని అర్పించాడు. (10:11,15)

John 10:14

యేసుకు వేరే గొర్రెల గుంపు ఉందా ? ఉంటే వాటికేమి జరుగుతుంది ?

ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఆయనకు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని రావాలని యేసు చెప్పాడు. అవి ఆయన స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. (10:16)

John 10:17

ఎందుకు తండ్రి యేసును ప్రేమించుచున్నాడు ?

యేసు మరల తీసుకొనునట్లు ఆయన తన ప్రాణమును పెట్టుచున్నాడు, ఇందు వలన తండ్రి ఆయనను ప్రేమించుచున్నాడు. (10:17)

ఎవరైనా యేసు ప్రాణమును తీసుకొనగలరా ?

లేదు. ఆయన అంతట ఆయనే తన ప్రాణమును పెట్టుచున్నాడు. (10:18)

తన ప్రాణమును పెట్టుటకును, దానిని తీసుకోనుటకును ఎక్కడినుండి అధికారము పొందాడు ?

తన తండ్రి వలన యేసు ఈ ఆజ్ఞ పొందాడు. (10:18)

John 10:19

యేసు మాటలను బట్టి యూదులు ఏమన్నారు ?

అనేకులు "వాడు దయ్యము పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి, మరికొందరు - ఇది దయ్యము పట్టినవాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలడా" అనిరి.(10:19-21)

John 10:22

దేవాలయములోని సోలోమోను మంటపము వద్ద యేసును యూదులు చుట్టుముట్టినపుడు యూదులు యేసుతో ఏమన్నారు ?

"ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పస్టముగా చెప్పు" అన్నారు. (10:24)

John 10:25

సోలోమోను మంటపము వద్ద యూదులకు యేసు ఎలా జవాబిచ్చాడు ?

అయన వారితో తాను (క్రీస్తునని) ఇంతకు ముందే చెప్పానని యూదులతో చెప్పాడు. వారు ఆయన గొర్రెలలో చేరినవారు కారు కనుక వారు నమ్మరని వారితో చెప్పాడు. (10:25-26)

John 10:27

యేసు తన గొర్రెలపట్ల తన శ్రద్ధ, కాపుదల గురించి ఏమి చెప్పాడు ?

తన గొర్రెలకు నిత్యజీవాన్ని ఇస్తాడని యేసు చెప్పాడు, అవి ఎప్పటికిని నశింపవు , ఎవడునూ వాటిని ఆయన చేతిలోనుండి అపహరింపడు. (10:28)

John 10:29

గొర్రెలను యేసుకు ఇచ్చినదెవరు ?

గొర్రెలను యేసుకు ఇచ్చినది తండ్రి (10:29)

తండ్రి కంటే గొప్పవాడున్నాడా ?

తండ్రి అందరికంటే గొప్పవాడు. (10:29)

John 10:32

"నేనునూ నా తండ్రియును ఏకమై యున్నామని " యేసు చెప్పినపుడు ఎందుకు యూదులు ఆయనను కొట్టవలెనని రాళ్ళు ఎత్తారు ?

యేసు దేవదూషణ చేయుచున్నాడు, తనను తాను దేవునితో సమానునిగా చేసుకొనుచున్నాడని యూదులు నమ్మారు. (10:30-33)

John 10:34

దేవదూషణకు వ్యతిరేకముగా యేసు తన ప్రతివాడికి ఇచ్చిన సమాధానమేది ?

"మీరు దైవ సమానులని నేనంటినని మీ ధర్మ శాస్త్రములో వ్రాయబడి యుండ లేదా ? లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యమెవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తనను ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా ?" అని తనని తాను సమర్ధించు కొన్నాడు. (10:34-36)

John 10:37

తనను నమ్మడానికి తీర్మానించుకోవడం కోసం యూదులు ఏమి చెయ్యాలని యేసు వారితో చెప్పాడు ?

తన క్రియలను చూడుడని యూదులతో యేసు చెప్పాడు, ఆయన తండ్రి క్రియలు చేయని యెడల తనను నమ్మకుడి అని చెప్పాడు, చేసిన యెడల తనను నమ్ముడని వారితో చెప్పాడు. (10:37-38)

యేసు చేసిన క్రియలను యూదులు గ్రహించి తెలిసికొన గల్గునట్లు యేసు ఏమి చెప్పాడు ?

తండ్రి యేసునందును, యేసు తండ్రి యందును ఉన్నారని వారు గ్రహించి తెలిసికొన గల్గునట్లు యేసు చేసిన క్రియలను నమ్ముడని చెప్పాడు. (10:38)

తండ్రి యేసునందును, యేసు తండ్రి యందును ఉన్నారను మాటకు యూదుల స్పందన ఏమిటి ?

వారు మరల ఆయనను పట్టుకొన చూసారు. (10:39)

John 10:40

ఈ సంఘటన జరిగిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు ?

యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన యొర్దాను అద్దరిని ఉన్న స్థలమునకు వెళ్ళాడు. (10:40)

యేసు వద్దకు వచ్చిన అనేకులు ఏమి చేసారు, ఏమి అన్నారు ?

అనేకులు ఆయన వద్దకు వచ్చి "యోహాను ఏ సూచక క్రియను చేయ లేదు గాని యీయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన"వనిరి, అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. (10:41-42)


Chapter 11

Translation Questions

John 11:1

లాజరు ఎవరు ?

లాజరు బేతనియ అనే గ్రామానికి చెందిన వాడు. మరియ, మార్త అతని సహోదరీలు. ఈ మరియ ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియయే. (11:1-2)

John 11:3

లాజరు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు లాజరు, అతని వ్యాదిధిని గురించి యేసు ఏమన్నాడు ?

"యీ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది" అని చెప్పాడు. (11:4)

John 11:5

లాజరు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు ఏమి చేసాడు ?

యేసు తానున్న చోటనే ఇంక రెండు దినములు నిలిచెను. (11:6)

John 11:8

"మనము యూదయకు తిరిగి వెళ్ళుదుము" అని తన శిష్యులతో అని నప్పుడు శిష్యులు ఏమన్నారు ?

"బోధకుడా యిప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా?" అని యేసును అడిగారు. (11:8)

పగటివేళ నడవడం, రాత్రివేళ నడవడం గురించి యేసు ఏమి చెపుతున్నాడు ?

ఒకడు పగటివేళ నడచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక వాడు తొట్రు పడడు, అయితే రాత్రివేళ ఒకడు నడచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడును అని యేసు చెప్పాడు. (11:9-10)

John 11:12

మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని యేసు తన శిష్యులతో చెప్పినపుడు వారు ఏమని తలంచారు ?

వారు లాజరు నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొని "ప్రభువా అతడు నిద్రించిన యెడల బాగుపడు"ననిరి.(11:11-12)

లాజరు నిద్రించెను అని చెప్పడములో యేసు ఉద్దేశమేమిటి ?

లాజరు నిద్రించెను అని చెప్పడములో యేసు లాజరు మరణము గురించి మాటలాడెను. (11:13)

John 11:15

లజరు చనిపోయినప్పుడు అక్కడ లేనందుకు యేసు ఎందుకు సంతోషిస్తున్నాడు ?

"లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండ లేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను" అని యేసు అన్నాడు. (11:15)

యేసుతో యూదయకు వెళ్ళినపుడు ఏమి జరగబోతున్నదని తోమాా ఆలోచించాడు ?

తామంతా చనిపోతామని తోమాా తలంచాడు. (11:16)

John 11:17

యేసు వచ్చే నాటికి లాజరు సమాధిలో ఎన్నిరోజుల నుండి ఉన్నాడు ?

నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడు.(11:17)

యేసు వచ్చుచున్నాడని మార్త వినినప్పుడు ఏమి చేసింది ?

యేసు వచ్చుచున్నాడని మార్త వినినపుడు ఆయనను ఎదుర్కొనడానికి బయటకు వెళ్ళింది. (11:20)

John 11:21

యేసు కొరకు దేవుడు ఏమి చేస్తాడని మార్త తలంచినది ?

"ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించును" అని మార్త యేసుతో అన్నది. (11:22)

John 11:24

"నీ సహోదరుడు మరల లేచును" అని యేసు మార్త తో అనినపుడు మార్త యొక్క స్పందన ఏమిటి ?

"అంత్య దినమున పునరుత్థానమున లేచునని ఎరుగుదునని" యేసు తో మార్త చెప్పింది. (11:24)

తన యందు విశ్వసించు వారికి ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు ?

ఆయన యందు విశ్వసించు వారు చనిపోయినను బ్రతుకును. బ్రతికి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు అని యేసు చెప్పాడు. (11:25-26)

John 11:27

యేసు ఎవరని మార్త సాక్ష్యం చెప్పింది ?

"అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని యేసు తో చెప్పింది. (11:27)

John 11:30

మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమెతో ఉన్న యూదులు ఆమె ఏమి చేయడానికి వెళ్ళుచున్నదని తలంచారు ?

ఆమెతో ఉన్న యూదులు ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లారు. (11:31)

మరియ ఎక్కడికి వెళ్ళుచున్నది ?

మరియ యేసును కలుసుకొనుటకు వెళ్ళుచున్నది. (11:29,32)

John 11:33

యేసు కలవరపడి ఆత్మలో మూలుగునట్లు చేసినది ఏది?

మరియ ఏడ్చుటయు ఆమెతో కూడివచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడు. (11:33-35)

John 11:36

యేసు కన్నీళ్లు విడవడం చూసి యూదులు ఏమనుకొన్నారు ?

యేసు లాజరును ఎలాగు ప్రేమించేనో చూడుడి అని యూదులు అనుకొన్నారు(11:36)

John 11:38

లాజరు ఉంచిన సమాధి రాయిని తొలగించమని యేసు ఆజ్ఞాపించినపుడు మార్త చెప్పిన అభ్యంతరమేమిటి ?

"ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని" ఆయనతో చెప్పింది. (11:39)

లాజరు ఉంచిన సమాధి రాయిని తొలగించమని యేసు ఆజ్ఞాపించినపుడు మార్త చెప్పిన అభ్యంతరమునకు యేసు ఇచ్చిన జవాబు ఏమిటి ?

"నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?" అని మార్తతో అన్నాడు. (11:40)

John 11:41

సమాధి నుండి రాయి తీసివేయబడిన వెంటనే యేసు ఏమి చేసాడు ?

యేసు కన్నులెత్తి బిగ్గరగా తండ్రికి ప్రార్ధన చేసాడు. (11:41)

ఎందుకు యేసు తాను చేయుచున్న ప్రార్ధన బిగ్గరగా చేసాడు ?

తన చుట్టూ ఉన్న ప్రజల నిమిత్తము, తండ్రి తనను పంపెనని వారు నమ్మునట్లును యేసు బిగ్గరగా ప్రార్ధన చేసాడు. (11:42)

John 11:43

"లాజరూ, బయటకు రమ్ము" అని బిగ్గరగా అరచినప్పుడు ఏమి జరిగింది ?

చనిపోయిన వాడు ప్రేతవస్త్రములతో కట్టబడి, బయటకు వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. (11:44)

John 11:45

సమాధి నుండి లాజరు బయటకు రావడాన్ని చూసిన యూదుల స్పందన ఏమిటి ?

ఆయన చేసిన కార్యమును చూచినా యూదులలో అనేకులు ఆయనలో విశ్వాసముంచిరి, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. (11:45-46)

John 11:49

ప్రధాన యాజకులు, పరిసయ్యుల సభలో కయిఫా చేసిన ప్రవచనము ఏమిటి ?

మన జనమంతయు నశింపకుండు నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనుడని వారితో చెప్పాడు. (11:50-51)

John 11:51

ఆ దినమునుండి అ సభ చేసిన ప్రణాళిక ఏమిటి ?

వారు ఆయనను చంపనాలోచించు చుండిరి. (11:53)

John 11:54

లజరును లేపిన తరువాత యేసు ఏమి చేసాడు ?

యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరించక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశాములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. (11:54)

John 11:56

ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏ ఆజ్ఞను జారీ చేసారు ?

ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియ జేయవలెనని ఆజ్ఞాపించారు. (11:57)


Chapter 12

Translation Questions

John 12:1

యేసు ఎప్పుడు బెతనియకు వచ్చాడు ?

బెతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. (12:1)

యేసు కొరకు ఏర్పాటు చెయ్యబడిన విందు లో మరియ ఏమి చేసింది ?

మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసికొని యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను.(12:3)

John 12:4

ఆ అత్తరు మూడువందల దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చని యేసు శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఎందుకన్నాడు ?

అతను చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయి యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. (12:4-6)

John 12:9

బేతనియ లో గొప్ప జనసమూహము ఎందుకు కూడి వచ్చినది ?

జనులు యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడ వచ్చిరి. (12:9)

ప్రధాన యాజకులు లాజరును ఎందుకు చంపాలని చూసారు ?

లాజరును బట్టి యూదులనేకులు తమ వారిని విడిచి యేసు నందు విస్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును చంపాలని చూసారు. (12:10,11)

John 12:12

పండుగ నాడు యేసు వచ్చున్నాడని విని జనసమూహము ఏమి చేసారు ?

ఖజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొన బోయి "జయము, ప్రభువు పెరట వచ్చు చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింప బడును గాక" అని బిగ్గరగా కేకలు వేసారు. (12:13)

John 12:14

మొదట గ్రహింప లేక యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడినవనియు, వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకము చేసుకున్న అంశాలు ఏవి?

"సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్ల మీద ఆసీనుడై వచ్చు చున్నాడు" అని ఆయన గురించి వ్రాయ బడిన అంశములను జ్ఞాపకము చేసుకున్నారు. (12:13-16)

John 12:17

ఎందుకు జనసమూహము పండుగలో యేసును కలుసుకోడానికి ఎదురు వెళ్ళారు?

ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. (12:17-18)

John 12:23

గ్రీకులు కొందరు ఆయనను చూడడానికి వచ్చారు అని అంద్రెయ, ఫిలిప్పు యేసుతో చెప్పినపుడు యేసు మొదట ఏమి చెప్పాడు?

"మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది" అని యేసు వారితో చెప్పాడు. (12:23)

గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల దానికేమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల అది విస్తారముగా ఫలించును అని చెప్పాడు. (21:24)

John 12:25

ఈ లోకములో తన ప్రాణమును ప్రేమించు వానికి, తన ప్రాణమును ద్వేషించు వానికి ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

ఈ లోకములో తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును ద్వేషించు వాడు దానిని నిత్య జీవము కొరకు కాపాడుకొనును అని యేసు చెప్పాడు. (12:25)

యేసును సేవించు వానికి ఏమి జరుగుతుంది?

తండ్రి అతని ఘనపరచును. (12:26)

John 12:27

"తండ్రి నీ నామము మహిమపరచుము" అని చెప్పినపుడు ఏమి జరిగింది ?

"నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును" అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. (12:28)

John 12:30

పరలోకము నుండి వచ్చిన ఆ శబ్దము యొక్క కారణం ఏమని యేసు చెప్పాడు?

"ఈ శబ్ధము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను" అని యేసు వారితో చెప్పాడు. (12:30)

ఇప్పుడు ఏమి జరుగుతున్నదని యేసు చెప్పాడు?

ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాదికారి బయటకు త్రోసివేయబడును" అని యేసు చెప్పాడు. (12:31)

John 12:32

"నేను భూమి మీద నుండి పైకెత్త బడినపుడు అందరిని నా యొద్దకు ఆకర్షించు కొందును" అని యేసు ఎందుకు చెప్పాడు?

తాను ఏ విధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. (12:33)

John 12:34

"మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పు చున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరు" అని జనసమూహము అడిగినపుడు యేసు వారికి తిన్ననైన సమాధానం చెప్పాడా ?

లేదు. వారి ప్రశ్నలకు యేసు తిన్నగా సమాధానం చెప్పలేదు. (12:35-36)

వెలుగు గురించి యేసు ఏమి చెప్పాడు ?

"ఇంకా కొంత కాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి .....మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగు నందు విశ్వాసముంచుడి" అని యేసు చెప్పాడు. (12:35-36)

John 12:37

ఎందుకు జనులు యేసు నందు విశ్వాసముంచ లేదు ?

"ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడేవాడు? ప్రభువుయొక్క బాహువు ఎవరికీ యయలుపరచ బడెను" అని ప్రవక్తయైన యెషయా ప్రవచనము నెరవేర్చా బడునట్లు వారు ఆయన యందు విశ్వాసముంచ లేదు. (12:37-38)

John 12:39

ఎందుకు ప్రజలు యేసు ను విశ్వసించలేక పోయారు ?

యెషయా చెప్పినట్టు "వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడ కుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠిన పరచెను" అను కారణము గా వారు నమ్మలేక పోయిరి. (12:39-40)

John 12:41

యెషయ ఎందుకు ఈ సంగతులు చెప్పాడు ?

యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. (12:41)

ఎందుకు ఆయనను విశ్వసించిన అధికారులు ఎందుకు దానిని ఒప్పుకొనలేక పోయారు ?

అధికారులలో కూడా అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొన లేదు. (12:42-43)

John 12:44

తన గురించి, తన తండ్రి గురించి యేసు ఏమి చెప్పాడు ?

"నా యందు విశ్వాస ముంచు వాడు నా యందు కాదు నన్ను పంపిన వానియందే విశ్వాసముంచు చున్నాడు, నన్ను చూచు వాడు నన్ను పంపినవానినే చూచు చున్నాడు. (12:44-45)

John 12:46

ఏమి చెయ్య దానికి యేసు ఈ లోకానికి వచ్చాడని ఆయన చెపుతున్నాడు ?

ఈ లోకమును రక్షించుటకె వచ్చానని యేసు చెప్పాడు. (21:47)

John 12:48

యేసు ను నిరాకరించు వానిని, ఆయన మాటలు గైకొనని వానిని తీర్పు తీర్చునది ఏది ?

ఆయనను నిరాకరించి ఆయన మాటలను అంగీకరింపని వానిని యేసు పలికిన మాటయే అంత్య దినమందు తీర్పు తీర్చును. (12:48)

యేసు తనంతట తానే మాట్లాడునా ?

లేదు. తాను ఏమి మాట్లాడవలెనో దీనిని గూర్చి తనను పంపిన తండ్రియే ఆయనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. (12:49)

ఎందుకు యేసు తండ్రి చెప్పిన ప్రకారమే ప్రజలకు చెపుతున్నాడు ?

తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని యేసు ఎరుగును గనుక యేసు ఆ విధముగా చేయుచున్నాడు. (12:50)


Chapter 13

Translation Questions

John 13:1

తన వారిని యేసు ఎంత ప్రేమించాడు ?

వారిని అంతము వరకు ప్రేమించాడు. (13:1)

యూదా ఇస్కరియోతుకు అపవాది ఏమీ చేసాడు ?

ఆయనను అప్పగింప వలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచనను పుట్టించెను. (13:2)

John 13:3

తండ్రి యేసుకు ఇచ్చినదేమిటి ?

తండ్రి యేసు చేతికి సమస్తము అప్పగించెను. (13:3)

యేసు ఎక్కడినుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళు చున్నాడు ?

తాను దేవుని యొద్ద నుండి వచ్చాడు, తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాడు. (13:3)

ఆయన భోజన పంక్తిలోనుండి లేచినపుడు ఏమి చేసాడు ?

ఆయన లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుముకు కట్టుకొనెను, అంతట పళ్ళెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. (13:4-5)

John 13:6

తన పాదములను యేసు కడుగుటకు పేతురు అభ్యంతర పెట్టినపుడు యేసు ఏమన్నాడు ?

"నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదు" అన్నాడు. (13:8)

John 13:10

"మీలో అందరు పవిత్రులు కారు" అని యేసు ఎందుకు అన్నాడు ?

తనను అప్పగించు వానిని ఎరిగేను గనుక యేసు ఈ మాట అన్నాడు. (13:11)

John 13:12

ప్ర.శిష్యుల పాదాలను యేసు ఎందుకు కడిగాడు ?

తాను వారికి చేసిన విధముగా వారును చేయ వలెనని యేసు తన శిష్యుల పాదాలను కడిగాడు. (13:14-15)

John 13:16

దాసుడు యజమాని కంటే గొప్పవాడా లేక పంపబడిన వాడు తనను పంపినవాని కంటే గొప్పవాడా ?

దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తనను పంపినవాని కంటే గొప్పవాడు కాడు. (13:16)

యేసు కు విరోధముగా తన మడమను ఎత్తిన వాడు ఎవరు ?

ఆయనతో కూడా భోజనముచేయువాడు ఆయనకు విరోధముగా తన మడమ ఎత్తెను. (13:18)

John 13:19

"మీలో అందరు పవిత్రులు కారు", "నాతో కూడా భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను" అని యేసు తన శిష్యులతో చెప్పాడు ?

అది జరిగినప్పుడు నేనే ఆయననని వారు నమ్మునట్లు అది జరుగక మునుపు ఆయన వారికి చెప్పాడు (13:19)

యేసును చేర్చుకొనువాడు ఎవరిని చేర్చు కొనును ?

ఆయనను చేర్చుకొనువాడు తనను పంపిన వానిని కూడా చేర్చుకొనువాడగును. (13:20)

John 13:23

వారిలో ఒకడు తనను అప్పగించబోవుతున్నాడని యేసు చెప్పినపుడు సీమోను పేతురు ఏమి చేసాడు ?

ఎవరిని గురించి యీలాగు చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుని అడిగాడు. (13:24)

John 13:26

వాడెవడని యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు యేసును అడిగినప్పుడు యేసు ఎలా స్పందించాడు ?

"నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే" అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను.(13:20)

యేసు యూదాకు రొట్టె ముక్క ఇవ్వగానే యూదాకు ఏమి జరిగింది? అతడు ఏమి చేసాడు ?

వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, వెంటనే వాడు బయటికి వెళ్ళాడు. (13:20)

John 13:31

దేవుడు ఎలా మహిమ పరచబడ్డాడు ?

దేవుడు మనుష్యకుమారుని యందు మహిమ పరచబడి యున్నాడు, దేవుడును ఆయనయందు మహిమ పరచబడిన యెడల దేవుడు తనయందు ఆయనను మహిమ పరచును.(13:31)

John 13:34

యేసు తన శిష్యుల కిచ్చిన నూతన ఆజ్ఞ ఏది ?

వారు ఒకరినొకరు ప్రేమింప వలెనని వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. (13:34)

ఒకరిని ఒకరు ప్రేమింప వలెననెడి ఆజ్ఞకు లోబడిన యెడల ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు ?

ఒకరిని ఒకరు ప్రేమింప వలెననెడి ఆజ్ఞకు లోబడిన యెడల దీనిని బట్టి వారు యేసు శిష్యులని అందరు తెలుసుకొంటారు. (13:35)

"నేను వెళ్ళు చోటికి నీవు రాలేవు" అని యేసు వారికి చెప్పిన మాటను సీమోను పేతురు అర్ధం చేసుకున్నాడా ?

లేదు. ఎందుకంటే "ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నా" వని యేసును అడిగాడు. (13:33-36)

John 13:38

"నీ కొరకు నా ప్రాణము పెట్టుదును" అని సీమోను పేతురు అనినప్పుడు యేసు ఏమి జవాబిచ్చాడు ?

"నా కొరకు నీ ప్రాణమును పెట్టుదువా ? అయనను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదు" అని యేసు జవాబిచ్చాడు.(13:38)


Chapter 14

Translation Questions

John 14:1

తండ్రి యింట ఏమున్నది ?

తండ్రి యింటి లో అనేక నివాసములు ఉన్నాయి. (14:2)

తన శిష్యులకు ఏమి చెయ్యడానికి యేసు వెళ్ళుతున్నాడు ?

యేసు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. (14:3)

శిష్యుల హృదయాలు ఎందుకు కలవరపడకూడదు ?

యేసు వారి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళు చున్నాడు. ఆయన యొద్ద ఉండుటకు వారిని తీసుకొని పోవడానికి ఆయన మరల రాబోతున్నాడు. (14:1-3)

John 14:4

తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గము ఏది ?

తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గము యేసు. (14:6)

John 14:8

శిష్యులకు చాలిన ఏ సంగతిని ఫిలిప్పు యేసును అడుగుతున్నాడు ?

"ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మా కంతే చాలును అని ఫిలిప్పు యేసును అడిగాడు. (14:8)

John 14:10

యేసు శిష్యులతో తనంతట తానే మాట్లాడు తున్నాడా ?

యేసు తనంతట తాను మాట్లాడడం లేదు తండ్రి ఆయన యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. (14:10)

యేసు తండ్రి యందు ఉన్నాడనియు, తండ్రి యేసునందు ఉన్నాడని శిష్యులు నమ్మాలని యేసు ఎందుకు చెప్పాడు ?

యేసు క్రియల నిమిత్తమైనను శిష్యులు దీనిని నమ్మాలని యేసు చెప్పాడు. (14:11)

John 14:12

తాను చేసిన దానికంటే తన శిష్యులు ఎక్కున చేస్తారని యేసు ఎందుకు చెప్పాడు ?

యేసు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు గనుక శిష్యులు గొప్ప కార్యములు చేస్తారని యేసు చెప్పాడు. (14:12)

శిష్యులు తన నామము లో అడిగితే యేసు ఎందుకు చేస్తాడు ?

తండ్రి కుమారుని యందు మహిమ పరచ బడునట్లు యేసు చేస్తాడు. (14:13)

John 14:15

మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు ఏమి చేస్తారని యేసు చెప్పాడు ?

మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొంటారని యేసు చెప్పాడు. (14:15)

శిష్యులతో నిత్యము ఉండునట్లు తండ్రి పంపబోవు వేరొక ఆదరణ కర్తను యేసు ఏమని పిలిచాడు ?

సత్య స్వరూపియగు ఆత్మ అని పిలిచాడు. (14:17)

సత్య స్వరూపియగు ఆత్మను లోకము ఎందుకు స్వీకరించ లేదు ?

లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. (14:17)

సత్య స్వరూపియగు ఆత్మ ఎక్కడ ఉంటాడని యేసు చెప్పాడు ?

సత్య స్వరూపియగు ఆత్మ శిష్యులలో ఉంటాడని యేసు చెప్పాడు . (14:17)

John 14:21

ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వానికి ఏమి జరుగుతుంది ?

వారు యేసు చేత, ఆయన తండ్రి చేత ప్రేమించ బడతారు, ఆయన వారికి తనను తాను కనుపరచు కొంటాడు. (14:21)

John 14:25

తండ్రి పంపినపుడు ఆదరణ కర్త, పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడు ?

ఆదరణ కర్త, పరిశుద్ధాత్ముడు వారికి సమస్తమును బోధించి యేసు వారితో చెప్పిన సంగతులన్నిటినీ వారికి జ్ఞాపకం చేస్తాడు. (14:26)

John 14:28

యేసు తమను విడిచి వెళ్ళుచున్నందుకు శిష్యులు ఎందుకు సంతోషించాలి ?

యేసు తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాడు గనుక శిష్యులు సంతోషించాలి అని యేసు చెప్పాడు, తండ్రి యేసు కంటే గొప్పవాడు. (14:28)

John 14:30

శిష్యులతో ఇక మీదట విస్తరించి మాట్లాడనని చెప్పడానికి కారణం యేసు ఏమి చెప్పాడు ?

శిష్యులతో ఇక మీదట విస్తరించి మాట్లాడనని చెప్పడానికి కారణం లోకాధికారి వచ్చుచున్నాడని యేసు చెప్పాడు (14:30)


Chapter 15

Translation Questions

John 15:1

నిజమైన ద్రాక్షా వల్లి ఎవరు ?

యేసు నిజమైన ద్రాక్షా వల్లి. (15:1)

వ్యయసాయకుడు ఎవరు ?

వ్యయసాయకుడు తండ్రి (15:1)

క్రీస్తులో ఉన్న తీగెలతో తండ్రి ఏమి చేస్తాడు ?

ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరింత ఫలించు నట్లు దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. (15:2)

John 15:3

ఎందుకు శిష్యులు పవిత్రులై ఉన్నారు ?

యేసు వారితో చెప్పిన మాటను బట్టి వారు పవిత్రులై ఉన్నారు. (15:3)

John 15:5

తీగెలు ఎవరు ?

మనము తీగెలము. (15:5)

ఫలించాలి అంటే ఏమి చెయ్యాలి ?

ఫలించాలి అంటే యేసు లో నిలిచి యుండాలి. (15:5)

యేసు లో నిలిచియుండని యెడల ఏమి జరుగుతుంది ?

ఎవరైనను యేసు లో నిలిచియుండని యెడల వాడు తీగె వలె బయట పారవేయబడును. (15:6)

మన కిస్టమైన ప్రతీది పొందాలంటే మనము ఏమి చెయ్యాలి ?

ఆయన యందు మనము నిలిచి యుండాలి, మనయందు ఆయన మాటలు నిలిచి యుండాలి. అప్ప్దుడు మనకేది ఇష్టమో దానిని అడగాలి, అది మనకు అనుగ్రహించ బడుతుంది. (15:7)

John 15:8

తండ్రి మహిమ పరచ బడే రెండు మార్గాలు ఏమిటి ?

మనము బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచ బదతాడు, మనము యేసు శిష్యులుగా ఉంటాము. (15:8)

John 15:10

ప్ర.యేసు ప్రేమలో నిలిచియుండునట్లు ఏమి చెయ్యగలం ?

ఆయన ఆజ్ఞలు గైకొనాలి ?(15:10)

John 15:12

ఒక వ్యక్తి కలిగియుండగలిగిన గొప్ప ప్రేమ ఏమిటి ?

తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగాలవాడెవడును లేడు . (15:13)

John 15:14

మనము యేసు స్నేహితులమా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది ?

ఆయన మనకు ఆజ్ఞాపించు వాటన్నిటిని చేసిన యెడల మనము ఆయన స్నేహితులమగుదుము.(15:14)

యేసు తన శిష్యులను ఎందుకు స్నేహితులని పిలిస్తున్నాడు ?

ఆయన తన తండ్రి వినిన సంగతులన్నిటిని వారికి తెలియ చేసాడు కనుక వారిని స్నేహితులని పిలచుచున్నాడు. (15:15)

John 15:18

యేసును వెంబడించు వారిని లోకము ఎందుకు ద్వేషిస్తుంది ?

యేసు ను వెంబడించు వారు లోకసంభందులు కారు, యేసు వారిని లోకములోనుంది ఏర్పరచు కొన్నాడు. (15:19)

John 15:23

వారి పాపము విషయం లోకము తప్పించుకోలేకుండా ఉండటానికి యేసు ఏమి చేసాడు ?

వారి పాపము విషయం లోకము తప్పించుకోలేకుండా ఉండటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు, ఎవడునూ చెయ్యని క్రియలను చేసాడు. (15:24)

John 15:26

యేసు ను గురించి ఎవరు సాక్ష్యం ఇస్త్తారు ?

ఆదరణ కర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ, యేసు శిష్యులు ఆయన గూర్చి సాక్ష్య మిస్తారు. (15:26-27)

ఎందుకు శిష్యులు ఆయన గురించి సాక్ష్య మిస్తారు ?

వారు మొదటి నుండి ఆయనతో ఉండిన వారు గనుక వారును అయన గురించి సాక్ష్య మిస్తారు. (15:27)


Chapter 16

Translation Questions

John 16:1

ఎందుకు యేసు ఈ మాటలు శిష్యులతో చెపుతున్నాడు ?

వారు అభ్యంతర పడకుండు నట్లు యేసు ఈ మాటలు శిష్యులతో చెప్పుచున్నాడు. (16:1)

John 16:3

యేసు శిష్యులను ఎందుకు సమాజ మందిరములోనుండి వెలివేసి వారిలో కొందరిని చంపుతున్నారు ?

వారు తండ్రిని యేసును తెలుసుకోన లేదు గనుక ఈవిధంగా చేస్తారు. (16:3)

ఈ సంగతులను గురించి యేసు ముందు గానే ఎందుకు చెప్పలేదు ?

ఆయన వారితో ఉన్నాడు గనుక మొదట ఆయన ఈ సంగతులను వారితో చెప్పలేదు. (16:4)

John 16:5

యేసు వెళ్లి పోవడం ఎందుకు ప్రయోజనకరం ?

ఆయన వెళ్లి పోవడం వారికి ప్రయోజన కరం, ఆయన వెళ్ళని యెడల ఆదరణ కర్త వారి దగ్గరకు రాడు. ఆయన వెళ్ళిన యెడల ఆదరణ కర్త వారి వద్దకు వస్తాడు. (16:7)

John 16:8

ఆదరణ కర్త దేని విషయం లోకాన్ని ఒప్పింప చేస్తాడు ?

ఆదరణ కర్త పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, అంతిమ తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. (16:8)

John 16:12

సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినపుడు శిష్యుల కొరకు ఏమి చేస్తాడు ?

సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినపుడు వారిని సర్వ సత్యములోనికి వారిని నడిపించును, ఆయన తనంతట తాను ఏమియూ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభావింప బోవు వాటిని వారికి బోధించును. (16:13)

సత్య స్వరూపియగు ఆత్మ యేసు ను ఏ విధంగా మహిమ పరచును ?

ఆయన యేసు లోనివి తీసుకొని వారికి తెలియ జేయును గనుక యేసు ను మహిమ పరచును. (16:14)

John 16:15

సత్య స్వరూపియగు ఆత్మ యేసు లోనివి వేటిని తీసుకుంటాడు ?

సత్య స్వరూపియగు ఆత్మ తండ్రి వాటిలోనుండి తీసుకుంటాడు, తండ్రికి కలిగియున్నవన్నియు యేసు కు చెందినవే. (16:15)

John 16:17

యేసును గురించిన ఏ సంగతులు శిష్యులకు అర్ధం కాలేదు ?

"కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాను ", "అని యేసు చెప్పిన మాటను వారు అర్ధం చేసుకోలేదు, (16:17-18)

John 16:19

శిష్యుల దు:ఖమునకు ఏమి జరుగుతుంది ?

శిష్యుల దు:ఖము సంతోషమౌతుంది. (16:20)

John 16:22

ఏ విషయం శిష్యులను సంతోష భరితులను చేస్తుంది ?

వారు యేసును మరల చూస్తారు, వారు సంతోషిస్తారు. (16:22)

అడిగి పొందండి అని యేసు తన శిష్యులతో ఎందుకు చెప్పాడు ?

వారి సంతోషము పరిపూర్ణమగునట్లు వారిని ఆ విధంగా చెయ్యమన్నాడు. (16:24)

John 16:26

ఎందు నిమిత్తం తండ్రి తానే యేసు శిష్యులను ప్రేమించుచున్నాడు ?

శిష్యులు యేసు ను ప్రేమించి ఆయన తండ్రి యెద్ద నుండి వచ్చాడని నమ్మారు గనుక తండ్రి తానే వారిని ప్రేమించు చున్నారు. (16:27)

యేసు ఎక్కడినుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళుచున్నాడు ?

యేసు తండ్రి దగ్గర నుండి బయలు దేరి లోకమునకు వచ్చి యున్నాడు, లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు. (16:28)

John 16:32

ఆ గడియలో శిష్యులు ఏమి చేయ్యబోతున్నారని యేసు చెప్పాడు ?

ఆ గడియలో వారిలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి యేసు ను ఒంటరిగా విడిచి పెడతారని యేసు చెప్పాడు. (16:32)

శిష్యులు ఆయనను విడిచి పెట్టినప్పుడు యేసుతో ఇంకా ఉండే దెవరు ?

తండ్రి యేసు తో ఉంటాడు. (16:32)

ఈ లోకములో వారికి శ్రమలు ఉన్నప్పటికీ ధైర్యము తెచ్చు కొనుడని యేసు ఎందుకు చెపుతున్నాడు ?

తాను లోకమును జయించి యున్నాడు గనుక ధైర్యము తెచ్చుకోనుడని శిష్యులతో చెపుతున్నాడు (16:33)


Chapter 17

Translation Questions

John 17:1

సర్వ శరీరుల మీద అధికారాన్ని యేసుకు తండ్రి ఎందుకిచ్చాడు ?

యేసు కు ఇచ్చిన వారికందరికీ నిత్య జీవము అనుగ్రహించు నట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారమును ఇచ్చాడు. (17:2)

John 17:3

నిత్య జీవ మనగా ఏమిటి ?

అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (17:3)

ఈ భూమి మీద యేసు తన తండ్రి ని ఏ విధంగా మహిమ పరచాడు ?

చేయుటకు తన కిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద దేవుని మహిమ పరచాడు. (17:4)

ఏ మహిమ ను యేసు కోరుతున్నాడు ?

లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయనకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను ఆయన కోరుతున్నాడు. (17:5)

John 17:6

తండ్రి నామమును యేసు ఎవరికి ప్రత్యక్ష్య పరచాడు ?

లోకమునుండి దేవుడు యేసు కు అనుగ్రహించిన మనుష్యులకు తండ్రి నామమును ప్రత్యక్ష్య పరచాడు. (17:6)

తండ్రి యేసుకు ఇచ్చిన మనుష్యులు యేసు మాటలకు ఎలా స్పందించారు ?

వారు యేసుని మాటలు అంగీకరించారు, ఆయన తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని నిజముగా ఎరిగి తండ్రి ఆయనను పంపాడని వారు నమ్మారు. (17:8)

John 17:9

ఎవరికొరకు ప్రార్ధన చెయ్యడము లేదని యేసు చెప్పాడు ?

లోకము కొరకు ప్రార్ధన చెయ్యడము లేదని యేసు చెప్పాడు. (17:9)

John 17:11

తండ్రి తనకు ఇచ్చిన వారికి ఏమి చేయాలని యేసు తండ్రిని కోరాడు ?

వారు ఏకమై ఉండు లాగున తండ్రి నామమందు వారిని కాపాడుమని తండ్రిని అడిగాడు, దుష్టుని నుండి కాపాడుమని ప్రార్ధించాడు, సత్యమునందు ప్రతిష్టించుమని ప్రార్ధించాడు, వారు యేసు నందును, తండ్రి యందును ఉండునట్లు ప్రార్ధించాడు, తండ్రి ఆయనకిచ్చిన వారు అయన ఎక్కడ ఉండునో అక్కడను ఆయనతో ఉండునట్లు ప్రార్ధించాడు. (17:11,15,21,24.)

John 17:12

యేసు లోకములో ఉండగా తండ్రి తనకిచ్చిన వారికి ఏమి చేసాడు ?

యేసు వారిని కాపాడాడు. (17:12)

John 17:18

యేసు తనను ఎందుకు ప్రతిష్టించు కున్నాడు ?

తండ్రి తనకు ఇచ్చిన వారు సత్య మందు ప్రతిష్ష్టించబడునట్లు వారికొరకు తనను తాను ప్రతిష్టించు కొన్నాడు. (17:19)

John 17:20

ఇంకా ఎవరి కొరకు యేసు ప్రార్దిస్తున్నాడు ?

తండ్రి యేసు కిచ్చిన వారు వాక్యము వలన యేసు నందు విశ్వాసముంచిన వారందరును ఏకమై యుండవలెనని వారి కొరకు ప్రార్ధన చేయుచుండెను. (17:20)

John 17:22

తండ్రి యేసుకు ఇచ్చిన వారిని తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడు ?

తండ్రి యేసు ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించాడు. (17:23)

John 17:25

తండ్రి యేసుకు ఇచ్చిన వారికి తండ్రి నామమును ఎందుకు తెలియ చేసాడు, ఇంకనూ ఎందుకు తెలియ చేస్తున్నాడు ?

తండ్రి యేసు నందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, యేసు వారి యందు ఉన్డునట్లును, వారికి ఆయన నామమును తెలియచేసాడు, (17:26)


Chapter 18

Translation Questions

John 18:1

ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత ఎక్కడికి వెళ్ళాడు ?

ఆయన తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటి వెళ్లెను. (18:1)

యూదాకు ఆ స్థలము ఎలా తెలుసు ?

యేసు తన శిష్యులతో కలిసి తరుచుగా ఆ స్థలానికి వవెల్లుచుండే వారు. (18:2)

దివిటీలతోను, దీపములతోను ఆయుధములతోను ఆ తోటలోనికి ఎవరెవరు వెళ్ళారు.

యూదా, ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన సైనికులతో ఆ చోటికి వచ్చారు. (18:3)

John 18:4

ఆ తోటలోనికి వచ్చిన ప్రజలను యేసు ఏమి అడిగాడు ?

"మీరెవరిని వెదకుచున్నారు" అని వారిని అడిగాడు. (18:4)

John 18:6

"ఆయనను నేనే" అని నజరేయుడైన యేసు ను వెదకుచున్న వారితో యేసు చెప్పినపుడు ఏమి జరిగింది ?

వారు వెనకకు తగ్గి నేల మీద పడ్డారు. (18:6)

John 18:8

"నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని పోనియ్యుడి" అని యేసు ఎందుకు చెప్పాడు ?

"నీవు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొన లేదని" అయన చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ మాట చెప్పాడు. (18:8-9)

John 18:10

ప్రధాన యాజకుని దాసుడు మల్కు యొక్క చెవిని పేతురు తెగనరికినపుడు యేసు ఏమి చెప్పాడు ?

"కత్తి ఒరలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా" అని పేతురు తో యేసు చెప్పాడు. (18:10-11)

John 18:12

సైనికులు, శతాధిపతి, యూదుల బంత్రోతులు యేసును పట్టుకొని ఎక్కడికి తీసుకు వెళ్ళారు ?

అన్న వద్దకు తీసుకొని వెళ్ళారు. (18:13)

అన్న ఎవరు ?

అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. (18:13)

John 18:15

పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి లోనికి ఎలా ప్రవేశించాడు ?

ప్రధాన యాజకునికి పరిచయ మైన ఒక శిష్యుడు బయటికి వచ్చి ద్వారా పాలకునితో మాట్లాడి పేతురుని లోపలి తోడుకొని వెళ్ళాడు. (18:16)

John 18:17

యేసు తో ఉన్న శిష్యులలో ఒకడివి కాదా అని పేతురును ఎవరు అడిగారు ?

కావలి యొద్ద ఒక చిన్నది, కొందరు మంట వేసి చలి కాచుకొంతుండగా , వారిలో పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువును ప్రదానయాజకుని దాసులలో ఒకడును, అందరునూ యేసు తో ఉన్న శిష్యులలో ఒకడివి కాదా అని పేతురును అడిగారు. (18:17)

John 18:19

ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి ఆయన బోధను గురించి యేసు ను అడిగినప్పుడు యేసు ఏమని సమాధానము ఇచ్చాడు ?

తాను బహిరంగముగా లోకమునకు మాటలాడితినని చెప్పాడు, తాను బోధించినది విన్న వారిని అడుగుమని ప్రధాన యాజకునికి చెప్పాడు. (18:19-21)

John 18:22

అన్న యేసు ను ప్రశ్నించిన తరువాత యేసు ను ఎక్కడికి పంపాడు ?

ప్రధాన యాజకుడైన కయప వద్దకు యేసు ను పంపాడు. (18:24)

John 18:25

యేసు తో ఉండటము గురించి పేతురు మూడవ సారి బొంకి నపుడు ఏమి జరిగింది ?

పేతురు నేనేరుగనని మూడవసారి బొంకి నపుడు వెంటనే కోడి కూసింది. (18:27)

John 18:28

యేసు ను తీసుకొని వెళ్ళిన వారు ఎందుకు అధికార మండపము లోనికి వెళ్ళ లేదు ?

వారు మైల పడకుండా పస్కాను భుజింప వలెనని అధికార మండపము లోనికి వెళ్ళ లేదు. (18:28)

"ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని" పిలాతు వారినడిగి నపుడు వారు ఏమి సమాధానమిచ్చారు ?

"వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించియుండమని" చెప్పిరి. (18:29-30)

John 18:31

ఎందుకు యూదులు ఆయనకు తీర్పు తీర్చ కుండ పిలాతు వద్దకు తీసుకొని వెళ్ళారు ?

రోమా అధిపతులనుండి (పిలాతు) అనుమతి లేకుండా ఎవనికైనను మరణ శిక్ష విధించదానికి యూదులకు అధికారము లేదు. (18:31)

John 18:33

పిలాతు యేసు ను ఏమి అడిగాడు ?

యూదులకు నీవు రాజువా అని అడిగాడు, యేసు ఏమి చేసాడని అడిగాడు. (18:33-35)

John 18:36

తన రాజ్యము గురించి యేసు ఏమి చెప్పాడు ?

తన రాజ్యము ఈ లోక సంభంద మైనది కాదు, ఇహ సంబంధ మైనది కాదు అని చెప్పాడు. (18:36)

ఏ ఉద్దేశము కొరకు యేసు జన్మించాడు ?

రాజుగా ఉండుటకు ఆయన జన్మించాడు. (18:37)

John 18:38

యేసు తో మాట్లాడిన తరువాత పిలాతు ఇచ్చిన తీర్పు ఏమిటి ?

"అతని యందు ఏ దోషమును నాకు కనబడ లేదు" అని పిలాతు యూదులతో చెప్పాడు. (18:38)

యేసు ను విడుదల చేయుటకు మీకిస్టమా అని యూదులను పిలాతు అడిగినప్పుడు యూదులు ఏమని అరిచారు ?

"ఈ మనుష్యుడు కాదు మాకు బరబ్బా కావాలి" అని మరల బిగ్గరగా కేకలు వేసారు. (18:39-40)


Chapter 19

Translation Questions

John 19:1

పిలాతు యేసు ను కొరడాలతో కొట్టించిన తరువాత సైనికులు ఏమి చేసారు ?

వారు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి "యూదుల రాజా, శుభం" అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి. (19:2-3)

John 19:4

పిలాతు యేసు ను తిరిగి ఎందుకు వెలుపలికి తీసుకొని వచ్చాడు ?

ఆయన యందు ఏ దోషము పిలతుకు కనబడ లేదని వారికి తెలియునట్లు యేసును వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. (10:4)

పిలాతు యేసు ను ప్రజల వద్దకు తీసుకొని వచ్చినపుడు ఆయన ఏమి ధరించుకొని ఉన్నాడు ?

ఆయన ముండ్ల కిరీటమును ధరించు కొని ఊదారంగు వస్త్రమును ధరించాడు. (19:5)

యేసు ను చూచినపుడు ప్రధాన యాజకులును, బంట్రౌతులును ఏమి చేసారు ?

"సిలువ వేయుము, సిలువ వేయుము" అని కేకలు వేశారు. (19:6)

John 19:7

పిలాతు భయపడునట్లు యూదులు ఏమన్నారు ?

"మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను" అని పిలాతుతో చెప్పారు. (19:7-8)

"నీవేక్కడి నుండి వచ్చితివి" అని పిలాతు యేసు ను అడిగినప్పుడు యేసు ఏమన్నాడు ?

యేసు పిలాతు ఏ జవాబు ఇవ్వలేదు. (19:9)

John 19:10

పిలాతు కు యేసు మీద అధికారం ఎవరిచ్చారని యేసు చెప్పాడు ?

"పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు" అని యేసు చెప్పాడు. (19:11)

John 19:12

యేసు ను విడుదల చేయుటకు ప్రయత్నించి నప్పటికిని యూదులు అనిన ఏ మాట అతనిని అడ్డుకొన్నది ?

"నీవు ఇతనిని విడుదల చేసితివా కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకోను ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడు తున్నవాడే" అని యూదులు పిలాతుతో అన్నారు. (19:12)

John 19:14

సిలువ వేయబడుటకు పిలాతు యేసును యూదులకు అప్పగించే ముందు ప్రధాన యాజకులు ఏమన్నారు ?

"కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు" అని అన్నారు. (19:15-16)

John 19:17

యేసు ను ఎక్కడ సిలువ వేసారు ?

వారు యేసు ను గొల్గోత అనే స్థలం లో యేసు సిలువ వేసారు, గొల్గోత అనే మాట కు కపాల స్థలమని అర్ధం. (19:17-18)

ఆ రోజున యేసు ఒక్కడే సిలువ వేయబడ్డాడా ?

లేదు. ఇద్దరు వ్యక్తులు ఆయనకు ఇరువైపులా ఆయనతో పాటు సిలువ వెయ బడ్డారు. (19:18)

John 19:19

యేసు సిలువ మీద పిలాతు ఏమి రాయించాడు ?

"యూదుల రాజైన నజరేయుడగు యేసు" అను పైవిలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. (19:19)

సిలువ మీద రాయించిన గురుతు ఏ భాషలో రాయించాడు ?

అది హెబ్రీ, గ్రీకుం రోమా భాషలలో రాయబడి ఉంది. (19:20)

John 19:23

యేసు వస్త్రములను సైనికులు ఏమి చేసారు ?

సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. కుట్టు లేకుండా ఉన్న అయన అంగీ కోసం చీట్లు వేశారు. (19:23-24).

యేసు వస్త్రములతో సైనికులు ఎందుకు ఆ విధంగా చేసారు ?

"వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి." అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. (19:23-24)

John 19:25

యేసు సిలువ దగ్గర నిలుచున్నా దెవరు ?

ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య యైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. (19:25-26)

యేసు తన తల్లియు తాను ప్రేమించిన సిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి తన తల్లి తో ఏమి చెప్పాడు ?

"అమ్మా యిదిగో నీ కుమారుడు" అని తన తల్లి తో చెప్పాడు. (19:26)

"యిదిగో నీ తల్లి" అని తాను ప్రేమించిన శిష్యునితో చెప్పినపుడు అ శిష్యుడు ఏమి చేసాడు ?

ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చు కొనెను. (19:27)

John 19:28

"దప్పిగోనుచున్నాను" అని యేసు ఎందుకు అన్నాడు ?

లేఖనము నెరవేరునట్లు ఆయన అన్నాడు. (19:28)

ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినపుడు యేసు ఏమి చేసాడు ?

యేసు ఆ చిరక పుచ్చుకొని - "సమాప్తమైనది" అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. (19:29-30)

John 19:31

శిక్ష విధించబడిన వారి కాళ్ళు విరగగోట్టించమని పిలాతు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు ?

ఆ దినము సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినమున మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినము సిలున మీద ఉండకుండు నట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతును అడిగిరి. (19:31)

సైనికులు యేసు కాళ్ళను ఎందుకు విరుగ గొట్టించ లేదు ?

ఆయన అంతకు ముందే మృతి నొందుట వారు చూచి అయన కాళ్ళు విరుగ గొట్టలేదు. (19:33)

John 19:34

యేసు చనిపోయాడని చూసిన తరువాత సైనికులు ఏమి చేసారు ?

సైనికులు ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు. (19:34)

John 19:35

యేసు కాళ్ళు ఎందుకు విరుగగోట్టబడలేదు, యేసు ఎందుకు ఈటెతో పొడవాబడ్డాడు ?

"అతని ఎముకలలో ఒకటైనా విరువబడ లేదు" "తాము పొడిచిన వాని తట్టు చూతురు" అను లేఖనములు నెరవేరునట్లు ఇది జరిగెను. (19:36-37)

యేసు సిలువ కార్యములను చూచు వాడు ఎందుకు వారికి సాక్ష్యము చెప్పాలి ?

వారు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడు. (19:35)

John 19:38

యేసు దేహమును తీసుకొని పోడానికి వచ్చిన వారు ఎవరు ?

యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసికోనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. (19:38)

యేసు దేహమును తీసికోనిపోవుటకు అరిమతయి యోసేపు తో వచ్చిన దెవరు ?

నికోదేము అరిమతయి యోసేపు తో వచ్చాడు. (19:39)

John 19:40

నికోదేము అరిమతయి యోసేపు యేసు దేహమును ఏమి చేసారు ?

వారు సుగంధ ద్రవ్వ్యములు యేసు దేహమునకు పూసి, నార బట్టలు చుట్టిరి. (19:40-41)


Chapter 20

Translation Questions

John 20:1

మగ్దలేనే మరియ సమాధి వద్దకు ఎప్పుడు వచ్చింది ?

ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధి వద్దకు వచ్చింది. (20:1)

మగ్దలేనే మరియ సమాధి వద్దకు రాగానే ఏమి చూసింది ?

సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట ఆమె చూసింది. (20:1)

ఇద్దరు శిష్యులతో మగ్దలేనే మరియ ఏమన్నది ?

"ప్రభువును సమాదిలోనుండి ఎత్తి కొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగను" అని వారితో చెప్పింది. (20:2)

John 20:2

సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట మగ్దలేనే మరియ చూసినపుడు ఏమి చేసింది ?

ఆమె పరుగెత్తు కొని సీమోను పేతురు, యేసు ప్రేమించిన శిష్యుని వద్దకు వచ్చింది. (20:2)

John 20:6

సీమోను పేతురు సమాధి లో ఏమి చూసాడు ?

నార బట్టలు పడియుండుట పేతురు చూసాడు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టియుండుట చూచాడు. (20:6-7)

John 20:8

సమాధి లోనికి చూచిన మరొక శిష్యుని స్పందన ఏమిటి ?

అతడు చూచి యేసు ను నమ్మాడు. (20:8)

John 20:11

మరియ సమాధి లోనికి వంగి ఏమి చూసింది ?

తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. (20:12)

దూతలు మరియతో ఏమి చెప్పారు ?

"అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?" అని అడిగారు. (20:13)

John 20:14

మరియ వెనుకకు తిరిగి చూడగా ఆమె ఏమి చూసింది ?

ఆమె వెనుక తట్టు తిరిగి చూడగా యేసు నిలిచి యుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. (20:14)

యేసు ఎవరని మరియ తలంచినది ?

అయన తోటమాలి అని అనుకున్నది. (20:15)

John 20:16

మరియ ఎప్పుడు యేసును గుర్తుపట్టింది ?

"మరియా" అని యేసు పిలిచినపుడు ఆయనను గుర్తుపట్టింది. (20:16)

తనను తాక వద్దని యేసు ఎందుకు చెప్పాడు ?

తాను తండ్రి యొద్దకు ఇంకనూ ఎక్కిపోలేదు గనుక తనను ముట్ట వద్దని యేసు చెప్పాడు. (20:17)

తన సహోదరులకు ఏమని చెప్పమని యేసు మరియతో చెప్పాడు ?

"నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని " వారితో చెప్పమని చెప్పాడు.(20:17)

John 20:19

ఆదివారము సాయంకాలము శిష్యులు ఉన్న చోటున ఏమి జరిగింది ?

యేసు వచ్చి వారి మధ్యన నిలిచెను. (20:19)

యేసు తన శిష్యులకు ఏమి చూపించాడు ?

ఆయన తన చేతులను, ప్రక్కను వారికి చూపించాడు. (20:20)

John 20:21

యేసు తన శిష్యులను ఏమి చేయ బోవుచున్నాడని చెప్పెను ?

తండ్రి తనను పంపిన విధముగా తానును వారిని పంపుచున్నానని వారితో చెప్పాడు. (20:21)

ఆయన వారి మీద ఊదిన తరువాత వారితో ఏమి చెప్పాడు ?

"పరిశుద్దాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించ బడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండ నిత్తురో అవి నిలిచి యుండును" అని వారితో చెప్పాడు. (20:22-23)

John 20:24

వారు యేసుని చూచినప్పుడు పండ్రెండు మంది శిష్యులలో ఏ శిష్యుడు వారి మధ్య లేదు ?

యేసు శిష్యుల మధ్య కు వచ్చినపుడు దిదుమ అనబడిన తోమా వారి మధ్య లేదు. (20:24)

తాను యేసు సజీవుడని నమ్మడానికి ఏమి చేస్తానని చెప్పాడు ?

తోమా యేసు చేతులలో మేకుల గురుతును చూచి తన వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి తన చేతిని ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మడని చెప్పాడు. (20:25)

John 20:26

తోమా యేసును ఎప్పుడు చూసాడు ?

ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉన్నాడు, తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచాడు. (20:26)

యేసు తోమా తో ఏమి చెప్పాడు ?

"నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసి వై యుండుము" అని తోమా తో చెప్పాడు. (20:27)

John 20:28

తోమాా యేసు తో ఏమి చెప్పాడు ?

"నా ప్రభువా, నా దేవా " అని తోమాా అన్నాడు. (20:28)

ఎవరు ధన్యులు అని యేసు అన్నాడు ?

"చూడక నమ్మిన వారు ధన్యులు" అని యేసు అన్నాడు. (20:29)

John 20:30

గ్రంథమందు రాయ బడని ఇతర అద్బుతాలు యేసు చేసాడా ?

అవును. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల యెదుట చేసెను, అవి యీ గ్రంథమందు వ్రాయబడి యుండ లేదు. (20:30)

సూచక క్రియలు గ్రంథమందు ఎందుకు రాయబడ్డాయి ?

యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందు నట్లును ఇవి వ్రాయబడెను. (20:31)


Chapter 21

Translation Questions

John 21:1

యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?

మరల యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు. (21:1)

ఏ శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు ?

సీమోను పేతురు, దిడుమ అనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనియేలును, జేబెదయి కుమారులును, ఆయన శిష్యులలో ఇద్దరును అక్కడ ఉన్నారు. (21:2)

ఈ శిష్యులు ఏమి చేస్తున్నారు ?

వారు చేపలు పట్టడానికి వెళ్ళారు కాని వారికి చేపలు పడలేదు. (21:3)

John 21:4

శిష్యులను ఏమి చెయ్య మని యేసు చెప్పాడు ?

చేపలు దొరుకునట్లు దోనే కుడి ప్రక్కన వల వేయమని యేసు చెప్పాడు (21:6)

శిష్యులు వల వేసినపుడు ఏమి జరిగింది ?

వారు వల వేసినపుడు చేపలు విస్తారముగా పట్టి నందున వల లాగ లేక పోయిరి. (21:6)

John 21:7

"అయన ప్రభువు సుమీ" అని యేసు ప్రేమించిన శిష్యుడు అనినపుడు సీమోను పేతురు ఏమి చేసాసు ?

పేతురు వస్త్ర హీనుడిగా ఉన్న కారణముగా పై బట్ట వేసి సముద్రములోనికి దూకాడు. (21:7)

ఇతర శిష్యులు ఏమి చేసారు ?

తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోనేలో వచ్చిరి. (21:8)

John 21:10

వారు పట్టిన కొన్ని చేపలను ఏమి చెయ్యమని యేసు చెప్పాడు ?

వారు అప్పుడే పట్టిన చేపలలో కొని తీసికొని రండని వారితో చెప్పాడు. (21:10)

John 21:12

యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ఎన్ని సార్లు ప్రత్యక్ష్య మయ్యాడు ?

యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్ష్య మైనది ఇది మూడవ సారి. (21:14)

John 21:15

వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని మొదట ఏమి అడిగాడు ?

సీమోను వీటికంటే తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని యేసు అడిగాడు. (21:15)

John 21:17

నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని మూడవ సారి యేసు సీమోనును అడిగినప్పుడు సీమోను పేతురు ఇచ్చిన సమాధాన మేమిటి ?

మూడవ సారి యేసు సీమోనును అడిగినప్పుడు సీమోను పేతురు "ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని " అని యేసుకు సమాధానమిచ్చాడు. (21:17)

మూడవ సారి యేసు అడిగిన "నీవు నన్ను ప్రేమించుచున్నావ" అనే ప్రశ్న కు సీమోను పేతురు స్పందించినపుడు యేసు ఏమి చెప్పాడు ?

మూడవ సారి "నా గొర్రెలను మేపుము" అని యేసు పేతురు కు చెప్పాడు. (21:17)

పేతురు ముసలివాడైనపుడు తనకు ఏమి జరుగుతుందని యేసు పేతురు తో చెప్పాడు ?

పేతురు ముసలి వాడై నపుడు అతని చేతులు చాచుతాడు, వేరొకడు అతని నడుము కట్టి తనకు ఇష్టము కాని చోటికి తనను మోసికొని పోవును అని చెప్పాడు. (21:18)

John 21:19

పేతురు ముసలివాడైనపుడు పేతురుకు ఏమి జరుగుందని యేసు ఎందుకు చెప్పాడు ?

అతడు ఎలాటి మరణము వలన దేవుని మహిమ పరచునో దాని సూచింఛి ఆయన ఈ మాట చెప్పెను. (21:19)

John 21:20

యేసు ప్రేమించిన శిష్యుని విషయము యేసును పేతురు ఏమి అడిగాడు ?

"ప్రభువా ఇతని సంగతి ఏమగును?" అని అడిగాడు. (21:21)

"ప్రభువా ఇతని సంగతి ఏమగును?" అని పేతురు అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబు ఏమిటి ?

"నీవు నన్ను వెంబడించుము" అని యేసు పేతురుతో చెప్పాడు. (21:22)

John 21:24

ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచూ గ్రంధమందు రాసినది ఎవరు ?

ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతనిసాక్ష్యము సత్యమని యెరుగుదుము. (21:24)


Chapter 1

Translation Questions

Acts 1:1

కొత్త నిబంధనలో లూకా రాసిన రెండు పుస్తకాలు ఏవి?

లూకా సువార్త, అపోస్తలుల కార్యములను లూకా రాసాడు [1:1]

యేసు బాధలు అనుభవించిన తరువాత నలభై దినాలు ఏమి చేసాడు?

యేసు సజీవునిగా అపోస్తలులుకు ప్రత్యక్షమై దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులను చెప్పాడు [1:3].

Acts 1:4

దేని కొరకు వేచి ఉండాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు?

తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు [1:4]

అపోస్తలులు కొద్ది దినాల్లో ఏ బాప్తిస్మం పోoదనైయున్నారు?

అపోస్తలులు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందనైయున్నారు [1:5]

Acts 1:6

ఇశ్రాయేలీయులకు రాజ్యాన్ని మరలా అనుగ్రహించే కాలాన్నిగూర్చి అపోస్తలులు అడిగినప్పుడు యేసు ఏమని జవాబు ఇచ్చాడు?

కాలములను సమయములను తెలిసి కొనుట మీ పని కాదు అని యేసు వారితో అన్నాడు [1:7].

ప్రశ్న: యేసు అపోస్తలులతో, పరిశుద్దాత్మ నుండి ఏమి పొందనై యున్నారని చెప్పాడు?

యేసు అపోస్తలులతో శక్తి పొందనై యున్నారని చెప్పాడు [1:8].

Acts 1:9

యేసు అపోస్తలుల నుండి ఏ విధంగా కొనిపోబడ్డారు?

యేసు పైకి ఎత్తబడి, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకుపోయింది [1:9].

యేసు ఏ విధంగా తిరిగి వస్తాడని దేవదూతలు అపోస్తలులతో చెప్పారు?

యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో అదే విధంగా తిరిగి వస్తారని దేవదూతలు అపోస్తలులతో చెప్పారు[1:11].

Acts 1:12

అపోస్తలులు, స్త్రీలు, మరియ, యేసు సోదరులు మేడ గదిలో ఏమి చేసారు?

వారు ఆసక్తితొ ప్రార్దించారు [1:14].

Acts 1:15

యేసును మోసంతో అప్పగించిన యూదా ఇస్కరియోతు జీవితంలో నెరవేరిoది ఏమిటి?

పరిశుద్ద లేఖనం యూదా ద్వారా నెరవేరిoది [1:16].

Acts 1:17

ద్రోహంతో సంపాదించిన డబ్బు తీసుకొన్న తరువాత యూదాకు ఏమి జరిగింది?

యూదా ఒక పొలం కొన్నాడు. అందులోనే అతని శరీరం బద్దలై పగిలిపోయి, పేగులు బయటకు వచ్చాయి [1:18].

Acts 1:20

కీర్తనలు గ్రంథంలో యూదా స్థానం గురించి ఏమి జరగాలని రాసి ఉంది?

యూదా స్థానంలో వేరొకని నియమించాలని కీర్తనలలో రాసి ఉంది [1:20].

Acts 1:21

యూదా స్థానం లో నియమిoచ వలసిన వ్యక్తికి ఉండవలసిన ఆవశ్యకతలు ఏమిటి?

యూదా స్థానంలో ఉండే వ్యక్తి అపోస్తలుల సహవాసంలో ఉంటూ, బాప్తిసం ఇచ్చే యోహాను కాలం నుండి, యేసు పునరుత్థానం వరకు సాక్షియై యుండాలి [1:21-22].

Acts 1:24

అపోస్తలులు నిర్ణయించిన ఇద్దరు వ్యక్తులలో యూదా స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలో ఎలా నిర్ణయించారు?

అపోస్తలులు ప్రార్ధన చేసి, దేవుడు తన చిత్తాన్ని బయలు పరచాలని చీట్లు వేసారు [1:24-26].

పదకొండు మంది అపోస్తలులతో ఎంపిక అయిన వ్యక్తి ఎవరు?

మత్తీయను ఆ పదకొండు మంది అపోస్తలులతో లెక్కించారు.[1:26].


Chapter 2

Translation Questions

Acts 2:1

యేసు శిష్యులందరూ సమావేశమైన యూదుల పండుగ ఏమిటి?

పెంతెకోస్తు దినాన శిష్యులందరూ సమావేశమయ్యారు [2:1].

పరిశుద్దాత్మ ఇంటిలోకి వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేయసాగారు?

శిష్యులు ఇతర భాషలలో మాట్లాడసాగారు [2:4].

Acts 2:5

ఆ సమయములో యెరూషములో ఉన్న యూదులు ఎక్కడ నుండి వచ్చారు?

దైవ భక్తి గల ఆ యూదులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు [2:5].

జన సమూహాలు శిష్యులు మాట్లాడడం విని ఎందుకు కలవర పడ్డారు?

జన సమూహాలు శిష్యులు తమ స్వభాషలో మాట్లాడడం విని కలవర పడ్డారు[2:6].

Acts 2:8

దేన్ని గూర్చి శిష్యులు మాట్లాడుతున్నారు?

శిష్యులు దేవుని గొప్ప పనులను గూర్చి చెబుతున్నారు[2:11].

Acts 2:12

అపహాస్యము చేసేవారు యేసు శిష్యులను గూర్చి ఏమని తలంచారు?

అపహాస్యము చేస్తూ వారు కొత్త మద్యంతో నిండి యున్నారని తలంచారు[2:13].

Acts 2:16

పేతురు చెప్పిన విధంగా ఆ కాలములో నెరవేరినది ఏమిటి?

యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం ప్రకారం, శరీరులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడని పేతురు చెప్పాడు [2:16-17].

Acts 2:20

యోవేలు ప్రవచనం ప్రకారంగా రక్షణ పొందిన వారు ఎవరు?

ప్రభువు పేరున ఎవరైతే ప్రార్ధన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారు[2:21].

Acts 2:22

యేసు పరిచర్యను దేవుడు ఏవిధంగా అమోదించాడు?

యేసు పరిచర్యను ఆయన ద్వారా దేవుడు చేసిన అద్బుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలను బట్టి దేవుడు ఆమోదించాడు [2:22].

యేసును సిలువ వేయడం ఎవరి ప్రణాళిలో ఉన్నది?

దేవుడు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారంగా యేసును సిలువ వేసారు [2:23].

Acts 2:27

పాత నిబంధన గ్రంథంలో రాజైన దావీదు దేవుని పరిశుద్దుని గూర్చి ఏమి చెప్పాడు?

దేవుడు తన పరిశుద్దుని కుళ్ళిపోనివ్వడని దావీదు చెప్పాడు [2:25,27,31].

Acts 2:29

దేవుడు దావీదు సంతతిని గూర్చి ఏమని ప్రమాణం చేసాడు?

దేవుడు దావీదుతొ అతని గర్బఫలంలో ఒకణ్ణి సింహాసనం మీద కూర్చుండ బెడతానని ప్రమాణం చేసాడు [2:30].

Acts 2:32

కుళ్ళు చూడక దేవుని సింహాసనము పై కూర్చుండే దేవుని పరిశుద్దుడు ఎవరు?

యేసు పరిశుద్దుడుగా రాజుగా ప్రవచి౦పబడ్డాడు [2:32].

Acts 2:34

పేతురు ప్రసంగములో చెప్పిన విదముగా దేవుడు యేసునకు ఇచ్చిన రెండు బిరుదులు ఏవి?

దేవుడు యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించాడు [2:36].

Acts 2:37

జనసమూహం పేతురు ప్రసంగాన్ని విని ఏమన్నారు?

జనసమూహం పేతురును మేము ఏమి చేయాలి? అని అడిగారు [2:37].

పేతురు జనసమూహాన్నిఏమి చేయాలి అని చెప్పాడు?

పేతురు జనసమూహాన్ని మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలని చెప్పాడు [2:38].

దేవుని వాగ్దానం ఎవరి కోసమని పేతురు చెప్పాడు?

దేవుని వాగ్దానం జనులందరికీ, వారి పిల్లలకును దూరస్థులందరికిని చెందునని వారితో చెప్పాడు [2:39].

Acts 2:40

ఆరోజు ఎంతమంది ప్రజలు బాప్తిసం తీసుకొన్నారు?

ఆరోజు ఇంచుమించు మూడువేల మంది బాప్తిసం తీసుకొన్నారు [2:41].

బాప్తిసం తీసుకొన్నవారు ఏమిచేసారు?

వీరు అపొస్తలుల బోధలోను సహవాసములోను , రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను కొనసాగుచుoడిరి [2:42].

Acts 2:43

విశ్వసించినవారు అవసరాలలో ఉన్నవారి కోసం ఏమి చేసారు?

విశ్వసించినవారు తమకు ఉన్నవాటిని, ఆస్తులను అమ్మి, అందరికిని వారి వారి అవసరాన్నిబట్టి పంచిపెట్టారు[2:44-45].

Acts 2:46

విశ్వసించినవారు ఎక్కడ కలసుకోనేవారు?

విశ్వసించినవారు ప్రతిదినము దేవాలయంలో కలసుకోనేవారు [2:46].

విశ్వసించినవారి గుంపులో ప్రతిరోజూ చేర్చబడినది ఎవరు? .

ప్రభువు రక్షణ పొందుతున్నవారిని ప్రతిరోజూ వారితో చేర్చాడు [2:47].


Chapter 3

Translation Questions

Acts 3:1

పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎవరిని చూసారు?

పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుట్టుక నుండి కుంటివానిగా పుట్టినవాడు దేవాలయపు సింహ ద్వారం దగ్గర అడుక్కోవటం చూసారు [3:2].

Acts 3:4

పేతురు అతనికి ఏమి ఇవ్వలేదు?

పేతురు అతనికి వెండి బంగారాలు ఇవ్వలేదు [3:6].

Acts 3:7

పేతురు అతనికి ఏమి ఇచ్చాడు?

పేతురు అతనికి నడచే సామర్థ్యం ఇచ్చాడు [3:6,7].

పేతురు ఇచ్చిన దానికి అతడు ఏమి చేసాడు?

అతను దేవాలయంలోకి వెళ్లి నడుస్తూ, గెంతుతూ దేవుని స్తుతించాడు [3:8].

Acts 3:9

దేవాలయంలో అతనిని చూచి ప్రజలు ఎలా స్పందిoచారు

ప్రజలు అతనిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు [3:10].

Acts 3:13

యేసుకు ఏమి చేసారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు?

యేసును తృణీకరించి, పిలాతుకు అప్పగించి, చంపేశారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు [3:13-15].

Acts 3:15

పేతురు ఏమి చెప్పి అతనిని బాగుచేసాడు?

పేతురు వారితో యేసు నామమందు విశ్వాసము వలన అతడు బాగుపడ్డాడు అని చెప్పాడు[3:16].

Acts 3:19

ప్రజలు ఏమి చేయాలి అని పేతురు చెప్పాడు?

పేతురు ప్రజలను పశ్చాత్తాప పడాలని చెప్పాడు [3:19].

Acts 3:21

పరలోకంలో యేసు ఉండే కాలాన్ని గూర్చి పేతురు ఏమి చెప్పాడు?

అన్నిపరిస్తితులు చక్కబడే కాలము వచ్చే వరకు యేసు పరలోకంలో ఉండుట అవసరమని పేతురు చెప్పాడు [3:21].

యేసును గురించి మోషే ఏమి చెప్పాడు?

దేవుని మాట వినేలా ప్రజలలో తన వంటి ప్రవక్తను పుట్టిస్తాడని మోషే చెప్పాడు [3:22].

యేసు మాట వినని ప్రతి మానవునికి ఏమి జరుగుతుంది?

యేసు మాట వినని వాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగును [3:23].

Acts 3:24

పాత నిబంధన లోని ఏ వాగ్దానాన్ని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు?

దేవుడు అబ్రాహాము సంతానం ద్వారా భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడుననిన వాగ్దానానికి వారసులై యున్నారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు [3:25].

దేవుడు యూదులను ఏవిధంగా ఆశీర్వదించాలని కోరుకొంటున్నాడు?

యేసును మొదటిగా యూదుల యొద్దకు పంపి వారిని దుష్టత్వము నుండి మళ్ళించి, ఆశీర్వదించాలని దేవుడు కోరుకొన్నాడు [3:26].


Chapter 4

Translation Questions

Acts 4:1

పేతురు యోహానులు దేవాలయంలో ఏమి బోధించారు?

పేతురు యోహానులు దేవాలయంలో, యేసు పునరుత్థానము మరణములను బోధించారు [4:2].

పేతురు యోహానుల బోధకు ప్రజలు ఎలా స్పందించారు?

చాలామంది విశ్వసించారు, దాదాపుగా ఐదువేల మంది. [4:4].

పేతురు యోహానుల బోధకు దేవాలయపు అధికారులు పెద్దలు శాస్త్రులు ఎలా స్పందించారు?

వారు పేతురు యోహానులను భందించి, చెరలో పెట్టారు[4:3].

Acts 4:8

ఏ శక్తి ద్వారా, ఎవరి నామములో దేవాలయంలో వ్యక్తి స్వస్తత పొందాడని పేతురు చెప్పాడు?

యేసు నామమందు అతడు బాగుపడ్డాడు అని పేతురు వారితో చెప్పాడు [4:10].

Acts 4:11

మనము రక్షణ పొందడానికి ఉన్న ఒకేఒక్క మార్గమును గూర్చి పేతురు ఏమని చెప్పాడు?

యేసు నామముననే రక్షణ పొందాలి గాని, మరి ఏ నామమున రక్షణ పొందలేము అని పేతురు చెప్పాడు[4:12].

Acts 4:13

యూదుల అధికారులు పేతురు యోహానులకు ఎందుకు ఎదురు చెప్పలేకపోయారు?

స్వస్తత పొందిన వ్యక్తి పేతురు యోహానులతోపాటు నిలబడి ఉండుటవలన యూదుల అధికారులు ఎదురు చెప్పలేకపోయారు [4:14].

Acts 4:15

యూదుల అధికారులు పేతురు యోహానులకు ఏమి చేయకూడదని ఆజ్ఞాపించారు?

యూదుల అధికారులు పేతురు యోహనులకు యేసు నామమున మాట్లాడకూడదని, బోదింపకూడదని ఆజ్ఞాపించారు [4:18].

Acts 4:19

యూదుల అధికారులకు పేతురు యోహానులు ఏమని బదులు చెప్పారు?

తాము చూచిన వాటిని, విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని పేతురు యోహనులు చెప్పారు [4:20].

Acts 4:29

యూదుల అధికారుల బెదిరింపులు విని విశ్వాసులు దేవుని ఏమని అడిగారు?

వాక్యమును చెప్పే దైర్యమును, యేసు నామములో సూచక క్రియలు, అద్బుతములు చేయాలనీ విశ్వాసులు దేవుణ్ణి అడిగారు [4:29,30].

విశ్వాసులు ప్రార్ధన ముగించినప్పుడు ఏమి జరిగింది?

విశ్వాసులు ప్రార్ధించినపుడు వారు కూడుకొన్న స్టలము కంపించి, పరిశుద్దత్మతో వారు నింపబడి ఎంతో దైర్యముతో వాక్యమును బోధించారు [4:31].

Acts 4:32

విశ్వాసుల అవసరాలు ఎలా అందించబడినవి?

విశ్వాసులు తమకు కలిగినవాటిని అందరితో సమానంగా పంచుకొన్నారు, వారి ఆస్తులను అమ్మి అవసరాన్ని బట్టి పంచారు [4:32,34,35].

Acts 4:36

తన పొలమును అమ్మగా వచ్చిన డబ్బును అపొస్తలులకు ఇచ్చిన వానికి "ఆదరణ పుత్రుడు" అని అర్థము వచ్చే కొత్త పేరు పెట్టారు. ఆ వ్యక్తి ఎవరు ?

"ఆదరణ పుత్రుడు" అను పేరుగల వ్యక్తి బర్నబా [4:36-37].


Chapter 5

Translation Questions

Acts 5:1

అననీయ సప్పీరాలు ఏమి చేసారు?

అననీయ సప్పీరాలు పొలమును అమ్మిన డబ్బు మొత్తం ఇస్తున్నామని అబద్దమాడి కొంత మాత్రమే ఇచ్చారు [5:1-3].

Acts 5:3

అననీయ సప్పీరాలు ఎవరితో అబద్దం చెప్పారని పేతురు చెప్పాడు?

అననీయ సప్పీరాలు పరిశుద్దాత్మతో అబద్దం చెప్పారని పేతురు చెప్పాడు [5:3].

Acts 5:9

అననీయ సప్పీరాలపై దేవుని తీర్పు ఎలా వచ్చింది?

అననీయ సప్పీరాలను దేవుడు చంపివేశాడు [5:5,10].

అననీయ సప్పీరాలకు జరిగినది విన్నవారందరికి, సంఘములోని వారు ఎలా స్పందించారు?

అననీయ సప్పీరాలకు జరిగినది విన్నవారందరికి, సంఘములోని వారికీ చాలా భయం వేసింది [5:11].

Acts 5:14

వ్యాధిగ్రస్తులు స్వస్తత పొందడానికి ప్రజలు ఏమి చేసారు?

కొందరు పేతురు నీడైనా పడితే నయం అవుతుందని వ్యాధిగ్రస్తులు వీధులలోకి తెచ్చారు, మరికొందరు యెరూషలేం చుట్టునుండు పట్టణములనుండి రోగులను తెచ్చారు [5:15-16].

Acts 5:17

యెరూషలేములో స్వస్థత పొందినవరిని చూచి సద్దుకయ్యులు ఏమన్నారు?

సద్దుకయ్యులు మత్సరముతో నిండి, అపోస్తలులను చెరసాలలో పెట్టారు[5:17-18].

Acts 5:19

అపోస్తలులు చెరసాలలోనుండి ఎలా బయటకు వచ్చారు?

ఒక దేవదూత వచ్చి చెరసాల తలుపులు తీసి వారిని బయటకు తెచ్చాడు [5:19].

Acts 5:22

ప్రధాన యాజకుని అధికారులు చెరసాలకు వచ్చినప్పుడు ఏమి కనుగొన్నారు?

అధికారులు చెరసాల భద్రంగా మూసివేయబడి, లోపల ఎవ్వరూ లేరని కనుగొన్నారు [5:23].

Acts 5:26

అధికారులు అపోస్తలులను ఎట్టి హింస లేకుండా ప్రధాన యాజకుని సభ యొద్దకు తేవడానికిగల కారణం ఏమిటి?

అధికారులు ప్రజలు రాళ్లతో కొడతారని భయపడ్డారు [5:26].

Acts 5:29

భోదింప కూడదని అజ్ఞాపించినా యేసు నామమున ఎందుకు భోధిస్తున్నారని ప్రశ్నించినప్పుడు అపోస్తలులు ఏమన్నారు?

"మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను" అని అపోస్తలులు అన్నారు [5:29].

యేసును చంపినది ఎవరని అపోస్తలులు అన్నారు?

యేసును చంపినది ప్రధాన యాజకుడు, సిబ్బంది అని అపోస్తలులు అన్నారు [5:30].

Acts 5:33

యేసు చావుకు కారకులు మీరే అని చెప్పిన మాటకు మహా సభ వారు ఎలా స్పందించారు?

మహా సభ వారు గొప్ప కోపంతో నిండిన వారై అపోస్తలులను చంపబోయారు [5:33].

Acts 5:38

గమలియేలు మహా సభ వారికి ఇచ్చిన సలహా ఏమిటి?

అపోస్తలులను విడిచిపెట్టమని గమలియేలు మహాసభ వారికి సలహా ఇచ్చాడు [5:38].

గమలియేలు మహాసభ వారితో అపోస్తలులను విడచిపెట్టకపోతే ఏమవుతుందని హెచ్చరించాడు?

గమలియేలు మహాసభ వారితో మీరు దేవునితో పోరాడువారవుతారని చెప్పాడు [5:39].

Acts 5:40

మహా సభ వారు చివరకు అపోస్తలులను ఏమి చేసారు?

మహా సభ వారు అపొస్తలులను కొట్టించి, యేసు నామ మున బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసారు [5:40].

మహా సభ వారు అపోస్తలులకు చేసిన దానిని బట్టి ఎలా స్పందించారు?

అపోస్తలులు యేసు నామమునుబట్టి అవమానము పొందుటకు యోగ్యులుగా యెంచబడినందుకు సంతోషించారు [5:41].

అపోస్తలులకు మహా సభ వారియెద్దనుండి వెళ్లిన తరువాత ప్రతిదినము ఏమి చేసేవారు?

అపోస్తలులు ప్రతిదినము దేవాలయంలోనూ, ఇంటింటను ప్రతిదినము బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటిస్తూవచ్చారు [5:42].


Chapter 6

Translation Questions

Acts 6:1

గ్రీకుభాష మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద చేసిన ఫిర్యాదు ఏమిటి?

గ్రీకుభాష మాట్లాడే యూదులు, వారికీ సంబధించిన విధవరాండ్రను ఆహారము పంచి పెట్టేటప్పుడు చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద ఫిర్యాదు చేసారు [6:1].

Acts 6:2

ఆహారమును పంచి పెట్టే బాధ్యతను యేడుగురు మనుష్యులకు అప్పగించినది ఎవరు?

శిష్యులు(విశ్వాసులు) యేడుగురు మనుష్యులను ఎన్నుకోన్నారు [6:3,6].

ఎన్నుకోబడిన ఆ యేడుగురు మనుష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి?

ఆ యేడుగురు మనుష్యులు మంచి పేరు కలిగి ఆత్మతోను జ్ఞానముతోను నింపబడినవారై ఉండాలి [6:3].

అపోస్తలులు ఏమి కొనసాగించారు?

అపోస్తలులు ప్రార్థనచేయుటలోను వాక్యపరిచర్యలోను ఎడతెగక యుండిరి [6:4].

Acts 6:5

ఎన్నుకోబడిన ఆ యేడుగురు మనుష్యులను తెచ్చినప్పుడు అపోస్తలులు ఏమిచేసారు?

అపోస్తలులు వారిపై తమ చేతులు ఉంచి ప్రార్ధన చేసారు [6:6].

Acts 6:7

శిష్యులకు యేరూషలేములో ఏమి జరిగింది?

అనేకమంది యాజకులతొ సహా శిష్యుల సంఖ్య యెరూష లేములో చాల ఎక్కువగా విస్తరించింది [6:7].

Acts 6:10

స్తెఫను, యూదులలో విశ్వసించని వారు చర్చించుకొన్నప్పుడు ఎవరు గెలిచేవారు?

స్తెఫను మాటలలోని జ్ఞానము, ఆత్మ ఎదుట విశ్వసించని యూదులు నిలువలేకపోయిరి [6:10].

Acts 6:12

స్తెఫనుకు వ్యతిరేకముగా మహా సభ వారు ఎదుట అబద్ధ సాక్షులు చేప్పిన ఆరోపణలు ఏమిటి?

స్తెఫనుకు వ్యతిరేకముగామహా సభ వారు ఎదుట అబద్ధ సాక్షులు యేసు పరిశుద్ధ స్థలమును పడగొట్టి, మోషే ఇచ్చిన ఆచారములను మార్చునని స్తెఫను చెప్పగా విన్నామని తప్పుడు సాక్షము చెప్పారు [6:14].

స్తెఫను వైపు చూచినప్పుడు మహా సభ వారికి ఏమి కనిపించింది?

వారు స్తెఫను ముఖము దేవదూత ముఖమువలె ఉండుటను చూచారు [6:15].


Chapter 7

Translation Questions

Acts 7:1

స్తెఫను యూదుల యొక్క చరిత్రను, ఎవరికి దేవుడు చేసిన వాగ్దానంను గూర్చి చెప్పసాగాడు?

స్తెఫను, దేవుడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంతొ మొదలుపెట్టి తమ చరిత్రను వారికి చెప్పసాగాడు [7:2].

Acts 7:4

దేవుడు అబ్రహాముకు ఏమని వాగ్దానం చేసాడు?

దేవుడు అబ్రహాముకు అతని వారసులకు భూమిని స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసాడు [7:5].

దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరడం ఎందుకు అసాద్యమైనది?

అబ్రహాముకు సంతానము లేనందున దేవుడుచేసిన వాగ్దానం నెరవేరడం అసాద్యమైనది [7:5].

Acts 7:6

అబ్రహాముకు, తన సంతానమునముకు నాలుగు వందల సంవత్సరములు ఏమి జరగనైయున్నదని దేవుడు చెప్పాడు?

అబ్రహాము, తన సంతానము నాలుగు వందల సంవత్సరములు పరదేశములో బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పాడు [7:6].

దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధన ఏమిటి?

నిబంధనతో కూడిన సున్నతిని అబ్రహాముకు ఇచ్చాడు [7:8].

Acts 7:9

యోసేపు ఐగుప్తులో బానిసగా ఎలా అయ్యాడు?

అతని అన్నలు అతనిపట్ల అసూయతో ఈజిప్ట్ కు అమ్మివేసారు [7:9].

యోసేపు ఐగుప్తుకు పరిపాలకునిగా ఎలా అయ్యాడు?

దేవుడు యోసేపుకు ఫరో సమక్షములో దయను జ్ఞానమును దయచేసాడు [7:10].

Acts 7:11

కానానులో కరువు ఉన్నందున యాకోబు ఏమి చేసాడు?

యాకోబు ఐగుప్తు లో ధన్యమున్నదని విని తన కుమారులను అక్కడికి పంపించాడు [7:12-13].

Acts 7:14

యాకోబు అతని బంధువులు ఐగుప్తుకు ఎందుకు వెళ్లారు?

యోసేపు తన అన్నలకు, యకోబును ఐగుప్తు రమ్మని చెప్పి పంపాడు [7:14].

Acts 7:17

అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినప్పుడు ఐగుప్తు లో ఉన్న ఇశ్రాయేలీయులకు ఏమి జరిగినది?

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి[7:17].

ఐగుప్తు కొత్త రాజు ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగకుండా ఉండేందుకు ఏమి చేసాడు?

ఈజిప్ట్ కొత్త రాజు ఇశ్రాయేలీయుల శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని బలవంతం చేసాదు [7:19].

Acts 7:20

బయట పారవేయబడిన మోషే ఎలా బ్రతికాడు?

ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొన్నది [7:21].

Acts 7:22

మోషే ఏవిధంగా విద్యను అభ్యసించాడు?

మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు [7:22].

నలబై యేండ్ల వయస్సులో, ఇశ్రాయేలీయులు హింసించబడుట చూచి మోషే ఏమి చేసాడు?

మోషే ఇశ్రాయేలీయుని పక్షమున ఐగుప్తీయుని చంపాడు [7:24].

Acts 7:29

మోషే ఎక్కడకు పారిపోయాడు?

మోషే మిద్యానుకు పారిపోయాడు[7:29].

మోషే ఎనబై యేండ్ల వయస్సులో ఉన్నప్పుడు ఏమి చూసాడు?

మోషే మoడుచున్న పొదలో అగ్నిలో దేవదూతను చూసాడు [7:30].

Acts 7:33

మోషే ఎక్కడకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు , అక్కడ దేవుడు ఏమి చేయనై యున్నాడు?

దేవుడు మోషే కు ఐగుప్తుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఎందుకంటే, దేవుడు ఇశ్రాయేలీయులను రక్షింపనై యున్నాడు [7:34].

Acts 7:35

మోషే ఇశ్రాయేలీయులను అరణ్యములో ఎన్ని సంవత్సరములు నడిపాడు?

మోషే ఇశ్రాయేలీయులను అరణ్యములో నలభై సంవత్సరములు నడిపాడు [7:36].

మోషే ఇశ్రాయేలీయులకు ఏమని ప్రవచించాడు?

నావంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టిస్తాడని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు [7:37].

Acts 7:41

ఇశ్రాయేలీయులు తమ హృదయాలను ఏవిధంగా ఐగుప్తు వైపుకు త్రిప్పారు?

ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడ ప్రతిమకు బలి అర్పించారు [7:41].

ఇశ్రాయేలీయులు దేవుడు నుండి మళ్లుకొన్నప్పుడు దేవుడు ఏమి చేసారు?

దేవుడు ఇశ్రాయేలీయుల నుండి మళ్లుకొని. ఆకాశసైన్యమును సేవించేలా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాడు [7:42].

Acts 7:43

ఇశ్రాయేలీయులను ఎక్కడకు తీసుకువెళ్తానని దేవుడు చెప్పాడు?

ఇశ్రాయేలీయులను బబులోనుకు తీసుకువెళ్తానని దేవుడు చెప్పాడు[7:43].

Acts 7:44

వారి దేశమునకు తీసుకొని పోవుటకు అరణ్యములో ఇశ్రాయేలీయులను ఏమి చేయమని దేవుడు చెప్పాడు?

అరణ్యములో ఇశ్రాయేలీయులు సాక్ష్యపుగుడారమును చేసారు [7:44-45].

ఇశ్రాయేలీయుల ఎదుటనుండి ఇతర జాతి ప్రజలను ఎవరు వెళ్ళగొట్టారు?

దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుటనుండి ఇతర జాతి ప్రజలను వెళ్ళగొట్టారు [7:45].

Acts 7:47

దేవునికి ఒక నివాసస్థలము కట్టమని చెప్పినది ఎవరు, అది కట్టినది ఎవరు?

దావీదు దేవునికి ఒక నివాసస్థలము కట్టమని చెప్పాడు కానీ సొలొమోను ఆయనకొరకు మందిరమును కట్టించాడు [7:46-47].

మహోన్నతుని సింహాసనము ఎక్కడ ఉంటుంది?

మహోన్నతుని సింహాసనము ఆకాశములో ఉంటుంది [7:49].

Acts 7:51

స్తెఫను ప్రజలతో వారి పితరులవలె ఏమిచేస్తున్నారని ఆరోపించాడు?

పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని స్తెఫను ప్రజలను గురించి ఆరోపించాడు [7:51].

ఏ విషయములో ప్రజలు దోషులయ్యారని స్తెఫను ప్రజలతో చెప్పాడు?

నీతిమంతుని అప్పగించి హత్య చేసి చంపిన విషయంలో ప్రజలు దోషులయ్యారని చెప్పాడు [7:52].

Acts 7:54

స్తెఫను ఆరోపణకు మహా సభ వారు ఏమిఅన్నారు?

మహా సభ వారు కోపముతో మండిపడి స్తెఫనును చూచి పండ్లుకొరికిరి [7:54].

ఆకాశంలో ఏమి కనిపిస్తుందని స్తెఫను చెప్పాడు?

యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడి యుండుటను చూచుచున్నానని స్తెఫను చెప్పాడు [7:55-56].

Acts 7:57

స్తెఫనును మహా సభ వారు ఏమిచేసారు?

మహా సభ వారు స్తెఫనుపై బడి పట్టణపు బయటికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లతొ కొట్టారు [7:57-58].

రాళ్లతొ కొట్టేటప్పుడు సాక్షులు తమ పైవస్త్రములను ఎక్కడ పెట్టారు?

సాక్షులు తమ పైవస్త్రములను సౌలు అను ఒక ¸యవనుని దగ్గర పెట్టారు [7:58].

Acts 7:59

తాను చనిపోక ముందు స్తెఫను అడిగిన చివరి విషయమేమిటి?

ఈ పాపమును వారిమీద మోపకుమని స్తెఫను దేవుణ్ణి అడిగాడు [7:58].


Chapter 8

Translation Questions

Acts 8:1

స్తెపను రాళ్ళతో కొట్టబడిన దానిని గురింఛి సౌలు ఏమని ఆలోచించాడు?

స్తెఫను చావుకు సౌలు సమ్మతించాడు [8:1].

స్తెఫను రాళ్ళతో కొట్టబడిన రోజు ఏమి ఆరంభమయ్యింది?

స్తెఫను రాళ్ళతో కొట్టబడిన రోజు యెరులేములోని సంఘముకు వ్యతిరేకంగా గొప్ప హింస ఆరంభమయ్యింది [8:1].

యెరులేములోని విశ్వాసులు ఏమి చేసారు?

యెరులేములోని విశ్వాసులు అందరు యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయారు, శుభవార్తను ప్రకటిస్తూ వెళ్ళారు [8:1,4].

Acts 8:6

ఫిలిప్పు చెప్పినదానికి సమరయ ప్రజలు ఎందుకు శ్రద్దగా విన్నారు?

ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు చూసి సమరయ ప్రజలు అతని మాటలు శ్రద్దగా విన్నారు [8:6].

Acts 8:9

సీమోను చెప్పినదానికి సమరయ ప్రజలు ఎందుకు శ్రద్దగా విన్నారు?

సీమోను మంత్ర విద్యలు చూసి సమరయ ప్రజలు అతడి మాటలు శ్రద్దగా విన్నారు [8:9-11].

Acts 8:12

ఫిలిప్పు సందేశం వినినప్పుడు సీమోను ఏమి చేసాడు?

సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు [8:13].

Acts 8:14

సమరయలోని విశ్వాసుల మీద పేతురు యోహానులు చేతులుంచినపుడు ఏమి జరిగింది?

సమరయలోని విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందారు [8:17].

Acts 8:18

సీమోను అపోస్తలులకు ఏమి ఇవ్వజూపాడు ?

తాను ఎవరి మీదనైన చేతులుంచినపుడు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చునట్లు అధికారము పొందునట్లు సీమోను అపోస్తలులకు డబ్బు ఇవ్వజూపాడు [8:18-19].

Acts 8:20

సీమోను అపోస్తలులకు డబ్బు ఇవ్వజూపిన తరువాత అతని ఆత్మీయ స్థితి గురించి పేతురు ఏమన్నాడు?

సీమోను ఘోరదుష్టత్వముతోను, దుర్నీతి బంధకములతోను నిండి యున్నాడని పేతురు చెప్పాడు [8:23].

Acts 8:26

ఫిలిప్పును ఏమి చెయ్యమని దూత చెప్పాడు?

దక్షిణంగా గాజా వైపు అరణ్య మార్గానికి వెళ్ళమని ఫిలిప్పుకు దూత చెప్పాడు [8:26].

ఫిలిప్పు ఎవరిని కలిసాడు, అతను ఏమి చేస్తున్నాడు?

ఫిలిప్పు ఇతియోపియ నుండి గొప్ప అధికారియైన నపుంపసకుణ్ణి కలిసాడు. అతడు రధంలో కూర్చుని ఉండి యెషయాాప్రవక్త గ్రంధం చదువుతూ ఉన్నాడు [8:27-28].

Acts 8:29

ఫిలిప్పు అతనిని ఏ ప్రశ్న అడిగాడు?

"మీరు చదువుతూ ఉన్నది మీకు అర్ధం అవుతుందా?" అని ఫిలిప్పు అతనిని అడిగాడు [8:30]

ఆ వ్యక్తి ఫిలిప్పును ఏమి చెయ్యమని కోరాడు?

ఆ వ్యక్తి ఫిలిప్పును తన రధమెక్కి తనతో కూర్చోమని, తాను చదువుచున్న దానిని వివరించమని అడిగాడు [8:31].

Acts 8:32

లేఖనాలలోని యెషయా గ్రంధం నుండి వివరించబడుతున్న వ్యక్తికి ఏమి జరుగుతుంది?

ఆయన గొర్రెలాగా వధకు తేబడ్డాడు, ఆయన తన నోరు తెరువలేదు [8:32].

Acts 8:34

లేఖనాలను చదువుతూ ఉన్న వ్యక్తి ఫిలిప్పును ఏ ప్రశ్న అడిగాడు?

ప్రవక్త ఇలా చెప్పేది తన విషయమా లేక మరొకరి విషయమా అని ఫిలిప్పును అడిగాడు [8:34].

యెషయా నుండి లేఖనాలలోని వ్యక్తి ఎవరు అని ఫిలిప్పు చెప్పాడు ?

యెషయా నుండి లేఖనాలలోని వ్యక్తి యేసు అని ఫిలిప్పు ఆ వ్యక్తికి వివరించాడు [8:35].

Acts 8:36

అప్పుడు ఫిలిప్పు ఆ వ్యక్తికి ఏమి చేసాడు?

ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు [8:38]

Acts 8:39

నీళ్ళలోనుంచి బయటకు వచ్చినపుడు ఫిలిప్పుకు ఏమి జరిగింది?

నీళ్ళలోనుంచి బయటకు వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకువెళ్ళాడు [8:39].

నీళ్ళలోనుంచి బయటకు వచ్చిన తరువాత నపుంసకుడు ఏమి చేసాడు?

నీళ్ళలోనుంచి బయటకు వచ్చిన తరువాత నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళాడు [8:39].


Chapter 9

Translation Questions

Acts 9:1

ఏమి చెయ్యడానికి యెరూషలేములోని ప్రధాన యాజకులను సౌలు అనుమతి కోరాడు?

తాను దమస్కు వరకు ప్రయాణం చేసి ఈ మార్గమునకు చెందినా వారినెవరినైనా ఖైదుచేసి తీసుకొని రావడానికి లేఖలు వ్రాసి ఇవ్వాలని సౌలు కోరాడు [9:1-2].

Acts 9:3

దమస్కుకు సమీపించినపుడు సౌలు ఏమి చూసాడు?

దమస్కుకు సమీపించినపుడు, ఆకాశంనుండి వెలుగు రావడం సౌలు చూసాడు [9:3].

ఆ స్వరం సౌలుకు ఏమి చెప్పింది?

"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు" అని ఆ స్వరం చెప్పింది [9:4].

Acts 9:5

తనతో మాట్లాడుతున్నదెవరు అని సౌలు అడిగినప్పుడు వచ్చిన జవాబు ఏమిటి?

జవాబు "నీవు హింసించుచున్న యేసునే నేను" [9:5]

Acts 9:8

సౌలు నేలమీదనుండి లేచినపుడు అతనికి ఏమి జరిగింది?

సౌలు నేలమీదనుండి లేచినపుడు అతడు ఏమీ చూడలేకపోయాడు [9:8].

అక్కడనుండి సౌలు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏమి చేసాడు?

అక్కడనుండి సౌలు దమస్కుకు వెళ్ళాడు, అక్కడ మూడు రోజులు ఏమీ తినలేదు, త్రాగలేదు [9:9].

Acts 9:10

దేవుడు అననీయకు ఏమి చెయ్యమని చెప్పాడు?

దేవుడు అననీయను వెళ్లి సౌలుకు చూపుకలిగేల తన చేతులను సౌలుమీద ఉంచమని చెప్పాడు [9:11-12].

Acts 9:13

దేవునికి ఎటువంటి ఆందోళన అననీయ కనుపరచాడు?

ప్రభువుపేర ప్రార్ధన చేసేవారందరినీ ఖైదు చెయ్యడానికి సౌలు దమస్కుకు వచ్చాడని అననీయకు తెలుసు కనుక ఆందోళనపడ్డాడు [9:13-14].

ఆయన ఎంపిక చేసుకున్న సాధనముగా సౌలు కొరకు తాను ఎటువంటి పరిచర్యను ఉద్దేశించానని ప్రభువు చెప్పాడు ?

సౌలు ఇశ్రాయేలు ప్రజల ఎదుట. ఇతర ప్రజల ఎదుట, వారి రాజుల ఎదుట తన పేరును భరిస్తాడని ప్రభువు చెప్పాడు [9:15].

సౌలు పరిచర్య సులభమని లేక కష్టమని ప్రభువు చెప్పాడా?

ప్రభువు పేరు కోసం సౌలు అనేక బాధలు అనుభవించాలని చెప్పాడు [9:16].

Acts 9:17

అననీయ తన చేతులను సౌలు మీద ఉంచిన తరువాత ఏమి జరిగింది?

అననీయ తన చేతులను సౌలు మీద ఉంచిన తరువాత అతనికి చూపు వచ్చింది, అతడు బాపిస్మం తీసుకున్నాడు, భోజనం చేసాడు [9:19].

Acts 9:20

సౌలు వెంటనే ఏమి చెయ్య నారంభించాడు?

సౌలు వెంటనే యేసే దేవుని కుమారుడని యూద సమాజ కేంద్రాలలో ఆయనను గురించి ప్రసంగించడం మొదలు పెట్టాడు [9:20].

Acts 9:26

సౌలు యెరూషలేముకు వచ్చినపుడు శిష్యులు అతనిని ఏవిధంగా చేర్చుకున్నారు?

సౌలు యెరూషలేముకు వచ్చినపుడు శిష్యులు అతనికి భయపడ్డారు [9:26].

సౌలును శిష్యులవద్దకు తీసుకొని వచ్చి సౌలుకు దమస్కులో జరిగినదానిని వివరించినదెవరు?

బర్నబా సౌలును శిష్యులవద్దకు తీసుకొని వచ్చి సౌలుకు దమస్కులో జరిగినదానిని వివరించాడు [9:27].

Acts 9:28

యెరూషలేములో సౌలు ఏమి చేసాడు?

యెరూషలేములో సౌలు ప్రభువైన యేసుని గురించి ధైర్యంగా బోధించాడు [9:29].

Acts 9:31

సౌలు తార్సుకు పంపబడినపుడు యూదయ, గలలియ, సమరయలోని సంఘం ఎలా ఉంది?

సౌలు తార్సుకు పంపబడినపుడు యూదయ, గలలియ, సమరయలోని సంఘం క్షేమాభివృద్ధినొందుచూ సమాధానము కలిగియుండి విస్తరించుచుండెను [9:31].

Acts 9:33

లుద్దలోని వారందరూ ప్రభువువైపు తిరుగునట్లు అక్కడేమి జరిగింది?

లుద్దలో పేతురు ఒక పక్షవాయువుగల వానితో మాట్లాడినపుడు యేసు అతనిని స్వస్థపరచాడు [9:33-35].

Acts 9:36

యొప్పేలో అనేకులు ప్రభువును విశ్వసిచునట్లు అక్కడేమి జరిగింది?

యొప్పేలో చనిపోయిన తబిత అను స్త్రీ కొరకు పేతురు ప్రార్ధించగా ఆమె తిరిగి బ్రతికింది [9:36-42].


Chapter 10

Translation Questions

Acts 10:1

కోర్నేలీ ఎలాంటి మనిషి?

కోర్నేలీ భక్తిపరుడు, దేవునియందు భయభక్తులు గలవాడు, దానధర్మాలు చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్ధన చేయువాడు [10:2].

Acts 10:3

కోర్నేలీని దేవుడు జ్ఞాపకం చేసుకోడానికి కారణం ఏమిటని దూత అతనితో చెప్పాడు?

కోర్నేలీ ప్రార్ధనలు, పేదవారికి అతడు చేసిన ధర్మములు దేవునిసన్నిదికి జ్ఞాపకార్ధంగా చేరాయని దూత చెప్పాడు [10:4].

కోర్నేలీని ఏమి చెయ్యమని దూత చెప్పాడు?

పేతురుని పిలిపించుకొని రావడానికి యొప్పేకు మనుషులను పంపమని కోర్నేలీతో దూత చెప్పాడు [10:5].

Acts 10:9

మరుసటి రోజు పేతురు ప్రార్ధన చేయుటకు మిద్దెమీదికెక్కినపుడు ఏమి చూసాడు ?

సకల విధములైన నలుగు కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, ఆకాశపక్షులతో కూడిన పెద్ద దుప్పటి వంటి పాత్రను పేతురు చూసాడు [10:11-12].

Acts 10:13

పేతురు దర్శనంను చూసినపుడు ఒక స్వరం అతనితో ఏమి చెప్పింది ?

"నీవు లేచి చంపుకొని తినుము" అని ఆ స్వరం అతనితో చెప్పింది [10:13].

ఈ స్వరం నకు పేతురు స్పందన ఏమిటి?

పేతురు తాను నిషిద్ధమైనదానిని, అపవిత్రమైనదానిని ఎన్నడు తినలేదని వాటిని నిరాకరించాడు [10:14].

దీని తరువాత స్వరం పేతురుతో ఏమని చెప్పింది?

"దేవుడు పవిత్రం చేసినవాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు" అని స్వరం చెప్పింది [10:15]

Acts 10:19

కోర్నేలీ వద్దనుండి మనుష్యులు వచ్చినపుడు ఏమి చెయ్యమని ఆత్మ పేతురుతో చెప్పాడు?

వారితో వెళ్ళమని ఆత్మ పేతురుతో చెప్పాడు [10:20]

Acts 10:22

కోర్నేలీ వద్దనుండి మనుష్యులు పేతురు కోర్నేలీ ఇంటికి వచ్చి ఏమి చెయ్యాలని కోరారు?

కోర్నేలీ వద్దనుండి మనుష్యులు పేతురు కోర్నేలీ ఇంటికి వచ్చి సందేశము ఇవ్వాలని కోరారు [10:22].

Acts 10:25

కోర్నేలీ పేతురు పాదాలవద్ద సాగిలపడినపుడు పేతురు ఏమి చెప్పాడు ?

పేతురు కోర్నేలీ లేచి నిలువుము, తాను కూడా నరుడనే అని చెప్పాడు [10:26].

Acts 10:27

ఇంతకుముందు యూదులకు ధర్మము కాని దేన్ని పేతురు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు?

పేతురు అన్యజాతి వానితో సహవాసము చేస్తున్నాడు, ఎందుకంటే ఏ మనిషి నిషేదింపదగినవాడనిగానీ, అపవిత్రుడనిగానీ చెప్పకూడదని దేవుడు తనతో చెప్పాడు [10:28].

Acts 10:34

దేవునికి అంగీకారమైనవారు ఎవరని పేతురు చెపుతున్నాడు?

దేవునికి భయపడి నీతిగా నడచుకోనువానిని దేవుడు అంగీకరించునని పేతురు చెపుతున్నాడు [10:35].

Acts 10:36

యేసును గురించిన ఏ సందేశం కోర్నేలీ ఇంటివారు ఇంతకు ముందే విన్నారు?

దేవుడు యేసును పరిశుద్దాత్మతోను, శక్తితోను అభిషేకించేనని, దేవుడాయనకు తోడైయుండెను గనుక పీడింపబడినవారినందరినీ స్వస్థపరచెనని యేసును గురించి విన్నారు [10:38].

Acts 10:39

యేసు మరణం తరువాత యేసుకు ఏమి జరిగిందని పేతురు ప్రకటించాడు, పేతురుకు ఈ సంగతి ఎలా తెలుసు?

దేవుడు యేసును మూడవ దినమున లేపేనని పేతురు ప్రకటించాడు, యేసు పునరుద్దానుడైన తరవాత పేతురు ఆయనతో కలసి భోజనం చేసాడు [10:40-41].

Acts 10:42

ప్రజలకు ప్రకటించాలని తమను యేసు ఆజ్ఞాపించాడని పేతురు దేనిగురించి చెప్పాడు?

యేసు సజీవులకును, మృతులకును న్యాయాదిపతినిగా దేవునిచేత నియమింబడెనని ప్రకటించాలని యేసు ఆజ్ఞాపించాడని పేతురు చెప్పాడు [10:42].

యేసు నందు విశ్వాసముంచు వారందరూ ఏమి పొందుతారని పేతురు చెపుతున్నాడు?

యేసు నందు విశ్వాసముంచు వారందరూ పాప క్షమాపణ పొందుతారని పేతురు చెపుతున్నాడు [10:43]

Acts 10:44

పేతురు ఇంకనూ బోధించుచుండగా వినుచున్న వారికి ఏమి జరిగింది?

పేతురు బోధ వినుచున్నవారి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు [10:44].

సున్నతి పొందిన గుంపుకు చెందిన విశ్వాసులు ఎందుకు ఆశ్చర్యపోయారు?

సున్నతి పొందిన గుంపుకు చెందిన విశ్వాసులు ఆర్చర్యపోయారు ఎందుకంటే, పరిశుద్ధాత్మ అన్యజనులమీద కూడా కుమ్మరింపబడ్డాడు [10:45].

Acts 10:46

పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింప బడ్డాడనే దానిని కనపరచడానికి ప్రజలు ఏమి చేస్తున్నారు?

పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింప బడ్డాడనే దానిని కనపరచడానికి ప్రజలు ఇతర భాషలతో మాట్లాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూఉన్నారు [10:46].

ప్రజలు పరిశుద్ధాత్మను పొందారని చూచినా తరువాత వారి విషయంలో ఏమి జరగాలని పేతురు ఆజ్ఞాపించాడు?

యేసుక్రీస్తు నామంలో ప్రజలు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు [10:48]


Chapter 11

Translation Questions

Acts 11:1

యూదయలోని అపోస్తలులు, సహోదరులు ఏ వార్త విన్నారు?

అన్యజనులు కూడా దేవుని వాక్కును స్వీకరించారని యూదయలోని అపోస్తలులు, సహోదరులు విన్నారు [11:1].

యెరుషలేములోని సున్నతిపొందిన గుంపు వారికి పేతురుకు వ్యతిరేకంగా ఉన్న విమర్శ ఏమిటి?

అన్యజనులతో కలసి భోజనం చేస్తున్నాడని యెరుషలేములోని సున్నతి పొందిన గుంపు వారు పేతురును విమర్శించారు [11:2-3].

Acts 11:15

పేతురు తనకు వ్యతిరేకంగా ఉన్న విమర్శకు ఎలాంటి జవాబిచ్చాడు?

పెద్ద దుప్పటి విషయమైన దర్శనం, అన్యజనుల యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి వివరించడం ద్వారా పేతురు తనకు వ్యతిరేకంగా ఉన్న విమర్శకు జవాబిచ్చాడు [11:4-16].

Acts 11:17

పేతురు వివరణ వినిన తరువాత సున్నతి పొందినగుంపుకు చెందిన విశ్వాసుల అభిప్రాయం ఏమిటి?

దేవుడు అన్యజనులకు కూడా జీవార్ధమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచారు [11:18].

Acts 11:19

స్తెఫను మరణం తరువాత చెదరిపోయిన విశ్వాసులు ఏమి చేసారు?

స్తెఫను మరణం తరువాత చెదరిపోయిన అనేకమంది విశ్వాసులు యేసును గురించిన సందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు [11:19].

చెదరిపోయిన అనేకమంది విశ్వాసులు యేసును గురించిన సందేశాన్ని గ్రీసు దేశస్తులకు చెప్పినపుడు ఏమి జరిగింది?

యేసును గురించిన సందేశాన్ని గ్రీసు దేశస్తులకు చెప్పినపుడు అనేకమంది విశ్వసించారు [11:20-21].

Acts 11:22

యెరూషలేమునుండి వచ్చిన బర్నబా అంతియొకయలోని విశ్వాసులకు ఏమిచెప్పాడు?

ప్రభువును స్థిరహృదయంతో హత్తుకోనవలెనని బర్నబా వారిని ప్రోత్సహించాడు [11:22-23].

Acts 11:25

అంతియొకయలోని సంఘంలో సంవత్సరమంతా గడిపినదెవరు?

బర్నబా, సౌలు అంతియొకయలోని సంఘంలో సంవత్సరమంతా గడిపారు [11:26].

అంతియొకయలో శిష్యులకు మొదట ఇవ్వబడిన పేరేంటి?

అంతియొకయలో మొదటిసారిగా శిష్యులను "క్రైస్తవులు" అనడం జరిగింది [11:26].

Acts 11:27

ఏమి జరగబోతుందని అగబు అను ప్రవక్త ముందుగా చెప్పాడు?

లోకమంతటికీ గొప్ప కరవు రాబోతున్నాదని అగబు అను ప్రవక్త ముందుగా చెప్పాడు [11:28]

Acts 11:29

అగబు చెప్పిన ప్రవచనానికి శిష్యులు ఎలా స్పందించారు?

శిష్యులు యూదయలోని సహోదరులకు సహాయాన్ని బర్నబా, సౌలు ద్వారా పంపారు [11:29-30].


Chapter 12

Translation Questions

Acts 12:1

రాజైన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబుకు ఏమిచేసాడు?

రాజైన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు [12:2].

Acts 12:3

రాజైన హేరోదు పేతురుని ఏమిచేసాడు?

రాజైన హేరోదు పేతురుని ఖైదు చేసాడు, పస్కాపండుగ తరువాత ప్రజల ఎదుటికి అతణ్ణి తేవాలని ఉద్దేశించాడు [12:3-4].

Acts 12:5

సంఘం పేతురు కొరకు ఏమిచేస్తుంది?

సంఘం పేతురు కొరకు మనస్పూర్తిగా ప్రార్ధన చేస్తూఉంది [12:5].

Acts 12:7

పేతురు చెరసాల నుండి బయటకు ఎలావచ్చాడు?

ఒక దేవదూత పేతురుకు కనిపించాడు, అతని చేతులనుండి సంకెళ్ళు ఊడిపడ్డాయి, చెరసాల బయటవరకు దేవదూతను అనుసరించాడు [12:7-10].

Acts 12:13

విశ్వాసులు ప్రార్దిస్తున్న గదికి పేతురు వచ్చినపుడు తలుపు వద్ద జవాబిచ్చినదెవరు, ఆమె ఏమి చేసింది?

రోదే అనే పనిపిల్ల తలుపు తీయడానికి వచ్చింది, ఆమె తలుపు తీయకుండానే పేతురు తలుపు ముందు నిలువబడి ఉన్నాడని విశ్వాసులకు చెప్పింది [12:13-14].

ఆమె చెప్పిన మాటలకు శిష్యులు ఎలా స్పందించారు?

మొదట ఆమెకు మతి తప్పిందని తలంచారు, అయితే వారు తలుపు తెరిచి పేతురును చూసారు [12:15-16].

Acts 12:16

తనకు జరిగినదానిని విశ్వాసులకు వివరించిన తరువాత పేతురు వారికి ఏమని ఆజ్ఞాపించాడు?

యాకొబుకూ, సోదరులకూ ఈ సంగతులు తెలియజేయండి అని చెప్పాడు [12:17].

Acts 12:18

పేతురుకి కావలి కాసిన వారికి ఏమిజరిగింది?

పేతురుకి కావలి కాసిన వారిని హేరోదు ప్రశ్నించాడు, వారిని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు [12:19].

Acts 12:22

హేరోదు తన ప్రసంగాన్ని ఇచ్చినపుడు ప్రజలు ఏమని అరిచారు?

"ఇది ఒక దేవుడి స్వరమే గాని మనిషిది కాదు" అని ప్రజలు అరిచారు [12:22].

ప్రసంగం అయిన తరువాత హేరోదుకు ఏమి జరిగింది, ఎందువలన?

హేరోదు దేవుని మహిమపరచలేదు, కనుక ఒక దేవుని దూత అతణ్ణి మొత్తాడు, అతడు పురుగులు పడి చనిపోయాడు [12:23].

Acts 12:24

ఈ కాలంలో దేవుని వాక్యానికి ఏమిజరుగుతూ ఉంది?

దేవునివాక్యం అంతకంతకు వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉంది [12:24].

బర్నబా సౌలులు ఎవరిని తమ వెంట తీసుకొని వెళ్ళారు?

బర్నబా సౌలులు మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకువెళ్ళారు [12:25]


Chapter 13

Translation Questions

Acts 13:1

పరిశుద్ధాత్మ వారితో మాట్ల్లడుతున్నప్పుడు అంతియొకయలోని సంఘం ఏమిచేస్తుంది?

పరిశుద్ధాత్మ వారితో మాట్ల్లడుతున్నప్పుడు అంతియొకయలోని సంఘం ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం చేస్తూఉంది [13:2].

పరిశుద్ధాత్మ వారిని ఏమిచెయ్యమని చెప్పాడు?

ఆత్మ బర్నబాను, సౌలునూ పిలిచిన పనికోరకు వారిని ప్రత్యేకించుడని వారితో చెప్పాడు [13:2].

పరిశుద్ధాత్మ మాట వినిన తరువాత సంఘం ఏమిచేసింది?

సంఘం ఉపవాసముండి ప్రార్ధన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపారు [13:3].

Acts 13:4

బర్నబా, సౌలూ కుప్రకు వెళ్ళినపుడు వారితో ఎవరున్నారు?

కుప్రలో యోహాను అనబడిన మార్కు వారికి సాయం చేసేవాడిగా వారితో ఉన్నాడు [13:5].

Acts 13:6

బర్-యేసు ఎవరు ?

బర్-యేసు సెర్గిపౌలుతో ఉన్న యూదుల అబద్ద ప్రవక్త [13:6-7].

ఎందుకు సెర్గిపౌలు బర్నబా, సౌలూను పిలిపించుకొన్నాడు?

సెర్గిపౌలు దేవుని వాక్యము వినగోరెను గనుక బర్నబా, సౌలూను పిలిపించుకొన్నాడు [13:7].

Acts 13:9

సౌలుకు ఇవ్వబడిన మరియొక పేరేంటి?

సౌలుకు ఇవ్వబడిన మరియొక పేరు పౌలు [13:9].

Acts 13:11

బర్ యేసు సెర్గి పౌలును విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నించినపుడు పౌలు ఏమి చేసాడు?

తాను సాతాను కుమారుడని, తాను కొంత కాలము గ్రుడ్డివాడై యుంటాడని బర్ యేసుతో పౌలు చెప్పాడు [13:10-11].

బర్ యేసుకు జరిగినది చూసి సెర్గి పౌలు ఏవిధంగా స్పందించాడు?

సెర్గి పౌలు విశ్వసించాడు [13:12].

Acts 13:13

పౌలును అతని స్నేహితులును పెర్గేకు వెళ్ళడానికి నిశ్చయించినపుడు యోహాను ఏమిచేసాడు?

యోహాను పౌలును అతని స్నేహితులను విడిచి యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు [13:13].

పిసిదియలోని అంతియొకయలో ఎక్కడ పౌలును ప్రసంగించాలని అడిగారు?

పిసిదియలోని అంతియొకయలో యూదుల సమాజమందిరంలో ప్రసంగించాలని పౌలును అడిగారు [13:15].

Acts 13:21

పౌలు తన ప్రసంగంలో ఏ చరిత్రను తిరిగి చెపుతున్నాడు?

పౌలు తన ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజల చరిత్రను తిరిగి చెపుతున్నాడు [13:17-22].

Acts 13:23

ఎవరినుండి దేవుడు ఇశ్రాయేలు రక్షకుని తీసుకు వచ్చాడు?

రాజైన దావీడునుండి దేవుడు ఇశ్రాయేలు రక్షకుని తీసుకు వచ్చాడు [13:23].

రానున్న రక్షకుని మార్గమును సిద్ధపరచువాడని ఎవరి గురించి పౌలు చెప్పాడు?

రానున్న రక్షకుని మార్గమును సిద్ధపరచువాడని బాప్తిస్మమిచ్చు యోహాను గురించి పౌలు చెప్పాడు [13:24-25]

Acts 13:26

యెరూషలేములోని అధికారులు, ప్రజలు ప్రవక్త యొక్క సందేశాలను ఏవిధంగా నెరవేర్చారు?

యేసుకు శిక్షవిధించుటచేత యెరూషలేములోని అధికారులు, ప్రజలు ప్రవక్త యొక్క సందేశాలను నెరవేర్చారు [13:27].

Acts 13:30

ఇప్పుడు ప్రజలకు యేసుయొక్క సాక్షులు ఎవరు?

మృతులలోనుండి లేచిన యేసును చూచిన ప్రజలు ఇప్పుడు ఆయనకు సాక్షులైయున్నారు [13:31].

Acts 13:32

యూదులకు తాను చేసిన వాగ్దానాలను నేరవేర్చియున్నాడని దేవుడు ఎలా చూపించాడు?

మృతులలోనుండి యేసును లేపుటద్వారా యూదులకు తాను చేసిన వాగ్దానాలను నేరవేర్చియున్నాడని దేవుడు చూపించాడు [13:33].

Acts 13:35

కీర్తనలు ఒకదానిలో పరిశుద్ధుడైన వానికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి?

పరిశుద్ధుని కుళ్ళిపోనివ్వనని దేవుడు వాగ్దానం చేసాడు [13:35].

Acts 13:38

విశ్వసించు ప్రతివానికి పౌలు ఏమి ప్రకటిస్తున్నాడు?

విశ్వసించు ప్రతివానికి పౌలు పాపక్షమాపణను ప్రకటిస్తున్నాడు [13:38].

Acts 13:40

వినేవారికి పౌలు ఏ హెచ్చరికను కూడా ఇస్తున్నాడు?

దేవుని కార్యమును గురించి వివరించినను ఎంతమాత్రము నమ్మనివారి గురించి ప్రవక్తలచేత ప్రవచించిన వారివలె ఉండకుడి అని పౌలు హెచ్చరికను ఇస్తున్నాడు [13:40-41].

Acts 13:44

మరుసటి సబ్బాతుదినాన్న అంతియొకయలో దేవుని వాక్కును వినడానికి వచ్చినదెవరు?

మరుసటి సబ్బాతుదినాన్న దాదాపు ఆ పట్టణమంతయూ దేవుని వాక్యము వినడానికి కూడివచ్చారు [13:44].

జనసమూహములను చూచి యూదులు ఏవిధంగా స్పందించారు?

యూదులు జనసమూహములను చూచి అసూయతో నిండిపోయారు. పౌలు చెప్పినదానిని కాదంటూ దూషించారు [13:45].

Acts 13:46

వారికి చెప్పిన దేవుని వాక్కు విషయం యూదులు ఏమిచేసారని పౌలు చెపుతున్నాడు?

వారికి చెప్పిన దేవుని వాక్యాన్ని యూదులు త్రోసివేసారని పౌలు చెపుతున్నాడు [13:46].

Acts 13:48

పౌలు అన్యజనులవైపు వెళుతున్నాడని వారు వినినపుడు అన్యజనుల స్పందన ఏమిటి?

అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి [13:48].

అన్యజనులు ఎంతమంది విశ్వసించారు?

నిత్య జీవానికి నిర్ణయింప బడిన వారందరూ విశ్వసించారు [13:48].

Acts 13:50

యూదులు పౌలు, బర్నబాలకు ఏమిచేసారు?

యూదులు పౌలు, బర్నబాలకు వ్యతిరేకంగా హింసను పురికొల్పారు, వారిని తమ ప్రాంతములనుండి వెళ్ళగొట్టారు [13:50].

పౌలు, బర్నబాలు ఈకొనియాకు వెళ్లక ముందు ఏమిచేసారు?

పౌలు, బర్నబాలు తమ పాద ధూళిని అంతియొక పట్టణములో తామును బయటకు వెల్లగొ ట్టినవారివైపు దులిపివేసి ఈకొనియకు వచ్చారు [13:51].


Chapter 14

Translation Questions

Acts 14:1

పౌలు, బర్నబాల సందేశాలను విని అనేకులు విశ్వసించడం చూసి ఈకోనియలోని అవిధేయులైన యూదులు ఏమిచేసారు ?

అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించారు [14:1-2].

Acts 14:3

దేవుడు తన కృపావాక్యమును గురించి ఏ సాక్ష్యమును ఇచ్చాడు?

ప్రభువు వారి చేత సూచకక్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమును గురించి సాక్ష్యమిప్పించుచుండెను [14:3].

Acts 14:5

పౌలు, బర్నబాలు ఎందుకు ఈకోనియ విడిచిపెట్టారు?

కొందరు అన్యజనులును, యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి పౌలు, బర్నబాలను అవమానపరచి రాళ్ళు రువ్వి చంపాలని చూసారు [14:5-7].

Acts 14:8

లుస్త్రలో కోలాహలము కలుగుటకు పౌలు ఏమి చేసాడు?

పుట్టుకుంటివాడైన ఒక మనుష్యుని పౌలు స్వస్థపరచాడు [14:8-10].

Acts 14:11

లుస్త్రలోని ప్రజలు పౌలు, బర్నబాలకు ఏమిచెయ్యాలని చూసారు?

ద్యుపతియొక్క పూజారి ద్వారా పౌలు, బర్నబాలకు బలులు అర్పించాలని కోరారు [14:11-13,18].

Acts 14:14

ప్రజలు తమకు చెయ్యాడానికి ఇష్ట పడిన దాని విషయం పౌలు, బర్నబాలు ఏ విధంగా స్పందించారు?

పౌలు, బర్నబాలు తమ వస్త్రములను చించుకొని సమూహము లోనికి చొరబడి వారు వ్యర్ధమైన వాటిని విడిచి సజీవుడైన దేవుని వైపు తిరగాలని గట్టిగా అరిచారు [14:14-15].

Acts 14:17

గతకాలములలో సర్వజనులను తమ తమ మార్గములలో నడువనిచ్చెనని దేని గురించి పౌలు బర్నబా చెపుతున్నారు?

ఆయన అకాశమునుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారముననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు [14:16-17]

Acts 14:19

లుస్త్రలోని సమూహము తరువాత పౌలుకు ఏమిచేసారు?

లుస్త్రలోని సమూహము తరువాత పౌలుమీద రాళ్ళు రువ్వి పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి [14:19].

శిష్యులు అతని చుట్టూ నిలిచియుండగా పౌలు ఏమిచేసాడు?

అతడు లేచి పట్టణములో ప్రవేశించెను [14:20].

Acts 14:21

దేనిద్వారా శిష్యులు దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు చెప్పాడు?

అనేక శ్రమలను అనుభవించుట ద్వారా శిష్యులు దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు చెప్పాడు [14:22]

Acts 14:23

ప్రతి విశ్వాసుల సంఘములో వారిని విడిచివెళ్ల్లడానికి ముందు పౌలు బర్నబాలు ఏమిచేస్తారు?

ప్రతి సంఘములో పౌలు బర్నబాలు పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్ధన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు [14:23].

Acts 14:27

పౌలు బర్నబాలు అంతియొకయకు తిరిగి వచ్చినపుడు ఏమిచేసారు?

పౌలు బర్నబాలు అంతియొకయకు తిరిగి వచ్చినపుడు దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నిటిని, అన్యజనులు విశ్వసించుటకు అయన ద్వారము తెరచిన సంగతి వివరించిరి [14:27].


Chapter 15

Translation Questions

Acts 15:1

యూదయనుండి వచ్చిన కొందరు సహోదరులకు ఏమని బోధించారు?

యూదయనుండి వచ్చిన కొందరు సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు [15:1].

ఈ ప్రశ్న పరిష్కరించబడటానికి సహోదరులు ఏవిధంగా నిర్ణయించారు?

పౌలు, బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి [15:2].

Acts 15:3

ఫినేకే, సమరయ దేశములద్వారా వెళ్ళుచూ పౌలును అతని సహచారులును ఏ సమాచారాన్ని తెలియచేసారు?

పౌలును అతని సహచారులును అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచిరి [15:3].

Acts 15:5

అన్యజనులకు సున్నతిచేయించవలెనని, వారు మోషే ధర్మశాస్త్రమును గైకోనవలెనని విశ్వాసుల్లో ఏ గుంపువారు తలంచారు?

పరిసయ్యుల తెగలో కొందరు విశ్వాసులు అన్యజనులకు సున్నతి చేయించవలెనని, వారు మోషే ధర్మశాస్త్రమును గైకొనవలెనని తలంచారు [15:5].

Acts 15:7

అన్యజనులకు దేవుడు ఏమి చేసాడు, ఏమి ఇచ్చాడు అని పేతురు చెప్పాడు?

దేవుడు అన్యజనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, విశ్వాసము ద్వారా వీరి హృదయాలను పవిత్రపరచాడని పేతురు చెప్పాడు [15:8-9].

Acts 15:10

యూదులు, అన్యజనులు రక్షించబద్దారని పేతురు ఎలా చెప్పాడు?

యూదులు, అన్యజనులు ప్రభువైన యేసు కృపద్వారా రక్షించబడ్డారని పేతురు చెప్పాడు [15:11].

Acts 15:12

పౌలు, బర్నబాలు సంఘానికి ఏమని వివరించారు?

దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతాలను పౌలు, బర్నబాలు సంఘానికి వివరించారు [15:12].

Acts 15:15

దేవుడు తిరిగి కట్టుదునని చెప్పిన ఏ ప్రవచనంను యాకోబు చెప్పాడు, అందులో ఎవరు చేర్చబడ్డారు?

దేవుడు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టుదునని ప్రవచనం చెపుతున్నది, దీనిలో అన్యజనులు ఉన్నారు [15:13-17].

Acts 15:19

అన్యజనులలోని విశ్వాసులకు ఏ ఆజ్ఞ ఇవ్వాలని యాకోబు సూచించాడు?

అన్యజనులలోని విశ్వాసులు విగ్రహాల వల్ల అపవిత్రమైనవాటిని, వ్యభిచారాన్ని విసర్జించాలని, గొంతుపిసికి చంపిన దానిని, రక్తాన్ని తినకూడదని వారికి ఆజ్ఞ ఇవ్వాలని యాకోబు సూచించాడు [15:20]

Acts 15:27

అన్యజనులకు రాసిన ఉత్తరం ముగింపులో అవసమైన కొన్ని ఆజ్ఞలు ఇవ్వడానికి అంగీకరించినట్టు కనపడుతున్నదెవరు?

ఉత్తరాన్ని రాసినవారు, పరిశుద్ధాత్మ ముగింపుమాటలతో అంగీకరించినట్టు కనిపిస్తుంది [15:28].

Acts 15:30

యెరూషలేమునుండి వచ్చిన ఉత్తరాన్ని చూసి అన్యజనుల స్పందన ఎలాఉంది?

అ ఉత్తరములోని ప్రోత్సాహాన్నిబట్టి అన్యజనులు సంతోషించారు [15:31].

Acts 15:33

పౌలు, బర్నబాలు అంతియొకయలో నిలిచి ఏమి చేసారు?

పౌలు, బర్నబాలు అంతియొకయలో నిలిచి ప్రభువు వాక్యాన్ని బోధించుచు ప్రకటించుచు వచ్చారు [15:35].

Acts 15:36

పౌలు తాను ఏమి చేయాలని కోరుతున్నానని బర్నబాకు చెప్పాడు ?

ఏయే పట్టణాలలో ప్రభువు వాక్యము ప్రచురపరచారో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లాలని బర్నబాతో చెప్పాడు [15:36].

Acts 15:39

పౌలు, బర్నబాలు ఎందుకు విడిపోయారు, ఎందుకు వివిధ మార్గాలనుండి ప్రయాణాలు చేసారు?

బర్నబా తమతో మార్కును తీసుకొనివెళ్ళాలని కోరాడు, అయితే పౌలు అతనిని తీసుకొని వెళ్ళడం యుక్తము కాదని తలంచాడు [15:37-39].


Chapter 16

Translation Questions

Acts 16:1

పౌలు తిమోతితో కలిసి వెళ్ళడానికిముందు అతనికి ఏమిచేసాడు, ఎందుకు?

పౌలు తిమోతికి సున్నతి చేయించాడు, ఎందుకంటే అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆప్రాంతయూదులందరికి తెలుసు [16:3].

Acts 16:4

పౌలు ప్రయాణం చేస్తూ ఏనియమాలను సంఘాలకు అందించాడు?

యెరూషలేములోని అపోస్తలులు, పెద్దలు నిర్ణయించిన నియమాలను వారికి అందించాడు [16:4].

Acts 16:9

మాసిదోనియాలో సువార్త ప్రకటించడానికి తాను పిలువబడ్డాడని పౌలుకు ఎలా తెలుసు?

మాసిదోనియ దేశస్థుడొకడు సహాయం చెయ్యదానికి రమ్మని పిలిచిన దర్శనాన్ని పౌలు పొందాడు [16:9].

Acts 16:11

విశ్రాంతి దినాన్న పౌలు ఎందుకు ఫిలిప్పి నగర ద్వారం బయట నది ఒడ్డుకు వెళ్ళాడు?

అక్కడ ప్రార్ధన జరుగునని పౌలు తలంచాడు [16:13].

Acts 16:14

పౌలు మాట్లాడినప్పుడు దేవుడు లుదియ కొరకు ఏమిచేసాడు?

పౌలు మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు లుదియ హృదయాన్ని తెరిచాడు [16:14].

పౌలు మాట్లాడిన తరువాత నదిలో బాప్తిస్మం పొందినదెవరు?

పౌలు మాట్లాడిన తరువాత లుదియ తన యింటివారందరితోపాటు నదిలో బాప్తిస్మం పొందింది [16:15].

Acts 16:16

దయ్యంపట్టిన బానిసపిల్ల ఏవిధంగా తన యజమానులకు లాభం సంపాదించేది?

దయ్యం పట్టిన బానిసపిల్ల సోదే చెప్పడం మూలంగా తన యజమానులకు లాభం సంపాదించేది [16:16]

అనేక దినాలు ఆ బానిసపిల్ల పౌలును వెంబడిస్తూ ఉన్నప్పుడు పౌలు ఏమి చేసాడు?

పౌలు ఆమె వైపుకు తిరిగి ఆమెలోనుండి బయటకు రమ్మని యేసు క్రీస్తు నామంలో దురాత్మకు అజ్ఞాపించాడు.[16:17-18].

Acts 16:19

ఆ బానిసపిల్ల యజమానులు పౌలు సీలలకు వ్యతిరేకంగా ఎటువంటి నేరం మోపారు?

రోమీయులు అంగీకరించకూడని, పాటించకూడని ఆచారాలను పౌలు సీలలు ప్రకటిస్తున్నారని వారికి వ్యతిరేకంగా నేరం మోపారు [16:21].

Acts 16:22

న్యాయాదిపతులనుండి ఎటువంటి శిక్షను పౌలు సీలలు పొందారు ?

వారిని బెత్తాలతో కొట్టారు, చెరసాలలో వేసారు, వారి కాళ్ళు కోయ్యబొండలో బిగించారు [16:22-24].

Acts 16:25

చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలు సీలలు ఏమిచేస్తున్నారు?

వారు దేవునికి ప్రార్ధన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు [16:25].

చెరసాల అధికారి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు?

అక్కడ మహా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి [16:26].

Acts 16:29

పౌలు సీలలను చెరసాల అధికారి ఏమని ప్రశ్నించాడు?

"అయ్యలారా, పాపవిముక్తి పొందడానికి నేనేం చేయాలి"పౌలు సీలలను చెరసాల అధికారి అడిగాడు [16:30].

పౌలు సీలలు చెరసాల అధికారికి ఏ సమాధానం ఇచ్చారు?

"ప్రభువైన యేసునందు నమ్మకముంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షణ పొందుతారు" అని పౌలు సీలలు జవాబిచ్చారు [16:31].

Acts 16:32

ఆ రాత్రి ఎవరు బాప్తిస్మం పొందారు

ఆ రాత్రి చేరసాల అధికారి, అతని యింటివారు బాప్తిస్మం పొందారు [16:33].

Acts 16:35

పౌలు సీలలను విడుదల చెయ్యమని కబురు పంపిన న్యాయాదిపతులు ఎందుకు భయపడ్డారు?

న్యాయవిచారణ లేకుండా ఇద్దరు రోమా పౌరులను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించిన కారణంగా న్యాయాదిపతులు భయపడ్డారు [16:35-38].

Acts 16:40

న్యాయాధిపతులు వారిని పట్టణంను విడిచిపెట్టమని చెప్పినపుడు పౌలు సీలలు ఏమిచేసారు?

పౌలు సీలలు లుదియ యింటికి వెళ్ళారు, అక్కడ సోదరులను చూచి ప్రోత్సాహపరచి తరువాత వెళ్ళిపోయారు [16:40].


Chapter 17

Translation Questions

Acts 17:1

పౌలు తెస్సలోనికకు వచ్చినపుడు లేఖనాలలోనుండి యేసును గురించి మాట్లాడడానికి మొదట ఎక్కడికి వెళ్ళాడు?

పౌలు తెస్సలోనికకు వచ్చినపుడు లేఖనాలలోనుండి యేసును గురించి మాట్లాడడానికి మొదట యూదుల సమాజకేంద్రం లోనికి వెళ్ళాడు [17:1-2].

Acts 17:3

తప్పనిసరి అని లేఖనాలలోనుండి దేన్ని పౌలు చూపించాడు?

క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలలోనుండి పౌలు చూపించాడు [17:3].

Acts 17:5

పౌలు సీలలమీద పట్టణం అధికారులకు చేసిన నింద ఏమిటి?

పౌలు సీలలు చక్రవర్తికాక యేసుఅను మరో రాజు ఉన్నాడని చెపుతూ చక్రవర్తి శాసనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని వారి మీద నింద వేసారు [17:7].

Acts 17:10

పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు ఎక్కడికి వెళ్ళారు?

పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు యూదుల సమాజ కేంద్రానికి వెళ్ళారు [17:10].

పౌలు ప్రసంగం వినినపుడు బెరయవారు ఏమిచేసారు ?

బెరయవారు వాక్కును అత్యాసక్తితో అంగీకరించి పౌలు చెప్పినది సత్యమో కాదో అని ప్రతి రోజూ లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు [17:11].

Acts 17:13

పౌలు బెరయ ఎందుకు విదిచిపెట్టాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు ?

తెస్సలోనికలోని యూదులు బెరయలోని జనసమూహములని రేపికదిలించారు కనుక పౌలు ఏథెన్సుకు వెళ్ళాడు [17:13-15]

Acts 17:16

పౌలు ఏథెన్సుకు వెళ్ళినపుడు ఎక్కడికి వెళ్ళాడు?

పౌలు ఏథెన్సుకు వెళ్ళినపుడు యూదుల సమాజకేంద్రానికి, బజారు ప్రదేశానికి యూదులతో చర్చించడానికి వెళ్ళాడు [17:17].

Acts 17:19

పౌలు బోధను కొనసాగించడానికి పౌలును ఎక్కడికి తీసుకొని వచ్చారు?

పౌలు బోధను కొనసాగించడానికి పౌలును అరెయోపగస్ సభకు తీసుకొని వచ్చారు [17:19-20].

Acts 17:22

ప్రజలకు పౌలు వివరించడానికి కోరుకొనిన ఏ బలిపీఠం ఏథెన్స్ లో పౌలు కనుగొన్నాడు?

"తెలియబడని దేవునికి" అని రాయబడిన ఒక బలిపీఠంను పౌలు చూశాడు, దానినే ప్రజలకు వివరించాలని పౌలు కోరాడు [17:23]

Acts 17:24

సమస్తాన్ని సృజించిన దేవుడు మనుష్యులందరికి ఏమి దయచేస్తున్నాడని పౌలు చెప్పాడు?

సమస్తాన్ని సృజించిన దేవుడు మనుష్యులందరికి జీవితాన్ని, ఊపిరిని అలాంటి వాటన్నిటినీ ప్రసాదిస్తున్నాడు [17:25].

Acts 17:26

మానవజాతులన్నిటినీ దేనినుండి దేవుడు చేసాడు?

మానవజాతులన్నిటినీ ఒక మనిషి నుండి దేవుడు చేసాడు [17:26].

దేవుడు ఎవరికైనా ఎంతదూరంలో ఉన్నాడని పౌలు చెపుతున్నాడు?

వాస్తవంగా దేవుడు మనలో ఎవరికీ దూరంగా లేడని పౌలు చెపుతున్నాడు [17:27].

Acts 17:28

మనము దేవుణ్ణి ఏవిధంగా తలంచకూడదని పౌలు చెపుతున్నాడు ?

మనము మన ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన విగ్రహం లాంటిదని దేవుణ్ణి తలంచకూడదని పౌలు చెపుతున్నాడు [17:29].

Acts 17:30

అంతటా ఉన్న మనుష్యులు ఇప్పుడు ఏమి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు?

ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుష్యులందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు [17:30].

దేనికొరకు దేవుడు ఒక దినాన్ని ఏర్పరచాడు?

ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును దేవుడు నిర్ణయించాడు [17:31].

యేసు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఎంపిక చెయ్యబడ్డాడని దేవుడు ఏ ఋజువును ఇచ్చాడు?

ఆయనను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపడంవల్ల ఈ సంగతి మనుషులందరికీ ఋజూవు చేసాడు [17:31].

Acts 17:32

మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు ఏమిచేసారు?

మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు పౌలును హేళన చేసారు [17:32].

పౌలు చెప్పిన దానిని ఎవరైనా విశ్వసించారా?

అవును కొందరు, తమతో ఉన్నవారును పౌలు చెప్పిన దానిని విశ్వసించారు [17:34].


Chapter 18

Translation Questions

Acts 18:1

తనను తాను పోషించుకోడానికి పౌలు ఏమిచేసేవాడు?

తనను తాను పోషించుకోడానికి పౌలు డేరాలు కుట్టేపనిని చేసేవాడు [18:3].

Acts 18:4

కొరింథులోని యూదులకు పౌలు ఏమని సాక్ష్యమిచ్చాడు?

యేసే క్రీస్తని కొరింథులోని యూదులకు పౌలు సాక్ష్యమిచ్చాడు [18:5].

యూదులు పౌలును దూషించినపుడు పౌలు ఏమిచేసాడు?

వారి రక్తము వారి తల మీదే ఉంటుందని చెప్పాడు, అన్యజనుల వద్దకు వెళ్ళాడు [18:6].

Acts 18:9

కొరింథులో ప్రభువు వద్దనుండి పౌలు ఎలాంటి ప్రోత్సాహాన్ని పొందాడు?

నిర్భయంగా ఉండి మాట్లాడుతూ ఉండమని ప్రభువు పౌలుకు చెప్పాడు, అక్కడ ఎవరూ తనకు హాని చెయ్యరు [18:9-10].

Acts 18:12

పౌలుకు వ్యతిరేకంగా ఏనేరంతో యూదులు రాష్ట్రాధికారివద్దకు వచ్చారు?

ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను పురికొల్పుతున్నాడని పౌలుమీద నేరం మోపారు [18:12-13].

Acts 18:14

పౌలుకు వ్యతిరేకంగా యూదులు మోపిన నేరంవిషయం రాస్ట్రాదికారి ఏవిధంగా స్పందించాడు?

యూదా ధర్మశాస్త్రానికి గురించినవాటిని విచారణ చేయడానికి తనకు ఇష్టంలేదని చెప్పాడు [18:15].

Acts 18:18

పౌలుతో ఎఫెసువరకు ప్రయాణం చేసిన భార్యాభర్తలు ఎవరు?

ఆకుల ప్రిస్కిల్ల పౌలుతో పాటు ఎఫెసువరకు ప్రయాణం చేసారు [1818-19].

Acts 18:22

ఎఫెసును విడిచిన తరువాత పౌలు మొదట ఏ రెండు స్థలాలకు వెళ్ళాడు?

ఎఫెసును విడిచిన తరువాత పౌలు యెరూషలేముకు వెళ్ళాడు, తరువాత అంతియొకయకు వెళ్ళాడు [18:22].

Acts 18:24

అపొల్లో ఏవిషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నాడు, ఏ బోధలో అతనికి మరింత సూచనలు అవసరం?

అపొల్లో ప్రభువు మార్గం విషయం ఉన్నవి ఉన్నట్టుగా అర్ధం చేసుకున్నాడు, అయితే యోహాను ఇచ్చిన బాప్తీస్మం మాత్రమే తనకు తెలుసు [18:25].

ప్రిస్సిల్ల అకులలు అపోల్లోకు ఏమి చేసారు?

ప్రిస్సిల్ల అకులలు అపోల్లోకు స్నేహితులయ్యారు, దేవుని మార్గాన్ని ఇంకా పూర్తిగా వివరించారు [18:26].

Acts 18:27

లేఖనాలలోని జ్ఞానం, బోధలో తనకున్న వాగ్దాటితో అపొల్లో ఏమి చెయ్యగలిగాడు?

యేసే క్రీస్తని లేఖనముల ద్వారా ఋజువు చేస్తూ బహిరంగంగానే యూదుల వాదాలను వమ్ము చేసాడు [18:9-10].


Chapter 19

Translation Questions

Acts 19:1

ఎఫెసులో పౌలును కలిసిన శిష్యులు వారు విశ్వసించినపుడు దేనిగురించి వారు వినలేదని చెప్పారు?

వారు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వినలేదని చెప్పారు [19:2].

Acts 19:3

బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం దేని గురించిన బాప్తిస్మం?

బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిస్మం [19:4]

ఎవరియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు?

తన వెనుక వచ్చువానియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు [19:4].

Acts 19:5

ఎఫెసులో ఎవరి నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు?

ప్రభువైన యేసు నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు [19:5].

వారు బాప్తిస్మం పొందిన తరువాత పౌలు వారిమీద చేతులుంచినపుడు ఏమిజరిగింది?

పరిశుద్ధాత్ముడు వారిమీదికి వచ్చాడు, వారు వేరే భాషలతో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు [19:6].

Acts 19:8

ఎఫెసులోని యూదులు కొందరు ప్రభువు మార్గాన్ని దూషించినపుడు పౌలు ఏమిచేసాడు?

పౌలు వారిని విడిచి శిష్యులను తీసుకువెళ్ళి తురన్నాన్ ప్రసంగశాలలో ప్రతి రోజూ చర్చలు జరిపాడు [19:9].

Acts 19:11

పౌలు చేతి ద్వారా దేవుడు చేసిన ప్రత్యేక అద్భుతాలు ఏమిటి?

అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గాని నడికట్లు గాని రోగుల దగ్గరకు తెచ్చినపుడు రోగాలు పోయాయి, దయ్యాలు వారిని విడిచి వెళ్ళాయి [19:12].

Acts 19:15

యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురు యేసు నామంలో దురాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రయత్నించినపుడు ఏమి జరిగింది?

దురాత్మలు యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురి మీదికి ఎగిరి దూకి వారిని లొంగదీసి ఓడగొట్టాడు, వారు గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు [19:16].

Acts 19:18

ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు ఏమి చేసారు?

ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు [19:19].

Acts 19:21

యెరూషలేము వెళ్ళిన తరువాత ఎక్కడికి వెళ్లాలని పౌలు అనుకున్నాడు?

యెరూషలేము వెళ్ళిన తరువాత పౌలు తాను రోమ్ కూడా చూడాలి అనుకున్నాడు [19:21].

Acts 19:26

దేమేత్రియస్ అనే కంసాలి వాడు అలాంటి పని చేసేవారితో ఏవిషయాన్ని పంచుకున్నాడు?

చేతులతో చేసిన దేవతలు దేవతలే కావని, అర్తెమి మహాదేవి నిరుపయోగం అని పౌలు ప్రజలకు బోధిస్తున్నాడని దేమేత్రియస్ అనే కంసాలి వాడు ఆందోళన చెందాడు [19:26].

Acts 19:28

అర్తెమి మహాదేవి విషయంలో ప్రజలు ఏ విధంగా స్పందించారు?

ప్రజలు కోపోద్రేకంతో నిండిపోయి "ఎఫేసువారి అర్తెమి గొప్పది" అని కేకలు పెట్టారు, నగరమంతా గందరగోళం అయిపోయింది [19:28-29].

Acts 19:30

పౌలు ప్రజల సభ వద్దకు వెళ్లాలని తలంచినప్పటికి ఎందుకు వెళ్ళలేక పోయాడు?

శిష్యులు, స్థానిక అధికారులు పౌలు ప్రజల సభ వద్దకు వెళ్ళడానికి అనుమతించ లేదు [19:30-31].

Acts 19:38

ప్రజలు అల్లరికి బదులు ఏమిచెయ్యాలని పట్టణపు కరణం చెప్పాడు?

ప్రజలు అల్లరికి బదులు వారి పిర్యాదులు తేవాలని పట్టణపు కరణం చెప్పాడు [19:38].

ప్రజలు ఏ ప్రమాదంలో ఉన్నారని పట్టణపు కరణం చెప్పాడు ?

జరిగిన అల్లరికి సరైన కారణం లేదు కనుక దానిని గురించి వారిమీద నేరం మోపడం జరుగుతుందేమో అని భయపడ్డాడు [19:40]


Chapter 20

Translation Questions

Acts 20:7

పౌలును ఇతర అపోస్తలులును వారంలో ఏరోజున రొట్టె విరవడానికి కలుసుకోనేవారు?

పౌలును ఇతర అపోస్తలులును వారంలో మొదటి రోజున రొట్టె విరవడానికి కలుసుకోనేవారు [20:7].

Acts 20:9

పౌలు ప్రసంగిస్తున్నపుడు కిటికీనుండి క్రింద పడిపోయిన యువకునికి ఏమి జరిగింది?

ఆ యువకుడు మూడో అంతస్తు నుంచి క్రింద పడి చనిపోయాడు. పౌలు అతనిమీద పడుకున్నాడు. ఆ యువకుడు మరల బ్రతికాడు [20:9-10].

Acts 20:15

ఎందుకు పౌలు యెరూషలేములో ఉండాలని ఆతురత పడుతున్నాడు?

పెంతెకోస్తు రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురత పడుతున్నాడు [20:16].

Acts 20:17

ఆసియాలో తాను అడుగుపెట్టిన దినమునుండి యూదులు, గ్రీసుదేశస్థులను హెచ్చరిస్తూ ఉన్నాడని దేని విషయంలో పౌలు చెపుతున్నాడు?

దేవుని పట్ల పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులు, గ్రీసు దేశస్థులను హెచ్చరిస్తూ వచ్చానని పౌలు చెపుతున్నాడు [20:18-20].

Acts 20:22

యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ప్రతి పట్టణములో పౌలుకు పరిశుద్ధాత్మ చెపుతున్న సాక్ష్యం ఏమిటి?

సంకెళ్ళు బాధలు తనకోసం కాచుకొని యున్నాయని ప్రతి పట్టణములో పౌలుకు పరిశుద్ధాత్మ సాక్ష్యం చెపుతూ ఉన్నాడు [20:23].

ప్రభువైన యేసు నుండి పౌలు పొందిన పరిచర్య ఏమిటి?

దేవుని కృపను గురించిన శుభవార్తను తెలియజేయడం పౌలు పొందిన పరిచర్య [20:24].

Acts 20:25

ఎవరైనా నాశనమైతే తాను బాధ్యుడను కాను అని ఎందుకు పౌలు చెపుతున్నాడు?

దేవుని సంకల్పమంతా వారికి ప్రకటించాడు కనుక వారు నాశనమైతే తాను బాధ్యుడను కాను అని పౌలు చెపుతున్నాడు [20:27].

Acts 20:28

తాను వెళ్ళిపోయిన తరువాత ఎఫెసు పెద్దలను ఏవిషయంలో జాగ్రత కలిగి ఉండమని ఆజ్ఞాపించాడు?

మంద అంతటి గురించి జాగ్రతగా ఉండుడని పెద్దలను ఆజ్ఞాపించాడు [20:28].

తాను వెళ్ళిపోయిన తరువాత ఎఫెసు పెద్దల మధ్య ఏమి జరగబోతుందని పౌలు చెప్పాడు?

శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని వారిలోని పెద్దలలో కొందరు కుటిలమైన మాటలు చెపుతారు అని పౌలు చెప్పాడు [20:30].

Acts 20:31

పౌలు ఎఫెసు పెద్దలను ఎవరికి అప్పగించాడు?

పౌలు ఎఫెసు పెద్దలను దేవునికి అప్పగించాడు[20:32].

Acts 20:33

పరిచర్య విషయం ఎఫెసు పెద్దలకు ఎటువంటి ఆదర్శంచూపించాడు?

పౌలు తన అక్కరలు తనతో ఉన్నవారి అక్కరలు తీర్చడానికి తన చేతులతో పనిచేసాడు, బలహీనులకు సాయం చేసాడు [20:34-35].

Acts 20:36

దేన్ని బట్టి ఎఫెసు పెద్దలందరూ దు:ఖించారు?

ఇకమీదట నా ముఖం చూడరని పౌలు చెప్పిన మాటకు ఎఫెసు పెద్దలందరూ విశేషంగా దు:ఖించారు [20:38].


Chapter 21

Translation Questions

Acts 21:3

తూరులో ఉన్న శిష్యులు పౌలుతో ఆత్మ ద్వారా ఏమిచెప్పారు?

వారు పౌలును యెరూషలేము వెళ్ళవద్దని ఆత్మమూలంగా చెప్పారు [21:4].

Acts 21:7

బోధకుడైన ఫిలిప్పు కుమార్తెల గురించి మనకు ఏమి తెలుసు?

ఫిలిప్పు నలుగురు కుమార్తెలు కన్యలు. వారు ప్రవచించువారు [21:9].

Acts 21:10

అగబు అను ప్రవక్త పౌలుకు ఏమి చెప్పాడు?

యెరూలేములోని యూదులు పౌలును బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని చెప్పాడు [21:11].

Acts 21:12

యెరూషలేము వదిలి వెళ్ళవద్దని అక్కడివారందరూ పౌలును బతిమాలినప్పుడు పౌలు ఏమన్నాడు?

యెరుషలేములో బంధింపబడుటకే కాక ప్రభువైన యేసు నామము నిమిత్తము చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు [21:13].

Acts 21:17

యెరూషలేముకు వచ్చిన తరువాత పౌలు ఎవరిని కలిసాడు?

యెరూషలేముకు వచ్చిన తరువాత పౌలు పెద్దలందరిని కలిసాడు [21:18].

Acts 21:20

పౌలుకు వ్యతిరేకంగా యూదులు ఏమి నేరం మోపారు?

అన్యజనులలో ఉన్న యూదులకు మోషేను విడిచిపెట్టమని పౌలు చేపుతున్నాడని యూదులు నేరం మోపారు [21:21].

Acts 21:22

యాకోబు, ఇతర పెద్దలు పౌలును అతనితోకూడా మొక్కుబడి చేసుకొని ఉన్నవారిని శుద్ది చేసుకొనమని ఎందుకు చెప్పారు?

పౌలు ధర్మశాస్త్రంను గైకొని యధావిధిగా నడుచుకొనుచున్నాడని అందరు తెలిసికొనునట్లు వారు కోరారు [21:24].

Acts 21:25

విశ్వసించిన అన్యజనులు ఏమిచేయాలని యాకోబు కోరాడు?

విగ్రహాలకు అర్పితమైనవాటినీ రక్తాన్నీ గొంతుపిసికి చంపిన దానినీ తినకుండా జారులు కాకుండా ఉండాలని యాకోబు చెప్పాడు [21:25].

Acts 21:27

ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలములో పౌలుకు వ్యతిరేకంగా ఏ నేరం మోపారు?

ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని, గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొనివచ్చి ఆ పవిత్ర స్థానాన్ని ఆశుద్దం చేసాడని నేరం మోపారు [21:28].

Acts 21:30

ఈ నేరాలు మోపిన తరువాత యూదులు పౌలుకు ఏమిచేసారు?

పౌలును పట్టుకొని దేవాలయంలోనుంచి బయటికి ఈడ్చుకుపోయారు [21:31].

Acts 21:32

యెరూషలేంలో అల్లరిగా ఉందని తెలిసినప్పుడు పటాలం అధికారి ఏమిచేసాడు?

యెరూషలేంలో అల్లరిగా ఉందని తెలిసినప్పుడు పటాలం అధికారి పౌలుని పట్టుకొని రెండు సంకెళ్ళతో బంధించి, అతను ఎవరు, ఏమిచేసాడు అని అడిగాడు [21:33].

Acts 21:34

సైనికులు పౌలును కోటలోనికి తీసుకొనివెళ్తున్నప్పుడు సమూహం ఏమని అరిచారు?

"వాణ్ణి చంపెయ్యండి" అని సమూహం అరిచారు [21:36].

Acts 21:39

పటాలం అధికారికి పౌలు ఏమని కోరాడు?

ప్రజలతో మాట్లాడడానికి తనకు అనుమతి ఇవ్వమని పౌలు కోరాడు [21:39].

యెరూషలెంలో ప్రజలతో పౌలు ఏ భాషలో మాట్లాడాడు?

యెరూషలెంలో పౌలు ప్రజలతో హెబ్రీ భాషలో మాట్లాడాడు [21:40].


Chapter 22

Translation Questions

Acts 22:1

పౌలు హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రజలు వినినప్పుడు వారు ఏమిచేసారు?

పౌలు హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రజలు వినినప్పుడు వారు మౌనం వహించారు [22:2].

Acts 22:3

పౌలు ఎక్కడ చదువుకున్నాడు, అతని ఉపాధ్యాయుడు ఎవరు?

పౌలు యెరూషలెంలో చదువుకున్నాడు, గమలీయేల్ అతని ఉపాధ్యాయుడు [22:3].

మార్గాన్ని అనుసరించేవారితో పౌలు ఏవిధంగా వ్యవహరించాడు?

మార్గాన్ని అనుసరించేవారిని మరణమయ్యేవరకు హింసిస్తూ, వారిని చెరసాలలో వేయిస్తూ వచ్చాడు [22:4].

Acts 22:6

పౌలు దమస్కుకు చేరినపుడు ఆకాశంనుండి వచ్చిన స్వరం పౌలుతో ఏమిచెప్పింది?

"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?" అని ఆకాశంనుండి వచ్చిన స్వరం పౌలుతో చెప్పింది [22:7].

పౌలు ఎవరిని హింసిస్తూ ఉన్నాడు?

పౌలు నజరేయుడైన యేసును హింసిస్తూ ఉన్నాడు [22:8].

Acts 22:9

పౌలు ఎందుకు చూడలేక పోయాడు?

దమస్కుకు చేరినపుడు ఆ కాంతి తేజస్సు కారణంగా పౌలు ఏమీ చూడలేకపోయాడు [22:11].

Acts 22:12

పౌలు తన చూపును ఎలా తిరిగి పొందాడు?

భక్తిపరుడైన అననియ అను పేరుగల వ్యక్తి పౌలు వద్ద నిలిచి "సోదరుడా సౌలూ, దృస్టి పొందు" అని చెప్పాడు [22:12-13].

Acts 22:14

అననియ పౌలుకు ఏమి చెయ్యమని చెప్పాడు, ఎందుకు?

లేచి తన పాపాలు కడిగివేసుకునేందుకు బాప్తిసం పొందమని అననియ పౌలుకు చెప్పాడు [22:16].

Acts 22:17

దేవాలయంలో పౌలుతో యేసు మాట్లాడినపుడు పౌలు సాక్ష్యము గురించి యూదులు ఏవిధంగా స్పందిస్తారని చెప్పాడు?

యూదులు పౌలు సాక్ష్యమును అంగీకరింపరు అని చెప్పాడు [22:18].

Acts 22:19

ఎవరి వద్దకు యేసు పౌలును పంపాడు?

అన్యజనులవద్దకు వద్దకు యేసు పౌలును పంపాడు [22:21].

Acts 22:22

పౌలు అన్యజనులనను గురించి మాట్లాడుతున్నపుడు ప్రజలు ఎలా స్పందించారు?

ప్రజలు అరుస్తూ తమ పైబట్టలు తీసిపారవేస్తూ ఆకాశం వైపు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు [22:23].

Acts 22:27

పౌలు ఏవిధంగా రోమ్ పౌరుడు అయ్యాడు?

పౌలు పుట్టుకతోనే రోమ్ పౌరుడు అయ్యాడు [22:28].

Acts 22:30

పౌలు రోమ్ పౌరుడు అని తెలిసినపుడు పైఅధికారి ఏమిచేసాడు?

పైఅధికారి అతని సంకెళ్ళు తీసివేసి ప్రముఖయాజులూ యూదా సమాలోచన సభావారూ అంతా సమావేశం కావాలని ఆజ్ఞ జారీ చేసాడు [22:30].


Chapter 23

Translation Questions

Acts 23:1

ప్రధాన యాజకుడు పౌలు నోటిమీద కొట్టండని పౌలు దగ్గర ఉన్నావారిని ఎందుకు ఆజ్ఞాపించాడు?

దేవుని ఎదుట మంచి మనస్సాక్షిగలవాడై ఉన్నానని చెప్పిన కారణంగా ప్రధాన యాజకుడు కోపగించి అలా ఆజ్ఞాపించాడు [23:1-2].

Acts 23:6

ఏ కారణంగా పౌలు యూదా సమాలోచన సభ ఎదుట విచారణకు గురి అయ్యాడు?

చనిపోయినవారు తిరిగిలేస్తారనే ఆశాభావం గురించి తాను విచారణకు గురి అయ్యాడని పౌలు చెప్పాడు [23:3-6].

తన విచారణకు కారణాన్ని పౌలు చెప్పినపుడు ఎందుకు అలజడి రేగింది?

పరిసయ్యులు పునరుద్ధానం ఉందని చెపుతారు, సద్దూకయ్యులు పునరుద్దానం లేదని చెపుతారు, ఈ కారణంగా వారిమధ్య అలజడి రేగింది [23:7-8].

Acts 23:9

యూదుల సభలో నుండి పౌలును కోటలోనికి ఎందుకు తేవాలని పై అధికారి తలంచాడు?

సభలోని సభ్యులు పౌలును చీల్చివేస్తారేమో అని పై అధికారి భయపడ్డాడు [23:10].

Acts 23:11

తరువాత రాత్రి ప్రభువు పౌలుకి ఏమి వాగ్దానం చేసాడు?

ధైర్యంగా ఉండాలని, యెరూషలేంలోను, రోమ్ లోను పౌలు సాక్షిగా ఉండాలని దేవుడు చెప్పాడు [23:11].

Acts 23:12

పౌలు విషయంలో కొందరు యూదులు ఏమని ఒట్టు పెట్టుకున్నారు?

సుమారు నలభై మంది యూదులు తాము పౌలును చంపేవరకు అన్నపానాలు తీసుకోబోమని ఒట్టుపెట్టుకున్నారు [23:12-13].

Acts 23:14

ప్రధాన యాజకులు, పెద్దల యొదుట నలభై మంది యూదుల ప్రణాలిక ఏమిటి?

పౌలు ఆ సభవరకు రాకముందే తాము అతణ్ణి చంపగలుగునట్లు పౌలుని విచారణ సభకు తీసుకురావాలని ప్రధాన యాజకులు, పెద్దలను అడిగారు [23:14-15].

Acts 23:20

ఈ నలుబదిమంది ప్రణాలిక గురించి పైఅధికారికి ఎలా తెలిసింది?

పౌలు మేనల్లుడు ఈ ప్రణాలికను గురించి విని దానిని పైఅధికారికి చెప్పాడు [23:16-21].

Acts 23:22

నలుబది మంది యూదుల ప్రణాలిక తెలుసుకున్న పైఅధికారి ఏవిధంగా స్పందించాడు?

పౌలును రాత్రి తొమ్మిది గంటలకు అధిపతియైన ఫేలిక్సు వద్దకు పౌలును సురక్షితంగా తీసుకొని వెళ్ళడానికి పెద్ద సైన్యాన్ని సిద్ధపరచమని ఆజ్ఞాపించాడు [23:23-24].

Acts 23:28

అధిపతియైన ఫేలిక్సు కు రాసిన ఉత్తరంలో పౌలుకు వ్యతిరేకంగా చేసిన నేరాల గురించి పైఅధికారి ఏమని రాశాడు?

పౌలు మరణశిక్షకు గాని చెరసాలకు గాని పాత్రుడు కాదు, అయితే తమ ధర్మశాస్త్ర వివాదాలను గురించి చేసిన నేరారోపణలే [23:29].

Acts 23:34

అధిపతియైన ఫెలిక్స్ పౌలు విషయాన్ని ఎప్పుడు విచారిస్తానని చెప్పాడు?

అధిపతియైన ఫెలిక్స్ పౌలు విషయాన్ని తనమీద నేరం మోపేవారు కూడా వచ్చినపుడు విచారణ చేస్తానని చెప్పాడు [23:35].

పౌలును తన విచారణ వరకు ఎక్కడ ఉంచారు?

పౌలును తన విచారణ వరకు హేరోదు భవనంలో ఉంచారు [23:35].


Chapter 24

Translation Questions

Acts 24:4

న్యాయవాది తెర్తుల్లు పౌలుకు వ్యతిరేకంగా ఏ నేరాలు మోపాడు?

యూదులందరినీ కలహానికి రేపేవాడు, దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకున్నాడని న్యాయవాది తెర్తుల్లు పౌలుకు వ్యతిరేకంగా నేరాలు మోపాడు [24:5-6].

పౌలు ఏ వర్గానికి చెందినవాడు అని న్యాయవాది తెర్తుల్లు చెప్పాడు?

పౌలు నజరేయుల మత శాఖకు నాయకుడు అని న్యాయవాది తెర్తుల్లు చెప్పాడు [24:5].

Acts 24:10

దేవాలయంలో, సమాజకేంద్రంలో, పట్టణంలో పౌలు ఏమి చేసాడని చెప్పాడు?

తాను ఎవరితోనూ వాదించ లేదు, ప్రజల మధ్య అల్లరి రేపలేదని పౌలు చెప్పాడు [24:12].

Acts 24:14

తాను ఏ విషయంలో నమ్మకంగా ఉన్నానని పౌలు చెపుతున్నాడు?

ధర్మశాస్త్రంలో ఉన్నదానంతటి విషయంలో నమ్మకంగా ఉన్నాడని పౌలు చెప్పాడు [24:14].

తన మీద నేరం మోపేవారితో ఎటువంటి ఆశాభావాన్ని పౌలు పంచుకుంటున్నాడు?

చనిపోయిన న్యాయవంతులేమి, దుర్మార్గులేమి లేస్తారని వారికి ఆశాభావం ఉందని పౌలు చెప్పాడు [24:15].

Acts 24:17

తాను యెరూషలేం ఎందుకు వచ్చాడని పౌలు చెప్పాడు?

తన స్వప్రజలకు దానధర్మాలు ఇవ్వడానికి కానుకలు అర్పించడానికి వచ్చానని చెప్పాడు [24:17].

ఆసియానుండి వచ్చిన యూదులు తనను దేవాలయంలో కనుగొనినపుడు తాను ఏమి చేస్తున్నట్టు చెప్పాడు?

తాను శుద్ధిచేసుకొని దేవాలయంలో ఉంటె వారు తనను చూసారని పౌలు చెప్పాడు [24:18].

Acts 24:22

ఏ విషయం అధిపతియైన ఫేలిక్సు కు బాగా తెలుసు?

మార్గం విషయం అధిపతియైన ఫేలిక్సు కు బాగా తెలుసు [24:22].

అధిపతియైన ఫేలిక్సు పౌలు సంగతిని ఎప్పుడు నిర్ణయిస్తాడని చెప్పాడు?

పై అధికారియైన లూసియస్ వచ్చిన తరువాత పౌలు సంగతిని నిర్ణయిస్తానని ఫేలిక్సు చెప్పాడు [24:22].

Acts 24:24

కొన్ని రోజుల తరువాత పౌలు ఫేలిక్సు కు ఏమి చెప్పాడు?

పౌలు క్రీస్తు యేసు మీద నమ్మకాన్ని గురించి చెప్పాడు, న్యాయం, ఆశానిగ్రహం, రానున్న తీర్పును గురించి చెప్పాడు [24:24-25].

పౌలు మాటలు వినిన తరువాత ఫేలిక్సుఏవిధంగా స్పందించాడు?

ఫేలిక్సు భయకంపితుడయ్యాడు, తన వద్దనుండి పౌలును పంపించి వేశాడు [24:25].

Acts 24:26

ఫేలిక్సు ఎందుకు పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు?

యూదులచేత మంచివాడనిపించుకోవాలనే ఉద్దేశంతో ఫేలిక్సు పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు [24:27].


Chapter 25

Translation Questions

Acts 25:1

ప్రదానయాజకుడు, ప్రముఖయూదులు ఫేస్తు పౌలు విషయం ఏమని అడిగారు?

పౌలును దారిలో చంపడానికి అతనిని యెరూషలేముకు పిలిపించమని అడిగారు [25:3].

Acts 25:4

ప్రధాన యాజకుడు, ప్రముఖ యూదులు ఏమి చేయాలని ఫేస్తు వారికి చెప్పాడు?

ఫేస్తు వారిని తాను వెళుతున్నసీజరియకు తనతో పాటు రమ్మని చెప్పాడు, అక్కడ వారు పౌలు మీద నేరారోపణ చెయ్యవచ్చు అని వారితో చెప్పాడు [25:5].

Acts 25:9

సీజరియలో పౌలును విచారణ చేస్తున్నప్పుడు ఫేస్తు పౌలును ఏమని అడిగాడు?

పౌలు యెరూషలేముకు వెళ్లి విచారించబడడం తనకు ఇష్టమేనా అని అడిగాడు [25:9].

ఫేస్తు ఈ ప్రశ్న పౌలును ఎందుకు అడిగాడు?

యూదులచేత మంచివాడనిపించుకోవడం కొరకు ఫేస్తు ఈ ప్రశ్న పౌలును అడిగాడు [25:9].

Acts 25:11

ఫేస్తు అడిగిన ప్రశ్నకు పౌలు స్పందన ఏమిటి?

తాను యూదులకి అన్యాయమేమియూ చేయలేదని, సీజరు ఎదుట తాను చెప్పుకుంటానని పౌలు చెప్పాడు [25:10-11].

పౌలు విషయం ఏమి చెయ్యాలని ఫేస్తు నిర్ణయించాడు?

పౌలు సీజరు పేరు చెప్పినందుకు సీజరు దగ్గరకే పంపడానికి నిర్ణయించాడు [25:12].

Acts 25:13

రోమనుల మీద నేరం మోపబడినపుడు వారి విషయంలో న్యాయబద్దమైన విధానం గురించి ఫేస్తు ఏమని చెప్పాడు?

నిందితుడైన వ్యక్తి తనమీద మోపిన వారికి ముఖాముఖిగా నిలబడి తనమీద మోపిన నేరాన్ని గురించి సంజాయిషీ చెప్పుకోడానికి అవకాశం రోమనులు ఇస్తారని చెప్పాడు [25:16].

Acts 25:17

పౌలుకు వ్యతిరేకంగా యూదులు ఏ నేరాలు మోపారని ఫేస్తు చెప్పాడు?

తమ మతం గురించి, చనిపోయిన యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే అతనితో వివాదాలు ఉన్నట్టు చెప్పాడు, అయితే ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెపుతున్నట్టు చెప్పాడు [25:19].

Acts 25:25

రాజైన అగ్రిప్ప వద్ద పౌలు చెప్పుకోడానికి ఫేస్తు ఎందుకు తీసుకు వచ్చాడు?

పౌలు విచారణను చక్రవర్తి వద్దకు తీసుకొని వెళ్ళడానికేదైనా రాయడానికి రాజైన అగ్రిప్ప వద్దకు తీసుకొని వచ్చాడు [25:26].

పౌలును చక్రవర్తి వద్దకు ఏ విధంగా పంపడం సరి అయిన పని కాదని అని ఫేస్తు చెప్పాడు?

ఖైదీ మీద మోపిన నేరాలేవో సూచించక పౌలును అలాగే చక్రవర్తి వద్దకు పంపడం సరి అయిన పని కాదని ఫేస్తు చెప్పాడు [25:27].


Chapter 26

Translation Questions

Acts 26:1

అగ్రిప్ప రాజు ఎదుట తన సంగతిని చెప్పుకోగల్గుతున్నందుకు పౌలు ఎందుకు సంతోషంగా ఉన్నాడు ?

అగ్రిప్పకు యూదుల సంబంధమైన ఆచారాలు, వివాదాలు బాగా తెలుసు కాబట్టి అగ్రిప్ప రాజు ఎదుట తన సంగతిని చెప్పుకోగల్గుతున్నందుకు పౌలు సంతోషంగా ఉన్నాడు [26:3].

Acts 26:4

యెరూషలెంలో బాల్యం నుండి పౌలు ఎలా జీవించాడు?

తన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్టానియమాలు ఉన్న తెగ ప్రకారం పరిసయ్యుడిగా జీవించాడని చెప్పాడు [26:5].

Acts 26:6

తాను, యూదులు ఎదురు చూచుచున్నఏ దేవుని వాగ్దానం గురించి పౌలు చెపుతున్నాడు?

దేవుడు చనిపోయినవారిని సజీవంగా లేపుతాడనే వాగ్దానం గురించి తానును యూడులును ఎదురుచూచుచున్నారని పౌలు చెపుతున్నాడు [26:6-8].

Acts 26:9

పౌలు తాను మార్పు చెందక ముందు నజరేయుడైన యేసు నామానికి వ్యతిరేకంగా ఏమిచేస్తూ వచ్చాడు?

చాలామంది పవిత్రులను చెరసాలలో వేయించాడు, చంపడానికి సమ్మతించాడు, విదేశీపట్టణాలకు వెళ్లి వారిని హింసిస్తూ వచ్చాడు [26:9-11].

Acts 26:12

దమస్కు మార్గంలో పౌలు ఏమిచూసాడు?

సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూసాడు [26:13].

దమస్కు మార్గంలో పౌలు ఏమి విన్నాడు?

జ:"సౌలా, సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు?" అనే స్వరాన్ని పౌలు విన్నాడు [26:14].

Acts 26:15

దమస్కు మార్గంలో ఎవరు పౌలుతో మాట్లాడుతున్నారు?

దమస్కు మార్గంలో యేసు పౌలుతో మాట్లాడుతున్నారు [26:15].

పౌలు ఏమి కావాలని యేసు నియమించాడు?

ఒక సేవకునిగాను, అన్యజనులకు సాక్షి గాను యేసు పౌలును నియమించాడు [26:16-17].

అన్యజనులు స్వీకరించాలని కోరుతున్నట్లు యేసు ఎందుకు చెప్పాడు?

అన్యజనులు పాపక్షమాపణను, దేవుని వద్దనుండి స్వాస్త్యమును పొందాలని కోరుతున్నాడని యేసు చెప్పాడు [26:18].

Acts 26:19

ఏరెండు సంగతులను పౌలు తాను వెళ్ళిన ప్రతీప్రదేశంలో చెపుతున్నాడు?

ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపాన్ని రుజువుపరచే క్రియలు చేయాలని బోధిస్తున్నట్టు పౌలు చెపుతున్నాడు [26:20].

Acts 26:22

మోషే, ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని చెపుతున్న సంగతులేంటి?

క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయి, మరణం నుండి లేవాలి, యూదా ప్రజలకు, అన్యజనులకు వెలుగు ప్రకటిస్తాడు అని మోషే, ప్రవక్తలు చెప్పారు [26:22-23].

Acts 26:24

పౌలు సమాధానం వినిన తరువాత ఫేస్తు పౌలు గురించి ఏమితలంచాడు?

పౌలు వెఱ్రివాడయ్యాడని ఫేస్తు పౌలు గురించి తలంచాడు [26:24-25].

Acts 26:27

రాజైన అగ్రిప్ప విషయం పౌలు కోరిక ఏమిటి?

రాజైన అగ్రిప్ప క్రైస్తవుడుగా మారాలని పౌలు కోరిక [26:28-29].

Acts 26:30

పౌలుకు వ్యతిరేకమైన నేరాలను గురించి అగ్రిప్ప, ఫేస్తు, బెర్నేకే పౌలు గురించి ఏమని తీర్మానానికి వచ్చారు?

పౌలు మరణానికి గాని, ఖైదుకు గాని తగిన నేరం ఏదీ చేయలేదు, చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననకపోతే అతణ్ణి విడుదల చేసేవాళ్ళమే అని అనుకొన్నారు [26:31-32].


Chapter 27

Translation Questions

Acts 27:3

రోమాకు ప్రయాణమవుతున్నపుడు ఆరంభంలో శతాధిపతియైన జూలియన్ పౌలును ఏ విధంగా చూసాడు?

శతాధిపతియైన జూలియన్ పౌలును దయతో చూసాడు, స్నేహితుల వద్దకు వెళ్లి తన అక్కరలు తీర్చుకొనేలా పౌలును అనుమతించాడు [27:3].

Acts 27:7

పౌలు ఎక్కిన ఓడ ఏ ద్వీపం వద్ద ఇబ్బందికి గురి అయింది?

క్రేతు ద్వీపం వద్ద ఓడ కష్టంతో ప్రయాణం చేసింది [27:7-8].

Acts 27:9

ప్రయాణంలో కొనసాగుతున్న ప్రమాదాలను గురించి పౌలు హెచ్చరికలను శతాధిపతియైన జూలియన్ ఎందుకు అనుసరించ లేదు?

నావికుడూ, ఓడ యజమానీ చెప్పిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక శతాధిపతియైన జూలియన్ పౌలు హెచ్చరికలను అనుసరించ లేదు [27:10-11].

Acts 27:14

ప్రయాణంలో నెమ్మదైన ఆరంభం తరువాత ఎటువంటి గాలి ఓడ మీద కొట్టింది?

ప్రయాణంలో నెమ్మదైన ఆరంభం తరువాత పెనుగాలి ఓడ మీద కొట్టింది [27:14].

Acts 27:19

చాలా రోజుల తరువాత ఓడ సిబ్బంది ఏ ఆశ వదులుకున్నారు?

చాలా రోజుల తరువాత ఓడ సిబ్బంది తాము బతికి బయట పడతామనే ఆశ వదులుకున్నారు [27:20].

Acts 27:23

ప్రయాణం గురించి దేవుని దూత ఎటువంటి సందేశాన్ని పౌలు అందించాడు?

పౌలును, తనతో పాటు ఓడలో ప్రయాణం చేస్తున్నవారు బ్రతుకుతారు, ఓడను కోల్పోతారు అని దేవదూత పౌలుతో చెప్పాడు [27:22-24].

Acts 27:27

పద్నాలుగవరోజు రాత్రి ఓడకు ఏమి జరుగుతుందని నావికులు భావించారు?

ఓడ ఏదో దేశాన్ని సమీపిస్తున్నట్టు నావికులు భావించారు [27:27].

Acts 27:30

ఏమి చెయ్యాలని నావికులు చూస్తున్నారు?

ఓడను వదిలి పెట్టాలని నావికులు చూస్తున్నారు [27:30].

శతాధిపతికి, ఇతర సైనికులకు పౌలు ఏమిచెప్పాడు?

వారు ఓడలో ఉంటేనే తప్ప వారు తప్పించుకోలేరని శతాధిపతికి, ఇతర సైనికులకు పౌలు చెప్పాడు [27:31].

Acts 27:33

తెల్లవారబోతున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఏమి చెయ్యమని పౌలు బతిమిలాడాడు?

ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని పౌలు బతిమిలాడాడు [27:33].

Acts 27:39

ఓడను ఒడ్డుకు తేవడానికి నావికులు ఏమి నిర్ణయించారు, ఏమి జరిగింది?

నావికులు ఓడను ఒడ్డుకు చేర్చాలని నిశ్చయించుకొన్నారు, ఓడను ఒడ్డుకు నడిపారు, అయితే ఓడ ముందు భాగం మట్టిలో కూరుకుపోయింది, ఓడ వెనుక భాగం బ్రద్ధలైపోతూ వచ్చింది [27:39-41].

Acts 27:42

ఈ సమయంలో ఖైదీల విషయం ఏమిచెయ్యాలని సైనికులు తలంచారు?

ఖైదీలలో ఎవడూ ఈదుకొని తప్పించుకోకుండా వారిని చంపాలని సైనికులు తలంచారు [27:42].

సైనికుల ఆలోచనను శతాధిపతి ఎందుకు ఆపివేసాడు?

పౌలును రక్షించాలనే ఉద్దేశంతో సైనికుల ప్రణాళికను శతాధిపతి ఆపివేసాడు [27:43].

ఓడలోని వారందరూ క్షేమంగా నేలమీదకి ఎలా వచ్చారు?

ఈత వచ్చినవారందరూ మొదట సముద్రములో దూకారు, మిగిలిన వారు పలకల మీద, ఓడ చెక్కల మీద ఎక్కారు [27:44].


Chapter 28

Translation Questions

Acts 28:1

మెలితే ద్వీప వాసులు పౌలును, మిగిలిన ఓడ వారిని ఏ విధంగా చూసారు?

ద్వీపవాసులు వారి పట్ల చూపిన దయ ఇంతింత కాదు [28:2].

Acts 28:3

విషసర్పం పౌలు చేతి నుంచి వ్రేలాడడం చూసి ద్వీపవాసులు ఏమి తలంచారు?

పౌలు తప్పక హంతకుడై ఉండాలి, సముద్రం నుంచి తప్పించుకొన్నా ధర్మదేవత అతణ్ణి బతకనివ్వడం లేదు, అని తలంచారు [28:4].

Acts 28:5

విషసర్పం పౌలును ఏమీ చెయ్యకపోవడం చూచి ప్రజలు ఏమని తలంచారు?

పౌలు దేవుడని వారు తలంచారు [28:6].

Acts 28:7

ద్వీపంలో ముఖ్యుడైన పొప్లి తండ్రిని పౌలు స్వస్థ పరచిన తరువాత ఏమి జరిగింది?

ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు [28:8-9].

Acts 28:11

పౌలును, నావికులు ను మెలితే ద్వీపంలో ఎంత కాలం ఉన్నారు?

పౌలును, నావికులు ను మెలితే ద్వీపంలో మూడు నెలలు ఉన్నారు [28:11].

Acts 28:13

తనను కలవడానికి రోమ్ నుండి వచ్చిన సోదరులను చూచినపుడు పౌలు ఏమిచేసాడు?

రోమ్ నుండి వచ్చిన సోదరులను చూచినపుడు పౌలు దేవునికి కృతజ్ఞత చెప్పాడు, ధైర్యం తెచ్చుకున్నాడు [28:15].

Acts 28:16

ఖైదీగా రోమ్ నందు పౌలు జీవన పరిస్థితులు ఏమిటి?

పౌలుకు తనను కావలి కాస్తున్న సైనికుడితో పాటు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు దొరికింది [28:16].

Acts 28:19

ఏ కారణంగా పౌలు సంకెళ్ళ పాలయ్యాడని రోమాలోని యూదా నాయకులకు చెప్పాడు?

ఇస్రాయెల్ ప్రజల ఆశాభావాన్ని బట్టి తాను సంకెళ్ళ పాలయ్యాడని రోమాలోని యూదా నాయకులకు పౌలు చెప్పాడు [28:20].

Acts 28:21

ఈ మతశాఖను గురించి రోమ్ లోని యూదా నాయకులకు ఏమి తెలుసు?

ఈ మతశాఖను గురించి అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రోమ్ లోని యూదా నాయకులకు తెలుసు [28:22].

Acts 28:23

యూదా నాయకులు మరల పౌలు బస చేస్తున్న ఇంటికి ఎప్పుడు వచ్చారు, ఉదయం నుండి సాయంత్రం వరకు పౌలు ఏమిచెయ్యడానికి ప్రయత్నించాడు?

మోషే ధర్మశాస్త్రం నుంచి ప్రవక్తల వ్రాతలలో నుంచి యేసును గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు [28:23].

పౌలు చెప్పిన బోధకు యూదా నాయకులు చూపిన స్పందన ఏమిటి?

కొందరు యూదా నాయకులు పౌలు చెప్పిన దానిని నమ్మారు, కొందరు నమ్మలేదు [28:24].

Acts 28:27

నమ్మని యూదా నాయకుల గురించి పౌలు ప్రస్తావించిన ఆఖరు లేఖనమేది?

ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్ధం చేసుకోరు, ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు అనే లేఖనాన్ని పౌలు ప్రస్తావించాడు [28:25-27].

Acts 28:28

దేవుడు ప్రసాదించిన రక్షణ పంపడం జరిగింది, దానికి స్పందన ఎక్కడుందని పౌలు చెపుతున్నాడు?

దేవుడు ప్రసాదించిన రక్షణ అన్యజనులకు పంపడం జరిగింది, వారు దానిని వింటారు అని పౌలు చెప్పాడు [28:28].

Acts 28:30

రోమాలో ఖైదీగా ఉంటూ పౌలు ఏమి చేసాడు?

పౌలు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, యేసే క్రీస్తుని గురించి ధైర్యంగా బోధించాడు.

పౌలు రెండు సంవత్సరాలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిoచకుండా అడ్డుకున్నది ఎవరు?

అతనిని ఎవ్వరూ ఆపలేదు [28:31].


Chapter 1

Translation Questions

Romans 1:1

పౌలుకు ముందే దేవుడు దేని ద్వారా సువార్తను వాగ్దానం చేసాడు ?

దేవుడు ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసాడు(1:1-2).

శరీరమును బట్టి దేవుని కుమారుడు ఎవరి సంతానముగా పుట్టాడు ?

శరీరమును బట్టి దేవుని కుమారుడు దావీదు సంతానముగా పుట్టాడు. (1:3)

Romans 1:4

దేని ద్వారా యేసు క్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపించ బడ్డాడు ?

యేసు క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు(1:4)

ఏ ఉద్దేశం కొరకు పౌలు కృపను, అపోస్తలత్వం పొందాడు ?

సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా పౌలు కృపను, అపోస్తలత్వం పొందాడు. (1:5)

Romans 1:8

రోమాలో ఉన్న విశ్వాసుల విషయములో దేని కొరకు పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ?

వారి విశ్వాసము సర్వ లోకమునకు ప్రచురము చేయబడింది గనుక పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు (1:8).

Romans 1:11

రోమాలో ఉన్న విశ్వాసులను పౌలు ఎందుకు చూడ గోరాడు ?

వారు స్థిరపరచ బడేలా వారికి ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వడానికి పౌలు చూడగోరాడు. (1:11)

Romans 1:13

పౌలు ఇది వరకు రోమాలోని విశ్వాసులను ఎందుకు దర్శించ లేకపోయాడు ?

ఇది వరకు ఆటంకం కలిగిన కారణంగా రోమాలోని విశ్వాసులను పౌలు దర్శించలేక పోయాడు(1:13)

Romans 1:16

సువార్తను గురించి పౌలు ఏమి చెబుతున్నాడు ?

నమ్ము ప్రతివానికి సువార్త దేవుని శక్తియై యున్నది అని పౌలు చెపుతున్నాడు.(1:16)

నీతి మంతుడు ఏ విధంగా జీవిస్తాడు అనే డానికి ఏ లేఖనాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు ?

"నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు" అనే లేఖనాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు (1:17)

Romans 1:18

దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది భక్తి హీనులకు, అనీతిమంతులకు విశదపరచ బడినపుడు వారు ఏమి చేస్తారు ?

దేవుని గూర్చి తెలియశక్యమైనది విశదపరచ బడినపుడు భక్తి హీనులు, అనీతిమంతులు దానిని దుర్నీతి చేత అడ్డగిస్తారు. (1:18-19)

Romans 1:20

దేవుని అదృశ్య లక్షణములు ఏ విధంగా తేటపడుతున్నాయి ?

దేవుని అదృశ్య లక్షణములు సృష్టింపబడిన వస్తువుల ద్వారా తేటపడుతున్నాయి. (1:20)

తేటపడుతున్న దేవుని అదృశ్య లక్షణములు ఏవి ?

ఆయన నిత్యశక్తి, దేవత్వము తేటపడుతున్నాయి. (1:20)

దేవుని మహిమ పరచక, ఆయనకు కృతజ్ఞత చెల్లించని వారి హృదయాలకు, తలంపులకు ఏమి జరుగుతుంది ?

దేవుని మహిమ పరచక, ఆయనకు కృతజ్ఞత చెల్లించని వారు తమ ఆలోచనలలో వ్యర్థులయ్యారు, వారి హృదయాలు అంధకారమయ్యాయి. (1:21)

Romans 1:22

దేవుని మహిమను క్షయమగు మనుష్యుల, జంతువుల ప్రతిమాస్వరూపముగా మార్చిన వారిని దేవుడు ఏమి చేస్తాడు ?

వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. (1:23-24)

Romans 1:26

ఏ నీచమైన కోరికల కొరకు ఈ స్త్రీ పురుషులు కామతప్తులయ్యారు ?

స్త్రీలు ఒకరి యెడల ఒకరు కామతప్తులయ్యారు, పురుషులు ఒకరి యెడల ఒకరు కామతప్తులయ్యారు. (1:26-27)

Romans 1:28

తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లని వారికి దేవుడు ఏమి చేస్తాడు ?

తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లని వారిని చేయ రాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ఠ మనస్సుకు వారిని అప్పగించాడు. (1:28)

Romans 1:29

భ్రష్ఠమనస్సు కలిగిన వారి లక్షణాలు కొన్ని ఏమిటి ?

భ్రష్ఠ మనస్సు కలిగిన వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండి యుంటారు. (1:29)

Romans 1:32

భ్రష్ఠ మనస్సు కలిగిన వారు దేవుని న్యాయ విధిని ఎలా అర్ధం చేసుకున్నారు ?

భ్రష్ఠ మనస్సు కలిగి ఇట్టి కార్యములు చేయువారు తాము మరణమునకు తగినవారు అని అర్ధం చేసుకున్నారు. (1:32)

భ్రష్ఠ మనస్సు కలిగి దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి యుండికూడా వారు ఏమి చేస్తున్నారు?

ఎరిగి యుండి కూడా అవినీతి కార్యాలే చేయుచున్నారు, వాటిని అభ్యసించు వారితో సమ్మతించుచున్నారు (1:32)


Chapter 2

Translation Questions

Romans 2:1

ఎందుకు కొందరు తీర్పు తీర్చునప్పుడు సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు ?

దేని విషయములో ఇతరులకు తీర్పు తీర్చుచున్నారో అట్టి కార్యములనే వారు చేయుచున్నారు గనుక వారు తీర్పు తీర్చునప్పుడు సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు(2:1)

దుర్నీతిని చేయువారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు ?

దుర్నీతిని చేయువారిని దేవుడు సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు(2:2)

Romans 2:3

దేవుని సహనము, అనుగ్రహము ఏమి చెయ్యాలని ప్రేరేపిస్తుంది ?

దేవుని సహనము, అనుగ్రహము మారుమనస్సు పొందుటకు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. (2:4)

Romans 2:5

దేవుని విషయమై కఠినులైన, మార్పు పొందని వారు ఏమి సమకూర్చుకొంటున్నారు ?

దేవుని విషయమై కఠినులైన, మార్పు పొందని వారు దేవుని న్యాయమైన తీర్పు బయలుపడే దినమందు దేవుని ఉగ్రతను సమకూర్చుకొంటున్నారు. (2:5)

సత్క్రియలు ఓపికగా చేయు వారు ఏమి పొందుతారు?

సత్క్రియలు ఓపికగా చేయు వారు నిత్య జీవమును పొందుతారు. (2:7)

Romans 2:8

దుర్నీతికి లోబడు వారు ఏమి పొందుతారు ?

దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రము వస్తాయి, వారికి శ్రమ, వేదన కలుగుతాయి. (2:8-9)

Romans 2:10

యూదునికి గ్రీసు జాతి వాడికి దేవుని తీర్పు నిష్పక్షపాతాన్ని ఏ విధంగా చూపిస్తాడు ?

యూదునికి గ్రీసు జాతి వాడికి దేవుని తీర్పు విషయంలో ఏ పక్షపాతం చూపడు. పాపం చేస్తే ఇద్దరూ నశిస్తారు (2:12).

Romans 2:13

దేవుని ఎదుట నీతిమంతులు గా ఎంచబడినవాడు ఎవరు ?

ధర్మ శాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచ బడుదురు. (2:13)

అన్యుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు తన హృదయములో రాయబడినట్టు ఏవిధంగా చూపించగలడు ?

ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసిన యెడల అన్యుడు ధర్మశాస్త్రంతన హృదయములో రాయబడినట్టు చూపించ గలడు (2:14-15)

Romans 2:17

ధర్మ శాస్త్రమును ఆశ్రయించి దానిని ఇతరులకు బోధించు యూదులకు పౌలు ఎలాంటి సవాలు చేస్తున్నాడు ?

ధర్మ శాస్త్రమును ఆశ్రయించి దానిని ఇతరులకు బోధించు యూదులు తమకు తాము బోధించుకోవాలని పౌలు సవాలు చేస్తున్నాడు. (2:17-21)

Romans 2:21

ధర్మ శాస్త్రమును బోధించు యూదులు ఏఏ పాపాలను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు ?

దొంగతనము, వ్యభిచారం, గుళ్ళను దోచుకోవడం లాంటి పాపాలను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు. (2:21-22)

Romans 2:23

యూదా ఉపదేశకులను బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య ఎందుకు అవమానపరచ బడుతుంది ?

యూదా ఉపదేశకులు ధర్మ శాస్త్రమును మీరుట వలన దేవుని నామము అన్యజనుల మధ్య అవమానపరచ బడుతుంది (2:23-24)

Romans 2:25

ఏ విధంగా ఒక యూదుని సున్నతి సున్నతి కాక పోవును అని పౌలు చెపుతున్నాడు ?

ఒక యూదుడు ధర్మ శాస్త్రమును అతిక్రమించిన వాడైతే అతని సున్నతి అతనికి సున్నతి కాక పోవును. (2:25)

ఏ విధంగా ఒక సున్నతి లేని అన్యుడు సున్నతి గలవాడుగా ఎంచ బడును అని పౌలు చెపుతున్నాడు ?

సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులు గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతి గలవాడుగా ఎంచ బడును. (2:26)

Romans 2:28

నిజమైన యూదుడు ఎవరని పౌలు చెబుతున్నాడు ?

హృదయ సంబంధమైన సున్నతి కలిగి అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని పౌలు చెపుతున్నాడు. (2:28-29)

నిజమైన యూదుడు ఎవరి వలన మెప్పు పొందును ?

నిజమైన యూదుడు దేవుని వలననే మెప్పు పొందును. (2:29)


Chapter 3

Translation Questions

Romans 3:1

యూదులకు కలిగిన గొప్పతనములలో మొదటిది ఏది ?

యూదులకు కలిగిన గొప్పతనములలో మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడడమే. (3:1-2)

Romans 3:3

ప్రతి మనుష్యుడు అబద్దికుడు అయినప్పటికిని దేవుడు ఏ విధంగా కనిపిస్తున్నాడు ?

ప్రతి మనుష్యుడు అబద్దికుడు అయినప్పటికిని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. (3:4)

Romans 3:5

దేవుడు నీతిమంతుడు కనుక ఆయన ఏమి చెయ్యగలడు ?

దేవుడు నీతిమంతుడు కనుక ఆయన లోకమునకు తీర్పు తీర్చ గలడు. (3:5-6)

Romans 3:7

"మేలు కలుగుట కొరకు మనము కీడు చేయుదము" అని చెప్పువారి మీదకు ఏమి వచ్చును ?

"మేలు కలుగుటకు మనము కీడు చేయుదము" అని చెప్పువారి మీదకు తీర్పు వచ్చును (3:8)

Romans 3:9

యూదులు, గ్రీసు దేశస్తులు మనుష్యులందరి నీతిని గురించి లేఖనాలలో ఏమి రాసి ఉంది ?

నీతి మంతుడు లేదు, ఒక్కడును లేడు అని రాసి ఉంది. (3:9-10)

Romans 3:11

రాసి ఉన్న దాని ప్రకారం గ్రహించు వాడు, దేవుని వెదకు వాడు ఎవరు ?

రాసి ఉన్న దాని ప్రకారం గ్రహించు వాడు లేడు, దేవుని వెదకు వాడు లేడు. (3:11)

Romans 3:19

ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు ?

ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చ బడడు.(3:20)

ధర్మశాస్త్రంమూలముగా ఏమి కలుగుతుంది ?

ధర్మశాస్త్రంమూలముగా పాపమనగా ఎట్టిదో తెలియు చున్నది. (3:20)

Romans 3:21

ధర్మశాస్త్రమునకు వేరుగా ఏ సాక్ష్యము ద్వారా దేవుని నీతి బయలు పడుచున్నది ?

ధర్మశాస్త్రమును, ప్రవక్తల సాక్ష్యము చేత ఇపుడు దేవుని నీతి బయలు పడుచున్నది. (3:21)

ధర్మశాస్త్రంలేకయే ఏ నీతి ఇపుడు బయలుపడు చున్నది ?

ధర్మశాస్త్రంలేకయే యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి దేవుని నీతి బయలు పడు చున్నది. (3:22)

Romans 3:23

దేవుని యెదుట ఒక వ్యక్తి ఏ విధంగా నీతి మంతుడిగా తీర్చబడతాడు ?

నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చ బడుతున్నాడు. (3:24)

Romans 3:25

ఏ ఉద్దేశం కొరకు దేవుడు క్రీస్తు యేసును అనుగ్రహించాడు ?

క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా అనుగ్రహించాడు (3:25)

జరిగిన దానంతటిని బట్టి యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఏమి కనుపరచెను ?

యేసునందు విశ్వాసము గలవానిని నీతి మంతునిగా తీర్చువాడునై యుండుటకు అయన అలా చేశాడు. (3:26)

Romans 3:27

నీతిమంతునిగా తీర్చ బడుటలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వంతు ఏమిటి ?

ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడుచున్నాడు. (3:28)

Romans 3:29

సున్నతి పొందిన యూదుని, సున్నతి లేని అన్యజనులను దేవుడు ఏ రీతిగా నీతిమంతులనుగా తీర్చుచున్నాడు ?

ఇద్దరినీ దేవుడు విశ్వాసము ద్వారా దేవుడు నీతిమంతులనుగా తీర్చుచున్నాడు (3:30)

Romans 3:31

విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రమును ఏమి చేయుచున్నాము ?

విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రమును స్థిర పరచుచున్నాము. (3:31)


Chapter 4

Translation Questions

Romans 4:1

అబ్రాహాము అతిశయించడానికి ఏ కారణం ఉండియుండవచ్చు ?

అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చ బడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును. (4:2)

అబ్రాహాము నీతిమంతుడుగా తీర్చబడుటను గూర్చి లేఖనము ఏమి చెపుతున్నది ?

అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచ బడెను అని లేఖనము చెప్పుచున్నది. (4:3)

Romans 4:4

ఎటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు ?

భక్తి హీనులను దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. (4:5)

Romans 4:6

దావీదు చెప్పిన ప్రకారం మనుష్యుడు ఏ విధంగా దేవుని చేత దీవించ బడతాడు ?

దావీదు చెప్పిన ప్రకారం, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తనపాపంలకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ప్రభువు చేత దీవించ బడినవాడు. (4:6-8)

Romans 4:9

అబ్రాహాము విశ్వాసము అతను సున్నతి పొందడానికి ముందు నీతిగా ఎంచ బడినదా లేక సున్నతి పొందిన తరువాత ఎంచ బడినదా ?

అబ్రాహాము విశ్వాసము అతను సున్నతి పొందడానికి ముందే నీతిగా ఎంచబడినది. (4:9-10)

Romans 4:11

ఏ గుంపు ప్రజలకు అబ్రాహాము తండ్రి గా ఉన్నాడు ?

సున్నతి పొందిన వారైనను, సున్నతి పొందని వారైనను విశ్వసించు ప్రతివారికీ అబ్రాహాము తండ్రి గా ఉన్నాడు. (4:11-12)

Romans 4:13

విశ్వాసము వలనైన నీతి ద్వారా అబ్రాహాము సంతానమునకు ఏ వాగ్దానము ఇవ్వబడినది ?

విశ్వాసము వలనైన నీతి ద్వారా లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహాము సంతానమునకు ఇవ్వబడినది. (4:13)

లోకమునకు వారసుడగునను వాగ్దానము ధర్మ శాస్త్రంవలన కలిగినదైతే ఏమి జరుగుతుంది ?

లోకమునకు వారసుడగునను వాగ్దానము ధర్మ శాస్త్రంవలన కలిగినదైతే విశ్వాసము వ్యర్ధమగును, వాగ్దానమును నిరర్ధకమగును. (4:14)

Romans 4:16

విశ్వాస మూలముగా వాగ్దానము ఇవ్వబడుటకు కారణాలు ఏమిటి ?

కృప చేత, దృఢం కావలెనని వాగ్దానము విశ్వాస మూలముగా ఇవ్వబడింది. (4:16)

దేవుడు చేసే ఏ రెండు కార్యాలను పౌలు చూపిస్తున్నాడు ?

దేవుడు మృతులను సజీవులనుగా చేస్తాడు, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు. (4:17)

Romans 4:18

అనేకులకు తండ్రి అవుతాడని దేవుని వాగ్దానమును నమ్మడానికి అబ్రాహామును కష్టపెట్టిన బాహ్య పరిస్తితులేవి ?

దేవుడు అబ్రహముకు వాగ్దానము చేసినపుడు అబ్రాహాము రమారమి నూరేండ్ల ప్రాయము గలవాడు, శారా గర్భము మృతతుల్యమైనదిగా ఉంది. (4:18-20)

Romans 4:20

ఈ బాహ్య పరిస్తితులు ఉన్నప్పటికిని దేవుని వాగ్దానముకు అబ్రాహాము ఎలా స్పందిచాడు ?

అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని విశ్వసించాడు. (4:18,20)

Romans 4:23

ఎవరి నిమిత్తము అబ్రాహాము వృత్తాంతము రాయబడింది ?

అబ్రాహాము వృత్తాంతము అతని నిమిత్తమును, మన నిమిత్తమును రాయబడింది. (4:23-24)

దేవుడు మనకు ఏమి చేశాడని మనము నమ్ముతున్నాము ?

దేవుడు మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపెనని, ఆయన మన అపరాధంల నిమిత్తము అప్పగించబడ్డాడని, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెనని నమ్ముతున్నాము. (4:25)


Chapter 5

Translation Questions

Romans 5:1

విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు ఏమి కలిగి యున్నారు ?

విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడినకారణంగా విశ్వాసులు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యున్నారు. (5:1)

Romans 5:3

శ్రమలు కలుగ చేసే మూడు అంశాలు ఏమిటి ?

శ్రమ సహనమును, అనుభవాన్ని, ఆశాభావాన్ని కలిగిస్తుంది. (5:3-4)

Romans 5:8

దేవుడు మన యెడల తన ప్రేమను ఏవిధంగా ఋజువు చేసాడు ?

దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనకొరకు చనిపోయాడు. (5:8)

క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు దేనినుండి రక్షించ బడ్డారు ?

క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు దేవుని ఉగ్రత నుండి రక్షించ బడ్డారు. (5:9)

Romans 5:10

యేసు ద్వారా అవిశ్వాసులైన వారు దేవుని తో సమాధాన పరచ బడక మునుపు ఏమై యున్నారు ?

యేసు ద్వారా అవిశ్వాసులైన వారు దేవుని తో సమాధాన పరచ బడక మునుపు శత్రువులు గా ఉన్నారు. (5:10)

Romans 5:12

ఒక మనుష్యునిపాపం వలన ఏమి జరిగింది ?

ఒక మనుష్యుని ద్వారాపాపంను,పాపం ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను, మరణంఅందరికీ వాటిల్లింది. (5:12)

Romans 5:14

ఎవని ద్వారాపాపం లోకములో ప్రవేశించిందో ఆ మనుష్యుడు ఎవరు ?

ఆదాము అను మనుష్యుని ద్వారాపాపం లోకములోనికి ప్రవేశించినది. (5:14)

దేవుని కృపావరం ఆదాము అపరాధంనకు భిన్నంగా ఉంది ?

ఆదాము అపరాధం వలన అనేకులు చనిపోయారు, అయితే దేవుని కృపావరం అనేకులకు విస్తరించింది. (5:15)

Romans 5:16

ఆదాము అపరాధం నుండి ఏమి కలిగింది, దేవుని కృపావరం నుండి ఏమి కలిగింది ?

ఆదాము అపరాధం నుండి శిక్షా విధి కలిగినది, దేవుని కృపావరం మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణ మాయెను. (5:16)

ఆదాము అపరాధం నుండి ఏలినది ఏది, దేవుని కృపావరం నుండి ఏమి ఏలినది ?

ఆదాము అపరాధం నుండి మరణంఏలినది, దేవుని కృపావరం పొండువారు జీవము గలవారై యేసు క్రీస్తు ద్వారా ఏలుదురు. (5:17)

Romans 5:18

ఆదాము అవిధేయత వలన అనేకులు ఏమి చేయబడతారు, క్రీస్తు విధేయత వలన అనేకులు ఏమి చేయ బడతారు ?

ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏమి చేయబడ్డారు, క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయ బడ్డారు. (5:19)

Romans 5:20

ఎందుకు ధర్మశాస్త్రంప్రవేశించింది ?

అపరాధం విస్తా రించు నట్లుగా ధర్మ శాస్త్రంప్రవేశించింది. (5:20)

అపరాధం కంటే ఎక్కువగా ఏది విస్తరించింది ?

దేవుని కృప అపరాధం కంటే ఎక్కువగా విస్తరించింది. (5:20)


Chapter 6

Translation Questions

Romans 6:1

కృప విస్తరించునట్లుగా విశ్వాసులుపాపంలో కొనసాగుతారా ?

అలా ఎప్పటికి జరగకూడదు. (6:1-2)

క్రీస్తు యేసు లోనికి బాప్తిసం పొందిన వారు దేనిలోకి బాప్తిస్మము పొందారు ?

క్రీస్తు యేసు లోనికి బాప్తిసం పొందిన వారు ఆయన మరణంలోకి బాప్తిస్మము పొందారు. (6:3)

Romans 6:4

క్రీస్తు మృతులలో నుండి లేపబడినందు వలన విశ్వాసులు ఏమి చేయాలి ?

విశ్వాసులు నూతన జీవము గలవారై నడుచుకోవాలి. (6:4)

బాప్తిస్మము ద్వారా ఏ రెండు విషయాలలో విశ్వాసులు క్రీస్తుతో ఐక్య పరచ బడ్డారు ?

బాప్తిస్మము ద్వారా అయన మరణము, పునరుద్ధానము లలో విశ్వాసులు క్రీస్తుతో ఐక్య పరచ బడ్డారు. (6:5)

Romans 6:6

మనమిక మీదట పాపానికిదాసులము కాకుండు నట్లు మనకు ఏమి జరిగింది ?

మనమిక మీదట పాపానికిదాసులము కాకుండు నట్లు మన ప్రాచీన పురుషుడు క్రీస్తు తో సిలువ వేయబడ్డాడు, (6:6)

Romans 6:8

మరణమునకు క్రీస్తు మీద ఆధిపత్యము లేదనే విషయము మనము ఎలా తెలుసుకోగాలము ?

క్రీస్తు మరణంలోనుండి లేచినకారణంగా మరణం ఆయన మీద ప్రభుత్వము చేయదు. (6:9)

Romans 6:10

క్రీస్తుపాపం విషయమై ఎన్ని సార్లు చనిపోయెను, ఎంతమంది కొరకు ఆయన చనిపోయెను ?

క్రీస్తుపాపం విషయమై ఒక్క సారే అందరికొరకు చనిపోయాడు. (6:10)

పాపం విషయములో తన గురించి ఏ విధంగా ఎంచు కోవాలి ?

పాపం విషయములో ఒక విశ్వాసి మృతునిగా ఎంచు కోవాలి. తన గురించి ఏ విధంగా ఎంచు కోవాలి (6:10-11)

ఎవరి కొరకు ఒక విశ్వాసి జీవించాలి ?

ఒక విశ్వాసి దేవుని కొరకు జీవించాలి. (6:10-11)

Romans 6:12

ఒక విశ్వాసి ఎవరి కొరకు తన అవయవములను సమర్పించు కోవాలి, ఏ ఉద్దేశం కొరకు ?

ఒక విశ్వాసి తన అవయవములను దేవునికి నీతి కొరకు సాధనములుగా సమర్పించు కోవాలి. (6:13)

పాపంమీద ఏలునట్లు ఒక విశ్వాసి దేనికి లోని ఉండాలి ?

పాపంమీద ఏలునట్లు ఒక విశ్వాసి కృపకు లోనైనా వాడిగా ఉంటాడు. (614)

Romans 6:15

పాపానికితనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం ఏమిటి ?

పాపానికితనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం మరణం. (6:16,21)

దేవునికి తనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం ఏమిటి ?

దేవునికి తనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం నీతి. (6:16,18-19)

Romans 6:22

దేవుని దాసులైనవారి ఫలము ఏ ఉద్దేశం కొరకు వారు కలిగి ఉంటారు ?

దేవుని దాసులైనవారి ఫలము పరిశుద్ధత కొరకే. 6:22)

పాపమంకు వచ్చు జీత మేమి ?

పాపం కు వచ్చు జీతము మరణము. (6:23)

దేవుని కృపావరం ఏమిటి ?

దేవుని కృపావరం నిత్య జీవము. (6:23)


Chapter 7

Translation Questions

Romans 7:1

ధర్మ శాస్త్రంఎంత కాలము ఒక మనుష్యుని మీద ప్రభుత్వము చేస్తుంది ?

ఒక మనుష్యుడు బ్రతికినంత కాలము అతని మీద ప్రభుత్వము చేస్తుంది. (7:1)

Romans 7:2

ధర్మశాస్త్రం వలన వివాహమైన స్త్రీ ఎంత కాలము బద్ధురాలై ఉంటుంది ?

ధర్మశాస్త్రం వలన వివాహమైన స్త్రీ భర్త బ్రతికినంతకాలము అతనికే బద్ధురాలై ఉంటుంది. (7:2)

ధర్మ శాస్త్రం నుండి ఒకసారి విడుదల పొందిన తరువాత ఆ స్త్రీ ఏమి చెయ్య వచ్చును ?

ధర్మ శాస్త్రం నుండి ఒకసారి విడుదల పొందిన తరువాత ఆ స్త్రీ వేరొక పురుషుని వివాహం చేసికొన వచ్చును. ఏమి చెయ్య వచ్చును. (7:3)

Romans 7:4

విశ్వాసులు ధర్మ శాస్త్రమునకు ఏ విధముగా మృతులయ్యారు ?

క్రీస్తు శరీరము ద్వారా విశ్వాసులు ధర్మ శాస్త్రమునకు మృతులయ్యారు. (7:4)

ధర్మ శాస్త్రమునకు మృతులయిన విశ్వాసులు ఏమి చెయ్య గలిగారు ?

ధర్మ శాస్త్రమునకు మృతులయిన విశ్వాసులు క్రీస్తును చేర గలిగారు. (7:4)

Romans 7:7

ధర్మ శాస్త్రంయొక్క పని ఏమిటి ?

ధర్మ శాస్త్రంపాపమును తెలియ పరచుచున్నది. (7:7)

ఆజ్ఞను హేతువు చేసుకొని పాపం ఏమి చేస్తుంది ?

ఆజ్ఞను హేతువు చేసుకొనిపాపం సకలవిధములైన దురాశలను పుట్టిస్తుంది. (7:8)

Romans 7:11

ధర్మ శాస్త్రం పాపమా లేక పరిశుద్ధమా ?

ధర్మ శాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధ మైనది,నీతి గలది, ఉత్తమమైనదియునై ఉన్నది. (7:7,12)

Romans 7:13

పాపం తనకు ఏమి చేసినదని పౌలు చెపుతున్నాడు ?

పాపం ధర్మ శాస్త్రంద్వారా అతనికి మరకరమైనదని పౌలు చెపుతున్నాడు. (7:13)

Romans 7:15

పౌలు ధర్మశాస్త్రముతో అది శ్రేస్టమైనదని ఒప్పుకొనునట్లు చేయడానికి కారణమేమిటి ?

పౌలు తాను ఇచ్చయింపని తాను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేస్టమైనదని ఒప్పుకొనుచున్నాడు. (7:16)

Romans 7:17

పౌలు చేయుచున్న వాటిని, చేయ గోరని పనులను ఎవరు చేయుచున్నారు ?

పౌలు చేయుచున్న, చేయ గోరని పనులను తనలో నివసించు చున్న పాపమే చేయుచున్నాది. (7:17,20)

పౌలు శరీరములో ఎవరు నివసించుచున్నారు ?

తన శరీరమందు మంచిది ఏదీ నివసించదు. (7:18)

Romans 7:19

తనలో క్రియ చేయుచున్న ఏ నియమమును పౌలు కనుగొన్నాడు ?

మేలు చేయగోరు తనకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము పౌలుకి కనబడు చున్నది. (7:21-23)

Romans 7:24

తన అంతరంగ పురుషునిలో పౌలు చూచిన నియమము ఏది, తన శరీర అవయములలో ఉన్న నియమము ఏది ?

అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మ సాస్త్రమునండు పౌలు ఆనందించుచున్నాడు, అయితే తన అవయములలో నున్న పాపనియమము పౌలును చెరపట్టి లోబరచు కొనుచున్నది. (7:23,25)

మరణమునకు లోనైన శరీరమును నుండి పౌలుని ఎవరు విడిపించ గలరు ?

పౌలు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అయన విడుదల కొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాడు. (7:25)


Chapter 8

Translation Questions

Romans 8:1

పాపమరణ నియమము నుండి పౌలును విడిపించినది ఏది ?

క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమము నుండి పౌలును విడిపించినది. (8:2)

Romans 8:3

ధర్మ శాస్త్రంపాపమరణ నియమము ఎందుకు విడిపించ లేక పోయింది ?

ధర్మ శాస్త్రంశరీరము ద్వారా బలహీనమైనది కనుక చేయ్య లేక పోయింది. (8:3)

ఆత్మానుసారులైన మనుష్యులు దేని మీద తమ మనసు నుంచుతారు ?

ఆత్మాను సారులైన మనుష్యులు ఆత్మ సంబంధమైన వాటి మీద తమ మనసు నుంచుతారు(8:4-5)

Romans 8:6

శరీరానుసారమైన మనసుకు దేవునితోను, ధర్మసాస్త్రముతోను ఎలాంటి సంబంధం ఉంటుంది ?

శరీరానుసారమైన మనసుకు దేవునికి విరోధమై యున్నది, అది ధర్మ శాస్త్రమునకు లోబడదు. (8:7)

Romans 8:9

దేవునికి చెందని వారికి ఏమి కొదువగా ఉంటుంది ?

క్రీస్తు ఆత్మ దేవునికి చెందని వారిలో నివసించడు. (8:9)

Romans 8:11

చావునకు లోనైన విశ్వాసుల శరీరములకు దేవుడు తన జీవాన్ని ఎలా ఇస్తాడు ?

చావునకు లోనైన విశ్వాసుల శరీరములలో దేవుడు తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇస్తాడు, ఆ ఆత్మ విశ్వాసిలో నివసిస్తాడు. (8:11)

Romans 8:12

దేవుని కుమారులు జీవించ డానికి ఏ విధంగా నడిపించ బడతారు ?

దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించ బడతారు. (8:13-14)

Romans 8:14

ఒక విశ్వాసి దేవుని ఇంటిలో ఎలా కలుపబదతాడు ?

దత్తత ద్వారా ఒక విశ్వాసి దేవుని ఇంటిలో ఎలా కలుపబడతాడు. (8:15).

Romans 8:16

దేవుని కుమారులుగా దేవుని ఇంటిలో విశ్వాసులు పొండుకొనే ఇతర ప్రయోజనాలు ఏవి ?

దేవుని కుమారులుగా దేవుని ఇంటిలో విశ్వాసులు దేవుని వారసులుగా ఉంటారు, క్రీస్తు తోడి వారసులుగా ఉంటారు. (8:17)

Romans 8:18

ప్రస్తుత కాల శ్రమలను ఎందుకు విశ్వాసులు సహించాలి ?

దేవుని కుమారులు ప్రత్యక్ష్య పరచ బదడినపుడు క్రీస్తు తో మహిమ పరచ బడుటకై ప్రస్తుత కాల ఈ శ్రమలను సహించాలి. (8:17-19)

Romans 8:20

ప్రస్తుత కాలమందు సృష్టి ఏ విధమైన దాస్యములో ఉన్నది ?

ప్రస్తుత కాలమందు సృష్టి వ్యర్ధ పరచబడు దాస్యములో ఉన్నది. (8:21)

దేనిలోనికి వెళ్ళడానికి సృష్టి విడిపించ బడుతుంది ?

దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము లోనికి విడిపించబడబోతుంది. (8:21)

Romans 8:23

దేహముల విమోచనము కొరకు విశ్వాసులు ఎలా ఎదురు చూడాలి ? ?

దేహముల విమోచనము కొరకు విశ్వాసులు నిరీక్షణ తోను ఒపికతోను కనిపెట్టాలి. (8:23-25)

Romans 8:26

పరిశుద్దుల బలహీనతలో సహాయం చెయ్యాడానికి ఆత్మ తానే ఏమి చేస్తాడు ?

పరిశుద్దుల బలహీనతలో సహాయం చెయ్యాడానికి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తాడు. (8:26-27)

Romans 8:28

దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగేలా దేవుడు ఎలా పనిచేస్తాడు ?

దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగేలా దేవుడు పనిచేస్తాడు. (8:28)

దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారికి ఏ గమ్యాన్ని ముందుగా నిర్ణయించాడు ?

దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (8:29)

దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనొ వారికి దేవుడింకా ఏమి చేస్తాడు ?

దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనొ వారిని పిలిచాడు, నీతిమంతులుగా చేసాడు, మహిమ పరచాడు. (8:30)

Romans 8:31

దేవుడు వీటన్నిటిని ఉచితంగా ఇచ్చాడని విశ్వాసులు ఎలా తెలుసుకుంటారు ?

మన అందరి కొరకు దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించాడు కనుక దేవుడు వీటన్నిటిని ఉచితంగా ఇచ్చాడని విశ్వాసులు తెలుసుకుంటారు. (8:32)

Romans 8:33

దేవుని కుడిపార్స్వమున క్రీస్తు యేసు ఏమి చేయుచున్నాడు ?

దేవుని కుడిపార్స్వమున క్రీస్తు యేసు మన కొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు. (8:34)

Romans 8:35

శ్రమల లోను, హింసలలోను, మరణములో సహితము విశ్వాసులు అత్యధిక విజయాన్ని ఎలా పొందుతున్నారు ?

విశ్వాసులు తమను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నారు. (8:35-37)

Romans 8:37

సృష్టింప బడిన ఏదైనను విశ్వాసిని ఏమీ చెయ్యలేదని పౌలు రూడిగా నమ్మిన దేమిటి ?

సృష్టింప బడిన ఏదైనను విశ్వాసిని దేవుని ప్రేమ నుండి వేరు పరచ లేదని పౌలు రూడిగా ఒప్పించా బడ్డాడు, నమ్మాడు. (8:39)


Chapter 9

Translation Questions

Romans 9:1

పౌలు ఎందుకు బహు దుఃఖము, మానని వేదన కలిగి యున్నాడు ?

దేహసంబందులైన అతని సహోదరులు, ఇశ్రాయేలీయుల కొరకు పౌలు బహు దుఃఖము, మానని వేదన కలిగి యున్నాడు. (9:1-4)

Romans 9:3

ఇశ్రాయేలీయులు తమ చరిత్ర లో ఏమి కలిగి యున్నారు ?

దత్త పుత్రత్వమును, మహిమయు, నిబందనలును, ధర్మ శాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలును, వాగ్దానములును వీరివి. (9:4)

Romans 9:6

ఇశ్రాయేలులో ఉన్నవారందరు, అబ్రాహాము సంతానమంతయు గురించి యధార్ధము కాదు అని పౌలు చెపుతున్న దేమిటి ?

ఇశ్రాయేలు సంబందులందరూ ఇశ్రాయేలీయులు కారు, అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు అని పౌలు చెపుతున్నాడు. (9:6-7)

Romans 9:8

ఎవరు దేవుని పిల్లలుగా ఎంచబడడం లేదు ?

శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. (9:8)

ఎవరు దేవుని పిల్లలుగా ఎంచబడు చున్నారు ?

వాగ్దాన సంబంధులైన పిల్లలు దేవుని సంతానమని ఎంచబడుచున్నారు. (9:8)

Romans 9:10

తనకు పిల్లలు పుట్టక మునుపే "పెద్దవాడు చిన్న వానికి దాసుడగును" అని రిబ్కా కు ఇవ్వబడిన మాట వెనుక ఉన్న కారణం ఏమిటి ?

రిబ్కా కు ఇవ్వబడిన మాట వెనుక ఉన్న కారణం ఏమిటి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. (9:10-12)

Romans 9:14

దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక ఉన్న కారణము ఏమిటి ?

దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక కారణం దేవుని సంకల్పం. (9:14-16)

దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక కారణం కానిది ఏమిటి ?

దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక ఉన్నకారణం పొంద గోరువానిలోనైనను, ప్రయాసపడు వానిలోనైనను కాదు(9:16)

Romans 9:19

మనుష్యుల మీద నేరము మోపుచున్న కారణము గా దేవుడు నీతిమంతుడని ప్రశ్నించు వారికి పౌలు ఇస్త్తున్న సమాధానము ఏమిటి ?

"ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవేవడవు ?" అని జవాబిచ్చాడు. (9:20)

Romans 9:22

నాశనమునకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు ఏమి చేసాడు ?

నాశనమునకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు దీర్ఘ శాంతముతో సహించాడు. (9:22)

మహిమకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు ఏమి చేసాడు ?

దేవుడు వారికి తన మహిమైస్వర్యమును కనుపరచాడు. (9:23)

ఏ ప్రజలలో నుండి తాను కరుణించిన వారిని దేవుడు పిలిచాడు ?

దేవుడు యూదులలో నుండియూ, అన్య జనులలో నుండియూ తాను కరుణించిన వారిని పిలిచాడు. (9:24)

Romans 9:27

ఇశ్రాయేలీయులందరిలోనుండి ఎంత మంది రక్షించ బడుదురు ?

ఇశ్రాయేలీయులందరిలోనుండి శేషమే రక్షించ బడుదురు. (9:27)

Romans 9:30

నీతిని వెంటాడని అన్య జనులు దానిని ఏ విధము గా దానిని సాధించారు.

నీతిని వెంటాడని అన్య జనులు దానిని విశ్వాసము వలనైన నీతిని పొందారు. (9:30)

నీతి కారణమైన నియమమును వెంటాడినను ఇశ్రాయేలీయులు దానిని ఎందుకు పొందలేదు ?

నీతి కారణమైన నియమమును విశ్వాస మూలముగా కాకుండా క్రియల మూలముగా వెంటాడిన కారణము చేత ఇశ్రాయేలీయులు దానిని పొందలేదు. (9:31-32)

Romans 9:32

దేని విషయములో ఇశ్రాయేలీయులు తొట్రు పడ్డారు ?

ఇశ్రాయేలీయులు అడ్డురాయిని , తొట్రుపాటు బండను తగిలి పడిరి. (9:32-33)

తొట్రు పడకయు విశ్వసించు వారికి ఏమి జరుగుతుంది ?

తొట్రు పడకయు విశ్వసించు వారు సిగ్గుపడరు. (9:33)


Chapter 10

Translation Questions

Romans 10:1

తన సహోదరులు, ఇశ్రాయేలీయుల కొరకు పౌలు కున్న హృదయాభిలాష ఏమిటి ?

ఇశ్రాయేలీయుల కొరకు పౌలు కున్న హృదయాభిలాష వారి రక్షణ. (10:1)

ఇశ్రాయేలీయులు దేనిని స్థాపించాలని చూచుచున్నారు ?

ఇశ్రాయేలీయులు తమ స్వనీతిని స్థాపించాలని చూచుచున్నారు. (10:3)

ఇశ్రాయేలీయులు దేనిని ఎరుగరు ?

ఇశ్రాయేలీయులు దేవుని నీతిని ఎరుగరు (10:3)

Romans 10:4

ధర్మ శాస్త్రంవిషయమై క్రీస్తు ఏమై యున్నాడు ?

క్రీస్తు ధర్మశాస్త్రమునాకు సమాప్తియై యున్నాడు(10:4)

Romans 10:8

పౌలు ప్రకటించు చున్న విశ్వాస వాక్యము ఎక్కడ ఉన్నది ?

పౌలు ప్రకటించు చున్న విశ్వాస వాక్యము నోటను, హృదయములోను ఉన్నది. (10:8)

ఒక వ్యక్తి రక్షించ బడడానికి ఏమి చెయ్యాలని పౌలు చెపుతున్నాడు ?

ఒక వ్యక్తి యేసు ప్రభువును తన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనుండి ఆయనను లేపేనని హృదయములో విశ్వసించాలి. (10:9)

Romans 10:11

ఏమి చేసిన ప్రతివాడును రక్షించ బడతాడు ?

ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షించ బడును. (10:13)

Romans 10:14

ఒక వ్యక్తి ప్రభువు నామము బట్టి ప్రార్ధన చేయునట్లు ఆ వ్యక్తి కి సువార్త చేరగలిగిన వివిధ అంశముల గురింఛి పౌలు ఏమి చెప్పాడు ?

ఒక వ్యక్తి ప్రభువు నామము బట్టి ప్రార్ధన చేయునట్లు మొదట ప్రకటించు వారు పంపబడాలి, సువార్త వినిపించ బడాలి, విశ్వసించ బడాలి. (10:14-15)

Romans 10:16

విశ్వాసము కలుగునట్లు ఏమి వినిపించ బడాలి ?

విశ్వాసము కలుగునట్లు క్రీస్తును గురించిన మాట వినబడాలి. (10:17)

Romans 10:18

ఇశ్రాయేలీయులు సువార్తను విన్నారా, దానిని తెలుసుకున్నారా ?

అవును ఇశ్రాయేలీయులు సువార్తను విన్నారు, దానిని తెలుసుకున్నారు. (10:18-19)

Romans 10:19

ఇశ్రాయేలీయులకు రోషమును ఎలా కలుగ చేస్తానని దేవుడు చెప్పాడు ?

తనను వెదకని వారికి ఆయన దొరకడం ద్వారా ఇశ్రాయేలీయులకు రోషమును కలుగ చేస్తానని దేవుడు చెప్పాడు. (10:19-20)

Romans 10:20

దేవుడు ఇస్రాయేలీయులను సమీపించినపుడు ఆయన ఏమి కనుగొన్నాడు ?

దేవుడు ఇస్రాయేలీయులను సమీపించినపుడు ఆయన అవిధేయులై ఎదురాడు ప్రజలను కనుగొన్నాడు. (10:21)


Chapter 11

Translation Questions

Romans 11:1

దేవుడు తన ప్రజలను విసర్జించేనా ?

దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విసర్జించక పోవచ్చును. (11:1)

Romans 11:4

నమ్మకమైన ఇశ్రాయేలీయులు మిగిలియున్న యెడల వారు ఏ విధంగా భద్రపరచబడతారని పౌలు చెప్పాడా ?

అలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అని పౌలు చెపుతున్నాడు. (11:5)

Romans 11:6

ఇశ్రాయేలీయులలో ఎంత మంది రక్షణను పొందారు, మిగిలిన వారికి ఏమి జరిగింది ?

ఇశ్రాయేలీయులలో ఎంపిక చేయబడిన వారు రక్షణను పొందారు, మిగిలిన వారు కఠినచిత్తులైరి. (11:7)

దేవుడిచ్చిన నిద్ర మత్తు గల మనసు దానిని పొందిన వారికి ఏమి చేసింది ?

నిద్ర మత్తు గల మనసు దానిని పొందిన వారు చూడలేకుండను, వినలేకుండను చేసింది. (11:8,10)

Romans 11:11

ఇశ్రాయేలీయులు సువార్తను స్వీకరించడానికి నిరాకరించడము వలన ఏ మేలు జరిగింది ?

రక్షణ అన్య జనుల వద్దకు వచ్చింది. (11:11-12)

Romans 11:17

ఒలీవ చెట్టు యొక్క వేరు, ఆడని ఒలీవ కొమ్మ కు సంబంధించిన ఉపమానములో వేరు ఎవరు, అడవి ఒలీవ కొమ్మలు ఎవరు ?

వేరు ఇశ్రాయేలు, అడవి ఒలీవ కొమ్మలు అన్యజనులు. (11:3-14,17)

Romans 11:19

అడవి ఒలీవ కొమ్మలు ఎలాంటి వైఖరులను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు ?

అడవి ఒలీవ కొమ్మలు విరిచి వేయబడిన కొమ్మల మీద అతిశయ పడే వైఖరిని విడిచిపెట్టాలని పౌలు చెపుతున్నాడు. (11:18-20)

ఏ హెచ్చరిక ను పౌలు అడవి ఒలీవ కొమ్మలకు ఇచ్చాడు ?

దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచి పెట్టని యెడల అవిశ్వాసము లోనికి పడిన యెడల అడవి ఒలీవ కొమ్మలనూ విదడిచిపెట్టడని పౌలు హెచ్చరించుచున్నాడు. (11:20-22)

Romans 11:23

స్వాభావిక కొమ్మలు తమ అవిశ్వాసము లో నిలువక పోయిన యెడల దేవుడు ఏమి చేస్తాడు ?

స్వాభావిక కొమ్మలు తమ అవిశ్వాసము లో నిలువక పోయిన యెడల దేవుడు వాటిని ఒలీవ చెట్టుకు అంటు కడతాడు. (11:23-24)

Romans 11:25

ఇశ్రాయేలుకు ఉండే కఠిన మనసు ఎంత మట్టుకు ఉంటుంది ?

ఇశ్రాయేలుకు ఉండే కఠిన మనసు అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఉంటుంది. (11:25)

Romans 11:28

వారి అవిదేయతలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులు దేవుని చేత ఎందుకు ప్రేమించ బడుతూనే ఉన్నారు ?

వారి పితరులను బట్టి, దేవుడు తన పిలుపు విషయములో మార్పు లేనివాడు గనుక ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రేమించ బడుతూనే ఉన్నారు. (11:28-29)

Romans 11:30

యూదులు, అన్యజనులు దేవుని చేత ఏ విధముగా కనబడు తున్నారు ?

యూదులు, అన్యజనులు అవిదేయులుగా కనబడు తున్నారు. (11:30-32)

అవిధేయులైన వారికి దేవుడు ఏమి కనబరచు చున్నాడు ?

అవిదేయులైన యూదులు, అన్యజనులు ఇద్దరికీ దేవుడు తన కరుణ కనుపరచుచున్నాడు. (11:30-32)

Romans 11:33

ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు ?

ఎవరునూ ప్రభువు మనస్సును ఎరిగలేదు, ఆయనకు ఆలోచన చెప్పలేరు. (11:33-34)

Romans 11:35

దేవునికి సమస్తము సంబంధించినవని చెప్పే మూడు విధానాలు ఏవి ?

సమస్తమూ దేవుని నుండి, దేవుని ద్వారా ఆయన నిమిత్తమును కలిగినవి. (11:36)


Chapter 12

Translation Questions

Romans 12:1

విశ్వాసి దేవునికి చేసే ఆత్మీయ సేవ ఏమిటి ?

సజీవ యాగాముగా తనను తాను దేవునికి సమర్పించు కొనుటయే విశ్వాసి దేవునికి చేసే ఆత్మీయ సేవ. (12:1)

విశ్వాసి లో నూతన పరచబడిన మనసు అతనిని ఎలా బలపరుస్తుంది ?

ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్త మేదో తెలుసు కొనునట్లు విశ్వాసిని బల పరుస్తుంది. (12:2)

Romans 12:3

ఒక విశ్వాసి తనను గురించి తాను ఏ విధముగా తలంచ కూడదు ?

ఒక విశ్వాసి తనను తాను ఎంచుకొన తగిన దాని కంటే ఎక్కువగా ఎంచుకొన కూడదు. (12:3)

Romans 12:4

క్రీస్తు లో అనేకమైన విశ్వాసులు ఏ విధముగా సంబంధ పరచుకోవాలి ?

అనేకమైన విశ్వాసులు క్రీస్తు లో ఒక్క శరీరము, ఒకరికోకారము ప్రత్యేక అవయవాములై ఉన్నారు. (12:4-5)

Romans 12:6

దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన కృపావరంలతో ప్రతీ ఒక్క విశ్వాసి ఏమి చెయ్యవలెను ?

ప్రతీ విశ్వాసి తమ విశ్వాస ప్రమాణము చొప్పున వారికివ్వబడిన కృపావరంలను వినియోగించ వలెను. (12:6)

Romans 12:9

విశ్వాసులు ఒకరి నొకరు ఏ విధముగా చూచుకొనవలెను ?

విశ్వాసులు ఒకనియందోకరు అనురాగము కలిగి ఒకరినొకరు గౌరవించు కొనవలెను. (12:10)

Romans 12:11

పరిశుద్ధుల అవసరముల విషయమై విశ్వాసులు ఏవిధంగా స్పందించాలి ?

విశ్వాసులు పరిశుద్ధుల అవసరముల పాలు పొంపులు పొందాలి. (12:13)

Romans 12:14

విశ్వాసులు తమను హింసించు వారి పట్ల ఏవిధముగా ఉండాలి ?

హింసించు వారిని దీవించాలి, శపించ కూడదు. (12:14)

విశ్వాసులు బాధలలో ఉన్నవారి పట్ల ఏవిధముగా ఉండాలి ?

విశ్వాసులు బాధలలో ఉన్నవారిని అంగీకరించాలి. (12:16)

Romans 12:17

సాధ్యమైనంత వరకు విశ్వాసులు అందరితో ఎలా ఉండాలి ?

విశ్వాసులు సాధ్యమైనంత వరకు సమస్తమైన వారితో సమాధానముగా ఉండాలి. (12:18)

Romans 12:19

విశ్వాసులు వారికి వారే ఎందుకు పగతీర్చుకోకూడదు ?

పగ తీర్చుట దేవుని పని గనుక విశ్వాసులు పగతీర్చుకొ కూడదు. (12:19)

విశ్వాసులు కీదుని ఏవిధముగా జయించాలి ?

మేలు చేత కీదుని జయించాలి. (12:21)


Chapter 13

Translation Questions

Romans 13:1

భూసంబంధమైన అధికారులు తమ అధికారాన్ని ఎక్కనుందడి పొందారు ?

భూసంబంధమైన అధికారులు దేవుని చేత నియమించా బడ్డారు, దేవుని నుండి తమ అధికారాన్ని పొందారు. (13:1)

భూసంబంధ మైన అధికారులను ఎదిరించు వారు ఏమి పొందుతారు ?

భూసంబంధమైన అధికారమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. (13:2)

Romans 13:3

పరిపాలించు అధికారులకు భయపడకుండునట్లు ఉండాలంటే ఏమి చెయ్యాలని పౌలు చెపుతున్నాడు ?

పరిపాలించు అధికారులకు భయపడకుండునట్లు ఉండాలంటే మేలు చేయాలని పౌలు చెపుతున్నాడు. (13:3)

కీడును అణచివేయడానికి అధికారులకు దేవుడు ఏ అధికారమును వారికి ఇచ్చాడు ?

కీడును అణచివేయడానికి అధికారులు ఖడ్గము ధరించుటకు, కీడు చేయువారి మీద ఆగ్రహము చూపునట్లు కావలసిన అధికారమును వారికి ఇచ్చాడు. (13:4)

Romans 13:6

డబ్బును గురించి అధికారులకు దేవుడు ఏ అధికారమును వారికి ఇచ్చాడు ?

డబ్బును గురించి అధికారులకు దేవుడు పన్ను చెల్లింపు లను స్వీకరించే అధికారమును వారికి ఇచ్చాడు. (13:6)

Romans 13:8

ఏ ఒక్క విషయములో విశ్వాసులు ఒకరికొకరు అచ్చి యుండాలని పౌలు చెప్పాడు ?

ఒక్క ప్రేమ విషయములో విశ్వాసులు ఒకరికొకరు అచ్చి యుండాలని పౌలు చెప్పాడు(13:8)

విశ్వాసి ఏవిధముగా ధర్మ శాస్త్రమును నెరవేర్చు చున్నాడు ?

తన పొరుగు వానిని ప్రేమించుట ద్వారా విశ్వాసి ధర్మ శాస్త్రమును పాటించు చున్నాడు. (13:8,10)

ధర్మ శాస్త్రములో భాగముగా ఏ ఆజ్ఞలను పౌలు చెపుతున్నాడు ?

వ్యభిచరించ వద్దు, నరహత్య చేయ వద్దు, దొంగిల వద్దు, ఆసించ వద్దు అను ఆజ్ఞలను ధర్మశాస్త్రములో భాగముగా పౌలు చెపుతున్నాడు. (13:9)

Romans 13:11

విశ్వాసులు ఏ క్రియలను విసర్జించాలని, వేటిని ధరించుకోవాలని పౌలు చెపుతున్నాడు ?

చీకటి క్రియలను విసర్జించి, తేజోసంబంధ మైన యుద్దోపకరణములను ధరించు కోవాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు. (13:12)

Romans 13:13

ఏ కార్య కలాపాలలో విశ్వాసులు నడువకూడదు ?

అల్లరితో కూడిన ఆట పాటలు, మత్తు అయినను, కామ విలాసములైనాను, పోకిరి చేష్టలైనను, మత్సరము అసూయలలో నడువ కూడదని పౌలు చెప్పాడు. (13:13)

శరీర కోరికలలవిషయములో విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలని పౌలు చెపుతున్నాడు ?

శరీర కోరికల విషయములో విశ్వాసులు ఆలోచన చేసికొన వద్దని పౌలు చెపుతున్నాడు(13:14)


Chapter 14

Translation Questions

Romans 14:1

బలమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారమును తీసుకొంటాడు, బలహీనమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారము తీసుకొంటాడు ?

బలమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారమునైనను, బలహీనమైన విశ్వాసము కలవాడు కేవలము కూరగాయాలనే తీసుకొంటాడు. (14:2)

వారు తిను విషయములో ఒకరి విషయములో ఒకరు విభేధించుకొను విశ్వాసులు ఏ విధమైన వైఖరి కలిగి ఉండాలి ?

వారు తిను విషయములో ఒకరి విషయములో ఒకరు విభేధించుకొను విశ్వాసులు ఒకరికొకరు తీర్పు తీర్చు కొనకూడదు. (14:1,3)

Romans 14:3

ఏ ఆహారమునైనను తీసుకోన్వానిని, కేవలము కూరగాయాలనే తీసుకొనువానిని ఇద్దరినీ అంగీకరించిన వాడు ఎవరు ?

ఏ ఆహారమునైనను తీసుకొనువానిని, కేవలము కూరగాయాలనే తీసుకొనువానిని ఇద్దరినీ అంగీకరించినది దేవుడే. (14:3-4)

Romans 14:5

వ్యక్తిగత నమ్మకము గా ప్రస్తావించిన మరియొక అంశము ఏమిటి ?

వ్యక్తిగత నమ్మకము గా ప్రస్తావించిన మరియొక అంశము ఒక దినము మరియొక దినము కంటే విలువైనది లేక అన్ని దినములు సమానముగా ఎంచబడినవి. (14:5)

Romans 14:7

దేనికొరకు విశ్వాసులు జీవించాలి, చనిపోవాలి ?

ప్రభువు కొరకు విశ్వాసులు జీవించాలి, చనిపోవాలి. (14:7-8)

Romans 14:10

అంతిమముగా విశ్వాసులందరూ ఎక్కడ నిలుస్తారు, అక్కడ ఏమి చేస్తారు ?

అంతిమముగా విశ్వాసులందరూ దేవుని న్యాయ పీఠం ఎదుట నిలుస్తారు, అక్కడ వారి గురించి లెక్క ఒప్పగించవలెను. (14:10-12)

Romans 14:12

వ్యక్తిగత అభిప్రాయాల విషయములో ఒక సహోదరుడు మరొక సహోదరుని పట్ల ఎలాంటి వైఖరి కలిగిఉండాలి?

ఒక సహోదరుడు వ్యక్తిగత అభిప్రాయాల విషయములో మరొక సహోదరునికి ఎటువంటి అడ్డమైనను, ఆటంకమైనను కలుగచేయ కూడదు. (14:13)

Romans 14:14

ప్రభువైన యేసు నందు నిషిద్దములైన భోజన పదార్దములు అని వేటిని రూఢిగా నమ్ముతున్నాడు ?

ఏదీ నిషిద్దము కాదని పౌలు రూఢిగా నమ్ముతున్నాడు. (14:14)

Romans 14:16

దేవుని రాజ్యము ఏమై ఉంది ?

దేవుని రాజ్యము నీతియు, సమాధానమును పరిశుద్దాత్మ యందలి ఆనందమునై యున్నది. (14:17)

Romans 14:20

మాంసము తినుట, ద్రాక్షా రసము త్రాగుట చేయని సహోదరుని ఎదుట మరొక సహోదరుడు ఏమి చెయ్య వలెను ?

ఆ సహోదరుని ఎదుట మాంసము తినుట, ద్రాక్షారసము త్రాగుట చేయకుండుట మంచిదని పౌలు చెపుతున్నాడు. (14:21)

Romans 14:22

ఒక వ్యక్తి విశ్వాసము లేకుండా తినిన యెడల కలిగే ఫలితమేమిటి ?

విశ్వాస మూలము కానిది ఏదో అదిపాపం. (14:23)


Chapter 15

Translation Questions

Romans 15:1

బలమైన విశ్వాసము గలవారు బలహీనమైన విశ్వాసము గలవారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి ?

బలమైన విశ్వాసము గలవారు బలహీనమైన విశ్వాసము గలవారి క్షేమాభివృద్ది కలగునట్లు వారి దౌర్బల్యములను భరించ వలెను. (15:1-2)

Romans 15:3

పూర్వ మందు రాసి ఉన్న లేఖనముల ఉద్దేశాలలో ఒక ఉద్దేశమేమిటి ?

పూర్వ మందు రాసి ఉన్న లేఖనములు మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడియున్నాయి. (15:4)

Romans 15:5

విశ్వాసులు ఓర్పు కలిగిఉండడము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము విషయములో వారికోరకైన పౌలు కోరిక ఏమిటి ?

విశ్వాసులు ఒకనితో ఒకరు మనస్సు కలిగి యుండాలని పౌలు కోరుతున్నాడు. (15:5)

Romans 15:8

తనను తాను సంతోష పరచక ఇతరులకు సేవ చేసిన ఏ వ్యక్తి యొక్క మాదిరిని పౌలు ఉపయోగించాడు ?

క్రీస్తు తనను తాను సంతోష పరచక ఇతరులకు సేవ చేసాదు. (15:,38-9)

Romans 15:10

తమ పట్ల దేవుని కరుణను బట్టి అన్య జనులు ఏమి చేస్తారని లేఖనాలు చెపుతున్నాయి ?

తమ పట్ల దేవుని కరుణను బట్టి అన్య జనులు సంతోషిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని యందు నిరీక్షణ ఉంచు తారు అని లేఖనాలు చెపుతున్నాయి. (15:10-12)

Romans 15:13

పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసులు ఏమి చేయ గలుగు తారు అని పౌలు చెప్పాడు ?

పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసులు సంతోషము, సమదానముతో నింపబడతారు, విస్తారమయిన నిరీక్షణ గలవారగుడురు. (15:13)

Romans 15:15

దేవుడు పౌలుకు తన పరిచర్యగా అనుగ్రహించిన కృప ఏది ?

క్రీస్తు యేసు దాసునిగా అన్యజనుల వద్దకు పంపబడుటయే పౌలు పరిచర్య. (15:16)

Romans 15:17

అన్య జనులు విదేయులగునట్లు పౌలు ద్వారా క్రీస్తు జరిగించిన పద్దతులేవి ?

వాక్యము చేతను, క్రియల చేతను, గురుతులు మహాత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు పౌలు ద్వారా తన కార్యములను జరిగించాడు. (15:18-19)

Romans 15:20

పౌలు ఎక్కడ సువార్తను ప్రకటించాలని కోరాడు ?

క్రీస్తు నామము ఎరుగని ప్రదేశాలలో సువార్తను ప్రకటించాలని కోరాడు. (15:20-21)

Romans 15:24

రోము దేశమునకు వెళ్ళగలుగునట్లు ఏ ప్రాంతానికి వెళ్లాలని పౌలు తలస్తున్నాడు ?

పౌలు స్పెయిను దేశానికి వెళ్లాలని తలస్తున్నాడు, అక్కడ నుండి రోము వెళ్ళగలుగుటకు ఎదురు చూస్తున్నాడు. (15:24-28)

Romans 15:26

పౌలు ఇప్పుడు ఎందుకు యెరూషలేము వెళ్ళుతున్నాడు ?

పౌలు అన్యజనులైన విశ్వాసుల నుండి పోగుచేయ్య బడిన కానుకలను యెరూషలేములోని పరిశుద్దులలో బీదలైన వారికి అందివ్వడానికి వెళ్ళుతున్నాడు. (15:25-26)

అన్యజనులైన విశ్వాసులు శరీర సంబంధమైన విషయములలో యూదయ విశ్వాసులకు ఋణస్తులై ఉన్నారని ఎందుకు పౌలు చెప్పాడు ?

అన్యజనులైన విశ్వాసులు యూదులైన విశ్వాసుల ఆత్మ సంబంధమైన విషయములలో పాలుపొందారు గనుక అన్యజనులైన విశ్వాసులు శరీర సంబంధమైన విషయములలో యూదయ విశ్వాసులకు ఋణస్తులై ఉన్నారని చెప్పాడు. (15:27)

Romans 15:30

ఎవరి చేతులలో నుండి పౌలు తప్పించబడాలని పౌలు కోరుతున్నాడు ?

యూదయలో ఉన్నా అవిదేయుల చేతులలో నుండి పౌలు తప్పించబడాలని పౌలు కోరుతున్నాడు. (15:31)


Chapter 16

Translation Questions

Romans 16:1

సోదరి ఫీబే పౌలుకు ఏమై ఉన్నది ?

సోదరి ఫీబే పౌలుకు సహాయకురాలై ఉంది, అనేకులకును సహాయకురాలై ఉన్నది. (16:1-2)

Romans 16:3

గతములో ఆకుల ప్రిస్చ్కిల్ల పౌలుకు ఏమి చేసారు ?

గతములో ఆకుల ప్రిస్చ్కిల్ల పౌలు ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇవ్వడానికి తెగించారు. (16:4)

రోమా లో విశ్వాసులు కలుసుకొను ఒక స్థలమేది ?

రోమా లో ఆకుల ప్రిస్సిల్ల గృహములో విశ్వాసులు కలుసుకొనుచున్నారు. (16:5)

Romans 16:6

గతములో అన్ద్రోనీకు, యూనియలు పౌలు తో కలిగిఉన్న అనుభవము ఏమిటి ?

గతములో అన్ద్రోనీకు, యూనియలు పౌలు తో సహా ఖైదీలుగా ఉన్నారు. (16:7)

Romans 16:15

విశ్వాసులు ఒకరికొకరు ఏవిధముగా వందనాలు చెప్పుకోవాలి ?

పవితమైన ముద్దు పెట్టుకొని విశ్వాసులు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. (16:16)

Romans 16:17

భేదములు, ఆటంకములు కలిగే విధముగా కొందరు ఏమి చేయుచున్నారు ?

వారు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వెళ్తున్నారు, నిష్కపటుల హుర్దయాలను మోసపుచ్చుతున్నారు. (1:3)

భేదములు, ఆటంకములు కలిగించు వారి విషయములో ఏమి చెయ్యాలని విశ్వాసులకు పౌలు చెపుతున్నాడు ?

భేదములు, ఆటంకములు కలిగించు వారి నుండి తొలగి పోవుడని విశ్వాసులకు పౌలు చెపుతున్నాడు(1:3)

Romans 16:19

మేలు కీడుల విషయములో ఎలాంటి వైఖరి కలిగి యుండాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు ?

మేలు విషయము లో జ్ఞానులును, కీడు విషయము నిష్కపటులునై యుండాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు(16:19)

సమాధాన కర్త యగు దేవుడు ఏమి చెయ్య బోతున్నాడు ?

సమాధాన కర్త యగు దేవుడు సతానును విశ్వాసుల కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును. (16:20)

Romans 16:21

వాస్తవానికి ఈ పత్రిక ఎవరు రాసారు ?

వాస్తవానికి ఈ పత్రిక తెర్తియు రాసాడు. (16:22)

Romans 16:23

విశ్వాసియైన ఎరస్తు ఏ ఉద్యోగమును చేస్తున్నాడు ?

విశ్వాసియైన ఎరస్తు పట్టణపు ఖజానాదారుడిగా పని చేయుచున్నాడు. (16:23)

Romans 16:25

అనాదినుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు పౌలు చేత భోధింపబడుతున్న మర్మము ఏమిటి ?

అనాదినుండి రహస్యముగా ఉంచ బడి ఇప్పుడు పౌలు చేత భోధింపబడుతున్న మర్మము యేసు క్రీస్తు సువార్తయే. (16:25-26)

ఏ ఉద్దేశం కొరకు పౌలుబోధిస్తున్నాడు ?

సమస్త మైన అన్య జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు పౌలు బోధిస్తున్నాడు. (16:26)


Chapter 1

Translation Questions

1 Corinthians 1:1

పౌలుని ఎవరు పిలిచారు, దేనికొరకు పిలిచారు?

పౌలుని అపోస్తలుడిగా ఉండుటకు యేసుక్రీస్తు పిలిచాడు[1:1].

మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తునుండి కొరింథులోని సంఘం కొరకు పౌలు ఏమికోరుకున్నాడు?

మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తునుండి కృపా సమాధానాలు కోరుకున్నాడు[1:3].

1 Corinthians 1:4

కొరింతులోని సంఘాన్ని దేవుడు ఏవిధంగా ఐశ్వర్యవంతులుగా చేసాడు?

ప్రతి విషయంలో - మాట్లాడే సామర్ధ్యంలోనూ జ్ఞానంలోను అన్నివిధాలుగా కొరింథులోని సంఘాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేసాడు[1:5].

1 Corinthians 1:7

ఏ విషయంలో కొరింథు సంఘం కొదువగా లేదు?

వారు ఏ ఆత్మ వరం విషయంలోను కొదువగా లేరు[1:7].

కొరింథులోని సంఘాన్ని దేవుడు అంతం వరకు ఎందుకు స్థిరపరుస్తాడు?

మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే రోజున వారు నిరపరాధులుగా ఉండేందుకు ఆయన దీనిని చేస్తాడు[1:8].

1 Corinthians 1:10

కొరింతులోని సంఘాన్ని ఏమి చేయాలని వారిని పౌలు కోరుతున్నాడు?

వారంతా ఒకే మాటమీద ఉండాలని, వారి మధ్యలో విభేదాలు లేకుండా చూసుకోవాలని, యేకమనస్సు, యేక తాత్పర్యంతో కలిసి ఉండాలని పౌలు కోరుతున్నాడు[1:10].

క్లోయే ఇంటివారు పౌలుకు ఏమని చెప్పారు?

కొరింథులోని సంఘంలో ప్రజల మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటివారు పౌలుకు చెప్పారు[1:11].

1 Corinthians 1:12

జగడాలు గురించి పౌలు ఏమిచెప్పాడు?

పౌలు ఈ విధంగా చెప్పాడు: మీలో ప్రతి ఒక్కడు "నేను పౌలు వాడను," "నేను అపొల్లో వాడను," "నేను కేఫా వాడను," "నేను క్రీస్తు వాడను" అంటున్నారు[1:12].

1 Corinthians 1:14

క్రిస్పునకు, గాయియుకు తప్ప మరి ఎవరికిని తాను బాప్తిస్మం ఇవ్వలేదని పౌలు ఎందుకు దేవునికి వందనాలు చెపుతున్నాడు?

వారు పౌలు నామమున బాప్తిస్మం పొందితిరని ఎవరును చెప్పకుండునట్లు ఈ విషయంలో పౌలు దేవునికి వందనాలు చెపుతున్నాడు[1:14-15].

1 Corinthians 1:17

ఏమి చేయాలని పౌలును క్రీస్తు పంపించాడు?

సువార్త ప్రకటించాలని పౌలును క్రీస్తు పంపించాడు[1:17].

1 Corinthians 1:18

నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త ఏమైయుంది?

నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది[1:18].

రక్షణ పొందుచున్నవారికి సిలువను గూర్చిన వార్త ఏమైయుంది?

రక్షణ పొందుచున్నవారికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తియై ఉంది[1:18].

1 Corinthians 1:20

ఈలోక జ్ఞానంను దేవుడు దేనిగా మార్చాడు?

ఈలోక జ్ఞానంను దేవుడు వెర్రితనంగా మార్చాడు[1:20].

సువార్త ప్రకటనయను వెర్రితనంచేత నమ్మువారిని రక్షించుట దేవునికి ఎందుకు ఇష్టమయ్యింది?

లోకం తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవునికి ఇష్టమయ్యింది[1:21].

1 Corinthians 1:26

లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పవంశంవారిని ఎంతమందిని దేవుడు ఎంపిక చేసాడు?

అటువంటి వారిలో అనేకులను దేవుడు పిలువలేదు[1:26].

లోకములోనుండి వెర్రివారిని, బలహీనులైనవారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకొనియున్నాడు?

జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు దేవుడు దీనిని చేసాడు[1:27].

1 Corinthians 1:28

ఎవరూ దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు దేవుడు చేసినదేంటి?

దేవుడు నీచులైన వారిని, లోకములో తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు[1:28-29].

1 Corinthians 1:30

విశ్వాసులు క్రీస్తుయేసు నందు ఎందుకు ఉన్నారు?

దేవుడు చేసినదాని మూలముగా వారు క్రీస్తుయేసు నందు ఉన్నారు[1:30].

క్రీస్తుయేసు మనకు ఏమిచేసాడు?

ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం అయ్యాడు[1:30].

మనం అతిశయించునట్లయితే ఎవరియందు అతిశయించాలి?

అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి[1:31].


Chapter 2

Translation Questions

1 Corinthians 2:1

దేవుని రహస్య సత్యం ప్రకటిస్తూ ఏవిధంగా పౌలు కొరింతు వారిదగ్గరకు వచ్చాడు?

దేవుని రహస్య సత్యం ప్రకటించినపుడు పౌలు మాటకారితనంగాని, గొప్పజ్ఞానంగాని వినియోగించుకోలేదు[2:1].

కొరింతు వారిమధ్య ఉన్నప్పుడు ఏమితెలుసుకొని ఉండాలని పౌలు నిశ్చయించుకొన్నాడు?

సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు తప్ప ఇంకేమియూ ఎరుగకుండా ఉండాలని పౌలు నిశ్చయించుకొన్నాడు[2:2].

1 Corinthians 2:3

పౌలు సందేశం, శుభవార్త ప్రకటన జ్ఞానయుక్తమైన మాటలు కాకుండా పరిశుద్ధాత్మ బలప్రభావాలతో ఎందుకు ఉన్నాయి?

వారి విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాకుండా దేవుని బలప్రభావాలే కావాలని పౌలు ఇలా చేసాడు[2:4-5].

1 Corinthians 2:6

పౌలును, తనతో ఉన్నవారును ఏ జ్ఞానాన్ని ఉపదేశించారు?

వారు ఉపదేశించింది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనత కోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం[2:7].

1 Corinthians 2:8

పౌలు కాలంలోని అధికారులకు దేవుని జ్ఞానం తెలిసి ఉంటే వారు ఏమి చేసియుండే వారు కాదు?

పౌలు కాలంలోని అధికారులకు దేవుని జ్ఞానం తెలిసి ఉంటే వారు ప్రభువును సిలువ వేసేవారు కాదు[2:8].

1 Corinthians 2:10

పౌలును, అతనితో ఉన్నవారును దేవుని జ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నారు?

దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచాడు[2:10].

దేవుని సంబంధమైన లోతైన ఆలోచనలు ఎవరికీ తెలుసు?

దేవుని సంబంధమైన లోతైన ఆలోచనలు కేవలం దేవుని ఆత్మకే తెలుసు[2:11].

1 Corinthians 2:12

పౌలును, అతనితో ఉన్నవారును ఎందుకు దేవుని యొద్దనుండి ఆత్మను పొందియున్నారు?

దేవుడు మనకు ఉచితముగా దయచేసినవాటిని తెలిసికొనుటకై వారు దేవుని యొద్ద నుండి ఆత్మను పొందియున్నారు[2:12].

1 Corinthians 2:14

దేవుని ఆత్మకు చెందిన విషయములను ఆత్మీయంగా లేని వ్యక్తి ఎందుకు అర్ధం చేసుకోలేడు?

దేవుని ఆత్మకు చెందిన విషయాలు ఆత్మీయంగా లేని వ్యక్తికి వెర్రితనంగా అనిపిస్తాయి, అవి ఆధ్యాత్మికంగా మాత్రమే తెలుస్తాయి[2:14].

యేసును విశ్వసించిన వారికి ఎవరి మనసు ఉంటుందని పౌలు చెప్పాడు?

యేసును విశ్వసించిన వారికి యేసు మనసు ఉంటుందని పౌలు చెప్పాడు[2:16].


Chapter 3

Translation Questions

1 Corinthians 3:1

ఎందుకు పౌలు కొరింతు విశ్వాసులతో ఆధ్యాత్మిక వ్యక్తులుగా మాట్లాడలేక పోయాడు?

వారు ఇంకా శరీరసంబంధంగా, వారి మధ్య అసూయ, కలహాలతో ఉనారు కనుక పౌలు వారితో ఆధ్యాత్మిక వ్యక్తులుగా మాట్లాడలేకపోయాడు[3:1,3].

1 Corinthians 3:3

పౌలు ఎవరు, అపొల్లో ఎవరు?

వారు పరిచారకులు, దేవుని జత పనివారు. వారి ద్వారా కొరింతువారు క్రీస్తును విశ్వసించారు[3:5,9].

1 Corinthians 3:6

వృద్ధి కలుగ జేయువాడు ఎవరు?

వృద్ధి కలుగ జేయువాడు దేవుడే[3:7].

1 Corinthians 3:10

పునాది ఎవరు?

యేసు క్రీస్తే పునాది[3:11].

1 Corinthians 3:12

యేసుక్రీస్తు అను పునాది మీద కట్టువాని పనికి ఏమి జరుగుతుంది?

అతని పని వెలుగులోను, అగ్నిలోను కనబడుతుంది[3:12-13].

ఆ వ్యక్తి యొక్క పనిని అగ్ని ఏమి చేస్తుంది?

వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును[3:13].

1 Corinthians 3:14

ఒకని పని అగ్ని పరీక్షకు నిలిచిన యెడల వానికేం జరుగుతుంది?

ఆ వ్యక్తి జీతం పుచ్చుకుంటాడు[3:14].

ఒకని పని అగ్ని పరీక్షకు నిలువని యెడల వానికేం జరుగుతుంది? ?

అతనికి నష్టం కలుగుతుంది, అయితే తన మట్టుకు తనకు రక్షణ ఉంటుంది గాని అది మంటల్లోనుంచి తప్పించుకొన్నట్టే ఉంటుంది[3:15].

1 Corinthians 3:16

యేసుక్రీస్తునందు విశ్వాసులంగా మనమెవరం, మనలో ఎవరు నివసిస్తున్నారు?

మనము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు[3:16].

దేవుని ఆలయాన్ని పాడుచేసిన వానికి ఏమి జరుగుతుంది?

దేవుని ఆలయాన్ని పాడుచేసిన వానిని దేవుడు పాడు చేయును[3:17].

1 Corinthians 3:18

ఈ లోకమందు ఎవడైనను జ్ఞానినని అనుకునే వానికి పౌలు ఏమి చెపుతున్నాడు?

"వాడు జ్ఞాని అగునట్లు "వెర్రివాడు" కావాలి అని పౌలు చెపుతున్నాడు[3:18].

జ్ఞానుల యోచనల గురించి ప్రభువుకు ఏమి తెలుసు?

జ్ఞానుల యోచనలు వ్యర్ధములని ప్రభువుకు తెలుసు[3:20].

1 Corinthians 3:21

మనుష్యులయందు అతిశపడకూడదని కొరింతు విశ్వాసులకు పౌలు ఎందుకు చెపుతున్నాడు?

అతిశయపడవద్దని పౌలు వారికి చెప్పాడు, "సమస్తమును మీవి," అందుచేత, "...మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు"[3:21-23].


Chapter 4

Translation Questions

1 Corinthians 4:1

కొరింతు వారు పౌలును, అతని జతపనివారిని ఎలా గౌరవించాలని పౌలు చెప్పాడు?

వారు క్రీస్తు సేవకులని, దేవుని రహస్య సత్యాల విషయం నిర్వాహకులువలె కొరింతు వారు పౌలును, అతని జతపని వారిని గౌరవించాలని పౌలు చెప్పాడు[4:1].

నిర్వాహకునికి ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి?

నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి[4:2].

1 Corinthians 4:3

తనకు తీర్పు తీర్చు వాడు ఎవరు అని పౌలు చెపుతున్నాడు?

తనకు తీర్పు తీర్చు వాడు దేవుడే అని పౌలు చెపుతున్నాడు[4:4].

1 Corinthians 4:5

ప్రభువు వచ్చినపుడు ఏమిచేస్తాడు?

చీకటిలో దాగిఉన్నవాటిని ఆయన వెలుగులోనికి తెస్తాడు, హృదయాలలోని ఆలోచనలను బట్టబయలు చేస్తాడు[4:5].

1 Corinthians 4:6

ఈ సూత్రాలను తనకు, అపోల్లోకు పౌలు ఎందుకు అన్వయించాడు?

"లేఖనములయందు రాసియున్న సంగతులను అతిక్రమించకూడదు" అను మాటకు అర్ధాన్ని కొరింతు విశ్వాసులు నేర్చుకొని వారు ఒకని పక్షమున మరియొకరు ఉప్పొంగ కూడదని వారికొరకు దీనిని చేసాడు[4:6].

1 Corinthians 4:8

కొరింతు విశ్వాసులు రాజులు కావాలని పౌలు ఎందుకు కోరాడు?

పౌలును, అతని సహచరులును కొరింతు విశ్వాసులతో కలసి రాజులగునట్లు కొరింతు విశ్వాసులు రాజులు కావాలని పౌలు కోరాడు[4:8].

1 Corinthians 4:10

ఏవిషయాలలో పౌలును, అతని సహచారులును కొరింతు విశ్వాసులకు భిన్నంగా ఉన్నారని పౌలు చెప్పాడు?

"మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులం" అని పౌలు చెప్పాడు[4:10].

అపోస్తలుల భౌతిక పరిస్థితిని పౌలు ఏవిధంగా వివరించాడు?

వారు ఆకలి, దప్పిక గలవారు, దిగంబరులు, పిడిగుద్దులు తినుచున్నవారు, నిలువరమైన నివాసం లేనివారు అని పౌలు చెప్పాడు[4:11].

1 Corinthians 4:12

పౌలును, అతని సహచరులును అవమానించినపుడు ఎలా స్పందించారు?

వారు నిందల పాలయినప్పుడు దీవించారు, వారు హింసలకు గురైతే ఓర్చుకున్నారు, అపనిందలు వచ్చినపుడు దయతో మాట్లాడారు(4:12).

1 Corinthians 4:14

పౌలు ఎందుకు ఈ సంగతులను కొరింతు విశ్వాసులకు రాస్తున్నాడు?

తన ప్రియమైన పిల్లలవలె సరిచెయ్యడానికి పౌలు రాశాడు[4:14].

కొరింతు విశ్వాసులు ఎవరిని అనుకరించాలని పౌలు చెప్పాడు?

కొరింతు విశ్వాసులు తనను అనుకరించాలని పౌలు చెప్పాడు[4:16].

1 Corinthians 4:17

ఏవిషయాన్నికొరింతు విశ్వాసులకు గుర్తుచేయ్యాలని పౌలు తిమోతిను పంపాడు?

క్రీస్తునందు పౌలు నడుచుకొను విధమును కొరింతు విశ్వాసులకు గుర్తుచెయ్యాలని పౌలు తిమోతిని పంపాడు[4:17].

కొందరు కొరింతు విశ్వాసులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారు?

పౌలు వారివద్దకు రాడని కొందరు విర్రవీగుచున్నారు[4:18].

1 Corinthians 4:19

దేవుని రాజ్యం దేనితో కూడుకొన్నది?

దేవుని రాజ్యం శక్తితో కూడుకొన్నది[4:20].


Chapter 5

Translation Questions

1 Corinthians 5:1

కొరింతు సంఘం గురించి ఎలాంటి వార్తను పౌలు విన్నాడు?

వారిలో వ్యభిచారం ఉన్నట్లు పౌలు విన్నాడు. వారిలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడు[5:1].

తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడికి ఏమి జరగాలని పౌలు చెప్పాడు?

తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడిని వారి మధ్యనుండి తొలగించాలని పౌలు చెప్పాడు[5:2].

1 Corinthians 5:3

తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడిని వారిమధ్యనుండి ఎలా, ఎందుకు తొలగించాలని పౌలు చెప్పాడు ?

కొరింతులోని సంఘం ప్రభువైన యేసు నామంలో కూడుకొనినపుడు పాపం చేసిన వ్యక్తి శరీరం నాశనమయ్యేలా అతనిని సాతానుకు అప్పగించాలి, ప్రభువైన యేసు వచ్చే రోజున అతనికి విముక్తి కలుగుతుంది[5:4-5].

1 Corinthians 5:6

దుర్మార్గాతను, దుష్టత్వమును దేనితో పౌలు పోలుస్తున్నాడు?

పౌలు వాటిని పొంగజేసే పదార్ధంతో పోలుస్తున్నాడు[5:8].

నిజాయితి, సత్యం కొరకు పౌలు ఏ రూపకాన్ని వాడుతున్నాడు?

నిజాయితి, సత్యం కొరకు పౌలు పొంగని రొట్టెను ఒక రూపకంగా వాడుతున్నాడు[5:8].

1 Corinthians 5:9

కొరింతు విశ్వాసులను ఎవరితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెపుతున్నాడు?

కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు రాస్తున్నాడు[5:9].

కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు ఉద్దేశిస్తున్నాడా?

కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు ఉద్దేశం కాదు, అలాగైతే మీరు లోకములోనుండి వెళ్ళిపోవలసి వస్తుంది[5:10].

కొరింతు విశ్వాసులను ఎవరితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెపుతున్నాడు?

క్రీస్తులో సోదరుడు, సోదరి అనిపించుకొంటున్న వారెవరైనా వ్యభిచారి, దురాశా పరుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, వంచకుడు, విగ్రహపూజ చేయువారితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెప్పాడు[5:10-11].

1 Corinthians 5:11

విశ్వాసులు ఎవరికి తీర్పుతీర్చాలి?

సంఘంలోపలి వారికి వారు తీర్పు తీర్చాలి[5:12].

సంఘం వెలుపల ఉన్నవారికి ఎవరు తీర్పు తీరుస్తారు?

సంఘం వెలుపల ఉన్నవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[5:13].


Chapter 6

Translation Questions

1 Corinthians 6:1

పరిశుద్ధులు ఎవరికీ తీర్పు తీరుస్తారు?

పరిశుద్ధులు లోకమునకు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు[6:2-3].

కొరింతులోని విశ్వాసులు దేనికి తీర్పు తీర్చగలరని పౌలు చెప్పాడు?

కొరింతులోని విశ్వాసులు పరిశుద్ధుల మధ్య ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను గూర్చి తీర్పు తీర్చగలరని పౌలు చెప్పాడు[6:1-3].

1 Corinthians 6:4

కొరింతులోని క్రైస్తవులు ఒకరితో ఒకరు వారి వ్యాజ్యములను ఏ విధంగా తీరుస్తారు?

ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద వ్యాజ్యమాడుతున్నాడు, అవిశ్వాసుల యెదుటనే వారు వ్యాజ్యమాడుతున్నారు[6:6].

1 Corinthians 6:7

కొరింతు క్రైస్తవుల మధ్య వ్యాజ్యాలు ఉన్నాయన్న వాస్తవం దేనిని చూపుతుంది?

వారి విషయం ఇది ఒక అపజయం అని చూపుతుంది[6:7]

1 Corinthians 6:9

దేవుని రాజ్యంను ఎవరు స్వతంత్రించుకొలేరు?

అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పురుషసంయోగులు, ఆడంగి వారు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొనువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొలేరు[6:9-10].

మునుపు అనీతిని అభ్యాసంచేసిన కొరింతు విశ్వాసులకు ఏమిజరిగింది?

వారు ప్రభువైన యేసుక్రీస్తు పేర దేవుని ఆత్మ వలన శుద్ధి అయ్యారు[6:11].

1 Corinthians 6:12

పౌలు తాను వశపరచుకొననివ్వని రెండు విషయాలు ఏమిటి?

భోజనం, జారత్వం పౌలు తనను వశపరచుకోనివ్వడు[6:12-13].

1 Corinthians 6:14

విశ్వాసుల శరీరాలు దేనిలో అవయవములై ఉన్నాయి?

వారి శరీరాలు క్రీస్తు అవయవములై యున్నాయి[6:15].

విశ్వాసులు తమనితాము వేశ్యలతో కలుపుకుంటారా?

లేదు, అదెంత మాత్రం తగదు[6:15].

1 Corinthians 6:16

ఒకడు వేశ్యతో కలిసినపుడు ఏమిజరుగుతుంది?

అతడు ఆమెతో ఏకశరీరం అవుతాడు[6:16].

ఒకడు ప్రభువుతో కలిసినపుడు ఏమి జరుగుతుంది?

అతడు ఆయనతో ఏకాత్మగా ఉన్నాడు[6:17].

1 Corinthians 6:18

జారత్వం చేయువాడు ఎవనికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు?

జారత్వం చేయువాడు తన స్వంత శరీరమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు[6:18].

1 Corinthians 6:19

ఎందుకు విశ్వాసులు తమ శరీరములతో దేవుని మహిమ పరచాలి?

వారి శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయమ. వారు విలువ పెట్టి కొనబడినవారు కనుక వారు తమ శరీరాలతో దేవుని మహిమ పరచాలి[6:19-20].


Chapter 7

Translation Questions

1 Corinthians 7:1

ఎందుకు ప్రతీ పురుషునికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి?

అనేక అనైతిక క్రియలకు సంబంధించిన శోధనల కారణంగా ప్రతి పురుషునికీ తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి[7:2].

1 Corinthians 7:3

భార్య గాని భర్త గాని తమ శరీరాలమీద వారికి అధికారం ఉందా?

లేదు. భర్తకు తన భార్య శరీరంమీద అధికారం ఉంది అలాగే భార్యకు తన భర్త శరీరంమీద అధికారం ఉంది[7:4].

1 Corinthians 7:5

ఒక భర్తగాని, ఒక భార్య గాని లైంగికంగా ఒకరికొకరు దూరంగా ఉండడం ఎప్పుడు సరియైనది?

ప్రార్ధన కోసం సావకాశం కలిగించుకోవడం కోసం కొంతకాలం సమ్మతించి ఒకరికొకరు దూరంగా ఉండడం సరియైనది [7:5].

1 Corinthians 7:8

పెండ్లికాని వారు, విధవరాండ్రకు ఏది మంచిదని పౌలు చెపుతున్నాడు?

వారు పెళ్ళి చేసికొకుండుట వారికి మంచిదని పౌలు చెపుతున్నాడు[7:8].

ఎటువంటి పరిస్థితులలో పెండ్లికాని వారు, విధవరాండ్రు వివాహం చేసుకోవాలి?

ఆశలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే వారు పెళ్ళి చేసుకోవడం మంచిది[7:9].

1 Corinthians 7:10

పెళ్ళైన వారికి ప్రభువు ఇచ్చే ఆజ్ఞ ఏది?

భార్య భర్తకు వేరైపోకూడదు, ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి, లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు [7:10-11].

1 Corinthians 7:12

నమ్మిన భర్త గాని, భార్యగాని వారి నమ్మని భర్తనుగాని, భార్యనుగాని విడిచిపెట్టవచ్చునా?

నమ్మని భర్త లేక భార్య వారి భార్యతో గాని లేక భర్తతో కాపురముండడం ఇష్టమైతే నమ్మినవారు విడిచిపెట్టకూడదు[7:12-13].

1 Corinthians 7:15

ఒకవేళ నమ్మని భాగస్వామి విడిచిపెట్టినపుడు విశ్వాసి ఏమిచెయ్యాలి?

ఒకవేళ నమ్మని భాగస్వామి విడిచి పెట్టినపుడు విశ్వాసి అతనిని వెళ్ళిపోనివ్వాలి[7:15].

1 Corinthians 7:17

సంఘములన్నిటికి పౌలు ఉంచిన నియమం ఏది?

ప్రతి ఒక్కరూ తనకు ప్రభువు నియమించిన ప్రకారం, దేవుడు పిలిచిన పరిస్థితిలో సాగిపోవాలి[7:17].

సున్నతి గలవారికి, సున్నతి లేనివారికి పౌలు ఏ సూచన ఇస్తున్నాడు?

సున్నతిలేనివాడు సున్నతి పొందకూడదు, సున్నతిగలవాడు సున్నతి గురుతు మాపుకోడానికి పూనుకోకూడదు[7:18].

1 Corinthians 7:20

బానిసల గురించి పౌలు ఏమి చెప్పాడు?

దేవుడు పిలిచినప్పుడు వాడు బానిసగా ఉన్నయెడల దాని గురించి బెంగ పెట్టుకోవద్దు, గాని ఒకవేళ స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం వస్తే దానిని వినియోగం చేసుకోవాలి, బానిసగా ఉన్నప్పుడు ప్రభువులోకి పిలుపు పొందిన వ్యక్తి ప్రభువు చేత విడుదల అయిన వ్యక్తే. వారు మనుషులకు బానిసలు కాకూడదు అని పౌలు చెప్పాడు[7:21-23].

1 Corinthians 7:25

పెళ్ళి కాని వారు పెళ్ళిలేకుండా పౌలులా ఉండిపోవాలని పౌలు ఎందుకు ఆలోచిస్తున్నాడు?

ఇప్పటి కష్టదశ కారణంగా మనిషి తానున్న పరిస్థితిలోనే ఉండడం మంచిదని పౌలు తలంపు[7:26].

1 Corinthians 7:27

విశ్వాసులు పెళ్ళిద్వారా ఒక స్త్రీకి కట్టుబడి ఉంటే వారు ఏమిచెయ్యాలి?

ఆ పెళ్ళి నిబంధననుండి విడుదల కోసం ప్రయత్నించకూడదు[7:27]

విశ్వాసులు ఒకవేళ భార్య లేకుండా ఉన్నట్లయితే భార్య కొరకు వెదకవద్దని పౌలు ఎందుకు చెప్పాడు?

పెళ్ళిచేసుకున్నవారు జీవితంలో వారికి కలిగే శరీరసంబంధమైన బాధలనుండి తప్పించడం కోసం పౌలు చెప్పాడు[7:28].

1 Corinthians 7:29

లోకంలో ఉన్నవాటిని వినియోగించేవారు వాటిని పూర్తిగా వినియోగించనట్టు ఎందుకు ఉండాలి?

ఈ లోక విధానం గతించిపోతున్నది గనుక వారు ఆ విధానంలో ఉండాలి[7:31].

1 Corinthians 7:32

పెళ్ళి అయిన క్రైస్తవులు ప్రభువుపట్ల పూర్తి శ్రద్ధ కనపరచడం ఎందుకు కష్టం?

భర్త గాని, భార్య గాని ఈ లోకసంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తారు గనుక ప్రభువుపట్ల పూర్తి శ్రద్ధ కనపరచడం కష్టం[7:33-34].

1 Corinthians 7:36

తనకు ప్రదానం జరిగిన ఆమెను పెళ్ళి చేసుకునేవాడికంటే ఎవరు ఇంకా మంచిపని చేస్తున్నారు?

పెళ్ళి చేసుకోని వాడు ఇంకా మంచి చేస్తున్నాడు[7:38].

1 Corinthians 7:39

ఎంతకాలం వరకు ఒక స్త్రీ తన భర్తకు కట్టుబడి ఉండాలి?

భర్త బ్రతికి ఉన్నంత వరకూ భార్య అతడికి కట్టుబడి ఉంటుంది[7:39].

నమ్మిన స్త్రీ భర్త చనిపోయిన యెడల ఆమె ఎవరిని పెళ్ళి చేసుకోవచ్చు?

ఆమెకు నచ్చిన వాడిని వివాహమాడడానికి ఆమెకు స్వేచ్చ ఉంది గాని ప్రభువుకు చెందిన వాణ్ణి మాత్రమే వివాహమాడాలి[7:39].


Chapter 8

Translation Questions

1 Corinthians 8:1

ఈ అధ్యాయంలో ఏ అంశంను గురించి పౌలు మాట్లాడుతున్నాడు?

విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం పౌలు రాస్తున్నాడు[8:1,4].

జ్ఞానం, ప్రేమలు కలుగజేసే ఫలితాలేంటి?

జ్ఞానం ఉప్పొంగజేస్తుంది, ప్రేమ అభివృద్ధిని కలిగిస్తుంది[8:1].

1 Corinthians 8:4

విగ్రహం దేవునితో సమానమా?

కాదు. లోకంలో విగ్రహం వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు[8:4].

ఒకే ఒక దేవుడు ఎవరు?

ఒకే దేవుడున్నాడు, ఆయన తండ్రియైన దేవుడు. ఆయనను బట్టి సమస్తం కలిగింది, మన ఉనికి ఆయన కోసమే[8:6].

ఒకే ప్రభువు ఎవరు?

ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు. అయన ద్వారానే సమస్తం కలిగింది, మన ఉనికి కూడా ఆయన ద్వారానే కలిగింది[8:6].

1 Corinthians 8:7

విగ్రహంను ఆరాధించినవారు విగ్రహంకు బలి ఇచ్చినదానిని భుజించినపుడు ఎంజరుగుతుంది?

వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతుంది[8:7].

1 Corinthians 8:8

భోజనం మనలను దేవుని యెదుట గొప్పవారినిగాని తక్కువ వారినిగా గాని చేస్తుందా?

భోజనం మనలను గురించి దేవునికేం చెప్పలేదు. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు[8:8].

మన స్వేచ్ఛ ఏమి కాకూడదని మనం జాగ్రత్త తీసుకోవాలి?

మన స్వేచ్చ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూసుకోవాలి[8:9].

విగ్రహార్పితమైన వాటి విషయం బలహీన మనస్సాక్షి గల సోదరుడుగాని సోదరిగాని వాటిని మనం తినుచుండుట చూచి వాటిని తింటే ఏమి జరుగుతుంది?

ఆ సహోదరుని, సోదరిని బలహీనమైన మనస్సాక్షి గలవారుగా చేసి నశింపజేసిన వారిమౌతున్నాము[8:10-11].

1 Corinthians 8:11

క్రీస్తులో ఒక సహోదరుని, సోదరిని వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి ఉద్దేశ్యపూర్వకంగా తొట్రుపడేవారిగా చేసినయెడల ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమౌతాము?

క్రీస్తులో ఒక సహోదరుని, సోదరిని వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి తొట్రుపడేవారిగా చేసిన యెడల క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసిన వారమౌతాం[8:11-12].

తాను చేసిన భోజనం ఒక సహోదరుని, సోదరిని తొట్రుపడేవారిగా చేసిన యెడల ఏమి చేస్తానని పౌలు చెపుతున్నాడు?

తాను చేసిన భోజనం ఒక సహోదరుని, సోదరిని తొట్రుపడేవారిగా చేసినయెడల ఎన్నటికి మాంసం తిననని పౌలు చెపుతున్నాడు[8:13].


Chapter 9

Translation Questions

1 Corinthians 9:1

తాను అపోస్తలుడనని పౌలు ఎం రుజువు చూపుతున్నాడు?

కొరింతు విశ్వాసులు ప్రభువునందు తన పనియై ఉన్నారు కనుక వారే తన అపోస్తలత్వముకు రుజువునై ఉన్నారని పౌలు చెపుతున్నాడు[9:1-2].

1 Corinthians 9:3

అపోస్తలులు, ప్రభువునందు సహోదరులు, కేఫా యొక్క అధికారాలలో పౌలు చెప్పిన కొన్ని అధికారాలు ఏవి?

తినుటకు, త్రాగుటకు వారికి అధికారం ఉన్నదని పౌలు చెపుతున్నాడు, విశ్వాసి అయిన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు అధికారమున్నదని చెపుతున్నాడు[9:4-5].

1 Corinthians 9:7

తమ పని నుండి ప్రయోజనాలు పొందినవారు, చెల్లించినవారి గురించి పౌలు ఏ ఉదాహరణలు ఇచ్చాడు?

తమ పని నుండి ప్రయోజనాలు పొందినవారి గురించి పౌలు సైనికులు, ద్రాక్షతోట నాటినవారు, మంద కాచువారిని గురించిన ఉదాహరణలు ఇచ్చాడు[9:7].

1 Corinthians 9:9

తమ పని నుండి ప్రయోజనాలు పొందడం, చెల్లించడం గురించిన తలంపును బలపరచడం కొరకు పౌలు మోషే ధర్మశాస్త్రం నుండి ఏ ఉదాహరణ ఇచ్చాడు?

పౌలు తన వాదనను బలపరచుకోడానికి "కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు" అను ఆజ్ఞను ప్రస్తావిస్తున్నాడు[9:9].

కొరింతు విశ్వాసుల మధ్య తాము ఆ అధికారం ఉపయోగించుకోక పోయినా పౌలుకు, అతని అనుచరులకు ఏ అధికారం ఉంది?

కొరింతు విశ్వాసులనుండి శరీరసంబంధమైన ఫలములు కోసికొనుటకు వారికి అధికారం ఉంది. ఎందుకంటే కొరింతువారి మధ్య వారు ఆత్మ సంబంధమైన వాటిని విత్తారు[9:11-12].

1 Corinthians 9:12

సువార్తను ప్రకటించువారిని గురించి ప్రభువు ఏమి ఆజ్ఞాపించాడు?

సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు ఆజ్ఞాపించాడు[9:14].

1 Corinthians 9:15

తాను అతిశయించడం లేదని దేని గూర్చి పౌలు చెప్పాడు, ఎందువలన దాని గురించి తాను అతిశయపడలేక పోయాడు?

తాను సువార్త ప్రకటించుచున్నను అతిశయ పడలేదని పౌలు చెప్పాడు, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం తన మీద ఉంది[9:16].

1 Corinthians 9:19

పౌలు ఎందుకు అందరికీ సేవకుడయ్యాడు?

ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించుకొనుటకై పౌలు అందరికి సేవకుడయ్యాడు[9:19].

దేవునికొరకు అనేకులను సంపాదించుటకు ఎవరివలె ఉండాలని పౌలు ఇష్టపడ్డాడు?

యూదునికి యూదునివలె, ధర్మశాస్త్రముకు లోబడినవాని వలె, ధర్మశాస్త్రం లేని వారికి బలహీనుడయ్యాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడయ్యాడు[9:20-22].

1 Corinthians 9:21

సువార్త నిమిత్తం పౌలు ఎందుకు అన్ని చేసాడు?

సువార్త దీవెనలలో పాలివాడు కావడానికి పౌలు సమస్తం చేసాడు[9:23].

1 Corinthians 9:24

ఏ విధంగా పరుగెత్తాలని పౌలు చెప్పాడు?

బహుమానం పొందునట్లుగా పరుగెత్తాలని పౌలు చెప్పాడు[9:24].

ఎటువంటి కిరీటాన్ని పొందాలని పౌలు పరుగెత్తుతున్నాడు?

అక్షయమగు కిరీటాన్ని పొందాలని పౌలు పరుగెత్తుచున్నాడు[9:25].

ఎందుకు పౌలు తన శరీరాన్ని నలగగొట్టి లోబరచుకొన్నాడు?

ఇతరులకు ప్రకటించిన తరువాత తాను భ్రష్టుడై పోతాడేమోనని ఈ విధంగా చేసాడు[9:27].


Chapter 10

Translation Questions

1 Corinthians 10:1

మోషే కాలంలో వారి పితరులు పొందిన సాధారణ అనుభవాలేవి?

వారి పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచారు. అందరు మోషేనుబట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిస్మం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసారు[10:1-4].

తమ పితరులను అనుసరించిన ఆత్మీయ బండ ఎవరు?

ఆత్మీయ బండ అయిన క్రీస్తు వారిని అనుసరించాడు[10:4].

1 Corinthians 10:7

మోషే కాలంలో వారి పితరుల విషయం దేవుడు ఎందుకు ఇష్టంగా లేడు?

వారు చెడ్డవాటిని ఆశించారు, వ్యభిచారులయ్యారు, ప్రభువును శోధించారు, సణిగారు[10:6-10].

వారి పితరుల ప్రవర్తనను శిక్షించడానికి దేవుడేమి చేసాడు?

వారు నానా విధాలుగా చనిపోయారు, కొందరు సర్పములచేత, కొందరు సంహారదూత చేత చనిపోయారు, అరణ్యంలో కూలిపోయారు[10:5,8-10].

1 Corinthians 10:11

అవి ఎందుకు జరిగాయి, ఎందుకోసం రాసిఉన్నాయి?

మనకు బుద్ధి కలుగుటకు దృష్టాంతములుగా మన కొరకు రాసి ఉన్నాయి[10:11].

ఏదైనా ప్రత్యేకమైన శోధన మనకు కలిగిందా?

లేదు. మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ వారికి కలుగలేదు[10:13].

మనం శోధన సహించుటకు దేవుడు ఏమి చేసాడు?

శోధనతో పాటు తప్పించుకొను మార్గాన్ని ఆయన కలుగజేశాడు[10:13].

1 Corinthians 10:14

దేని నుండి కొరింతు విశ్వాసులను పారిపొమ్మని పౌలు హెచ్చరిస్తున్నాడు?

విగ్రహరాధననుండి కొరింతు విశ్వాసులు పారిపోవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు[10:14].

విశ్వాసులు దీవించు ఆశీర్వచనపు పాత్ర ఏమిటి, వారు విరచు రొట్టె ఏమిటి?

పాత్ర క్రీస్తు రక్తములో సహవాసము, రొట్టె విరచి తినడం క్రీస్తు శరీరంలో సహవాసం[10:16].

1 Corinthians 10:20

అన్యజనులు తమ బలులను ఎవరికీ అర్పిస్తున్నారు?

వారు దయ్యములకే గాని దేవునికి తమ బలులను అర్పించుట లేదు[10:20].

కొరింతు విశ్వాసులు దయ్యాలతో వంతు తీసుకోవడం పౌలు కోరడం లేదు కనుక, వారు ఏమి చెయ్యలేరని పౌలు చెపుతున్నాడు?

వారు ప్రభువు పాత్రలోనిది దయ్యాల పాత్ర లోనిదీ త్రాగలేరు, ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యాల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందలేరని పౌలు చెపుతున్నాడు[10:20].

ప్రభువు విస్వాసులంగా దయ్యాలతో పాలు పొందిన యెడల ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటాం?

ప్రభువుకు రోషం పుట్టించిన వారిమౌతాం[10:22].

1 Corinthians 10:23

మన స్వంత మేలునే చూసుకుంటామా?

లేదు. దానికి బదులుగా ప్రతివాడునూ తన పొరుగువాని మేలుకొరకు చూచుకోనవలెను[10:24].

1 Corinthians 10:25

ఒక అవిశ్వాసి భోజనానికి నిన్ను పిలిస్తే నీవు వెళ్ళదలిస్తే ఏమి చెయ్యాలి?

నీకు వడ్డించినవి ఏవో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినాలి[10:27].

1 Corinthians 10:28

నీవు తీసుకోబోయే భోజనం బలి అర్పించినదని ఆతిధ్యం ఇచ్చిన అవిశ్వాసి నీకు చెప్పినపుడు దీనిని నీవు ఎందుకు తీసుకోవు?

నీకు తెలియజేసిన వాని కొరకు నీవు దానిని తీసుకోకూడదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం నీవు దానిని తీసుకోకూడదు[10:28-29].

1 Corinthians 10:31

దేవుని మహిమ కొరకు మనం ఏమిచెయ్యాలి?

మనం భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి[10:31].

యూదులకు, గ్రీసుదేశస్తులకు, దేవుని సంఘానికి ఎందుకు అభ్యంతరం కలుగజేయకూడదు?

వారు రక్షణ పొందునట్లు మనం వారికి అభ్యంతరం కలుగజేయ కూడదు [10:32-33].


Chapter 11

Translation Questions

1 Corinthians 11:1

ఎవరిని అనుకరించమని పౌలు కొరింతు విశ్వాసులకు చెప్పాడు?

పౌలును అనుకరించమని పౌలు చెప్పాడు[11:1].

పౌలు ఎవరిని అనుకరిశున్నాడు?

పౌలు క్రీస్తును అనుకరించువాడు[11:1].

ఎందుకొరకు పౌలు కొరింతు విస్వాసులను మెచ్చుకొన్నాడు?

వారికి అప్పగించిన కట్టడలను గట్టిగా పట్టుకొనియున్నందున పౌలు వారిని మెచ్చుకుంటున్నాడు[11:2].

క్రీస్తుకు శిరస్సు ఎవరు?

క్రీస్తుకు శిరస్సు దేవుడు[11:3].

పురుషునికి శిరస్సు ఎవరు?

ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే[11:3].

స్త్రీకి శిరస్సు ఎవరు?

స్త్రీకి శిరస్సు పురుషుడే[11:3].

పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్ధిస్తే ఏమవుతుంది?

పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్ధిస్తే అతడు తన తలను అవమాన పరచును[11:4].

1 Corinthians 11:5

స్త్రీ తన తల మీద ముసుగు లేకుండా ప్రార్ధిస్తే ఏమవుతుంది?

స్త్రీ తన తల మీద ముసుగు లేకుండా ప్రార్ధిస్తే ఆమె తన తలను అవమాన పరచును[11:5].

1 Corinthians 11:7

ఎందుకు పురుషుడు తన తల మీద ముసుకు వేసుకొనకూడదు?

పురుషుడు తన తల మీద ముసుకు వేసుకొనకూడదు ఎందుకంటే అతడు దేవుని పోలికయు, మహిమయునై యున్నాడు[11:7].

1 Corinthians 11:9

ఎవరి కొరకు స్త్రీని సృజించడం జరిగింది?

స్త్రీని పురుషుని కొరకు సృజించడం జరిగింది[11:9].

1 Corinthians 11:11

స్త్రీ పురుషులిద్దరు ఒకరిమీద ఒకరు ఎందుకు ఆధారపడ్డారు?

స్త్రీ పురుషుని మూలంగా కలిగింది, పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు[11:11-12].

1 Corinthians 11:13

స్త్రీ ప్రార్ధించుటను గురించి పౌలు, అతని అనుచరులు, దేవుని సంఘముల అలవాటు ఏమిటి?

జ.స్త్రీలు ముసుకు వేసికొని ప్రార్ధించుట వారి ఆచారం[11:10,13,16].

1 Corinthians 11:17

కొరింతు విశ్వాసుల మధ్య ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉండాలి?

వారిలో యోగ్యులు స్పష్టం కావడానికి వారిలో భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పదు[11:19].

1 Corinthians 11:20

ప్రభువు రాత్రి భోజనం కొరకు కొరింతు సంఘం కూడినపుడు ఏమి జరుగుతుంది?

వారు భోజనం చేయునపుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఒకడు ఆకలి గొనియున్నాడు, మరియొకడు మత్తుగా ఉన్నాడు[11:21].

1 Corinthians 11:23

ప్రభువైన యేసును శత్రువులకు పట్టిఇచ్చిన రాత్రి యేసు ఒక రొట్టెను విరచి ఏమిచెప్పాడు?

"ఇది మీకోరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసికొనుటకు దీనిని చేయుడి" అని చెప్పాడు[11:23,24].

1 Corinthians 11:25

భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను తీసికొని ఏమి చెప్పాడు?

"యీ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకం చేసుకోండి" అని చెప్పాడు[11:25].

ఆయన రొట్టెను తినునప్పుడు, ఆయన రసం త్రాగునప్పుడెల్ల మీరేం చేయుచున్నారు?

ప్రభువు వచ్చు వరకు ఆయన మరణం ప్రచురం చేస్తున్నారు[11:26].

1 Corinthians 11:27

ఎందుకు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినకూడదు, పాత్రలోనిది త్రాగకూడదు?

ఆ విధంగా చేసినయెడల వాడు ప్రభువు యొక్క శరీరం గురించియు, రక్తమును గురించియు అపరాధియగును[11:27,29].

కొరింతు సంఘంలో అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిని, అయన పాత్రలోనిది త్రాగిన అనేకులకు ఏమిజరిగింది?

అనేకులు బలహీనులును, రోగులునై ఉన్నారు, కొందరు కన్నుమూసారు[11:30].

1 Corinthians 11:33

భోజనం చేయడానికి కూడి వచ్చినపుడు ఏమిచెయ్యాలని కొరింతు విశ్వాసులకు పౌలు చెపుతున్నాడు?

ఒకరికొకరు కనిపెట్టుకొని యుండాలని పౌలు చెపుతున్నాడు[11:33].


Chapter 12

Translation Questions

1 Corinthians 12:1

కొరింతు క్రైస్తవులు ఏమి తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు?

వారు ఆత్మవరాల గురించి తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు[12:1].

దేవుని అత్మచేత మాట్లాడువాడు ఏమి మాట్లాడ లేడు?

దేవుని అత్మచేత మాట్లాడువాడు "యేసు శాపగ్రస్తుడని" చెప్పలేడు[12:3].

"యేసు ప్రభువు" అని ఎవరైనా ఏవిధంగా చెప్పగలరు?

ఎవరైనా పరిశుద్ధాత్మచేత "యేసు ప్రభువు" అని చెప్పగలరు[12:3].

1 Corinthians 12:4

ప్రతి విశ్వాసిలో దేవుడు దేనిని జరిగించుచున్నాడు?

ప్రతి విశ్వాసిలోను దేవుడు నానావిధములైన కృపావరములను, నానావిధములైన పరిచర్యలను, నానావిధములైన కార్యములను జరిగించుచున్నాడు[12:4-6].

1 Corinthians 12:7

ఆత్మ ప్రత్యక్షత ఎందుకు కలుగుతుంది?

మనుష్యులందరి ప్రయోజనంకొరకు కలుగుతుంది[12:7].

1 Corinthians 12:9

ఆత్మ ఇచ్చిన కొన్ని కృపావరాలు ఏవి?

బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, స్వస్థపరచు వరం, అద్భుతాలు చేయు వరం, ప్రవచనం, ఆత్మల వివేచనా వరం, నానావిధ భాషలు, భాషల అర్ధం చెప్పు వరం కొన్ని కృపావరాలు[12:8-10].

ఏ వరములను ఎవరు పంచి ఇస్తారు?

ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి ఇస్తాడు[12:11].

1 Corinthians 12:12

దేనిలోనికి క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్నారు?

మనమందరం ఒక్క శరీరంలోనికి అత్మయందే బాప్తిస్మం పొందాం, ఒక్క ఆత్మను పానం చేశాం[12:13].

1 Corinthians 12:18

శరీరంలోని ప్రతి అవయవంను ఎవరు చక్కగా అమర్చారు?

శరీరంలోని ప్రతి అవయవంను దేవుడు తన చిత్తం ప్రకారం చక్కగా అమర్చాడు[12:18].

1 Corinthians 12:21

శరీరం యొక్క భాగాలలో బలహీనంగా కనపడే భాగాలు లేకుండా ఏమైనా చెయ్యగలమా?

లేదు. శరీరంలో బలహీనంగా కనపడే భాగాలు అవసరమైనవి[12:22].

బలహీనంగా కనపడే భాగాలతో కలిపి శరీరం యొక్క భాగాలకు దేవుడు ఏమిచేసాడు?

శరీరంలోని భాగాలన్నిటిను ఏకం చేసాడు, తక్కువదానికే ఎక్కువ ఘనతను కలుగజేశాడు[12:24].

1 Corinthians 12:25

శరీర భాగాలలో తక్కువవాటికి దేవుడు ఎందుకు ఘనత కలుగజేశాడు?

శరీరంలో ఎటువంటి వివాదం లేకుండునట్లు దేవుడు దీనిని చేసాడు, అయితే శరీర భాగాలు ఒకనికొకటి ఆప్యాయంగా చూసుకోవాలి [12:25].

1 Corinthians 12:28

దేవుడు సంఘం లో ఎవరిని నియమించాడు?

దేవుడు మొదట కొందరిని అపోస్తలులుగా, రెండవది ప్రవక్తలుగా, మూడవది బోధకులుగా, అద్భుతాలు చేయువారినిగా, స్వస్తతలు, ఉపకారం చేయువారినిగా, ప్రభుత్వములు చేయువారినిగా, నానా భాషలు మాట్లాడువారినిగా నియమించాడు[12:28].

1 Corinthians 12:30

దేనిని వెదకమని పౌలు కొరింతు విశ్వాసులకు చెప్పాడు?

శ్రేష్టమైన కృపావరములను వెదకమని పౌలు వారికి చెప్పాడు[12:31].

కొరింతు విశ్వాసులకు ఏమి చూపిస్తానని పౌలు చెప్పాడు?

మరింత శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తానని పౌలు చెప్పాడు[12:31].


Chapter 13

Translation Questions

1 Corinthians 13:1

మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను మాట్లాడి, ప్రేమలేకపోతే పౌలు ఏమౌతాడు?

మ్రోగెడు కంచును, గణగణలాడు తాళముగా ఉంటాడు[13:1].

ప్రవచించు కృపావరం కలిగి, మర్మములన్నియు, జ్ఞానమంతయు ఎరిగినవాడై, ప్రేమలేకపోతే పౌలు ఏమౌతాడు?

వ్యర్దుడవుతాడు[13:2].

పౌలు బీదలపోషణ కొరకు తన ఆస్తి అంతయు ఇచ్చినా, తన శరీరాన్ని కాల్చడానికి అప్పగించినాప్రయోజనం లేకపోవడానికి కారణం ఏమిటి?

ఈ కార్యాలన్నీ చేసినా ప్రేమ లేనివాడు అయితే అతనికేం ప్రయోజనం లేదు[13:2]

1 Corinthians 13:4

ప్రేమ యొక్క కొన్ని లక్షణాలు ఏమిటి

ప్రేమ సహిస్తుంది, దయ చూపుతుంది, అది మత్సర పడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అది అమర్యాదగా నడువదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయం సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది, అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ఇది శాశ్వత కాలముంటుంది[13:4-8].

1 Corinthians 13:8

గతించిపోయేవి, నిలిచిపోయేవి ఏవి?

ప్రవచనాలు, జ్ఞానం, పూర్ణము కానిది గతించి పోతాయి, భాషలు నిలిచిపోతాయి[13:8-10].

అంతము లేనిదేది?

అంతము లేనిది ప్రేమ[13:8].

1 Corinthians 13:11

పౌలు పెద్దవాడైనప్పుడు ఏమి చేసాడని చెప్పాడు?

పౌలు పెద్దవాడైనప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసాడని చెప్పాడు[13:11].

ఎ మూడు విషయాలు నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ఏది?

విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే[13:13].


Chapter 14

Translation Questions

1 Corinthians 14:1

ఆత్మ సంబంధమైన ఏ ఆత్మవరం కొరకు ఆపేక్ష కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు?

ప్రవచన వరం విషయం మనం ఆపేక్ష కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు[14:1].

భాషతో మాట్లాడు వాడు ఎవనితో మాట్లాడుచున్నాడు?

భాషతో మాట్లాడు వాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు[14:2].

భాషలతో మాట్లాడడం కంటే ప్రవచించడం ఎందుకు మిన్న?

భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొంటున్నాడు, అయితే ప్రవచించే వాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయును. అందుచేత ప్రవచించడం గొప్పది[14:3-5].

1 Corinthians 14:7

జ్ఞానంలేని సంభాషణను పౌలు దేనితో పోల్చాడు?

స్వరములలో భేదం కలుగాజేయని పిల్లనగ్రోవి, వీణేలతో పౌలు దీనిని సరిపోల్చాడు. స్పష్టం కాని ధ్వని ఇచ్చే బూరతో కూడా పౌలు పోల్చాడు[14:7-9].

1 Corinthians 14:12

ఏ విషయంలో కొరింతు విశ్వాసులు ఆసక్తి కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు?

సంఘ క్షేమాభివృద్ధి విషయం ఆసక్తి కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు[14:12].

భాషతో మాటలాడువాడు దేనికొరకు ప్రార్ధించాలి?

భాషతో మాటలాడువాడు అర్ధం చెప్పు శక్తిగలవాడగుటకు ప్రార్ధించాలి[14:13].

భాషతో ప్రార్ధన చేయునపుడు తన ఆత్మ, మనసు ఏమిచేస్తాయని పౌలు చెపుతున్నాడు?

భాషతో ప్రార్ధన చేయునపుడు తన ఆత్మ ప్రార్ధిస్తుంది, మనసు ఫలవంతంగా ఉండదు అని పౌలు చెపుతున్నాడు[14:14].

1 Corinthians 14:15

తాను ఏవిధంగా ప్రార్ధించబోతున్నాడు, పాడబోతున్నాడని పౌలు చెపుతున్నాడు?

తాను ఆత్మతో మాత్రమే కాక, మనసుతోను ప్రార్దిస్తానని, పాడతానని పౌలు చెపుతున్నాడు[14:15].

1 Corinthians 14:17

భాషతో పదివేల మాటలు మాట్లాడం కంటే ఏది మేలు అని పౌలు చెప్పాడు?

భాషతో పదివేల మాటలు మాట్లాడం కంటే మనసుతో ఇతరులకు బోధకలుగునట్లు ఐదు మాటలు మేలు అని పౌలు చెప్పాడు[14:19].

1 Corinthians 14:22

భాషలు, ప్రవచనాలు ఎవరికీ గుర్తుగా ఉన్నాయి ?

భాషలు అవిశ్వాసులకు గుర్తుగా ఉన్నాయి, ప్రవచనాలు విశ్వాసులకు గుర్తుగా ఉన్నాయి[14:22].

సంఘమంతయు కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా బయటివారును, అవిశ్వాసులును లోనికి వచ్చినపుడు వారు ఏమనవచ్చు?

విశ్వాసులు వెర్రివారు అని పిలువవచ్చును[14:23].

1 Corinthians 14:24

సంఘమంతయు కూడి అందరు ప్రవచించుచుండగా బయటివాడు, అవిశ్వాసి లోనికి వచ్చినపుడు ఏమవుతుందని పౌలు చెపుతున్నాడు?

సంఘమంతయు కూడి అందరు ప్రవచించుచుండగా బయటివాడు, అవిశ్వాసి లోనికి వచ్చినపుడు అందరి బోధ వలన తనకు ఒప్పుదల కలుగుతుంది, అందరి వలన విమర్శలోనికి వస్తాడు[14:24].

ప్రవచనాలు తన హృదయ రహస్యాలను బయలుపరచుచు ఉన్నప్పుడు బయటివాడు, అవిశ్వాసి ఏమి చేస్తారు?

అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు, నిజంగా దేవుడు వారి మధ్య ఉన్నాడని ప్రచురం చేస్తాడు[14:25].

1 Corinthians 14:26

విశ్వాసులు కూడి వచ్చినపుడు భాషలు మాట్లాడువారి కొరకు పౌలు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?

ఇద్దరు, అవసరమైన యెడల ముగ్గురు వంతుల చొప్పున మాట్లాడాలని చెప్పాడు, అర్ధం చెప్పువాడు లేనియెడల అతడు సంఘంలో మౌనంగా ఉండాలని పౌలు చెప్పాడు[14:27-28].

1 Corinthians 14:29

విశ్వాసులు కూడి వచ్చినపుడు ప్రవక్తలకు పౌలు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?

ప్రవక్తలు ఇద్దరు, ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కినవారు వివేచింపవచ్చును. కూర్చున్న వానికి ఏదైనను తెలిస్తే మొదటి వాడు మౌనంగా ఉండాలి. వారు ఒకరి తరువాత మరొకరు ప్రవచింపవచ్చును అని పౌలు చెప్పాడు[14:29-31].

1 Corinthians 14:31

ఏ సంఘాలలో స్త్రీలు మాట్లాడుటకు సెలవు లేదని పౌలు చెప్పాడు?

పరిశుద్ధుల సంఘాలన్నిటిలో స్త్రీలు మాట్లాడుటకు సెలవు లేదని పౌలు చెప్పాడు[14:33-34].

1 Corinthians 14:34

స్త్రీలు ఏమైనా నేర్చుకోవాలంటే ఏమిచేయాలని పౌలు చెప్పాడు?

వారు తమ ఇంట తమ భర్తలను అడగాలని పౌలు చెప్పాడు[14:35].

సంఘంలో మాట్లాడుచున్న స్త్రీని ప్రజలు ఎలా చూస్తారు?

సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానం[14:35].

1 Corinthians 14:37

ఎవరైనను తాను ప్రవక్తనియైనను ఆత్మ సంబంధినని తలంచిన యెడల వారు ఏమి తెలుసుకోవాలని పౌలు చెప్పాడు?

అతడు పౌలు రాయుచున్నవి ప్రభువు యొక్క అజ్ఞలని దృఢంగా తెలిసికోవాలని పౌలు చెప్పాడు[14:37].

1 Corinthians 14:39

సంఘంలో సమస్తం ఏవిధంగా జరగాలి?

సమస్తం మర్యాదగాను, క్రమంగాను జరగాలి[14:40].


Chapter 15

Translation Questions

1 Corinthians 15:1

సహోదరులకు, సోదరీలకు పౌలు ఏమి జ్ఞాపకం చేసాడు?

వారికి ప్రకటించిన సువార్తను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు[15:1].

పౌలు ప్రకటించిన సువార్త ద్వారా కొరింతు వారు రక్షణ పొందాలంటే ఏ షరతులు నెరవేర్చాలి?

పౌలు ప్రకటించిన వాక్కును గట్టిగా పట్టుకొనుట ద్వారా కొరింతు వారు రక్షణ పొందగలరని పౌలు వారికి చెప్పాడు[15:2]

1 Corinthians 15:3

సువార్తలోని భాగాలలో మొదటి ప్రాముఖ్యత కలిగిన అంశాలేంటి?

లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడం, మూడో రాజున ఆయనను సజీవంగా లేపడమూ జరిగింది అనేవి సువార్తలోని మొదటి ప్రాముఖ్యత కలిగిన అంశాలు[15:3].

1 Corinthians 15:8

క్రీస్తు మృతులలోనుండి లేచిన తరువాత ఎవరికి కనిపించాడు?

క్రీస్తు మృతులలోనుండి లేచిన తరువాత, అయన కేఫాకు, పన్నెండుమంది శిష్యులకు, ఐదువందలమంది సహోదరులు, సోదరీలకు ఒకసారి, యాకోబుకు, అపోస్తలులందరికి, పౌలుకును కనిపించాడు[15:8].

అపోస్తాలులలో కనిష్టుడను అని పౌలు ఎందుకు చెప్పాడు?

దేవుని సంఘాన్ని హింసించాడు కనుక పౌలు ఇలా చెప్పాడు[15:9].

1 Corinthians 15:12

పునరుత్థానం గురించి కొరింతు విశ్వాసులు కొందరు చెపుతున్నదానిని ఏమని సూచిస్తున్నాడు?

వారిలో కొందరు మృతులలోనుండి పునరుత్థానం లేదని చెపుతున్నట్టు ఉందని పౌలు సూచిస్తున్నాడు[15:12].

మృతులలోనుండి పునరుత్థానం లేనట్లయితే పౌలు చెపుతున్న ఏ విషయంకూడా సత్యం అని పౌలు చెపుతున్నాడు?

మృతులలోనుండి పునరుత్థానం లేనట్లయితే పౌలును, తనవలె ఇతరుల సందేశం నిరుపయోగం అని, కొరింతువారి విశ్వాసం కూడా నిరుపయోగం అని చెపుతున్నాడు[15:13-14].

1 Corinthians 15:18

మృతులలోనుండి క్రీస్తు లేవనియెడల క్రీస్తులో చనిపోయిన వారికి ఏమిజరుగుతుంది ?

వారు నశించిపోయారు[15:18].

భవిష్యత్తు కొరకు క్రీస్తులో మన నిరీక్షణ ఈ జీవితానికి మట్టుకే సత్యం అయితే పౌలు చెపుతున్నదేమిటి?

ఇది సత్యమైతే మనుష్యులందరిలో మనం దౌర్భాగ్యులం[15:19].

1 Corinthians 15:20

క్రీస్తును పౌలు ఏమని పిలుస్తున్నాడు?

"చనిపోయినవారిలో ఆయన ప్రథమ ఫలం" అని క్రీస్తును పౌలు పిలుస్తున్నాడు[15:20].

ఎవని ద్వారా మరణం ఈ లోకం లోనికి వచ్చింది, ఎవని ద్వారా మృతుల పునరుత్థానం ఈ లోకం లోనికి వచ్చింది?

ఆదాము మరణాన్ని ఈ లోకం లోనికి తీసుకొని వచ్చాడు, క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది[15:21-22].

1 Corinthians 15:22

కీస్తుకు చెందినవారు ఎప్పుడు సజీవంగా లేవడం జరుగుతుంది ?

క్రీస్తు వచ్చినపుడు ఇడి జరుగుతుంది[15:23].

1 Corinthians 15:24

ప్ర.అంతమందు ఏమిజరుగుతుంది?

సమస్త ప్రభుత్వాన్ని సమస్త అధికారాన్ని సమస్త శక్తిని రద్దుచేసి రాజ్యాన్ని తండ్రిఅయిన దేవునికి అప్పగిస్తాడు[15:24].

ఎంత కాలం క్రీస్తు పరిపాలిస్తాడు?

తన విరోధులందరినీ తన పాదాల క్రింద పెట్టుకొనేవరకు క్రీస్తు రాజ్యం చేయాలి[15:23].

చివరిగా మరణమయ్యే విరోధి ఎవరు?

చివరిగా మరణమయ్యే విరోధి మరణం[15:26]

1 Corinthians 15:27

"ఆయన సమస్తంను ఆయన పాదాల క్రింద ఉంచాడు" అని అయన చెప్పినపుడు అందులో ఎవరు ఉండరు?

సమస్తమునూ కుమారునికి(తనకు) వశము చేసినవాడు అందులో ఉండడు[15:27].

తండ్రి అయిన దేవుడు సమస్తంలోను సమస్తమై ఉండేలా కుమారుడు ఏమి చేస్తాడు?

తండ్రి అయిన దేవుడు సమస్తంలోను సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తనకు వశం చేసిన ఆయనకు వశం అవుతాడు[15:28].

1 Corinthians 15:31

మృతులు లేవని యెడల వారు ఏమి చేయ వచ్చని పౌలు ప్రకటిస్తున్నాడు?

"మనం రేపు చనిపోతాము కనుక తిందుము, త్రాగుదము" అని పౌలు ప్రకటించాడు[15:32].

1 Corinthians 15:33

కొరింతు వారు ఏమి చెయ్యాలని పౌలు ఆజ్ఞాపించాడు?

మేల్కొని, నీతి ప్రవర్తన కలిగిని వారై, పాపం చేయవద్దని పౌలు ఆజ్ఞాపించాడు[15:34].

కొరింతి వారిలో కొందరిని సిగ్గుపరచడానికి పౌలు ఏమన్నాడు?

వారిలో కొందరికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు అన్నాడు[15:34].

1 Corinthians 15:35

మృతుల పునరుత్థానాన్ని పౌలు దేనితో పోల్చాడు?

భూమిలో నాటిన విత్తనంతో పోల్చాడు[15:35-42].

విత్తనం వృద్దిచెందడానికి ముందు దానికి ఏమౌతుంది?

అది చావాలి[15:36].

1 Corinthians 15:37

భూమిలో నాటిన వట్టి విత్తనం ఆ విత్తనం నుండి రాబోతున్న ఆకారాన్ని చూపిస్తుందా?

నీవు నాటిన విత్తనం కలుగాబోవు ఆకారాన్ని చూపించదు[15:37].

మాంసమంతయూ ఒక్కటేనా?

మాంసమంతయూ ఒక్కటికాదు, మనుష్య మాంసం వేరు, మృగమాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు[15:39].

1 Corinthians 15:40

వివిధ రకాలైన గ్రహాలున్నాయా?

ఆకాశంలో గ్రహాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి [15:40]

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఒకే మహిమను పంచుకుంటాయా?

సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదం కలదు[15:41)]

1 Corinthians 15:42

నశించిపోయే మన శరీరాలను ఎలా విత్తడం జరిగింది?

ఘనహీనతలో, బలహీనతలో సహజసిద్ధమైన శరీరాలుగా విత్తడం జరిగింది[15:42-44].

మృతులలో నుండి మనం లేవడం జరిగినపుడు మన స్థితి ఎలా ఉంటుంది?

మృతులలో నుండి లేచిన శరీరం నాశనం కాని శరీరం, మహిమగల స్థితిలో, బలమైన స్థితిలో లేపడం జరిగింది[15:42-44].

1 Corinthians 15:45

మొదటి మానవుడు ఆదాము ఏమయ్యాడు?

అతడు జీవించు ఆత్మ అయ్యాడు[15:45].

చివరి ఆదాము ఏమయ్యాడు?

అతడు బ్రతికించే ఆత్మ అయ్యాడు[15:45].

1 Corinthians 15:47

మొదటి మానవుడు, చివరి మానవుడు ఎక్కడినుండి వచ్చారు?

మొదటి మానవుడు భూమినుండి వచ్చాడు, మట్టినుండి రూపొందినవాడు. రెండవ మానవుడు పరలోకం నుండి వచ్చాడు[15:47].

మనం ఎవరి పోలిక ధరించాము, ఎవరి పోలిక ధరించబోతున్నాము?

మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంభంది పోలిక కూడా ధరించుకొంటాం[15:49].

1 Corinthians 15:50

దేవుని రాజ్యాన్ని ఏది స్వతంత్రించు కోలేదు?

రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కోలేవు[5:50].

మనకందరికీ ఏమి జరుగుతుంది?

మనం మార్పు చెందుతాము[15:51].

1 Corinthians 15:52

ఎప్పుడు, ఎంత త్వరగా మనం మార్పు చెందుతాం?

చివరి బూర మ్రోగగానే ఒక క్షణంలోనే, రెప్పపాటున ఇది జరుగుతుంది[15:52].

1 Corinthians 15:54

ఈ నశించేది నశించని దానిని ధరించుకొనినపుడు, మరణించేది మరణించని దానిని ధరించుకొనినపుడు ఏమిజరుగుతుంది?

విజయం మరణాన్ని మ్రింగివేస్తుంది[15:54].

1 Corinthians 15:56

మరణపు కొండె ఏది, పాపపు బలం ఏది?

మరణపు కొండె పాపం, పాపపు బలం ధర్మశాస్త్రం[15:56].

ఎవరి ద్వారా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు?

దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు విజయాన్ని ఇచ్చుచున్నాడు[15:57].

1 Corinthians 15:58

కొరింతు సోదరులు, సోదరీలు స్థిరంగా, నిలకడగా, ప్రభువు సేవ ఎప్పుడూ ఆసక్తితో చేయాలని పౌలు ఎందుకు చెపుతున్నాడు?

ప్రభువులో వారి ప్రయాస వ్యర్ధం కాదని వారికి తెలుసు కనుక దీనిని చెయ్యమని చెపుతున్నాడు[15:58].


Chapter 16

Translation Questions

1 Corinthians 16:1

పరిశుద్ధుల కొరకైన చందా విషయం కొరింతు సంఘం చేసినట్టు పౌలు ఎవరికి నియమించాడు?

కొరింతు సంఘం చేసినట్టు పౌలు గలతియలోని సంఘాలకు పౌలు నియమించాడు[16:1].

వారు చందాను ఏవిధంగా పోగుచేయాలని పౌలు కొరింతులోని సంఘానికి చెప్పాడు ?

ప్రతి ఆదివారంన వారిలో ప్రతివాడును తాను వర్ధిల్లన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువచేయాలని పౌలు చెప్పాడు తద్వారా పౌలు వారి వద్దకు వెళ్ళినపుడు చందా పోగుచేయ్యడం ఉండదు[16:2].

1 Corinthians 16:3

చందా ఎవరికీ వెళ్తున్నది?

యెరూషలేంలోని పరిశుద్ధులకు ఇది వెళ్తున్నది[16:1,3].

1 Corinthians 16:5

కొరింతులోని సంఘానికి పౌలు ఎప్పడు వస్తున్నాడు?

మాసిదోనియా నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు తాను వారి దగ్గరకు వస్తానని పౌలు చెప్పాడు[6:5].

పౌలు కొరింతులోని విశ్వాసులను వెంటనే చూడడానికి కొద్దికాలం ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదు?

వారివద్ద ఎక్కువకాలం ఉండడానికి వారిని దర్శించాలని పౌలు తలంచాడు, వీలయితే శీతాకాలం వారితో ఉండాలని పౌలు తలంచాడు[16:6-7].

1 Corinthians 16:7

పెంతెకోస్తు వరకు ఎఫెసులో పౌలు ఎందుకు ఉండబోతున్నాడు?

పౌలుకు ఎఫెసులో ఫలవంతమైన సేవ చెయ్యడానికి అవకాశం కలిగింది, అక్కడ ఎదిరించువారు అనేకులు ఉన్నారు[16:8-9].

1 Corinthians 16:10

తిమోతి ఏమి చేస్తున్నాడు?

పౌలు చేయుచున్నట్టుగానే ప్రభువు పని చేస్తున్నాడు[16:10]

తిమోతి విషయం పౌలు కొరింతులోని సంఘానికి ఏమి ఆజ్ఞాపించాడు?

అతడు వారివద్ద నిర్భయుడిగా ఉండేలా చూసుకొమ్మని పౌలు కొరింతు సంఘానికి చెప్పాడు. అతనిని తృణీకరించవద్దని, సమాధానంతో సాగనంపాలని పౌలు వారికి చెప్పాడు[16:10-11].

అపోల్లోను ఏమి చెయ్యమని పౌలు బలంగా ప్రోత్సహించాడు?

కొరింతులోని పరిశుద్ధులను దర్శించమని అపోల్లోను పౌలు బలంగా ప్రోత్సహించాడు[16:12].

1 Corinthians 16:15

కొరింతులో పరిశుద్ధులకు సేవ చెయ్యడానికి తమ్మునుతాము అప్పగించుకొన్నదెవరు?

స్తెఫను ఇంటివారు పరిశుద్ధులకు సేవ చెయ్యడానికి తమ్మునుతాము అప్పగించుకొన్నారు[16:15].

స్తెఫను ఇంటివారి విషయం కొరింతులోని పరిశుద్ధులు ఏమిచెయ్యాలని పౌలు చెప్పాడు?

అటువంటి వారికి లోబడి ఉండాలని పౌలు వారికి చెప్పాడు[16:16].

1 Corinthians 16:17

స్తెఫను, ఫొర్మునాతు, అకాయిలు పౌలుకు ఏమిచేసారు?

కొరింతు వారు లేని కొరతను తీర్చి పౌలు ఆత్మకు సుఖాన్ని కలుగచేసారు[16:17-18].

1 Corinthians 16:19

కొరింతులోని సంఘానికి ఎవరు శుభములు చెప్పారు?

ఆసియాలోని సంఘాలు, ఆకుల, ప్రిస్కిల్ల, సహోదరులు, సోదరీలందరూ కొరింతులోని సంఘానికి శుభములు చెప్పారు[16:19-20].

1 Corinthians 16:21

ప్రభువును ప్రేమించని వారి విషయం పౌలు ఏమిచెప్పాడు?

ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శపించబడతాడు గాక." అని పౌలు చెప్పాడు[16:22].


Chapter 1

Translation Questions

2 Corinthians 1:1

ఈ పత్రిక ఎవరు రాశారు?

పౌలు, తిమోతి పత్రిక రాశారు[1:1].

ఎవరికోసం ఈ పత్రిక రాయడం జరిగింది?

కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, ఆకయ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికి ఈ పత్రిక రాయడం జరిగింది[1:1].

2 Corinthians 1:3

పౌలు దేవుని ఏవిధంగా వివరిస్తున్నాడు?

దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి, కరుణామయుడైన తండ్రి, అన్ని విధాల ఆదరణను అనుగ్రహించే తండ్రి గా పౌలు వివరిస్తున్నాడు[1:3].

ఎందుకు దేవుడు మన కష్టాలలో మనలను ఆదరిస్తాడు?

దేవుడు ఏ ఆదరణతో మమ్మును ఆదరించుచున్నాడో అలాంటి ఆదరణతో ఎలాంటి కష్టాలలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారమవుటకు ఆయన మా కస్టాలన్నిటిలో మమ్మును ఆదరించుచున్నాడు [1:4].

2 Corinthians 1:8

పౌలు, అతని సహచరులును ఆసియాలో ఎలాంటి కష్టాలు పొందారు?

వారి బలానికి మించిన విపరీతమైన ఒత్తిడి వారి మీదికి వచ్చింది. వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు[1:8-9].

పౌలు అతని సహచరుల మీద మరణం విధించినట్టు అనిపించడానికి కారణం ఏమిటి?

తమ మీద కాక దేవుని మీద నమ్మకం ఉంచేలా వారికి మరణం విధించినట్టు అనిపించింది[1:9].

2 Corinthians 1:11

కొరింతు సంఘం తమకు ఏ విధంగా సాయపడిందని పౌలు చెపుతున్నాడు?

కొరింతు సంఘం వారి ప్రార్ధనల ద్వారా తమకు సాయం చేసిందని పౌలు చెప్పాడు[1:11].

2 Corinthians 1:12

పౌలు, అతని సహచరులు ఏ విషయం అతిశయపడ్డారని పౌలు చెప్పాడు?

వారు ఈ లోక జ్ఞానాన్ని అనుసరించకుండ, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత, నిజాయితితో దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొన్నారని, ప్రత్యేకించి కొరింతు సంఘం విషయంలో నడచుకున్నారని వారి మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అతిశయపడుతున్నారు[1:12].

ప్రభువైన యేసు దినమందు ఏమి జరుగబోతున్నదని పౌలు స్థిరంగా ఉన్నాడు?

ఆ రోజున కొరింతు పరిశుద్ధులు అతిశయానికి కారణమౌతారని పౌలు, అతని అనుచరులు స్థిరంగా ఉన్నారు[1:14].

2 Corinthians 1:15

కొరింతు పరిశుద్దులను ఎన్ని సార్లు దర్శించాలని పౌలు సిద్ధపడ్డాడు?

పౌలు వారిని దర్శించాలని రెండు సార్లు సిద్ధపడ్డాడు[1:15].

2 Corinthians 1:21

క్రీస్తు మన హృదయాలలో ఆత్మను ఇవ్వడానికి ఒక కారణం ఏమిటి?

ఆయన మనకు ఇవ్వబోతున్న దానికి హామీగా మన హృదయంలో తన ఆత్మను అనుగ్రహించాడు[1:22].

2 Corinthians 1:23

ఎందుకు పౌలు కొరింతుకు రాలేదు?

వారిని నొప్పించడం ఎందుకని పౌలు కొరింతుకు రాలేదు[1:23].

పౌలు, తిమోతిను కొరింతు సంఘం విషయం తాము ఎలా ఉన్నాము అని పౌలు చెపుతున్నాడు?

వారి విశ్వాసం మీద పెత్తనం చెయ్యడం లేదని పౌలు చెపుతున్నాడు, అయితే వారి ఆనందం కోసం కొరింతు సంఘంతో కలసి పనిచేస్తున్నట్లు పౌలు వారికి చెప్పాడు[1:24].


Chapter 2

Translation Questions

2 Corinthians 2:1

కొరింతు సంఘం వద్దకు రాకుండా ఉండడం ద్వారా పౌలు ఎలాంటి పరిస్థితులను తప్పించాలని చూస్తున్నాడు?

బాధాకరమైన పరిస్థితులనుండి తప్పించుకోవడానికి పౌలు కొరింతు సంఘానికి రాకుండా అగుతున్నాడు[2:1].

2 Corinthians 2:3

పౌలు కొరింతు సంఘానికి తన ముందు ఉత్తరంలో రాసినట్టు ఎందుకు రాశాడు?

పౌలు వారి వద్దకు వచ్చినపుడు తనకు సంతోషాన్ని కలిగించవలసిన వారు విచారాన్ని కలిగించకూడదని ముందు అలా రాశాడు[2:3].

పౌలు కొరింతు సంఘానికి ముందు రాసినపుడు అతని మనసు స్థితి ఎలా ఉంది?

పౌలు ఎంతో బాధతో, హృదయవేదనతో ఉన్నాడు[2:4].

కొరింతు సంఘానికి పౌలు ఈ ఉత్తరం ఎందుకు రాశాడు?

కొరింతు వారిపట్ల పౌలుకున్న అత్యధిక ప్రేమ వారు తెలుసుకోవాలని వారికి రాశాడు[2:4].

2 Corinthians 2:5

వారు శిక్షించిన వాని పట్ల కొరింతు విశ్వాసులు ఇప్పుడు ఏమి చేయాలని పౌలు చెప్పాడు?

వారు అతనిని క్షమించి ఆదరించాలని పౌలు చెప్పాడు[2:6-7].

వారు శిక్షించిన వానిని క్షమించి అతనిని ఆదరించాలని పౌలు కొరింతు పరిశుద్ధులకు ఎందుకు చెప్పాడు?

వారు శిక్షించినవాడు అత్యధిక విచారంలో మునిగి పోతాడేమో అని పౌలు అలా చెప్పాడు[2:7].

2 Corinthians 2:8

కొరింతు సంఘానికి రాయడానికి మరొక కారణం ఏమిటి?

వారిని పరీక్షించడానికి, వారు అన్నింటిలో విధేయత కలిగి ఉంటారో లేదో అని తెలుసుకోడానికి పౌలు రాశాడు[2:9].

2 Corinthians 2:10

వారు ఎవరిని క్షమిస్తారో వారు క్రీస్తు సన్నిధిలో వారిని పౌలు కూడా క్షమిస్తాడని కొరింతు సంఘం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

సాతాను వారిని ఏమాత్రం మోసపరచకూడదని పౌలు చెప్పాడు[2:11].

2 Corinthians 2:12

పౌలు త్రోయకు వెళ్ళినపుడు తనకు ఎందుకు మనసులో నెమ్మది లేదు?

త్రోయలో తన సోదరుడైన తీతు కనబడలేదు కనుక పౌలుకు మనసు నెమ్మది లేదు[2:13].

2 Corinthians 2:14

పౌలు అతని అనుచరుల ద్వారా దేవుడు ఏమి చేసాడు?

పౌలు అతని అనుచరుల ద్వారా దేవుడు ప్రతిచోట క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచాడు[2:14-15].

2 Corinthians 2:16

పౌలు, అతని సహచరులు దేవుని వాక్యం వల్ల అక్రమలాభం సంపాదించే వారికి భిన్నమైనవారు అని ఎలా చెప్పాడు?

పౌలు, అతని సహచరులు దేవునినుండి వచ్చినవారు, పవిత్రమైన ఉద్దేశాలతో, దేవుని ఎదుటే క్రీస్తులో మాట్లాడేవారు[2:17].


Chapter 3

Translation Questions

2 Corinthians 3:1

ఎటువంటి సిఫారసు లేఖలు పౌలు, అతని సహచరుల వద్ద ఉన్నాయి?

మనుషులందరూ గుర్తించి చదవగలిగే కొరింతు పరిశుద్దులే వారి సిఫారసు లేఖ[3:2].

2 Corinthians 3:4

పౌలుకు అతని సహచరులకు క్రీస్తు ద్వారా దేవునిలో నమ్మకం ఏమిటి?

వారి సొంత సామర్ధ్యం మీద వారికి నమ్మకం లేదు కాని దేవుడు అనుగ్రహించిన సామర్ధ్యం మీద వారి నమ్మకం ఉంది[3:4-5].

దేవుడు పౌలు, అతని సహచరులను యోగ్యులుగా చేసిన నూతన నిబంధనకు ఆధారమేమిటి?

మనుష్యులను చంపు అక్షరం కాక జీవమునిచ్చు ఆత్మమీద నూత నిబంధన ఆధారపడింది[3:6].

2 Corinthians 3:7

ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని సూటిగా ఎందుకు చూడలేక పోయారు?

మోషే ముఖంమీద కనిపించిన మహిమా ప్రకాశం తగ్గిపోయేదైనా వారు చూడలేక పోయారు[3:7].

2 Corinthians 3:9

తగ్గిపోతున్న, శిక్షా విధికి కారణమైన పరిచర్య, లేక ఆత్మకు నీతికి కారణమైన నిత్యం నిలిచే పరిచర్య - దేనికి ఎక్కువ మహిమ ఉంది?

ఆత్మ సంబధమైన పరిచర్య ఎంతో మహిమ గలది. నీతికి కారణమైన పరిచర్య ఎంతో అత్యధిక మహిమ కలది. శాశ్వతమైన దానికి ఎక్కువ మహిమ ఉంది [3:8-11].

2 Corinthians 3:14

మోషే పాత నిబంధన చదివినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకు నేటి వరకు ఉన్న సమస్య ఏమిటి?

నేటి వరకూ మోషే గ్రంథాన్నిచదివినప్పుడల్లా వారి హృదయాలకు ముసుకు ఉంది[3:15].

ఇశ్రాయేలు హృదయాలు ఎలా తెరచుకుంటాయి, వారి ముసుకు ఎలా తొలగిపోతుంది?

ఇశ్రాయేలు ప్రజలు ప్రభువువైపు తిరిగినప్పుడు మాత్రమే వారి హృదయాలు తెరచుకుంటాయి, వారి ముసుకు తొలగిపోతుంది [3:14,16].

2 Corinthians 3:17

ప్రభువ్హు ఆత్మతో ఉన్నదేంటి?

ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది[3:17].

ప్రభువు మహిమను చూచువారందరూ దేనిలోనికి మారుతూ ఉన్నారు?

వారు మహిమనుండి అధిక మహిమలోనికి ప్రభువైన ఆత్మ చేత ఆ ప్రభువు పోలికగా మారుతూ ఉన్నారు[3:18].


Chapter 4

Translation Questions

2 Corinthians 4:1

పౌలు, అతని సహచరులు ఎందుకు నిరుత్సాహపడరు?

వారు కలిగిఉన్న సేవను బట్టి, వారు పొందిన కరుణను బట్టి వారు నిరుత్సాహ పడరు[4:1].

పౌలు, అతని సహచరులు ఏయే విధానాలను విడిచిపెట్టారు?

అవమానకరమైన రహస్య విషయాలను విసర్జించారు. కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్కును వంచనగా బోధించలేదు[4:2].

పౌలు,, పౌలులాంటి వారును దేవుని సన్నిధిలో ప్రతివాని మనస్సాక్షి యెదుట తమ్మును తాము ఏవిధంగా సిఫారసు చేసుకుంటున్నారు?

సత్యాన్ని వెల్లడి చేస్తూ ఇలా చేస్తున్నారు[4:2].

2 Corinthians 4:3

ఎవరు సువార్త వెలుగును చూడలేకపోతున్నారు?

నశిస్తున్నవారు సువార్త వెలుగును చూడలేక పోతున్నారు[4:3].

నశిస్తున్నవారు సువార్త వెలుగును ఎందుకు చూడలేక పోతున్నారు?

ఈ యుగదేవుడు విశ్వాసం లేని వారి మనసులకు గుడ్డితనం కలిగించాడు కనుక నశిస్తున్నవారు సువార్త వెలుగును చూడలేక పోతున్నారు[4:4].

2 Corinthians 4:5

పౌలు, అతని సహచరులు యేసును గురించి తమను గురించి ఏమి ప్రచురిస్తున్నారు?

క్రీస్తు యేసు ప్రభువని, తాము యేసు కోసం కొరింతు సంఘానికి సేవకులమని ప్రచురిస్తున్నారు[4:5].

2 Corinthians 4:7

పౌలు, అతని సహచరుల ఐశ్వర్యం మట్టి పాత్రలలో ఎందుకుంది?

అత్యధిక బలప్రభావం వారిది కాదు, అది దేవునిదే అని వెల్లడి అయ్యేలా వారి ఐశ్వర్యం మట్టి పాత్రలలో ఉంది[4:7].

పౌలు, అతని సహచరులు యేసు మరణాన్ని తమ శరీరాలలో ఎందుకు భరిస్తూ ఉన్నారు?

యేసు జీవం వారి శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణాన్ని తమ శరీరాలలో భరిస్తూ ఉన్నారు[4:10].

2 Corinthians 4:13

ప్రభువైన యేసును లేపినవాడు ఎవరిని లేపి తన సన్నిధిలో ఎవరిని నిలబెడతాడు?

ప్రభువైన యేసును లేపినవాడు తన సన్నిధిలో పౌలు, అతని సహచరులను, కొరింతు పరిశుద్ధులను తన ఎదుట నిలువబెట్టుకొంటాడు[4:14].

దేవుని కృప అనేకులకు వ్యాపిస్తూ ఉన్న ఫలితం ఏమిటి?

దేవుని కృప అనేకులకు వ్యాపిస్తూ ఉండగా ఆయన మహిమకు కృతజ్ఞతలు సమృద్ధిగా కలుగుతాయి[4:15].

2 Corinthians 4:16

పౌలు, అతని సహచరులును నిరుత్సాహపడటానికి కారణాలు ఎందుకు ఉన్నాయి?

వారు నిరుత్సాహపడటానికి కారణం ఉంది, ఎందుకంటే వారు శారీరకంగా క్షీణించి పోతున్నారు[4:16].

పౌలు, అతని సహచరులును ఎందుకు నిరుత్సాహపడరు?

వారు అధైర్యపడరు ఎందుకంటే అంతరంగ పురుషుడు దినదినం నూతనమౌతున్నాడు. క్షణికమైన, చులకనైన బాధలు వాటికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమ భావాన్ని కలిగిస్తున్నాయి. చివరిగా వారు నిత్యమూ ఉండే కనిపించని వాటినే గమనిస్తున్నారు[4:16-18].


Chapter 5

Translation Questions

2 Corinthians 5:1

భూమి మీద మన నివాసమైన గుడారం నాశనమైతే ఇంకా మనకు ఏమి ఉంటుందని పౌలు చెప్పాడు?

చేతులతో చేసినది కాని దేవుడు నిర్మించే శాశ్వత కట్టడం పరలోకంలో మనకుంటుందని పౌలు చెప్పాడు[5:1].

2 Corinthians 5:4

మనం ఈ "గుడారం"లో ఉన్నప్పుడు ఎందుకు మూలుగుతాం అని పౌలు చెప్పాడు?

మనం ఈ "గుడారం"లో ఉన్నప్పుడు, మనం భారంతో ఉంటాం, వస్త్రాలు ధరించుకోవాలని కోరుకుంటాం, తద్వారా చావుకు లోనయ్యేది జీవంలో మింగివేయబడుతుంది కనుక పౌలు ఇలా చెప్పాడు[5:4].

రాబోతున్నదానికి హామీగా దేవుడు మనకేం ఇచ్చాడు?

రాబోతున్నదానికి హామీగా దేవుడు మనకు తన ఆత్మను ఇచ్చాడు?[5:5].

2 Corinthians 5:6

శరీరంలో ఉండడం, ప్రభువుతో ఆయన నివాసంలో ఉండడంలో దేనిని పౌలు ఇష్టపడుతున్నాడు?

"శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో ఆయన నివాసంలో ఉండడమే మాకు ఇష్టం" అని పౌలు చెప్పాడు[5:8].

2 Corinthians 5:9

పౌలు లక్ష్యం ఏమిటి?

ప్రభువును సంతోషపెట్టడమే పౌలు లక్ష్యం[5:9].

ప్రభువును సంతోషపెట్టడమే పౌలు తన లక్ష్యంగా ఎందుకు చేసుకున్నాడు?

మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా కనపడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో చేసిన క్రియలకు - అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే - తగిన ప్రతిఫలం పొందాలి కనుక పౌలు ప్రభువును సంతోషపెట్టడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు [5:10].

2 Corinthians 5:11

పౌలు, అతని సహచరులు ప్రజలను ఎందుకు ఒప్పిస్తున్నారు?

వారికి ప్రభువు పట్ల భయభక్తులంటే ఏమిటో తెలుసు కనుక వారు ప్రజలను ఒప్పిస్తున్నారు [5:11].

వారి యోగ్యతలను మరల కొరింతు పరిశుద్దుల ఎదుట పెట్టడం లేదని పౌలు ఎందుకు చెపుతున్నాడు?

హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే గర్వపడే వారికి కొరింతు పరిశుద్ధులు జవాబు చెప్పగలిగేలా వారి విషయంలో కొరింతు వారికి అతిశయ కారణం కలిగిస్తున్నారు[5:12].

2 Corinthians 5:13

క్రీస్తు అందరికోసమూ చనిపోయాడు గనుక జీవించే వారు ఏమి చేయాలి?

జీవించు వారు తమ కోసం బ్రతకకుండా చనిపోయి మళ్ళీ సజీవంగా లేచిన వాని కోసం జీవించాలి[5:15].

2 Corinthians 5:16

మానవ ప్రమాణాల ప్రకారం మనమిక మీదట ఎందుకు తీర్పు తీర్చం?

ఎందుకంటే క్రీస్తు అందరికోసం చనిపోయాడు, మనమికమీదట మనకోసం జీవించం, క్రీస్తు కొరకే జీవిస్తాం[5:15-16].

క్రీస్తునందున్న వానికి ఏమి జరుగుతుంది?

అతడు నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇదిగో క్రొత్తవి వచ్చాయి[5:17].

2 Corinthians 5:18

దేవుడు క్రీస్తునందు మనుష్యులను తనతో సఖ్యపరచుకొన్నప్పుడు వారికోసం ఏమి చేస్తున్నాడు?

దేవుడు వారిమీద వారి అపరాధాలు మోపకుండా ఉన్నాడు, వారికి సఖ్యపరచే సందేశాన్ని అప్పగించాడు[5:19].

2 Corinthians 5:20

క్రీస్తు కోసం నియమితులైన రాయబారులుగా కొరింతు వారికి పౌలు, అతని సహచరుల యొక్క విన్నపం ఏమిటి?

క్రీస్తు నిమిత్తం దేవునితో సఖ్యపడాలని కొరింతు వారికి చేస్తున్నవారి విన్నపం[5:20].

దేవుడు క్రీస్తును ఎందుకు మన పాపానికి బలిగా చేసాడు?

క్రీస్తులో మనం దేవుని నీతి అయ్యేలా దేవుడు దీనిని చేశాడు[5:21].


Chapter 6

Translation Questions

2 Corinthians 6:1

పౌలు, అతని సహచరులు కొరింతు వారిని ఏమి చెయ్యవద్దని వేడుకొంటున్నారు?

వారు పొందిన కృపను వ్యర్ధం చెయ్యవద్దని కొరింతు వారిని వేడుకొంటున్నారు[6:1].

ఏది అనుకూల సమయం? ఏది రక్షణ దినం?

ఇదే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినం[6:2].

పౌలు, అతని సహచరులు ఎందుకు ఎవరి ఎదుట అడ్డంకులు పెట్టలేదు?

వారి సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఎవరి ఎదుటను అభ్యంతరాలు పెట్టారు[6:3].

2 Corinthians 6:4

పౌలు, అతని సహచరుల క్రియలు దేనిని రుజువు చేస్తున్నాయి?

వారు దేవుని సేవకులని వారి క్రియలు రుజువు చేస్తున్నాయి[6:4].

పౌలు, అతని సహచరులు సహించుకొన్నకొన్ని విషయాలేంటి?

వారు బాధలను, కష్టాలను, ఇరుకు పరిస్థితులను, దెబ్బలను, చెరసాలను, అల్లరులను, శ్రమను, జాగరణలను, ఆకలిని సహించుకొన్నారు[6:4-5].

2 Corinthians 6:8

పౌలు, అతని సహచరులు నమ్మకంగా ఉన్నప్పటికీ వారు దేని విషయం నిందకు గురయ్యారు?

వారు వంచకులు అనే నిందకు గురయ్యారు[6:8].

2 Corinthians 6:11

కొరింతు వారితో పౌలు ఎలాంటి ప్రతిఫలం కోరుతున్నాడు?

కొరింతు వారిపట్ల తమ హృదయాలు తెరచి యున్నాయి, దానికి ప్రతిఫలంగా కొరింతు వారి హృదయాలు పౌలు పట్లను అతని సహచరుల పట్లను తెరిచి యుంచాలని పౌలు వారిని కోరాడు[6:11,13].

2 Corinthians 6:14

కొరింతు విశ్వాసులు అవిశ్వాసులతో ఎందుకు జతగా ఉండకూడదో పౌలు ఇస్తున్న కారణాలు ఏమిటి?

పౌలు ఈ క్రింది కారణాలను చెపుతున్నాడు: న్యాయానికి అన్యాయానికి వంతు ఏమిటి? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? క్రీస్తుకు బెలియాలు తో సమ్మతి ఏమిటి? నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తితో భాగమేమిటి? దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి?[6:14-16].

2 Corinthians 6:17

"వారిమధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేక పరచుకొని, అపవిత్రమైన దానిని ముట్టని..." వానికి ప్రభువు ఏమి చేస్తానని చెప్పాడు?

వారిని స్వాగతిస్తానని ప్రభువు చెప్పాడు. ఆయన వారికి తండ్రిగా ఉంటాడు, వారు ఆయనకు కుమారులు కుమార్తెలునై ఉంటారు[6:17-18].


Chapter 7

Translation Questions

2 Corinthians 7:1

దేని విషయంలో మనలను మనం పవిత్ర పరచుకోవాలని పౌలు చెపుతున్నాడు?

శరీరానికి, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్ర పరచుకోవాలి[7:1].

2 Corinthians 7:2

కొరింతు పరిశుద్ధులు తన కోసం తన సహచరుల కోసం ఏమి చెయ్యాలని పౌలు కోరాడు?

"మీ హృదయములలో చేర్చుకొనుడి" అని పౌలు వారిని కోరాడు[7:2].

కొరింతు పరిశుద్ధుల పట్ల పౌలు ఎలాంటి ప్రోత్సాహపు మాటలు చెప్పాడు?

కొరింతు వారు తన హృదయంలోను, తన సహచరుల హృదయంలోను ఉన్నారని పౌలు చెప్పాడు, తామంతా కలసి చనిపోవాలి, కలిసి జీవించాలి. వారియందు గొప్ప నమ్మకం ఉన్నదని, వారిని బట్టి అతిశయపడుతున్నానని పౌలు చెప్పాడు[7:3-4].

2 Corinthians 7:5

పౌలు, అతని సహచరులు మాసిదోనియకు వచ్చినపుడు, ఎటువెళ్ళినా శ్రమలు పొందినపుడు - వెలుపట పోరాటాలు, లోపల భయాలు కలిగినపుడు దేవుడు ఇచ్చిన ఆదరణ ఏమిటి?

తీతు రాకను బట్టి దేవుడు వారిని ఆదరించాడు, కొరింతు పరిశుద్ధుల నుండి తీతు పొందిన ఆదరణను గురించిన మాట చేత, పౌలు కోసం కొరింతు వారి లోతైన ఆసక్తి, వారి శ్రద్ధ, వారి గొప్ప హృదయాభిలాష చేత దేవుడు వారిని ఆదరించాడు[7:6-7].

2 Corinthians 7:8

పౌలు రాసిన ముందు లేఖ కొరింతు పరిశుద్ధులలో ఏమి కలుగజేసింది?

పౌలు రాసిన ముందు లేఖ కొరింతు పరిశుద్ధులను దుఃఖపెట్టింది ఇది పౌలు రాసిన ముందు లేఖకు దైవసంబంధ స్పందన[7:8-9].

2 Corinthians 7:11

కొరింతు పరిశుద్ధులలో దైవసంబంధమైన విచారం దేనిని తీసుకొని వచ్చింది?

దైవసంబంధమైన విచారం వారిలో మారుమనస్సును తీసుకొనివచ్చింది, వారు నిర్దోషులని రుజువు పరచుకొనే గొప్ప సమర్పణను తీసుకొని వచ్చింది [7:9,11].

తన మొదటి లేఖను ఎందుకు రాశాడని పౌలు చెప్పాడు?

పౌలు కోసం, అతని సహచారుల కొరకు కొరింతు పరిశుద్ధులకున్న శ్రద్ధ దేవుని యెదుట కొరింతు పరిశుద్ధులకు స్పష్టం కావాలని రాశానని పౌలు చెప్పాడు[7:12].

2 Corinthians 7:13

తీతు ఎందుకు సంతోషంగా ఉన్నాడు?

కొరింతు పరిశుద్ధుల వల్ల తీతుకు ఊరట కలిగింది[7:13].

2 Corinthians 7:15

కొరింతు పరిశుద్ధుల కోసం తీతు వాత్సల్యం ఎందుకు అధికమౌతుంది?

కొరింతు పరిశుద్ధులు భయందోళనతో స్వీకరించి విధేయత చూపిన సంగతి తీతు జ్ఞాపకం చేసుకొన్నప్పుడెల్ల వారి పట్ల తీతు వాత్సల్యం అధికమౌతుంది[7:15].


Chapter 8

Translation Questions

2 Corinthians 8:1

కొరింతు సోదరులు, సోదరీలు తెలుసుకోవాలని పౌలు కోరినదేంటి?

మాసిదోనియ వారికి దేవుడు అనుగ్రహించిన కృపను తెలుసుకోవాలని పౌలు వారిని కోరాడు[8:1].

2 Corinthians 8:3

మాసిదోనియలోని సంఘాలు అతి దరిద్రంలో ఉన్నప్పటికీ తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఏమి చేసారు?

వారు తమ ఆనంద సమృద్దిలోనుండి అధికమైన ఔదార్యంతో తమంతట తామే ఇవ్వగలిగినదంతా పరిశుద్ధుల పరిచర్యకు ఇచ్చారు[8:2-4].

2 Corinthians 8:6

తీతును ఏమి చెయ్యమని పౌలు వేడుకొన్నాడు?

కొరింతు పరిశుద్ధులలో తాను ఆరంభించిన ఉపకార క్రియను ముగించమని పౌలు తీతును వేడుకున్నాడు[8:6].

2 Corinthians 8:8

"ఈ ఉపకార క్రియలో కూడా అభివృద్ధి పొందేలా చూసుకోండి" అని పౌలు కొరింతు పరిశుద్ధులకి చెప్పాడు?

ఇతరుల శ్రద్ధాసక్తులతో సరిపోల్చుతూ వారి ప్రేమ భావం ఎంత వాస్తమైనదో రుజువు చెయ్యడానికి పౌలు ఇది చెప్పాడు[8:7-8].

2 Corinthians 8:10

దేనిని గురించి పౌలు మంచిది, అంగీకారమైనదని చెపుతున్నాడు?

పరిచర్య చెయ్యడంలో సిద్ధమైన మనస్సు మంచిది, అంగీకారమైనదని పౌలు చెపుతున్నాడు[8:12].

2 Corinthians 8:13

ఇతరులకు ఊరట కలిగించేలా కొరింతు పరిశుద్ధులకు భారమని అనిపించినా ఈ కార్యాన్ని పౌలు చెయ్యమని కోరాడా?

లేదు. ప్రస్తుతం వారికున్న సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి కొరింతు వారికి సహాయకరంగా ఉండాలని పౌలు భావన[8:13-14].

2 Corinthians 8:16

కొరింతు పరిశుద్దుల పట్ల పౌలుకున్న శ్రద్ధాసక్తులు దేవుడు తీతు హృదయంలో ఉంచిన తరువాత తీతు ఏమిచేశాడు?

పౌలు విన్నపాన్ని తీతు అంగీకరించాడు, వారి పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి తనకు తానే వారి వద్దకు వెళ్ళాడు[8:16-17].

2 Corinthians 8:18

వారు పోగు చేస్తున్నచందా విషయం ఎవరూ తప్పు పట్టే అవకాశంను తప్పించడానికి పౌలు అతని సహచరులు ఏమి చేసారు?

తీతును మాత్రమే కాక శుభవార్త సేవలో ప్రసిద్ధి గాంచిన మరొక సోదరుడిని పౌలు అతని సహచరులు పంపారు. ఈ సోదరుడు, పరీక్షించిన మరొక సోదరుడు ఈ సహాయాన్ని అందివ్వడానికి పంపడం జరిగింది[8:18-22].

2 Corinthians 8:22

ఇతర సంఘాలు పంపిన సోదరుల విషయం ఏమి చెయ్యాలని కొరింతు పరిశుద్ధులకు పౌలు చెప్పాడు?

సంఘాల ఎదుట బహింరంగంగా వారికి ప్రేమ చూపించాలని, తమపట్ల పౌలుకున్న అతిశయ కారణాన్ని రుజువు చేయాలని పౌలు కొరింతు సంఘానికి చెప్పాడు[8:24].


Chapter 9

Translation Questions

2 Corinthians 9:1

దేని విషయం కొరింతు పరిశుద్ధులకు రాయనవసరం లేదు అని పౌలు చెపుతున్నాడు?

పరిశుద్ధుల కోసం పరిచర్య గురించి వారికి రాయనవసరం లేదని పౌలు చెపుతున్నాడు[9:1].

2 Corinthians 9:3

ఎందుకు పౌలు సోదరులను కొరింతుకు పంపాడు?

కొరింతు పరిశుద్ధుల గురించి తనకున్న అతిశయం వ్యర్ధం కాకూడదని, తాను చెప్పినట్టే వారు సిద్ధంగా ఉండాలని పౌలు సోదరులను పంపాడు[9:3].

సోదరులను ముందుగా పంపి కొరింతువారు వాగ్దానం చేసిన చందా విషయం ఏర్పాట్లు చెయ్యడం ఎందుకు ప్రాముఖ్యం అని పౌలు తలంచాడు?

ఒకవేళ మాసిదోనియ వారిలో ఎవరైనా పౌలుతో వచ్చి కొరింతువారు సిద్ధంగా లేకపోవడం చూసి వారిపట్ల పౌలుకున్న నమ్మకంవల్ల పౌలుకు అతని సహచరులకు సిగ్గుకలుగుతుందని సోదరులను ముందుగా పంపడం అవసరమని తలంచాడు.[9:4-5].

2 Corinthians 9:6

వారి దాతృత్వంలో ఉన్న ప్రధాన అంశం ఏమిటి అని పౌలు చెపుతున్నాడు?

"కొద్దిగా వెదజల్లే వాడు కొద్ది పంటను కోస్తాడు, విస్తారంగా చల్లేవాడు విస్తార పంటను కోస్తాడు" అని పౌలు తన ముఖ్య అంశం చెప్పాడు[9:6].

ప్రతి ఒక్కరు ఏవిధంగా ఇవ్వాలి?

ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి[9:7].

2 Corinthians 9:10

వెదజల్లే వానికి విత్తనాలు, తినడానికి ఆహారం దయచేసే వాడు కొరింతు పరిశుద్దుల కోసం ఏమి చెయ్య బోతున్నాడు?

అయన చల్లడానికి విత్తనాలు ఇచ్చి వృద్ధి చేసి, వారి నీతి అనే పంట కోతను పెంపొందించే వాడు. వారు అన్ని విషయాల్లో వర్థిల్లుతారు గనుక, వారు ఉదార భావంతో ఉండవచ్చు. [9:10-11].

2 Corinthians 9:12

కొరింతు పరిశుద్ధులు దేవుని ఎలా మహిమ పరచారు?

వారు ఒప్పుకొన్న క్రీస్తు సువార్తకు విధేయత చూపించడం, వారు ఉదారంగా ఇచ్చిన చందాను బట్టి వారు దేవుని మహిమ పరచారు[9:13].

పరిశుద్ధులు కొరింతు పరిశుద్ధుల కోసం ప్రార్ధిస్తూ వారిని చూడాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు?

దేవుడు వారి పట్ల చూపిన అత్యధిక కృపను బట్టి వారిని చూడాలని ఎక్కువ కోరిక కలవారై ఉన్నారు[9:14].


Chapter 10

Translation Questions

2 Corinthians 10:1

దేని విషయం పౌలు కొరింతు పరిశుద్ధులను వేడుకొంటున్నాడు?

తాను కొరింతు వారితో ఉన్నప్పుడు తాను ధైర్యశాలిగా ఉండకుండా వ్యవహరించాలని వారిని వేడుకొంటున్నాను[10:1].

ఏ సందర్భం కోసం పౌలు ధైర్యంగా ఉండాలని తలంచాడు?

పౌలు,, అతని సహచరులు శరీరానుసారంగా బ్రతుకుతున్నారని అనుకుంటున్నవారిపట్ల ధైర్యంగా వ్యవహరించాలని పౌలు తలంపు[10:2].

2 Corinthians 10:3

పౌలు, అతని సహచరులు యుద్ధం చేయాల్సివచ్చినపుడు వారు ఎలాంటి యుద్దోపకరణాలను ఉపయోగించరు?

పౌలు, అతని సహచరులు యుద్ధం చేయాల్సినపుడు వారు శరీరసంబంధమైన యుద్దోపకరణాలను ఉపయోగించరు[10:4].

2 Corinthians 10:5

పౌలు ఉపయోగించే యుద్దోపకరణాలు ఏమి చెయ్యడానికి శక్తిగలవి?

కోటలను పడగొట్టడానికి దేవుని ద్వారా బలప్రభావాలు గలవి - తప్పుదారి పట్టించేవాటిని వ్యర్థపరిచేవి. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఉన్నతమైన ప్రతి దానిని పడద్రోయగలిగినవి[10:4-5].

2 Corinthians 10:7

దేవుడు పౌలుకి అతని సహచరులకి ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు?

కొరింతు పరిశుద్ధుల అభివృద్ధి కోసం దేవుడు పౌలుకు అతని అనుచరులకు అధికారాన్ని ఇచ్చాడు[10:8].

2 Corinthians 10:9

పౌలు గురించి అతని లేఖల గురించి కొందరు ఏమనుకుంటున్నారు?

అతడి ఉత్తరాలు గంభీరమైనవి, తీవ్రమైనవి గాని అతడు శరీరరీత్యా దుర్భలుడు, అతడి ప్రసంగాలు కొరగానివి అనుకుంటున్నారు[10:10].

2 Corinthians 10:11

తన ఉత్తరాలు చెప్పేదానికి తాను భిన్నంగా కనిపిస్తాడని తలంచే వారికి పౌలు ఏమి చెప్పాడు?

పౌలు కొరింతుపరిశుద్ధులతో లేనప్పుడు ఉత్తరాలలో రాసిన మాటల ప్రకారం ఎలాంటివాడిగా ఉన్నాడో వారితో ఉన్నప్పుడు అలాంటి వాడుగానే ఉన్నాడని చెప్పాడు[10:11].

తమను మెప్పించుకొనే కొందరు తమకు గ్రహింపు లేదని కనపరచుకోడానికి ఏమి చేస్తారు?

తమలో ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుంటారు, ఒకడితో ఒకరు పోల్చుకుంటారు, వారికి గ్రహింపు లేదు[10:12].

2 Corinthians 10:13

పౌలు అతిశయానికి సరిహద్దులేవి?

పౌలు అతిశయం దేవుడు తనకు కొలిచి ఇచ్చిన సరిహద్దుల్లోనే ఉంటుంది, కొరింతువారు ఉన్న సరిహద్దులలోనే, సరిహద్దు దాటి ఇతరుల కష్టఫలంలో వారికి వంతు ఉన్నట్టు అతిశయంగా చెప్పుకోరు[10:13,15,16].

2 Corinthians 10:17

ఎవడు యోగ్యుడు?

ప్రభువు మెచ్చుకొనేవాడే యోగ్యుడు[10:18].


Chapter 11

Translation Questions

2 Corinthians 11:1

కొరింతు పరిశుద్ధుల కోసం దైవిక ఆసక్తి పౌలుకు ఎందుకుంది?

పౌలు వారిని ఒకే పురుషునికి ప్రధానం చేసాడు, వారిని క్రీస్తు కోసం పవిత్ర కన్యగా అప్పగించాలని వారిపట్ల దైవిక ఆసక్తి ఉంది[11:2].

2 Corinthians 11:3

కొరింతు పరిశుద్ధుల పట్ల పౌలుకున్న భయం ఏమిటి?

వారి ఆలోచనలు క్రీస్తు పట్ల ఉన్న నిజాయితి నుంచి పవిత్రభక్తి నుండి తొలగిపోతాయేమోనని భయపడ్డాడు[11:3].

కొరింతు పరిశుద్దులు దేనిని ఓర్చుకుంటారు?

ఒకడు వచ్చి పౌలు,, ఇతర సహచరులు ప్రకటించిన యేసును కాక వేరే యేసును ప్రకటిస్తే, వేరే శుభవార్తను ప్రకటిస్తే వారు ఓర్చుకున్నారు[11:4].

2 Corinthians 11:7

కొరింతు ప్రజలకు శుభవార్తను ఎలా ప్రకటించాడు?

కొరింతు ప్రజలకు శుభవార్తను ఉచితంగా ప్రకటించాడు[11:7].

ఇతర సంఘాలను పౌలు ఎలా దోచుకుంటున్నాడు?

ఇతర సంఘాలనుంచి జీతం తీసుకోవడం వల్ల వారిని దోచుకుంటున్నాడు[11:8].

2 Corinthians 11:14

పౌలుతోను, అతని సహచరులతోను సమానంగా అనిపించుకోవాలని కోరుకొనే వారి గురించి పౌలు ఎలా వివరిస్తున్నాడు?

వారు సాతాను సేవకులు, వాస్తవమైన క్రీస్తురాయబారులు కాదు, మోసకారులైన పనివారు, క్రీస్తురాయబారులు అనిపించుకోవాలని మారు వేషం వేసుకొనేవారు అని పౌలు వివరించాడు[11:13-15].

సాతాను తనని తాను ఎలా దాచి పెట్టుకుంటాడు?

సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు[11:14].

2 Corinthians 11:16

తనను తెలివితక్కువ వానిగా స్వీకరించాలని పౌలు ఎందుకు కొరింతు పరిశుద్ధులను అడిగాడు?

తాను అతిశయంగా కొంత చెప్పుకోనేలా తనను తెలివితక్కువవానిగా స్వీకరించాలని పౌలు కోరాడు[11:16].

2 Corinthians 11:19

కొరింతు పరిశుద్ధులు సంతోషంగా ఎవరిని ఓర్చుకుంటారని పౌలు చెప్పాడు?

వారు తెలివి తక్కువవారిని, వారిని బానిసలుగా చేసిన వారిని, వారి మధ్య విభజనలు చేసేవారిని, వారి నుండి లాభం కోరే వారిని, తమని తాము గోప్ప చేసుకోనే వారిని, వారి ముఖాల మీద కొట్టే వారిని సంతోషంతో చేర్చుకుంటారని పౌలు చెప్పాడు[11:19-20].

2 Corinthians 11:22

తాము అతిశయపడే వాటి విషయంలో పౌలుతో సమానంగా కనుపరచుకోనువారితో పోల్చుకొని పౌలు ఏమి అతిసయపడుతున్నాడు?

తాము యూదులమనీ, అబ్రాహాము సంతానమని చెప్పుకొనేవారితో సమానంగా పౌలు తానుకూడా తను అబ్రాహాము సంతానమని అతిశయ పడ్డాడు. వారి కంటే ఎంతో ఎక్కువగా క్రీస్తు సేవకుడిని అని, ఎక్కువగా ప్రయాసపడ్డానని, అనేక సార్లు ఖైదు పాలయ్యానని, లెక్కలేనన్నిసార్లు దెబ్బలు తిన్నానని, తరచుగా ప్రాణాపాయాలలో ఉన్నానని అతిశయించాడు[11:22-23].

2 Corinthians 11:24

పౌలు సహించిన కొన్ని ప్రత్యేకమైన ప్రమాదలేంటి?

పౌలు యూదుల చేత అయిదుసార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మూడుసార్లు బెత్తం దెబ్బలు తిన్నాడు. ఒకసారి రాళ్ళతో కొట్టడం జరిగింది. మూడుసార్లు తానున్న ఓడలు పగిలిపోయాయి. ఒకసారి పగలూ రాత్రి సముద్రంలో గడిపాడు. నదుల వల్ల అపాయాలు, దోపిడీ దొంగల వల్ల అపాయాలు, స్వజనం వల్ల అపాయాలు, ఇతరజనాలవల్ల అపాయాలు, పట్టణాలలో అపాయాలు, అరణ్యాలలో అపాయాలు, సముద్రంలో అపాయాలు, కపటసోదరుల వల్ల అపాయాలు. దమస్కు అధికారి నుండి కూడా పౌలుకు ప్రమాదం ఉంది[11:24-26,32].

2 Corinthians 11:27

పౌలు తనలో తాను మండిపడడానికి కారణం ఏమిటి?

ఎవరైనా పాపంలో పడే కారణం కలిగిస్తే పౌలు తనలో మండి పడతాడు [11:29].

2 Corinthians 11:30

ఒకవేళ పౌలు అతిశయాపడాల్సివస్తే దేని గురించి అతిశయ పడతాడు?

పౌలు తన బలహీనతల గురించిన విషయాలలోనే అతిశయ పడతాడు[11:30].


Chapter 12

Translation Questions

2 Corinthians 12:1

దేనిగురించి ఇపుడు పౌలు అతిశయ పడతాడని చెపుతున్నాడు?

ప్రభువు దర్శనాలను గురించి, ప్రత్యక్షతల గురించి అతిశయ పడతానని పౌలు చెప్పాడు[12:1].

2 Corinthians 12:3

పద్నాలుగేళ్ళ క్రితం క్రీస్తులోని ఒకనికి ఏమి జరిగింది?

అతణ్ణి మూడో ఆకాశం లోనికి తీసుకు వెళ్ళిపోవడం జరిగింది, పరమానంద నివాసం లోనికి తీసుకు వెళ్ళడం జరిగింది, వివరించడానికి వీలుకాని విషయాలు అతడు విన్నాడు[12:2-4].

2 Corinthians 12:6

తాను అతిశయ పడడం బుద్ధిహీనం కాదు అని పౌలు ఎందుకు అన్నాడు?

తాను అతిశయ పడడం బుద్ధిహీనం కాదు అని పౌలు అన్నాడు ఎందుకంటే పౌలు సత్యం పలుకుతున్నాడు[12:6].

పౌలు తనని తాను గొప్ప చేసుకోకుండా ఏమి జరిగింది?

పౌలు తనని తాను గొప్ప చేసుకోకుండా తన శరీరంలో ఒక ముల్లు ఉంచడం జరిగింది[12:7].

2 Corinthians 12:8

తన శరీరంలోని ముల్లును తీసివేయమని పౌలు అడిగినపుడు ప్రభువు ఏమిచెప్పాడు?

"నా కృప నీకు చాలు, నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే" అని ప్రభువు పౌలుకు చెప్పాడు[12:9].

ఎందుకు పౌలు తన బలహీనతల గురించి అతిశయపడడం మంచిదని చెప్పాడు?

క్రీస్తు బలప్రభావాలు తనలో నిలిచియుండేలా అది మంచిదని పౌలు చెప్పాడు[12:9].

2 Corinthians 12:11

పూర్తి సహనంతో కొరింతు వారి మధ్య ఏమి జరిగింది?

క్రీస్తు రాయబారుల సూచనలు, సూచక క్రియలు, వింతలూ, అద్భుతాలు పూర్తి సహనంతో వారి మధ్య జరిగాయి[12:12].

2 Corinthians 12:14

పౌలు కొరింతు వారికి భారంగా ఉండనని ఎందుకు చెపుతున్నాడు?

పౌలు వారి సొత్తును కోరడం లేదు. వారినే కోరుతున్నాడని వారికి కనపరచునట్లు వారికి చెప్పాడు [12:14].

పౌలు కొరింతు విశ్వాసులకోసం తాను సంతోషంగా ఏమి చేస్తానని చెప్పాడు?

వారి అత్మల కోసం ఎంతో సంతోషంతో ఖర్చు చేస్తానని, ఖర్చు అవుతానని పౌలు చెప్పాడు[12:15].

2 Corinthians 12:19

తాను మాట్లాడినదంతా కొరింతు పరిశుద్దుల కొరకే అని ఏ ఉద్దేశంతో చెప్పాడు?

కొరింతు పరిశుద్ధుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకే పౌలు ఈ సంగాతులన్నీ చెప్పాడు12:19.

2 Corinthians 12:20

కొరింతు పరిశుద్ధులవద్దకు పౌలు తిరిగి వెళ్ళినపుడు దేనిని చూడాలని భయపడ్డాడు?

వారి మధ్యలో కలహం, అసూయ, కోపం, జగడాలు, అపనిందలు, గుసగుసలు, మిడిసిపాటు, కలతలు ఉంటాయేమోనని పౌలు భయపడ్డాడు[12 :20].

దేవుడు తనకు ఏమి చేస్తాడని పౌలు భయపడ్డాడు?

దేవుడు కొరింతువారి మధ్యలో తలవంపులు తెస్తాడేమోనని పౌలు భయపడ్డాడు[12:21].

ఏ కారణాన్నిబట్టి మునుపు పాపం చేసిన కొరింతు పరిశుద్దులనేకుల కోసం దుఃఖించాల్సి వస్తుందని పౌలు ఆలోచించాడు?

ఇంతకుముందు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, అల్లరి క్రియల నిమిత్తం మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని పౌలు భయపడుచున్నాడు[12:21].


Chapter 13

Translation Questions

2 Corinthians 13:1

కొరింతియులకు 2వ పత్రిక రాయడానికి ముందు పౌలు ఎన్నిసార్లు కొరింతు పరిశుద్ధుల వద్దకు వచ్చాడు?

కొరింతియులకు 2వ పత్రిక రాయడానికి ముందు పౌలు రెండు సార్లు కొరింతు పరిశుద్ధుల వద్దకు వచ్చాడు[13:1-2].

2 Corinthians 13:3

మునుపు పాపం చేసిన కొరింతు పరిశుద్దులకు, మిగిలిన అందరికిని, తాను తిరిగి వచ్చినపుడు ఏమాత్రం సహించనని పౌలు ఎందుకు చెపుతున్నాడు?

పౌలు ద్వారా క్రీస్తు మాట్లాడుతున్నాడనే దానికి రుజువుకోసం కొరింతు పరిశుద్ధులు వెతుకుచున్నారు కాబట్టి పౌలు ఇలా చెప్పాడు [13:3].

2 Corinthians 13:5

కొరింతు పరిశుద్ధులను పౌలు తమను తాము పరిశోధించుకొని పరీక్షించుకోవాలని పౌలు ఎందుకు చెప్పాడు?

వారు విశ్వాసంలో ఉన్నారో లేదో అంది కొరింతు పరిశుద్ధులను పౌలు తమను తాము పరిశోధించుకొని పరీక్షించుకోవాలని పౌలు చెప్పాడు[13:5].

పౌలు, అతని సహచరులలో కొరింతు పరిశుద్ధులు ఏమి కనుగొంటారని అతడు నిబ్బరంగా ఉన్నాడు?

తాము ఆమోదం లేనివారు కాదని కొరింతు పరిశుద్ధులు కనుగొంటారని అతడు నిబ్బరంగా ఉన్నాడు[13:6].

2 Corinthians 13:7

తాను, తన సహచరులు ఏమి చెయ్యలేమని పౌలు చెపుతున్నాడు?

వారు సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేమని చెప్పాడు[13:8].

2 Corinthians 13:9

వారికి దూరంగా ఉండి పౌలు ఈ సంగతులను కొరింతు పరిశుద్ధులకు ఎందుకు రాస్తున్నాడు?

తాను వారితో ఉన్నప్పుడు వారిని కఠినంగా చూడకూడదని పౌలు అలా చేసాడు[13:10].

కొరింతు పరిశుద్ధులకు సంబంధించి ప్రభువు ఇచ్చిన అధికారాన్ని ఎలా వినియోగించాలని పౌలు కోరుతున్నాడు?

వారిని పడద్రోయ డానికి కాక వారిని కట్టుటకే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని వినియోగించాలని పౌలు కోరుతున్నాడు[13:10].

2 Corinthians 13:11

ముగింపులో కొరింతు వారిని పౌలు ఏమి చెయ్యమని కోరుతున్నాడు?

సంతోషించుడి, పరిపూర్ణులు కావడానికి ప్రయాసపడండి, ఏకమనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, పవిత్రమైన ముద్దుపెట్టుకొని వందనాలు చెప్పుకోండని పౌలు వారిని కోరుతున్నాడు[13:11-12].

2 Corinthians 13:13

కొరింతు పరిశుద్దులందరికి ఏమి ఉండాలని పౌలు కోరాడు?

అందరు ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలని పౌలు కోరాడు[13:14].


Chapter 1

Translation Questions

Galatians 1:1

పౌలు అపోస్తలునిగా ఎలా అయ్యాడు?

యేసు క్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా పౌలు అపోస్తలునిగా అయ్యాడు (1:1).

Galatians 1:3

విశ్వాసులను యేసు క్రీస్తు దేని నుండి విడిపించాడు?

విశ్వాసులను యేసు క్రీస్తు ప్రస్తుత దుష్ట యుగం నుండి విడిపించాడు (1:4).

Galatians 1:6

గలతీ సంఘంలో దేన్ని చూసి పౌలు నిర్ఘాంత పోతున్నాడు?

వారు ఇంత త్వరగా వేరొక సువార్త వైపుకు తిరిగి పోవడం చూసి పౌలు నిర్ఘాంత పోతున్నాడు (1:6).

సత్య సువార్తలు ఎన్ని ఉన్నాయి?

సత్య సువార్త ఒక్కటే ఉంది. అది క్రీస్తు సువార్త (1:7).

Galatians 1:8

క్రీస్తు సువార్త కాక వేరు సువార్త బోధించే వారికి ఏమి జరుగుతుందని పౌలు చెబుతున్నాడు?

వేరు సువార్త బోధించేవారు శాపానికి గురి అవుతారని పౌలు చెబుతున్నాడు (1:8,9).

క్రీస్తు సేవకులు ముందుగా ఎవరి ఆమోదం పొందాలి?

క్రీస్తు సేవకులు ముందుగా దేవుని ఆమోదం పొందాలి

Galatians 1:11

క్రీస్తు సువార్త జ్ఞానాన్ని పౌలు ఎలా పొందాడు?

క్రీస్తు సువార్త జ్ఞానాన్ని పౌలు నేరుగా యేసు క్రీస్తు నుండి పొందాడు (1:12)

Galatians 1:13

క్రీస్తు సువార్త పౌలుకు వెల్లడి కాక ముందు అతడు తన జీవితంలో ఏమి చేసేవాడు?

అతడు యూదు మతాన్ని ఆసక్తిగా అనుసరిస్తూ దేవుని సంఘాన్ని హింసించేవాడు (1:13,14).

Galatians 1:15

దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు?

పౌలును తన అపోస్తలునిగా తల్లి గర్భం నుండే ఎంపిక చేయడం దేవునికి ఇష్టం అయింది (1:15).

ఏ ప్రయోజనం కోసం దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎంపిక చేసుకున్నాడు?

పౌలు అన్యజనుల మధ్య క్రీస్తును ప్రకటించాలని దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎంపిక చేసుకున్నాడు (1:19)

Galatians 1:18

చివరికి ఎక్కడ మిగతా అపోస్తలులను పౌలు కలుసుకున్నాడు?

చివరికి మిగతా అపోస్తలులు కేఫా, యాకోబులను కలుసుకునేందుకు పౌలు యెరూషలేము వెళ్ళాడు (1:19).

Galatians 1:21

యూదయ లోని సంఘాలు పౌలును గురించి ఏమి విన్నారు?

గతంలో సంఘాన్ని హింసించిన పౌలు ఇప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడని యూదయలోని సంఘాలు విన్నాయి (1:22-23)


Chapter 2

Translation Questions

Galatians 2:1

పద్నాలుగు సంవత్సరాల తరువాత పౌలు యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఏమి చేశాడు?

పౌలు నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి తాను ప్రకటిస్తున్న సువార్త గురించి వివరించాడు (2:1).

Galatians 2:3

యూదేతరుడు తీతు ఏమి చేయనవసరం లేదు?

తీతు సున్నతి చేసుకోనవసరం లేదు (2:3).

కపట సహోదరులు ఏమి చేయగోరారు?

వారు పౌలును అతని సహచరులను ధర్మశాస్త్రానికి బానిసలుగా చేయగోరారు (2:4).

Galatians 2:6

యెరూషలేములో ఉన్న సంఘ నాయకులు పౌలు సందేశాన్ని మార్చారా?

లేదు. పౌలు సందేశానికి వారేమీ కలపలేదు (2:6).

పౌలు ముఖ్యంగా ఎవరికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు?

పౌలు ముఖ్యంగా సున్నతి లేని వారికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు (2:7-8).

పేతురు ముఖ్యంగా ఎవరికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు?

పేతురు ముఖ్యంగా సున్నతి ఉన్నవారికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు (2:7-8).

Galatians 2:9

పౌలు పరిచర్యకు తమ ఆమోదాన్ని యెరూషలేములో ఉన్న సంఘ నాయకులు ఏ విధంగా తెలియపరిచారు?

యెరూషలేములో ఉన్న సంఘ నాయకులు పౌలుకు, బర్నబాకు సహవాస సూచనగా తమ కుడి చేతిని ఇవ్వడం ద్వారా తమ ఆమోదాన్ని తెలియపరిచారు (2:9).

Galatians 2:11

పేతురు అంతియోకయకు వచ్చినప్పుడు ఏ పొరపాటు చేశాడు?

సున్నతి పొందిన వారికి భయపడి యూదేతరులతో కలిసి భోజనం చేయడం మానుకున్నాడు (2:11,12).

Galatians 2:13

అందరి ఎదుటా పౌలు కేఫాను ఏమని అడిగాడు?

కేఫాయే యూదేతరునిలాగా జీవిస్తూ యూదేతరులు యూదుల్లాగా జీవించాలని ఎలా బలవంతం చేస్తావు అని ప్రశ్నించాడు (2:14).

Galatians 2:15

దీని మూలంగా ఎవరూ నిర్దోషులుగా తీర్చబడరు అని పౌలు అన్నాడు. ఏమిటది?

ధర్మ శాస్త్ర క్రియల మూలంగా ఎవరూ నిర్దోషులుగా తీర్చబడరు అని పౌలు అన్నాడు (2:16).

దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడేది ఎవరు?

దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడేది క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారే (2:18).

Galatians 2:17

క్రీస్తులో విశ్వాసం ఉంచిన తరువాత ధర్మ శాస్త్రాన్ని పాటించే వాడు నిజానికి ఏమౌతున్నాడని పౌలు అంటున్నాడు?

అతడు నిజానికి ధర్మ శాస్త్రాన్ని మీరే వాడు అవుతాడు అని పౌలు అంటున్నాడు (2:18)

Galatians 2:20

ప్రస్తుతం తనలో ఎవరు నివసిస్తున్నారు అని పౌలు అంటున్నాడు?

ప్రస్తుతం తనలో క్రీస్తు నివసిస్తున్నాడు అని పౌలు అంటున్నాడు (2:20).

దేవుని కుమారుడు తనకు ఏమి చేశాడని పౌలు అంటున్నాడు?

దేవుని కుమారుడు తనను ప్రేమించి, తనను తాను పౌలు కోసం సమర్పించుకున్నాడని పౌలు అంటున్నాడు (2:20).


Chapter 3

Translation Questions

Galatians 3:6

దేవుని ఎదుట అబ్రహాము నీతిమంతునిగా ఎలా తీర్చబడ్డాడు?

అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది (3:6).

అబ్రాహాము పిల్లలు ఎవరు?

దేవుణ్ణి నమ్మిన వారు అబ్రాహాము పిల్లలు (3:7).

యూదేతరులు ఏ పద్ధతిలో నీతిపరులుగా తీర్చబడతారని లేఖనాలు నిర్దేశించాయి?

యూదేతరులు విశ్వాసం మూలంగా నీతిపరులుగా తీర్చబడతారని లేఖనాలు నిర్దేశించాయి (3:8).

Galatians 3:10

ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడిన వారు దేని కింద నీతిపరులుగా తీర్చబడతారు (3:10).

ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడిన వారు శాపం కింద నీతిపరులుగా తీర్చబడతారు (3:10)

ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడి ఎందరు నీతిపరులుగా తీర్చబడ్డారు?

ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడి ఎవరూ నీతిపరులుగా తీర్చబడలేదు (3:11).

Galatians 3:13

క్రీస్తు మనకోసం ఎందుకు శాపంగా అయి మనలను విమోచించాడు?

అబ్రాహము దీవెన యూదేతరులపైకి రావాలని క్రీస్తు మనకోసం శాపంగా అయి మనలను విమోచించాడు (3:14).

Galatians 3:15

అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానంలో చెప్పిన "సంతానం" అంటే ఎవరు?

అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానంలో చెప్పిన "సంతానం" అంటే క్రీస్తు (3:16)

Galatians 3:17

అబ్రాహాము తరువాత 430 సంవత్సరాలకు వచ్చిన యూదుల ధర్మశాస్త్రం దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలను వమ్ము చేసిందా?

లేదు. ధర్మశాస్త్రం దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలను వమ్ము చేయలేదు (3:17)

Galatians 3:19

అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు?

అబ్రాహాము సంతానం వచ్చే దాకా పాపాల మూలంగా ధర్మశాస్త్రం వచ్చింది (3:19).

Galatians 3:21

లేఖనాల్లో ధర్మశాస్త్రం అందరినీ దేని కింద బంధించింది?

లేఖనాల్లో ధర్మశాస్త్రం అందరినీ పాపం కింద బంధించింది (3:22).

Galatians 3:23

ధర్మ శాస్త్రం చెర నుండి మనం ఎలా విడుదల పొందాము?

క్రీస్తు యేసు లో విశ్వాసం మూలంగా ధర్మ శాస్త్రం చెర నుండి మనం విడుదల పొందాము (3:23-26).

Galatians 3:27

ఎవరు క్రీస్తును ధరించుకున్నారు?

క్రీస్తులోకి బాప్తిసం పొందిన వారంతా క్రీస్తును ధరించుకున్నారు (3:27).

ఎలాటి వివిధ వ్యక్తులు యేసు క్రీస్తులో ఒకటిగా అయ్యారు?

యూదులు, గ్రీకులు, స్వేచ్ఛ గల వారు, బానిసలూ, అడ, మగ అందరూ యేసు క్రీస్తులో ఒకటిగా అయ్యారు (3:28).


Chapter 4

Translation Questions

Galatians 4:1

ఒక ఆస్తికి వారసుడు తానింకా బాలుడుగా ఉన్నప్పుడు ఎలా జీవిస్తాడు?

ఆస్తికి వారసుడు బాలుడుగా ఉన్నప్పుడు తండ్రి నియమించిన సమయం వచ్చేదాకా సంరక్షకుల, నిర్వాహకుల కింద ఉంటాడు (4:12)

Galatians 4:3

చరిత్రలో సరియైన సమయానికి దేవుడు ఏమి చేశాడు?

సరియైన సమయానికి దేవుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి తన కుమారుణ్ణి పంపాడు (4: 4,5).

ధర్మశాస్త్రం కింద ఉన్న పిల్లలను దేవుడు తన కుటుంబంలోకి ఎలా తెచ్చాడు?

ధర్మశాస్త్రం కింద ఉన్నవారిని దేవుడు తనకు దత్తపుత్రులుగా చేసుకున్నాడు (4:5).

Galatians 4:6

తన పిల్లల హృదయాల్లోకి దేవుడు ఏమి పంపాడు?

తన పిల్లల హృదయాల్లోకి దేవుడు తన కుమారుని ఆత్మను పంపాడు పంపాడు (4:6).

Galatians 4:8

దేవుణ్ణి ఎరగక ముందు మనం ఎవరికీ బానిసలం?

దేవుణ్ణి ఎరగక ముందు మనం ఈ లోకాన్ని ఏలుతున్న ఆత్మలకు బానిసలం. వీరు ఎంతమాత్రం దేవుళ్ళు కారు (4:3,8).

గలతీయులు దేనికి తిరిగి మళ్ళుతున్నారని పౌలు ఆశ్చర్యపోతున్నాడు?

గలతీయులు ఈ లోకాన్నేలే ఆత్మలకు తిరిగి మళ్ళుతున్నారని పౌలు ఆశ్చర్యపోతున్నాడు (4:9).

Galatians 4:10

గలతీయులు తిరిగిపోవడం చూసి పౌలు ఏమని భయపడుతున్నాడు?

గలతీయులు మరలా బానిసలై పోతారేమోనని, తాను పడిన కష్టమంతా వృథా అయిపోతుందేమోనని భయపడుతున్నాడు (4:9,11).

Galatians 4:12

పౌలు మొదట గలతీయుల దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఉన్న సమస్య ఏమిటి?

పౌలు మొదట గలతీయుల దగ్గరికి వచ్చినప్పుడు అతనికి శరీర బలహీనత ఉంది (4:13).

పౌలుకు సమస్య ఉన్నా గలతీయులు అతణ్ణి ఎలా చేర్చుకున్నారు?

పౌలుకు సమస్య ఉన్నా గలతీయులు అతణ్ణి దేవుని దూత లాగా, అతడు క్రీస్తు యేసు అయినట్టు చేర్చుకున్నారు (4:14).

Galatians 4:17

గలతియ లోని అబద్ధ బోధకులు ఎవరిని వేరు చేయాలనుకుంటున్నారు?

అబద్ధ బోధకులు గలతీయులను పౌలు నుండి వేరు చేయాలనుకుంటున్నారు (4:17).

Galatians 4:21

అబద్ధ బోధకులు గలతీయులను దేని కింద ఉంచాలనుకుంటున్నారు?

అబద్ధ బోధకులు గలతీయులను తిరిగి ధర్మశాస్త్రం కింద ఉంచాలనుకుంటున్నారు (4:21).

అబ్రాహాము ఇద్దరు కొడుకులను ఎలాటి ఇద్దరు స్త్రీల వల్ల కన్నాడు?

అబ్రాహాము ఇద్దరు కొడుకులను ఒకణ్ణి బానిస స్త్రీ వల్లా, ఒకణ్ణి స్వతంత్రురాలైన స్త్రీ వల్ల, కన్నాడు (4:22).

Galatians 4:26

పౌలుకు, విశ్వాసులైన గలతీయులకు అలంకారికంగా తల్లి ఎవరు?

పైనున్న యెరూషలేము స్వతంత్రురాలైన స్త్రీ పౌలుకు, విశ్వాసులైన గలతీయులకు అలంకారికంగా తల్లి (4:26).

Galatians 4:28

క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు శరీర రీతి సంతానమా లేక వాగ్దాన రీతిగానా?

క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు వాగ్దాన రీతి సంతానం (4:28).

వాగ్దాన పుత్రులను పీడించినది ఎవరు?

వాగ్దాన పుత్రులను పీడించినది శరీర రీతిగా పుట్టిన సంతానం (4:29).

Galatians 4:30

బానిస స్త్రీ వల్ల పుట్టిన వారు దేన్ని వారసత్వంగా పొందుతారు?

బానిస స్త్రీ వల్ల పుట్టిన వారు స్వతంత్రురాలైన స్త్రీకి పుట్టిన వారితో సమానంగా వారసత్వం పొందరు (4:30).

క్రీస్తులో నమ్మకం ఉంచినవారు బానిస స్త్రీ వల్ల పుట్టిన వారా లేక స్వతంత్రురాలైన స్త్రీకి పుట్టినవారా?

క్రీస్తులో నమ్మకం ఉంచినవారు స్వతంత్రురాలైన స్త్రీకి పుట్టినవారే (4:31).


Chapter 5

Translation Questions

Galatians 5:1

క్రీస్తు మనలను విడిపించింది ఎందుకు?

క్రీస్తు మనలను విడిపించింది స్వతంత్రులుగా చేయడానికే (5:1).

గలతీయులు సున్నతి పొందితే ఏమి జరుగుతుందని పౌలు హెచ్చరించాడు?

గలతీయులు సున్నతి పొందితే వారికీ క్రీస్తు వల్ల ఎలాటి ప్రయోజనమూ ఉండదని పౌలు హెచ్చరించాడు (5:2).

Galatians 5:3

ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నిర్దోషులుగా తీర్చబడాలని చూసే గలతీయులకు ఏమి జరుగుతుందని పౌలు హెచ్చరించాడు?

ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నిర్దోషులుగా తీర్చబడాలని చూసే గలతీయులు క్రీస్తునుండి వేరైపోతారని, కృప నుండి తొలిగి పోతారని పౌలు హెచ్చరించాడు (5:4).

Galatians 5:5

సున్నతి పొందడం, పొందకపోవడం అనే దానితో సంబంధం లేకుండా క్రీస్తు యేసులో నిజంగా అర్థవంతమైన సంగతి ఏమిటి?

క్రీస్తు యేసులో నిజంగా అర్థవంతమైన సంగతి ప్రేమ ద్వారా కార్యం జరిగించే విశ్వాసమే (5:6)

Galatians 5:9

సువార్త విషయం గలతీయులను తప్పుదారి పట్టించిన వారికి ఏమి జరుగుతుందని పౌలు నిస్సందేహంగా నమ్ముతున్నాడు?

సువార్త విషయం గలతీయులను తప్పుదారి పట్టించిన వారు దేవుని తీర్పు ఎదుర్కొంటారని పౌలు నిస్సందేహంగా నమ్ముతున్నాడు (5:10).

Galatians 5:11

సున్నతి దేని విషయంలో అభ్యంతరాన్ని తీసివేస్తుందని పౌలు చెప్పాడు?

సున్నతి సిలువ అనే అడ్డు బండ విషయంలో అభ్యంతరాన్ని తీసివేస్తుందని పౌలు చెప్పాడు (5:11).

Galatians 5:13

విశ్వాసులు క్రీస్తులో తమ స్వేచ్ఛను ఎలా ఉపయోగించాలి?

విశ్వాసులు క్రీస్తులో తమ స్వేచ్ఛను ఒకరినొకరు ప్రేమతో సేవించుకోడానికి ఉపయోగించాలి (5:13).

ధర్మశాస్త్రం అంతా ఒక్క ఆజ్ఞలో నిక్షిప్తమై ఉందా?

"నిన్ను వలె నీ సాటి మనిషిని ప్రేమించాలి" అనే ఒక్క ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా నిక్షిప్తమై ఉంది (5:14).

Galatians 5:16

విశ్వాసులు శరీర కోరికలను తీర్చుకోకుండా ఎలా ఉండగలుగుతారు?

ఆత్మ ద్వారా జీవించడం ద్వారా విశ్వాసులు శరీర కోరికలను తీర్చుకోకుండా ఉండగలుగుతారు (5:16).

విశ్వాసిలో ఏ రెండు ఒక దానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి?

విశ్వాసిలో ఆత్మ, శరీరం ఒక దానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి (5:17).

Galatians 5:19

శరీర క్రియలకు మూడు ఉదాహరణలు ఏవి?

ఇక్కడ ఇచ్చిన జాబితా లోవన్నీశరీర క్రియలకు ఉదాహరణలే. లైంగిక అవినీతి, అశుద్ధత, కామవికారం, విగ్రహ పూజ, మంత్ర విద్య, వ్యతిరేక భావం, కలహం, అసూయ, ముక్కోపం, విరోధం, అభిప్రాయ భేదాలు, చీలికలు, మాత్సర్యం, తాగుబోతు తనం, విచ్చలవిడి తనం (5: 20-21).

శరీర క్రియలు జరిగించే వారు ఏమి పొందలేరు?

శరీర క్రియలు జరిగించే వారు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేరు (5:21)

Galatians 5:22

ఆత్మ ఫలాలు ఏవి?

ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, సంయమనం (5:22,23).

క్రీస్తు యేసుకు చెందినవారు తమ శరీరం, దాని కోరికల విషయం ఏమి చేశారు?

క్రీస్తు యేసుకు చెందినవారు తమ శరీరం, దాని కోరికలను సిలువ వేశారు (5:24)


Chapter 6

Translation Questions

Galatians 6:1

ఎవరైనా అపరాధంలో పడితే అత్మసంబంధులైన వారు ఏమి చెయ్యాలి?

అత్మసంబంధులైన వారు అ వ్యక్తిని మృదువుగా తిరిగి మంచిదారికి తీసుకు రావాలి (6:1).

ఆత్మసంబంధులైన వారు ఎలాటి ప్రమాదంలో పడకుండా చూసుకోవాలి?

ఆత్మసంబంధులైన వారు తామూ శోధనలో పడతామేమో నని చూసుకోవాలి (6:1).

విశ్వాసులు క్రీస్తు నియమాన్ని ఎలా నెరవేర్చాలి?

ఒకరి భారాలు ఒకరు మోయడం ద్వారా విశ్వాసులు క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలి (6:2).

Galatians 6:3

ఎవరైనా తన పని గురించి తానే అతిశయ పడడానికి అతనిలో ఏముంది?

ఎవరైనా తన పని గురించి తానే అతిశయ పడడానికి తనను ఎవరితోనూ పోల్చుకోకుండా తన పనిని పరీక్షించుకోవాలి (6:4).

Galatians 6:6

వాక్యం నేర్చుకున్న వాడు తనకు నేర్పించిన వాడికి ఏమి చెయ్యాలి?

వాక్యం నేర్చుకున్న వాడు తనకు నేర్పించిన వాడికి అన్ని మంచి విషయాల్లో భాగం ఇవ్వాలి (6:6).

ఒకడు ఆత్మ సంబంధంగా నాటిన వాటి విషయం ఏమవుతుంది?

ఒకడు ఆత్మ సంబంధంగా నాటిన వాటినే పంట కోసుకుంటాడు (6:7).

శరీర రీతిగా నాటినవాడు ఏమి పంట కోసుకుంటాడు?

శరీర రీతిగా నాటినవాడు శరీరం నుండి నాశనం అనే పంట కోసుకుంటాడు (6:8).

ఆత్మలో నాటినవాడు ఏమి పంట కోసుకుంటాడు?

ఆత్మలో నాటినవాడు ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోసుకుంటాడు (6:8).

Galatians 6:9

ఒక విశ్వాసి ఎడతెగకుండా మంచినే చేస్తూ ఉంటే అతడు ఏమి పొందుతాడు?

ఎడతెగకుండా మంచినే చేస్తూ ఉండే విశ్వాసి పంట కోసుకుంటాడు (6:9).

ఎవరి పట్ల విశ్వాసులు ప్రత్యేకించి మేలు చేయాలి?

విశ్వాసులు విశ్వాస గృహానికి చెందిన వారి పట్ల మేలు చేయాలి (6:10).

Galatians 6:11

విశ్వాసులు సున్నతి పొందాలని బలవంత పెట్టే వారి ఉద్దేశం ఏమిటి?

విశ్వాసులు సున్నతి పొందాలని బలవంత పెట్టే వారు క్రీస్తు సిలువ నిమిత్తం బాధలు పొందడానికి ఇష్టపడరు (6:12).

Galatians 6:14

పౌలు తాను దేని విషయం గర్వ పడుతున్నాను అంటున్నాడు?

మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయం గర్వ పడుతున్నాను అంటున్నాడు (6:14).

సున్నతి పొందడం, పొందక పోవడం అటుంచి, ఏది ప్రాముఖ్యం?

నూతన జన్మ ప్రాముఖ్యం (6:15).

ఎవరికీ పౌలు శాంతి కరుణలు కలగాలని కోరుతున్నాడు?

నూతన సృష్టి నియమం ప్రకారం, ఇశ్రాయేలు దేవునిలో జీవించే వారికి పౌలు శాంతి కరుణలు కలగాలని కోరుతున్నాడు (6:16).

Galatians 6:17

పౌలు తన శరీరంలో ఏమి కలిగి ఉన్నాడు?

పౌలు తన శరీరంలో క్రీస్తు ముద్రలు కలిగి ఉన్నాడు


Chapter 1

Translation Questions

Ephesians 1:1

ఈ లేఖ అందుకోబోతున్న వారిని పౌలు ఏమని వర్ణించాడు?

ఈ లేఖ అందుకోబోతున్న వారిని పౌలు దేవునికి ప్రత్యేకించబడిన వారని, నమ్మకంగా క్రీస్తు యేసుపై ఆధార పడిన వారని వర్ణించాడు (1:1).

Ephesians 1:3

తండ్రి అయిన దేవుడు దేనితో విశ్వాసులను దీవించాడు?

తండ్రి అయిన దేవుడు క్రీస్తులో పరలోక స్థలాల్లోని ప్రతి ఆత్మ సంబంధమైన దీవెనలతో విశ్వాసులను దీవించాడు (1:3).

క్రీస్తులో విశ్వాసముంచిన వారిని తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు?

క్రీస్తులో విశ్వాసముంచిన వారిని తండ్రి అయిన దేవుడు సృష్టికి ముందే ఎన్నుకున్నాడు (1:4).

తండ్రి అయిన దేవుడు విశ్వాసులను ఏ ఉద్దేశంతో ఎన్నుకున్నాడు?

తండ్రి అయిన దేవుడు విశ్వాసులను తన దృష్టిలో పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని ఎన్నుకున్నాడు (1:4).

Ephesians 1:5

దేవుడు దత్త పుత్రత్వం కోసం విశ్వాసులను ముందుగా ఎందుకు నిర్ణయించాడు?

దేవుడు విశ్వాసులను ముందుగా ఎందుకు నిర్ణయించాడంటే అది ఆయనకు ఇష్టమైంది. అంతేగాక తన మహిమ గల కృపకు కీర్తి కలగాలని అలా చేసాడు (1:5,6).

Ephesians 1:7

దేవుని ప్రియ కుమారుడు క్రీస్తు రక్తం మూలంగా విశ్వాసులకు ఏమి లభించింది?

క్రీస్తు రక్తం మూలంగా విశ్వాసులకు విమోచన, పాప క్షమాపణ లభించింది (1:7).

Ephesians 1:9

తన పథకం సంపూర్ణమయ్యే కాలం వచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు?

భూమి పైనా, ఆకాశంలోనూ ఉన్న వాటన్నిటిని దేవుడు క్రీస్తుకు లోబరుస్తాడు (1:10).

Ephesians 1:13

సత్య వాక్యం విన్నప్పుడు విశ్వాసులు ఏ ముద్ర పొందారు?

విశ్వాసులు వాగ్దానం చేయబడిన ఆత్మ అనే ముద్రను పొందారు (1:13).

ఆత్మ దేనికి హామీ?

ఆత్మ విశ్వాసులు పొందనైయున్న వారసత్వానికి హామీ (1:14).

Ephesians 1:17

ఎఫెసీయులు దేనిని అర్థం చేసుకోవడానికి తెలివి పొందాలని పౌలు ప్రార్థించాడు?

ఎఫెసీయులు వారి పిలుపులోని నిబ్బరాన్ని, వారి వారసత్వంలోని సౌభాగ్యాన్ని, వారిలో ఉన్న దైవ శక్తి లోని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడానికి తెలివి పొందాలని పౌలు ప్రార్థించాడు (1:18,19).

Ephesians 1:19

ఇప్పుడు విశ్వాసుల్లో నివసిస్తున్న ప్రభావమే క్రీస్తులో ఏమి చేసింది?

అదే ప్రభావం క్రీస్తు ను చనిపోయిన వారిలో నుండి లేపి, ఆయనను పరమ స్థలాల్లో దేవుని కుడి వైపున కూర్చో బెట్టింది (1:20).

Ephesians 1:22

క్రీస్తు పాదాల కింద దేవుడు దేనిని ఉంచాడు?

క్రీస్తు పాదాల కింద దేవుడు సమస్తాన్నీ ఉంచాడు (1:22).

సంఘంలో క్రీస్తు అధికారిక స్థానం ఏమిటి?

సంఘంలో అన్నిటికీ క్రీస్తు శిరస్సు (1:22).

సంఘం ఏమిటి?

సంఘం క్రీస్తు శరీరం (1:23).


Chapter 2

Translation Questions

Ephesians 2:1

అవిశ్వాసుల ఆత్మ స్థితి ఏమిటి?

అవిశ్వాసులంతా తమ అతిక్రమాల్లో పాపాల్లో చనిపోయి ఉన్నారు (2:1).

అవిధేయత పిల్లల్లో ఎవరు పని చేస్తున్నారు?

అవిధేయత పిల్లల్లో వాయు సంబంధమైన అధిపతుల నాయకుడు పని చేసున్నాడు (2:2).

స్వతహాగా అవిశ్వాసులందరూ ఎవరు?

స్వతహాగా అవిశ్వాసులందరూ ఉగ్రత పుత్రులు (2:3).

Ephesians 2:4

దేవుడు కొందరు అవిశ్వాసులను క్రీస్తులో నూతన జీవానికి ఎందుకు తెచ్చాడు?

దేవుడు కొందరు అవిశ్వాసులను తన అధిక కరుణ, గొప్ప ప్రేమల మూలంగా క్రీస్తులో నూతన జీవానికి తెచ్చాడు (2:4-5).

దేని మూలంగా విశ్వాసులు రక్షణ పొందారు?

దేవుని కృప మూలంగా విశ్వాసులు రక్షణ పొందారు (2:5).

విశ్వాసులు ఎక్కడ కూర్చుని ఉన్నారు?

విశ్వాసులు పరమ స్థలాల్లో క్రీస్తు యేసుతో కూర్చుని ఉన్నారు (2:6).

విశ్వాసులను ఏ ఉద్దేశంతో దేవుడు రక్షించి లేపాడు?

విశ్వాసులను రాబోయే యుగాల్లో వారి పట్ల తన కృప అనే మహా భాగ్యాన్ని కనుపరచాలని దేవుడు రక్షించి లేపాడు (2:7).

Ephesians 2:8

విశ్వాసి ఎవరూ ఏ విషయంలో గొప్పలు చెప్పుకోకూడదు?

ఏ విశ్వాసి తన సత్క్రియల గురించి గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే దేవుని కానుకగా అతడు పొందిన కృప వల్ల రక్షణ పొందాడు. (2:8-9).

దేవుడు ఏ ఉద్దేశంతో క్రీస్తు యేసులో విశ్వాసులను సృష్టించాడు?

వారు సత్క్రియల్లో నడుచుకోవాలని దేవుడు క్రీస్తు యేసులో విశ్వాసులను సృష్టించాడు (2:10).

Ephesians 2:11

విశ్వాసం లేని యూదేతరుల స్థితి ఏమిటి?

విశ్వాసం లేని యూదేతరులు క్రీస్తు నుండి వేరై పోయారు. ఇశ్రాయేలుకు దూరమై పోయారు. వారు నిబంధనకు అపరిచితులు. దేవుడు గానీ ఆశాభావం గానీ లేని వారు (2:12).

Ephesians 2:13

విశ్వాసం లేని యూదేతరులు కొందరిని దేవునికి దగ్గరగా తీసుకు వచ్చింది ఏమిటి?

విశ్వాసం లేని యూదేతరులు కొందరిని దేవునికి దగ్గరగా తీసుకు వచ్చింది క్రీస్తు రక్తం (2:13).

యూదేతరులకు యూదులకు మధ్య ఉన్న సంబంధాన్ని క్రీస్తు ఎలా మార్చాడు?

క్రీస్తు తన శరీరం ద్వారా యూదేతరులను యూదులను ఒక్క ప్రజగా చేసాడు. వారిని వేరు చేస్తున్న శత్రుత్వాన్ని నాశనం చేశాడు (2:14).

యూదేతరులకు యూదులకు మధ్య శాంతి స్థాపించడానికి క్రీస్తు దేన్ని నాశనం చేసాడు?

యూదేతరులకు యూదులకు మధ్య శాంతి స్థాపించడానికి క్రీస్తు ఆజ్ఞలతో, కట్టడలతో కూడిన ధర్మశాస్త్రాన్ని నాశనం చేసాడు (2:15-16).

Ephesians 2:17

దేని మూలంగా విశ్వాసులకు తండ్రి చెంతకు ప్రవేశం ఉంది?

పరిశుద్ధాత్మ మూలంగా విశ్వాసులకు తండ్రి చెంతకు ప్రవేశం ఉంది (2:18).

Ephesians 2:19

ఏ పునాదిపై దేవుని కుటుంబం కట్ట బడింది?

క్రీస్తే మూల రాయిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిపై దేవుని కుటుంబం కట్టబడింది (2:20).

తన కుటుంబం నిర్మాణంలో యేసు ప్రభావం ఎలాటి పాత్ర పోషిస్తున్నది?

యేసు ప్రభావం నిర్మాణం మొత్తాన్నిచక్కగా అమర్చి అభివృద్ధి కలిగిస్తున్నది (2:21).

దేవుని కుటుంబం అనే కట్టడం ఎలాటి కట్టడం?

దేవుని కుటుంబం అనే కట్టడం ప్రభువుకు ప్రత్యేకపరచబడిన ఆలయం (2:21).

దేవుడు ఆత్మ ద్వారా ఎక్కడ నివసిస్తున్నాడు?

దేవుడు ఆత్మ ద్వారా విశ్వాసిలో నివసిస్తున్నాడు (2:22).


Chapter 3

Translation Questions

Ephesians 3:1

ఎవరి ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు వరం ఇచ్చాడు?

యూదేతరుల ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు వరం ఇచ్చాడు (3:1-2)

Ephesians 3:3

గడిచిన తరాల్లో దేవుడు మానవజాతికి చెప్పకుండా దాచిన సంగతి ఏమిటి?

గడిచిన తరాల్లో దేవుడు మానవజాతికి చెప్పకుండా దాచిన సంగతి క్రీస్తును గూర్చిన రహస్య సత్యం (3:35).

గడిచిన తరాల్లో దేవుడు మానవజాతికి చెప్పకుండా దాచిన సంగతిని ఆయన ఎవరికి వెల్లడి చేశాడు?

క్రీస్తును గూర్చిన రహస్య సత్యాన్ని దేవుడు తన అపోస్తలులకు ప్రవక్తలకు వెల్లడి చేశాడు (3:5).

Ephesians 3:6

ఏ రహస్య సత్యం వెల్లడి అయింది?

వెల్లడి అయిన రహస్య సత్యం ఏమిటంటే యూదేతరులు కూడా సాటి వారసులు, శరీరంలో భాగస్తులు. క్రీస్తు యేసు వాగ్దానాల్లో భాగం పంచుకునే వారు (3:6).

పౌలుకు ఏ వరం ఇవ్వబడింది?

దేవుని కృప అనే వరం పౌలుకు ఇవ్వబడింది (3:7).

Ephesians 3:8

దేనిని గూర్చి యూదేతరులకు వివరించడానికి పౌలు పంపబడ్డాడు?

దేవుని ప్రణాళిక గూర్చి యూదేతరులకు వివరించ దానికి పౌలు పంపబడ్డాడు (3:9).

Ephesians 3:10

దేవుని సంక్లిష్టమైన జ్ఞానం దేని మూలంగా వెల్లడి అవుతుంది?

దేవుని సంక్లిష్టమైన జ్ఞానం సంఘం మూలంగా వెల్లడి అవుతుంది (3:12).

Ephesians 3:12

క్రీస్తులో విశ్వాసం మూలంగా విశ్వాసులకు ఏమి ఉందని పౌలు చెప్పాడు?

క్రీస్తులో విశ్వాసం మూలంగా విశ్వాసులకు ధైర్యం, నిబ్బరంతో కూడిన ప్రవేశం ఉందని పౌలు చెప్పాడు (3:12).

Ephesians 3:14

తండ్రి పేరున ఏది సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది?

భూమి మీదా, ఆకాశంలో ఉన్న ప్రతి కుటుంబం తండ్రి పేరున సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది (3:14-15).

విశ్వాసులు ఎలా బలం పొందాలని పౌలు ప్రార్థించాడు?

వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మ మూలంగా శక్తి పొంది విశ్వాసులు బలం పొందాలని పౌలు ప్రార్థించాడు (3:16-17).

Ephesians 3:17

విశ్వాసులు ఏమి అర్థం చేసుకోగలగాలని పౌలు ప్రార్థించాడు?

విశ్వాసులుక్రీస్తు ప్రేమ వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు అర్థం చేసుకోగలగాలని పౌలు ప్రార్థించాడు (3;18).

Ephesians 3:20

అన్ని తరాల్లోనూ తండ్రికి ఏమి ఇవ్వబడాలని పౌలు ప్రార్థించాడు?

సంఘంలో, క్రీస్తు యేసులో అన్ని తరాల్లోనూ తండ్రికి మహిమ కలుగుతుంది అని పౌలు ప్రార్థించాడు (3:21).


Chapter 4

Translation Questions

Ephesians 4:1

విశ్వాసులు ఎలా జీవించాలని పౌలు హెచ్చరించాడు?

విశ్వాసులు నమ్రతగా, మృదుత్వంతో, సహనంతో, ఒకరినొకరు ఆమోదించుకుంటూ జీవించాలని పౌలు హెచ్చరించాడు (4;1-2)

Ephesians 4:4

పౌలు ఇచ్చిన ఒక్కటే అని ఉన్న జాబితాలో ఏమి ఉన్నాయి?

ఒక్కటే శరీరం, ఒక్కటే ఆత్మ, నిరీక్షణ గురించిన నిబ్బరం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే (4:4-6).

Ephesians 4:7

క్రీస్తు ఆరోహణం అయిన తరువాత ప్రతి విశ్వాసికి ఏమి ఇచ్చాడు?

క్రీస్తు వరాల పరిమాణం ప్రకారం ప్రతి విశ్వాసికి ఆయన వరం ఇచ్చాడు (4:7-8).

Ephesians 4:11

పౌలు చెప్పిన క్రీస్తు తన శరీరానికి ఇచ్చిన 5 వరాలు ఏవి?

క్రీస్తు తన శరీరానికి ఇచ్చిన 5 అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు (4;11).

శరీరానికి ఇచ్చిన ఈ 5 వరాలు ఏ ప్రయోజనం నిమిత్తం పని చేయాలి?

శరీరానికి ఇచ్చిన ఈ 5 వరాలు విశ్వాసులను సేవ కోసం సిద్ధ పరచడానికి, శరీరం క్షేమాభివృద్ధి చెందడం నిమిత్తం పని చేయాలి (4:12).

Ephesians 4:14

విశ్వాసులు చిన్న పిల్లల్లాగా ఎలా ఉండగలరని పౌలు చెబుతున్నాడు?

మనుషుల కపటం మూలంగా తప్పుదారి పట్టించే మోసం మూలంగా అటు ఇటు కొట్టుకు పోతూ, ఉండడంలో విశ్వాసులు చిన్న పిల్లల్లాగా బేలగా ఉంటున్నారు (4:4).

విశ్వాసుల శరీరం ఏవిధంగా నిర్మాణం అయింది అని పౌలు చెబుతున్నాడు?

ప్రతి ఒక్కరూ ప్రేమలో ఎదుగుతూ ఉండేటందుకు, శరీరంలో ప్రతి భాగం క్షేమాభివృద్ధి చెందడం నిమిత్తం కీళ్ళ ద్వారా అమరి, అతికి ఉంది (4:16).

Ephesians 4:17

యూదేతరులు ఎలా నడుచుకుంటారని పౌలు అంటున్నాడు?

యూదేతరులు తమ ఆలోచనల్లో అంధకారం లో ఉండి, దేవునికి దూరమై అపవిత్ర చర్యలకు తమను అప్పగించుకున్నారు (4:17,19)

Ephesians 4:23

విశ్వాసులు దేన్ని తీసేసి, దేన్ని ధరించాలి?

విశ్వాసులు పాడై పోయిన పాత స్వభావాన్ని తీసేసి, నీతిమూలంగా సృష్టి అయిన నూతన స్వభావం ధరించుకోవాలి (4:22-24)

Ephesians 4:25

విశ్వాసి సాతానుకు ఎలా అవకాశం ఇవ్వగలడు?

విశ్వాసి సూర్యాస్తమయం తరువాత కూడా కోపం ఉంచుకుంటే సాతానుకు అవకాశం కలుగుతుంది.

Ephesians 4:28

విశ్వాసులు ఎందుకు కష్టపడి పని చెయ్యాలి?

అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం విశ్వాసులు కష్టపడి పని చెయ్యాలి (4:28).

విశ్వాసి నోట ఎలాటి మాటలు రావాలి అని పౌలు చెప్పాడు?

చెడ్డమాటలు ఏవీ విశ్వాసి నోట రాకూడదు. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలే రావాలి (4:29).

విశ్వాసి ఎవరిని దుఃఖపెట్టకూడదు?

విశ్వాసి పరిశుద్దాత్మను దుఃఖపెట్టకూడదు (4:30).

Ephesians 4:31

దేవుడు విశ్వాసిని క్రీస్తులో క్షమించాడు గనక విశ్వాసి ఏమి చెయ్యాలి?

దేవుడు విశ్వాసిని క్రీస్తులో క్షమించాడు గనక విశ్వాసి ఇతరులను క్షమించాలి (4:32).


Chapter 5

Translation Questions

Ephesians 5:1

విశ్వాసులు ఎవరిని అనుకరించాలి?

పిల్లలు తండ్రిని అనుకరించినట్టు విశ్వాసులు తండ్రి అయిన దేవుణ్ణి అనుకరించాలి (5:1).

దేవునికి ప్రీతికరమైన సువాసన గా ఉండే ఏ పని క్రీస్తు చేసాడు?

క్రీస్తు తనను విశ్వాసుల కోసం దేవునికి బలిగా అర్పణగా ఇచ్చేశాడు (5:2).

Ephesians 5:3

విశ్వాసులకు ఏమి ప్రస్తావించ కూడదు?

లైంగిక దుర్నీతి, అపవిత్రత, శరీర దురాశ విశ్వాసులమధ్య ప్రస్తావించ కూడదు (5:3).

దానికి బదులు ఎలాటి ప్రవృత్తి విశ్వాసుల్లో కనిపించాలి?

కృతజ్ఞతాపూర్వకమైన ప్రవృత్తి విశ్వాసుల్లో కనిపించాలి (5:4).

Ephesians 5:5

దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఎవరికి వారసత్వం లేదు?

లైంగిక దుర్నీతి, అపవిత్రత, శరీర దురాశగల వారికి దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో వారసత్వం లేదు (5:5).

అవిధేయుల మీదికి ఏమి వస్తున్నది?

అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వస్తున్నది (5:6).

Ephesians 5:8

ఎలాటి వెలుగు ఫలం దేవునికి ఇష్టం?

మంచితనం, నీతి, సత్యం అనే ఫలం దేవునికి ఇష్టం.

చీకటి కార్యాల విషయం విశ్వాసులు ఏమి చెయ్యాలి?

అలాటి వాటిలో విశ్వాసులు పాల్గొనకూడదు. చీకటి పనులను వారు బట్టబయలు చెయ్యాలి (5:11).

Ephesians 5:13

వెలుగు దేనిని బహిర్గతం చేస్తుంది?

వెలుగు అన్నిటినీ బహిర్గతం చేస్తుంది (5:13)

Ephesians 5:15

దినాలు చెడ్డవి గనక విశ్వాసులు ఏమి చెయ్యాలి?

దినాలు చెడ్డవి గనక విశ్వాసులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి (5:16).

Ephesians 5:18

నాశనానికి నడిపేది ఏమిటి?

తాగి మత్తెక్కడం నాశనానికి నడుపుతుంది (5:18).

దేనితో విశ్వాసులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి?

విశ్వాసులు ఒకరితో ఒకరు పాటలతో, కీర్తనలతో, ఆధ్యాత్మిక గీతాలతో మాట్లాడుకోవాలి (5:19).

Ephesians 5:22

భార్యలు ఏ విధంగా భర్తలకు లోబడాలి?

ప్రభువుకు లోబడినట్టుగా భార్యలు భర్తలకు లోబడాలి (5:22).

భర్త దేనికి శిరస్సు? క్రీస్తు దేనికి శిరస్సు?

భర్త భార్యకు శిరస్సు.? క్రీస్తు సంఘానికి శిరస్సు(5:23).

Ephesians 5:25

క్రీస్తు తన సంఘాన్ని పవిత్రంగా ఎలా ఉంచుతాడు?

వాక్కు అనే నీటితో స్నానం చేయించడం ద్వారా క్రీస్తు తన సంఘాన్ని పవిత్రంగా ఉంచుతాడు (5:26-27).

Ephesians 5:28

భర్తలు తమ భార్యలను ఎలా ప్రేమించాలి?

భర్తలు తమ స్వంత శరీరాలను ప్రేమించుకున్నట్టే భార్యలను ప్రేమించాలి (5:28).

ఒక వ్యక్తి తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడు?

ఒక మనిషి తన స్వంత శరీరాన్ని చక్కగా పోషించుకుంటాడు (5:29).

Ephesians 5:31

ఒక మనిషి తన భార్యతో కలిస్తీ ఏమవుతుంది?

ఒక మనిషి తన భార్యతో కలిస్తీ వారిద్దరూ ఏక శరీరం అవుతారు (5:31).

ఒక పురుషుణ్ణి స్త్రీని ఏకం చేయడంలో ఏ సత్యం దాగి ఉంది?

అందులో క్రీస్తు ఆయన సంఘం గురించిన సత్యం దాగి ఉంది (5:32).


Chapter 6

Translation Questions

Ephesians 6:1

క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా చూడాలి?

క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించి ఘన పరచాలి (6:1-2).

Ephesians 6:4

క్రైస్తవ తండ్రులు తమ పిల్లల విషయంలో ఏమి చెయ్యాలి ?

క్రైస్తవ తండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో ప్రభువు బోధలో పెంచాలి (6:4).

Ephesians 6:5

క్రైస్తవ బానిసలు తమ యజమానులకు ఏ వైఖరితో లోబడాలి?

క్రైస్తవ బానిసలు తమ యజమానులకు తమ హృదయంలో యధార్థత కలిగి ప్రభువుకు చేసినట్టుగా సంతోషంతో తమ యజమానులను సేవించాలి (6:5-7).

విశ్వాసి తను చేసిన ఏ మంచి పని విషయంలోనైనా ఏమనుకోవాలి?

ఏ మంచి పని చేసినా తనకు ప్రతిఫలం ప్రభువు నుండే కలుగుతుందని భావించాలి (6:8).

Ephesians 6:9

క్రైస్తవ యజమాని తన పరలోక యజమాని గురించి ఏమి గుర్తు చేసుకోవాలి?

క్రైస్తవ యజమాని తనకు, తన సేవకునికి యజమాని పరలోకంలో ఉన్నాడని గుర్తుంచుకుని ఆయనలో ఏ పక్షపాతం లేదని గ్రహించాలి (6:9).

Ephesians 6:10

విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ఎందుకు ధరించాలి?

సైతాను కుతంత్రాల నుండి తనను కాపాడుకోవడానికి విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ధరించాలి (6:11,13,14).

Ephesians 6:12

విశ్వాసి ఎవరితో పోరాడాలి?

దుష్ట అంధకార లోకపు పరిపాలకులతో, ఆత్మ సంబంధమైన ప్రభుత్వాలతో పోరాడాలి (6:12).

Ephesians 6:14

దేవుని కవచంలో ఉన్న భాగాలు ఏమిటి?

దేవుని కవచంలో సత్యం అనే బెల్టు, నీతి అనే ఛాతీ కవచం, సువార్తకోసం సన్నద్ధం అనే చెప్పులు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణం, ఆత్మ ఖడ్గం ఉన్నాయి (6:14-17)

Ephesians 6:17

ఆత్మ ఖడ్గం ఏమిటి?

ఆత్మ ఖడ్గం దేవుని వాక్కు (6:17).

ప్రార్థనలో విశ్వాసులు ఎలాటి వైఖరి కలిగి ఉండాలి?

అన్ని సమయాల లోనూ, దేవుని జవాబు కోసం ఎదురు చూస్తూ ఎడతెగక ప్రార్థించాలి (6:18).

Ephesians 6:19

ఎఫెసీయుల ప్రార్థనల మూలంగా ఏమి దొరకాలని కోరుతున్నాడు?

తను సువార్త చెప్పేటప్పుడు ధైర్యంతో కూడిన వాక్కు తనకు అనుగ్రహించ బడేలా కోరుతున్నాడు (6:19-20).

ఈ లేఖ రాసినప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు?

ఈ లేఖ రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు

Ephesians 6:23

విశ్వాసులకు ఇమ్మని పౌలు తండ్రి అయిన దేవుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువును ఏమి అడుగుతున్నాడు?

దేవుడు వారికి శాంతి, విశ్వాసంతో కూడిన ప్రేమ, కృప ఇమ్మని దేవుణ్ణి అడుగుతున్నాడు (6:23-24).


Chapter 1

Translation Questions

Philippians 1:1

పౌలు ఈ ఉత్తరo ఎవరికి వ్రాశాడు?

పౌలు ఈ ఉత్తరo ఫిలిప్ఫీలో ఉంటూ క్రీస్తు యేసులో ప్రత్యేకపరచిన వారికీ, సంఘనాయకులకూ పరిచారకులకూ వ్రాశాడు(1:1).

Philippians 1:3

పౌలు దేని కోసం ఫిలిప్పీయుల గూర్చి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు?

శుభవార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఫిలిప్పీయులు భాగస్వాములవటం వల్ల పౌలు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు(1:5).

ఫిలిప్పీయుల విషయంలో పౌలుకు ఉన్న నమ్మకం ఏoటి?

ఫిలిప్పీయుల్లో మంచి పని మొదలు పెట్టిన వాడే దాన్ని ముగిస్తాడని పౌలు నమ్మకం(1:6).

Philippians 1:7

ఏ విషయంలో ఫిలిప్పీయులు పౌలు జత పనివారుగా ఉన్నారు?

పౌలు చెరసాలలో ఉండి సువార్త విషయంలో తనను గురించి వాదించుకుంటూ ఒప్పిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీయులు పౌలు జత పనివారుగా ఉన్నారు(1:7).

Philippians 1:9

ఫిలిప్పీయుల్లో అంతకంతకు ఏమి అభివృద్ధి కావాలని పౌలు ప్రార్ధిoచాడు?

ఫిలిప్పీయుల్లో అంతకంతకూ ప్రేమ అభివృద్ధి కావాలని పౌలు ప్రార్ధిoచాడు(1:9).

ఫిలిప్పీయులు దేనితో నిండాలని పౌలు కోరుకుంటున్నాడు?

ఫిలిప్పీయులు నీతిఫలాలతో నిండాలని పౌలు కోరుకుంటున్నాడు(1:11).

Philippians 1:12

పౌలు చెర వల్ల శుభవార్త ఎలా వ్యాపించింది?

పౌలు చెర క్రీస్తు కోసమే అని అందరికి బాగా తెలిసిoది. ఇప్పుడు అనేక మంది సోదరులు ఎక్కువ ధైర్యంతో మాట్లాడటo వల్ల శుభవార్త బాగా వ్యాపించింది(1:12-14).

Philippians 1:15

కొందరు ఎందుకు స్వార్ధంతో కపటమైన భావాలతో క్రీస్తును ప్రకటిస్తున్నారు?

స్వార్ధంతో కపటమైన భావాలతో క్రీస్తును ప్రకటించే వారు ఖైదులోని పౌలుకు మరిన్ని కష్టాలు కలుపుతూ ఉన్నారు(1:17).

Philippians 1:18

నిజమైన క్రీస్తు బోధకూ, కపటమైన క్రీస్తు బోధకు పౌలు స్పందన ఏంటి?

నిజమైన క్రీస్తు బోధకూ, కపటమైన క్రీస్తు బోధకు పౌలు స్పందన ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటన జరుగుతూ ఉందని ఆనందిస్తున్నాడు(1:18).

Philippians 1:20

చావు ద్వారా గాని బ్రతుకు ద్వారా గాని పౌలు ఏం చేయాలని కోరుకుంటున్నాడు?

చావు ద్వారా గాని బ్రతుకు ద్వారా గాని క్రీస్తుకు మహిమ తీసుకురావలని పౌలు కోరుకుంటున్నాడు(1:21).

చావైనా బ్రతుకైనా దేనికని పౌలు చెప్పాడు?.

బ్రతకడం క్రీస్తే, చావైనా లాభమే అని పౌలు చెప్పాడు(1:21).

Philippians 1:22

పౌలును ఏ రెండు ఎంపికలు రెండు వైపులకు లాగాయి?

మరణించి క్రీస్తుతో ఉండడమా లేక బ్రతికి ఉండి తన పరిచర్య కొనసాగించడమా అనే రెండు ఎంపికలు అతణ్ణి రెండు వైపులకు లాగాయి (1:22,24).

Philippians 1:25

ఏ ఉద్దేశం కోసం ఫిలిప్పీయులతో ఉండాలని పౌలు నిబ్బరంగా ఉన్నాడు?

విశ్వాసంలో ఫిలిప్పీయుల అభివృద్ధి, ఆనందాల కోసం ఉండాలని పౌలు నిబ్బరంగా ఉన్నాడు(1:25)

పౌలు ఫిలిప్పీయులతో ఉన్నా వారికి దూరంగా ఉన్నా వారిని గూర్చి ఏం వినాలని కోరుకుంటున్నాడు?

ఫిలిప్పీయులతో ఉన్నా వారికి దూరంగా ఉన్నా వారు శుభవార్త విశ్వాసం కోసం ఏకాత్మలో స్టిరంగా నిలిచి ఏకమనస్సుతో పెనుగులాడుతుండటం వినాలని కోరుకుంటున్నాడు(2:27).

Philippians 1:28

ఫిలిప్పీయులు తమను ఎదిరించే వారికి భయపడకుండా ఉంటే అది దేనికి సూచన?

ఫిలిప్పీయులు భయపడకుండా ఉంటే అది వారి శత్రువుల నాశనానికి, వారి రక్షణకీ సూచన (1:28).

ఫిలిప్పీయులకు దేవుడిచ్చిన రెండు విషయాలు ఏమిటి?

ఫిలిప్పీయులు క్రీస్తును నమ్మాలని, అయన పక్షంగా బాధలు అనుభవించాలని దేవుడు నిర్దేశించాడు (1:29).


Chapter 2

Translation Questions

Philippians 2:1

పౌలు సంతోషం పరిపూర్ణమయ్యేలా ఫిలిప్పీయులు ఏమి చెయ్యాలని చెబుతున్నాడు?

ఫిలిప్పీయులు ఒకే భావం, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలోనూ మనస్సులోనూ కలిసి ఉండాలని పౌలు చెబుతున్నాడు(2:2).

Philippians 2:3

ఫిలిప్పీయులు ఒకరినొకరు ఎలా ఎంచుకోవాలని పౌలు చెపుతున్నాడు?

ఫిలిప్పీయులు ఒకరినొకరు తమ కంటే ఇతరులు ఎక్కువ వారిగా ఎంచుకోవాలని పౌలు చెపుతున్నాడు(2:3).

Philippians 2:5

మనం ఎవరి మనసు కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు?

క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు(2:5-6).

క్రీస్తు యేసు ఏ స్వరూపంలో ఉన్నాడు?

క్రీస్తు యేసు దేవుని స్వరూపంలో ఉన్నాడు(2:6).

క్రీస్తు యేసు ఏ రూపం తీసుకున్నాడు?

క్రీస్తు యేసు మనిషి పోలికలో కనపడి దాసుని స్వరూపం తీసుకొన్నాడు(2:7).

యేసు తనను తానే ఎలా తగ్గించుకున్నాడు?

యేసు తనను తానే సిలువపై మరణం పొందేటంతగా విధేయత చూపి తగ్గించుకున్నాడు(2:8).

Philippians 2:9

అప్పుడు దేవుడు యేసు కోసం ఏమి చేశాడు?

దేవుడు ఆయనను ఎంతో గొప్పగా హెచ్చించి అన్ని పేర్లు కంటే ఉన్నతమైన పేరు ఆయనకు ఇచ్చాడు(2:9).

ప్రతి నాలుకా ఏమని ఒప్పుకోవాలి?

ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకోవాలి(2:11).

Philippians 2:12

ఫిలిప్పీయులు రక్షణను ఎలా కొనసాగాలని పిలిచాడు?

ఫిలిప్పీయులు రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగాలని పిలిచాడు(2:12).

విశ్వాసుల్లో దేవుడు పని చేయటానికి ఏం చెయ్యాలి?

విశ్వాసుల్లో దేవుడు తనకు ఇష్టమైన ఉద్దేశం ప్రకారం సంకల్పించడానికీ చేయడానికీ పనిచేస్తున్నాడు(2:13).

Philippians 2:14

ఏం లేకుండా ప్రతిదీ జరగాలి?

సణుగులూ వివాదాలు లేకుండా ప్రతిదీ జరగాలి (2:14).

Philippians 2:17

ఏ ఉద్దేశం కోసం పౌలు తన జీవితాన్నిధార పోశాడు?

ఫిలిప్పీయుల విశ్వాససంబంధమైన సేవలోనూ విశ్వాసయాగంలోనూ పౌలు తన జీవితాన్ని ధార పోశాడు(2:17).

పౌలు ఏ వైఖరిని కలిగి ఉన్నాడు, ఫిలిప్పీయులు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని పిలిచాడు?

పౌలు సంతోషతో కూడిన గొప్ప ఆనందo కలిగి ఉన్నాడు, ఫిలిప్పీయులు అలాంటి వైఖరే కలిగి ఉండాలని పిలిచాడు(2:17-18).

Philippians 2:19

ఎందుకు పౌలు తిమోతి ఒక ప్రత్యేకమైన సహకారి?

తిమోతి తన స్వలాభం కోసం కాక ఫిలిప్ఫీయుల కోసం నిజమైన శ్రద్ధ తీసుకోడం వల్ల పౌలుకి తిమోతి ఒక ప్రత్యేకమైన సహకారి(2:20-21).

Philippians 2:22

ఫిలిప్ఫీయులను చూడటానికి పౌలు ఎదురు చూస్తున్నాడా?

అవును, త్వరలో ఫిలిప్ఫీయులను చూడటానికి పౌలు ఎదురు చూస్తున్నాడు(2:24).

Philippians 2:28

ఎపఫ్రోదితు చనిపోయేoతగా దేని కోసం పాటుబడ్డాడు?

పౌలు అవసరాలకు కావలసిన వాటినీ ఏర్పాటు చేస్తూ క్రీస్తు పనికై ఎపఫ్రోదితు చనిపోయేoతగా పాటుబడ్డాడు (2:30).


Chapter 3

Translation Questions

Philippians 3:1

విశ్వాసులు ఏవరిని జాగ్రత్తగా కనిపెట్టాలని పౌలు హెచ్చరించాడు?

కుక్కలనూ, దుష్టులైన పనివారినీ, ఛేదన ఆచరించే వారిని విశ్వాసులు జాగ్రత్తగా కనిపెట్టాలని పౌలు హెచ్చరించాడు(3:2).

నిజమైన సున్నతి అంటే ఏమిటని పౌలు చెప్పాడు?

శరీరం మీద నమ్మకం పెట్టుకొనక క్రీస్తు యేసు మహిమలో దేవుని ఆత్మలో ఆరాధించే వారిదే నిజమైన సున్నతి అని పౌలు చెప్పాడు (3:3).

Philippians 3:6

ధర్మశాస్త్ర నీతి ప్రకారం పౌలు తన గత ప్రవర్తన విషయంలో ఎలాంటి వాడినని చెపుతున్నాడు?

ధర్మశాస్త్ర నీతి ప్రకారం పౌలు తన గత ప్రవర్తన విషయంలో తప్పులేని వాడినని చెపుతున్నాడు(3:6).

పౌలు తన శరీర సంబంధంమైన గత విశ్వాసం గూర్చి ఇప్పుడు ఎలా అనుకుంటున్నాడు?

పౌలు తన శరీర సంబంధంమైన గత విశ్వాసం ఇప్పుడు క్రీస్తు ద్వారా విలువలేనిదిగా లెక్కిస్తున్నాడు(3:7).

Philippians 3:8

పౌలు ఇప్పుడు తన గత ప్రవర్తన విషయలన్ని అర్ధం పర్దం లేని చెత్త అని ఏ ఉద్దేశంతో తలస్తున్నాడు?

ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోడం వల్ల పౌలు తన గత ప్రవర్తన విషయలన్ని అర్ధం పర్దం లేని చెత్త అని తలస్తున్నాడు(3:8).

పౌలు ఇప్పుడెలాంటి నీతి కలిగి ఉన్నాడు?

క్రీస్తునందు విశ్వాసం ద్వారా పౌలు ఇప్పుడు దేవుని నీతి కలిగి ఉన్నాడు(3:9).

క్రీస్తులో పౌలు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడు?

క్రీస్తు శ్రమల్లో పౌలు సహవాసం కలిగి ఉన్నాడు(3:10).

Philippians 3:12

పౌలు ముగించనప్పటికీ, ఏం కొనసాగించాలని ఉన్నాడు?

పౌలు ఎడతెగక ముందుకు కొనసాగుతున్నాడు(3:12).

ఎలాటి గురి వైపు పౌలు కొనసాగుతున్నాడు ?

క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు చెందే బహుమతి కోసం గురి వైపు పౌలు కొనసాగుతున్నాడు(3:14).

Philippians 3:17

తన ఆదర్శాన్ని బట్టి ఫిలిప్పీయులు ఎలా నడుచుకోవాలని పౌలు కోరాడు ?

తన ఆదర్శాన్ని, నడకను వారు అనుకరించాలని పౌలు కోరాడు (3:17).

ఎవరి కడుపు వారికి దేవుడో, ఎవరు లోక విషయాలపై మనస్సు ఉంచుతారో వారి గతి ఏమవుతుంది?

ఎవరి కడుపు వారికి దేవుడో, ఎవరు లోక విషయాలపై మనస్సు ఉంచుతారో వారి అంతం నాశనమే (3:19).

Philippians 3:20

విశ్వాసుల పౌరసత్వం ఎక్కడ ఉందని పౌలు చెప్పాడు?

విశ్వాసుల పౌరసత్వం పరలోకంలో ఉందని పౌలు చెప్పాడు(3:20).

పరలోకం నుండి ఆయన వచ్చినప్పుడు విశ్వాసుల శరీరాలకు క్రీస్తు ఏం చేస్తాడు?

క్రీస్తు విశ్వాసుల దీన శరీరాలను ఆయన మహిమ శరీరo వలె మారుస్తాడు(3:21).


Chapter 4

Translation Questions

Philippians 4:1

ఫిలిప్పీ లోని తన ప్రియ స్నేహితులు ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?

వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని పౌలు కోరుతున్నాడు (4:1).

యువోదియ, సుంటుకేలిద్దరూ ఎలా ఉండాలని పౌలు కోరుతున్నాడు?

యువోదియ, సుంటుకేలిద్దరూ ఏక మనస్సు కలిగి ఉండాలని పౌలు కోరుతున్నాడు?

Philippians 4:4

ఎల్లప్పడు ఫిలిప్పీయులు ఏం చెయ్యాలని పౌలు చెప్పాడు?

ఎల్లప్పడు ప్రభువులో ఆనందించమని వారికి చెప్పాడు(4:4).

కలత చెందటానికి బదులు ఏం చెయ్యాలి అని పౌలు చెప్పాడు?

కలత చెందటానికి బదులు మనకు అవసరమైన వాటిని దేవునికి కృతజ్ఞతతో ప్రార్ధనలో ఆయనకు చెప్పాలని పౌలు చెప్పాడు(4:6).

ఈ విధంగా చేస్తే, మన హృదయాలకు తలంపులకు ఏం కావలి ఉంటుంది?

ఈ విధంగా చేస్తే, మన హృదయాలకు తలంపులకు దేవుని శాంతి కావలిగా ఉంటుంది(4:7).

Philippians 4:8

ఏలాంటి వాటి పైన మనసు పెట్టాలని పౌలు చెపుతున్నాడు?

గౌరవిoచదగినవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, అందమైనవి, మంచి పేరుగలవి, శ్రేష్టమైనవి, మెప్పుకు తగిన వాటి పైన మనసు పెట్టాలని పౌలు చెపుతున్నాడు(4:8).

Philippians 4:10

ఇప్పుడు ఫిలిప్పీయులు దేనిని నూతన పరచగలుగుతున్నారు?

ఇప్పుడు ఫిలిప్పీయులు పౌలు పట్ల తమ శ్రద్ధను నూతన పరచ గలుగుతున్నారు (4:10).

వివిధ పరిస్థితుల్లో జీవించగలిగే ఎలాటి రహస్యాన్ని పౌలు నేర్చుకున్నాడు?

కలిమిలోనూ లేమిలోనూ కూడా తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు (4:11,12).

పౌలు ఏ శక్తి మూలంగా తృప్తిగా జీవించగలుగుతున్నాడు?

పౌలు అన్ని పరిస్థితుల్లోనూ క్రీస్తు తనను బలపరచిన కొద్దీ తృప్తిగా జీవించ గలుగుతున్నాడు (4:13).

Philippians 4:14

పౌలు తన అవసరాల కోసం ఫిలిప్పీయులు సమకూర్చి ఇస్తున్న వాటికి ప్రతిఫలంగా ఏమి దక్కాలని కోరుకుంటున్నాడు?

పౌలు తన అవసరాల కోసం ఫిలిప్పీయులు సమకూర్చి ఇస్తున్న వాటికి ప్రతిఫలంగా వారి లెక్కకు విస్తార ఫలాలు రావాలని పౌలు కోరుకుంటున్నాడు(4:4-17).

Philippians 4:18

పౌలు కోసం ఫిలిప్ఫీయులు పంపిన కానుక దేవుడు ఎలా చూసాడు?

పౌలు కోసం ఫిలిప్పీయులు పంపిన కానుక దేవునికి ఇష్టమైన అర్పణ లాగా ఉన్నది(4:18).

ఫిలిప్పీయుల కోసం దేవుడు ఏం చేస్తాడని పౌలు చెప్పాడు?

దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్యమైన ఐశ్వర్యం ప్రకారం ఫిలిప్ఫీయుల అక్కరలన్నీ తీరుస్తాడని పౌలు చెప్పాడు(4:19).

Philippians 4:21

పౌలు ఏ ఇంటివారి అభినందనలు ఫిలిప్పీయులకు చెపుతున్నాడు?

పౌలు ఫిలిప్పీయులకు కైసరు ఇంటివారి అభినందనలు చెపుతున్నాడు(4:22).


Chapter 1

Translation Questions

Colossians 1:1

క్రీస్తు యేసు అపోస్తులుడుగా పౌలు ఎలా అయ్యాడు?

క్రీస్తు యేసు అపోస్తులుడుగా పౌలు దేవుని చిత్తం వలన అయ్యాడు(1:1).

పౌలు ఎవరికి ఈ లేఖ వ్రాశాడు?

పౌలు ఈ లేఖ కొలొస్సయిలో ఉన్న దేవుని కోసం ప్రత్యేకపరచుకొనిన వారికీ, విశ్వాసులైన సోదరులకు వ్రాశాడు(1:1)

Colossians 1:4

ఇప్పుడు కొలొస్సయులు కలిగి ఉన్న నమ్మకమైన ఆశాభావం ఎక్కడ నుంచి విన్నారు?

కొలొస్సయులు కలిగివున్న నమ్మకమైన ఆశాభావం గూర్చి శుభవార్త అనే సత్య వాక్కులో విన్నారు(1:5).

శుభవార్త లోకంలో ఏం చేస్తూoదని పౌలు చెపుతున్నాడు?

శుభవార్త లోకంలో ఫలిస్తూ ఎదుగుతున్నదని పౌలు చెపుతున్నాడు(1:6).

Colossians 1:7

శుభవార్త కొలొస్సయులకు ఎవరు పరిచయం చేశారు?

శుభవార్త కొలొస్సయులకు నమ్మకమైన క్రీస్తు సేవకుడు ఎపఫ్రా పరిచయం చేశాడు(1:7).

Colossians 1:9

కొలొస్సయులు దేనితో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు?

కొలొస్సయులు ఆత్మ సంబంధమైన వివేకం, దేవుని చిత్తం గూర్చిన సంపూర్ణ జ్ఞానంతో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు(1:9).

కొలొస్సయులు తమ జీవితంలో ఎలా నడుచుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు?

కొలొస్సయులు తమ జీవితంలో ప్రభువుకు తగిన విధంగా నడుస్తూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, దేవుని జ్ఞానంలో వృద్ధి చెందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు(1:10).

Colossians 1:11

దేవుని కోసం ప్రత్యేకించినవారు దేనికి యోగ్యులు?

దేవుని కోసం ప్రత్యేకించినవారు వెలుగులో ఉన్న వారసత్వంలో పాలిభాగస్థ్హులవటానికి యోగ్యులయ్యారు(1:12).

Colossians 1:13

ఆయన కోసం ప్రత్యేకించినవారిని తండ్రి వేటి నుంచి విడిపించాడు?

ఆయన కోసం ప్రత్యేకించినవారిని తండ్రి చీకటి పరిపాలన నుంచి విడిపించి ఆయన కుమారుని రాజ్యoలోకి తెచ్చాడు(1:13).

క్రీస్తులో మనకు విమోచన అంటే ఏంటి?

క్రీస్తులో విమోచన అంటే మన పాపాలకు క్షమాపణ(1:14).

Colossians 1:15

కుమారుడు ఎవరి స్వరూపం?

కుమారుడు కనిపించని దేవుని స్వరూపం(1:15).

యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం ఏం సృష్టించడం జరిగింది?

యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం అన్నీoటినీ సృష్టించడం జరిగింది(1:16).

Colossians 1:18

ఎలా దేవుడు తానే అన్నిటినీ సమాధానంతో సఖ్యపరచుకున్నాడు?

దేవుడు తానే అన్నిటిని తన కుమారుని రక్తం ద్వారా సమాధానంతో సంధి చేసుకొని సఖ్యపరచుకొన్నాడు(1:20).

Colossians 1:21

కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగియున్నారు?

కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునికి పరాయివారునూ, ఆయనకు శత్రువులైయున్నారు(1:21).

కొలస్సయులు నిరంతరం ఏం చేయాలి?

కొలస్సయులు నిరంతరం శుభవార్తలో నమ్మకముంచి విశ్వాసంలో స్థిరంగా ఉoడాలి (1:23).

Colossians 1:24

పౌలు దేని కోసం బాధలు పడుతున్నాడు, అతని వైఖరి ఏంటి?

పౌలు సంఘం కోసం బాధలు పడుతూ వాటిలో ఆనందిస్తున్నాడు(1:24).

యుగాల నుండి దాగి ఉండి ఇప్పుడు వెల్లడయిన రహస్యo ఏంటి?

యుగాల నుండి దాగి ఉన్న రహస్యం ఇప్పుడు మీలో ఉన్న క్రీస్తులో వెల్లడయ్యింది, ఆయనే మహిమకు ఆశాభావం(1:27).

Colossians 1:28

పౌలు ఉపదేశమూ హెచ్చరికల లక్ష్యం ఏంటి?

పౌలు ఉపదేశమూ హెచ్చరికల లక్ష్యం క్రీస్తులో ప్రతి ఒక్కరినీ సంపూర్ణులుగా సమర్పించడం (1:28).


Chapter 2

Translation Questions

Colossians 2:1

దేవుని రహస్యం ఏoటి?

దేవుని రహస్యం క్రీస్తు(2:2).

క్రీస్తులో ఏం దాగి ఉన్నాయి?

క్రీస్తులో జ్ఞానవివేకాల నిధులన్నీ దాగి ఉన్నాయి(2:3).

Colossians 2:4

కొలొస్సయులకు ఏమి అవుతుందని పౌలు కలత చెందాడు?

కొలొస్సయులు ఒప్పింప చేసే మాటలతో మోసపోతారేమోనని పౌలు కలత చెందాడు(2:4).

Colossians 2:6

కొలొస్సయులు ఇప్పుడు క్రీస్తు యేసును స్వీకరించినందుకు ఏం చేయాలని పౌలు పిలిచాడు?

కొలొస్సయులు క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే నడుచుకోవాలని పౌలు పిలిచాడు(2:6).

Colossians 2:8

పౌలు కలత చెందుతున్నఅర్ధం లేని వట్టి మోసాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి?

అర్ధంలేని వట్టి మోసాలు, మానవ ఆచారాల పైన, లోకంలోని పాపభూయిష్టమైన వ్యవస్థలపైనా ఆధారపడి ఉన్నాయి(2: 8).

క్రీస్తులో ఏమి నివసిస్తున్నది?

క్రీస్తులో దేవుని స్వభావo సంపూర్తిగా నివసిస్తున్నది(2: 9).

Colossians 2:10

ప్రభుత్వాలకూ ఆధిపత్యాలకూ అధికారి ఎవరు?

ప్రభుత్వాలకూ ఆధిపత్యాలకూ అధికారి క్రీస్తు(2:10).

క్రీస్తు సున్నతి ద్వారా ఏమి తొలగించాడు?

క్రీస్తు సున్నతి ద్వారా శరీర సంబంధమైన పాప స్వభావాన్ని తొలగించాడు(2:11).

బాప్తిసంలో ఏం జరుగుతుంది?

బాప్తిసంలో ఒక వ్యక్తిని క్రీస్తుతో కూడా పాతిపెట్టడం జరిగింది(2:12).

Colossians 2:13

క్రీస్తు ఒకని సజీవంగా చేయక ముoదు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి?

క్రీస్తు ఒకని సజీవంగా చేయక ముoదు ఆ వ్యక్తి అపరాధాలలో చనిపోయి ఉన్నాడు(2:13).

మనకు విరోధంగా ఉన్న రుణపత్రంతో క్రీస్తు ఏం చేశాడు?

మనకు విరోధంగా ఉన్న రుణపత్రం తొలగించి దానిని సిలువకు మేకులతో కొట్టాడు(2:14).

క్రీస్తు ప్రధానులతో అధికారులతో ఏం చేశాడు?

క్రీస్తు ప్రధానులనూ అధికారులనూ తొలగించి జయోత్సం ఊరేగింపులో వారిని నడిపించి బహిరంగంగా కనపడేలాచేసాడు (2:15).

Colossians 2:16

రాబోయే వాటికి నీడలు ఏoటని పౌలు చెపుతున్నాడు?

రాబోయే వాటికి నీడలు అన్నపానాలు, పండుగలు, విశ్రాంతి రోజులని పౌలు చెపుతున్నాడు(2:17).

నీడలు ఏ వాస్తవాన్ని చూపుతున్నాయి?

నీడలు క్రీస్తులోని వాస్తవాన్ని చూపుతున్నాయి(2:17).

Colossians 2:18

ఎలా శరీరమంతా కలిపి అమర్చి ఉన్నది?

శరీరమంతా క్రీస్తు అనే శిరస్సు వలన కలసి అమరి ఉన్నది(2:19).

Colossians 2:20

లోకసంబంధమైన నమ్మకాల్లో ఏవి భాగాలని పౌలు చెబుతున్నాడు?

ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు, తాకవద్దు అనే వాటికీ సంబంధించిన ఆజ్ఞలు లోకసంబంధమైన నమ్మకాల్లో భాగాలు (2: 20-22).

వేటితో పోల్చుకుంటే మానవ కల్పిత మత నియమాలకు విలువ లేదు?

శరీర వాంఛలతో పోల్చుకుంటే మానవ కల్పిత మతనియమాలకు విలువ లేదు (2:23).


Chapter 3

Translation Questions

Colossians 3:1

ఎక్కడకు క్రీస్తు లేపబడ్డాడు?

క్రీస్తు దేవుని కుడి చేతి ప్రక్కన కూర్చోడానికి లేపబడ్డాడు(3:1).

విశ్వాసులు ఏం వెదకాలి, ఏం వెదకకూడదు?

విశ్వాసులు పైవాటిని వెదకాలి, భూలోక విషయాలు కాదు(3:1-2).

దేవుడు విశ్వాసి జీవాన్ని ఎక్కడ ఉంచాడు?

దేవుడు విశ్వాసి జీవాన్ని క్రీస్తులో దాచి ఉంచాడు(3:3).

క్రీస్తు కనిపించినపుడు విశ్వాసులకు ఏమవుతుంది?

క్రీస్తు కనిపించినపుడు విశ్వాసులు కూడా మహిమలో కనిపిస్తారు(3:4).

Colossians 3:5

విశ్వాసి వేటిని చంపెయ్యాలి?

విశ్వాసి భూసంబంధమైన పాప కోరికలను చంపెయ్యాలి(3:5).

దేవునికి అవిధేయులైన వారికి ఏమవుతుంది?

దేవునికి అవిధేయులైన వారి పైకి దేవుని ఉగ్రత వస్తుంది(3:6).

పాత స్వభావానికి సంబంధించి విశ్వాసులు ఏం వదులుకోవాలని పౌలు చెపుతున్నాడు?

పాత స్వభావానికి సంబంధించి విశ్వాసులు కోపం, ఆగ్రహం, చెడు ఉద్దేశ్యాలు, అవమానించడం, చెడు మాటలు, అబద్దాలు వదులుకోవాలని పౌలు చెపుతున్నాడు(3:8-9).

Colossians 3:9

విశ్వాసులు నూతన స్వభావo ఎవరి పోలికలో సృష్టించడం జరిగింది?

విశ్వాసులు నూతన స్వభావo క్రీస్తు పోలికలో సృష్టించడం జరిగింది(3:10).

Colossians 3:12

నూతన స్వభావానికి సంబంధిoచి విశ్వాసులు ధరించాలిసినవి ఏంటని పౌలు చెపుతున్నాడు?

నూతన స్వభావానికి సంబంధిoచి విశ్వాసులు జాలి గల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోవాలని పౌలు చెపుతున్నాడు(3:12).

విశ్వాసి ఏ విధానంలో క్షమిoచాలి?

ప్రభువు అతనిని క్షమిoచిన విధానంలో క్షమిoచాలి(3:13).

విశ్వాసుల మధ్య పరిపూర్ణమైన బంధం ఏంటి?

విశ్వాసుల మధ్య పరిపూర్ణమైన బంధం ప్రేమే(3:14).

Colossians 3:15

విశ్వాసి హృదయoలో ఏం పరిపాలిస్తూ ఉండాలి?

విశ్వాసి హృదయoలో క్రీస్తు శాంతి పరిపాలిస్తూ ఉండాలి(3:15).

విశ్వాసిలో ఏం సమృద్ధిగా జీవించాలి?

విశ్వాసిలో క్రీస్తు వాక్కు సమృద్ధిగా జీవించాలి(3:16).

విశ్వాసి వైఖరీ, పాట, మాట, పనులు దేవునికి ఇవ్వడంలో ఏ విధంగా ఉండాలి?

విశ్వాసి వైఖరి, పాట, మాట, పనులు దేవునికి ఇవ్వడంలో కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి(3:15-17).

Colossians 3:18

భార్య తన భర్తకు తగినట్టు ఎలా ఉండాలి?

భార్య తన భర్తకు లోబడి ఉండాలి(3:18).

భర్త ఏ విధంగా తన భార్యతో ప్రవర్తించాలి?

భర్త తన భార్యను ప్రేమిస్తూ ఆమెతో కఠినంగా ప్రవర్తించకూడదు(3:19).

పిల్లలు ఏ విధంగా తమ తల్లితండ్రుల పట్ల ప్రవర్తించాలి?

పిల్లలు తమ తల్లితండ్రులకు అన్నీ విషయాలలో విధేయులై ఉండాలి (3:20).

తండ్రి తన పిల్లలకు ఏం చేయకూడదు?

తండ్రి తన పిల్లలకు కోపం పుట్టించకూడదు(3:21).

Colossians 3:22

విశ్వాసులు చేసే పని ఏదైనా ఎవరికి చేయాలి?

విశ్వాసులు చేసే పని ఏదైన ప్రభువు కోసమే చేయాలి(3:23-24).

ఏం చేసిన ప్రభువు సేవ కోసం చేసేవాడు ఏం పొందుతాడు?

ఏం చేసినా ప్రభువు సేవ కోసం చేసేవాడు వారసత్వాన్ని పొందుతాడు (3:24).

అక్రమం చేసేవాడు ఏం పొందుతాడు?

అక్రమం చేసేవాడు తను చేసిన దానికి ప్రతిఫలం పొందుతాడు. (3:25).


Chapter 4

Translation Questions

Colossians 4:1

భూసంబంధమైన యజమానులు ఏం కలిగియున్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు?

భూసంబంధమైన యజమానులకు కూడా పరలోకంలో యజమానుడొకడు ఉన్నాడని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు(4:1).

Colossians 4:2

కొలొస్సయులు ఏ విషయంలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు?

కొలొస్సయులు ప్రార్థనలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు(4:2).

పౌలు దేని కోసం ప్రార్దించమని కొలొస్సయులను కోరుతున్నాడు?

క్రీస్తు రహస్యం, వాక్కు చెప్పుటకు ఆయన తలుపు తెరిచేలా ప్రార్దించమని పౌలు కొలొస్సయులను కోరుతున్నాడు(4:3).

Colossians 4:5

సంఘం బయట ఉన్నవారిని కొలస్సయులు ఎలా ఆదరించాలని పౌలు ఉపదేశిస్తున్నాడు?

సంఘం బయట ఉన్నవారి యెడల జ్ఞానంగా జీవిస్తూ దయతో మాట్లాడి ఆదరించాలని కొలస్సయులకు పౌలు ఉపదేశిస్తున్నాడు(4:5-6).

Colossians 4:7

తుకికుకూ ఒనేసిములకు ఏ పని పౌలు అప్పగించాడు?

తుకికుకూ ఒనేసిములకు పౌలు తనను గూర్చిన విషయాలు కొలొస్సయులకు తెలియజేసే పని అప్పగించాడు(4:7-9).

Colossians 4:10

పౌలు బర్నబా సమీప బంధువైన మార్కును గూర్చి ఏ విధమైన ఆదేశాలు ఇచ్చాడు?

కొలొస్సయుల దగ్గరకు మార్కు వస్తే అతన్ని స్వీకరించoడని పౌలు వారికీ చెప్పాడు (4:10).

Colossians 4:12

కొలొస్సయుల కోసం ఎపఫ్రా ఏమని ప్రార్ధిస్తున్నాడు?

కొలొస్సయులు దేవుని సంకల్పంలో పూర్తి నిశ్చయతతో సుస్థిరంగా నిలిచి ఉండాలని ఎపఫ్రా ప్రార్ధిస్తున్నాడు(4:12).

పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు ఏంటి?

పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు లూకా (4:14).

Colossians 4:15

లవొదికయ సంఘ సమావేశం ఎలాంటి స్థలంలో ఉన్నది?

లవొదికయలోని సంఘo ఇంట్లో సమావేశమయ్యేది (4:15).

ఏ ఇతర సంఘానికి కూడా పౌలు ఉత్తరం వ్రాయటం జరిగింది?

లవొదికయలోని సంఘానికి కూడా పౌలు ఉత్తరం వ్రాయటం జరిగింది (4:16).

Colossians 4:18

పౌలు ఏ విధంగా ఈలేఖ తన నుంచే కలిగిందని కనపరచాడు?

పౌలు ఈ లేఖ చివరన తన స్వదస్తూరితో సంతకం చేశాడు (4:18).


Chapter 1

Translation Questions

1 Thessalonians 1:2

తెస్సలోనికయుల గురించి పౌలు ఎల్లప్పుడూ దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకునేది ఏమిటి?

వారి విశ్వాస క్రియలనూ, వారి ప్రేమపూర్వక ప్రయాసనూ, ఓపికతో కూడిన నిరీక్షణనూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు (1: 3).

1 Thessalonians 1:4

తెస్సలోనికయుల దగ్గరకు ఏ నాలుగు విధాలుగా సువార్త వచ్చింది?

తెస్సలోనికయుల దగ్గరకు సువార్త మాటతో, ప్రభావంతో, పరిశుద్ధాత్మతో, గొప్ప నిబ్బరంతో వచ్చింది (1: 5).

1 Thessalonians 1:6

సువార్త వాక్కు వింటున్నప్పుడు తెస్సలోనికయులకు ఏమి జరుగుతున్నది?

అనేక బాధల్లో ఉండి తెస్సలోనికయులు వాక్కును విన్నారు (1: 6).

సువార్త వాక్కును విన్నప్పుడు తెస్సలోనికయుల వైఖరి ఏమిటి?

పరిశుద్ధాత్మ లోని ఆనందంతో తెస్సలోనికయులు వాక్కును స్వీకరించారు (1: 6)

1 Thessalonians 1:8

తెస్సలోనికయులు ప్రభువు వాక్కును స్వీకరించిన తరువాత ఏమి జరిగింది?

వారి విశ్వాసం వెళ్ళిన చోటల్లా వాక్కు ప్రతిధ్వనించింది (1: 8).

నిజ దేవుణ్ణి నమ్ముకోక ముందు తెస్సలోనికయులు ఎవరిని పూజించేవారు?

నిజ దేవుణ్ణి నమ్ముకోక ముందు తెస్సలోనికయులు విగ్రహాలను పూజించేవారు (1: 9)

పౌలు, తెస్సలోనికయులు దేని కోసం ఎదురు చూస్తున్నారు?

పౌలు, తెస్సలోనికయులు పరలోకం నుంచి యేసు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు (1: 10).

దేని నుండి యేసు మనలను విడిపిస్తాడు?

రానున్న ఉగ్రత నుండి విడిపిస్తాడు.


Chapter 2

Translation Questions

1 Thessalonians 2:1

తెస్సలోనికకు రాక ముందు పౌలు అతని సహచరులు ఎలాటి అనుభవాలు పొందారు?

వారు బాధల పాలై, అవమాన కరమైన అనుభవాలు పొందారు (2: 2)

1 Thessalonians 2:3

పౌలు తన సువార్త బోధన మూలంగా ఎవరిని సంతోష పరచగోరుతున్నాడు?

పౌలు తన సువార్త బోధన మూలంగా దేవుణ్ణి మాత్రమే సంతోషపరచ గోరుతున్నాడు (2: 4- 6)

1 Thessalonians 2:5

పౌలు తన సువార్త ప్రకటనలో ఏది చేయలేదు?

పౌలు ముఖస్తుతి మాటలను, దురాశను కనుపరచలేదు.

1 Thessalonians 2:7

వారి మధ్య ఉన్నపుడు పౌలు తెస్సలోనికయుల పట్ల ఎలా ప్రవర్తించాడు?

తమ స్వంత పిల్లలతో తల్లి, తండ్రి ఎలా ఉంటారో అలా మృదువుగా పౌలు తెస్సలోనికయుల పట్ల ప్రవర్తించాడు [2:7-8,11].

తెస్సలోనికయులకు భారంగా ఉండకూడదని పౌలు అతని అనుచరులు ఏమి చేశారు?

తెస్సలోనికయులకు భారంగా ఉండకూడదని పౌలు అతని అనుచరులు పగలూ రాత్రీపని చేశారు [2:9].

1 Thessalonians 2:10

తెస్సలోనికయులు ఎలా నడుచుకోవాలని పౌలు చెప్పాడు?

వారిని తన రాజ్యానికీ మహిమకు పిలిచిన దేవునికి తగినట్టుగా తెస్సలోనికయులు నడుచుకోవాలని పౌలు చెప్పాడు (2: 12)

1 Thessalonians 2:13

పౌలు తమకు బోధించిన దానిని తెస్సలోనికయులు దేనిగా స్వీకరించారు?

మానవ వాక్కుగా కాక దేవుని వాక్కుగా తెస్సలోనికయులు స్వీకరించారు (2: 13).

1 Thessalonians 2:14

నమ్మని యూదులు దేవునికి అయిష్టమైన పని ఏమి చేశారు?

నమ్మని యూదులు యూదయ లోని సంఘాలను హింసించారు. యేసును ప్రవక్తలను చంపారు. పౌలును వెళ్ళగొట్టారు. అతడు యూదేతరులతో మాట్లాడడం నిషేధించారు (2: 14- 16)

1 Thessalonians 2:17

అది తన కోరిక అయినప్పటికీ పౌలు తెస్సలోనికాకు ఎందుకు రాలేక పోయాడు?

సాతాను అతణ్ణి ఆటంక పరచినందువల్ల అతడు రాలేక పోయాడు (2: 17- 18).

ప్రభువు రాకడ సమయంలో పౌలు పాలిట తెస్సలోనికయులు ఎలా ఉంటారు?

ప్రభువు రాకడ సమయంలో తెస్సలోనికయులు పౌలు పాలిట నిరీక్షణ, ఆనందం, మహిమ కిరీటంగా ఉంటారు (2: 19- 20)


Chapter 3

Translation Questions

1 Thessalonians 3:1

పౌలు ఎతెన్సులో ఉండి పోవలసి వచ్చినా ఏమి చేశాడు?

తెస్సలోనికలోని విశ్వాసులను బలపరచడానికి, ఆదరించడానికి తిమోతిని పంపాడు (3: 1: 2).

పౌలు తాను దేనికోసం నియమితుడయ్యాడని చెప్పాడు?

తాను బాధలు అనుభవించడం కోసమే నియమితుడయ్యాడని చెప్పాడు (3: 3).

1 Thessalonians 3:4

తెస్సలోనికయుల్లో దేని విషయం పౌలు అందోళనగా ఉన్నాడు?

తెస్సలోనికయులను శోధకుడు తప్పు దారి పట్టించాడేమోననీ, తన ప్రయాస అంతా వ్యర్థం అయిపోతుందేమో అనీ పౌలు అందోళనగా ఉన్నాడు (3: 5).

1 Thessalonians 3:6

తిమోతి తెస్సలోనికకు తిరిగి వచ్చినపుడు పౌలును ఏది ఆదరించింది?

తెస్సలోనికయుల విశ్వాస ప్రేమల గురించిన వార్త, వారు తనను చూడాలని ఆశిస్తున్నారనే వార్త విని పౌలు ఆదరణ పొందాడు (3: 6- 7)

1 Thessalonians 3:8

తెస్సలోనికయులు ఏమి చేస్తే తాను బతికిపోతానని చెప్పాడు?

వారు ప్రభువులో స్థిరంగా నిలబడితే తాను బతికిపోతానని పౌలు చెప్పాడు (3: 10).

పౌలు రేయింబవళ్ళు దేని కోసం ప్రార్థిస్తున్నాడు ?

తను తెస్సలోనికయులను చూడాలని, వారి విశ్వాసంలో కొరతగా ఉన్నదాన్ని పూర్తి చేయాలనీ పౌలు రేయింబవళ్ళు ప్రార్థిస్తున్నాడు (3: 10).

1 Thessalonians 3:11

తెస్సలోనికయులు దేనిలో ఎదిగి అభివృద్ధి చెందాలని పౌలు ఆశిస్తున్నాడు?

తెస్సలోనికయులు ఒకరి పట్ల ఒకరు, అందరి పట్ల ప్రేమలో వర్థిల్లాలని ఆశిస్తున్నాడు (3: 12).

తెస్సలోనికయులు తమ హృదయాలను నిర్దోషంగా పవిత్రంగా ఉంచుకుని ఏ సంభవం కోసం ఎదురు చూడాలని పౌలు కోరుతున్నాడు?

యేసు ప్రభువు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చేటప్పుడు తెస్సలోనికయులు అయన రాక కోసం సిద్ధంగా ఉండాలని పౌలు కోరుతున్నాడు (3: 13).


Chapter 4

Translation Questions

1 Thessalonians 4:1

తెస్సలోనికయులు ఎలా నడుచుకోవాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనే తన సూచనల విషయంలో వారు ఏమి చేయాలి అని పౌలు కోరుతున్నాడు?

తెస్సలోనికయులు దేవునితో నడక కొనసాగిస్తూ ఆయన్ని సంతోషపరుస్తూ, దాన్ని మరింత ఎక్కువగా చేయాలని పౌలు కోరుతున్నాడు (4: 1-2).

1 Thessalonians 4:3

తెస్సలోనికయుల విషయంలో దేవుని సంకల్పం ఏదని పౌలు అన్నాడు?

తెస్సలోనికయుల విషయంలో దేవుని సంకల్పం వారు పరిశుద్ధులు కావడమేనని పౌలు అన్నాడు (4: 3)

భర్తలు తమ భార్యలను ఎలా చూసుకోవాలి?

భర్తలు తమ భార్యలను పరిశుద్ధతతో గౌరవపూర్వకంగా చూసుకోవాలి (4: 4).

లైంగిక అవినీతి విషయంలో తప్పటడుగు వేసిన సహోదరునికి ఏమి జరుగుతుంది?

లైంగిక అవినీతి విషయంలో తప్పటడుగు వేసిన సహోదరునిపై ప్రభువే ప్రతీకారం చేస్తాడు (4: 6).

1 Thessalonians 4:7

పరిశుద్ధతకై పిలుపును త్రోసిపుచ్చిన వ్యక్తి ఏమి చేస్తున్నాడు?

పరిశుద్ధతకై పిలుపును త్రోసిపుచ్చిన వ్యక్తి ప్రభువునే తిరస్కరిస్తున్నాడు (4: 8).

1 Thessalonians 4:9

దేన్ని మరింతగా చేయాలని తెస్సలోనికయులకు పౌలు కోరాడు?

తెస్సలోనికయులు మరింతగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని పౌలు కోరాడు (4: 9,10).

తమకేమీ కొదువ లేకుండా అవిశ్వాసుల ఎదుట యోగ్యంగా నడచుకోనేలా తెస్సలోనికయులు ఏమి చెయ్యాలి?

తెస్సలోనికయులు నెమ్మది గలిగి తమ స్వంత పనులు చూసుకుంటూ తమ చేతులతో పని చేస్తూ ఉండాలి (4: 11-12).

1 Thessalonians 4:13

ఏ విషయంలో బహుశా తెస్సలోనికయులు అపార్థంలో ఉన్నారు?

కన్నుమూసిన వారికి ఏమి అవుతుందనే విషయంలో బహుశా తెస్సలోనికయులు అపార్థంలో ఉన్నారు (4-1:13).

క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు ఎమి చేస్తాడు?

క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకు వస్తాడు (4:1- 4).

1 Thessalonians 4:16

ప్రభువు పరలోకం నుండి ఎలా దిగి వస్తాడు?

ఆర్భాటంతో దేవుని బూర శబ్దంతో ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు (4: 1- 6).

మొదట లేచేదెవరు? ఆపైన వారితో బాటు లేచేది ఎవరు?

క్రీస్తులో మృతులు మొదట లేస్తారు. ఆపైన సజీవులు వారితో బాటు ఎత్తబడతారు (4:16-17).

లేచినవారు ఎవరిని కలుసుకుంటారు? ఎంతకాలం?

లేచిన వారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. శాశ్వతంగా వారు ఆయనతో ఉంటారు (4:17).

కన్నుమూసిన వారి గురించి తను చెప్పిన ఉపదేశంతో తెస్సలోనికయులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు ?

తన ఉపదేశంతో వారు ఒకరినొకరు ఆదరించుకోవాలని పౌలు చెప్పాడు (4:18).


Chapter 5

Translation Questions

1 Thessalonians 5:1

ప్రభువు దినం ఎలా వస్తుందని పౌలు చెప్పాడు?

ప్రభువు దినం రాత్రి వేళ దొంగ వచ్చినట్టు వస్తుందని చెప్పాడు (5:2).

హటాత్తుగా వినాశం తమ పైకి వచ్చినప్పుడు మనుషులు ఏమంటారు?

కొందరు వినాశం తమ పైకి వచ్చినప్పుడు "శాంతి, భద్రత" అంటూ ఉంటారు (:53).

1 Thessalonians 5:4

ప్రభువు దినం దొంగ వలే విశ్వాసులపైకి విరుచుకుపడకూడదని పౌలు ఎందుకు అంటున్నాడు?

ఎందుకంటే వారు చీకటిలో లేరు. వారు వెలుగు సంతానం. కాబట్టి ప్రభువు దినం దొంగ వలే విశ్వాసులపైకి విరుచుకుపడకూడదు (5:45).

రానున్న ప్రభువు దినం గురించి పౌలు విశ్వాసులకు ఏమి చెబుతున్నాడు?

మెలకువ గలవారై అప్రమత్తంగా ఉండి విశ్వాసం ప్రేమ నిరీక్షణలను ధరించుకోవాలని చెబుతున్నాడు (5:6- 8).

1 Thessalonians 5:8

దేవుని ఏర్పాటులో విశ్వాసుల అంతిమ గమ్యం ఏది?

యేసు క్రీస్తులో రక్షణయే విశ్వాసుల అంతిమ గమ్యం (5:9).

1 Thessalonians 5:12

ప్రభువులో తమపై ఉన్నవారి విషయంలో విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలి?

అలాటి వారిని విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రేమ పూర్వకమైన గౌరవం చూపాలి అని పౌలు అంటున్నాడు (5:12- 13).

1 Thessalonians 5:15

తమ పట్ల కీడు జరిగితే విశ్వాసులు ఎలా స్పందించకూడదని పౌలు చెప్పాడు?

తమకు కీడు జరిగితే ప్రతికీడు చేయకూడదని చెప్పాడు (5:15).

అన్ని విషయాల్లో విశ్వాసులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు? ఎందుకు?

అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలని పౌలు చెప్పాడు. ఎందుకంటే వారి విషయంలో అది దేవుని చిత్తం (5:18).

1 Thessalonians 5:19

ప్రవచనాల గురించి పౌలు విశ్వాసులకు ఎలాటి సూచనలు ఇచ్చాడు?

ప్రవచనాలను చులకన చేయవద్దని, అయితే అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని పరిగ్రహించాలని చెప్పాడు (5: 20-21).

1 Thessalonians 5:23

దేవుడు విశ్వాసులకు ఏమి చేయాలని పౌలు ప్రార్థించాడు?

ఆత్మలో మనసులో దేహంలో దేవుడు విశ్వాసులను పరిపూర్ణంగా పవిత్రపరచాలని పౌలు ప్రార్థించాడు (5: 23).

1 Thessalonians 5:25

విశ్వాసులతో ఏమి ఉండాలి అని పౌలు ప్రార్థించాడు?

యేసు క్రీస్తు ప్రభువు కృప విశ్వాసులతో ఉండాలి అని పౌలు ప్రార్థించాడు (5:28).


Chapter 1

Translation Questions

2 Thessalonians 1:3

తెస్సలోనిక సంఘంలో ఏ రెండు సంగతుల గురించి పౌలు దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాడు?

ఒకరిపట్ల ఒకరు కనపరచుకునే విశ్వాస ప్రేమల విషయంలో పౌలు దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాడు (1: 3).

తెస్సలోనికలో విశ్వాసులు ఎలాటి పరిస్థితులు ఎదుర్కుంటున్నారు?

తెస్సలోనికలో విశ్వాసులు శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు (1: 4).

విశ్వాసులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల వల్ల కలిగిన మంచి ఫలితాలు ఏవి?

వారు దేవుని రాజ్యానికి వారసులుగా ఎంచబడతారు (1: 5).

2 Thessalonians 1:6

విశ్వాసులను బాధలు పెడుతున్న వారిని దేవుడు ఏమి చేస్తాడు?

విశ్వాసులను బాధించే వారిని దేవుడు బాధిస్తాడు. అగ్ని జ్వాలల్లో శిక్షిస్తాడు (1:6, 8).

విశ్వాసులకు బాధలనుండి విడుదల ఎప్పుడు కలుగుతుంది?

యేసు క్రీస్తు పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులకు బాధలనుండి విడుదల కలుగుతుంది (1: 7).

2 Thessalonians 1:9

దేవుణ్ణి ఎరుగని వారికి శిక్ష ఎంతకాలం ఉంటుంది?

దేవుణ్ణి ఎరుగని వారికి శిక్ష శాశ్వత కాలం ఉంటుంది (1: 9).

దేవుణ్ణి ఎరుగని వారు తమకు కలిగే శిక్షలో భాగంగా దేని నుండి వేరై పోతారు?

దేవుణ్ణి ఎరుగని వారు తమకు కలిగే శిక్షలో భాగంగా దేవుని సన్నిధి నుండి వేరై పోతారు (1: 9)

క్రీస్తు తన దినాన రావడం చూసినప్పుడు విశ్వాసులు ఏమి చేస్తారు?

క్రీస్తు తన దినాన రావడం చూసినప్పుడు విశ్వాసులు అబ్బుర పడతారు (1: 10).

2 Thessalonians 1:11

దేవుని శక్తితో విశ్వాసులు జరిగించిన సత్క్రియల ఫలితం ఏమిటి?

దేవుని శక్తితో విశ్వాసులు జరిగించిన సత్క్రియల ఫలితంగా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది (1: 11-12).


Chapter 2

Translation Questions

2 Thessalonians 2:1

ఇప్పుడు ఏ సంభవం గురించి తాను రాయబోతున్నట్టు పౌలు చెబుతున్నాడు?

ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు రాక గురించి తాను రాయబోతున్నట్టు పౌలు చెబుతున్నాడు (2: 1)

ఏమి నమ్మవద్దని వారికి పౌలు చెబుతున్నాడు?

ప్రభువు దినం గతంలోనే వచ్చిందని చెబితే నమ్మవద్దని పౌలు చెబుతున్నాడు (2: 2).

2 Thessalonians 2:3

ప్రభువు దినానికి ముందు ఏమి రావాలని పౌలు చెబుతున్నాడు?

ప్రభువు దినానికి ముందు పతనం సంభవించి ధర్మవిరోధి వెల్లడి అవుతాడు (2: 3).

ధర్మ విరోధి ఏమి చేస్తాడు?

ధర్మ విరోధి దేవుణ్ణి వ్యతిరేకించి తనను దేవునికి పైగా హెచ్చించు కుంటాడు. తనను దేవుడుగా ఎంచుకుని దేవాలయంలో కూర్చుంటాడు (2: 4)

2 Thessalonians 2:5

ధర్మవిరోధి ఎప్పుడు వెల్లడి అవుతాడు?

సమయం ఆసన్నమైనపుడు అతనిని అడ్డగించేది తొలిగి పోయినప్పుడు ధర్మవిరోధి వెల్లడి అవుతాడు (2: 6-7).

2 Thessalonians 2:8

యేసు ప్రత్యక్షమైనప్పుడు ధర్మవిరోధిని ఏమి చేస్తాడు?

యేసు ప్రత్యక్షమైనప్పుడు ధర్మవిరోధిని సంహరిస్తాడు (2:8).

ధర్మవిరోధి అద్భుతాలు, సూచనలు చేసేలా ధర్మవిరోధికి శక్తి ఇచ్చి అతనితో కలిసి పని చేసేదెవరు?

ధర్మవిరోధి అద్భుతాలు, సూచనలు చేసేలా ధర్మవిరోధికి శక్తి ఇచ్చి అతనితో కలిసి పని చేసేది సాతాను (2:9).

కొందరు ఎందుకు ధర్మవిరోధి చేతుల్లో మోసపోయి నశిస్తారు?

రక్షణ పొందేలా సత్యాన్ని గురించిన ప్రేమ కొందరిలో ఉండదు గనుక వారు మోసపోతారు (2: 10).

2 Thessalonians 2:11

మోసపోయి నాశనమవుతున్న వారు దేనిలో ఆనందిస్తారు?

మోసపోయి నాశనమవుతున్న వారు అవినీతిలో ఆనందిస్తారు (2: 12).

2 Thessalonians 2:13

సువార్త మూలంగా తెస్సలోనికయులు ఏమి పొందాలని దేవుడు ఎంపిక చేసాడు?

సువార్త మూలంగా తెస్సలోనికయులు యేసు క్రీస్తు ప్రభువు మహిమను పొందాలని దేవుడు ఎంపిక చేసాడు (2: 13-14).

తెస్సలోనికయులు ఇప్పుడు సువార్తను అంగీకరించారు గనక ఇప్పుడు వారు ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?

వారు నేర్చుకున్న సంప్రదాయాలను గట్టిగా చేపట్టి స్థిరంగా నిలబడాలని పౌలు తెస్సలోనికయులను కోరాడు (215).

2 Thessalonians 2:16

తెస్సలోనికయులు తమ హృదయాలలో దేనిపై స్థిరపడాలని పౌలు కోరాడు?

తెస్సలోనికయులు ప్రతి సత్క్రియలోను, వాక్కులోనూ స్థిరపడాలని పౌలు కోరాడు (2:17).


Chapter 3

Translation Questions

2 Thessalonians 3:1

ప్రభువు వాక్కు విషయంలో తెస్సలోనికయులు ఏమని ప్రార్థన చేయాలని పౌలు కోరాడు?

ప్రభువు వాక్కు త్వరగా వ్యాపించేలా మహిమ పొందేలా తెస్సలోనికయులు ప్రార్థన చేయాలని పౌలు కోరాడు (3:2).

దేని నుండి తాను విడుదల పొందాలని పౌలు కోరాడు?

విశ్వాసం లేని దుష్టుల చేతుల్లో నుండి విడుదల పొందాలని పౌలు కోరాడు (3: 2).

2 Thessalonians 3:4

దేనిని కొనసాగించాలని పౌలు తెస్సలోనికయులకు చెప్పాడు?

తను వారికి ఆజ్ఞాపించిన క్రియలు కొనసాగించాలని పౌలు తెస్సలోనికయులకు చెప్పాడు (3: 4).

2 Thessalonians 3:6

సోమరితనంగా బ్రతికే సహోదరుని విషయం తెస్సలోనికయులు ఏమి చేయాలని పౌలు ఆజ్ఞాపించాడు?

సోమరితనంగా బ్రతికే సహోదరునికి తెస్సలోనికయులు దూరంగా ఉండాలని పౌలు ఆజ్ఞాపించాడు (3: 6).

తన పరిచర్య, పోషణ విషయంలో పౌలు తెస్సలోనిక వారికి ఏ ప్రమాణం ఉంచాడు?

పౌలు తాను ఎవరికీ భారంగా ఉండకూడదని తన పోషణ నిమిత్తం రేయింబవళ్ళు పని చేసేవాడు (3:7-9).

2 Thessalonians 3:10

పని చేయడానికి ఇష్ట పడని వారి విషయంలో పౌలు ఏమి ఆజ్ఞాపించాడు?

పని చేయడానికి ఇష్ట పడని వారు భోజనం చేయకూడదని పౌలు ఆజ్ఞాపించాడు (3: 10).

అలాటి వారు సోమరులుగా కాక ఏమి చేయాలని పౌలు ఆజ్ఞాపించాడు?

సోమరులు నెమ్మదిగా పని చేసుకుంటూ తమ స్వంత ఆహారం తింటూ ఉండాలని పౌలు ఆజ్ఞాపించాడు (3: 12).

2 Thessalonians 3:13

ఈ లేఖలో పౌలు రాసిన సూచనలను పాటించని వారి విషయంలో సహోదరులు ఏమి చేయాలి?

ఈ లేఖలో పౌలు రాసిన సూచనలను పాటించని వారితో సహోదరులు ఎలాటి పొత్తు పెట్టుకోకూడదు (3: 14).

2 Thessalonians 3:16

తెస్సలోనికయులకు దేవుడు ఏమి ఇవ్వాలని పౌలు కోరాడు?

తెస్సలోనికయులకు దేవుడు అన్ని కాలాల్లో శాంతి ఇవ్వాలని పౌలు కోరాడు (3: 16).

ఈ లేఖను తాను రాశానని చూపడానికి పౌలు ఏమి చేశాడు?

ఈ లేఖను తాను రాశానని చూపడానికి పౌలు తన స్వహస్తాలతో అభినందనలు చెబుతూ సంతకం చేశాడు (3: 17).


Chapter 1

Translation Questions

1 Timothy 1:1

యేసు క్రీస్తు అపోస్తలునిగా పౌలు ఎలా అయ్యాడు?

పౌలు దేవుని అజ్ఞానుసారంగా యేసు క్రీస్తు అపోస్తలునిగా అయ్యాడు. (1:1).

పౌలు, తిమోతిల మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

విశ్వాసంలో పౌలు నిజకుమారుడు తిమోతి (1:2).

1 Timothy 1:3

తిమోతి ఎక్కడ నిలిచి ఉండాలి?

తిమోతి ఎఫెసులో నిలిచి ఉండాలి(1:3).

కొందరు మనుషులు ఏమి చేయకూడదని తిమోతి ఆజ్ఞాపించాలి?

వారు భిన్నబోధలు చేయకూడదని తిమోతి ఆజ్ఞాపించాలి (1:3).

1 Timothy 1:5

పౌలు తన బోధ, ఆజ్ఞల లక్ష్యం ఏమిటని చెప్పాడు?

అతని లక్ష్యం పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ (1:5).

1 Timothy 1:9

ధర్మశాస్త్రం ఎవరి కోసం చేశారు?

ధర్మశాస్త్రం ధర్మవిరోధుల కోసం, తిరుగుబాటుదారుల కోసం, భక్తిహీనులకోసం చేశారు (1:9).

అలాంటి మనుషులు చేసే నాలుగు పాపాలు ఏమిటి?

వాళ్ళు చేసే పాపాలు హత్యలు, అనైతిక లైoగికత్వం, దోపిడీ, అబద్ధాలు (1:9-10).

1 Timothy 1:12

గతంలో పౌలు చేసిన పాపాలు ఏమిటి?

గతంలో పౌలు దైవ దూషకుడు, హింసించేవాడు, హానికరుడు(1:13).

యేసు క్రీస్తు అపోస్తలుడుగా మారటానికి పౌలును బలవంతం చేసిన దేమిటి?

మన ప్రభువు కృప పౌలును బలవంతం చేసింది (1:14).

1 Timothy 1:15

క్రీస్తు యేసు ఈ లోకానికి ఎవరిని రక్షించడానికి వచ్చాడు?

పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు (1: 15).

తాను దేవుని కృపకు తార్కాణం అని పౌలు ఎందుకు అన్నాడు?

ఎందుకంటే తాను పాపులందరిలోకీ ముఖ్యుడై కూడా దేవుని కృప పొందాడు గనుక తాను దేవుని కృపకు తార్కాణం అని పౌలు అన్నాడు (1:15,16).

1 Timothy 1:18

తిమోతి గురించి చెప్పిన ఏ విషయాల గురించి పౌలు సమ్మతిస్తున్నాడు?

విశ్వాసంతో, మంచి మనస్సాక్షితో తిమోతి చేసే మంచి పోరాటం గురించిన ప్రవచనాలతో పౌలు ఏకీభవిస్తున్నాడు (1:18,19).

విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షినీ విడిచి పెట్టి తమ విశ్వాసం విషయంలో ఓడ బద్దలైనట్టుగా ఉన్న వారికి పౌలు ఏమి చేస్తున్నాడు?

వారు దైవదూషణ చేయకుండా వారికీ నేర్పించడం కోసం పౌలు వారిని సాతానుకు అప్పగించాడు (1: 20).


Chapter 2

Translation Questions

1 Timothy 2:1

ఎవరి నిమిత్తం ప్రార్థన చెయ్యాలని పౌలు కోరాడు?

అందరి విషయం, రాజుల, అధికారుల విషయం ప్రార్థించాలని పౌలు కోరాడు (2: 1-2).

క్రైస్తవులు ఎలాటి జీవితం గడపడానికి వారికి అవకాశం ఉండాలని పౌలు కోరుతున్నాడు?

క్రైస్తవులు భక్తితో, హుందాగా, ప్రశాంతంగా, నెమ్మదిగా జీవించే అవకాశం వారికి ఉండాలని పౌలు కోరుతున్నాడు (2: 2).

మనుషులందరి కోసం దేవుడు ఏమి కోరుతున్నాడు?

మనుషులంతా రక్షణ పొంది సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు (2: 4).

1 Timothy 2:5

దేవునికి, మనిషికి మధ్య క్రీస్తు యేసు పాత్ర ఏమిటి?

ఆయన దేవునికి, మనిషికి మధ్యవర్తి (2: 5).

యేసు క్రీస్తు అందరికోసం ఏమి చేశాడు?

అందరికోసం విమోచన వెలగా ఆయన తనను సమర్పించు కున్నాడు (2:6).

అపోస్తలుడు పౌలు ఎవరికి బోధకుడు?

అపోస్తలుడు పౌలు యూదేతరులకు బోధకుడు (2: 7).

1 Timothy 2:8

పురుషులు ఏం చెయ్యాలని పౌలు కోరాడు?

పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిoచాలని పౌలు కోరాడు(2 :8).

స్త్రీలు ఏం చెయ్యాలని పౌలు కోరాడు?

స్త్రీలు అణుకువతో, తగుమాత్రం వస్త్రాలు ధరించాలని పౌలుకోరాడు(2:9).

1 Timothy 2:11

స్త్రీలు ఏం చెయ్యటానికి పౌలు అనుమతించ లేదు?

స్త్రీలు ఉపదేశించటం, పురుషులపై అధికారం చేయడానికి పౌలు అనుమతించ లేదు(2: 12).

1 Timothy 2:13

దీనికి పౌలు ఏ కారణాలు చూపాడు?

ఆదాము మొదట సృష్టి అయ్యాడని, ఆదాము మోసపోలేదని, ఈ రెండు కారణాలు పౌలు చూపించాడు.

స్త్రీలు దేనిలో కొనసాగాలని పౌలు కోరాడు?

స్త్రీలు విశ్వాసంలో ప్రేమలో స్వస్థ బుద్ధితో కూడిన పవిత్రతలో కొనసాగాలని పౌలు కోరాడు (2:15).


Chapter 3

Translation Questions

1 Timothy 3:1

పై విచారణ కర్త పని ఎలాటిది?

పై విచారణ కర్త పని మంచిది (3:1).

పై విచారణ కర్త ఏమి చెయ్యగలిగి ఉండాలి?

పై విచారణ కర్త బోధించ గలిగి ఉండాలి (3:2).

పై విచారణ కర్త మద్యాన్ని, ధనాన్ని ఎలా చూడాలి?

పై విచారణ కర్త మద్యానికి అలవాటు పడకూడదు. ధనాన్ని ప్రేమించకూడదు (3: 3)

1 Timothy 3:4

పై విచారణ కర్త పిల్లలు అతన్ని ఎలా చూడాలి?

పై విచారణ కర్త పిల్లలు అతనికి లోబడి గౌరవించాలి (3:4).

పై విచారణ కర్త తన ఇంటిని చక్కగా నిర్వహించుకోవడం ఎందువల్ల ప్రాముఖ్యం?

ఎందువల్లనంటే అతడు తన ఇంటిని చక్కగా నిర్వహించుకోలేక పోతే సంఘం గురించి కూడా అతడు జాగ్రత్త తీసుకోలేడు (3:5).

1 Timothy 3:6

పై విచారణ కర్త కొత్తగా నమ్మిన వాడైతే ప్రమాదం ఏమిటి?

ప్రమాదం ఏమిటంటే అతడు గర్విష్టిగా అయిపోయి శిక్షకు గురి అవుతాడు (3:6).

సంఘానికి బయట వారి మధ్య పై విచారణ కర్త గురించి ఎలాటి అభిప్రాయం ఉండాలి?

సంఘానికి బయట వారి మధ్య పై విచారణ కర్త మంచి పేరు పొంది ఉండాలి (3:7).

1 Timothy 3:8

వారు పరిచర్య ఆరoభిoచటానికి ముందు పరిచారకుల విషయం ఏం చేయాలి?

పరిచర్య ఆరంభిoచటానికి ముందు పరిచారకులు ఆమోదం పొందాలి(3:11).

1 Timothy 3:11

భక్తిగల స్త్రీల కొన్ని గుణగణాలు ఏమిటి ?

భక్తి గల స్త్రీలు గౌరవానికి తగినవారు, అపనిందలు ప్రచారం చేయనివారు, కోరికలు అదుపులో ఉంచుకొనేవారు, అన్ని విషయాలలో నమ్మకైనవారు (3:11).

1 Timothy 3:14

దేవుని గృహం అంటే ఏమిటి?

జ సంఘమే దేవుని గృహం(3:15)

1 Timothy 3:16

యేసు శరీరoతో కనబడి, ఆత్మచేత నిర్దోషి అని నిర్ణయించబడి, దేవదూతలకు కనబడిన తరువాత ఆయన ఏం చేసాడు?

ఆయనను జనాలలో ప్రకటించడం, లోకంలో నమ్మడం, మహిమలో పైకి వెళ్డడం జరిగింది(3:16)


Chapter 4

Translation Questions

1 Timothy 4:1

తరువాతి కాలంలో కొoదరు మనుషులు ఏమి చేస్తారు అని ఆత్మను బట్టి తెలుస్తుంది?

తరువాతి కాలంలో కొందరు మనుషులు విశ్వాసం నుండి తొలిగిపోయి మోసపరిచే ఆత్మలను లక్ష్యపెడతారు (4:1 )

1 Timothy 4:3

ఈ మనుషులు ఏ అబద్ధాలు బోధిస్తారు?

వివాహాన్ని, కొన్ని రకాల ఆహార పదార్థాలను నిషేధిస్తారు (4:4).

మనం తినే ఏదైనా పవిత్రం, వాడుకోడానికి ఆమోదయోగ్యం ఎలా అవుతుంది?

మనం తినే ఏదైనా దేవుని వాక్కు మూలంగా, ప్రార్థన మూలంగా పవిత్రం, వాడుకోడానికి ఆమోదయోగ్యం అవుతుంది (4:5).

1 Timothy 4:6

దేనిలో శిక్షణ పొందమని పౌలు తిమోతికి చెబుతున్నాడు?

దైవ భక్తిలో శిక్షణ పొందమని పౌలు తిమోతికి చెబుతున్నాడు (4:7).

దైవ భక్తిలో శిక్షణ పొందడం దేహ వ్యాయామం కన్నా ఎందుకు లాభకరమైనది?

దైవ భక్తిలో శిక్షణ పొందడం దేహ వ్యాయామం కన్నా ఎందుకు లాభకరమైనదంటే ఈ జీవితానికి, రాబోయే జీవితానికి అది ప్రయోజనం (4:8).

తిమోతి తాను పొందిన మంచి బోధ అంతటితో ఏమి చెయ్యాలని కోరుతున్నాడు?

ఈ విషయాలు ఇతరులకు బోధించమంటున్నాడు (4:6, 11).

1 Timothy 4:11

తిమోతి తాను పొందిన మంచి బోధ అంతటితో ఏమి చెయ్యాలని కోరుతున్నాడు?

ఈ విషయాలు ఇతరులకు బోధించమంటున్నాడు (4:6, 11).

ఏ విషయాల్లో తిమోతి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి?

మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, పవిత్రతలో తిమోతి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి (4:12).

1 Timothy 4:14

తిమోతి తన ఆత్మవరాలను ఎలా పొందాడు?

ప్రవచనం ద్వారా, పెద్దలు అతనిపై చేతులు ఉంచడం ద్వారా తిమోతి తన ఆత్మవరాలను పొందాడు?

తిమోతి తన జీవితంలో ఉపదేశంలో నమ్మకంగా కొనసాగితే ఎవరు రక్షణ పొందుతారు?

అతడు తనను, తన మాటలు వినే వారినీ రక్షిస్తాడు (4:16).


Chapter 5

Translation Questions

1 Timothy 5:1

సంఘoలోని ముసలివారిని ఏ విధంగా భావించాలని పౌలు తిమోతితో చెప్పాడు?

సంఘoలోని ముసలివారిని తండ్రులు గా భావించాలని పౌలు తిమోతితో చెప్పాడు(5 :1).

1 Timothy 5:3

విధవరాలి పిల్లలు, పిల్లల సంతానం ఆమె కోసం ఏమి చేయాలి?

ఆ పిల్లలు ,పిల్లల సంతానం తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేస్తూ ఆమెను జాగ్రతగా చూచుకోవాలి(5:4).

1 Timothy 5:7

ఎవరైనా తన ఇంటివారిని సరిగ్గా చూడకపోతే ఏమిటి?

అతను విశ్వాసం లేని వాని కంటే చెడ్డవాడై విశ్వాసం కాదన్నట్టే(5:8)

1 Timothy 5:9

ఒక విధవరాలు ఏ విధంగా పేరు పొంది ఉండాలి?

విధవరాలు మంచి పనులకు పేరు పొంది ఉండాలి(5:10).

1 Timothy 5:11

యవ్వన ప్ర్రాయమున్న విధవరాలు తన మిగిలిన జీవితం విధవరాలు గానే వుండాలని నిశ్చయించుకుంటే కలిగే అపాయo ఏమిటి?

ఆమె తన మొదటి నిశ్చయతను విడిచి పెట్టి తరువాత పెళ్లి చేసుకోవాలి అనుకునే అపాయం ఉంది(5 :11-12).

1 Timothy 5:14

యువతులు ఏమి చేయాలని పౌలు కోరాడు?

యువతులు పెళ్లి చేసుకొని, పిల్లలను కని, ఇంటి వ్యవరాలను చూసుకోవాలని పౌలు కోరాడు(5 :14 ).

1 Timothy 5:17

బాగా పాలన చేసే పెద్దలకు ఏమి చేయాలి?

బాగా పాలన చేసే పెద్దలు రెట్టింపు గౌరవానికి పాత్రులని భావించాలి(5:17).

1 Timothy 5:19

ఒక పెద్ద మీద నిందారోపణ తీసుకొనే ముందుగా ఏమి చెయ్యాలి?

ఒక పెద్ద మీద నిందారోపణ తీసుకొనే ముందుగా ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల సాక్ష్యం తీసుకోవాలి(5:19).

1 Timothy 5:21

పౌలు తిమోతికి ఏ నియమాలను ఏ విధంగా పాటించాలి అని ఆజ్ఞాపించాడు?

పౌలు తిమోతికి పక్షపాతం లేకుండా ఈ నియమాలను జాగ్ర్రతగా పాటించాలి అని ఆజ్ఞపించాడు (5:21).

1 Timothy 5:23

ఎప్పటి వరకు కొందరు మనుషుల అపరాధాలు బయట పడవు?

కొందరి మనుషుల అపరాధాలు తీర్పు వరకు బయటపడవు(5:24).


Chapter 6

Translation Questions

1 Timothy 6:1

బానిసలు తమ యజమానుల యెడల ఏం చేయాలి అని పౌలు చెప్పాడు?

బానిసలు తమ యజమానులు మర్యాదకు తగినవారిగా ఎంచాలి అని పౌలు చెప్పాడు(6:3-4).

1 Timothy 6:3

ఎలాంటి వ్యక్తి దైవభక్తికి అనుగుణమైన ఉపదేశాన్ని, క్షేమకరమైన మాటలును తిరస్కరిస్తాడు?

అలాంటి వ్యక్తి ఏమీ తెలియని గర్విష్టియై దైవభక్తికి అనుగుణమైన ఉపదేశాన్ని, క్షేమకరమైన మాటలును తిరస్కరిస్తాడు(6:3-4).

1 Timothy 6:6

గొప్ప లాభం అని పౌలు దేన్ని అంటున్నాడు?

తృప్తితో కూడిన భక్తి గొప్ప లాభం అని పౌలు అంటున్నాడు (6:6).

మనం అన్నవస్త్రాలతో ఎందుకు తృప్తి పడి ఉండాలి?

ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. ఏమీ తీసుకు పోలేము (6:7,8).

1 Timothy 6:9

ధనికులవ్వాలని చూసే వాళ్ళు దేనిలో పడిపోతారు?

ధనికులవ్వాలని చూసే వాళ్ళు శోధనలో, ఉచ్చులో పడిపోతారు (6:9).

దుష్టత్వమంతటికీ మూలం ఏది?

ధన వ్యామోహం దుష్టత్వమంతటికీ మూలం (6:10).

డబ్బును ప్రేమించిన కొందరికి ఏమి జరిగింది?

డబ్బును ప్రేమించిన కొందరు విశ్వాసం నుండి దారి తొలిగి పోయారు (6:10).

1 Timothy 6:11

ఎలాంటి పోరాటం పోరాడాలని పౌలు తిమోతికి చెప్పాడు?

విశ్వాసాన్ని గూర్చిన మంచి పోరాటం పోరాడాలని పౌలు తిమోతికి చెప్పాడు(6:12).

1 Timothy 6:15

ధన్య జీవి, ఏకైక శక్తిమంతుడు ఎక్కడ నివసిస్తున్నాడు?

ధన్య జీవి, ఏకైక శక్తిమంతుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు (6:16).

1 Timothy 6:17

ధనికులు అనిశ్చితమైన సంపదల్లో గాక దేవునిలో మాత్రమే ఎందుకు ఆశ పెట్టుకోవాలి?

దేవుడు మాత్రమే నిజమైన సంపదలు ఇస్తాడు గనక ధనికులు అనిశ్చితమైన సంపదల్లో గాక దేవునిలో మాత్రమే ఆశ పెట్టుకోవాలి (6:17).

సత్క్రియల్లో నిమగ్నమయ్యే వారు తమ కోసం ఏమి చేసున్నారు?

సత్క్రియల్లో నిమగ్నమయ్యే వారు తమ కోసం మంచి పునాది వేసుకుంటూ నిజమైన జీవాన్ని చేపడతారు (6:19)

1 Timothy 6:20

చివరిగా పౌలు తిమోతికి అప్పగించబడిన దాని విషయంలో ఏo చేయాలని అతనితో చెప్పాడు ?

పౌలు తిమోతికి అప్పగించబడిన దానిని కాపాడుకోవాలని చెప్పాడు(6:20).


Chapter 1

Translation Questions

2 Timothy 1:1

క్రీస్తు అపోస్తులుడుగా పౌలు ఎలా అయ్యాడు?

క్రీస్తు అపోస్తులుడుగా పౌలు దేవుని చిత్తం వలన అయ్యాడు(1:1).

2 Timothy 1:3

నిజమైన విశ్వాసo తిమోతి కంటే ముందు అతని కుటుంబంలో ఎవరికి ఉంది?

నిజమైన విశ్వాసం తిమోతి కంటే ముందు అతని అమ్మకు, అమ్మమ్మకు ఉంది(1: 5).

2 Timothy 1:6

దేవుడు తిమోతికి ఎలాంటి ఆత్మను ఇచ్చాడు?

దేవుడు తిమోతికి క్రమశిక్షణ, ప్రేమ, శక్తిగల ఆత్మను ఇచ్చాడు(1 :7).

2 Timothy 1:8

పౌలు తిమోతికి ఏం చేయకూడదు అని చెప్పాడు?

పౌలు తిమోతికి ప్రభువును గూర్చిన సాక్ష్యం విషయంలో సిగ్గుపడకూడదని చెప్పాడు(1:8).

దానికి బదులు పౌలు తిమోతికి ఏమి చేయాలని చెప్పాడు?

దానికి బదులు పౌలు తిమోతికి శుభవార్త కోసం శ్రమలో భాగస్వామి కమ్మని చెప్పాడు(1:8).

దేవుడు తన ప్రణాళిక, కృప మనకు ఎప్పుడు ఇచ్చాడు?

దేవుడు తన ప్రణాళిక, కృప యుగాల ఆరంభానికి ముందే మనకు ఇచ్చాడు(1:9).

ఎప్పుడు దేవుడు తన రక్షణ ప్రణాళికను బయలుపరచాడు?

దేవుడు తన రక్షణ ప్రణాళికను మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షం అవ్వటం వల్ల బయలుపరచాడు(1:10).

యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, జీవ మరణాల విషయాల్లో ఏమి చేస్తాడు?

యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, జీవ మరణాల విషయాల్లో మరణాన్ని నశింపచేసి, శుభవార్త వలన అంతం లేని జీవాన్ని తెచ్చాడు(1:10).

2 Timothy 1:12

పౌలు శుభవార్త నిమిత్తం సిగ్గు పడలేదు, ఎందుకంటే దేవుడు అతని కోసం ఏమి చేస్తాడని నమ్మకం?

ఏమైతే తాను దేవునికి అప్పగించుకొనేనో దానిని దేవుడు ఆ రోజు వరకు కాపాడగలడని పౌలు ధృడ విశ్వాసంతో ఉన్నాడు(1:12).

దేవుడు తిమోతికి అప్పగించిన మంచి విషయం

దేవుడు తిమోతికి అప్పగించిన మంచి విషయం పవిత్రాత్మ ద్వారా కాపాడుకోవాలి .

2 Timothy 1:15

ఆసియాలో పౌలుకు తోడుగా ఉన్న వారందరూ ఏమి చేశారు?

ఆసియాలో పౌలుకు తోడుగా ఉన్న వారందరూ అతన్ని విడిచి పెట్టేశారు(1:15).

ఒనేసిఫోరు ఇంటి వారి యెడల దయ చూపమని పౌలు ఎందుకు ప్రభువును అడిగాడు?

ఒనేసిఫోరు ఇంటి వారు అనేక విధాలుగా పౌలుకు సహాయం చేయడం వలన దయ చూపమని ప్రభువును అడిగాడు(1:16-18).


Chapter 2

Translation Questions

2 Timothy 2:1

పౌలు తిమోతిల మధ్య సంబంధం ఏంటి?

పౌలు ఆత్మీయ కుమారుడు తిమోతి(2:2).

పౌలు బోధిoచిన ఉపదేశo ఎవరికీ తిమోతి అప్పగించాలి?

పౌలు బోధించిన ఉపదేశo ఇతరులకు నేర్పించటానికి సామర్ధ్యం గలిగిన నమ్మకమైన మనుషులకు తిమోతి అప్పగించాలి(2:2).

2 Timothy 2:3

ఒక మంచి సైనికుడు తనకుతాను ఎలాంటి చిక్కుల్లోపడడని పౌలు తిమోతికి వివరించాడు?

ఒక మంచి సైనికుడు తనకు తాను ఈ జీవన సంబంధాలలో చిక్కుకోడని పౌలు తిమోతికి వివరించాడు(2:4).

2 Timothy 2:8

ఈ లేఖ తిమోతికి వ్రాస్తుండగా దేవుని వాక్కు ప్రకటన కోసం పౌలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నాడు?

ఈ లేఖ పౌలు తిమోతికి వ్రాస్తుండగా సంకెళ్ళతో బందియై కష్టాలు అనుభవిస్తున్నాడు(2:9).

ఏది సంకెళ్ళపాలై లేదని పౌలు చెపుతున్నాడు?

దేవుని వాక్కు సంకెళ్ళపాలై లేదని పౌలు చెపుతున్నాడు(2:9).

వీటన్నిటి కోసం పౌలు ఎందుకు ఓర్చుకున్నాడు?

క్రీస్తు యేసులో రక్షణ పొందాలని దేవుని వలన ఏర్పరచుకొన్నవారికోసం పౌలు వీటన్నిటిన్నీ ఓర్చుకున్నాడు(2:10).

2 Timothy 2:11

సహించే వారికి క్రీస్తు వాగ్ద్ధానం ఏమిటి?

సహించే వారు క్రీస్తుతో కూడా ఏలతారు(2:12).

క్రీస్తును ఎరగననే వారికీ క్రీస్తు హెచ్చరిక ఏమిటి?

క్రీస్తును ఎరగననే వారిని ఆయనా ఎరగనoటాడు(2:12).

2 Timothy 2:14

ప్రజలు దేని గురించి పోట్లాడుకోకూడదని తిమోతి హెచ్చరించాలి?

ప్రజలు ఏవేవో మాటల గురించి పోట్లాడుకోకూడదని, వాటి వల్ల ప్రయోజనం లేదని తిమోతి హెచ్చరించాలి(2:14).

2 Timothy 2:16

సత్యం నుండి తొలిగిపోయిన ఇద్దరు ఏ తప్పుడు సిద్ధాంతం ఉపదేశిoచారు?

సత్యం నుండి తొలిగిపోయిన ఇద్దరు పునర్జీవం ముందే జరిగిoదనే తప్పుడు సిద్ధాంతం ఉపదేశిoచారు(2:18).

2 Timothy 2:19

ప్రతి మంచి పని కోసం విశ్వాసులు ఎలా సిద్ధపడాలి?

ప్రతి మంచి పని కోసం విశ్వాసులు ఘనతకు ఉపయోగపడని వాటినుండి తమ్ముతాము శుద్ధి చేసుకొని, సమర్పించుకోవాలి(2:21).

2 Timothy 2:22

తిమోతి వేటి నుండి పారిపోవాలి?

తిమోతి యువకులకు కలిగే చెడు కోరికల నుండి పారిపోవాలి(2:22).

2 Timothy 2:24

ప్రభు సేవకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి?

ప్రభు సేవకుడు మర్యాదస్తుడునూ, ఉపదేశిoచగలవాడై ఉండీ, ఓర్చుకొనువాడై, ఎదిరించే వారిని సాత్వికంతో సరిదిద్దాలి(2:24-25).

అవిశ్వాసులకు దయ్యం ఏం చేస్తుంది?

అవిశ్వాసులకు దయ్యం తన ఇష్ట ప్రకారం చేయడానికి చెరపట్టి మోసం చేస్తుంది(2:26).


Chapter 3

Translation Questions

2 Timothy 3:1

చివరి రోజుల్లో ఏం వస్తాయని పౌలు చెప్పాడు?

చివరి రోజుల్లో అపాయకరమైన కాలములు వస్తాయని పౌలు చెప్పాడు(3:1).

చివరి రోజుల్లో దేవునికి బదులు మనుషులు ప్రేమించే మూడు విషయాలు ఏమిటి?

చివరి రోజుల్లో దేవునికి బదులు మనుషులు తమనుతామే ప్రేమిoచుకోనుచూ, డబ్బునీ సుఖాన్నీ ప్రేమిస్తూ ఉంటారు(3:2-4).

2 Timothy 3:5

కేవలం ఆచారపూర్వకమైన దైవ భక్తిగల వారి విషయంలో ఏమి చెయ్యాలని తిమోతికి పౌలు చెప్పాడు?

కేవలం ఆచారపూర్వకమైన దైవ భక్తిగల వారి నుంచి తొలగి పొమ్మని చెప్పాడు (3:5).

ఈ భక్తిహీనుల్లో కొందరు ఏమి చేస్తారు?

ఈ భక్తిహీనుల్లో కొందరు ఇళ్ళలో చొరబడి వివిధ కోరికలతో కొట్టుకుపోయే స్త్రీలను వశపరచు కుంటారు (3:6).

2 Timothy 3:8

పాత ఒడంబడికలోని యన్నే, యంబ్రేలాగా భక్తిహీనులు ఎలా ఉంటారు?

భక్తిహీనులు పాత ఒడంబడికలో సత్యానికి వ్యతిరేకంగా నిలిచిన యన్నే, యంబ్రేలాగ ఉంటారు.(3:8).

2 Timothy 3:10

అబద్ద బోధకులకు బదులు తిమోతి ఎవరిని అనుసరించాడు?

అబద్ద బోధకులకు బదులు తిమోతి పౌలును అనుసరించాడు(3:10-11).

ప్రభువు వేటి నుండి పౌలును తప్పించాడు?

ప్రభువు అన్ని హింసల నుండి పౌలును తప్పించాడు(3:11).

దైవభక్తితో జీవించాలని కోరుకొనే వారికి ఏమవుతుందని పౌలు చెప్పాడు?

దైవభక్తితో జీవించాలని కోరుకొనే వారు హింసలకు గురవుతారని పౌలు చెప్పాడు(3:12).

చివరి రోజులలో మిక్కిలి చెడ్డదిగా ఏం మారుతుంది?

చివరి రోజులలో దుర్మార్గులూ వంచకులూ మిక్కిలి చెడ్డవారిగా మారతారు(3:13).

2 Timothy 3:14

తిమోతి జీవితంలో పరిశుద్ధ లేఖనాలు ఎప్పటి నుండి తెలుసు?

పరిశుద్ధ లేఖనాలు తిమోతికి బాల్యం నుండి తెలుసు(3 :15).

2 Timothy 3:16

మనిషికి లేఖనాలన్నీఎలా ఇవ్వడం జరిగింది?

మనిషికి లేఖనాలన్నీ దైవావేశం వల్ల ఇవ్వడం జరిగింది(3:16).

లేఖనాలన్నీవేటికి ప్రయోజనకరంగా ఉన్నాయి?

లేఖనాలన్నీ ఉపదేశించుటానికీ, మందలించటానికీ, తప్పులు సరిచేయటానికీ, నీతి న్యాయాలలో తర్ఫీదు ఇవ్వటానికి ప్రయోజనకరంగా ఉన్నాయి(3:16).

ఒక వ్యక్తికి లేఖనాలు తర్ఫీదు ఇవ్వటంలో గల ఉద్దేశ్యం ఏంటి?

ఒక వ్యక్తికి లేఖనాలు తర్ఫీదు ఇవ్వటంలో గల ఉద్దేశ్యం అతను సంసిద్దుడై ప్రతి మంచి పనికి సమర్ధుడై ఉండాలని(3:17).


Chapter 4

Translation Questions

2 Timothy 4:1

యేసుక్రీస్తు ఎవరికి న్యాయాధిపతి?

యేసుక్రీస్తు చనిపోయిన వారికీ, సజీవులకు న్యాయాధిపతి(4:1.

తిమోతి ఏo చేయాలని పౌలు ఆజ్ఞాపించాడు?

తిమోతి దేవుని వాక్కు ప్రకటించాలని పౌలు ఆజ్ఞాపించాడు(4 :2).

2 Timothy 4:3

రాబోయే కాలంలో మనుషులు ఏమి చేస్తారని పౌలు హెచ్చరిస్తున్నాడు?

రాబోయే కాలంలో మనుషులు మంచి ఉపదేశాన్ని సహించరు. తమ కామవికారాలకు అనుగుణమైన బోధలే వింటారు (4:5).

తిమోతి కి ఇచ్చిన పని, పరిచర్య ఏమిటి?

తిమోతి కి సువార్తికుని పరిచర్య ఇవ్వబడింది [4:5].

2 Timothy 4:6

ఎలాంటి సమయం తన జీవితంలో వచ్చిందని పౌలు చెపుతున్నాడు?

తన జీవితంలో వెళ్ళిపోయే సమయం వచ్చిందని పౌలు చెపుతున్నాడు(4:6).

క్రీస్తు కనపడినప్పుడు ఆయనను ప్రేమించే వారు ఏo బహుమానం పొందుతారు?

క్రీస్తు కనపడినప్పుడు ఆయనను ప్రేమించే వారు నీతి కిరీటం బహుమానంగా పొందుతారు(4:8).

2 Timothy 4:9

దేమా, పౌలు సహవాసాన్నిఎందుకు విడిచిపెట్టాడు?

ఎందుకంటే దేమాకు ఈలోకం మీద ప్రీతి కలిగి పౌలును విడిచిపెట్టాడు(4:10).

2 Timothy 4:11

పౌలుకు తోడుగా ఉన్నఒక్క సోదరుడు ఎవరు?

పౌలుకు తోడుగా ఒక్క లూకా మాత్రమే ఉన్నాడు(4 :11).

2 Timothy 4:14

ఏ మనుషుడైతే తనను వ్యతిరేకించాడో అతను ఏం ఫలం పొందుతాడని పౌలు చెప్పాడు?

ఏ మనుషుడైతే తనను వ్యతిరేకించాడో అతని పనుల ప్రకారం ప్రతిఫలం పొందుతాడని పౌలు చెప్పాడు(4:14).

పౌలు మొదటి వాదంలో ఎవరు అతనితో నిలిచి ఉన్నారు?

పౌలు మొదటి వాదంలో, దేవుడు పౌలుతో నిలిచాడు(4:16-17).


Chapter 1

Translation Questions

Titus 1:1

దేవునికి చేసిన సేవలో పౌలు ఉద్దేశ్యం ఏమిటి?

దేవుడు ఎన్నుకొన్న ప్రజల విశ్వాసం స్థిరపరచడం, సత్యం గురించి జ్ఞానాన్ని స్థిరపరచడం అతని ఉద్దేశం.

Titus 1:2

దేవుడు తాను ఎన్నుకొన్న ప్రజలకోసం శాశ్వత జీవం ఎప్పుడు వాగ్దానం చేశాడు?

ఆయన యుగాల కాలాల ముందే వారికి వాగ్దానం చేసాడు

దేవుడు అబద్దం ఆడతాడా?

లేదు

Titus 1:3

దేవుడు తన ప్రకటనను సరైన సమయంలో ఎవరికి అప్పగించాడు?

దేవుడు దానిని అపొస్తలుడైన పౌలుకు అప్పగించాడు

Titus 1:4

తీతుకూ, పౌలుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

వారి ఉమ్మడి విశ్వాసం కారణంగా తీతు పౌలుకు నిజమైన కుమారుడిగా ఉన్నాడు.

Titus 1:6

పెద్ద యొక్క భార్య మరియు పిల్లలు ఏవిధంగా ఉండాలి?

అతడు ఏక పత్నీ పురుషుడిగా ఉండాలి, మరియు నిర్లక్ష్యంగల ప్రవర్తన లేదా తిరుగుబాటు విషయంలో నిందితుడు కాకుండా విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండాలి.

Titus 1:7

ఒక పెద్ద నిందితుడు కాకుండా ఉండడానికి ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన స్వభావ లక్షణాలు ఏమిటి?

అతడు అహంకారిగా ఉండకూడదు లేదా త్వరగా కోపపడేవాడు, లేదా మద్యానికి అలవాటు పడినవాడు, లేదా దెబ్బలాడేవాడు, లేదా దురాశపరుడుగా ఉండకూడదు.

దేవుని ఇంటిలో అధ్యక్షుని స్థానం మరియు బాధ్యత ఏమిటి?

అతడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడుగా ఉండాలి.

Titus 1:8

ఒక పెద్ద ఎటువంటి మంచి లక్షణాలు కలిగియుండాలి?

ఒక పెద్ద అతిథి ప్రియుడు, మంచికి స్నేహితుడు, స్థిరబుద్ధికలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం కలవాడుగా ఉండాలి.

Titus 1:9

తనకు నేర్పించిన ఉపదేశం విషయంలో పెద్ద వైఖరి ఏవిధంగా ఉండాలి?

అతడు దానిని గట్టిగా చేపట్టాలి. మరియు తద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి మరియు ఇతరులను గద్దించడానికి సమర్ధుడుగా ఉంటాడు.

Titus 1:11

వారి ఉపదేశం ద్వారా అబద్దపు బోధకులు ఏమి చేస్తున్నారు?

వారు కుటుంబాలు అన్నింటిని పాడుచేస్తున్నారు.

అబద్దపు బోధకులు ఏమి కోరుకున్నారు?

వారు సిగ్గుకరమైన లాభాన్ని కోరుకున్నారు.

Titus 1:13

సంఘాన్ని పాడుచేస్తున్న ఈ అబద్దపు బోధకులను ఒక పెద్ద ఏవిధంగా చూడాలి?

అతడు వారిని కఠినంగా గద్దించాలి తద్వారా వారు విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు.

Titus 1:14

వారు దేని విషయంలో శ్రద్ధ చూపకూడదని పౌలు చెప్పాడు?

వారు యూదుల కల్పనాకథలకూ మరియు మనుషుల ఆదేశాలకూ శ్రద్ధ చూపించకూడదు.

Titus 1:15

అవిశ్వాసియైన మనిషిలో అపవిత్రం అయినదేమిటి?

అతని మనసు మరియు మనస్సాక్షి రెండూ అపవిత్రం అయ్యాయి.

Titus 1:16

అపవిత్రుడైన మనిషి దేవుడు తెలుసు అని చెప్పుకొన్నప్పటికీ అతడు దేవుణ్ణి ఏవిధంగా నిరాకరిస్తున్నాడు?

అతడు తన పనుల ద్వారా దేవుణ్ణి నిరాకరిస్తున్నాడు.


Chapter 2

Translation Questions

Titus 2:2

సంఘంలోని వృద్ధ పురుషులు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమిటి?

వారు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగానూ, స్థిరబుద్ధికలవారుగానూ మరియు విశ్వాసంలో, ప్రేమలో, పట్టుదలలో స్థిరులుగా ఉండాలి.

Titus 2:3

సంఘంలోని వృద్ధ స్త్రీలు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమిటి?

వృద్ధస్త్రీలు గౌరవప్రదంగా ఉండాలి, కొండెకత్తెలు కాకుండా ఉండాలి మరియు నిగ్రహం కలిగి ఉండాలి, మరియు మంచికి బోధకులుగా ఉండాలి.

Titus 2:4

వృద్ధ స్త్రీలు యౌవనస్త్రీలకు ఏమి నేర్పించాలి?

వారు తమ భర్తలను ప్రేమించువారుగా, మరియు తమ బిడ్డలను ప్రేమించు వారుగా ఉండాలని బోధించాలి.

Titus 2:7

విశ్వాసులకు ఆదర్శంగా కనపరచుకొనేలా ఉండడానికి తీతు ఏమి చేయాలి?

అతడు మంచి పనుల విషయంలోనూ, నిష్కళంకంగానూ మర్యాదగానూ ఉండడంలోనూ ఆదర్శంగా ఉండాలి,

Titus 2:8

తీతు మంచి ఆదర్శంగా ఉంటే అతని ప్రతివాదికి ఏమి జరుగుతుంది?

అతని ప్రతివాది అతని గూర్చి చెడుమాట యేదియు చెప్పలేడు కనుక సిగ్గుపడతాడు.

Titus 2:9

విశ్వాసులైన బానిసలు ఏవిధంగా ప్రవర్తించాలి?

వారు బానిసలు తమ సొంత యజమానులకు విధేయులై వాదులాడకుండా సంతోషపెట్టేవారిగా ఉండాలి.

Titus 2:10

విశ్వాసులైన బానిసలు పౌలు హెచ్చరించినట్లు ప్రవర్తించినప్పుడు, ఇతరులమీద అది ఎలాంటి ప్రభావాన్ని కలిగియుంటుంది?

రక్షకుడు అయిన దేవుని గురించిన ఉపదేశానికి అన్ని విధాలుగా కీర్తి తెస్తుంది.

Titus 2:11

దేవుని కృప ఎవరిని రక్షించగలదు?

దేవుని కృప ప్రతి ఒక్కరినీ రక్షించగలదు.

Titus 2:12

మనం దేనిని తిరస్కరించడానికి దేవుని కృప మనకు శిక్షణ ఇస్తుంది?

భక్తిహీనతనూ, మరియు ఈ లోక సంబంధమైన దురాశలు తిరస్కరించడానికి దేవుని కృప మనకు మనకు శిక్షణ ఇస్తుంది.

Titus 2:13

విశ్వాసులు ఎటువంటి భవిష్యత్తు సంఘటనను పొందడం కోసం ఎదురుచూస్తున్నారు?

విశ్వాసులు శుభప్రదమైన నిరీక్షణ పొందడం కోసం ఎదురుచూస్తున్నారు: మన మహా దేవుడు, మరియు రక్షకుడు యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత.

Titus 2:14

యేసు మన కోసం ఎందుకు తనను తాను అర్పించుకొన్నాడు?

మనలను సమస్త దుర్మార్గమంతటి నుంచీ విమోచించడం కోసం, మరియు తనకోసం ప్రత్యేక ప్రజలుగా, మంచి పనుల కోసం ఆసక్తి గలవారుగా పవిత్రపరచుకోవడానికి ఆయన మన కోసం తనను తాను అర్పించుకొన్నాడు.


Chapter 3

Translation Questions

Titus 3:1

పరిపాలకులూ, అధికారుల పట్ల విశ్వాసి వైఖరి ఎలా ఉండాలి?

విశ్వాసి వారికి లోబడాలి, మరియు వారికి విధేయులై ఉండాలి, మరియు ప్రతి మంచి పని కోసం సంసిద్ధంగా ఉండాలి.

Titus 3:3

అవిశ్వాసులను తప్పుదారి పట్టించేవీ, బానిసలుగా చేసేవీ ఏమిటి?

నానా విధాల కోరికలూ, సుఖానుభవాలు వారిని తప్పుదారి పట్టిస్తాయి, బానిసలుగా చేస్తాయి.

Titus 3:5

దేవుడు మనలను ఏ విధంగా రక్షించాడు?

నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, మరియు పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావం కలిగించడం ద్వారా ఆయన మనలను రక్షించాడు.

మనం చేసిన నీతి పనులు మూలంగా రక్షించబడ్డామా లేదా దేవుని కనికరం చేత రక్షించబడ్డామా?

మనం దేవుని కనికరం చేత రక్షించబడ్డాము.

Titus 3:7

దేవుడు మనలను నీతిమంతులుగా చేసిన తరువాత మనలను ఏవిధంగా చేస్తాడు?

దేవుడు మనలను తన వారసులుగా చేస్తాడు.

Titus 3:8

విశ్వాసులు ఏమి చేయడానికి జాగ్రత్త వహించాలి?

విశ్వాసులు మంచి పనులు చెయ్యడంలో జాగ్రత్త వహించాలి.

Titus 3:9

విశ్వాసులు వేటిని తప్పించాలి?

విశ్వాసులు బుద్ధిలేని వాదనలు, వంశావళులు, కలహము, మరియు ధర్మశాస్త్రమును గురించిన విభేధములను తప్పించాలి.

Titus 3:10

ఒకటి లేదా రెండు హెచ్చరికల తర్వాత మనం ఎవరిని విసర్జించాలి?

విభజించే వ్యక్తిని మనం విసర్జించాలి.

Titus 3:14

విశ్వాసులు ఫలవంతులు కావడానికి తాము దేనిలో పాల్గొనాలి?

విశ్వాసులు తప్పనిసరి ఆవసరాల విషయం మంచి పనులలో తాము పాల్గొనడం నేర్చుకోవాలి.


Chapter 1

Translation Questions

Philemon 1:1

పౌలు ఈ ఉత్తరం వ్రాస్తుoడగా ఎక్కడున్నాడు?

పౌలు ఈ ఉత్తరం వ్రాస్తుoడగా చెరలో ఉన్నాడు(1:1,9,13).

ఈ ఉత్తరం ఎవరికీ వ్రాయటం జరిగింది?

పౌలు ప్రియమైన సోదరుడు, జత పనివాడైన ఫిలేమోనుకు వ్రాశాడు(1:1).

ఎలాంటి స్థలంలో సంఘం సమావేశమవుతుంది?

సంఘం ఇంట్లో సమావేశమవుతుంది(1:2).

Philemon 1:4

ఫిలేమోను మంచి లక్షణాలు గురించి పౌలు ఏమి విన్నాడు?

ఫిలేమోను ప్రేమ గురించి, ప్రభువుపై విశ్వాసం, పరిశుద్ధులందరిపట్ల విశ్వసనీయత గురించి పౌలు విన్నాడు [1: 5].

పౌలు ప్రకారం, పరిశుద్ధులకు ఫిలేమోను ఏమి చేశాడు?

ఫిలేమోను పరిశుద్ధుల హృదయాలను నూతన పరిచ్చడు [1: 7]

Philemon 1:8

ఎందుకు ఫిలేమోనును ఆజ్ఞాపించుటకు బదులు పౌలు దేనిని వేడుకొంటున్నాడు ?

పౌలు ఆజ్ఞాపించుటకు బదులు ఫిలేమోనును ప్రేమనుబట్టి వేడుకొంటున్నాడు(1:9).

Philemon 1:10

ఎప్పుడు పౌలు ద్వారా ఒనేసిము కుమారుడయ్యాడు?

పౌలు బంధకాలలో ఉన్నపుడు పౌలు ద్వారా ఒనేసిము కుమారుడయ్యాడు(1:10).

పౌలు ఒనేసిముతో ఏం చేశాడు?

పౌలు ఒనేసిమును తిరిగి ఫిలేమోను దగ్గరకు పంపాడు(1:12).

ఒనేసిము ఏం చేయాలని పౌలు ఇష్టపడుతున్నాడు?

ఒనేసిము తనకు సహాయం చేయాలని పౌలు ఇష్టపడుతున్నాడు(1:13).

Philemon 1:14

ఫిలేమోను ఒనేసిముకు ఏo చేయాలని పౌలు ఇష్టపడుతున్నాడు?

ఫిలేమోను ఒనేసిముకు బానిసగా ఉండటం నుంచి విడుదల, తిరిగి పౌలు దగ్గరకు పంపటానికి అంగీకారాన్ని కోరుతున్నాడు(1:14-16).

ఒనేసిమును ఇప్పుడు ఎలా ఎంచుకోవాలని పౌలు ఫిలేమోనును కోరుతున్నాడు?

ఒనేసిమును ఒక ప్రియమైన సోదరునిగా ఫిలేమోను ఎంచుకోవాలని పౌలు ఫిలేమోనును కోరుకుంటున్నాడు (1:16).

Philemon 1:21

ఫిలేమోను ఒనేసిమును తిరిగి తన దగ్గరకు పంపుతాడని పౌలు అనుకుంటున్నాడా?

అవును, ఫిలేమోను ఒనేసిమును తిరిగి తన దగ్గరకు పంపుతాడని పౌలు నమ్మకంగా ఉన్నాడు(1:21).

పౌలు చెరసాల నుంచి విడుదలైతే ఎక్కడికి వస్తాడు?

పౌలు చెరసాల నుంచి విడుదలైతే ఫిలేమోను దగ్గరకు వచ్చి అతిధిగా ఉంటాడు.


Chapter 1

Translation Questions

Hebrews 1:1

చాలా కాలం క్రితం దేవుడు ఎలా మాట్లాడాడు?

చాలా కాలం క్రితం దేవుడు అనేక సమయాలలో, నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు[1:1].

ఈ చివరి రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడాడు?

దేవుడు ఈ చివరి రోజుల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాడు[1:2].

ఎవరి ద్వారా విశ్వం సృజించడం జరిగింది?

కుమారుని ద్వారానే దేవుడు ఈ విశ్వాన్ని సృజించాడు[1:22].

సమస్తం ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది?

ఆయన బలప్రభావాలు గల తన వాక్కు చేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు[1:3].

దేవుని మహిమను, స్వభావాన్ని కుమారుడు ఏ విధంగా కనుపరుస్తున్నాడు?

కుమారుడే దేవుని మహిమతేజస్సు , దేవుని స్వభావ స్వరూపం[1:3].

Hebrews 1:4

దేవుని కుమారునికి దేవదూతలతో పోలిక ఏమిటి?

దేవుని కుమారుడు దేవదూతలకంటే శ్రేష్టుడు[1:4].

Hebrews 1:6

కుమారుణ్ణి లోకంలోకి రప్పించినప్పుడు దేవదూతలను ఏమి చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించాడు?

కుమారుణ్ణి లోకంలోకి రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనను ఆరాధించాలని దేవుడు ఆజ్ఞాపించాడు[1:6].

Hebrews 1:8

కుమారుడు రాజుగా ఎంతకాలం పరిపాలన చేస్తాడు?

కుమారుడు రాజుగా శాశ్వతకాలం పరిపాలన చేస్తాడు[1:8].

కుమారుడు దేన్ని ప్రేమిస్తాడు, దేన్ని ద్వేషిస్తాడు?

కుమారుడు నీతిని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు[1:9].

Hebrews 1:10

కాలం గతించిన తరువాత భూమికి, ఆకాశానికి ఏమి జరుగుతుంది?

ఆకాశం, భూమి వస్త్రం లాగా పాతబడిపోతాయి[1:10-11].

Hebrews 1:13

ఏమి జరిగేంత వరకు దేవుడు కుమారుని తన కుడివైపున కూర్చుండమని చెప్పాడు?

కుమారుని శత్రువులను తన పాదాల క్రింద పీఠంగా దేవుడు చేసే వరకు కుమారుని తన కుడి వైపున కూర్చోమని దేవుడు చెప్పాడు [1:13].

దేవదూతలకు శారీరక దేహాలుంటాయా?

లేదు. దేవదూతలు ఆత్మలు[1:7,14].

ఎవరి గురించి దేవదూతలు శ్రద్ధ తీసుకుంటారు?

రక్షణ అనే స్వాస్థ్యాన్నిపొందబోయే వారి గురించి దేవదూతలు శ్రద్ధ తీసుకుంటారు[1:14].


Chapter 2

Translation Questions

Hebrews 2:1

ఎందుకు విశ్వాసులు తాము విన్నదాని గురించి శ్రద్ధ తీసుకోవాలి?

విశ్వాసులు తాము విన్న సంగతులనుంచి కొట్టుకు పోకుండా శ్రద్ధ తీసుకోవాలి[2:1].

Hebrews 2:2

ప్రతీ అతిక్రమం, అవిధేయత ఏమి పొందుతాయి?

ప్రతీ అతిక్రమం, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతాయి[2:2].

ప్రభువు ప్రకటించిన సువార్తకు దేవుడు ఎలా సాక్ష్యం ఇచ్చాడు?

దేవుడు సూచకక్రియలూ వింతలూ శక్తివంతమైన క్రియలూ పరిశుద్ధాత్మ వరాల చేత సువార్తకు సాక్ష్యం ఇచ్చాడు[2:4].

Hebrews 2:5

రానున్న లోకాన్ని ఎవరు పాలించరు?

రానున్న లోకాన్నిదేవదూతలు పాలించరు[2:5].

Hebrews 2:7

రానున్న లోకాన్ని ఎవరు పాలిస్తారు?

నరపుత్రుడు రానున్న లోకాన్ని పాలిస్తాడు[2:6-8].

Hebrews 2:9

ఎవరి నిమిత్తం యేసు మరణాన్ని రుచి చూసాడు?

ప్రతిఒక్కరి నిమిత్తం యేసు మరణాన్ని రుచి చూసాడు[2:9].

ఎవరిని మహిమలోకి తేవాలని దేవుడు తలంచాడు?

అనేకమంది కుమారులను మహిమలోకి తేవాలని దేవుడు తలంచాడు[2:10].

Hebrews 2:11

ఏ ఇద్దరు ఒకే ఆధారం, దేవుని నుంచి వస్తారు?

పరిశుద్ధ పరచేవాడు, పరిశుద్ధత పొందేవారు ఒకే ఆధారం, దేవుని నుంచి వస్తారు [2:11].

Hebrews 2:13

యేసు మరణం ద్వారా ఎవరు శక్తిహీనుడయ్యాడు?

యేసు మరణం ద్వారా సాతాను శక్తిహీనుడయ్యాడు[2:14].

యేసు మరణం ద్వారా ఎలాంటి బానిసత్వం నుంచి మనుషులు విడుదల పొందారు?

యేసు మరణం ద్వారా మరణభయం నుంచి మనుషులు విడుదల పొందారు[2:15].

Hebrews 2:16

ఎందుకు యేసు అన్నింటిలో తన సోదరులలాంటివాడుగా ఉండవలసి వచ్చింది?

ఆయన దేవుని విషయాలలో జాలిగల నమ్మకమైన యాజకుడయ్యే నిమిత్తం, ప్రజల పాపాలకు క్షమాపణ కలగజేయాలని యేసు అన్నింటిలో తన సోదరులలాంటివాడుగా ఉండవలసి వచ్చింది[2:17].

శోధనలకు గురి అయిన వారికి యేసు సాయం చెయ్యగలిగినవాడు ఎలా అయ్యాడు?

యేసు శోధనలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక శోధనలకు గురి అయినవారికి సాయం చెయ్యగలిగినవాడు అయ్యాడు[2:18].


Chapter 3

Translation Questions

Hebrews 3:1

హెబ్రీ గ్రంథకర్త యేసుకు ఇచ్చిన రెండు బిరుదులేంటి?

అపొస్తలుడు, ప్రధానయజకుడు అని గ్రంధకర్త యేసుకు బిరుదులు ఇచ్చాడు[3:1].

మోషే కంటే యేసు ఎక్కువ గౌరవానికి తగినవాడుగా ఎందుకు లెక్కకు వచ్చాడు?

మోషే దేవుని యిల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, యేసు యింటిని నిర్మించాడు కనుక యేసు మోషే కంటే ఎక్కువ గౌరవానికి తగినవాడుగా లెక్కకు వచ్చాడు[3:2-3].

Hebrews 3:5

దేవుని ఇంటిలో మోషే పాత్ర ఏమిటి?

దేవుని ఇంటిలో మోషే ఒక సేవకుడు[3:5].

మోషే దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు?

మోషే తరువాత చెప్పబోతున్నదాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు[3:5].

దేవుని ఇంటిలో యేసు పాత్ర ఏమిటి?

యేసు దేవుని ఇంటిమీద అధికారి[3:6].

దేవుని ఇల్లు ఎవరు?

విశ్వాసులు అంతం వరకు తమ ధైర్యాన్నిగట్టిగా పట్టుకొన్నారంటే వారే ఆయన ఇల్లు[3:6].

Hebrews 3:7

అరణ్యంలో దేవుని స్వరాన్ని వినినపుడు ఇశ్రాయేలీయులు ఏమి చేసారు?

ఇశ్రాయేలీయులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు[3:7-8].

Hebrews 3:9

ఇశ్రాయేలీయులు తమ హృదయాలలో తప్పిపోయిన వారి విషయం దేవుడు ఏమని ప్రమాణం చేసాడు?

వారు విశ్రాంతిలో ప్రవేసించరని దేవుడు ప్రమాణం చేసాడు[3:10-11].

Hebrews 3:12

దేని విషయం సోదరులకు హెచ్చరిక ఇవ్వటం జరిగింది?

నమ్మకంలేని హృదయం ద్వారా దేవుని నుండి తొలగిపోకుండా జాగ్రత్త వహించాలని సోదరులకు హెచ్చరిక ఇవ్వటం జరిగింది[3:12].

పాపం ద్వారా కలిగే మోసం చేత కఠినులు కాకుండా ఉండటానికి సోదరులు ఏమి చెయ్యాలి?

అనుదినం సోదరులు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొంటూ ఉండాలి[3:13].

Hebrews 3:14

క్రీస్తులో పాలిభాగస్తులుగా విశ్వాసులు ఏమి చెయ్యాలి?

క్రీస్తులో పాలిభాగస్తులుగా విశ్వాసులు మొదట వారికున్న ధైర్యాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టాలి[3:14].

Hebrews 3:16

ఎవరి విషయం దేవుడు నలభై సంవత్సరాలు కోపగించుకున్నాడు?

అరణ్యంలో పాపం చేసినవారి విషయం దేవుడు నలభై సంవత్సరాలు కోపగించుకున్నాడు[3:17].

దేవుడు కోపపడిన వారికి ఏమి జరిగింది?

వారి మృత దేహాలు అరణ్యంలో కూలిపోయాయి[3:17].

అవిధేయులైన ఇశ్రాయేలీయులు దేవుని విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించలేక పోయారు?

అవిధేయులైన ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసం కారణంగా దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేక పోయారు[3:19].


Chapter 4

Translation Questions

Hebrews 4:1

విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ వినిన శుభవార్త ఏమిటి?

విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త విన్నారు[4:2].

దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త ఇశ్రాయేలీయులకు ఎందుకు ప్రయోజనకరంగా లేదు?

ఇశ్రాయేలీయులకు అ శుభవార్త మీద నమ్మకం కుదరలేదు కనుక వారికి ప్రయోజనకరంగా లేదు[4:2].

Hebrews 4:3

దేవుని విశ్రాంతిలో ప్రవేశించేదెవరు?

శుభవార్తను విని దానిని విశ్వసించినవారు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు [4:2-3].

దేవుడు తాను సృష్టించిన వాటిని ఎప్పుడు సంపూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు?

దేవుడు తాను సృష్టించిన వాటిని జగత్తుకు పునాది వేయబడినప్పుడే సంపూర్తి చేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు[4:3-4].

దేవుడు ఇశ్రాయేలీయుల గురించి తన విశ్రాంతి గురించి ఏమిచెప్పాడు?

ఇశ్రాయేలీయులు తన విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు[4:5].

Hebrews 4:6

తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు ఏ దినం నిర్ణయించాడు?

తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు "ఈ రోజు" నిర్ణయించాడు(4:7).

దేవుని విశ్రాంతిలోకి ప్రవేసించడానికి ఎవరైనా ఏమి చేయాలి?

దేవుని స్వరం విని హృదయం కఠినం చేసుకోకుండా ఉండాలి.

Hebrews 4:8

దేవుని ప్రజలకు నిలిచియున్న దేమిటి?

దేవుని ప్రజలకు సబ్బాతు విశ్రాంతి నిలిచి ఉంది[4:9].

దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు దేనినుండి విశ్రాంతి పొందుతాడు?

దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు తన కార్యాలనుండి విశ్రాంతి పొందుతాడు[4:10].

దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి విశ్వాసులు ఎందుకు ఆతురపడాలి?

ఇశ్రాయేలీయులు చేసినట్టు పడిపోకుండా దేవుని విశ్రాంతిలో ప్రవేశించదానికి విశ్వాసులు ఆశపడాలి[4:11].

Hebrews 4:12

దేవుని వాక్యం దేనికంటే వాడిగలది?

దేవుని వాక్యం ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడిగలది[4:12].

దేవుని వాక్యం దేన్ని విభజించటానికి శక్తి కలది?

దేవుని వాక్యం ప్రాణాన్నీ, ఆత్మనూ విభజిస్తూ, కీళ్ళనూ మూలుగునూ వేరు చేస్తుంది[4:12].

దేవుని వాక్యం వేటిని శోధించ గలదు?

దేవుని వాక్యం తలంపులను ఆలోచనలను శోధించగలదు[4:12].

దేవుని దృష్టికి కనిపించనిది ఏది?

సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు[4:13].

Hebrews 4:14

విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు ఎవరు?

దేవుని కుమారుడైన యేసు విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు[4:14].

విశ్వాసుసుల బలహీనతలలో యేసు ఎందుకు సానుభూతి చూపుతున్నాడు?

అన్నివిషయాలలో ఆయన శోధనలకు గురి అయ్యాడు కనుక విశ్వాసుసుల బలహీనతలలో యేసు సానుభూతి చూపుతున్నాడు[4:15].

యేసు ఎన్ని సార్లు పాపం చేసాడు?

ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు[4:15].

అవసర సమయాలలో కరుణ, కృప పొందటానికి విశ్వాసులు ఏమి చెయ్యాలి?

అవసర సమయాలలో విశ్వాసులు ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి చేరాలి[4:16].


Chapter 5

Translation Questions

Hebrews 5:1

ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల పక్షంగా ఏమి చేస్తాడు?

ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కోసం అర్పణలు, బలులు అర్పిస్తాడు[5:1].

ప్రజలకు కోసం అర్పించటానికి అదనంగా ప్రధాన యాజకుడు ఎవరి కోసం అర్పణలు అర్పిస్తాడు ?

ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం కూడా బలులు అర్పిస్తాడు[5:3].

Hebrews 5:4

దేవుని ప్రదానయాజకుని ఘనత ఒక వ్యక్తి ఎలా తీసుకుంటాడు?

అతడు ప్రదానయాజకునిగా ఉండుటకు దేవుని పిలుపు పొందినవాడై ఉండాలి [5:4].

ప్రధాన యాజకునిగా క్రీస్తును ఎవరు ప్రకటించారు?

క్రీస్తును ప్రధానయాజకునిగా దేవుడు ప్రకటించాడు[5:5,10].

Hebrews 5:6

క్రీస్తు దేవుని ప్రధానయాజకునిగా ఎంతకాలముంటాడు?

క్రీస్తు దేవుని ప్రధానయాజకునిగా నిరంతరం ఉంటాడు[5:6].

ఏ వరుస క్రమం చొప్పున క్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్నాడు?

మెల్కీసెదెకు వరుస ప్రకారం క్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్నాడు[5:6,10].

Hebrews 5:7

క్రీస్తు ప్రార్ధనలను దేవుడు ఎందుకు విన్నాడు?

క్రీస్తుకున్న భయభక్తులను బట్టి ఆయన ప్రార్ధనలను దేవుడు విన్నాడు[5:7].

క్రీస్తు విధేయత ఎలా నేర్చుకున్నాడు?

తాను పొందిన శ్రమల వలన క్రీస్తు విధేయతను నేర్చుకున్నాడు[5:8].

Hebrews 5:9

ఎవరి కోసం క్రీస్తు శాశ్విత రక్షణకు కారకుడయ్యాడు?

తనకు విధేయత చూపిన వారికోసం క్రీస్తు శాశ్విత రక్షణకు కారకుడయ్యాడు[5:9].

ఈ లేఖను పొందినవారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది?

ఈ లేఖను పొందినవారు వినడంలో మందబుద్దులయ్యారు, దేవోక్తులలో ఉన్న మొదటి పాఠాలు నేర్చుకొనవలసిన వారుగా ఉన్నారు[5:11-12].

Hebrews 5:12

విశ్వాసులు ఆత్మీయంగా పసిపిల్లలు నుండి ఎదిగిన పెద్దల వలె ఎలా ఎదుగుతారని పత్రిక రచయిత చెపుతున్నాడు?

విశ్వాసులు మంచిచెడ్డలు గుర్తించడం సాధన చెయ్యడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతారు[5:14].


Chapter 6

Translation Questions

Hebrews 6:1

హెబ్రీ గ్రంధకర్త విశ్వాసులను ఏవిషయంలో ముందుకు సాగాలని కోరుతున్నాడు?

హెబ్రీ గ్రంధకర్త విశ్వాసులను సంపూర్ణతకు ముందుకు సాగాలని కోరుతున్నాడు[6:1].

క్రీస్తు సందేశానికి ఆధారంగా హెబ్రీ గ్రంధకర్త చూపుతున్న బోధల జాబితా ఏది?

నిర్జీవక్రియల విషయం పశ్చాత్తాపం, దేవునిమీద నమ్మకం, బాప్తిస్మం, చేతులుంచడం, చనిపోయినవారు లేవడమూ, శాశ్వతమైన తీర్పులు మొదలైనవి పునాది బోధలు[6:1-2].

Hebrews 6:4

ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారు ఏమి కావడం అసాధ్యం?

ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం[6:4-6].

వెలుగొందిన ఈ ప్రజలు ఏమి రుచి చూసారు?

వెలుగొందిన ఈ ప్రజలు పరలోక వరాన్ని, దేవుని వాక్కును, రానున్న యుగప్రభావాలను రుచి చూసారు[6:4-5].

ఈ ప్రజలు పశ్చాత్తాపడేలా ఎందుకు సాధ్యం కావడం లేదు?

వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేసారు కాబట్టి వారు పశ్చాత్తాపడేలా సాధ్యం కావడం లేదు[6:6].

Hebrews 6:7

రచయిత సాదృశ్యంలో వర్షాన్ని పొంది, ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే ఆ భూమికి ఏమి జరుగుతుంది?

వర్షాన్ని పొంది, ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే ఆ భూమి కాల్చివేయడం జరుగుతుంది[6:7-8].

Hebrews 6:9

తాను రాస్తున్న విశ్వాసుల విషయం రచయిత ఏమి కోరుతున్నాడు?

ఈ విశ్వాసులనుండి రక్షణ గురించిన శ్రేష్టమైన విషయాలకోసం రచయత ఎదురుచూస్తున్నాడు[6:9].

ఈ విశ్వాసుల విషయంలో దేవుడు ఏమి మరచిపోడు?

వారు చేసిన పనిని, వారి ప్రేమను, పరిశుద్ధులకు వారు చేసిన సేవను దేవుడు మరచిపోడు[6:10].

Hebrews 6:11

దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విషయంలో విశ్వాసులు దేన్ని అనుకరించాలి?

దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విశ్వాసంను, ఓర్పును విశ్వాసులు అనుకరించాలి[6:12].

Hebrews 6:13

దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఏమి చేయాలి?

దేవుడు తనకు వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఓపికతో ఎదురుచూడాలి[6:13-15].

Hebrews 6:16

దేవుడు తన వాగ్దానాన్నిఎందుకు ప్రమాణం ద్వారా స్థిరపరచాడు?

మార్పుచెందని తన ఉద్దేశాన్ని చూపించటానికి దేవుడు తన వాగ్దానాన్ని ప్రమాణం ద్వారా స్థిరపరచాడు[6:17].

దేవునికి ఏది అసాధ్యం?

దేవుడు అబద్ధమాడటం అసాధ్యం[6:18].

Hebrews 6:19

దేవునిలో విశ్వాసి నమ్మకం అతని ఆత్మకు ఏమి చేస్తుంది?

దేవునిలో విశ్వాసి నమ్మకం అతని ఆత్మకు భద్రమైనది, సుస్థిరమైన లంగరు వంటిది[6:19].

విశ్వాసులకు ముందుగా వెళ్ళిన వాడుగా యేసు ఎక్కడ ప్రవేశించాడు?

యేసు విశ్వాసుల కోసం ముందుగా తెర వెనుకకు ప్రవేశించాడు[6:20].


Chapter 7

Translation Questions

Hebrews 7:1

మెల్కీసెదెక్ కు ఇచ్చిన రెండు బిరుదులేంటి?

మెల్కీసెదెక్ కు షాలేం పట్టణ రాజు, మహోన్నతుడైన దేవుని యాజకుడు అని పేర్లు [7:1].

అబ్రాహాము మెల్కీసెదెక్ కు ఏమి ఇచ్చాడు?

అబ్రాహాము మెల్కీసెదెక్ కు అన్నింటిలో పదవ వంతు ఇచ్చాడు[7:2].

మెల్కీసెదెక్ అనే పేరుకు అర్ధమేమిటి?

మెల్కీసెదెక్ అనే పేరుకు "నీతికి రాజు" అని "శాంతి రాజు" అని అర్ధం[7:2].

మెల్కీసెదెక్ పితరులు ఎవరు, అతను ఎప్పుడు చనిపోయాడు?

మెల్కీసెదెక్ పితరులు లేనివాడు, తన జీవానికి అంతము లేనివాడు[7:3].

Hebrews 7:4

ఎవరి సంతానంలో నుంచి యాజకులు వచ్చారు, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు ఎవరు. ప్రజలనుంచి పదవ వంతు ఎవరు పోగు చేస్తారు?

ధర్మశాస్త్ర యాజకులు లేవి, అబ్రాహాము సంతానం నుంచి వచ్చారు[7:5].

Hebrews 7:7

అబ్రాహాము, మెల్కీసెదెక్ లలో ఎవరు గొప్పవారు?

మెల్కీసెదెక్ గొప్పవాడు ఎందుకంటే అతడు అబ్రాహామును ఆశీర్వదించాడు[7:7].

ఏవిధంగా లేవి కూడా మెల్కీసెదెక్ దశమ భాగాన్ని ఇచ్చాడు?

లేవి మెల్కీసెదెక్ దశమ భాగాన్ని చెల్లించాడు, ఎలాగంటే అబ్రాహాము మెల్కీసెదెక్ దశమ భాగాన్ని ఇచ్చినపుడు లేవి అబ్రాహాము గర్భంలోనే ఉన్నాడు[7:9-10].

Hebrews 7:11

మెల్కీసెదెకు వరుసక్రమంలో మరొక యాజకుడు ఎందుకు కావలసి వచ్చింది?

మెల్కీసెదెకు వరుసక్రమంలో మరొక యాజకుడు కావలసి వచ్చింది ఎందుకంటే లేవియాజక ధర్మం ద్వారా సంపూర్ణత సాధ్యం కాలేదు[7:11].

యాజక ధర్మం మారినపుడు ఏమి మార్పుచెందాలి?

యాజక ధర్మం మారినపుడు ధర్మశాస్త్రం కూడా మారడం అవసరం[7:12].

Hebrews 7:13

ఏ గోత్రం నుండి యేసు వచ్చాడు, అతని గోత్రం బలిపీఠం వద్ద ఇంతకు ముందు యాజక ధర్మం చేసారా?

యూదా గోత్రం నుండి యేసు వచ్చాడు, యూదా గోత్రం బలిపీఠం వద్ద ఇంతకు ముందు యాజక ధర్మం చేయలేదు[7:14].

Hebrews 7:15

దేనిప్రకారం యేసు మెల్కీసెదెక్ వరుసక్రమంలో యాజకుడయ్యాడు?

అంతం లేని జీవానికున్న బలం ప్రకారమే యేసు మెల్కీసెదెక్ వరుసక్రమంలో యాజకుడయ్యాడు[7:16].

Hebrews 7:18

బలహీనమైనది, పనికిమాలినిది అయిన ఏది ప్రక్కన పెట్టడం జరిగింది?

బలహీనమైనది, పనికిమాలినిది అయిన ధర్మశాస్త్రం, మునుపు ఉన్న ఆజ్ఞ ప్రక్కన పెట్టడం జరిగింది[7:18-19].

Hebrews 7:20

క్రీస్తులో విశ్వాసులకున్న దానిని దేవుడెలా శ్రేష్టమైన విశ్వాసంగా స్థిరపరచాడు?

యేసు శాశ్వతం యాజకుడిగా ఉంటాడనే ప్రమాణం చెయ్యటం ద్వారా క్రీస్తులో విశ్వాసులకున్న దానిని దేవుడు శ్రేష్టమైన విశ్వాసంగా స్థిరపరచాడు[7:19-21].

Hebrews 7:22

యేసు దేన్ని ఖాయం చేసాడు?

శ్రేష్టమైన నిబంధనను యేసు ఖాయపరచాడు[7:22].

Hebrews 7:25

తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు ఏవిధంగా శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు?

తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు ఎందుకంటే వారి పక్షంగా విజ్ఞాపనలు చెయ్యడానికి ఆయన ఎప్పటికి జీవిస్తూ ఉన్నాడు[7:25].

యేసు విశ్వాసులకు తగిన యాజకుడిగా ఉండటానికి ఉన్న నాలుగు లక్షణాలు ఏమిటి?

యేసు పాపం లేనివాడు, నిర్దోషి, కళంకం లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు[7:26].

Hebrews 7:27

ప్రజల పాపం కోసం యేసు ఏమి అర్పించాడు?

ప్రజల పాపం కోసం యేసు తనను తాను ఒక్కసారే అర్పించుకొన్నాడు[7:27].

యేసు తనకు తాను ఎలాంటి అర్పణ అర్పించుకోవాల్సి వచ్చింది?

యేసు పాపం లేనివాడు కనుక తనకు తాను ఎలాంటి అర్పణ అర్పించాల్సిన అవసరం లేదు[7:26-27].

ధర్మశాస్త్రం ద్వారా నియమితులైన యాజకులకు యేసు ఏవిధంగా భిన్నమైనవాడు?

ధర్మశాస్త్రం ద్వారా నియమితులైన యాజకులు బలహీనులు, అయితే యేసు శాశ్వితంగా సంపూర్ణసిద్ధి పొందినవాడు[7:28].


Chapter 8

Translation Questions

Hebrews 8:1

విశ్వాసుల ప్రధానయాజకుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు?

విశ్వాసుల ప్రధానయాజకుడు పరలోకంలో ఉన్న మహాఘనుడైన దేవుని సింహాసనం కుడిప్రక్కన కూర్చుని ఉన్నాడు[8:1].

నిజమైన గుడారం ఎక్కడ ఉంది?

నిజమైన గుడారం పరలోకంలో ఉంది[8:2].

Hebrews 8:3

ప్రతీ యాజకునికి ఏమి ఉండాలి?

ప్రతీ యజకునికి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి[8:3].

ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఎక్కడ ఉన్నారు?

ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు భూమి మీద ఉన్నారు[8:4].

భూమి మీద ఉన్న యాజకులు దేనికి సేవ చేయాలి?

భూమి మీద ఉన్న యాజకులు పరలోక విషయాలకు సూచనగా, నీడగా ఉన్న ఆరాధనా గుడారంలో సేవ చేయాలి[8:5].

ఏ పద్ధతి ప్రకారం భూసంబంధమైన గుడారం నిర్మాణం జరిగింది?

దేవుడు మోషేకు పర్వతం మీద చెప్పిన పద్ధతి ప్రకారం భూసంబంధమైన గుడారం నిర్మాణం జరిగింది[8:5].

Hebrews 8:6

క్రీస్తుకు శ్రేష్టమైన యాజక సేవ ఎందుకు దొరికింది?

క్రీస్తుకు శ్రేష్టమైన సేవ దొరికింది ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాగ్దనాల మీద స్థాపితమైన శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు[8:6].

Hebrews 8:8

మొదటి నిబంధన క్రింద ఉన్న ప్రజలు లోపంలో ఉన్నప్పుడు దేవుడు వారికేం వాగ్దానం చేసాడు?

ఇశ్రాయేలు ఇంటితోను, యూదా ఇంటితోను దేవుడు నూతన నిబంధనను వాగ్దానం చేసాడు[8:8].

Hebrews 8:10

నూతన నిబంధనలో దేవుడు ఏమి చేస్తానని చెప్పాడు?

ఆయన తన శాసనాలను వారి మనసులలో రాస్తానని చెప్పాడు, వారి హృదయాలలో రాస్తానని చెప్పాడు[8:10].

Hebrews 8:11

నూతన నిబంధనలో ప్రభువును ఎవరు తెలుసుకుంటారు?

నూతన నిబంధనలో అల్పులైనా, ఘనులైనా వారు ప్రభువును తెలుసుకుంటారు[8:11].

నూతన నిబంధనలో ప్రజల పాపం విషయం దేవుడు ఏమిచేస్తాడని చెప్పాడు?

నూతన నిబంధనలో ప్రజల పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడని చెప్పాడు [8:11].

Hebrews 8:13

క్రొత్త నిబంధనను ప్రకటించడం చేత దేవుడు మొదటి నిబంధనను ఏమి చేసాడు?

క్రొత్త నిబంధనను ప్రకటించడం చేత దేవుడు మొదటి నిబంధనను పాతదిగా, అంతర్దానం కావడానికి సిద్ధమైనదిగా చేసాడు[8:13].


Chapter 9

Translation Questions

Hebrews 9:1

మొదటి నిబంధనకు ఆరాధన స్థలం ఏది?

మొదటి నిబంధనకు ఆరాధన స్థలం భూమి మీద గుడారం[9:1-2].

భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఏవి ఉంచారు?

భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం, బల్ల, సన్నిధి రొట్టెలు ఉన్నాయి[9:2].

Hebrews 9:3

భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో ఏమి ఉన్నాయి?

భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో బంగారు ధూపార్తి, నిబంధన మందసం ఉన్నాయి[9:4].

Hebrews 9:6

అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఎన్ని సార్లు వెళ్తాడు, దానిలోకి ప్రవేశించటానికి ముందు ఏమి చేస్తాడు?

తన కోసం, ఇతరుల కోసం బలులు అర్పించిన తరువాత అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే ప్రవేశిస్తాడు[9:7].

Hebrews 9:8

ఈ ఉత్తరాన్ని ప్రస్తుతకాలం చదివే వారికి ఇది ఏ విషయం ఉదాహరణగా ఉంది?

భూసంబంధమైన గుడారం, అర్పించిన అర్పణలు, బలులూ ప్రస్తుత కాలానికి ఉదాహరణగా ఉంది[9:9].

భూసంబంధమైన గుడారం బలులు ఏమి చెయ్యలేవు?

భూసంబంధమైన గుడారం బలులు ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు[9:9].

భూసంబంధమైన గుడారం విధులు ఎప్పటి వరకు వర్తిస్తాయి?

భూసంబంధమైన గుడారం విధులు నూతన క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి[9:10].

Hebrews 9:11

క్రీస్తు సేవ చేసే పవిత్ర గుడారం గురించిన ప్రత్యేకత ఏమిటి?

క్రీస్తు సేవ చేసే పవిత్ర గుడారం మరింత పరిపూర్ణమైనది, చేతులతో చేసినది కాదు, ఈ సృష్టి సంబంధమైనది కాదు[9:11].

పవిత్రమైన గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో క్రీస్తు ఏబలిని అర్పించాడు?

క్రీస్తు తన సొంత రక్తంతోనే పవిత్రమైన గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు[9:12,14].

క్రీస్తు అర్పణ ఏ కార్యాన్ని పూర్తి చేసింది?

క్రీస్తు అర్పణ ప్రతి ఒక్కరికి శాశ్వత విమోచనను అనుగ్రహించింది [9:12].

Hebrews 9:13

క్రీస్తు రక్తం విశ్వాసికి ఏమిచేస్తుంది?

జీవంగల దేవుని సేవకోసం విశ్వాసి మనస్సాక్షిని నిర్జీవ క్రియలనుండి శుద్ది చేస్తుంది[9:14].

క్రీస్తు దేని విషయం మధ్యవర్తి?

క్రీస్తు నూతన నిబంధనకు మధ్యవర్తి [9:15].

Hebrews 9:16

మరణ శాసనం చెల్లుబాటు కావడానికి ఏది అవసరం?

మరణ శాసనం చెల్లుబాటు కావడానికి మరణం అవసరం[9:17].

Hebrews 9:18

మొదటి నిబంధనకు ఎలాటి మరణం అవసరం?

మొదటి నిబంధనకు కోడెదూడల మరణం, మేకల మరణం అవసరం[9:18-19].

Hebrews 9:21

రక్తం చిందనిదే ఏమి జరగదు?

రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు[9:22].

Hebrews 9:23

క్రీస్తు మన పక్షంగా ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు?

ఇప్పుడు క్రీస్తు దేవుని సముఖంలో మన కోసం కనబడడానికి ఆయన పరలోకంలో ఉన్నాడు[9:24].

Hebrews 9:25

పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు తనను తాను ఎన్ని సార్లు అర్పించుకోవాలి?

పాపాన్ని తీసివేయడానికి యుగాల అంతంలో ఒకేసారి క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు[9:26].

Hebrews 9:27

ప్రతీవ్యక్తి మరణం తరువాత ఏమి జరుగుతుంది?

ప్రతీవ్యక్తి చనిపోయిన తరువాత వారు తీర్పును ఎదుర్కొంటారు[9:27].

ఏ ఉద్దేశ్యం కోసం క్రీస్తు రెండవ సారి ప్రత్యక్షమవుతాడు?

తన కోసం ఎదురు చూచేవారికి విముక్తి ప్రసాదించడానికి క్రీస్తు రెండవ సారి కనిపిస్తాడు[9:28].


Chapter 10

Translation Questions

Hebrews 10:1

క్రీస్తులోని నిజస్వరూపంతో ధర్మశాస్త్రం పోలిక ఏమిటి?

క్రీస్తులోని నిజస్వరూపానికి ధర్మశాస్త్రం ఒక నీడ మాత్రమే[10:1].

ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి?

ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు వారి పాపలను జ్ఞాపకం చేస్తున్నాయి[10:3].

ఎద్దుల రక్తం, మేకల రక్తం ఏమి చెయ్యడం అసాధ్యం?

ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం[10:4].

Hebrews 10:5

క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ఆయన కోసం ఏమిసిద్ధపరచాడు?

దేవుడు ఆయన కోసం ఒక శరీరాన్ని సిద్ధపరచాడు[10:5].

Hebrews 10:8

క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ఏఅభ్యాసాన్ని ప్రక్కన పెట్టాడు?

క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించవలసిన అభ్యాసాన్ని ప్రక్కన పెట్టాడు[10:8].

క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ఏ అభ్యాసాన్ని స్థిరపరచాడు?

క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు క్రీస్తు శరీరాన్ని అందరికోసం అర్పించే అభ్యాసాన్ని స్థిరపరచాడు[10:10].

Hebrews 10:11

దేవుని కుడి వైపున కూర్చుని క్రీస్తు దేనికోసం ఎదురు చూస్తున్నాడు?

తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు[10:12-13].

క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారికి క్రీస్తు ఏమి చేసాడు?

క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారిని క్రీస్తు శాశ్వతంగా పరిపూర్ణులను చేసాడు[10:14].

Hebrews 10:17

పాపాలకు క్షమాపణ లేని పక్షంలో ఏది అవసరం లేదు?

పాపాలకు క్షమాపణ లేని పక్షంలో అదనపు బలులు అవసరం లేదు[10:18].

Hebrews 10:19

యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించగలరు?

యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలం లోకి ప్రవేశించగలరు[10:19].

విశ్వాసిలో దేని మీద ప్రోక్షణ జరిగింది, ఏది శుద్ధి అయ్యింది?

విశ్వాసి హృదయం నేరారోపణ చేయకుండా దాని మీద ప్రోక్షణ జరిగింది, శరీరం శుద్ధజలంతో శుద్ధి అయ్యింది[10:22].

Hebrews 10:23

విశ్వాసులు దేన్ని గట్టిగా పట్టుకోవాలి?

విశ్వాసులు తమ నిరీక్షణ విషయం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోవాలి[10:23].

ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఏమిచెయ్యాలి?

ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకొంటూ ఉండాలి[10:25].

Hebrews 10:26

సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతని విషయం ఏమి చేయాలి?

సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతనికి తీర్పు, దేవుని శత్రువులను దహించి వేసే అగ్ని ఉంటుంది[10:26-27].

Hebrews 10:28

ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే అతడు ఏమి పొందుతాడు?

ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే ఎలాంటి కరుణ లేకుండ మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్న శిక్షకు మించిన శిక్షకు అతడు పాత్రుడవుతాడు[10:28-29].

Hebrews 10:30

పగ తీర్చటం ఎవరి వంతు?

పగ తీర్చుట దేవుని వంతు[10:30].

Hebrews 10:32

వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా ఈ ఉత్తరాన్ని పొందినపుడు వారు స్పందన ఎలాఉంది?

వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా దానికంటే శ్రేష్టమైన ఆస్తి పరలోకంలో వారికుందని తెలిసికొని విశ్వాసులు సంతోషంతో అంగీకరించారు[10:34].

Hebrews 10:35

దేవుడు వాగ్దానం చేసినది పొందేలా విశ్వాసి ఏమి చెయ్యాలి?

దేవుడు వాగ్దానం చేసినది పొందేలా విశ్వాసికి ధైర్యం, ఓర్పు అవసరం[10:35-36].

Hebrews 10:38

నీతిమంతుడు ఏవిధంగా జీవిస్తాడు?

నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు[10:38].

వెనుకకు తీసిన వ్యక్తి విషయం దేవుడు ఏమని తలుస్తాడు?

వెనుకకు తీసిన వ్యక్తి విషయం దేవుడు సంతోషించడు[10:38].

ఈ ఉత్తరాన్ని స్వీకరించిన వారి విషయం రచయిత ఏమి కోరుకుంటున్నాడు?

ఈ ఉత్తరాన్ని స్వీకరించిన వారు వారి ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగినవారై ఉండాలని రచయిత కోరుకుంటున్నాడు [10:39].


Chapter 11

Translation Questions

Hebrews 11:1

ఇంకా సంపూర్తి కాని దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ఎలాంటి వైఖరి కలిగిఉండాలి?

ఇంకా సంపూర్తి కాని దేవుని వాగ్దానాలను విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ధైర్యంతో ఎదురు చూస్తాడు, వాటి పట్ల ఖచ్చితమైన వైఖరి కలిగి ఉంటాడు[11:1].

ప్రపంచాల్లో కనిపించే వస్తువులు దేనివలన నిర్మాణం అయ్యాయి?

ప్రపంచాల్లో కనిపించే వస్తువులు కనిపించే వస్తువులతో నిర్మాణం కాలేదు[11:3].

Hebrews 11:4

నీతిమంతుడిగా ఉన్నందుకు హెబెలును దేవుడు ఎందుకు గొప్పగా చెప్పాడు?

విశ్వాసం ద్వారా హెబెలు కయీను అర్పించిన దానికంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు కనుక దేవుడు హెబెలు విషయం గొప్పగా చెప్పాడు[11:4].

Hebrews 11:5

దేవుని దగ్గరకు వచ్చే వాడు దేవుని విషయం ఏమని విశ్వశించాలి?

దేవుని దగ్గరకు వచ్చే వాడు దేవుడు ఉన్నాడని, ఆయనను హృదయపూర్వకంగా వెదికే వారికి ప్రతిఫలమిస్తాడని నమ్మాలి [11:6].

Hebrews 11:7

నోవహు తన విశ్వాసాన్ని ఏవిధంగా కనుపరచాడు?

దేవుని హెచ్చరిక ప్రకారం తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఓడను నిర్మించడం ద్వారా నోవహు తన విశ్వాసాన్ని కనుపరచాడు[11:7].

Hebrews 11:11

విశ్వాసం ద్వారా అబ్రాహాము, శారాలు పొందిన వాగ్దానం ఏమిటి?

విశ్వాసం ద్వారా అబ్రాహాము, శారాలు వయసు ఉడిగినా గర్భం ధరించడానికి వాగ్దానం పొందారు[11:11].

Hebrews 11:13

విశ్వాసం కలిగిన పితరులందరూ దూరం నుంచి ఏమి చూసారు?

విశ్వాసం కలిగిన పితరులందరూ దూరం నుంచి దేవుని వాగ్దానాలను స్వాగతించారు [11:13].

విశ్వాసం కలిగిన పితరులందరూ తమను తాము భూమి మీద ఎలా ఎంచుకున్నారు?

విశ్వాసం కలిగిన పితరులందరూ భూమి మీద పరదేశులం, యాత్రికులం అని తమను తాము ఎంచుకున్నారు[11:13].

Hebrews 11:15

విశ్వాసం కలిగిన వారి కోసం దేవుడేం సిద్ధం చేసాడు?

విశ్వాసం కలిగిన వారి కోసం దేవుడు ఒక పరలోక నగరాన్ని సిద్ధం చేసాడు[11:16].

Hebrews 11:17

అబ్రాహాము తన ఒక్కడైయున్న కుమారుని బలి ఇచ్చినప్పటికీ, దేవుడు ఏమి చేస్తాడని నమ్మాడు?

మృతులలోనుండి తన కుమారుని లేపుతాడని అబ్రాహాము దేవుని నమ్మాడు[11:17-19].

Hebrews 11:18

దేవుడు మాట్లాడిన పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు దేనికోసం బతిమాలుకొన్నారు?

మరే మాట వారితో చెప్పవద్దని ఇశ్రాయేలీయులు బతిమాలుకున్నారు [12:19].

Hebrews 11:20

తన అంతం సమీపంగా ఉందని యోసేపు విశ్వాసం ద్వారా ఏమని ప్రవచించాడు?

తన అంతం సమీపంగా ఉన్నప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు సంతానం నిర్గమనం గురించి యోసేపు విశ్వాసం ద్వారా ప్రవచించాడు[11:22].

Hebrews 11:23

మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ద్వారా ఏమిచెయ్యాలని ఎంపిక చేసుకున్నాడు?

విశ్వాసం ద్వారా మోషే పాపంతో కూడిన సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికి కోరుకున్నాడు[11:24-26].

Hebrews 11:27

ఇశ్రాయేలు ప్రథమ సంతానాన్ని కాపాడడంకోసం విశ్వాసం ద్వారా మోషే ఏమిచేసాడు?

ఇశ్రాయేలు ప్రథమ సంతానాన్ని కాపాడడంకోసం విశ్వాసం ద్వారా మోషే పస్కాను, రక్త ప్రోక్షణను ఆచరించాడు[11:28].

Hebrews 11:29

నశించిపోకుండా విశ్వాసం ద్వారా రాహాబు ఏమి చేసింది?

తాను నశించిపోకుండా విశ్వాసం ద్వారా రాహాబు వేగులను భద్రంగా దాచిపెట్టింది[11:31].

Hebrews 11:32

కొందరు పితరులు విశ్వాసం ద్వారా యుద్ధంలో ఏమి సాధించారు?

కొందరు పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, కత్తివాత పడకుండా తప్పించుకున్నారు, యుద్ధంలో వీరులయ్యారు, విదేశీసైన్యాలను పరుగులెత్తించారు[11:33-34].

Hebrews 11:35

కొందరు విశ్వాసవీరులు ఏ విధంగా హింసకు గురి అయ్యారు?

విశ్వాసవీరులు కొందరు హింసకు గురి అయ్యారు, వెక్కిరింపులకు, కొరడా దెబ్బలకు, సంకెళ్ళు, ఖైదులూ అనుభవించారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, రంపాలతో రెండుగా కోయడం, మరణం, పేదరికానికి గురి అయ్యారు[11:35-38].

Hebrews 11:39

ఈ పితరులు విశ్వాసం కలిగినావారైనప్పటికి, వారు ఈ లోక జీవితంలో ఏమి అనుభవించలేదు?

ఈ పితరులు విశ్వాసం కలిగినావారైనప్పటికి, దేవుడు వారికి చేసిన వాగ్దానాల నేరవేర్పును అనుభవించలేదు[11:39].

ఈ విశ్వాసవీరులు ఎవరితో కలిసి దేవుని వాగ్దానాలను పొందుతారు, సంపూర్ణసిద్ధి పొందుతారు?

ఈ విశ్వాసవీరులు క్రీస్తులోని నూతన నిబంధన విశ్వాసులతో కలిసి దేవుని వాగ్దానాలను పొందుతారు, సంపూర్ణ సిద్ధి పొందుతారు[11:40].


Chapter 12

Translation Questions

Hebrews 12:1

సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను ఎందుకు విశ్వాసి త్రోసిపుచ్చాలి?

ఇంత గొప్ప సాక్షి సమూహం మనచుట్టూ ఆవరించి ఉన్నందువలన సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విశ్వాసి త్రోసిపుచ్చాలి[12:1].

ఎందుకు యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు?

తనముందున్న ఆనందం కోసం యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు[12:2].

విశ్వాసి విసుకకుండా, అలసి పోకుండా ఎలా ఉండగలడు?

పాపులు తనకు వ్యతిరేకంగా చేసిన ఎదిరింపులు ఓర్చుకున్న యేసును తలపోయడం ద్వారా విశ్వాసి విసుకకుండ, అలసిపోకుండా ఉండగలడు [12:3].

Hebrews 12:4

తాను ప్రేమించి, స్వీకరించే వారికి ప్రభువు ఏమి చేస్తాడు?

తాను ప్రేమించి, స్వీకరించే వారిని ప్రభువు శిక్షిస్తాడు[12:6].

Hebrews 12:7

ప్రభువు శిక్ష లేనివారు ఎలాంటివారు?

ప్రభువు శిక్ష లేనివారు కుమారులు కాదు గాని వారు అక్రమ సంతానం[12:8].

Hebrews 12:9

దేవుడు తన పిల్లలను ఎందుకు శిక్షిస్తాడు?

దేవుడు తన పిల్లలు తన పవిత్రతలో పాల్గొనాలని మేలుకే శిక్షిస్తాడు[12:10].

శిక్ష ఏ ఫలాలను ఇస్తుంది?

శిక్ష నీతి అనే ఫలాలను ఇస్తుంది[12:11].

Hebrews 12:14

విశ్వాసులు అందరితో కలిసి దేని కోసం ప్రయత్నించాలి?

విశ్వాసులు అందరితో కలిసి సమాధానం కోసం ప్రయత్నించాలి [12:14].

ఏది ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి?

చెడు వేరు ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి[12:15].

ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు ఏమిజరిగింది?

ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు అతడు నిరాకరణకు గురి అయ్యాడు[12:17].

Hebrews 12:22

ఇశ్రాయేలీయులు దేవుని స్వరం వినిన పర్వతం దగ్గరకు కాక క్రీస్తునందున్న విశ్వాసులు ఎక్కడికి రావాలి?

క్రీస్తునందున్న విశ్వాసులు సీయోను పర్వతానికి, సజీవుడైన దేవుని నగరానికి రావాలి[12:22].

క్రీస్తులో ఉన్న విశ్వాసులు ఏ సంఘానికి రావాలి?

క్రీస్తులో ఉన్న విశ్వాసులు పరలోకంలో రాసి ఉన్న జ్యేష్టుల సంఘానికి రావాలి[12:23].

క్రీస్తులో ఉన్న విశ్వాసులు ఎవరి దగ్గరకు రావాలి?

క్రీస్తులో ఉన్న విశ్వాసులు అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు , న్యాయవంతుల ఆత్మల దగ్గరకు , యేసు దగ్గరకు రావాలి[12:23-24].

Hebrews 12:25

పరలోకంనుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగిపోయిన వాడికి ఏమి జరుగుతుంది?

పరలోకం నుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగి పోయిన వారు దేవుని నుండి తప్పించుకోలేరు[12:25].

కదిలించడానికి, తొలగించడానికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి?

సృష్టించిన వాటిని కదిలించడానికి, తొలగించడానికి దేవుడు వాగ్దానం చేశాడు[12:26-27].

Hebrews 12:27

కదిలించడానికి అవకాశం ఉన్న వాటికి బదులు విశ్వాసులు ఏమి పొందుతారు?

విశ్వాసులు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతారు[12:28].

విశ్వాసులు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి?

విశ్వాసులు దేవుణ్ణి వినయ భయభక్తులు కలిగి ఆరాధించాలి[12:28].

విశ్వాసులు ఎందుకు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి?

దేవుడు దహించే అగ్ని కనుక విశ్వాసులు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి[12:29].


Chapter 13

Translation Questions

Hebrews 13:1

తెలియని వారికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా కొందరు ఏమి చేసారు?

కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు [13:2].

Hebrews 13:3

విశ్వాసులు ఖైదులో ఉన్నవారిని ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి?

ఖైదులో ఉన్నవారితో కూడా వారునూ ఖైదీలై ఉన్నట్టే, వారు దౌర్జన్యానికి గురి అయిన వారిగా విశ్వాసులు వారిని జ్ఞాపకముంచుకోవాలి[13:3].

దేన్ని అందరూ ఘనపరచాలి?

వివాహం అంటే అందరికి గౌరవముండాలి[13:4].

జారత్వం, వ్యభిచారం చేసేవారిని దేవుడు ఏమిచేస్తాడు?

జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[13:4].

Hebrews 13:5

ధనాశనుండి విశ్వాసి ఏ విధంగా విముక్తుడు కాగలడు?

ధనాశనుండి విశ్వాసి విముక్తుడు ఎలా కాగలడంటే తనను ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని దేవుడు చెప్పాడు[13:14].

Hebrews 13:7

ఎవరి విశ్వాసాన్ని విశ్వాసులు అనుకరించాలి?

దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్నవారిని విశ్వాసులు అనుకరించాలి [13:7].

Hebrews 13:9

ఎలాంటి కొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు?

ఆహారం గురించి నియమాలు ఉన్న క్రొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు[13:9].

బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను ఎక్కడ కాల్చివేస్తారు?

బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు[13:11].

Hebrews 13:12

యేసు ఎక్కడ బాధలను అనుభవించాడు?

యేసు నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు[13:12].

విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు?

విశ్వాసులు యేసు నిందను భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళాలి [13:13].

ఈ భూమి మీద విశ్వాసులకున్న శాశ్విత నగరం ఏది?

ఈ భూమి మీద విశ్వాసులకు శాశ్విత నగరం ఏదీ లేదు [13:14].

దానికి బదులు విశ్వాసులు దేన్ని వెదకుతున్నారు?

రానున్న నగరం కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు [13:14].

Hebrews 13:15

విశ్వాసులు నిరంతరం దేవునికి అర్పించవలసిన అర్పణలేవి?

విశ్వాసులు దేవునికి స్తుతి యాగం ఎప్పుడూ అర్పిస్తూ ఉండాలి[13:15].

నాయకుల యెడల విశ్వాసులకు ఎలాంటి వైఖరి ఉండాలి?

విశ్వాసులు తమ నాయకుల మాట వినాలి, వారికి లోబడాలి[13:17].

Hebrews 13:20

విశ్వాసి జీవితంలో దేవుడు ఏమి చేస్తాడు?

దేవుని దృష్టికి ప్రీతికరమైన దానిని విశ్వాసి జీవితంలో జరిగిస్తాడు[13:21].

Hebrews 13:22

విశ్వాసులను దర్శించడానికి రచయిత ఎవరితో కలిసి వస్తాడు?

విశ్వాసులను దర్శించడానికి రచయిత తిమోతితో కలిసి వస్తాడు[13:23].


Chapter 1

Translation Questions

James 1:1

యాకోబు ఈ లేఖ ఎవరికీ వ్రాశాడు?

యాకోబు ఈ లేఖ చెదరి పోయిన పన్నెండు గోత్రాలకు వ్రాశాడు(1:1).

సమస్యలు అనుభవిస్తూ ఉన్నపుడు, తన లేఖను చదివేవారు ఎలాంటి వైఖరి కలిగివుండాలని యాకోబు చెపుతున్నాడు?

సమస్యలు అనుభవిస్తూ ఉన్నపుడు వాటి అన్నింటిని ఆనందంగా ఎoచుకోవాలని యాకోబు చెపుతున్నాడు(1:2).

మన విశ్వాసo పరీక్షకు గురి అవుతుండగా ఏం కలుగుతుంది?

మన విశ్వాసo పరీక్షకు గురి అవుతుండగా పరిపక్వత, ఓర్పు కలుగుతాయి (1:3-4).

James 1:4

మనం విశ్వాసంతో ఏమి అడగాలి?

మనం విశ్వాసంతో దేవున్ని జ్ఞానం కోసం అడగాలి(1:5-6).

James 1:6

అనుమానంగా అడిగే వాడు తనకు ఏమి దొరుకుతుందని చూడాలి?

అనుమానంగా అడిగే వాడు తనకు దేవుని నుండి ఏదైనా దొరుకుతుందని చూడకూడదు (1:6-8).

James 1:9

ఎందుకు ఆస్థిపరుడైన సోదరుడు వినయం కలిగి ఉండాలి?

ఆస్థిపరుడైన సోదరుడు వినయం కలిగి ఉండాలి ఎందుకంటే ఆతడు గడ్డిపువ్వులాగా గతించిపోతాడు(1:12).

James 1:12

విశ్వాస పరీక్ష గెలిచే వ్యక్తి ఏమి పొందుతాడు?

విశ్వాస పరీక్ష గెలిచే వ్యక్తి జీవ కిరీటం పొందుతాడు(1:12).

James 1:14

ఒక వ్యక్తి దుష్టత్వం వలన శోధనకు గురి అవుటకు కారణం ఏమిటి?

ఒక వ్యక్తి దుష్టత్వం వలన శోధనకు గురి అవుటకు కారణం తన చెడ్డ కోరికలే(1:14).

James 1:17

వెలుగుకు కర్త అయిన తండ్రి నుండి కిందకి ఏం వస్తుంది?

వెలుగుకు కర్త అయిన తండ్రి నుండి కిందకి ప్రతి మంచి ఈవీ పరిపూర్ణమైన ప్రతి వరం వస్తాయి(1:17).

దేవుడు మనకు జీవాన్ని ఏ పధ్ధతి ద్వారా ఇవ్వాలని కోరాడు?

దేవుడు సత్య వాక్కు ద్వారా మనకు జీవం ఇవ్వాలని ఎంచు కొన్నాడు(1:18).

James 1:19

వినడం, మాట్లాడడం ఇంకా భావాలను గురించి యాకోబు మనలను ఏం చేయాలని చెపుతున్నాడు?

వినటానికి ఆతురoగా, మాట్లాడటానికీ కోపడటానికీ నిదానంగా ఉండాలని యాకోబు మనకు చెపుతున్నాడు(1:19).

James 1:22

యాకోబు మనంతట మనమే ఎలా మోస పోతామని చెపుతున్నాడు?

వాక్కు విని దాని ప్రకారం చేయకపోవటం వల్ల మనంతట మనమే మోస పోతామని యాకోబు చెపుతున్నాడు(1:27).

James 1:26

మనం నిజమైన దైవ భక్తి కలిగి యుండుట కోసం ఏమి అదుపులో ఉంచుకోవాలి?

మనం నిజమైన దైవ భక్తి కలిగి యుండుట కోసం నాలుకను అదుపులో ఉంచుకోవాలి(1:26).

దేవుని ఎదుట కళంకం లేని నిర్మలమైన మతం ఏది?

దేవుని ఎదుట కళంకం లేని నిర్మలమైన దైవభక్తి ఏదంటే తండ్రి లేని పిల్లలనూ విధవరాండ్రను పరామర్శించటం, ఈలోక మాలిన్యం నుండి తనను కాపాడుకోవటం(1:27).


Chapter 2

Translation Questions

James 2:1

ఎవరైనా సభ లోకి వచ్చినపుడు ఏం చేయకూడదని యాకోబు సోదరులకు చెపుతున్నాడు?

ప్రత్యేకమైన మనుషులు వచ్చినపుడు వారు కనపడే రూపాన్ని బట్టి అభిమానం చూపకూడదని యాకోబు సోదరులకు చెపుతున్నాడు(2 :1-4).

James 2:5

దేవుడు ఎన్నుకొన్నపేదవారి గురించి యాకోబు ఏం చెపుతున్నాడు?

దేవుడు ఎన్నుకొన్నపేదవారు విశ్వాస విషయంలో భాగ్యవంతులై దేవుని రాజ్యానికి వారసులై ఉండాలని అని యాకోబు చెపుతున్నాడు(2:6-7).

భాగ్యవంతులు ఏం చేస్తారని యాకోబు చెపుతున్నాడు?

భాగ్యవంతులు దేవుని నామo దుషిస్తూ సోదరులను అణగ ద్రోక్కుతారు అని యాకోబు చెపుతున్నాడు(2:6-7).

James 2:8

లేఖనాల అత్యుత్తమైన ఆజ్ఞ ఏమిటి ?

లేఖనాల అత్యుత్తమైన ఆజ్ఞ, "నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుట " (2 :8 ).

James 2:10

ఎవరైన ధర్మశాస్త్ర మంతటిలో ఒక్క దేవుని ఆజ్ఞ విషయంలో తప్పి పోతే అపరాధం ఏమిటి?

ఎవరైన ధర్మశాస్త్ర మంతటిలో ఒక్క దేవుని ఆజ్ఞ విషయంలో తప్పి పోతే ధర్మశాస్త్ర మంతటిలో అపరాధి(2:10).

James 2:12

కరుణ చూపని వానికి ఏం వస్తుంది?

కరుణ చూపని వానికి కరుణ లేకుండా తీర్పు వస్తుంది(2:13).

James 2:14

విశ్వాసం కలిగి ఉన్నానని వాదించేవారు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయకపోతే దాని గురించి యాకోబు ఏం చెపుతున్నాడు?

విశ్వాసం కలిగి ఉన్నానని వాదించేవారు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయకపోతే అలాంటి విశ్వాసం వారిని రక్షించదు అని యాకోబు చెపుతున్నాడు(2:14-16).

క్రియలు లేకుండా విశ్వాసం ఒంటరిగా ఉంటే అది ఏమిటి?

క్రియలు లేకుండా ఒంటిగా ఉండే విశ్వాసం మృతం. [2:17].

James 2:18

మనo ఎలా విశ్వాసము చూపాలని యాకోబు చెపుతున్నాడు?

క్రియలు ద్వారా మనం విశ్వాసం చూపాలని యాకోబు చెపుతున్నాడు(2:18 ).

విశ్వాసం కలిగి ఉన్నానని వాదించేవారు, దయ్యాలు ఇద్దరూ నమ్మి ఏం చేశారు?

విశ్వాసం కలిగి ఉన్నానని వాదించేవారు, దయ్యాలు ఇద్దరూ ఒకే దేవుడున్నాడు అని నమ్ముతున్నారు(2 :19).

James 2:21

ఎలా అబ్రాహాము క్రియల ద్వారా తన విశ్వాసం ప్రదర్శించాడు?

అబ్రాహాము బలిపీఠo మీద ఇస్సాకును సమర్పించినపుడు క్రియల ద్వారా తన విశ్వాసం ప్రదర్శించాడు(2:21-22).

అబ్రహాము విశ్వాస క్రియల వలన ఏ లేఖనం నెరవేరింది?

అబ్రహాము విశ్వాస క్రియల వలన లేఖనం నెరవేరింది అది, "అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ నమ్మకమే అతనికి నీతి అయ్యింది"(2:23).

James 2:25

ఆత్మనుంచి వేరైన శరీరం అంటే ఏంటి?

ఆత్మనుంచి వేరైన శరీరం మృతం(2:26).


Chapter 3

Translation Questions

James 3:1

అనేకులు బోధకులుగా మారకండని ఎందుకు యాకోబు చెపుతున్నాడు?

వారు మరీ కఠినమైన తీర్పు పొందుకుంటారు గనుక అనేకులు బోధకులుగా మారకండని యాకోబు చెపుతున్నాడు(3:1).

ఎవరు తొట్రుపడతారు, ఎన్నిమార్గాల్లో?

మనమందరము అనేక మార్గాల్లో తొట్రుపడతాo(3:2).

ఎలాంటి వ్యక్తి తన శారీరమంతా అదుపులో ఉంచు కొంటాడు?

ఏ వ్యక్తి తన మాటల్లో తొట్రుపడడో ఆ వ్యక్తి తన శారీరమంతా అదుపులో ఉంచుకుoటాడు(3:2).

James 3:3

ఓ చిన్నవస్తువు ఓ పెద్ద వస్తువుని ఎలా అదుపు చేస్తుందో వివరించటానికి యాకోబు ఉపయోగించిన రెండు ఉదాహరణలు ఏంటి?

ఓ చిన్నవస్తువు ఓ పెద్ద వస్తువుని ఎలా అదుపు చేస్తుందో వివరించటానికి యాకోబు గుర్రం నోటికి తగిలించే కళ్ళెo, ఓడను అదుపుచేసే చుక్కాని, ఉదాహరణలుగా ఉపయోగించి వివరించాడు(3:3-4).

James 3:5

పాపిష్టి నాలుక శరీరాన్నoతా ఏం చేస్తుంది ?

పాపిష్టి నాలుక శరీరాన్నoతా మాలిన్యం చేస్తుంది(3:6).

James 3:7

మనుషుల్లో ఎవరిచేతా మచ్చిక కానిది ఏమిటి?

మనుషుల్లో ఎవరిచేతా మచ్చిక కానిది నాలుకే(3:8).

James 3:9

ఒకే నోటి నుంచి వచ్చే రెండు విషయాలు ఏమిటి ?

ఒకే నోటి నుంచి వచ్చే రెండు విషయాలు ఆశీర్వాదమూ శాపము(3:9-10).

James 3:13

ఒక వ్యక్తి తెలివి, జ్ఞానాన్నిఎలా బయటకు కనపరుస్తాడు?

ఒక వ్యక్తి తెలివి, జ్ఞానాన్నివినయంతో చేసిన క్రియల వల్ల బయటకు కనపరుస్తాడు(3:13).

ఇహలోక సంబంధమైన, సహజసిద్ధమైన, దయ్యాలచే కలిగే జ్ఞానం ఎలాoటి తీరు ప్రతిఫలిస్తుంది?

ఇహలోక సంబంధమైన, సహజసిద్ధమైన, దయ్యాలచే కలిగే జ్ఞానం ఒక వ్యక్తిలో తీవ్రమైన అసూయ, స్వార్ధపూరితమైన ఆశను ప్రతిఫలిస్తుంది(3:14-16).

James 3:15

పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఏ రీతిగా ప్రతిబింబిస్తుంది?

పైనుంచి దిగి వచ్చే జ్ఞానం శాంతికరమైనది, మృధువైనది, దయతో కూడిన హృదయంగలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది, నిష్కపటమైనదిగా ప్రతిబింబిస్తుంది(3:17).


Chapter 4

Translation Questions

James 4:1

విశ్వాసుల మధ్య జగడాలకూ పోట్లాటలకూ కారణమేoటని యాకోబు చెపుతున్నాడు?

విశ్వాసుల మధ్య జగడాలకూ పోట్లాటలకూ కారణo చెడు కోరికలే అని యాకోబు చెపుతున్నాడు(4:1).

విశ్వాసులు దేవున్ని అడిగేవి ఎందుకు పొందుకోలేక పోతున్నారు?

విశ్వాసులు దేవున్ని అడిగేవి దురుద్దేశంతో చెడు కోరికలు వాడుకోటానికి చెడ్డ విషయాలు అడుగుతారు గనుక పొందుకోలేక పోతున్నారు(4:3).

James 4:4

ఒక వ్యక్తి ఈ లోకంతో స్నేహంగా ఉండాలని నిశ్చయిoచుకుంటే, దేవునితో ఆ వ్యక్తి సంబంధo దేవునితో ఏమై ఉంది?

ఒక వ్యక్తి ఈ లోకంతో స్నేహంగా ఉండాలని నిశ్చయిoచుకుంటే ఆ వ్యక్తి దేవునికి విరోధౌవుతాడు(4:4).

James 4:6

దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు, ఎవరికి కృపనిస్తాడు?

దేవుడు గర్విష్టులను ఎదిరిస్తాడు, వినయం గలవారికి కృప అనుగ్రహిస్తాడు(4:6).

విశ్వాసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినపుడు అపవాది ఏం చేస్తాడు?

విశ్వాసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినపుడు పారిపోతాడు (4:7).

James 4:8

దేవుని దగ్గరకు వచ్చే వారి కోసం ఆయన ఏమి చేస్తాడు?

దేవుని దగ్గరకు వచ్చే వారి దగ్గరకు ఆయన వస్తాడు(4:8).

James 4:11

విశ్వాసులు ఏం చేయకూడదని యాకోబు చెప్పాడు?

విశ్వాసులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడాకోవద్దని యాకోబు చెప్పాడు(4:11).

James 4:13

భవిష్యత్తులో జరిగే దానికి ఏం చెప్పాలని విశ్వాసులుకు యాకోబు చెపుతున్నాడు?

దేవుడు అనుమతిస్తే, ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం అని చెప్పాలని విశ్వాసులుకు యాకోబు చెపుతున్నాడు (4:13-15).

James 4:15

తమ పథకాల గురించి గొప్పలు చెప్పుకునే వారి గురించి యాకోబు ఏమి చెబుతున్నాడు?

తమ పథకాల గురించి గొప్పలు చెప్పుకునే వారు దుర్మార్గం జరిగిస్తున్నారు అని యాకోబు చెబుతున్నాడు (4: 16).

మంచి చేయడం తెలిసి కూడా చెయ్యని వారి సంగతి ఏమిటి?

మంచి చేయడం తెలిసి కూడా చెయ్యక పోవడం పాపం (4: 17).


Chapter 5

Translation Questions

James 5:1

యాకోబు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అ ధనికులు చివరి రోజుల్లో వారికీ వ్యతిరేకంగా తీర్పు రప్పించే ఎ పనులు చేస్తున్నారు?

ధనికులు తమ సంపదలు నిలవ చేసుకున్నారు (5: 3).

James 5:4

ధనవంతులు తమ పని వారితో ఎలా వ్యవరించారు?

ధనవంతులు తమ పని వారికి కూలి చెల్లించలేదు (5: 4).

ధనికులు నీతిపరులతో ఎలా వ్యవరించారు?

ధనికులు నీతిపరులను దోషులుగా తీర్చి చంపారు (5: 6).

James 5:7

రాబోతున్న ప్రభువు యెడల విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలని యాకోబు చెపుతున్నాడు?

రాబోతున్న ప్రభువు కోసం విశ్వాసులు ఓర్పుగా కనిపెట్టుకొని ఉండాలని యాకోబు చెపుతున్నాడు(5:7-8).

James 5:9

పాత ఒడంబడిక ప్రవక్తలు మనకు ఏం నిదర్శనంగా చూపెట్టారని యాకోబు చెపుతున్నాడు?

పాత ఒడంబడిక ప్రవక్తలు మనకు ఓర్పు, బాధల్లో సహనాన్ని నిదర్శనంగా చూపెట్టారని యాకోబు చెపుతున్నాడు(5:10-11).

James 5:12

ఒక విశ్వాసి "అవును," "కాదు," ఎంత అధారపడ దగినవిగా ఉండాలి?

ఒక విశ్వాసి "అవును" అంటే అవును, "కాదు" అంటే కాదు అయి ఉండాలి (5:12).

James 5:13

ఎవరికైనా జబ్బు చేస్తే ఏం చెయ్యాలి?

ఎవరికైనా జబ్బు చేస్తే అతడు సంఘ పెద్దల్నిపిలిపించుకోవాలి అప్పుడు వాళ్ళు ప్రభు పేర నూనె రాసి ప్రార్ధన చెయ్యాలి (5:16).

James 5:16

ఆరోగ్యం చేకూరే క్రమంలో ఒకరితో ఒకరు ఏ రెండు విషయాలు చేయాలని విశ్వాసులకు యాకోబు చెపుతున్నాడు?

ఆరోగ్యం చేకూరే క్రమంలో ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవాలి, ఒకరి కోసం ప్రార్ధన చెయ్యాలి అని చెపుతున్నాడు(5:16).

ఏలీయా ఉదాహరణ మనకు ప్రార్థన గురించి ఏమి చెబుతోంది?

నీతిపరుని ప్రార్థన శక్తిగలదని ఏలీయా ఉదాహరణ మనకు ప్రార్థన గురించి చెబుతోంది [5:16-18].

James 5:19

ఒక పాపి వెళుతున్న తప్పు దారినుంచి మళ్ళించే వాడు ఏమి సాధిస్తున్నాడు?

ఒక పాపి వెళుతున్న తప్పు దారినుంచి మళ్ళించే వాడు అతని ఆత్మను మరణం నుంచి తప్పించి, అసంఖ్యాక మైన పాపాలను కప్పి వేస్తున్నాడు (5:20).


Chapter 1

Translation Questions

1 Peter 1:1

పేతురు ఎవరికి అపోస్తలుడు?

పేతురు యేసుక్రీస్తుకు అపోస్తలుడు (1:1).

పేతురు ఎవరికి రాశాడు?

పొంతు, గలతియ, కప్పదొకియ, ఆసియా, బితునియాలలో చెదిరి ఉన్న ఎంపిక అయిన వారికీ పేతురు రాసాడు (1:1).

పరదేశులు ఎంపిక అయిన వారుగా ఎలా అయ్యారు?

తండ్రి అయిన దేవుని పూర్వ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్ముని పవిత్రీకరణను బట్టి పరదేశులు ఎంపిక అయిన వారుగా అయ్యారు (1:1, 2).

1 Peter 1:3

ఎంపిక అయిన వారికి ఏమి ఉండాలని పేతురు రాశాడు?

ఎంపిక అయిన వారికి కృప, అభివృద్ధి చెందే శాంతి ఉండాలని పేతురు రాశాడు (1:3).

ఎవరు స్తుతులు పొందాలని పేతురు కోరుకున్నాడు?

తమ ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతులు పొందాలని పేతురు కోరుకున్నాడు (1:3).

దేవుడు వారికి నూతన జీవం ఎలా ఇచ్చాడు?

దేవుడు వారికి తన గొప్ప కృప చొప్పున నూతన జీవం ఇచ్చాడు (1: 3).

వారి వారసత్వం ఎందుకు నశించిపోదు, మచ్చ పడదు, వాడి పోదు?

ఎందుకంటే ఆ వారసత్వం పరలోకం నుండి వెల్లడి అయింది (1: 4).

దేవుని శక్తిలో ఎ విధంగా వారు భద్రంగా ఉన్నారు?

చివరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణపై విశ్వాసముంచడం ద్వారా వారు భద్రంగా ఉన్నారు (1: 5).

1 Peter 1:6

వివిధ కష్టాల్లో వారు దుఃఖించడం ఎందువల్ల అవసరం?

వారి విశ్వాసం పరీక్షకు గురి కావాలని, వారి విశ్వాసం మూలంగా స్తుతి, మహిమ, యేసు క్రీస్తు ప్రత్యక్షం కలగాలి గనుక వివిధ కష్టాల్లో వారు దుఃఖించడం అవసరం (1:7).

నశించిపోయే బంగారం కన్నా ఏది మరింత విలువైనది?

నశించిపోయే బంగారం కన్నా విశ్వాసం మరింత విలువైనది (1: 7).

1 Peter 1:8

ఎంపిక అయిన పరదేశులు యేసును చూడనప్పటికీ వారు ఏమి చేసారు?

వారు ఆయన్ను ప్రేమించారు. నమ్మకం ఉంచారు. చెప్ప శక్యంగాని మహిమకరమైన అనందం వారిలో నిండింది (1: 8).

ఆయనలో నమ్మకముంచిన వారు తమ విశ్వాసానికి ఫలితంగా ఏమి పొందారు?

తమ ఆత్మ రక్షణ పొందారు (1: 9).

ప్రవక్తలు జాగ్రత్తగా దేన్నివెదికి పరిశోధించారు?

ప్రవక్తలు ఎంపిక అయిన పరదేశులు పొందుతున్న రక్షణ, వారి స్వంతం కాబోతున్న కృప గురించి జాగ్రత్తగా వెదికి పరిశోధించారు (1: 10).

1 Peter 1:11

దేన్ని గురించి క్రీస్తు ఆత్మ ప్రవక్తలకు ముందుగానే చెబుతున్నాడు?

క్రీస్తు బాధల గురించి, వాటి తరువాత రాబోయే మహిమను గురించి అయన వారికీ ముందుగానే చెబుతున్నాడు (1:11).

ప్రవక్తలు తమ పరిశోధనల ద్వారా ఎవరికి లాభం చేకూరుస్తున్నారు?

వారు ఎంపిక అయిన పరదేశులకు లాభం చేకూరుస్తున్నారు (1: 12).

ప్రవక్తల పరిశోధనల ఫలితాలు వెల్లడి కావాలని ఎవరు ఆశిస్తున్నారు?

దేవదూతలు సైతం ప్రవక్తల పరిశోధనల ఫలితాలు వెల్లడి కావాలని ఆశిస్తున్నారు (1: 12).

1 Peter 1:13

ఎంపిక అయిన పరదేశులకు విధేయులైన పిల్లల్లాగా ఏమి చేయాలని పేతురు అజ్ఞాపిస్తున్నాడు?

వారు తమ మనస్సు అనే నడికట్టు బిగించుకుని తమ ఆలోచనల్లో మెలకువగా ఉండి వారికీ అందిన కృప విషయంలో పూర్తి నిబ్బరం కలిగి, గతంలో తమకున్న ఆశలకు కట్టుబడకుండా ఉండాలని పేతురు అజ్ఞాపిస్తున్నాడు (1: 13,14).

1 Peter 1:15

ఎంపిక అయిన పరదేశులు పవిత్రంగా ఉండాలని పేతురు ఎందుకు అజ్ఞాపిస్తున్నాడు?

ఎందుకంటే వారిని పిలిచినవాడు పవిత్రుడు (1: 15,16).

ఎంపిక అయిన పరదేశులు తమ ప్రయాణాన్ని భయభక్తులతో ఎందుకు గడపాలి?

ఎందుకంటే ప్రతివాడి పని చొప్పున పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే వాణ్ణి వారు తండ్రి అని పిలుస్తున్నారు (1: 17).

1 Peter 1:18

ఎంపిక అయిన పరదేశులు దేని మూలంగా విమోచన పొందారు?

వారు వెండితో బంగారంతో కాక, మచ్చ, కళంకం లేని గొర్రె పిల్లగా ప్రశస్తమైన క్రీస్తు రక్తం మూలంగా విమోచన పొందారు (1: 18,19).

ఎంపిక అయిన పరదేశులు ఎవరి మూలంగా బుద్ధిహీనమైన ప్రవర్తన నేర్చుకున్నారు?

వారు తమ పూర్వీకుల మూలంగా బుద్ధిహీనమైన ప్రవర్తన నేర్చుకున్నారు (1: 19).

1 Peter 1:20

క్రీస్తును ఎన్నుకున్నది, వెల్లడి చేసింది ఎప్పుడు?

భూమి పునాదులకు ముందే ఆయన ఎంపిక అయ్యాడు. ఎంపిక అయిన పరదేశులకు అయన అంత్య కాలంలో వెల్లడి అయ్యాడు (1: 20).

ఎంపిక అయిన పరదేశులు దేవుణ్ణి ఎలా విశ్వసించారు? దేవునిలో నమ్మకం, నిబ్బరం ఎలా పెంపొందించుకున్నారు?

చనిపోయిన వారిలో నుండి లేపి మహిమ పొందిన క్రీస్తు ద్వారా విశ్వసించారు (1: 20, 21).

1 Peter 1:22

ఎంపిక అయిన పరదేశులు తమ ఆత్మలను ఎలా పవిత్రం చేసుకుంటారు?

సోదర ప్రేమ విషయం సత్యానికి విధేయత చూపడం ద్వారా వారు తమ ఆత్మలను పవిత్రం చేసుకుంటారు (1: 22).

ఎంపిక అయిన పరదేశులు దేవుని ఎలా తిరిగి జన్మించారు?

నశించి పోయే విత్తనం మూలంగా కాకా నాశనం కాని విత్తనం మూలంగా సజీవమైన, నిలిచి ఉండే దేవుని వాక్కు వాళ్ళ వారు తిరిగి జన్మించారు (1: 23).

1 Peter 1:24

శరీరులందరూ దేనిని పోలి ఉన్నారు, వారి వైభవం దేనిని పోలి ఉంది?

శరీరం గడ్డిలాంటిది. దాని వైభవo గడ్డి పువ్వు లాంటిది(1:24).

ప్రభు వాక్కుకు ఏం అవుతుంది?

ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది(1:25).


Chapter 2

Translation Questions

1 Peter 2:1

ఎంపిక అయిన పరదేశులు దేనిని వదిలి పెట్టాలి?

సమస్తమైన మోసాన్ని, కపటాన్ని, అసూయను, దూషణను వారు విడిచి పెట్టాలి (2: 1).

ఎంపిక అయిన పరదేశులు నిర్మలమైన ఆత్మసంబంధమైన పాలను ఎందుకు కోరుకోవాలి?

ఎంపిక అయిన పరదేశులు తమ రక్షణలో ఎదిగేలా నిర్మలమైన ఆత్మసంబంధమైన పాలను కోరుకోవాలి (2:2).

1 Peter 2:4

మనుషులు తిరస్కరించిన, దేవుడు ఎన్నుకున్న, సజీవమైన రాయి ఎవరు?

ఆ రాయి యేసు క్రీస్తు (2: 4-5).

ఎంపిక అయిన పరదేశులు కూడా ఎందువలన సజీవమైన రాళ్ళు?

వారు ఆత్మ సంబంధమైన మందిరంగా నిర్మాణ మౌతున్న సజీవమైన రాళ్ళు. సిగ్గు పడనక్కరలేని పవిత్ర యజకులుగా వారు ఉండాలి (

1 Peter 2:7

వాక్కుకు అవిధేయులవుతూ కట్టే వారు ఎందుకు తొట్రుపడ్డారు?

తొట్రుపడటానికే నియమిoచ బడ్డారు గనక తొట్రుపడ్డారు(2:7-8).

1 Peter 2:11

ఎందుకు ప్రియమైన వారు పాప సంబంధమైన కోరికలు వదులుకోవాలని పేతురు పిలిచాడు?

జ.ఎవరయితే చెడు చేస్తూ మాట్లాడుతూ ఉంటారో వారు ప్రియమైన వారి మంచి ప్రవర్తన చూసి దేవున్ని మహిమపరచాలని పాప సంబంధమైన కోరికలు వదులుకోవాలని పేతురు పిలిచాడు(2:11-12).

1 Peter 2:13

ఎంపిక అయిన పరదేశులు ప్రతి మానవ అధికారానికి ఎందుకు లోబడాలి?

బుద్ధిలేని వారి అజ్ఞాన పూరితమైన మాటల విషయం వారి నోరు మూయించడం కోసం ఎంపిక అయిన పరదేశులు తమ విధేయతను ఉపయోగించడం కోసం దేవుడు వారు ప్రతి మానవ అధికారానికి లోబడాలి అని దేవుడు కోరుతున్నాడు (2:13-15).

ఎంపిక అయిన పరదేశులు తమ స్వేచ్ఛను తమ దుర్మర్గాతను కప్పుకోవడానికి కాక దేని కోసం చెయ్యాలి?

వారు తమ స్వేచ్ఛను దేవుని సేవకులుగా ఉండడానికి ఉపయోగించాలి.

1 Peter 2:18

యజమానులు అపకార బుద్ధి గల వారైనా దాసులు ఎందుకు లోబడాలి?

యజమానులు అపకార బుద్ధి గల వారైన దాసులు లోబడాలి ఎందుకంటే మoచి చేస్తూ భాదలకు గురవుతూ ఉండటం దేవునిచే కొనియాడ తగింది (2:18-20).

1 Peter 2:21

సేవకులు మంచి చేయడం కోసం బాధలు పడాలని ఎందుకు పిలుపు అందుకున్నారు ?

ఎందుకంటె క్రీస్తు వారికోసం శ్రమపడి న్యాయంగా తీర్పు తీర్చు వానికి తనను అప్పగించు కొని వారికి ఒక మంచి ఆదర్శం ఉంచి వెళ్ళాడు(2:21-23).

1 Peter 2:24

క్రీస్తు పేతురు పాపాలను, పరదేశుల పాపాలను, ఎంపిక అయినవారి పాపాలను, సేవకుల పాపాలను మానుపై తన శరీరంలో ఎందుకు భరించాడు?

వారిక మీదట పాపంలో ఎలాటి భాగం లేకుండా నీతి కోసం జీవించాలని, వారు తన గాయాల వల్ల స్వస్థత పొందాలని అయన వారి పాపాలు భరించాడు (2:24).

వారంతా దారి తప్పిన గొర్రెల్లాగా తిరుగులాడిన తరువాత ఎవరి దగ్గరికి తిరిగి వచ్చారు?

వారంతా తమ ఆత్మల రక్షకుని దగ్గరకు, కాపరి దగ్గరకు వచ్చారు (2:25).


Chapter 3

Translation Questions

1 Peter 3:1

భార్యలు తమ భర్తలకు ఎందుకు లోబడాలి ?

జ భార్యలు అవిధేయుల అయిన భర్తలకు లోబడుట వలన వాక్కు లేకుండానే వారిని గెలుచుకోవచ్చు(3:1).

1 Peter 3:3

భార్యలు ఎలా తమ భర్తలను గెలుచుకోవాలి?

భార్యలు తమ వెలుపటి అలంకారం కాక హృదయం లోని వ్యక్తిత్వoతో వారిని గెలుచుకోవాలి(3:3-4).

1 Peter 3:5

దేవునిలో నమ్మకముంచి భర్తకు లోబడిన భార్యగా ఏ పవిత్రమయన స్త్రీని మాదిరిగా పేతురు చెప్పాడు?

దేవునిలో నమ్మకముంచి భర్తకు లోబడిన భార్యగా శారాను మాదిరిగా పేతురు చెప్పాడు(3:5-6).

1 Peter 3:7

భర్తలు తమ భార్యలతో ఎందుకు జ్ఞానానుసారంగా యోగ్యoగా జీవించాలి?

జ భర్తలు తమ భార్యలతో తమ ప్రార్ధనలకు ఆటంకం కాకుండా జ్ఞానానుసారంగా యోగ్యoగా జీవించాలి(3:7).

1 Peter 3:8

ఎన్నికైన పరదేశులoదరూ దీవిస్తూ ఏక భావంతో ఉoడాలని పేతురు ఎందుకు సూచించాడు?

ఎందుకంటే వారు అలా చేసి దీవెనలకు వారసులయ్యేoదుకు పిలుపు అందుకున్నారు (3:8-9).

1 Peter 3:10

జీవాన్ని ప్రేమించగోరేవారు ఎందుకు తన నాలుకను దుష్టత్వం నుండి కాపాడుకుని చెడుగు నుండి తొలిగి పోవాలి?

జ.ఎందుకంటే పభువు కళ్ళు నీతిమంతుల పై ఉన్నాయి (3: 10, 12).

చెడుగు చేసే వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు దేనికి భయపడతారో దానికి భయపడక పరదేశులు, ఎంపిక అయిన వారు ఏమి చెయ్యాలి ?

వారు తమ హృదయాల్లో క్రీస్తు ప్రభువును ప్రశస్తమైన వానిగా ప్రతిష్టించుకోవాలి (3:12,15)

1 Peter 3:13

ధన్యులు ఎవరు?

నీతి కారణంగా బాధలు పడేవారే ధన్యులు(3:14).

1 Peter 3:15

ఎన్నికైన పరదేశులు దేవునిలోని వారి నమ్మకo గురించి అడిగే వారందరికి ఎలా సమాధానం చెప్పాలి?

ఎన్నికైన పరదేశులు దేవునిలోని వారి నమ్మకo గురించి అడిగే వారందరికీ గౌరవంగా సాత్వికంతో సమాధానం చెప్పాలి(3:15-16).

1 Peter 3:18

క్రీస్తు పాపాల కోసం ఒక్కసారే ఎందుకు హింసలు పొందాడు?

పేతురును, ఎన్నికైనవారిని, పరదేశులను దేవుని చెంతకు తేవడానికి క్రీస్తు పాపాల కోసం ఒక్కసారే హింసలు పొందాడు (3:18).

క్రీస్తు ఆత్మ రూపిగా బోధించిన ఆత్మలు ఇప్పుడు చెరలో ఎందుకు ఉన్నారు?

ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు నోవహు కాలంలో దేవుడు సహనంతో ఎదురు చూసినప్పుడు అవిధేయంగా ఉన్న వారు (3: 19,20).

దేవుడు కొద్ది మందిని నీటి ద్వారా రక్షించడం దేన్ని సూచిస్తున్నది?

ఎన్నికైనవారిని, పరదేశులను రక్షించిన బాప్తిసాన్ని అది సూచిస్తున్నది. యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా మంచి మనస్సాక్షి వలె అది ఉంది (3: 20, 21)

1 Peter 3:21

దేవుడు కొద్ది మందిని నీటి ద్వారా రక్షించడం దేన్ని సూచిస్తున్నది?

ఎన్నికైనవారిని, పరదేశులను రక్షించిన బాప్తిసాన్ని అది సూచిస్తున్నది. యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా మంచి మనస్సాక్షి వలె అది ఉంది (3: 20, 21).

యేసు పరలోకంలో తండ్రి కుడి వైపున ఉండగా దేవదూతలు, అధికారులు, శక్తులు ఏమి చెయ్యాలి?

వారంతా ఆయనకు లోబడాలి (3:22).


Chapter 4

Translation Questions

1 Peter 4:1

ఎన్నికైన పరదేశులు ఏ ఆయుధo ధరించాలని పేతురు ఆజ్ఞాపించాడు?

క్రీస్తు శరీరంలో బాధలు అనుభవించినపుడు కలిగిన మనసును ఆయుధంగా ధరిoచమని పేతురు వారికి ఆజ్ఞాపించాడు(4:1).

1 Peter 4:3

యూదేతరులు ఎన్నికైన పరదేశుల గురించి చెడుగా ఎందుకు మాట్లాడారు?

యూదేతరులు ఎన్నికైన పరదేశుల గురించి చెడుగా ఎందుకు మాట్లాడారంటే, వారు యూదేతరుల్లాగా కామవికారాలలో, అభిలాషల్లో, తాగుడులో, విందువినోదాల్లో, అసహ్యమైన విగ్రహ పూజల్లో పాల్గొనరు (4:3,4).

దేవుడు ఎవరిని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు?

సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు (4:5).

1 Peter 4:7

ఎన్నికైన పరదేశులు ఒకరి పట్ల ఒకరు స్వస్థ బుద్ది, ప్రగాఢ ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి?

ఎందుకంటే అన్నిటికీ అంతం వస్తుంది ఇoకా వారి ప్రార్ధనలు కోసం అలా చేస్తూ ఉండాలి(4:7).

1 Peter 4:10

ఎన్నికైన పరదేశులు తమకు ఇచ్చిన వరాలు ఇతరుల సేవకు ఎందుకు ఉపయోగించాలి?

యేసుక్రీస్తు ద్వారా దేవుడు మహిమ పొందుటకై తమకు ఇచ్చిన వరాలు ఇతరుల సేవకు ఉపయోగించాలి(4:10-11).

1 Peter 4:12

ఎందుకు ఎన్నికైన పరదేశులు క్రీస్తు నామం కోసం అవమానమూ బాధలు అనుభవించినట్లయితే సంతోషించాలి అని చెప్పాడు(4:12-14).

ఎందుకంటే క్రీస్తు నామం కోసం అవమానమూ బాధలు అనుభవించినట్లయితే వారు ధన్యులవుతారు(4:12-14).

1 Peter 4:15

ఎందుకు ఎన్నికైన పరదేశులు హంతకుడుగా గానీ దుర్మార్గుడుగా గానీ దొంగగా గానీ పరుల జోలికి పోయేవాడుగా బాధలు అనుభవించకూడదు?

ఎందుకంటే దేవుని ఇంటివారితో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది (4 :15-17).

1 Peter 4:17

భక్తిహీనులు, పాపులు దేవుని సువార్తకు ఎందుకు లోబడాలి?

ఎందుకంటే నీతిపరులు సైతం బాధల గుండా రక్షణ పొందుతారు (4:17, 18).

దైవ చిత్తానుసారంగా బాధలు పడే వారు ఎలా ప్రవర్తించాలి?

తాము మేలు చేస్తూ నమ్మకమైన సృష్టి కర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి (4:19).


Chapter 5

Translation Questions

1 Peter 5:1

పేతురు ఎవరు?

పేతురు సాటి పెద్ద, క్రీస్తు బాధలకు ప్రత్యక్ష సాక్షి, వెల్లడి కాబోతున్న మహిమ లో పాలిభాగస్థుడు (5:1).

తన సాటి పెద్దలను పేతురు ఏమని హెచ్చరిస్తున్నాడు?

దేవుని మందను కాస్తూ వారి విషయం శ్రద్ధ తీసుకోమంటున్నాడు (5:12).

1 Peter 5:5

యువకులు ఎవరికి లోబడాలి?

యువకులు వృద్ధులకు లోబడాలి (5:5).

ఎన్నికైన పరదేశులు అందరూ తమను తాము వినయం అనే నడుము కట్టుకుని ఒకరినొకరు ఎందుకు సేవించాలి?

ఎందుకంటే సరైన సమయంలో వారిని హెచ్చించేలా దేవుడు వినయం గలవారికి కృప ఇస్తాడు (5:5-7).

1 Peter 5:8

సాతాను ఎలాటి వాడు?

ఎవరిని మింగాలా అని గర్జించే సింహం లాగా తిరుగులాడుతున్నాడు.

ఎన్నికైన పరదేశులకు ఇచ్చిన సూచనలు ఏమిటి?

జ.వారు తమ అందోళనలను దేవునిపై వేసి, మెలకువగా, కనిపెట్టి చూస్తూ, సాతానును ధైర్యంగా ఎదిరించి నిలుస్తూ, తమ విశ్వాసంలో బలంగా ఉండాలి (5:7-9).

1 Peter 5:10

ఎన్నికైన పరదేశులు వారి సోదరులులాగా కొంచెం కాలం బాధలు ఓర్చుకున్న తరువాత ఏం అవుతుంది?

ఎన్నికైన పరదేశులు వారి సోదరులులాగా కొంచెం కాలం బాధలు ఓర్చుకున్న తరువాత దేవుడు వారిని పరిపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు(5:9-10).

1 Peter 5:12

పేతురు సిల్వానును ఎవరిగా భావించాడు?

పేతురు సిల్వానును నమ్మకమైన సోదరునిగా భావించాడు (5:12).

తను రాసిన దాన్ని గురించి పేతురు ఏమి చెప్పాడు?

తను రాసినది నిజమైన దేవుని కృప అని అతడు భావించాడు (5:12).

ఎన్నికైన పరదేశులకు ఎవరు వందనాలు చెప్పారు? వారు ఒకరికొకరు ఎలా వందనాలు చెప్పుకోవాలి?

బబులోనులో ఉన్న అమ్మగారు, పేతురు కుమారుడైన మార్కు, వారికి వందనాలు చెబుతున్నారు. వారి పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి (5:13,14).


Chapter 1

Translation Questions

2 Peter 1:1

పేతురు రెండవ లేఖ ఎవరు వ్రాశారు?

యేసుక్రీస్తు దాసుడూ అపోస్తులుడూ అయిన సీమోను పేతురు వ్రాశాడు(1:1).

పేతురు ఎవరికి వ్రాశాడు?

పేతురు తమలాగే అమూల్య విశ్వాసం పొందిన వారికి వ్రాశాడు(1:1).

2 Peter 1:3

జీవానికి సంబంధించిన దైవ ప్రభావాన్ని, భక్తిని పేతురుకు విశ్వాసం పొందిన వారికీ దేవుడు ఎలా ఇచ్చాడు?

దేవుడు వీటిని దేవుని జ్ఞానం చొప్పున అయన ఇచ్చాడు (1: 3).

జీవానికి సంబంధించిన దైవ ప్రభావాన్ని, భక్తిని గొప్ప వాగ్దానాలతో సహా పేతురుకు విశ్వాసం పొందిన వారికీ దేవుడు ఎందుకు ఇచ్చాడు?

వారు దైవ స్వభావంలో భాగం పంచుకోవాలని అలా ఇచ్చాడు (1: 3-4).

2 Peter 1:5

విశ్వాసాన్ని అందుకున్న వారు చివరకు తమ విశ్వాసం మూలంగా పొందవలసినదేమిటి?

వారు చివరకు తమ విశ్వాసం మూలంగా ప్రేమను పొందాలి (1: 5-7)

విశ్వాసం, సుబుద్ధి, జ్ఞానం, సంయమనం, సహనం, భక్తి, సోదర వాత్సల్యం, ప్రేమ లేని వాడు ఏమి చూస్తాడు?

దగ్గరగా ఉన్నదే చూస్తాడు, అతడు అంధుడు (1:5-9).

2 Peter 1:10

శ్రేష్టమైన పిలుపునూ ఎన్నికనూ సోదరులు నిశ్చయం చేసుకుంటే ఏం అవుతుంది?

శ్రేష్టమైన పిలుపునూ ఎన్నికనూ సోదరులు నిశ్చయం చేసుకోoటే వారు తొట్రుపడరు. ఇంకా వారి ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు శాశ్వత రాజ్యంలో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది(1:10-11).

2 Peter 1:12

ఈ విషయాలు సోదరులకు జ్ఞాపకం చేసుకోవటo యుక్తమని ఎందుకు తలంచాడు?

ఎందుకంటే పేతురు తన గుడారం త్వరలోనే విడిచి పెట్టాల్సి వస్తుందని వారి ప్రభువైన యేసుక్రీస్తు అతనికి చూపెట్టాడు(1:12-14).

2 Peter 1:16

యేసు మహిమకు ప్రత్యక్ష సాక్షులయన వారు ఏమి చూసారు?

తండ్రి అయిన దేవుని నుండి యేసు ఘనతా మహిమా పొందటం చూశారు(1:16-17).

2 Peter 1:19

ప్రవచనం నమ్మదగినదని మనకు ఎలా రూఢీ అవుతుంది?

ప్రవచనం మనిషి ఇష్టాన్ని బట్టి ప్రవక్తల ఊహాలో నుండి రాలేదు గాని మనుషులు పవిత్రాత్మవశులై దేవుని మూలంగా వ్రాశారు (1:19-21).


Chapter 2

Translation Questions

2 Peter 2:1

అబద్ద బోధకులు విశ్వాసులకు రహస్యంగా ఏం తీసుకొస్తారు?

అబద్ద బోధకులు విశ్వాసులకు వినాశానకరమైన తప్పుడు సిద్ధాంతాలను రహస్యంగా తమను తీసుకొస్తారు కొన్న ప్రభువును కూడా కాదంటారు(2:1).

అబద్ద బోధకుల పైకి ఏం వస్తుంది?

అబద్ద బోధకుల పైకి నాశనమూ శీఘ్ర విధ్వంసమూ వస్తుంది(2:1-3).

అబద్ద బోధకులు కల్ల బొల్లి మాటల చెపుతూ ఏం చేస్తారు?

అబద్ద బోధకులు అత్యాశపరులై సోదరులు వలన లాభం సంపాదిస్తారు(2:1-3).

2 Peter 2:4

దేవుడు ఎవరిని విడిచి పెట్ట లేదు?

దేవుడు పాపం చేసిన దేవదూతలనూ పురాతన లోకంనూ అంతేకాదు సొదొమ, గొమొర్రా అనే పట్టణాలనూ విడిచి పెట్డ లేదు(2:5-7).

దేవుడు ఎవరిని కాపాడాడు?

దేవుడు నోవహుతో ఏడుగురిని ఇoకా లోతును కాపాడాడు(2:9).

2 Peter 2:7

కొందరిని విడిచి పెట్టకుండా, కొందరిని తప్పించడం ద్వారా దేవుడు ఏమి చూపిస్తున్నాడు?

భక్తిపరులను రక్షించడం నీతిపరులను భద్రంగా ఉంచడం ఎలాగో ఆయనకు తెలుసునని దేవుని చర్యలు చూపిస్తున్నాయి (2: 9).

2 Peter 2:10

భక్తిహీనులు దూషించడానికి వెనుకాడని మహిమ రూపులు ఎవరు?

ఆ మహిమ రూపులు దేవదూతలు. వారు మనుషుల గురించి కించపరిచే తీర్పులు ప్రభువు దగ్గరికి తీసుకు రారు (2: 10, 11).

2 Peter 2:12

అబద్ద భోధకులు మరులు కొలిపి ఏం చేస్తారు?

అబద్ద భోధకులు మరులు కొలిపి నిలకడ లేని ఆత్మలను చేస్తారు (2 :14).

2 Peter 2:15

బిలాం ప్రవక్త్హ అత్యాశను ఆపింది ఎవరు?

బిలాం ప్రవక్త్హ అత్యాశను మాటాడని గాడిద మనిషి గొంతుతో మాట్లాడి ఆపింది(2:15-16).

2 Peter 2:17

మనిషి ఎవరికి బానిస?

మనిషిని ఏదయితే గెలుస్తుందో దానికి బానిస(2:19).

2 Peter 2:20

యేసుక్రీస్తు జ్ఞానంవల్ల లోక కల్మషాలు తప్పిo చుకొనిన వారు వెనుకకు తిరుగుట కంటే ఏది మేలు?

యేసుక్రీస్తు జ్ఞానంవల్ల లోక కల్మషాలు తప్పిo చుకొనిన వారు వెనుకకు తిరుగుట కంటే నీతి మార్గం ఏమిటో వారికి తెలియ కుంటేనే మేలు(2:20-21).


Chapter 3

Translation Questions

2 Peter 3:1

ఈ రెండవ లేఖ పేతురు ఎందుకు వ్రాశాడు?

గతంలో ప్రవక్తలు పలికిన మాటలనూ రక్షకుడైన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞనూ ప్రియమైన వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవటానికి అతడు వ్రాశాడు(3 :1 -2 ).

2 Peter 3:3

చివరి రోజుల్లో వెక్కిరించే వాళ్ళు ఏం చెపుతారు?

చివరి రోజుల్లో వెక్కిరించే వాళ్ళు యేసు రాకడ గురించిన వాగ్ద్ధానం ఏమయింది అని ప్రశ్నిస్తూ సృష్టి ఆరంభం నుoచి ఉన్నట్లే అంతా ఉంది అని చెపుతారు(3:3-4).

2 Peter 3:5

ఆకాశాలూ భూమీ ఎలా ఏర్పడ్డాయి? అవి మంటలూ భక్తిహీనుల నాశనమూ తీర్పు జరిగే రోజు కోసం ఎలా ఉంచడం జరిగింది?

దేవుని వాక్కు వల్ల ఆకాశాలూ భూమీ ఏర్పడి మంటలూ భక్తిహీనుల నాశనమూ తీర్పు జరిగే రోజు కోసం ఉంచడం జరిగింది(3:5-7).

2 Peter 3:8

ఎందుకు తన ప్రియుల పట్ల ప్రభువు ఓర్పు చూపుతూ ఉన్నాడు?

ఎందుకంటే వారు నశించ కూడదని , అందరూ పశ్చాత్తాపపడలనీ ఆయన కోరిక(3 :9 ).

2 Peter 3:10

ప్రభువు రాకడ దినం ఎలా వస్తుంది?

ప్రభువు రాకడ దినం దొంగ వచ్చినట్టు వస్తుంది(3:10).

2 Peter 3:11

దైవ భక్తీ పవిత్ర జీవితవిషయంలో ఎలాంటి మనుషులై జీవిస్తూ ఉండాలని ప్రియమైన వారిని పేతురు ఎందుకు అడిగాడు?

ఎందుకంటే భూమి ఆకాశాలు నాశనమై పోతాయి, నీతిమంతులు కొత్త ఆకాశాలు కొత్త భూమిలో జీవించుటకు ఎదురు చూస్తూ ఉండాలి(3:11-13).

2 Peter 3:14

ఇతర లేఖనాలనూ పౌలుకు ఇయ్యబడ్డ జ్ఞానాన్నీ శిక్షణా నిలకడా లేని వారు అపార్థం చేసుకుంటే ఏం అవుతుంది?

ఇతర లేఖనాలనూ పౌలుకు ఇయ్యబడ్డ జ్ఞానాన్నీ శిక్షణా నిలకడా లేని వారు అపార్థం చేసుకుంటే స్వనాశనమే వారి పనుల ఫలితం(3:15-16).

2 Peter 3:17

తమ స్వంత విశ్వాసం పోగొట్టు కొని మోసం వలన తప్పిపోవుట కంటే ప్రియమైన వారు ఏం చేయాలని పేతురు ఆజ్ఞాపించాడు?

వారి ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు కృపలోనూ జ్ఞానమందునూ ఎదగాలని పేతురు ఆజ్ఞాపించాడు(3:17-18).


Chapter 1

Translation Questions

1 John 1:1

ఆది నుంచి ఏమి ఉంది అని యోహాను చెప్పాడు?

ఆది నుంచి జీవ వాక్కు ఉంది అని యోహాను చెప్పాడు[1:1].

యోహాను దేని ద్వారా జీవ వాక్కు గురించి తెలుసుకున్నాడు?

యోహాను జీవ వాక్కును విన్నాడు, కళ్ళతో చూశాడు, దగ్గరగా గమనించి, చేతులతో తాకి చూశాడు[1:1].

జీవ వాక్కు యోహానుకు వెల్లడి కాక ముందు ఎక్కడ ఉంది?

యోహానుకు వెల్లడి కాక ముందు జీవ వాక్కు తండ్రితో ఉంది[1:2].

1 John 1:3

యోహాను కళ్ళతో చూసిందీ , విన్నదీ ఎందుకు ప్రకటిస్తున్నాడు?

యోహాను కళ్ళతో చూసిందీ , విన్నదీ ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే అనేకులు వారితో సహవాసం కలిగి ఉండాలని[1:3].

వీరిలో ఎవరితో యోహాను అప్పటికే సహవాసం కలిగి ఉన్నాడు?

తండ్రితో, అయన కుమారుడు యేసు క్రీస్తుతో యోహాను అప్పటికే సహవాసం కలిగి ఉన్నాడు[1:3].

1 John 1:5

యోహాను తన పాఠకులకు దేవుని నుండి ఏమి సందేశాన్ని ప్రకటిస్తున్నాడు?

దేవుడు వెలుగు, ఆయనలో చీకటి లేనే లేదు అనే సందేశాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు [1:5].

ప్రదేవుని తో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉండే మనిషి గురించి యోహాను ఏమి చెబుతున్నాడు?

అటువంటి మనిషి అబద్ధం ఆడుతున్నట్టే, సత్యన్ని ఆచరిస్తూన్నట్లు కాదు అని యోహాను చెబుతున్నాడు[1:6].

వెలుగులో నడిచే వారి, ప్రి పాపాలు నుండి వారిని ఏది శుద్ధి చేస్తుంది?

యేసు క్రీస్తు రక్తం మనల్ని ప్రి పాపం నుండి శుద్ధి చేస్తుంది[1:7].

1 John 1:8

తనలో పాపం లేదని చెప్పుకునే వ్యక్తి గురించి యోహాను ఏమి చెప్పుతున్నాడు?

తనలో పాపం లేదని చెప్పుకునే వ్యక్తి తనను తను మోసం చేసుకునేవాడు అతనిలో సత్యం ఉండదు అని యోహాను చెబుతున్నాడు?

ఎవరు అయితే వారి పాపాలు అంగీకరిస్తున్నారో వారికి దేవుడు ఏమి చేస్తాడు?

ఎవరు అయితే వారి పాపాలు అంగీకరిస్తున్నారో వారికి దేవుడు వారి పాపాలను క్షమించి, సమస్త దుర్నీతి నుంచి శుద్ధి చేస్తాడు


Chapter 2

Translation Questions

1 John 2:1

ఎవరి పాపాలకు యేసు క్రీస్తు పరిహారం?

సర్వలోక పాపాలకూ యేసు క్రీస్తు పరిహారం[2:2].

యేసు క్రీస్తుని ఎరిగినవారం అని మనకు ఎలా తెలుస్తుంది?

యేసు క్రీస్తు ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే ఆయనను మనం ఎరిగినవారం అని మనకు తెలుస్తుంది [2:3].

1 John 2:4

ప్ర.దేవుడు తనకు తెలుసునని చెప్పుకుంటూ అయన ఆజ్ఞలు పాటించని వాడు ఎలాటి వాడు?

దేవుడు తనకు తెలుసునని చెప్పుకుంటూ అయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు (2:4).

విశ్వాసి ఎలా నడుచుకోవాలి?

విశ్వాసి యేసు క్రీస్తు నడిచినట్టు నడుచుకోవాలి (2:6).

1 John 2:9

ఒక మనిషి తను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే వాడి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది?

ఒక మనిషి తను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే వాడు చీకటిలోనే ఉన్నాడు[2:9,11].

1 John 2:12

దేవుడు విశ్వాసుల పాపాలు ఎందుకు క్షమించాడు?

దేవుడు క్రీస్తు నామము నిమిత్తము విశ్వాసుల పాపాలను క్షమించాడు.[2:12].

1 John 2:15

లోకంలో ఉన్నవాటి విషయాలు వైపు విశ్వాసుల వైఖరి ఏ విధముగా ఉండాలి అని యోహాను చెబుతున్నాడు?

విశ్వాసుల లోకాన్నిగానీ, లోకంలో ఉన్నవాటిని గాని ప్రేమించకూడదు అని యోహాను చెప్పాడు[2:15].

ఏ మూడు విషయాలు తండ్రి వద్ద నుండి వచ్చినవి కాదు అని యోహాను చెబుతున్నాడు?

శరీరాశ, నేత్రాశ, జీవిత దురహంకారం లోకంలో ఉన్నవి, అవి తండ్రి వద్ద నుండి వచ్చినవి కావు[2:16].

1 John 2:18

యోహానుకు చివరి ఘడియలు గురించి తెలుసు అని ఎలా చెబుతున్నాడు?

క్రీస్తు విరోధులు వచ్చారు, దీన్నిబట్టి యోహానుకు చివరి ఘడియలు గురించి తెలుసు అని చెప్పాడు[2:18].

ఎవరు వస్తున్నాడు అని యోహాను చెబుతున్నాడు?

క్రీస్తు విరోధి వస్తున్నాడని యోహాను చెబుతున్నాడు[2:18].

1 John 2:22

క్రీస్తు విరోధి అని అతనిని మనం గుర్తించడం మనకి ఎలా తెలుస్తుంది?

తండ్రిని , కుమారుణ్ణి నిరాకరించిన వాడే క్రీస్తు విరోధి అని మనకి తెలుస్తుంది[2:22].

ఎవరైనా కుమారుణ్ణి నిరాకస్తే వారికి తండ్రి ఉంటాడా?

ఎవరైనా కుమారుణ్ణి నిరాకరిస్తే వారికి తండ్రి లేనట్టే [2:23].

1 John 2:24

కుమారునిలో, తండ్రిలో విశ్వాసులు నిలిచి ఉండటానికి ఏమి చేయాలి అని యోహాను చెబుతున్నాడు?

మొదటి నుండి విన్నదానిలో అలాగే నిలిచి ఉంటే మీరు కుమారునిలో, తండ్రిలో నిలిచి ఉంటారు అని యోహాను చెబుతున్నాడు[2:24].

విశ్వాసులకు దేవుడు ఏమి వాగ్ధానం ఇచ్చాడు?

విశ్వాసులకు దేవుడు శాశ్వత జీవాన్ని వాగ్ధానంగా ఇచ్చాడు[2:25].

1 John 2:27

క్రీస్తు రాకడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు కుమారునిలో ఉన్నవారు ఏ వైఖరి తో ఉంటారు?

ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు కుమారుని లో ఉన్నవారు ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఉంటారు[2:28].


Chapter 3

Translation Questions

1 John 3:1

తండ్రి ప్రేమతో ఆయనని నమ్మిన విశ్వాసులకు ఏమి ప్రాదిస్తున్నాడు?

తండ్రి ప్రేమతో ఆయనని నమ్మిన విశ్వాసులకు దేవుని పిల్లలు అని ప్రాదిస్తున్నాడు[3:1-2].

క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులకు ఏమి జరిగిది?

క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు ఉన్నవాడు ఉన్నట్లుగానే చూస్తారు, ఆయన వలే ఉంటారు [3:2].

ప్ర? క్రీస్తులో ఆశాభావంగా ఉన్న విశ్వాసులుగా వారి గురించి వారు ఏమి అనుకొంటున్నారు?

క్రీస్తులో ఆశాభావంగా ఉన్న విశ్వాసులుగా తమను తాము పవిత్రం చేసుకుంటారు[3:3].

1 John 3:4

క్రీస్తులో ఏమి లేదు?

క్రీస్తులో ఏ పాపమూ లేదు[3:5].

పాపంచేస్తూ ఉండే వాడు దేవుని తో ఏ విధమైన సంబంధము కలిగి ఉంటాడు?

పాపం చేస్తూ ఉండే వాడు దేవుని తెలుసుకోలేరు, దేవుని ఎన్నడూ చూడలేరు[3:6,8].

1 John 3:7

దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు?

సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు[3:8].

1 John 3:9

దేవుని పిల్లలు, సైతాను పిల్లలు వారిని వారు ఏవిధముగా ప్రత్యక్షం చేసుకున్నారు?

దేవుని పిల్లలు నీతిని జరిగించే వారుగా ప్రత్యక్షం చేసుకుంటారు, సైతాను పిల్లలు పాపం చేస్తూ ప్రత్యక్షం చేసుకుంటారు [3:7-10].

1 John 3:11

కయీను సైతాను సంబంధి అని ఎలా ప్రదర్శించుకున్నాడు?

తన తమ్ముణ్ణి చంపి కయీను సైతాను సంబంధి అని ప్రదర్శించుకున్నాడు

1 John 3:13

విశ్వాసులు దేనిని బట్టి ఆశ్చర్యపడకండి అని యోహాను చెప్పాడు?

లోకం తమను ద్వేషించడం చూసి ఆశ్చర్యపడకండి అని యోహాను చెప్పాడు[3:13].

ఎవరైనా దేవుని పిల్లలు అయితే వారి వైఖరి విశ్వాసులు పట్ల ఏ విధముగా ప్రర్శించాలి?

జ .ఎవరైనా దేవుని పిల్లలు అయితే వారి వైఖరి విశ్వాసులు పట్ల ప్రేమగా ప్రర్శించాలి[3:10- 11,14].

1 John 3:16

ప్రేమ ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది?

యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబటి మనకు ప్రేమ ఏమిటో తెలిసింది[3:16].

తన సోదరుడు అవసరంలో ఉంటే విశ్వాసి ఏ విధముగా తన ప్రేమను చూపించాలి?

జ.తన సోదరుడు అవసరంలో ఉంటే విశ్వాసి తన ప్రేమను లోక అవసరతలు తీర్చుట ద్వారా చూపించాలి [3:17-18].

1 John 3:19

విశ్వాసి దేవుని సత్యమును, ప్రేమను, ప్రదర్శించినప్పుడు, ఆతడు తన కోసం ఏమి పొందుకొంటాడు?

విశ్వాసి దేవుని సత్యమును, ప్రేమను, ప్రదర్శించినప్పుడు, ఆతడు తనకు అభయం సాధించుకొని దేవుని దగ్గర ధైర్యముగా ఉంటాం[3:19,21].

1 John 3:23

దేవుని నుండి ఏమి ఆజ్ఞను విశ్వాసులు పొందుకొంటారు అని గుర్తు చేస్తున్నాడు?

దేవుని కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అనేది దేవుని అజ్ఞ అని యోహాను గుర్తు చేస్తున్నాడు[3:23].

దేవునిలో నిలిచి ఉండటానికి విశ్వాసులకు దేవుడు ఏమి ఇచ్చాడు?

దేవునిలో నిలిచి ఉండటానికి విశ్వాసులకు దేవుడు ఆయన ఆత్మని ఇచ్చాడు[3:24].


Chapter 4

Translation Questions

1 John 4:1

విశ్వాసులు ప్రతి అత్మనూ నమ్మకూడదు అని యోహాను ఎందుకు హెచ్చరిస్తున్నాడు?

లోకంలో చాలా మంది అబద్ధ ప్రక్తలు ఉన్నారు అని యోహాను విశ్వాసులు హెచ్చరిస్తున్నాడు[4:1].

దేవుని ఆత్మ మాట్లాడుతుంది అని మీరు ఎలా తెలుసుకొంటారు?

జ .శరీర రూపంలో వచ్చిన యేసు క్రీస్తు దేవుడు అని ప్రతి ఆత్మ అంగీకరిస్తుంది[4:2].

శరీర రూపంలో వచ్చిన యేసు క్రీస్తు దేవుడు కాదు అని ఏ ఆత్మ అంగీకరించదు?

శరీర రూపంలో వచ్చిన యేసు క్రీస్తు దేవుడు కాదు క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ అంగీకరించదు[4:3].

1 John 4:4

ఏ ఆత్మ గొప్పది అని యోహాను చెబుతున్నాడు?

ఈ లోకంలో ఉన్నవాని ఆత్మ కన్నా విశ్వాసులో ఉన్న ఆత్మ గొప్పది[4:4-5].

1 John 4:7

విశ్వాసులకు దేవుడు తెలుసు అని దేని ద్వారా చూపిస్తారు, వారు దేవుని లాగా ఉండటానికి ఏమి చేస్తారు ?

దేవుడు ప్రేమ కావున విశ్వాసులు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు దాని ద్వారా తమకు దేవుడు తెలుసు అని చూపిస్తారు[4:7-8].

1 John 4:9

దేవుడు తన ప్రేమని ఎలా వెల్లడి చేశాడు?

దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి ఆయన ప్రేమని వెల్లడి చేశాడు[4:9].

తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి ఏ ప్రయోజనం కోసం పంపాడు?

తండ్రి తన కుమారుణ్ణి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా, లోక రక్షకుడుగా ఈ లోకానికి పంపాడు.

1 John 4:15

నిజమైన విశ్వాసులు యేసు గురించి ఏమి అంగీకరిస్తారు?

యేసు దేవుని కుమారుడు అని నిజమైన విశ్వాసులు అంగీకరిస్తారు[4:15].

1 John 4:17

ప్రేమలో, దేవునిలో నిలిచి ఉన్నవారు తీర్పు రోజున ఏ వైఖరి కలిగి ఉంటారు?

ప్రేమలో, దేవునిలో నిలిచి ఉన్నవారు తీర్పు రోజున ధైర్యము కలిగి ఉంటారు[4:17].

1 John 4:19

మనం ఎలా ప్రేమించ గలుగుతున్నాము?

దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాము[4:19].

ఎవరైనా తన సోదరుణ్ణి ద్వేషిస్తే దేవునితో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు?

తన సోదరుణ్ణి ద్వేషించే వాడు దేవుని ప్రేమించలేడు[4:20].

దేవుని ప్రేమించే వాడు తప్పక ఎవరిని ప్రమించాలి?

దేవుని ప్రేమించే వాడు తప్పక తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి[4:21].


Chapter 5

Translation Questions

1 John 5:1

మనం దేవుని ప్రేమించేవారమని ఎలా ప్రదర్శించుకోవచ్చు?

ఆయన అజ్ఞలు పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించేవారమని ప్రదర్శించుకోవచ్చు[5:3].

1 John 5:4

లోకాన్ని జయిoచే విజయం అంటే ఏమిటి?

లోకాన్ని జయిoచే విజయం అంటే మన విశ్వాసమే[5:4].

1 John 5:6

యేసు క్రీస్తు ఏ రెండు అంశాలు ద్వారా వచ్చినవాడు?

యేసు క్రీస్తు నీళ్ళు ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు[5:6].

ఏ మూడు విషయాలు యేసు క్రీస్తుకు సాక్షం చెబుతాయి?

ఆత్మ, నీళ్ళు, రక్తం, ఈ మూడు యేసు క్రీస్తుకి సాక్షం చెబుతాయి[5:7-8].

1 John 5:9

దేవుని కుమారుడుకు సంబంధించిన సాక్ష్యము నమ్మని వాడు ఎవరైనా దేవుణ్ణి ఏమి చేసినట్టే?

దేవుని కుమారుడుకు సంబంధించిన సాక్ష్యము నమ్మని వాడు ఎవరైనా దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసినట్టే[5:9-10].

1 John 5:11

దేవుడు తన కుమారునిద్వారా మనకు ఏమి ఇచ్చాడు?

దేవుడు తన కుమారుని ద్వారా శాశ్వత జీవం ఇచ్చాడు[5:11].

1 John 5:13

దేవుని ముందు విశ్వాసులకు ఉన్న ధైర్యం ఏంటి?

దేవుని చిత్తానికి అనుగుణంగా ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు అనేది విశ్వాసులకు ఉన్న ధైర్యం[5:14].

1 John 5:16

మరణం కలిగించే పాపం తన సోదరుడు చెయ్యడం చూస్తే విశ్వాసి ఏమి చేయాలి?

మరణం కలిగించే పాపం తన సోదరుడు చెయ్యడం చూస్తే విశ్వాసి తన సోదరుని కోసం ప్రార్ధిoచాలి తద్వారా తన సోదరునికి దేవుడు జీవం ఇస్తాడు[5:16].

సమస్త దుర్నీతీ అంటే ఏంటి?

సమస్త దుర్నీతీ అంటే పాపం [5:17].

1 John 5:18

సర్వ లోకం ఎవరి అధీనంలో ఉంది?

సర్వ లోకం దుష్టుని అధీనంలో ఉంది[5:19].

1 John 5:20

నిజమైన దేవుడు ఎవరు?

యేసు క్రీస్తు తండ్రి నిజమైన దేవుడు[5:20].

విశ్వాసులు దేని నుండి దూరముగా ఉండాలి?

విశ్వాసులు విగ్రహాలకు దూరముగా ఉండాలి [5:21].


Chapter 1

Translation Questions

2 John 1:1

ఏ పేరు ద్వారా రచయిత యోహాను ఈ లేఖలో తానను పరిచయం చేసుకున్నాడు?

యోహాను ఈ లేఖలో తానను పెద్దగా పరిచయం చేసుకున్నాడు[1:1].

ఈ పత్రిక ఎవరికీ రాయబడినది?

ఎన్నికైన తల్లికి, ఆమె పిల్లలకు పత్రిక రాయబడినది [1:1].

మ, దయ, శాంతి ఎవరి వద్ద నుంచి వస్తాయి అన్ని యోహాను చెబుతున్నాడు?

తండ్రి అయిన దేవుని నుంచి, కుమారుడైన యేసు క్రీస్తు నుంచి # మ, దయ, శాంతి వస్తాయి అని యోహాను చెప్పాడు[1:3].

2 John 1:4

యోహాను ఎందుకు సంతోషిస్తున్నాడు?

స్త్రీ పిల్లలు కొందరు సత్యమార్గంలో నడుస్తున్నారు అన్ని తెలిసి యోహాను సంతోషిస్తున్నాడు [1:4].

ఆరంభం నుండి వారికి ఉన్నఅజ్ఞ ఏదని యోహాను చెపుతున్నాడు?

ఒకరిని ఒకరు # మించాలన్నఅజ్ఞ ఆరంభం నుండి వారికి ఉన్నది అని యోహాను చెప్పాడు[1:5].

మ అంటే ఏంటి అని యోహాను చెబుతున్నాడు?

మ అనేది దేవుని అజ్ఞల # ారం నడుచుకోవటం అని యోహాను చెబుతున్నాడు[1:6].

2 John 1:7

యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకొనని వాళ్ళను యోహాను ఏమని పిలిచాడు?

యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకొనని వాళ్ళు మోసగాళ్ళు, క్రీస్తు విరోధులు అని యోహాను పిలిచాడు[1:7].

విశ్వాసుల్ని ఏమి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి యోహాను చెప్పాడు?

చేసిన పనికి రావలసిన ఫలితాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసుల్ని జాగ్రత్తగా ఉండాలి అన్నియోహాను చెప్పాడు[1:8].

2 John 1:9

ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే విశ్వాసులు ఏమి చేయాలి అని యోహాను చెప్పాడు?

ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే అతని ఆహ్వానించవద్దు అని విశ్వాసులుకు యోహాను చెప్పాడు[1:10].

ఒకవేళ క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వానిస్తే అతడు దేనిలో పాలిభాగస్తుడు అవుతాడు?

క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వనిస్తే అతడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడు అవుతాడు[1:11].

2 John 1:12

యోహాను భవిష్యత్తులో ఏమి చేయాలి అని ఆశతో ఉన్నాడు?

ఎన్నికైన సోదరితో ముఖాముఖి మాట్లాడాలని యోహాను ఆశతో ఉన్నాడు[1:12].


Chapter 1

Translation Questions

3 John 1:1

ఈ ఉత్తరంలో రచయిత యోహాను ఏ పేరు ద్వారా తనను తాను పరిచయం చేసుకొంటున్నాడు?

యోహాను తనను తాను ఒక పెద్దగా పరిచయం చేసుకొంటున్నాడు.

ఈ ఉత్తరాన్ని అందుకున్న గాయితో యోహానుకు ఎలాంటి సంబంధం ఉంది?

యోహాను గాయిని నిజంగా ప్రేమిస్తున్నాడు.

3 John 1:2

గాయి విషయంలో యోహాను దేని కోసం ప్రార్థిస్తున్నాడు?

గాయి తన ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న ప్రకారం, అన్ని విషయాలలో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతునిగా ఉండాలనీ యోహాను ప్రార్థిస్తూ ఉన్నాడు.

3 John 1:4

యోహాను కున్న గొప్ప సంతోషం ఏమిటి?

తన పిల్లలు సత్యంలో నడుచుకుంటున్నారని వినడం యోహాను కున్న గొప్ప సంతోషం.

3 John 1:5

గాయి ఎవరి కోసం పని చేస్తున్నాడు?

గాయి సోదరుల కోసం పనిచేసాడు, వారు అపరిచితులు అయినప్పటికీ వారి కోసం పనిచేశాడు.

3 John 1:6

సోదరుల ప్రయాణంలో గాయి వారిని ఏవిధంగా పంపించాడు?

వారిని దేవునికి తగినట్టుగా అతడు పంపించాడు.

3 John 1:7

సోదరులను వారి ప్రయాణంలో పంపించడానికి విశ్వాసుల సహాయం ఎందుకు అవసరం అయ్యింది?

వారికి సహాయం అవసరం అయ్యింది ఎందుకంటే వారు అన్యజనుల నుండి ఏమీ తీసుకోవడం లేదు.

3 John 1:8

విశ్వాసులు ఇలాంటి సోదరులను స్వీకరించాలని యోహాను ఎందుకు చెప్పాడు?

విశ్వాసులు వారిని స్వీకరించాలని యోహాను చెప్పాడు తద్వారా వారు సత్యం కోసం జతపనివారు అవుతారు.

3 John 1:9

దియోత్రెఫే దేనిని ప్రేమిస్తున్నాడు?

దియోత్రెఫే సమాజంలో గొప్పవాడిగా ఉండాలని ప్రేమిస్తున్నాడు.

యోహాను పట్ల దియోత్రెఫే వైఖరి ఏమిటి?

దియోత్రెఫే యోహానును అంగీకరించడం లేదు.

3 John 1:10

గాయి, మరియు సంఘం వద్దకు వచ్చినప్పుడు యోహాను ఏమి చేస్తాడు?

యోహాను వచ్చినప్పుడు అతడు దియోత్రెఫే యొక్క పనులను జ్ఞాపకం చేసుకొంటాడు.

నామం కోసం ముందుకు వెళ్తున్న సోదరులతో దియోత్రెఫే ఏమి చేస్తున్నాడు?

దియోత్రెఫే సోదరులను స్వీకరించడం లేదు.

ఈ సోదరులను స్వీకరించే వారితో దియోత్రెఫే ఏమి చేస్తున్నాడు?

వారు సోదరులను స్వీకరించకుండా దియోత్రెఫే వారిని నిలువరిస్తున్నాడు, వారిని సంఘం నుండి త్రోసివేస్తున్నాడు.

3 John 1:11

దేనిని అనుకరించాలని గాయికి యోహాను చెపుతున్నాడు?

మంచిని అనుకరించమని యోహాను గాయికి చెపుతున్నాడు.

3 John 1:14

భవిష్యత్తులో ఏమి చేయాలని యోహాను ఎదురుచూస్తున్నాడు?

యోహాను రావాలనీ, గాయితో వ్యక్తిగతంగా మాట్లాడాలని యోహాను ఎదురుచూస్తున్నాడు.


Chapter 1

Translation Questions

Jude 1:1

యూదా ఎవరికీ సేవకుడు?

యూదా యేసు క్రీస్తుకి సేవకుడు [1:1].

యూదా ఎవరి సోదరుడు?

యూదా యాకోబు సోదరుడు [1:1].

ఈ పత్రికను యూదా ఎవరికి వ్రాశాడు?

తండ్రి అయిన దేవుని పిలుపు అందుకుని, అయన ప్రేమను చూరగొని, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్న వారికీ యూదా వ్రాశాడు [1:1].

ఈ పత్రిక రాసే వారికి ఏమి రెట్టింపు కావాలి అని యూదా కోరుకున్నాడు?

దయ, శాంతి, ప్రేమ, రెట్టింపు కలగాలి అని యూదా కోరుకున్నాడు[1:2].

Jude 1:3

ముందుగా యూదా ఏమి వ్రాయాలి అనుకున్నాడు?

మనకందరికీ చెందిన రక్షణ గురించి రాయాలని ముందుగా యూదా అనుకున్నాడు[1:3].

నిజానికి దేనిని గురించి యూదా వ్రాయలి అనుకున్నాడు?

పవిత్రులు విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని యూదా వ్రాయలి అనుకున్నాడు[1:3].

కొంతమంది శిక్షా పాత్రులు, భక్తిహీనులు ఎలా వచ్చారు?

కొంతమంది శిక్షా పాత్రులు, భక్తిహీనులు దొంగచాటుగా వస్తారు[1:4].

శిక్షా పాత్రులు భక్తిహీనులు ఏమి చేస్తారు?

దేవుని కృపను, లైoగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు [1:4].

Jude 1:5

ఒకసారి జనాంగాన్ని ప్రభువు దేని నుంచి రక్షించాడు?

ప్రభువు ఐగుప్తు నుండి జనాంగాన్నిరక్షించాడు [1:5].

ప్ర? ఎవరు అయితే నమ్మరో అ ప్రజలను ప్రభువు ఏమి చేస్తాడు?

ఎవరు అయితే నమ్మరో అ ప్రజలను ప్రభువు నాశనం చేస్తాడు [1:5].

వారికి ఏర్పరచిన నివాస స్థలాల విడిచిపెట్టిన దేవదూతలను ప్రభువు ఏమి చేశాడు?

ప్రభువు వాళ్ళని సంకెళ్ళతో చీకటిలో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు [1:6].

Jude 1:7

సొదొమ గొమొర్ర వాటి చుట్టూ ఉన్న పట్టణాల వారు ఏమి చేశారు?

లైంగిక అవినీతికి అసహజమైన లైంగిక కోరికలకు పాలుపడ్డారు [1:7].

సొదొమ, గొమొర్ర, వాటి చుట్టూ ఉన్న పట్టణాల వారి వలే కొంతమంది శిక్షార్హులు, భక్తిహీనులు ఎలా వచ్చారు?

వాళ్ళు వారి కలల్లో కూడా తమ శరీరాల్ని అపవిత్రం చేసుకుంటున్నారు, ప్రభుత్వన్ని నిరాకరిస్తూ, చెడుగా చెబుతున్నారు [1:8].

Jude 1:9

ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో ఏమి చెప్పాడు?

ప్రభువు నిన్ను గద్దించును గాక, అని ప్రధాన దూత మిఖాయేలు చెప్పాడు [1:9]

Jude 1:12

శిక్షార్హులు, భక్తిహీనులు సిగ్గు లేకుండా దేనిని చూసుకున్నారు?

వారు సిగ్గు లేకుండా తమ క్షెమమే చూసుకున్నారు[1:12].

Jude 1:14

ప్రభువు తీర్పు ఎవరి మీద అమలు చేయబడుతుంది?

ప్రజలు అందరీ మీద తీర్పు అమలు చేయబడుతుంది[1:15].

ఆదాము వరుసలో హనోకు ఎన్నో వాడు?

ఆదాము వరుసలో హనోకు ఏడవ వాడు[1:14].

శిక్ష పొందే భక్తిహీనులు ఎవరు ?

తమ దురాశలను బట్టి నడుచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్ధితిని బట్టి సణుగుతూ, గొణుగుతూ ఉన్నవారు[1:16].

Jude 1:17

అంతకుముందు అపహాస్యులు గురించి ఎవరు పలికారు?

అంతకుముందు అపహాస్యులు గురించి మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులులు పలికారు [1:17].

బేధాలు కలిగించే వారు, అపవిత్ర కోరికల కోసం వెంటపడే అపహాస్యుల గురించిన వాస్తవం ఏమిటి ?

వాళ్ళకి దైవాత్మ లేదు[1:19].

Jude 1:20

ప్రియమైన వారు ఏ విధముగా ఎదుగుతూ ప్రార్ధన చేస్తున్నారు?

అతిపవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పవిత్ర ఆత్మలో ప్రార్ధన చేస్తూ ప్రియమైన వారు తమలో తాము ఎదుగుతూ వస్తున్నారు [1:20].

ప్రియమైన వారు దేనిలో ఉంటూ, దేని కోసము ఎదురు చూడాలి ?

A .ప్రియమైన వారు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవం కోసం, మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడాలి[1:21].

Jude 1:22

ప్రియమైన వారు ఎవరి మీద దయగా ఉండాలి ఎవరిని రక్షించాలి?

అనుమానంతో ఉన్నకొంతమంది పట్ల, అగ్నిలో ఉన్న వారిపట్ల, భయంతో ఉన్న వారి పట్ల, పాపంతో మలినమైన దుస్తులతో ఉన్న వారిపట్ల ప్రియమైన వారు దయగా ఉండి రక్షించాలి [1:22-23].

Jude 1:24

వారి రక్షకుడైన దేవుడు, యేసు క్రీస్తు ద్వారా ఏమి చేస్తాడు?

దేవుడు వారు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమ గల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్ముల్నిమచ్చలేని వాళ్ళుగా ఉంచగలవాడు [1:24-25].

దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది?

దేవునికి మహిమ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక[1:25].


Chapter 1

Translation Questions

Revelation 1:1

ఈ ప్రత్యక్షత మొదట ఎవరి నుంచి వచ్చింది, దేవుడు ఎవరికి చూపాడు?

యేసుక్రీస్తు ప్రత్యక్షత దేవుని నుండి వచ్చింది, ఆయన తన దాసులకు చూపాడు(1:1).

ఈ ప్రత్యక్షత గూర్చిన సంగతులు ఎప్పుడు జరుగుతాయి?

ఈ ప్రత్యక్షత గూర్చిన సంగతులు త్వరలో జరుగుతాయి(1:1).

ఈ గ్రంథం వల్ల ఎవరు ధన్యులు?

ఈ గ్రంథం బహిరంగంగా చదివేవారు, వినేవారు, వాటిని పాటించేవారు ధన్యులు(1:3).

Revelation 1:4

ఈ గ్రంథం ఎవరు ఎవరికి రాశారు?

యోహాను ఈ గ్రంథం ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు రాశాడు(1:4).

యేసు క్రీస్తుకు యోహాను ఏ మూడు బిరుదులను ఇచ్చాడు?

యేసు క్రీస్తుకు యోహాను నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలోనుంచి మొదట లేచినవాడు, భూరాజులను పరిపాలించువాడు అనే మూడు బిరుదులను ఇచ్చాడు(1:5).

యేసు విశ్వాసులను ఏం చేశాడు?

యేసు విశ్వాసులను తండ్రియైన దేవునికి రాజ్యంగానూ యాజకులుగానూ చేశాడు(1:6).

Revelation 1:7

యేసు వచ్చినప్పుడు ఎవరు చూస్తారు?

యేసు వచ్చినప్పుడు ప్రతీ కన్నూ, ఆయనను పొడిచినవారూ చూస్తారు(1:7).

ప్రభువైన దేవుడు తనను తాను ఎలా వివరించుకొన్నాడు?

ప్రభువైన దేవుడు తనను తాను అల్ఫాయు ఓమెగయు, ప్రస్థుతమూoటూ, పూర్వముoడి, భవిష్యత్తులో రాబోవు వాడినని వివరించుకొన్నాడు(1:8).

Revelation 1:9

యోహాను పత్మాసు దీవిలో ఎందుకున్నాడు?

యోహాను పత్మాసు దీవిలో దేవుని వాక్కు కోసం యేసును గూర్చిన సాక్ష్యం కోసం ఉన్నాడు(1:9).

యోహాను ఏం చెయ్యాలని వెనుక నుండి పెద్ద స్వరం చెప్పడం జరిగింది?

యోహానుకు వెనుక నుంచి వచ్చిన స్వరం తాను చూచినది గ్రంథంలో రాసి ఆసియాలోని ఏడు సంఘాలకు పoపంపించాలని చెప్పడం జరిగింది(1:11).

Revelation 1:14

యోహాను చూచిన వ్యక్తి ఎలాంటి కన్నులూ, వెంట్రుకలు కలిగి ఉన్నాడు?

యోహాను చూచిన వ్యక్తి ఉన్నివలె తెల్లని వెంట్రుకలూ, మండుచున్న అగ్ని వంటి కన్నులూ కలిగి ఉన్నాడు(1:14).

ఆ వ్యక్తి కుడి చేతిలో ఏముంది, అతని నోటి నుంచి బయటకు ఏం వస్తుంది?

ఆ వ్యక్తి కుడి చేతిలో ఏడు నక్షత్రాలు, రెండంచుల పదునైన కత్తి నోటి నుంచి బయటకు వస్తుంది(1:16).

Revelation 1:17

ఆ వ్యక్తిని చూచినప్పుడు యోహాను ఏం చేశాడు?

ఆ వ్యక్తిని చూచినప్పుడు యోహాను చచ్చిన వాని వలె ఆ వ్యక్తి పాదాల దగ్గర పడ్డాడు(1;18).

Revelation 1:19

ఏడు నక్షత్రాలూ, ఏడు ద్వీప స్తంభాలూ అర్ధము ఏమిటి?

ఏడు నక్షత్రాలూ ఏడు సంఘాల దూతలు ఏడు ద్వీప స్తంభాలూ ఏడు సంఘాలు(1:20).


Chapter 2

Translation Questions

Revelation 2:1

తరువాతి గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాతి గ్రంథ భాగం ఎఫెసులో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(2:1).

ఎఫెసులో ఉన్న సంఘo దుష్టులైన వారికీ, అబద్ద ప్రవక్తలకూ ఏం చేసింది?

ఎఫెసులో ఉన్న సంఘo దుష్టులైన వారిని సహించలేదూ, అబద్ద ప్రవక్తలను పరీక్షించి సహించలేదు(2:2).

Revelation 2:3

ఎఫెసు సంఘంలో క్రీస్తు కలిగియున్న వ్యతిరేకత ఏమిటి?

ఎఫెసు సంఘంలో క్రీస్తు కలిగియున్న వ్యతిరేకత వారి మొదటి ప్రేమను విడిచి పెట్టడం(2:5).

వారు మారుమనస్సు పొందక పోతే ఏం చేస్తానని క్రీస్తు చెప్పాడు?

వారు మారుమనస్సు పొందక పోతే వారి దీపస్తంభం దాని ఉన్న చోటు నుంచి తొలగిస్తానని క్రీస్తు చెప్పాడు(2:5).

Revelation 2:6

జయించు వారికి క్రీస్తు చేసిన వాగ్దానం ఏమిటి?

జయించు వారికి పరదైసులో జీవ వృక్ష ఫలాలు తినడానికి ఇస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:7).

Revelation 2:8

తరువాతి గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాతి గ్రంథ భాగం స్ముర్న సంఘo దూతకు రాయడం జరిగింది(2:8).

స్ముర్న సంఘము ఏమి అనుభవం కలిగి ఉంది?

స్ముర్న సంఘము శ్రమానుభవమూ, పేదరికమూ, నిందానుభవం కలిగి ఉంది(2:9).

Revelation 2:10

మరణం వరకు నమ్మకంగా ఉండి జయించిన వారికి క్రీస్తు చేసిన వాగ్దానం ఏమిటి?

మరణం వరకు నమ్మకంగా ఉండి జయించిన వారికి క్రీస్తు జీవకిరీటమిచ్చీ, రెండవ మరణం వల్ల ఎటువంటి హాని కలగదని వాగ్దానం చేశాడు(2:10-11).

Revelation 2:12

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం పెర్గములోని సంఘo దూతకు రాయడం జరిగింది(2:12).

పెర్గము సంఘo ఎక్కడ నివాసముంది?

పెర్గము సంఘo సాతాను సింహాసనo ఉన్న స్థలంలో నివాసముంది(2:13).

అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం ఏం చేసింది?

అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం క్రీస్తు నామమును గట్టిగా పట్టుకొని, విశ్వాసం కాదన లేదు(2:13).

Revelation 2:14

పెర్గము సంఘంలో కొందరు పట్టుకొని ఉన్న రెండు బోధలేంటి?

పెర్గము సంఘంలో కొందరు బిలాం బోధలూ, కొoదరు నికోలయతు బోధలూ పట్టుకొని ఉన్నారు(2:14-15).

Revelation 2:16

మారుమనస్సు పొందక అబద్ద బోధలను పట్టుకుంటే ఏం చేస్తానని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు?

మారుమనస్సు పొందక అబద్ద బోధలను పట్టుకుంటే వారికి వ్యతిరేకంగా యుద్దము చేస్తానని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(2:16).

జయించిన వారికి ఏం చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించిన వారికి మరుగైన మన్నానూ, ఒక కొత్త పేరుగల తెల్లని రాయి పొందుతారని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:17).

Revelation 2:18

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం తుయతైరలోని సంఘం దూతకు రాయడం జరిగింది(2:18).

తుయతైర సంఘం చేసిన ఏ మంచి పనులను క్రీస్తు తెలుసుకున్నాడు?

తుయతైర సంఘంలోని ప్రేమా, విశ్వాసమూ, సేవా, సహనమూ ఓర్పు వంటి మంచిపనులను క్రీస్తు తెలుసుకున్నాడు(2:19).

Revelation 2:20

తుయతైర సంఘంలో క్రీస్తుకు ఉన్న వ్యతిరేకత ఏమిటి?

తుయతైర సంఘంలో క్రీస్తుకు ఉన్న వ్యతిరేకత, వారు యెజెబెలు ప్రవక్తి అనైతికమైన తప్పుడు విధానాన్ని సహిస్తున్నారు(2:20).

Revelation 2:22

యెజెబెలు మారుమనసు పొందకపోతే ఏమి చేస్తానని క్రీస్తు హెచ్చరించాడు?

యెజెబెలు మారుమనసు పొందకపోతే ఆమెను మంచం పట్టించి ఆమె పిల్లలను కొట్టి చంపేస్తానని క్రీస్తు హెచ్చరించాడు(2:22-23).

Revelation 2:24

యెజెబెలు బోధను పాటించని వారు ఏమి చెయ్యాలని క్రీస్తు చెప్పాడు?

యెజెబెలు బోధను పాటించని వారు ఆయన వచ్చే వరకు ఆయనలో కలిగింది గట్టిగా పట్టుకోoడని క్రీస్తు చెప్పాడు(2:25).

Revelation 2:26

జయించిన వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించిన వారికి జనాల మీద అధికారంనూ వేకువ నక్షత్రానిస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:7).

చదివేవారు ఏం వినాలని క్రీస్తు చెబుతున్నాడు?

చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(2:29).


Chapter 3

Translation Questions

Revelation 3:1

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం సార్దీసులో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(3:1).

సార్దీసులో ఉన్న సంఘ ప్రసిద్ధి ఏoటి, దాన్నిగూర్చిన సత్యం ఏoటి?

సార్దీసులో ఉన్న సంఘo బ్రతికుంది కానీ దానిలోని సత్యం చనిపోయిoది(3:1).

సార్దీసులో ఉన్న సంఘo ఏం చెయ్యాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు?

సార్దీసులో ఉన్న సంఘాని మేల్కొని, మిగిలిన వాటిని దృఢ పరచుకొని, జ్ఞాపకం చేసుకొని, తగ్గించుకొని, మారుమనసు పొందాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(3:2-3).

Revelation 3:5

జయించిన వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు ?

జయించిన వారికి తెల్లని వస్త్రాలు ధరించడం జరుగుతుంది, జీవగ్రంథంలో పేరు నిలిచి ఉంటుంది, తండ్రియైన దేవుని ఎదుట వారి పేరు పలకడం జరుగుతుంది(3:5).

Revelation 3:7

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(3:8).

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo తక్కువ బలమున్నప్ప్తటికి ఏమి చేసింది?

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo తక్కువ బలమున్నప్పటికీ క్రీస్తు వాక్కుకు విధేయత చూపీ ఆయన పేరు తెలియదనలేదు(3:8).

Revelation 3:9

సాతాను సమాజం వారిని క్రీస్తు ఏమి చేస్తాడు?

సాతాను సమాజం వారిని పవిత్రుల కాళ్ళ ముందు పడి నమస్కారం చేసేలా క్రీస్తు చేస్తాడు(3:9).

ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సంఘo ఏమి చెయ్యాలని క్రీస్తు చెప్పాడు?

ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సంఘo ఏదైతే కలిగిఉoదో ఆ కిరీటం ఎవరు తీసుకోకుండా గట్టిగా పట్టుకోవాలని క్రీస్తు చెప్పాడు(3:11).

Revelation 3:12

జయించిన వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించిన వారిని దేవుని ఆలయంలో స్తంభంగా ఉంటారు, దేవుని పేరు కలిగి ఉంటారు, దేవుని పట్టణం పేరు కలిగి ఉంటారు, క్రీస్తు కొత్త పేరు వారి మీద రాయడం జరుగుతుందని క్రీస్తు వాగ్దానం చేశాడు(3:12).

Revelation 3:14

ఏ దూతకు తరువాత గ్రంథ భాగం రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం లవొదికయలో ఉన్న సంఘ దూతకు రాయడం జరిగింది(3:14).

లవొదికయలో ఉన్న సంఘo ఎలా ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు?

లవొదికయలో ఉన్న సంఘo చల్లగానైన వెచ్చగానైన ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు(3:15).

క్రీస్తు లవొదికయలో ఉన్న సంఘానికి ఏమి చెయ్యాలని ఉన్నాడు, ఎందుకు?

లవొదికయలో ఉన్న సంఘo నులివెచ్చగా ఉన్నందుకు తన నోటి నుంచి ఉమ్మి వేయబోతున్నాడు (3:16).

Revelation 3:17

లవొదికయలో ఉన్న సంఘo తన గూర్చి తాను ఏమనుకుoటుంది?

లవొదికయలో ఉన్న సంఘo తన గూర్చి తాను ధనవంతుడననీ తనకు కొదువంటూ ఏమి లేదని అనుకుంటుంది(3:17).

లవొదికయలో ఉన్న సంఘo గూర్చి క్రీస్తు ఏమంటున్నాడు?

లవొదికయలో ఉన్న సంఘo గూర్చి క్రీస్తు దిక్కుమాలినవాడనీ, దౌర్భగ్యుడనీ, దరిద్రుడనీ, గుడ్డివాడనీ, దిగంబరిగా ఉన్నావని క్రీస్తు చెబుతున్నాడు(3:17).

Revelation 3:19

ఆయన ప్రేమిoచువారి కోసం క్రీస్తు ఏమి చేస్తాడు?

ఆయన ప్రేమిoచువారికి శిక్షణ ఇచ్చి నేర్పిస్తాడు(3:19).

Revelation 3:21

జయించు వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించు వారిని క్రీస్తు తన సింహాసనం మీద కూర్చోనిస్తాడు(3:21).

చదివేవారు ఏం వినాలని క్రీస్తు చెబుతున్నాడు?

చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(3:22).


Chapter 4

Translation Questions

Revelation 4:1

ఏమి తెరుచుకోడం యోహాను చూశాడు?

యోహాను పరలోకంలో ఒక తలుపు తెరుచుకోడం చూశాడు(4:1).

యోహానుతో ఆ స్వరం ఏమి చూపుతానని చెప్పింది?

యోహానుతో ఆ స్వరం ఇక మీదట జరిగేది ఆయన చూపుతాడని చెప్పింది(4:1).

పరలోకంలో ఎవరో కూర్చుని ఉన్నదేంటి?

పరలోకంలో ఎవరో సింహాసనం మీద కూర్చున్నాడు(4:2).

Revelation 4:4

పరలోకంలో సింహాసనం చుట్టూ ఉన్నదేంటి?

పరలోకంలో సింహాసనం చుట్టూ ఇరవైనాలుగు సింహాసనాలు పైన ఇరువైనాలుగు మంది పెద్దలు కూర్చున్నారు(4:4).

సింహాసనం ఎదుట మండుచున్న ఏడు దీపాలు ఏమై ఉన్నాయి?

సింహాసనం ఎదుట మండుచున్న ఏడు దీపాలు దేవుని ఏడాత్మలు (4:5).

Revelation 4:6

సింహాసనం చుట్టూ ఉన్నవి నాలుగు ఏమిటి?

సింహాసనం చుట్టూ ఉన్నవి నాలుగు జీవులు(4:6).

Revelation 4:7

రాత్రింబవళ్ళు నాలుగు జీవులు ఏం చేస్తున్నాయి?

రాత్రింబవళ్ళు నాలుగు జీవులు దేవునికి మహిమా ఘనతా కృతజ్ఞతా స్తుతులు మానక చేస్తున్నాయి (4:8-9).

Revelation 4:9

దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు ఏం చేశారు?

దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు సింహాసనం ఎదుట వంగి సాగిలపడి, తమ కిరీటాలు పడేశారు(4:10).

సృష్టిలో దేవుని పాత్ర గూర్చి పెద్దలు ఏం చెప్పారు?

దేవుడు సమస్తమును సృష్టించెను ఆయన చిత్తం ద్వారా అవన్నియు జీవిస్తున్నాయి అని పెద్దలు చెప్పారు(4:11).


Chapter 5

Translation Questions

Revelation 5:1

సింహాసనం మీద కూర్చున్న వాని కుడిచేతిలో యోహాను ఏం చూశాడు?

సింహాసనం మీద కూర్చున్న వాని కుడిచేతిలో ఏడు ముద్రలతో ముద్రించి ఉన్న గ్రంథం యోహాను చూశాడు(5:1).

గ్రంథం విప్పటానికి చదవటానికి భూమి మీద యోగ్యుడెవరు?

గ్రంథం విప్పటానికి చదవటానికి భూమి మీద యోగ్యులెవరూ లేరు(5:2-4).

Revelation 5:3

చుట్టి ఉన్న గ్రంథo దాని ఏడు ముద్రలు విప్పుటకు ఎవరు సమర్ధుడు?

చుట్టి ఉన్న గ్రంథo, దాని ఏడు ముద్రలు విప్పుటకు యూదగోత్ర సింహం, దావీదు వేరు చిగురు సమర్ధుడు(5:5).

Revelation 5:6

సింహాసనం ఎదుట పెద్దల మధ్యలో ఎవరు నుంచున్నారు?

సింహాసనం ఎదుట పెద్దల మధ్యలో చూడ్డానికి వధింపబడినట్టుగా ఉన్న గొర్రెపిల్ల నుంచుంది(5:6).

గొర్రెపిల్ల మీదున్న ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏమిటి?

గొర్రెపిల్ల మీదున్న ఏడు కొమ్ములు ఏడు కన్నులు భూమంతటికీ పంపిన దేవుని ఏడాత్మలు(5:6).

Revelation 5:8

పెద్దలు కలిగున్నసువాసన ధూపంతో నింపిన బంగారు పాత్రలు ఏమిటి?

పెద్దలు కలిగున్నసువాసన ధూపంతో నింపిన బంగారు పాత్రలు పవిత్రుల ప్రార్ధనలు(5:8).

Revelation 5:9

ఎందుకు చుట్టి ఉన్న గ్రంథం విప్పుటకు గొర్రెపిల్ల యోగ్యుడు?

చుట్టి ఉన్న గ్రంథం విప్పుటకు గొర్రెపిల్ల యోగ్యుడు ఎందుకంటే ప్రతీ గోత్రం నుంచి, బాష నుంచి, ప్రజల నుంచి, జనం నుంచి ఆయన రక్తంతో దేవుని కోసం ఆయన మనుషులను కొన్నాడు(5:9).

దేవుని యాజకులు ఎక్కడ పరిపాలిస్తారు?

దేవుని యాజకులు భూమ్మీద పరిపాలిస్తారు(5:10).

Revelation 5:11

గొర్రెపిల్ల ఏమి పొందడానికి యోగ్యుడని అని దేవదూత చెప్పాడు?

గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తుతి పొందడానికి యోగ్యుడు అని దేవదూత చెప్పాడు [5:12].

Revelation 5:13

సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని ఎవరు చెప్పారు?

సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని సృష్టించ బడిన ప్రతిదీ చెప్పడం జరిగింది(5:13).

నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలేమి చేశారు?

నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలు సాష్టాంగపడి ఆరాధించిరి(4:14).


Chapter 6

Translation Questions

Revelation 6:1

గొర్రెపిల్ల చుట్టి ఉన్న గ్రంథంతో ఏం చేసింది?

గొర్రెపిల్ల చుట్టి ఉన్న గ్రంథం ఏడు ముద్రలలో ఒకటి విప్పడం చేసింది(6:1).

మొదటి ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

మొదటి ముద్ర విప్పిన తరువాత తెల్లని గుర్రంపై జయిoచడానికి బయలుదేరిన ఒకనిని యోహాను చూశాడు(6:2 ).

Revelation 6:3

రెండవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

రెండవ ముద్ర విప్పిన తరువాత భూమి మీద నుండి శాంతిని తీసివేయడానికి మండుచున్న ఒక ఎర్రనిగుర్రం తోలేవాన్నియోహాను చూశాడు(6:4).

Revelation 6:5

మూడవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

మూడవ ముద్ర విప్పిన తరువాత త్రాసు చేత పట్టుకొని ఒక నల్లని గుర్రం తోలేవాన్ని యోహాను చూశాడు(6:5).

Revelation 6:7

నాలుగవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

నాలుగవ ముద్ర విప్పిన తరువాత ఒక కాంతిలేని తెల్లబారిన గుర్రాన్ని తోలే మరణం అనే పేరు గలవాన్నియోహాను చూశాడు(6:9).

Revelation 6:9

ఐదవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

ఐదవ ముద్ర విప్పిన తరువాత దేవుని వాక్కు కోసం చనిపోయిన వారిని యోహాను చూశాడు(6:9).

బలిపీఠo కింద ఉన్న ఆత్మలు దేవుని నుండి ఏం తెలుసుకోవాలనుకొన్నాయి?

బలిపీఠo కింద ఉన్న ఆత్మలు వారి రక్తం కోసం ఎంతకాలానికి పగ తీర్చు కుంటాడని దేవుని నుండి తెలుసుకోవాలనుకొన్నాయి(6:10).

Revelation 6:12

ఆరవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

ఆరవ ముద్ర విప్పిన తరువాత యోహాను భూకంపం, సూర్యుడు నల్లగామారడం, చంద్రుడు రక్తంలాగ మారడం, నక్షత్రాలు భూమి మీద పడటం చూశాడు(6:12-13).

Revelation 6:15

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు ఏం చేయడం యోహాను చూశాడు?

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు గుహలలో దాగి బండలతో మా మీద పడి దాచమని అడగడం యోహాను చూశాడు(6:15-16).

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు దేని నుంచి దాగి ఉండాలని కోరారు?

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు సింహాసనం మీద కూర్చున్న వాని నుంచీ గొర్రెపిల్ల కోపం నుంచీ దాగి ఉండాలని కోరారు(6:16).

ఎలాంటి రోజు వచ్చింది?

సింహాసనం మీద కూర్చున్న వాని నుంచీ గొర్రెపిల్ల నుంచీ మహా ఉగ్రత రోజు వచ్చింది(6:17).


Chapter 7

Translation Questions

Revelation 7:1

యోహాను చూచినప్పుడు భూమ్మీద నలుదిక్కుల నిలుచున్న నలుగురు దూతలు ఏం చేస్తున్నారు?

యోహాను చూచినప్పుడు భూమ్మీద నలుదిక్కుల నిలుచున్న నలుగురు దూతలు భూమి నాలుగు దిక్కుల గాలులను పట్టుకున్నారు(7:1).

భూమికి హనీ చేయక ముందు ఏం చెయ్యాలని తూర్పు నుంచి వచ్చిన దేవదూత చెప్పాడు?

భూమికి హనీ చేయక ముందు దేవుని దాసుల నొసట మీద ముద్ర వెయ్యాలని దేవదూత చెప్పాడు(7:2-3).

Revelation 7:4

ఏ గోత్రం నుంచి ఎంత మంది ప్రజలు ముద్రించడం జరిగింది?

ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుంచి 1,44,OOO మంది ముద్రించడం జరిగింది(7:4).

Revelation 7:9

సింహాసనం ముందూ గొర్రెపిల్ల ఎదుట యోహాను ఏo చూశాడు?

సింహాసనం ముందూ గొర్రెపిల్ల ఎదుట ప్రతి జనంలో నుంచీ, ప్రతి గోత్రంలో నుంచీ, ప్రతి ప్రజల్లో నుంచీ, ప్రతి భాషల్లో నుంచీ గొప్ప జనసముహంను యోహాను చూశాడు(7:10).

సింహాసనం ముందు ఉన్న వారి ప్రకారం, రక్షణ ఎవరికి చెందింది?

సింహాసనం ముందు ఉన్న వారి ప్రకారం దేవునికీ గొర్రెపిల్లకూ రక్షణ చెందినది(7:10).

Revelation 7:11

దేవదూతలు, పెద్దలు, నాలుగు జీవులు దేవున్ని ఆరాధిస్తూoడగా ఎలాంటి శరీర స్థితిలో ఉన్నారు?

దేవదూతలు, పెద్దలు, నాలుగు జీవులు వారు సాష్టాంగపడి తమ ముఖాలు నేలపై ఉంచి దేవున్ని ఆరాధిoచారు. (7:11).

Revelation 7:13

సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు ధరించిన వారెవరని పెద్ద చెప్పాడు?

సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు ధరించిన వారు మహా శ్రమల్లో నుంచి వచ్చిన వారని పెద్ద చెప్పాడు(7:14).

ఎలా సింహాసనం ముందు ఉన్నవారి వస్త్రాలు తెల్లగా అయ్యాయి?

సింహాసనం ముందున్నవారి వస్త్రాలు గొర్రెపిల్ల రక్తం ద్వారా తెల్లగా అయ్యాయి(7:14).

Revelation 7:15

తెల్లని వస్త్రాలు ధరించిన వారి కోసం దేవుడు ఏం చేస్తాడని పెద్ద చెప్పాడు?

తెల్లని వస్త్రాలు ధరించిన వారి పైన దేవుడు తన గుడారం కప్పుతాడు కనుక వారెప్పటికి భాదపడరు(7:15-16).

తెల్లని వస్త్రాలు ధరించిన వారి కోసం గొర్రెపిల్ల ఏం చేస్తాడని పెద్ద చెప్పాడు?

తెల్లని వస్త్రాలు ధరించిన వారికి గొర్రెపిల్ల కాపరియై జీవజలం ఊటకు నడిపిస్తుంది(7:17).


Chapter 8

Translation Questions

Revelation 8:1

ఏ కారణం చేత పరలోకంలో నిశ్శబ్దంగా ఉంది?

ఏడవ ముద్ర గొర్రెపిల్ల విప్పినప్పుడు పరలోకంలో నిశ్శబ్దంగా ఉంది(8:1).

దేవుని ముందు నిల్చున్న ఏడు దూతలకు ఏం ఇవ్వడం జరిగింది?

దేవుని ముందు నిల్చున్న ఏడు దూతలకు ఏడు బూరలివ్వడం జరిగింది(8:2).

Revelation 8:3

దేవుని ఎదుట ఏం లేచింది?

దేవుని ఎదుట పవిత్రుల ప్రార్ధనా ధూపం పొగ లేచింది(8:4).

దేవదూత బలిపీఠo నుంచి నిప్పులు తీసి భూమ్మీద పడేసినప్పుడు ఏం అయ్యింది?

దేవదూత బలిపీఠo నుంచి నిప్పులు తీసి భూమ్మీద పడేసినప్పుడు ఉరుములూ, ధ్వనులు, మెరుపులు కలిగి భూకంపం వచ్చిoది(8:5).

Revelation 8:6

మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం అయ్యింది?

మొదటి దూత బూర ఊదినప్పుడు భూమ్మీద మూడోవంతు కాలిపోయింది, చెట్లలో మూడోవంతు కాలిపోయాయి, పచ్చగడ్డి మూడోవంతు కాలిపోయింది(8:7).

Revelation 8:8

రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం అయ్యింది?

రెండవ దూత బూర ఊదినప్పుడు సముద్రాలలో మూడోవంతు రక్తంగా మారింది, సముద్ర జీవులలో మూడోవంతు చనిపోయాయి, ఓడలలో మూడోవంతు నాశనమయ్యాయి(8:8-9).

Revelation 8:10

మూడవ దూత బూర ఊదినపుడు ఏం జరిగింది?

మూడవ దూత బూర ఊదినప్పుడు నీటిలో మూడోవంతు చేదుగా మారింది దాని వల్ల అనేకమంది చనిపోయారు(8:10-11).

Revelation 8:12

నాలుగోవ దూత బూర ఊదినప్పుడు ఏం అయ్యింది?

నాలుగోవ దూత బూర ఊదినప్పుడు పగటి సూర్యుని వెలుగులో మూడోవంతు చీకటై పోయింది చంద్ర నక్షత్రాల వెలుగులో మూడోవంతు చీకటై పోయింది(8:12).

Revelation 8:13

ఎందుకు గ్రద్ద భూమ్మీదున్న వారికీ "అయ్యో, అయ్యో, అయ్యో" అంది?

ఉదాటానికి మిగిలివున్న మూడు బూరలు గూర్చి భూమ్మీదున్న వారికీ "అయ్యో, అయ్యో, అయ్యో" అని గ్రద్ద అంది(8:13).


Chapter 9

Translation Questions

Revelation 9:1

ఐదవ దూత బూర ఊదినప్పుడు యోహాను ఎలాంటి నక్షత్రాన్ని చూశాడు?

ఐదవ దూత బూర ఊదినప్పుడు యోహాను పరలోకం నుంచి భూమ్మీద పడుతున్న నక్షత్రాన్ని చూశాడు(9:1).

నక్షత్రం ఏం చేసింది?

నక్షత్రం అంతంలేని లోతైన అగాధం తెరిచింది(9:2).

Revelation 9:3

అగాధంలో నుంచి వచ్చిన మిడతలుకు ఏం చెయ్యాలని చెప్పడం జరిగింది?

అగాధంలో నుంచి వచ్చిన మిడతలుకు భూమికి హాని చేయకూడదని, నోసళ్ళ మీద దేవుని ముద్ర లేని వారికే హాని చెయ్యాలని చెప్పడం జరిగింది(9:6).

Revelation 9:5

మిడతలు ద్వారా బాధలుపడిన వారు వెదుకుతారు కానీ కనుగొన లేకపోతారు ఏమిటి?

మిడతలు ద్వారా బాధలుపడిన వారు చావును వెదుకుతారు కానీ కనుగొన లేకపోతారు(9:6).

Revelation 9:7

మిడతల రెక్కలు ఎలాంటి శబ్దం చేస్తాయి?

మిడతల రెక్కలు యుద్దంలో పరుగెత్తుతున్నా అనేక గుర్రాలు రధాలు వలె శబ్దం చేస్తాయి(9:9).

Revelation 9:10

మిడతలన్నిటి పైన రాజు ఎవరు?

మిడతలన్నిటి పైన రాజు అగాధానికి దూత అబద్దోను, గ్రీకులో అపోల్లుయోను(9:12).

ఐదవ బూర ఊదిన తరువాత ఏమి గతించింది?

ఐదవ బూర ఊదిన తరువాత మొదటి శ్రమ గతించింది(9:12).

Revelation 9:13

ఆరవ దూత బూర ఊదినప్పుడు యోహాను ఏలాంటి స్వరం విన్నాడు?

ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న బంగారు బలిపీఠo నుంచి ఒక స్వరం విన్నాడు(9:13).

ఆ స్వరం విన్నప్పుడు నలుగురు దేవదూతలు ఏం చేశారు?

ఆ స్వరం విన్నప్పుడు నలుగురు దేవదూతలు మనుషుల్లో మూడోవంతు చంపుటకు విడిపించడం జరిగింది(9:15).

Revelation 9:16

ఎంత మంది గుర్రాలపై ఉన్న సైనికులను యోహాను చూశాడు?

ఇరవై కోట్ల మంది సైనికులు గుర్రాలపైన ఉండటం చూశాడు(9:16).

Revelation 9:18

ఏ తెగుళ్ళు మనుషుల్లో మూడోవంతు చంపడం జరిగింది?

గుర్రాల నోటిలో నుంచి వచ్చే మంటలు, పొగ, గంధకాల తెగుళ్ళు చేత మనుషుల్లో మూడోవంతు చంపడం జరిగింది(9:18).

Revelation 9:20

తెగుళ్ల చేత చావని మనుషులు ఎలా స్పందించారు?

తెగుళ్ల చేత చావని మనుషులు వారి పనుల వల్ల పశ్చాత్తాపపడలేదూ దయ్యాలని పూజించడం మానలేదు(9:20).


Chapter 10

Translation Questions

Revelation 10:1

యోహాను చూచిన బలిష్ఠుడైన దేవదూత ముఖమూ కాళ్ళు చూడటానికి ఏం పోలి ఉన్నాయి?

యోహాను చూచిన బలిష్ఠుడైన దేవదూత ముఖo సూర్యుని వలే, కాళ్ళు అగ్ని స్తంభాలను పోలి ఉన్నాయి(10:2).

దేవదూత ఎక్కడ నుంచున్నాడు?

దేవదూత తన కుడిపాదం సముద్రం మీద ఎడమ పాదం నేల మీద పెట్టి నుంచున్నాడు(10:2).

Revelation 10:3

ఏమి రాయకూడదని యోహానుకు చెప్పాడు?

ఏడు ఉరుములు చెప్పిన సంగతులు రాయకూడదని యోహానుకు చెప్పాడు(10:4).

Revelation 10:5

బలిష్ఠుడైన దేవదూత ఎవరి తోడని ప్రమాణం చేసెను?

బలిష్ఠుడైన దేవదూత పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ సృజించి యుగయుగాలు జీవించుచున్న వాని తోడని ప్రమాణం చేసెను(10:6).

ఏమి ఆలస్యం కాదని బలిష్ఠుడైన దేవదూత చెప్పాడు?

ఇక ఆలస్యం కాదు ఏడవ దూత బూర ఊదినప్పుడు దేవుని రహస్యము సమాప్తమవుతుందని బలిష్ఠుడైన దేవదూత చెప్పాడు(10:7).

Revelation 10:8

బలిష్ఠుడైన దేవదూత నుంచి ఏమి తీసుకోమని యోహానుకు చెప్పడం జరిగింది?

బలిష్ఠుడైన దేవదూత నుంచి విప్పిన పుస్తకం తీసుకోమని యోహానుకు చెప్పడం జరిగింది(10:8).

యోహాను ఆ గ్రంథం తినినప్పుడు ఏమవుతుందని దేవదూత చెప్పాడు?

యోహాను ఆ గ్రంథం తినినప్పుడు నోటికి తియ్యగాను కడుపుకి చేదవుతుందని దేవదూత చెప్పాడు(10:9).

Revelation 10:10

యోహాను ఆ గ్రంథం తినిన తరువాత ఏమని ప్రవచనం చెప్పాడు?

యోహాను ఆ గ్రంథం తినిన తరువాత అనేకమంది ప్రజల గూర్చి, జనముల గూర్చి, అనేక భాషలు మాట్లాడేవారి గూర్చి, అనేకమంది రాజులను గూర్చి ప్రవచనం చెప్పాడు(10:11).


Chapter 11

Translation Questions

Revelation 11:1

ఏమి కొలవమని యోహానుకు చెప్పాడు?

దేవుని ఆలయమును బలిపీఠo కొలిచి అందులో ఆరాదించు వారిని లెక్కపెట్టమని యోహానుకు చెప్పాడు(11:1).

అన్యజనులు ఎంతకాలము పవిత్రమైన పట్ట్తణాన్ని తొక్కుతారు?

అన్యజనులు నలబై రెండు నెలలు పవిత్రమైన పట్ట్తణాన్ని తొక్కుతారు(11:2).

Revelation 11:3

ఏం చెయ్యాలని ఇద్దరు సాక్షులకు అధికారం ఇవ్వడం జరిగింది?

ఇద్దరు సాక్షులకు ఒక వెయ్యి రెండు వందల అరవై రోజులు ప్రవచించుటకు, వారి శత్రువులను చంపుటకు, ఆకాశం మూయుటకు, అనేకరకాల తెగుళ్ళతో భూమిని బాధించుటకు అధికారం ఇవ్వడం జరిగింది(11:3-6).

Revelation 11:8

ఇద్దరు సాక్షుల మృతదేహాలు ఎక్కడ పడుoటాయి?

ఇద్దరు సాక్షుల మృతదేహాలు పట్టణం వీధిలో పడుoటాయి ఆ నగరానికి అలంకారికంగా సొదొమ, ఐగుప్తు అని పిలుస్తారు అక్కడ వారి ప్రభువు సిలువ వేయడం జరిగింది(11:8-9).

Revelation 11:10

ఇద్దరు సాక్షులును చంపివేసినపుడు భూనివాసుల ప్రతిస్పందన ఏంటి?

ఇద్దరు సాక్షులును చంపివేసినపుడు భూనివాసుల సంతోషించి పండగ చేసుకున్నారు(11:10-12).

మూడున్నర రోజుల తరువాత ఇద్దరు సాక్షులకు ఏం జరిగింది?

మూడున్నర రోజుల తరువాత ఇద్దరు సాక్షులు వారి కాళ్ళపైన నిలిచి పరలోకానికి వెళ్ళడం జరిగింది(11:10-12).

Revelation 11:13

ఇద్దరు సాక్షులు తరువాత, భూకంపం ముగిసిన తరువాత ఏo గతించింది?

ఇద్దరు సాక్షులు తరువాత, భూకంపం ముగిసిన తరువాత రెండవ శ్రమ గతించిoది(11:13-14).

Revelation 11:15

ఏడవ దూత బూర ఊదినప్పుడు, పరలోకంలో ఏం చెప్పడం జరిగింది?

ఏడవ దూత బూర ఊదినప్పుడు భూలోక రాజ్యాలు మన ప్రభువు రాజ్యంగానూ ఆయన క్రీస్తు రాజ్యంగానూ మారిపోయాయి(11:15).

Revelation 11:16

ప్రభువైన దేవుడు ఇప్పుడు ఏం మొదలుపెట్టాలని పెద్దలు చెప్పారు?

ప్రభువైన దేవుడు ఇప్పుడు పరిపాలించడం మొదలుపెట్టాలని పెద్దలు చెప్పారు(11:16-17).

Revelation 11:18

పెద్దల ప్రకారం ఏ సమయం ఇప్పుడు వచ్చింది?

చనిపోయిన వారికి తీర్పుతీర్చు సమయమూ, దేవుని దాసులు బహుమతులు పొందబోయే సమయమూ, భూమిని నాశనం చేసేవారిని దేవుడు నాశనం చేసే సమయమూ ఇప్పుడు వచ్చింది(11:18).

Revelation 11:19

అప్పుడు పరలోకంలో ఏం తెరవడం జరిగింది?

అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరవడం జరిగింది(11:1-2).


Chapter 12

Translation Questions

Revelation 12:1

పరలోకంలో కనపడిన గొప్ప సూచన ఏమిటి?

పరలోకంలో సూర్యున్ని ధరించుకొన్నగర్భిణి స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రునితో, ఆమె తలమీద పన్నెండు నక్షత్రాలతో, ప్రసవ వేదనలతో కేకలు వేస్తున్న స్త్రీని గూర్చిన సూచన కనపడింది(12:1-2).

Revelation 12:3

పరలోకంలో కనపడిన మరొక గొప్ప సూచన ఏమిటి?

పరలోకంలో ఎర్రని పెద్ద మహా సర్పం ఏడు తలలు పది కొమ్ములు ఏడు కిరీటాలు తో మరొక గొప్ప సూచన కనపడింది(12:3-4).

మహా సర్పము దాని తోకతో ఏం చేసింది?

మహా సర్పము దాని తోకతో మూడో వంతు నక్షత్రాలను ఊడ్చి భూమ్మీద పడేసింది(12:3-4).

మహా సర్పము ఏమి చెయ్యాలనుకుంది?

మహా సర్పము ఆ స్త్రీ కనిన శిశువును మ్రింగి వేయాలనుకుంది(12:3-4).

Revelation 12:5

ఆ మగ శిశువు ఏం చెయ్యాలని వెళుతున్నాడు?

ఆ మగ శిశువు తన జనములను ఇనుప కడ్డీతో ఏలాలని వెళుతున్నాడు (12:5).

ఆ మగ శిశువు ఎక్కడికి వెళుతున్నాడు?

ఆ మగ శిశువు ఆయన సింహాసనం దగ్గరకు కొనిపోయాడు(12:5).

ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది?

ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయిoది(12:6).

Revelation 12:7

పరలోకంలో ఎవరు యుద్ధం చేశారు?

మిఖాయేలును, అతని దూతలును మహా సర్పమునకు దాని దూతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు(12:7).

యుద్దము తరువాత మహా సర్పమునకు దాని దూతలకు ఏమి జరిగింది?

యుద్దము తరువాత మహా సర్పము దాని దూతలు భూమి మీదకు పడద్రోయడం జరిగింది(12:9).

ఆ మహా సర్పము ఎవరు?

ఆ మహా సర్పము ఆది సర్పము, పిశాచము, సాతాను [12:9].

Revelation 12:11

సోదరులు మహా సర్పoను ఎలా జయించారు?

సోదరులు మహా సర్పంను గొర్రెపిల్ల రక్తంతోను, వారి సాక్ష్యంతోను జయించిరి(12:11).

మహా సర్పం తనకింక ఎంత కాలం ఉందని తెలుసుకుంది?

మహా సర్పం తనకింక కొద్ది కాలమే మాత్రమే మిగిలి ఉందని తెలుసుకుంది(12:12).

Revelation 12:13

మహా సర్పం స్త్రీని హింసించినప్పడు స్త్రీ కోసం ఏం అయ్యింది?

మహా సర్పం స్త్రీని హింసించినప్పడు ఆమె కోసం సిద్దపరచిన స్థలంకు ఎగిరిపోవుటకు ఆమెకు రెక్కలు ఇవ్వడం అయ్యింది అక్కడ ఆమె పోషించడం జరిగింది(12:13-14).

Revelation 12:15

స్త్రీని తుడిచి పెట్టలేక పోయినప్పుడు మహా సర్పం ఏం చేసింది?

స్త్రీని తుడిచి పెట్టలేక పోయినప్పుడు మహా సర్పం ఎవరైతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతారో యేసుని గూర్చి సాక్ష్యం కలిగుంటారో వారితో యుద్దము చేయడానికి వెళ్ళింది(12:15-18).


Chapter 13

Translation Questions

Revelation 13:3

ఎందుకు లోకమంతా ఆశ్చర్యపోతూ క్రూర జంతువుని అనుసరించారు?

మరణకరమైన గాయం తగిలి బాగైనoదు వల్ల లోకమంతా ఆశ్చర్యపోతూ క్రూర జంతువుని అనుసరించారు(13:3).

Revelation 13:5

క్రూర జంతువు తన నోటితో ఏం మాట్లాడింది?.

క్రూర జంతువు తన నోటితో దేవుని పేరు దూషిస్తూ,గర్వంగా మాట్లాడుచూ, ఆయన నివాసమునకునూ, పరలోక నివాసులకునూ వ్యతిరేకంగా మాట్లాడింది(13:5-6).

Revelation 13:7

పవిత్రులైన మనుషులతో ఏం చెయ్యడానికి క్రూర జంతువుకు అనుమతివ్వడం జరిగింది?

పవిత్రులైన మనుషులతో యుద్ధం చెయ్యడానికీ వారిని జయించడానికి క్రూర జంతువుకు అనుమతివ్వడం జరిగింది(13:7).

ఎవరు క్రూర జంతువుని పూజించలేదు?

ఎవరి పేరులు జీవగ్రంథంలో రాయడం జరిగిందో వారు ఆ క్రూర జంతువుని పూజించలేదు(13:8).

Revelation 13:9

పవిత్రులైన వారిని దేనికి పిలవడం జరిగింది?

పవిత్రులైన వారిని ఓర్పు, సహనం, విశ్వాసం కోసం పిలవడం జరిగింది(13:10).

Revelation 13:11

మరొక క్రూర జంతువు ఎక్కడ నుంచి రావడం యోహాను చూశాడు?

మరొక క్రూర జంతువు భూమిలో నుంచి బయటికి రావడం యోహాను చూశాడు(13:11 ).

మరొక క్రూర జంతువు ఎలాంటి కొమ్ములు కలిగి ఏం మాట్లాడుతుంది?

మరొక క్రూర జంతువు గొర్రెపిల్ల లాంటి కొమ్ములు కలిగి మహా సర్పంలాగా మాట్లాడుతుంది(13:11).

మరొక క్రూర జంతువు భూమ్మీద నివసించే వారు ఏం చేయడానికి కారణమైంది ?

మరొక క్రూర జంతువు భూమ్మీద నివసించే వారు మొదటి క్రూర జంతువును పూజించుటకు కారణమైంది(13:12).

Revelation 13:13

క్రూర జంతువును పూజించుటకు నిరాకరించిన వారికి ఏం జరిగింది?

క్రూర జంతువును పూజించుటకు నిరాకరించిన వారిని చంపడం జరిగింది(13:15).

ప్రతిఒక్కరు మరొక క్రూర జంతువు నుంచి ఏం పొoదారు?

ప్రతిఒక్కరు మరొక క్రూర జంతువు నుంచి కుడిచేతి మీదా లేక నొసటి మీద ముద్ర పొoదారు(13:16).

Revelation 13:18

క్రూర జంతువు సంఖ్య ఏమిటి?

క్రూర జంతువు సంఖ్య 666(13:18).


Chapter 14

Translation Questions

Revelation 14:1

యోహాను తన ముందు ఎవరు నిలుచుండడం చూశాడు?

యోహాను తన ముందు గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలుచుండడం చూశాడు(14:1).

Revelation 14:3

సింహాసనం ముందు కొత్త పాట నేర్చుకొని పాడుటకు ఎవరు సమర్ధులు?

భూమ్మీద విమోచన పొందిన 144,000 మంది మాత్రమే సింహాసనం ముందు కొత్త పాట నేర్చుకొని పాడుటకు సమర్ధులు(14:3).

దేవునికీ గొర్రెపిల్లకు మొదటి ఫలంగా విమోచన పొందినవారెవరు?

నిందించడానికి తప్పులేని 144,000 మంది దేవునికీ గొర్రెపిల్లకు మొదటి ఫలంగా విమోచన పొందినవారు(14:4-5).

Revelation 14:6

దేవదూత నిత్య సువార్త ప్రకటన ఎవరికిచ్చాడు?

దేవదూత నిత్య సువార్త ప్రకటన ప్రతీ దేశం వారికీ, ప్రతి వంశం వారికీ, ప్రతి భాష మాట్లాడే వారికీ,భూమ్మీద ఉన్న ప్రతి జనానికీ ఇచ్చాడు(14:6).

భూమ్మీద నివసిస్తున్న వారు ఏం చెయ్యాలని దేవదూత చెప్పాడు?

భూమ్మీద నివసిస్తున్న వారు దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించమని దేవదూత చెప్పాడు(14:7).

ఏ గడియ వచ్చిందని దేవదూత చెప్పాడు?

దేవుని తీర్పు గడియ వచ్చిందని దేవదూత చెప్పాడు(14:7).

Revelation 14:8

రెండవ దూత ఏమని ప్రకటించాడు?

రెండవ దూత మహా బబులోను కులిపోయిందని ప్రకటించాడు(14:8).

Revelation 14:11

క్రూర జంతువు ముద్ర పొందుంటే వారికి ఏం జరిగిందని మూడవ దూత ప్రకటించాడు?

క్రూర జంతువు ముద్ర పొందుంటే వారికి అగ్నిగంధకాలతో ఎన్నటెన్నటికి వేదించడం జరుగుతుందని మూడవ దూత ప్రకటించాడు(14:9-11).

పవిత్రులు దేనికి పిలవడం జరిగింది?

పవిత్రులు సహనంతో ఓర్చు కునేందుకు పిలవడం జరిగింది(14:12).

Revelation 14:14

మేఘాల మీద ఎవరు కూర్చోవడం యోహాను చూశాడు?

మేఘాల మీద దేవుని కుమారుని పోలిన ఒకరు కూర్చోవడం యోహాను చూశాడు(14:14).

మేఘాలమీద కూర్చున్న ఆయన ఏం చేశాడు?

మేఘాలమీద కూర్చున్నఆయన భూమి మీద పంట కోతకు కొడవలి ఊపాడు(14:16).

Revelation 14:18

దూత పదునైన కొడవలితో ఏం చేశాడు?

దూత పదునైన కొడవలితో భూమ్మీద ద్రాక్ష పంటను కూర్చి దేవుని కోపమనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడేశాడు(14:18-19).

Revelation 14:20

దేవుని ద్రాక్ష గానుగ దగ్గర ఏం జరిగింది?

ద్రాక్ష గానుగ తొక్కడం జరిగింది దాని నుంచి రక్తం బయటికి పారింది(14:20).


Chapter 15

Translation Questions

Revelation 15:1

ఏడుగురు దూతలు ఏమి కలిగుండటం యోహాను చూశాడు?

ఏడుగురు దూతలు ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉండటం యోహాను చూశాడు, ఇవే చివరి తెగుళ్ళు(15:1).

Revelation 15:2

సముద్రం దగ్గర ఎవరు నుoచున్నారు?

క్రూర జంతువు మీద గెల్చి ఆయన పోలిక గల వారు సముద్రం దగ్గర నుoచున్నారు(15:2).

Revelation 15:3

సముద్రం దగ్గర నుoచున్న వారు ఎవరి పాట పాడుతున్నారు?

సముద్రం దగ్గర నుoచున్న వారు మోషే పాటా, గొర్రెపిల్ల పాటా పాడుతున్నారు(15:3).

ఆ పాటలో దేవుని మార్గాలు ఎలా వివరించడం జరిగింది?

ఆ పాటలో దేవుని మార్గాలు న్యాయమైనవి యధార్ద మైనవని వివరించడం జరిగింది(15:3).

ఈ పాటలో ఎవరు వచ్చి దేవుని ఆరాదిస్తారు?

ఈ పాటలో అన్ని రాజ్యాలు వచ్చి దేవుని ఆరాదిస్తారు(15:4).

Revelation 15:5

అప్పుడు అతి పరిశుద్ద స్థలం నుంచి ఎవరు బయటకు వచ్చారు?

అప్పుడు ఏడు తెగుళ్ళుతో ఏడుగురు దేవదూతలు అతి పరిశుద్ద స్థలం నుంచి బయటకు వచ్చారు(15:6).

Revelation 15:7

ఏడుగురు దేవదూతలకు ఏం ఇవ్వడం జరిగింది?

ఏడుగురు దేవదూతలకు దేవుని కోపoతో నిండిన ఏడు పాత్రలు ఇవ్వడం జరిగింది(15:7).

ఎప్పటి వరకు అతి పరిశుద్ద స్థలంలోకి ఎవ్వరు ప్రవేశించ లేదు?

ఏడు తెగుళ్ళు పూర్తయ్యే వరకు అతి పరిశుద్ద స్థలంలోకి ఎవ్వరు ప్రవేశించ లేదు(15:8).


Chapter 16

Translation Questions

Revelation 16:1

ఏడుగురు దేవదూతలకు ఏం చెయ్యాలని చెప్పారు?

ఏడుగురు దేవదూతలకు వెళ్లి దేవుని కోపమనే ఏడు పాత్రలు భూమ్మీద పోయమని చెప్పారు(16:1).

Revelation 16:2

దేవుని మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు క్రూర జంతువు ముద్ర ఉన్న మనుషుల మీద బాధకరమైన చెడ్డ కురుపులు వచ్చాయి(16:2).

Revelation 16:3

దేవుని రెండవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని రెండవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రం చనిపోయిన వారి రక్తంలాగా మారిoది(16:3).

Revelation 16:4

దేవుని మూడవ ఉగ్రత పాత్ర బయటకు కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని మూడవ ఉగ్రత పాత్ర బయటకు కుమ్మరించినప్పుడు నదులూ ఊటలూ రక్తం అయినాయి(16:4).

దేవుడు ఈ ప్రజలకు తాగటానికి రక్తమివ్వడమనేది ఎందుకు యధార్ధమైనదీ న్యాయమైనది ?

దేవుడు ఈ ప్రజలకు తాగటానికి రక్తమివ్వడమనేది యధార్ధమైనదీ న్యాయమైనది ఎందుకంటే వారు దేవుని పవిత్రుల రక్తం, ప్రవక్తల రక్తం ఒలికించారు(16:6).

Revelation 16:8

దేవుని నాలుగవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని నాలుగవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సూర్యుడు అగ్నితో మనుషులను మాడ్చడం జరిగింది(16:8).

ఈ తెగుళ్ళకు మనుషులు ఎలా స్పందించారు?

ఈ తెగుళ్ళకు మనుషులు మారుమనస్సు పొందలేదూ దేవుని మహిమ పరచలేదు(16:9).

Revelation 16:12

దేవుని ఆరవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని ఆరవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు యూఫ్రటీసు నది నీరు ఎండి పోయి తూర్పు నుంచి వచ్చు రాజులకు దారి ఏర్పడింది(16:12).

ఏం చేయడానికి మూడు అపవిత్రాత్మలు బయటికి వెళ్ళాయి?

దేవుని మహా దినాన జరిగే యుద్ధం కోసం భూలోక రాజులను పోగు చేయడానికి మూడు అపవిత్రాత్మలు వెళ్ళాయి(16:13-14).

Revelation 16:15

భూలోక రాజులను తెచ్చి పోగుచేసిన స్థలo పేరు ఏమిటి?

భూలోక రాజులను తెచ్చి పోగుచేసిన స్థలo పేరు హార్ మెగిద్దోను(16:16).

Revelation 16:17

దేవుని ఏడవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని ఏడవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఒక గొప్ప స్వరం,"సమాప్తo అయ్యింది!" అప్పుడు మెరుపులూ, ఉరుములూ, భూకంపము వచ్చింది(16:17-18).

ప్ర.ఈ సమయంలో దేవుడు ఏం చెయ్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు?

ఈ సమయంలో దేవుడు మహా బబులోనును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ఉగ్రతతో నిండిన పాత్రను బబులోనుకు ఇచ్చాడు(16:19).

Revelation 16:20

ఈ తెగుళ్ళకు మనుషులు ఎలా స్పందించారు?

ఈ తెగుళ్ళకు మనుషులు దేవుని దూషించారు(16:21).


Chapter 17

Translation Questions

Revelation 17:1

దేవదూత యోహానుకు ఏం చూపిస్తానని చెప్పాడు?

దేవదూత యోహానుకు మహా వేశ్య మీదకు వచ్చే తీర్పును చూపిస్తానాని చెప్పాడు(17:1).

Revelation 17:3

ఆ స్త్రీ దేని మీద కూర్చుంది?

ఆ స్త్రీ ఏడు తలలు ఏడు కొమ్ములతో ఉన్న జంతువు మీద కూర్చుంది(17:3).

ఆ స్త్రీ తన చేతితో పట్టుకున్న పాత్రలో ఏముంది?

ఆ స్త్రీ తన చేతితో పట్టుకున్న పాత్రలో అసహ్యమైన ఆమె వ్యభిచార సంబంధమైన మాలిన్యoతో నిండి ఉంది(17:4).

ఆ స్త్రీ పేరేoటి?

ఆ స్త్రీ పేరు, "మహా బబులోను వేశ్యలకూ, భూలోకoలో అసహ్యమైన వాటికి తల్లి"(17:5).

Revelation 17:6

ఆ స్త్రీ ఏమి తాగి మత్తెక్కుంది?

ఆ స్త్రీ యేసు హతసాక్షుల రక్తం, పరిశుద్దుల రక్తం తాగి మత్తెక్కుంది(17:6).

Revelation 17:8

స్త్రీ కూర్చున్న జంతువు ఎక్కడ నుంచి వచ్చింది?

స్త్రీ కూర్చున్న జంతువు లోతైన అంతులేని అగాధం నుంచి వచ్చింది(17:8).

Revelation 17:9

క్రూర జంతువు ఏడు తలలు ఏమిటి?

క్రూర జంతువు ఏడు తలలు స్త్రీ కూర్చున్న ఏడు కొండలు, ఏడుగురు రాజులు (17:9-10).

Revelation 17:11

క్రూర జంతువు ఎక్కడకి పోతుంది?

క్రూర జంతువు నాశనానికి పోతుంది(17:8,11)

Revelation 17:12

క్రూర జంతువు పది కొమ్ములు ఏమిటి?

క్రూర జంతువు పది కొమ్ములు పది మంది రాజులు(17:12).

అప్పుడు క్రూర జంతువూ రాజులూ ఒకే ఉద్దేశము కలిగి ఏం చేశారు?

అప్పుడు క్రూర జంతువూ రాజులూ ఒకే ఉద్దేశము కలిగి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు(17:14).

Revelation 17:15

వేశ్య ఎక్కడ కూర్చుందో ఆ జలాలు ఏమిటి ?

వేశ్య కూర్చున్న జలాలు ప్రజలూ, జనసమూహాలూ, జాతులూ, ఆయా భాషలు మాట్లాడేవారు(17:15).

Revelation 17:16

క్రూర జంతువు రాజులూ ఆ స్త్రీకేమి చేస్తాయి?

క్రూర జంతువు రాజులూ ఆ స్త్రీని ద్వేషించీ, దిగంబరిచేసీ, ఆమె మాంసం తిని నిప్పంటించి కాల్చివేస్తాయి(17:16).

Revelation 17:18

యోహాను చూసిన స్త్రీ ఏమిటి?

యోహాను చూసిన స్త్రీ భూరాజులను పరిపాలించిన మహా నగరం(17:18).


Chapter 18

Translation Questions

Revelation 18:1

దేవదూత గొప్ప అధికారంతో ఏమని ప్రకటించింది?

దేవదూత గొప్ప అధికారంతో మహా బబులోను కూలిపోయిందని ప్రకటించింది(18:1-2).

Revelation 18:4

పరలోకం నుంచి స్వరం దేవుని ప్రజలు ఏమి చెయ్యాలని చెప్పడం జరిగింది?

పరలోకం నుంచి స్వరం దేవుని ప్రజలు బబులోను నుంచి బయటకు రమ్మనీ, ఆమె పాపములో భాగ మవ్వద్దని చెప్పడం జరిగింది(18:4).

బబులోను చేసిన దానికి దేవుడు తిరిగి ఆమెకు చెల్లించు మొత్తం ఏమిటి?

బబులోను చేసిన దానికి దేవుడు తిరిగి దానికి రెండంతలు ఆమెకు చెల్లిస్తాడు(18:6).

Revelation 18:7

బబులోనును ఒక్క రోజులో తరిమి కొట్టిన తెగుళ్ళు ఏమిటి?

ఆమెను అగ్నితో కాల్చిన రోజున బబులోనుపై ఒక్క రోజులో దుఃఖమూ కరువు విరుచుకు పడ్డాయి (18:8).

Revelation 18:9

భూలోక రాజులూ వర్తకులు బబులోను తీర్పును చూసినప్పుడు ఎలా స్పందించారు?

భూలోక రాజులూ వర్తకులు బబులోను తీర్పును చూసినప్పుడు ఆమె కోసం ఏడుస్తూ రోదించారు(18:9-11).

Revelation 18:14

ప్ర.ఏ కారణం చేత బబులోను ఒక్క ఘడియలోనే తుడిచి పెట్టుకు పోయింది

బబులోను విలాసవంతమైన వైభవాన్ని కోరుకుంది. అవన్నీ ఒక్క ఘడియలోనే తుడిచి పెట్టుకు పోయాయి(1814).

Revelation 18:15

బబులోను తీర్పు సమయoలో రాజులూ, వర్తకులూ, ఓడ నావికులు ఎందుకు దూరాన నిలిచారు?

బబులోను తీర్పు సమయoలో రాజులూ, వర్తకులూ, ఓడ నావికులు దాని వేదనలకు భయపడి దూరంగా నిలిచారు(18:9-10,15,17).

Revelation 18:18

బబులోను గూర్చి ఓడ నావికులు ఏo ప్రశ్నలడిగారు ?

జ బబులోను గూర్చి ఓడ నావికులు,"ఈ మహా పట్టణం లాంటి పట్టణం ఏది?"అని ప్రశ్నలడిగారు(18:18).

దేవుని ద్వారా బబులోనుకు తీర్పు జరిగినప్పుడు పవిత్రులు, అపోస్తులులూ, ప్రవక్తలు ఏం చెప్పారు?

దేవుని ద్వారా బబులోనుకు తీర్పు జరిగినప్పుడు పవిత్రులూ, అపోస్తులులూ, ప్రవక్తలు ఆనందించండని చెప్పారు(18:20).

Revelation 18:21

ఆమె తీర్పు జరిగిన తరువాత, మళ్ళి ఎప్పుడు బబులోను కనపడతుంది?

ఆమె తీర్పు జరిగిన తరువాత, ఇంకెప్పటికి బబులోను కనబడదు(18:21).

Revelation 18:23

బబులోను మహా పట్టణంలో ఏం కనుగోవడం జరిగింది, దేని కోసం తీర్పు జరిగింది?

బబులోను మహా పట్టణంలో ప్రవక్తల రక్తమూ, పవిత్రుల రక్తమూ, భూమి మీద చంపడం జరిగిన వారoదరి రక్తం కనుగొవడం జరిగింది(18:24).


Chapter 19

Translation Questions

Revelation 19:1

దేవుని తీర్పులను గూర్చి పరలోకంలో గొప్ప స్వరం ఏమని చెప్పింది?

దేవుని తీర్పులు న్యాయమైనవీ, యధార్దమైనవని పరలోకంలో చెప్పడం జరిగింది(19:1-2).

దేవుడు ఎందుకు గొప్ప వేశ్యకు తీర్పు తీర్చాడు?

ఆమె తన వ్యభిచారంతో భులోకాన్ని చెడగొట్టి, దేవుని దాసుల రక్తం చిందించడం వల్ల దేవుడు గొప్ప వేశ్యకు తీర్పు తీర్చాడు(19:2).

Revelation 19:3

యుగ యుగాలకు మహా వేశ్యకు ఏం జరుగుతుంది?

మహా వేశ్య నుంచి యుగ యుగాలకు పొగ లేస్తూ ఉంటుంది(19:2).

Revelation 19:5

దేవునికి భయపడే దాసులు ఏం చెయ్యాలని చెప్పడం జరిగింది?

దేవునికి భయపడే దాసులు ఆయనను స్తుతించాలని చెప్పడం జరిగింది(19:5).

Revelation 19:7

ఎందుకు దేవుని దాసులు సంతోషంగా ఉండీ ఆనందించాలని స్వరం చెబుతుంది?

గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినందుచేత దేవుని దాసులు సంతోషంగా ఉండీ ఆనందించాలని స్వరం చెబుతుంది(19:7).

గొర్రెపిల్ల పెండ్లి కూతురు ఏ బట్టలుతో ఉంది?

గొర్రెపిల్ల పెండ్లి కూతురు మంచి నార బట్టలుతో ఉంది, అవి దేవుని పవిత్ర ప్రజల నీతి క్రియలు(19:8).

Revelation 19:9

యేసు గూర్చిన సాక్ష్యం ఏమైయున్నదని దేవదూత చెప్పాడు?

యేసు గూర్చిన సాక్ష్యం ప్రవచనాత్మయై ఉన్నదని దేవదూత చెప్పాడు(19:10).

Revelation 19:11

యోహాను చూచిన తెల్లని గుర్రం తోలే వాని పేరేంటి?

యోహాను చూచిన తెల్లని గుర్రం తోలే వాని పేరు దేవుని వాక్కు(19:11-13).

Revelation 19:14

దేవుని వాక్కు జనాలను ఎలా కొట్టింది?

జనాలను కొట్టడానికి దేవుని వాక్కు నోటి నుంచి వాడిగల ఖడ్గం బయటికి వెళుతుంది(19:15).

దేవుని వాక్కు వస్త్రం మీదనూ తొడ మీదనూ ఏం రాసి ఉంది?

దేవుని వాక్కు వస్త్రం మీదనూ తొడ మీదనూ,"రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు" అని రాసి ఉంది(19:16).

Revelation 19:17

గొప్ప విందులో ఏమి తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది?

రాజుల మాంసంనూ, సైన్యాధికారుల మాంసంనూ, బలిష్ఠుల మాంసంనూ, గుర్రాల మాంసంనూ, వాటిని తోలే రౌతులైన వారి మాంసంనూ, అందరి మాంసoనూ తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది(19:18).

Revelation 19:19

భూలోక రాజులునూ క్రూర జంతువును ఏమి చేయడానికి పోగై ఉన్నారు?

భూలోక రాజులునూ క్రూర జంతువును దేవుని వాక్కుతోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి బయట పోగై ఉన్నారు(19:19).

క్రూర జంతువుకు, అబద్ద ప్రవక్తకు ఏం జరిగింది?

క్రూర జంతువు, అబద్ద ప్రవక్త వారి ఇద్దరిని బతికుండగానే గంధకంలో మండు అగ్ని గుండంలో పడవేయడం జరిగింది(19:20).

Revelation 19:21

దేవుని వాక్కుకు వ్యతిరేకంగా యుద్దo చేసిన మిగిలిన వారికీ ఏం జరిగింది?

దేవుని వాక్కుకు వ్యతిరేకంగా యుద్దo చేసిన మిగిలిన వారికీ, దేవుని వాక్కు నోటి నుంచి వచ్చు ఖడ్గo వల్ల చంపడం జరిగింది(19:21).


Chapter 20

Translation Questions

Revelation 20:1

పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత తనతో ఏమి కలిగియున్నాడు?

పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత తన చేతిలో అంతులేని అగాధం తాళం చెవి, పెద్ద గొలుసు కలిగియున్నాడు(20:1).

దేవదూత సాతానుకు ఏం చేశాడు?

దేవదూత సాతానును అడుగులేని అగాధం లోనికి విసిరేసాడు(20:3).

ఎంత కాలం సాతానును బంధించి ఉంచడం జరిగింది?

వెయ్యి సంవత్సరాలు సాతానును బంధించి ఉంచడం జరిగింది(20:2-3).

సాతాను బంది అయినప్పుడు ఏం చేయడానికి సామర్ద్యం లేకుండా పోయిoది?

సాతాను బంది అయినప్పుడు జనాలను మోసగించడానికి సామర్ద్యం లేకుండా పోయిoది(20:3).

Revelation 20:4

క్రూర జంతువు ముద్ర తిరస్కరించిన వారికి ఏం అయ్యింది?

క్రూర జంతువు ముద్ర తిరస్కరించిన వారు బ్రతికి వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యపాలన చేశారు(20:4).

Revelation 20:5

చనిపోయిన వారిలో మిగిలిన వారు ఎప్పుడు బ్రతకడం జరిగింది?

చనిపోయిన వారిలో మిగిలిన వారు వెయ్యి సంవత్సరాలు గడచిపోయే వరకు బ్రతకలేదు(20:5).

మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు ఏం చేస్త్తారు?

మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు దేవునికీ క్రీస్తుకూ యాజకులై ఉండి ఆయనతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు(20:6).

Revelation 20:7

వెయ్యి సంవత్సరాలు గడచిన తరువాత సాతాను ఏం చేస్తాడు?

వెయ్యి సంవత్సరాలు గడచిన తరువాత, సాతాను విడుదల పొంది జనాలను మోసం చేయడానికి బయలుదేరిపోతాడు(20:8).

Revelation 20:9

పవిత్రుల శిబిరం చుట్టుముట్టినప్పుడు ఏం జరుగుతుంది?

పవిత్రుల శిబిరం చుట్టుముట్టినప్పుడు, పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి గోగు, మాగోగులను మ్రింగివేస్తుంది(20:9).

ఈ సమయంలో సాతానుకు ఏం అవుతుంది?

ఈ సమయంలో సాతాను అగ్ని గంధాకాల సరస్సులో పడత్రోయడం జరిగి యుగయుగాలు వేదనపడుతుంది(20:10).

Revelation 20:11

తెల్ల సింహాసనం ఎదుట మృతులంతా దేని మూలంగా తీర్పు పొందారు?

మృతులంతా గ్రంథాల్లో రాసి ఉన్న ప్రకారం వారు చేసిన పనులను బట్టి తీర్పు పొందారు [20:12-13].

Revelation 20:14

రెండవ మరణం అంటే ఏమిటి?

రెండవ మరణం అంటే అగ్ని సరస్సు(20:14).

జీవ గ్రంథంలో పేర్లు రాయబడని వారి అందరికి ఏం జరుగుతుంది?

జీవ గ్రంథంలో పేర్లు కనుగొనని వారoదరు అగ్ని సరస్సులో పడత్రోయడం జరుగుతుoది(20:15).


Chapter 21

Translation Questions

Revelation 21:1

మొదటి భూమీ, మొదట ఆకాశంకు ఏం జరగడం యోహాను చూశాడు?

మొదటి భూమీ, మొదట ఆకాశం గతించి పోవడం యోహాను చూశాడు(21:1).

మొదటి భూమీ, మొదట ఆకాశాల స్థానంలో ఏమి వచ్చాయి?

మొదటి భూమీ, మొదట ఆకాశాల స్థానంలో కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చాయి(21:1).

పరలోకం నుంచి ఏం దిగి వచ్చాయి?

పరలోకo నుంచి పవిత్ర పట్టణం , నూతన యెరుషలేo దిగి వచ్చాయి(21:2).

Revelation 21:3

సింహాసనం నుంచి వచ్చిన స్వరం ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడని చెప్పింది?

సింహాసనం నుంచి వచ్చిన స్వరం ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్పింది(21:3).

ఇప్పుడు ఏమి గతించిపోయాయి?

మరణం, దుఃఖo, ఏడ్పు, బాధ గతించిపోయాయి(21:4).

Revelation 21:5

సింహాసనం మీద కూర్చున్న ఆయన తననుతాను ఏo పేరున పిలుచుకొన్నాడు?

సింహాసనం మీద కూర్చున్న ఆయన తననుతాను అల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడనని పేరున పిలుచుకొన్నాడు(21:6).

Revelation 21:7

విశ్వాసం లేని వారూ, వ్యభిఛార సంబంధంమైన పాపమూ, విగ్రహారాధికులకు ఏం జరుగుతుంది?

విశ్వాసం లేని వారూ, వ్యభిఛార సంబంధంమైన పాపమూ, విగ్రహారాధికులు అగ్ని గంధకాల సరస్స్లులో ఉంటారు(21:8).

Revelation 21:9

గొర్రెపిల్ల భార్య, పెండ్లి కూతురు ఏమిటి?

గొర్రెపిల్ల భార్య, పెండ్లి కూతురు పరలోకమందున్న దేవుని నుంచి వచ్చుచున్న పవిత్ర పట్టణం, యెరూషలేము(22:12).

Revelation 21:11

యెరూషలేము గుమ్మముల మీద ఏమి రాసున్నాయి?

యెరూషలేము గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రముల పిల్లల పేర్లు రాసున్నాయి(21:12).

Revelation 21:14

యెరూషలేము పునాదుల మీద ఏమి రాసున్నాయి?

యెరూషలేము పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపోస్తులుల పేర్లు రాసున్నాయి(21:14).

Revelation 21:16

కొత్త యెరూషలేము ఎలా వేయడం జరిగింది?

కొత్త యెరూషలేము నాలుగు వైపుల సమానంగా ఉంది(21:16).

Revelation 21:18

పట్టణమూ వీధులూ ఎలా కట్టడం జరిగింది?

పట్టణమూ వీధులూ స్వచ్చమైన బంగారమూ, శుభ్ర మైన గాజువలే కట్టడం జరిగింది(21:18-21).

Revelation 21:22

కొత్త యెరూషలేములో దేవాలయం ఏమిటి?

కొత్త యెరూషలేములోప్రభువైన దేవుడునూ, గొర్రెపిల్లయే దేవాలయం(21:22).

Revelation 21:23

కొత్త యెరూషలేములో వెలుగుకు ములాధారం ఏమిటి?

కొత్త యెరూషలేములో దేవుని మహిమా, గోర్రేపిల్ల మహిమా వెలుగుకు ములాధారం(21:23).

Revelation 21:26

కొత్త యెరూషలేములో ప్రవేశించలేనిది ఏమిటి?

కొత్త యెరూషలేములో అపవిత్ర మైనది ఏదియూ ప్రవేశించలేదు(21:27).


Chapter 22

Translation Questions

Revelation 22:1

దేవుని సింహాసనం నుంచి ప్రవహించే దేనిని యోహాను చూసాడు?

దేవుని సింహాసనం నుంచి జీవ జల నది ప్రవహించడాన్ని యోహాను చూసాడు(22:1).

జీవ వృక్షo ఆకులు దేని కోసం?

జీవ వృక్షo ఆకులు జనములను స్వస్థ పరచడo కోసం(22:2).

Revelation 22:3

పట్టణంలో ఇంకా ఏముండదు?

పట్టణంలో ఇంకా ఏవిధమైన శాపo ఉండదు, చీకటనేదే ఉండదు(22:3-5)

దేవుని సింహాసనమూ గొర్రెపిల్ల సింహాసనమూ ఎక్క్డడ ఉoటాయి?

దేవుని సింహాసనమూ గొర్రెపిల్ల సింహాసనమూ పట్టణంలో ఉంటాయి(22:3).

Revelation 22:6

ఈ గ్రంథం ద్వారా దీవెన పొందాలంటే మనం ఏమి చెయ్యాలి?

ఈ గ్రంథం ద్వారా దీవెన పొందాలంటే ఇందులోని ప్రవచన వాక్కులకు లోబడాలి [22:7].

Revelation 22:8

యోహాను దేవదూత పాదాల దగ్గర సాగిలపడినప్పుడు, దేవదూత యోహానుతో ఏమి చెయ్యాలని చెప్పాడు?

యోహాను దేవదూత పాదాల దగ్గర సాగిలపడినప్పుడు, దేవదూత యోహానుతో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని చెప్పాడు(22:8-9).

Revelation 22:10

యోహాను ఈ పుస్తకంలోని ప్రవచన వాక్యాలకు ముద్ర వేయ వద్దని చెప్పాడు?

యోహాను ఈ పుస్తకంలోని ప్రవచన వాక్యాలకు ముద్ర వేయ వద్దు ఎందుకంటే సమయం దగ్గరా వుందని చెప్పాడు22:10).(

Revelation 22:12

ప్రభువు వచ్చేప్పుడు తనతో ఏమి తీసుకోస్తున్నానని చెప్పాడు?

ప్రభువు వచ్చేప్పుడు తనతో బహుమానము తీసుకోస్తున్నానని చెప్పాడు(22:12).

Revelation 22:14

జీవ వృక్ష ఫలం తినే హక్కు సంపాదించుకోవాలనుకునే వారు ఏమి చెయ్యాలి?

జీవ వృక్ష ఫలం తినే హక్కు సంపాదించుకోవాలనుకునే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి (22:14)

Revelation 22:16

యేసు రాజైన దావీదుకు సంబంధిoచిన వాడినని ఎలా చెప్పాడు?

దావీదు వేరు దావీదు సంతానమని యేసు చెప్పాడు(22:16).

Revelation 22:18

ఈ గ్రంథ ప్రవచనాలకు ఎవరైన ఏదైనా కలిపిన ఏమవుతుందని?

ఈ గ్రంథ ప్రవచనాలకు ఎవరైన ఏదైనా కలిపిన తెగుళ్ళు వస్తాయనే విషయం రాసుంది (22:18).

ఈ గ్రంథ ప్రవచనాల నుంచి ఎవరైనా ఏదైనా తీసివేసిన ఏమవుతుంది?

ఈ గ్రంథ ప్రవచనాల నుంచి ఎవరైనా ఏదైనా తీసివేసిన జీవ వృక్షంలో భాగం తీసివేయడం జరుగుతుంది(22:19).

Revelation 22:20

ఈ గ్రంథంలో యేసు చివరి మాటలు ఏవమిటి?

యేసు చివరి మాటలు,"అవును! నేను త్వరలో వస్తున్నాను"(22:20).

ఈ గ్రంథంలో చివరి పదం ఏమిటి?

ఈ గ్రంథంలో చివరి పదం "ఆమెన్"(22:21).